renuka
-
Mettuguda Incident: అంతా కట్టుకథేనా!
చిలకలగూడ,హైదరాబాద్: చిలకలగూడ ఠాణా పరిధిలోని మెట్టుగూడలో ఇంట్లోకి చొరబడిన దుండగులు కత్తులతో దాడి చేసి పొడిచింది కట్టుకథేనని పోలీసులు తేల్చేశారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యల నేపథ్యంలో కుమారుడు యశ్వంత్ కూరగాయలు కోసే చాకుతో కడుపులో పొడుచుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతుండగా.. వద్దని వారించేందుకు అడ్డొచ్చిన తల్లిని పొడిచినట్లు పోలీసులు భావిస్తున్నారు. దుండగులకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లభించకపోవడం, స్థానికులు అందించిన కీలక సమాచారంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు ఇది వేరే వారి పని కాదని, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలే కారణమని నిర్ణయించి అందుకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. సికింద్రాబాద్ మెట్టుగూడకు చెందిన తల్లి రేణుక తన ముగ్గురు కుమారులతో కలిసి నివసిస్తోంది. గురువారం మధ్యాహ్నం ఆరుగురు దుండగులు ఇంట్లోకి చొరబడి కత్తులతో దాడి చేయగా, తల్లి రేణుక, పెద్ద కుమారుడు యశ్వంత్లకు తీవ్ర గాయాలయ్యాయని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సుమారు 150 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా దుండగులకు సంబంధించిన ఏ ఒక్క ఆధారమూ లభించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చిన ఆనవాళ్లు లేవని స్థానికులు స్పష్టం చేశారు. గట్టిగా కేకలు వినిపించడంతో వెళ్లిచూడగా లోపల నుంచి తలుపు గడియ పెట్టి ఉందని, కొన్ని క్షణాల తర్వాత తలుపులు తెరుచుకోగా రేణుక, యశ్వంత్ ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారని, అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. వినియోగించిన చాకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు.. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, వివాహం కాకపోవడం తదితర సమస్యలో తల్లి రేణుక కుమారుడు యశ్వంత్‌ల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయని తెలిసింది. మూడు నెలలుగా యశ్వంత్ ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైన అతను.. కూరగాయలు కోసే చాకుతో కడుపులో పొడుచుకుని ఆత్మహత్యకు యతి్నంచగా, అడ్డుకున్న తల్లిని కూడా పొడిచినట్లు పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఈ ఘటనలో వినియోగించిన చాకును పోలీసులు స్వా«దీనం చేసుకుని ఫింగర్‌ప్రింట్స్ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం. బాధితుడే.. నిందితుడు... ఈ ఘటనలో బాధితుడే నిందితుడు కావడం గమనార్హం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యశ్వంత్‌ను బాధితుడిగా పేర్కొన్న పోలీసులు ఇప్పుడు నిందితుడిగా చేర్చనున్నారు. ఆత్మహత్యా యత్నంతో పాటు తల్లిని చాకుతో పొడిచి హత్యాయత్నానికి పాల్పడినందుకు యశ్వంత్‌పై కేసులు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. కేసును తప్పుదారి పట్టించేలా వ్యవహరించిన యశ్వంత్ సోదరులు యశ్పాల్, వినయ్‌లపై కూడా కేసులు నమోదు చేసేందుకు న్యాయనిపుణుల సలహా తీసుకోనున్నట్లు తెలిసింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేణుక, యశ్వంత్‌లు కోలుకుంటున్నారని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. వీరు పూర్తిగా కోలుకున్న తర్వాత వాంగూల్మం నమోదు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చిలకలగూడ ఇన్స్పెక్టర్ అనుదీప్ స్పష్టం చేశారు. -
రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తిస్తాం
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహిస్తామని హైకోర్టు కొత్త జడ్జీలు రేణుక యార, నర్సింగ్‌రావు నందికొండ, తిరుమలాదేవి ఈద, మధుసూదన్‌రావు బొబ్బిలి రామయ్య ప్రమాణం చేశారు. హైకోర్టు ఆవరణలోని ఫస్ట్ కోర్టు హాల్లో శనివారం ఉదయం 10.45 గంటలకు నలుగురితో న్యాయమూర్తులుగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ సుజోయ్‌పాల్ ప్రమాణస్వీకారం చేయించారు. తొలుత వీరిని న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను రిజి్రస్టార్ జనరల్ ఎస్.గోవర్ధన్‌రెడ్డి చదివి వినిపించారు.ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అదనపు సొలిసిటర్ జనరల్ బి.నరసింహశర్మ, అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, పీపీ పల్లె నాగేశ్వర్రావు, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్‌కుమార్, హెచ్‌సీఏఏ అధ్యక్షుడు ఎ.రవీందర్‌రెడ్డి, రిజి్రస్టార్లు, ఏఏజీలు, కోర్టు సిబ్బందితోపాటు కొత్త న్యాయమూర్తుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. ఇంకా 12 ఖాళీలున్నాయి. తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తులుగా ఈ నలుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం ఈనెల 11న సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. వీరంతా 2012లో జిల్లా జడ్జిగా ఎంపికైన వారే కావడం గమనార్హం. న్యాయాధికారుల కోటాలో వీరిని ఎంపిక చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు ఈ నెల 22న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. కాగా, జస్టిస్ తిరుమలాదేవి 2026, జూన్ 1 వరకు అదనపు న్యాయమూర్తిగా కొనసాగనుండగా, మిగతా ముగ్గురు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్లు అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వహించనున్నారు. -
ఘనంగా రేణుకామాత నవరాత్రి వేడుకలు
బుర్హాన్పూర్: మధ్యప్రదేశ్‌లోని చారిత్రక నగరం బుర్హాన్పూర్. ఇక్కడ వెయ్యేళ్ల పురాతన రేణుకామాత ఆలయం ఉంది. శరదానవరాత్రులు, చైత్ర నవరాత్రులలో ఇక్కడ ఘనంగా వేడుకలు నిర్వహిస్తుంటారు.శరన్నవరాత్రులలో రేణుకా మాత ఆలయ సమీపంలో ప్రతీయేటా జాతర నిర్వహిస్తారు. ఈ జాతర 9 రోజుల పాటు ప్రతీరోజూ ఉదయం 5:00 గంటల నుంచే ప్రారంభమవుతుంది. ఆలయంలో అమ్మవారికి మూడుసార్లు హారతి నిర్వహిస్తారు. నవరాత్రులలో తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలువుతుంది. రేణుకా మాత ఆలయ పూజారి జై శుక్లా మాట్లాడుతూ తమ కుటుంబం ఏడు తరాలుగా ఇక్కడ సేవలు అందిస్తున్నదన్నారు. ఈ ఆలయం సుమారు వెయ్యేళ్లనాటిదని, పెళ్లికానివారు రేణుకామాతను దర్శించుకుంటే వారికి త్వరగా వివాహమవుతుందనే నమ్మకం స్థానికుల్లో ఉన్నదన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలోని పలు జిల్లాల నుంచి ఇక్కడికి భక్తులు తరలివస్తారు. ఉదయం 5:00 గంటల నుండి రాత్రి 11:00 గంటల వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చు. నవరాత్రుల సందర్భంగా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.ఇది కూడా చదవండి: అగ్ని స్నానమాచరించే అమ్మవారు..! సైన్సుకే అంతు చిక్కని మిస్టరీ! -
Hyderabad: ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం (ఫొటోలు)
-
రేణుకస్వామి కేసులో ఏ1గా పవిత్ర!
బెంగళూరు: కన్నడ నటి పవిత్ర గౌడను ఆన్లైన్లో వేధించాడన్న పట్టారాని కోపంతో రేణుకస్వామి అనే చిరుద్యోగిని నటుడు దర్శన్ తూగుదీప, అతని అనుచరులు హతమార్చారన్న కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్శన్ సన్నిహిత నటి పవిత్ర గౌడను ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా పేర్కొంటూ పోలీసులు గురువారం బెంగళూరులో 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట రిమాండ్ రిపోర్ట్‌ను సమర్పించారు. స్వామికి కరెంట్ షాక్ ఇచ్చి హింసించామని ఇప్పటికే అరెస్టయిన ఒక నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. ఈ వివరాలను రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు ప్రస్తావించారు. హత్య తర్వాత అరెస్ట్, కేసు నుంచి తప్పించుకునేందుకు, మృతదేహాన్ని మాయం చేసి ఆధారాలను ధ్వంసంచేసేందుకు దర్శన్ భారీగా ఖర్చుచేశారని, అందుకోసం స్నేహితుడు మోహన్ రాజ్ నుంచి రూ.40 లక్షల అప్పు తీసుకున్నారని పోలీసులు వెల్లడించారు. షాక్ ఇచ్చేందుకు వాడిన ఎలక్ట్రిక్ షాక్ టార్చ్‌ను, ఆ రూ.40 లక్షల నగదును పోలీసులు ఇప్పటికే స్వా«దీనం చేసుకున్నారు. దర్శన్, మరో ముగ్గురిని పోలీస్ కస్టడీకి, పవిత్ర గౌడను జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోర్టును పోలీసులు కోరారు. ఘటనాస్థలిలో చెప్పులతో కొట్టిన పవిత్ర చిత్రదుర్గ ప్రాంతంలో రేణుకస్వామిని కిడ్నాప్‌చేసి 200 కి.మీ.ల దూరంలోని బెంగళూరుకు తీసుకొచ్చి షెడ్లో కట్టేసి కొట్టేటపుడు నటి పవిత్ర గౌడ అక్కడే ఉన్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆమె కూడా రేణుకస్వామిని తన చెప్పులతో కొట్టారని పోలీసులు పేర్కొన్నారు. అసభ్య సందేశాలు పంపిన స్వామికి బుద్ది చెప్పాలని అక్కడే ఉన్న దర్శన్‌ను పవిత్ర ఉసిగొలి్పందని ఆయా వర్గాలు వెల్లడించాయి. రేణుకస్వామి పోస్ట్‌మార్టమ్‌లో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. సున్నిత అవయవాలపై దాడితో వృషణాలు చితికిపోయాయని, ఒక చెవి కనిపించలేదని నివేదిక పేర్కొంది. రేణుకస్వామి గతంలో ఇన్‌స్టా్రగామ్‌లో పోస్ట్ చేసి డిలీట్‌చేసిన మెసేజ్‌లను వెలికి తీసివ్వాలని దాని మాతృ సంస్థ ‘మెటా’ను పోలీసులు కోరారు. -
హత్య కేసులో నటుడు దర్శన్
-
అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన టీడీపీ అభిమానులనూ ఆకట్టుకుంటోంది. గతంలో తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు అభిమాని అయిన సీనియర్ జర్నలిస్ట్ రేణుక పోతినేని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దార్శనిక పాలనపై ప్రత్యేకంగా ఓ పుస్తకం రూపొందించారు. ‘జగన్ విజన్.. ట్రాన్స్ఫార్మింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ఏపీ’ శీర్షికతో ఆమె రచించిన ఈ పుస్తకం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ట్రెండ్ అవుతోంది. సీఎం జగన్ నాయకత్వంలో ఏపీలో కనిపిస్తున్న అద్వితీయ మార్పులను ఎలుగెత్తి చాటుతూ, మాజీ సీఎం చంద్రబాబు హయాంలోని అవినీతి కోణాలను ఈ పుస్తకం తూర్పారపట్టింది.ఏపీలో అభివృద్ధి, ఉద్యోగాలు, సామాజిక న్యాయం, పారిశ్రామిక ప్రగతి, వ్యవసాయం, విద్య, ఆక్వా రంగం అభివృద్ధి, వైద్యం, సంక్షేమం, భూ సంస్కరణలు, ఇళ్ల నిర్మాణం, మేనిఫెస్టో విశ్వసనీయత, సీఎం జగన్ స్కీములు, చంద్రబాబు స్కాములను వివరిస్తూ, అప్పటి.. ఇప్పటి అప్పులపై ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా సమగ్ర వివరాలు అందించిన ఈ పుస్తకం అందరినీ ఆకట్టుకుంటోంది.సీఎం జగన్ సమగ్ర పాలనా స్వరూపాన్ని ఆవిష్కరించింది. ఒకప్పుడు చంద్రబాబు అభిమాని అయిన రేణుక పోతినేని.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న విప్లవాత్మక అభివృద్ధి, జీవన ప్రమాణాలను పెంచుతున్న ప్రజా సంక్షేమ పథకాలను చూసి ఈ పుస్తకాన్ని రూపొందించడమే కాకుండా, సీఎం జగన్ పాలనను సామాజిక మాధ్యమాల్లో ప్రశంసిస్తున్నారు.చరిత్ర ఎరుగని దుర్మార్గపు దాడి..ఏపీ అభివృద్ధి, సంక్షేమంపై గత ఐదేళ్లుగా ప్రధాన మీడియాల్లో పదేపదే తప్పుడు ప్రచారం జరుగుతున్నట్టు రేణుక తన పుస్తకంలో అభిప్రాయపడ్డారు. ‘నిజం రెండు అడుగులు వేసేలోపు.. అబద్ధం వెయ్యి అడుగులు వేస్తుంది’ అనే నినాదాన్ని టీడీపీ, దాని అనుబంధ మీడియా సంస్థలు నమ్ముకున్నాయయి’ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మీడియా మేనేజ్మెంట్ స్కిల్స్‌తో ప్రధాన, సోషల్ మీడియాలో ట్రోల్స్ విపరీతంగా పెరిగిపోయాయన్నారు.తెలుగుదేశం పార్టీ, న్యూట్రల్ ముసుగులో ఉన్న రెండు పత్రికలు, ఐదారు మీడియా సంస్థల అసత్య ప్రచార దాడిలో ఎన్నో వాస్తవాలు మరుగున పడిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీ తరఫున 1.50 లక్షల వాట్సాప్ గ్రూప్‌లు, 100కు పైగా పెయిడ్ మీమర్స్, వెయ్యికి పైగా ఫేస్బుక్ పేజీలను నడిపిస్తూ నిత్యం ప్రజా పాలనపై చరిత్రలో ఎన్నడూ లేనంతగా దుర్మార్గపు దాడికి పాల్పడ్డారని అభిప్రాయపడ్డారు.ఐదేళ్లలో ఏపీ సాధించిన అభివృద్ధి, సంక్షేమం వివరాలు ప్రజలకు గణాంకాలతో సహా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె చెప్పారు. సీఎం జగన్ తీసుకునే నిర్ణయాల వెనుక ఏపీ భవిష్యత్తు ఎంత ఉజ్వలంగా మారుతుందో, ఎంతటి గొప్ప మార్పులు కనిపిస్తాయో ప్రతి ఒక్కరూ అవగతం చేసుకోవడానికే కచ్చితమైన సమాచారంతో ‘జగన్ విజన్’ పుస్తకాన్ని తీసుకొచ్చినట్టు’ తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు. ఆమె చెప్పిన అక్షర సత్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. -
Renuka Jagtiani: 'ఫోర్బ్స్ న్యూ బిలియనీర్స్ 2024 జాబితాలో' తన ల్యాండ్ మార్క్..
