Q2 Results
-
స్విగ్గీ నష్టాలు తగ్గాయ్..
న్యూఢిల్లీ: ఈ ఏడాది(2024–25) రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో ఫుడ్, గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ నష్టాలు స్వల్పంగా తగ్గాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 626 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2023–24) ఇదేకాలంలో రూ. 657 కోట్ల నష్టం ప్రకటించింది.మొత్తం ఆదాయం రూ. 2,763 కోట్ల నుంచి రూ. 3,601 కోట్లకు బలపడింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 3,507 కోట్ల నుంచి రూ. 4,310 కోట్లకు పెరిగాయి. కంపెనీ ఇటీవలే స్టాక్ ఎక్చ్సేంజీలలో లిస్ట్‌కావడంతో తొలిసారి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది.కాగా.. సొంత అనుబంధ సంస్థ స్కూట్సీ లాజిస్టిక్స్ ప్రయివేట్‌లో రైట్స్ ద్వారా ఒకేసారి లేదా దశలవారీగా రూ. 1,600 కోట్లకు మించకుండా ఇన్వెస్ట్ చేసేందుకు బోర్డు తాజాగా అనుమతించినట్లు స్విగ్గీ వెల్లడించింది. స్కూట్సీ ప్రస్తుతం సప్లైచైన్ సర్వీసులు, పంపిణీ బిజినెస్ నిర్వహిస్తోంది. -
పడిపోయిన ఏషియన్ పెయింట్స్ లాభం
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఏషియన్ పెయింట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 44 శాతం క్షీణించి రూ. 694 కోట్లకు పరిమితమైంది.డిమాండ్ మందగించడం, ముడివ్యయాల పెరుగుదల, డెకొరేటివ్, కోటింగ్ బిజినెస్ క్షీణించడం ప్రభావం చూపాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,232 కోట్లకుపైగా ఆర్జించింది. వాటాదారులకు షేరుకి రూ. 4.25 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. మొత్తం అమ్మకాలు సైతం 5 శాతం నీరసించి రూ. 8,028 కోట్లకు చేరాయి. గత క్యూ2లో రూ. 8,479 కోట్ల టర్నోవర్ సాధించింది.అయితే మొత్తం వ్యయాలు స్వల్పంగా 1 శాతం పెరిగి రూ. 7,093 కోట్లను దాటాయి. ఇతర వనరులతో కలిపి మొత్తం ఆదాయం 5 శాతం తక్కువగా రూ. 8,201 కోట్లను తాకింది. కాగా.. అంతర్జాతీయ అమ్మకాలు నామమాత్ర క్షీణతతో రూ. 770 కోట్లకు పరిమితమయ్యాయి. గత క్యూ2లో సాధించిన రూ. 40 కోట్ల పన్నుకుముందు లాభం(పీబీటీ)స్థానే రూ. 22 కోట్ల నష్టం ప్రకటించింది. -
అంచనాలను మించిన దివీస్ లాభం
ముంబై: ఫార్మా కంపెనీ దివీస్ ల్యాబొరేటరీస్ సెప్టెంబర్ త్రైమాసికంలో అంచనాలకు మించి రాణించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కంపెనీ నికరలాభం రూ.510 కోట్లుగా నమోదైంది. 2023–24 ఇదే త్రైమాసిక లాభం రూ.348 కోట్లతో పోలిస్తే ఇది 46% అధికం.మొత్తం ఆదాయం రూ.1,909 కోట్ల నుంచి 22.5% పెరిగి రూ.2,338 కోట్లకు చేరింది. పన్నుకు ముందు లాభం (పీబీటీ) 54% వృద్ధి చెంది రూ.469 కోట్ల నుంచి రూ.722 కోట్లకు చేరింది. మార్జిన్లు 25% నుంచి 31 శాతానికి పెరిగాయి. ఈ క్యూ2లో విదేశీ మారక ద్రవ్య లాభం (ఫారెక్స్ గెయిన్) రూ.29 కోట్లుగా ఉంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగం (ఏప్రిల్–సెప్టెంబర్)లో కంపెనీ మొత్తం ఆదాయం రూ.4,640 కోట్లు ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో మొత్తం ఆదాయం రూ.3,854 కోట్లుగా ఉంది. నికర లాభం రూ.704 కోట్ల నుంచి 33% అధికమై రూ.940 కోట్లకు చేరింది. -
ఓలా ఎలక్ట్రిక్‌కు తగ్గిన నష్టం
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) రంగ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు వెలువరించింది. అయితే కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర నష్టం స్వల్పంగా తగ్గి రూ. 495 కోట్లకు పరిమితమైంది. అధిక విక్రయాలు ఇందుకు సహకరించాయి.గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 524 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 873 కోట్ల నుంచి రూ. 1,214 కోట్లకు ఎగసింది. వాహన విక్రయాలు 74 శాతం జంప్‌చేసి 98,619 యూనిట్లను తాకాయి. 2025 మార్చికల్లా కంపెనీ 2,000 సొంత ఔట్లెట్లకు నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది. 2024 సెప్టెంబర్‌కల్లా 782 స్టోర్లను కలిగి ఉంది. ఫలితాల నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ షేరు బీఎస్ఈలో 2.5% నష్టంతో రూ. 73 వద్ద ముగిసింది. -
లాభాల్లో దూసుకెళ్లిన టాటా గ్రూప్ కంపెనీ
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ సంస్థ ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సీఎల్) సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి పటిష్ట పనితీరు చూపించింది. లాభం మూడు రెట్లు పెరిగి రూ.583 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.179 కోట్లుగానే ఉంది.విమానయాన, సంస్థాగత కేటరింగ్ సేవల విభాగం ‘తాజ్‌శాట్స్’ స్థిరీకరణతో ఏకీకృత ఆర్జన (రూ.307కోట్లు) తోడు కావడం లాభంలో అధిక వృద్ధికి దారితీసింది. ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే రూ.1,433 కోట్ల నుంచి రూ.1,826 కోట్లకు పెరిగింది. వ్యయాలు సైతం రూ.1,249 కోట్ల నుంచి రూ.1,502 కోట్లకు పెరిగాయి.‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వీతీయ త్రైమాసికంలో డిమాండ్ బలంగా పుంజుకుంది. దీంతో ఆదాయం 28 శాతం పెరిగింది. హోటల్ విభాగంలో ఆదాయం 16 శాతం వృద్ధి చెందింది. దీంతో క్యూ2లో ఇప్పటి వరకు అత్యుత్తమ ఎబిట్డా మార్జిన్ 29.9 శాతం నమోదైంది’’అని ఐహెచ్‌సీఎల్ ఎండీ, సీఈవో పునీత్ ఛత్వాల్ తెలిపారు. 2024–25 సంవత్సరానికి రెండంకెల ఆదాయ వృద్ధి అంచనాలను కొనసాగిస్తున్నట్టు చెప్పారు. ఢిల్లీలోని ల్యాండ్‌మార్క్ హోటల్ ‘క్లారిడ్జ్’ను 2025 ఏప్రిల్‌లో స్వాధీనం చేసుకోనున్నట్టు తెలిపారు. -
మార్కెట్లో మతాబులు వెలిగేనా?
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లపై పలు అంశాలు ప్రభావం చూపనున్నాయి. దేశీయంగా కార్పొరేట్ల క్యూ2 ఫలితాలు, అక్టోబర్ ఎఫ్‌అండ్‌వో సిరీస్ ముగింపు కీలకంగా నిలవనున్నాయి. దీంతో ఈ వారం మార్కెట్లు ఆటుపోట్లకు లోనుకానున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇప్పటికే వేడెక్కిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పశి్చమాసియాలో తలెత్తిన యుద్ధ భయాలు సైతం ట్రెండ్‌ను ప్రభావితం చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ స్టాక్ మార్కెట్ల తీరు, క్యూ2 ఫలితాలపై ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఈ వారం బీహెచ్ఈఎల్, డాబర్ ఇండియా, గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీలు.. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ పవర్ జులై–సెపె్టంబర్(క్యూ2) పనితీరును వెల్లడించనున్నాయి. గురువారం(31న) అక్టోబర్ డెరివేటివ్స్ గడువు ముగియనుంది. ఇది మార్కెట్లలో హెచ్చుతగ్గులకు కారణంకావచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అంచనా వేశారు. స్వల్ప కాలంలో మార్కెట్లు కన్సాలిడేట్ కావచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం, యూఎస్ అధ్యక్ష ఎన్నికలు పూర్తికావడం వంటి అంశాలు ట్రెండ్ రివర్స్‌కు దోహదం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఎఫ్‌పీఐల ఎఫెక్ట్ కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్‌లో వెల్లువెత్తుతున్న ఎఫ్‌పీఐల అమ్మకాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేస్తున్నట్లు నాయిర్ పేర్కొన్నారు. ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. దీపావళి సందర్భంగా శుక్రవారం(నవంబర్ 1) మార్కెట్లకు సెలవుకాగా.. సంవత్ 2081 ప్రారంభం సందర్భంగా స్టాక్ ఎక్సే్ఛంజీలు గంటపాటు ప్రత్యేక ట్రేడింగ్‌ను నిర్వహించనున్నాయి. ఎప్పటిలాగే బీఎస్ఈ, ఎన్ఎస్ఈ.. సాయంత్రం 6–7 మధ్య ముహూరత్ ట్రేడింగ్‌కు తెరతీయనున్నాయి. నిరుత్సాహకర క్యూ2 ఫలితాలు, ఎఫ్‌పీఐల భారీ అమ్మకాల నేపథ్యంలో గత వారం మార్కెట్లు పతనబాటలో సాగిన సంగతి తెలిసిందే. దీంతో సెంటిమెంటు బలహీనపడినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చీఫ్ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయ్‌కుమార్ తెలియజేశారు. అందుబాటు ధరల్లో ఉన్న చైనా మార్కెట్లు, అక్కడి ప్రభుత్వ సహాయక ప్యాకేజీ ఎఫ్‌పీఐ అమ్మకాలకు కారణమవుతున్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాలు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు, ముడిచమురు ధరలు కీలకంగా నిలవనున్నట్లు సంతోష్ పేర్కొన్నారు. వీటికితోడు ఎఫ్‌పీఐల తీరు, క్యూ2 ఫలితాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు వివరించారు. యూఎస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రపంచవ్యాప్తంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు తెలియజేశారు. ఈ వారం యూఎస్ క్యూ3(జులై–సెపె్టంబర్) జీడీపీ గణాంకాలు, సెప్టెంబర్ ఉపాధి రిపోర్ట్, చైనా తయారీ రంగ డేటాతోపాటు.. యూఎస్ పీసీఈ ధరలు వెల్లడికానున్నాయి. ఇవి ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణ అంచనాలపై ప్రభావం చూపే విషయం విదితమే. జపాన్ మానిటరీ పాలసీ సమావేశం జరగనుంది. 2.2 శాతం డౌన్ గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు అమ్మకాలతో నీరసించాయి. సెన్సెక్స్ నికరంగా 1,822 పాయింట్లు(2.25 శాతం) పతనమై 79,402 వద్ద నిలవగా.. నిఫ్టీ మరింత ఎక్కువగా 673 పాయింట్లు(2.7 శాతం) కోల్పోయి 24,181 వద్ద ముగిసింది. మిడ్‌క్యాప్ 5.2 శాతం, స్మాల్‌క్యాప్ 7.4 చొప్పున కుప్పకూలాయి. కాగా.. దేశీ మార్కెట్ రికార్డ్ గరిష్టం నుంచి 8 శాతం పతనమైనట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్‌మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా ప్రస్తావించారు. ఇందుకు నిరాశపరుస్తున్న క్యూ2 ఫలితాలు, ఎఫ్‌పీఐల అమ్మకాలు కారణమవుతున్నట్లు తెలియజేశారు. సమీపకాలంలో ఈ ట్రెండ్ కొనసాగే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎఫ్‌పీఐల అమ్మకాల రికార్డ్ గత నెలలో దేశీ స్టాక్స్‌లో నికర ఇన్వెస్టర్లుగా నిలిచిన ఎఫ్‌పీఐలు ఉన్నట్టుండి అక్టోబర్‌లో అమ్మకాల బాట పట్టారు. ఇటీవల అమ్మకాల స్పీడ్ పెంచి నిరవధికంగా స్టాక్స్ నుంచి వైదొలగుతున్నారు. తద్వారా ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా రూ. 85,790 కోట్ల(10.2 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. వెరసి మార్కెట్ చరిత్రలోనే అక్టోబర్ నెల అత్యధిక విక్రయాల రికార్డ్‌కు వేదికకానుంది. అంతక్రితం నెల(సెపె్టంబర్)లో ఎఫ్‌పీఐలు గత 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇంతక్రితం 2020 మార్చిలో మాత్రమే ఎఫ్‌పీఐలు ఒక నెలలో అత్యధికంగా రూ. 61,973 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
లగ్జరీ ప్రాపర్టీలకు డిమాండ్.. డీఎల్ఎఫ్ లాభం డబుల్
న్యూఢిల్లీ: లగ్జరీ ప్రాపర్టీలకు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో సెప్టెంబర్ త్రైమాసికంలో రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ. 1,381 కోట్లకు చేరింది. గత క్యూ2లో ఇది రూ. 622 కోట్లు.సమీక్షాకాలంలో మొత్తం ఆదాయం 48 శాతం పెరిగి రూ. 1,476 కోట్ల నుంచి రూ. 2,181 కోట్లకు చేరింది. ప్రథమార్ధంలో నికర లాభం రూ. 1,150 కోట్ల నుంచి రూ. 2,027 కోట్లకు ఎగిసింది. మొత్తం ఆదాయం రూ. 2,998 కోట్ల నుంచి రూ. 3,910 కోట్లకు చేరింది.మార్కెట్ క్యాపిటలైజేషన్లో డీఎల్ఎఫ్ దేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ.ఇది ప్రాథమికంగా రెసిడెన్షియల్ ప్రాపర్టీల అభివృద్ధి, విక్రయాలతోపాటు కమర్షియల్, రిటైల్ ప్రాపర్టీల అభివృద్ధి, లీజింగ్ వ్యాపారంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
టీవీఎస్ మోటార్ కొత్త రికార్డ్
న్యూఢిల్లీ: ద్విచక్ర, త్రిచక్ర వాహన రంగ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 41 శాతం జంప్‌చేసి రూ. 588 కోట్లను అధిగమించింది. రికార్డ్ అమ్మకాలు ఇందుకు సహకరించాయి.గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 416 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 9,933 కోట్ల నుంచి రూ. 11,302 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు రూ. 9,297 కోట్ల నుంచి రూ. 10,428 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో ఎగుమతులతోపాటు ద్విచక్ర, త్రిచక్ర వాహన అమ్మకాలు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 12.28 లక్షల యూనిట్లను తాకాయి. గత క్యూ2లో నమోదైన 10.74 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది 14 శాతం వృద్ధి. వీటిలో మోటార్ సైకిళ్ల విక్రయాలు 14 శాతం పుంజుకుని 5.6 లక్షల యూనిట్లకు చేరగా.. స్కూటర్ అమ్మకాలు 17 శాతం ఎగసి 4.9 లక్షల యూనిట్లను తాకాయి.ద్విచక్ర వాహన ఎగుమతులు 16 శాతం బలపడి 2.78 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక త్రిచక్ర వాహన అమ్మకాలు 5,000 యూనిట్లు తగ్గి 38,000కు పరిమితమయ్యాయి. ఎలక్ట్రిక్ వాహనాలు 31 శాతం అధికంగా 75,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఫలితాల నేపథ్యంలో టీవీఎస్ మోటార్ షేరు బీఎస్ఈలో 3.6 శాతం పతనమై రూ. 2,565 వద్ద ముగిసింది. -
క్యూ2 ఫలితాలదే పైచేయి
దేశీ స్టాక్ మార్కెట్లను ఈ వారం ప్రధానంగా కార్పొరేట్ ఫలితాలు నిర్దేశించనున్నాయి. గత వారాంతాన పలు దిగ్గజాలు జులై–సెపె్టంబర్(క్యూ2) ఫలితాలు వెల్లడించాయి. బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, కొటక్ మహీంద్రాసహా ఆర్బీఎల్ బ్యాంక్, యుకో బ్యాంక్, ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికం పనితీరు ప్రకటించాయి. దీంతో సోమవారం ప్రధానంగా ఈ కౌంటర్లలో యాక్టివిటీ కనిపించనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కాగా.. ఈ వారం మరిన్ని రంగాలకు చెందిన బ్లూచిప్ కంపెనీలు క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. జాబితాలో ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు ఐటీసీ, హచ్‌యూఎల్, రిఫైనరీ దిగ్గజాలు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, సిమెంట్ దిగ్గజం అల్ట్రాటెక్ తదితరాలున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ఇదేవిధంగా ఫైనాన్స్ దిగ్గజాలు బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇటీవలే స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తోపాటు.. అదానీ గ్రీన్ ఎనర్జీ, వన్97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్), జొమాటో, బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) సైతం ఫలితాలు ప్రకటించనున్నాయి. చమురు ధరలు సైతం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ముదిరిన వివాదాలతో ఇటీవల ముడిచమురు ధరలకు రెక్కలొస్తున్నాయి. వారాంతాన బ్రెంట్ చమురు బ్యారల్ 75 డాలర్లకు చేరింది. దీనికిజతగా అన్నట్లు విదేశీ మార్కెట్లో పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 2,730 డాలర్ల ఆల్‌టైమ్ గరిష్టాన్ని దాటింది. చమురు, పసిడి ధరల పెరుగుదల వాణిజ్యలోటును పెంచే వీలుంది. దీనికితోడు ఇటీవల డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడుతోంది. చరిత్రత్మాక కనిష్టం 84కు బలహీనపడి కదులుతోంది. ఇవి ప్రతికూల అంశాలుగా మార్కెట్ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ఇరాన్– ఇజ్రాయెల్ యుద్ధ భయాలు, చమురు ధరల సెగ మార్కెట్లలో ఆటుపోట్లకు కారణమయ్యే అవకాశమున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేష్ గౌర్ తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు కార్పొరేట్ ఫలితాలను నిశితంగా గమనిస్తారని మిశ్రా చెబుతున్నారు. గత వారమిలా పలు ఆటుపోట్ల మధ్య గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప వెనకడుగు వేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 157 పాయింట్లు(0.2 శాతం) క్షీణించి 81,225 వద్ద ముగిసింది. నిఫ్టీ కొంత అధికంగా 110 పాయింట్లు(0.4 శాతం) నీరసించి 24,854 వద్ద నిలిచింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.2 శాతమే నష్టపోగా.. స్మాల్ క్యాప్ 1 శాతంపైగా క్షీణించింది. ఎఫ్‌పీఐ అమ్మకాలు భౌగోళిక, రాజకీయ అనిశి్చతులు, చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా సెంటిమెంటు బలహీనపడినట్లు మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్(రీసెర్చ్) ప్రశాంత్ తాప్సే పేర్కొన్నారు. మరోపక్క దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) నిరవధిక అమ్మకాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలకు తెరతీస్తున్నట్లు వివరించారు. ఈ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్‌లో నికరంగా రూ. 74,700 కోట్ల విలువైన అమ్మకాలు చేట్టారు. అయితే ఇందుకు ధీటుగా దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(డీఐఐలు) కొనుగోళ్లు చేపడుతుండటం గమనార్హం! ఈ ట్రెండ్ సమీపకాలంలో కొనసాగవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. చైనా స్టాక్స్ చౌకగా లభిస్తుండటం, దేశీ మార్కెట్లు అధిక విలువలకు చేరుకోవడం ఎఫ్‌పీఐలపై ప్రభావం చూపుతున్నట్లు విశ్లేíÙంచారు. కాగా.. క్యూ2లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 6 శాతం వృద్ధితో రూ. 17,286 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కొటక్ బ్యాంక్ 13 శాతం అధికంగా రూ. 5,044 కోట్ల నికర లాభం ఆర్జించింది. టెక్ మహీంద్రా 60.3 కోట్ల డాలర్ల(రూ. కోట్లు) విలువైన కొత్త డీల్స్ కుదుర్చుకుంది. ఈ వివరాలు శనివారం(19న) వెల్లడయ్యాయి. వీటి ప్రభావం నేడు(21న) ఆయా స్టాక్స్‌పై కనిపించనున్నట్లు విశ్లేషకులు అంచనా వేశారు.క్యూ2 ఫలితాలదే పైచేయిఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సొల్యూషన్స్ అందించే బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ సంస్థ తమ షేర్లను 2:1 నిష్పత్తిలో విభజించనుంది. ఈ ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపినట్లు వివరించింది. దీని ప్రకారం రూ. 2 ముఖ విలువ ఉండే ఒక్కో షేరును రూ. 1 ముఖ విలువ ఉండే షేరుగా విభజిస్తారు. కంపెనీ ఇటీవలే బ్లూహెల్త్ అప్లికేషన్, బ్లూరా, ఎడ్యుజీనీ, బయోస్టర్ పేరిట నాలుగు ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఉత్పత్తులను ఆవిష్కరించింది.నవంబర్ 1న ముహూరత్ ట్రేడింగ్దీపావళి సందర్భంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈ రెడీ స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ దీపావళి పండుగ సందర్భంగా యథావిధిగా ముహూరత్(మూరత్) ట్రేడింగ్‌ను చేపట్టనున్నాయి. ఇందుకు నవంబర్ 1న(శుక్రవారం) సాయంత్రం 6 నుంచి 7వరకూ గంటపాటు ప్రత్యేక ట్రేడింగ్‌కు తెరతీయనున్నాయి. తద్వారా స్టాక్ మార్కెట్‌కు కొత్త ఏడాది సంవత్ 2081 ప్రారంభంకానున్నట్లు ఎక్సే్ఛంజీలు ఒక ప్రకటనలో తెలియజేశాయి. హిందువుల క్యాలండర్ ప్రకారం దీపావళికి ప్రారంభమయ్యే కొత్త ఏడాది తొలి రోజు చేపట్టే ముహూరత్ ట్రేడింగ్ ఆర్థికంగా శుభాన్ని, లాభాన్ని కలగజేస్తుందని స్టాక్ మార్కెట్ వర్గాలు భావిస్తుంటాయి. కాగా.. దీపావళి రోజు మార్కెట్లలో సాధారణ ట్రేడింగ్ ఉండదు. దీనిస్థానే సాయంత్రం గంటపాటు ప్రత్యేక ట్రేడింగ్‌ను నిర్వహిస్తారు. 5.45కల్లా ప్రీఓపెనింగ్ సెషన్ ప్రారంభమవుతుంది. ఈక్విటీ, ఎఫ్‌అండ్‌వో, కమోడిటీ, కరెన్సీ డెరివేటివ్స్ ట్రేడింగ్‌కు వీలుంటుంది.పీఎస్‌యూలలో ట్రేడింగ్‌కు నో ప్రభుత్వ అధికారులకు దీపమ్ ఆదేశాలుప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల షేర్లలో ట్రేడింగ్ చేపట్టవద్దంటూ ఆర్థిక శాఖ నిర్వహణలోని దీపమ్ అంతర్గత ఆదేశాలు జారీ చేసింది. ఆయా కంపెనీలకు సంబంధించిన మార్కెట్లపై ప్రభావం చూపగల రహస్య సమాచారం అందుబాటులో ఉంటుందన్న యోచనతో దీపమ్ తాజా నిర్ణయం తీసుకుంది. ఆయా శాఖలలో చేరేందుకు ఎంపికయ్యే వ్యక్తులు పీఎస్‌యూలలో షేర్లను కలిగి ఉంటే ముందుగానే వెల్లడించవలసిందిగా తెలియజేసింది. అధికారిక అనుమతులు పొందాక మాత్రమే వీటిని విక్రయించేందుకు వీలుంటుందని వివరించింది. పీఎస్‌యూలలో ప్రభుత్వ ఈక్విటీని దీపమ్ మేనేజ్ చేస్తుంటుంది. అంతేకాకుండా పీఎస్‌యూలలో ప్రభుత్వానికి చెందిన మైనారిటీ వాటా లేదా వ్యూహాత్మక వాటాల విక్రయం, ఎంపిక చేసిన కంపెనీల ప్రయివేటైజేషన్ తదితరాలను చేపట్టే సంగతి తెలిసిందే. వెరసి షేర్ల ధరలను ప్రభావితం చేయగల సమాచారం అందుబాటులో ఉంటుందన్న కారణంతో పీఎస్‌యూలలో ట్రేడింగ్ చేపట్టవద్దంటూ ప్రభుత్వ అధికారులకు అంతర్గత ఆదేశాల ద్వారా దీపమ్ స్పష్టం చేసింది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వం గతేడాది(2023–24) రూ. 16,507 కోట్ల విలువైన సీపీఎస్ఈ షేర్లను విక్రయించిన విషయం విదితమే. అంతక్రితం ఏడాది(2022–23)లోనూ రూ. 35,294 కోట్లు సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) జీఐసీ, కొచిన్ షిప్‌యార్డ్‌లలో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ. 5,160 కోట్లు అందుకుంది.చిన్నషేర్ల ఫండ్స్‌కు భారీ పెట్టుబడులు 6 నెలల్లో రూ. 30,352 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి ఆరు నెలల్లో మధ్య, చిన్నతరహా షేర్ల ఫండ్స్‌కు మరోసారి పెట్టుబడులు భారీగా తరలివచ్చాయి. వెరసి ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌కు రూ. 30,352 కోట్లు ప్రవహించాయి. మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్(యాంఫీ) వివరాల ప్రకారం మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ. 14,756 కోట్లు, స్మాల్‌క్యాప్ ఫండ్స్ రూ. 15,586 కోట్లు చొప్పున పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. ఇందుకు మధ్య, చిన్నతరహా షేర్ల విభాగాలు ఆకట్టుకునే స్థాయిలో రిటర్నులు సాధించడం ప్రభావం చూపింది. గతేడాది(2023–24) తొలి ఆరు నెలల్లోనూ మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌కు రూ. 32,924 కోట్ల పెట్టుబడులు లభించాయి. ఓవైపు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ అంశంపై ఆందోళనలు వ్యక్తం చేసినప్పటికీ ఈ ఏడాది పెట్టుబడులు కొనసాగడం గమనార్హం! అధిక రిటర్నులు మిడ్, స్మాల్ క్యాప్స్ అత్యధిక లాభాలు అందించగలవన్న ఇన్వెస్టర్ల విశ్వాసమే ఇందుకు కారణమని ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) సీఈవో సందీప్ బాగ్లా, ట్రేడ్జినీ సీవోవో ట్రివేష్ పేర్కొన్నారు. ఇకపైన కూడా చిన్న షేర్లు వేగవంతంగా వృద్ధి చెందనున్నట్లు అభిప్రాయపడ్డారు. అధిక వృద్ధిగల రంగాలలో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. వెరసి స్మాల్ క్యాప్ ఫండ్స్ పోర్ట్‌ఫోలియో కేటాయింపుల్లో భాగమైపోయినట్లు వివరించారు. ఈ ఏడాది ఇప్పటివరకూ మిడ్ క్యాప్ ఇండెక్స్ 20 శాతం, స్మాల్ క్యాప్ 24 శాతం చొప్పున ర్యాలీ చేశాయి. తద్వారా నిఫ్టీ, లార్జ్‌క్యాప్ ఇండెక్సులను అధిగమించాయి. 2024 మార్చిలో స్ట్రెస్ టెస్ట్ సైతం ఇందుకు కీలకపాత్ర పోషించినట్లు ఆనంద్ రాఠీ వెల్త్ డిప్యూటీ సీఈవో ఫిరోజ్ అజీజ్ తెలియజేశారు. దీంతో ఫండ్ మేనేజర్లు మార్కెట్ ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధపడినట్లు వివరించారు.సాక్షి, బిజినెస్ డెస్క్ -
జీ ఎంటర్టైన్మెంట్ దూకుడు.. మళ్లీ పునీత్ గోయెంకానే
న్యూఢిల్లీ: మీడియా రంగ దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్(జీల్) ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 70 శాతంపైగా దూసుకెళ్లి రూ. 209 కోట్లను అధిగమించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 123 కోట్లు ఆర్జించింది. పటిష్ట వ్యయ నియంత్రణల కారణంగా మార్జిన్లు 6 శాతంపైగా మెరుగుపడినట్లు కంపెనీ పేర్కొంది. అయితే మొత్తం ఆదాయం 19% క్షీణించి రూ. 2,034 కోట్లకు పరిమితమైంది. గత క్యూ2లో రూ. 2,510 కోట్ల టర్నోవర్ అందుకుంది. పునీత్ గోయెంకాను 2025 జనవరి1 నుంచి ఐదేళ్ల కాలానికి ఎండీ, సీఈవోగా బోర్డు తిరిగి నియమించినట్లు జీల్ పేర్కొంది. షేరు 5% జంప్ చేసి రూ. 132 వద్ద ముగిసింది. -
ఎల్‌టీమైండ్‌ట్రీ లాభం ప్లస్.. 2,504 మందికి ఉద్యోగాలు
ముంబై: ఐటీ సర్వీసుల కంపెనీ ఎల్‌టీమైండ్‌ట్రీ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 8 శాతం పుంజుకుని రూ. 1,251 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,161 కోట్లు ఆర్జించింది.మొత్తం ఆదాయం సైతం 6 శాతం ఎగసి రూ. 9,432 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 8,905 కోట్ల టర్నోవర్ సాధించింది. వాటాదారులకు షేరుకి రూ. 20 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. కీలక విభాగాలలో 20 కోట్ల డాలర్ల డీల్సహా పలు కాంట్రాక్టులు కుదుర్చుకున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ దేవశిష్ చటర్జీ పేర్కొన్నారు.ఈ కాలంలో 2,504 మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 84,438ను తాకింది. సెప్టెంబర్ కల్లా 742 మంది యాక్టివ్ క్లయింట్లను కలిగి ఉంది. ఫలితాల నేపథ్యంలో ఎల్‌టీమైండ్‌ట్రీ షేరు బీఎస్ఈలో 0.7% బలపడి రూ. 6,402 వద్ద ముగిసింది. -
ఎల్&టీ టెక్నాలజీలో 2000 ఫ్రెషర్ జాబ్స్
ముంబై: ఇంజనీరింగ్ సర్వీసుల ఐటీ కంపెనీ ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జూలె–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం స్వల్పంగా 2 శాతం పుంజుకుని రూ. 320 కోట్లకు చేరింది. లాభాల మార్జిన్లు నీరసించడం ప్రభావం చూపింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 315 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 8 శాతం ఎగసి రూ. 2,573 కోట్లను తాకింది.యూరోపియన్ మార్కెట్ నుంచి ఆటోమొబైల్, సస్టెయినబిలిటీ సొల్యూషన్లకు ఏర్పడిన డిమాండ్ ఇందుకు తోడ్పాటునిచ్చింది. వాటాదారులకు షేరుకి రూ. 17 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు ఈ నెల 25 రికార్డ్ డేట్‌కాగా.. ఈ ఏడాది 2,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు ఆఫర్ చేయనున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో అమిత్ చద్దా పేర్కొన్నారు. ఈ కాలంలో 121 మందిని చేర్చుకోవడంతో సిబ్బంది సంఖ్య 23,698కు చేరింది.అమ్మకాలు, టెక్నాలజీలపై అధిక వ్యయాలతో నిర్వహణ లాభ మార్జిన్లు 17.1 శాతం నుంచి 15.1 శాతానికి బలహీనపడ్డాయి. 8–10 శాతం వృద్ధి ప్రస్తుత ఏడాది ఎల్అండ్టీ టెక్నాలజీ ఆదాయంలో 8–10 శాతం వృద్ధి నమోదుకానున్నట్లు అమిత్ చద్దా పేర్కొన్నారు. వార్షికంగా 2 బిలియన్ డాలర్ల ఆదాయ మార్క్‌ను అందుకోగలమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇకపై మార్జిన్లు మెరుగుపడనున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఏడాది చివరికల్లా ఆదాయంలో 16 శాతం పురోగతిని అందుకోగలమని అంచనా వేశారు. ప్రస్తుత సమీక్షాకాలంలో 2 కోట్ల డాలర్ల విలువైన 2 డీల్స్తోపాటు కోటి డాలర్ల విలువైన 4 ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. -
బజాజ్ ఆటో రివర్స్‌గేర్.. చేతక్ అమ్మకాలు సూపర్
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 31 శాతం క్షీణించి రూ. 1,385 కోట్లకు పరిమితమైంది. అధిక వ్యయాలు, డిఫర్డ్ ట్యాక్స్‌కు పెరిగిన కేటాయింపులు ప్రభావం చూపాయి. అయితే మొత్తం ఆదాయం రూ.10,838 కోట్ల నుంచి రూ. 13,247 కోట్లకు జంప్ చేసింది. మొత్తం వ్యయాలు రూ. 8,806 కోట్ల నుంచి రూ. 10,767 కోట్లకు పెరిగాయి. విక్రయాలు 16% అప్ ఈ క్యూ2లో బజాజ్ ఆటో స్టాండెలోన్ నికర లాభం 9 శాతం వృద్ధితో రూ. 2,005 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం రూ. 10,777 కోట్ల నుంచి రూ. 13,127 కోట్లకు బలపడింది. ఈ కాలంలో వాహన విక్రయాలు 16 శాతం ఎగసి 12,21,504 యూనిట్లకు చేరాయి. దేశీ అమ్మకాలు 26 శాతం జంప్‌చేసి 6,36,801 యూనిట్లను తాకగా.. ఎగుమతులు 5 శాతం పుంజుకుని 3,96,407 యూనిట్లుగా నమోదయ్యాయి. కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ 70,000 యూనిట్ల అమ్మకాలు సాధించింది. -
న్యూజెన్ సాఫ్ట్వేర్ బంపర్ లాభాలు
న్యూఢిల్లీ: సాప్ట్వేర్ ఉత్పత్తుల సంస్థ న్యూజెన్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో (క్యూ2) బలమైన పనితీరు నమోదు చేసింది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 47 శాతం పెరిగి రూ.70 కోట్లకు చేరింది.క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.48 కోట్లుగా ఉండడం గమనార్హం. రూ.361 కోట్ల ఆదాయాన్ని సాధించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.293 కోట్లతో పోల్చి చూస్తే 23 శాతం పెరిగింది.‘‘అన్ని కీలక మార్కెట్లలో మెరుగైన పనితీరు సాధించాం. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వరుసగా రెండు త్రైమాసికాల్లో బలమైన వృద్ధి నమోదవుతోంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కీలక విభాగాలుగా ఉన్నాయి. ఇన్సూరెన్స్, ప్రభుత్వ విభాగాల్లోనూ డిమాండ్ పెరుగుతోంది’’అని న్యూజెన్ సాఫ్ట్వేర్ సీఈవో వీరేందర్ జీత్ తెలిపారు. కంపెనీ ఉద్యోగుల సంఖ్య 4,400కు చేరింది. -
సీన్ రివర్స్.. నష్టాల్లోకి పీవీఆర్ ఐనాక్స్
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ ఐనాక్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో లాభాలకు బదులు నష్టాలు చవిచూసింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో రూ. 12 కోట్లకుపైగా నష్టాలను ప్రకటించింది. సినిమా థియేటర్ల బిజినెస్ నీరసించడం ప్రభావాన్ని చూపించింది.గతేడాది(2023–24) ఇదే కాలంలో కంపెనీ రూ. 166 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. మొత్తం ఆదాయం సైతం 19 శాతం క్షీణించి రూ.1,622 కోట్లకు పరిమితమైంది. మొత్తం వ్యయాలు 7 శాతం తగ్గి రూ. 1,679 కోట్లుగా నమోదయ్యాయి. మూవీ ఎగ్జిబిషన్ ఆదాయం 20 శాతం క్షీణించి రూ. 1,579 కోట్లకు పరిమితమైంది. అయితే మూవీ ప్రొడక్షన్, పంపిణీ బిజినెస్ 78 శాతం పెరిగి రూ. 108 కోట్లను చేరుకుంది. -
ఫలితాలు, గణాంకాలు కీలకం
దేశీ స్టాక్ మార్కెట్లను ఈ వారం పలు కీలక అంశాలు ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసిక ఫలితాల సీజన్ గత వారమే ప్రారంభమైంది. ఇకపై ఊపందుకోనుంది. వారాంతాన ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, పీఎస్‌యూ ఇరెడా, జస్ట్‌డయల్ జులై–సెప్టెంబర్(క్యూ2) ఫలితాలను వెల్లడించాయి. ఈ బాటలో మరిన్ని దిగ్గజాలు క్యూ2 పనితీరును వెల్లడించనున్నాయి. క్యూ2 జాబితాలో ఈ వారం ప్రయివేట్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్, బ్యాంకింగ్ బ్లూచిప్ హెచ్డీఎఫ్సీ క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ల ట్రెండ్‌ను ఫలితాలు నిర్దేశించే వీలున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. 17న ఐటీ సేవల దిగ్గజం విప్రో క్యూ2 ఫలితాలుసహా బోనస్ షేర్లను ప్రకటించనుంది. అంతేకాకుండా 12న డీమార్ట్ క్యూ2 పనితీరును వెల్లడించడంతో సోమవారం(14న) ఈ ప్రభావం రెండు షేర్లపై కనిపించే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. 3 ఐపీవోలు ఈ వారం మూడు కంపెనీల పబ్లిక్ ఇష్యూలు ప్రారంభంకానున్నాయి. వీటిలో ప్రధానమైనది హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇష్యూ. అతిపెద్ద ఐపీవోగా రికార్డు సృష్టించనున్న రూ. 27,870 కోట్ల ఇష్యూ మంగళవారం ప్రారంభమై గురువారం ముగియనుంది. ఈ బాటలో మరో రెండు చిన్న కంపెనీలు బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఐపీవోకు రానున్నాయి. లక్ష్య పవర్‌టెక్, ఫ్రెషార ఆగ్రో ఎక్స్‌పోర్ట్స్ 16–17 మధ్య ఇష్యూలు చేపట్టనున్నాయి. అయితే గత వారం క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. ఎస్ఎంఈ ఐపీవో తదుపరి ట్రాఫిక్సోల్ను లిస్ట్కాకుండా నిలిపి వేయడం గమనార్హం. నిధుల వినియోగంపై అభియోగాలతో మరింత లోతైన దర్యాప్తునకు సైతం ఆదేశించింది. ద్రవ్యోల్బణం గత వారం పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెలువడగా.. ఇకపై రిటైల్ ధరలు(సీపీఐ), టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. సెప్టెంబర్ నెలకు ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రభుత్వం నేడు(సోమవారం) విడుదల చేయనుంది. వీటికితోడు పశి్చమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భౌగోళిక, రాజకీయ పరిస్థితులు సెంటిమెంటును దెబ్బతీయగలవని స్టాక్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇండియా, చైనా, యూకే ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల చేయనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖేమ్కా వెల్లడించారు. ఈసీబీ పాలసీ రేట్ల నిర్ణయాలు, చైనా జీడీపీ, యూఎస్ రిటైల్ అమ్మకాల గణాంకాలు సైతం వెల్లడికానున్నట్లు వివరించారు. వీటన్నిటిపైనా ఇన్వెస్టర్లు దృష్టిసారిస్తారని తెలియజేశారు.చమురు రయ్ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల కారణంగా గత వారం ముడిచమురు ధరలు రివ్వున పైకెగశాయి. మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టం 84ను దాటి ముగిసింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నిరవధిక అమ్మకాలకే మొగ్గు చూపుతున్నారు. ఈ అంశాలన్నీ విదేశీ మారక నిల్వలపై ప్రతికూల ప్రభావాన్ని చూపగలవని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. చైనా సహాయక ప్యాకేజీలు, అందుబాటులో ఉన్న షేర్ల విలువలు ఎఫ్‌పీఐలను ఆకట్టుకుంటున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. మరోపక్క 10ఏళ్ల యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ మెరుగుపడటం సైతం విదేశీ పెట్టుబడులపై ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు.ఎఫ్‌పీఐల భారీ విక్రయాలు కొద్ది రోజులుగా అమ్మకాల యూటర్న్ తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఇటీవల మరిన్ని పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ నెల(అక్టోబర్)లో ఇప్పటివరకూ(1–11 మధ్య) నికరంగా రూ. 58,711 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. అయితే గత నెల(సెపె్టంబర్)లో రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. గత 9 నెలల్లో ఇవి అత్యధిక పెట్టుబడులుకాగా.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు, చైనా సహాయక ప్యాకేజీల తదుపరి దేశీ స్టాక్స్‌లో నిరంతర అమ్మకాలు చేపడుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కేలండర్ ఏడాది ఏప్రిల్, మే నెలల తదుపరి జూన్ నుంచి ఎఫ్‌పీఐలు దేశీయంగా పెట్టుబడులకే కట్టుబడినట్లు మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలియజేశారు. అయితే పశ్చిమాసియా యుద్ధ భయాలతో ముడిచమురు ధరలు పెరగడం, చైనా మార్కెట్లు బలపడుతుండటం వంటి అంశాలు ఎఫ్‌పీఐల అమ్మకాలకు కారణమవుతున్నట్లు విశ్లేíÙంచారు. వెంచురా సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ వినిత్ బి. సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.గత వారమిలా గత వారం ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో నిలిచాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 307 పాయింట్లు క్షీణించి 81,381 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 పాయింట్లు నీరసించి 24,964 వద్ద స్థిరపడింది.–సాక్షి, బిజినెస్ డెస్క్ -
టీసీఎస్ భేష్.. వచ్చే ఏడాది క్యాంపస్ హైరింగ్ షురూ
ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మరోసారి పటిష్ట ఫలితాలు సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో నికర లాభం 5 శాతం బలపడి రూ. 11,909 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలం(క్యూ2)లో రూ. 11,342 కోట్లు ఆర్జించింది.అయితే ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్–జూన్)లో ఆర్జించిన రూ. 12,040 కోట్లుతో పోలిస్తే లాభాలు నామమాత్రంగా తగ్గాయి. పన్నుకుముందు లాభం రూ. 15,330 కోట్ల నుంచి రూ. 16,032 కోట్లకు మెరుగుపడింది. ఇక మొత్తం ఆదాయం 7% పుంజుకుని రూ. 64,988 కోట్లకు చేరింది. గతేడాది క్యూ2లో రూ. 60,698 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ ఏడాది క్యూ1లో రూ. 63,575 కోట్ల అందుకున్న సంగతి తెలిసిందే. ఇతర విశేషాలు » ఆర్డర్ బుక్ విలువ (టీసీవీ) 8.6 బి. డాలర్లకు చేరింది. దీనిలో ఉత్తర అమెరికా నుంచి 4.2 బిలియన్ డాలర్లు లభించింది. » మొత్తం సిబ్బంది సంఖ్య 6,12,724కు చేరింది. » షేరుకి రూ. 10 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.» 2025–26కు క్యాంపస్ హైరింగ్ షురూఅనిశ్చితుల ఎఫెక్ట్ గత కొన్ని త్రైమాసికాలుగా కనిపిస్తున్న అప్రమత్తత తాజా క్వార్టర్లోనూ కొనసాగింది. ప్రపంచ భౌగోళిక, రాజకీయ అనిశ్చిత పరిస్థితుల్లోనూ మా అతిపెద్ద విభాగం బీఎఫ్ఎస్ఐ రికవరీ బాటలో సాగుతోంది. వృద్ధి మార్కెట్లలో పటిష్ట పనితీరు చూపాం. క్లయింట్లు, ఉద్యోగులు, వాటాదారుల విలువ పెంపుపై ప్రత్యేక దృష్టిని కొనసాగిస్తున్నాం. – కె.కృతివాసన్, సీఈవో, ఎండీ -
కాస్త పైకి తేలిన ‘స్పైస్‌జెట్’.. నిధుల సమీకరణతో కొత్త ఊపిరి!
