ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయ మహిళ.. ఎవరీ రేణుకా జగ్తియాని? | Sakshi
Sakshi News home page

ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయ మహిళ.. ఎవరీ రేణుకా జగ్తియాని?

Published Wed, Apr 3 2024 9:16 PM

Who is Renuka Jagtiani - Sakshi

భారతీయుల ఆస్తులు అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా, ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితాలో మరో 25 మంది చేరారు. వారిలో ల్యాండ్‌మార్క్‌ గ్రూప్‌ సీఈఓ రేణుకా జగ్తియాని ఒకరు. ఆమె నికర విలువ సుమారు 4.8 బిలియన్లు

రేణుకా జగ్తియాని ఎవరు?

  • భారతి సంతతికి చెందిన రేణుకా జగ్తియాని భర్త మిక్కి జగ్తియాని ల్యాండ్‌మార్క్‌ గ్రూప్‌ను స్థాపించారు. అయితే గతేడాది మిక్కి జగ్తియాని మరణించడంతో కంపెనీ ఛైర్‌ ఉమెన్‌ అండ్‌ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సంస్థలో మొత్తం 50వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. 
     
  • రేణుకా జగిత్యాని ఆర్ట్స్‌ విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీని యూనివర్సిటీ ఆఫ్‌ ముంబై నుంచి పూర్తి చేశారు. 
     
  •  రేణుకా జగిత్యాని జనవరి 2007లో ఏషియన్ బిజినెస్ అవార్డ్స్ మిడిల్ ఈస్ట్‌లో అత్యుత్తమ ఏషియన్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత జనవరి 2012లో గల్ఫ్ బిజినెస్ ఇండస్ట్రీ అవార్డ్స్‌లో బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌గా, 2014లో వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫోరమ్ ఆమెను ప్రపంచ వ్యాపార వేత్తగా గౌరవించింది. 2015లో ఆమె ఇండియన్ సీఈఓ అవార్డ్స్‌లో స్ట్రాటజిక్ లీడర్ ఆఫ్ ది ఇయర్‌గా, 2016లో స్టార్స్ ఆఫ్ బిజినెస్ అవార్డ్ నుండి ఆమె కెప్టెన్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవార్డును, 2017లో ఆమె వరల్డ్ రిటైల్ కాంగ్రెస్‌లో 'హాల్ ఆఫ్ ఫేమ్'లో చేర్చబడింది.
     
  • రేణుకా జగిత్యాని ఇటీవలే ఫోర్బ్స్ ‘న్యూ బిలియనీర్స్’లో 4.8 బిలియన్ల నికర విలువతో కొనసాగుతున్నారు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఆర్తి, నిషా, రాహుల్‌లు ల్యాండ్‌ మార్క్‌ గ్రూప్‌ ఆఫ్‌ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. 
     
  •  ఫోర్బ్స్ న్యూ బిలియనీర్స్ 2024 నివేదిక ప్రపంచవ్యాప్తంగా 2,781 బిలియనీర్లను గుర్తించింది. ఈ ఏడాది 265 మంది కొత్త బిలియనీర్లు చేరగా.. గత ఏడాది 150 మందితో పోలిస్తే ఇది గణనీయంగా పెరిగింది.

Advertisement
Advertisement