సంపన్న కుటుంబ నేపథ్యం లేని మిక్కీ జగ్తియాని ‘ల్యాండ్‌మార్క్’తో ఒక్కోమెట్టు ఎక్కుతూ ప్రపంచ కుబేరుల సరసన నిలిచాడు. భర్త అడుగు జాడల్లో నడిచి వ్యాపార నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న రేణుకా జగ్తియాని ‘ల్యాండ్ మార్క్’కు తనదైన మార్క్ జోడించి ఆ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించింది. తాజాగా.. ఫోర్బ్స్ న్యూ బిలియనీర్స్ 2024 జాబితాలో చోటు సాధించింది. రేణుకా జగ్తియాని నేతృత్వంలోని దుబాయ్ చెందిన రిటైలింగ్ దిగ్గజం ‘ల్యాండ్‌మార్క్’ 21 దేశాలలో పాదరక్షల నుంచి గృహోపకరణ వస్తువుల వరకు వివిధ బ్రాండ్లతో విజయపథంలో దూసుకుపోతుంది. హాస్పిటాలిటీ బిజినెస్‌లో కూడా గెలుపు జెండా ఎగరేసింది. ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలతో ముందుకువెళ్లే రేణుక మిడిల్ ఈస్ట్, ఇండియా, ఆగ్నేయాసియాలోని కీలక మార్కెట్లలో రాబోయే కాలంలో వందలాది స్టోర్లను ప్రారంభించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఎలాంటి వ్యాపార అనుభవం లేని రేణుక 1993లో ల్యాండ్‌మార్క్ గ్రూప్‌లోకి అడుగు పెట్టింది. ‘ఇది సాధ్యమా!’ అనుకునే వాళ్లు సందేహాల దగ్గరే తచ్చాడుతారు. ‘కచిత్చంగా సాధ్యమే’ అనుకునే వాళ్లు ముందుకు దూసుకుపోతారు. రేణుక రెండోకోవకు చెందిన మహిళ. వేగంగా వ్యాపార నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవడమే కాదు ఫాస్ట్–ఫ్యాషన్ బిజినెస్ ‘స్ప్లాష్’తో తనదైన ముద్ర వేసింది. ‘స్ప్లాష్’ పదకొండు దేశాలలో 200 స్టోర్స్ వరకు విస్తరించింది. మన దేశంలో 1999లో లైఫ్‌స్టైల్, హోమ్ సెంటర్ అండ్ మాక్స్‌లాంటి అయిదు ఫార్మట్స్‌లో ప్రస్థానం ప్రారంభించి 900 స్టోర్స్‌లో విస్తరించింది ల్యాండ్‌మార్క్. 2017లో రేణుక ల్యాండ్ మార్క్ గ్రూప్ చైర్పర్సన్, సీయీవోగా బాధ్యతలు స్వీకరించింది. రేణుక భర్త మిక్కీ జగ్తియాని సౌత్ ఆఫ్రికా ఇమిగ్రెంట్స్‌ను దృష్టిలో పెట్టుకొని బహ్రెయిన్‌లో బేబీ ్ర΄÷డక్ట్స్ స్టోర్‌ను మొదలుపెట్టాడు. అక్కడినుంచిప్రారంభమైన బుడి బుడి అడుగుల వ్యాపారం ‘ల్యాండ్‌మార్క్’ రూపంలోఎక్కడికో వెళ్లింది. భర్త నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాన్ని చెక్కుచెదరకుండా నిలబెట్టడం అంత సులువు కాదు. కాని ఎక్కడా రేణుక వెనకడుగు వేయలేదు. అయితే ప్రపంచంలోని ఎన్నో కంపెనీలపై పడినట్లే కోవిడ్ సంక్షోభ ప్రభావం ‘ల్యాండ్‌మార్క్’ పై పడింది. రెండు నెలలకు పైగా స్టోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఆ తరువాత మెల్లమెల్లగా కొత్త గైడ్‌లైన్స్‌తో తెరుచుకోవడం మొదలైంది. ‘విపత్కరమైన పరిస్థితుల్లో ఆపరేషనల్ప్రాసెస్లో ర్యాపిడ్ చేంజెస్ చేశాము. ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాం. క్వారంటైన్లో ఉన్న ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందించాం, వారిలో ధైర్యం నింపాం. ఆఫీస్, స్టోర్ ఉద్యోగుల కోసం ప్రత్యేక వసతి ఏర్పాటు చేశాం. ఉద్యోగుల కోసమే కాదు కోవిడ్ బాధితుల కోసం మా ఫౌండేషన్ తరపున ఎన్నోరకాల సేవాకార్యక్రమాలు చేపట్టాం’ అంటూ ఆ రోజులను గుర్తు తెచ్చుకుంటుంది రేణుక. చిన్న వ్యాపారంగా మొదలైన ‘ల్యాండ్‌మార్క్’ గల్ఫ్‌కు సంబంధించి ‘కింగ్ ఆఫ్ రిటైల్’గా పేరు తెచ్చుకుంది. విజయపథంలో దూసుకుపోతున్న ‘ల్యాండ్‌మార్కు’ ముందున్న కర్తవ్యం.. సమాజానికి తిరిగి ఇవ్వాలి. ఆదరించిన ప్రజలకు అండగా ఉండాలి. పర్యావరణ సంరక్షణ కార్యక్రమాలకుప్రాధాన్యత ఇస్తున్న ల్యాండ్ మార్క్ గ్రూప్ చెన్నై, ముంబై మురికివాడల్లో రకరకాల సేవాకార్యక్రమాలు చేపడుతోంది. రేణుక జగ్తియాని భర్త మిక్కీ జగ్తియాని 71 సంవత్సరాల వయసులో చనిపోయారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక రిపోర్టర్ ఆయనను ‘మీ నెక్ట్స్ ΄్లాన్ ఏమిటి?’ అని అడిగాడు. దీనికి మిక్కీ జగ్తియాని చెప్పిన జవాబు.. ‘నా గురించి నేను పూర్తిగా తెలుసుకోవడానికి ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నాను. వ్యాపార సంబంధిత విషయాల గురించి కాకుండా నేనెవరిని? జీవితపరమార్థం ఏమిటి? లాంటి విషయాల గురించి ఆలోచిస్తుంటాను. వ్యాపార లాభాలే కాదు జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాలలో ఆనందం దొరుకుతుంది’ భర్త అడుగుజాడల్లో నడిచి, వ్యాపార నైపుణ్యాన్నే కాదు సేవాదృక్పథాన్ని సొంతం చేసుకున్న రేణుకా జగ్తియాని వ్యాపారంతో పాటు సేవాకార్యక్రమాలకు కూడాప్రాధాన్యత ఇస్తోంది. భర్త అడుగుజాడల్లో నడిచి, వ్యాపారనైపుణ్యాన్నే కాదు సేవాదృక్పథాన్ని సొంతం చేసుకున్న రేణుకా జగ్తియాని వ్యాపారంతోపాటు సేవా కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తోంది. ఇవి చదవండి: Vipul Varshney: ఎదుర్కోడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి -
ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయ మహిళ.. ఎవరీ రేణుకా జగ్తియాని?
భారతీయుల ఆస్తులు అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా, ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో మరో 25 మంది చేరారు. వారిలో ల్యాండ్‌మార్క్ గ్రూప్ సీఈఓ రేణుకా జగ్తియాని ఒకరు. ఆమె నికర విలువ సుమారు 4.8 బిలియన్లు రేణుకా జగ్తియాని ఎవరు? భారతి సంతతికి చెందిన రేణుకా జగ్తియాని భర్త మిక్కి జగ్తియాని ల్యాండ్‌మార్క్ గ్రూప్‌ను స్థాపించారు. అయితే గతేడాది మిక్కి జగ్తియాని మరణించడంతో కంపెనీ ఛైర్ ఉమెన్ అండ్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సంస్థలో మొత్తం 50వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. రేణుకా జగిత్యాని ఆర్ట్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని యూనివర్సిటీ ఆఫ్ ముంబై నుంచి పూర్తి చేశారు. రేణుకా జగిత్యాని జనవరి 2007లో ఏషియన్ బిజినెస్ అవార్డ్స్ మిడిల్ ఈస్ట్‌లో అత్యుత్తమ ఏషియన్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత జనవరి 2012లో గల్ఫ్ బిజినెస్ ఇండస్ట్రీ అవార్డ్స్‌లో బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌గా, 2014లో వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫోరమ్ ఆమెను ప్రపంచ వ్యాపార వేత్తగా గౌరవించింది. 2015లో ఆమె ఇండియన్ సీఈఓ అవార్డ్స్‌లో స్ట్రాటజిక్ లీడర్ ఆఫ్ ది ఇయర్‌గా, 2016లో స్టార్స్ ఆఫ్ బిజినెస్ అవార్డ్ నుండి ఆమె కెప్టెన్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవార్డును, 2017లో ఆమె వరల్డ్ రిటైల్ కాంగ్రెస్‌లో 'హాల్ ఆఫ్ ఫేమ్'లో చేర్చబడింది. రేణుకా జగిత్యాని ఇటీవలే ఫోర్బ్స్ ‘న్యూ బిలియనీర్స్’లో 4.8 బిలియన్ల నికర విలువతో కొనసాగుతున్నారు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఆర్తి, నిషా, రాహుల్‌లు ల్యాండ్ మార్క్ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ న్యూ బిలియనీర్స్ 2024 నివేదిక ప్రపంచవ్యాప్తంగా 2,781 బిలియనీర్లను గుర్తించింది. ఈ ఏడాది 265 మంది కొత్త బిలియనీర్లు చేరగా.. గత ఏడాది 150 మందితో పోలిస్తే ఇది గణనీయంగా పెరిగింది. -
ఐర్లాండ్: వాసవి మాత అగ్నిప్రవేశ దినోత్సవ వేడుకలు..
శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో త్రిశక్తి స్వరూపిణి, సకల వేద స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అగ్నిప్రవేశ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాఘశుద్ధ విదియ రోజు వందమందికి పైగా వాసవి మాత భక్తులు, కమిటీ సభ్యులందరు కలిసి ఉదయాన్నే అనుకున్నట్టుగా కింగ్స్‌వుడ్ ప్రాంతమునందున్న స్థానిక వినాయగర్ ఆలయానికి చేరుకొని అక్కడ మొదటగా అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. మొదటగా పిల్లలు తరువాత మహిళలంతా కలిసి చక్కగా అమ్మవారికి భక్తిశ్రద్దలతో అభిషేక కార్యక్రమాన్ని పూర్తిచేశారు. తరువాత అమ్మవారికి వివిధరకాల పుష్పాలతో అలంకరించిన పిమ్మట లలిత సహస్రనామ పఠనము, మణిదీపవర్ణన, సామూహిక కుంకుమార్చన నిర్వహించగా.. విశాలి రమేష్, శృతి, అనూష చేసిన అమ్మవారి గీతాలాపనలో భక్తులందరూ తన్మయత్వం చెందారు. అటుపిమ్మట అమ్మవారికి మహిళలందరూ వడిబియ్యం సమర్పించి మన సంస్కృతీ సంప్రదాయాలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన అంకిత ఈ కార్యక్రమం మొత్తాన్ని చక్కగా సమన్వయము చేసారు. చిరంజీవి-లక్ష్మి హాసిని వాసవి పురాణం నుండి సేకరించిన ధర్మసూత్రాలను ఆంగ్లంలోకి అనువదించిన వాసవి దివ్యకథను భక్తులందరికీ చదివి వినిపించారు. అమ్మవారి నామస్మరణతో భక్తులందరూ పులకించిపోయారు. సంప్రదాయ వస్త్రధారణలో పిల్లలు పెద్దలు ఆనందంగా వారి ఒకరోజు సమయాన్ని ఇలా అమ్మవారి సేవలో గడపటం చాలాా ఆనందంగా ఉందని కోర్-కమిటీ సభ్యుల్లో ఒకరైన అనీల్ అన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిధిగా విచ్చేసిన ఆలయ సెక్రటరీ, డైరెక్టర్ బాలకృష్ణన్ దంపతులకు కార్యవర్గ సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు ముత్తుస్వామిని ఘనంగా సత్కరించారు. బాలకృష్ణన్ మాట్లాడుతూ అమ్మవారి కార్యక్రమాలు వినయాగర్ ఆలయం నందు నిర్వహించడం అందులో భక్తులందరూ ఉత్సాహంగా పాల్గొనడం చాలా ఆనందమైన విషయమని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలనీ అభిలాషించారు. సరసమైన ధరలకే భోజన ప్రసాదాలు అందించిన బిర్యానీవాలా రెస్టారెంట్ అధినేత శ్రీనివాస్‌కి, దీనికి సహకరించిన ప్రశాంత్‌కి కమిటీ కార్యవర్గ సభ్యులు శివ కుమార్, నవీన్ సంతోష్ ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు. హాజరైన సభ్యులందరు ముక్తకంఠంతో ఐర్లాండ్ నందు ఇలాంటి కార్యక్రమాలు జరగడం ఎంతో శుభపరిణామమని ఆనందించారు. కార్యక్రమానికి ముఖ్య ఉభయదారులుగా దాతలు రేణుక దినేష్, రజిత సంతోష్, నితేశ్ గుప్తాలకు కమిటీ సభ్యులు సత్కరించి కృతఙ్ఞతలు తెలియజేసారు. అమ్మవారి అలంకరణ, పుష్పాలంకరణ సేవకు కృషిచేసిన సభ్యుల్లో మాధవి, దివ్య మంజుల, శృతి, మాధురి, రేణుక, అంకిత, మణి, లావణ్య తదితరులకు కమిటీ సభ్యులు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు. తదుపరి కార్యక్రమంలో అధ్యక్షులు నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. అమ్మవారి జీవిత విశేషాలను ప్రస్తుత సమాజం ఎలా స్వీకరించాలో ఉదాహారణలతో వివరించి సభ్యులందరికి అమ్మవారు చెప్పిన ధర్మ సంబంధమైన విషయాలను లోతుగా వివరించి చెప్పారు, హాజరైన సభ్యులకు భక్తులకు పేరుపేరునా కృతఙ్ఞతలు తెలియజేసారు. చివరిగా.. అందరూ భోజన ప్రసాదాన్ని స్వీకరించి కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమం మొత్తం ముందుకు సాగడంలో కీలకంగా కోర్-కమిటీ సభ్యులతో పాటుగా సేవాదళ్ సభ్యుల్లో ముఖ్యంగా గంగా ప్రసాద్, లావణ్య, సంతోష్ పారేపల్లి, శ్రీనివాస్, సతీష్, మాణిక్, శ్రవణ్ తదితరులు పాల్గొని విజయవంతంగా ముగించారు. -
బర్త్‌డేకు దుబాయ్ తీసుకెళ్లలేదని భర్తను గుద్ది చంపేసింది
పుణె: తన పుట్టినరోజును పురస్కరించుకుని దుబాయ్‌కు తీసుకెళ్లి వేడుక చేయలేదనే వీరావేశంతో భర్తను భార్య పిడిగుద్దులు కురిపించి చంపేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పుణెకు చెందిన 38 ఏళ్ల నిఖిల్ ఖన్నా వాన్వాడియా ప్రాంతంలో వ్యాపారం చేస్తుండేవారు. అతనికి 36 ఏళ్ల భార్య రేణుక ఉంది. ఆమె పుట్టినరోజు సెప్టెంబర్ 18. అదే రోజున తనను దుబాయ్‌కు తీసుకెళ్లి పుట్టినరోజు వేడుక జరపాలని పట్టుబట్టింది. అందుకు భర్త ససేమిరా అన్నాడు. ఈ నెల ఐదో తేదీన వీరి వివాహ వార్షికోత్సం జరిగింది. ఆ రోజూ తనకేమైనా ప్రత్యేక బహుమతులు ఇస్తాడేమో అని ఆశపడి భంగపడింది. ఢిల్లీలోని తన బంధువుల వేడుకలకూ వెళ్లాలని భావించినా అదీ నెరవేరలేదు. ఒకదాని వెంట మరోటి ఏ ఒక్క ఆశ తీరకపోవడంతో నవంబర్ 24వ తేదీన భర్తతో వాగ్వాదానికి దిగింది. తీవ్ర వాదులాట సందర్భంగా వీరావేశంతో భర్త ముఖంపై పిడిగుద్దులు కురిపించింది. దీంతో ముక్కు నుంచి రక్తం కారుతూ అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. భార్యభర్త ఘర్షణ పడుతున్న విషయం తెల్సి ఇరుగుపొరుగు వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి భర్తను వెంటనే దగ్గర్లోని ససూన్ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే ఆయన ప్రాణం పోయిందని వైద్యులు ధృవీకరించారు. -
అప్పుడు తల్లి.. ఇప్పుడు తండ్రి.. చివరికి అనాథలైన పిల్లలు!
సంగారెడ్డి: తల్లిదండ్రుల మృతితో ఆ పిల్లలను రోడ్డున పడేశాయి. అనారోగ్యంతో రెండేళ్ల కిందట తల్లి చనిపోగా.. అదే అనారోగ్యం తండ్రినీ పొట్టనపెట్టుకుంది. దీంతో ముగ్గురు చిన్నారుల పరిిస్థితి అగమ్యగోచరంగా మారింది. వివరాలిలా ఉన్నాయి. దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాలకు చెందిన దొడ్డి యాదగిరి (42), రేణుక (35)లకు ముగ్గురు ఆడపిల్లలు. 2021లో రేణుక అనారోగ్యంతో మృతిచెందింది. అప్పటి నుంచి పిల్లల బాగోగులు తండ్రి చూసుకునేవాడు. అంతలోనే యాదగిరి తల్లి బాల ఎల్లవ్వ కూడా మృతిచెందింది. కాగా కొద్దిరోజులుగా యాదగిరి కూడా మంచం పట్టాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 18న మృతిచెందాడు. శనివారం గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. తల్లిదండ్రులతో పాటు నానమ్మ కూడా మృతిచెందడంతో చిన్నారులు అనాథలయ్యారు. శిరీష 8వ తరగతి, శ్రావణి నాలుగు, రిషిక రెండో తరగతి చదువుతున్నారు. పిల్లల రోదనలు గ్రామస్తులను కంటతడి పెట్టించాయి. ఎవరూ లేని ఈ పిల్లలను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దాతలు సాయం అందించాలనుకుంటే 9550940672లో సంప్రదించాలని తెలిపారు. -
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో రేణుకకు బెయిల్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్ పేపర్ లీకేజీ కేసులో నిందితురాలు(ఏ3) రేణుకకు బెయిల్ లభించింది. నాంపల్లి కోర్టు ఆమెకు రూ.50వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. రేణుకతో పాటు ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు ఏ12 డి.రమేష్, ఏ13 ప్రశాంత్ రెడ్డిలకు కూడా కోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ పొందిన ఈ ముగ్గురి నిందితుల పాస్‌పోర్టు సీజ్ చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. మూడ నెలల వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో సిట్ కార్యలయంలో హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈమేరకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. కాగా.. రేణుక గతంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. న్యాయస్థానం తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈసారి మాత్రం ఆమెకు ఊరటనిచ్చింది. (చదవండి: పుట్టగానే తండ్రి వదిలేశాడు.. టెన్త్‌లో 10 జీపీఏతో సత్తాచాటిన కవలలు) -
TSPSC: 40 లక్షలకు మూడు ఏఈ పేపర్లు లీక్.. సినిమా రేంజ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో సిట్ ఇప్పటికే స్పీడ్ పెంచింది. కాగా, తాజాగా టీఎస్పీఎస్సీ నిందితుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఏఈ పేపర్ లీక్‌లో కేతావత్ రాజేశ్వర్ కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, మూడు ఏఈ పేపర్లను రాజేశ్వర్ రూ.40 లక్షలకు అమ్మినట్టు విచారణలో తేలింది. ఇందుకు రూ. 25 లక్షలను రాజేశ్ అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. మిగిలిన డబ్బును పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత వచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో నిందితుల నుంచి పోలీసులు.. రూ. 8.5 లక్షలను రికవరీ చేశారు. ఈ క్రమంలో ప్రవీణ్ కుమార్.. రేణుకకు పేపర్ లీక్ చేశాడు. నమ్మకమైన వారికి పేపర్ అమ్మాలని రేణుకకు సూచించాడు. ఈ సందర్బంగా రూ. 10లక్షలకు రేణుకతో బేరం కుదుర్చుకున్నాడు. దీంతో, రేణుక వద్ద నుంచి ప్రవీణ్ అడ్వాన్స్‌గా రూ. 5లక్షలు తీసుకున్నాడు. ఇక, ఈ పేపర్లను రేణుక తన భర్త డాక్యానాయక్ ద్వారా అమ్మకానికి పెట్టింది. వారి సమీప బంధువైన రాజేశ్వర్‌కు పేపర్ విషయం చెప్పి అమ్మాలని సూచించారు. రంగంలోకి దిగిన రాజేశ్వర్.. మధ్యవర్తులు గోపాల్, నీలేష్, ప్రశాంత్, రాజేంద్రకుమార్‌లకు రూ. 40 లక్షలకు పేపర్లను విక్రయించాడు. వారి వద్ద నుంచి అడ్వాన్స్‌గా రూ. 23 లక్షలు తీసుకున్నాడు. అనంతరం, రూ.10లక్షలు డాక్యానాయక్‌కు ఇచ్చిన రాజేశ్వర్. ఇక, ఇందులో నుంచి మరో రూ.5లక్షలను ప్రవీణ్‌కు డాక్యా నాయక్ ఇచ్చాడు. అయితే, రాజేశ్వర్ తల్లి గండీడ్(మండలం) మన్సూర్‌పల్లి తండా సర్పంచ్. పేపర్లు అమ్మగా వచ్చిన డబ్బుతో రూ. 8లక్షలు వెచ్చించి ఊరిలో రాజేశ్వర్ అభివృద్ధి పనులు చేశారు. ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరయ్యాక రూ.8లక్షలు తీసుకుందామని రాజేశ్వర్ ప్లాన్ చేసుకున్నాడు. -
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో రేణుకకు ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో రాథోడ్ రేణుకకు ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం రేణుక దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు శనివారం కొట్టివేసింది. మరోవైపు పేపర్ లీక్ కేసులో ఇటీవల అరెస్ట్ అయిన మరో ముగ్గురు నిందితులను సిట్ కస్టడీకి కోరింది. అరెస్టయిన ప్రశాంత్, రాజేష్, తిరుపతయ్యను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ముగ్గురు నిందితుల కస్టడీ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. తీర్పును సోమవారం ప్రకటిస్తామని నాంపల్లి కోర్టు వెల్లడించింది. కాగా, టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల కేసు ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే పేపర్ లీక్ కేసులో ఏ3 నిందితురాలిగా ఉన్న బెయిల్ దాఖలు చేసింది. రేణుకకు ఆరోగ్యం బాగోలేదని, తనకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని వారి బాగోగులు చూసే వారు ఎవరూ లేనందున బెయిల్ ఇవ్వాలని రేణుక తరఫు న్యాయవాది కోర్టును కోరారు. సిట్ విచారణకు ఆమె మొదటి నుంచి సహకరిస్తోందని, ఇక ముందు కూడా సహకరిస్తుందన్న న్యాయవాది పేర్కొన్నారు. అయితే కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదని, చాలా మంది పాత్ర ఇందులో ఉందని సిట్ విచారణలో వెల్లడైందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. ఈ దశలో బెయిల్ ఇస్తే విచారణపై ప్రభావం చూపుతుందని అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు రేణు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. -
భార్యకు తెలియకుండానే మరో ఇద్దరికి పేపర్ లీక్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితురాలైన రేణుక భర్త డాక్యా ఆమెకు తెలియకుండానే మరో ఇద్దరికి ఏఈ ప్రశ్నపత్రాలను విక్రయించినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. వాస్తవానికి ప్రశ్నపత్రాలను మరో నిందితుడు ప్రవీణ్ నుంచి అందుకున్న రేణుక... తన బంధువు ద్వారా నీలేష్ , గోపాల్లతోనే పేపర్ల విక్రయానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ప్రవీణ్‌కు చెప్పి ప్రశ్నపత్రాలు తీసుకునేప్పుడే రూ.5 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చింది. అప్పటికే గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను అడ్డదారిలో రాసిన ‘ప్రవీణ్ అండ్ కో’మెయిన్స్‌ను అదే పంథాలో క్లియర్ చేయాలనే పథకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే లీకేజీ వ్యవహారం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడకూడదనే ఉద్దేశంతో ఎక్కువ మంది అభ్యర్థులకు పేపర్ లీక్ చేయొద్దని ప్రవీణ్ రేణుకకు చెప్పాడు. అందుకే రేణుక తన భర్తతో కలిసి నీలేష్, గోపాల్‌లను ఇంటికే తీసుకెళ్లి చదివించింది. అయితే ఈ పేపర్లను మరో ఇద్దరికి అమ్మి ఎక్కువ మొత్తం సొమ్ము చేసుకోవాలని డాక్యా భావించాడు. ఇందులో భాగంగానే భార్యకు చెప్పకుండా తిరుపతయ్య అనే మధ్యవర్తి ద్వారా ప్రశాంత్‌రెడ్డి, రాజేంద్రకుమార్ అనే మరో ఇద్దరు అభ్యర్థులకు ఏఈ ప్రశ్నపత్రాలు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకొని అడ్వాన్సులు సైతం తీసుకున్నాడు. ఈ విషయాన్ని భార్య పసిగట్టకూడదనే ఉద్దేశంతోనే వారిని ఈ నెల 4న (పరీక్ష ముందురోజు రాత్రి) హైదరాబాద్‌లో తాము బస చేసిన ఓ లాడ్జికి రప్పించి పేపర్లు అందించాడు. ప్రవీణ్ ఇంటి నుంచి నగదు స్వాదీనం... ప్రశ్నపత్రాల విక్రయం ద్వారా రూ. 14 లక్షల వరకు ఆర్జించిన రేణుక అందులో రూ. 10 లక్షలను ప్రవీణ్‌కు ఇచ్చింది. రెండు దఫాలుగా ఈ డబ్బు అందుకున్న ప్రవీణ్ అందులో కొంత మొత్తాన్ని తన బ్యాంకు ఖాతాలో వేసుకున్నాడు. అకౌంట్లో ఉన్న డబ్బును ప్రవీణ్ అరెస్టు సందర్భంలోనే అధికారులు గుర్తించారు. అదనపు కస్టడీలో భాగంగా అతన్ని విచారిస్తున్న సిట్ అధికారులు సోమవారం బడంగ్‌పేటలోని మల్లికార్జునకాలనీలో ఉన్న ఇంట్లో సోదాలు చేశారు. అక్కడ లభించిన రూ. 4 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ప్రశాంత్‌రెడ్డి, రాజేంద్రకుమార్‌లను అరెస్టు చేసిన సిట్ పోలీసులు... సోమవారం తిరుపతయ్యను అరెస్టు చేశారు. ఈ ముగ్గురినీ కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారించాలని నిర్ణయించారు. వారి నుంచి మరెవరికైనా పేపర్ అందిందా అనే కోణంలో ఆరా తీయనున్నారు. గ్రూప్–1 టాపర్లకు సామర్థ్య పరీక్షలు.. గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో 100కుపైగా మార్కులు సాధించిన 121 మంది అభ్యర్థుల్లో ఇప్పటికే 53 మందిని ప్రశ్నించిన సిట్ అధికారులు... అభ్యర్థుల సమర్ధతను పరీక్షించడానికి ఎఫీషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తున్నారు. నిపుణులతో మరో ప్రశ్నపత్రం తయారు చేయించి వాటికి సమాధానాలు రాయించడం ద్వారా అభ్యర్థుల సమర్థతను పరీక్షిస్తున్నారు. మరోవైపు న్యూజిలాండ్ నుంచి వచ్చి గతేడాది గ్రూప్–1 పిలిమ్స్ రాసి 100కుపైగా మార్కులు పొందిన మరో నిందితుడైన రాజశేఖర్ సమీప బంధువు ప్రశాంత్‌కు సిట్ అధికారులు వాట్సాప్ ద్వారా నోటీసులు జారీ చేశారు. హ్యాకింగ్ ద్వారానే... పేపర్ల లీకేజీ కేసులో అదనపు కస్టడీకి తీసుకున్న ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా, రాజేశ్వర్లను రెండో రోజైన సోమవారం తొమ్మిది గంటలపాటు ప్రశ్నించారు. ముఖ్యంగా కమిషన్ సెక్రటరీ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన పి.ప్రవీణ్, మాజీ నెట్వర్క్ అడ్మిన్ ఎ.రాజశేఖర్‌లను లోతుగా విచారించి పేపర్ల లీకేజీ అంశంలో మరో చిక్కుముడిని విప్పారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో కస్టోడియన్‌గా వ్యవహరిస్తున్న శంకరలక్ష్మి కంప్యూటర్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ప్రవీణ్ సిస్టం ద్వారా హ్యాక్ చేసిన రాజశేఖర్ అందులోంచి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను చేజిక్కించుకున్నట్లు తేల్చారు. -
లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన నీలేష్ , గోపాల్, డాక్యా, రాజేందర్లు ఈ నెల 4న రాత్రి హైదరాబాద్‌లోని ఓ లాడ్జిలో బస చేసినప్పుడు వారిని మరో ఇద్దరు అభ్యర్థులు కలిసి ఏఈ ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్లు పక్కా ఆధారాలతో గుర్తించారు. వారిని నవాబ్‌పేట్, షాద్‌నగర్ ప్రాంతాలకు చెందిన ప్రశాంత్‌రెడ్డి, రాజేంద్రకుమార్గా నిర్ధారించారు. డాక్యా, రేణుకల విచారణలోనూ ఇదే విషయం రుజువు కావడంతో ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ అభ్యర్థులిద్దరూ ప్రశ్నపత్రాన్ని రూ.18 లక్షలకు కొనేందుకు డాక్యా, ఇతరులతో ఒప్పందం కుదుర్చుకొని రూ.10 లక్షల వరకు చెల్లించారని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన మహబూబ్‌నగర్‌లోని సల్కర్‌పేటకు చెందిన తిరుపతయ్యతోపాటు మరో ముగ్గురు అనుమానితులను ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న తిరుపతయ్య... ప్రశాంత్, రాజేంద్రకుమార్లతోపాటు పలువురు ఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులకు ఏఈ ప్రశ్నపత్రం విక్రయంలో దళారిగా వ్యవహరించాడని సిట్ ప్రాథమికంగా నిర్ధారించింది. పూర్తి ఆధారాలు లభించాక అతనితోపాటు మరో వ్యక్తిని అరెస్టు చేయాలని భావిస్తోంది. మరోవైపు గతేడాది నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో 100 కంటే ఎక్కువ మార్కులు సాధించిన 121 మంది అభ్యర్థుల విచారణ కొనసాగుతోంది. ఆదివారం మరో 20 మంది అభ్యర్థులను అధికారులు ప్రశ్నించారు. దీంతో పోలీసులు విచారించిన వారి సంఖ్య 50 దాటింది. అడ్డదారి తొక్కి.. అడ్డంగా బుక్కయ్యి.. షాద్‌నగర్ రూరల్: సిట్ అధికారులు తాజాగా అరెస్టు చేసిన ఇద్దరు నిందితుల్లో ఒకడైన రాజేంద్రకుమార్‌ది రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని నేరేళ్ల చెరువు గ్రామం. నిరుపేదలైన లక్ష్మయ్య, లక్ష్మీదేవమ్మ దంపతుల నలుగురు సంతానంలో అతను పెద్ద కొడుకు. రాజేంద్రకుమార్ కొన్నేళ్లు ఉపాధి హామీ పథకంలో పనిచేసి కుటుంబాన్ని పోషించాడు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం కోసం అప్పులు చేసి హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నాడు. అయితే కచ్చి తంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు అడ్డదారిని ఎంచుకున్నాడు. తన కుటుంబ సభ్యుల వద్ద ఉన్న బంగారాన్ని అమ్మడంతోపాటు ఇతరుల వద్ద అప్పు చేసి రూ.5 లక్షలకు డాక్యా నాయక్ ద్వారా ఏఈఈ ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ బండారాన్ని సిట్ నిగ్గుతేల్చడంతో అడ్డంగా బుక్కయ్యాడు. 8 గంటలపాటు నిందితుల విచారణ టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో కోర్టు అదనపు కస్టడీకి అనుమతించడంతో నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా, రాజేశ్వర్లను పోలీసులు ఆదివారం చంచల్‌గూడ జైలు నుంచి సిట్ కార్యాలయానికి తరలించారు. దాదాపు ఎనిమిది గంటలపాటు వారిని ప్రశ్నించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో సిట్ కార్యాలయం నుంచి సీసీఎస్‌కు తరలించారు. సోమ, మంగళవారాల్లోనూ వారిని విచారించనున్నారు. -
‘టీఎస్పీఎస్సీ కేసు’లో సాక్షిగా శంకరలక్ష్మి
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ కేసులో కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కస్టోడియన్ బి.శంకరలక్ష్మి కీలక సాక్షిగా మారారు. తొలుత అరెస్టు చేసిన తొమ్మిది మందిలో ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, డాక్యాల అదనపు కస్టడీతోపాటు తాజాగా అరెస్టు చేసిన షమీమ్, సురేశ్,రమేశ్‌లను తమ కస్టడీకి అప్పగించాలంటూ సిట్ అధికారులు శుక్రవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పులిదిండి ప్రవీణ్ కుమార్, రాజశేఖర్‌రెడ్డి ఐదు పరీక్షలకు సంబంధించిన 11 ప్రశ్నపత్రాలను కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కస్టోడియన్ అయిన శంకరలక్ష్మి కంప్యూటర్ నుంచే తస్కరించారు. ఈ వ్యవహరంలో ఆమె నిర్లక్ష్యం ఉందని అధికారులు ఇప్పటికే తేల్చడంతో చర్యలు కూడా తీసుకుంటారని ప్రచారం జరిగింది. అయితే ఆమెను ఈ కేసులో రెండో సాక్షిగా పరిగణిస్తున్నట్లు కోర్టు దృష్టికి సిట్ తీసుకువెళ్లింది. నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరుస్తూ దాఖలు చేసిన రిమాండ్ కేస్ డైరీలో ఈ విషయాలు పొందుపరిచింది. ఈ కేసులో వివరాలు సేకరించి దర్యాప్తు పూర్తి చేయడంతోపాటు అభియోగపత్రాలు దాఖలు చేయడానికి నిందితుల కస్టడీ అవసరమని పేర్కొంది. రాజశేఖర్ బంధువుకు నోటీసులు! న్యూజిలాండ్‌లో నివసిస్తూ గతేడాది గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష రాసేందుకు హైదరాబాద్ వచ్చి వెళ్లిన కమిషన్ నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్‌రెడ్డి సమీప బంధువు ప్రశాంత్‌ను ప్రశ్నించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం అతనికి వాట్సాప్ ద్వారా నోటీసులు పంపిస్తున్నారు. అత డు విచారణకు రాకుంటే లుక్ఔట్ సర్క్యులర్ జారీ చేయనున్నారు. గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష లీకేజీ కేసులో 100 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన 121 మందిలో శుక్రవారం నాటికి 40 మంది విచారణ పూర్తయింది. ఏఈ పరీక్ష ప్రశ్న పత్రం విషయంలోనే క్రయవిక్రయాలు జరిగాయని, గ్రూప్– 1లో ఇలాంటివి జరిగినట్లు ఇప్పటివరకు తమ దృష్టికి రాలేదని సిట్ అధికారులు చెబుతున్నారు. బండి సంజయ్ గైర్హాజరు... పరీక్ష పత్రాల లీకేజీ కేసుల్లో ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అందుకుతగ్గ ఆధారాలను శుక్రవారం తమ కార్యాలయానికి వచ్చి సమర్పించాలంటూ సిట్ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ బండి సంజయ్ హాజరుకాలేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి సైతం సిట్ నోటీసులు ఇవ్వగా ఆయన గురువారం సిట్ కార్యాలయానికి హాజరైన సంగతి తెలిసిందే. -