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన కంపెనీ స్పైస్‌జెట్ ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర నష్టం దాదాపు సగానికి తగ్గి రూ. 446 కోట్లకు పరిమితమైంది. వ్యయాలు తగ్గడం ఇందుకు సహకరించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 830 కోట్ల నికర నష్టం నమోదైంది. అయితే మొత్తం ఆదాయం రూ. 2,102 కోట్ల నుంచి రూ. 1,726 కోట్లకు క్షీణించింది. మొత్తం వ్యయాలు సైతం రూ. 2,935 కోట్ల నుంచి రూ. 2,175 కోట్లకు తగ్గాయి. విమానాలు అద్దెకిచ్చే క్యాజిల్ లేక్‌తో ఉన్న వివాదాలను సర్దుబాటు చేసుకోవడంతోపాటు.. సిటీ యూనియన్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ. 100 కోట్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా కార్లయిల్ ఏవియేషన్ పార్ట్నర్స్కు షేరుకి రూ. 48 ధరలో 4.81 కోట్ల షేర్లను జారీ చేసినట్లు పేర్కొంది. రుణాలను ఈక్విటీగా మార్పు చేయడం ద్వారా రూ. 230 కోట్ల రుణాలు తగ్గించుకున్నట్లు తెలియజేసింది. నిధుల సమీకరణకు రెడీ ఆర్థిక సంస్థలు, ఎఫ్ఐఐలకు ఈక్విటీ షేర్ల జారీ ద్వారా 27 కోట్ల డాలర్లు(రూ. 2,250 కోట్లు) సమీకరించనున్నట్లు స్పైస్‌జెట్ పేర్కొంది. తద్వారా ఆర్థిక సవాళ్లకు చెక్ పెట్టే యోచనలో ఉంది. ప్రయివేట్ ప్లేస్మెంట్లో భాగంగా ఈక్విటీ షేర్లు, వారంట్ల జారీకి బోర్డు అనుమతించినట్లు వెల్లడించింది. ఎలారా ఇండియా అపార్చునిటీస్ ఫండ్, ఏరీస్ అపార్చునిటీస్ ఫండ్, నెక్సస్ గ్లోబల్ ఫండ్, ప్రభుదాస్ లీలాధర్ తదితరాలకు సెక్యూరిటీలను జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం బీఎస్ఈలో లిస్టయిన కంపెనీ ఎన్ఎస్ఈలోనూ లిస్టయ్యే ప్రణాళికల్లో ఉన్నట్లు వివరించింది. -
మూడోరోజూ మార్కెట్ ముందుకే...
ముంబై: స్టాక్ సూచీలు గురువారం స్వల్పంగా లాభపడి మూడోరోజూ ముందడుగేశాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్, దేశీయ క్యూ2 జీడీపీ వృద్ధి రేటు, అక్టోబర్ ద్రవ్యలోటు డేటా వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. అమెరికా మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. ట్రేడింగ్‌లో 460 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 87 పాయింట్లు పెరిగి 66,988 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 37 పాయింట్లు బలపడి 20,133 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు నవంబర్ నెలవారీ డెరివేటివ్‌ల గడువు ముగింపు కావడంతో ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఫార్మా, కన్జూమర్, రియలీ్ట, పారిశ్రామిక, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒకశాతం మేర లాభపడ్డాయి. బ్యాంకులు, యుటిలిటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆసియాలో చైనా, హాంగ్‌కాంగ్ స్టాక్ సూచీలు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు సానుకూలంగా ట్రేడయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 5 పైసలు బలహీనపడి 83.37 వద్ద స్థిరపడింది. -
లాభాలు కొనసాగే అవకాశం
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారమూ లాభాలను కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు, కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలపై ఆశావహ అంచనాలు ఇందుకు దోహదపడొచ్చని భావిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, పశి్చమాసియా ఘర్షణలు, క్రూడాయిల్ ధరలు, ఎఫ్ఐఐల కొనుగోళ్లు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. డాలర్ మారకంలో రూపాయి కదలికలపై కన్నేయోచ్చంటున్నారు. సెపె్టంబర్ క్వార్టర్ ఆదాయాలపై సానుకూల అంచనాలు, దేశీయ ద్రవ్యోల్బణ దిగిరావడం, మెరుగైన పారిశ్రామికోత్పత్తి నమోదు తదితర పరిణామాలు కలిసిరావడంతో గతవారం సెన్సెక్స్ 287 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 100 పాయింట్లు ఆర్జించింది. మరోవైపు అమెరికాలో ద్రవ్యల్బోణం పెరగడం, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, దేశీయ ఐటీ కంపెనీల యాజమాన్య నిరాశజనక ఆదాయ అవుట్‌లుక్ వ్యాఖ్యలు సూచీల లాభాలను కట్టడి చేశాయి. కార్పొరేట్ ఫలితాలు కీలకం మార్కెట్ ముందుగా గత వారాంతాన విడుదలైన హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అవెన్యూ సూపర్ మార్ట్(డీ మార్ట్)లు ప్రకటించిన ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో నిఫ్టీ–50 ఇండెక్సు లో 40% వెయిటేజీ కలిగిన కంపెనీల షేర్లు తమ సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలు ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనా న్స్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, నెస్లే ఇండియా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు మొ త్తం 540 కంపెనీలు తమ క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. కార్పొరేట్ వార్తల నేపథ్యంలో షేరు ఆధారిత ట్రేడింగ్‌కు అధిక ప్రాధాన్యత ఉండొచ్చు. ప్రపంచ పరిణామాలు ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధ పరిమాణాలు భారత్‌తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు అత్యంత కీలకం కానున్నాయి. యుద్ధ ప్రభావంతో ఇప్పటికే బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 8% ర్యాలీ చేశాయి. ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ గురువారం ‘ది ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్’ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. అమెరికా రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి డేటా(మంగళవారం), బ్రిటన్ నిరుద్యోగ, సీపీఐ ద్రవ్యోల్బణ డేటా పాటు యూరోజోన్ సెపె్టంబర్ సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. జపాన్ పారిశ్రామికోత్పత్తి, చైనా జీడీపీ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలపైనా కన్నేయోచ్చు. ప్రథమార్థంలో రూ.9,800 కోట్ల ఉపసంహరణ విదేశీ ఇన్వెస్టర్లు అక్టోబర్ ప్రథమార్థంలో రూ.9,800 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అమెరికా బాండ్ల రాబడులు పెరగడం, ఇజ్రాయెల్– హమాస్ వంటి భౌగోళిక రాజకీయ అనిశి్చతులు ఇందుకు కారణమయ్యాయి. సెపె్టంబరులో రూ.14,767 కోట్లు వెనక్కి తీసుకోవడంతో ఈ ఏడాది ఈక్విటీలోకి ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ. 1.1 లక్షల కోట్లుగా ఉన్నాయి. కాగా ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు భారత ఈక్విటీల్లో రూ.1.74 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఫిబ్రవరిలో 6 శాతంగా ఉన్న అమెరికా ద్రవ్యోల్బణం జులైలో 3.2 శాతానికి తగ్గడం, అమెరికా ఫెడరల్ రేట్ల పెంపులో తాత్కాలిక విరామం వంటి పరిణామాలు భారత్‌లోకి ఎఫ్‌పీఐల పెట్టుబడులకు దోహదం చేశాయి. ఫైనాన్షియల్స్, పవర్, ఐటీ రంగాల్లో ఎఫ్‌పీఐలు పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నారు. క్యాపిటల్ గూడ్స్ ఆటోమొబైల్స్ రంగాల్లో కొనుగోళ్లను కొనసాగించారు. ఇదే నెలలో ఇప్పటి వరకు ఎఫ్‌పీఐలు దేశీయ డెట్ మార్కెట్లో రూ.4,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. -
ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్: 10,000 ఉద్యోగాలు ప్రకటించిన ఐటీ సంస్థ
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 10 శాతం పుంజుకుని రూ. 3,833 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 3,487 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 8 శాతం వృద్ధితో రూ. 26,672 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 24,686 కోట్ల టర్నోవర్ నమోదైంది. వాటాదారులకు షేరుకి రూ. 12 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. కొత్త కాంట్రాక్టులు 67 శాతం జంప్‌చేసి కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 4 బిలియన్ డాలర్లను తాకినట్లు వెల్లడించారు. ఇతర విశేషాలు... ఈ ఏడాది తొలి ఆరు నెలల పనితీరు నేపథ్యంలో పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాలను 5–6 శాతానికి తగ్గించింది. తొలుత 6–8 శాతం వృద్ధి అంచనాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ చివరికి సిబ్బంది సంఖ్య 1% తగ్గి 2,21,139కు చేరింది. ఈ ఏడాది 10,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలివ్వనున్నట్లు కంపెనీ సీపీవో రామచంద్రన్ సుందరరాజన్ వెల్లడించారు. గతేడాది 27,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించినట్లు ప్రస్తావించారు. సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
షాకింగ్ న్యూస్ చెప్పిన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్
దేశంలోని రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడర్ అయిన ఇన్ఫోసిస్(Infosys) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) రెండవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను గురువారం ప్రకటించింది. రెండో త్రైమాసికంలో నికర లాభం 3.1 శాతం పెరిగి లాభం రూ.6,215 కోట్లగా నమోదైంది. ఆదాయం 6.7 శాతం పెరిగి రూ.38,994 కోట్లకు చేరింది. అలాగే లితాల అనంతరం విలేకరుల సమావేశంలో సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ మాట్లాడుతూ ఉద్యోగుల్లో అసమర్థతలను కంపెనీ మోస్తోందన్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 6.7 శాతం పెరిగి రూ.38,994 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది.ఇన్ఫోసిస్ మొత్తం ఆర్థిక సంవత్సరానికి ఆదాయ మార్గదర్శకాలను 1 నుండి 2.5 శాతానికి తగ్గించింది. ఇంతకు ముందు రెవెన్యూ గైడెన్స్ 1 నుంచి 3.5 శాతంగా ఉండేది. అంతేకాదు ఏడాది కూడా క్యాంపస్ నియామకాలనలేవని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఫ్రెషర్లు ఎదుర్కొంటున్న ఆన్‌బోర్డింగ్ ఆలస్యంపై స్పందిస్తూ ఇప్పటికే ఉన్న ఆఫర్లకు తగిన సమయంలో కట్టుబడి ఉంది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 7,500మేర తగ్గింది.త్రైమాసికం క్రితం 17.3 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు 14.6శాతానికి కి తగ్గిందిసెప్టెంబర్ త్రైమాసికంలో దాని మొత్తం సిబ్బంది సంఖ్య 7,530 తగ్గి 328,764కి చేరింది. యుఎస్‌లో కొనసాగుతున్న మాంద్యం భయాల మధ్య బలహీనమైన డీల్ పైప్‌లైన్ కారణంగా ఐటి సంస్థలు ఇప్పుడు ఫ్రెషర్లను నియమించుకోవడాన్ని తగ్గించుకోవాలని యోచిస్తున్నాయి. జీతాల పెంపు ఆలస్యం వేతనాల పెంపు ఆలస్యం చేస్తూ ఉద్యోగులను షాకిచ్చింది. నవంబర్ 1 నుండి తన వేతనాల పెంపును అమలు చేయనున్నట్లు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీలాంజన్ రాయ్ తెలిపారు. కంపెనీ ఏప్రిల్‌లో సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులకు, ఆ పైన జూలైలో పైన ఉన్నవారికి పెంపుదల ఉంటుంది. ఈ ఆలస్యానికి గల కారణాలను కంపెనీ స్పష్టం చేయలేదు. మరోవైపు Wipro, మెరిట్ జీతాల పెంపుదల డిసెంబర్ 1 కి వాయిదా వేస్తున్నట్టు ఉద్యోగులకు తెలియజేసింది. HCLTech జూనియర్ ఉద్యోగులకు త్రైమాసిక పెంపుదలని వాయిదా వేసింది . సీనియర్ మేనేజ్మెంట్ కోసం మెరిట్ పెంపుదలని దాటవేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఐటీ కంపెనీలు అంతంతే.. మళ్లీ నిరాశాజనకమే!
న్యూఢిల్లీ: దేశీ ఐటీ కంపెనీలకు సాధారణంగా రెండో త్రైమాసికం పటిష్టమైనదే అయినప్పటికీ ఈసారి మాత్రం ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండనున్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి వల్ల స్థూల ఆర్థిక పరిస్థితులపరమైన సవాళ్లు నెలకొనడంతో క్లయింట్లు తమ వ్యయాల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తుండటం... ఐటీ సంస్థలకు ప్రతికూలంగా ఉండనుంది. పరిస్థితులు మెరుగుపడతాయనేందుకు అర్థవంతమైన సంకేతాలేమీ లేకపోవడంతో క్యూ1లో కనిపించిన బలహీనత రెండో త్రైమాసికంలోనూ కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 11న టీసీఎస్‌తో మొదలుపెట్టి ఐటీ దిగ్గజాలు రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో ఈ అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అక్టోబర్ 12న ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, 18న విప్రో ఫలితాలు వెలువడనున్నాయి. ‘సాధారణంగా ఐటీ కంపెనీలకు రెండో త్రైమాసికం పటిష్టంగానే ఉంటుంది. కానీ త్రైమాసికాలవారీగా టాప్ అయిదు కంపెనీల వృద్ధి చూస్తే మైనస్ 1 శాతం (టెక్ మహీంద్రా), ప్లస్ 1.9 శాతం (హెచ్‌సీఎల్ టెక్) మధ్య ఉండొచ్చు‘ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఒక నోట్లో తెలిపింది. పెద్ద ఐటీ కంపెనీలు ఒక మోస్తరుగానే ఉన్నా.. మధ్య స్థాయి సంస్థలు మాత్రం మెరుగ్గానే రాణించనున్నాయి. తగ్గనున్న వృద్ధి వేగం .. ఐటీ సేవల రంగం జులై–సెప్టెంబర్ క్వార్టర్లో త్రైమాసికాల వారీగా సగటున 1.5 శాతం, వార్షికంగా 5.7 శాతం వృద్ధి రేటు నమోదు చేయొచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది. దశాబ్దకాలంలో నమోదైన అత్యంత తక్కువ వృద్ధి రేట్లలో ఈ క్వార్టర్ ఒకటి కాగలదని పేర్కొంది. అధిక ద్రవ్యోల్బణం, వినియోగదారులు ఖర్చు పెట్టడం తగ్గించుకుంటూ ఉండటం వంటి పరిణామాలతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, బీమా, రిటైల్, హై–టెక్, కమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో మందగమనం కొనసాగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని వివరించింది. వ్యయాల తగ్గింపు, కన్సాలిడేషన్‌కు సంబంధించిన భారీ డీల్స్‌తో ద్వితీయార్ధంలో ప్రథమ శ్రేణి కంపెనీల వ్యాపారం సాధారణ స్థాయికి తిరిగి రాగలదని, 2025 ఆర్థిక సంవత్సరంలో మెరుగుపడటానికి బాటలు వేయగలవని షేర్‌ఖాన్ వివరించింది. -
బయోకాన్ లాభం డౌన్
న్యూఢిల్లీ:హెల్త్‌కేర్ రంగ దిగ్గజం బయోకాన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–2) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 11 శాతం క్షీణించి రూ. 168 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 188 కోట్లు ఆర్జించింది. వ్యయాలు పెరగడం ప్రభావం చూపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,840 కోట్ల నుంచి రూ. 2,320 కోట్లకు ఎగసింది. బయోసిమిలర్స్, రీసెర్చ్ సర్వీసులు, జనరిక్స్ బిజినెస్ ఇందుకు సహకరించాయి. అయితే మొత్తం వ్యయాలు 30 శాతం పెరిగి రూ. 2,110 కోట్లను తాకాయి. మార్పిడిరహిత డిబెంచర్ల జారీ ద్వారా 25 కోట్ల డాలర్లు(సుమారు రూ. 2,025 కోట్లు), కమర్షియల్ పేపర్(బాండ్లు) ద్వారా మరో 27.5 కోట్ల డాలర్లు సమీకరించేందుకు బోర్డు అనుమతించినట్లు బయోకాన్ తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో బయోకాన్ షేరు ఎన్ఎస్ఈలో 0.7 శాతం నీరసించి రూ. 284 వద్ద ముగిసింది. చదవండి: భారత్‌లో ట్విటర్ చాలా స్లో, మరీ దారుణం: ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్స్! -
ఎన్ఎండీసీ లాభం డౌన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మైనింగ్ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 62 శాతం తగ్గి రూ.886 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్ రూ.6,882 కోట్ల నుంచి రూ.3,755 కోట్లకు పడిపోయింది. వ్యయాలు రూ.3,743 కోట్ల నుంచి రూ.2,570 కోట్లకు వచ్చి చేరాయి. క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో ఎన్ఎండీసీ షేరు ధర సోమవారం 0.26 శాతం పడిపోయి రూ.113.35 వద్ద స్థిరపడింది. చదవండి: ఆ బ్యాంకులపై కొరడా ఝులిపించిన ఆర్బీఐ! -
భారత్ ఫోర్జ్ లాభంలో క్షీణత
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల దిగ్గజం భారత్ ఫోర్జ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–2) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం జులై–సెప్టెంబర్(క్యూ2)లో 48 శాతం క్షీణించి రూ.141 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 270 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 2,386 కోట్ల నుంచి రూ. 3,076 కోట్లకు ఎగసింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 1.50 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. అల్యూమినియం ఫోర్జింగ్ బిజినెస్ విక్రయాలు మందగించడంతో యూరోపియన్ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడినట్లు భారత్ ఫోర్జ్ పేర్కొంది. ఉత్తర అమెరికాలో ఏర్పాటు చేసిన ఈ కొత్త ప్లాంటులో ఉత్పత్తిని దశలవారీగా హెచ్చిస్తున్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం నిర్వహణా లాభస్థాయికి దిగువనే వినియోగమున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో అల్యూమినియం ఫోర్జింగ్ బిజినెస్ టర్న్అరౌండ్ సాధించే వీలున్నట్లు కంపెనీ చైర్మన్, ఎండీ బీఎన్ కళ్యాణి అభిప్రాయపడ్డారు. ఫలితాల నేపథ్యంలో భారత్ ఫోర్జ్ షేరు ఎన్ఎస్ఈలో 4 శాతం క్షీణించి రూ. 853 వద్ద ముగిసింది. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
ఆదాయం పుంజుకున్నా.. స్పైస్‌జెట్ నష్టాలు పెరిగాయ్!
న్యూఢిల్లీ:ప్రయివేట్ రంగ విమానయాన కంపెనీ స్పైస్‌జెట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు వెల్లడించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో దాదాపు రూ. 838 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఫారెక్స్ నష్టాలను మినహాయిస్తే రూ. 578 కోట్ల నష్టం నమోదైంది. ఇంధన ధరల పెరుగుదల, రూపాయి పతనం ప్రభావం చూపాయి. గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 562 కోట్ల నష్టాలు ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,539 కోట్ల నుంచి 2,105 కోట్లకు పుంజుకుంది. అయితే నిర్వహణ వ్యయాలు సైతం రూ. 2,100 కోట్ల నుంచి రూ. 2,943 కోట్లకు ఎగశాయి. ఇదే కాలంలో కార్గో అనుబంధ సంస్థ స్పైస్‌ఎక్స్‌ప్రెస్ రూ. 206 కోట్ల ఆదాయం, రూ. 21 కోట్ల నికర లాభం ఆర్జించడం గమనార్హం! ఫలితాల నేపథ్యంలో స్పైస్‌జెట్ షేరు ఎన్ఎస్ఈలో 0.5 శాతం నీరసించి రూ. 39 వద్ద ముగిసింది. చదవండి: కేంద్రం భారీ షాక్: పది లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఏంటంటే.. -
ఎక్సైడ్ ఆదాయంలో వృద్ధి
కోల్‌కతా: బ్యాటరీ తయారీ సంస్థ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ సెప్టెంబర్ క్వార్టర్లో పనితీరు పరంగా ఫర్వాలేదనిపించింది. రూ.3,719 కోట్ల ఆదాయంపై రూ.246 కోట్ల లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే లాభం 5 శాతం, ఆదాయం 13 శాతం చొప్పున పెరిగాయి. ఎబిట్డా పెద్దగా మార్పులేకుండా రూ.412 కోట్లుగా ఉంది. ఫలితాలపై అధిక తయారీ వ్యయాల ప్రభావం కొనసాగినట్టు కంపెనీ తెలిపింది. అయినప్పటికీ ఎబిట్డా మార్జిన్‌ను 9.9 శాతం నుంచి 11.1 శాతానికి పెంచుకుంది. ప్రస్తుత త్రైమాసికం నుంచి లాభదాయకత మెరుగుపడుతుందని, తయారీ వ్యయాలపై అధిక ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుతున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో సుబీర్ చక్రవర్తి తెలిపారు. బెంగళూరులో లిథియం అయాన్ సెల్ తయారీ కేంద్రం నిర్మాణానికి తన అనుబంధ సంస్థ ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్ భూమి పూజ చేసినట్టు చెప్పారు. -
అశోక్ లేలాండ్ లాభం రూ.199 కోట్లు
న్యూఢిల్లీ: అశోక్ లేలాండ్ సెప్టెంబర్ క్వార్టర్‌కు మెరుగైన ఫలితాలను ప్రకటించింది. రూ.199 కోట్ల లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.83 కోట్ల నష్టం రావడం గమనార్హం. ఆదాయం దాదాపు రెట్టింపై రూ.8,266 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.4,458 కోట్లుగా ఉంది. దేశీ మార్కెట్లో మధ్య, భారీ స్థాయి వాణిజ్య విక్రయాలు 25,475 యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలం వీటి విక్రయాలు 11,988 యూనిట్లుగా ఉన్నాయి. మార్కెట్ వాటా 9.6 శాతంగా ఉంది. స్వల్ప స్థాయి వాణిజ్య వాహనాల విక్రయాలు 28 శాతం పెరిగి 17,040 యూనిట్లుగా ఉన్నా యి. ఎగుమతులు 25 శాతం పెరిగి 2,780 యూనిట్లుగా నమోదయ్యాయి. ‘‘అంతర్జాతీయంగా మాంద్యం ధోరణలు ఉన్నా, దేశీ వాణిజ్య వాహన మార్కెట్లో వృద్ధి చక్కగా ఉంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మంచి విక్రయాలు పరిశ్రమ వ్యాప్తంగా నమోదయ్యాయి’’అని అశోక్‌లేలాండ్ చైర్మన్ ధీరజ్ హిందుజా తెలిపారు. మెరుగైన ఉత్పత్తులు, ప్రత్యామ్నాయ ఇంధన ఆధారిత భవిష్యత్తు ఉత్పత్తుల తయారీకి అవసరమైన సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటామని ప్రకటించారు. -
టాటా మోటార్స్ నష్టాలు, షేర్లు ఢమాల్!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో ఆటో మేజర్ స్ట్రీట్ నిరాశపరచడంతో గురువారం ట్రేడింగ్‌లో టాటా మోటార్స్ షేర్ 5 శాతం కుప్పకూలింది. జాగ్వార్ ల్యాండ్ ఓవర్ (జేఎల్ఆర్) అమ్మకాలు ఆశ్చర్యపరిచినా, దేశీయ లాభాలు ఈ అంచనాలను అందుకోలేక మార్కెట్‌ను నిరాశపరిచాయి. ఫలితాల నేపథ్యంలో బుధవారం స్వల్ప నష్టాలతో రూ. 433 వద్ద ముగిసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై-సెప్టెంబర్(క్యూ2)లో నికర నష్టాలు భారీగా తగ్గి రూ.945 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో ఏకంగా రూ. 4,442 కోట్ల నష్టం వచ్చింది. ఆదాయం సైతం రూ. 62,246 కోట్ల నుంచి రూ. 80,650 కోట్లకు జంప్‌చేసింది. ఇక స్టాండెలోన్ నికర నష్టాలు సైతం రూ. 659 కోట్ల నుంచి తగ్గి రూ. 293 కోట్లకు పరిమితమయ్యాయి. మొత్తం ఆదాయం రూ. 11,197 కోట్ల నుంచి రూ. 15,142 కోట్లకు ఎగసింది. జేఎల్ఆర్ జూమ్ ప్రస్తుత సమీక్షా కాలంలో బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) ఆదాయం 36శాతం జంప్‌చేసి 5.3 బిలియన్ పౌండ్లను తాకింది. దేశీయంగా టాటా మోటార్స్ వాణిజ్య వాహన అమ్మకాలు 19శాతం వృద్ధితో 93,651 యూనిట్లను తాకగా.. ఎగుమతులు 22శాతం పుంజుకుని 6,771 వాహనాలకు చేరినట్లు కంపెనీ ఈడీ గిరీష్ వాగ్ పేర్కొన్నారు. ఈ కాలంలో 69శాతం అధికంగా 1,42,755 ప్యాసింజర్ వాహనాలు విక్ర యించింది. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో 326శాతం వృద్ధితో 11,522 యూనిట్లు అమ్ముడయ్యాయి. -
దివీస్ ల్యాబొరేటరీస్‌కు షాక్.. ఈ సారి తగ్గింది!
ఔషధ కంపెనీ దివీస్ ల్యాబొరేటరీస్ సెప్టెంబర్ క్వార్టర్లో నికరలాభం 18.6 శాతం తగ్గి రూ.493 కోట్లు దక్కించుకుంది. ఈపీఎస్ 18.56 శాతం తగ్గి రూ.18.6 నమోదైంది. టర్నోవర్ 3.6 శాతం పెరిగి రూ.1,934 కోట్లకు చేరుకుంది. ఏప్రిల్–సెప్టెంబర్‌లో టర్నోవర్ 7 శాతం పెరిగి రూ.4,277 కోట్లు, నికరలాభం 2.75 శాతం అధికమై రూ.1,195 కోట్లు దక్కించుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే దివీస్ షేరు ధర బీఎస్ఈలో సోమవారం 8.85 శాతం తగ్గి రూ.3,413.70 వద్ద స్థిరపడింది. చదవండి: Dropout Chaiwala: విదేశాలలో చదువు మానేసి.. కాఫీలు, టీలు అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్నాడు! -
టైర్ల దిగ్గజం సియట్ ఆసక్తికర ఫలితాలు, లాభాలు ఢమాల్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో టైర్ల తయారీ దిగ్గజం సియట్ లిమిటెడ్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై-సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 81 శాతం క్షీణించి కేవలం రూ.7.83 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021-22) ఇదే కాలంలో రూ. 42 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 2,452 కోట్ల నుంచి రూ. 2,894 కోట్లకు ఎగసింది. ఇన్పుట్ ఖర్చులు తమ లాభాలను ప్రభావితం చేశాయని కంపెనీ ప్రకటించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 2,402 కోట్ల నుంచి రూ. 2,864 కోట్లకు పెరిగాయి. రానున్న రెండేళ్లలో అంబర్నాథ్ ప్లాంటులో రేడియల్ టైర్ల తయారీ సామర్థ్యాన్ని రోజుకి 55 టన్నులకు పెంచేందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు అదనంగా రూ. 396 కోట్లు వెచ్చించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. పెట్టుబడులను అంతర్గత వనరులు, రుణాల ద్వారా సమకూర్చుకోనున్నట్లు తెలియజేసింది. -
రికార్డ్ లాభాలను సాధించిన ఉజ్జీవన్ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202223) రెండో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ సంస్థ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. జులై-సెప్టెంబర్(క్యూ2)లో రూ. 294 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది ఒక క్వార్టర్‌కు బ్యాంక్ చరిత్రలోనే అత్యధిక లాభంకాగా.. గతేడాది(2021-22) ఇదే కాలంలో రూ. 274 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం 63 శాతం జంప్‌చేసి రూ. 1,140 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం సైతం 54 శాతం ఎగసి రూ. 993 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 8.1 శాతం నుంచి 9.8 శాతానికి మెరుగుపడ్డాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 11.8 శాతం నుంచి 5.06 శాతానికి, నికర ఎన్పీఏలు 3.29 శాతం నుంచి 0.04 శాతానికి దిగివచ్చాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో క్విప్ ద్వారా రూ. 475 కోట్లు సమీకరించినట్లు బ్యాంక్ వెల్లడించింది. -
ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లాభం ఐదింతలు
న్యూఢిల్లీ: పండుగల సీజన్ కావడంతో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ సెప్టెంబర్ క్వార్టర్లో మెరుగైన పనితీరు చూపించింది. కన్సాలిడేటెడ్ లాభం ఐదింతలు పెరిగి రూ.29 కోట్లకు చేరింది. ఆదాయం సైతం 50 శాతం పెరిగి రూ.3,075 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.5 కోట్లు, ఆదాయం రూ.2,054 కోట్ల చొప్పున ఉన్నాయి. ‘‘కంపెనీ చరిత్రలో ఒక త్రైమాసికంలో అత్యధిక ఆదాయాన్ని నమోదు చేశాం. ఈ కామర్స్ విక్రయాల్లో మెరుగైన పనితీరు వృద్ధికి సాయపడింది. మార్కెటింగ్‌పైనా పెట్టుబడులు పెరిగాయి. బ్రాండ్ల బలోపేతం, వినియోగదారులను చేరుకోవడంపై దృష్టి సారించాం. పెద్ద ఎత్తున స్టోర్ల నెట్వర్క్ విస్తరణ చేపట్టాం. పాంటలూన్ బ్రాండ్ కింద 21 స్టోర్లు, బ్రాండెడ్ వ్యాపారంలో 85 స్టోర్లు ప్రారంభించాం’’ అని ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ తెలిపింది. విభాగాల వారీగా.. ♦ మధుర ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టయిల్ విభాగం ఆదాయం 45 శాతం పెరిగి రూ.2,109 కోట్లుగా ఉంది. ♦ ప్యాంటలూన్స్ ఆదాయం 65 శాతం పెరిగి రూ.1,094 కోట్లకు చేరింది. ♦ఈ కామర్స్ విక్రయాలు 20 శాతం పెరిగాయి. ఎబిట్టా మార్జిన్లు కరోనా ముందున్న స్థాయిని అధిగమించాయి. ♦ కంపెనీ కన్సాలిడేటెడ్ రుణ భారం రూ.243 కోట్లకు తగ్గింది. -
అంచనాలను అందుకున్న సిప్లా
న్యూఢిల్లీ: ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా లిమిటెడ్ సెప్టెంబర్ త్రైమాసికానికి (202–23లో క్యూ2) బలమైన పనితీరు ప్రదర్శించింది. నికర లాభంలో 12 శాతం వృద్ధి నమోదైంది. రూ.797 కోట్ల లాభాన్ని కంపెనీ ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి వచ్చిన లాభం రూ.709 కోట్లుగా ఉంది. దేశీయ, యూఎస్ మార్కెట్లలో బలమైన అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలోని ఆదాయంతో పోలిస్తే రూ.5,520 కోట్ల నుంచి రూ.5,829 కోట్లకుపెరిగింది. భారత్‌లో ఉన్న అమెరికా వ్యాపారాన్ని బదలాయించాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. ప్రస్తుత వాతావరణం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. క్యూ2 ఫలితాలపై సిప్లా ఎండీ, గ్లోబల్ సీఈవో ఉమంగ్ వోహ్రా మాట్లాడారు. యూఎస్ మార్కెట్లో వివిధ పోర్ట్‌ఫోలియోల పరంగా అమలు చేసిన విధానం, దేశీ మార్కెట్లో బలమైన పనితీరు ఫలితాల్లో కనిపించినట్టు చెప్పారు. దేశీ అమ్మకాల ఆదాయం 6 శాతం పెరిగి రూ.2,563 కోట్లుగా ఉంటే, నార్త్ అమెరికా వ్యాపారం 35 శాతం పెరిగి రూ.1,432 కోట్లకు చేరింది. కలిసొచ్చిన లెనలిడోమైడ్ ముఖ్యంగా లెనలిడోమైడ్ డ్రగ్‌ను విడుదల చేయడం అమ్మకాల వృద్ధికి తోడ్పడినట్టు ఉమంగ్ వోహ్రా తెలిపారు. వెలుపలి మార్కెట్లో సవాళ్లు ఉన్నప్పటికీ లాభాలను నమోదు చేసినట్టు వివరించారు. నిర్వహణ లాభం 22.3 శాతంగా ఉందని, పూర్తి ఆర్థిక సంవత్సరానికి తమ అంచనాలైన 21–22 శాతం పరిధిలోనే ఇది ఉన్నట్టు వివరించారు. వ్యయాలు తగ్గించుకోవడం, ధరలు పెంచడం తదితర చర్యలతో కమోడిటీ ధరల పెరుగుదల ప్రభావాన్ని కంపెనీ అధిగమించింది. -
క్యూ2లో అదానీ గ్యాస్‌కు షాక్!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ కంపెనీ అదానీ టోటల్ గ్యాస్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై-సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 139 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021-22) ఇదే కాలంలో రూ. 159 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 73 శాతం జంప్‌చేసి రూ. 1,190 కోట్లను తాకింది. సీఎన్జీకి డిమాండ్ పుంజుకోవడంతో గ్యాస్ విక్రయాలు 9 శాతం వృద్ధితో 19.1 కోట్ల ఘనపు మీటర్లను తాకాయి. ఈ కాలంలో నేచురల్ గ్యాస్ వ్యయాలు రెట్టింపై రూ. 860 కోట్లకు చేరినట్లు కంపెనీ సీఈవో సురేష్ పి.మంగ్లానీ పేర్కొన్నారు. సహజవాయువు సీఎన్జీగా మార్పిడి ద్వారా ఆటో మొబైల్స్‌కు, పైప్డ్ నేచురల్ గ్యాస్‌గా మార్చి వంటలు, పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేసే సంగతి తెలిసిందే. సెప్టెంబర్ చివరికల్లా 33 కొత్త సీఎన్జీ స్టేషన్లను జత చేసుకుంది. వీటి సంఖ్య 367కు చేరింది. ఇదే విధంగా 61,000 గృహాలకు కొత్త కనెక్షన్ల ద్వారా పీఎన్జీ నెట్‌వర్క్‌ను 6.25 లక్షలకు పెంచుకుంది. కొత్తగా 412 బిజినెస్ కస్టమర్లను కలుపుకుని వాణిజ్య కనెక్షన్ల సంఖ్యను 6,088కు చేర్చుకుంది. ఫలితాల నేపథ్యంలో అదానీ టోటల్ షేరు ఎన్ఎస్ఈలో స్వల్ప లాభంతో రూ. 3,647 వద్ద ముగిసింది. -
అదానీ ట్రాన్స్మిషన్: 32 శాతం లాభాలు ఢమాల్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో విద్యుత్ రంగ దిగ్గజం అదానీ ట్రాన్స్మిషన్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 32 శాతం క్షీణించి రూ. 194 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021-22) ఇదే కాలంలో దాదాపు రూ. 289 కోట్లు ఆర్జించింది. అయితే రూ. 138 కోట్ల ఫారెక్స్ నష్టాలు(విదేశీ రుణాలపై ఎంటూఎం సర్దుబాటు) ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. గత క్యూ2లో ఇవి రూ. 6 కోట్ల లాభంగా నమోదైనందున ఫలితాలు పోల్చిచూడతగదని వివరించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 2,675 కోట్ల నుంచి రూ. 3,377 కోట్లకు బలపడింది. ఈ కాలంలో 223.3 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను విక్రయించింది. గత క్యూ2లో 197.5 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే విక్రయించింది. మార్పిడి రహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా రూ. 1,500 కోట్లు సమీకరించేందుకు బోర్డు అనుమతించింది. నేటి(2) నుంచి ట్రాన్స్మిషన్ బిజినెస్‌కు సీఈవోగా విమల్ దయాల్, పంపిణీ విభాగ సీఈవోగా కందర్ప్ పటేల్‌ను బోర్డు ఎంపిక చేసింది. అనిల్ సర్దానా కంపెనీ ఎండీగా బాధ్యతలు కొనసాగించనున్నారు. -
షాక్ ఇచ్చిన వోల్టాస్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో ఆతిథ్య రంగ కంపెనీ మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 30 శాతం క్షీణించి రూ. 41.4 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021-22) ఇదే కాలంలో దాదాపు రూ. 60 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 546 కోట్ల నుంచి రూ. 598 కోట్లకు బలపడింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 515 కోట్ల నుంచి రూ. 575 కోట్లకు పెరిగాయి. కాగా.. ఈ కాలంలో స్టాండెలోన్ ప్రాతిపదికన కొత్తగా 4,397 మంది సభ్యులను జత చేసుకుంది. సభ్యత్వ అమ్మకాల విలువ 93 శాతం వృద్ధితో రూ. 194 కోట్లను తాకింది. -
క్యూ2లో కర్ణాటక బ్యాంక్ రికార్డు లాభాలు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ కర్ణాటక బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై-సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 228 శాతం దూసుకెళ్లి రూ. 411 కోట్లను అధిగమించింది. ఇది ఒక క్వార్టర్లో బ్యాంక్ చరిత్రలోనే అత్యధికంకాగా.. గతేడాది(2021-22) ఇదే కాలంలో కేవలం రూ. 125 కోట్లు ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం సైతం 26 శాతం ఎగసి రూ. 803 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.03 శాతం నుంచి 3.36 శాతానికి, నికర ఎన్పీఏలు 2.16 శాతం నుంచి 1.72 శాతానికి దిగివచ్చాయి. ఫలితాల నేపథ్యంలో కర్ణాటక బ్యాంక్ షేరు బీఎస్ఈలో 20 శాతం దూసుకెళ్లి రూ. 113 వద్ద ముగిసింది. -
పంజాబ్ నేషనల్ బ్యాంక్.. ఎన్పీఏల భారం!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) స్టాండలోన్ నికర లాభం సెప్టెంబర్‌తో ముగిసిన 3 నెలల్లో 63% తగ్గిరూ.411 కోట్లకు చేరింది. ఆదాయం రూ.23,001 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.1,105 కోట్లు, ఆదాయం రూ.21,262 కోట్ల చొప్పున ఉన్నాయి. మొండి బకాయిల భారం కొంత తగ్గినప్పటికీ.. వీటి కోసం అధిక కేటాయింపులు చేయాల్సి రావడం లాభాలను ప్రభావితం చేసింది. వడ్డీ ఆదాయం రూ.17,980 కోట్ల నుంచి రూ.20,154 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 30 శాతం పెరిగి రూ.8,271 కోట్లుగా ఉంది. రుణ ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. స్థూల ఎన్పీఏలు 13.36 శాతం నుంచి 10.48 శాతానికి (రూ.87,034 కోట్లు) తగ్గాయి. నికర ఎన్పీఏలు 5.49 శాతం నుంచి 3.80 శాతానికి పరిమితమయ్యాయి. చదవండి: ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే! -
కారణం తెలియదు, ఫర్వాలేదనిపించిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్!
ముంబై: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సెప్టెంబర్ త్రైమాసికానికి ఫలితాల పరంగా ఫర్వాలేదనిపించింది. నికర లాభం 23 శాతం వృద్ధితో రూ.305 కోట్లుగా నమోదైంది. కానీ, కీలకమైన వడ్డీ ఆదా యం స్వల్పంగా తగ్గి (0.80 శాతం) రూ.1,163 కోట్లకు పరిమితమైంది. ఇందుకు కారణం ఏంటన్నది సంస్థ వెల్లడించలేదు. వ్యక్తిగత విభాగంలో రుణాల మంజూరు స్వల్పంగా తగ్గి రూ.14,300 కోట్లుగా ఉంది. మొత్తం రుణాల వితరణ 4 శాతం పెరిగి రూ.16,110 కోట్లుగా ఉంది. సంస్థ నిర్వహణలోని మొత్తం రుణాల్లో వ్యక్తులకు ఇచ్చినవి రూ.2,16,771 కోట్లుగా ఉన్నాయి. నికర వడ్డీ మార్జిన్ ఏడాది క్రితం ఇదే కాలంలో ఉన్న 2 శాతం నుంచి 1.8 శాతానికి పరిమితమైంది. కేటాయింపులు రూ.6,552 కోట్లకు పెరిగాయి. చదవండి: ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే! -
సన్ ఫార్మా లాభం అప్
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 11 శాతం ఎగసి రూ. 2,262 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 2,047 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 9,626 కోట్ల నుంచి రూ. 10,952 కోట్లకు బలపడింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 7,562 కోట్ల నుంచి రూ. 8,625 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో దేశీ ఫార్ములేషన్ల అమ్మకాలు 8 శాతంపైగా పుంజుకుని రూ. 3,460 కోట్లను తాకాయి. యూఎస్ విక్రయాలు 14 శాతం ఎగసి 41.2 కోట్ల డాలర్ల(రూ. 3,400 కోట్లు)కు చేరాయి. గ్లోబల్ స్పెషాలిటీ అమ్మకాలు మరింత అధికంగా 27 శాతం జంప్‌చేసి 20 కోట్ల డాలర్లను అందుకున్నాయి. వర్ధమాన మార్కెట్ల నుంచి ఫార్ములేషన్ల విక్రయాలు 7 శాతం బలపడి 25.9 కోట్ల డాలర్లను(రూ. 2,140 కోట్లు) తాకాయి. అయితే ఇతర దేశాల నుంచి ఆదాయం 4 శాతం క్షీణించి 18.1 కోట్ల డాలర్లకు పరిమితమైనట్లు సన్ ఫార్మా వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో సన్ ఫార్మా షేరు ఎన్ఎస్ఈలో 1.6 శాతం లాభంతో రూ. 1,033 వద్ద ముగిసింది. చదవండి: ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే! -
అదానీ పోర్ట్స్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: నౌకాశ్రయాలు, టెర్మినళ్ల దిగ్గజం అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై-సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 65 శాతం జంప్‌చేసి రూ. 1,738 కోట్లకు చేరింది. గతేడాది(2021-22) ఇదే కాలంలో రూ. 1,050 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 3,923 కోట్ల నుంచి రూ. 5,211 కోట్లకు ఎగసింది. ఈ ఏడాది తొలి అర్ధభాగం (ఏప్రిల్-సెప్టెంబర్) లో కార్గో పరిమాణం, ఆదాయం, నిర్వహణా లాభాల్లో సరికొత్త రికార్డు సాధించినట్లు కంపెనీ సీఈవో కరణ్ అదానీ పేర్కొన్నారు. ఈ బాటలో అక్టోబర్‌ను సైతం పరిగణిస్తే కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 7 నెలల్లో 200 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ) కార్గోను సాధించినట్లు తెలియజేశారు. వెరసి పూర్తి ఏడాదికి నిర్దేశించుకున్న 35-36 కోట్ల మెట్రిక్ టన్నుల కార్గో పరిమాణం, రూ. 12,200-12,600 కోట్ల నిర్వహణా లాభ లక్ష్యాన్ని అందుకునే బాటలో సాగుతున్నట్లు వెల్లడించారు. -
ఉసూరుమనిపించిన వర్ల్‌పూల్: నికర లాభాలు ఢమాల్!
