profit
-
‘మహాకుంభ్’ ఖర్చెంత? లాభమెంత?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని సంగమ తీరంలో నిర్వహిస్తున్న కుంభమేళాకు కోట్లాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలు ప్రభుత్వానికి పలు సవాళ్లు సంధిస్తున్నారు. వీటికి సీఎం యోగి ఆదిత్యనాథ్ సమాధానమిచ్చారు. మహాకుంభమేళా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందని, కోట్లాదిమంది తరలివస్తున్నారని, ఈ నేపధ్యంలో ప్రయాగ్‌రాజ్, కాశీ, అయోధ్యలను కూడా దర్శిస్తున్నారని సీఎం పేర్కొన్నారు.‘యువ పారిశ్రామికవేత్తలతో సంభాషణ’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ మహాకుంభమేళాపై విమర్శలు గుప్పిస్తున్నవారు.. ఈ భారీ కార్యక్రమం కారణంగా రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతున్నదని గ్రహించాలన్నారు. మహాకుంభమేళా నిర్వహణకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సంయుక్తంగా రూ. 7,500 కోట్లు ఖర్చు చేస్తున్నాయని, ఫలితంగా రాష్ట్రానికి మూడు లక్షల కోట్లకుపైగా ఆదాయం రానున్నదనే అంచనాలున్నాయన్నారు.కుంభమేళా సందర్భంగా అయోధ్య, ప్రయాగ్‌రాజ్, కాశీ, చిత్రకూట్, గోరఖ్‌పూర్, నైమిశారణ్యంలో పలు వసతులు కల్పించామని సీఎం అన్నారు. ఒక్క ఏడాదిలో అయోధ్యకు కానుకలు, విరాళాల రూపంలో రూ. 700 కోట్లు సమకూరాయన్నారు. మహాకుంభమేళాలో ఫిబ్రవరి 17 నాటికి మొత్తం రూ.54 కోట్ల 31 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారన్నారు. మహాకుంభమేళా ఫిబ్రవరి 26(శివరాత్రి) వరకూ కొనసాగనుంది. ఇది కూడా చదవండి: Railway Station Stampede: రద్దీ నియంత్రణకు మూడు విధానాలు -
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లాభం రూ.645 కోట్లు
దేశంలో అతి పెద్ద రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (Star Health Insurance) 2024 డిసెంబర్ 31తో ముగిసిన తొమ్మిది నెలలకు గాను తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ ఈ తొమ్మిది నెలల వ్యవధిలో రూ. 645 కోట్ల లాభం (PAT) నమోదు చేసింది.2025 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలంలో (9MFY25) ఆర్థికంగా, నిర్వహణపరంగా స్టార్ హెల్త్ స్థిరమైన పనితీరును సాధించింది. కంపెనీ కంబైన్డ్ నిష్పత్తి 101.8%గా, క్లెయిమ్స్ నిష్పత్తి 70.66%గా నమోదయ్యాయి. వ్యయ నిష్పత్తి 31.18 శాతంగా ఉంది. పెట్టుబడులపై ఆదాయం రూ. 996 కోట్లుగా ఉంది. అదే సమయంలో కంపెనీ పెట్టుబడులు పెట్టిన అసెట్స్ విలువ 15 శాతం పెరిగి రూ. 16,666 కోట్లకు చేరుకుంది.“టెక్నాలజీని ఉపయోగించుకుని, పటిష్టమైన భాగస్వామ్యాలను పెంపొందించుకోవడం ద్వారా ఆరోగ్య బీమా ప్రతి ఒక్కరికి సులభతరంగా, అందుబాటులో ఉండేలా చూడాలనేది మా లక్ష్యం. ఆరోగ్య సంరక్షణ విషయంలో భారతదేశ పురోభివృద్ధికి తోడ్పడుతూ, ఆరోగ్య బీమా వ్యవస్థను పటిష్టం చేస్తూ, 2047 నాటికి అందరికీ బీమా ఉండాలన్న ఐఆర్డీఏఐ చైర్మన్ విజన్‌ను సాకారం చేసే దిశగా, దేశీయంగా బీమా విషయంలో నెలకొన్న అంతరాలను తగ్గించేందుకు కృషి చేస్తున్నాం” అని స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో ఆనంద్ రాయ్ తెలిపారు. -
నాటు కోళ్లతో మంచి ఆదాయం ఆర్జిస్తున్న యువజంట..
నాటు కోళ్లు, జాతి (పందెం) కోళ్ల పెంపకం మారుమూల గ్రామాల్లో సైతం రైతుకు ఆధారపడదగినంత స్థాయిలో నిరంతర ఆదాయాన్ని అందిస్తుందని ఓ యువజంట రుజువు చేస్తున్నారు. గత పదేళ్లుగా శ్రద్ధగా ఈ పని చేస్తే ప్రజలకు ఆరోగ్యదాయకమైన మాంసం, గుడ్లను అందించటంతోపాటు స్వగ్రామంలోనే స్వయం ఉపాధి కల్పించుకుంటున్నారు రైతు దంపతులు ఉపేందర్‌రావు, జ్యోతి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం బొజ్జాయిగూడేనికి చెందిన నిరుద్యోగులైన మూలగుండ్ల ఉపేందర్‌రావు, వజ్జా జ్యోతి పదేళ్ల క్రితం ఇంటి వద్ద ఒక షెడ్డును ఏర్పాటు చేసుకొని నాటు, పందెం కోళ్ల పెంపకం చేపట్టారు. చుట్టూ కోళ్ల ఎగిరి పోకుండా ఎత్తు జాలీ ఏర్పాటు చేశారు. నీడ కోసం పరిసర ప్రాంతంలో వివిధ రకాల చెట్లను పెంచారు. కోళ్ల మధ్యకు మాములు రాకుండా చూసేందుకు సీమ కోళ్లను, రెండు కుక్కలను పెంచారు. కొన్నేళ్ల క్రితం 20 జాతి (పందెం) కోడి పిల్లలను పలు ప్రాంతాల నుంచి సేకరించి పెంచటం మొదలుపెట్టారు. వీటి గుడ్లను సాధారణ కోళ్లకు వేసి పొదిగించి పిల్లలు తీసి సంతతిని పెంచారు. తదనంతరం ఇంక్యుబేటర్‌ను సమకూర్చుకొని పందెం కోడి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. పిల్లల సైజును బట్టి వివిధ ధరలకు అమ్ముతున్నారు. 8 రకాల జాతి కోళ్లుకోళ్లను 24 గంటలూ కనిపెట్టుకొని ఉండి అన్ని పనులూ ఉపేందర్‌రావు, జ్యోతి చేసుకుంటారు. వీరి వద్ద మార్కెట్లో మార్కెట్లో గిరాకీ ఉన్న నెమలి, కాక, డేగ, రసంగి, అబ్రాస్, సీత్వాల్, కెక్కర, ఎర్ర కెక్కర వంటి అనేక రకాల జాతి కోళ్లను వీరు పెంచుతున్నారు. రెండు వందల పెట్టలు, పుంజులు ఉన్నాయి. ఇవి దాణా కంటే ఆకుకూరలను ఎక్కువగా తింటున్నాయి. ఇంటి పరిసరాల్లో పలు రకాల ఆకుకూరలను,మునగాను పెంచి వీటికి మేపుతున్నారు. ఫామ్ హౌస్ యజమానులు జాతి కోళ్లను ఆసక్తితో పెంచుతుండటంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేసుకెళుతున్నారు. కిలో బరువు గల జాతి కోడి రూ. 4 నుంచి 5 వేలు పలుకుతోంది. నెలలోపు చిన్న పిల్లలైతే రూ. 300 వరకు పలుకుతోందని ఉపేందర్ రావు తెలిపారు. మునగాకుతో జబ్బులకు చెక్!మొదట్లో కడక్‌నా«ద్ కోళ్ల పెంపకం చేపట్టాం. మారుమూల ప్రాంతం కావటంతో వాటికన్నా జాతి (పందెం) కోళ్ల పెంపకంతోనే అధిక ఆదాయం వస్తోంది. జాతి కోడిగుడ్లను ఇంక్యుబేటర్ ద్వారా పోదిగించి పిల్లలను అమ్మటం వల్ల మంచి ఆదాయం పొందుతున్నాం. రెండు, మూడు సార్లు మందులు వాడితే ఈ కోళ్లకు ఎలాంటి జబ్బులు రావు. ముఖ్యంగా మునగ ఆకు తినిపిస్తే కోళ్లకు జబ్బులు వచ్చే ఛాన్సే లేదని ఉపేందర్‌రావు(95023 48987) అనుభవపూర్వకంగా చెబుతున్నారు. – ఇల్లెందుల నాగేశ్వరరావు, సాక్షి, ఇల్లెందు (చదవండి: పాదాల నొప్పి తగ్గడానికి పొట్టలోని కొవ్వును ఇంజెక్ట్ చేస్తే చాలు!!) -
2024లో అత్యధిక లాభాలొచ్చిన తెలుగు సినిమా ఏదంటే?
2024 చివరకొచ్చేసింది. ఈ ఏడాది తెలుగు సినిమా రేంజ్ చాలా ఎత్తుకు ఎదిగింది. జనవరిలో 'హనుమాన్' దగ్గర నుంచి డిసెంబర్లో రిలీజైన 'పుష్ప 2' వరకు తగ్గేదే లే అన్నట్లు దూసుకుపోయింది. మధ్యలో 'కల్కి', 'దేవర' లాంటి మూవీస్ పాన్ ఇండియా లెవల్లో తమదైన వసూళ్లు సాధించాయి. మిగతా భాషలతో పోలిస్తే తెలుగు చిత్రాలకు ఈసారి లాభాలు బాగానే వచ్చాయని చెప్పొచ్చు. మరి ఈ ఏడాది అత్యధికంగా లాభపడిన మూవీ ఏంటి? ఎంతొచ్చాయి?తెలుగులో ఈ ఏడాది థియేటర్లలో రిలీజై మంచి వసూళ్లు సాధించిన సినిమాల అంటే.. హనుమాన్, కల్కి, దేవర, పుష్ప 2, టిల్లు స్క్వేర్, లక్కీ భాస్కర్, సరిపోదా శనివారం, గుంటూరు కారం ఉంటాయి. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న 'పుష్ప 2' దేశవ్యాప్తంగా ఇప్పటికే రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. హిందీలోనూ రూ.645 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకుని.. వందేళ్ల బాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.(ఇదీ చదవండి: భార్యని పరిచయం చేసిన హీరో శ్రీసింహా)లాభాల పరంగా చూసుకుంటే 'పుష్ప 2' సినిమా అగ్రస్థానంలో ఉంటుందా అంటే లేదని చెప్పొచ్చు. ఎందుకంటే 'పుష్ప 2'కి అటుఇటుగా రూ.500 కోట్లకు పైనే బడ్జెట్ పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే 150-200 శాతం మధ్యలోనే ఉంది. కల్కి, దేవర చిత్రాల్ని తీసుకున్నా సరే పెట్టిన బడ్జెట్‌కి కొంతమేర లాభాలు వచ్చాయి తప్పితే మరీ ఎక్కువ అయితే రాలేదు.కానీ జనవరిలో రిలీజైన 'హనుమాన్' మూవీకి మాత్రం రూ.40 కోట్లు బడ్జెట్ పెడితే.. రూ.300-350 కోట్ల వరకు వచ్చాయి. దాదాపు 600 శాతానికి పైగా వసూళ్లు వచ్చినట్లే. బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్‌కి లాభాల్లో షేర్ ఇచ్చినా సరే నిర్మాత ఈ సినిమాతో బాగానే లాభపడినట్లే! దీనిబట్టి చూస్తే 2024లో 'హనుమాన్' మోస్ట్ ప్రాఫిటబుల్ తెలుగు సినిమా అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. 'పుష్ప 2' మూవీ ఇంకా థియేటర్లలో ఉంది కాబట్టి.. రన్ పూర్తయ్యేసరికి లాభాల్లో పర్సంటేజ్ ఏమైనా మారుతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు: అల్లు అర్జున్) -
చిన్న ఐటీ కంపెనీ.. భారీ లాభాలు
సాంకేతిక శిక్షణ, ఐటీ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ సొల్యూషన్లు అందించే విన్సిస్ ఐటీ సర్వీసెస్ ఇండియా ఈ ఏడాది(2024–25) తొలి ఆరు నెలల్లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. చిన్న సంస్థల కోసం ఏర్పాటైన ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్ ద్వారా లిస్టయిన కంపెనీ నికర లాభం ఏప్రిల్–సెప్టెంబర్‌లో 36 శాతం జంప్‌చేసి రూ. 11 కోట్లకు చేరింది.గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 8 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 16 శాతం ఎగసి రూ. 92 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. నిర్వహణ లాభం(ఇబిటా) 53% జంప్‌చేసి రూ. 15 కోట్లను దాటింది."ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాం. ముఖ్యంగా భారత్‌లో డిమాండ్ మందగించడం, సిబ్బంది వ్యయం పెరగడం వంటి ఇబ్బందులు పడ్డాం. అయితే మా సామర్థ్యాలు, భౌగోళికాలు, సౌకర్యాలపై సకాలంలో పెట్టుబడి పెట్టగలిగినందున అటువంటి అనిశ్చితులను ఎదుర్కొనేందుకు బలమైన పునాదిని ఏర్పాటు చేశాం" అని విన్సిస్ చైర్మన్, ఎండీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. -
పడిపోయిన ఏషియన్ పెయింట్స్ లాభం
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఏషియన్ పెయింట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 44 శాతం క్షీణించి రూ. 694 కోట్లకు పరిమితమైంది.డిమాండ్ మందగించడం, ముడివ్యయాల పెరుగుదల, డెకొరేటివ్, కోటింగ్ బిజినెస్ క్షీణించడం ప్రభావం చూపాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,232 కోట్లకుపైగా ఆర్జించింది. వాటాదారులకు షేరుకి రూ. 4.25 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. మొత్తం అమ్మకాలు సైతం 5 శాతం నీరసించి రూ. 8,028 కోట్లకు చేరాయి. గత క్యూ2లో రూ. 8,479 కోట్ల టర్నోవర్ సాధించింది.అయితే మొత్తం వ్యయాలు స్వల్పంగా 1 శాతం పెరిగి రూ. 7,093 కోట్లను దాటాయి. ఇతర వనరులతో కలిపి మొత్తం ఆదాయం 5 శాతం తక్కువగా రూ. 8,201 కోట్లను తాకింది. కాగా.. అంతర్జాతీయ అమ్మకాలు నామమాత్ర క్షీణతతో రూ. 770 కోట్లకు పరిమితమయ్యాయి. గత క్యూ2లో సాధించిన రూ. 40 కోట్ల పన్నుకుముందు లాభం(పీబీటీ)స్థానే రూ. 22 కోట్ల నష్టం ప్రకటించింది. -
అంచనాలను మించిన దివీస్ లాభం
ముంబై: ఫార్మా కంపెనీ దివీస్ ల్యాబొరేటరీస్ సెప్టెంబర్ త్రైమాసికంలో అంచనాలకు మించి రాణించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కంపెనీ నికరలాభం రూ.510 కోట్లుగా నమోదైంది. 2023–24 ఇదే త్రైమాసిక లాభం రూ.348 కోట్లతో పోలిస్తే ఇది 46% అధికం.మొత్తం ఆదాయం రూ.1,909 కోట్ల నుంచి 22.5% పెరిగి రూ.2,338 కోట్లకు చేరింది. పన్నుకు ముందు లాభం (పీబీటీ) 54% వృద్ధి చెంది రూ.469 కోట్ల నుంచి రూ.722 కోట్లకు చేరింది. మార్జిన్లు 25% నుంచి 31 శాతానికి పెరిగాయి. ఈ క్యూ2లో విదేశీ మారక ద్రవ్య లాభం (ఫారెక్స్ గెయిన్) రూ.29 కోట్లుగా ఉంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగం (ఏప్రిల్–సెప్టెంబర్)లో కంపెనీ మొత్తం ఆదాయం రూ.4,640 కోట్లు ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో మొత్తం ఆదాయం రూ.3,854 కోట్లుగా ఉంది. నికర లాభం రూ.704 కోట్ల నుంచి 33% అధికమై రూ.940 కోట్లకు చేరింది. -
లాభాల్లో దూసుకెళ్లిన టాటా గ్రూప్ కంపెనీ
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ సంస్థ ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సీఎల్) సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి పటిష్ట పనితీరు చూపించింది. లాభం మూడు రెట్లు పెరిగి రూ.583 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.179 కోట్లుగానే ఉంది.విమానయాన, సంస్థాగత కేటరింగ్ సేవల విభాగం ‘తాజ్‌శాట్స్’ స్థిరీకరణతో ఏకీకృత ఆర్జన (రూ.307కోట్లు) తోడు కావడం లాభంలో అధిక వృద్ధికి దారితీసింది. ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే రూ.1,433 కోట్ల నుంచి రూ.1,826 కోట్లకు పెరిగింది. వ్యయాలు సైతం రూ.1,249 కోట్ల నుంచి రూ.1,502 కోట్లకు పెరిగాయి.‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వీతీయ త్రైమాసికంలో డిమాండ్ బలంగా పుంజుకుంది. దీంతో ఆదాయం 28 శాతం పెరిగింది. హోటల్ విభాగంలో ఆదాయం 16 శాతం వృద్ధి చెందింది. దీంతో క్యూ2లో ఇప్పటి వరకు అత్యుత్తమ ఎబిట్డా మార్జిన్ 29.9 శాతం నమోదైంది’’అని ఐహెచ్‌సీఎల్ ఎండీ, సీఈవో పునీత్ ఛత్వాల్ తెలిపారు. 2024–25 సంవత్సరానికి రెండంకెల ఆదాయ వృద్ధి అంచనాలను కొనసాగిస్తున్నట్టు చెప్పారు. ఢిల్లీలోని ల్యాండ్‌మార్క్ హోటల్ ‘క్లారిడ్జ్’ను 2025 ఏప్రిల్‌లో స్వాధీనం చేసుకోనున్నట్టు తెలిపారు. -
బాటా ఇండియా మెరుగైన పనితీరు
న్యూఢిల్లీ: బాటా ఇండియా సెపె్టంబర్ త్రైమాసికంలో బలమైన పనితీరు చూపించింది. లాభం 53 శాతానికి పైగా పెరిగి రూ.52 కోట్లకు చేరింది. ఆదాయం మాత్రం 2 శాతానికి పైగా వృద్ధితో రూ.837 కోట్లుగా నమోదైంది. ఎబిట్డా లాభం స్థిరంగా ఉండడం నిర్వహణ సామర్థ్యాల బలాన్ని తెలియజేస్తున్నట్టు బాటా ఇండియా ప్రకటించింది. ఉత్పత్తుల ఆవిష్కరణ, కస్టమర్లకు మెరుగైన అనుభవం, టెక్నాలజీ అనుసంధానత, బ్రాండ్ ప్రమియమైజేషన్పై తాము చేసిన వ్యూహాత్మక పెట్టుబడులు ఫలితాన్నిచి్చనట్టు తెలిపింది. వినియోగంలో స్తబ్దత ఉన్నప్పటికీ తాము మెరుగైన పనితీరు చూపించినట్టు బాటా ఇండియా ఎండీ, సీఈవో గుంజన్ షా పేర్కొన్నారు. సెపె్టంబర్ చివరికి దేశవ్యాప్తంగా బాటా స్టోర్ల సంఖ్య 1,955కి చేరింది. పవర్ బ్రాండ్‌కు సంబంధించి 4, హష్ పప్పీస్కు సంబంధించి 136 బ్రాండెడ్ అవుట్లెట్లు, ఫ్లోట్జ్కు సంబంధించి 14కియోస్క్‌లను కొత్తగా తెరిచినట్టు బాటా ఇండియా తెలిపింది. -
ఫేస్బుక్ ఇండియా లాభం ఎలా ఉందంటే..
సోషల్ మీడియా దిగ్గజం మెటాకు చెందిన అడ్వర్టయిజ్మెంట్ యూనిట్ ఫేస్బుక్ ఇండియా ఆన్లైన్ సర్వీసెస్ గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో పటిష్ట ఫలితాలు సాధించింది. ఫైనాన్షియల్ రీసెర్చ్ సంస్థ టోఫ్లర్ వివరాల ప్రకారం నికర లాభం 43 శాతం జంప్‌చేసి రూ.505 కోట్లను తాకింది.టోఫ్లర్ తెలిపిన వివరాల ప్రకారం..ఫేస్బుక్ ఇండియా 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.353 కోట్ల నికర లాభం మాత్రమే ఆర్జించింది. కానీ 2023-24 ఏడాదిలో ఇది 43 శాతం పెరిగి రూ.505 కోట్లను తాకింది. కంపెనీ దేశీయంగా అడ్వర్టయిజింగ్ ఇన్వెంటరీని కస్టమర్లకు విక్రయించే సర్వీసులతోపాటు మెటా ప్లాట్‌ఫామ్స్ ఇంక్‌కు ఐటీ ఆధారిత సపోర్ట్, డిజైన్ సపోర్ట్ సేవలు సైతం అందిస్తోంది. కాగా..2023-24లో టర్నోవర్ 9 శాతంపైగా ఎగసి రూ.3,035 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది రూ.2,776 కోట్ల ఆదాయం నమోదైంది.ఇదీ చదవండి: గూగుల్ ఆస్తులమ్మినా తీరని జరిమానా!ఫేస్బుక్ ఇండియా విభాగంలో దాదాపు 2,500 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్, హ్యూమన్ రిసోర్స్, సపోర్ట్ సర్వీస్..వంటి విభిన్న విభాగాల్లో సేవలందిస్తున్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా మెటా ప్లాట్‌ఫామ్స్ సుమారు 67,317 మందికి ఉపాధి కల్పిస్తుంది. -
ఒకేరోజు రూ.3.53 నుంచి రూ.2.36 లక్షలకు చేరిన స్టాక్!
ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనే స్మాల్ క్యాప్ స్టాక్ భారీగా పెరిగి రికార్డు నమోదు చేసింది. అక్టోబర్ 29న పెరిగిన స్టాక్ విలువ ఏకంగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్లోనే ఖరీదైన స్టాక్‌గా మారింది. ఈ స్టాక్ ధర ఒక్క ట్రేడింగ్ సెషన్లో ఏకంగా 66,92,535 శాతం దూసుకుపోయింది. దాంతో గతంలో రూ.3.53గా ఉండే స్టాక్ ధర కాస్తా రూ.2,36,250కు చేరింది. ఇండియాలోనే ఇప్పటి వరకు ఖరీదైనా స్టాక్‌గా ఉన్న ఎంఆర్ఎఫ్ షేర్ ధర రూ.1.2 లక్షలును మించిపోయింది.షేర్ ధర రూ.3.53 వద్ద ఎందుకుందంటే..2011 నుంచి ఒక్కో షేరు ధర దాదాపు రూ.3గా ఉంది. కానీ ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక్కో షేర్ పుస్తక విలువ(వాస్తవ విలువ) రూ.5,85,225గా ఉంది. ఇలా కంపెనీ స్టాక్‌ల వాస్తవ విలువ ఆకర్షణీయంగా ఉండడంతో కంపెనీ షేర్లు ఎవరూ అమ్మడానికి ఇష్టపడలేదు. దాంతో షేర్ల ట్రేడింగ్ కొరత ఎక్కువైంది. తక్కువ ట్రేడింగ్ వాల్యూమ్ల కారణంగా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ నిలిపేశారు. ఫలితంగా దాదాపు ఒక దశాబ్దం పాటు స్టాక్ ధర సింగిల్ డిజిట్‌లోనే ఉంది.ఇదీ చదవండి: ‘షరతులు తీరిస్తే జాబ్ చేయడానికి సిద్ధం’ఎందుకు అంత పెరిగిందంటే..ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ వాల్యుయేషన్‌కు అనుగుణంగా ప్రత్యేక సెషన్‌ను నిర్వహించాలని స్టాక్ ఎక్స్ఛేంజీలను సెబీ ఆదేశించింది. దాంతో ఎల్సిడ్ వాటాదారుల పంట పండినట్లయింది. కొత్త మెకానిజంలో భాగంగా లిక్విడిటీని మెరుగుపరచడం, సరసమైన ధరల ఆవిష్కరణను సులభతరం చేయడం లక్ష్యంగా హోల్డింగ్ కంపెనీలకు ఎటువంటి ప్రైస్ బ్యాండ్లు విధించలేదు. దాంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నిర్వహించిన ప్రత్యేక కాల్ ఆక్షన్ సెషన్లో స్టాక్ ధర భారీగా పెరిగింది. మంగళవారం కొన్ని షేర్లు చేతులు మారిన తర్వాత, బుధవారం ఉదయం ఎటువంటి ట్రేడింగ్ కార్యకలాపాలు జరగలేదు. -
‘అలాంటివారిని ఇప్పటి వరకు చూడలేదు’
దేశీయ స్టాక్‌మార్కెట్లు ఇటీవల భారీగా పడిపోతున్న నేపథ్యంలో స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ మదుపర్లకు సలహా ఇచ్చారు. సరైన రిస్క్ మేనేజ్‌మెంట్‌తోనే స్టాక్ మార్కెట్లో లాభాలు పొందవచ్చన్నారు. మార్కెట్ ట్రెండ్‌కు తగిన వ్యూహం అనుసరించని వారు త్వరగా నష్టపోతారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విటర్లో కొన్ని అంశాలను పంచుకున్నారు.‘ఈక్విటీ మార్కెట్లో దాదాపు 20 ఏళ్ల అనుభవం ఉంది. సరైన రిస్క్ మేనేజ్మెంట్ లేనివారు లాభాలు ఆర్జించడం ఇప్పటివరకు చూడలేదు. మార్కెట్ ట్రేండ్‌కు తగిన ప్రణాళిక లేకుండా ట్రేడింగ్ చేసేవారు త్వరగా నష్టాల్లోకి వెళుతారు. మార్కెట్ రిస్క్‌లకు తగిన విధంగా పోర్ట్‌ఫోలియోను నిర్వహించాలి. లేదంటే డబ్బు సంపాదించడం కష్టం. రిస్క్ తక్కువగా తీసుకుంటే రిటర్న్‌లు కూడా అందుకు అనుగుణంగానే తక్కువ ఉంటాయి. అలాగని ఎక్కువ రిస్క్ తీసుకోవడం ప్రమాదం. కొన్నిసార్లు మొత్తం డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి రిస్క్ నిర్వహణ చాలా ముఖ్యం. పోర్ట్‌ఫోలియో ఆధారంగా రిస్క్ మేనేజ్మెంట్ ఉండాలి. ఇది ట్రేడర్, ఇన్వెస్టర్ క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుంది’ అని కామత్ అన్నారు.In the 20+ years in this business, I haven’t seen anyone who has kept profits from trading without good risk management. I know many who've lost quickly. If you don't have a plan to manage risk and size your bets, it's impossible to keep the money you make.Here are a few…— Nithin Kamath (@Nithin0dha) October 23, 2024ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య పెంపు.. ఎంతంటే..అంతర్జాతీయ అనిశ్చితులు, అమెరికా ఎన్నికలు, పెరుగుతున్న ఎఫ్ఐఐ అమ్మకాలు వెరసి స్టాక్ మార్కెట్లు ఇటీవల భారీగా నష్టపోతున్నాయి. దీర్ఘకాలంలో రాబడులు ఆశించే ఇన్వెస్టర్లకు ఇలా మార్కెట్లు నష్టపోతుండడం మంచి అవకాశంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో మరిన్ని ఎక్కువ స్టాక్‌లు తక్కువ ధరకే లభించే అవకాశం ఉందని సూచిస్తున్నారు. -
లగ్జరీ ప్రాపర్టీలకు డిమాండ్.. డీఎల్ఎఫ్ లాభం డబుల్
న్యూఢిల్లీ: లగ్జరీ ప్రాపర్టీలకు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో సెప్టెంబర్ త్రైమాసికంలో రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ. 1,381 కోట్లకు చేరింది. గత క్యూ2లో ఇది రూ. 622 కోట్లు.సమీక్షాకాలంలో మొత్తం ఆదాయం 48 శాతం పెరిగి రూ. 1,476 కోట్ల నుంచి రూ. 2,181 కోట్లకు చేరింది. ప్రథమార్ధంలో నికర లాభం రూ. 1,150 కోట్ల నుంచి రూ. 2,027 కోట్లకు ఎగిసింది. మొత్తం ఆదాయం రూ. 2,998 కోట్ల నుంచి రూ. 3,910 కోట్లకు చేరింది.మార్కెట్ క్యాపిటలైజేషన్లో డీఎల్ఎఫ్ దేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ.ఇది ప్రాథమికంగా రెసిడెన్షియల్ ప్రాపర్టీల అభివృద్ధి, విక్రయాలతోపాటు కమర్షియల్, రిటైల్ ప్రాపర్టీల అభివృద్ధి, లీజింగ్ వ్యాపారంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
న్యూజెన్ సాఫ్ట్వేర్ బంపర్ లాభాలు
న్యూఢిల్లీ: సాప్ట్వేర్ ఉత్పత్తుల సంస్థ న్యూజెన్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో (క్యూ2) బలమైన పనితీరు నమోదు చేసింది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 47 శాతం పెరిగి రూ.70 కోట్లకు చేరింది.క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.48 కోట్లుగా ఉండడం గమనార్హం. రూ.361 కోట్ల ఆదాయాన్ని సాధించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.293 కోట్లతో పోల్చి చూస్తే 23 శాతం పెరిగింది.‘‘అన్ని కీలక మార్కెట్లలో మెరుగైన పనితీరు సాధించాం. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వరుసగా రెండు త్రైమాసికాల్లో బలమైన వృద్ధి నమోదవుతోంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కీలక విభాగాలుగా ఉన్నాయి. ఇన్సూరెన్స్, ప్రభుత్వ విభాగాల్లోనూ డిమాండ్ పెరుగుతోంది’’అని న్యూజెన్ సాఫ్ట్వేర్ సీఈవో వీరేందర్ జీత్ తెలిపారు. కంపెనీ ఉద్యోగుల సంఖ్య 4,400కు చేరింది. -
పెరిగిన బ్యాంకు లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 44 శాతం ఎగసి రూ. 1,327 కోట్లను తాకింది. వడ్డీ ఆదాయం మెరుగుపడటం ఇందుకు సహకరించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో సంస్థ లాభం కేవలం రూ. 920 కోట్లు. మొత్తం ఆదాయం సైతం రూ. 5,736 కోట్ల నుంచి రూ. 6,809 కోట్లకు జంప్ చేసింది.నికర వడ్డీ ఆదాయం 15 శాతంపైగా పుంజుకుని రూ.2,807 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 3.88 శాతం నుంచి 3.98 శాతానికి బలపడ్డాయి. 12 ప్రభుత్వ రంగ బ్యాంకులలో బీవోఎం గరిష్ట మార్జిన్లు ఆర్జించినట్లు బ్యాంక్ ఎండీ నిధు సక్సేనా పేర్కొన్నారు. పూర్తి ఏడాదికి రూ. 5,000 కోట్ల నికర లాభం ఆర్జించే వీలున్నట్లు అంచనా వేశారు. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.19% నుంచి 1.84 శాతానికి, నికర ఎన్పీఏలు 0.23 % నుంచి 0.2 శాతానికి దిగివచ్చాయి. -
ఒక్క కంపెనీ లాభం.. రోజుకు రూ.216 కోట్లు!
దేశంలోని కొన్ని కంపెనీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. అవి మనం నిత్యం వింటున్న పేర్లే.. బాగా తెలిసిన కంపెనీలే. అయితే అవి రోజుకు ఎంత లాభం ఆర్జిస్తున్నాయో తెలిస్తే ముక్కున వేలేసుకుంటాం. 2024 ఆర్థిక సంవత్సరానికి ఆయా కంపెనీలు ప్రకటించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ల ఆధారంగా సగటున రోజుకు ఎంత లాభం ఆర్జిస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.ముఖేష్ అంబానీ నేతృత్వలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.79 లక్షల కోట్ల ఏకీకృత ఎబీటా (EBITDA)ని నివేదించింది. నికర లాభం రూ. 79,020 కోట్లుగా ఉంది. అంటే కంపెనీ సగటున రోజుకు ఆర్జిస్తున్న లాభం రూ.216.5 కోట్లు. ఈటీ మనీ నివేదిక ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో సగటున రోజువారీ లాభంలో టాప్ టెన్ కంపెనీల జాబితా ఇదే..లాభాల్లో టాప్10 కంపెనీలు🔝రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.216.5 కోట్లు🔝ఎస్బీఐ రూ.186.7 కోట్లు🔝హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.179.3 కోట్లు🔝ఓఎన్జీసీ రూ.156.4 కోట్లు🔝టీసీఎస్ రూ.126.3 కోట్లు🔝ఐసీఐసీఐ బ్యాంక్ రూ.123.3 కోట్లు🔝ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.118.2 కోట్లు🔝ఎల్ఐసీ రూ.112.1 కోట్లు🔝కోల్ ఇండియా రూ.102.4 కోట్లు🔝టాటా మోటర్స్ రూ.87.1 కోట్లుఇదీ చదవండి: పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ.. -
ఆ మైలురాయి సాధించడమే ఎస్బీఐ లక్ష్యం
వచ్చే 3-5 సంవత్సరాలలో రూ. 1 లక్ష కోట్ల నికర లాభం మైలురాయిని దాటిన మొదటి భారతీయ ఆర్థిక సంస్థగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.2024 ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ 21.59 శాతం వృద్ధితో రూ.61,077 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని నమోదు చేసింది. వచ్చే 3-5 సంవత్సరాలలో రూ. 1 లక్ష కోట్లు దాటడం సాధ్యమేనా అని అడిగినప్పుడు “మాకు అవకాశం ఉంది. ఖచ్చితంగా, ఆ మైలురాయిని చేరుకున్న దేశంలో మొదటి కంపెనీగా మేము ఉండాలనుకుంటున్నాం” అని సీఎస్ శెట్టి చెప్పారు.లాభాలు, మార్కెట్ క్యాపిటలైజేషన్ మొదలైనవి తమకు చాలా ముఖ్యమైన అంశాలని, అదే సమయంలో కస్టమర్-సెంట్రిసిటీకి సమానమైన ప్రాధాన్యతనిస్తామని ఆయన పేర్కొన్నారు. అదే తమ కార్యకలాపాలలో ప్రాథమిక అంశంగా ఉంటుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు.ఇక కార్పొరేట్ రుణ డిమాండ్‌కు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నుండి బ్యాంక్ ఇప్పటికే రూ. 4 లక్షల కోట్ల బలమైన క్రెడిట్ పైప్‌లైన్‌ను పొందిందని వివరించారు. ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ప్రైవేట్ రంగం మూలధన వ్యయం పెరుగుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. -
నిండుతున్న బీసీసీఐ ఖజానా
భారత్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. దాదాపు గల్లీల్లో ఎక్కడోచోట క్రికెట్ ఆడుతుండడం గమనిస్తాం. ఇంతలా ఆదరణ పొందిన క్రికెట్‌ను నిర్వహిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2023 ఆర్థిక సంవత్సరానికిగాను ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా రూ.5,120 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2022లో పొందిన రూ.2,367 కోట్లు కంటే ఇది 116 శాతం అధికం.బీసీసీఐ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం.. 2023లో ఐపీఎల్ ద్వారా వచ్చిన వార్షిక ఆదాయం రూ.11,769 కోట్లుగా ఉంది. వ్యయం గతంలో కంటే 66% పెరిగి రూ.6,648 కోట్లకు చేరుకుంది. దాంతో మొత్తంగా రూ.5,120 కోట్లు లాభం వచ్చింది. కొత్త మీడియా హక్కులు, స్పాన్సర్షిప్ ఒప్పందాల వల్ల ఈ డబ్బు సమకూరిందని బీసీసీఐ పేర్కొంది.2023-27 సీజన్‌కుగాను బీసీసీఐ గతంలో వేలం నిర్వహించింది. అందులో కంపెనీలు పోటీపడి రూ.48,390 కోట్ల విలువైన మీడియా హక్కులను చేజిక్కించుకున్నాయి. దాంతో బీసీసీఐ ఖజానా నిండింది. డిస్నీ స్టార్ రూ.23,575 కోట్లు బిడ్ వేసి 2023-27 ఐపీఎల్ టీవీ హక్కులను పొందగా, వయాకామ్ 18 యాజమాన్యంలోని జియో సినిమా రూ.23,758 కోట్ల బిడ్‌తో డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. మీడియా హక్కుల ద్వారా బీసీసీఐకు ఐపీఎల్ 2022 సీజన్లో రూ.3,780 కోట్ల ఆదాయం సమకూరింది. 2023లో అది 131 శాతం పెరిగి రూ.8,744 కోట్లకు చేరుకుంది.ఐదేళ్ల కాలానికిగాను ఐపీఎల్ టైటిల్ హక్కులను టాటా సన్స్ రూ.2,500 కోట్లకు చేజిక్కించుకుంది. మైసర్కిల్11, రూపే, ఏంజిల్‌వన్, సీయెట్ సంస్థలకు అసోసియేట్ స్పాన్సర్షిప్లను విక్రయించడం ద్వారా బీసీసీఐ మరో రూ.1,485 కోట్లను సంపాదించింది. ఫ్రాంచైజీ ఫీజుల ద్వారా వచ్చే ఆదాయాలు గతంలో కంటే 2023లో 22 శాతం పెరిగి రూ.2,117 కోట్లకు చేరుకున్నాయి. స్పాన్సర్షిప్ ఆదాయం రూ.828 కోట్ల నుంచి 2 శాతం పెరిగి రూ.847 కోట్లుగా ఉంది.ఇదీ చదవండి: ఫ్రెషర్స్‌కు ఏటా రూ.9 లక్షలు వేతనం!ఇదిలాఉండగా, 2023లో అరంగేట్రం చేసిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నుంచి క్రికెట్ బోర్డ్ రూ.377 కోట్ల లాభం సంపాదించింది. మీడియా హక్కులు, ఫ్రాంచైజీ ఫీజులు, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా రూ.636 కోట్ల ఆదాయం సమకూర్చుకుంది. వీటంతటికి రూ.259 కోట్లు ఖర్చు చేసింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ రూ.2,038 కోట్ల జీఎస్టీను చెల్లించిందని రాజ్యసభకు తెలియజేశారు. -
ఫస్ట్‌క్రై లిస్టింగ్: సచిన్‌కు రూ. 3.35కోట్ల లాభం
ఫస్ట్‌క్రై మాతృ సంస్థ బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ షేర్లు మంగళవారం దలాల్ స్ట్రీట్ అరంగేట్రంలో పెట్టుబడిదారులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో ఒక్కసారిగా సచిన్ టెండూల్కర్, రతన్ టాటాతో సహా ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు భారీ లాభాలను పొందారు.బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ మొదటిరోజే 40 శాతం ప్రీమియంతో లిస్టింగ్ అయ్యాయి. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇప్పటికే ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. షేర్లు భారీగా పెరగటంతో ఆయన ఒక్కరోజులోనే 3.35 కోట్లకు పైగా లాభం పొందారు. సచిన్ బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్‌లో అక్టోబర్ 2023లో రూ. 10 కోట్ల పెట్టుబడులు పెట్టారు. సచిన్ ఒక్కో షేరుకు రూ.487.44 వెచ్చించారు. ఆ షేర్లే ఇప్పుడు భారీగా పెరిగాయి. సచిన్ ఏకంగా కోట్ల లాభాలను పొందగలిగారు.రతన్ టాటా కూడా రూ.5.50 కోట్లు లాభం పొందారు. 2016లో 77900 ఈక్విటీ షేర్లను ఒక్కో షేరుకు రూ.84.72 చొప్పున కొనుగోలు చేసేందుకు కంపెనీలో రూ.66 లక్షలు పెట్టుబడి పెట్టారు. లిస్టింగ్‌లో తన పెట్టుబడి రూ.5 కోట్ల మార్కును తాకింది.బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ ఐపీఓ ఆగష్టు 6 - ఆగస్ట్ 8 మధ్య నడిచింది. ఫస్ట్‌క్రై పేరెంట్ 32 షేర్ల లాట్ సైజుతో ఒక్కో షేరుకు రూ. 440-465 ధర బ్యాండ్‌లో షేర్లను అందించింది. కంపెనీ తన ఐపీఓ నుంచి మొత్తం రూ. 4,193.73 కోట్లను సేకరించింది. ఇది మొత్తం 12.22 రెట్లు కంటే ఎక్కువ. -
అద్దిల్లా..? సొంతిల్లా..?