దావత్లో గొడవ.. వెలుగులోకి లీక్!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: టీఎస్పీఎస్సీ ఈ నెల ఐదో తేదీన నిర్వహించిన అసిస్టెంట్ ఇంజినీర్స్ పరీక్ష పేపర్ల లీకేజీకి సంబంధించి ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. పరీక్ష అనంతరం ఈ కేసులో నిందితులతో పాటు మరికొందరు వనపర్తిలో దావత్ చేసుకున్నారని, ఆ సమయంలో ‘లీకేజీ డబ్బులు’విషయమై గొడవ జరిగిందని, ఆ గొడవతోనే పేపర్ లీక్ విషయం బయటపడిందని తెలిసింది. ఈ బాగోతంలో తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఇందులో ఆరుగురు పాలమూరుకు చెందినవారేనన్న సంగతి తెలిసిందే. పంచాంగల్లో ప్రిపరేషన్..వనపర్తిలో దావత్ ఏ–1 నిందితుడు ప్రవీణ్ నుంచి పేపర్ తీసుకున్న తర్వాత.. పరీక్షకు ఒకట్రెండు రోజుల ముందు రేణు క, డాక్యా దంపతులు గండేడ్ మండలం పంచాంగల్ తండాలోని ఇంటికి వచ్చారు. వీరితో పాటు ఆమె పెద్ద నాన్న కొడుకు శ్రీనివాస్ (మేడ్చల్ కానిస్టేబుల్), ఈయన స్నేహితులు కేతావత్ నీలేశ్ నాయక్, అతడి తమ్ముడు రాజేంద్ర నాయక్, వికారాబాద్ జిల్లా దుగ్యాల మండలం లగచర్ల తండాకు చెందిన పత్లావత్ గోపాల్ నాయక్ కూడా వచ్చినట్లు సమాచారం. రేణుక తమ్ముడు రాజేశ్వర్ కూడా వీరితో జత కాగా.. వారిని అక్కడే చదివించి 5న సరూర్‌నగర్‌లోని పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు. పరీక్ష రాసిన తర్వాత రేణుక కారులో రాజేశ్వర్, శ్రీనివాస్, నీలేశ్, రాజేంద్ర నాయక్ వనపర్తి ఇంటికి వచ్చారని, అంతా కలిసి దావత్ చేసుకున్నారని సమాచారం. ఆ సమయంలో డాక్యా, గోపాల్‌నాయక్ వారితో ఉన్నారా? లేరా? అనేది తెలియలేదు. పేరులో తప్పు సరిచేసుకునేందుకు వెళ్లి.. రేణుకకు హిందీ పండిట్ ఉద్యోగం వచ్చిన తర్వాత రికార్డుల్లో ఆమె పేరులో తప్పుదొర్లింది. దీన్ని సరిచేసుకునేందుకు వెళ్లిన క్రమంలో ప్రవీణ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారు తరచుగా కలిసేవారని.. రేణుక టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లేదని తెలిసింది. ఈ క్రమంలోనే కవిత, ఆమె భర్త డాక్యా, ప్రవీణ్‌తో కలిసి పేపర్ లీకేజీ స్కెచ్ వేశారు. రేణుక సొంతూరు గండేడ్ మండలంలోని మన్సూర్‌పల్లి కాగా అత్తగారిల్లు ఇదే మండలంలోని పంచాంగల్ తండా. ఇలావుండగా వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు బుధవారం ఈ రెండు తండాల్లో పర్యటించి వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఘర్షణ, బెదిరింపుతో.. దావత్ క్రమంలో రేణుక డబ్బుల విషయం లేవనెత్తినట్లు సమాచారం. ఒక్కొక్కరు రూ.10 లక్షల చొప్పున ఇచ్చేందుకు ఒప్పందం కుదరగా.. రూ.5 లక్షలు చొప్పున ఇచ్చి మిగతా డబ్బు తర్వాత ఇస్తామని రేణుకకు చెప్పారు. అయితే ఆమె ఇప్పుడే పూర్తిగా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే నీలేశ్‌నాయక్, రేణుక మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగినట్లు సమాచారం. నీలేశ్‌ను రేణుక బెదిరించడంతో ఆయన బయటకు వచ్చి డయల్ 100కు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆ ఇంటికి వచ్చి అందరినీ తీసుకెళ్లారు. వారు విచారించడంతో లీకేజీ డొంక కదిలినట్లు తెలుస్తోంది. -
TSPSC: పాలమూరులో ప్రకంపనలు.. 9 మందిలో ఆరుగురు ఇక్కడివాళ్లే
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/గండేడ్: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపన లు సృష్టిస్తోంది. తొమ్మిది మంది నిందితుల్లో ఆరుగురు ఉమ్మడి పాలమూరుకు చెందిన వారే ఉండ డం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారం మ హబూబ్‌నగర్‌తో పాటు గండేడ్ మండలంలోని మ న్సూర్‌పల్లి, పంచాంగల్ తండాలు, వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం చుట్టూ తిరుగుతోంది. ఈ బాగోతంలో వీరితో పాటు ఇంకెవరైనా ఉన్నారా?..అనే కోణంలో పోలీసులు జల్లెడ పడుతున్నారు. రేణుక, డాక్యా ఇక్కడి వారే.. పేపర్ల లీకేజీకి పాల్పడింది కమిషన్ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న ప్రవీణ్ కాగా..నిందితుల జాబితాలో రేణుక, లవుడ్యావత్ డాక్యా దంపతులు ఉన్నారు. రేణుకది మన్సూర్‌పల్లి తండా కాగా.. డాక్యాది అదే మండలంలోని పంచాంగల్ తండా. డాక్యా బీటెక్ పూర్తయిన తర్వాత 15 ఏళ్లుగా టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలో నాలుగేళ్ల పాటు టీఏగా విధులు నిర్వర్తించాడు. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో పనిచేస్తున్నాడు. రేణుకకు 2018లో వనపర్తి గురుకుల పాఠశాలలో హిందీ పండిట్ ఉద్యోగం రావడంతో మూడేళ్ల క్రితం మహబూబ్‌నగర్‌కు మకాం మార్చాడు. ప్రస్తుతం రేణుక బుద్దా రం గురుకుల పాఠశాలలో పనిచేస్తోంది. అంతా బంధువులు, సన్నిహితులే: ప్రవీణ్ ద్వారా పేపర్లు సంపాదించిన రేణుక మొదట తన తమ్ముడు రాజేశ్వర్‌కు సమాచారమిచ్చింది. ఇతను మహబూబ్‌నగర్‌లోనే ఉంటున్నాడు. రాజేశ్వర్ తన పెద్దనాయన చంద్రానాయక్ కొడుకు శ్రీనివాస్ (బీటెక్)కు సమాచారం ఇచ్చాడు. అతడికి 2020లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం మేడ్చల్‌లో పనిచేస్తున్నాడు. ఎస్సై ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాడు. దీంతో తనకు ప్రశ్నపత్రం వద్దని.. తనకు సన్నిహితులైన మన్సూర్‌పల్లి తండా కు చెందిన కేతావత్ నీలేశ్ నాయక్, అతడి తమ్ముడు రాజేంద్రనాయక్, వికారాబాద్ జిల్లా దుగ్యాల మండలం లగచర్ల తండాకు చెందిన పత్లావత్ గోపాల్‌నాయక్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రేణుక, డాక్యా దంపతులు ఒప్పందం కుదుర్చుకున్న వారిని వెంటబెట్టుకుని పంచాంగల్ తండాలోని ఇంటికి వచ్చినట్లు సమాచారం. అక్కడే వారితో రెండు రోజుల పాటు చదివించి.. పరీక్ష రోజు సరూర్‌నగర్‌లోని పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు. ఈ పరీక్షను రేణుక తమ్ముడు రాజేశ్వర్ కూడా రాశాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
TSPSC: మెయిన్ సర్వర్ నుంచే పేపర్ కొట్టేశాడు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలకాంశాలు వెలుగు చూశాయి. రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలను ప్రస్తావించారు పోలీసులు. ప్రధాన నిందితుడు ప్రవీణ్ తన నేరాన్ని అంగీకరించినట్లు అందులో పేర్కొంటూనే.. ఈ మొత్తం తతంగం ఎలా జరిగిందనేది అందులో వివరించారు. మెయిన్ సర్వర్ నుంచే ప్రశ్నాపత్రాన్ని కొట్టేశాడు టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కుమార్. లూప్ ఉన్న కంప్యూటర్ల ద్వారా ఆ పేపర్‌ను సేకరించాడు. సేకరించిన పేపర్‌ను ప్రింట్ తీసుకుని తనతో సన్నిహితంగా ఉంటున్న రేణుకకు షేర్ చేశాడు ప్రవీణ్. ఆపై.. పేపర్ అమ్మేందుకు రేణుకు ఫ్యామిలీ చాలా ప్రయత్నాలే చేసింది. రేణుక తన కమ్యూనిటీలోని పలువురికి తన దగ్గర పేపర్ ఉందని సమాచారం ఇచ్చింది. ఈ ప్రచారంలో రేణుక భర్త, సోదరుడు ముఖ్యపాత్ర పోషించారు. ఒక్కో పేపర్‌కి రూ.20 లక్షలు డిమాండ్ చేసింది రేణుక. అయినప్పటికీ పేపర్ కొనుగోలుకు ఇద్దరు అభ్యర్థులు ముందుకు వచ్చారు. వాళ్లను తన ఇంట్లోనే ఉంచి ప్రిపేర్ చేసింది. పరీక్ష రోజున వనపర్తి నుంచి అభ్యర్థులను తీసుకొచ్చి.. సరూర్‌నగర్‌లోని సెంటర్ వద్ద స్వయంగా దింపేసి వెళ్లిపోయిందని పోలీసులు పేర్కొన్నారు. ఇక ప్రవీణ్ ఫోన్లో చాలామంది మహిళల కాంటాక్ట్స్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. వాళ్లతో సంబంధాలు నడిపినట్లు నిర్ధారించుకున్నారు కూడా. అయితే ఇది హనీ ట్రాపా? లేదంటే పక్కా ప్రణాళికగా జరుగుతున్న స్కామా? అనేది మాత్రం ఇంకా నిర్ధారించాల్సి ఉంది. ఇదీ చదవండి: ప్రవీణ్ ఫోన్లో మహిళల అసభ్య ఫొటోలు నిందితులకు 14 రోజుల రిమాండ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలోని నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఈ లీకేజ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మంది నిందితులను నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరు పరచగా, వారికి రెండు వారాల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పు నిచ్చింది. ఈ క్రమంలోనే నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి కావడంతో నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. కస్టడీ కోరిన పోలీసులు పేపర్ లీకేజీ కేసు నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు హైదరాబాద్ బేగంబజార్ పోలీసులు. ఈ కేసులో అరెస్ట్ అయిన తొమ్మిది మందిని.. పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. -
ఏఈ పేపర్ లీక్.. స్కామ్‌లో తొమ్మిది మంది అరెస్టు.. నిందితుల్లో కానిస్టేబుల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఈ నెల 5న నిర్వహించిన అసిస్టెంట్ ఇంజనీర్స్ (ఏఈ సివిల్) పరీక్ష పేపర్లు లీకైనట్టు పోలీసులు తేల్చారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడైన పి.ప్రవీణ్‌కుమార్ ఈ ప్రశ్నపత్రాలనే టీచర్ రేణుక, ఆమె భర్త లవుడ్యావత్ డాక్యాకు అందించాడని గుర్తించారు. వీటితోపాటు ప్రవీణ్‌కు చెందిన పెన్‌డ్రైవ్‌లో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్ కూడా ఉందని, దాన్ని విక్రయించేందుకు అతను ఒప్పందం చేసుకున్నాడని ఆధారాలు సేకరించారు. హైదరాబాద్ సౌత్‌వెస్ట్ జోన్ డీసీపీ కిరణ్ సోమవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుతో కలసి లీకేజీ వ్యవహారం వివరాలను వెల్లడించారు. కారుణ్య నియామకం కింద వచ్చి.. ఏపీలోని రాజమండ్రికి చెందిన పి.హరిశ్చంద్రరావు కుమారుడు ప్రవీణ్‌కుమార్. హరిశ్చంద్రరావు ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీ కార్యాలయం ప్రెస్‌కు అదనపు ఎస్పీగా పనిచేశారు. ఆయన ఉద్యోగంలో ఉండగానే అనారోగ్యంతో మరణించడంతో కారుణ్య నియామకం కింద ప్రవీణ్‌కుమార్‌కు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. బీటెక్ పూర్తిచేసిన ప్రవీణ్ 2017 నుంచి టీఎస్పీఎస్సీలో పనిచేస్తూ ప్రస్తుతం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ హోదాలో కమిషన్ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇక మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రేణుక 2018లో టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్ష ద్వారా గురుకుల హిందీ టీచర్‌గా ఎంపికై.. ప్రస్తుతం వనపర్తిలో విధులు నిర్వర్తిస్తోంది. ఆమె భర్త లవుడ్యావత్ డాక్యా వికారాబాద్‌లోని డీఆర్డీఏలో పనిచేస్తున్నాడు. టీఎస్పీఎస్సీ పరీక్షకు సిద్ధమైన నాటి నుంచీ రేణుక, ప్రవీణ్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమె తరచూ కమిషన్ కార్యాలయానికి వచ్చి ప్రవీణ్‌ను కలిసేది. ల్యాన్ ద్వారా యాక్సెస్ చేసి.. టీఎస్పీఎస్సీ ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్ చేసేందుకు రేణుక, లవుడ్యావత్ డాక్యా పథకం వేశారు. పేపర్లను తమకు ఇవ్వాలని ప్రవీణ్‌ను రేణుక కోరింది. టీఎస్‌టీఎస్‌లో ఔట్ సోర్సింగ్ విధానంలో నెట్వర్క్ అడ్మిన్‌గా పనిచేస్తున్న అట్ల రాజశేఖర్‌తో ప్రవీణ్ కలిసి పేపర్ లీకేజ్‌కి మార్గాలు అన్వేషించాడు. పరీక్ష పేపర్లన్నీ కమిషన్ కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లోని కంప్యూటర్లో ఉంటాయి. ఈ సెక్షన్‌కు నేతృత్వం వహించే కస్టోడియన్ శంకరలక్ష్మి తన కంప్యూటర్ పాస్వర్డ్, యూజర్ ఐడీలను నిత్యం వినియోగించే పుస్తకం చివరి పేజీలో రాసి పెట్టుకున్నారు. ఈ విషయం తెలిసిన ప్రవీణ్ ఆమె కార్యదర్శి పేషీకి వచ్చినప్పుడు.. ఆమె పుస్తకం నుంచి తస్కరించాడు. ప్రవీణ్ కంప్యూటర్ నుంచే శంకరలక్ష్మి కంప్యూటర్ను యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో యాక్సెస్ చేశాడు. ఇద్దరూ కలిసి ఆ కంప్యూటర్లో నుంచి ఏఈ పరీక్షకు సంబంధించిన జనరల్ స్టడీస్, సివిల్ పేపర్లను, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్‌ను కాపీ చేసుకున్నారు. ప్రవీణ్ వీటిని తన పెన్‌డ్రైవ్‌లో వేసుకున్నాడు. ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలను ప్రింట్ ఔట్ తీసుకున్నాడు. ఇంట్లోనే చదివించి, దగ్గరుండి పరీక్ష రాయించి.. మరోవైపు టీచర్ రేణుక, లవుడ్యావత్ డాక్యా ఏఈ పరీక్ష పేపర్లు విక్రయించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రేణుక సోదరుడు, మాన్సూర్‌పల్లి తండా సర్పంచ్ కుమారుడైన కేతావత్ రాజేశ్వర్‌నాయక్‌ను.. అతడి ద్వారా మేడ్చల్ ఠాణాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కేతావత్ శ్రీనివాస్ (రాజేశ్వర్ సోదరుడు)ను సంప్రదించి ఏఈ పేపర్ విషయం చెప్పారు. ఎస్సై పరీక్షకు సిద్ధమవుతున్న శ్రీనివాస్.. తనకు ఏఈ పేపర్ వద్దని చెప్పి, పరిచయస్తులైన కేతావత్ నీలేశ్‌నాయక్, పత్లావత్ గోపాల్‌నాయక్‌ల పేర్లు చెప్పాడు. దీనితో వారిని సంప్రదించిన రేణుక, డాక్యా రూ.13.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్ తీసుకున్నారు. ఏఈ పేపర్లు ప్రింట్ తీసుకున్న ప్రవీణ్.. ఈ నెల 2న రేణుక, డాక్యాలకు ఫోన్ చేసి చెప్పాడు. అప్పుడు మహబూబ్‌నగర్‌లో ఉన్న వారిద్దరూ వెంటనే బాలాపూర్ వరకు వచ్చి ప్రవీణ్‌ను కలిశారు. ఏఈ పరీక్ష పేపర్లు తీసుకుని రూ.5 లక్షలు ఇచ్చారు. నీలేశ్, గోపాల్‌తోపాటు నీలేశ్ సోదరుడు రాజేంద్రనాయక్‌లను గండీడ్ మండలం పంచగల్ తండాలోని తమ ఇంటికి తీసుకువెళ్లారు. 5న ఉదయం డాక్యా అభ్యర్థులను వెంటపెట్టుకుని సరూర్‌నగర్‌లోని పరీక్ష కేంద్రం వరకు వచ్చి.. పరీక్ష రాయించాక విడిచిపెట్టాడు. టీఎస్పీఎస్సీ ఉద్యోగులు ఇద్దరిపై వేటు అసిస్టెంట్ ఇంజనీర్ పేపర్ల లీక్ వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగులపై టీఎస్పీఎస్సీ వేటు వేసింది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్‌ను సస్పెండ్ చేయడంతోపాటు శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఔట్సోర్సింగ్ విధానంలో కంప్యూటర్ నెట్వర్క్ ఎక్స్‌పర్ట్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌రెడ్డిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించింది. ఇక ఈ వ్యవహారంలో భాగస్వాములైన గురుకుల టీచర్ రేణుక, పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగి, పోలీస్ కానిస్టేబుల్ ముగ్గురూ ప్రభుత్వ ఉద్యోగులే కావడంతో.. వారిపైనా చర్యలు తీసుకునేందుకు సంబంధిత శాఖలు సిద్ధమయ్యాయి. మరికొన్ని పేపర్ల లీకేజీపై అనుమానాలు 6న తేదీన మళ్లీ ప్రవీణ్‌ను కలిసిన రేణుక, ఆమె భర్త ప్రశ్నపత్రాల కాపీలతోపాటు మరో రూ.5 లక్షలు ఇచ్చారు. పేపర్ల లీకేజీపై అనుమానం వచ్చిన టీఎస్పీఎస్సీ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రఘునాథ్ నేతృత్వంలోని బృందం.. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, లవుడ్యావత్ డాక్యా, రాజేశ్వర్, నీలేశ్, గోపాల్, శ్రీనివాస్, రాజేందర్‌లను అరెస్టు చేసింది. వారి నుంచి పెన్‌డ్రైవ్‌లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌ను పరిశీలించిన పోలీసులు.. అందులో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్ ఉందని, దాన్ని విక్రయించడానికి ప్రయత్నించాడని గుర్తించారు. ప్రవీణ్ కంప్యూటర్ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఆ నివేదిక అందిన తర్వాత.. అతను, రాజశేఖర్ ఎవరెవరి కంప్యూటర్లను యాక్సస్ చేశారు? ఏమేం పేపర్లు డౌన్లోడ్ చేశారనేది తేలుతుందని డీసీపీ వెల్లడించారు. -
నిశ్శబ్దాన్ని ఛేదించి ఎందరికో ‘చేయూత’
హెచ్ఐవీ.. దశాబ్దం క్రితం వరకు దీనిపై నలుగురిలో మాట్లాడాలంటేనే వణుకు. ఆత్మహత్య ఒక్కటే శరణ్యమనుకునే వారు. కానీ.. మందులకు లొంగని ఈ వ్యాధి సోకినంత మాత్రాన జీవితం అక్కడితో ఆగిపోదని కోటగిరి రేణుక రుజువు చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామానికి చెందిన రేణుక భర్త కోటగిరి శ్రీనివాసరావుకు 1999లో హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలింది. రేణుకకు కూడా ఈ వ్యాధి సోకినట్టు వైద్యులు గుర్తించారు. 2003లో శ్రీనివాసరావు మృతి చెందారు. భర్త మరణానంతరం రేణుక విజయవాడకు మారారు. హెచ్ఐవీ బాధితుల పట్ల ఉన్న చిన్నచూపు వల్ల తనలా ఇంకెంత మంది మహిళలు వేదనకు గురవుతున్నారోననే భావన రేణుకను కలచివేసింది. హైదరాబాద్‌కు వెళ్లి హెచ్ఐవీ బాధితుల ‘కేర్ అండ్ సపోర్టింగ్’లో శిక్షణ పొందారు. అనంతరం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నడుం కట్టారు. ఇందులో భాగంగా 2003లోనే ‘తెలుగు నెట్వర్క్ ఆఫ్ పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవీ అండ్ ఎయిడ్స్’ పేరిట స్వచ్ఛంద సంస్థను నెలకొల్పడంలో భాగస్వామి అయ్యారు. మరోవైపు అప్పట్లోనే చేయూత అనే సంస్థను సైతం నెలకొల్పి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని హెచ్ఐవీ బాధితులకు వివిధ రకాలుగా అండగా నిలిచారు. బాధిత కుటుంబాల్లోని పిల్లల చదువులకు సాయం, పౌష్టికాహారం అందిస్తున్నారు. ఇప్పటివరకు 200 మంది పిల్లల చదువులకు చేయూత ఎన్జీవో ద్వారా సాయం అందించారు. ప్రస్తుతం 400 మంది పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ఆమె సహకారంతో బీఎస్సీ నర్సింగ్, ఫార్మసీ, ఇంజనీరింగ్ చదివిన వారు ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నారు. చెప్పుకోవడానికి భయపడను నేను హెచ్ఐవీ పాజిటివ్ అని చెప్పుకోవడానికి భయపడను. అలా చెప్పుకోవడానికి ఇబ్బంది పడి.. నాలుగు గోడల మధ్య కుంగిపోకుండా బాధితులకు సాయం చేయడమే నా లక్ష్యం. తమ ప్రమేయం లేకున్నా.. ఏ తప్పు చేయకున్నా చాలామంది ఈ వ్యాధి బారినపడుతుంటారు. వ్యాధి సోకినంత మాత్రాన కుంగిపోవద్దు. ఇప్పుడు మన రాష్ట్రంలోనే ప్రభుత్వ రంగంలో మంచి వైద్యం అందుతోంది. ఎవరో.. ఏదో అనుకుంటారని బాధితులు ఆస్పత్రులకు వెళ్లడం మానేయొద్దు. – కోటగిరి రేణుక, చైర్మన్, చేయూత స్వచ్ఛంద సంస్థ -
Mandya MP Sumalatha: ఎంపీ సోదరికి వంచన
సాక్షి, బెంగళూరు: మండ్య ఎంపీ సుమలతా సోదరి రేణుక.. తనను హెచ్డీఎఫ్సీ బ్యాంకు మేనేజర్ విశాలాక్షీ భట్ డబ్బు మోసగించారని కోణణకుంటె పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. ఎక్కువ లాభాలు వస్తాయని రూ.60 లక్షలు పెట్టుబడి పెట్టించిన విశాలక్ష్మీ భట్ మోసం చేసిందని ఫిర్యాదులో ఆరోపించారు. పైగా తన ఇంటికే వచ్చి ఖాళీ పేపర్లపై సంతకం చేయాలని బెదిరించిందని తెలిపారు. ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. చదవండి: (14 ఏళ్ల మేనల్లుడితో శారీరక వాంఛలు.. వీడియో రికార్డ్ చేసి..) -
జీవితాంతం తోడుంటానన్నాడు.. మరో మహిళతో సంబంధం పెట్టుకుని
సాక్షి, గుణదల (విజయవాడ తూర్పు): జీవితాంతం తోడుంటానని పెళ్లాడిన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను విస్మరించాడన్న మనస్తాపంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. మాచ వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగల్రాజపురం ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మాచవరం సీఐ ప్రభాకర్ కథనం మేరకు.. గుంటూరు జిల్లా, యర్రబాలెం ప్రాంతానికి చెందిన భువనగిరి నాగవెంకట అంజన్‌కృష్ణ (30)కు అదే ప్రాంతానికి చెందిన రేణుక శ్రీదేవి (19)తో గత యేడాది నవంబర్‌లో పెద్దల సమక్షంలో వివాహమైంది. కొన్ని నెలల క్రితం అంజన్‌కృష్ణ, రేణుకశ్రీదేవి విజయవాడ మొగల్రాజపురం అమ్మకల్యాణ మండపం సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. అదే ప్రాంతంలో సెల్‌ఫోన్ షాపు నిర్వహిస్తున్న అంజన్‌కృష్ణ భార్యను పట్టించుకోకుండా వేరే మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. అంజన్‌కృష్ణ మద్యానికి బానిసై భార్యను మానసికంగా, శారీరకంగా హింసించడం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో కొన్ని సార్లు పెద్దల మధ్య పంచాయితీలు జరిగాయి. ఇక పై తన భార్యను ఇబ్బందులకు గురిచేయనని పంచాయితీలో అంజన్ కృష్ణ మాటచ్చాడు. కొద్ది రోజులకే వివాహేతర సంబంధం నెరపుతూ, మద్యంతాగడం మొదలు పెట్టాడు. దీంతో దంపతుల మధ్య గొడవలు మరింతగా పెరిగాయి. చదవండి: (సీఐ గారి రైస్‌మిల్ కథ!.. సుప్రియ పేరుతో) ఆదివారం రాత్రి భార్యతో గొడవ పడిన అంజన్ కృష్ణ సోమవారం ఉదయం సెల్‌ఫోన్‌షాపు వద్దకు బయలుదేరగా, భారీ వర్షం, బంద్ కారణంగా బయటకు వెళ్లొద్దని రేణుక అతడిని వేడుకుంది. అయినా అంజన్ కృష్ణ గొడవ పడి వెళిపోయాడు. దీంతో తన భర్త చేయిదాటిపోయాడని, తన జీవితం నాశనమైపోయిందన్న మనస్తాపంతో రేణుక చున్నీతో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి వచ్చిన అంజన్‌కృష్ణకు తన భార్య ఉరికి వేళాడుతూ కన్పించింది. ఈ సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (సైబర్ కేఫ్‌లో ఇద్దరు బాలికలపై గ్యాంగ్ రేప్) -
ఇప్పుడే పెళ్లి వద్దు.. నిందలు భరించలేను..
సాక్షి, వికారాబాద్: ‘నాకు ఇప్పుడే పెళ్లి వద్దు.. నేను చదువుకుంటా.. నా మాట వినకుండా మీరు సంబంధాలు చూస్తున్నారు. లేనిపోని నిందలు వేస్తున్నారు’ అంటూ తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని సూసైడ్‌నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. జనగాం గ్రామానికి చెందిన సంపంగి వెంకటమ్మ, నర్సింహులు దంపతులకు ముగ్గురు సంతానం. అందులో ఇద్దరు మృతి చెందారు. నాలుగేళ్ల క్రితం తల్లి వెంకటమ్మ కూడా మృతి చెందింది. దీంతో కూతురు రేణుక (14) పెద్దేముల్ మండలం మంబాపూర్లో ఉన్న అమ్మమ్మ అనంతమ్మ వద్ద ఉంటోంది. అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం టీచర్లు పాఠ్య పుస్తకాలను కూడా అందజేశారు. అయితే రేణుకకు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు కొంత కాలంగా సంబంధాలు చూస్తున్నారు. బాలిక వద్దని వారించినా వారు సంబంధాలు చూస్తుండటం.. లేనిపోని నిందలు వేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో సూసైడ్‌నోట్ రాసి ఇంటి దూలానికి ఉరేసుకుంది. ‘అమ్మమ్మా.. నన్ను క్షమించూ.. నిందలు భరించలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: (ప్రేమపెళ్లి: బాలికను వివాహమాడిన మరో బాలిక) -
ఆ పాత్రలు మగవాళ్లు, రొమాన్స్ గురించి మాట్లాడవు
ఈ కొత్త ఏడాది రేణుకకు ఉల్లాసంగా మొదలైంది.‘‘ఓటీటీలో మనం ఎలాంటి కథనైనా చెప్పొచ్చు. ఎంత సున్నితంగానైనా. ‘పుషింగ్ ద ఎన్వలప్’ అది. పరిమితుల్ని దాటుకుని కొంచెం దుడుకుతనాన్ని చూపించవచ్చు. ఆ ఛాన్స్ ఉంటుంది అందులో..’’ అంటారు రేణుక. త్రిభంగను దృష్టిలో పెట్టుకునే ఆమె ఆ మాట అన్నారు. తల్లి, ఆమె కూతురు, ఆమె కూతురు.. మూడు తరాల స్త్రీల మధ్య కథను కాస్త ‘తీవ్రంగా’ నడిపించారు రేణుక. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘‘భారతీయ మహిళల జీవితాలు ప్రత్యేకమైనవి. వాటిని మనం కథలుగా ప్రపంచంతో పంచుకోవలసిన అవసరం ఉంది. నా పాత్రలు బాగా చదువుకున్నవి కావచ్చు. పాశ్చాత్య పోకడలతో ఉండొచ్చు. కానీ అవి భారతీయత వేర్లను తెంపుకుని వెళ్లేలా ప్రవర్తించవు. ఆ గుణాన్నే నేను స్క్రీన్ మీద సెలబ్రేట్ చెయ్యాలని అనుకుంటున్నాను’’ అంటున్నారు రేణుకు. త్రిభంగ తర్వాత తను తీసే సినిమా కూడా ముగ్గురు మహిళల కథేనట. మహిళల సమస్యల్ని మాత్రమే మహిళా దర్శకులు తియ్యగలరు అని చిత్ర పరిశ్రమలో ఒక అభిప్రాయం ఉంది. అంటే, వాళ్లకు వేరే జీవనాంశాలేమీ పరిచయం ఉండవు కనుక తమకు తెలిసిన వాటిని మాత్రమే చూపించగలరని. అది సరికాదంటారు రేణుక. ‘‘మహిళల సమస్యల్ని సినిమా తియ్యడం అంటే స్త్రీని ఒక భార్యగానో, చెల్లిగానో, కూతురిగానో చూపించడం మాత్రమే అవుతుంది. చాలామంది మగ దర్శకులు చేస్తున్నది కూడా అదే. మహిళా సమస్యల్నే తీసుకున్నా ఆ సమస్యల్ని చర్చిస్తున్న విధానాన్ని మనం చూడాలి. నా పాత్రలు అన్ని విషయాలను ధైర్యంగా మాట్లాడాలని నేను కోరుకుంటాను. రేణుకా సహానీ దర్శకత్వం వహించిన ‘త్రిభంగ’ చిత్రంలో మూడు తరాల మహిళలు : మిథిలా పాల్కర్, కాజోల్, తన్వీ అజ్మీ పురుషాహంకారం, భర్త, పెళ్లి.. వీటి జోలికి ఆ పాత్రలు వెళ్లడం నాకు ఇష్టం ఉండదు’’ అంటారు రేణుక. ఈ మాటల్ని బట్టి రేణుక సరికొత్త సున్నితమైన కథాంశంతో ఒక మహిళా చిత్రాన్ని తీయబోతున్నట్లే ఉంది. ఇప్పుడైతే ఆమె 1980ల నాటి జీవితంపై ఒక పుస్తకాన్ని రాసేందుకు కూర్చున్నారు. మరో రెండు స్క్రిప్టులూ ఆమె చేతుల మీదుగా తయారవుతున్నాయి. ఒకటి పూర్తయింది. ఇంకోటి పూర్తి కావస్తోంది. ఆమెకింత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? రేణుక తండ్రి అరుణ్ ఖోప్కర్ స్క్రిప్టు రైటర్. తల్లి శాంతా గోఖలే రచయిత్రి, అనువాదకురాలు, జర్నలిస్టు, రంగస్థల విమర్శకురాలు. ఇవన్నీ రేణుకపై పని చేసి ఉండొచ్చు. రేణుక దర్శకత్వం వహించిన మొదటి సినిమాగా ‘త్రిభంగ’ పేరు పొందినప్పటికీ 2009 లోనే ‘రీటా’ అనే మరాఠీ మూవీతో దర్శకత్వంలోకి ప్రవేశించారామె. రేణుక అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ ఉన్నా.. ఇకముందు తనే సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నారు. తీయడం అంటే దర్శకత్వం. కథ తను రాసిందే, స్క్రిప్టూ తను అల్లిందే. మహిళలే ఆమె ప్రధాన కథాంశం. అయితే ఆ పాత్రలేవీ మగవాళ్ల గురించి, రొమాన్స్ గురించీ మాట్లాడవని కూడా డైరెక్టర్‌గా తన తొలి సినిమా ‘త్రిభంగ’ సక్సెస్ మీట్లో చెప్పేశారు సహానీ. ఇప్పటికే ఆమె మరొక సినిమా కథ రాసే పనిలో పడిపోయారు. రెండు సినిమా స్క్రిప్టులను కూడా అల్లుకుంటున్నారు. బహుశా అవి కూడా ఆడవాళ్ల ప్రపంచం చుట్టూ తిరిగేవే కావచ్చు. -
అంగన్వాడీ ఆయా ఆత్మహత్య
ఖమ్మంరూరల్: ఉరివేసుకుని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన మండల పరిధిలోని నాయుడుపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేటలోని తాళ్ళగడ్డకు చెందిన రేణుక(35)కు, నాయుడుపేటకు చెందిన పోలేబోయిన నాగేశ్వరరావుతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లులు ఉన్నారు. రేణుక అంగన్వాడీ ఆయాగా పని చేస్తోంది. భర్త నాగేశ్వరరావు ఏడాది నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కుమారుడికి కూడా మాటలు సరిగా రావు. దీనికి తోడు ఆర్థిక పరిస్థితులు కూడా సరిగాలేకపోవడంతో జీవితంపై విరక్తి చెందింది. ఈ నెల 11న ఎవరూ లేని సమయంలో ఇంట్లోని ఇనుప పైపునకు ఉరి వేసుకుంది. కుటుంబీకులు గమనించి ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి అపస్మారస్థితిలోనే చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందింది. మృతురాలి సోదరుడు రావుల నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఖమ్మం రూరల్ ఎస్సై బాణాల రాము తెలిపారు. -
దిశ నిందితుడు చెన్నకేశవులు తండ్రి మృతి
సాక్షి, నారాయణపేట : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార, హత్య కేసులో నిందితుడైన చెన్నకేశవులు తండ్రి తండ్రి కురమయ్య మృతిచెందారు. గతంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన హైదరాబాద్‌లో కొన్నిరోజులపాటు చికిత్స పొందారు. కొన్ని రోజుల క్రితమే కురమయ్య కుటుంబ సభ్యులు ఆయన్ని తన స్వగ్రామం నారాయణపేట జిల్లా గుడిగండ్లకు తీసుకునివెళ్లారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం సమయంలో తన ఇంట్లోనే మృతి చెందారు. కాగా దిశ అత్యాచార కేసులో ఏ4గా ఉన్న చెన్నకేశవులు పోలీసుతో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన విషయం తెలిసిందే. ఇక ఆయన భార్య రేణుక రెండు రోజుల క్రితమే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో కురమయ్య మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు గుడిగండ్ల వాసులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. (ఆడబిడ్డకు జన్మనిచ్చిన రేణుక) -
మెడపై గాట్లతో విద్యార్థిని అనుమానాస్పద మృతి
సాక్షి, వికారాబాద్ : అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని జాంబపూర్ తండాలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన రవినాయక్ కూతురు రేణుక(13) నవాబుపేట మండల కేంద్రంలోని కేజీబీపీ పాఠశాలలో 8వ తరగతి చదువుతుండేది. బుధవారం ఉదయం బాలిక అనారోగ్యానికి గురవడంతో ఏఎన్ఎం జ్వరం మాత్రలు ఇచ్చింది. అనంతరం బాలిక తండ్రి రవినాయక్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. మధ్యాహ్నం 3:30 గంటలకు రవినాయక్ హాస్టల్‌కు వెళ్లి కూతురును సదాశివాపేట్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయిస్తానని తన వెంట తీసుకెళ్లాడు. అయితే, రేణుక తల్లి, రవినాయక్ మొదటి భార్య ఏడేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఆయన తన రెండో భార్య బుజ్జిబాయితో కలిసి సంగారెడ్డి జిల్లా సదాశివాపేట మండలం ఆత్మకూరులో ఉంటూ అక్కడే మేస్త్రిగా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో రేణుకను ఆత్మకూరుకు తీసుకెళ్లినట్లు సమాచారం. తండాకు మృతదేహం.. వసతిగృహం నుంచి రేణుకను తీసుకెళ్లిన రవినాయక్.. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ఆమె మృతదేహాన్ని స్వగ్రామం జాంబపూర్ తండాకు తీసుకొచ్చాడు. అనంతరం స్థానికులకు విషయం తెలియడంతో రవినాయక్ ఇంటికి వచ్చారు. బాలిక మృతదేహాన్ని పరిశీలించగా మెడపై గాట్లు కనిపించాయి. దీంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. వీఆర్ఓ అనిత ఫిర్యాదు మేరకు సీఐ శ్రీనివాస్‌రావు, ఎస్ఐ లక్ష్మయ్య తండాకు చేరుకొని రేణుక మృతదేహాన్ని పరిశీలించారు. తండ్రి రవినాయక్‌ను వికారాబాద్ పోలీసులు విచారింగా పొంతన లేని సమాధానాలు తెలిపాడు. బుధవారం రాత్రి రేణుకను ద్విచక్ర వాహనంపై సదాశివపేట్‌కు తీసుకొస్తుండగా నురుగులు కక్కుతూ వాహనం పైనుంచి కింద పడిందని, దీంతో మెడకు గాయాలైనట్లు తెలిపాడు. వీఆర్ఓ ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వికారాబాద్ పోలీసులు సదాశివాపేట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన సదాశివాపేట్ సీఐ శ్రీధర్‌రెడ్డి కుటుంబీకుల నుంచి సమచారం సేకరించి తండ్రి రవినాయక్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. ఏడేళ్ల క్రితం తల్లి బలవన్మరణం రేణుక తల్లి చంద్రిబాయి 7 ఏళ్ల క్రితమే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటికే ఆమెకు కూతురు రేణుక, కుమారుడు దర్శన్ ఉన్నారు. తల్లి మృతి తరువాత రవినాయక్ పిల్లలను ప్రభుత్వ వసతిగృహాల్లో చేర్చాడు. అనంతరం బుజ్జిబాయిని రెండో వివాహం చేసుకొని సదాశివాపేట్ మండలం ఆత్మకూరులో ఉంటున్నాడు. బుధవారం రేణుకను ఆత్మకూరు తీసుకెళ్లిన రవినాయక్ రెండో భార్య బుజ్జిబాయి సహాయంతో ఆటోలో మృతదేహాన్ని జాంబపూర్కు తీసుకొచ్చారు. రేణుక మెడకు రెండు వైపుల గాట్లు ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తుంది. తండ్రి పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో పోలీసులు ఆయనపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేణుక మృతిపై డీఈఓ విచారణ నవాబుపేట: రేణుక మృతిపై డీఈఓ రేణుకాదేవి గురువారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో విచారణ జరిపారు. రేణుకను హాస్టల్నుంచి ఇంటికి ఎందుకు పంపారు...? ఎవరు వచ్చి తీసుకెళ్లారని ఆమె పాఠశాల ప్రత్యేకాధికారిని ఆశలతను, ఏఎన్ఎం అనసూయను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలిక నీరసంగా ఉండటంతో తండ్రి రవినాయక్‌కు ఫోన్లో సమాచారం ఇచ్చామని, ఆయన మధ్యా హ్నం వచ్చి తన కూతురికి జ్వరంగా ఉందని చెప్పి మూమెంట్ రిజిస్టర్లో సంతకం పెట్టి సెలవు చిట్టీ ఇచ్చి తీసుకెళ్లాడని వివరించారు. గురువారం ఉదయం రేణుక మృతి చెందినట్లు సమాచారం అందిందని తెలిపారు. అంతకు ముందు తహసీల్దార్ వెంకటేశం, ఆర్ఐ రవీందర్‌రెడ్డి పాఠశాలకు వెళ్లి వివరాలు సేకరించారు. ఎంఈఓ గోపాల్ తదితరులు ఉన్నారు. -
ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
సైదాబాద్: హాస్టల్ ఉంటూ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైన సంఘటన సైదాబాద్ పోలీస్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.మహబూబ్‌నగర్ జిల్లా, చంద్రదాన గ్రామం, పుల్సింగ్తండాకు చెందిన పత్లావత్ రేణుక(17) ఐఎస్‌సదన్ డివిజన్, వినయ్‌నగర్ కాలనీలోని నాయుడు హాస్టల్లో ఉంటూ స్థానికంగా ఉండే సంఘం లక్ష్మిబాయి జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 7న సంక్రాంతి పండగ నేపథ్యంలో ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లింది. దీంతో హాస్టల్ నిర్వాహకులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే ఆమె ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె బంధువు పరుశురాం గురువారం సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగిని.. మల్కాజిగిరి:ప్రైవేట్ ఉద్యోగిని అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ నాగేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.దయానంద్‌నగర్ సాయికృప ఎంపైర్ అపార్ట్మెంట్లో ఉంటున్న తొగర్ క్లెమెంట్ దైవకర్ భార్య జ్యోత్స్న లత గచ్చిబౌలిలోని అభిరాం డెవలపర్స్‌లో జీఎంగా పనిచేస్తోంది. ఈ నెల 8 న డ్యూటీకి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఆమె సెల్‌ఫోన్ కూడా స్విచ్ఛాఆఫ్ వస్తుండడంతో ఆమె భర్త దైవకర్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు విద్యార్థులు అదృశ్యం ఉప్పల్: రామంతాపూర్ డాన్‌బాస్కో నవజీవన్ అనాథాశ్రమం నుంచి ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆశ్రమంలో ఉంటున్న కోడి అఖిల్, నడిపి పోలు అనే విద్యార్థులు ఈ నెల 8న ఉదయం ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిపోయారు. వారికోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో సొసైటీ ఇన్చార్జి శిల్వరాజు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
రేణుకను బాలికల వసతి గృహానికి పంపండి
సాక్షి, హైదరాబాద్: దిశ హత్యాచారం కేసులో నిందితుడు చెన్నకేశవులు భార్య రేణుకను వైద్య సదుపాయం ఉన్న బాలికల వసతి గృహానికి తరలించాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు పి.అచ్యుతరావు కోరారు. రేణుక మైనర్ అని, ఆర్నెల్ల్ల గర్భిణీ అయినందున ఆమె ఎప్పుడైనా ప్రసవించే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ఆమెకు వైద్య సేవలు సమీపంలో ఉండాలని, అందుకోసంఅన్ని రకాల వసతులున్న వసతి గృహానికి తరలించాలని ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. అదే విధంగా రేణుకకు పోక్సో చట్టం కింద పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. -
గుంత రేణుక అరెస్ట్
గద్వాల క్రైం/ఆత్మకూర్: నిషేధిత మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నారనే నెపంతో గుంత రేణుక (ఏ6)ను బుధవారం గద్వాలలోని రామిరెడ్డి స్మారక గ్రంథాలయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆత్మకూర్ కోర్టుకు తరలించారు. జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఎల్కూర్కు చెందిన టీవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగన్న (నాగరాజు) నిషేధిత మావోయిస్టు పార్టీలోకి యువతను నియమిస్తున్నారన్న సమాచారం అందడంతో గత అక్టోబర్ 5న అతడిని అరెస్టు చేశారు. అదే నెల 7, 11న టీవీవీ బలరాం, ఓయూ ప్రొఫెసర్ జగన్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. యువతను చేర్చుకుంటున్నారు.. నిషేధిత మావోయిస్టు పార్టీలోకి యువతను చేర్చుకుంటున్నారన్న సమాచారంతో ఈ కేసులోని ఆరుగురు సానుభూతిపరులను అరెస్టు చేశామని జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ అపూర్వరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు, విధ్వంసకర కార్యకలాపాలను నిర్వహించడానికి, మావోయిస్టు పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రమంతా వారు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. శిల్ప, రమేశ్‌లకు 14 రోజులు రిమాండ్.. హైదరాబాద్‌లో ఈ నెల 17న అరెస్టయిన చైతన్య మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చుక్కల శిల్ప, తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచు రమేశ్‌లను కోర్టు 14 రోజుల రిమాండ్‌కు ఆదేశించింది. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆత్మకూర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో గద్వాల పోలీసులు వారిని హాజరుపర్చా రు. న్యాయమూర్తి జీవన్ సూరజ్‌సింగ్ 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో మహబూబ్‌నగర్ జిల్లా జైలుకు తరలించినట్లు సమాచారం. -
స్నేహితుడిని కసితీరా కత్తితో నరికేసింది..
మానవత్వం మంటగలిసింది... బంధాలు బరి తెగిస్తున్నాయి.. స్నేహాలు చెడుమార్గంలో నడుస్తున్నాయి.. సంబంధాలు అవసరాలకు పరిమితమవుతున్నాయి.. క్షణక్షణం అనుమానంతోనే స్నేహం.. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పాకులాట.. అంతిమంగా ప్రాణం తీసేందుకు వెనకాడని తత్వం.. అందులోనూ ఓ మహిళ కక్ష కట్టింది.. నమ్మకంగా స్నేహితుడిని ఇంటికి తీసుకెళ్లింది.. కసితీర కత్తితో నరికి దారుణంగా హత్య చేసింది. ఘటన తంగిళ్లబీడులో గురువారం సంచలనం రేపింది. సాక్షి, తిరువూరు(కృష్ణా) : వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తిని స్నేహితురాలు అతిదారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్ తెలిపిన వివరాలు.. విజయవాడ పోరంకికి చెందిన అవనిగడ్డ గణేష్ (46) గతలో ఆగిరిపల్లి మండలంలో గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేశాడు. అప్పట్లో తిరువూరు సమీపంలోని తంగిళ్లబీడుకు చెందిన రేణుకతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. కొంతకాలం ఇద్దరు బాగానే ఉన్నారు. అయితే ఇటీవలే గణేష్‌కు బదిలీ కావడంతో ఉద్యోగానికి సెలవు పెట్టి ఇంటి వద్ద ఉంటున్నాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలతో దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. ఏడాదిన్నరగా సంబంధం కొనసాగుతోంది. అయితే జనవరి నుంచి రేణుకకు డబ్బులు ఇవ్వడం లేదని సమాచారం. దీనికితోడు అనారోగ్యంతో గణేష్ మెడికల్ లీవ్‌లో ఉన్నాడు. పథకం ప్రకారమే హత్య ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వని గణేష్ మీద రేణుక కక్షపెంచుకుంది. తరుచూ ఫోన్లో డబ్బులు ఇవ్వాలని కోరుతోంది. అయితే జనవరి నుంచి డబ్బులు సర్దుబాటు చేయకపోగా గణేష్ కనిపించకుండా తిరుతున్నాడు. ఫోన్లో సంప్రందించినా పట్టించుకోవడం లేదని రేణుక భావించింది. దీంతో తోటి వారి సాయం తీసుకుంది. విస్సన్నపేట నుంచి ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు యువకులను కారులో ఎక్కించుకుని విజయవాడ పోరంకి వెళ్లింది. గణేష్‌ను మాయమాటలు చెప్పి తీసుకురావాలని వారికి పని అప్పగించింది. అందరు కలసి పథకం ప్రకారం ఇంటికి వెళ్లి కారులో గణేష్‌ను ఎక్కించుకున్నారు. తరువాత కారును నేరుగా తిరువూరు తంగిళ్లబీడులోని తన ఇంటికి తీసుకెళ్లింది. విస్సన్నపేట నుంచి తీసుకొచ్చుకున్న కిరాయి వ్యక్తులతో కలసి గణేష్‌ను కత్తితో నరికి చంపేశారు. నిందితులు పరయ్యారు. విస్సన్నపేటకు చెందిన కారు డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. గతంలోనూ రేణుక పలు హత్యానేరాల్లో నిందితురాలు. ఆమె భర్తను కూడా హత్య చేసిన కేసులో నిందితురాలుగా ఉంది. ఆమెపై తిరువూరు పోలీసుస్టేషన్ రౌడీషీటు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. -
చిన్న చిత్రాన్ని ఆదరిస్తున్నారు
ప్రసాద్ రెడ్డి, రేణుక జంటగా కళా రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆ నిమిషం’. వెంకటేశ్వర డిజిటల్ మూవీస్ పతాకంపై బండారు హరితేజ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో కళా రాజేష్ మాట్లాడుతూ– ‘‘ఆడపిల్లలను రక్షించండి– సంరక్షించండి’ అనే ప్రధాన పాయింట్ చుట్టూ తెరకెక్కించిన చిత్రమిది. 44మంది నూతన నటీనటులతో, కొత్త సాంకేతిక నిపుణులతో నిర్మించిన మా చిన్న బడ్జెట్ చిత్రాన్ని ఆదరించి, ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఈ సినిమా తీయడం వెనక ఉన్న మా ఉద్దేశం ప్రేక్షకాదరణతో సఫలమైంది’’ అన్నారు ప్రసాద్‌రెడ్డి. ‘‘లెక్చరర్స్ అయిన మేము నిర్మించిన ఈ చిత్రాన్ని సెన్సార్ అధికారుల నుంచి ఎందరో పెద్దలు ఆశీర్వదించినందుకు థ్యాంక్స్. మా సినిమాని ప్రోత్సహించిన డైరెక్టర్ జి.నాగేశ్వర రెడ్డి, నటి జయసుధ, ఎమ్మెల్యే రోజా, హీరో శ్రీకాంత్‌గార్లకు కృతజ్ఞతలు’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్కె నజీర్. రేణుక, కో డైరెక్టర్ రాయుడు పాల్గొన్నారు. -
ఆడపిల్లలే ఆస్తి
‘ఆడపిల్లని స్వాగతించండి.. వారిని సంరక్షించండి.. ఏ దేశానికైనా ఆడపిల్లలే నిజమైన ఆస్తి’ అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ఆ నిమిషం’. ప్రసాద్ రెడ్డిని హీరోగా, రేణుకని హీరోయిన్గా పరిచయం చేస్తూ కళా రాజేష్ దర్శకత్వంలో వెంకటేశ్వర డిజిటల్ మూవీస్ పతాకంపై బండారు హరితేజ నిర్మించిన ఈ సినిమా ఈనెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కళా రాజేష్ మాట్లాడుతూ–‘‘నేడు ఆడపిల్ల అంటే పరపతి కోసమే అన్నట్లు చూస్తున్న కొంతమంది పురిటిలోనే చంపేస్తున్నారు. ఆడపిల్లల బర్త్ రేటు గణనీయంగా తగ్గుతోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే సమాజానికి భవిష్యత్ అనేది ఉండదు. విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నేను, నా మిత్రులు కలసి ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు. నటుడు రవి ప్రకాష్ మాట్లాడుతూ– ‘‘నేడు సమాజం ఎదుర్కొంటున్న బర్నింగ్ పాయింట్‌తో ఈ సినిమాని తెరకెక్కించారు. ట్రైలర్స్ బాగున్నాయి. దర్శకుడు, నిర్మాత, యాక్టర్స్ అంతా కొత్తవారే అయినా చక్కగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు’’ అన్నారు. ‘‘మా తొలి ప్రయత్నం సక్సెస్ కావాలి.. సినిమా ఘన విజయం సాధించాలి’’ అన్నారు ప్రసాద్ రెడ్డి. కెమెరామెన్ షరీఫ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ నజీర్, వినోద్ రెడ్డి పాల్గొన్నారు. రాణిశ్రీ, నాగబాబు, శ్రీదేవి నటించిన ఈ చిత్రానికి సంగీతం: కున్ని గుడిపాటి, కెమెరా: వై.ప్రసాద్. -
ఆడపిల్లల స్థాయి పెంచాలి
నేటి సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు, భ్రూణ హత్యల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఆ నిమిషం’. ప్రసాద రెడ్డి, రాణిశ్రీ, రేణుక, నాగబాబు, శ్రీదేవి, శరభారావు, బేబీ రోహీ, బేబీ నన్న ముఖ్య తారలుగా కళా రాజేష్ దర్శకత్వంలో వెంకటేశ్వర డిజిటల్ మూవీస్ బ్యానర్‌పై బండారు హరితేజ నిర్మించారు. గురువారం నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులతో ‘మన సమాజంలో ఆడ పిల్లల స్థాయి పెంచాలి’ అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు టీమ్. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించారు. ఆడపిల్లలకు సమాజంలో సమున్నత స్థాయిని కల్పించి వాళ్లను గౌరవించాలి, ప్రోత్సహించాలి అని విద్యార్థులు ఏకకంఠంతో కోరారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపింది చిత్రబృందం. ‘‘ప్రతి ఒక్కరూ దేవుడిచ్చిన ఆడపిల్లలను స్వాగతించాలి. అపురూపంగా పెంచాలి. సుస్థిరమైన జీవితం అందించాలి. ఇందుకు మగవారు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి. ఈ సందేశాన్నే మా సినిమాలో చూపించాం’’ అని కళా రాజేష్ అన్నారు. ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
మిస్టరీ వీడని రేణుక అదృశ్యం
సాక్షి,మోర్తాడ్: ఏర్గట్ల శివారులోని కాకతీయ కాలువలో పడి గల్లంతైన వివాహిత యువతి రేణుక ఆచూకీ రెండు నెలలైనా ఇంకా దొరకలేదు. దీంతో రేణుక అదృశ్యం కేసు మిస్టరీ వీడకుండా ఉంది. అక్టోబర్ మొదటి వారంలో ఇబ్రహీంపట్నంలోని తన తల్లిగారి ఇంటి నుంచి బాల్కొండలోని తన అత్తగారింటికి భర్త మారుతితో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మార్గమధ్యలో రేణుక కాకతీయ కాలువలోకి దూకిందని మారుతి పోలీసులకు అప్పట్లో ఫిర్యాదు చేశాడు. అయితే కాకతీయ కాలువలో గజ ఈతగాళ్లతో పలు చోట్ల వెతికించినా అప్పట్లో రేణుక ఆచూకీ లభించలేదు. రేణుకకు సంబంధించి ఎలాంటి దుస్తులు, నగలు దొరకకపోవడంతో ఆమె ఏమి అయి ఉంటుందో పోలీసులకు అంతు చిక్కడం లేదు. రేణుకకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఆమె సజీవంగా ఉందా లేదా అని ఒక నిర్దారణకు రాలేక పోతున్నామని పోలీసులు చెబుతున్నారు. రేణుక అదృశ్యం మిస్టరీగానే పోలీసులు పరిగణిస్తున్నారు. అయితే తమ కూతురు కాలువలోకి దూకి ఉండదని ఆమె భర్త మారుతి తోసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తూ రేణుక తల్లి పోలీసుల ఎదుట ఆరోపించింది. అయితే రేణుక అదృశ్యం అయిన నుంచి కాకతీయ కాలువ నిండుగా ప్రవహిస్తుండటంతో ఎలాంటి ఆధారం దొరకడానికి అవకాశం లభించలేదు. రేణుక భర్త మాత్రం ఆమె తనతో గొడవ పడి కాలువలోకి దూకిందని చెబుతున్నాడు. రేణుకకు సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరికితే తప్ప ఎలాంటి వివరాలు తాము వెల్లడించలేమని ఏర్గట్ల ఎస్ఐ హరిప్రసాద్ ‘సాక్షి’కి వివరించారు. ఏది ఏమైనా వివాహిత యువతి కాకతీయ కాలువలో గల్లంతై రెండు నెలలు గడచినా ఇంత వరకు ఆచూకీ లభించకపోవడంతో అదృశ్యం కేసు మిస్టరీగానే ఉండిపోయిందని చెప్పవచ్చు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని..
మలక్‌పేట: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఓ మహిళ తన కుమార్తె(3)ను వదిలించుకునేందుకు చిన్నారిని చిత్రహింసలకు గురి చేస్తుంది. తరచూ బాలికపై ఒంటిపై వాతలు పెట్టడం, కొడుతుండటాన్ని గుర్తించిన స్థానికులు బాలల హక్కుల సంఘానికి సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న సంఘం సభ్యులు చిన్నారిని కాపాడి మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాదాద్రి జిల్లా, పాలడుగు గ్రామానికి చెందిన ముక్కాముల వెంకన్న, సరిత దంపతులకు రేణుక కుమార్తె ఉంది. భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో కొద్దికాలంగా వారు వేర్వేరుగా ఉంటున్నారు. సరిత కుమార్తె రేణుకతో కలిసి ఈస్ట్ ప్రశాంత్‌నగర్‌లో ఉంటూ ఇళ్లల్లో పనులు చేసి జీవనం సాగిస్తోంది. గత కొంత కాలంగా ఆమె మిర్యాలగూడకు చెందిన డీసీఎం డ్రైవర్ వెంకట్‌రెడ్డితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. తమ ఆనందానికి రేణుక అడ్డుగా ఉందని భావించిన వెంకట్‌రెడ్డి, సరిత ఆమెను వదిలించుకునేందుకు పథకం పన్నారు. ఇందులో భాగంగా తరచూ చిన్నారిని వేదిస్తున్నారు. స్థానికులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం అందించడంతో సోమవారం వారు పాపను కాపాడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సరితను అదుపులోకి తీసుకుని రేణుకను శిశువిహార్‌కు తరలించారు. వెంకట్‌రెడ్డి పరారీలో ఉన్నాడు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుత్‌రావు డిమాండ్ చేశారు. -
హావేరిలో ఆగ్రహ జ్వాల
సాక్షి బెంగళూరు: వేలాది మంది విద్యార్థులు హావేరిలో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. గురువారం జాతీయ రహదారిపై వారద నదికి సమీపంలో 21 ఏళ్ల యువతి మృతదేహం లభించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన రేణుక పాటిల్ కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. హావేరి పట్టణంలోని ప్రధాన సర్కిల్‌ను అడ్డగిస్తూ విద్యార్థులు మానవహారాన్ని నిర్వహించారు. హావేరి పట్టణానికి సరిగ్గా 14 కిలోమీటర్ల దూరంలోని మన్నూర్ గ్రామానికి చెందిన బసనగౌడ కుమార్తె రేణుక పాటిల్ (21) అనుమానస్పద రీతిలో కాలిన గాయాలతో మృతి చెందింది. కాగా, సోమవారం సాయంత్రం స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకునేందుకు మిత్రులతో వెళ్లి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ పార్టీలో మత్తుపదార్థాలు ఇచ్చి స్నేహితులే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టి హత్య చేసి ఉంటారని అనుమానించారు. ఈ నేపథ్యంలో రేణుక విషయంలో సత్వర న్యాయం జరగాలని, నిందితులను కఠినంగా శిక్షించాని డిమాండ్ చేస్తూ హావేరి రోడ్డుపై విద్యార్థులు నిరసన చేపట్టారు. ఏబీవీపీ, ఎస్ఐఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు జరిగాయి. మరోవైపు పంచమసాలి పీఠాధిపతి బసవజయ మృత్యుంజయ శ్రీగళు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యువతులపై వేధింపులు అధికమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేణుక పాటిల్ కేసుపై తక్షణమే ముఖ్యమంత్రి, హోం మంత్రి స్పందించాలన్నారు. -
కర్కశత్వం.. అమానవీయం..
వర్గల్(గజ్వేల్): కర్కశత్వం.. అమానవీయం.. నాలుగేళ్ల లోపు పసి పిల్లలు అని కూడా చూడ కుండా.. తమ అమానుష ప్రవర్తన బయటకు పొక్కకుండా.. పిల్లల కేకలు బయటకు వినప డకుండా.. నోట్లో గుడ్డలు కుక్కి.. శరీరంపై వాతలు పెట్టి.. ఒళ్లంతా హూనం చేసి, గిచ్చి, రక్కి, కాళ్లు, చేతులు విరిచి.. ప్రతి నిత్యం చిన్నారులకు నరకం చూపుతున్న తల్లి, ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి దుశ్చర్య.. మానవత్వానికి మచ్చగా నిలుస్తోంది. ఎదురు ప్రశ్నించలేని చిన్నారులను చిత్రహింసలు చేస్తున్న ఇరువురి దుర్మార్గం గ్రామస్తుల చొరవతో ఆదివారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంలో వెలుగులోకి వచ్చింది. గజ్వేల్ సమీపంలోని జాలిగామకు చెందిన మాచ పురం సురేశ్ అలియాస్ సురేందర్‌కు పెళ్లై భార్యను వదిలేశాడు. వర్గల్ మండలం తున్కిఖాల్సకు చెందిన రేణుకకు పెళ్లైంది. ఇద్దరు పిల్లలు దివ్య(4), డేవిడ్(రెండేళ్లలోపు బాబు) పుట్టిన తర్వాత భర్త వదిలేశాడు. గజ్వేల్‌లోనే కూలి పని చేసుకునే రేణుకకు, మాచపురం సురేశ్‌కు పరిచయం, ఆ క్రమంలో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇరవై రోజుల నుంచి సురేశ్ వర్గల్ మండలం నాచా రంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ, ఇక్కడే రేణుక పిల్లలతో కలసి అద్దెగదిలో ఉంటు న్నారు. రేణుక, సురేశ్ ఇద్దరు దంపతులనే గ్రామస్తులు భావించారు. అయితే, రోజూ ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలను వారు కొడుతున్న విషయం ఇరుగుపొరుగు గమనించినా పెద్దగా పట్టించుకోలేదు. నోట్లో గుడ్డలు కుక్కి నోట్లో గుడ్డలు కుక్కి పిల్లలను గిల్లడం, కాళ్లు, చేతులు మెలితిప్పడం, చేతులు కట్టేసి ఇనుప పొగ గొట్టంతో శరీరంపై వాతలు పెట్టడం, చావ బాదడం లాంటి దుష్కృత్యాలు నిత్యకృత్యమైనా అరుపులు బయటకు విన్పించే ఆస్కారం లేకుండా పోయింది. ఆదివారం ఉదయం వారి హింసకు తాళలేక దివ్య గట్టిగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వచ్చి అమానవీయ కృత్యాలను గమ నించారు. కాళ్లు వాచి పోయి నడవలేని స్థితిలో చిన్నారి ఉంది. దివ్య శరీరంపై వాతలు, కమిలి పోయిన గాయాలు, ముఖంపై రక్కిన గాయాలు చూసి చలించి పోయారు. ఆకలితో అల్లాడుతున్న చిన్నారిని చేరదీసి అన్నం పెట్టారు. చిన్న పిల్లాడి ఛాతిపై కమిలిన గాయం చూసి ఆవేదన వ్యక్తం చేశారు. గాయాలతో విలవిల్లా డుతున్న చిన్నారులను చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో గజ్వేల్ ఆసుపత్రికి తరలిం చారు. చిన్నారులను చిత్ర హింసలకు గురి చేసిన వైనం తెలిసి గజ్వేల్ సీడీపీఓ వెంకట్రాజమ్మ, జిల్లా బాలల సంక్షేమ అధికారులు రాజు, శంకర్ నాచారం సందర్శిం చారు. వెంకట్రాజమ్మ ఫిర్యాదు మేరకు సురేశ్, రేణుకలపై కేసు నమోదు చేశామని గౌరారం ఎస్సై ప్రసాద్ తెలిపారు. చిన్నారులను సం రక్షణ కోసం చిల్డ్రన్ హోమ్‌కు తర లించను న్నట్లు వెంకట్రాజమ్మ తెలిపారు. -
ఎవరెస్టు అధిరోహణకు రేణుక పయనం
సీతంపేట: ఎవరెస్టు శిఖర అధిరోహణకు కొండగొర్రె రేణుక అనే గిరిజన విద్యార్థిని శుక్రవారం తన స్వగ్రామమైన భామిని మండలం నులకజోడు నుంచి పయనమై వెళ్లింది. పది రోజుల పాటు విజయవాడలోని కేతాని కొండ వద్ద శిక్షణ అనంతరం మరో పది రోజులు లడక్‌లో మంచు పర్వతాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. తదుపరి 20 రోజుల తర్వాత ఎవరెస్టు అధిరోహణకు వెళ్లనున్నారు. రేణుక ఎవరెస్టు ఎక్కితే జిల్లా నుంచి ఊయక కృష్ణారావు తర్వాత అధిరోహించిన రెండో గిరిజన విద్యార్థినిగా గుర్తింపు దక్కుతుంది. ఈమె సీతంపేట గిరిజన బాలికల గురుకుల కళాశాలలో వృత్తివిద్యాకోర్సు ( అక్కౌంట్స్ అండ్ ట్యాక్సేషన్) గ్రూపు ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు రాసింది. ఇప్పటికే 6,620 మీటర్ల ఎత్తయిన రినాక్ పర్వతశిఖరాన్ని అధిరోహించింది. 8,848 మీటర్ల ఎత్తున్న ఎవరెస్టు శిఖరాగ్రాన చేరుకోవడానికి ఉవ్విళ్లూరుతోంది. తల్లిదండ్రులు సంజీవరావు, కృష్ణవేణిలు కొండపోడు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తుంటారు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం వారిది. అన్నయ్య గణపతి పదో తరగతి వరకు చదివి డ్రాపౌట్ అయ్యాడు. మరో అన్నయ్య సంతోష్ సీతంపేటలో ఐటీఐ చేస్తున్నాడు. ప్రాథమిక విద్యాబ్యాసం స్వగ్రామంలో పూర్తి చేసి, ఐదు నుంచి పదోతరగతి వరకు హడ్డుబంగి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో పూర్తి చేసింది. ఇంటర్మీడియట్ సీతంపేట బాలికల కళాశాలలో చేరింది. గురుకుల సొసైటీ ఇచ్చిన పర్వతారోహణ శిక్షణ అందిపుచ్చుకుంది. -
రేణుకది హత్యే!
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం: ‘రేణుకను చున్నీతో గొంతు నులిమి చంపారు, రేణుకది ముమ్మాటికి హత్యే, మృతిపై అనుమానాలున్నాయి’ అని రేణుక సోదరి రేవతి ఆవేదన వ్యక్తం చేశారు. రేణుక కేరళకు బయల్దేరే సమయంలో శ్రీజిత్, శ్రీరామ్ అడ్డుపడుతున్నారని చెప్పిందని రేవతి పోలీసులకు, మీడియాకు వివరించింది. బుచ్చిరెడ్డిపాళెం బలరాంనగర్‌లోని ఓ ఇంటిలో కేరళకు చెందిన ఉపాధ్యాయురాలు రేణుక(23) అనుమానాస్పద స్థితిలో శనివారం మృతి చెందిన విషయం విధితమే. ఈ మేరకు.. కొట్టాయం నుంచి ఆదివారం సాయంత్రం రేణుక సోదరి రేవతి, కుటుంబసభ్యులు బుచ్చిరెడ్డిపాళేనికి చేరుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తన చెల్లెలిది హత్యేనని అనుమానం వ్యక్తం చేశారు. సంక్రాంతి సెలవులకు వస్తున్నాని శుక్రవారం ఫోన్ చేసి తల్లి వాసంతికి చెప్పిందన్నారు. మళ్లీ శనివారం మధ్యాహ్నం ఫోన్ చేసి తాను ఇంటింకి బయల్దేరాలని చూస్తుంటే బిందు కుమారులు శ్రీజిత్, శ్రీరామ్ గదిలోనే ఉన్నారని, బయటకు వెళ్లడం లేదని తెలిపిందన్నారు. శ్రీజిత్, శ్రీరామ్ తల్లిదండ్రులు విషం తీసుకుని ఆస్పత్రిలో ఉన్నారని తనతో శ్రీజిత్, శ్రీరామ్ అన్నట్లు ఫోన్లో రేణుక చెప్పిందన్నారు. దీంతో రావడం కుదిరే అవకాశం లేదని చెప్పిందని తెలిపారు. అనంతరం కొద్దిసేపటికే మళ్లీ రేణుక సెల్ నుంచి ఫోన్ వచ్చిందని, అయితే బిందు మాట్లాడిందన్నారు. రేణుకకు సీరియస్‌గా ఉందని చెప్పిందన్నారు. ఇదిలా ఉంటే గతంలో రేణుక బిందు ఇంట్లో ఉన్న సమయంలో బిందు భర్త రాధాకృష్ణ మద్యం సేవించి వచ్చి కొట్టాడని తమకు ఫోన్లో తెలిపిందన్నారు. రేణుకకు ముక్కులో రక్తం కారుతున్నట్లు తమకే తెలియదని, మరి బిందు కుటుంబ సభ్యులు ముక్కులో రక్తం వస్తుందని చెప్పడం అనుమానాలకు తావిస్తోందన్నారు. మొత్తానికి రేణుకది హత్యేనని, పోలీసులు విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. శ్రీజిత్–రేణుకల మధ్య ప్రేమ వ్యవహారం శ్రీజిత్–రేణుకల మధ్య ప్రేమ వ్యవహారం ఉంది. తన డైరీలో ఇద్దరి ప్రేమ విషయాన్ని రేణుక రాసి ఉంది. ఐ లవ్ యూ అంటూ , ఐలవ్యూ కన్నా అంటూ శ్రీజిత్‌ను సంబోధిస్తు రాసి ఉంది. ఆర్థిక లావాదేవీలే కారణమా... రేణుక మృతికి ఆర్థిక లావాదేవీలు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేణుక మెడలోని బంగారు చైన్ బుచ్చిరెడ్డిపాళెంలోని ఓ నగల దుకాణంలో కుదువపెట్టింది. అందుకు సంబంధించి నగదును బిందు కుటుంబసభ్యులకు రేణుక ఇచ్చినట్లు సమాచారం. కేరళకు వెళ్లే క్రమంలో తన తల్లి ఎక్కడ అడుగుతుందోనని రేణుక అలాంటి రోల్‌గోల్డ్ చైనే కొనుక్కుంది. రేణుక తన వేతనంలో ఇంటికి ఏమీ పంపించిన దాఖలాలు లేవని సోదరి రేవతి చెబుతోంది. ఈ నేపధ్యంలో తన చైన్‌తో పాటు ఆర్థిక లావాదేవీలను ప్రశ్నించినందుకు బిందు కుటుంబీకులు రేణుకను హత్యచేసి ఉంటారని రేవతి కుటుంబసభ్యులు పోలీసులు, మీడియాకు తెలిపారు. అన్నీ అనుమానాలే.. బిందు–రాధాకృష్ణ దంపతులు, వారి కుమారులు శ్రీజిత్, శ్రీరామ్‌ల మాటల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. రేణుక అడగకుండానే శ్రీరామ్, శ్రీజిత్‌లు శనివారం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం బిరియానీ తీసుకెళ్లి ఇచ్చారు. అనంతరం కొద్దిసేపటికే మృతిచెంది పడి ఉంది. -
సొంతం నీకా..? నాకా..?