న్యూఢిల్లీ: కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌లో ప్రముఖ కంపెనీ వర్ల్‌పూల్ ఇండియా సెప్టెంబర్ త్రైమాసికంలో పనితీరు పరంగా ఇన్వెస్టర్లను నిరుత్సాహానికి గురి చేసింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఏకంగా 88 శాతం పడిపోయి రూ.49 కోట్లకు పరిమితమైంది. ఒకవైపు కమోడిటీ ధరల పెరుగుదల ప్రభావం ఉండగా, మరోవైపు క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఏకీకృత లాభం చూపించడం ఈ వ్యత్యాసానికి కారణమని కంపెనీ ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.413 కోట్లుగా ఉంది. కార్యకలాపాల ఆదాయం రూ.1,611 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.1,607 కోట్లతో పోలిస్తే వృద్ధి నమోదు కాలేదు. కంపెనీ వ్యయాలు 3 శాతం పెరిగి రూ.1,567 కోట్లకు చేరాయి. ‘‘నికర లాభం తగ్గడానికి ప్రధానంగా కమోడిటీల (తయారీలో వినియోగించే) ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం కారణం. అయితే తయారీ పరంగా కొన్ని చర్యలు తీసుకోవడం, ధరలు పెంచడంతో ఈ ప్రభావాన్ని కొంత వరకు అధిగమించాం. ఎలికా ఇండియా కొనుగోలు అనంతరం కంపెనీ సబ్సిడరీగా మారింది. భారత అకౌంటింగ్ ప్రమాణాల మేరకు ఎలికా ఇండియాలో మా వాటాల పారదర్శక విలువ ఆధారంగా, రూ.324 కోట్ల లాభాన్ని గతేడాది సెప్టెంబర్ క్వార్టర్ కన్సాలిడేటెడ్ ఫలితాల్లో గుర్తించాం. ఇది మినహాయించి చూస్తే నికర లాభంలో క్షీణత 45 శాతమే ఉంటుంది’’ అని కంపెనీ తెలిపింది. 88 శాతం పడిపోయిన నికర లాభం -
ఇది అసలు ఊహించలేదు.. షాక్‌లో టాటా స్టీల్!
న్యూఢిల్లీ: భారీగా పెరిగిన వ్యయాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలు దేశీ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ షాకిచ్చాయి. ఈ సారి నికర లాభం (కన్సాలిడేటెడ్) ఏకంగా 90 శాతం క్షీణించి, రూ. 1,297 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఇది రూ. 12,548 కోట్లు. తాజాగా జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ. 60,658 కోట్ల నుంచి రూ. 60,207 కోట్లకు తగ్గింది. వ్యయాలు రూ. 47,240 కోట్ల నుంచి రూ. 57,684 కోట్లకు పెరిగాయి. కీలక ఎకానమీల్లో మందగమన భయాలు, సీజనల్ అంశాలతో పాటు భౌగోళికరాజకీయ అనిశ్చితి తదితర అంశాలు వ్యాపార నిర్వహణలో ఒడిదుడుకులకు కారణమయ్యా యని టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ చెప్పారు. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కంపెనీ దేశీ అమ్మకాలు అత్యుత్తమంగా నమోదయ్యాయని పేర్కొన్నారు. అధిక ధరలకు కొనుగోలు చేసిన ముడి సరుకుల నిల్వలను ఉపయోగించుకోవాల్సి రావడం వల్ల మార్జిన్లు తగ్గాయని టాటా స్టీల్ ఈడీ కౌశిక్ ఛటర్జీ చెప్పారు. ప్రస్తుతం భారత మార్కెట్ కోలుకుంటూ ఉండటం, ముడి సరుకుల రేట్లు సానుకూలంగా మారుతుండటం వంటి అంశాలతో మార్జిన్లు మళ్లీ మెరుగుపడగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: సామాన్యులకు శుభవార్త.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు -
క్యూ2లో మదర్సన్ సుమీ వైరింగ్ లాభాలు ఓకే
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో ఆటో విడిభాగాల కంపెనీ మదర్సన్ సుమీ వైరింగ్ ఇండియా ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై-సెప్టెంబర్ (క్యూ2)లో నికర లాభం స్వల్పంగా 2 శాతం పుంజుకుని రూ. 116 కోట్లను అధిగమించింది. గతేడాది(2021-22) ఇదే కాలంలో రూ. 114 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,400 కోట్ల నుంచి రూ. 1,835 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 1,230 కోట్ల నుంచి రూ. 1,690 కోట్లకు పెరిగాయి. దేశీ ఆటోమోటివ్ పరిశ్రమ తిరిగి జోరందుకున్నట్లు కంపెనీ చైర్మన్ వివేక్ చాంద్ సెహగల్ పేర్కొన్నారు. దీంతో తమ కస్టమర్లు ఉత్పత్తిని పెంచుతున్నట్లు తెలియజేశారు. ఇది వ్యయాలను (వన్‌టైమ్) పెంచినప్పటికీ రానున్న త్రైమాసికాలలో సర్దుబాటు కాగలవని తెలిపారు.అయితే ఈ ఫలితాలు నేపథ్యంలో సోమవారం 6 శాతం నష్టాలనుంచి కోలుకుని మంగళవారం 2 శాతం లాభాలతో కొనసాగుతోంది. -
ఎయిర్టెల్ లాభం జూమ్
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 89% జంప్‌చేసి రూ. 2,145 కోట్లను తాకింది. అనూహ్య రాబడిని మినహాయిస్తే రూ. 2,052 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) క్యూ2లో కేవలం రూ.11,340 కోట్లు ఆర్జించింది. 4జీ లాభదాయకత, వినియోగదారుపై సగటు ఆదాయం (ఏఆర్పీయూ), డేటా వినియోగం పుంజుకోవడం అధిక లాభాలకు దోహదం చేసింది. మొత్తం ఆదాయం సైతం 22% ఎగసి రూ. 34,527 కోట్లకు చేరింది. ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల కస్టమర్లను అధిగమించడంతోపాటు.. నిలకడైన పటిష్ట పనితీరును చూపగలిగినట్లు కంపెనీ పేర్కొంది. పరిశ్రమలోనే అత్యుత్తమంగా రూ. 190 ఏఆర్పీయూను సాధించింది. గత క్యూ2లో ఇది రూ. 153 మాత్రమే. 20 జీబీ వినియోగం: 5జీ ప్రారంభించనున్న నేపథ్యంలో మరింత ఉత్తమ సేవలు అందించగలమని ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విఠల్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే చౌక ధరల కారణంగా తక్కువ ఆర్వోసీఈని నమోదు చేస్తున్నట్లు తెలియజేశారు. కంపెనీ 8 పట్టణాలలో 5జీ సేవలకు శ్రీకారం చుట్టింది. కాగా ప్రస్తుత సమీక్షా కాలంలో 1.78 కోట్లమంది 4జీ కస్టమర్లు లభించగా.. ఒక్కొక్కరి నెలవారీ సగటు డేటా వినియోగం 20.3 జీబీకి చేరింది. ఫలితాల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు 2 శాతం లాభపడి రూ. 832 వద్ద ముగిసింది. -
అదరగొట్టిన భారతి ఎయిర్టెల్
సాక్షి, ముంబై: టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ ఫలితాల్లో అదరగొట్టింది. క్యూ2 ఫలితాల్లో ఏకంగా 89 శాతం రెట్టింపు లాభాలను సాధించింది. 30 సెప్టెంబర్ 2022తో ముగిసిన త్రైమాసికంలో 2,145 కోట్ల రూపాయల ఏకీకృత నికర లాభాన్ని సాధించింది. (Zomato మరో వివాదంలో జొమాటో: దుమ్మెత్తిపోస్తున్న యూజర్లు) గత ఏడాది ఇదే సమయానికి కంపెనీ లాభం రూ.1,134కోట్లు మాత్రమే. ఆదాయం వార్షిక ప్రాతిపదికన 21.9 శాతం పెరిగి రూ.34,527 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో రూ.28,326 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్టు టెల్కో రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం సంవత్సరానికి 21.9శాతం పెరిగి రూ.34,527 కోట్లకు చేరుకుంది, పోర్ట్‌ఫోలియో అంతటా బలమైన, స్థిరమైన పనితీరు కనబర్చినట్టు కంపెనీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ల కస్టమర్లను దాటినట్టు కంపెనీ ఫలితాల సందర్భంగా ప్రకటించింది. ప్రతి వినియోగదారుకు సగటు ఆదాయం (ఏఆర్పీయూ) క్యూ1తో 183 రూపాయలతో పోలిస్తే క్యూ2లో రూ. 190కి పెరిగింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన, ఎయిర్టెల్ త్రైమాసికానికి ఏకీకృత నికర లాభంలో 33.5 శాతం పెరుగుదలను నివేదించింది. కాగా ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్ , వారణాసి వంటి ఎనిమిది నగరాల్లో ఎయిర్టెల్ 5 జీ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు ఇటీవల తెలిపిన సంగతివ తెలిసిందే. -
ఫెడ్ రిజర్వ్, ఆర్బీఐ నిర్ణయాలు కీలకం
ముంబై: అమెరికా ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ, ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ అత్యవసర సమావేశపు నిర్ణయాలు ఈ వారం మార్కెట్‌ను నడిపిస్తాయని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ధోరణి, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదిలికలు ప్రభావం చూపొచ్చంటున్నారు. హిందూ నూతన సంవత్సరం ‘2079 సంవత్’ తొలివారంలో సెన్సెక్స్ 650 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు స్థిరీకరణ దిశగా సాగొచ్చు. కార్పొరేట్ల రెండో క్వార్టర్ ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌పై దృష్టి సారించడం శ్రేయస్కరం. కన్సాలిడేషన్‌లో భాగంగా దిగివచ్చిన నాణ్యమైన షేర్లను గుర్తించి ఎంపిక చేసుకోవాలి. సాంకేతికంగా నిఫ్టీకి 18,100 పాయింట్ల వద్ద నిరోధం ఎదురుకావచ్చు. దిగువ స్థాయిలో 17,400 స్థాయి వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. ఫెడ్ రిజర్వ్ సమావేశం అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశం మంగళవారం(నవంబర్ ఒకటిన) ప్రారంభం కానుంది. మరుసటి రోజు(బుధవారం) చైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్య కమిటి నిర్ణయాలను వెల్లడించనున్నారు. వరుసగా నాలుగోసారి వడ్డీరేట్లను 75 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలను విదేశీ ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. ఆర్బీఐ ఎంపీసీ అత్యవసర భేటీ రిజర్వ్ బ్యాంక్ తన తదుపరి పరపతి ద్రవ్య సమీక్ష(ఎంపీసీ) సమావేశాన్ని గురువారం (నవంబర్ 3న) అత్యవసరంగా నిర్వహించనుంది. వరుసగా మూ డు త్రైమాసికాలుగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో విఫలంకావడంతో ఆర్బీఐ మరోదఫా వడ్డీరేట్లను పెంచడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు ఈ వారంలో సుమారు 100కి పైగా కంపెనీలు తమ క్యూ2తో గణాంకాలను ప్రకటించనున్నాయి. ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, యూపీఎల్, హీరో మోటోకార్ప్, హెచ్‌పీసీఎల్, బ్రిటానియా ఇండస్ట్రీస్, సిప్లా, గెయిల్ ఇండియా, టైటాన్, పవర్ గ్రిడ్ తదితర దిగ్గజ కంపెనీలు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. స్థూల ఆర్థిక గణాంకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసిక జీడీపీ డేటాతో పాటు జూలై ద్రవ్యోల్బణ లోటు, మౌలిక రంగ గణాంకాలు బుధవారం(ఆగస్టు 31న) వెల్లడి కానున్నాయి. సెప్టెంబర్ ద్రవ్యలోటు, మౌలిక రంగ గణాంకాలు సోమవారం విడుదల కానున్నాయి. మరసటి రోజు అక్టోబర్ నెల వాహన విక్రయ గణాంకాలతో పాటు అదే నెల తయారీ రంగ డేటా కూడా విడుదల అవుతుంది. సేవారంగ డేటా గురువారం వెల్లడి కానుంది. అలాగే శుక్రవారం ఆర్బీఐ అక్టోబర్ 21 తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఇదే నెల 28వ తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. తగ్గిన ఎఫ్ఐఐల అమ్మకాల ఉధృతి దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఉధృతి తగ్గుముఖం పట్టింది. సెప్టెంబర్‌లో రూ.7,600 కోట్ల ఈక్విటీలను విక్రయించిన ఎఫ్ఐఐలు ఈ నెలలో ఇప్పటి వరకు(29 తేదీ నాటికి) రూ.1,586 కోట్ల షేర్లను మాత్రమే అమ్మారు. ఆగస్ట్‌లో రూ. 51,200 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ ఏడాదిలో నికరంగా 1.70 లక్షల కోట్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ‘‘ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, రూపాయి పతనం, ఆర్థిక మాంద్యం భయాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగడం, బ్రిటన్‌లో రాజకీయ అస్థిరత తదితర అంశాల నేపథ్యంలో భవిష్యత్‌లోనూ ఎఫ్‌పీఐల పెట్టుబడుల్లో ఆటుపోట్లు కనిపించవచ్చు’’ అని మార్నింగ్‌స్టార్ ఇండియా అసిసోయేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. -
అయ్యో!.. ఐకియాకు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: ఫర్నీచర్ రంగ దిగ్గజం ఐకియా ఇండియా 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.903 కోట్ల నష్టం చవిచూసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.810 కోట్ల నష్టం వాటిల్లింది. టర్నోవర్ 73 శాతం ఎగసి రూ.650 కోట్ల నుంచి రూ.1,125 కోట్లకు చేరింది. నిర్వహణ వ్యయాలు 45 శాతం పెరిగి రూ.1,591 కోట్లుగా ఉంది. 2021–22లో విస్తరణ ప్రణాళికపై కోవిడ్–19 మహమ్మారి ప్రభావం చూపిందని కంపెనీ తెలిపింది. హైదరాబాద్, నవీ ముంబై, బెంగళూరులో ఐకియా స్టోర్లు ఉన్నాయి. ఈ మూడు నగరాలతోపాటు పుణే, గుజరాత్లో ఆన్‌లైన్‌లోనూ ఉత్పత్తులను విక్రయిస్తోంది. -
కంపెనీ చరిత్రలో ఇదే తొలిసారి.. లాభాల్లో మారుతీ స్పీడ్!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం నాలుగు రెట్లు జంప్‌చేసి రూ. 2,112 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 487 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 20,551 కోట్ల నుంచి రూ. 29,942 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 5,17,395 వాహనాలను విక్రయించింది. వీటిలో దేశీయంగా 4,54,200 వాహనాలను విక్రయించగా.. 63,195 యూనిట్లు ఎగుమతి చేసింది. ఎలక్ట్రానిక్ పరికరాల కొరత కారణంగా ఉత్పత్తిలో 35,000 వాహనాలవరకూ ప్రభావం పడినట్లు మారుతీ వెల్లడించింది. ఇందువల్లనే గత క్యూ2 లోనూ మొత్తం వాహన విక్రయాలు 3,79,541 యూనిట్లకు పరిమితమైనట్లు ప్రస్తావించింది. పండుగల ప్రభావం ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత, కోవిడ్–19 సవాళ్లు గతంలో వృద్ధిని దెబ్బతీసినప్పటికీ ప్రస్తుతం పరిస్థితులు జోరందుకున్నట్లు వర్చువల్‌గా నిర్వహించిన విలేకరుల సమావేశంలో కంపెనీ చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. ప్రధానంగా పండుగల సీజన్ అమ్మకాలకు జోష్‌నిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో కస్టమర్ల పెండింగ్ ఆర్డర్లు 4.12 లక్షల యూనిట్లకు చేరినట్లు వెల్లడించారు. వీటిలో ఇటీవల ప్రవేశపెట్టిన గ్రాండ్ వితారా, కొత్త బ్రెజ్జా తదితర మోడళ్ల కోసమే 1.3 లక్షల ముందస్తు బుకింగ్స్ నమోదైనట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ విడిభాగాల లభ్యత, వ్యయ నియంత్రణ, ఉత్తమ ధరలు వంటి అంశాలపై దృష్టిపెట్టినట్లు వివరించారు. తద్వారా మెరుగైన మార్జిన్లు సాధించే వీలున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో మొత్తం 9,85,326 వాహనాలు విక్రయించగా.. పూర్తి ఏడాదిలో 20 లక్షల యూనిట్ల అమ్మకాలు సాధించే లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు భార్గవ తెలియజేశారు. గతేడాది ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో 7,33,155 వాహనాలను మాత్రమే విక్రయించింది. ఫలితాల నేపథ్యంలో మారుతీ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 6 శాతం జంప్‌చేసి రూ. 9,548 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 9,550 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకడం విశేషం! చదవండి: Elon Musk: ఎలాన్ మస్క్‌కు షాక్.. ట్విట్టర్లో యాడ్స్ బంద్! -
ఎస్బీఐ కార్డ్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం ఎస్బీఐ కార్డ్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 52 శాతం జంప్‌చేసి రూ. 526 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 345 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 28 శాతం ఎగసి రూ. 3,453 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 2,695 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ప్రమోట్ చేసిన క్రెడిట్ కార్డుల కంపెనీ వడ్డీ ఆదాయం 27 శాతం పురోగమించి రూ. 1,484 కోట్లను తాకింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.36 శాతం నుంచి 2.14 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 0.91 శాతం నుంచి 0.78 శాతానికి నీరసించాయి. కనీస మూలధన నిష్పత్తి 23.2 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ కార్డ్ షేరు ఎన్ఎస్ఈలో 5.5 శాతం పతనమై రూ. 812 వద్ద ముగిసింది. చదవండి: ఐటీలో అసలేం జరుగుతోంది! ఉద్యోగుల తొలగింపు, ఆఫర్ లెటర్స్ లేవు.. అన్నింటికీ అదే కారణమా -
ఫలితాల్లో మారుతి అదుర్స్: ఏకంగా నాలుగు రెట్ల లాభం
సాక్షి,ముంబై: దేశీయ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ క్యూ2 ఫలితాల్లో అదరగొట్టింది. సెప్టెంబరు త్రైమాసికంలో నికర లాభం 4 రెట్లు పెరిగి రూ.2,062 కోట్లకు చేరుకుందని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. సెప్టెంబర్ త్రైమాసికంలో గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 475.30 కోట్ల లాభంతో పోలిస్తే నాలుగు రెట్లు ఎగిసింది. (షావోమి యూజర్లకు షాకింగ్ న్యూస్: ఆ సేవలిక బంద్!) గత ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్మకాలు రూ.19,297.80 కోట్లనుంచి రూ.28,543.50 కోట్లకు వార్షిక ప్రాతిపదికన 47.91 శాతం వృద్ధి చెందాయి. ఆపరేటింగ్ ఎబిట్ గత ఏడాది త్రైమాసికంలో రూ.98.80 కోట్ల నుంచి 20.71 రెట్లు పెరిగి రూ.2,046.30 కోట్లకు చేరుకుంది. అలాగే ఈ త్రైమాసికంలో ఎబిట్ మార్జిన్ 670 బేసిస్ పాయింట్లు పెరిగి 0.5 శాతం నుంచి 7.2 శాతానికి చేరుకుంది. ఖర్చు తగ్గింపు ప్రయత్నాలు, అనుకూలమైన విదేశీ మారకపు వైవిధ్యం తమకు లాభించిందని పేర్కొంది. అయితే ఎలక్ట్రానిక్ భాగాల కొరత కారణంగా ఈ త్రైమాసికంలో దాదాపు 35,000 వాహనాల ఉత్పత్తిపై ప్రభావం చూపిందని కంపెనీ తెలిపింది. ఈ త్రైమాసికం ముగిసే సమయానికి 4.12 లక్షల వాహనాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిలో 1.3 లక్షల వాహనాల ప్రీ-బుకింగ్‌లు ఇటీవల లాంచ్ చేసిన మోడళ్లకు సంబంధించినవేనని మారుతి వెల్లడించింది. ఈ ఫలితాల జోష్‌తో మారుతి సుజుకి షేరు ఆరుశాతం ఎగిసి 9,548 వద్ద ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించింది. -
అదరగొట్టిన సెంచురీ టెక్స్టైల్స్, ఆదాయం జంప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ సెంచురీ టెక్స్టైల్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై-సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 59 శాతం జంప్‌చేసి రూ. 70 కోట్లకు చేరింది. గతేడాది(2021-22) ఇదే కాలంలో కేవలం రూ. 44 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,034 కోట్ల నుంచి రూ. 1,242 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 972 కోట్ల నుంచి పెరిగి రూ. 1,125 కోట్లను తాకాయి. కంపెనీ టెక్స్టైల్స్, పల్ప్, పేపర్, రియల్టీ బిజినెస్‌లను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఫలితాల నేపథ్యంలో సెంచురీ టెక్స్టైల్స్ షేరు గురువారం నాటి 8 శాతం లాభంతో పోలిస్తే 2 శాతం నష్టంతో 861 వద్ద ట్రేడ్ అవుతోంది. -
మార్క్ జుకర్‌బర్గ్‌కు ఇన్వెస్టర్ల షాక్: మార్కెట్ వాల్యూ ఢమాల్!
న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా మరోసారి ఫలితాల్లో ఢమాల్ అంది. వరుసగా రెండో త్రైమాసికంలో కూడా ఆదాయ క్షీణత నమోదు చేసింది. మెటావర్స్‌పై అనాసక్తతకు తోడు ప్రకటనల ఆదాయం క్షీణించడం, ప్రపంచవ్యాప్తంగా టిక్ టాక్ నుంచి ఎదురవుతున్న పోటీ కారణంగా మెటా ఆదాయం పడిపోయింది. సెప్టెంబర్ 30తో ముగిసిన క్యార్టర్-2 ఫలితాల్లో ఆదాయం 4శాతం తగ్గి 27.71 బిలియన్ల డాలర్లకు చేరింది. అంతకుముందు ఇది 29.01 బిలియన్ల డాలర్లుగా ఉంది. మెటావర్స్ ప్రాజెక్ట్‌పై చేసిన అపారమైన, ప్రయోగాలకు మొత్తం ఖర్చుల్లో ఐదవ వంతు ఖర్చుపెట్టారు మెటా బాస్ మార్క్ జుకర్‌బర్గ్ . అయితే కంపెనీ ఒక్కోషేరు ఆదాయంలో అంచనాలకు అందుకోలేక చతికిలపడింది. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో ఆర్జించిన3.22 డాలర్లనుంచి 52 శాతం పడిపోయి 1.64 డాలర్లను మాత్రం సాధించింది. అలాగే మెటా రియాలిటీ ల్యాబ్స్ యూనిట్, దాని మెటావర్స్ మూడవ త్రైమాసికంలో 3.67 బిలియన్ డాలర్ల నిర్వహణ నష్టాన్నినమోదు చేసింది. అంతకు ముందు సంవత్సరంతో నష్టంతో పోలిస్తే ఇది అధికం. ఈ ఫలితాల నేపథ్యంలోవాల్ స్ట్రీట్‌లో మెటా షేరు ఏకంగా 20 శాతం కుప్పకూలింది. 2016 కనిష్ట స్థాయిని తాకింది. ఈ ఏడాదిలో మెటాషేరు 61శాతం క్షీణించడం గమనార్హం. తాజా నష్టంతో 67 బిలియన్ డాలర్ల మార్కెట్ వాల్యూ హరించుకు పోయింది. కాగా మెటా పెట్టుడులపై పెట్టుబడిదారుల ఆందోళన నేపథ్యంలో మెటావర్స్ పేరిట కంపెనీ అనవసర ఆలోచనలు చేస్తోందని మెటా వాటాదారు ఆల్టిమీటర్ క్యాపిటల్ సీఈఓ బ్రాడ్ గెర్స్ట్నర్ ఈ వారం ప్రారంభంలో మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్క్‌పై లేఖ రాసిన సంగతి తెలిసిందే. -
గ్లాండ్ ఫార్మా లాభం 20% డౌన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ సంస్థ గ్లాండ్ ఫార్మా సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 20 శాతం తగ్గి రూ.241 కోట్లు నమోదు చేసింది. వ్యయాలు రూ.731 కోట్ల నుంచి రూ.786 కోట్లకు ఎగశాయి. టర్నోవర్ రూ.1,080 కోట్ల నుంచి రూ.1,044 కోట్లకు వచ్చి చేరింది. యూఎస్, యూరప్, కెనడా, ఆస్ట్రేలియా మార్కెట్ల నుంచి టర్నోవర్ 3 శాతం పెరిగి రూ.747 కోట్లుగా ఉంది. ఆదాయం భారత విపణి నుంచి 42 శాతం తగ్గి రూ.73 కోట్లకు, ఇతర మార్కెట్ల నుంచి 3 శాతం క్షీణించి రూ.224 కోట్లకు పడిపోయింది. క్రితం ముగింపుతో పోలిస్తే గ్లాండ్ ఫార్మా షేరు ధర బీఎస్ఈలో బుధవారం 1.57 శాతం పెరిగి రూ.2,224.20 వద్ద స్థిరపడింది. చదవండి: ఐటీలో అసలేం జరుగుతోంది! ఉద్యోగుల తొలగింపు, ఆఫర్ లెటర్స్ లేవు.. అన్నింటికీ అదే కారణమా -
సీడీఎస్ఎల్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో డిపాజిటరీ సేవల దిగ్గజం సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్(సీడీఎస్ఎల్) ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 80 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 86 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం మాత్రం 3 శాతం పుంజుకుని రూ.170 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 165 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ కాలంలో ఇన్వెస్టర్లు కొత్తగా 48 లక్షల డీమ్యాట్ ఖాతాలను తెరచినట్లు కంపెనీ వెల్లడించింది. దీర్ఘకాలిక వ్యూహాలలో భాగంగా డిజిటల్ ఎకోసిస్టమ్‌పై వెచ్చిస్తున్న పెట్టుబడులు ఫలితాలనిస్తున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో నేహల్ వోరా పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో సీడీఎస్ఎల్ షేరు ఎన్ఎస్ఈలో నామమాత్రంగా లాభపడి రూ. 1,228 వద్ద ముగిసింది. చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
కోటక్ మహీంద్రా లాభం ప్లస్
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుత ఏడాది(2022–23) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 21 శాతం పుంజుకుని రూ. 3,608 కోట్లను తాకింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 27 శాతం జంప్‌చేసి రూ. 2,581 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 8,408 కోట్ల నుంచి రూ. 10,047 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 27 శాతం బలపడి రూ. 5,099 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 5.17 శాతానికి చేరాయి. అయితే ఆటోమాటిక్ పద్ధతిన రుణాలపై మార్కెట్‌కు అనుసంధానమైన రేట్లతో మార్జిన్లు మెరుగుపడటం ఇందుకు దోహదం చేసినప్పటికీ భవిష్యత్‌లో 4.25–4.35 శాతం స్థాయిలో ఇవి కొనసాగగలవని బ్యాంక్ వివరించింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.19 శాతం నుంచి 2.08 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు 1.06 శాతం నుంచి 0.55 శాతానికి దిగివచ్చాయి. తాజా స్లిప్పేజీలు రూ. 983 కోట్లుగా నమోదయ్యాయి. అనుబంధ సంస్థల తీరు ఇదీ.. కోటక్ బ్యాంక్ అనుబంధ సంస్థలలో లైఫ్ ఇన్సూరెన్స్ లాభం రూ. 155 కోట్ల నుంచి రూ. 270 కోట్లకు ఎగసింది. సెక్యూరిటీస్ లాభం రూ. 243 కోట్ల నుంచి రూ. 224 కోట్లకు తగ్గింది. కొటక్ ప్రైమ్ లాభం రూ. 18 కోట్లు తక్కువగా రూ. 222 కోట్లకు పరిమితమైంది. ట్రస్టీ విభాగం నుంచి రూ. 9 కోట్లు అధికంగా రూ. 106 కోట్లు లభించినట్లు కొటక్ బ్యాంక్ వెల్లడించింది. కోటక్ ఇన్వెస్ట్మెంట్స్ రూ. 11 కోట్లు తగ్గి రూ. 78 కోట్ల లాభం ఆర్జించింది. మైక్రోఫైనాన్స్ లాభం రూ. 8 కోట్ల నుంచి ఏకంగా రూ. 70 కోట్లకు దూసుకెళ్లింది. అయితే కోటక్ క్యాపిటల్ లాభం రూ. 58 కోట్ల నుంచి రూ. 22 కోట్లకు క్షీణించింది. చదవండి: వైద్యుడే వాచ్ రూపంలో వచ్చినట్టు.. చిన్నారి ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్! -
కరూర్ వైశ్యా బ్యాంక్ లాభం 52 శాతం అప్
చెన్నై: ప్రైవేట్ రంగ కరూర్ వైశ్యా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 250 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ2లో నమోదైన రూ. 165 కోట్లతో పోలిస్తే సుమారు 52 శాతం వృద్ధి సాధించింది. ఇక నికర వడ్డీ ఆదాయం దాదాపు 21 శాతం పెరిగి రూ. 680 కోట్ల నుంచి రూ. 821 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 3.74 శాతం నుంచి 4.07 శాతానికి పెరిగింది. నికర మొండి బాకీలు (ఎన్పీఏ) 2.99 శాతం నుంచి 1.36 శాతానికి దిగివచ్చినట్లు బ్యాంకు ఎండీ బి. రమేష్ బాబు తెలిపారు. సెప్టెంబర్ ఆఖరు నాటికి మొత్తం వ్యాపార పరిమాణం దాదాపు 14 శాతం పెరిగి రూ. 1,35,460 కోట్లకు చేరినట్లు వివరించారు. దశాబ్ద కాలంలో వ్యాపారం రెట్టింపైనట్లు పేర్కొన్నారు. -
బెస్ట్ ఆగ్రోలైఫ్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆగ్రోకెమికల్స్ సంస్థ బెస్ట్ ఆగ్రోలైఫ్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 5 రెట్లు దూసుకెళ్లి రూ. 130 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 25 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 702 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 325 కోట్ల టర్నోవర్ మాత్రమే నమోదైంది. తమ ప్లాంట్లు గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు కంపెనీ ఎండీ విమల్ అలవాధి పేర్కొన్నారు. కొత్తగా విడుదల చేసిన ప్రొడక్టులకు మంచి స్పందన లభించినట్లు తెలియజేశారు. భవిష్యత్‌లో మరిన్ని విప్లవాత్మక ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఆర్అండ్డీ బృందం నూతన మాలిక్యూల్స్‌ను ఆవిష్కరించడంలో ప్రత్యేకత కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్ఎస్ఈలో బెస్ట్ ఆగ్రోలైఫ్ షేరు వారాంతాన 1 శాతం బలపడి రూ. 1,526 వద్ద ముగిసింది. -
ఐడీబీఐ బ్యాంక్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఐడీబీఐ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 46 శాతం జంప్‌చేసి రూ. 828 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 567 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 5,130 కోట్ల నుంచి రూ. 6,066 కోట్లకు ఎగసింది. ఎల్ఐసీ నియంత్రణలోని బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 21.85 శాతం నుంచి 16.51 శాతానికి వెనకడుగు వేశాయి. నికర ఎన్పీఏలు 1.71 శాతం నుంచి 1.15 శాతానికి తగ్గాయి. మొండి రుణాలు, కంటింజెన్సీలకు కేటాయింపులు రూ. 571 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ. 771 కోట్లకు పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐడీబీఐ బ్యాంక్ షేరు 1.4 శాతం నీరసించి రూ. 44 వద్ద ముగిసింది. చదవండి: భారీ షాక్.. దీపావళి తర్వాత ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్! -
మెప్పించిన టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్
న్యూఢిల్లీ: టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ (టీసీపీఎల్) సెప్టెంబర్ క్వార్టర్లో పనితీరు పరంగా మెప్పించింది. నికర లాభం 36 శాతం పెరిగి రూ.389 కోట్లుగా నమోదైంది. ఆదాయం 11 శాతం ఎగసి రూ.3,363 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికానికి నికర లాభం రూ.286 కోట్లు, ఆదాయం రూ.3,033 కోట్ల చొప్పున ఉన్నాయి. వ్యయాలు 12 శాతం వరకు పెరిగి రూ.3,022 కోట్లకు చేరాయి. భారత్‌లో వ్యాపారం బలమైన పనితీరు చూపించినట్టు టీసీపీఎల్ గ్రూపు సీఎఫ్‌వో ఎల్ కృష్ణకుమార్ తెలిపారు. ముఖ్యంగా ఆహారోత్పత్తుల వ్యాపారం గొప్ప పనితీరు చూపించిందన్నారు. భారత మార్కెట్ నుంచి ఆదాయం 9 శాతం పెరిగి రూ.2,160 కోట్లుగా ఉంది. ఫుడ్స్ బిజినెస్ ఆదాయం 29 శాతం వృద్ధిని చూసింది. టాటా సంపన్న్, నీటి వ్యాపారం ఆదాయం డబుల్ డిజిట్ స్థాయిలో పెరిగింది. ప్యాకేజ్డ్ పానీయాల వ్యాపారం 7 శాతం క్షీణించింది. టాటా స్టార్ బక్స్ ఆదాయం 57 శాతం పెరిగింది. ఉప్పు వ్యాపారంలో మార్కెట్ వాటాను పెంచుకున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో సునీల్ డిసౌజ తెలిపారు. చదవండి: ‘అలా చేస్తే మీకే కాదు..నా ఉద్యోగానికే దిక్కుండదు’, రషీద్ ప్రేమ్‌జీ సంచలన వ్యాఖ్యలు -
హెచ్‌యూఎల్ ఫలితాలు బాగు..
