ముంబై: ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సెప్టెంబర్ త్రైమాసికానికి ఫలితాల పరంగా ఫర్వాలేదనిపించింది. నికర లాభం 23 శాతం వృద్ధితో రూ.305 కోట్లుగా నమోదైంది. కానీ, కీలకమైన వడ్డీ ఆదా యం స్వల్పంగా తగ్గి (0.80 శాతం) రూ.1,163 కోట్లకు పరిమితమైంది. ఇందుకు కారణం ఏంటన్నది సంస్థ వెల్లడించలేదు. వ్యక్తిగత విభాగంలో రుణాల మంజూరు స్వల్పంగా తగ్గి రూ.14,300 కోట్లుగా ఉంది.
మొత్తం రుణాల వితరణ 4 శాతం పెరిగి రూ.16,110 కోట్లుగా ఉంది. సంస్థ నిర్వహణలోని మొత్తం రుణాల్లో వ్యక్తులకు ఇచ్చినవి రూ.2,16,771 కోట్లుగా ఉన్నాయి. నికర వడ్డీ మార్జిన్ ఏడాది క్రితం ఇదే కాలంలో ఉన్న 2 శాతం నుంచి 1.8 శాతానికి పరిమితమైంది. కేటాయింపులు రూ.6,552 కోట్లకు పెరిగాయి.
చదవండి: ఎయిర్‌టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment