న్యూఢిల్లీ: రెండో త్రైమాసికంలో డీమార్ట్ స్టోర్ల నిర్వాహక కంపెనీ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 64 శాతంపైగా జంప్‌చేసి రూ. 686 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 418 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం దాదాపు 37 శాతం ఎగసి రూ. 10,638 కోట్లను అధిగమించింది.
గత క్యూ2లో రూ. 7,789 కోట్ల టర్నోవర్ నమోదైంది. అయితే మొత్తం వ్యయాలు 37 శాతం పెరిగి రూ. 9,926 కోట్లను తాకాయి. స్టోర్ల సందర్శకుల సంఖ్య తగ్గినప్పటికీ సరుకు కొనుగోళ్ల(బాస్కెట్) విలువ పుంజుకున్నట్లు సంస్థ సీఈవో, ఎండీ నెవిల్లే నొరోన్హా పేర్కొన్నారు.
చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు!
Comments
Please login to add a commentAdd a comment