న్యూఢిల్లీ: దిగ్గజ ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో బలమైన ఫలితాలను నమోదు చేసింది. కన్సాలిడేటెడ్ నికర లాభం ఏకంగా 22 శాతం వృద్ధితో రూ.2,670 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం 16 శాతానికి పైగా పెరిగి రూ.15,253 కోట్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికానికి లాభం రూ.2,185 కోట్లు, ఆదాయం రూ.13,099 కోట్ల చొప్పున ఉన్నాయి. విక్రయాల సంఖ్యా పరంగా 4 శాతం వృద్ధిని చూసినట్టు కంపెనీ తెలిపింది. తమ ఉత్పత్తుల్లో 75 శాతం విలువ పరంగా, పరిమాణం పరంగా మార్కెట్ వాటాను పెంచుకున్నట్టు పేర్కొంది. కంపెనీ వ్యయాలు 18 శాతం పెరిగి రూ.11,965 కోట్లుగా ఉన్నాయి. ‘‘అన్ని రకాలుగా బలమైన ప్రదర్శన చూపించాం. 2022–23లో మొదటి ఆరు నెలల్లో రూ.4,000 కోట్ల అధిక టర్నోవర్ నమోదు చేయగలిగాం. మా ఉత్పత్తులకు ఉన్న బలం, నిర్వహణ సామర్థ్యాలు, వివేకవంతమైన ఆర్థిక వ్యవహారాల నిర్వహణ అనుకూలించాయి’’అని హెచ్‌యూఎల్ సీఈవో, ఎండీ సంజీవ్ మెహతా పేర్కొన్నారు. ఒక్కో షేరుకు రూ.17 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని కంపెనీ‡ బోర్డు నిర్ణయించింది. -
ఆర్ఐఎల్ లాభం రూ. 13,656 కోట్లు
ముంబై: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో రూ. 13,656 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 13,680 కోట్లతో పోలిస్తే నామమాత్రంగా తగ్గింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్–జూన్(క్యూ1)లో ఆర్జించిన రూ. 17,955 కోట్లతో పోలిస్తే నికర లాభం భారీగా క్షీణించింది. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన విండ్‌ఫాల్ ట్యాక్స్ చమురు విభాగంపై ప్రతికూల ప్రభావం చూపడంతో లాభాలు నీరసించాయి. ఇక ప్రస్తుత క్యూ2లో రూ. 31,224 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) సాధించగా.. గతేడాది క్యూ2లో రూ. 26,020 కోట్లు మాత్రమే ఆర్జించింది. క్యూ1లో ఇబిటా రూ. 37,997 కోట్లుగా నమోదైంది. తాజా సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం రూ. 2.30 లక్షల కోట్లకు బలపడింది. గతేడాది క్యూ2లో రూ. 1.68 లక్షల కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. ఈ ఏడాది క్యూ1లో రూ. 2.19 లక్షల కోట్ల టర్నోవర్ సాధించింది. కంపెనీ ఇబిటా మార్జిన్లు 13.6%కి చేరాయి. క్యూ1లో ఇవి 17.3 శాతంగా నమోదయ్యాయి. క్యూ2లో ఇతర హైలైట్స్ ► సెప్టెంబర్‌కల్లా ఆర్ఐఎల్ రుణ భారం రూ. 2.94 లక్షల కోట్లకు చేరగా.. నగదు, తత్సమాన నిల్వల విలువ రూ. 2.01 లక్షల కోట్లను తాకినట్లు కంపెనీ వెల్లడించింది. ► చమురు, గ్యాస్ విభాగం రూ. 3,853 కోట్ల ఆదాయం సాధించింది. ఇబిటా 2510 కోట్లు కాగా, ఇబిటా మార్జిన్లు 65% నమోదయ్యాయి. ► రిటైల్ విభాగం ఆదాయం రూ.64,936 కోట్లను తాకగా.. రూ. 4,414 కోట్ల ఇబిటా సాధించింది. ఇబిటా మార్జిన్లు 6.8 %గా ఉన్నాయి. ► ఆయిల్ టు కెమికల్ ఆదాయం రూ. 1.6 లక్షల కోట్లకు చేరింది. ఇబిటా రూ. 11,968 కోట్లు. జియో లాభం 28% జూమ్ క్యూ2లో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ నికర లాభం 28 శాతం వృద్ధితో రూ. 4,518 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 20 శాతం పుంజుకుని రూ. 22,521 కోట్లకు చేరింది. 5 శాతం అధికంగా రూ. 11,489 కోట్ల ఇబిటా సాధించింది. ఇబిటా మార్జిన్లు 0.9 శాతం బలపడి 51 శాతానికి చేరాయి. ఈ కాలంలో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 177.20ను తాకింది. ఈ ఏడాది క్యూ1లో రూ. 175 మాత్రమే. సెప్టెంబర్‌కల్లా మొత్తం సబ్స్క్రయిబర్ల సంఖ్య 427.6 మిలియన్లకు చేరింది. క్యూ1లో ఈ సంఖ్య 419.9 మిలియన్లు. మార్కెట్లు ముగిశాక ఆర్ఐఎల్ ఫలితాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో షేరు ఎన్ఎస్ఈలో 1.2 శాతం క్షీణించి రూ. 2,470 వద్ద ముగిసింది. -
ఐనాక్స్ లీజర్ నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో మల్టీప్లెక్స్ చైన్ నిర్వాహక కంపెనీ ఐనాక్స్ లీజర్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర నష్టం సగానికిపైగా తగ్గి రూ. 40.4 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 88 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 47.44 కోట్ల నుంచి రూ. 374 కోట్లకు దూసుకెళ్లింది. కోవిడ్–19 సెకండ్ వేవ్ కారణంగా గత క్యూ2లో స్వల్ప టర్నోవర్ నమోదైంది. అయితే ప్రస్తుత క్యూ2లో మొత్తం వ్యయాలు సైతం రెండు రెట్లు ఎగసి రూ. 434 కోట్లను దాటాయి. ఈ కాలంలో 11.6 మిలియన్లమంది సినిమాలను వీక్షించగా.. సగటు టికెట్ ధర రూ. 215కు చేరింది. ఒక్కో వ్యక్తి సగటు వ్యయం రికార్డు నెలకొల్పుతూ రూ. 102ను తాకింది. కొత్తగా 13 తెరలను ఏర్పాటు చేసింది. దీంతో కంపెనీ 165 మల్టీప్లెక్స్‌ల ద్వారా 74 పట్టణాలలో 705 స్క్రీన్లను నిర్వహిస్తోంది. ఫలితాల నేపథ్యంలో ఐనాక్స్ లీజర్ షేరు బీఎస్ఈలో 0.6 శాతం బలపడి రూ. 514 వద్ద ముగిసింది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
హెచ్డీఎఫ్సీ ఏఎంసీ లాభం రూ.364 కోట్లు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ సేవలు అందించే హెచ్డీఎఫ్సీ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.364 కోట్ల లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో వచ్చిన లాభం రూ.344 కోట్లతో పోలిస్తే 6 శాతం వృద్ధి నమోదైంది. ఆదాయం సైతం 7 శాతం వృద్ధితో రూ.649 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.608 కోట్లుగా ఉంది. ఈ సంస్థ నిర్వహణలోని సగటు ఆస్తులు (ఏయూఎం) సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.4.29 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నిర్వహణ ఆస్తులు రూ.4.38 లక్షల కోట్లతో పోలిస్తే 2 శాతానికి పైగా తగ్గాయి. మార్కెట్ వాటా 11 శాతం కలిగి ఉంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్డీఎఫ్సీ ఏఎంసీ షేరు ఒక శాతానికి పైగా లాభపడి రూ.1,960 వద్ద ముగిసింది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
నెస్లే డివిడెండ్ రూ.120
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2022) మూడో త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియా ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ3)లో నికర లాభం 8 శాతం బలపడి రూ. 668 కోట్లను అధిగమించింది. గతేడాది(2021) ఇదే కాలంలో రూ. 617 కోట్లు ఆర్జించింది. నికర అమ్మకాలు సైతం 18 శాతం వృద్ధితో రూ. 4,591 కోట్లను తాకాయి. గత క్యూ3లో రూ. 3,883 కోట్ల టర్నోవర్ సాధించింది. కంపెనీ క్యాలండర్ ఏడాదిని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంగతి తెలిసిందే. వాటాదారులకు రెండో మధ్యంతర డివి డెండ్ కింద షేరుకి రూ.120 చెల్లించేందుకు బోర్డు అనుమతించినట్లు నెస్లే ఇండియా వెల్లడించింది. త్రైమాసిక రికార్డ్..: గత ఐదేళ్లలో ఒక త్రైమాసికానికి అమ్మకాల్లో అత్యధిక వృద్ధిని అందుకున్నట్లు ఈ సందర్భంగా నెస్లే ఇండియా చైర్మన్, ఎండీ సురేష్ నారాయణన్ తెలియజేశారు. దేశీ అమ్మకాలు 18 శాతంపైగా ఎగసి రూ. 4,361 కోట్లను దాటాయి. కస్టమర్ల వద్దకే నెస్లే మైనెస్లే పేరుతో డైరెక్ట్ టు కంజ్యూమర్ (డీ2సీ) విభాగంలోకి (ఆన్లైన్) కంపెనీ ప్రవేశించింది.తొలుత ఢిల్లీ రాజధాని ప్రాంత కస్టమర్లకు ఈ సేవలను పరిచయం చేయనున్నారు. తరువాత దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని నెస్లే ఇండియా సీఎండీ సురేశ్ నారాయణన్ వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో నెస్లే ఇండియా షేరు 2 శాతం లాభపడి రూ. 19,800 వద్ద ముగిసింది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
హావెల్స్ ఇండియా లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో కన్జూమర్ ఎలక్ట్రికల్ గూడ్స్ దిగ్గజం హావెల్స్ ఇండియా నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 38 శాతం క్షీణించి రూ. 187 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 302 కోట్లకుపైగా ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 14 శాతం వృద్ధితో రూ. 3,679 కోట్లను అధిగమించింది. గత క్యూ2లో రూ. 3,238 కోట్ల టర్నోవర్ సాధించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం 21 శాతం ఎగసి రూ. 3,274 కోట్లకు చేరాయి. కమోడిటీ ధరల కారణంగా వ్యయాలు పెరగడంతో మార్జిన్లు బలహీనపడినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ అనిల్ రాయ్ గుప్తా పేర్కొన్నారు. కేబుళ్ల విభాగం అమ్మకాలు రూ. 1,359 కోట్లను దాటగా.. స్విచ్ గేర్ల నుంచి రూ. 488 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలియజేశారు. ఇక మొత్తం ఆదాయంలో ఎలక్ట్రికల్ కన్జూమర్ గూడ్స్ నుంచి రూ. 773.5 కోట్లు, లైటింగ్ తదితరాల నుంచి రూ. 402 కోట్లు చొప్పున లభించినట్లు వెల్లడించారు. లాయిడ్ కన్జూమర్ అమ్మకాలు రూ. 420 కోట్లకు చేరినట్లు పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో హావెల్స్ ఇండియా షేరు బీఎస్ఈలో 0.7 శాతం బలహీనపడి రూ. 1,248 వద్ద ముగిసింది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
నష్టాల్లోకి నెట్వర్క్18 మీడియా
న్యూఢిల్లీ: రెండో త్రైమాసికంలో ఎంటర్టైన్మెంట్ రంగ కంపెనీ నెట్వర్క్18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో దాదాపు రూ. 29 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 199 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 12 శాతం బలపడి రూ. 1,549 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 1,387 కోట్ల టర్నోవర్ నమోదైంది. అయితే మొత్తం వ్యయాలు సైతం 34 శాతం ఎగసి రూ. 1,592 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో నెట్వర్క్18 మీడియా షేరు బీఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 70 వద్ద ముగిసింది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
పీవీఆర్ నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నష్టాలు సగానికిపైగా తగ్గాయి. రూ. 71.5 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 153 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గడంతో ఫిల్మ్ ఎగ్జిబిషన్ బిజినెస్ ఊపందుకున్నట్లు కంపెనీ పేర్కొంది. క్యూ2లో మొత్తం ఆదాయం సైతం రూ. 120 కోట్ల నుంచి దాదాపు రూ. 687 కోట్లకు దూసుకెళ్లింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 461 కోట్ల నుంచి భారీగా ఎగసి రూ. 813 కోట్లను తాకాయి. ఈ కాలంలో 1.8 కోట్ల మంది సినిమాలను సందర్శించగా.. టికెట్ సగటు ధరలు 11 శాతం మెరుగై రూ. 224కు చేరాయి. ఆహారం, పానీయాలపై ఒక్కో వ్యక్తి వినియోగ వ్యయం 31 శాతం పుంజుకుని రూ. 129కు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
ఎల్అండ్టీ ఇన్ఫో లాభం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 23 శాతం బలపడి రూ. 680 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 552 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 28 శాతంపైగా ఎగసి రూ. 4,837 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 3,767 కోట్ల టర్నోవర్ నమోదైంది. క్లౌడ్, అనలిటిక్స్ విభాగంలో పటిష్ట వృద్ధి బాటన సాగుతున్నట్లు కంపెనీ సేల్స్ ప్రెసిడెంట్ సుధీర్ చతుర్వేది పేర్కొన్నారు. గ్రూప్‌లోని సాఫ్ట్వేర్ సేవల మరో కంపెనీ మైండ్‌ట్రీని విలీనం చేసుకునే ప్రాసెస్ కొనసాగుతున్నట్లు తెలియజేశారు. ఇందుకు గత నెల 10న వాటాదారులు, అన్సెక్యూర్డ్ రుణదాతలు అనుమతించినట్లు ప్రస్తావించారు. పూర్తి షేర్ల జారీ ద్వారా ఈ లావాదేవీ జరగనున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మైండ్‌ట్రీ వాటాదారులకు తమ వద్దగల ప్రతీ 100 షేర్లస్థానే 73 ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ షేర్లు జారీ కానున్నాయి. విలీన సంస్థ ఆదాయం 3.5 బిలియన్ డాలర్లకు చేరనుంది. చదవండి: అమెజాన్ మైండ్‌బ్లోయింగ్ ఆఫర్లు.. రూ.2,500 లోపు అదిరిపోయే గాడ్జెట్స్! -
క్యూ2 ఫలితాలు, ప్రపంచ పరిణామాలు కీలకం
ముంబై: దేశీయ సూచీలు ఈ వారం కార్పొరేట్ క్యూ2 ఫలితాలు, ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా కదలాడొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక వృద్ధి మందగమన భయాల నేపథ్యంలో త్రైమాసిక ఫలితాల సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదిలికలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ట్రేడర్లు తమ పొజిషన్లను సమతూకం చేసుకోవాలి. పతనాన్ని కొనుగోలుకు అవకాశంగా మలుచుకోవాలి అని నిపుణులు చెబుతున్నారు. అర్థిక మాంద్య భయాలు, మిశ్రమ కార్పొరేట్ ఫలితాలు, బలహీన స్థూల ఆర్థిక గణాంకాలు నేపథ్యంలో గతవారంలో సెన్సెక్స్ 271 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లు నష్టపోయాయి. ‘‘ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొని ఉన్న అనిశ్చితుల ప్రభావంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవచ్చు. అయితే దేశీయ పండుగ సీజన్ డిమాండ్, క్యూ2 ఆర్థిక ఫలితాల ఫలితాల జోష్ అస్థిరతలను పరిమితం చేయోచ్చు. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, స్పెషాలిటీ కెమికల్స్, మౌలిక రంగ షేర్లు రాణించే వీలుంది. గడిచిన మూడు వారాలుగా నిఫ్టీ 16,800–17,350 స్థాయిల పరిధిలో ట్రేడవుతోంది. కొనుగోళ్లు కొనసాగితే 17,100 వద్ద తక్షణ నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. అటు పిదప 17,700 శ్రేణిలో మరో కీలక నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు నెలకొంటే నిఫ్టీకి 16,800 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ రిలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. 300 కంపెనీలు రెడీ ముందుగా నేడు మార్కెట్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అవెన్యూ సూపర్‌మార్ట్ త్రైమాసిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో సుమారు 300కి పైగా కంపెనీలు తమ క్యూ2తో గణాంకాలను ప్రకటించనున్నాయి. ఏసీసీ, ఏషియన్ పేయింట్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, టాటా కన్జూమర్ ప్రాడెక్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, ఆల్ట్రాటెక్ సిమెంట్, హావెల్స్ ఇండియా, పీవీఆర్, ఎల్అండ్టీ టెక్నాలజీస్ సర్వీసెస్ వంటి దిగ్గజ కంపెనీలు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. మాంద్యం భయాలు ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు అంచనాలు, మాంద్య భయాల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో అస్థిరతలు కొనసాగుతున్నాయి. మరోవైపు డాలర్ క్రమంగా పుంజుకుంటోంది. ఈ అక్టోబర్ ప్రథమార్థంలో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ ఒకశాతానికి పైగా బలపడింది. ఫలితంగా దేశీయ కరెన్సీ రూపాయి శుక్రవారం జీవితకాల కనిష్టం(82.350) వద్ద స్థిరపడింది. ఇటీవల భారత మార్కెట్‌పై విదేశీ ఇన్వెస్టర్లు సైతం ‘‘బేరీష్’’ వైఖరి ప్రదర్శిస్తున్నారు. రేపు అమెరికా సెప్టెంబర్ పారిశ్రామికోత్పత్తి, చైనా క్యూ3 జీడీపీ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ పరిణామాల ప్రభావం దేశీయ ఈక్విటీ మార్కెట్లపై ఉండొచ్చు. ప్రథమార్థంలో రూ.7500 కోట్ల ఉపసంహరణ దేశీయ ఈక్విటీల పట్ల విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ‘‘బేరీష్’’ వైఖరిని కొనసాగిస్తున్నారు. ఈ అక్టోబర్ ప్రథమార్థంలో(1–14 తేదీ ల మధ్య) రూ.7,500 కోట్లను భారత మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. యూఎస్ ఫెడ్ రిజర్వ్‌తో సహా పలు దేశాల కేంద్ర బ్యాంకులు కఠి న ద్రవ్య విధాన అమలుతో ఆర్థిక మాంద్యం మొ దలవుతుందనే భయాలు ఎఫ్‌పీఐల్లో నెలకొన్నట్లు నిపుణులు తెలిపారు. ఆగస్టులో రూ.51,200 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఈ ఏడాది పది నెలల్లో రూ.1.76 లక్షల కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. చదవండి: అమెజాన్ మైండ్‌బ్లోయింగ్ ఆఫర్లు.. రూ.2,500 లోపు అదిరిపోయే గాడ్జెట్స్! -
డీమార్ట్ నికర లాభం హైజంప్
న్యూఢిల్లీ: రెండో త్రైమాసికంలో డీమార్ట్ స్టోర్ల నిర్వాహక కంపెనీ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 64 శాతంపైగా జంప్‌చేసి రూ. 686 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 418 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం దాదాపు 37 శాతం ఎగసి రూ. 10,638 కోట్లను అధిగమించింది. గత క్యూ2లో రూ. 7,789 కోట్ల టర్నోవర్ నమోదైంది. అయితే మొత్తం వ్యయాలు 37 శాతం పెరిగి రూ. 9,926 కోట్లను తాకాయి. స్టోర్ల సందర్శకుల సంఖ్య తగ్గినప్పటికీ సరుకు కొనుగోళ్ల(బాస్కెట్) విలువ పుంజుకున్నట్లు సంస్థ సీఈవో, ఎండీ నెవిల్లే నొరోన్హా పేర్కొన్నారు. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం జూమ్
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 22%ఎగసి రూ. 11,125 కోట్లను అధిగమించింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 20 శాతం పుంజుకుని రూ. 10,606 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 8,834 కోట్లు ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం 19 శాతం బలపడి రూ. 21,201 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు స్థిరత్వాన్ని ప్రదర్శిస్తూ 4.1 శాతంగా నమోదయ్యాయి. ఎన్పీఏలు మెరుగు ప్రస్తుత క్యూ2లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.35 శాతం నుంచి 1.23 శాతానికి తగ్గాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీల కేటాయింపులు రూ. 3,925 కోట్ల నుంచి తగ్గి రూ. 3,240 కోట్లకు పరిమితమయ్యాయి. కాగా, హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ విలీనంపై వాటాదారుల సమావేశ నిర్వహణకు ఎన్సీఎల్టీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 40 బిలియన్ డాలర్ల విలువైన ఈ డీల్‌కు 2022 ఏప్రిల్ 4న తెరలేచిన విషయం విదితమే. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
సైయంట్ మధ్యంతర డివిడెండ్ రూ.10
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ సేవల కంపెనీ సైయంట్ 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను ఒక్కో షేరుకు రూ.10 మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని బోర్డ్ నిర్ణయించింది. సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 34.8 శాతం తగ్గి రూ.79 కోట్లు నమోదు చేసింది. ఎబిటా 10.2 శాతం తగ్గి రూ.186 కోట్లు, ఎబిటా మార్జిన్ 532 బేసిస్ పాయింట్లు తగ్గి 13.4 శాతంగా ఉంది. టర్నోవర్ 25 శాతం ఎగసి రూ.1,396 కోట్లు సాధించింది. చదవండి: బ్యాంక్ కస్టమర్లకు వార్నింగ్.. ఆ యాప్‌లు ఉంటే మీ ఖాతా ఖాళీ,డిలీట్ చేసేయండి! -
అంచనాలు మించి అదరగొట్టిన హెచ్‌సీఎల్ టెక్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఐటీ సర్వీసుల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (హెచ్‌సీఎల్‌టెక్) అంచనాలకు మించి లాభాలను ప్రకటించింది. క్యూ2లో లాభం 7 శాతం వృద్ధి చెంది రూ. 3,489 కోట్లకు చేరింది. గతేడాది సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది రూ. 3,259 కోట్లు. ఇక ఆదాయం 19.5 శాతం పెరిగి రూ. 24,686 కోట్లకు చేరింది. సీక్వెన్షియల్‌గా చూస్తే ఆదాయం 5 శాతం, లాభం 6 శాతం పెరిగాయి. జూన్ త్రైమాసికంతో పోలిస్తే క్యూ2లో లాభం 2.7 శాతం, ఆదాయం 3.4 శాతం పెరగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. కొత్త ఆర్డర్ల బుకింగ్ పటిష్టంగా ఉందని, భవిష్యత్ వృద్ధికి గణనీయంగా ఊతమివ్వగలదని సంస్థ సీఈవో సి. విజయకుమార్ ధీమా వ్యక్తం చేశారు. షేరుకు రూ. 10 చొప్పున కంపెనీ మధ్యంతర డివిడెండు ప్రకటించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ గైడెన్స్‌ను 13.5–14.5 శాతానికి పెంచింది. సమీక్షాకాలంలో కొత్తగా 8,359 మంది ఉద్యోగులు చేరారు. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,19,325కి చేరింది. ఇందులో 10,339 మంది ఫ్రెషర్స్ ఉన్నారు. ఐటీ సేవల విభాగంలో అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) 23.8 శాతంగా ఉంది. ఫలితాల నేపథ్యంలో గురువారం నాటి మార్కెట్లో హెచ్‌సీఎల్ షేరు 3 శాతం ఎగిసింది. -
మూన్‌లైటింగ్‌పై విప్రో సీఈవో కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: సిబ్బంది ఖర్చులు పెరగడం, అమెరికాయేతర మార్కెట్ల నుంచి ఆదాయాలు తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఐటీ సేవల సంస్థ విప్రో నికర లాభం 9.3శాతం క్షీణించింది. రూ. 2,659 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే కాలంలో లాభం రూ. 2,930 కోట్లు. సమీక్షాకాలంలో ఆదాయం సుమారు 15శాతం పెరిగి రూ. 19,667 కోట్ల నుంచి రూ. 22,540 కోట్లకు చేరింది. సీక్వెన్షియల్‌గా లాభం సుమారు 4శాతం, ఆదాయం 5శాతం వృద్ధి చెందాయి. (‘అదానీ’ కి టెలికం లైసెన్స్: డాట్ గ్రీన్ సిగ్నల్) ‘ఆర్డర్లు, భారీ డీల్స్, ఆదాయాల్లో పటిష్టమైన వృద్ధి సాధించడం.. మార్కెట్లో మా పోటీతత్వం మెరుగుపడటాన్ని సూచిస్తోంది‘ అని కంపెనీ సీఈవో థియెరీ డెలాపోర్ట్ తెలిపారు. వివాదాస్పదమైన మూన్‌లైటింగ్‌పై (రెండు సంస్థల్లో ఉద్యోగాలు చేయడం) స్పందిస్తూ ఇది న్యాయపరమైన అంశం కంటే నైతిక విలువలకు సంబంధించిందని డెలాపోర్ట్ పేర్కొన్నారు. ఉద్యోగులు చిన్నా చితకా ఇతరత్రా పనులు చేసుకోవడం ఫర్వాలేదని కానీ ఏకంగా పోటీ కంపెనీకి పని చేయడం మాత్రం నైతికత కాదని ఆయన స్పష్టం చేశారు. మూన్‌లైటింగ్ చేస్తున్న 300 మంది ఉద్యోగులను తొలగించామని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో డెలాపోర్ట్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదీ చదవండి: ఫెస్టివ్ బొనాంజా: హోం లోన్లపై ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ ఆఫర్స్ ఇతర విశేషాలు.. ► ఆర్డరు బుకింగ్‌లు 23.8 శాతం, భారీ డీల్స్ 42 శాతం పెరిగాయి. క్యూ2లో 725 మిలియన్ డాలర్ల విలువ చేసే 11 భారీ డీల్స్ కుదిరాయి. ► సమీక్షాకాలంలో విప్రో 10,000 మంది ఉద్యోగులను ప్రమోట్ చేసింది. అట్రిషన్ రేటు వరుసగా మూడో త్రైమాసికంలోనూ తగ్గింది. క్యూ1లో 23.3 శాతంగా ఉన్న ఈ రేటు స్వల్పంగా 23 శాతానికి దిగి వచ్చింది. ► సెప్టెంబర్ నాటికి ఉద్యోగుల సంఖ్య నికరంగా కేవలం 605 పెరిగి 2,59,179కి చేరింది. తాజాగా 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంది. (క్లిక్ : అంచనాలు మించి అదరగొట్టిన హెచ్‌సీఎల్ టెక్) -
క్యూ2లో స్తబ్దుగా ఎఫ్ఎంసీజీ విక్రయాలు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు ఇంకా ముగిసిపోలేదు. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మందగమనం, తయారీ వ్యయాలు పెరిగిపోవడం తదితర సవాళ్ల నుంచి అవి గట్టెక్కాల్సి ఉంది. కాకపోతే రానున్న నెలల్లో పరిస్థితులు సానుకూలిస్తాయన్న అంచనాలతో కంపెనీలు ఉన్నాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో (క్యూ2) విక్రయాలు స్తబ్దుగా ఉన్నట్టు ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలైన మారికో, గోద్రేజ్ కన్జ్యూమర్, డాబర్ ప్రకటించాయి. వీటి అమ్మకాల్లో వృద్ధి ఒక అంకెకే పరిమితమైంది. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిల్లో ఉండడాన్ని అవి ప్రధానంగా ప్రస్తావించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన రెండు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం నెమ్మదించి, పండుగల సీజన్ కారణంగా వినియోగం పుంజుకుంటుందని ఇవి అంచనా వేస్తున్నాయి. వినియోగం పుంజుకుంటుంది.. ‘‘కమోడిటీల ధరలు దిగిరావడంతో ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు నెమ్మదించనున్నాయి. వర్షాలు కొన్ని రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా అంచనాలకు తగ్గట్టే ఉన్నాయి. దీంతో వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ భాగంలో పుంజుకుంటుందని అంచనా వేస్తున్నాం’’అని గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ పేర్కొంది. సఫోలా, ప్యారాచూట్ తదితర ప్రముఖ బ్రాండ్లను కలిగిన మారికో సైతం విక్రయాల్లో వృద్ధి ఒక అంకెకే పరిమితమైనట్టు ప్రకటించింది. ‘‘డిమాండ్ సెంటిమెంట్ అంతకుముందు త్రైమాసికం మాదిరే క్యూ2లోనూ కొనసాగింది. కాకపోతే చివరి నెలలో (సెప్టెంబర్) కాస్త పుంజుకుంది. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో ఉండడం, గ్రామీణ ప్రాంతాల్లో విక్రయాలు బలహీనంగా ఉండడం కనిపించింది’’అని మారికో తెలిపింది. కాకపోతే పట్టణ ప్రాంతాలు, ప్రీమియం ఉత్పత్తుల విక్రయాలు మెరుగ్గా ఉండడం కంపెనీలకు కాస్తంత వెసులుబాటు ఇస్తోంది. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని, ద్వితీయ ఆరు నెలల కాలంలో విక్రయాలు పుంజుకుంటాయని భావిస్తున్నట్టు మారికో తెలిపింది. అధిక పంటల దిగుబడి, పండుగల సీజన్ సానుకూలిస్తుందని అంచనా వేసింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల పెరిగిపోయిన ద్రవ్యోల్బణం ప్రభావం వ్యాపారంపై క్యూ2లోనూ కొనసాగినట్టు డాబర్ వెల్లడించింది. దీంతో అన్ని విభాగాల్లో డిమాండ్ బలహీనంగా ఉందని తెలిపింది. పట్టణాలు, ఈ కామర్స్ వేదికల్లో మాత్రం విక్రయాలు రెండంకెల వృద్ధిని చూసినట్టు పేర్కొంది. ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి దిగి రావడం, పండుగల సీజన్ వల్ల రానున్న నెలల్లో విక్రయాలు మెరుగుపడతాయని అంచనా వేసింది. -
India GDP: వృద్ధి జోరులో మనమే టాప్..!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) రెండవ త్రైమాసికంలో అంచనాలకు మించి 8.4 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. తద్వారా ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ హోదాను భారత్ నిలబెట్టుకుంది. మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు 20.1 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. వెరసి రెండు త్రైమాసికాల్లో (ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో) వృద్ధి రేటు 13.7 శాతమని మంగళవారం వెలువడిన గణాంకాలు వెల్లడించాయి. ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో (ఏప్రిల్, మే) సెకండ్‌వేవ్ ప్రభావం లేకపోతే ఎకానమీ మరింత పురోగమించేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్యూ2లో 7.9 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలకన్నా అధికంగా తాజా గణాంకాలు వెలువడ్డం గమనార్హం. వివిధ సంస్థలు, రేటింగ్ సంస్థల అంచనాలు సైతం 7.8 శాతం నుంచి 8.3 శాతం శ్రేణిలోనే ఉన్నాయి. మరోవైపు రెండవ త్రైమాసికంలో ఈ స్థాయి గణాంకాల నమోదుకు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లో బేస్ ప్రధాన (బేస్ ఎఫెక్ట్) కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా సవాళ్లతో అప్పట్లో ఎకానమీ వృద్ధిలేకపోగా 7.4 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. విలువల్లో ఇలా... తాజా సమీక్షా త్రైమాసికం జూలై–సెప్టెంబర్ మధ్య ఎకానమీ విలువ రూ.35.73 లక్షల కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ రూ.32.96 లక్షల కోట్లు. వెరసి ఎకానమీ వృద్ధి రేటు 8.4 శాతంగా నమోదయ్యింది. కోవిడ్–19 సవాళ్లు దేశంలో ప్రారంభంకాని 2019–20 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఎకానమీ విలువతో పోల్చి చూస్తే, ఎకానమీ విలువ స్వల్పంగా 0.33 శాతం అధికంగా నమోదయ్యింది. కాగా, ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య ఎకానమీ విలువలు రూ.59.92 లక్షల కోట్ల నుంచి (2020–21 తొలి ఆరునెలల్లో) రూ.68.11 లక్షల కోట్లకు (13.7 శాతం వృద్ధి) పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో అసలు వృద్ధి లేకపోగా 15.9 శాతం క్షీణత నమోదయ్యింది. కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ♦తాజా సమీక్షా నెల్లో ప్రభుత్వ వ్యయాల్లో 8.7% వృద్ధి నమోదవడం, తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థ, పెరిగిన వినియోగం ఎకానమీ లో సానుకూలతను సృష్టించాయి. ♦తగిన వర్షపాతంలో జీడీపీలో దాదాపు 15 శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగం మంచి ఫలితాన్ని ఇచ్చింది. 4.5 శాతం వృద్ధి నమోదయ్యింది. ♦దేశీయ డిమాండ్, ఎగుమతులు పెరగడంతో తయారీ రంగంలో 5.5 శాతం పురోగతి నమోదయ్యింది. మొత్తం జీడీపీలో పారిశ్రామిక రంగం వాటా దాదాపు 15 శాతం అయితే, అందులో తయారీ రంగం వాటానే దాదాపు 78 శాతం. ♦నిర్మాణం, ట్రేడ్, హోటల్స్ రవాణా, ఫైనాన్షియల్ సేవల రంగాల్లో 7 నుంచి 8 శాతం వృద్ధి రేట్లు నమోదయ్యాయి. ♦ప్రభుత్వ సేవలు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ రంగాల్లో 17.4 శాతం వృద్ధి నమోదుకావడం సానుకూల పరిణామం. ♦ఇక ఉత్పత్తి స్థాయి వరకూ లెక్కించే జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్)లో వృద్ధి రేటు జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 8.5 శాతంగా నమోదయ్యింది. ♦కాగా, జూలై–సెప్టెంబర్ మధ్య చైనా వృద్ధి రేటు 4.9 శాతం. 2021–22పై అంచనాలు ఇలా... గడచిన ఆర్థిక సంవత్సరం (2020–21) కరోనా సవాళ్లతో ఎకానమీ 7.3 శాతం క్షీణతను నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే 2021–22లో వృద్ధి రేటు 11 శాతంగా ఉంటుందని ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఎకనమిక్ సర్వే పేర్కొంది. అయితే అటు తర్వాత ఏప్రిల్, మే నెలల్లో సెకండ్‌వేవ్ దేశాన్ని కుదిపివేసింది. ఈ నేపథ్యంలో ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 9.3 శాతం–9.6% శ్రేణిలో ఉంటుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. క్యూ3లో 6.8%, క్యూ4లో 6.1% వృద్ధి నమోదవుతుందని ఆర్బీఐ ఇటీవలి పాలసీ సమీక్ష పేర్కొంది. అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) మంగళవారం ఒక నివేదికను విడుదల చేస్తూ, 2021–22లో భారత్ ఎకానమీ 9.5 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందని అంచనా వేసింది. 2022–23 ఏడాదిలో ఈ రేటు 7.8% ఉంటుందని విశ్లేషించింది. రెండంకెల వృద్ధి దిశగా... భారత్ 2021–22 ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి దిశగా పయనిస్తోంది. డిమాండ్‌లో గణనీయ వృద్ధి, బ్యాంకింగ్ రంగం పురోగతి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. క్రితం త్రైమాసికాల్లో దాదాపు 6 శాతం వృద్ధి రేటు నమోదుకాగా, సెప్టెంబర్ వరకూ గడచిన త్రైమాసికాల్లో వృద్ధి రేటు 13.7 శాతం నమోదుకావడం హర్షణీయ పరిణామం. 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి రేట్లు వరుసగా 7 శాతం వరకూ ఉంటుందని భావిస్తున్నాం. కేంద్రం చేపడుతున్న రెండవ తరం ఆర్థిక సంస్కరణలు ఇందుకు దోహపడతాయని భావిస్తున్నాం. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, రుణ భారాల కట్టడికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. మూలధన వ్యయాల పెంపునకు కృషి జరుగుతుంది. – కేవీ సుబ్రమణియన్, ప్రధాన ఆర్థిక సలహాదారు -
పేటీఎంకు మరోసారి ఎదురు దెబ్బ..!
భారీ అంచనాలతో ఐపీవోకు వెళ్లిన పేటీఎంకు మార్కెట్లలో ఎదురుగాలి వీచింది. పేటీఎంను నష్టాలను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.కాగా కంపెనీ తాజాగా విడుదల చేసిన క్యూ2 ఫలితాల్లో కూడా భారీ నష్టాలను సొంతం చేసుకుంది. ఈ ఏడాది క్యూ2లో భారీ నష్టాలను మూటకట్టుకుంది. పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 481 కోట్ల 70 లక్షల రూపాయల నికర నష్టాలు వచ్చాయి. చదవండి: పేటీఎం అట్టర్ ప్లాప్‌షో.. 63 వేల కోట్లు మటాష్! ఇన్వెస్టర్లు లబోదిబో గత ఏడాదితో పాటుగా వరుసగా రెండో త్రైమాసికంలో నష్టాలను పొందడం వరుసగా ఇది రెండోసారి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనూ ఇదే స్థాయిలో నష్టాలను పేటీఎం రికార్డు చేసింది. (ఏప్రిల్-జూన్) క్యూ1లో 376 కోట్ల 60 లక్షల రూపాయల మేర నష్టాలను మూటకట్టుకుంది. ఇదిలా ఉండగా...కంపెనీ రెవెన్యూ గణీయంగా పెరిగింది. కోవిడ్-19 రాకతో డిజిటల్ చెల్లింపులు అధికమయ్యాయి. దీంతో పేటీఎం కార్యకలాపాలు రెట్టింపు స్ధాయిలో జరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆర్నెళ్లలో వన్ 97 కమ్యూనికేషన్స్ మొత్తంగా 1,086 కోట్ల 40 లక్షల రూపాయల మేర కార్యకలాపాలను రికార్డు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో 663 కోట్ల 90 లక్షల రూపాయలు నమోదుచేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆర్నెళ్లలో 64 శాతం మేర కంపెనీ కార్యకలాపాలు పెరిగాయి. ఫలితంగా కొంతమేర నష్టాలు తగ్గాయి. చదవండి: Paytm IPO: పేటీఎం ఢమాల్..! రూ.38 వేల కోట్ల లాస్ అతడి వాళ్లే..! నెటిజన్ల ఫైర్..! -
ఒలెక్ట్రాకు ఎంఎస్ఆర్టీసీ నుంచి 100 బస్సులకు ఆర్డరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్ఆర్టీసీ) నుంచి 100 ఎలక్ట్రిక్ లగ్జరీ బస్సులకు ఆర్డరు లభించినట్లు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం ఒలెక్ట్రా వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఒలెక్ట్రా, ఈవీ ట్రాన్స్ కన్సార్షియంనకు లెటర్ ఆఫ్ అవార్డ్ (ఎల్వోఏ) అందినట్లు తెలిపింది. ఈ కాంట్రాక్టు విలువ సుమారు రూ. 250 కోట్లు. రాబోయే 10 నెలల వ్యవధిలో వీటిని అందించాల్సి ఉంటుంది. ఈ బస్సులను ముంబై–పుణె మధ్య నడుపుతారు. కొత్త ఆర్డరుతో ఒలెక్ట్రా ఆర్డర్ల సంఖ్య 1,550కి చేరింది. మరోవైపు, సీతారాంపూర్ పారిశ్రామిక పార్కు ప్లాంటులో ఉత్పత్తి 2022–23 నుంచి ప్రారంభం కాగలదని ఒలెక్ట్రా చైర్మన్ కేవీ ప్రదీప్ వెల్లడించారు. అత్యాధునికమైన పూర్తి స్థాయి ఆటోమేటెడ్ ప్లాంటులో ఏటా 10,000 పైచిలుకు ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో ట్రక్కులు, త్రిచక్ర వాహనాలు, తేలికపాటి.. మధ్య స్థాయి వాణిజ్య వాహనాలు కూడా ఉత్పత్తి చేస్తామని తెలిపారు. దీనితో ఉపాధి అవకాశాలు పెరగగలవని, ఎకానమీ వృద్ధికి కూడా ఇతోధికంగా తోడ్పడగలదని ప్రదీప్ వివరించారు. ఒలెక్ట్రాకు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని సీతారాంపూర్ పారిశ్రామిక పార్కులో.. టీఎస్ఐఐసీ 150 ఎకరాల స్థలం కేటాయించింది. రూ. 69 కోట్లకు ఆదాయం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఆదాయం 38 శాతం పెరిగి రూ. 69 కోట్లకు చేరింది. గత క్యూ2లో ఇది రూ. 50 కోట్లు. 2020 రెండో త్రైమాసికంలో ఏడు బస్సులు సరఫరా చేయగా తాజా క్యూ2లో 18 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసినట్లు, పుణెలో కార్యకలాపాల ఊతంతో నిర్వహణ ఆదాయం మరింత పెరిగినట్లు సంస్థ తెలిపింది. ఎలక్ట్రిక్ బస్సుల విభాగం ఆదాయం రూ. 17.8 కోట్ల నుంచి రూ.42.1 కోట్లకు పెరగ్గా, ఇన్సులేటర్స్ విభాగం మాత్రం 17 శాతం క్షీణించిందని పేర్కొంది. సమీక్షాకాలంలో కంపెనీ నికర లాభం రూ. 2.3 కోట్ల నుంచి రూ. 3.71 కోట్లకు చేరింది. -
ఎంఅండ్ఎం లాభం హైజంప్
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం జులై–సెప్టెంబర్(క్యూ2)లో మూడు రెట్లు ఎగసి రూ. 1,929 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 615 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 19,227 కోట్ల నుంచి రూ. 21,470 కోట్లకు జంప్ చేసింది. ఇక స్టాండెలోన్ నికర లాభం మరింత అధికంగా 8 రెట్లు ఎగసి రూ. 1,432 కోట్లకు చేరింది. గతేడాది క్యూ2లో కేవలం రూ. 162 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం 15 శాతం పుంజుకుని రూ. 13,305 కోట్లయ్యింది. వాహన విక్రయాలు 9% పెరిగి 99,334 యూనిట్లను తాకాయి. అయితే ట్రాక్టర్ల విక్రయాలు 5% క్షీణించి 88,920 యూనిట్లకు పరిమితమయ్యాయి. మెరుగుపడే చాన్స్: 2022లోనూ సరఫరా సమస్యలు ఎదురయ్యే అవకాశమున్నట్లు ఎంఅండ్ఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జేజురికర్ పేర్కొన్నారు. అయితే 2021లో తలెత్తిన స్థాయిలో సవాళ్లకు అవకాశంలేదని భావిస్తున్నట్లు తెలియజేశారు. గత క్యూ2లో అధికస్థాయిలో ట్రాక్టర్ల విక్రయాలు నమోదుకావడం(బేస్ ఎఫెక్ట్)తో తాజా సమీక్షా కాలంలో గణాంకాలు మందగించినట్లు వెల్లడించారు. కాగా.. ఎక్స్‌యూవీ700 వాహనానికి భారీ డిమాండ్ నెలకొన్నట్లు ఎంఅండ్ఎం పేర్కొంది. 70,000 వాహనాలకుపైగా బుకింగ్స్ నమోదైనట్లు తెలియజేసింది. మేరు ట్రావెల్ సొల్యూషన్స్‌లో 100 శాతం వాటాను మహీంద్రా లాజిస్టిక్స్‌కు విక్రయించనున్నట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో ఎంఅండ్ఎం షేరు బీఎస్ఈలో 4% జంప్‌చేసి రూ. 893 వద్ద ముగిసింది. -
అదరగొట్టిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..!
ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 69 శాతం జంప్‌చేసి రూ. 8,890 కోట్లను తాకింది. ఇది ఒక త్రైమాసికానికి బ్యాంక్ చరిత్రలోనే అత్యధికంకాగా.. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 5,246 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 95,374 కోట్ల నుంచి రూ. 1,01,143 కోట్లకు ఎగసింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 67 శాతం ఎగసి రూ. 7,627 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 4,574 కోట్లు ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం 11 శాతం వృద్ధితో రూ. 31,184 కోట్లను తాకింది. ప్రొవిజన్లు తగ్గాయ్ క్యూ2లో ఎస్బీఐ స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏలు) 5.28 శాతం నుంచి 4.9 శాతానికి క్షీణించాయి. నికర ఎన్పీఏలు సైతం 1.59 శాతం నుంచి 1.52 శాతానికి మెరుగుపడ్డాయి. మొండి రుణాలకు కేటాయింపులు రూ. 5,619 కోట్ల నుంచి రూ. 2,699 కోట్లకు భారీగా తగ్గాయి. దేశీయంగా నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 0.16 శాతం బలపడి 3.5 శాతంగా నమోదయ్యాయి. కోవిడ్–19 అనిశ్చితుల నేపథ్యంలో తాజాగా చేపట్టిన రూ. 2,884 కోట్లతో కలిసి మొత్తం ప్రొవిజన్లు రూ. 6,181 కోట్లకు చేరాయి. సెప్టెంబర్‌కల్లా కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 13.35 శాతానికి చేరింది. రైట్ బ్యాక్ఇలా.. క్యూ2లో ఎస్బీఐ తాజా స్లిప్పేజీలు రూ. 4,176 కోట్లుకాగా.. రికవరీలు రూ. 7,407 కోట్లుగా నమోదయ్యాయి. డీహెచ్ఎఫ్ఎల్కు చేపట్టిన రూ. 4,000 కోట్ల ప్రొవిజన్లను రైట్‌బ్యాక్ చేసింది. మొత్తం ప్రొవిజన్లు 74 శాతంపైగా తగ్గి రూ. 3,034 కోట్లకు పరిమితమయ్యాయి. స్థూల అడ్వాన్సులు(రుణాలు) 6.2 శాతం పెరిగి రూ. 25,30,777 కోట్లను తాకాయి. డిపాజిట్లు దాదాపు 10% వృద్ధితో రూ. 38,09,630 కోట్లకు చేరాయి. షేరు జోరు... క్యూ2 ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ షేరు బీఎస్ఈలో 1.2 శాతం బలపడి రూ. 528 వద్ద ముగిసింది. తొలుత 4 శాతం జంప్‌చేసి రూ. 542ను అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం! లాభదాయకత అప్ క్యూ2లో పలు లాభదాయక అంశాలలో బ్యాంక్ పటిష్ట పనితీరు చూపింది. తద్వారా ఒక క్వార్టర్లో బ్యాంక్ చరిత్రలోనే అత్యధిక లాభం ఆర్జించింది. వసూళ్లు పుంజుకోవడం, అండర్‌రైటింగ్ మెరుగుపడటం వంటి అంశాలు భవిష్యత్ రుణ నాణ్యతపై ఆందోళనలకు చెక్ పెట్టాయి. ఇకపై రిటైల్ రుణాల్లో భారీ వృద్ధిని అంచనా వేస్తున్నాం. – దినేష్ ఖారా, చైర్మన్, ఎస్బీఐ -
నష్టాల్లో టాటా మోటార్స్
ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. గత ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.314 కోట్లతో పోలిస్తే టాటా మోటార్స్ ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.4,441 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు కంపెనీ రూ.4,450.92 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఇది ఇలా ఉంటే కంపెనీ ఆదాయం క్యూ2ఎఫ్ వై222లో సుమారు 15 శాతం పెరిగి రూ.61,379 కోట్లకు చేరుకుంది. గత ఏడాది క్యూ2ఎఫ్ వై21లో కంపెనీ ఆదాయం రూ.53,530 కోట్లగా ఉంది. త్రైమాసిక ఫలితాల ప్రకటనలో కంపెనీ ఏకీకృత ఈబీఐటీడీఏ మార్జిన్ 210 బేసిస్ పాయింట్లు(బిపిఎస్) 8.4 శాతానికి తగ్గిందని నివేదించింది. జెఎల్ఆర్ మార్జిన్ కూడా 380 బిపిఎస్ తగ్గి 7.3 శాతానికి పడిపోయింది. సరఫరా విషయంలో అంతరాయం, జాగ్వార్ & ల్యాండ్ రోవర్ అమ్మకాలు క్షీణించడం, కమోడిటీ ద్రవ్యోల్బణం ఈ త్రైమాసికంలో టాటా మోటార్స్ ఆదాయంపై ప్రభావం చూపాయి. గత ఏడాదితో పోలిస్తే భారతదేశంలో టాటా మోటార్స్ కార్యకలాపాలు బాగున్నాయని కంపెనీ తెలిపింది. ఎలక్ట్రిక్ కార్ల వ్యాపారం దాదాపు మూడు రెట్లు వృద్ధిని నమోదు చేసినట్లు తెలిపింది. సెమీకండక్టర్ సమస్యలు, కమోడిటీ ద్రవ్యోల్బణం వల్ల నష్టం వచ్చినట్లు పేర్కొంది. (చదవండి: దేశీయ ఈవీ మార్కెట్లో చైనా కారు విడుదల.. రేంజ్ ఎంతో తెలుసా?) -
ఆర్బీఐ అండతో 60 వేల పైకి..