చాలా మంది తేల్చుకోలేని అంశం.. అద్దె ఇంట్లో ఉండడం నయమా? లేక సొంతిల్లు సమకూర్చుకోవడం బెటరా? అని. ఈ రెండింటిలో ఆర్థికంగా ఏది లాభదాయకమో నిపుణులను అడిగితే చెబుతారు. కానీ, ఇల్లు అన్నది భావోద్వేగాలు, సామాజిక గుర్తింపు, మానసిక ప్రశాంతత తదితర ఎన్నో అంశాలతో ముడిపడి ఉంటుంది. అద్దె ఇల్లు ఆర్థిక భారం లేనిది. సొంతిల్లు ఆర్థిక బాధ్యతను తెచి్చపెడుతుంది. ఒకటి రెండు నెలల అడ్వాన్స్ ఉంటే నిమిషాల్లో అద్దె ఇంట్లో దిగిపోవచ్చు. కానీ, సొంతింట్లో కుడి కాలు మోపాలంటే భారీ మొత్తం కావాలి. లేదంటే బ్యాంక్ తలుపు తట్టాలి. అద్దె ఇంట్లో మనకు నచ్చకపోయినా, ఇంటి యజమానికి గిట్టకపోయినా మరో గూడు వెతుక్కోవాల్సిందే. సొంతింట్లో ఎవరికి వారే రారాజు. ఇలా నాణేనికి రెండువైపులా లాభనష్టాలున్నాయి. తమకు ఏది అనుకూలమో ఎవరికి వారు తేల్చుకోవాల్సిందే. ఈ దిశగా అవగాహన కలి్పంచి, సులువుగా నిర్ణయం తీసుకోవ డానికి దారి చూపించేదే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ కథనం. ఆర్థిక కోణం... ఇంటి విషయంలో ముందుగా తమ ప్రాధాన్యతలు ఏంటన్నవి ముఖ్యం. మెట్రో నగరాల్లో ఇంటి ధరలు చూస్తే చుక్కల్లో కనబడుతున్నాయి. కనుక అక్కడ సొంతిల్లు చాలా మందికి సాధ్యపడకపోవచ్చు. అలాంటి చోట అద్దె ఇల్లే ఆర్థి కంగా సౌకర్యం. ఇంటి కొనుగోలుతో పోలిస్తే అద్దే తక్కువగా ఉంటుంది. ఇంటి కొనుగోలుకు సరిపడా ఆర్థిక స్థోమత ఉన్న వారి విషయంలో అంత గందరగోళం అక్కర్లేదు. వృత్తి/ఉద్యోగ/వ్యాపార రీత్యా తరచూ ప్రాంతాలు మారే అవసరం లేకపోతే నిశి్చంతగా సొంతింటికి మొగ్గు చూపొచ్చు. కానీ, నగరాలు, పట్టణాల్లో రుణంపై ఇంటిని సమకూర్చుకోవాలని భావించే వారు అక్కడి రెంటల్ ఈల్డ్స్ (ప్రాపర్టీ విలువపై అద్దె రాబడి), ప్రాపర్టీ విలువ పెరుగుదల శాతం ఏ మేరకు ఉంది, తదితర అంశాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. మన దేశంలోని చాలా పట్టణాల్లో రుణంపై ఇల్లు కొనుగోలు చేసి చెల్లించే ఈఎంఐతో పోలి్చతే.. చాలా తక్కువకే అద్దె ఇల్లు వచ్చేస్తుంది. పట్టణాల్లో ఇంటిని కొనుగోలు చేయడం మంచి ఆప్షనే. కాలం గడిచే కొద్దీ దాని విలువ పెరుగుతూ వెళ్తుంది. కానీ, దాన్ని సమకూర్చుకునేందుకు సరిపడా పెట్టుబడి కావాలి. పెట్టుబడి కోసం అయితే కొత్తగా అభివృద్ధిలోకి వస్తున్న నగర, పట్టణ శివారు ప్రాంతాల్లో ఇల్లు కొనుగోలు చేసుకోవడం వల్ల.. తక్కువ కాలంలోనే ఎక్కువ విలువ సమకూరుతుంది.అద్దె రాబడి తక్కువ... మన దేశంలో ఇంటిపై సగటు రాబడి 2.9 శాతంగా ఉంది. ప్రపంచంలో ఇక్కడే తక్కువ. అదే యూఎస్, కెనడా, దుబాయిలోని పట్టణాల్లో ఇంటిపై అద్దె రాబడి 5–6 శాతంగా ఉంది. అద్దె రాబడి 4 శాతాన్ని మించినప్పుడు రుణంపై ఇంటిని కొనుగోలు చేసుకోవడం అత్యుత్తమమని ఆర్థిక గణాంకాలు చెబుతున్నాయి. మీరు ఉండాలనుకుంటున్న ప్రాంతంలో ప్రస్తుత రెంటల్ ఈల్డ్ (అద్దెకు ఇస్తే వచ్చే రాబడి) (ప్రాపర్టీ విలువతో పోలిస్తే చెల్లించే అద్దె రేటు), ఏటా ఎంత చొప్పున పెరుగుతుందన్నది తెలుసుకోవాలి. వీటి ఆధారంగా అద్దె/ఈఎంఐ రేషియో ఎంతో తేల్చుకోవాలి. రియల్ ఎస్టేట్ పరిశోధనా సంస్థ ‘లైసస్ ఫొరాస్’ ఇందుకు సంబంధించి విలువైన గణాంకాలు రూపొందించింది. దీని ప్రకారం 100 శాతం అంతకంటే తక్కువ నిష్పత్తి ఉన్న పట్టణాల్లో అద్దె ఇంట్లో ఉండడమే లాభం. ఈ రేషియో 100 దాటిన చోట సొంతిల్లు సమకూర్చుకోవడం లాభం.విశ్లేషణ విశాఖలో రెంటల్ ఈల్డ్ ప్రాపర్టీ విలువపై 2 శాతంగా ఉంది. ఇది ఏటా 5 శాతం పెరుగుతూ పోతే రెంటల్/ఈఎంఐ రేషియో 57 శాతం అవుతుంది. ఏటా 10 శాతం పెరిగితే ఈ రేషియో 84 శాతంగా ఉంటుంది. 11 శాతం పెరిగితే రేషియో 93గా ఉంటుంది. అదే హైదరాబాద్‌లో రెంటల్ ఈల్డ్ 2.5 శాతం.. ఏటా 9 శాతం వరకు పెరిగితే రెంట్/ఈఎంఐ రేషియో 94గా ఉంటుంది. ఒకవేళ ఏటా 10 శాతం పెరిగితే ఈ రేషియో 104కు వెళుతుంది. హైదరాబాద్‌లో ఏటా 10 శాతం చొప్పున అద్దెలు పెరిగేట్టు అయితే అప్పుడు రుణంపై ఇల్లు కొనుగోలు చేసి, ఈఎంఐలు కట్టుకోవడమే ప్రయోజనకరం. అద్దె పెరుగుదల 10 శాతంలోపే ఉంటే కిరాయికి తీసుకోవడం ఆర్థికంగా ప్రయోజనకరం. ఒకవేళ మీరు ఎంపిక చేసుకున్న ప్రాంతంలో ప్రస్తుత రెంటల్ ఈల్డ్ ప్రాపర్టీ విలువపై 4 శాతం అంతకంటే ఎక్కువే ఉండి, ఏటా అద్దె 5 శాతం పెరిగినా సరే.. అక్కడ రుణంపై ఇల్లు కొనుగోలు చేసి ఈఎంఐ కట్టుకోవడమే లాభం.లాభాలుఈ అంశాలు గమనించాలి.. ఆర్బీఐ డేటా ప్రకారం 2010–11 నుంచి 2017–18 మధ్య కాలంలో (రియల్ ఎస్టేట్ రంగ నియంత్రణ సంస్థ (రెరా) రాక ముందు) ప్రాప ర్టీల ధరలు ఏటా 15 శాతం చొప్పున పెరిగాయి. 2018–19 నుంచి 2022–23 కాలంలో (రెరా వచ్చిన తర్వాత) ఏటా 3 శాతం పెరిగాయి. చారిత్రకంగా చూస్తే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం కంటే రెట్టింపు స్థాయిలో ప్రాపరీ్టల ధరలు పెరిగినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ రకంగా చూస్తే ప్రాపర్టీ కొనుగోలు లాభదాయకమే. 30 ఏళ్ల కాలానికి రుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేస్తే, ప్రతి నెలా చెల్లించాల్సిన ఈఎంఐ, ఇంటి అద్దె కంటే రెట్టింపు ఉంటుంది. కానీ, 15–17 ఏళ్లు గడిచే సరికి ఇంటి అద్దె ఏటా పెరుగుతూ రుణ ఈఎంఐకి చేరువ కావచ్చు.సొంతిల్లు→ ఒకే చోట స్థిరపడిన వారు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. మన దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతోంది. ఇది ఇళ్లు, స్థలాల విలువలకు దన్నుగా నిలుస్తుంది. కనుక ఇంటిపై పెట్టుబడి దీర్ఘకాలంలో సంపదకు దారితీస్తుంది. → సొంతిల్లుతో వచ్చే ప్రశాంతతను వెలకట్టలేం. భద్రతకు హామీనిస్తుంది. ఖాళీ చేయాల్సిన అనిశ్చితి ఉండదు. ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. గోపత్య ఉంటుంది. ఇంటిని ఎలా వినియోగించుకోవాలనే విషయంలో పరిమితులు ఉండవు. నచ్చినట్టుగా ఇంటిని మార్చుకోవచ్చు. రాజీపడాల్సిన అవసరం ఉండదు. → అద్దెకు బదులు ఈఎంఐ కట్టుకుంటే స్థిరాస్తి సమకూరుతుంది. రుణంపై ఇంటిని సమకూర్చుకోవడం వల్ల దీర్ఘకాలంలో దాని విలువ పెరగడమే కాదు.. పన్ను రూపంలోనూ ఎంతో ఆదా అవుతుంది. ఇంటి రుణ ఈఎంఐలో అసలు (ప్రిన్సిపల్), వడ్డీ అని రెండు భాగాలుంటాయి. అసలుకు చెల్లించే మొత్తం గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. అలాగే, సెక్షన్ 24 కింద ఇంటి రుణంపై ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 2 లక్షల వడ్డీ భాగంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఒకవేళ రుణంపై కొనుగోలు చేసిన ఇంటిని అద్దెకు ఇచ్చినట్టయితే అప్పుడు వడ్డీ ఒక ఆర్థిక సంవత్సరంలో ఎంత ఉన్నా, ఆ మొత్తంపై పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంది. → సొంతింటితో అనుబంధం విడదీయరానిది. అదే అద్దె ఇంట్లో ఉండి, చుట్టుపక్కల వారితో మంచి సంబంధాలు ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవడం కష్టమనిపిస్తుంది. ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేయాల్సిన అగత్యం ఏర్పడదు. సొంతిల్లు వ్యక్తిగత హోదాను పెంచుతుంది. సామాజిక గుర్తింపును తెస్తుంది. → చివరిగా సొంతిల్లు ఉంటే.. విశ్రాంత జీవనంలో స్థిరమైన ఆదాయాన్నిచ్చే బంగారు బాతు అవుతుంది. రివర్స్ మార్ట్‌గేజ్‌తో ప్రతి నెలా స్థిరమైన ఆదాయాన్ని బ్యాంక్ నుంచి పొందొచ్చు. అద్దె ఇల్లుళీ అద్దె ఇంటితో ఉండే అత్యంత అనుకూలత.. నచి్చన ప్రాంతంలో ఉండొచ్చు. సొంతిల్లు అయితే మారకుండా ఎప్పటికీ ఒకేచోట ఉండిపోవాల్సి వస్తుంది. → ప్రతికూల ఆర్థిక పరిస్థితుల్లో, ఉద్యోగం కోల్పోయి ఖాళీగా ఉండాల్సి వస్తే, తక్కువ అద్దె ఇంటికి వెళ్లి సర్దుకోవచ్చు. సొంతిల్లు అయితే వ్యక్తిగత కష్టాలతో సంబంధం లేకుండా ఈఎంఐ కట్టాల్సిందే. → అద్దె ఇల్లు అయితే ఇంటి నిర్వహణ భారం తమ మీద పడదు. వాటర్ ట్యాంక్‌లు, నీటి మోటార్ల నిర్వహణ, రిపేర్లు, పెయింట్స్ తదితర బాదర బం«దీలు ఉండవు. వీటి రూపంలో ఆర్థిక భారం పడదు. ఇంటి పన్నుల బాధా ఉండదు. → రుణంపై ఇల్లు కొనుగోలు చేయాలంటే.. మొత్తం విలువలో 20 శాతం డౌన్ పేమెంట్ కింద సమకూర్చుకోవాలి. అదే అద్దె ఇంటి విషయంలో ఈ అవసరం ఉండదు. కొద్ది నెలల అద్దెకు సరిపడా రిఫండబుల్ డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుంది.వేతన జీవులకు రియల్టీ ఆస్తివేతన జీవులకు రియల్ ఎస్టేట్ ఒక ఆస్తిగా మారుతుంది. నీవు ప్రతి నెలా అద్దె కింద రూ.లక్ష చెల్లిస్తుంటే, దానికి అదనంగా రూ.50,000–60,000 చెల్లించేట్టు అయితే సొంతిల్లు దక్కుతుంది. పదేళ్ల పాటు ఇదే అద్దెను చెల్లించడం వల్ల ఎలాంటి ఆస్తి సమకూరదు. కనుక ఈఎంఐతో ఒక ఆస్తిని సమకూర్చుకోవచ్చు. – అజితేష్ కొరుపూలు, అశోక బిల్డర్స్ (రియల్ ఎస్టేట్ కంపెనీ) సీఈవోతెలివైన నిర్ణయం కాదు!గురుగ్రామ్‌లో నేను ఉండే ఇంటికి ప్రతి నెలా రూ.1.5 లక్షలు అద్దె, మెయింటెనెన్స్‌తో కలిపి రూ.1.65 లక్షలు చెల్లిస్తున్నా. అది గోల్ఫ్‌కోర్స్‌తో కూడిన ఖరీదైన ప్రాంతం. నేను ప్రస్తుతం అద్దెకు ఉంటున్న అపార్ట్మెంట్ ఖరీదు రూ.7.5–8 కోట్లు. దీన్ని కొనుగోలు చేయాలంటే 70 శాతం మేర రూ.6 కోట్లు రుణం తీసుకోవాలి. దీనికి ప్రతి నెలా రూ.6–7 లక్షల ఈఎంఐ చెల్లించాలి. అంటే నేను ప్రస్తుత ఇంటికి చెల్లిస్తున్న అద్దెకంటే ఈఎంఐ నాలుగు రెట్లు అధికం. కనుక ఇల్లు కొనుగోలు చేయడం నాకు తెలివైన నిర్ణయం కాబోదు. ఇల్లు అనేది లిక్విడిటీ (కోరుకున్న వెంటనే సొమ్ము చేసుకోగల) ఉన్న ఆస్తి కాదు. కనుక నేను అదే రూ.6 లక్షలను పబ్లిక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తాను. పైగా అద్దె ఇల్లు తీసుకోవడంలో కొంత స్వేచ్ఛ ఉంటుంది. 15 రోజుల్లోనే చిన్న సైజు నుంచి పెద్ద సైజు ఇంటికి మారొచ్చు. నేను నా పిల్లలు, తల్లిదండ్రులతో కలసి ఉంటే తప్ప ఇంటి విషయంలో నా ఆలోచన ఇదే. – శంతను దేశ్‌పాండే, బోంబే షేవింగ్ కంపెనీ ఫౌండర్హాస్యాస్పదంప్రస్తుత వేల్యూషన్ల వల్లే నేను రియల్ ఎస్టేట్‌ను కొనుగోలు చేయలేదు. నా వరకు ఈ వేల్యూషన్లు నిజంగా హాస్యాస్పదం. వడ్డీ రేట్ల కంటే ఇంటిపై రాబడులు తక్కువ. ఇళ్లు, ఆఫీస్‌ల ధరలు పెరుగుతాయని కొనుగోలు చేయడం తెలివైన నిర్ణయం అనిపించడంలేదు. పెట్టుబడులపై 10–12 శాతం రాబడులు సంపాదించుకోలిగినప్పుడు, 3 శాతానికే (ప్రాపర్టీ విలువలో) వచ్చే అద్దె ఇల్లు తీసుకోవడమే మంచిది. పెట్టుబడులపై వచ్చే రాబడి కంటే రెంటల్ ఈల్డ్ చాలా తక్కువ. నా తల్లిదండ్రులు నివసించిన ఇల్లు ఒక్కటే నాకు ఉంది. దానికి కూడా భావోద్వేగ పరమైన కారణాలున్నాయి. – నిఖిల్ కామత్, జెరోదా కో–ఫౌండర్ ఆఫీసుకు దగ్గరుంటే.. తమ కార్యాలయాలకు దగ్గరగా లేదా వ్యాపార సంస్థలకు సమీపంలో ఉండాలనుకుంటే ఇంటిని అద్దెకు తీసుకోవడమే లాభం. అలాంటి చోట సొంతిల్లు సమకూర్చుకోవడానికి భారీ పెట్టుబడి కావాలి. దాంతో పోలిస్తే చాలా తక్కువకే అద్దె ఇల్లు వచ్చేస్తుంది. పైగా రోజూ ఇంటి నుంచి వెళ్లి వచ్చేందుకు ఎక్కువ సమయం పట్టదు. ఇంధన వ్యయాల భారం ఉండదు. విలువైన సమయం, వనరుల ఆదా అవుతాయి. సెలబ్రిటీలు ఇలా..సెలబ్రిటీలు మాధురి దీక్షిత్, కృతి సనన్ సొంతింటికి బదులు అదంట్లో ఉండడానికే ప్రాధాన్యమిస్తున్నారు. అభిషేక్ బచ్చన్ ముంబైలో ఒకే ప్రాజెక్టులో 6 అపార్ట్మెంట్లు కొన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
నాలుగేళ్లకే లాభాల్లోకి చేరిన హైదరాబాద్ కంపెనీ
కేజీఎఫ్, కాంతారా, సలార్ వంటి సినిమాలతోపాటు తాజాగా విడుదలకు సిద్ధమైన కల్కి చిత్రానికి డిజిటల్‌మార్కెట్ చేస్తున్న సిల్లీమాంక్స్ నాలుగేళ్లకే లాభాల్లోకి చేరింది. హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీ జనవరి-మార్చి త్రైమాసికానికిగాను రూ.26.83లక్షలు లాభాన్ని పోస్ట్ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.5.5 కోట్లమేర నష్టపోయిన సంస్థ తాజా ఫలితాల్లో లాభాలు పోస్ట్ చేయడంతో పెట్టుబడిదారులకు కొంత ఊరట లభించింది.కంపెనీ లాభాలపై సంస్థ సహవ్యవస్థాపకులు, ఎండీ సంజయ్‌రెడ్డి మాట్లాడుతూ..‘ఇండియన్ ఎంటర్టైన్మెంట్ రంగంలో కీలకంగా ఉన్న సంస్థ నాలుగేళ్ల తర్వాత లాభదాయకంగా మారడం గొప్ప విజయంగా భావిస్తున్నాం. సంస్థ చేపట్టిన కొన్ని వ్యూహాత్మక కార్యక్రమాలతో ఈ విజయం సొంతమైంది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించాం. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక విధానాన్ని అనుసరించాం. ప్రతిభావంతులైన బృంద సభ్యులతో మరిన్ని విజయాలు సాధించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. సంస్థ ప్రాజెక్ట్‌లు ఇవే..ఇండియన్ ఎంటర్టైన్మెంట్ రంగంలో ఈ సంస్థ సినిమాలకు డిజిటల్ మార్కెటింగ్ సేవలందిస్తోంది. గతంలో విడుదలైన కేజీఎఫ్, కేజీఎఫ్-2, కాంతారా, సలార్ వంటి సినిమాలతోపాటు త్వరలో విడుదలయ్యే ప్రబాస్ నటించిన కల్కి 2898-ఏడీ చిత్రం యూనిట్లతో కలిసి పనిచేసింది. డిజిటల్ మార్కెటింగ్తోపాటు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వ్యవహరిస్తోంది.ఉద్యోగులకు షేర్క్యాపిటల్లో 5 శాతం వాటాకంపెనీ త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన సందర్భంగా తమ ఉద్యోగుల ప్రయోజనాల కోసం ‘ఎంప్లాయి స్టాక్ ఓనర్షిప్ ప్లాన్’(ఈసాప్)ను ప్రకటించింది. ఈప్లాన్‌లో భాగంగా కంపెనీ మొత్తం షేర్క్యాపిటల్లో 5శాతం వాటాను తమ ఉద్యోగులకు కేటాయించింది. రానున్న ఐదేళ్లలో ఈవాటాలో 70 శాతం మూలధనాన్ని ఉద్యోగులకు పంచనున్నారు. ఈ ప్రక్రియ జూన్ 2024 నుంచి ప్రారంభంకానుందని కంపెనీ చెప్పింది.ఇదీ చదవండి: పెరుగుతున్న బంగారం ధరలు.. రూ.లక్ష మార్కు చేరిన వెండికరోనా కారణంగా సినిమా పరిశ్రమ 2020 ప్రారంభం నుంచి తీవ్ర అనిశ్చితులు ఎదుర్కొంది. క్రమంగా కొవిడ్ భయాలు తొలగి గతేడాది నుంచి ఆ రంగం పుంజుకుంటోంది. ఫలితంగా ఆ పరిశ్రమపై ఆధారపడిన కంపెనీలు లాభాల్లోకి చేరుతున్నట్లు మార్కెట్‌వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దాంతోపాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య పెరుగుతోంది. అందులో ప్రమోషన్లు, ప్రకటనలు, డిజిటల్ మార్కెటింగ్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. -
తగ్గిపోయిన బంధన్ బ్యాంక్ లాభం
కోల్‌కతా: నాలుగో త్రైమాసికంలో బంధన్ బ్యాంక్ నికర లాభం రూ. 55 కోట్లకు పరిమితమైంది. క్రితం క్యూ4లో ఇది రూ. 808 కోట్లు. తాజాగా రైటాఫ్‌లు, మొండిబాకీలకు అధిక కేటాయింపులు జరపాల్సి రావడం వంటి అంశాలు లాభాలు తగ్గడానికి కారణం.జనవరి–మార్చి త్రైమాసికంలో ప్రొవిజనింగ్ రూ. 735 కోట్ల నుంచి రూ. 1,774 కోట్లకు పెరిగిందని బ్యాంక్ ఎండీ చంద్రశేఖర్ ఘోష్ తెలిపారు. అలాగే రూ. 3,852 కోట్లు రైటాఫ్ చేయాల్సి వచ్చిందని వివరించారు. క్యూ4లో నికర వడ్డీ మార్జిన్ 7.6 శాతంగా ఉంది.స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) 4.9 శాతం నుంచి 3.8 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు 1.1 శాతంగా ఉన్నాయి. జూలైలో ఎండీ, సీఈవో పదవి నుంచి రిటైర్ కానున్న ఘోష్.. రిటైర్మెంట్ తర్వాత హోల్డింగ్ కంపెనీ బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌లో వ్యూహాత్మక బాధ్యతలు పోషించనున్నట్లు తెలిపారు. -
ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయ మహిళ.. ఎవరీ రేణుకా జగ్తియాని?
భారతీయుల ఆస్తులు అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా, ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో మరో 25 మంది చేరారు. వారిలో ల్యాండ్‌మార్క్ గ్రూప్ సీఈఓ రేణుకా జగ్తియాని ఒకరు. ఆమె నికర విలువ సుమారు 4.8 బిలియన్లు రేణుకా జగ్తియాని ఎవరు? భారతి సంతతికి చెందిన రేణుకా జగ్తియాని భర్త మిక్కి జగ్తియాని ల్యాండ్‌మార్క్ గ్రూప్‌ను స్థాపించారు. అయితే గతేడాది మిక్కి జగ్తియాని మరణించడంతో కంపెనీ ఛైర్ ఉమెన్ అండ్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సంస్థలో మొత్తం 50వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. రేణుకా జగిత్యాని ఆర్ట్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని యూనివర్సిటీ ఆఫ్ ముంబై నుంచి పూర్తి చేశారు. రేణుకా జగిత్యాని జనవరి 2007లో ఏషియన్ బిజినెస్ అవార్డ్స్ మిడిల్ ఈస్ట్‌లో అత్యుత్తమ ఏషియన్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత జనవరి 2012లో గల్ఫ్ బిజినెస్ ఇండస్ట్రీ అవార్డ్స్‌లో బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌గా, 2014లో వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫోరమ్ ఆమెను ప్రపంచ వ్యాపార వేత్తగా గౌరవించింది. 2015లో ఆమె ఇండియన్ సీఈఓ అవార్డ్స్‌లో స్ట్రాటజిక్ లీడర్ ఆఫ్ ది ఇయర్‌గా, 2016లో స్టార్స్ ఆఫ్ బిజినెస్ అవార్డ్ నుండి ఆమె కెప్టెన్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవార్డును, 2017లో ఆమె వరల్డ్ రిటైల్ కాంగ్రెస్‌లో 'హాల్ ఆఫ్ ఫేమ్'లో చేర్చబడింది. రేణుకా జగిత్యాని ఇటీవలే ఫోర్బ్స్ ‘న్యూ బిలియనీర్స్’లో 4.8 బిలియన్ల నికర విలువతో కొనసాగుతున్నారు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఆర్తి, నిషా, రాహుల్‌లు ల్యాండ్ మార్క్ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ న్యూ బిలియనీర్స్ 2024 నివేదిక ప్రపంచవ్యాప్తంగా 2,781 బిలియనీర్లను గుర్తించింది. ఈ ఏడాది 265 మంది కొత్త బిలియనీర్లు చేరగా.. గత ఏడాది 150 మందితో పోలిస్తే ఇది గణనీయంగా పెరిగింది. -
‘శని’ వారికి వ్యాపార భాగస్వామి.. లాభాలలో వాటా కూడా!
దేశంలో శని దేవుని ఆలయాలు చాలానే ఉన్నాయి. కానీ మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్లో ఒక ప్రత్యేకమైన శనిదేవుని ఆలయం ఉంది. ఇక్కడకు వచ్చే భక్తులు శనిదేవుడిని తమ వ్యాపార భాగస్వామిగా చేర్చుకుంటారు. ఇందుకోసం ఒక డాక్యుమెంట్ తయారు చేసి, శని దేవుని పాదాల చెంత ఉంచుతారు. ఇలా చేయడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుందని వారు నమ్ముతారు. ఇప్పటి వరకు 1,500 మంది వ్యాపారులు శనిదేవుడిని తమ వ్యాపార భాగస్వామిగా చేసుకున్నారు. ఈ ఆలయం ఖర్గోన్ జిల్లాలోని మోర్ఘడిలో శ్రీ సిద్ధ శని గజానన్ శక్తిపీఠం రూపంలో ఉంది. ఈ దేవాలయం సుమారు 21 సంవత్సరాల క్రితం నాటిది. ఇక్కడ దేవుని విగ్రహం లేదు. శిల రూపంలో శనిదేవుడు ఇక్కడ కొలువుదీరాడు. ఇక్కడికి వచ్చిన పలువురు వ్యాపారులు శనిదేవుడిని తమ వ్యాపార భాగస్వామిగా చేసుకున్నారని ఆలయ పూజారి సందీప్ బార్వే తెలిపారు. వారు వ్యాపారంలో వచ్చే లాభంలో కొంత భాగాన్ని శనిదేవునికి సమర్పిస్తారన్నారు. మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు ఇక్కడికి వచ్చి, తమ వ్యాపారంలో పురోగతి కోసం శనిదేవుడిని తమ వ్యాపార భాగస్వామిగా చేసుకుంటారు. ఇందుకోసం వారు ఒక దరఖాస్తును వారు నింపుతారు. దానిలో తన వ్యాపారంలో శని దేవుడిని భాగస్వామిగా చేస్తున్నట్లు రాస్తారు. వివాదాస్పద కోర్టు కేసుల నుంచి ఉపశమనం కోరుతూ కూడా పలువురు భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. -
కోటీశ్వరుణ్ణి చేసిన వెల్లుల్లి సాగు.. రూ 25 లక్షలకు రూ. కోటి ఆదాయం!
దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు భారీగా పెరిగాయి. ఒకప్పుడు కిలో రూ.70-80 పలికిన వెల్లుల్లి ఇప్పుడు రూ.400-500కు చేరింది. దీనివల్ల సామాన్యులపై భారం పడినా, వెల్లుల్లి పండించిన రైతులు అత్యధిక లాభాలతో ఆనందంలో మునిగితేలుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాకు చెందిన రైతు రాహుల్ దేశ్‌ముఖ్ వెల్లుల్లిని విక్రయించడం ద్వారా కోటి రూపాయల లాభం పొందాడు. 25 లక్షల పెట్టుబడితో రాహుల్ ఇంతటి లాభం పొందాడు. కాగా రాహుల్ తన వెల్లుల్లి పంటను కాపాడుకునేందుకు పొలాల్లో సీసీ కెమెరాలను అమర్చుకోవాల్సి వచ్చింది. ఇందుకోసం రాహుల్ సౌరశక్తితో నడిచే సీసీ కెమెరాలను అమర్చాడు. రాహుల్ దేశ్‌ముఖ్ ఛింద్వారాకు 20 కిలోమీటర్ల దూరంలోని సవారి గ్రామంలో ఉంటున్నాడు. రాహుల్ దేశ్‌ముఖ్ దాదాపు 13 ఎకరాల్లో వెల్లుల్లిపాయలు సాగుచేశాడు. ఇంకా మిగిలిన తన పొలంలో టమాటా సాగు చేశాడు. అయితే కొద్దిరోజుల క్రితం అతని పొలంలో 25-30 కిలోల టమోటాలు అపహరణకు గురయ్యాయి. ఆ తర్వాత రాహుల్ దేశ్‌ముఖ్ రూ.10వేలు వెచ్చించి పొలాన్ని పర్యవేక్షించేందుకు మూడు సీసీ కెమెరాలు అమర్చాడు. రాహుల్ పొలంలో దాదాపు 150 మంది కూలీలు పనిచేస్తున్నారు. రాహుల్ దేశ్‌ముఖ్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవలే పెద్దఎత్తున వెల్లుల్లి సాగు చేశానని తెలిపాడు. పెరుగుతున్న వెల్లుల్లి ధరలను దృష్టిలో ఉంచుకుని , వాటిని సాగుచేస్తున్నానని, అయితే భద్రతా కారణాల దృష్ట్యా పొలంలో సీసీ కెమెరాలు అమర్చానని అన్నాడు. రాహుల్ తాను పండించిన వెల్లుల్లిని హైదరాబాద్‌కు కూడా పంపే యోచనలో ఉన్నాడు. వెల్లుల్లి ధరల్లో ఇంత భారీ పెరుగుదల ఇటీవలి కాలంలో ఎన్నడూ లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం వెల్లుల్లి ధర గరిష్టంగా రూ.80-90 వరకు మాత్రమే ఉంటుందని రైతులు చెబుతున్నారు. చింద్వారాలోని బద్నూర్లో నివసించే మరో రైతు పవన్ చౌదరి కూడా తన 4 ఎకరాల పొలంలో వెల్లుల్లిని నాటాడు. ఇందుకు రూ.4 లక్షలు ఖర్చు చేయగా, ఇప్పటి వరకు రూ.6 లక్షల లాభం వచ్చింది. తన పొలాన్ని పర్యవేక్షించేందుకు ఆయన కూడా మూడు సీసీ కెమెరాలను అమర్చాడు. -
లాభాల బాటలో జొమాటో
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో డిసెంబర్ క్వార్టర్లో తన పనితీరును మరింత బలోపేతం చేసుకుంది. రూ.138 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.347 కోట్ల నష్టాన్ని నమోదు చేయడం గమనార్హం. కన్సాలిడేటెడ్ ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.2485 కోట్ల నుంచి 35 శాతం వృద్ధితో రూ.3,383 కోట్లకు దూసుకువెళ్లింది. డిసెంబర్ త్రైమాసికంలో ఫుడ్ డెలివరీ స్థూల ఆర్డర్ విలువ (జీవోవీ) తిరిగి 25 శాతం వృద్ధిలోకి వచ్చినట్టు జొమాటో ఎండీ, సీఈవో దీపిందర్ గోయల్ వాటాదారులకు లేఖ రూపంలో తెలిపారు. వార్షికంగా జీవోవీ 20 శాతానికి పైనే వృద్ధిని కొనసాగిస్తుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. వినియోగ డిమాండ్ పుంజుకోవడం, అంచనాకు మించి మార్కెట్ వాటా సొంతం చేసుకోవడంపై జీవోవీ మరింత వృద్ధి ఆధారపడి ఉంటుందని వివరించారు. క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ జీవోవీ 103 శాతం పెరిగి రూ.3,542 కోట్లకు చేరింది. బ్లింకిట్ నష్టాలు రూ.56 కోట్లకు పరిమితమయ్యాయి. ఫుడ్ డెలివరీ జొమాటో వరకే చూస్తే ఆదాయం రూ.1,565 కోట్ల నుంచి రూ.2,025 కోట్లకు పెరిగింది. క్విక్ కామర్స్ ఆదాయం రూ.301 కోట్ల నుంచి రూ.644 కోట్లకు వృద్ధి చెందింది. రెస్టారెంట్లకు గ్రోసరీని సరఫరా చేసే హైపర్‌ప్యూర్ విభాగం ఆదాయం రూ.421 కోట్ల నుంచి రూ.859 కోట్లకు చేరింది. మెరుగైన ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో జొమాటో షేరు 4 శాతానికి పైగా లాభపడి రూ.149 వద్ద ముగిసింది. -
అదానీ పవర్ ఆకర్షణీయం - గణనీయంగా పెరిగిన లాభం
న్యూఢిల్లీ: అదానీ పవర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.9 కోట్లతో పోల్చి చూసినప్పుడు ఎన్నో రెట్ల వృద్ధితో రూ.2,738 కోట్లకు దూసుకుపోయింది. మొత్తం ఆదాయం సైతం రూ.8,290 కోట్ల నుంచి రూ.13,355 కోట్లకు వృద్ధి చెందింది. మహన్ వద్ద 1,600 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం ప్రణాళిక ప్రకారమే కొనసాగుతున్నట్టు కంపెనీ తెలిపింది. ఇనార్గానిక్ (ఇతర సంస్థల కొనుగోళ్లు) మార్గంలో తమ నాయకత్వ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోనున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికంతోపాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొమ్మిది నెలల్లో ముంద్రా, ఉడుపి, రాయిపూర్, మహన్ ప్లాంట్లు అధిక విక్రయాలకు సాయపడినట్టు తెలిపింది. అదే సమయంలో గొడ్డా ప్లాంట్ నుంచి అదనపు ఉత్పత్తి తోడైనట్టు వివరించింది. బంగ్లాదేశ్ విద్యుత్ సరఫరా వ్యవస్థలో ఇది (గొడ్డా ప్లాంట్) కీలక భాగంగా మారినట్టు పేర్కొంది. మూడో త్రైమాసికంలో 21.5 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను విక్రయించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 11.8 బిలియన్ యూనిట్లుగానే ఉంది. రుణాలకు చేసే వ్యయాలు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.946 కోట్ల నుంచి రూ.797 కోట్లకు తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంత్సరం డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి నికర లాభం 230 శాతం పెరిగి రూ.18,092 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.5,484 కోట్లుగా ఉంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో అదానీ పవర్ షేరు 4 శాతానికి పైగా లాభపడి రూ.542 వద్ద ముగిసింది. -
రిలయన్స్ లాభం 17,265 కోట్లు
న్యూఢిల్లీ: ఆయిల్ నుంచి రిటైల్ వరకు ఎన్నో వ్యాపారాలు నిర్వహిస్తున్న డైవర్సిఫైడ్ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ డిసెంబర్ త్రైమాసికంలో మిశ్రమ పనితీరు చూపించింది. రిటైల్, టెలికం వ్యాపారాలు రాణించగా, ఆయిల్ టు కెమికల్స్ (ఓటూసీ) నిరాశపరించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 9.3 శాతం పెరిగి రూ.17,265 కోట్లకు చేరుకుంది. షేరువారీ ఆర్జన రూ.25.52గా ఉంది. ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 3.6 శాతం వృద్ధితో రూ.2.28 లక్షల కోట్లుగా నమోదైంది. కానీ, 2023 సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చి చూస్తే నికర లాభం 0.7 శాతం, ఆదాయం 3 శాతం చొప్పున తక్కువగా నమోదయ్యాయి. ఎబిటా (ఆపరేటింగ్ మార్జిన్) క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 2.10 శాతం మేర, 2023 డిసెంబర్ త్రైమాసికంతో పోల్చితే 0.50 శాతం మేర పెరిగి 18 శాతానికి చేరింది. రుణాలపై వ్యయాలు 11 శాతం పెరిగి రూ.5,789 కోట్లుగా ఉన్నాయి. బ్యాలన్స్ షీటులో నగదు, నగదు సమానాలు రూ.1.92 లక్షల కోట్లుగా ఉన్నాయి. కన్సాలిడేటెడ్ రుణ భారం రూ.3.12 లక్షల కోట్లుగా, నికర రుణ భారం రూ.1,19,372 కోట్లుగా ఉంది. రిటైల్ భేష్... ► రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) కన్సాలిడేటెడ్ లాభం క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 40 శాతం పెరిగి రూ.3,165 కోట్లకు చేరింది. ►స్థూల ఆదాయం క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 23 శాతం వృద్ధితో రూ.83,063 కోట్లకు చేరింది. ఒక త్రైమాసికంలో కంపెనీకి ఇదే అత్యధిక ఆదాయం. ► ఎబిటా 31% పెరిగి రూ.6,258 కోట్లు. ► గత త్రైమాసికంలో 252 స్టోర్లను కొత్తగా ప్రారంభించింది. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 18,774కు చేరింది. ఆయిల్, కెమికల్స్... ఆయిల్ టు కెమికల్స్ విభాగంలోనే బలహీనత కనిపించింది. నిర్వహణ పనుల కోసం జామ్‌నగర్‌లోని రిఫైనరీ ప్లాంట్లను ఏడు వారాలు మూసివేయడం ప్రభావం చూపించింది. ఆయిల్ టు కెమికల్స్ ఆదాయం 2.4% తగ్గి రూ.1.41 లక్షల కోట్లుగా ఉంది. ఆయిల్ అండ్ గ్యాస్ ఆదాయం 50% వృద్ధితో రూ.6,719 కోట్లకు ఎగసింది.రిలయన్స్ షేరు ఫ్లాట్‌గా రూ.2,736 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. జియో జూమ్... టెలికం, డిజిటల్ వ్యాపారం రాణించింది. నికర లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12% పెరిగి రూ.5,445 కోట్ల గా ఉంది. ఆదాయం 11 శాతానికి పైగా వృద్ధితో రూ.32,510 కోట్లుగా నమోదైంది. జియో వరకే చూస్తే లాభం 12% పెరిగి రూ.5,208 కోట్లుగా ఉంది. ఆదాయం 10% వృద్ధితో రూ.25,368 కోట్లకు చేరింది. ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయ రూ. 181.70కి చేరింది. ఏడాది క్రితం రూ. 178గా ఉంది. 2023 సెప్టెంబర్ క్వార్టర్‌తో పోలి స్తే ఫ్లాట్‌గా ఉంది. డిసెంబర్ నాటికి కస్టమర్ల సంఖ్య 470.09 మిలియన్లకు చేరింది. నికరంగా 11.2 మిలియన్ల కస్టమర్లు జతయ్యారు. 9 కోట్ల మంది 5జీ నెట్‌వర్క్‌కు మళ్లారు. -
పాలీక్యాబ్ లాభం రూ.416 కోట్లు
న్యూఢిల్లీ: కేబుళ్లు, వైర్ల తయారీ సంస్థ పాలీక్యాబ్ ఇండియా డిసెంబర్ త్రైమాసికంలో పనితీరు పరంగా ఫర్వాలేదనిపించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చి చూసినప్పుడు 15 శాతం వృద్ధితో రూ.416 కోట్లకు చేరింది. త్రైమాసిక వారీ లాభంలో ఇది మూడో గరిష్ట స్థాయి కావడం గమనార్హం. పన్ను అనంతర లాభాల మార్జిన్ 9.6 శాతంగా ఉంది. ఆదాయం 17 శాతం పెరిగి రూ.4,340 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.361 కోట్లు, ఆదాయం రూ.3,715 కోట్ల చొప్పున ఉన్నాయి. మొత్తం వ్యయాలు 18 శాతం పెరిగి రూ.3,865 కోట్లకు చేరాయి. వైర్లు, కేబుళ్ల విభాగం ఆదాయం 17 శాతం వృద్ధితో రూ.3,904 కోట్లుగా ఉంది. ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రిక్ గూడ్స్ అమ్మకాల ఆదాయం 13.4 శాతం పెరిగి రూ.296 కోట్లుగా ఉంది. ఈపీసీ విభాగం ఆదాయం రెట్టింపై రూ.247 కోట్లకు చేరింది. గత నెల కంపెనీకి చెందిన పలు ప్రాంగణాలు, ప్లాంట్లు, కొందరు ఉద్యోగుల నివాసాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారని, ఆ సమయంలో పూర్తి సహకారం అందించినట్టు కంపెనీ ప్రకటించింది. ఈ సోదాలకు సంబంధించి ఇప్పటి వరకు ఆదాయపన్ను శాఖ నుంచి తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేసింది. బీఎస్ఈలో పాలీక్యాబ్ షేరు పెద్దగా మార్పు లేకుండా రూ.4,431 వద్ద క్లోజ్ అయింది. -
బీఎస్ఈ లాభం హైజంప్
న్యూఢిల్లీ: మార్కెట్ దిగ్గజం బొంబాయి స్టాక్ ఎక్ఛేంజ్ (బీఎస్ఈ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం నాలుగు రెట్లు దూసుకెళ్లి రూ. 118 కోట్లను అధిగమించింది. ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 29 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 53 శాతం జంప్‌చేసి రూ. 367 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 240 కోట్ల ఆదాయం సాధించింది. ఈక్విటీ విభాగంలో రోజువారీ సగటు టర్నోవర్ రూ. 4,740 కోట్ల నుంచి రూ. 5,922 కోట్లకు ఎగసింది. రైట్స్ ఇష్యూ ద్వారా ఇండియా ఇంటర్నేషనల్ ఎక్సే్ఛంజ్(ఐఎఫ్ఎస్సీ) లిమిటెడ్(ఇండియా ఐఎన్ఎక్స్)లో రూ. 22.36 కోట్లు, ఇండియా ఇంటర్నేషనల్ ఎక్సే్ఛంజ్(ఐఎఫ్ఎస్సీ) లిమిటెడ్(ఇండియా ఐసీసీ)లో రూ. 33.88 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేసేందుకు బోర్డు అనుమతించినట్లు బీఎస్ఈ వెల్లడించింది. -
ఇంధన దిగ్గజం కోల్ ఇండియాకు లాభాల పంట
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం కోల్ ఇండియా పటిష్ట ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 13 శాతం పుంజుకుని రూ. 6,800 కోట్లను తాకింది. అధిక అమ్మకాలు ఇందుకు సహకరించాయి. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 6,044 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు షేరుకి రూ. 15.25 చొప్పున తొలి మధ్యంతర డివిడెండును బోర్డు ప్రకటించింది. కాగా.. మొత్తం అమ్మకాలు సైతం రూ. 27,539 కోట్ల నుంచి రూ. 29,978 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు 9 శాతం పెరిగి రూ. 26,000 కోట్లను దాటాయి. ఈ కాలంలో ఇంధన కొనుగోలు ఒప్పందం(ఎఫ్ఎస్ఏ)లో భాగంగా ఒక్కో టన్ను బొగ్గుకు సగటున దాదాపు రూ. 1,542 చొప్పున లభించినట్లు కంపెనీ వెల్లడించింది. దేశీ బొగ్గు ఉత్పత్తిలో 80 శాతం వాటాను ఆక్రమిస్తున్న కంపెనీ తాజా సమీక్షా కాలంలో 157.42 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేసింది. గతేడాది క్యూ2లో 139.23 ఎంటీ బొగ్గు మాత్రమే ఉత్పత్తయ్యింది. ఇక అమ్మకాలు సైతం 154.53 ఎంటీ నుంచి 173.73 ఎంటీకి జంప్ చేశాయి. ఈ ఏడాది 780 ఎంటీ విక్రయాలను కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. -
షాకింగ్ న్యూస్ చెప్పిన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్
దేశంలోని రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడర్ అయిన ఇన్ఫోసిస్(Infosys) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) రెండవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను గురువారం ప్రకటించింది. రెండో త్రైమాసికంలో నికర లాభం 3.1 శాతం పెరిగి లాభం రూ.6,215 కోట్లగా నమోదైంది. ఆదాయం 6.7 శాతం పెరిగి రూ.38,994 కోట్లకు చేరింది. అలాగే లితాల అనంతరం విలేకరుల సమావేశంలో సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ మాట్లాడుతూ ఉద్యోగుల్లో అసమర్థతలను కంపెనీ మోస్తోందన్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 6.7 శాతం పెరిగి రూ.38,994 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది.ఇన్ఫోసిస్ మొత్తం ఆర్థిక సంవత్సరానికి ఆదాయ మార్గదర్శకాలను 1 నుండి 2.5 శాతానికి తగ్గించింది. ఇంతకు ముందు రెవెన్యూ గైడెన్స్ 1 నుంచి 3.5 శాతంగా ఉండేది. అంతేకాదు ఏడాది కూడా క్యాంపస్ నియామకాలనలేవని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఫ్రెషర్లు ఎదుర్కొంటున్న ఆన్‌బోర్డింగ్ ఆలస్యంపై స్పందిస్తూ ఇప్పటికే ఉన్న ఆఫర్లకు తగిన సమయంలో కట్టుబడి ఉంది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 7,500మేర తగ్గింది.త్రైమాసికం క్రితం 17.3 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు 14.6శాతానికి కి తగ్గిందిసెప్టెంబర్ త్రైమాసికంలో దాని మొత్తం సిబ్బంది సంఖ్య 7,530 తగ్గి 328,764కి చేరింది. యుఎస్‌లో కొనసాగుతున్న మాంద్యం భయాల మధ్య బలహీనమైన డీల్ పైప్‌లైన్ కారణంగా ఐటి సంస్థలు ఇప్పుడు ఫ్రెషర్లను నియమించుకోవడాన్ని తగ్గించుకోవాలని యోచిస్తున్నాయి. జీతాల పెంపు ఆలస్యం వేతనాల పెంపు ఆలస్యం చేస్తూ ఉద్యోగులను షాకిచ్చింది. నవంబర్ 1 నుండి తన వేతనాల పెంపును అమలు చేయనున్నట్లు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీలాంజన్ రాయ్ తెలిపారు. కంపెనీ ఏప్రిల్‌లో సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులకు, ఆ పైన జూలైలో పైన ఉన్నవారికి పెంపుదల ఉంటుంది. ఈ ఆలస్యానికి గల కారణాలను కంపెనీ స్పష్టం చేయలేదు. మరోవైపు Wipro, మెరిట్ జీతాల పెంపుదల డిసెంబర్ 1 కి వాయిదా వేస్తున్నట్టు ఉద్యోగులకు తెలియజేసింది. HCLTech జూనియర్ ఉద్యోగులకు త్రైమాసిక పెంపుదలని వాయిదా వేసింది . సీనియర్ మేనేజ్మెంట్ కోసం మెరిట్ పెంపుదలని దాటవేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అతి నియంత్రణ అనర్ధదాయకం..
న్యూఢిల్లీ: ఓవర్–ది–టాప్ (ఓటీటీ) సర్విసులని, మరొకటని ఇంటర్నెట్ సేవలను వేర్వేరుగా వర్గీకరిస్తూ ’అతిగా నియంత్రించడం’ అనర్ధదాయకంగా మారే ప్రమాదముందని స్టార్టప్‌లు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనివల్ల వివిధ రకాల సేవలు అందించే సంస్థలు వివక్షకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ పీడీ వాఘేలాకు 129 అంకుర సంస్థల వ్యవస్థాపకులు ఈ మేరకు సంయుక్త లేఖ రాశారు. జిరోధాకు చెందిన నితిన్ కామత్, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తదితరులు వీరిలో ఉన్నారు. ఓటీటీలు భారీగా డేటాను వినియోగిస్తుండటం వల్ల తమ నెట్‌వర్క్‌లపై భారం పెరిగిపోతోందని, వ్యయాలను భర్తీ చేసుకునేందుకు సదరు ఓటీటీ సంస్థల లాభాల్లో కొంత వాటా తమకూ ఇప్పించాలని టెల్కోలు కోరుతున్న నేపథ్యంలో స్టార్టప్‌ల లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. స్పీడ్, లభ్యత, వ్యయాలపరంగా ఏ యాప్‌పైనా టెలికం, ఇంటర్నెట్ సేవల ప్రొవైడర్లు వివక్ష చూపకుండా తటస్థంగా వ్యవహరించే నెట్ న్యూట్రాలిటీ విధానానికే తమ మద్దతని లేఖలో స్టార్టప్‌ల వ్యవస్థాపకులు తెలిపారు. ఓటీటీ వంటి సర్విసులు అందించే సంస్థలను టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్స్ (టీఎస్పీ) నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి తేవడానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇంటర్నెట్ యాప్స్, సర్విసులకు టెలికం లైసెన్సింగ్ నిబంధనలను వర్తించేస్తే దేశీ స్టార్టప్ వ్యవస్థకు తీవ్ర హాని జరుగుతుందని వివరించాయి. ఇవన్నీ కూడా బడా బహుళజాతి సంస్థలకే లబ్ధి చేకూరుస్తాయని అంకుర సంస్థల వ్యవస్థాపకులు లేఖలో తెలిపారు. -
దశ తిరిగిన కాఫీడే! ఎట్టకేలకు లాభాల్లోకి..
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడిన కాఫీడే (కేఫ్ కాఫీ డే గ్లోబల్ లిమిటెడ్- సీడీజీఎల్) దశ తిరిగిట్టు కనిపిస్తోంది. నష్టాల ఊబి నుంచి బయటపడి ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.24.57 కోట్ల నికర లాభం వచ్చినట్లు ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.11.73 కోట్ల నష్టాన్ని కాఫీడే చవిచూసింది. మొత్తంగా ఏడాది క్రితం తొలి త్రైమాసికంలో రూ.189.63 కోట్లుగా ఉన్న కంపెనీ ఆపరేషన్స్ ఆదాయం ఈ ఏడాది రూ.223.20 కోట్లకు చేరుకున్నట్లు క్యూ1 ఫలితాల వెల్లడి సందర్భంగా కాఫీ డే పేర్కొంది. సీడీజీఎల్ అన్‌లిస్టెడ్ కంపెనీ కావడంతో దాని మాతృ సంస్థ కాఫీడే ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ (సీడీఈఎల్) ప్రతి త్రైమాసికం ఫలితాలను వెల్లడిస్తుంది. కాగా ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 250 కోట్లు. మరోవైపు ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో కాఫీ డే దేశవ్యాప్తంగా ఉన్న తమ అవుట్లెట్ల సంఖ్యను సీక్వెన్షియల్ ప్రాతిపదికన 467కి తగ్గించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 493 అవుట్లెట్లు ఉండేవి. కానీ, వెండింగ్ యంత్రాలను మాత్రం 46,603 నుంచి 50,870కి పెంచుకుంది. ఒక్కో అవుట్‌లెట్‌లో సరాసరి రోజువారీ ఆదాయం రూ.19,537 నుంచి రూ.20,824కి పెరిగినట్లు కాఫీడే కంపెనీ వెల్లడించింది. క్యూ1 ఫలితాల నేపథ్యంలో కాఫీడే షేర్లు ఆగస్ట్ 16న లాభాల బాటలో పయనించాయి. ఇదీ చదవండి: Vietnam Richest man: అదృష్టం కాదిది.. అంతకు మించి! ఒక్క రోజులో రూ. 3.2 లక్షల కోట్ల సంపద.. -
రిస్క్ ఎక్కువే.. మంచి రాబడులు మాత్రం పక్కా..
దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగిస్తూ, ఓపిక పట్టే ఇన్వెస్టర్లకు స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గణనీయమైన రాబడులను ఇస్తాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ పథకాలు గడిచిన పదేళ్ల కాలంలో ఏటా 21 శాతం కాంపౌండ్ వార్షిక రాబడిని అందించాయి. మిడ్‌క్యాప్ (19 శాతం), లార్జ్ క్యాప్ (14 శాతం) పెట్టుబడులతో పోలిస్తే మెరుగైన పనితీరు చూపించాయి. అయితే స్మాల్‌క్యాప్ పథకాలు అందరికీ అనుకూలం అని చెప్పలేం. కేవలం అధిక రిస్క్ తీసుకునే వారు, కనీసం పదేళ్ల పాటు అయినా తమ పెట్టుబడులు కొనసాగించే అవకాశం ఉన్న వారే వీటిని పరిశీలించొచ్చు. ఈ విభాగంలో గొప్ప రాబడుల చరిత్ర ఉన్న కొద్ది పథకాల్లో నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్ కూడా ఒకటి కావడం గమనించొచ్చు. పెట్టుబడుల విధానం నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్ తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ కంపెనీలను కూడా కొంత కేటాయింపులు చేస్తుంటుంది. తద్వారా ఫండ్‌లో అంతర్లీనంగా రిస్క్ తగ్గించే వ్యూహం ఉంది. ముఖ్యంగా టాప్ 250కి పైన ఉన్న (స్మాల్‌క్యాప్) వాటిల్లోంచి భవిష్యత్తులో పెద్ద కంపెనీలుగా అవతరించే సామర్థ్యాలున్న వాటిని గుర్తించి పెట్టుబడులు పెడుతుంటుంది. కాలానుగుణంగా ఒక్కో సైకిల్లో ఒక్కో రంగానికి చెందిన కంపెనీలు బుల్ ర్యాలీ చేస్తుంటాయి. అలాంటి అవకాశాలను కూడా ఈ పథకం ముందే గుర్తించి అధిక కేటాయింపులు చేస్తుంటుంది. ఈ పథకానికి 2017 నుంచి సమీర్ రాచ్ ఫండ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. తేజాస్ షేత్ అనే మరొక ఫండ్ మేనేజర్ కూడా ఈ బాధ్యతలను పంచుకుంటారు. స్మాల్‌క్యాప్ కంపెనీలు స్థూల ఆర్థికపరమైన మార్పులకు సున్నితత్వాన్ని కలిగి ఉంటాయి. అందుకని స్వల్పకాలంలో వీటిల్లో ఎక్కువ అస్థిరతలు కనిపిస్తాయి. కానీ ఓ కంపెనీని వృద్ధి దశ ఆరంభంలోనే గుర్తించి పెట్టుబడులు పెట్టి, వాటిని కొన్నేళ్లపాటు నిలకడగా కొనసాగించడం ద్వారా మెరుగైన రాబడికి వీలుంటుందని చెప్పడానికి ఈ పథకం పనితీరు నిదర్శనం. రాబడులు ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.31,945 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఈ పథకం 2010 సెప్టెంబర్ 16న మొదలైంది. అప్పటి నుంచి చూసుకుంటే ఏటా 20 శాతానికి పైనే ఇన్వెస్టర్లకు రాబడులను అందిస్తోంది. గడిచిన ఏడాది కాలంలో 37 శాతం ప్రతిఫలాన్ని తెచ్చి పెట్టింది. మూడేళ్ల కాలంలోనూ వార్షిక రాబడి 46 శాతంగా ఉంది. ఐదేళ్లలో 21.72 శాతం, ఏడేళ్లలోనూ ఇంతే మేర, పదేళ్ల కాలంలో ఏటా 28.21 శాతం చొప్పున రాబడి అందించింది. అంటే ఏ కాలంలో చూసుకున్నా వార్షిక రాబడుల రేటు 20 శాతానికి పైనే ఉండడం విస్మరించకూడని విషయం. పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం తన నిర్వహణలోని పెట్టుబడుల్లో 96.80 శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించింది. మిగిలినది నగదు రూపంలో కలిగి ఉంది. లార్జ్‌క్యాప్ విభాగంలోని కంపెనీలకు 17 శాతం మేర, మిడ్‌సైజు కంపెనీలకు 38 శాతం వరకు కేటాయింపులు చేయగా, 44.81 శాతం పెట్టుబడులను స్మాల్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 179 స్టాక్స్ ఉన్నాయి. అత్యధికంగా క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 17.14 శాతం, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 13.44 శాతం చొప్పును కేటాయింపులు చేసింది. ఆ తర్వాత కెమికల్ కంపెనీల్లో 8.7 శాతం, సేవల రంగ కంపెనీల్లో 8 శాతం, కన్జ్యూమర్ స్టాపుల్స్ కంపెనీల్లో 7.48 శాతం, టెక్నాలజీ కంపెనీల్లో 6.44 శాతం, ఆటోమొబైల్ రంగ కంపెనీల్లో 6 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. -
ఒకే పథకం.. రెండు ప్రయోజనాలు
ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే పన్ను ఆదా పథకాల్లో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించడం మంచి ఆలోచన అవుతుంది. ఎందుకంటే ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చే సరికి ప్రణాళిక మేరకు పెట్టుబడులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. తద్వారా ఆశించిన మేర పన్ను ఆదాకు మార్గం సుగమం చేసుకోవచ్చు. పెట్టుబడులకు పన్ను ఆదా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. మెరుగైన రాబడులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాతే పన్ను ఆదా ప్రయోజనం చూడాలి. అన్ని సాధనాల్లోకి ఈక్విటీలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు ఇస్తాయని తెలిసిందే. పన్ను ఆదా ప్రయోజనంతో ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాలతో దీర్ఘకాలంలో మంచి సంపద సృష్టించుకోవచ్చని చారిత్రక గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈఎల్ఎస్ఎస్ విభాగంలో చక్కని, నమ్మకమైన పనితీరు చూపిస్తున్న పథకాల్లో మిరే అస్సెట్ ట్యాక్స్ సేవర్ గురించి తప్పకుండా చెప్పుకోవాలి. ఈ పథకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు సొంతం చేసుకోవచ్చు. ఇన్వెస్టర్లు గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఈ పథకంలో చేసే ప్రతి పెట్టుబడికి అక్కడి నుంచి మూడేళ్ల పాటు లాకిన్ ఉంటుంది. మూడేళ్లు నిండిన తర్వాతే ఆ పెట్టుబడిని వెనక్కి తీసుకోవడానికి అనుమతిస్తారు. రాబడులు 5 స్టార్ రేటెడ్ పథకం ఇది. ఏడాది కాలంలో 11 శాతం రాబడులను ఇవ్వగా, మూడేళ్లలో ఏటా 27 శాతం ప్రతిఫలాన్ని పెట్టుబడులపై అందించింది. ఇక ఐదేళ్లలో ఏటా 15 శాతం రాబడిని ఇచ్చింది. ఏడేళ్లలో చూసుకున్నా వార్షిక రాబడి రేటు 17.44 శాతంగా ఉంది. ఈక్విటీల్లో దీర్ఘకాలంలో వార్షిక సగటు రాబడి 12 శాతానికి పైన ఉంటే దాన్ని మెరుగైనదిగా భావిస్తారు. ఈ పథకం రాబడులకు బీఎస్ఈ 500 టీఆర్ఐ సూచీని పరిగణనలోకి తీసుకుంటారు. ఈ సూచీతో పోలిస్తే మిరే అస్సెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్ ఐదేళ్లు, ఏడేళ్ల కాలంలో రెండు నుంచి మూడు శాతం అధికంగా వార్షిక రాబడిని అందించింది. కనుక ఐదేళ్లకు మించిన కాలానికే ఇన్వెస్టర్లు ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఐదేళ్లలోపు లక్ష్యాలకు అచ్చమైన ఈక్విటీలు అనుకూలం కాదని నిపుణుల సూచన. పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో ఈ పథకం ఈక్విటీల్లో పూర్తి మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. అంటే నగదు నిల్వలు తక్కువగా నిర్వహిస్తుండడాన్ని గమనించొచ్చు. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.15,218 కోట్ల ఆస్తులు ఉన్నాయి. వీటిల్లో 99.16 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. ఇందులోనూ లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే 69 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. ఇక మిడ్‌క్యాప్ కంపెనీల్లో 25 శాతం, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 5.57 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 66 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఈ రంగానికి చెందిన కంపెనీల్లోనే 32 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. ఆ తర్వాత అత్యధికంగా ఇంధన రంగ కంపెనీల్లో 11.13 శాతం, టెక్నాలజీ రంగ కంపెనీల్లో 9 శాతం, సేవల రంగ కంపెనీల్లో 8.15 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. ఈ నాలుగు రంగాల్లోనే 60 శాతం పెట్టుబడులు ఉండడం గమనించొచ్చు. -
భారీగా పెరిగిన విమాన ప్రయాణికులు.. లాభాల్లో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ
న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. నష్టాలను వీడి రూ. 3,400 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2021–22) దాదాపు రూ. 804 కోట్ల నికర నష్టం ప్రకటించగా.. 2020–21లో మరింత అధికంగా రూ. 3,176 కోట్ల నష్టం నమోదైంది. గతేడాది ప్రధానంగా దేశీ విమాన ప్రయాణికులు భారీగా పెరగడంతో కంపెనీ ఆర్థికంగా బలపడింది. వెరసి కరోనా మహమ్మారి బయటపడ్డాక కంపెనీ తిరిగి లాభాల బాట పట్టడం గమనార్హం! కాగా.. ఇవి ప్రొవిజనల్ ఫలితాలు మాత్రమేనని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆడిట్ తదుపరి కంపెనీ తుది పనితీరు వెల్లడికానున్నట్లు తెలియజేశాయి. 2022లో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 47 శాతం జంప్‌చేసి 12.32 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది ఈ సంఖ్య 8.38 కోట్లు మాత్రమే. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో ప్రయాణికుల సంఖ్య 52 శాతం ఎగసి 3.75 కోట్లకు చేరింది. ఇదీ చదవండి: ఈక్విటీలలో భారీ పెట్టుబడులు.. ఇప్పటివరకూ రూ.30,945 కోట్లు -
మంచి రాబడిని ఇచ్చే నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఏదీ?
నాకు ఎనిమిది వరకు ఆర్ధిక లక్ష్యాలు ఉన్నాయి. ప్రతీ లక్ష్యానికి విడిగా పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకోవాలా? అలా అయితే పర్యవేక్షణకు ఇబ్బంది కాదా? – శివాని లక్ష్యాలు, పోర్ట్‌ఫోలియో మధ్య సమతూకం ఉండాలి. ముందుగా సమీప కాలంలోని లక్ష్యాలను వేరు చేయండి. అలాగే, మధ్య కాలం, దీర్ఘకాల లక్ష్యాలను కూడా వేరు చేయండి. ఇప్పుడు స్వల్పకాల, మధ్యకాల లక్ష్యాలను సైతం.. రాజీ పడతగ్గ, రాజీపడలేని అనే రెండు విభాగాలుగా వేరు చేయండి. రాజీపడలేని అంటే రిస్క్ తీసుకోని పెట్టుబడులు. రిస్క్ తీసుకోలేని మధ్యకాలం లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడులను ఫిక్స్డ్ ఇన్కమ్ (స్థిరాదాయ/డెట్) సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. వీటికోసం ఒక్కటే పోర్ట్‌ఫోలియో సరిపోతుంది. ఈ పెట్టుబడుల కోసం ఈక్విటీలపై ఆధారపడకూడదు. అవసరమైనప్పుడు వెంటనే తీసుకునేందుకు అనుకూలంగా ఉండాలి. ఇక దీర్ఘకాలం కోసం ఉద్దేశించిన పెట్టుబడులను అంటే తదుపరి ఐదేళ్ల కాలం వరకు అవసరం లేని పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకోవాలి. ప్రతీ లక్ష్యానికి విడిగా ఎంత చొప్పున కావాలి, ఎంత వ్యవధి ఉందనే దాని ఆధారంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. మీ లక్ష్యానికి కావాల్సిన నగదు మీరు కోరుకున్న సమయంలో లభించేలా ప్రణాళిక ఉండాలి. ఉదాహరణకు వచ్చే మూడేళ్ల కాలంలో రూ.5 లక్షలు కావాలి, ఐదేళ్లలో రూ.5 లక్షల కావాలనుకుంటే లేదా 25–30 ఏళ్లలో రూ.కోటి రూపాయలు (రిటైర్మెంట్) కావాలనుకుంటే అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. వేర్వేరు పోర్ట్ఫోలియోలన్నవి కాలవ్యవధికి అనుగుణంగానే ఉండాలి. స్వల్పకాల లక్ష్యాల కోసం ఫిక్స్డ్ ఇన్కమ్లో ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐదేళ్లకు మించిన ఏ లక్ష్యానికైనా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అప్పుడు లక్ష్యాల వారీగా కాకుండా, కాలవ్యవధి ఆధారంగా ప్రత్యేక పోర్ట్‌ఫోలియోలు ఉంటాయి. ఇందుకోసం వ్యాల్యూరీసెర్చ్ ఆన్లైన్లో ‘మై ఇన్వెస్ట్మెంట్’ టూల్‌ను వినియోగించుకోవచ్చు. ఒకటికి మించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు వివిధ లక్ష్యాలకు అనుగుణంగా ఈ టూల్‌తో వేరు చేసుకోవచ్చు. నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్‌లో ఏది మంచిదనే విషయంలో సందేహం నెలకొంది. పథకం ఎంపిక చేసుకోవడం ఎలా? – స్వామినాథన్ ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకునే విషయంలో పరిశీలించాల్సిన ముఖ్య అంశాలు రెండున్నాయి. ఒకటి ఎక్స్పెన్స్ రేషియో. ప్రస్తుతం ఇండెక్స్ ఫండ్స్ మధ్య చాలా పోటీ ఉంది. 10–15 బేసిస్ పాయింట్ల (0.1–0.15 శాతం) ఎక్స్పెన్స్ రేషియోకే ఇండెక్స్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కనుక యాక్టివ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకుని ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో చెల్లించాల్సిన అవసరం లేదు. రెండోది ట్రాకింగ్ ఎర్రర్. ఒక ఇండెక్స్ ఫండ్.. తాను పెట్టుబడులను అనుసరించే ఇండెక్స్‌తో పోలిస్తే రాబడుల విషయంలో ఎంత మెరుగ్గా పనిచేసిందో చెబుతుంది. ఇండెక్స్ ఫండ్ నిర్వహణ బృందం సామర్థ్యాన్ని ఇది ప్రతిఫలిస్తుంది. తక్కువ ఎక్స్పెన్స్ రేషియోతోపాటు.. ట్రాకింగ్ ఎర్రర్ తక్కువగా ఉన్న పథకం మెరుగైనది అవుతుంది. ఈ రెండు అంశాలను ప్రామాణికంగా చేసుకుని చూస్తే ఎస్బీఐ, యూటీఐ, హెచ్డీఎఫ్సీ సంస్థల పథకాలు మెరుగ్గా పనిచేస్తున్నాయి. -
అదానీ పవర్‌కు లాభాలే లాభాలు
న్యూఢిల్లీ: అదానీ పవర్ మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికి రూ.5,242 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.4,645 కోట్లతో పోలిస్తే 13 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.13,307 కోట్లతో పోలిస్తే 19 శాతం క్షీణించి రూ.10,795 కోట్లకు పరిమితమైంది. లాభం వృద్ధి చెందడానికి రుణ వ్యయాలు తగ్గడం, సబ్సిడరీల విలీనం కలిసొచ్చినట్టు అదానీ పవర్ లిమిటెడ్ తెలిపింది. మొత్తం వ్యయాలు మార్చి త్రైమాసికంలో 30 శాతానికి పైగా పెరిగి రూ.9,897 కోట్లకు పెరిగింది. ఇక 2022–23 ఆర్థిక సంవత్సరానికి కన్సాలిడేటెడ్ నికర లాభం 118 శాతం పెరిగి రూ.10727 కోట్లకు చేరుకుంది. ఆదాయం రూ.14,312 కోట్లుగా నమోదైంది అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.4,912 కోట్లు, ఆదాయం రూ.13,789 కోట్ల చొప్పున ఉన్నాయి. మార్చి త్రైమాసికంలో 52 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌ను చేరుకుంది. అదానీ పవర్‌కు 14,410 మెగావాట్ల స్థాపిత థర్మల్ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం ఉంది. -
8 రోజుల లాభాలకు బ్రేక్.. నష్టాల్లో దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాల నేపథ్యంలో ట్రేడర్స్ జాగ్రత్త పడ్డారు. దీంతో 8 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఇక, బుధవారం సాయంత్రం మార్కెట్లు సెన్సెక్స్ 61,193 వద్ద, నిఫ్టీ 18,090 వద్ద ముగిసింది. ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, టీసీఎస్ షేర్లు 1శాతం నష్టపోయాయి. హెచ్‌యూఎల్, ఏసియన్ పెయింట్స్, టాటా మోటార్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, నెస్లే షేర్లు భారీ లాభాలతో ముగింపు పలికాయి. -
మహీంద్రా హాలిడేస్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ దిగ్గజం మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం మూడున్నర రెట్లు జంప్‌చేసి రూ. 56 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో దాదాపు రూ. 16 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 543 కోట్ల నుంచి రూ. 712 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు రూ. 551 కోట్ల నుంచి రూ. 658 కోట్లకు పెరిగాయి. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 67 శాతం దూసుకెళ్లి రూ. 114 కోట్లకు చేరింది. 2021–22లో రూ. 68 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. మొత్తం ఆదాయం రూ. 2,013 కోట్ల నుంచి రూ. 2,517 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం, నిర్వహణ లాభం తదితరాలలో కంపెనీ అత్యుత్తమ పనితీరు చూపినట్లు ఎండీ, సీఈవో కవీందర్ సింగ్ పేర్కొన్నారు. భౌగోళిక, రాజకీయ వివాదాల కారణంగా తలెత్తిన స్థూలఆర్థిక సవాళ్లలోనూ యూరోపియన్ కార్యకలాపాలలో టర్న్‌అరౌండ్‌ను సాధించినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో మహీంద్రా హాలిడేస్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 311 వద్ద ముగిసింది. చైర్మన్ పదవీ విరమణ మహీంద్రా గ్రూప్ నాయకత్వ శ్రేణిలో కీలక సభ్యుడు మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ చైర్మన్ అరుణ్ నందా పదవీ విరమణ చేయనున్నారు. 50 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకుంటున్న నందా 2023 జులై 25న నిర్వహించనున్న వాటాదారుల సాధారణ వార్షిక సమావేశంలో బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. నాన్‌ఎగ్జిక్యూటివ్ పదవుల విషయంలో వయసును పరిగణించి తిరిగి ఎంపిక చేయవద్దంటూ బోర్డుకు సూచించినట్లు నందా తెలియజేశారు. మహీంద్రా గ్రూప్‌లో నందా 1973లో అకౌంటెంట్‌గా కోల్‌కతాలో చేరారు. 1976లో సీఎఫ్‌వో, కంపెనీ సెక్రటరీ(మహీంద్రా సింటర్డ్ ప్రొడక్ట్స్‌గా పుణేలో బాధ్యతలు స్వీకరించారు. -
మామిడి కాయకు కవర్, రైతుకు ప్రాఫిట్
జిల్లాలోని ఖరీఫ్ ఉద్యాన పంటల్లో మామిడిదే అగ్రస్థానం. పంట దిగుబడి నాణ్యంగా ఉంటేనే రైతుకు ఆదాయం. ఇందులో భాగంగానే మామిడి పండ్లు రక్షణ కోసం ఫ్రూట్ కవర్లను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కీటకాలు, పురుగులు ఆశించకుండా జాగ్రత్తలు తీసుకుంది. బయట మార్కెట్లో ఒక్కో ఫ్రూట్ కవర్ ధర రూ.2.5 ఉండగా రైతు భరోసా కేంద్రాల్లో సబ్సిడీ ద్వారా రూపాయికే రైతులకు అందుబాటులోకి తెచ్చింది. దీనిపై జిల్లా వ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సాక్షి, చిత్తూరు:జిల్లాలోని ఉద్యాన పంటల్లో మామి డితే అగ్రస్థానం. ఈ ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 58 వేల హెక్టార్లలో మామిడి పంట సాగవుతోంది. ఇందులో ఎక్కువగా గుజ్జు పరిశ్రమకు ఉపయోగించే తోతాపూరి రకం సాగులో ఉంది. టేబుల్ వైరెటీస్గా పిలవబడే బంగినపల్లి, ఇమామ్ పసంద్, మల్గూబ, రసాలు, మల్లిక వంటి రకాలు సుమారు 40 వేల ఎకరాలలో సాగువుతోంది. గతంలో రసాయనిక ఎరువు లు ఎక్కువగా వాడుతున్నారని యూరోపియన్ దేశా ల వారు మామిడి ఎగుమతులను తిరస్కరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా సేంద్రీయ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించింది. మామిడిలోనూ అధిక దిగుబడులు సాధించేలా చర్యలు చేపట్టింది. తద్వారా విదేశాల నుంచి కూడా ముందస్తు ఆర్డర్లు వస్తున్నాయి. సబ్సిడీతో రూపాయికే కవర్ మొదటి విడతలో జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం 15.3 లక్షల మ్యాంగో కవర్లు మంజూరు చేసింది. ఇదే కవర్ బయట మార్కెట్లో రూ.2.5 వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 60 శాతం సబ్సి డీతో రూపాయికే రైతుకు కవర్ మంజూరు చేస్తోంది. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఆయా రైతు భరోసా కేంద్రాల్లోనే కవర్లు అందుబాటులోకి తెచ్చింది. వీటిని సక్రమంగా వాడుకుంటే రెండు సార్లు ఉపయోగించవచ్చని యంత్రాంగం సూచిస్తోంది. నాణ్యమైన దిగుబడి మామిడిలో పూత దశ నుంచి పిందె.. కాయ దశ వరకు అనేక క్రిమికీటకాలు ఆశిస్తుంటాయి. మామిడి కాయలకు మచ్చతెగులు సోకుతుంటుంది. దీనిద్వారా పంట దిగుబడి దెబ్బతినే ప్రమాదం ఉంది. దీన్ని గుర్తించిన రైతులు మామిడి కాయలకు రక్షణగా కవర్లు కట్టి కాపాడుతున్నారు. వీటి వాడకం వల్ల మామిడి కాయలు వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయని, లోపలికి ఎటువంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయని అధికారులు పేర్కొంటున్నారు. కవర్ లోపల భాగం నలుపు రంగులో ఉండడం వల్ల మామిడికాయకు మంచి ఉష్ణోగ్రత కూడా లభిస్తుంది. దీంతో నాణ్యత గల మామిడి దిగుబడి అవుతుంది. ఆశించిన స్థాయిలో మామిడి ధర ఉంటుంది. సలహా మండలి తీర్మానంతో.. మామిడిలో టేబుల్ వైరెటీస్లో ఎక్కువ భాగం విదేశాలకు ఎగుమతి చేయాల్సి వస్తుంది. వ్యవసాయ సలహా మండలి సమావేశంలో సభ్యులు ఫ్రూట్ కవర్లు కావాలని తీర్మానించారు. ఆమేరకు ప్రభుత్వానికి పంపాము. ప్రభుత్వ అనుమతితో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సబ్సిడీతో కూడిన కవర్లు అందజేస్తున్నాం. – పి.రామచంద్రారెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్, చిత్తూరు జిల్లా నాణ్యమైన పంట దిగుబడి జిల్లాలో మొదటి విడతగా 15.3 లక్షల ఫ్రూట్ కవర్లు మంజూరయ్యాయి. వీటి ద్వారా నాణ్యమైన పంట దిగుబడిని పొందవచ్చు. రైతుల ఉత్పత్తి వ్యయాలను తగ్గించవచ్చు. ఇటీవల మామిడిలో భారీ ఎత్తున ఎగుమతులు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సారి మామిడి కవర్లు అందుబాటులోకి తెచ్చాం. – మధుసూదన్‌రెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి చిత్తూరు మామిడి రైతుకు బాసట రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతుకు నష్టం వాటిల్ల కూడదని అన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించింది. మామిడిలో రక్షణ చర్యలు ప్రారంభించింది. కవర్లు వాడడం వల్ల ఎటువంటి క్రిమిసంహారక మందులు ఉపయోగించనవసరం లేదు. ఇలాంటి మామిడి కాయలను ఎక్కువగా ఎగుమతి చేయొచ్చు. – పి.శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్, చిత్తూరు జిల్లా సమాచారం ఉద్యాన పంటలు ఎకరాల్లో మామిడి 58,000 అరటి 1,500 దానిమ్మ 700 బొప్పాయి 400 మంచి లాభదాయకం మామిడికి ఫ్రూట్ కవర్ వాడకం ఎంతో లాభదాయకం. గతంలో ఈ విధానంలో సాగుచేసిన రైతులకు మంచి ధర లభించింది. అందుకే ఈ ఏడాది మేము కూడా ఈ విధానాన్ని అనుసరించాం. కవర్ల వాడకం వల్ల ఎలాంటి క్రిమిసంహారక మందులు కూడా అవసరం లేదు. నాణ్యమైన పంట దిగుబడి పొందవచ్చు. – ఈశ్వరబాబు, కొత్తపల్లి, గుడిపాల మండలం అవగాహన పెరిగింది అధికారుల సూచనల మేరకు రైతులకు మామిడి కవర్లను సరఫరా చేశాం. క్షేత్రస్థాయిలో ఈ కవర్లను ఏ విధంగా ఉపయోగించాలో అవగాహన కల్పించాం. ఒక రూపాయికే కవర్లు పంపిణీ చేశాం. వీటి వల్ల ఎలాంటి కీటకాలు చేరవు. ఎగుమతులకు ఉపయోగపడే విధంగా మామిడి పంట దిగుబడి చేయవచ్చు. – అఖిల, వ్యవసాయకార్యదర్శి, - చేర్లోపల్లి, చిత్తూరు మండలం కవర్‌ను ఎలా ఉపయోగించాలంటే.. ఒక పెద్ద నిమ్మకాయ సైజు వచ్చిన మామిడికాయకు ఈ కవర్‌ను తొడగాలి. ఆపై కాండంకు కవరు మొదటి భాగం వేలాడదీయాలి. ఈ విధంగా చేయడం వల్ల కాయకు ఎటువంటి పురుగులు ఆశించవు. ఇలా దిగుబడి అయిన మామిడి పళ్లకు మార్కెట్లో 40 శాతానికిపైగా అధిక ధర లభిస్తుంది. (చదవండి : మామిడి ఎగుమతి షురూ) -
క్యూ3లో మార్జిన్ల నేలచూపు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో దేశీ కార్పొరేట్ల నిర్వహణ లాభ మార్జిన్లు మందగించనున్నట్లు రేటింగ్ దిగ్గజం ఇక్రా తాజాగా అంచనా వేసింది. ఇందుకు ద్రవ్యోల్బణం, ఇంధన వ్యయాలు కారణంకానున్నట్లు పేర్కొంది. వెరసి అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో వార్షిక ప్రాతిపదికన ఇబిటా మార్జిన్లు 2.37 శాతం క్షీణించి 16.3 శాతానికి పరిమితంకానున్నాయి. అయితే త్రైమాసికవారీగా అంటే జులై–సెప్టెంబర్(క్యూ2)తో పోల్చి చూస్తే 1.8 శాతం బలపడనున్నట్లు ఇక్రా రేటింగ్స్ అభిప్రాయపడింది. ఇందుకు ముడివ్యయాలు తగ్గడం, పలు కంపెనీలు ప్రొడక్టుల ధరలను పెంచడం దోహదపడనున్నట్లు తెలియజేసింది. త్రైమాసికవారీగా ముడివ్యయాలు నీరసించడంతోపాటు.. ఉత్పత్తుల విక్రయ ధరలు మెరుగుపడటంతో సమీప కాలంలో మార్జిన్లు బలపడనున్నట్లు వివరించింది. అయితే భౌగోళిక రాజకీయ ఆందోళనలు, ఆర్థిక మాంద్య భయాలు, ఫారెక్స్ హెచ్చుతగ్గుల కారణంగా రిస్కులు ఎదురుకావచ్చని పేర్కొంది. ఫైనాన్షియల్ మినహా.. ఫైనాన్షియల్ రంగ సంస్థలు మినహా ఇతర కంపెనీల ఆదాయం 17.2 శాతం పుంజుకోనున్నట్లు ఇక్రా అంచనా వేసింది. హోటళ్లు, చమురు గ్యాస్, ఆటో, ఎయిర్‌లైన్స్, విద్యుత్ రంగాలు ఆదాయ వృద్ధిలో ముందు నిలవనున్నట్లు తెలియజేసింది. త్రైమాసికవారీగా మాత్రం ఆదాయంలో 1.4 శాతమే వృద్ధి నమోదుకావచ్చని అభిప్రాయపడింది. ఇందుకు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, కన్జూమర్ సెంటిమెంట్లు ప్రభావం చూపనున్నట్లు తెలియజేసింది. ఇంధన వ్యయాల ద్రవ్యోల్బణం, అభివృద్ధి చెందిన దేశాలలో మాంద్య పరిస్థితులు, ఎగుమతి, దిగుమతి కంపెనీలపై విదేశీ మారక ఆటుపోట్లు వంటి అంశాలను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో దేశీ కార్పొరేట్ ఫలితాలు ఆధారపడి ఉంటాయని ఇక్రా నిపుణులు శ్రుతి థామస్ తెలియజేశారు. -
స్పైస్‌జెట్‌కు లాభాలు
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ డిసెంబర్ త్రైమాసికానికి రూ.107 కోట్లను ప్రకటించింది. ప్రయాణికులు, సరుకు రవాణా పరంగా పనితీరు మెరుగ్గా ఉండడం లాభాలకు కారణమని కంపెనీ తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలానికి స్పైస్‌జెట్ లాభం రూ.23.28 కోట్లుగా ఉంది. విదేశీ మారకం సర్దుబాటుకు ముందు చూస్తే డిసెంబర్ క్వార్టర్లో లాభం రూ.221 కోట్లుగా ఉంది. ఆదాయం రూ.2,679 కోట్ల నుంచి రూ.2,794 కోట్లకు పెరిగింది. ‘‘మా ప్యాసింజర్, కార్గో వ్యాపారం మంచి పనితీరు చూపించడం లాభాలకు తోడ్పడింది. రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయి. రుణ భారం తగ్గించుకునేందుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి’’ అని స్పైస్‌జెట్ చైర్మన్, ఎండీ అజయ్ సింగ్ తెలిపారు. -
తుక్కు.. తక్కువేం కాదు.. టీఎస్ జెన్కోకు రూ.485 కోట్ల ఆదాయం
సాక్షి , భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో కాలం చెల్లిన, ప్రస్తుతం వినియోగంలో లేని పాత విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను తుక్కు కింద అమ్మేయడం ద్వారా టీఎస్ జెన్కోకు భారీగా ఆదాయం రానుంది. దీంతో పాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా స్థల లభ్యత పెరగనుంది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో దేశ పారిశ్రామిక, గృహ అవసరాలను దృష్టిలో ఉంచుకుని థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాలకు అప్పటి ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ క్రమంలో 1966 సెప్టెంబర్ 4న పాల్వంచలో తొలి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని 60 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించారు. ఈ ప్లాంటు నిర్మాణానికి జపాన్ సాంకేతిక సహాయం అందించగా రూ.59.29 కోట్లు ఖర్చయింది. ఆ తర్వాత వరుసగా బీ, సీ యూనిట్ల నిర్మాణాన్ని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) సంస్థ చేపట్టింది. మొదటి నాలుగు ప్లాంటు సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించారు. ఈ మూడు ప్లాంట్లను ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్ఎం)గా పేర్కొనేవారు. పాత టెక్నాలజీ కావడంతో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తక్కువ పైగా కాలుష్యం ఎక్కువగా ఉండేది. దీంతో పాత ప్లాంట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తిని క్రమంగా నిలిపేస్తూ వచ్చారు. అలా 2019 ఫిబ్రవరి నుంచి 2020 మార్చి నాటికి ఏ, బీ, సీ యూనిట్ల నుంచి విద్యుత్త్ ఉత్పత్తిని ఆపేశారు. తుక్కుకు రూ.485 కోట్లు కేటీపీఎస్‌లోని ఏ, బీ, సీ స్టేషన్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన తర్వాత అప్పటి వరకు వినియోగిస్తూ వచ్చిన టర్బైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, కన్వేయర్ బెల్టులు, ఇతర యంత్ర సామగ్రి నిరుపయోగంగా మారాయి. దీంతో వాటిని తుక్కు కింద అమ్మేయాలని జెన్కో నిర్ణయం తీసుకుంది. దీంతో మరో కేంద్ర సంస్థ ఎంఎస్టీసీ రంగంలోకి దిగింది. ఏ, బీ, సీ ప్లాంట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇక్కడ లభించే ఐరన్, కాపర్, ఇతర యంత్ర విడిభాగాల విలువను మదింపు చేసింది. దీన్ని తుక్కు లెక్కన కొనేందుకు టెండర్లను ఆహ్వానించారు. మొత్తం ఐదు కంపెనీలో పోటీ పడగా కేటీపీఎస్‌లోని పాత మూడు ప్లాంట్లను తుక్కు కింద రూ.485 కోట్లకు కొనుగోలు చేసేందుకు ముంబైకి చెందిన హెచ్ఆర్ కమర్షియల్స్ సంస్థ ముందుకొచ్చింది. కేటీపీఎస్ ఓ అండ్ ఎంలో విడి భాగాలను తొలగిస్తున్న సిబ్బంది ముందుగా ‘ఏ’ ప్లాంటు తొలి దశలో ఏ ప్లాంటును పూర్తిగా తొలగించనున్నారు. ఇందుకుగాను హెచ్ఆర్ కమర్షియల్స్ సంస్థ రూ.144 కోట్లు చెల్లించి రంగంలోకి దిగింది. గత నెలలో పనులు ప్రారంభం కాగా, ప్రస్తుతం ప్లాంటులోకి బొగ్గు తీసుకొచ్చే కన్వేయర్ బెల్ట్ తొలగింపు ప్రక్రియ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఎక్కడికక్కడ భారీ కటింగ్ యంత్రాలతో కన్వేయర్ బెల్ట్ లైన్‌ను ముక్కలుగా చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా పని జరిగే ప్రదేశంలో విద్యుత్ సరఫరా నిలిపేశారు. భారీ నిర్మాణాలను కటింగ్ చేసిన తర్వాత ఇనుము, ఇతర లోహాలను వేరు చేస్తున్నారు. ఇక్కడి నుంచి లారీల ద్వారా తుక్కును తరలిస్తున్నారు. జూన్ వరకు ఏ ప్లాంటు తొలగింపు పనులు సాగనున్నాయి. ఆ తర్వాత వరుసగా బీ, సీ ప్లాంట్లను తొలగిస్తారు. అనంతరం కూలింగ్ టవర్లు, చిమ్నీలను తొలగించాల్సి ఉంటుంది. మొత్తంగా మూడేళ్లలో ఏ, బీ, సీ ప్లాంట్లను పూర్తిగా తొలగించడంతో పాటు నేల మొత్తాన్ని చదును చేసి జెన్కోకు అప్పగించాలనే ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో జెన్కోకు సుమారు 400 ఎకరాల స్థలం లభించనుంది. ఇవి కీలకం.. కేటీపీఎస్ పాత ప్లాంట్లను తొలగించే పనిలో అత్యంత కీలకమైనది వందల మీటర్ల ఎత్తుతో నిర్మించిన చిమ్నీలు, కూలింగ్ టవర్ల తొలగింపు. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ నాలుగు కూలింగ్ టవర్లు, ఒక చిమ్నీని తొలగించాల్సి ఉంటుంది. అయితే జెన్కో విధించిన షరతుల ప్రకారం ఈ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు పేలుడు పదార్థాలను వినియోగించడం నిషిద్ధం. దీంతో బ్లాస్టింగ్ లేకుండా భారీ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అనువుగా ఉన్న మార్గాలపై ఇటు జెన్కో, అటు హెచ్ఆర్ కమర్షియల్స్ సంస్థలు అన్వేషిస్తున్నాయి. ప్రస్తుతానికి మన దేశంలో గతంలో చంద్రాపూర్‌లో ఉన్న పాత విద్యుత్ కేంద్రాన్ని తుక్కు కింద అమ్మేశారు. అక్కడ ఏ విధానం పాటించారనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించనున్నారు. -
బోటు నిండుగా ఆదాయం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జల పర్యాటకం పరవళ్లు తొక్కుతోంది. గడిచిన ఏడేళ్లతో పోలిస్తే ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ)కు చెందిన 12 బోటింగ్ యూనిట్లలో వివిధ రకాలైన 41 బోట్లు నిత్యం సేవలందిస్తున్నాయి. పాపికొండలు, విజయవాడ, శ్రీశైలం బోటింగ్ పాయింట్లకు పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత రికార్డు స్థాయిలో 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఏపీటీడీసీ బోటింగ్ విభాగం ద్వారా రూ.6.25 కోట్లు ఆదాయం రాగా, మార్చి చివరి నాటికి రూ.8.32కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. కొత్తగా బోట్ల కొనుగోలు రూ.2కోట్ల వ్యయంతో కొత్త బోట్ల కొనుగోలుకు ఏపీటీడీసీ సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే అధికారులు టెండర్లు పిలవనున్నారు. 50సీటింగ్ సామర్థ్యం కలిగిన మూడు బోట్లను కొనుగోలు చేసి పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉన్న విజయవాడ, శ్రీశైలం యూనిట్లకు కేటాయించనున్నారు. ఔట్ బోర్డ్ బోట్లు, స్పీడ్, డీలక్స్, పెడల్ బోట్లను సైతం కొనుగోలు చేయనున్నారు. మరోవైపు నాగార్జున సాగర్‌లోని స్టీల్ జెట్టీకి కూడా మరమ్మతులు పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురానున్నారు. కొత్త బోటింగ్ యూనిట్లపై దృష్టి ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రస్తుత బోటింగ్ యూనిట్లలో సేవలను మెరుగుపరచడంతోపాటు కొత్త యూనిట్లను నెలకొల్పడంపై దృష్టి సారిస్తోంది. ఇటీవల పోచవరం(పాపికొండలు), వైఎస్సార్ జిల్లాలోని పర్నపల్లిలో జల పర్యాటకాన్ని అందుబాటులోకి తెచి్చంది. రాష్ట్రంలోనే తొలిసారిగా పర్నపల్లిలో అమెరికన్ పాంటూన్ బోట్లను ప్రవేశపెట్టింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఈ కస్టమైజ్డ్ బోట్లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అక్కడ గత నెలలో ఏకంగా రూ.8లక్షల వరకు ఆదాయం వచి్చంది. త్వరలో బ్రహ్మంసాగర్, దేవునికడపతోపాటు రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో కూడా బోట్లు నడిపేందుకు ఏపీటీడీసీ ప్రతిపాదనలు రూపొందిస్తోంది. జల పర్యాటకానికి ఆదరణ పెరుగుతోంది. పర్యాటకులకు మెరుగైన సేవలందించేందుకు కొత్త బోట్లను సైతం కొనుగోలు చేస్తున్నాం. రాష్ట్ర విభజన తర్వాత ఇంత ఆదాయం ఎప్పుడూ రాలేదు. కొత్త బోటింగ్ పాయింట్లపైనా దృష్టి సారించాం. కరోనా తర్వాత ఇంత వేగంగా పుంజుకోవడం శుభపరిణామం. – కె.కన్నబాబు, ఎండీ, ఏపీటీడీసీ -
ఐవోబీ లాభం ప్లస్.. క్యూ3లో రూ. 555 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 22 శాతం ఎగసి రూ. 555 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 454 కోట్లు ఆర్జించింది. వడ్డీ ఆదాయం, రుణాల నాణ్యత మెరుగుపడటం ఇందుకు సహకరించింది. మొత్తం ఆదాయం రూ. 5,317 కోట్ల నుంచి రూ. 6,006 కోట్లకు పుంజుకుంది. నికర వడ్డీ ఆదాయం 44 శాతం జంప్‌చేసి రూ. 2,272 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 0.71 శాతం బలపడి 3.27 శాతానికి చేరాయి. స్థూల మొండిబకాయిలు 10.4 శాతం నుంచి 8.19 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు సైతం 2.63 శాతం నుంచి 2.43 శాతానికి బలహీనపడ్డాయి. మొండి రుణాలకు కేటాయింపులు రూ. 937 కోట్ల నుంచి రూ. 711 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 15.16 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఐవోబీ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 27.15 వద్ద ముగిసింది. -
టాటా స్టీల్ రూ. 2,502 కోట్ల నష్టాలు
న్యూఢిల్లీ: టాటా స్టీల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఏకంగా రూ. 2,502 కోట్ల నష్టాన్ని (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) ప్రకటించింది. వ్యయాలు గణనీయంగా పెరగడమే ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో కంపెనీ రూ. 9,598 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఇక తాజాగా ఆదాయం రూ. 60,843 కోట్ల నుంచి రూ. 57,354 కోట్లకు తగ్గింది. వ్యయాలు రూ. 48,666 కోట్ల నుంచి రూ. 57,172 కోట్లకు పెరిగాయి. కంపెనీ రుణ భారం ప్రస్తుతం రూ. 71,706 కోట్లుగా ఉంది. సమీక్షా కాలంలో రూ. 3,632 కోట్ల మొత్తాన్ని కంపెనీ పెట్టుబడి వ్యయాలపై వెచ్చించింది. ఉక్కుఉత్పత్తి 7.76 మిలియన్ టన్నుల (ఎంటీ) నుంచి 7.56 ఎంటీకి తగ్గింది. ఒడిదుడుకుల పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశీయంగా అమ్మకాల్లో స్థిర వృద్ధి సాధించగలిగామని టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ తెలిపారు. వ్యయాల నియంత్రణ, నిర్వహణను మెరుగుపర్చుకోవడంపై మరింతగా దృష్టి పెట్టుకోనున్నట్లు పేర్కొన్నారు. -
అదరగొట్టిన ఐటీసీ.. రూ. 5,070 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ, డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 23 శాతం జంప్‌చేసి రూ. 5,070 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,119 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం దాదాపు 4 శాతం వృద్ధితో రూ. 19,021 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 18,366 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. అయితే మొత్తం వ్యయాలు 3 శాతంపైగా తగ్గి రూ. 12,772 కోట్లకు పరిమితమయ్యాయి. వాటాదారులకు షేరుకి రూ. 6 చొప్పున మధ్యంతర డివిడెండు ప్రకటించింది. విభాగాలవారీగా.. క్యూ3లో సిగరెట్లుసహా మొత్తం ఎఫ్ఎంసీజీ విభాగం టర్నోవర్ 17 శాతం వృద్ధితో రూ. 12,935 కోట్లకు చేరింది. దీనిలో సిగరెట్ల ఆదాయం 16 శాతం ఎగసి రూ. 8,086 కోట్లను తాకింది. ఇతర ఎఫ్ఎంసీజీ నుంచి 18 శాతం అధికంగా రూ. 4,849 కోట్లు సమకూరింది. హోటళ్ల ఆదాయం 49 శాతం జంప్‌చేసి రూ. 739 కోట్లను దాటగా, గోధుమలు, బియ్యం ఎగుమతులపై ఆంక్షల కారణంగా అగ్రిబిజినెస్ 36 శాతం క్షీణించి రూ. 3,305 కోట్లకు పరిమితమైంది. పేపర్ బోర్డ్స్, ప్యాకేజింగ్ టర్నోవర్ 13 శాతం పుంజుకుని రూ. 2,306 కోట్లుకాగా.. ఇతర విభాగాల నుంచి రూ. 857 కోట్లు సమకూరింది. ఇది 18 శాతం అధికం.ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్ఈలో 0.5 శాతం బలపడి రూ. 381 వద్ద ముగిసింది. చదవండి: ఎలన్ మస్క్‌కు భారీ ఊరట.. ఆ దూకుడుకు కళ్లెం వేయడం కష్టమే! -
టీవీ టుడే: ఫలితాలు నిరుత్సాహం.. ఒక్కో షేరుకు రూ.67 బంపర్ డివిడెండ్!
న్యూఢిల్లీ: టీవీ టుడే నెట్వర్క్ లిమిటెడ్ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 55 శాతం తగ్గి రూ.28 కోట్లకు పరిమితమైంది. ఆదాయం కూడా 10 శాతం తగ్గి రూ.231 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.61 కోట్లు, ఆదాయం రూ.258 కోట్ల చొప్పున ఉన్నాయి. టెలివిజన్, ఇతర మీడియా కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.229 కోట్లుగా ఉంది. రేడియో బ్రాడ్‌కాస్టింగ్ సేవల నుంచి రూ.2.38 కోట్ల ఆదాయం వచ్చింది. వ్యయాలు 12 శాతం పెరిగి రూ.206 కోట్లుగా ఉన్నాయి. ఒక్కో షేరుకు రూ.67 ప్రత్యేక డివిడెండ్ కింద ఇవ్వాలని కంపెనీ బోర్డ్ నిర్ణయించింది. ఇందుకు ఫిబ్రవరి 13 రికార్డ్ తేదీగా ప్రకటించింది. చదవండి: Google Layoffs: రోడ్డెక్కిన అమెరికాలోని గూగుల్ ఉద్యోగులు.. -
ఇది ఊహించలేదు.. మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ లాభం 452శాతం జంప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, డిజైనింగ్ కంపెనీ మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ డిసెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ నికరలాభం అంత క్రితంతో పోలిస్తే 452.5% ఎగసి రూ.9.2 కోట్లు సాధించింది. ఎబిటా 300 శాతం పెరిగి రూ.13.6 కోట్లకు చేరింది. టర్నోవర్ 71% అధికమై రూ.40.7 కోట్లుగా ఉంది. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన కంపెనీల మోడళ్లకు 3డీ, 2డీ, రోబోటిక్స్ సేవలను అందిస్తున్నామని మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ సీఎండీ జె.లక్ష్మణ రావు తెలిపారు. ‘ఇటువంటి సర్వీసులను ఆఫర్ చేస్తున్న అతికొద్ది భారతీయ కంపెనీల్లో మోల్డ్‌టెక్ ఒకటి. యూరప్, మెక్సికో నుంచి ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. కనెక్షన్ డిజైన్, స్ట్రక్చరల్ డిజైనింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ కంపెనీలను కొనుగోలు చేస్తాం. ఆర్డర్ బుక్ ఎన్నో రెట్లు పెరిగింది. ఈ వృద్ధి కొనసాగుతుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. చదవండి: ఆ జాబ్ పోతేనేం, మూడు రోజుల్లో..భారీ ఆఫర్: 7.1 మిలియన్ల వ్యూస్‌తో మహిళ వైరల్ స్టోరీ -
ఎన్టీపీసీ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుత్ దిగ్గజం ఎన్టీపీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 5 శాతం బలపడి రూ. 4,854 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,626 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 33,784 కోట్ల నుంచి రూ. 44,989 కోట్లకు ఎగసింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 4.25 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఈ కాలంలో సగటు విద్యుత్ టారిఫ్ యూనిట్‌కు 3.95 నుంచి రూ. 4.96కు పుంజుకుంది. బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ల సామర్థ్య వినియోగం(పీఎల్ఎఫ్) 1.1 శాతం మెరుగై 68.85 శాతానికి చేరింది. 2022 డిసెంబర్ 31కల్లా భాగస్వామ్య కంపెనీలు, అనుబంధ సంస్థలతో కలిపి ఎన్టీపీసీ గ్రూప్ విద్యుదుత్పాదక సామర్థ్యం 70,884 మెగావాట్లుగా నమోదైంది. స్థూల విద్యుదుత్పత్తి 75.67 బిలియన్ యూనిట్ల నుంచి 78.64 బి.యూనిట్లకు ఎగసింది. చదవండి: ఓలా సరికొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్.. కస్టమర్ల కోసం అదిరిపోయే బెనిఫిట్స్ -
పతంజలి ఫుడ్స్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ పతంజలి ఫుడ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 15 శాతం వృద్ధితో రూ. 269 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 234 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 26 శాంత ఎగసి రూ. 7,964 కోట్లకు చేరింది. గతంలో రుచీ సోయా ఇండస్ట్రీస్‌గా కార్యకలాపాలు సాగించిన కంపెనీ గత క్యూ3లో రూ. 6,301 కోట్ల టర్నోవర్ సాధించింది. కాగా.. ఈ ఏడాది తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) నికర లాభం రూ. 572 కోట్ల నుంచి రూ. 623 కోట్లకు బలపడింది. మొత్తం ఆదాయం రూ. 17,608 కోట్ల నుంచి రూ. 23,858 కోట్లకు జంప్‌చేసింది. చదవండి: రికార్డు స్థాయిలో సేల్స్.. ఎగబడుతున్న జనం, ఆ ఇళ్లకి యమడిమాండ్! -
వేదాంత లాభం క్షీణత
న్యూఢిల్లీ: మెటల్, మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 41 శాతం క్షీణించి రూ. 2,464 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,164 కోట్లు ఆర్జించింది. పెరిగిన ముడివ్యయాలు, విండ్‌ఫాల్ ట్యాక్స్ లాభాలను ప్రభావితం చేశాయి. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 12.5 చొప్పున నాలుగో మధ్యంతర డివిడెండును ప్రకటించింది. అల్యూమినియం, కాపర్, ఆయిల్‌గ్యాస్ కార్యకాలాపాల కోసం 91 మెగావాట్ల హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుత్, 600 మెగావాట్ల సౌర విద్యుత్‌ను పొందేందుకు బోర్డు అనుమతించినట్లు కంపెనీ తెలిపింది. ఆదాయం అప్ ప్రస్తుత సమీక్షా కాలంలో వేదాంతా మొత్తం ఆదాయం రూ. 34,674 కోట్ల నుంచి రూ. 34,818 కోట్లకు స్వల్పంగా బలపడింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 26,777 కోట్ల నుంచి 31,327 కోట్లకు భారీగా ఎగశాయి. 2022 జూలెలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విండ్‌ఫాల్ ట్యాక్స్ కారణంగా రూ. 333 కోట్ల ప్రభావం పడినట్లు కంపెనీ వెల్లడించింది. జింక్ ఇంటర్నేషనల్ ఆస్తులను రూ. 2,981 కోట్ల విలువలో హిందుస్తాన్ జింక్‌కు విక్రయించనున్నట్లు పేర్కొంది. క్యూ3లో తరుగుదల, అమార్టైజేషన్ పద్దు 4 శాతం పెరిగి రూ. 2,720 కోట్లుగా నమోదైంది. 2022 డిసెంబర్ 31కల్లా స్థూల రుణభారం రూ. 61,550 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో వేదాంతా షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం నష్టంతో రూ. 320 వద్ద ముగిసింది. చదవండి: Union Budget 2023: కేంద్రం శుభవార్త.. రైతులకు ఇస్తున్న సాయం పెంచనుందా! -
జ్యోతి ల్యాబ్స్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ కంపెనీ జ్యోతీ ల్యాబ్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో నికర లాభం 77% పైగా జంప్‌చేసి రూ. 674 కోట్లను తాకింది. గతేడాది ఇదే కాలంలో రూ. 380 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 5,390 కోట్ల నుంచి రూ. 6,127 కోట్లకు ఎగసింది. అధిక కమోడిటీ ధరలు వినియోగాన్ని దెబ్బతీసినప్పటికీ పటిష్ట బిజినెస్‌ను సాధించగలిగినట్లు కంపెనీ పేర్కొంది. నూతన ప్రొడక్టులు, మెరుగైన పంపిణీ, కొత్త ప్రాంతాలకు విస్తరించడం వంటి వ్యూహాలను అమలు చేయడం ద్వారా మార్కెట్ వాటాను పెంచుకునే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు కంపెనీ ఎండీ ఎంఆర్ జ్యోతి పేర్కొన్నారు. చదవండి: Union Budget 2023: అరుదైన ఘనత నిర్మలా సీతారామన్ సొంతం.. అదో రేర్ రికార్డ్! -
ఇండియన్ బ్యాంక్ లాభం డబుల్
కోల్‌కతా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పీఎస్‌యూ సంస్థ ఇండియన్ బ్యాంక్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 1,396 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది (2021– 22) ఇదే కాలంలో సాధించిన రూ. 690 కోట్లతో పోలిస్తే ఇది 102 శాతం వృద్ధి. మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించాయి. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 25 శాతం జంప్‌చేసి రూ. 5,499 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం రూ. 11,482 కోట్ల నుంచి రూ. 13,551 కోట్లకు బలపడింది. నికర వడ్డీ మార్జిన్లు 3.03 శాతం నుంచి 3.74 శాతానికి మెరుగ య్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 9.13 శాతం నుంచి 6.53 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు 2.72 శాతం నుంచి 1 శాతానికి తగ్గాయి. మొండి రుణాలకు కేటాయింపులు రూ. 2,439 కోట్ల నుంచి రూ. 1,474 కోట్లకు క్షీణించాయి. కనీస మూలధన నిష్పత్తి 15.74 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో నామమాత్ర లాభంతో రూ. 291 వద్ద ముగిసింది. -
అరవింద్ లాభం డౌన్!
న్యూఢిల్లీ: టెక్స్టైల్స్ రంగ దిగ్గజం అరవింద్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 87 కోట్లకు పరిమితమైంది. గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 98 కోట్లకుపైగా ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 2,270 కోట్ల నుంచి రూ. 1,980 కోట్లకు బలహీనపడింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 2,135 కోట్ల నుంచి రూ. 1,900 కోట్లకు తగ్గాయి. కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా దీర్ఘకాలిక రుణ భారాన్ని తగ్గించుకుంటున్నట్లు అరవింద్ పేర్కొంది. దీనిలో భాగంగా క్యూ3లో రూ. 135 కోట్లు తిరిగి చెల్లించడం ద్వారా 2022 డిసెంబర్31కల్లా దీర్ఘకాలిక రుణాలు రూ. 739 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో అరవింద్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 2 శాతం నష్టంతో రూ. 85 వద్ద ముగిసింది. చదవండి: ఆయనకు లేదా బాధ్యత? ముందు గూగుల్ సీఈవోను తొలగించండి: పెల్లుబుకిన ఆగ్రహం -
యుకో బ్యాంక్ డబుల్ ధమాకా!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పీఎస్‌యూ సంస్థ యుకో బ్యాంక్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 653 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో సాధించిన రూ. 310 కోట్లతో పోలిస్తే ఇది 110 శాతం వృద్ధి. మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 8 శాతం నుంచి 5.63 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు 2.81 శాతం నుంచి 1.66 శాతానికి తగ్గాయి. స్లిప్పేజీల కంటే రికవరీలు పెరగడంతో మొండి రుణాలకు కేటాయింపులు రూ. 565 కోట్ల నుంచి రూ. 220 కోట్లకు తగ్గాయి. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) రూ. 3,919 కోట్ల నుంచి రూ. 4,627 కోట్లకు బలపడింది. కనీస మూలధన నిష్పత్తి 14.32 శాతంగా నమోదైంది. ఈ కాలంలో ఆర్బీఐ రూ. 88 లక్షల జరిమానా విధించినట్లు బ్యాంక్ వెల్లడించింది. క్యూ3 ఫలితాల నేపథ్యంలో యుకో బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 3.3 శాతం క్షీణించి రూ. 29.50 వద్ద ముగిసింది. చదవండి: మెగా రిపబ్లిక్ డే సేల్స్.. ఆన్లైన్, ఆఫ్‌లైన్ షాపింగ్‌పై భారీ ఆఫర్స్ -
ఐడీబీఐ బ్యాంక్ లాభం జూమ్
ప్రభుత్వ రంగ సంస్థ ఐడీబీఐ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 927 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 578 కోట్లతో పోలిస్తే ఇది 60 శాతం అధికం. ప్రొవిజన్లు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించాయి. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) సైతం 23 శాతం ఎగసి రూ. 2,925 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 2,383 కోట్ల ఎన్ఐఐ నమోదైంది. ఈ కాలంలో స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 21.68 శాతం నుంచి 13.82 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు 1.81 శాతం నుంచి 1.07 శాతానికి తగ్గాయి. నికర వడ్డీ మార్జిన్లు 3.88 శాతం నుంచి 4.59 శాతానికి బలపడ్డాయి. ప్రొవిజన్లు రూ. 939 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ. 233 కోట్లకు పరిమితమయ్యాయి. కనీస మూలధన నిష్పత్తి 20.14 శాతంగా నమోదైంది. బ్యాంకులో ప్రభుత్వం, ఎల్ఐసీకి సంయుక్తంగా 94.71 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. దీనిలో 60.72 శాతం వాటాను విక్రయానికి ఉంచగా ఈ నెల మొదట్లో పలు సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్ దాఖలయ్యాయి. క్యూ3 ఫలితాల నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో యథాతథంగా రూ. 55 వద్దే ముగిసింది. చదవండి: అప్పట్లో రియల్ ఎస్టేట్ కింగ్.. ఇప్పుడేమో లక్షల కోట్ల ఆస్తిని కోల్పోయి -
భళా.. అదరగొట్టిన యాక్సిస్ బ్యాంక్!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 56% ఎగసి రూ. 6,187 కోట్లను అధిగమించింది. స్టాండెలోన్ నికర లాభం మరింత అధికంగా 62% జంప్‌చేసి రూ. 5,853 కోట్లను తాకింది. గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 3,614 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించాయి. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) సైతం 32 శాతం వృద్ధితో రూ. 11,459 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 0.73% బలపడి 4.26 శాతానికి చేరాయి. ఆదాయం రూ. 21,101 కోట్ల నుంచి రూ. 26,892 కోట్లకు చేరింది. యాక్సిస్ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) వార్షిక ప్రాతిపదికన 3.17% నుంచి 2.38%కి, నికర ఎన్పీఏలు 0.91% నుంచి 0.47%కి దిగివచ్చాయి. క్యూ3 ఫలితాల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేరు యథాతథంగా రూ. 930 వద్దే ముగిసింది. చదవండి: అప్పట్లో రియల్ ఎస్టేట్ కింగ్.. ఇప్పుడేమో లక్షల కోట్ల ఆస్తిని కోల్పోయి -
ఇండస్ఇండ్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 58 శాతం జంప్‌చేసి రూ. 1,964 కోట్లను తాకింది. రుణాల నాణ్యత మెరుగుపడటం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం వృద్ధితో రూ. 4,495 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 0.17 శాతం మెరుగై 4.27 శాతాన్ని తాకాయి. ఇతర ఆదాయం సైతం రూ. 1,877 కోట్ల నుంచి రూ. 2,076 కోట్లకు ఎగసింది. మొత్తం ప్రొవిజన్లు రూ. 1,654 కోట్ల నుంచి రూ. 1,065 కోట్లకు క్షీణించాయి. క్యూ2 (జూలె–సెప్టెంబర్)తో పోలిస్తే తాజా స్లిప్పేజీలు రూ. 1,572 కోట్ల నుంచి రూ. 1,467 కోట్లకు తగ్గాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.11 శాతం నుంచి 2.06 శాతానికి వెనకడుగు వేశాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 18.01 శాతానికి చేరింది. ఈ కాలంలో 1,800 మందికి ఉపాధి కల్పించినట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో సుమంత్ కథ్పాలియా తెలియజేశారు. తొలి 9 నెలల్లో 8,500 మందిని జత చేసుకున్నట్లు వెల్లడించారు. దీంతో బ్యాంక్ మొత్తం సిబ్బంది సంఖ్య 37,870కు చేరింది. ఫలితాల నేపథ్యంలో ఇండస్ఇండ్ షేరు బీఎస్ఈలో 0.7% క్షీణించి రూ. 1,222 వద్ద ముగిసింది. చదవండి: కొత్త ఏడాది టెక్కీలకు గుడ్ న్యూస్.. జీతాలు పెరగనున్నాయ్! -
సెంట్రల్ బ్యాంక్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 64 శాతం జంప్‌చేసి రూ. 458 కోట్లను తాకింది. మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 279 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 6,524 కోట్ల నుంచి రూ. 7,636 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 20 శాతం వృద్ధితో రూ. 3,285 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 15.16 శాతం నుంచి 8.85 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు సైతం4.39 శాతం నుంచి 2.09 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 0.22 శాతం తగ్గి 13.76 శాతానికి చేరింది. ఫలితాల నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 0.5 శాతం నష్టంతో రూ. 32.40 వద్ద ముగిసింది. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
టీవీ18 బ్రాడ్‌క్యాస్ట్ లాభం డౌన్
న్యూఢిల్లీ: మీడియా కంపెనీ టీవీ18 బ్రాడ్‌క్యాస్ట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 87 శాతం పతనమై రూ. 38 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 312 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 13 శాతం ఎగసి రూ. 1,768 కోట్లకు చేరింది. గతేడాది క్యూ3లో రూ. 1,567 కోట్ల ఆదాయం నమోదైంది. మొత్తం వ్యయాలు 45 శాతం పెరిగి రూ. 1,813 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో టీవీ18 బ్రాడ్‌క్యాస్ట్ షేరు బీఎస్ఈలో 1.6 శాతం క్షీణించి రూ. 36.5 వద్ద ముగిసింది. చదవండి: దేశంలోని ధనవంతులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసా? -
నెట్వర్క్18 మీడియా క్యూ3 వీక్.. 97 శాతం పతనం!
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ సంస్థ నెట్వర్క్18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 97 శాతం పతనమై రూ. 9 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 307 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 12 శాతం ఎగసి రూ. 1,850 కోట్లను అధిగమించింది. గతేడాది క్యూ3లో రూ. 1,657 కోట్ల ఆదాయం నమోదైంది. మొత్తం వ్యయాలు 45 శాతం పెరిగి రూ. 1,939 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో నెట్వర్క్18 మీడియా షేరు బీఎస్ఈలో 3.3 శాతం క్షీణించి రూ. 63 వద్ద ముగిసింది. చదవండి: స్విగ్గీ సంచలనం..డెలివరీ బాయ్స్‌కు, వారి కుటుంబ సభ్యులకు.. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్యూ3 గుడ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 20 శాతం జంప్‌చేసి రూ. 12,698 కోట్లను తాకింది. వడ్డీ ఆదాయం మెరుగుపడటం ఇందుకు సహకరించింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 19 శాతం బలపడి రూ. 12,260 కోట్లయ్యింది. ఈ కాలంలో 20 శాతం రుణ వృద్ధి కారణంగా నికర వడ్డీ ఆదాయం 25 శాతం ఎగసి రూ. 22,988 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 4.1 శాతంగా నమోదయ్యాయి. ఇతర ఆదాయం రూ. 300 కోట్లు పెరిగి రూ. 8,540 కోట్లకు చేరింది. రుణ నాణ్యత అప్: క్యూ3లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) నిలకడను చూపుతూ 1.23%గా నమోదైంది. నిర్వహణ వ్యయాలు 27 శాతం పెరిగి రూ. 12,464 కోట్లకు చేరగా.. 4,000 మంది ఉద్యోగులను జత చేసుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1,66,890ను తాకింది. . కాగా.. అనుబంధ సంస్థలలో హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నికర లాభం రూ. 258 కోట్ల నుంచి రూ. 203 కోట్లకు తగ్గింది. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ. 304 కోట్ల నుంచి రూ. 501 కోట్లకు జంప్‌చేసింది. ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 1% బలహీనపడి రూ. 1,586 వద్ద ముగిసింది. చదవండి: సేల్స్ రచ్చ మామూలుగా లేదు, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో నంబర్ వన్! -
విప్రో లాభం రూ. 3,053 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 2.8 శాతం బలపడి రూ. 3,053 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 2,969 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 14 శాతం ఎగసి రూ. 23,229 కోట్లకు చేరింది. మార్చితో ముగియనున్న పూర్తి ఏడాదికి ఐటీ సర్వీసుల ఆదాయం 11.5–12 శాతం మధ్య పుంజుకోనున్నట్లు తాజాగా అంచనా(గైడెన్స్) ప్రకటించింది. వాటాదారులకు షేరుకి రూ. 1 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఈ ఏడాది క్యూ2(జూలై–సెప్టెంబర్)తో పోలిస్తే నికర లాభం 15 శాతం, ఆదాయం 3 శాతం వృద్ధి చూపాయి. డీల్స్ రికార్డ్.. ప్రపంచ అనిశ్చితుల్లోనూ క్యూ3లో రికార్డ్ నెలకొల్పుతూ మొత్తం 4.3 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులు కుదుర్చుకున్నట్లు విప్రో సీఈవో, ఎండీ థియరీ డెలాపోర్ట్ పేర్కొన్నారు. ఇది 26 శాతం వృద్ధికాగా.. వీటిలో బిలియన్ డాలర్ల విలువకు మించిన భారీ ఆర్డర్లను సైతం పొందినట్లు తెలియజేశారు. క్యూ4(జనవరి–మార్చి)లోనూ ఇదే స్థాయి ఆర్డర్లు పొందే వీలున్నట్లు అంచనా వేశారు. క్లయింట్లతో లోతైన సంబంధాల ద్వారా అత్యధిక స్థాయిలో డీల్స్ కుదుర్చుకోగలుగుతున్నట్లు వివరించారు. ట్రాన్స్ఫార్మేషన్ లక్ష్యాలు, వ్యయ క్రమబద్ధీకరణ తదితర అంశాలలో క్లయింట్లకు అందిస్తున్న సమర్థవంత సేవలు ఇందుకు దోహదపడుతున్నట్లు తెలియజేశారు. పూర్తిస్థాయి క్లౌడ్ సర్వీసులు, ఇంజనీరింగ్ సర్వీసులు ఆర్డర్బుక్కు దన్నుగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు యథాతథంగా రూ. 396 వద్ద ముగిసింది. ఇతర హైలైట్స్ ►క్యూ2తో పోలిస్తే విప్రో ఉద్యోగుల సంఖ్య నికరంగా 435 తగ్గి 2,58,744ను తాకింది. ► ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 1.8 శాతం తగ్గి 21.2 శాతానికి చేరింది. ► ఐటీ సర్వీసుల నిర్వహణ మార్జిన్లు 1.2 శాతం బలపడి 16.3 శాతానికి చేరాయి. ► ఐటీ సర్వీసుల ఆదాయం 6.2 శాతం వృద్ధితో 280.35 కోట్ల డాలర్లను తాకింది. ► ఐటీ ప్రొడక్టుల ఆదాయం 2.08 కోట్ల డాలర్లు(రూ. 170 కోట్లు)గా నమోదైంది. చదవండి: గూగుల్ ప్లే స్టోర్‌లో ఫేక్ ‘చాట్‌జీపీటీ’ యాప్స్ కలకలం -
టీసీఎస్ క్యూ3 భేష్!
ముంబై: సాఫ్ట్వేర్ సేవల టాటా గ్రూప్ దిగ్గజం టీసీఎస్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 11 శాతం పుంజుకుని రూ. 10,846 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 9,769 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 19 శాతం ఎగసి రూ. 58,229 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 48,885 కోట్ల టర్నోవర్ నమోదైంది. కార్యకలాపాల్లో వృద్ధి, ఫారెక్స్ లాభాలు తాజా త్రైమాసికంలో కంపెనీ లాభదాయకతకు సహకరించాయి. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 75 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది. దీనిలో రూ. 67 ప్రత్యేక డివిడెండ్ కలసి ఉంది. వెరసి డివిడెండ్ రూపేణా రూ. 33,000 కోట్లను పంచనుంది. డాలర్ల రూపేణా ఆదాయం 8 శాతం మెరుగుపడినట్లు టీసీఎస్ పేర్కొంది. భారీగా ఉద్యోగాలు వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24)లో అత్యంత భారీగా ఉద్యోగ సృష్టికి తెరతీయనున్నట్లు టీసీఎస్ వెల్లడించింది. సుమారు 1.5 లక్షల మందికి ఉపాధి కల్పించే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. డీల్ పరిస్థితులు, పైప్‌లైన్ ఆశావహంగా ఉన్నట్లు సీవోవో ఎన్.గణపతి సుబ్రమణ్యం పేర్కొన్నారు. 7 నుంచి 9 బిలియన్ డాలర్ల మధ్య డీల్స్‌ను లక్ష్యంగా పెట్టుకోగా.. వీటికి మధ్యస్థంగా కాంట్రాక్టులు పొందినట్లు వెల్లడించారు. థర్డ్‌పార్టీ, ఇతర వ్యయాలు పెరగడంతో లాభాల మార్జిన్లు ప్రభావితమైనట్లు సీఎఫ్‌వో సమీర్ సేక్సరియా పేర్కొన్నారు. గతేడాది స్థాయిలోనే 25 శాతం ఇబిటా మార్జిన్లు సాధించగలమని తెలియజేశారు. తగ్గిన సిబ్బంది... చాలా ఏళ్ల తదుపరి క్యూ3లో టీసీఎస్ మొత్తం సిబ్బంది సంఖ్య 2,197 తగ్గి 6,13,974కు పరిమితమైంది. ఉపాధి కల్పనకు మించి ఉద్యోగ వలస దీనికి కారణమైనట్లు హెచ్ఆర్ చీఫ్ మిలింద్ లక్కడ్ తెలియజేశారు. ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో 42,000 మంది ఫ్రెషర్స్‌ను తీసుకోగా.. క్యూ4(జనవరి–మార్చి)లోనూ మరికొంతమందికి ఆఫర్ ఇవ్వనున్నట్లు తెలియజేశారు. వచ్చే ఏడాది(2023–24)లోనూ 40,000 మంది కొత్తవారిని నియమించుకోనున్నట్లు వెల్లడించారు. పూర్తి ఏడాదిలో 1.25–1.5 లక్షల మందిని ఎంపిక చేసుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు. ఇతర హైలైట్స్ ► నిర్వహణ లాభ మార్జిన్లు 0.5 శాతం బలపడి 24.5 శాతాన్ని తాకాయి. ► క్యూ3లో 7.9 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ కుదుర్చుకుంది. ► ఉద్యోగుల వలస(అట్రిషన్) స్వల్పంగా తగ్గి 21.3 శాతానికి చేరింది. ► కొత్త ఏడాదిలో 40,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటన. మార్కెట్లు ముగిశాక టీసీఎస్ సాయంత్రం ఫలితాలు విడుదల చేసింది. క్యూ3 పనితీరుపై అంచనాలతో టీసీఎస్ షేరు బీఎస్ఈలో 3.35 శాతం ఎగసి రూ. 3,320 వద్ద ముగిసింది. చదవండి: ‘70 ఉద్యోగాలకు అప్లయ్ చేశా.. ఒక్క జాబ్ రాలేదు..ఇండియాకి తిరిగి వచ్చేస్తా’ -
లక్షల కోట్లలో.. లాభాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థల (పీఎస్‌యూలు/పీఎస్ఈలు) నికర లాభం గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2021–22) 51 శాతం పెరిగి రూ.2.49 లక్షల కోట్లుగా ఉంది. ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ (ఐవోసీ), పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, సెయిల్ అత్యధిక లాభాలను తెచ్చిపెడుతున్నాయి. 2020–21లో ప్రభుత్వరంగ సంస్థల నికర లాభం రూ.1.65 లక్షల కోట్లుగా ఉంది. ఇక నష్టాలతో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థల నష్టం అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.23వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్లకు తగ్గింది. అంటే నష్టాన్ని 38 శాతం తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎయిర్ ఇండియా అస్సెట్ హోల్డింగ్స్, ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్, అలయన్స్ ఎయిర్ ఏవియేషన్ ఎక్కువ నష్టాలతో నడుస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల స్థూల ఆదాయం 2021–22లో రూ.31.95 లక్షల కోట్లుగా ఉంది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో రూ.24.08 లక్షల కోట్లుగా ఉండడం గమనించాలి. అంటే ఏడాదిలో 33 శాతం వృద్ధి చెందింది. ముఖ్యంగా పెట్రోలియం రిఫైనరీ మార్కెటింగ్, ట్రేడింగ్ అండ్ మార్కెటింగ్, పవర్ జనరేషన్ కంపెనీలే ఆదాయంలో 69 శాతం వాటా సమకూరుస్తున్నాయి. ప్రభుత్వానికి భారీ ఆదాయం.. 2021–22 సంవత్సరానికి ప్రభుత్వరంగ సంస్థలు ప్రకటించిన డివిడెండ్ రూ.1.15 లక్షల కోట్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్ రూ.73వేల కోట్లుగానే ఉంది. ఇక ప్రభుత్వరంగ సంస్థలు ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్ డ్యూటీ, జీఎస్టీ, కార్పొరేట్ పన్ను, కేంద్ర ప్రభుత్వ రుణాలపై వడ్డీ చెల్లింపులు, డివిడెండ్, ఇతర సుంకాల రూపంలో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు 2021–22లో రూ.5.07 లక్షల కోట్ల భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.4.97 లక్షల కోట్లుగా ఉంది. ఇలా ఎక్కువ ఆదాయాన్ని తెచ్చి పెట్టిన టాప్–5 కంపెనీల్లో ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ ఒమన్ రిఫైనరీస్, చెన్నై పెట్రోలియం ఉన్నాయి. ఇక కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అర్హులైన కంపెనీలు చేసిన ఖర్చు గత ఆర్థిక సంవత్సరంలో రూ.4,600 కోట్లుగా ఉంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.4,483 కోట్లు కావడం గమనార్హం. సామాజిక కార్యక్రమాలకు చేయూతలో ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఇండియన్ ఆయిల్, ఎన్ఎండీసీ, పవర్‌గ్రిడ్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. -
మీడియా, వినోదం ఆదాయం 1.6 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: భారత్ మీడియా, వినోద రంగం ఆదాయాలు మార్చితో ప్రారంభమయ్యే 2023–24 ఆర్థిక సంవత్సరంలో 12 నుంచి 14 శాతం వృద్ధితో రూ. 1.6 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది. ఆదాయాల వృద్ధి స్పీడ్ విషయంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్ తొలి వరుసలో నిలిస్తే, టీవీ, ప్రింట్లు వరుసలో తరువాత ఉండనున్నట్లు నివేదిక వివరించింది. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ►మీడియా, వినోద రంగం ఆదాయంలో 55 శాతం వాటా ప్రకటన విభాగం నుంచి రాబడికి సంబంధించినదే. ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగా ఉండడంతో ఈ విభాగంలో ఆదాయాలు 14 శాతం వృద్ధి చెందుతాయని అంచనా. అలాగే, 2024 మధ్యలో జరిగే సాధారణ ఎన్నికలు వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ప్రకటన వ్యయంలో పెరుగుదలను పెంచుతాయి. ► మిగిలిన 45 శాతం చందాల రూపంలో ఉంటుంది. ఈ విభాగంలో వృద్ధి 12 శాతం వరకూ నమోదుకావచ్చు. ►వేర్వేరుగా చూస్తే, ప్రింట్ మీడియాలో ఆదాయాలు 15 శాతం పెరిగే వీలుంది. అయితే ఈ విభాగంలో ఆదాయాలు ఇంకా కరోనా ముందస్తు స్థాయికి చేరలేదు. ఇంకా ఈ విషయంలో ఆదాయాలు ఇంకా 8 నుంచి 10 శాతం వరకూ వెనుకబడి ఉన్నాయి. ఆంగ్ల ఎడిషన్ల విషయంలో ఆదాయాల రికవరీ నెమ్మదిగా ఉండడం దీనికి కారణం. అయితే రేడియో, అవుట్డోర్ వంటి ఇతర హైపర్‌లోకల్ మీడియా వచ్చే ఆర్థిక సంవత్సరంలో కరోనా ముందస్తు స్థాయిలను చేరుకోవచ్చు. ఈ విభాగాలకు కీలకమైన వనరుగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల కోసం అధిక యాడ్ బడ్జెట్ కేటాయింపులు దీనికి కారణం. ►ఫిల్మ్ ఎగ్జిబిషన్ విషయానికి వస్తే, థియేటర్ వసూళ్లు కోవిడ్–19 వల్ల తీవ్రంగా నష్టపోయాయి. అయితే 2023–24లో పటిష్టంగా ఆయా ఆదాయాఉల రికవరీ సాధించవచ్చు.30 శాతం వరకూ గణనీయమైన వృద్ధి రేటు నమోదవుతుందని భావిస్తున్నాం. స్క్రీన్లు, ఆక్యుపెన్సీ రేటు పెరిగే అవకాశాలు ఉండడం మా అంచనాలకు కారణం. ►టీవీ, ప్రింట్ మీడియాల్లో రాబడుల్లో వృద్ధి స్పీడ్ మామూలుగా నమోదుకావచ్చు. దీర్ఘకాలికంగా డిజిటల్ మాధ్యమానికి ప్రాధాన్యత పెరుగుతుండడమే దీనికి కారణం. -
ఈ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడితో.. లాభాలు చూస్తే కళ్లుచెదరాల్సిందే
గడిచిన ఏడాది కాలంలో లార్జ్‌క్యాప్ కంపెనీలు అనుకూలంగా ఉన్నాయి. ఇదే కాలంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీలు ఎంతో దిద్దుబాటును చూశాయి. కానీ, ఈ ఏడాది మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కూడా మంచి పనితీరు చూపిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ దృష్ట్యా చూస్తే మల్టీక్యాప్ పథకాలు మంచి రాబడులను ఇవ్వగలవు. ఇప్పుడనే కాదు, దీర్ఘకాలంలో స్థిరమైన, మెరుగైన రాబడులను తెచ్చిపెట్టగలవు. ఈ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో క్వాంట్ యాక్టివ్ ఫండ్ కూడా ఒకటి. గతంతో క్వాంట్ గ్రోత్ ఫండ్‌గా ఇది పనిచేసింది. రాబడులు ఈ పథకం అన్ని కాలాల్లోనూ మెరుగైన రాబడులను ఇచ్చినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ పథకం పేరు మారినా పనితీరులో మార్పు లేదు. ఎందుకంటే లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయగలదు. దీర్ఘకాల లక్ష్యాలైన పిల్లల ఉన్నత విద్య, వివహాలు, రిటైర్మెంట్ కోసం తప్పకుండా ఈ పథకాన్ని పరిశీనలోకి తీసుకుని అధ్యయనం చేయవచ్చు. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడి 10 శాతానికి పైనే ఉంది. కానీ, ఇదే కాలంలో ప్రధాన సూచీల రాబడి 5 శాతంలోపే ఉండడాన్ని గమనించొచ్చు. ఇక మూడేళ్లల కాలంలో ఈ పథకం 35 శాతం చొప్పున వార్షిక రాబడిని అందించింది. ఏడేళ్ల కాలంలో చూసినా 19.34 శాతం, పదేళ్లలో 20 శాతం చొప్పున వార్షిక రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి. ఈ పథకం పనితీరుకు ప్రామాణికమైన బీఎస్ఈ 500 సూచీ రాబడులు ఏడాది కాలంలో కవేలం 5 శాతంలోపే ఉన్నాయి. మూడేళ్లలో చూస్తే బీఎస్ఈ 500 కంటే ఈ పథకం రెట్టింపు రాబడులను ఇచ్చింది. బీఎస్ఈ 500 వార్షికంగా 17.76 శాతం రాబడినివ్వగా, క్వాంట్ యాక్టివ్ 35.13 శాతం ఇచ్చింది. ఏడేళ్లు, పదేళ్లలోనూ రాబడుల పరంగా ఎంతో వ్యత్యాసం ఉండడం ఫండ్ పెట్టు బడుల విధానంలోని బలాన్ని తెలియజేస్తోంది. పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో అవకాశాలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టడం ఈ పథకంలోని ప్రత్యేకత. 2018 నవంబర్ నాటికి ఈ పథకం నిర్వహణలో కేవలం రూ.7 కోట్లు ఉంటే, నాలుగేళ్లలో రూ.3,480 కోట్లకు చేరుకోవడం అసాధారణ వృద్ధి అని చెప్పుకోవాలి. ఫండ్ పనితీరు మెరుగ్గా ఉండడంతో అధిక పెట్టుబడులను ఆకర్షిస్తోంది. అధిక అస్థిరతలను (పెట్టుబడుల విలువలో హెచ్చు తగ్గులు) ఓర్చుకోగలిగి, సగటు కంటే ఎక్కువ రిస్క్ భరించే వారికి క్వాంట్ యాక్టివ్ ఫండ్ అనుకూలం. గ్రోత్ లేదా వ్యాల్యూ లేదా కాంట్రా తరహా ఏదో ఒక పెట్టుబడుల విధానానికి ఇది పరిమితం కాదు. ఎక్కడ బంగారం లాంటి అవకాశం కనిపించినా, పథకం పెట్టుబడుల విధానం పరిధిలో ఆయా అవకాశాలను సొంతం చేసుకుంటుంది. తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 99.2 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. ఇందులో 58 శాతం మేర లార్జ్‌క్యాప్‌లో ఉంటే, మిడ్‌క్యాప్‌లో 35 శాతం, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 16 శాతానికి పైన పెట్టుబడులు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో 58 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ రూ.19 శాతం పెట్టుబడులు ఈ రంగంలోని కంపెనీలకు కేటాయించింది. కన్జ్యూమర్ స్టాపుల్స్లో 16 శాతం, సేవల రంగ కంపెనీల్లో 13.57 శాతం, మెటీరియల్స్ కంపెనీల్లో 10 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టింది. -
లాభాల బాటలో ప్రభుత్వ బ్యాంకులు.. కారణం ఇదే!
ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఈ ఆర్థిక సంవత్సరంలో మొండి బాకీలను తగ్గించుకుని, రికార్డు లాభాలు నమోదు చేశాయి. రుణాలకు భారీగా డిమాండ్ నెలకొనడం, వడ్డీ రేట్లు అధిక స్థాయిలో కొనసాగుతుండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే జోరును కొనసాగించనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రైవేట్ రంగంలో స్థిరీకరణ కనిపిస్తుందని వారు తెలిపారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ విలీనం, సిటీబ్యాంక్ రిటైల్ పోర్ట్‌ఫోలియోను యాక్సిస్ బ్యాంక్ టేకోవర్ చేయడం 2023లో పూర్తి కానుంది. రిజర్వ్ బ్యాంక్ కీలక పాలసీ రేటును మరో పావు శాతం పెంచి 6.25 శాతం నుంచి 6.50 శాతానికి చేర్చే అవకాశం ఉందని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్ తెలిపారు. ఇదే జరిగితే, బ్యాంకులు రుణాలపై పెంచినంతగా డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచటం లేదు కాబట్టి వాటి లాభదాయకతకు మరింతగా తోడ్పడగలదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కొత్త ఏడాదిలో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఒకసారి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ బ్యాంకింగ్ రంగంలో కొన్ని పరిణామాలు చూస్తే.. ► మొత్తం బ్యాంకింగ్ వ్యాపారంలో దాదాపు 60 శాతం వాటా ఉన్న 12 పీఎస్‌బీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో 32 శాతం అధికంగా నికర లాభాలు నమోదు చేశాయి. రూ. 40,991 కోట్లు ఆర్జించాయి. సెప్టెంబర్ క్వార్టర్లో పీఎస్బీలన్నింటి నికర లాభం 50 శాతం పెరిగి రూ. 25,685 కోట్లకు ఎగిసింది. ► ఇదే తీరు కొనసాగితే పీఎస్‌బీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021–22కు మించి లాభాలు సాధించవచ్చని అంచనా. 2021–22లో 12 పీఎస్‌బీల లాభాలు 110 శాతం పెరిగి రూ. 31,816 కోట్ల నుంచి రూ. 66,539 కోట్లకు చేరాయి. ► మొండి బాకీలను తగ్గించేందుకు, అదనపు మూలధనం ఇచ్చి బ్యాంకులను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల అభిప్రాయపడ్డారు. 2022 మార్చి ఆఖరు నాటికి మొండి బాకీలు 9.11 శాతం నుంచి 7.28 శాతానికి దిగి వచ్చాయని ఇటీవల తెలిపారు. కార్పొరేట్లు కూడా రుణాలు తీసుకోవడం పెరుగుతుండటంతో రుణ వృద్ధి మరింత పుంజుకుంటుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ► ప్రైవేట్ రంగం విషయానికొస్తే యస్ బ్యాంకులోకి రెండు గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు (కార్లైల్ గ్రూప్, యాడ్వెంట్) రూ. 8,896 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. చెరో 9.99 శాతం వాటా తీసుకున్నాయి. ► హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ విలీన ప్రతిపాదనకు ఆమోదముద్ర పడింది. దాదాపు 40 బిలియన్ డాలర్ల విలువ చేసే ఈ డీల్‌తో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భారీ ఆర్థిక సేవల దిగ్గజంగా ఆవిర్భవించనుంది. 2023–24 రెండో త్రైమాసికంలో ఈ డీల్ పూర్తి కావచ్చని అంచనా. ► వ్యాపార వృద్ధి ప్రణాళికల్లో భాగంగా సిటీబ్యాంక్ రిటైల్ వ్యాపారాన్ని రూ. 12,325 కోట్లకు కొనుగోలు చేసేందుకు యాక్సిస్ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో క్రెడిట్ కార్డులు, రిటైల్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్, వినియోగదారు రుణాలు తదితర వ్యాపార విభాగాలు ఉన్నాయి. విలీనం పూర్తయితే యాక్సిస్ బ్యాంక్ వద్ద 2.85 కోట్ల పొదుపు ఖాతాలు, 1.06 కోట్ల క్రియాశీలక క్రెడిట్ కార్డులు ఉంటాయి. చదవండి: జొమాటో షాకింగ్ రిపోర్ట్: పూణె వాసి యాప్ ద్వారా రూ.28 లక్షల పుడ్ ఆర్డర్! -
ఈ స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే..లాభాలే లాభాలు
కెనరా రోబెకో స్మాల్ క్యాప్ ఫండ్! భవిష్యత్తులో మంచి వృద్ధిని సాధించే అవకాశాలున్న లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ పథకం ఇది. మోస్తరు రిస్క్ ఉంటుంది. మోస్తరు రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం ఈ పథకాన్ని పెట్టుబడుల కోసం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇచ్చిన చరిత్ర ఈ పథకానికి ఉంది. పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రంగాల వారీ, పెట్టుబడుల కేటాయింపుల విధానాలను ఈ పథకం మార్చుకుంటూ ఉంటుంది. 2014, 2017 మార్కెట్ ర్యాలీ సమయాల్లో ఈ పథకం 99 శాతం వరకు పెట్టుబడులను ఈక్విటీల్లోనే కలిగి ఉంది. అలాగే, 2015, 2018 సంవత్సరాల్లో మార్కెట్లలో అస్థిరతలు పెరిగిన సందర్భాల్లో సురక్షిత రంగాలు, కంపెనీల్లో పెట్టుబడులను పెంచుకోవడాన్ని గమనించొచ్చు. కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్, ఫార్మా రంగాలను అస్థిరతల సమయాల్లో నమ్ముకున్నది. బోటమ్‌అప్ విధానాన్ని పెట్టుబడుల విషయంలో అనుసరిస్తోంది. కొనుగోలు చేసి, దీర్ఘకాలం పాటు కొనసాగడం అనే విధానాన్ని పాటిస్తోంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.15వేల కోట్లకు పైగా పెట్టుబడులు ఉండడం, ఇన్వెస్టర్లకు ఈ పథకం పట్ల ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. సిప్ విధానంలో ప్రతి నెలా రూ.1,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో ప్రస్తుతం ఈక్విటీలకు 97 శాతం కేటాయించి, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో 56 స్టాక్స్ ఉన్నాయి. లార్జ్కాప్స్ కంపెనీల్లో 72 శాతం మేర పెట్టుబడులు కలిగి ఉంటే, మిడ్‌క్యాప్ కంపెనీల్లో 35 శాతం పెట్టుబడులు పెట్టి ఉంది. స్మాల్‌క్యాప్ కంపెనీల్లో కేవలం 1.92 శాతం పెట్టుబడులే ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 30 శాతం పెట్టుబడులు ఈ రంగంలోని కంపెనీలకే కేటాయించింది. ఆ తర్వాత ఆటోమొబైల్ కంపెనీల్లో 9.24 శాతం, సేవల రంగ కంపెనీల్లో 7.72 శాతం, హెల్త్‌కేర్ కంపెనీల్లో 7.25%, టెక్నాలజీ కంపెనీల్లో 6.99 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టింది. రాబడులు ఈ పథకం గడిచిన ఏడాది కాలం మినహా అన్ని కాలాల్లోనూ స్థిరమైన, మెరుగైన రాబడులను ఇచ్చింది. గత ఏడాదిగా మార్కెట్లలో అనిశ్చితులు నెలకొని ఉండడం, మిడ్‌క్యాప్ కంపెనీలు ఎక్కువగా నష్టపోవడం రాబడులపై ప్రభావం చూపించిందని చెప్పుకోవాలి. గడిచిన మూడేళ్ల కాలంలో ఈ పథకం ఏటా 18 శాతం చొప్పున రాబడులను ఇచ్చింది. ఇక ఐదేళ్లలో 10.16 శాతం, ఏడేళ్లలో 14.24 శాతం, పదేళ్లలో 19.38 శాతం చొప్పున వార్షిక రాబడులు ఇందులో ఉన్నాయి. ఏడాది, ఐదేళ్ల కాలంలో మినహా లార్జ్ మిడ్‌క్యాప్ టీఆర్ఐ రాబడుల కంటే ఇందులోనే ఎక్కువగా ఉన్నాయి. -
మోదీ మిత్రుల కోసమే పన్ను తగ్గింపు!
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సామాన్యుల కోసం కాకుండా కార్పొరేట్ల కోసమే పనిచేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పన్నులు, సెస్సుల రూపంలో పెట్రో ఉత్పత్తుల ధరలను అడ్డగోలుగా పెంచేసిన కేంద్రం.. కార్పొ రేట్ చమురు కంపెనీలకు మాత్రం విండ్‌ఫాల్ టాక్సులు తగ్గించడం ఏమిటని నిలదీశారు. ఈ మేరకు కేటీఆర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పెట్రో ఉత్పత్తులపై సెస్సులు, పన్నులు తగ్గించకుండా.. జనం జేబులకు చిల్లుపెట్టడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విమర్శించారు. కార్పొరేట్ చమురు కంపెనీలకు మిగులుతున్న సొమ్ములు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. వాస్తవానికి తెలంగాణ వంటి రాష్ట్రాలు 2014 నుంచి పెట్రో ఉత్పత్తులపై వ్యాట్‌ను ఏమాత్రం పెంచలేదని.. అయినా రాష్ట్రాలే వ్యాట్ తగ్గించడం లేదంటూ మోదీ ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా దేశ ప్రజలను తప్పుదోవ పట్టించిందని మండిపడ్డారు. సెస్‌ల పేరుతో రూ.30లక్షల కోట్లు కొల్లగొట్టి, రాష్ట్రాల పన్నుల వాటాను ఎగవేసిన కేంద్రం.. పైగా రాష్ట్రాలపైనే నిందలు వేస్తోందని విమర్శించారు. కేంద్రం సెస్సుల రూపంలో దోచుకున్న రూ.30 లక్షల కోట్లను వినియోగంలోకి తెస్తే.. లీటర్ పెట్రోల్ రూ.70, డీజిల్‌ను రూ.60కే అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీల లాభం కోసమే.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని బూచిగా చూపి బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలను దోచుకుందని కేటీఆర్ ఆరోపించారు. రష్యా నుంచి తక్కువ ధరకు ముడిచమురు కొంటున్నట్టు మోదీ ప్రభుత్వం గొప్పలు చెప్పిందని.. కానీ ఆ చమురును దేశీయ అవసరాలకు వాడకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసి కార్పొరేట్ కంపెనీలు భారీగా లాభం ఆర్జించాయని వివరించారు. ఇలా కంపెనీలకు అప్పనంగా వచ్చిన సొమ్ముపై మోదీ ప్రభుత్వం పన్నులు తగ్గించిందని.. దీని వెనుక మోదీ కార్పొరేట్ మిత్రులకు చెందిన రెండు కంపెనీలకు లబ్ధి చేకూర్చే ఉద్దే శం ఉందని ఆరోపించారు. చవక చమురు లాభం దేశ ప్రజలకు అందకుండా పోయిందన్నారు. బీజేపీవి క్షుద్ర రాజకీయాలు మోదీప్రభుత్వం దేశప్రగతి, ప్రయోజనాలను పట్టించుకోకుండా క్షుద్ర రాజకీయాలతో కాలం గడుపుతోందని కేటీఆర్ విమర్శించారు. పెట్రో ధరల తగ్గింపు విషయంలో సంకుచిత రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టాలని.. ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. పన్నులు, సెస్సులతో పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచిన కేంద్రం.. ఈ నెపాన్ని తెలంగాణ వంటి రాష్ట్రాలపైకి నెట్టడాన్ని ఆపాలని సూచించారు. (చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుడు నందుపై మరో చీటింగ్ కేసు ) -
ఈ స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే..లాభాలే లాభాలు
స్మాల్‌క్యాప్ అంటే అధిక రిస్క్, అధిక రాబడులతో కూడిన విభాగం. లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్‌తో పోలిస్తే అస్థిరతలు ఎక్కువ. ఆర్థిక సంక్షోభ సమయాల్లో, మార్కెట్ కల్లోలాల్లో ఈ విభాగంలో ఎక్కువ నష్టాలు ఎదురవుతుంటాయి. చిన్న కంపెనీలు లిక్విడిటీ తక్కువతో ఉంటాయి. కనుక, కొంచెం అమ్మకాల ఒత్తిడికే స్టాక్స్ ధరలు ఎక్కువగా నష్టపోతుంటాయి. అందుకని ఈ విభాగంలో దీర్ఘకాలానికి మల్టీబ్యాగర్ స్టాక్స్‌ను గుర్తించి పెట్టుబడులు పెట్టడం, అస్థిరతల సమయాల్లో ఆ పెట్టుబడులను ధైర్యంగా కొనసాగించడం కేవలం నిపుణులైన ఫండ్ మేనేజర్లకే సాధ్యపడుతుంది. కనుక రిటైల్ ఇన్వెస్టర్లు నేరుగా స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి బదులు మంచి ట్రాక్ రికార్డు ఉన్న స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌ను నమ్ముకోవడం మంచిది. ఈ విభాగంలో నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్‌కు తిరుగులేని ట్రాక్ రికార్డు ఉంది. రాబడులు పెట్టుబడిదారులకు మంచి రాబడులను తెచ్చి పెట్టడంలో ఈ పథకం అన్ని కాలాల్లోనూ ముందుంటోంది. ఇతర పథకాలతో, స్మాల్‌క్యాప్ సూచీ, విభాగంతో పోల్చినా మెరుగైన ప్రతఫలాన్నిస్తోంది. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం 11 శాతం రాబడినిచ్చింది. కానీ, ఇదే కాలంలో బీఎస్ఈ 250 స్మాల్‌క్యాప్ టీఆర్ఐ, ఈక్విటీ స్మాల్‌క్యాప్ విభాగం సగటు రాబడి 1.5 శాతంలోపే ఉండడాన్ని ఇన్వెస్టర్లు విస్మరించరాదు. ఇక గడిచిన మూడేళ్ల కాలంలో ఈ పథకం ఏటా 35 శాతం రాబడిని తెచ్చిపెట్టింది. దీన్ని అద్భుత రాబడిగానే చూడొచ్చు. ఇక గడిచిన ఐదేళ్ల కాలంలో 16.43 శాతం, ఏడేళ్లలో 19.38 శాతం, పదేళ్లలో 24.44 శాతం చొప్పున వార్షిక రాబడిని తీసుకొచ్చింది. గడిచన పదేళ్లలో బీఎస్ఈ స్మాల్‌క్యాప్ 250 సూచీ రాబడి ఏటా 13 శాతంగా ఉంటే, స్మాల్‌క్యాప్ విభాగం సగటు వార్షిక రాబడి 18 శాతంగా ఉండడం గమనార్హం. పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో పోర్ట్‌ఫోలియో విషయంలో తగినంత వైవిధ్యాన్ని ఈ పథకం పాటిస్తుంటుంది. అస్థిరతల సమయంలో నగదు నిల్వలను పెంచుకోవడాన్ని గమనించొచ్చు. విడిగా ఒక్కో కంపెనీలో మరీ ఎక్కువగా పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్తను పాటిస్తుంటుంది. అందుకే ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో స్టాక్స్ సంఖ్య భారీగా కనిపిస్తుంది. ప్రస్తుతం 159 కంపెనీల్లో పెట్టుబడులు కలిగి ఉంది. అన్ని రకాల మార్కెట్ సైకిల్స్‌లోనూ కనీసం 100 స్టాక్స్ అయినా పోర్ట్‌ఫోలియోలో నిర్వహిస్తుంటుంది. అలాగే, ఏదో ఒక రంగంలో భారీగా పెట్టుబడులను పెట్టే విధానానికి దూరంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకం పోర్ట్‌ఫోలియోను గమనిస్తే.. క్యాపిటల్ గూడ్స్‌లో 15 శాతం ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ 12.53 శాతం, కెమికల్స్ 11 శాతం, కన్జ్యూమర్ స్టాపుల్స్ కంపెనీల్లో 9 శాతానికి పైగా పెట్టుబడులు కలిగి ఉంది. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.22,844 కోట్ల పెట్టుబడులు ఉన్నాయంటే.. ఈ పథకం పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న నమ్మకం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. తన నిర్వహణలోని పెట్టుబడుల్లో 96.62 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. 17 శాతాన్ని లార్జ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేసింది. 34 శాతం పెట్టుబడులను మిడ్‌క్యాప్‌నకు కేటాయించగా, 49 శాతం పెట్టుబడులు స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఉన్నాయి. -
సేల్స్ బీభత్సం, ఆ కంపెనీకి ఒక సెకను లాభం రూ. 1.48 లక్షలు!
ఇటీవల స్మార్ట్ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో మొబైల్ రంగంలో కంపెనీలు అత్యధిక లాభాలు పొందుతున్నాయి. ఈ జాబితాలో టాప్ స్థానంలో కొనసాగుతున్న ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ లాభాల బాటలో దూపుకుపోతోంది. లాభాల విషయానికొస్తే ..యాపిల్ ప్రతి సెకనుకు ఎంత లాభం పొందుతుందో తెలుసా? ఇది $1,820 ( భారత కరెన్సీ ప్రకారం రూ. 1.48 లక్షలకు పైగా), రోజుకు సుమారు $157 మిలియన్ (రూ. 1,282 కోట్ల కంటే ఎక్కువ) ఆర్జిస్తోంది. తోటి టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ (గూగుల్ మాతృ సంస్థ), అలాగే వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హాత్వే కూడా ప్రతి సెకనుకు వెయ్యి డాలర్లకు పైగా సంపాదిస్తున్నాయి. అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఫైనాన్షియల్ టెక్నాలజీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న టిపాల్టీ ఈ నివేదికను తయారు చేసింది. యాపిల్ టాప్ రెండవ స్థానంలో, మైక్రోసాఫ్ట్ సెకనుకు సుమారు $1,404 (రూ. 1.14 లక్షలు), బెర్క్‌షైర్ హాత్వే సెకనుకు $1,348 (సుమారు రూ. 1.10 లక్షలు) సంపాదిస్తూ తర్వాతి వరుసలో ఉన్నాయి. ఆల్ఫాబెట్ నాల్గవ స్థానంలో సెకనుకు $1,277 సంపాదిస్తే, మెటా ప్లాట్‌ఫారమ్‌లు ప్రతి సెకనుకు $924 లాభలను ఆర్జిస్తున్నాయి. ఉబెర్ (Uber) టెక్నాలజీస్ 2021లో $6.8 బిలియన్ల భారీ నష్టాన్ని చవిచూసింది, ఇది ప్రతి సెకనుకు $215 నష్టంతో సమానం. ప్రపంచంలోనే అతిపెద్ద రైడ్-హెయిలింగ్ యాప్ అయినప్పటికీ, ఉబెర్ ప్రముఖంగా ఎప్పుడూ లాభాలను ఆర్జించలేదు. చదవండి: మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది! -
క్యూ3లో మెరుగ్గా ఉక్కు కంపెనీల లాభాలు
న్యూఢిల్లీ: సవాళ్లతో గడిచిపోయిన సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో దేశీ ఉక్కు తయారీ సంస్థల లాభదాయకత మెరుగుపడవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా పెరుగుతున్న డిమాండ్, తగ్గుతున్న ముడి ఉత్పత్తుల వ్యయాలు ఇందుకు దోహదపడవచ్చని భావిస్తున్నారు. ‘ఒకవైపు ఉక్కు ధరలు పడిపోతూ మరోవైపు ముడి వస్తువుల రేట్లు.. ముఖ్యంగా కోకింగ్ కోల్ ధరలు పెరిగిపోతూ ఉండటం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారతీయ స్టీల్ కంపెనీల ఆర్థిక పనితీరుపై ప్రతికూల ప్రభావం పడింది. అయితే, కోకింగ్ కోల్ వ్యయాలు తగ్గడం, పెరుగుతున్న డిమాండ్‌కి అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాలు పుంజుకంటూ ఉండటం వంటి అంశాలతో మూడో త్రైమాసికంలో వాటి లాభదాయకత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి‘ అని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా సీనియర్ వైస్–ప్రెసిడెంట్ జయంత రాయ్ చెప్పారు. వచ్చే రెండు త్రైమాసికాల్లో ఉక్కు రంగం లాభదాయకత ఒక మోస్తరుగా మెరుగుపడవచ్చని ఎక్యూయిట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చీఫ్ అనలిటికల్ ఆఫీసర్ సుమన్ చౌదరి తెలిపారు. సరఫరాపరమైన సవాళ్లతో పెరిగిన ముడి వస్తువుల రేట్లు ద్వితీయార్థంలో తగ్గుముఖం పట్టనుండటం, సీజనల్‌గా డిమాండ్ పుంజుకుని ఉక్కు ధర పెరగడం వంటివి ఇందుకు సహాయపడగలవని తెలిపారు. ప్రాంతీయంగా ఆశావహంగా భారత్.. ముడి వస్తువులు .. ఇతర ఉత్పత్తుల వ్యయాలు అధిక స్థాయిలో ఉండి, ఉక్కు ధరలు గణనీయంగా పడిపోవడం వల్ల సీజనల్‌గా స్టీల్ కంపెనీలకు జూలై–సెప్టెంబర్ త్రైమాసికంగా బలహీనంగా ఉంటుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ ఫైనాన్స్) కౌస్తుభ్ చౌబల్ తెలిపారు. అయినప్పటికీ, ప్రాంతీయంగా భారత్ ఆశావహంగానే ఉందని, వచ్చే 12 నెలల్లో స్టీల్ వినియోగం సింగిల్ డిజిట్ శాతంలో వృద్ధి నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. ఆటో రంగం నుండి డిమాండ్, ఇన్ఫ్రాపై ప్రభుత్వం భారీగా పెట్టుబడులు కొనసాగిస్తుండటం ఇందుకు దోహదపడగలవని వివరించారు. ద్వితీయార్థంలో అంతర్జాతీయంగా స్టీల్‌కు డిమాండ్ బలహీనంగా ఉన్నా దేశీయంగా మాత్రం బాగానే ఉండటంతో పరిశ్రమ ఈ ఆర్థిక సంవత్సరంలో 6–8 శాతం వృద్ధి చెందవచ్చని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ మనీష్ గుప్తా చెప్పారు. ఉక్కు ధరలు ఒక శ్రేణిలో తిరగవచ్చని పేర్కొన్నారు. చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు భారీ షాక్.. నేటి నుంచి -
బయోకాన్ లాభం డౌన్
న్యూఢిల్లీ:హెల్త్‌కేర్ రంగ దిగ్గజం బయోకాన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–2) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 11 శాతం క్షీణించి రూ. 168 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 188 కోట్లు ఆర్జించింది. వ్యయాలు పెరగడం ప్రభావం చూపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,840 కోట్ల నుంచి రూ. 2,320 కోట్లకు ఎగసింది. బయోసిమిలర్స్, రీసెర్చ్ సర్వీసులు, జనరిక్స్ బిజినెస్ ఇందుకు సహకరించాయి. అయితే మొత్తం వ్యయాలు 30 శాతం పెరిగి రూ. 2,110 కోట్లను తాకాయి. మార్పిడిరహిత డిబెంచర్ల జారీ ద్వారా 25 కోట్ల డాలర్లు(సుమారు రూ. 2,025 కోట్లు), కమర్షియల్ పేపర్(బాండ్లు) ద్వారా మరో 27.5 కోట్ల డాలర్లు సమీకరించేందుకు బోర్డు అనుమతించినట్లు బయోకాన్ తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో బయోకాన్ షేరు ఎన్ఎస్ఈలో 0.7 శాతం నీరసించి రూ. 284 వద్ద ముగిసింది. చదవండి: భారత్‌లో ట్విటర్ చాలా స్లో, మరీ దారుణం: ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్స్! -
ఎన్ఎండీసీ లాభం డౌన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మైనింగ్ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 62 శాతం తగ్గి రూ.886 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్ రూ.6,882 కోట్ల నుంచి రూ.3,755 కోట్లకు పడిపోయింది. వ్యయాలు రూ.3,743 కోట్ల నుంచి రూ.2,570 కోట్లకు వచ్చి చేరాయి. క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో ఎన్ఎండీసీ షేరు ధర సోమవారం 0.26 శాతం పడిపోయి రూ.113.35 వద్ద స్థిరపడింది. చదవండి: ఆ బ్యాంకులపై కొరడా ఝులిపించిన ఆర్బీఐ! -
హిందాల్కో మిశ్రమ ఫలితాలు
న్యూఢిల్లీ: హిందాల్కో ఇండస్ట్రీస్ సెప్టెంబర్ త్రైమాసికానికి మిశ్రమ ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ లాభం 35 శాతం తగ్గిపోయి రూ.2,205 కోట్లకు పరిమితం కాగా, ఆదాయం మాత్రం 18 శాతం పెరిగి రూ.56,176 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.3,417 కోట్లు, ఆదాయం రూ.47,665 కోట్ల చొప్పున ఉండడం గమనించాలి. మెరుగైన అమ్మకాలు ఆదాయంలో వృద్ధికి తోడ్పడినట్టు కంపెనీ తెలిపింది. రూ.5,743 కోట్ల ఎబిట్డా (పన్నులు, వడ్డీకి ముందస్తు) నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 29 శాతం తక్కువ. ‘‘తయారీ వ్యయాలు పెరగడం, అననుకూల ఆర్థిక పరిస్థితులు ప్రభావం చూపించాయి. కాపర్ వ్యాపారంలో మెరుగైన నిర్వహణ పనితీరు, విక్రయాలు బలంగా ఉండడంతో ఈ ప్రభావాన్ని కొంత వరకు అధిగమించగలిగాం’’అని హిందాల్కో ఎండీ సతీష్ పాయ్ తెలిపారు. గత కొన్నేళ్లుగా కంపెనీ వ్యాపారం మరింత బలోపేతంగా, సమగ్రంగా మార్పు చెందడం సవాళ్ల వాతావరణంలోనూ బలమైన ఫలితాలు సాధించేందుకు అనుకూలించినట్టు వివరించారు. -
గోద్రెజ్ కన్జూమర్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం గోద్రెజ్ కన్జూమర్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 25 శాతం క్షీణించి రూ. 359 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 479 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 3,144 కోట్ల నుంచి 7 శాతం పుంజుకుని రూ. 3,364 కోట్లను అధిగమించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం 14 శాతంపైగా పెరిగి రూ. 2,951 కోట్లను దాటాయి. దేశీ ఆదాయం 8 శాతం పుంజుకుని రూ. 1,985 కోట్లను తాకింది. ఇండోనేసియా నుంచి 8 శాతం అధికంగా రూ. 409 కోట్ల టర్నోవర్ సాధించింది.