న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 23 శాతం బలపడి రూ. 680 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 552 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 28 శాతంపైగా ఎగసి రూ. 4,837 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 3,767 కోట్ల టర్నోవర్ నమోదైంది.
క్లౌడ్, అనలిటిక్స్ విభాగంలో పటిష్ట వృద్ధి బాటన సాగుతున్నట్లు కంపెనీ సేల్స్ ప్రెసిడెంట్ సుధీర్ చతుర్వేది పేర్కొన్నారు. గ్రూప్‌లోని సాఫ్ట్‌వేర్ సేవల మరో కంపెనీ మైండ్‌ట్రీని విలీనం చేసుకునే ప్రాసెస్ కొనసాగుతున్నట్లు తెలియజేశారు. ఇందుకు గత నెల 10న వాటాదారులు, అన్‌సెక్యూర్డ్ రుణదాతలు అనుమతించినట్లు ప్రస్తావించారు. పూర్తి షేర్ల జారీ ద్వారా ఈ లావాదేవీ జరగనున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మైండ్‌ట్రీ వాటాదారులకు తమ వద్దగల ప్రతీ 100 షేర్లస్థానే 73 ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్ షేర్లు జారీ కానున్నాయి. విలీన సంస్థ ఆదాయం 3.5 బిలియన్ డాలర్లకు చేరనుంది.
చదవండి: అమెజాన్ మైండ్‌బ్లోయింగ్ ఆఫర్లు.. రూ.2,500 లోపు అదిరిపోయే గాడ్జెట్స్!
Comments
Please login to add a commentAdd a comment