ముంబై: ఆర్థిక వృద్ధికి కట్టుబడుతూ ఆర్బీఐ కమిటీ తీసుకున్న ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు స్టాక్ మార్కెట్‌ను మెప్పించాయి. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 381 పాయింట్లు పెరిగి 60 వేల స్థాయిపైన 60,059 వద్ద ముగిసింది. నిఫ్టీ 105 పాయింట్లు లాభపడి 17,895 వద్ద నిలిచింది. తాజా ముగింపు నిఫ్టీ సూచీకి జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. అధిక వెయిటేజీ రిలయన్స్ షేరు నాలుగు శాతానికి పైగా రాణించి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచింది. దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ క్యూ2 ఆర్థిక ఫలితాల ప్రకటనకు ముందు టెక్నాలజీ షేర్లు దుమ్ములేపాయి. ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఆయిల్‌అండ్‌గ్యాస్, ఆటో షేర్ల కౌంటర్లూ కొనుగోళ్లతో కళకళలాడాయి. అయితే ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆర్థిక, రియల్టీ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.64 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు 168 కోట్ల షేర్లను అమ్మారు. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 1293 పాయింట్లు, నిఫ్టీ 363 పాయింట్లు పెరిగాయి. అమెరికా ఉద్యోగ గణాంకాల వెల్లడికి ముందు(శుక్రవారం) అంతర్జాతీయ మార్కెట్లు స్తబ్ధుగా ట్రేడ్ అవుతున్నాయి. రెండు రోజుల్లో రూ.4.16 లక్షల కోట్లు... స్టాక్ మార్కెట్లో గడిచిన రెండో రోజుల్లో రూ.4.16 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.266.36 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్టానికి చేరినట్లైంది. ఈ రెండు రోజుల్లో సెన్సెక్స్ 869 పాయింట్లు, నిఫ్టీ 249 పాయింట్లు పెరిగింది. రిలయన్స్ నాలుగు శాతం జంప్... అమెరికాకు చెందిన 7–లెవెన్ కనీ్వనియెన్స్ తొలి స్టోర్‌ను అక్టోబర్ 9న ముంబైలో ప్రారంభించనున్నట్లు అనుబంధ సంస్థ ఆర్ఆర్వీఎల్ ప్రకటనతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు నాలుగు శాతం లాభపడి రూ.2,671 వద్ద ముగిసింది. -
అరబిందో- ఐబీ హౌసింగ్- క్యూ2 ఖుషీ
ముంబై: ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్ల 8 రోజుల వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. ప్రస్తుతం సెన్సెక్స్ 292 పాయింట్లు పతనమై 43,301కుచేరింది. నిఫ్టీ సైతం 62 పాయింట్లు క్షీణించి 12,687 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో హెల్త్‌కేర్ రంగ హైదరాబాద్ దిగ్గజం అరబిందో ఫార్మా కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో ఫలితాలు అంచనాలను చేరడంతో ఎన్బీఎఫ్సీ.. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ పతన మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. అరబిందో ఫార్మా ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో అరబిందో ఫార్మా నికర లాభం 26 శాతం ఎగసి రూ. 806 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 16 శాతం పెరిగి రూ. 6,483 కోట్లను అధిగమించాయి. వాటాదారులకు సైతం షేరుకి రూ. 1.25 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో అరబిందో ఫార్మా షేరు తొలుత ఎన్ఎస్ఈలో దాదాపు 7 శాతం దూసుకెళ్లి రూ. 864ను తాకింది. ప్రస్తుతం 5.3 శాతం జంప్‌చేసి రూ. 854 వద్ద ట్రేడవుతోంది. ఐబీ హౌసింగ్ ఫైనాన్స్ ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో ఐబీ హౌసింగ్ నికర లాభం 54 శాతం క్షీణించి రూ. 323 కోట్లకు పరిమితమైంది. అయితే త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే 18.5 శాతం పెరిగినట్లు నిపుణులు తెలియజేశారు. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 26 శాతం తక్కువగా రూ. 2,581 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో ఐబీ హౌసింగ్ ఫైనాన్స్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో దాదాపు 8 శాతం జంప్‌చేసి రూ. 174కు చేరింది. ప్రస్తుతం 7.3 శాతం లాభంతో రూ. 171 వద్ద ట్రేడవుతోంది. -
మయూర్- వీఎస్టీ టిల్లర్స్ జూమ్
ముంబై: తొలుత వరుసగా మూడో రోజు సరికొత్త గరిష్టాలను అందుకున్నదేశీ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం ఆటుపోట్ల మధ్య సానుకూలంగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో వీఎస్టీ టిల్లర్స్ ట్రాక్టర్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో అంచనాలకు తగిన పనితీరు చూపడంతోపాటు.. సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు బోర్డు అనుమతించిన వార్తలతో మయూర్ యూనికోటర్స్ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. వీఎస్టీ టిల్లర్స్ ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో వీఎస్టీ టిల్లర్స్ ట్రాక్టర్స్ నికర లాభం ఐదు రెట్లు ఎగసి రూ. 30 కోట్లకు చేరింది. నికర అమ్మకాలు సైతం 37 శాతం పెరిగి రూ. 220 కోట్లను తాకాయి. ఇబిటా మార్జిన్లు 5.9 శాతం బలపడి 17.1 శాతానికి చేరాయి. పవర్ టిల్లర్ అమ్మకాలు 41 శాతం అధికంగా 7,924 యూనిట్లను తాకగా.. ట్రాక్టర్ల విక్రయాలు సైతం 25 శాతం వృద్ధితో 2,751 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ కాలంలో కంపెనీ రూ. 140 కోట్ల నగదును సముపార్జించింది. ఫలితాల నేపథ్యంలో వీఎస్టీ షేరు తొలుత ఎన్ఎస్ఈలో దాదాపు 11 శాతం దూసుకెళ్లి రూ. 1,939ను తాకింది. ప్రస్తుతం 9 శాతం జంప్‌చేసి రూ. 1,911 వద్ద ట్రేడవుతోంది. మయూర్ యూనికోటర్స్ ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో మయూర్ యూనికోటర్స్ నికర లాభం 9 శాతం క్షీణించి రూ. 20 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 4 శాతం తక్కువగా రూ. 126 కోట్లను తాకింది. అయితే ఇబిటా మార్జిన్లు 5.6 శాతం బలపడి 23 శాతానికి చేరాయి. కాగా.. షేరుకి రూ. 400 ధర మించకుండా కంపెనీ ఈక్విటీలో 1.65 శాతం వాటాను బైబ్యాక్ చేసేందుకు బోర్డు అనుమతించినట్లు మయూర్ యూనికోటర్స్ తెలియజేసింది. ఇందుకు రూ. 30 కోట్లవరకూ వెచ్చించనుంది. ఈ నేపథ్యంలో మయూర్ యూనికోటర్స్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో దాదాపు 8 శాతం జంప్‌చేసి రూ. 275ను తాకింది. ప్రస్తుతం 4.5 శాతం లాభంతో రూ. 267 వద్ద ట్రేడవుతోంది. -
ఆస్ట్రల్ పాలీ జోష్- యాంబర్ డౌన్
ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో పీవీసి పైపుల కంపెనీ ఆస్ట్రల్ పాలీటెక్నిక్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో పనితీరు నిరాశపరచడంతో కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ యాంబర్ ఎంటర్ ప్రైజెస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి ఆస్ట్రల్ పాలీ టెక్నిక్ లాభాలతో కళకళలాడుతుంటే.. రికార్డుల మార్కెట్లోనూ యాంబర్ ఎంటర్ ప్రైజెస్ కౌంటర్ నష్టాలతో డీలా పడింది. వివరాలు చూద్దాం.. ఆస్ట్రల్ పాలీటెక్నిక్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆస్ట్రల్ పాలీటెక్నిక్ నికర లాభం దాదాపు 7 శాతం బలపడి రూ. 88 కోట్లను తాకింది. నికర అమ్మకాలు సైతం 10 శాతం పెరిగి రూ. 747 కోట్లను అధిగమించాయి. అధెసివ్స్ బిజినెస్ 29 శాతం ఎగసి రూ. 190 కోట్లకు చేరడం మెరుగైన పనితీరుకు దోహదం చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇబిటా మార్జిన్లు 2.2 శాతం పుంజుకుని 21 శాతాన్ని దాటాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఆస్ట్రల్ పాలీటెక్నిక్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 3 శాతం జంప్ చేసి రూ. 1,200 వద్ద ట్రేడవుతోంది. తొలుత 7.2 శాతం పురోగమించి రూ. 1,249ను తాకింది. యాంబర్ ఎంటర్ ప్రైజెస్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో యాంబర్ ఎంటర్ ప్రైజెస్ నికర లాభం 77 శాతం పడిపోయి రూ. 3 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 35 శాతం నీరసించి రూ. 408 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 1.34 శాతం క్షీణించి 4.8 శాతానికి చేరాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం యాంబర్ ఎంటర్ ప్రైజెస్ షేరు ఎన్ఎస్ఈలో 5.5 శాతం పతనమై రూ. 2,193 వద్ద ట్రేడవుతోంది. తొలుత 7.3 శాతం వెనకడుగుతో రూ. 2,150ను తాకింది. -
దివీస్ జూమ్- గ్లెన్ మార్క్ బోర్లా
ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో హెల్త్ కేర్ రంగ దిగ్గజాలు దివీస్ ల్యాబొరేటరీస్, గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్ సాధించిన ఫలితాలు ఈ కౌంటర్లపై విభిన్న ప్రభావాన్ని చూపుతున్నాయ. ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో దివీస్ ల్యాబ్స్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించగా.. గ్లెన్ మార్క్ పనితీరు నిరాశపరచింది. దీంతో దివీస్ కౌంటర్ కు డిమాండ్ నెలకొనగా.. గ్లెన్ మార్క్ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. వెరసి దివీస్ షేరు లాభాలతో సందడి చేస్తుంటే.. గ్లెన్ మార్క్ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. దివీస్ ల్యాబ్స్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో దివీస్ ల్యాబ్స్ నికర లాభం 45 శాతానికిపైగా జంప్ చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 519.6 కోట్లను తాకింది. నికర అమ్మకాలు సైతం 21 శాతం పెరిగి రూ. 1,749 కోట్లను అధిగమించాయి. క్యూ2లో పన్నుకు ముందు లాభం 42 శాతం ఎగసి రూ. 693 కోట్లను దాటింది. మొత్తం పన్ను వ్యయాలు దాదాపు 33 శాతం అధికంగా రూ. 174 కోట్లకు చేరాయి. ఈ కాలంలో రూ. 16 కోట్లమేర ఫారెక్స్ నష్టాలు నమోదైనట్లు దివీస్ వెల్లడించింది. ప్రస్తుత పెట్టుబడుల వ్యయ ప్రణాళికలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా మరో రూ. 400 కోట్లను వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం దివీస్ ల్యాబ్స్ షేరు ఎన్ఎస్ఈలో 4.6 శాతం జంప్ చేసి రూ. 3,386 వద్ద ట్రేడవుతోంది. తొలుత 6 శాతం పురోగమించి రూ. 3,435ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం. గ్లెన్ మార్క్ ఫార్మా ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్ నికర లాభం 8.4 శాతం క్షీణించి రూ. 234 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర అమ్మకాలు మాత్రం 5.2 శాతం పెరిగి రూ. 2,908 కోట్లను అధిగమించాయి. క్యూ2లో పన్నుకు ముందు లాభం 2 శాతం నీరసించి రూ. 339 కోట్లను తాకింది. మొత్తం పన్ను వ్యయాలు దాదాపు 33 శాతం అధికంగా రూ. 137 కోట్లకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం దివీస్ ల్యాబ్స్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం పతనమై రూ. 486 వద్ద ట్రేడవుతోంది. తొలుత 6.5 శాతం వెనకడుగుతో రూ. 479ను తాకింది. -
దివీస్ ల్యాబ్స్ Q2 భళా
ముంబై: ఫార్మా రంగ హైదరాబాద్ కంపెనీ దివీస్ ల్యాబొరేటరీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో కంపెనీ నికర లాభం 45 శాతానికిపైగా జంప్ చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 519.6 కోట్లను తాకింది. నికర అమ్మకాలు సైతం 21 శాతం పెరిగి రూ. 1,749 కోట్లను అధిగమించాయి. ఈ కాలంలో కంపెనీ కార్యకలాపాలు సాధారణ స్థాయికి చేరినట్లు దివీస్ ల్యాబ్స్ ఫలితాల విడుదల సందర్భంగా తెలియజేసింది. పీబీటీ జూమ్ క్యూ2లో దివీస్ ల్యాబ్స్ పన్నుకు ముందు లాభం(పీబీటీ) 42 శాతం ఎగసి రూ. 693 కోట్లను దాటింది. మొత్తం పన్ను వ్యయాలు దాదాపు 33 శాతం అధికంగా రూ. 174 కోట్లకు చేరాయి. ఈ కాలంలో రూ. 16 కోట్లమేర ఫారెక్స్ నష్టాలు నమోదైనట్లు దివీస్ వెల్లడించింది. ప్రస్తుత పెట్టుబడుల వ్యయ ప్రణాళికలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా మరో రూ. 400 కోట్లను వెచ్చించనున్నట్లు తెలియజేసింది. తద్వారా కస్టమ్ సింథసిస్ ప్రాజెక్టులలో కొత్త బిజినెస్ అవకాశాలను అందుకోనున్నట్లు పేర్కొంది. వీటిని త్వరితగతిన పూర్తి చేయవలసి ఉన్నట్లు వివరించింది. షేరు ఇలా ఏపీఐలు, ఇంటర్మీడియెట్స్ తదితర తయారీ కంపెనీ దివీస్ ల్యాబ్స్.. పలు దేశాలకు ప్రొడక్టులను ఎగుమతి చేస్తోంది. కాగా.. శుక్రవారం బీఎస్ఈలో దివీస్ ల్యాబ్స్ షేరు 1 శాతం బలపడి రూ. 3,238 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 3,265 వద్ద గరిష్టాన్ని తాకగా.. 3,189 దిగువన కనిష్టానికి చేరింది. ఈ ఏడాది ఇప్పటివరకూ దివీస్ షేరు 75 శాతంపైగా లాభపడటం గమనార్హం. -
బిర్లా కార్పొరేషన్- జిందాల్ హిసార్.. భళా
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో డైవర్సిఫైడ్ కంపెనీ బిర్లా కార్పొరేషన్ కౌంటర్‌కు డిమాండ్ నెలకొంది. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో మెటల్ రంగ కంపెనీ జిందాల్ స్టెయిన్లెస్(హిసార్) కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి.. వివరాలు చూద్దాం.. బిర్లా కార్పొరేషన్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో బిర్లా కార్పొరేషన్ నికర లాభం 87 శాతం ఎగసి రూ. 166 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 2 శాతమే పెరిగి రూ. 1,675 కోట్లను అధిగమించింది. ఫలితాల నేపథ్యంలో బిర్లా కార్పొరేషన్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 9.6 శాతం జంప్‌చేసి రూ. 705కు చేరింది. ప్రస్తుతం 4.5 శాతం లాభంతో రూ. 671 వద్ద ట్రేడవుతోంది. జిందాల్ స్టెయిన్లెస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో జిందాల్ స్టెయిన్లెస్(హిసార్) రూ. 111 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ2తో పోలిస్తే ఇది 35 శాతం అధికంకాగా.. మొత్తం ఆదాయం 5 శాతం పుంజుకుని రూ. 2,076 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు యథాతథంగా 12 శాతం వద్దే నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో జిందాల్ హిసార్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 7 శాతం జంప్ చేసి రూ. 104 వద్ద ట్రేడవుతోంది. -
అపోలో పైప్స్- కేఎస్బీ.. యమ స్పీడ్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో పీవీసీ పైపుల తయారీ కంపెనీ అపోలో పైప్స్ కౌంటర్‌కు భారీ డిమాండ్ నెలకొంది. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో పంప్ సెట్ల దిగ్గజం కేఎస్బీ లిమిటెడ్ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. అపోలో పైప్స్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో అపోలో పైప్స్ నికర లాభం 64 శాతం ఎగసి రూ. 9.5 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 28 శాతం పుంజుకుని రూ. 123 కోట్లను అధిగమించింది. అమ్మకాల పరిమాణం 19 శాతం పెరిగి 12,268 టన్నులను తాకింది. ఇబిటా మార్జిన్లు 1.55 శాతం మెరుగుపడి 14.19 శాతానికి చేరాయి. పీవీసీ, హెచ్డీపీఈ పైపులకు పెరిగిన డిమాండ్ కారణంగా పటిష్ట పనితీరును సాధించినట్లు కంపెనీ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో అపోలో పైప్స్ షేరు ప్రస్తుతం 14 శాతం దూసుకెళ్లి రూ. 595 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 598ను అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. వారం రోజుల్లో 29 శాతం ర్యాలీ చేసింది. కేఎస్బీ లిమిటెడ్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో కేఎస్బీ లిమిటెడ్ నికర లాభం రూ. 26 కోట్ల నుంచి రూ. 43 కోట్లకు ఎగసింది. అయితే కన్సాలిడేటెడ్ ప్రాదిపదికన మొత్తం ఆదాయం నామమాత్రంగా తగ్గి రూ. 362 కోట్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో కేఎస్బీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 10.4 శాతం జంప్‌చేసి రూ. 509 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 17 శాతం దూసుకెళ్లి రూ. 540కు చేరింది. -
బీఏఎస్ఎఫ్- బజాజ్ ఎలక్ట్రికల్స్ జోరు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో స్పెషాలిటీ కెమికల్స్ రంగ దిగ్గజం బీఏఎస్ఎఫ్ ఇండియా కౌంటర్‌కు డిమాండ్ నెలకొంది. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించడంతో ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ కంపెనీ బజాజ్ ఎలక్ట్రికల్స్ కౌంటర్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. బీఏఎస్ఎఫ్ ఇండియా ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో బీఏఎస్ఎఫ్ ఇండియా నికర లాభం రూ. 412 కోట్లను అధిగమించింది. గతేడాది(2019-20) క్యూ2లో కేవలం రూ. 2.3 కోట్ల లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం రూ. 2067 కోట్ల నుంచి రూ. 2,463 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో కన్ స్ట్రక్షన్ కెమికల్స్ బిజినెస్ విక్రయం ద్వారా రూ. 465 కోట్లకుపైగా లాభం ఆర్జించింది. ఫలితాల నేపథ్యలో ప్రస్తుతం బీఏఎస్ఎఫ్ షేరు 13 శాతం దూసుకెళ్లి రూ. 1,525 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 15 శాతంపైగా ర్యాలీ చేసింది. రూ. 1,557ను అధిగమించింది. బజాజ్ ఎలక్ట్రికల్స్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో బజాజ్ ఎలక్ట్రికల్స్ రూ. 53 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ2లో రూ. 36.5 కోట్ల నికర నష్టం ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 11 శాతం పెరిగి రూ. 1,218 కోట్లకు చేరింది. రూ. 73 కోట్ల ఇబిటా ఆర్జించింది. గత క్యూ2లో రూ. 29 కోట్ల పన్నుకు ముందు నష్టం నమోదైంది. ఈ నేపథ్యంలో బజాజ్ ఎలక్ట్రికల్స్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం జంప్ చేసి రూ. 510 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 515 వరకూ ఎగసింది. -
హెచ్ పీసీఎల్ బైబ్యాక్- ఎస్ఆర్ఎఫ్ జోష్
సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు బోర్డు అనుమతించినట్లు వెల్లడించడంతో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్ పీసీఎల్) కౌంటర్ వెలుగులోకి వచ్చింది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో విభిన్న స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీ ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. హెచ్ పీసీఎల్ ఒక్కో షేరుకి రూ. 250 ధర మించకుండా 10 కోట్ల షేర్లవరకూ కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదముద్ర వేసినట్లు హెచ్ పీసీఎల్ తాజాగా వెల్లడించింది. ఇది కంపెనీ ఈక్విటీలో 6.56 శాతం వాటాకు సమానంకాగా.. బైబ్యాక్ కోసం రూ. 2,500 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. కాగా.. ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో కంపెనీ నికర లాభం రూ. 1052 కోట్ల నుంచి రూ. 2,477 కోట్లకు ఎగసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం రూ. 66,165 కోట్ల నుంచి రూ. 61,340 కోట్లకు నీరసించింది. క్యూ2లో స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 5.11 డాలర్లకు చేరాయి. ఈ నేపథ్యంలో హెచ్ పీసీఎల్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 7.5 శాతం జంప్ చేసి రూ. 201 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 203 వరకూ లాభపడింది. ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఎస్ఆర్ఎఫ్ నికర లాభం 57 శాతం పెరిగి రూ. 316 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 21 శాతం బలపడి రూ. 1,738 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ఎస్ఆర్ఎఫ్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 7.2 శాతం జంప్ చేసి రూ. 4,763 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 4,789 వరకూ లాభపడింది. ఈ కౌంటర్లో సగటు ట్రేడింగ్ పరిమాణం 4,980 షేర్లుకాగా.. తొలి రెండు గంటల్లో రెండు రెట్లు అధికంగా 11,100 షేర్లు చేతులు మారాయి. -
సన్ ఫార్మా- ఉత్తమ్ గాల్వా.. భళా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో హెల్త్‌కేర్ రంగ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతోంది. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించడంతో మెటల్ రంగ కంపెనీ ఉత్తమ్ గాల్వా స్టీల్ కౌంటర్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టారు. వెరసి సన్ ఫార్మా కౌంటర్ వరుసగా రెండో రోజు లాభాలతో సందడి చేస్తుంటే.. ఉత్తమ్ గాల్వా అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. వివరాలు చూద్దాం.. సన్ ఫార్మాస్యూటికల్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో సన్ ఫార్మాస్యూటికల్ నికర లాభం 70 శాతం ఎగసి రూ. 1,813 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 5 శాతమే పెరిగి రూ. 8,553 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 3.6 శాతం మెరుగుపడి 25.6 శాతాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో సన్ ఫార్మా షేరు ఎన్ఎస్ఈలో తొలుత 6.5 శాతం జంప్‌చేసి రూ. 518ను అధిగమించింది. ప్రస్తుతం 5 శాతం లాభంతో రూ. 508 వద్ద ట్రేడవుతోంది. వెరసి గత రెండు రోజుల్లో ఈ షేరు 11 శాతంపైగా ర్యాలీ చేసింది. ఉత్తమ్ గాల్వా స్టీల్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఉత్తమ్ గాల్వా స్టీల్ రూ. 19.3 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ2లో రూ. 335 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం రూ. 142 కోట్ల నుంచి రూ. 195 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు రూ. 321 కోట్ల నుంచి రూ. 176 కోట్లకు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఉత్తమ్ గాల్వా షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 6.50 వద్ద ఫ్రీజయ్యింది. కాగా.. కంపెనీకి సంబంధించి కార్పొరేట్ రుణచెల్లింపుల రిజల్యూషన్ చేపట్టేందుకు ఎస్బీఐకు ఎన్సీఎల్టీ అనుమతించింది. -
ఎస్బీఐ నికర లాభం జూమ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. స్టాండెలోన్ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో నికర లాభం 52 శాతం ఎగసింది. రూ. 4,574 కోట్లను అధిగమించింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 14.6 శాతం వృద్ధితో రూ. 28,182 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 3.4 శాతం పెరిగి రూ. 75,342 కోట్లకు చేరింది. జీవిత బీమా అనుబంధ సంస్థలో వాటా విక్రయం కారణంగా ప్రొవిజన్లకు ముందు నిర్వహణ లాభం మెరుగుపడినట్లు బ్యాంక్ పేర్కొంది. పన్నుకుముందు లాభం 25 శాతం పుంజుకుని రూ. 6,341 కోట్లను దాటింది. ప్రొవిజన్లు 23 శాతం తక్కువగా రూ. 10,118 కోట్లకు చేరాయి. ఎన్పీఏలు ఓకే క్యూ2లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 5.44 శాతం నుంచి 5.28 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 1.86 శాతం నుంచి 1.59 శాతానికి క్షీణించాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎస్బీఐ షేరు ఎన్ఎస్ఈలో 0.7 శాతం క్షీణించి రూ. 203 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 206 వద్ద గరిష్టాన్ని తాకగా.. 201 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. -
Q2 ఎఫెక్ట్- కేర్ రేటింగ్స్ దూకుడు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో రేటింగ్స్ దిగ్గజం.. కేర్ రేటింగ్స్ కౌంటర్‌కు భారీ డిమాండ్ నెలకొంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో ఈ షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. కొనుగోలుదారులు అధికంకాగా.. అమ్మేవాళ్లు కరువుకావడంతో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం రూ. 61 జంప్‌చేసి రూ. 365.4 వద్ద ఫ్రీజయ్యింది. ఈ కౌంటర్లో ట్రేడింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లోనే ఏకంగా 6.29 మిలియన్ షేర్లు చేతులు మారాయి. ఇది కంపెనీ మొత్తం ఈక్విటీలో 21 శాతం వాటాకాగా.. 15 రెట్లు అధిక పరిమాణం నమోదుకావడం గమనార్హం! రెండు ఎక్స్ఛేంజీలలోనూ కలిపి 4 లక్షలకుపైగా కొనుగోలు ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. పనితీరు భేష్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో కేర్ రేటింగ్స్ నికర లాభం నాలుగు రెట్లు ఎగసి రూ. 36 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 76 కోట్లను తాకింది. త్రైమాసిక ప్రాతిపదికన విడుదల చేసిన ఫలితాలివి. వాటాదారులకు షేరుకి రూ. 8 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ప్రభుత్వ వ్యయాలు పెరగనుండటం, బాండ్ మార్కెట్ల పురోగతి, ప్రైవేట్ పెట్టుబడులు వంటి అంశాలు ఇకపై కంపెనీ పనితీరు మరింత మెరుగు పడేందుకు దోహదపడనున్నట్లు కేర్ రేటింగ్స్ సీఈవో అజయ్ మహాజన్ పేర్కొన్నారు. -
హావెల్స్ రికార్డ్- అశోక్ లేలాండ్ అదుర్స్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ కంపెనీ హావెల్స్ ఇండియా కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోవైపు ఈ అక్టోబర్ నెలలో అమ్మకాలు జోరందుకోవడంతో ఆటో రంగ కంపెనీ అశోక్ లేలాండ్ కౌంటర్‌కు సైతం డిమాండ్ కనిపిస్తోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. హావెల్స్ ఇండియా ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో హావెల్స్ ఇండియా నికర లాభం 80 శాతం జంప్‌చేసి రూ. 325 కోట్లను తాకింది. స్టాండెలోన్ ప్రాతిపదికన నికర ఆదాయం 10 శాతం పెరిగి రూ. 2,452 కోట్లకు చేరింది. ఇబిటా 79 శాతం ఎగసి రూ. 421 కోట్లయ్యింది. ఇబిటా మార్జిన్లు 6.7 శాతం బలపడి 17.2 శాతాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో హావెల్స్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో 4.5 శాతం జంప్‌చేసి రూ. 816 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 827 వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. గత మూడు రోజుల్లో ఈ షేరు 14 శాతం లాభపడింది. తాజాగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 51,000 కోట్లను అధిగమించింది. అశోక్ లేలాండ్ ఈ అక్టోబర్ నెలలో అశోక్ లేలాండ్ 1 శాతం అధికంగా 9,989 వాహనాలను విక్రయించింది. ఇందుకు ఎల్‌సీవీలు, ట్రక్కుల విక్రయాలలో 14 శాతం నమోదైన వృద్ధి సహకరించింది. అయితే మధ్య, భారీస్థాయి వాహన విక్రయాలు 11 శాతం క్షీణించాయి. అయితే నెలవారీగా చూస్తే మొత్తం అమ్మకాల పరిమాణం 20 శాతం వృద్ధి చూపినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఎల్‌సీవీలు, వాణిజ్య వాహనాలకు దేశీయంగా డిమాండ్ పెరుగుతున్నట్లు తెలియజేశారు. సెప్టెంబర్‌లో కంపెనీ 8,344 యూనిటన్లు విక్రయించింది. ఈ నేపథ్యంలో అశోక్ లేలాండ్ షేరు ఎన్ఎస్ఈలో 3 శాతం బలపడి రూ. 85 వద్ద ట్రేడవుతోంది. తద్వారా జనవరిలో నమోదైన ఏడాది గరిష్టం రూ. 87.5కు చేరువైంది. గత మూడు నెలల్లో ఈ షేరు 72 శాతం ర్యాలీ చేయడం విశేషం! -
క్యాడిలా హెల్త్‌కేర్- హెచ్డీఎఫ్సీ.. జోరు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతోంది. కాగా.. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరంక్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆకర్షణీయ పనితీరు చూపడంతో ఫార్మా రంగ కంపెనీ క్యాడిలా హెల్త్‌కేర్ కౌంటర్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ఈ ఏడాది క్యూ2లో రూ. 2,870 కోట్ల నికర లాభంఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ2తో పోలిస్తే ఇది 28 శాతం క్షీణతకాగా.. గతంలో పెట్టుబడుల విక్రయం ద్వారా డివిడెండ్ ఆదాయం భారీగా లభించడంతో లాభాలు పెరిగినట్లు విశ్లేషకులు తెలియజేశారు. కాగా.. నికర వడ్డీ ఆదాయం 21 శాతం ఎగసి రూ. 3,647 కోట్లను తాకింది. నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) 10 శాతంపైగా పెరిగి రూ. 5.4 ట్రిలియన్లను తాకింది. వీటిలో వ్యక్తిగత రుణాల వాటా 75 శాతం. స్థూల మొండిబకాయిలు(జీఎన్‌పీఏలు) 6 బేసిస్ పాయింట్లు తగ్గి 1.81 శాతానికి చేరాయి. ఈ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 4 శాతం జంప్‌చేసి రూ. 2,119ను తాకింది. ఇది మార్చి 13 తదుపరి గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 2,104 వద్ద ట్రేడవుతోంది. గత రెండు రోజుల్లో ఈ షేరు 10 శాతం ర్యాలీ చేయడం గమనార్హం. క్యాడిలా హెల్త్‌కేర్ ఈ ఏడాది క్యూ2లో క్యాడిలా హెల్త్‌కేర్ నికర లాభం సర్దుబాట్ల తదుపరి 73 శాతం ఎగసింది. రూ. 562 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 13 శాతంపైగా వృద్ధితో రూ. 3,820 కోట్లకు చేరింది. యూఎస్ మార్కెట్లలో అమ్మకాలు 18 శాతం పుంజుకుని రూ. 1,709 కోట్లుగా నమోదయ్యాయి. దేశీయంగా ఫార్ములేషన్ల అమ్మకాలు సైతం 11 శాతం అధికంగా రూ. 1,087 కోట్లకు చేరాయి. ఈ నేపథ్యంలో క్యాడిలా షేరు ఎన్ఎస్ఈలో తొలుత 13 శాతం దూసుకెళ్లింది. రూ. 464 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 7 శాతం లాభపడి రూ. 438 వద్ద ట్రేడవుతోంది. -
ఎన్టీపీసీ షేర్ల బైబ్యాక్ @ రూ. 2,276 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్టీపీసీ రూ. 2,276 కోట్ల విలువ చేసే షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు సంస్థ బోర్డు సోమవారం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం షేరు ఒక్కింటికి రూ. 115 చొప్పున మొత్తం 19.78 కోట్ల దాకా షేర్లను కంపెనీ కొనుగోలు చేయనుంది. దీనికోసం నవంబర్ 13 రికార్డు తేదీగా ఎన్టీపీసీ నిర్ణయించింది. మరోవైపు, సీఎండీ గుర్దీప్ సింగ్ పదవీకాలాన్ని 2025 జూలై 31 దాకా పొడిగించే ప్రతిపాదనకు ఎన్టీపీసీ బోర్డు ఆమోదం తెలిపింది. 2021 ఫిబ్రవరి 4 నుంచి పొడిగించిన పదవీకాలం అమల్లోకి వస్తుంది. 2016 ఫిబ్రవరి 4న ఆయన ఎన్టీపీసీ చైర్మన్, ఎండీగా బాధ్యతలు చేపట్టారు. 1987లో ఎన్టీపీసీలో ఇంజనీర్ ట్రెయినీగా కెరియర్ ప్రారంభించిన గుర్దీప్ సింగ్ ఆ తర్వాత పలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. క్యూ2లో నికర లాభం 8 శాతం డౌన్ .. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్టీపీసీ నికర లాభం (కన్సాలిడేటెడ్) సుమారు 8 శాతం క్షీణించి రూ. 3,495 కోట్లకు పరిమితమైంది. గత క్యూ2లో లాభం రూ. 3,788 కోట్లు. ఇక తాజా క్యూ2లో ఆదాయం రూ. 26,569 కోట్ల నుంచి రూ. 28,678 కోట్లకు చేరింది. సమీక్షాకాలంలో విద్యుదుత్పత్తి స్థూలంగా 61.64 బిలియన్ యూనిట్ల (బీయూ) నుంచి 67.67 బీయూకి పెరిగింది. సెప్టెంబర్ ఆఖరు నాటికి స్థాపిత సామర్థ్యం 57,106 మెగావాట్ల నుంచి 62,910 మెగావాట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో సగటున విద్యుత్ టారిఫ్ యూనిట్‌కు రూ. 3.86గా ఉన్నట్లు ఎన్టీపీసీ తెలిపింది. సోమవారం బీఎస్ఈలో ఎన్టీపీసీ షేరు సుమారు రెండు శాతం పెరిగి రూ. 89.25 వద్ద క్లోజయ్యింది. -
ఐసీఐసీఐ, డీఎల్ఎఫ్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ జూమ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ, రియల్టీ రంగ బ్లూచిప్ కంపెనీ డీఎల్ఎఫ్ లిమిటెడ్, ఎన్బీఎఫ్సీ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి ఒడిదొడుకుల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఐసీఐసీఐ బ్యాంక్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం ఆరు రెట్లు ఎగసి రూ. 4,251 కోట్లను తాకింది. స్టాండెలోన్ ప్రాతిపదికన నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 16 శాతం పెరిగి రూ. 9,366 కోట్లకు చేరింది. అయితే నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 3.64 శాతం నుంచి 3.57 శాతానికి స్వల్పంగా బలహీనపడ్డాయి. ఈ కాలంలో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 6.37 శాతం నుంచి 5.17 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 1.6 శాతం నుంచి 1 శాతానికి వెనకడుగు వేశాయి. దీంతో ఎన్ఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు ప్రస్తుతం 7.3 శాతం జంప్‌చేసి రూ. 421 వద్ద ట్రేడవుతోంది. డీఎల్ఎఫ్ లిమిటెడ్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో డీఎల్ఎఫ్ లిమిటెడ్ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. క్యూ2లో రూ. 236 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ2లో రూ. 72 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం మూడు రెట్లు పెరిగి రూ. 1,723 కోట్లకు చేరింది. ఇబిటా రూ. 100 కోట్ల నుంచి రూ. 576 కోట్లకు ఎగసింది. క్యూ2లో నికర అమ్మకాల బుకింగ్స్ రూ. 152 కోట్ల నుంచి రూ. 853 కోట్లకు పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో డీఎల్ఎఫ్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 5.3 శాతం జంప్‌చేసి రూ. 167 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 171 వరకూ లాభపడింది. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ రూ. 985 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం రూ. 2,022 కోట్లుగా నమోదైంది. ఇవి గతేడాది క్యూ2తో పోలిస్తే స్వల్పంగా తగ్గినప్పటికీ అంచనాలకంటే మెరుగైన ఫలితాలేనని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ కాలంలో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 8 శాతం నుంచి 6.42 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 5.1 శాతం నుంచి 3.64 శాతానికి వెనకడుగు వేశాయి. నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 4.8 శాతం ఎగసి రూ. 1.13 ట్రిలియన్లను తాకాయి. ఈ నేపథ్యంలో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 9 శాతం జంప్‌చేసి రూ. 755 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 763 వరకూ దూసుకెళ్లింది. -
ఆస్టెక్ లైఫ్- బ్లూడార్ట్.. ఎక్స్‌ప్రెస్ స్పీడ్
ఉదయం సెషన్లో జోరందుకున్న దేశీ స్టాక్ మార్కెట్లు మిడ్‌సెషన్‌కల్లా పతన బాట పట్టాయి. తొలుత లాభాల డబుల్ సెంచరీ చేసిన సెన్సెక్స్ ప్రస్తుతం 328 పాయింట్లు కోల్పోయింది. 39,422కు చేరింది. నిఫ్టీ సైతం 82 పాయింట్ల నష్టంతో 11,589ను తాకింది. ఈ నేపథ్యంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఓవైపు బ్లూడార్ట్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్.. మరోపక్క హెల్త్‌కేర్ రంగ కంపెనీ ఆస్టెక్ లైఫ్‌సైన్సెస్ కౌంటర్లు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కంపెనీల షేర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. బ్లూడార్ట్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో బ్లూడార్ట్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ నికర లాభం 189 శాతం జంప్‌చేసి రూ. 42 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 8 శాతం పెరిగి రూ. 867 కోట్లకు చేరింది. పన్నుకు ముందు లాభం 17.5 శాతం పుంజుకుని రూ. 57 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో బ్లూడార్ట్ ఎక్స్‌ప్రెస్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 16 శాతం దూసుకెళ్లి రూ. 3,767కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 11 శాతం లాభంతో రూ. 3,603 వద్ద ట్రేడవుతోంది. ఆస్టెక్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆస్టెక్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్ నికర లాభం 238 శాతం జంప్‌చేసి రూ. 18 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 11 శాతం పెరిగి రూ. 155 కోట్లను తాకింది. పన్నుకు ముందు లాభం 205 శాతం ఎగసి రూ. 24 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ఆస్టెక్ లైఫ్‌సైన్సెస్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 9 శాతం దూసుకెళ్లి రూ. 1,185కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 7.2 శాతం లాభంతో రూ. 1,168 వద్ద ట్రేడవుతోంది. -
సెక్యూరిటీ ఇంటెలిజెన్స్- చోళమండలం భళా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఓవైపు సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఇండియా.. మరోపక్క చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కౌంటర్లు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కంపెనీల షేర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఎస్ఐఎస్ ఇండియా లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఎస్ఐఎస్ ఇండియా లిమిటెడ్ నికర లాభం 42 శాతం జంప్‌చేసి రూ. 108 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 33 శాతం పెరిగి రూ. 2,158 కోట్లను తాకింది. పటిష్ట క్యాష్‌ఫ్లో కారణంగా ఈ కాలంలో రూ. 213 కోట్లమేర రుణాలను తిరిగి చెల్లించినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎస్ఐఎస్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 14 శాతం దూసుకెళ్లి రూ. 404కు చేరింది. ప్రస్తుతం 7.2 శాతం లాభంతో రూ. 381 వద్ద ట్రేడవుతోంది. చోళమండలం ఇన్వెస్ట్మెంట్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో చోళమండలం ఇన్వెస్ట్మెంట్ నికర లాభం 41 శాతం జంప్‌చేసి రూ. 432 కోట్లకు చేరింది. ఇందుకు బలపడ్డ నికర వడ్డీ మార్జిన్లు, నిర్వహణ వ్యయాలు తగ్గడం సహకరించినట్లు తెలియజేసింది. ఆస్తుల నాణ్యతకు సంబంధించి స్టేజ్-3 రుణాలు 2.75 శాతంగా నమోదుకాగా.. ప్రొవిజన్ కవరేజీ నిష్పత్తి 42.65కు చేరినట్లు పేర్కొంది. ప్రాపర్టీలపై రుణాల బిజినెస్ నామమాత్రంగా క్షీణించి రూ. 1,052 కోట్లను తాకింది. రూ. 6,802 కోట్ల నగదు నిల్వల ద్వారా పటిష్ట లిక్విడిటీని కలిగి ఉన్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో చోళమండలం షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 9 శాతం దూసుకెళ్లి రూ. 273 వద్ద ట్రేడవుతోంది. -
హెచ్‌పీసీఎల్, ఏంజెల్ బ్రోకింగ్.. భేష్
స్వల్ప ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 168 పాయింట్లు పెరిగి 39,918కు చేరగా.. నిఫ్టీ 63 పాయింట్లు బలపడి 11,734 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా ఓవైపు ఇంధన రంగ పీఎస్‌యూ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్), మరోపక్క ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కంపెనీల షేర్లూ భారీ లాభాలతో దూకుడు చూపుతున్నాయి. వివరాలు చూద్దాం.. హెచ్‌పీసీఎల్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు ప్రతిపాదించినట్లు చమురు రిఫైనరీ దిగ్గజం హెచ్‌పీసీఎల్ తాజాగా పేర్కొంది. ఈ అంశంపై వచ్చే నెల 4న(బుధవారం) సమావేశంకానున్న కంపెనీ బోర్డు చర్చించనున్నట్లు తెలియజేసింది. అదేరోజు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక ఫలితాలను సైతం విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్- జూన్)లో హెచ్‌పీసీఎల్ నికర లాభం 157 శాతం దూసుకెళ్లి రూ. 2,253 కోట్లకు చేరగా.. నికర అమ్మకాలు మాత్రం 47 శాతం క్షీణించి రూ. 37,559 కోట్లకు పరిమితమైన విషయం విదితమే. కాగా.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో హెచ్‌పీసీఎల్ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 189 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 190 వరకూ పెరిగింది. ఏంజెల్ బ్రోకింగ్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఇటీవల జోరు చూపుతున్న ఏంజెల్ బ్రోకింగ్ కౌంటర్‌కు మరోసారి డిమాండ్ నెలకొంది. కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ బల్క్‌డీల్ ద్వారా కంపెనీలో 0.53 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడం దీనికి కారణమైంది. షేరుకి రూ. 321.73 ధరలో 4.3 లక్షల ఈక్విటీ షేర్లను సొంతం చేసుకున్నట్లు ఎన్ఎస్ఈ డేటా పేర్కొంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఏంజెల్ బ్రోకింగ్ షేరు 12.5 శాతం దూసుకెళ్లి రూ. 367 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 17 జంప్‌చేసి రూ. 379ను తాకింది. గత నాలుగు రోజుల్లో ఏంజెల్ బ్రోకింగ్ షేరు 52 శాతం ర్యాలీ చేసింది. ఇందుకు క్యూ2 ఫలితాలు దోహదం చేస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. క్యూ2లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా దాదాపు రూ. 75 కోట్ల నికర లాభం ఆర్జించిన విషయం విదితమే. -
రెండో రోజూ అమ్మకాలే..!
ముంబై: ప్రపంచవ్యాప్తంగా తిరిగి పెరుగుతున్న కరోనా కేసుల భయం భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపింది. ఫలితంగా బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా రెండోరోజూ నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్ఫ్రా రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో గురువారం సెన్సెక్స్ 173 పాయింట్లు నష్టపోయి 39,750 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 59 పాయింట్లను కోల్పోయి 11,700 దిగువున 11,671 వద్ద నిలిచింది. డాలర్ మారకంలో రూపాయి క్షీణత కొనసాగడం, బ్లూచిప్ కంపెనీల క్యూ2 ఫలితాలు మార్కెట్‌ను మెప్పించకపోవడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నష్టాల ట్రేడింగ్ మన మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అక్టోబర్ డెరివేటివ్ సిరీస్ గడువు ముగియడంతో ట్రేడర్లు పొజిషన్లను రోలోవర్ చేసుకోవడంతో సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. రూపాయి పతనంతో ఒక్క ఐటీ షేర్లు స్వల్పంగా లాభాలను ఆర్జించగలిగాయి. మిగిలిన అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,524 – 40,011 రేంజ్ కదలాడింది. నిఫ్టీ 11,606 – 11,744.15 పరిధిలో ఊగిసలాడింది. దేశీయ స్టాక్ మార్కెట్ దృష్టి ఇప్పుడు కంపెనీల క్యూ2 ఫలితాల నుంచి అంతర్జాతీయ పరిణామాల వైపు మళ్లింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తిరిగి పెరగడం, అమెరికా ఎన్నికలపై, ఉద్దీపన ప్యాకేజీ ప్రకటనపై సందిగ్ధత కొనసాగడం లాంటి ప్రతికూలాంశాలు ఇప్పుడిప్పుడే రికవరి అవుతున్న ఆర్థిక వ్యవస్థలో ఆందోళనలను రేకెత్తించాయి. ఈక్విటీల్లో నెలకొన్న బలహీనత స్వల్పకాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పలు దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఉద్దీపన ప్యాకేజీల ప్రకటనలతో పాటు వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో మార్కెట్లు తిరిగి పుంజుకునే అవకాశం ఉంది.’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. బలహీనంగా ప్రపంచమార్కెట్లు... అమెరికా అనిశ్చితులతో పాటు రోజు వారీగా కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతుండడంతో ప్రపంచమార్కెట్లు బలహీనంగా కదులుతున్నాయి. కోవిడ్–19 కేసుల కట్టడికి యూరప్‌లో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలతో పాటు పలు దేశాల్లో లాక్డౌన్ ఆంక్షలు విధించారు. లాక్డౌన్ విధింపుతో ఆర్థిక వృద్ధి ఆందోళనలు ఈక్విటీ మార్కెట్లను కలవరపెట్టాయి. ఫలితంగా గురువారం ఆసియాలో ఒక్క చైనా తప్ప మిగిలిన అన్ని దేశాల ఇండెక్స్‌లు 0.5% నుంచి 1% నష్టంతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు అరశాతం క్షీణించాయి. 5% నష్టపోయిన ఎల్ అండ్ టీ షేరు ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) షేరు గురువారం 5 శాతం పతనమైంది. క్యూ2 ఫలితాలు అంతంత మాత్రంగా ఉండటంతో షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒకదశలో 6 శాతం క్షీణించి రూ.927 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 5% పతనంతో రూ.935 వద్ద స్థిరపడింది. -
ఎల్అండ్టీ డౌన్- ఓరియంట్ ఎలక్ట్రిక్ అప్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202-21) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో డైవర్సిఫైడ్ దిగ్గజం ఎల్అండ్టీ లిమిటెడ్ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. అయితే ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో హోమ్ అప్లయెన్సెస్ కంపెనీ ఓరియంట్ ఎలక్ట్రిక్ కౌంటర్‌కు డిమాండ్ నెలకొంది. గత 8 రోజులుగా బలపడుతూ రావడంతో ఎల్అండ్టీ కౌంటర్లో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగారని.. దీంతో ఈ షేరు బలహీనపడిందని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. మరోపక్క ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఓరియంట్ ఎలక్ట్రిక్ కౌంటర్ లాభాలతో ట్రేడవుతోంది. వివరాలు చూద్దాం.. ఎల్అండ్టీ లిమిటెడ్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఎల్అండ్టీ నికర లాభం 45 శాతం క్షీణించి రూ. 1,410 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 12 శాతం నీరసించి రూ. 31,035 కోట్లను తాకింది. ఈ కాలంలో మొత్తం రూ. 28,039 కోట్ల విలువైన కాంట్రాక్టులను దక్కించుకున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఇవి వార్షిక ప్రాతిపదికన 42 శాతం తక్కువకాగా.. క్యూ1తో పోల్చితే 19 శాతం అధికమని వివరించింది. ఈ కాలంలో ఎలక్ట్రికల్ ఆటోమేషన్ బిజినెస్‌ను ఫ్రాన్స్‌కు చెందిన ష్నీడర్ ఎలక్ట్రిక్‌కు విక్రయించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా వాటాదారులకు షేరుకి రూ. 18 చొప్పున ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించింది. ఇందుకు నవంబర్ 5 రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎల్అండ్టీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 5.4 శాతం పతనమై రూ. 930 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 926కు నీరసించింది. ఓరియంట్ ఎలక్ట్రిక్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఓరియంట్ ఎలక్ట్రిక్ నికర లాభం ఏడు రెట్లు ఎగసి రూ. 32 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం మాత్రం యథాతథంగా రూ. 434 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 8.3 శాతం బలపడి 13.3 శాతానికి చేరాయి. ఈ నేపథ్యంలో ఓరియంట్ ఎలక్ట్రిక్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 3.6 శాతం లాభపడి రూ. 209 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 8 శాతం జంప్‌చేసి రూ. 221 సమీపానికి చేరింది. -
నవీన్ ఫ్లోరైన్- రూట్ మొబైల్స్.. దూకుడు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ నవీన్ ఫ్లోరైన్ ఇంటర్నేషనల్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో డిజిటల్ కమ్యూనికేషన్ సేవల కంపెనీ రూట్ మొబైల్స్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. నవీన్ ఫ్లోరైన్ ఇంటర్నేషనల్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో నవీన్ ఫ్లోరైన్ ఇంటర్నేషనల్ నికర లాభం 43 శాతం ఎగసి రూ. 68 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 17 శాతం పుంజుకుని రూ. 319 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 3.23 శాతం బలపడి 24.9 శాతానికి ఎగశాయి. వాటాదారులకు షేరుకి రూ. 5 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఇందుకు నవంబర్ 11 రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నవీన్ ఫ్లోరైన్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6.5 శాతం దూసుకెళ్లి రూ. 2,260 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 2,268 సమీపానికి చేరింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. రూట్ మొబైల్స్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో రూట్ మొబైల్స్ నికర లాభం రెట్టింపునకుపైగా పెరిగి రూ. 33 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 77 శాతం జంప్‌చేసి రూ. 349 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 2.3 శాతం బలపడి 13.3 శాతానికి చేరాయి. ఈ నేపథ్యంలో రూట్ మొబైల్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6 శాతం జంప్‌చేసి రూ. 964 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 8 శాతం లాభపడి రూ. 990 సమీపానికి చేరింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని సాధించింది. కాగా.. గత మూడు రోజుల్లో ఈ షేరు 25 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! -
40 వేల దిగువకు సెన్సెక్స్
న్యూఢిల్లీ: ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అమ్మకాల సునామీ బుధవారం భారత మార్కెట్‌ను ముంచెత్తింది. ఫలితంగా సెన్సెక్స్ 40,000 స్థాయిని కోల్పోయి 600 పాయింట్ల నష్టంతో 39,775 వద్ద ముగిసింది. నిఫ్టీ 160 పాయింట్ల నష్టంతో 11,730 వద్ద స్థిరపడింది. అమెరికా, ఐరోపా దేశాలలో రెండో దశ కోవిడ్–19 కేసుల విజృంభణతో మరోసారి లాక్డౌన్ విధింపు భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. యూఎస్ ఆర్థిక వ్యవస్థకు అండగా ప్రతిపాదించిన ఉద్దీపన ప్యాకేజీపై ఇప్పటికీ అధికారిక సమాచారం రాకపోవడం నిరుత్సాహపరిచింది. దీంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఈ ప్రతికూలాంశాలకు తోడుగా దేశీయంగా రూపాయి బలహీనపడడం, మెప్పించని కంపెనీల క్యూ2 ఫలితాలు, డెరివేటివ్ సిరీస్ ముగింపునకు ముందు ఇన్వెస్టర్ల అప్రమత్తత లాంటి అంశాలు మన మార్కెట్ సెంటిమెంట్ మరింత దెబ్బతీశాయి. ముఖ్యంగా అధిక వెయిటేజీ షేర్లలో నెలకొన్న అమ్మకాలు సూచీల భారీ పతనాన్ని ఖరారు చేశాయి. ఏ ఒక్క రంగానికి కొనుగోళ్ల మద్దతు లభించలేదు. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో ఒక దశలో సెనెక్స్ 747 పాయింట్లను కోల్పోయి 39,775 దిగువన కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం 200 పాయింట్లను నష్టపోయి 11,685 ఇంట్రాడే కనిష్టానికి దిగివచ్చింది. నగదు విభాగంలో బుధవారం ఎఫ్‌పీఐలు రూ.1130.98 కోట్ల షేర్లను విక్రయించారు. డీఐఐలు అతి స్వల్పంగా రూ.1.48 కోట్ల షేర్లను కొన్నారు. ఆవిరైన రూ.1.56 లక్షల కోట్ల సంపద... స్టాక్ మార్కెట్ భారీ పతనంతో రూ.1.56 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.158 లక్షల కోట్లకు దిగివచ్చింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్–19 కేసులు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. అమెరికా ఉద్దీపన ప్యాకేజీపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో వారు నిరాశచెందారు. గురువారం అక్టోబర్ డెరివేటివ్ కాంటాక్టు ముగింపు కావడంతో మార్కెట్లో మరింత ఒడిదుడుకులకు లోనైంది. ఈ పరిస్థితుల్లో మార్కెట్ల పట్ల అప్రమత్తత అవసరమని మా కస్టమర్లను హెచ్చరించాము. స్టాక్ ఆధారిత షేర్ల కొనుగోళ్లు ఉత్తమని సలహానిచ్చాము.’’ అని రెలిగేర్ బ్రోకరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. 4 శాతం లాభపడ్డ ఎయిర్టెల్ షేరు కన్సాలిడేటెడ్ ప్రతిపాదికన ఒక క్వార్టర్లో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించినట్లు భారతీ ఎయిర్టెల్ ప్రకటించడంతో కంపెనీ షేరు బుధవారం 4 శాతం లాభంతో రూ.450 వద్ద ముగిసింది. క్యూ2లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఉదయం సెషన్లో దాదాపు 13 శాతం రూ. 488కు చేరింది. తదుపరి మార్కెట్ భారీ పతనంలో భాగంగా లాభాలన్ని హరించుకుపోయాయి. టాటా మోటార్స్ 6 శాతం జంప్... రానున్న రికవరీ క్రమంగా పెరగడంతో పాటు డిమాండ్ ఊపందుకుంటుందనే ఆశాభావ ప్రకటనతో టాటా మోటర్స్ షేరు 6% లాభంతో రూ.143 వద్ద స్థిరపడింది. క్యూ2 ఫలితాలు నిరుత్సాహపరచడం గమనార్హం. -
డాక్డర్ రెడ్డీస్ ల్యాబ్ నికర లాభం డౌన్
ఫార్మా రంగ హైదరాబాద్ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో నికర లాభం30 శాతం క్షీణించి రూ. 762 కోట్లకు పరిమితమైంది. అయితే మొత్తం ఆదాయం 2 శాతం పుంజుకుని రూ. 4,897 కోట్లను తాకింది. ఇబిటా 11 శాతం తక్కువగా రూ. 1,276 కోట్లుగా నమోదైంది. కాగా.. త్రైమాసిక ప్రాతిపదికన నికర లాభం 32 శాతం పుంజుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ పేర్కొంది. ఇదేవిధంగా ఆదాయంలో 11 శాతం వృద్ధి సాధించినట్లు తెలియజేసింది. ఈ నెల 22న కంపెనీపై సైబర్ అటాక్ జరిగిన నేపథ్యంలో అన్ని కీలక కార్యకలాపాలనూ తగిన నియంత్రణతో తిరిగి ప్రారంభించినట్లు తెలియజేసింది. షేరు ఓకే ఫలితాల నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 1 శాతం వెనకడుగుతో రూ. 5,053 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 5,150 వద్ద గరిష్టాన్ని తాకగా.. రూ. 4,990 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. కాగా.. ఈ ఏడాది క్యూ2లో అన్ని మార్కెట్లలోనూ వృద్ధిని సాధించగలిగినట్లు ఫలితాల విడుదల సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ సహచైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రొడక్టివిటీ మెరుగుపడటంతో ఆర్‌వోసీఈ బలపడినట్లు తెలియజేశారు. కోవిడ్-19కు ఇప్పటికే విడుదలైన ప్రొడక్టులకుతోడు తమ రీసెర్చ్ టీమ్ మరిన్ని ఉత్పత్తులు, నివారణ పద్ధతులపై పరిశోధన చేస్తున్నట్లు వివరించారు. మార్జిన్లు వీక్ క్యూ2లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ స్థూల మార్జిన్లు 3.6 శాతం క్షీణించి 53.9 శాతానికి చేరగా.. నికర లాభ మార్జిన్లు 22.8 శాతం నుంచి 15.6 శాతానికి బలహీనపడ్డాయి. ఈ కాలంలో పరిశోధన, అభివృద్ధి వ్యయాలు 9 శాతం పెరిగి రూ. 436 కోట్లకు చేరగా.. గ్లోబల్ జనరిక్స్ బిజినెస్ 21 శాతం ఎగసి రూ. 3,984 కోట్లను అధిగమించింది. అయితే ప్రొప్రీటరీ ప్రొడక్టుల ఆదాయం 92 శాతం క్షీణించి రూ. 62 కోట్లను తాకింది. -
Q2తో ఎయిర్టెల్ లాభాల ట్యూన్స్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కౌంటర్‌కు భారీ డిమాండ్ నెలకొంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఒడిదొడుకుల మార్కెట్లోనూ తొలుత దాదాపు 13 శాతం దూసుకెళ్లింది. రూ. 488కు చేరింది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 9 శాతం జంప్‌చేసి రూ. 471 వద్ద ట్రేడవుతోంది. ప్రధానంగా ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఒక్కో వినియోగదారుపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) భారీగా మెరుగుపడటంతో ఎయిర్టెల్ కౌంటర్‌కు జోష వచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇతర వివరాలు చూద్దాం.. రూ. 162కు క్యూ2లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఎయిర్టెల్ రూ. 763 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2019-20) క్యూ2లో నమోదైన రూ. 23,045 కోట్లతో పోలిస్తే నష్టం 97 శాతం తగ్గడం గమనార్హం! కాగా.. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా ఈ క్యూ2లో రూ. 25,785 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఇది 22 శాతం అధికంకాగా.. డేటా వినియోగం 58 శాతం పెరిగినట్లు ఎయిర్టెల్ పేర్కొంది. దేశీయంగా ఆదాయం 22 శాతం పుంజుకుని రూ. 18,747 కోట్లను తాకింది. ప్రధానంగా ఏఆర్పీయూ రూ. 128 నుంచి రూ. 162కు ఎగసింది. క్యూ1లో సాధించిన రూ. 157తో పోల్చినా ఇది అధికమే. ఈ కాలంలో 4జీ డేటా కస్టమర్ల సంఖ్య 15.27 కోట్లకు చేరినట్లు కంపెనీ పేర్కొంది. 1.44 కోట్ల మంది కొత్తగా జమ అయినట్లు తెలియజేసింది. -
ఎయిర్టెల్ నష్టం 763 కోట్లు
న్యూఢిల్లీ: దేశీ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ నష్టాలు భారీగా దిగొచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (2020-21, క్యూ2) కంపెనీ కన్సాలిడేటెడ్ (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర నష్టం రూ. 763 కోట్లుగా నమోదైంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రభావంతో సర్దుబాటు చేసిన స్థూల ఆదాయానికి(ఏజీఆర్) సంబంధించిన చట్టబద్ధమైన బకాయిల చెల్లింపు కోసం తక్షణం గతేడాది క్యూ2లో రూ.28,450 కోట్లను కేటాయింపుల (ప్రొవిజనింగ్) కింద పక్కనబెట్టడంతో ఆ త్రైమాసికంలో రూ.23,045 కోట్ల నికర నష్టాన్ని కంపెనీ ప్రకటించింది. దీంతో పోలిస్తే నష్టాలు భారీగా తగ్గుముఖం పట్టాయి. కాగా, కంపెనీ మొత్తం ఆదాయం 22 శాతం వృద్ధితో రూ.25,785 కోట్లకు ఎగబాకింది. ఎయిర్టెల్ చరిత్రలో ఒక క్వార్టర్లో ఇదే అత్యధిక కన్సాలిడేటెడ్ ఆదాయం కావడం గమనార్హం. అన్ని విభాగాలు, ప్రాంతాల్లోనూ పటిష్టమైన వృద్ధితో పాటు ఒక్కో యూజర్ నుంచి సగటు ఆదాయం (ఏఆర్పీయూ) పెరగడం, 4జీ కస్టమర్లు భారీగా జతకావడం దీనికి తోడ్పడినట్లు కంపెనీ పేర్కొంది. ఆదాయం, మార్జిన్లు, కస్టమర్ల వ్యాప్తంగా భారత్‌లో వ్యాపారం పటిష్టమైన వృద్ధిని సాధించినట్లు తెలిపింది. టెలికం శాఖ ఆదేశాలకు అనుగుణంగా తాము ఇప్పటికే ఏజీఆర్ బకాయిల్లో 10 శాతం పైగానే చెల్లించేశామని, సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా నడుచుకుంటామని హామీ నిస్తూ ప్రభుత్వానికి భారతీ ఎయిర్టెల్ గ్రూపు లేఖ రాసినట్లు ఎయిర్టెల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. మొత్తం ఏజీఆర్ బకాయిల్లో 10 శాతాన్ని ఈ ఏడాది చెల్లించాల్సిందిగా, మిగతా మొత్తాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 10 వాయిదాల్లో చెల్లించేందుకు సుప్రీం కోర్టు అనుమతించిన విషయాన్ని ఈ సందర్భంగా కంపెనీ గుర్తు చేసింది. భారత్ ఆదాయం 22 శాతం అప్... భారత్ కార్యకలాపాలపై క్యూ2లో ఆదాయం 22 శాతం వృద్ధి చెంది రూ.18,747 కోట్లకు ఎగబాకింది. మొబైల్ ఆదాయాలు 26 శాతం దూసుకెళ్లాయి. ఏఆర్పీయూ రూ.162కు చేరింది. ఈ ఏడాది క్యూ1లో ఏఆర్పీయూ రూ.128 మాత్రమే. 4జీ డేటా వినియోగదారులు గతేడాది క్యూ2తో పోలిస్తే 48.1శాతం పెరిగి 15.27 కోట్ల మందికి చేరారు. ఘనా మార్కెట్‌కు గుడ్‌బై! ఘనా టెలికం మార్కెట్ నుంచి వైదొలిగే ప్రణాళికల్లో ఉన్నట్లు ఎయిర్టెల్ వెల్లడించింది. ‘ఎయిర్టెల్ ఘనా లిమిటెడ్ (ఎయిర్‌టెల్‌టిగో)లోని 100 శాతం వాటాలతో సహా మొత్తం కస్టమర్లు, ఆస్తులు, రుణాలన్నింటినీ ఘనా ప్రభుత్వం కొనుగోలు చేసేవిధంగా ఆ దేశ ప్రభుత్వంతో ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపింది’ అని కంపెనీ ఎక్సే్ఛంజీలకు వెల్లడించింది. ఎయిర్‌టెల్‌టిగో జాయింట్ వెంచర్లో ఎయిర్‌టెల్‌కు 49.95శాతం వాటా ఉంది. ఫలితాల నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్ షేరు మంగళవారం 0.24 శాతం స్వల్ప లాభంతో రూ.433 వద్ద ముగిసింది. సీజనల్‌గా బలహీన త్రైమాసికం అయినప్పటికీ, పటిష్టమైన పనితీరుతో మేం 22 శాతం ఆదాయ వృద్ధిని సాధించగలిగాం. వ్యాపార లాభదాయకతను పెంచుకునేందుకు కంపెనీ కట్టుబడి ఉంది. - గోపాల్ విఠల్, ఎండీ, సీఈఓ భారత్-దక్షిణాసియా -
ఎల్జీ బాలకృష్ణన్- ఇప్కా ల్యాబ్స్ జూమ్
ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన దేశీ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 187 పాయింట్లు పెరిగి 40,332కు చేరగా.. నిఫ్టీ 63 పాయింట్లు బలపడి 11,831 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ఎల్జీ బాలకృష్ణన్ అండ్ బ్రదర్స్ అంచనాలకు అనుగుణమైన ఫలితాలు ప్రకటించింది. ఈ బాటలో క్యూ3పై అంచనాలు పెరగడంతో ఈ ఆటో విడిభాగాల కంపెనీ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క క్యూ2లో ఆకర్షణీయ పనితీరు చూపనున్న అంచనాలతో హెల్త్‌కేర్ రంగ కంపెనీ ఇప్కా ల్యాబొరేటరీస్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఎల్జీ బాలకృష్ణన్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఎల్జీ బాలకృష్ణన్ నికర లాభం దాదాపు 24 శాతం క్షీణించి రూ. 28 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్ర వృద్ధితో రూ. 412 కోట్లను తాకింది. అయితే ఇటీవల ఆటో రంగం జోరందుకోవడంతో క్యూ3(అక్టోబర్- డిసెంబర్)లో మరింత మెరుగైన పనితీరును చూపవచ్చన్న అంచనాలు పెరిగినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఎల్జీ బాలకృష్ణన్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 9 శాతం దూసుకెళ్లి రూ. 272 వద్ద ట్రేడవుతోంది. ఇప్కా ల్యాబొరేటరీస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఇప్కా ల్యాబొరేటరీస్ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించనున్న అంచనాలు పెరిగాయి. దీంతో ఎన్ఎస్ఈలో తొలుత ఇప్కా ల్యాబ్ షేరు 9 శాతం దూసుకెళ్లింది. రూ. 2,319 సమీపంలో సరికొత్త గరిష్టానికి చేరింది. ప్రస్తుతం కొంత వెనకడుగు వేసి 5.5 శాతం లాభంతో రూ. 2,240 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్- జూన్)లో కంపెనీ నికర లాభం మూడు రెట్లు జంప్‌చేసి రూ. 129 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 41 శాతం పెరిగి రూ. 1,546 కోట్లకు చేరింది. కాగా.. యాంటీమలేరియల్ బిజినెస్‌లో గ్లోబల్ ఫండ్ నుంచి మద్దతు లభించడం, యూఎస్ఎఫ్డీఏ నుంచి దిగుమతులపై అడ్డంకులు తొలగిపోవడం వంటి అంశాలు కంపెనీ పనితీరుకు దోహదపడగలవని ఆగస్ట్ నివేదికలో రేటింగ్ దిగ్గజం క్రిసిల్ పేర్కొంది. ఇది ఇన్వెస్టర్లకు హుషారునిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. -
కొటక్ మహీంద్రా- ఏంజెల్ బ్రోకింగ్ హైజంప్
ఆటుపోట్ల మధ్య మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 111 పాయింట్లు పుంజుకుని 40,256 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 33 పాయింట్లు బలపడి 11,801 వద్ద కదులుతోంది. కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ప్రయివేట్ రంగ దిగ్గజం కొటక్ మహీంద్రా బ్యాంక్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ఇదే కాలంలో ఏంజెల్ బ్రోకింగ్ సైతం ఆకర్షణీయ పనితీరు చూపడంతో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. కొటక్ మహీంద్రా బ్యాంంక్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో కొటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం దాదాపు 27 శాతం ఎగసి రూ. 2,185 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 17 శాతం పెరిగి రూ. 3,913 కోట్లను అధిగమించింది. అయితే లోన్‌బుక్ 4 శాతం క్షీణించి రూ. 2.04 లక్షల కోట్లను తాకగా.. డిపాజిట్లు 12 శాతంపైగా పెరిగి రూ. 2.61 లక్షల కోట్లకు చేరాయి. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 4.61 శాతం నుంచి 4.52 శాతానికి స్వల్పంగా నీరసించాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు 9.6 శాతం క్షీణించి రూ. 369 కోట్లకు పరిమితమయ్యాయి. స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 0.15 శాతం తగ్గి 2.55 శాతానికి చేరగా.. నికర ఎన్పీఏలు సైతం 0.23 శాతం తక్కువగా 0.64 శాతంగా నమోదయ్యాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 22 శాతం వృద్ధితో రూ. 2,947 కోట్లను తాకింది. దీంతో వరుసగా రెండో రోజు కొటక్ బ్యాంక్ షేరు జోరు చూపుతోంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 10 శాతం దూసుకెళ్లి రూ. 1,559 సమీపంలో ట్రేడవుతోంది. ఏంజెల్ బ్రోకింగ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఏంజెల్ బ్రోకింగ్ నికర లాభం రూ. 74 కోట్లకు జంప్ చేసింది. ఒక త్రైమాసికంలో ఇది అత్యధిక లాభంకాగా.. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్- జూన్)లో రూ. 48 కోట్ల లాభం నమోదైంది. మొత్తం ఆదాయం 29 శాతం పెరిగి రూ. 318 కోట్లను తాకింది. రోజువారీ సగటు టర్నోవర్ 107 శాతం పుంజుకుని రూ. 1281 బిలియన్లకు చేరినట్లు కంపెనీ పేర్కొంది. ఇబిట్ మార్జిన్లు 6.3 శాతం బలపడి 49 శాతాన్ని అధిగమించినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఏంజెల్ బ్రోకింగ్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 16.5 శాతం దూసుకెళ్లి రూ. 290 సమీపంలో ట్రేడవుతోంది. -
కొటక్ మహీంద్రా బ్యాంక్ క్యూ2 గుడ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ2(జులై- సెప్టెంబర్)లో బ్యాంక్ నికర లాభం దాదాపు 27 శాతం ఎగసి రూ. 2,185 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 17 శాతం పెరిగి రూ. 3,913 కోట్లను అధిగమించింది. అయితే లోన్‌బుక్ 4 శాతం క్షీణించి రూ. 2.04 లక్షల కోట్లను తాకగా.. డిపాజిట్లు 12 శాతంపైగా పెరిగి రూ. 2.61 లక్షల కోట్లకు చేరాయి. ఎన్ఐఎం వీక్ నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 4.61 శాతం నుంచి 4.52 శాతానికి స్వల్పంగా నీరసించాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు 9.6 శాతం క్షీణించి రూ. 369 కోట్లకు పరిమితమయ్యాయి. స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 0.15 శాతం తగ్గి 2.55 శాతానికి చేరగా.. నికర ఎన్పీఏలు సైతం 0.23 శాతం తక్కువగా 0.64 శాతంగా నమోదయ్యాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 22 శాతం వృద్ధితో రూ. 2,947 కోట్లను తాకింది. కొటక్ సెక్యూరిటీస్ లాభం 34 శాతం పెరిగి రూ. 199 కోట్లకు చేరగా.. లైఫ్ ఇన్సూరెన్స్ విభాగం 19 శాతం వృద్ధితో రూ. 171 కోట్లను తాకింది. అయితే ప్రైమ్ లాభం 23 శాతం క్షీణించి రూ. 133 కోట్లుగా నమోదైంది. క్యూ2లో కొటక్ బ్యాంక్‌లో వాటాను ఎల్ఐసీ 2.45 శాతం నుంచి 3.18 శాతానికి పెంచుకుంది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం కొటక్ మహీంద్రా షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 2 శాతం ఎగసి రూ. 1,406 వద్ద ట్రేడవుతోంది. -
థైరోకేర్- పెర్సిస్టెంట్ సిస్టమ్స్.. దూకుడు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ పనితీరును చూపనుందన్న అంచనాలతో హెల్త్‌కేర్ రంగ కంపెనీ థైరోకేర్ టెక్నాలజీస్‌కు డిమాండ్ నెలకొంది. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ కౌంటర్ సైతం వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పతన మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు ఇలా.. థైరోకేర్ టెక్నాలజీస్ ఈ ఏడాది క్యూ2 ఫలితాలపై అంచనాలు పెరగడంతో డయాగ్నోస్టిక్ సేవల కంపెనీ థైరోకేర్ టెక్నాలజీస్ కౌంటర్ జోరు చూపుతోంది. తొలుత ఎన్ఎస్ఈలో ఈ షేరు 10 శాతం దూసుకెళ్లి రూ. 1,165కు చేరింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం 6.6 శాతం జంప్‌చేసి రూ. 1,129 వద్ద ట్రేడవుతోంది. క్యూ2 ఫలితాల విడుదలకు వీలుగా బుధవారం(28న) బోర్డు సమావేశంకానున్నట్లు థైరోకేర్ టెక్నాలజీస్ వెల్లడించింది. ఇదేవిధంగా వాటాదారులకు మధ్యంతర డివిడెండ్ చెల్లించే అంశంపైనా బోర్డు చర్చించనున్నట్లు తెలియజేసింది. కాగా.. గత నెల రోజుల్లో థైరోకేర్ టెక్నాలజీస్ షేరు 50 శాతం ర్యాలీ చేయడం విశేషం! ఇందుకు క్యూ1లో సాధించిన పటిష్ట ఫలితాలు దోహదపడినట్లు నిపుణులు చెబుతున్నారు. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఈ ఏడాది క్యూ2లో కన్సాలిడేటెడ్ నికర లాభం 13 శాతంపైగా ఎగసి రూ. 102 కోట్లకు చేరినట్లు పెర్సిస్టెంట్ సిస్టమ్స్ పేర్కొంది. త్రైమాసిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం 1.7 శాతం పుంజుకుని రూ. 1008 కోట్లను తాకింది. ఇబిటా 13 శాతం బలపడి రూ. 166 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో పెర్సిస్టెంట్ సిస్టమ్స్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 4 శాతం జంప్‌చేసి రూ. 1,220ను తాకింది. ప్రస్తుతం 2.4 శాతం లాభంతో రూ. 1,200 వద్ద ట్రేడవుతోంది. -
మార్కెట్ డౌన్- పాలీక్యాబ్- అరబిందో జోరు
తొలుత బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి అమ్మకాలు పెరగడంతో కుదేలయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 490 పాయింట్లు పతనమై 40,195కు చేరింది. నిఫ్టీ 150 పాయింట్లు కోల్పోయి 11,780 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఎఫ్ఎంఈజీ కంపెనీ పాలీక్యాబ్ ఇండియా కౌంటర్‌కు డిమాండ్ కనిపిస్తోంది. మరోపక్క యూఎస్ అనుబంధ సంస్థ ఆస్తులను విక్రయించనున్నట్లు ప్రకటించడంతో హెల్త్‌కేర్ దిగ్గజం అరబిందో ఫార్మా కౌంటర్ సైతం వెలుగులో నిలుస్తోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ నష్టాల మార్కెట్లోనూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. పాలీక్యాబ్ ఇండియా ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో పాలీక్యాబ్ ఇండియా నికర లాభం 14 శాతం పుంజుకుని రూ. 222 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 6 శాతం క్షీణించి రూ. 2,114 కోట్లకు పరిమితమైంది. పన్నుకు ముందు లాభం 25 శాతం పెరిగి రూ. 288 కోట్లను తాకగా.. ఇబిటా మార్జిన్లు 2.72 శాతం బలపడి రూ. 14.76 శాతంగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పాలీక్యాబ్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 8.5 శాతం దూసుకెళ్లి రూ. 955 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 968 వరకూ ఎగసింది. అరబిందో ఫార్మా న్యూ మౌంటెయిన్ క్యాపిటల్, జారో ఫార్ములాస్‌తో బిజినెస్ యూనిట్ల విక్రయానికి యూఎస్ అనుబంధ సంస్థ నాట్రోల్ ఎల్ఎల్సీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అరబిందో ఫార్మా తాజాగా పేర్కొంది. పూర్తి నగదు రూపంలో 55 కోట్ల డాలర్ల(రూ. 4048 కోట్లు)కు డీల్‌ను కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. 2021 జనవరికల్లా డీల్ పూర్తికావచ్చని వివరించింది. నిధులను రుణభార తగ్గింపు, ఇతర వ్యూహాత్మక అవసరాలకు వినియోగించనున్నట్లు అరబిందో వెల్లడించింది. ఈ నేపథ్యంలో అరబిందో ఫార్మా షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 1 శాతం లాభంతో రూ. 790 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 4 శాతం జంప్‌చేసి రూ. 815కు చేరింది. -
సెన్సెక్స్ 127 పాయింట్లు ప్లస్
న్యూఢిల్లీ: మార్కెట్ నష్టాలు ఒకరోజుకే పరిమితమయ్యాయి. ఆటో, ఐటీ, మెటల్, పవర్ షేర్ల అండతో శుక్రవారం తిరిగి లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 127 పాయింట్లు పెరిగి 40,686 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 11,930 వద్ద నిలిచింది. కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాలకు అనుగుణంగా నమోదవడంతో పాటు అమెరికా ఉద్దీపన ప్యాకేజీ విడుదల చర్చలు పురోగతిని సాధించడం లాంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. అలాగే మార్కెట్లో అనిశ్చితి పరిస్థితులు తగ్గుముఖం పట్టాయనేందుకు సంకేతంగా ఇండియా వీఐఎక్స్ ఇండెక్స్ 4 శాతం నష్టపోయింది. చిన్న, మధ్య తరహా షేర్ల కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపారు. ఇక వారం మొత్తంగా సెన్సెక్స్ 702 పాయింట్లు, నిఫ్టీ 168 పాయింట్లు లాభపడ్డాయి. పరిమిత శ్రేణిలోనే ట్రేడింగ్.. నష్టాల ముగింపు రోజు తర్వాత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపడంతో సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ, ఆర్థిక షేర్ల దూకుడుతో ఉదయం సెషన్లో సెన్సెక్స్ 253 పాయింట్లు పెరిగి 40,811 వద్ద, నిఫ్టీ 79 పాయింట్లను ఆర్జించి 11,975 వద్ద ఇంట్రాడే గరిష్టస్థాయిలను అందుకున్నాయి. వారాంతం కావడంతో మిడ్‌సెషన్‌లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో సూచీలు కొంత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే ఆటో, మెటల్ షేర్ల ర్యాలీ సూచీలకు అండగా నిలవడంతో లాభాలతో ముగిశాయి. ‘‘మార్కెట్ మరోరోజు కన్సాలిడేట్కు లోనై లాభాలతో ముగిసింది. అమెరికా ఉద్దీపన ప్యాకేజీ తాజా సమాచారంతో పాటు రానున్న అధ్యక్ష ఎన్నికలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. యూరప్‌లో పుంజుకుంటున్న రెండో దశ కోవిడ్–19 కేసులను నిశితంగా పరిశీలిస్తున్నారు’’ అని రెలిగేర్ బ్రోకింగ్ వైస్ చైర్మన్ అజిత్ మిశ్రా తెలిపారు. క్రాంప్టన్ గ్రీవ్స్ షేరుకు ఫలితాల జోష్.. మెరుగైన క్వార్టర్ ఫలితాల ప్రకటనతో క్రాంప్టన్ గ్రీవ్స్ షేరు శుక్రవారం 6 శాతం లాభపడింది. రూ.303.70 వద్ద ముగిసింది. ఈ క్యూ2లో కంపెనీ నికరలాభం 27.77 శాతం వృద్ధి చెంది రూ.141.68 కోట్లను ఆర్జించింది. -
ఆదిత్య బిర్లా ఫ్యాషన్- సీజీ కన్జూమర్ జోరు
ఒక రోజు వెనకడుగు తదుపరి దేశీ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల బాట పట్టాయి. ఈ నేపథ్యంలో ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కంపెనీలో వాటా కొనుగోలు చేయనున్న వార్తలతో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. కాగా.. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు షేర్లూ మార్కెట్లను మించి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ షేరుకి రూ. 205 ధరలో 7.8 శాతం వాటా కొనుగోలు చేస్తున్నట్లు ఆదిత్య బిర్లా ఫ్యాషన్ తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 1,500 కోట్లు వెచ్చించనున్నట్లు ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా గ్రూప్‌నకు చెందిన ఆదిత్య బిర్లా ఫ్యాషన్ ఇందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. దీంతో దేశీ దుస్తుల మార్కెట్లో కంపెనీ మరింత విస్తరించే వీలున్నట్లు ఏబీ ఫ్యాషన్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా వ్యాఖ్యానించారు. రానున్న ఐదేళ్లలో దేశీ దుస్తుల పరిశ్రమ 100 బిలియన్ డాలర్లను తాకే అంచనాలున్నట్లు తెలియజేశారు. ఫ్లిప్‌కార్ట్‌కు వాటా విక్రయం ద్వారా లభించే నిధులను బ్యాలన్స్‌షీట్ పటిష్టతకు, వృద్ధి అవకాశాలకూ వినియోగించనున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఫ్లిప్‌కార్ట్‌కు వాటా విక్రయం తదుపరి ప్రమోటర్ల వాటా 55.13 శాతానికి చేరనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఏబీ ఫ్యాషన్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 4.3 శాతం జంప్‌చేసి రూ. 160 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 163ను అధిగమించింది. క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్ నికర లాభం 28 శాతం ఎగసి రూ. 142 కోట్లను తాకింది. నికర అమ్మకాలు సైతం 13 శాతం పెరిగి రూ. 1,213 కోట్లకు చేరాయి. నిర్వహణ లాభ మార్జిన్లు 3.8 శాతం మెరుగుపడి 15.8 శాతానికి చేరాయి. వాటాదారులకు షేరుకి రూ. 3 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 7.3 శాతం జంప్‌చేసి రూ. 307 వద్ద ట్రేడవుతోంది. తొలుత 15 శాతం దూసుకెళ్లి రూ. 329 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. -
జేకే టైర్- సాగర్ సిమెంట్స్.. స్పీడ్
వరుస లాభాలకు ట్రేడర్లు బ్రేక్ వేయడంతో దేశీ స్టాక్ మార్కెట్లు వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 212 పాయింట్లు క్షీణించి 40,495ను తాకింది. నిఫ్టీ 60 పాయింట్లు నీరసించి 11,878 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) ద్వితీయ త్రైమాసికంలో అంచనాలకు అనుగుణమైన ఫలితాలు సాధించడంతో ఓవైపు జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్, మరోపక్క సాగర్ సిమెంట్స్ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో నష్టాల మార్కెట్లోనూ ఈ షేర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ నికర లాభం 38 శాతం క్షీణించి రూ. 105 కోట్లకు పరిమితమైంది. తక్కువ పన్ను వ్యయాల కారణంగా గతేడాది క్యూ2లో అధిక లాభాలు నమోదైనట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 6 శాతం పుంజుకుని రూ. 2,275 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) మరింత అధికంగా 20 శాతం ఎగసి రూ. 367 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో జేకే టైర్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 9 శాతం జంప్‌చేసి రూ. 66ను అధిగమించింది. ప్రస్తుతం 6 శాతం లాభంతో రూ. 64 వద్ద ట్రేడవుతోంది. సాగర్ సిమెంట్స్ లిమిటెడ్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో సాగర్ సిమెంట్స్ నికర లాభం 10 రెట్లు ఎగసి రూ. 50 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 23 శాతం పుంజుకుని రూ. 326 కోట్లను తాకింది. నిర్వహణ లాభ(ఇబిటా) మార్జిన్లు 16 శాతం నుంచి రెట్టింపై 32 శాతాన్ని తాకాయి. క్యూ2లో దాదాపు 21 శాతం మెరుగుపడిన ధరలు(రియలైజేషన్లు) పటిష్ట పనితీరుకు దోహదం చేసినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో సాగర్ సిమెంట్స్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 9 శాతం దూసుకెళ్లి రూ. 750కు చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 6 శాతం ఎగసి రూ. 731 వద్ద ట్రేడవుతోంది. -
ఎల్అండ్టీ ఇన్ఫోటెక్- న్యూజెన్.. జూమ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202-21) ద్వితీయ త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో సాఫ్ట్వేర్ సేవల మధ్యస్థాయి కంపెనీలు ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, న్యూజెన్ సాఫ్ట్వేర్ కంపెనీలకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తొలుత ఒక దశలో న్యూజెన్ సాఫ్ట్వేర్ 20 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ సైతం భారీ లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం.. న్యూజెన్ సాఫ్ట్వేర్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో న్యూజెన్ సాఫ్ట్వేర్ నికర లాభం ఏడు రెట్లు ఎగసి రూ. 29 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం యథాతథంగా రూ. 155 కోట్లుగా నమోదైంది. నిర్వహణ లాభ మార్జిన్లు 5.9 శాతం నుంచి భారీగా 26.5 శాతానికి ఎగశాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో న్యూజెన్ షేరు 11 శాతం జంప్‌చేసి రూ. 251 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో దాదాపు 20 శాతం దూసుకెళ్లింది. రూ. 270 సమీపంలో 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ నికర లాభం 9.7 శాతం పెరిగి రూ. 457 కోట్లను తాకింది. త్రైమాసిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం 1.7 శాతం పుంజుకుని రూ. 2,998 కోట్లకు చేరింది. నిర్వహణ లాభ మార్జిన్లు 2.8 శాతం బలపడి 22.9 శాతానికి ఎగశాయి. వాటాదారులకు షేరుకి రూ. 15 డివిడెండ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 3,078 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో దాదాపు 6 శాతం దూసుకెళ్లి రూ. 3,139 వద్ద గరిష్టాన్ని తాకింది. -
ఒబెరాయ్ రియల్టీ జూమ్- ర్యాలీస్ డౌన్
వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 238 పాయింట్లు జంప్‌చేసి 40,669ను తాకింది. నిఫ్టీ 56 పాయింట్లు ఎగసి 11,929 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) ద్వితీయ త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ.. ఇకపై మెరుగైన పనితీరు ప్రదర్శించనుందన్న అంచనాలు ఒబెరాయ్ రియల్టీ కౌంటర్‌కు డిమాండ్‌ను పెంచాయి. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెస్టెంబర్) ఫలితాలు నిరాశపరచడంతో ర్యాలీస్ ఇండియా కౌంటర్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. వెరసి ఒబెరాయ్ రియల్టీ భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. ర్యాలీస్ ఇండియా నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. ఒబెరాయ్ రియల్టీ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఒబెరాయ్ రియల్టీ నిర్వహణ లాభం(ఇబిటా) 12 శాతం క్షీణించి రూ. 187 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 36 శాతం నీరసించి రూ. 316 కోట్లను తాకింది. అయితే ఇబిటా మార్జిన్లు భారీగా జంప్‌చేసి 59 శాతాన్ని తాకాయి. పండుగల సీజన్ నేపథ్యంలో ఈ ఏడాది ద్వితీయార్ధం నుంచి కంపెనీ పనితీరు జోరందుకునే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. థానే తదితర ప్రాంతాలలో ప్రాజెక్టులు ఇందుకు సహకరించగలవని అంచనా వేసింది. దీంతో ఎన్ఎస్ఈలో ఒబెరాయ్ రియల్టీ షేరు తొలుత 15 శాతం దూసుకెళ్లి రూ. 446ను తాకింది. ప్రస్తుతం 13 శాతం లాభంతో రూ. 440 వద్ద ట్రేడవుతోంది. ర్యాలీస్ ఇండియా ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ర్యాలీస్ ఇండియా నికర లాభం 2 శాతం తగ్గి రూ. 83 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 3 శాతం నీరసించి రూ. 725 కోట్లను తాకింది. అయితే నిర్వహణ లాభ(ఇబిటా) మార్జిన్లు 16.1 శాతం వద్ద స్థిరత్వాన్ని చూపాయి. అమ్మకాలలో దేశీయంగా సస్యరక్షణ విభాగం 8 శాతం, విత్తనాల బిజినెస్ 29 శాతం పుంజుకున్నప్పటికీ.. ఎగుమతులు 29 శాతం క్షీణించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ర్యాలీస్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో తొలుత 5.5 శాతం పతనమై రూ. 259 దిగువకు చేరింది. ప్రస్తుతం 4 శాతం నష్టంతో రూ. 263 వద్ద ట్రేడవుతోంది. -
బ్రిటానియా- కేఐవోసీఎల్ పతనం
విదేశీ ప్రతికూలతల కారణంగా ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 240 పాయింట్లు జంప్‌చేసి 40,671ను తాకింది. నిఫ్టీ 59 పాయింట్లు ఎగసి 11,932 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) ద్వితీయ త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించినప్పటికీ.. అంచనాలను చేరకపోవడంతో బ్రిటానియా ఇండస్ట్రీస్ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. మరోపక్క ఈక్విటీ షేర్ల బైబ్యాక్ నిర్ణయాలు నిరాశపరచడంతో మెటల్, మైనింగ్ రంగ పీఎస్‌యూ కేఐవోసీఎల్ లిమిటెడ్ కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూ కట్టారు. వెరసి ఈ రెండు షేర్లూ లాభాల మార్కెట్లోనూ భారీ నష్టాలతో కళ తప్పాయి. వివరాలు చూద్దాం.. బ్రిటానియా ఇండస్ట్రీస్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఎఫ్ఎంసీజీ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ నికర లాభం 23 శాతం పెరిగి రూ. 495 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 12 శాతం పుంజుకుని రూ. 3,419 కోట్లను తాకింది. అమ్మకాలు ఆశించిన స్థాయిలో వృద్ధి చూపనప్పటికీ వ్యయాల నియంత్రణ, తగ్గిన ముడి సరుకుల ధరలు కంపెనీ లాభదాయకత మెరుగుపడేందుకు దోహదం చేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో బ్రిటానియా షేరు 5 శాతం పతనమై రూ. 3,583 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 3,575 వరకూ వెనకడుగు వేసింది. కేఐవోసీఎల్ లిమిటెడ్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు బోర్డు ఆమోదముద్ర వేసినట్లు పీఎస్‌యూ కేఐవోసీఎల్ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. దీనిలో భాగంగా ఒక్కో షేరుకీ రూ. 110 ధర మించకుండా 1.41 కోట్లకుపైగా షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు తెలియజేసింది. ఇది కంపెనీ ఈక్విటీలో 2.28 శాతం వాటాకు సమానంకాగా.. ఇందుకు రూ. 156 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు వెల్లడించింది. బైబ్యాక్‌కు ఈ నెల 30 రికార్డ్ డేట్‌గా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేఐవోసీఎల్ షేరు ఎన్ఎస్ఈలో 10 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు అధికంకాగా.. కొనేవాళ్లు కరువుకావడంతో రూ. 123 దిగువన ఫ్రీజయ్యింది. -
టాటా కామ్- ఫెడరల్ బ్యాంక్ జోరు
హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు మరింత జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 424 పాయింట్లు జంప్‌చేసి 40,407ను తాకింది. నిఫ్టీ 105పాయింట్లు ఎగసి 11,867 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు చూపడంతో అటు టాటా కమ్యూనికేషన్స్, ఇటు.. ఫెడరల్ బ్యాంక్ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. టాటా కమ్యూనికేషన్స్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో టెలికం మౌలిక సదుపాయాల కంపెనీ టాటా కమ్యూనికేషన్స్ రూ. 385 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ2తో పోలిస్తే ఇది 7 రెట్లు అధికంకాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 4 శాతం పుంజుకుని రూ. 4,282 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో టాటా కామ్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 919 ఎగువన ఫ్రీజయ్యింది. తద్వారా 52 వారాల గరిష్టం రూ. 935కు చేరువైంది. ఫెడరల్ బ్యాంక్ ప్రయివేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో రూ. 308 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది 26 శాతం క్షీణతకాగా.. ప్రొవిజన్లకు అధిక కేటాయింపులు చేపట్టడం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే నికర వడ్డీ ఆదాయం 23 శాతం వృద్ధితో రూ. 1,380 కోట్లకు చేరింది. రుణ మంజూరీ 6 శాతం పుంజుకోగా.. నికర వడ్డీ మార్జిన్లు 3.13 శాతంగా నమోదయ్యాయి. ప్రొవిజన్లు, తదితరాలు 135 శాతం పెరిగి రూ. 592 కోట్లను అధిగమించాయి. ఈ కాలంలో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 0.12 శాతం నీరసించి 2.84 శాతానికి చేరగా.. నికర ఎన్పీఏలు 0.23 శాతం మందగించి 0.99 శాతాన్ని తాకాయి. దీంతో ఎన్ఎస్ఈలో ఫెడరల్ బ్యాంక్ షేరు ప్రస్తుతం 5 శాతం జంప్‌చేసి రూ. 55 సమీపంలో ట్రేడవుతోంది. -
ఫలితాల్లో అదరగొట్టిన ఇన్ఫీ
సాక్షి,ముంబై: దేశీయ దిగ్గజ సాఫ్ట్వేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ మెరుగైన ఫలితాలను ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ ఏకీకృత నికర లాభం 20.5 శాతం వృద్ధితో రూ. 4,845 కోట్లుగా వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 4,019 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. కంపెనీ ఏకీకృత ఆదాయం 8.6 శాతం పెరిగి రూ. 24,570 కోట్లకు చేరుకుంది. గతేడాది సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 22,629 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. డివిడెండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి ఇన్ఫోసిస్ బోర్డు ఈక్విటీ షేర్‌కు రూ.12 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఆదాయం, మార్జిన్ పెరిగిన నేపథ్యంలో క్లయింట్లకు సంస్థ పట్ల కొనసాగుతున్న నమ్మకాన్ని సూచిస్తుందని ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి సగంలో ద్రవ్యత గణనీయంగా పెరిగిందని, నగదు నిర్వహణపై సంస్థ దృష్టి సారించడం ద్వారా కంపెనీ లాభాలు, ఆదాయం పెరిగాయని ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ నీలంజన్ రాయ్ వెల్లడించారు. టీసీఎస్ కంటే మెరుగ్గా మరోవైపు గత మూడు త్రైమాసికాలలో, ఇన్ఫోసిస్ డాలర్ ఆదాయాలు 2.1 శాతం పెరిగ్గా, టీసీఎస్ ఆదాయాలు 2.9 తగ్గడం గమనార్హం. అంతేకాదు పోస్ట్-కోవిడ్ కాలంలో ఇన్ఫీ లాభాల మార్జిన్ గణనీయంగా పెరిగింది. నిర్వహణ లాభాలు 18.1 శాతం పుంజుకోగా, టీసీఎస్ లాభాలు 1.7శాతం మాత్రమే పెరిగాయి. ముఖ్యంగా క్లౌడ్ , డిజిటల్ సేవలకు పెరిగిన డిమాండ్ ఇన్ఫోసిస్ కు బాగా లాభిస్తోంది. అటు వాన్ గార్డ్ తో చేసుకున్న డీల్ అతిపెద్ద ఒప్పందంగా నిలిచింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో 21-23 శాతం మార్జిన్‌తో పోలిస్తే రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఆపరేటింగ్ మార్జిన్లు గైడెన్స్ ను 23-24 శాతానికి పెరుగుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. -
మార్కెట్ ముందుకే
స్టాక్ మార్కెట్ ర్యాలీ స్వల్ప కాలం మేర కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా (భారత్‌లో కూడా) ఉద్దీపన ప్యాకేజీపై ఆశలు, కంపెనీల క్యూ2 ఫలితాలు బాగా ఉంటా యనే అంచనాలు దీనికి ప్రధాన కారణాలని వారంటున్నారు. ఇక ఈ వారంలో వెలువడనున్న ఐటీ కంపెనీల ఫలితాలు, ద్రవ్యోల్బణ, పారిశ్రామికో త్పత్తి గణాంకాలు, మారటోరియం రుణాలపై వడ్డీ మాఫీపై సుప్రీం కోర్టు తీర్పు.. మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని విశ్లేషకులు అంటున్నారు. వీటితో పాటు కరోనా కేసులు, వ్యాక్సిన్ సంబంధిత వార్తలు, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ సంకేతాల ప్రభావం కూడా ఉంటుందని వారంటున్నారు. 70 కంపెనీల క్యూ2 ఫలితాలు.... ఈ వారంలోనే విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మైండ్ ట్రీ వంటి ఐటీ కంపెనీల ఫలితాలు వెలువడతాయి. వీటితో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అవెన్యూ సూపర్ మార్ట్, ఫెడరల్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్... మొత్తం 70 కంపెనీలు తమ తమ క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. నేడు (సోమవారం) మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్, యూటీఐ ఏఎమ్‌సీ, లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టవుతాయి. ఇదే రోజు ఆగస్టు నెలకు సంబంధించిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, సెప్టెంబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. బుధవారం (ఈ నెల 14న ) టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడుతాయి. వరుసగా ఏడు రోజుల పాటు మార్కెట్ పెరిగినందున పై స్థాయిల్లో స్వల్ప లాభాల స్వీకరణ ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెలలో 1,000 కోట్ల విదేశీ నిధులు.... విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) మన మార్కెట్లో ఈ నెలలో రూ.1,086 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. ఇప్పటివరకూ వెల్లడైన కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాలను మించడం, జీఎస్టీ వసూళ్లు మెరుగుపడటం, ఆర్థిక పరిస్థితులు పుంజుకున్నాయని గణాంకాలు వెల్లడించడం, సానుకూల అంతర్జాతీయ సంకేతాలు దీనికి కారణాలు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్మార్కెట్లో రూ.5,245 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, డెట్ మార్కెట్ నుంచి రూ.4,159 కోట్లు ఉపసంహరించుకున్నారు. కాగా సెప్టెంబర్ నెల మొత్తం మీద నికరంగా రూ.3,419 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. -
క్యూ2 ఫలితాలపై ఇక మార్కెట్ల దృష్టి
వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లు పలు అంశాల ఆధారంగా హెచ్చుతగ్గులను చవిచూసే వీలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా ఐటీ దిగ్గజాలు ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. విప్రో లిమిటెడ్ 12న, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ 14న, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 16న క్యూ2(జులై- సెప్టెంబర్) ఫలితాలు విడుదల చేయనున్నాయి. ఈ కంపెనీలు ప్రకటించనున్న క్యూ3(అక్టోబర్- డిసెంబర్) ఆదాయ అంచనాలు(గైడెన్స్) సెంటిమెంటును ప్రభావితం చేసే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇతర అంశాలూ దేశీ కంపెనీల క్యూ2 ఫలితాలతోపాటు.. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐల) పెట్టుబడులు, ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు సైతం మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించే వీలున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా భారీ సహాయక ప్యాకేజీకి సిద్ధమంటూ తెలియజేయడంతో వారాంతాన ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు జోరందుకున్నాయి. ఈ జోరు తొలి సెషన్లో కొనసాగే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న అధ్యక్ష ఎన్నికల డిబేట్‌పై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు. కాగా.. వచ్చే వారం యూఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ నెలకు రిటైల్ అమ్మకాలు, ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల చేయనుంది. 40,000కు సెన్సెక్స్ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఆర్బీఐ లిక్విడిటీ చర్యలు ప్రకటించడం, యూఎస్ ప్రభుత్వ ప్యాకేజీపై అంచనాలు వంటి అంశాలు గడిచిన వారం దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. దీంతో శుక్రవారం(9)తో ముగిసిన వారంలో సెన్సెక్స్ 1,812 పాయింట్లు లాభపడింది. 40,509 వద్ద ముగిసింది. తద్వారా 40,000 పాయింట్ల కీలక మార్క్ ఎగువన స్థిరపడింది. నిఫ్టీ సైతం 497 పాయింట్లు జమ చేసుకుని 11,914 వద్ద నిలిచింది. వెరసి మార్కెట్లు 7 నెలల గరిష్టం వద్ద ముగిశాయి. ఐటీ, ఫైనాన్స్ దిగ్గజాలు విప్రో 19 శాతం, టీసీఎస్ 12 శాతం, ఇన్ఫోసిస్ 9 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 11 శాతం, హెచ్డీఎఫ్సీ 9 శాతం చొప్పున ఎగశాయి. -
టీసీఎస్ ఫలితాలు, అంతర్జాతీయ సంకేతాలు కీలకం
ఐటీ కంపెనీ టీసీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్‌కు కీలకం కానున్నది. దీంతో పాటు మారటోరియం రుణాలపై వడ్డీ మాఫీ అంశంపై సుప్రీం కోర్టు విచారణ... తదనంతర పరిణామాలు, కరోనా కేసులు, వ్యాక్సిన్ సంబంధిత వార్తలు, అంతర్జాతీయ సంకేతాలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కరోనా సోకడం... ఆయన ఆరోగ్య స్థితిగతులు కూడా ఈ వారం ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతాయి. ఈ నెల 7న టీసీఎస్ ఫలితాలు.... మారటోరియం రుణాలపై, వడ్డీ మాఫీపై సుప్రీం కోర్టులో నేడు(సోమవారం) విచారణ జరగనున్నది. ఈ కేసు విషయమై సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు బ్యాంక్ రంగ షేర్లపై ప్రభావం చూపనున్నది. సోమవారం నాడే∙సేవల రంగం పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎమ్ఐ) గణాంకాలు వస్తాయి. ఇక ఈ నెల 7 (బుధవారం) టీసీఎస్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నది. గత వారం సెన్సెక్స్, నిఫ్టీలు బాగా పెరిగినందున ఈ వారం లాభాల స్వీకరణకు అవకాశముందని కొందరు నిపుణులంటున్నారు. మూడు నెలల తర్వాత ‘విదేశీ’ అమ్మకాలు.... విదేశీ ఇన్వెస్టర్ల మూడు నెలల కొనుగోళ్లకు సెప్టెంబర్‌లో బ్రేక్‌పడింది. కరోనా కేసులు పెరుగుతుండటం, అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో మార్కెట్లో అనిశ్చితి నెలకొనడం దీనికి కారణం. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.7,783 కోట్ల నికర అమ్మకాలు జరపగా, డెట్ సెగ్మెంట్లో రూ. 4,364 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. వెరశి మన క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.3,419 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే, భారత మార్కెట్ విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆకర్షించగలదని నిపుణులంటున్నారు. మెరుగుపడుతున్న వ్యాపార సెంటిమెంట్ సీఈవోలతో సీఐఐ సర్వే క్రమంగా దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆశలు రేకెత్తిస్తూ.. వ్యాపార సంస్థల్లో సెంటిమెంట్ మెరుగుపడుతోంది. కంపెనీల పనితీరు కూడా క్రమేపీ మెరుగుపడగలదని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (సీఈవో) భావిస్తున్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన సీఈవోల సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మెటల్స్, మైనింగ్, తయారీ, ఆటో, ఫార్మా, ఇంధనం, ఇన్ఫ్రా, నిర్మాణ తదితర రంగ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు ఇందులో పాల్గొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో సామర్థ్యాల వినియోగం 50 శాతానికి పైగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. అంటువ్యాధుల కట్టడిలో లాక్డౌన్ల ప్రయోజనాలు తక్కువగా ఉంటాయని సర్వే అభిప్రాయపడింది. ఎకానమీని పూర్తిగా తెరిస్తేనే డిమాండ్ మెరుగుపడుతుందని, తద్వారా ఉత్పత్తికి ఊతం లభిస్తుందని పేర్కొంది. -
కరెంట్ అకౌంట్ మిగులు @ 20 బిలియన్ డాలర్లు
ముంబై: కరెంట్ అకౌంట్ లావాదేవీల విషయంలో 2020 వరుసగా రెండవ త్రైమాసికం ఏప్రిల్–జూన్‌లోనూ భారత్ మిగులను నమోదు చేసుకుంది. ఈ మొత్తం 19.8 బిలియన్ డాలర్లుగా నమోదయినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. సంబంధిత త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ఇది 3.9 శాతం. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కూడా కరెంట్ అకౌంట్ మిగులు 0.6 బిలియన్ డాలర్లు (0.1 శాతం) నమోదయ్యింది. అంటే ఏమిటి? ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసాన్ని కరెంట్ అకౌంట్ ప్రతిబింబిస్తుంది. వస్తువులు, సేవలకు సంబంధించి ఒక దేశం ఎగుమతులు–దిగుమతుల లావాదావీల వ్యయాలు, విదేశీ ఇన్వెస్టర్లకు చేసిన చెల్లింపులు, వారి నుంచి వచ్చిన నిధులు, ఆయా పరిమాణాల వ్యత్యాసాలు అన్నీ కరెంట్ అకౌంట్లోకి వస్తాయి. సహజంగా భారత్ కరెంట్ అకౌంట్‌లోటు (క్యాడ్)ను కలిగి ఉంటుంది. అయితే కోవిడ్–19 నేపథ్యంలో దిగుమతులు భారీగా పడిపోవడంతో కరెంట్ అకౌంట్ మిగులు నమోదవుతోంది. 2019–20లో కరెంట్ అకౌంట్ లోటు 24.6 బిలియన్ డాలర్లు. జీడీపీలో ఇది 0.9 శాతం. 2020–2021లో 30 బిలియన్ డాలర్ల కరెంట్ అకౌంట్ ‘మిగులు’ ఉంటుందని ఇక్రా అంచనా. -
బంగారం డిమాండ్ 70% డౌన్
ముంబై: భారత్ పసిడి డిమాండ్ ఏప్రిల్–జూన్ మధ్య 70 శాతం పడిపోయిందని ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) నివేదిక పేర్కొంది. కోవిడ్–19 నేపథ్యంలో మార్చి 25 నుంచి విధించిన లాక్డౌన్ ప్రభావం, అధిక ధరల వంటి అంశాలు డిమాండ్ భారీ పతనానికి కారణమని వివరించింది. ‘క్యూ2 పసిడి డిమాండ్ ట్రెండ్స్’ పేరుతో విడుదలైన నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► 2019 రెండవ త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో పసిడి డిమాండ్ 213.2 టన్నులు. ఈ పరిమాణం 2020 ఇదే నెలల మధ్య 63.7 టన్నులకు పరిమితమైంది. ► ఇక డిమాండ్ విలువ విషయానికి వస్తే, 57 శాతం పతనమై రూ.62,420 కోట్ల నుంచి రూ.26,600 కోట్లకు క్షీణించింది. ► ఆభరణాల డిమాండ్ పరిమాణంలో 74 శాతం తగ్గి 168.6 టన్నుల నుంచి 44 టన్నులకు పడింది. విలువలో చూస్తే, 63 శాతం పడిపోయి, రూ.49,380 కోట్ల నుంచి రూ. 18,350 కోట్లకు చేరింది. పెళ్లిళ్లు జరక్కపోవడం, భవిష్యత్తుపై అనిశ్చితి వాతావరణం వంటి అంశాలు దీనికి కారణం. ► ఇక పెట్టుబడుల విషయానికి వస్తే, పరిమాణం డిమాండ్ 56 శాతం క్షీణించి 44.5 టన్నుల నుంచి 19.8 టన్నులకు జారింది. విలువల్లో 37 శాతం క్షీణించి 13,040 కోట్ల నుంచి రూ.8,250 కోట్లకు చేరింది. ► పసిడి రీసైకిల్డ్ పరిమాణం కూడా 64 శాతం క్షీణతతో 37.9 టన్నుల నుంచి 13.8 టన్నులకు దిగివచ్చింది. నేషనల్ లాక్‌డౌన్‌తో రిఫైనరీలు మూతపడ్డం దీనికి ప్రధాన కారణం. ► పసిడి దిగుమతులు భారీగా 95 శాతం క్షీణించి 247.4 టన్నుల నుంచి కేవలం 11.6 టన్నులకు పరిమితం. ► కాగా 2020 మొదటి ఆరునెలల్లో భారత్ పసిడి డిమాండ్ 56 శాతం పతనమై 165.6 టన్నులకు క్షీణించింది. పెట్టుబడులు అదుర్స్... పసిడి అంతర్జాతీయంగా డిమాండ్ సైతం ఏప్రిల్–జూన్ మధ్య 11 శాతం పడిపోయింది. 2019 ఇదే కాలంలో పోల్చి చూస్తే డిమాండ్ 1,136.9 టన్నుల నుంచి 1,015.7 టన్నులకు క్షీణించినట్లు డబ్ల్యూజీసీ తాజా నివేదిక పేర్కొంది. అయితే పెట్టుబడులకు సంబంధించి డిమాండ్ మాత్రం భారీగా పెరగడం గమనార్హం. జీవితకాల గరిష్ట స్థాయిల్లో ధర... మరోవైపు పసిడి ధరలు అంతర్జాతీయంగా జీవితకాల గరిష్ట స్థాయిల్లోనే కొనసాగుతున్నాయి. ఈ వారం మొదట్లో సోమవారం అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి ఆగస్టు కాంట్రాక్ట్ ఔన్స్ (31.1 గ్రా) ధర తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,911.60 డాలర్లను బ్రేక్ చేసిన తర్వాత తిరిగి అంతకన్న కిందకు దిగిరాలేదు. అటు తర్వాత రెండు రోజుల్లో 1,974.7 డాలర్లకు చేరి సరికొత్త రికార్డును సృష్టించిన ధర గురువారం 1,936–1,965 డాలర్ల శ్రేణిలో ఉంది. ఇక భారత్ విషయానికి వస్తే, అంతర్జాతీయ దూకుడు ధోరణికితోడు రూపాయి బలహీన ధోరణి (ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో గురువారం డాలర్ మారకంలో ముగింపు 74.84) పసిడికి వరంగా మారుతోంది. స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.53,000– రూ.54,000 మధ్య తిరుగుతుండగా, ఆభర ణాల బంగారం రూ.50,000పైనే ట్రేడవుతోంది. -
కాగ్నిజెంట్ క్యూ2 వీక్- కొత్త సీఎఫ్‌వో ఎంపిక
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020) రెండో త్రైమాసికంలో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీస్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. అంతేకాకుండా కోవిడ్-19 నేపథ్యంలో 2020 పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాల(గైడెన్స్)ను సైతం కుదించింది. క్యూ2(ఏప్రిల్-జూన్)లో కంపెనీ నికర లాభం 29 శాతం క్షీణించి 36.1 కోట్ల డాలర్లకు పరిమితమైంది. వార్షిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 3.4 శాతం తక్కువగా 4 బిలియన్ డాలర్లకు చేరింది. కరోనా వైరస్‌తోపాటు ఇతర రాన్సమ్వేర్ సమస్యలతో క్యూ2 పనితీరు బలహీనపడినట్లు కంపెనీ పేర్కొంది. జాన్ సిగ్మండ్ సెప్టెంబర్ 1 నుంచి కంపెనీ సీఎఫ్‌వోగా జాన్ సిగ్మండ్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు కాగ్నిజెంట్ టెక్నాలజీస్ తాజాగా వెల్లడించింది. ప్రస్తుత సీఎఫ్‌వో కరెన్ మెక్లాఫ్లిన్ ఆగస్ట్ చివరివరకూ పదవిలో కొనసాగుతారని, తదుపరి కంపెనీ సలహాదారుగా సేవలందిస్తారని తెలియజేసింది. 17ఏళ్లపాటు సేవలు అందించిన కరెన్ పదవీ విరమణ చేయనున్నట్లు తెలియజేసింది. సిగ్మండ్ ఇటీవల ఆటోమాటిక్ డేటా ప్రాసెసింగ్ కంపెనీకి సీఎఫ్‌వోగా వ్యవహరించారు. కాగా.. కాగ్నిజెంట్ ఇండియా కంట్రీ ఎండీగా వ్యవహరించిన రామ్‌కుమార్ రమణమూర్తి, గ్లోబల్ డెలివరీ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించిన ప్రదీప్ షిలీజీ ఇటీవల కంపెనీ నుంచి వైదొలగిన విషయం విదితమే. 2-0.5 శాతం డౌన్ 2020 పూర్తి ఏడాదిలో కంపెనీ ఆదాయం 16.4-16.7 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదుకావచ్చని కాగ్నిజెంట్ తాజాగా అంచనా వేసింది. ఇది 2-0.5 శాతం క్షీణతకాగా.. కొన్ని కంటెంట్ సంబంధ సర్వీసుల నుంచి వైదొలగడం వల్ల 1.1 శాతంమేర మార్జిన్లపై ప్రతికూల ప్రభావం పడవచ్చని పేర్కొంది. విదేశీ మారక ప్రభావం సైతం 0.2 శాతంమేర ప్రతిఫలించవచ్చని అభిప్రాయపడింది. నిర్వహణ మార్జిన్లు 15.1 శాతం నుంచి 14.1 శాతానికి నీరసించాయి. డిజిటల్ జోరు మొత్తం ఆదాయంలో డిజిటల్ విభాగం వాటా పెరుగుతున్నట్లు కాగ్నిజెంట్ తెలియజేసింది. క్యూ2లో 14 శాతం వృద్ధి చూపగా.. మొత్తం ఆదాయంలో 42 శాతం వాటాను ఆక్రమించినట్లు వివరించింది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో 50 శాతం అధికంగా బుకింగ్స్ సాధించినట్లు తెలియజేసింది. ఇందుకు డిజిటల్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) విభాగాలు ప్రధానంగా సహకరించినట్లు పేర్కొంది. -
టెల్కోలపై ‘ఏజీఆర్’ పిడుగు
న్యూఢిల్లీ: ఏజీఆర్‌పై (సవరించిన స్థూల ఆదాయం) సుప్రీంకోర్టు తీర్పు టెలికం కంపెనీలకు పెనుభారంగా మారింది. ఈ తీర్పు కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో వొడాఫోన్ ఐడియా రూ.50,921 కోట్లు, ఎయిర్టెల్ కంపెనీ రూ.23,045 కోట్ల నికర నష్టాల్ని ప్రకటించాయి. ఈ రెండు కంపెనీల నష్టాల మొత్తం సుమారుగా రూ.74,000 కోట్లకు చేరింది. టెలికం వ్యాపారేతర ఆదాయాలూ టెల్కోల స్థూల ఆదాయం (ఏజీఆర్) కిందే పరిగణించాలన్న ప్రభుత్వ వాదనలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ఏజీఆర్‌లో నిర్దిష్ట మొత్తాన్ని లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం వినియోగ చార్జీల కింద ప్రభుత్వానికి టెల్కోలు చెల్లించాల్సి ఉంటుంది. క్యూ2లో ఎయిర్‌టెల్‌పై భారం 28,450 కోట్లు టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్‌కు ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) సెప్టెంబర్ త్రైమాసిక కాలానికి భారీగా నష్టాలు వచ్చాయి. ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) విషయమై సుప్రీం కోర్ట్ ఇటీవల ఇచ్చిన తీర్పుతో కంపెనీకి ఈ క్యూ2లో అత్యధిక స్థాయిలో త్రైమాసిక నష్టాలు తప్పలేదు. గత క్యూ2లో రూ.119 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ2లో రూ.23,045 కోట్ల నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయని ఎయిర్టెల్ తెలిపింది. ఈ క్యూ2లో ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.21,199 కోట్లకు పెరిగిందని పేర్కొంది. కొత్త అకౌంటింగ్ విధానాలను అనుసరించినందువల్ల గత క్యూ2, ఈ క్యూ2 ఆర్థిక ఫలితాలను పోల్చడానికి లేదని వివరించింది. సుప్రీంకోర్టు ఏజీఆర్ విషయమై తాజాగా ఇచ్చిన తీర్పు కారణంగా స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీలు(ఎస్‌యూసీ), లైసెన్స్ ఫీజు తదితర అంశాలకు సంబంధించి ఈ క్యూ2లో ఈ కంపెనీపై రూ.28,450 కోట్ల భారం పడిం ది. దీంతో కంపెనీ నికర నష్టాలు రూ.23,045 కోట్లకు పెరిగాయి. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక త్రైమాసిక నష్టం. ఏజీఆర్ భారం లేకుంటే కంపెనీ నికర నష్టాలు రూ.1,123 కోట్లుగా ఉండేవి. నిర్వహణ లాభం రూ. 6,343 కోట్ల నుంచి రూ.8,936 కోట్లకు పెరిగింది. భారత విభాగం ఆదాయం 3% పెరిగి రూ.15,361 కోట్లకు చేరింది. ఆఫ్రికా విభాగం ఆదాయం 13% ఎగసింది. వొడాఫోన్ ఐడియాపై పెనుభారం... ఏజీఆర్ ప్రభావంతో వొడాఫోన్ ఐడియా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో భారీ నష్టాలను ప్రకటించింది. ఈ క్యూ2లో రూ.50,921 కోట్ల నికర నష్టాలు వచ్చాయని వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఇంత వరకూ ఏ భారత కంపెనీ కూడా ఈ స్థాయిలో నష్టాలను ప్రకటించలేదు. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో తమ నష్టాలు రూ.4,874 కోట్లని కంపెనీ వెల్లడించింది. ఇక ఆదాయం 42 శాతం ఎగసి రూ.11,146 కోట్లకు పెరిగిందని వివరించింది. సుప్రీం తాజా తీర్పు కారణంగా తాము చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలు రూ.44,150 కోట్లుగా ఉంటాయని అంచనా వేసిన వొడాఫోన్ ఐడియా, ఈ క్యూ2లో రూ.25,680 కోట్ల మేర కేటాయింపులు జరిపింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఇరు కంపెనీల ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలపై ప్రతికూల అంచనాలతోనే ఈ రెండు షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. ఎయిర్టెల్ షేర్ బీఎస్ఈలో 1.5% నష్టంతో రూ.363 వద్ద ముగిసింది. వొడాఫోన్ ఐడియా షేర్ 20% క్షీణించి రూ.2.95 వద్దకు చేరింది. మొత్తం బకాయిలు రూ.1.4 లక్షల కోట్లు... టెలికం విభాగం తాజా అంచనాల ప్రకారం... ఏజీఆర్‌కు సంబంధించి ఎయిర్టెల్ రూ.62,187 కోట్లు, (టాటా గ్రూప్ టెలికం కంపెనీలను, టెలినార్‌ను కూడా విలీనం చేసుకున్నందు వల్ల వాటి భారం ఎయిర్టెల్ మీదనే పడింది) వొడాఫోన్ ఐడియాలు రూ.54,184 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ బకాయిలను 3 నెలల్లోగా చెల్లించాలని సుప్రీం తన తీర్పులో పేర్కొంది. తాజాగా సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోగానే ఈ బకాయిలను చెల్లించాలని టెలికం విభాగం నోటీసులు జారీ చేసింది. మొత్తం టెలికం కంపెనీలు ప్రభుత్వానికి రూ.1.4 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. ఐడియా రివ్యూ పిటిషన్...!: ఏజీఆర్‌కు సంబంధించి స్పష్టత లేదంటూ గత నెలలోనే వెల్లడించాల్సిన ఆర్థిక ఫలితాలను ఎయిర్టెల్ వాయిదా వేసింది. కాగా టెలికం పరిశ్రమ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఈ దృష్ట్యా ప్రభుత్వం ఏజీఆర్‌పై సానుకూల నిర్ణయం తీసుకోగలదన్న ఆశాభావాన్ని క్యూ2 ఫలితాల వెల్లడి సందర్భంగా ఎయిర్టెల్ వ్యక్తం చేసింది. మరోవైపు ఏజీఆర్ విషయమై ఒక రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేయాలని వొడాఫోన్ ఐడియా సన్నాహాలు చేస్తోంది. ఏజీఆర్‌కు సంబంధించి సానుకూల నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటేనే తమ కంపెనీ కొనసాగగలదని వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైననే తమ కంపెనీ మనుగడ ఆధారపడి ఉందని వివరించింది. -
క్యూ2 లో సన్ ఫార్మాకు భారీ లాభాలు
సాక్షి, ముంబై : హెల్త్‌కేర్ దిగ్గజం సన్‌ఫార్మా సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 1065 కోట్ల లాభం ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 270 కోట్ల నష్టం ప్రకటించింది. ఆసమయంలో కంపెనీ వన్‌టైమ్ నష్టం రూ. 1214 కోట్లను భరించాల్సివచ్చింది. తాజా సమీక్షా కాలంలో కంపనీ రెవెన్యూ 17.1 శాతం పెరిగి రూ. 8123 కోట్లను చేరింది. దేశీయ, అంతర్జాతీయ విక్రయాలు పెరగడం కంపెనీ రెవెన్యూ పెరుగుదలకు దోహదం చేసింది. క్యు2లో కంపెనీ ఎబిటా 17 శాతం దూసుకుపోయి రూ. 1790 కోట్లను చేరింది, కానీ మార్జిన్ మాత్రం ఫ్లాట్‌గా 22 శాతం వద్దే నమోదయింది. సమీక్షా కాలంలో కంపెనీ ఇతర ఆదాయాలు దాదాపు 43 శాతం పడిపోయి రూ. 201 కోట్లకు చేరాయి. దేశీయ మార్కెట్లో సన్ ఫార్మా నంబర్ 1 స్థానంలో ఉందని, ఫార్మా మార్కెట్ పరిశోధనా సంస్థ జూన్ -2019 నివేదిక ప్రకారం132,000 కోట్ల రూపాయలతో సుమారు 8.2 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంద సంస్థ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. క్యూ 2 ఆదాయాలపై సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ సాంఘ్వి మాట్లాడుతూ, క్యూ 2, పనితీరు నిరంతర వృద్ధి వేగాన్ని ప్రదర్శిస్తోందనీ, ఈ ఏడాది గైడెన్స్‌కు అనుగునంగా ఉందని పేర్కొన్నారు. ప్రధానంగా దేశీయ విక్రయాలు 35 శాతం పెరిగి రూ. 2515 కోట్లను తాకగా, ఇతర మార్కెట్లలో విక్రయాలు 49 శాతం పెరిగి 16.1 కోట్ల డాలర్లను చేరాయి.ఇతర మార్కెట్లలో ముఖ్యంగా వర్ధమాన మార్కెట్లలో విక్రయాలు మంచి మెరుగుదల చూపాయి, ఇదే సమయంలో యూఎస్ విక్రయాలు మాత్రం యథాతధంగా కొనసాగాయి. ఈ త్రైమాసికంలో యుఎస్ అమ్మకాలు 424 మిలియన్ డాలర్లు, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఫ్లాట్ . అయితే మొత్తం ఏకీకృత అమ్మకాలలో 30 శాతం వాటా ఉంది. మొదటి సగం అమ్మకాలు 763 మిలియన్ డాలర్లు, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 6 శాతం వృద్ధిని నమోదు చేసింది.ఈ గురువారం ముగింపులో షేరు దాదాపు మూడున్నర శాతం లాభపడి442.50 రూపాయల వద్ద ముగిసింది. -
పీఎన్బీ లాభం రూ. 507 కోట్లు
సాక్షి,ముంబై: దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలను మంగళవారం ప్రకటించింది. ఈ ఆర్థికసంవత్సరం క్యూ2లో బ్యాంక్ రూ.507.05 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం ఆదాయం 11శాతం వృద్ధితో రూ.15,556.61 కోట్లను నమోదు చేసింది. గతేడాది క్యూ2లో మొత్తం ఆదాయం రూ.14,035.88 కోట్లుగా ఉంది. ఇదే త్రైమాసికంలో రూ.4,262 నికర వడ్డీ ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ2లో సాధించిన రూ.3,974 కోట్ల పోలిస్తే ఇది 7.2శాతం అధికం.మొండిబకాయిలకు రూ.2,928.90 కోట్ల ప్రొవిజన్లను కేటాయించింది. ఇదే ఏడాది క్యూ1లో రూ.2,023.31 కోట్లను మాత్రమే కేటాయించింది. గతేడాది క్యూ2లో కేటాయించిన రూ.9,757.90 కోట్లతో పోలిస్తే 70శాతం తక్కువ. త్రైమాసిక ప్రాతిపదికన స్థూల ఎన్పీఏలు 16.76శాతానికి , నికర ఎన్పీఏలు 7.65శాతానికి పెరిగాయి. ఫలితాల ప్రకటన తర్వాత ఈ షేరు 5.3 శాతం తగ్గి రూ .64.60 వద్ద ముగిసింది. -
రికార్డుల హోరు
స్టాక్ మార్కెట్లో రికార్డుల మోత మోగుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్లను నెలకొల్పింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన స్థాయి, 11,900 పాయింట్ల ఎగువకు ఎగబాకింది. కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు అంచనాలను మించి పోతుండటం, సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు....వీటన్నింటి ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా ఏడో ట్రేడింగ్ సెషన్లోనూ లాభాల్లోనే ముగిశాయి. మార్చి తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా ఇన్ని రోజులు లాభపడటం ఇదే మొదటిసారి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 4 పైసలు పుంజుకొని 70.77 కు చేరడం సానుకూల ప్రభావం చూపించింది. అయితే సెన్సెక్స్ రికార్డ్ లాభాల కారణంగా పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఇంట్రాడే లాభాలు తగ్గాయి. లోహ, టెలికం, ఐటీ షేర్లు లాభపడగా, వాహన షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. రికార్డ్ బ్రేక్... బీఎస్ఈ సెన్సెక్స్ 137 పాయింట్ల లాభంతో 40,302 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది సెన్సెక్స్‌కు జీవిత కాల గరిష్ట స్థాయి ముగింపు దీంతో ఈ ఏడాది జూన్ 3 నాటి ఆల్‌టైమ్ క్లోజింగ్ రికార్డ్, 40,268 పాయింట్ల రికార్డ్ బద్దలైంది. ఇక ఇంట్రాడేలో కూడా సెన్సెక్స్ జీవిత కాల గరిష్ట స్థాయి, 40,483 పాయింట్లను తాకింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 51 పాయింట్లు పెరిగి 11,941 పాయింట్ల వద్ద ముగిసింది. ఆల్‌టైమ్ హై (12,103 పాయింట్లు)కు 162 పాయింట్ల దూరంలో నిఫ్టీ ఉంది. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరు చూపించింది. లాభాల స్వీకరణ కారణంగా ఆరంభ లాభాలు ఆవిరైనా, చివరకు లాభాల్లోనే ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 318 పాయింట్లు, నిఫ్టీ 98 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. అన్నీ శుభ శకునములే... విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం, అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ రిస్క్‌లు తగ్గుముఖం పట్టటం, వృద్ధి జోరు పెంచడం లక్ష్యంగా మరిన్ని సంస్కరణలకు కేంద్రం తెరతీయనున్నదన్న వార్తలు... ఇవన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిస్తున్నాయి. ఈ నెలలో విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటిదాకా మన క్యాపిటల్ మార్కెట్లో రూ.16,464 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. విదేశీ ఇన్వెస్టర్లు నికర కొనుగోళ్లు జరపడం ఇది వరుసగా రెండో నెల. చైనా–అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారు దశకు రావడంతో ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు కూడా లాభాల్లోనే ముగిశాయి. ► అవకతవకలు చోటు చేసుకున్నాయనడానికి ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని కంపెనీ స్పష్టతనివ్వడంతో ఇన్ఫోసిస్ షేర్ 3 శాతం లాభంతో రూ.709 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్ ఇదే. ► ఈ క్యూ2లో రూ.629 కోట్ల నికర నష్టాలు రావడంతో యెస్ బ్యాంక్ షేర్ ఇంట్రాడేలో 10 శాతం మేర పతనమై రూ.60ను తాకింది. ఆ తర్వాత రికవరీ అయి 0.75 శాతం నష్టంతో రూ.66 వద్ద ముగిసింది. ఒక దశలో ఈ షేర్ 8 శాతానికి పైగా లాభంతో రూ.71ను తాకడం విశేషం. ► సెన్సెక్స్‌తో పాటు పలు షేర్లు కూడా ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ హోల్డింగ్స్, అబాట్ ఇండియా, అదానీ గ్రీన్, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ బ్యాంక్, ఐనాక్స్ లీజర్, మణప్పురం ఫైనాన్స్, మెట్రోపొలిస్ హెల్త్‌కేర్, మిధాని, ఎమ్‌ఎస్‌టీసీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
హెచ్డీఎఫ్సీ లాభం రూ.10,749 కోట్లు
న్యూఢిల్లీ: భారత్‌లో అతి పెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ, హెచ్డీఎఫ్సీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.10,749 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గతేడాది ఇదే క్వార్టర్లో లాభం, రూ.6,097 కోట్లుతో పోల్చితే 76% వృద్ధి సాధించామని హెచ్డీఎఫ్సీ తెలిపింది. గృహ్ ఫైనాన్స్‌లో వాటా విక్రయం, అనుబంధ కంపెనీల నుంచి డివిడెండ్ ఆదాయం బాగా పెరగడం, పన్ను భారం తగ్గడం వల్ల నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. ఆదాయం రూ.22,951 కోట్ల నుంచి రూ.32,851 కోట్లకు పెరిగిందని పేర్కొంది. 18 శాతం రుణ వృద్ధి...: పన్ను భారం రూ.1,022 కోట్ల నుంచి రూ.569 కోట్లకు తగ్గింది. గత క్యూ2లో రూ.6 కోట్లుగా ఉన్న డివిడెండ్ ఆదాయం ఈ క్యూ2లో 186 రెట్లు ఎగసి రూ.1,074 కోట్లకు పెరిగింది. 18% రుణ వృద్ధి సాధించామని తెలిపింది. నికర వడ్డీ ఆదాయం 16% వృద్ధితో రూ.3,078 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లో ఎలాంటి మార్పు లేకుండా 3.3 శాతం రేంజ్‌లోనే ఉంది. స్థూల మొండి బకాయిలు సీక్వెన్షియల్‌గా 1.29% నుంచి స్వల్పంగా 1.33%కి పెరిగాయని వివరించింది. కేటాయింపులు గత క్యూ2లో రూ.890 కోట్లుగా ఉండగా, ఈ క్యూ2లో రూ.754 కోట్లకు తగ్గాయని తెలిపింది. స్టాండ్అలోన్ లాభం...61 శాతం అప్.... స్టాండ్అలోన్ పరంగా నికర లాభం రూ.2,467 కోట్ల నుంచి 61 శాతం వృద్ధితో రూ.3,962 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ.11,257 కోట్ల నుంచి 20 శాతం వృద్ధితో రూ.13,494 కోట్లకు పెరిగింది. గృహ్ ఫైనాన్స్ కంపెనీని బంధన్ బ్యాంక్‌కు విక్రయించడం వల్ల రూ.1,627 కోట్ల పన్నుకు ముందు లాభాలు వచ్చాయని తెలిపింది. బీఎస్ఈలో హెచ్డీఎఫ్సీ షేర్ 2.4 శాతం లాభంతో రూ.2,181 వద్ద ముగిసింది. -
40,000 దాటిన సెన్సెక్స్
ఆదాయపు పన్ను విషయంలో, ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించిన పన్ను అంశాల్లో కూడా ఊరటనిచ్చే నిర్ణయాలను కేంద్రం తీసుకోనున్నదన్న వార్తల కారణంగా బుధవారం స్టాక్ మార్కెట్ లాభపడింది. కంపెనీల సానుకూల క్యూ2 ఫలితాలు, షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు కలసివచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 40,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,800 పాయింట్ల ఎగువకు ఎగబాకాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల నిర్ణయం నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో అప్రమత్తత నెలకొన్నా, మన మార్కెట్ మాత్రం ముందుకే దూసుకుపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు పతనమై 70.91కు చేరినా, ఆ ప్రభావం కనిపించలేదు. బీఎస్ఈ సెన్సెక్స్ 220 పాయింట్ల లాభంతో 40,052 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 11,844 పాయింట్ల వద్ద ముగిశాయి. ప్రభుత్వ రంగ కంపెనీలు, ఐటీ, ఆయిల్, గ్యాస్ షేర్లు పెరిగాయి. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. ఆల్‌టైమ్ హై స్థాయిలకు ఈ రెండు సూచీలు చెరో 250 పాయింట్ల దూరంలోనే ఉన్నాయి. ఈక్విటీ పన్ను సంస్కరణలు.. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ)ను రద్దు చేయనున్నారని, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను(ఎల్టీసీజీ), సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్టీటీ)ల్లో కూడా మార్పులు, చేర్పులు చేయనున్నారన్ని వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాలను మించుతుండటం, ప్రభుత్వ కంపెనీల్లో వాటా విక్రయం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల తగ్గింపు అంచనాలు.. ఇవన్నీ సానుకూల ప్రభావం చూపించాయి. ► భారీ రుణభారంతో ఇప్పటికే కుదేలైన టెలికం కంపెనీలకు తాజాగా ఏజీఆర్ విషయమై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో కష్టాలు మరింతగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ రంగానికి బెయిలవుట్ ప్యాకేజీ నిమిత్తం కార్యదర్శుల సంఘాన్ని కేంద్రం నియమించింది. ఈ నేపథ్యంలో టెలికం షేర్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఆరంభంలో 8.5% ఎగసిన వొడాఫోన్ ఐడియా షేర్ చివరకు 1% నష్టంతో రూ.3.81 వద్ద ముగిసింది. ఎయిర్టెల్ షేర్ 2.3% లాభంతో రూ.368 వద్ద ముగిసింది. -
28 శాతం క్షీణించిన ఐసీఐసీఐ లాభం
సాక్షి, ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసిక ఫలితాల్లో నష్టాలను మోదు చేసింది. క్యూ2లో బ్యాంక్ నికర లాభం 28 శాతం క్షీణించి రూ. 655 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2018-19) క్యూ2లో రూ. 909 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం మాత్రం 26 శాతం ఎగసి రూ. 8057 కోట్లను తాకింది. వార్షిక ప్రాతిపదికన ప్రొవిజన్లు రూ. 3994 కోట్ల నుంచి రూ. 2507 కోట్లకు క్షీణించాయి. ఇతర ఆదాయం రూ. 3156 కోట్ల నుంచి రూ. 4194 కోట్లకు చేరింది. పన్ను వ్యయాలు రూ. 346 కోట్ల నుంచి రూ. 3712 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో 13 శాతం రుణ వృద్ధిని సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 6.49 శాతం నుంచి 6.9 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు మాత్రం 1.77 శాతం నుంచి 1.74 శాతానికి నీరసించాయి. స్థూల స్లిప్పేజెస్ రూ. 2779 కోట్ల నుంచి రూ. 2482 కోట్లకు వెనకడుగు వేశాయి. నికర వడ్డీ మార్జిన్లు 3.61 శాతం నుంచి 3.64 శాతానికి మెరుగుపడ్డాయి. కాగా ఫలితాలపై అంచనాలతో శుక్రవారం ఎన్ఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు 3.2 శాతం జంప్‌చేసి రూ. 469 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 471 సమీపంలో 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఫలితాల ప్రభావం దివాలీ మూరత్ ట్రేడింగ్‌లో కనిపించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. -
అదరగొట్టిన ఎస్బీఐ
సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) క్యూ2 ఫలితాల్లో అదరగొట్టింది. మొదటి త్రైమాసికంతో పోలిస్తే... సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎస్బీఐ లాభం మూడింతలైంది. రూ.3,012 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే క్యూ2లో ఆర్జించిన రూ.945 కోట్లతో పోలిస్తే ఇది 218 శాతం అధికం. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ.26,600 కోట్లకు చేరింది. బ్యాంక్ ఎన్పీఏలు తగ్గాయి. స్థూల ఎన్పీఏలు 7.8శాతం నుంచి 7.3శాతానికి, నికర ఎన్పీఏలు 3.07శాతం నుంచి 2.97శాతానికి తగ్గాయి. తాజా మొండిబకాయిలు ఈ ఏడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే రూ.16,217 కోట్ల నుంచి రూ.8,805 కోట్లకు తగ్గాయి. శుక్రవారం మధ్యాహ్నం వెల్లడించిన ఈ ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ షేరు దూసుకుపోతోంది. ఎన్ఎస్ఈలో 7 శాతం లాభంతో రూ.281వద్ద ట్రేడ్ అవుతోంది. -
ఇండిగోకు రూ. 1062కోట్లు నష్టం
సాక్షి, ముంబై : బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఇండిగో ఫలితాల్లో మరోసారి చతికలపడింది. ఇండిగో పేరెంట్ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ గురువారం ప్రకటించిన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో భారీ నష్టాలను నమోదు చేసింది. రూ.1,062 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అధిక ఖర్చులు, మార్కెట్ నష్టాలు ఈ లాభాల క్షీణతకు కారణమని ఇండిగో ఫలితాల వెల్లడి సందర్భంగా ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలంలో కంపెనీకి రూ .651.5 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ మొత్తం ఆదాయం 31 శాతం పెరిగి రూ .8,539.8 కోట్లు. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో రూ .6,514.1 కోట్లు. రూ .4,282 మిలియన్ల క్యాపిటలైజ్డ్ ఆపరేటింగ్ లీజులపై మార్క్-టు-మార్కెట్ నష్టాలు, 3,190 మిలియన్ల అధిక నిర్వహణ వ్యయం తమ లాభాలను గణనీయంగా ప్రభావితం చేశాయని అని కంపెనీ తెలిపింది. -
నాలుగో రోజూ లాభాలే...
స్టాక్ మార్కెట్ లాభాలు వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లోనూ కొనసాగాయి. ఆర్థిక, ఇంధన, ఐటీ రంగ షేర్ల జోరుతో సెన్సెక్స్, నిఫ్టీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. అయితే ట్రేడింగ్ ఆద్యంతం సెన్సెక్స్, నిఫ్టీలు లాభ, నష్టాల మధ్య దోబూచులాడాయి. రోజం తా 249 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 93 పాయింట్ల లాభంతో 38,599 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 11,464 పాయింట్ల వద్దకు చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 17 పైసలు పుంజుకోవడం కలసివచ్చింది. 249 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, విప్రో, ఏసీసీ తదితర కంపెనీల క్యూ2 ఫలితాలు పటిష్టంగా ఉండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ప్రపంచ మార్కెట్లు ఫ్లాట్‌గా ఉన్నా, మన మార్కెట్ వరుసగా నాలుగో రోజు లాభపడిందని శాంక్టమ్ వెల్త్ మేనేజ్మెంట్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సునీల్ శర్మ తెలిపారు. కంపెనీల ఫలితాల సీజన్ అంచనాల కంటే మెరుగ్గానే ఉందని అంతేకాకుండా భవిష్యత్తు అంచనాలపై కంపెనీల యాజమాన్యాలు ఆశావహ ప్రకటనలు చేయడం సానుకూల ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. 20,000 కోట్ల డాలర్ల కంపెనీగా రిలయన్స్! రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 20,000 కోట్ల డాలర్ల మార్కెట్ క్యాప్ గల తొలి కంపెనీగా అవతరించే సత్తా ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ తెలిపింది. ప్రస్తుతం 12,200 కోట్ల డాలర్ల మార్కెట్ క్యాప్ గల ఈ కంపెనీ రెండేళ్లలో ఈ ఘనత సాధించగలదని ఈ సంస్థ అంచనా వేస్తోంది. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో ఎస్ఎమ్ఈ ఎంటర్ప్రైజ్ స్పేస్‌లోకి ప్రవేశించడం, జియో ఫైబర్ బిజినెస్.. తదితర అంశాలతో రిలయన్స్ ఈ ఘనత సాధించనున్నదని పేర్కొంది. -
అంచనాలు దాటేసిన విప్రో : 36 శాతం ఎగిసిన లాభం
సాక్షి, ముంబై : దేశీయ ఐటీ దిగ్గజం విప్రో రెండవ త్రైమాసిక ఫలితాలను మంగళవారం వెల్లడించింది. విశ్లేషకుల అంచనాలను మించి ఫలితాలను నమోదు చేసింది. మార్కెట్ ముగిసిన తరువాత ప్రకటించిన ఫలితాల్లో సంస్థ భారీ నికర లాభాల సాధించింది. నికర లాభాలు వార్షిక ప్రాతిపదికన 36 శాతం ఎగిసాయి. గత ఏడాది ఇదే క్వార్టర్లోని 1886 కోట్ల రూపాయలతో పోల్చితే ఏడాది క్యూ2లో రూ. 2650కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. ఎనలిస్టులు రూ.2303 కోట్ల లాభాలను అంచనావేశారు. ఎబిటా మార్జిన్లు 18.1 శాతంగా ఉన్నాయి. ఆదాయం 4 శాతం ఎగిసి రూ. 15,130 కోట్లను ఆర్జించింది. ఐటీ ఉత్పత్తుల విభాగం ఆదాయం రూ. 320 కోట్లుగా ఉంది. మూడవ క్వార్టర్‌కు సంబంధించిన రెవెన్యూ గెడెన్స్ 0.8 శాతంనుంచి 2.8 శాతంగా పేర్కొంది. రానున్న త్రైమాసికంలో ఆదాయాలు, మార్జిన్లు మరింత మెరుగ్గా ఉండనున్నాయని విప్రో సీఎండీ అబిదాలి నీముచ్వాలా తెలిపారు. తన ఐటీ సేవల వ్యాపారం ఆదాయం డిసెంబర్ 31 తో ముగిసిన త్రైమాసికంలో 0 2,065 మిలియన్- 10 2,106 మిలియన్ల పరిధిలో ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. -
క్యూ2 ఫలితాలే దిక్సూచి..!
ఈ వారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్తాన్ యూనిలివర్, విప్రో, అంబుజా, తదితర దిగ్గజ సంస్థలు తమ క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. కంపెనీల క్యూ2 ఫలితాలతో పాటు ప్రపంపవ్యాప్తంగా చోటు చేసుకునే పరిణామాలు కూడా ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. మరోవైపు నేడు (సోమవారం) విడుదలయ్యే రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాల, గత శుక్రవారం వెల్లడైన పారిశ్రామికోత్పత్తి గణాంకాల ప్రభావం కూడా మార్కెట్‌పై ఉంటుందని వారంటున్నారు. పాక్షిక ఒప్పందం.... గత 15 నెలలుగా జరుగుతున్న అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధానికి గత శుక్రవారం జరిగిన పాక్షిక ఒప్పందంతో ఒకింత తెరపడింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలతో అంతర్జాతీయ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన పాక్షిక ఒప్పందం ఒకింత సానుకూల ప్రభావం చూపించవచ్చు. అయితే పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు భగ్గుమంటే ఆ ప్రభావం మన మార్కెట్‌పై ప్రతికూలంగానే ఉంటుంది. నేడు రిటైల్ గణాంకాలు నేడు సెప్టెంబర్ నెలకు సంబంధించిన రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడవుతాయి. రేపు(ఈ నెల 15న) ఎగుమతుల గణాంకాలు వస్తాయి. ఇక ఈ నెల 1–4న జరిగిన ఆర్బీఐ ద్రవ్య, పరపతి విధాన సమావేశ వివరాలు (మినిట్స్) 18న(శుక్రవారం) వెల్లడవుతాయి. ఒడిదుడుకులు... ఫలితాల సీజన్ ఆరంభమై ఇది రెండో వారం. ఈ వారంలో దాదాపు 96 కంపెనీలు తమ ఫలితాలను వెల్లడించనున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్తాన్ యూనిలివర్, ఎస్బీఐ లైఫ్, విప్రో, ఏసీసీ, జీ ఎంటర్టైన్మెంట్, హెచ్డీఎప్సీ బ్యాంక్, అంబుజా సిమెంట్స్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, టీవీఎస్ మోటార్స్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, పీవీఆర్, ఈ జాబితాలో ఉన్నాయి. కంపెనీల ఫలితాలు మార్కెట్ మూడ్‌ను నిర్దేశిస్తాయని శామ్కో సెక్యూరిటీస్ ఎనలిస్ట్ జిమీత్ మోదీ పేర్కొన్నారు. దిగ్గజ కంపెనీల ఫలితాల వెల్లడి కారణంగా మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని ఎపిక్ రీసెర్చ్ ఎనలిస్ట్ ముస్తఫా నదీమ్ అంచనా వేస్తున్నారు.ఇక అంతర్జాతీయంగా చూస్తే, చైనా క్యూ3 జీడీపీ గణాంకాలు ఈ నెల 18న వస్తాయి. అమెరికా సెప్టెంబర్ నెలకు సంబంధించిన రిటైల్ అమ్మకాల వివరాలు ఈ నెల 16న (బుధవారం) వస్తాయి. 6,200 కోట్ల విదేశీ నిధులు వెనక్కి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటిదాకా మన క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.6,200 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ఎఫ్‌పీఐలు స్టాక్ మార్కెట్ నుంచి రూ.4,955 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.1,262 కోట్లు చొప్పున మొత్తం రూ.6,217 కోట్లు పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అంతర్జాతీయ వృద్ధి భయాలు, వాణిజ్య యుద్ధ ఆందోళనలు, ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నా, ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో పుంజుకోలేకపోవడం దీనికి కారణాలు. కంపెనీల క్యూ2 ఫలితాలు, ప్రపంచ వాణిజ్య పరిణామాలు, ఆర్థిక మందగమనాన్ని నిరోధించేందుకు ప్రభు త్వం తీసుకునే చర్యలు తదితర అంశాలపై విదేశీ నిధుల భవిష్యత్తు పెట్టుబడులు ఆధారపడి ఉంటాయని నిపుణులంటున్నారు. -
మెప్పించిన ఇన్ఫీ!
న్యూఢిల్లీ/బెంగళూరు: దేశీయంగా రెండో అతి పెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్.. మార్కెట్ వర్గాల అంచనాలకు అనుగుణమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. శుక్రవారం వెల్లడైన గణాంకాల ప్రకారం నికర లాభం స్వల్పంగా 2.2 శాతం క్షీణించి రూ. 4,019 కోట్లుగా నమోదైంది. మార్కెట్ వర్గాలు ఇది సుమారు రూ. 4,040 కోట్లు ఉంటుందని అంచనా వేశాయి. గతేడాది ఇదే వ్యవధిలో లాభం రూ. 4,110 కోట్లు. మరోవైపు, రెండో త్రైమాసికంలో ఆదాయం 9.8% వృద్ధితో రూ. 20,609 కోట్ల నుంచి రూ. 22,629 కోట్లకు పెరిగింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన 11.4 శాతం వృద్ధి నమోదైంది. 2019–20 ఆర్థిక సంవత్సర ఆదాయ గైడెన్స్‌ను ఇన్ఫోసిస్ పెంచింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన 9–10 శాతానికి సవరించింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో రెవెన్యూ వృద్ధి 7.5–9.5 శాతంగా ఉండొచ్చంటూ గైడెన్స్ ఇచ్చిన ఇన్ఫోసిస్ తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో దీన్ని 8.5–10 శాతానికి పెంచింది. తాజాగా కనీస ఆదాయ వృద్ధి గైడెన్స్‌ను మరింత పెంచింది. సెప్టెంబర్ త్రైమాసికంలో షేరు ఒక్కింటికి రూ. 8 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. టీసీఎస్ లాభంలో స్వల్ప వృద్ధి సాధించగా, ఇన్ఫీ లాభాలు స్వల్పంగా తగ్గడం గమనార్హం. 2.8 బిలియన్ డాలర్ల డీల్స్.. మరో త్రైమాసికంలో అన్ని విభాగాల్లోనూ, ప్రాంతాలవారీగాను ఆల్ రౌండ్ వృద్ధి సాధించగలిగాం. క్లయింట్లకు మాపై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం. 2.8 బిలియన్ డాలర్ల విలువ చేసే డీల్స్ కుదుర్చుకోగలిగాం. ఉద్యోగులకు మరింత ప్రయోజనాలు చేకూర్చేందుకు తీసుకుంటున్న చర్యలతో అట్రిషన్ రేటును తగ్గించుకోగలిగాం‘. – ప్రవీణ్ రావు, సీవోవో బహుముఖ వృద్ధి.. నిర్వహణ మార్జిన్లు, సామర్ధ్యాలు, ఆదాయాలు, డిజిటల్ విభాగం మెరుగుపడటంతో పాటు భారీ డీల్స్ కుదుర్చుకోగలిగాం. ఆట్రిషన్ తగ్గింది. దీంతో అన్ని విభాగాల్లోనూ మెరుగైన పనితీరు సాధించగలిగాం. వాటాదారులకు మరింత విలువ చేకూర్చడంతో పాటు క్లయింట్లకు అవసరమైన సేవలపై మరింతగా దృష్టి పెట్టే దిశగా కంపెనీ పురోగతి సాధిస్తోందనడానికి ఇవన్నీ స్పష్టమైన సంకేతాలు’. – సలిల్ పరేఖ్, ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ 14% అదనంగా డివిడెండ్ నిర్వహణపరంగా అన్ని అంశాలను మెరుగుపర్చుకోవడంతో పాటు వ్యయాలు నియంత్రించుకోవడంతో రెడో త్రైమాసికంలో నిర్వహణ మార్జిన్లు పెంచుకోగలిగాం. నిధులను మెరుగ్గా వినియోగించుకునే∙దిశగా మధ్యంతర డివిడెండ్‌ను గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 14 శాతం పెంచగలిగాం’. – నీలాంజన్ రాయ్, సీఎఫ్ఓ మరిన్ని విశేషాలు.. ► సెప్టెంబర్ త్రైమాసికంలో డాలర్ మారకంలో నికర లాభం 569 మిలియన్ డాలర్లు కాగా ఆదా యం 3.21 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ► సీక్వెన్షియల్‌గా నికర లాభం 6 శాతం, ఆదాయం 3.8 శాతం పెరిగింది. ► డిజిటల్ విభాగం ఆదాయాలు 38.4 శాతం వృద్ధి చెంది 1.23 బిలియన్ డాలర్లకు చేరాయి. మొత్తం ఆదాయంలో ఈ విభాగం వాటా 38.3 శాతానికి చేరింది. ► 21–23 శాతం శ్రేణిలో ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్ యథాతథం. ► రూ. 8,260 కోట్ల విలువ చేసే షేర్ల బైబ్యాక్ కార్యక్రమం ఆగస్టు 26తో ముగిసింది. ► రెండో త్రైమాసికంలో నికరంగా 7,457 మంది నియామకాలు జరిగాయి. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.36 లక్షలకు చేరింది. ► ఆట్రిషన్ రేటు జూన్ ఆఖరు నాటికి 23.4 శాతంగా ఉండగా, సెప్టెంబర్ క్వార్టర్లో 21.7 శాతానికి తగ్గింది. స్టాక్ మార్కెట్ ముగిసిన తర్వాత ఇన్ఫోసిస్ ఫలితాలు వెల్లడయ్యాయి. బీఎస్ఈలో సంస్థ షేరు 4.19% పెరిగి రూ. 815.70 వద్ద ముగిసింది. -
ఇన్ఫోసిస్ ప్రోత్సాహకర ఫలితాలు
ముంబై : ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ అంచనాలకు అనుగుణంగా రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్ క్వార్టర్లో సంస్థ మొత్తం రాబడి గత ఏడాది రూ 21348 కోట్లు కాగా ప్రస్తుత త్రైమాసంలో రూ 23,255 కోట్లుగా నమోదైంది. నికర లాభం 2.2 శాతం తగ్గి రూ 4019 కోట్లు ఆర్జించింది. రెవెన్యూ రాబడి, డిజిటల్ వృద్ధి, నిర్వహణ మార్జిన్లు, భారీ ప్రాజెక్టుల రాక, సిబ్బంది నిష్క్రమణ వంటి పలు రంగాల్లో సానుకూల వృద్ధిని సాధించామని ఇన్ఫోసిస్ ఎండీ, సీఈఓ సలీల్ పరేఖ్ పేర్కొన్నారు. రెండో క్వార్టర్లో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించి సరైన బాటలో సాగుతున్నామనేందుకు ఈ ఫలితాలు సంకేతమని వ్యాఖ్యానించారు. ఇన్ఫోసిస్ తమ వాటాదారులకు షేర్‌కు రూ 8 డివిడెండ్‌ను ప్రకటించింది. రెండో త్రైమాసంలో తాము అన్ని విభాగాలోల మెరుగైన వృద్ధిని కనబరిచామని, ఉద్యోగుల నిష్ర్కమణ కూడా తగ్గుముఖం పట్టిందని ఈ క్వార్టర్లో భారీ ఒప్పందాలు తమకు కలిసివచ్చాయని సీఎఫ్ఓ నీలంజన్ రాయ్ పేర్కొన్నారు. -
టీసీఎస్‌కు ఫలితాల షాక్
సాక్షి, ముంబై: ఐటీ మేజర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు క్యూ2 ఫలితాల షాక్ తగిలింది. దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభంలో 400 పాయింట్లకు పైగాఎగిసినప్పటికీ టీసీఎస్ షేరు టాప్ లూజర్‌గా నిలిచింది. సెప్టెంబరు త్రైమాసిక ఆదాయాలు మార్కెట్ అంచనాలను అందుకోలేక పోవడంతోశుక్రవారం టీసీఎస్ షేర్లు 4 శాతం క్షీణించాయి. అటుకీలక సూచీలు కూడా ట్రేడర్ల అమ్మకాలతో భారీ లాభాలనుంచి వెనక్కి తగ్గాయి. సెన్సెక్స్,నిఫ్టీ కీలకమద్దతుస్థాయిలను కోల్పోయి స్వల్ప లాభాలతో తీవ్ర ఊగిసలాట మధ్య కొనసాగుతున్నాయి. గురువారం మార్కెట్ ముగిసిన తరువాత ప్రకటించిన ఫలితాల ప్రకారం.. ఈ ఏడాది రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేకపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో కంపెనీ నికర లాభం 1.8 శాతం వృద్ధి చెంది రూ. 8,042 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నికర లాభం రూ. 7,901 కోట్లు. ఇక జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో ఆదాయం 5.8% పెరిగి రూ. 36,854 కోట్ల నుంచి రూ. 38,977 కోట్లకు చేరింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయ వృద్ధి 8.4శాతంగా నమోదైంది.రూ. 1 ముఖవిలువ గల షేరు ఒక్కింటికి రూ. 5 చొప్పున రెండో విడత మధ్యంతర డివిడెండుతో పాటు రూ. 40 మేర ప్రత్యేక డివిడెండ్ చెల్లించాలని టీసీఎస్ బోర్డు నిర్ణయించింది. దీనికి రికార్డు తేదీ అక్టోబర్ 18. చెల్లింపు తేదీ అక్టోబర్ 24. చదవండి : టీసీఎస్..అంచనాలు మిస్ -
ఇండస్ఇండ్ లాభం రూ.1,401 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంక్ నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 52 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ2లో రూ.920 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) క్యూ2లో రూ.1,401 కోట్లకు పెరిగిందని ఇండస్ఇండ్ బ్యాంక్ తెలిపింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, నికర లాభం స్వల్పంగా తగ్గిందని బ్యాంక్ సీఈఓ రమేశ్ సోబ్తి చెప్పారు. కేటాయింపులు పెరగడం, నికర వడ్డీ మార్జిన్ తక్కువ వృద్ధిని నమోదు చేయడం దీనికి కారణాలని వివరించారు. మొత్తం ఆదాయం రూ.6,755 కోట్ల నుంచి రూ.8,878 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నికర వడ్డీ మార్జిన్ 4.1 శాతం నికర వడ్డీ ఆదాయం 32 శాతం వృద్ధితో రూ.2,909 కోట్లకు పెరిగిందని రమేశ్ సోబ్తి తెలిపారు. సీక్వెన్షియల్‌గా చూస్తే, నికర వడ్డీ మార్జిన్ మెరుగుపడి 4.1 శాతానికి ఎగసిందని వివరించారు. 21 శాతం రుణ వృద్ధి సాధించామని, ఇది బహుళ సంవత్సరాల కనిష్ట స్థాయి అని, మందగమనం ప్రభావం మరో ఆరు నెలల పాటు ఉండగలదని అంచనా వేస్తున్నామన్నారు. ఎగబాకిన మొండిబకాయిలు... నికర లాభం, ఆదాయాలతో పాటు బ్యాంక్ మొండి బకాయిలు కూడా పెరిగాయి. రుణ నాణ్యత వార్షికంగా, సీక్వెన్షియల్‌గా చూసినా క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 1.09 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో 2.19 శాతానికి పెరిగాయని రమేశ్ సోబ్తి వెల్లడించారు. అలాగే నికర మొండి బకాయిలు 0.48 శాతం నుంచి 1.12 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు. తాజా మొండి బకాయిలు ఈ క్యూ1లో రూ.725 కోట్లుగా ఉండగా, ఈ క్యూ2లో రూ.1,102 కోట్లకు పెరిగాయని తెలిపారు. దీంట్లో కంపెనీల తాజా మొండి బకాయిలు 174 శాతం, రిటైల్ రుణాలకు సంబంధించిన తాజా మొండి బకాయిలు 13 శాతం చొప్పున పెరిగాయని వివరించారు. ఇక కేటాయింపులు రూ.590 కోట్ల నుంచి 71 శాతం వృద్ధితో రూ.738 కోట్లకు చేరాయని వివరించారు. ఈ క్యూ1లో 43 శాతంగా ఉన్న ప్రొవిజన్ కవరేజ్ రేషియో ఈ క్యూ2లో 50 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. నికర లాభం, ఆదాయం పెరిగినా, మొండి బకాయిలు రెట్టింపై రుణనాణ్యత క్షీణించడంతో ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు 6.1 శాతం నష్టంతో రూ. 1,229 వద్ద ముగిసింది. -
టీసీఎస్.. అంచనాలు మిస్
ముంబై: దేశీ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేకపోయాయి. గురువారం వెల్లడించిన ఫలితాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో కంపెనీ నికర లాభం 1.8 శాతం వృద్ధి చెంది రూ. 8,042 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నికర లాభం రూ. 7,901 కోట్లు. ఇక జూలై–సెప్టె ంబర్ త్రైమాసికంలో ఆదాయం 5.8% పెరిగి రూ. 36,854 కోట్ల నుంచి రూ. 38,977 కోట్లకు చేరింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయ వృద్ధి 8.4%గా నమోదైంది. సాధారణంగా దేశీ ఐటీ సేవల కంపెనీలకు జూలై–సెప్టెంబర్ త్రైమాసికం మెరుగ్గా ఉండే నేపథ్యంలో టీసీఎస్ ఆదాయ వృద్ధి 9–9.5 శాతం శ్రేణిలో ఉండొచ్చని, లాభం రూ. 8,304–8,322 కోట్ల మేర ఉండగలదని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. రూపాయి మారకం విలువ క్షీణించడం, వీసా ఖర్చులు తగ్గడం వంటి సానుకూల అంశాలు ఉన్నప్పటికీ లాభాలు.. అంచనాలకు అనుగుణంగా లేకపోవడం అశ్చర్యకరమని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. టీసీఎస్ గతంలో ఇచ్చిన రెండంకెల స్థాయి వృద్ధికి రిస్కులు పొంచి ఉన్నాయనడానికి తాజా ఫలితాలు నిదర్శనమని, స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి 9 శాతానికి దిగువనే ఉండొచ్చని బ్రోకరేజి సంస్థ ఎమ్కే గ్లోబల్ పేర్కొంది. రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల సీజన్ టీసీఎస్‌తోనే ప్రారంభం కావడంతో.. మిగతా కంపెనీల ఫలితాలెలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. సీక్వెన్షియల్‌గా చూస్తే లాభం 1.09 శాతం క్షీణించింది. జూన్ క్వార్టర్లో లాభం రూ. 8,131 కోట్లు. మరోవైపు తొలి త్రైమాసికంలో ఆదాయం రూ. 38,172 కోట్లుగా ఉండగా, రెండో త్రైమాసికంలో రూ. 38,977 కోట్లకు చేరింది. తగ్గిన మార్జిన్లు.. నిర్వహణ పనితీరుకు సంబంధించి వడ్డీలు, పన్నులకు ముందు లాభాలు (ఎబిట్) వార్షిక ప్రాతిపదికన 4.2 శాతం క్షీణించి రూ. 9,361 కోట్లకు చేరగా, మార్జిను 250 బేసిస్ పాయింట్లు తగ్గింది. తొమ్మిది త్రైమాసికాల కనిష్ట స్థాయి అయిన 24 శాతానికి పరిమితమైంది. సీక్వెన్షియల్‌గా చూసినా మార్జిను 15 బేసిస్ పాయింట్లు తగ్గింది. సామ ర్థ్యాలను పెంచుకునే దిశగా మరింత ఇన్వెస్ట్ చేస్తుండటం మార్జిన్లపై ప్రభావం చూపినట్లు సంస్థ వెల్లడించింది. కాగా, విశ్లేషకులు ఎబిట్ రూ. 9,834 కోట్లుగాను, మార్జిను 25 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. కంపెనీ 26–28 శాతం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. సవాళ్లు పొంచి ఉన్నాయ్... ఏడాది ప్రారంభంలో మేం అంచనా వేసిన దానికన్నా ఫలితాలు తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ఆర్థిక సేవలు, రిటైల్ విభాగాల్లో ఒడిదుడుకులు తీవ్రంగా పెరిగినప్పటికీ రెండో త్రైమాసికంలో స్థిరంగా వృద్ధి నమోదు చేయగలిగాం. మధ్యకాలికంగా, దీర్ఘకాలికంగా మా సేవలకు డిమాండ్ కొనసాగుతుందని ధీమాగా ఉన్నాం. గడిచిన ఆరు త్రైమాసికాల్లోనే అత్యధిక స్థాయిలో ఉన్న క్యూ2లో ఆర్డర్ బుక్ ఇందుకు నిదర్శనం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సవాళ్లతో కూడుకున్నట్లుగానే కనిపిస్తోంది. పెద్ద సంస్థలు, బ్యాంకులు.. ఐటీ వ్యయాల్లో కోత పెడుతుండటంతో ప్రధానమైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, రిటైల్ విభాగంలో మందగమనం కొనసాగుతోంది. ఇది ఆర్థిక ఫలితాలపై గణనీయంగా ప్రతికూల ప్రభావం చూపిందని చెప్పారు. 6.4 బిలియన్ డాలర్ల ఆదాయం లభించే అవకాశాలున్న పలు డీల్స్‌ను రెండో త్రైమాసికంలో కుదుర్చుకున్నాం. – రాజేష్ గోపీనాథన్, టీసీఎస్ సీఈవో ఇతర విశేషాలు.. ► మొత్తం ఆదాయంలో డిజిటల్ సేవల విభాగం వాటా 33.2 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంతో పోలిస్తే డిజిటల్ ఆదాయం 27.9 శాతం పెరిగింది. అయితే, సీక్వెన్షియల్‌గా చూస్తే మాత్రం 40 శాతం నుంచి 28 శాతానికి తగ్గింది. ► ప్రాంతాల వారీగా యూరప్, ఇంగ్లాండ్‌లో ఆదాయాల వృద్ధి మెరుగ్గా ఉంది. కానీ అమెరికాతో పాటు భారత్, మధ్యప్రాచ్యం, ఆసియా–పసిఫిక్ ప్రాంతాలు బలహీనంగా ఉన్నాయి. ► రెండో క్వార్టర్లో ఉద్యోగుల సంఖ్య నికరంగా 14,097 మేర పెరిగింది. మొత్తం సిబ్బంది సంఖ్య 4,50,738కి చేరింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 30,000 పైచిలుకు క్యాంపస్ నియామకాలు చేపట్టనుంది. అట్రిషన్ రేటు 11.6 శాతంగా ఉంది. ► ఆదాయాలు కొంత తగ్గడం, కొత్త సిబ్బందిపై భారీ వేతనాల వ్యయాలు తదితర అంశాలు మార్జిన్లపై ప్రభావం చూపినట్లు సంస్థ సీఎఫ్‌వో వి. రామకృష్ణన్ చెప్పారు. అయితే, వ్యవస్థాగతంగా సవాళ్లేమీ లేకపోవడంతో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. వ్యాపారపరంగా ఇప్పటికే పన్ను మినహాయింపులు ఉన్నందున కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు వల్ల కంపెనీకి కొత్తగా ప్రయోజనాలేమీ ఉండబోవని రామకృష్ణన్ పేర్కొన్నారు. ► రూ. 1 ముఖవిలువ గల షేరు ఒక్కింటికి రూ. 5 చొప్పున రెండో విడత మధ్యంతర డివిడెండుతో పాటు రూ. 40 మేర ప్రత్యేక డివిడెండ్ చెల్లించాలని టీసీఎస్ బోర్డు నిర్ణయించింది. దీనికి రికార్డు తేదీ అక్టోబర్ 18. చెల్లింపు తేదీ అక్టోబర్ 24. టీసీఎస్ ఆర్థిక ఫలితాలు స్టాక్ మార్కెట్ ముగిసిన తర్వాత వెల్లడయ్యాయి. సంస్థ షేరు ఎన్ఎస్ఈలో 0.86 శాతం క్షీణించి రూ. 2,004 వద్ద క్లోజయ్యింది. -
ఉబెర్‌కు భారీ నష్టాలు
క్యాబ్ సేవల సంస్థ ఉబెర్‌కు ఈ క్వార్టర్లో భారీ షాక్ తగిలింది. 2017లో పరిమిత ఆర్థిక డేటాను వెల్లడించడం ప్రారంభించిన అనంతరం ఉబెర్ టెక్నాలజీస్ ఇంక్ అతిపెద్ద త్రైమాసిక రికార్డు నష్టాన్ని చవిచూసింది. ఉబర్ సేల్స్ భారీగా క్షీణించడంతో 5.2 బిలియన్ డాలర్లు (రూ.520 కోట్లు) నష్టపోయినట్టు ఉబర్ ఇంక్ ఒక ప్రకటనలో నివేదించింది. ఆదాయం 14శాతం పెరిగి 3.17 బిలియన్లుగా ఉంది. అయితే ఎనలిస్టులు ఊహించిన దాని కంటే ఎక్కువ నష్టాలను ప్రకటించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఐపీవో సందర్భంగా స్టాక్ ఆధారిత కంపెన్సేషన్ కారణంగా ఇంత భారీ నష్టం వాటిల్లిందని వాల్‌స్ట్రీట్ అనలిస్టులు అంచనా. ఈ ఫలితాల నేపథ్యంలో ఉబెర్ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ త్రైమాసికంలో ఉబెర్ ఖర్చులు 147శాతం పెరిగి 8.65 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ప్రధాన ప్రత్యర్థి లిఫ్ట్‌తో పోటీ నేపథ్యంలో పరిశోధన, అభివృద్ధిపై వెచ్చించిన ఖర్చు గణనీయంగా పెరిగింది. ప్రయాణికుల ట్రిప్ 20 శాతం పెరగగా, ఉబెర్ తన డ్రైవర్లకు చెల్లించిన తర్వాత ఉంచిన మొత్తం కేవలం 4 శాతం మాత్రమే పెరిగింది. కంపెనీలు చారిత్రాత్మకంగా రైడర్లను ఆకర్షించడానికి సబ్సిడీపై ఆధారపడ్డాయి. స్థూల బుకింగ్‌లు15.76 బిలియన్లు (సంవత్సరానికి 37శాతం పెరిగింది)గా ఉన్నాయి. ఫుడ్ డెలివరీ ఉబెర్ ఈట్స్ ఆదాయం 72 శాతం పెరిగి 595 మిలియన్ డాలర్లకు చేరుకుంది. మరోవైపు ఉబెర్ ప్రత్యర్థి లిఫ్ట్ బుధవారం ప్రకటించిన ఫలితాల్లో ఊహించిన దానికంటే మెరుగైన ఆదాయ గణాంకాలను నమోదు చేసింది. ప్రధానంగా రైడింగ్ సేవల వ్యాపారంలో వృద్ధి మందగించడంతో తీవ్ర నష్టాలను చవి చూసింది. దీంతో ఉబర్ వాటాలను 6 శాతం వరకు తగ్గించింది. ఆదాయ వృద్ధి మందగించడం ఉబెర్ పోటీని విస్తరించి నిరోధించే సామర్థ్యాన్ని కోల్పోవడం నష్టాలకు దారితీసినట్టు ఆర్థిక మార్కెట్ విశ్లేషకుడు హరిస్ అన్వర్ తెలిపారు. అయితే పెట్టుబడుల దూకుడు కొనసాగిస్తామనీ, అది కూడా ఆరోగ్యకరమైన వృద్ధిగా ఉండాలని కోరకుంటున్నామని ఉబెర్ ఫలితాల సందర్భంగా ప్రకటించింది. అంతేకాదు ఈ త్రైమాసికంలో ఆ దిశగా మంచి పురోగతి సాధించామని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెల్సన్ చాయ్ అన్నారు. 2020, 2021 సంవత్సరాల్లో పెట్టుబడులు గరిష్టంగా ఉండనున్నాయని, దీంతో నష్టాలు తగ్గుతాయని భావిస్తున్నామని ఉబెర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, దారా ఖోస్రోషాహి చెప్పారు. -
జెట్ ఎయిర్వేస్కు చమురు సెగ
సాక్షి, ముంబై: అంతర్జాతీయంగా మండుతున్న చమురు ధరలు విమానయాన సంస్థల్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ఆర్థికంగా సంక్షోభంలో చిక్కి విలవిల్లాడుతున్న ప్రయివేటురంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ను బాగా ప్రభావితం చేసింది. వరుసగా మూడవ క్వార్టర్లో కూడా భారీ నష్టాలను మూట గట్టుకుంది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండవ త్రైమాసిక ఫలితాల్లో జెట్ ఎయిర్వేస్ భారీ నష్టాలను నమోదు చేసింది. రూ.1298 కోట్ల నికర నష్టాలను ప్రకటించింది. అంతకుముందు సంవత్సరం 496.3 మిలియన్ల లాభాలను సాధించింది. ఆదాయం 6161 కోట్లకు పరిమితమైంది. ఏకంగా ఇంధన వ్యయం 58.6 శాతం పెరిగి రూ. 24.20 బిలియన్లకు చేరుకుంది. ఆపరేటింగ్ ఆదాయం 9.5 శాతం పెరిగింది. మరోవైపు విక్రమం మెహతా ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా రాజీనామా చేశారు. కాగా నరేష్ గోయల్ నేతృత్వంలోని జెట్ ఎయిర్వేస్ నిధుల కొరత సమస్యను అధిగమించే వ్యూహంలో నిమగ్నమై ఉన్న సంగతి తెలిసిందే. -
క్యూ2లో ఢమాలన్న పీఎన్బీ
సాక్షి, ముంబై: దేశీయ రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) క్యూ2లో ఢమాల్ అంది. శుక్రవారం విడుదల చేసిన ఈ ఆర్థిక సంవత్సరం(2018-19) రెండో త్రైమాసిక ఫలితాల్లో నికర నష్టాలను ప్రకటించింది. సెప్టెంబర్ 30తోముగిసిన క్యూ2లో రూ. 4532 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గత త్రైమాసికంలో రూ. 940 కోట్లతో పోలిస్తే తాజా క్వార్టర్లో భారీ నష్టాలను నమోదు చేసింది. పీఎన్బీ నికర వడ్డీ ఆదాయం కూడా 1 శాతం తగ్గి రూ. 3974 కోట్లకు పరిమితమైంది. అయితే స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 18.26 శాతం నుంచి 17.16 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 10.58 శాతం నుంచి 8.9 శాతానికి నీరసించడం గమనార్హం. త్రైమాసిక ప్రాతిపదికన ప్రొవిజన్లు రూ. 5758 కోట్ల నుంచి రూ. 9758 కోట్లకు ఎగశాయి. తాజా స్లిప్పేజెస్ రూ. 5250 కోట్ల నుంచి రూ. 4476 కోట్లకు తగ్గాయి. రైటాఫ్స్ రూ. 2648 కోట్ల నుంచి రూ. 3543 కోట్లకు ఎగశాయి. ఈ ఫలితాల నేపథ్యంలో పీఎన్బీ కౌంటర్లో అమ్మకాలతో 4శాతానికి పైగా నష్టపోయింది. అయితే ఇటీవల నీరవ్‌మోదీ స్కాంతో అభాసుపాలైన పీఎన్బీ ఎసెట్ క్వాలీటీ క్వార్టర్-ఆన్ క్వార్టర్ మెరుగుపడింది. సెప్టెంబర్ చివరినాటికి రుణాల మొత్తం 17.16 శాతంగా ఉంది. జూన్ చివరి నాటికి ఇది 18.26 శాతం, అంతకు ముందు ఏడాది 13.31 శాతంగా ఉంది.