తమిళ సినిమా: ఒక మార్కెట్‌ను సొంతం చేసుకోవడానికి హీరో, రౌడీ మధ్య జరిగే పోరాటం ఇతివృత్తంగా రూపొందుతున్న చిత్రం సెయల్. నవ జంట రాజన్తేజేశ్వర్, తరూషి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఇందులో నటి రేణుక, మునీష్కాంత్, సూపర్‌గుడ్ సుబ్రమణియం, వినోదిని, టీపోట్టి గణేశన్, ఆడుగళంజయబాలన్, దీనా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నటుడు ఛమక్ చంద్ర విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సీఆర్.క్రియేషన్స్ నిర్మలారాజన్ సమర్పణలో దివ్యక్షేత్ర ఫిలింస్ పతాకంపై సీఆర్.రాజన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు గతంలో విజయ్ హీరోగా షాజహాన్ చిత్రాన్ని తెరకెక్కించిన రవి అబ్బులు దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన 15 ఏళ్ల తరువాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. వీ.ఇళయరాజా ఛాయాగ్రహణ, సిద్ధార్ద్ విపిన్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఉత్తర చెన్నైలోని తంగశాలై మార్కెట్‌ను సొంతం చేసుకోవడానికి వచ్చిన ఒక రౌడీని అదే మార్కెట్లో సరకులు కొనుక్కోవడానికి వచ్చిన హీరో చితకబాదే పరిస్థితి నెలకొంటుందన్నారు. దీంతో ఆ మార్కెట్లో ప్రజలకు రౌడీ అంటే భయం పోతుందన్నారు. ఆ మార్కెట్‌ను సొంతం చేసుకోవాలంటే ఆ రౌడీ అదే చోట హీరోను తిరిగి కొట్టాలన్నారు. మరి ఆ రౌడీ కొట్టారా? లేక మరోసారి హీరో చేత చావు దెబ్బలు తిన్నాడా? అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో సెయల్ చిత్ర కథ సాగుతుందన్నారు. ఇందులో హీరోను ప్రేమించమని వెంటపడే పాత్రలో హీరోయిన్ నటిస్తోందని, అయితే ఆమె హీరోను కలిసి నప్పుడల్లా ఒక ఆసక్తికరమైన సంఘటన జరుగుతుందని చెప్పారు. -
రేణుక... గోల్డ్‌మెడలిస్ట్!
∙ వెన్నాడిన ఫ్లోరైడ్ భూతం ∙చదువుకు వెళ్లిన చోటల్లా అవమానాలు ∙కష్టాలను అధిగమించి పీజీ, బీఎడ్ చదివింది ∙యూనివర్సిటీ టాపర్‌గా బంగారు పతకం సాధించింది ∙వెక్కిరించిన నోళ్లే ఇప్పుడు వెరీగుడ్ అంటున్నాయ్.... ∙సర్కారు కరుణించాలంటున్న చదువుల తల్లి రేణుక... పసి ప్రాయంలోనే ఫ్లోరోసిస్ భూతం బారిన పడింది. వయస్సుకు తగ్గట్టుగా ఎదగలేకపోయింది. కనీసం నడవడానికి కూడా కాళ్లు సహకరించవు. కన్నవారికి భారమైనా కడుపుతీపి ఆమెను కాపాడింది. బిడ్డను కంటికి రెప్పలా చూసుకున్న తల్లిదండ్రులు ఆమె సంకల్పానికి ఊపిరినిచ్చారు. ఆమె చదువు కోసం ఎన్నో త్యాగాలు చేశారు. కష్టాలెన్నింటినో ఎదుర్కొంటూనే బిడ్డ ఆశయానికి అండగా నిలిచారు. తల్లిదండ్రులు అందించిన ధైర్యంతో, వెక్కిరించిన విధిని, అవమానించిన సమాజాన్ని చాలెంజ్ చేసింది. తన సంకల్పాన్ని నెరవేర్చుకుంది. ఎంఏ, బీఈడీ చదివిన రేణుక యూనివర్సిటీ టాపర్‌గా గోల్డ్‌మెడల్ అందుకుంది. ఉన్నత చదువులతో వెక్కిరించిన నోళ్లను మూయించింది. వారితోనే వెరీగుడ్ అనిపించుకుంది. కాని సర్కారు కొలువు దొరికితేనే తన సంకల్పం నెరవేరినట్టవుతుందని ఉద్యోగం కోసం తపిస్తోంది. సర్కారు కరుణ కోసం ఆరాటపడుతోంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని ఆరెపల్లి పంచాయతీ పరిధిలో గల ‘ఆరేడు’ గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి–గంగ దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు. వ్యవసాయంపైనే ఆధారపడ్డ ఆ కుటుంబం సాగునీటి వేటలో అనేక కష్టాలను ఎదుర్కొంది. అయితే లక్ష్మారెడ్డి కూతురు రేణుక చిన్నతనంలోనే ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడి ఇబ్బందులపాలైంది. కూతురికి వైద్యం చేయించడం కోసం తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేసినా లాభం లేకుండాపోయింది. అయితే కూతురికి చదువుపై ఉన్న ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు కష్టాలెన్నింటినో ఎదుర్కొంటూ ఆమెకు ఉన్నత చదువులు చెప్పించారు. సొంత ఊరైన ఆరేడులో నాలుగో తరగతి వరకే ఉండడంతో అక్కడ నాలుగో తరగతి దాకా చదివింది. తరువాత ఐదు, ఆరు తరగతులు పక్క గ్రామమైన అచ్చంపేటలో చదువుకుంది. ఏడోతరగతి నుంచి పదోతరగతి వరకు నిజామాబాద్ పట్టణంలోని వివేకానంద హైస్కూల్లో చదివించారు. పదో తరగతిలో 400 మార్కులు సాధించింది. తరువాత ఇంటర్మీడియల్ మెదక్ పట్టణంలో చదివింది. 658 మార్కులు సంపాదించింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీకి అనుబంధమైన ఆంధ్రమహిళా సభ కళాశాలలో డిగ్రీ చదివి కాలేజ్ టాపర్‌గా నిలిచింది. బీఈడీ కూడా అదే కళాశాలలో అభ్యసించింది. యూనివర్సిటీ టాపర్‌గా నిలిచిన రేణుకకు గోల్డ్‌మెడల్ అందించారు. పీజీ ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో పూర్తి చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) కూడా క్వాలిఫై అయ్యింది. కూతురి చదువు కోసం తల్లి ఆమె వెంటే ఉండేది. కూతురు ఎక్కడ ఉంటే అక్కడ తల్లి ఉండి ఆమెను చదువుకోసం తీసుకెళ్లడం, తిరిగి ఇంటికి తీసుకురావడం జరిగేది. తండ్రి అటు వ్యవసాయం చూసుకుంటూ పిల్లల చదువుల కోసం ఆరాటపడేవారు. తల్లిదండ్రులు తన కోసం పడుతున్న శ్రమను చూసిన రేణుక పట్టుదలతో ధైర్యాన్ని కూడగట్టుకుని మరీ ఉన్నత చదువులు పూర్తి చేసింది. చదువుల్లో ఏనాడూ వెనుకబడకుండా అందరికన్నా తనే ఎక్కువ మార్కులు సాధించే ప్రయత్నం చేసింది. ఆంధ్రమహిళా సభ కళాశాలలో బీఈడీ చదివిన రేణుక గోల్డ్‌మెడల్ కూడా సాధించిందంటే ఆమె పట్టుదలకు ఇదే నిదర్శనంగా చెప్పవచ్చు. సర్కారు కరుణ కోసం.... ఎంఏ; బీఈడీ పూర్తి చేసిన రేణుక ఉద్యోగం కోసం ఎదురు చూస్తోంది. డీఎస్సీ నోటిఫికేషన్లు పడకపోవడంతో ఆమె ఆశయం నెరవేరడం లేదు. కనీసం ప్రభుత్వం తన పరిస్థితిని గుర్తించి ఏదైనా ఉద్యోగం ఇస్తే కుటుంబానికి ఆసరా అవుతానంటూ ఇటీవలే కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి విన్నవించింది. ఫ్లోరోసిస్ బారిన పడిన తను నిత్యం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటోంది. తల్లిదండ్రులు ఆమెకు అన్ని రకాల సేవలు చేస్తూ ధైర్యాన్నివ్వడం వల్లే ఆమె ఇంతదాక నెట్టుకువచ్చింది. అయితే ప్రభుత్వం తనకు ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని ఆమె వేడుకుంటోంది. సాధారణంగా వికలాంగులు ఏదో ఒక పనిచేసుకుని బతకగలుగుతారని, తాను పూర్తిస్థాయిలో ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్నందున ఏ పనీ చేసుకునే పరిస్థితి లేదని, తనకు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు వెంట ఉంటేనే బయటకు వెళ్లే పరిస్థితి ఉందని తెలిపింది. తనను ఆదుకోవాలని వేడుకుంటోంది రేణుక. – సేపూరి వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి -
కూలి కోసం వెళ్లి..
సైదాబాద్(హైదరాబాద్ సిటీ): కూలి పని కోసం వెళ్లిన మహిళ అదృశ్యమైన సంఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఐఎస్‌సదన్ డివిజన్ నీలం రాజశేఖర్రెడ్డినగర్కు చెందిన ఎన్. రేణుక(41) ఈ నెల 7న కూలీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో గురువారం సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త హరినాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాపు చేస్తున్నారు. -
యువతి అదృశ్యం
కడప అర్బన్: కడప నగరంలోని చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరవింద నగర్‌కు చెందిన కాటాబత్తిన రేణుక (22) జూన్ 6 నుంచి కనిపించడంలేదని ఆమె తండ్రి కె. సుబ్బరాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆగస్టు 11న క్రైం నెంబర్ 170/2016 కింద కేసు నమోదు చేసినట్లు చిన్నచౌక్ పోలీసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 94407 96911, 94407 96913, 08562–245200లకు ఫోన్ చేసి వివరాలను తెలియజేయాలని కోరారు. -
జిల్లాకు హైకోర్టు న్యాయమూర్తి రాక
కమాన్‌చౌరస్తా : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, కరీంనగర్ జిల్లా ఫోర్ట్ట్‌ఫోలియో జడ్జి జస్టిస్ ఏ.రాజశేఖర్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం కరీంనగర్‌కు రానున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.రేణుక తెలిపారు. గురువారం జిల్లా కోర్టులో జరిగిన విలేకరుల సమావేశంలో జడ్జి మాట్లాడారు. శనివారం ఉదయం సుల్తానాబాద్ కోర్టు ఆవరణలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవన నిర్మాణానికి జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన హైకోర్టు న్యాయమూర్తి నవీన్‌రావు కూడా పాల్గొంటారని అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో న్యాయసేవాసధన్ భవనంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయమూర్తులకు ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో జస్టిస్ రాజశేఖర్‌రెడ్డితో పాటు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి సీవీ రాములు, ప్రొఫెసర్ రఘురాం, అదనపు జిల్లా జడ్జి హేమంత్‌కుమార్ పాల్గొంటారన్నారు. -
సింగరేణి కాలనీలో 51 మద్యం బాటిళ్లు స్వాధీనం
ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా లిక్కర్‌ను విక్రయిస్తున్న స్థావరాలపై మలక్‌పేట ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. సీఐ బీ.ఎల్. రేణుక తెలిపిన వివరాల ప్రకారం.. డిప్యూటీ కమీషనర్ వివేకానందరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం స్టేషన్ పరిధిలోని ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఐఎస్‌సదన్ డివిజన్ సింగరేణికాలనీ రోడ్డు నంబర్ -14లో ఆర్. పాండు (42), అతని భార్య జుక్కుబాయి (38) నివాసంలో తనిఖీలు చేయగా 26 మద్యబాటిళ్లు పట్టుబడ్డాయి. సాయంత్రం మరోసారి నిర్వహించిన దాడుల్లో అదేప్రాంతానికి చెందిన ఆర్. రాజు(32) ఇంటిలో 25 లిక్కర్ క్వాటర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్య విక్రయదారులు ముగ్గురిపై కేసు నమోదు చేశామని, వారు పరారీలో ఉన్నారని తొందరలోనే వారి పట్టుకుంటామని సీఐ తెలిపారు. తనిఖీల్లో ఎస్సైలు దుబ్బాక శంకర్, నరేష్కుమార్, కానిస్టేబుల్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
14 అంతస్తుల భవనం పై నుంచి దూకి..
హైదరాబాద్: రెండేళ్ల చిన్నారితో కలిసి 14 అంతస్తుల భవనం పై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నగరంలోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న రేణుక(34) తన రెండేళ్ల కూతురు ఐశ్వర్యతో కలిసి 14వ అంతస్తు భవనం పై నుంచి దూకింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
నీటి సంపులో పడి చిన్నారి మృతి
ఏడాది వయసున్న చిన్నారి నీటి సంపులో పడి ప్రాణాలు కోల్పోయింది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం శాలిలింగోటం గ్రామంలో ఆదివారం ఈ విషాదం చోటు చేసుకుంది. బత్తుల రేణుక(1) అనే పాపను తల్లిదండ్రులు తమ ఇంటి దగ్గరే వదిలేసి కూలీ పనులకు వెళ్లారు. ఇంటి పక్కనున్న వారికి అప్పగించి వెళ్లగా... పాప ప్రమాదవశాత్తూ సంపులో పడి మృతి చెందింది. -
అదృశ్యమైన చిన్నారులు క్షేమం
మీర్‌పేట పరిధిలోని జిల్లెలగూడ వెంకటగిరి కాలనీలో ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. కాలనీకి చెందిన శ్రీశైలం(10), రేణుక(8), శివ(7) అనే చిన్నారులు సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి ఆడుకోవడానికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చారు. తల్లిదండ్రులు మందలించడంతో భయపడి కనిపించకుండా పోయారు. రాత్రి అయినా కనపడకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా..దూల్పేట్ పరిధిలోని అల్మాస్‌గూడలో ఉంటున్న వారి పెద్దమ్మ దగ్గరకు వెళ్లినట్లుగా కనుగొన్నారు. వారిని తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. -
ప్రేమకు వెల కట్టిన పెద్దమనుషులు
మనస్తాపంతో యువతి ఆత్మహత్యాయత్నం వర్ధన్నపేట టౌన్ : ప్రేమించినవాడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడమేగాక, పెద్దమనుషులు కూడా పంచాయతీలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు చెప్పడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి క్రిమిసంహారక మందు తాగిన సంఘటన మండలంలోని డీసీ తండా శివారు గుబ్బెడ తండాలో శుక్రవారం జరిగింది. బాధితురాలు, తల్లిదండ్రుల కథనం ప్రకారం.. తండాకు చెందిన గుగులోతు రేణుక, అదే తండాకు చెందిన బానోతు మోతి ప్రేమించుకున్నారు. ఇటీవల మోతి ముఖం చాటేశాడు. అతడిని నిలదీసిన ఫలితం లేకపోవడంతో రేణుక కుటుంబ సభ్యులు పెద్దమనుషులను ఆశ్రయించారు. వారు కూడా పెళ్లికి బదులుగా ఆమెకు రూ.40 వేలు నష్టపరిహారం ఇవ్వాలని, పెద్ద మనుషులకు ఖర్చల కోసం రూ.10 వేలు ఇవ్వాలని తీర్పు చెప్పారు. ఈ తీర్పుతో తీవ్ర మనస్తాపానికి గురైన రేణుక శుక్రవారం ఇంట్లో క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వర్ధన్నపేట ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
'డబుల్' ఇంటి కోసం ఆత్మహత్యాయత్నం
శంకరపట్నం : సర్కారు వారి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుల జాబితాలో తన పేరు లేదంటూ ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామానికి 20 డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించగా... అధికారులు 25 మంది పేర్లతో ఓ జాబితాను రూపొందించారు. దీనిపై చర్చించేందుకు శనివారం గ్రామసభ ఏర్పాటు చేశారు. జాబితాలో తన పేరు లేకపోవడంతో మనస్తాపం చెందిన పైడిపల్లి రేణుక (30) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోబోయింది. వెంటనే ఎంపీపీ విజయ ఆమె చేతిలోని పురుగుల మందు డబ్బా లాగేసుకున్నారు. జాబితాలో చోటు కల్పిస్తామని చెప్పి ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. -
పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య
నార్నూర్ మండలం ఖాండవ్ గ్రామంలో ఓ మహిళ గురువారం ఆత్మహత్య చేసుకుంది. ఖాండవ్ గ్రామానికి చెందిన జాదవ్ రేణుక(40) ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. పక్కింటి వారితో గొడవపడి మనస్తాపంతో ఆత్మహత్యకు చేసుకున్నట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కేటీఆర్ క్షమాపణ చెప్పాలి : రేణుకా
-
కీచక గురువు సస్పెన్షన్
ఉత్తర్వులు జారీ చేసిన డీఈవో కృష్ణారెడ్డి విచారణ చేపట్టిన ఉప విద్యాశాఖాధికారిణి రేణుక నక్కపల్లి : మండలంలో జానకయ్యపేట పాఠశాలలో విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఆమె ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తున్న కీచక గురువు ఈశ్వర్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవో కృష్ణారెడ్డి గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉదంతంపై జిల్లా ఉప విద్యాశాఖాధికారిణి సీవీ రేణుక గురువారం విచారణ చేపట్టారు. ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఈశ్వర్ తనను నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడంటూ పాఠశాలలో తొమ్మి దో తరగతి చదువుతున్న పెదతీనార్లకు చెందిన బాలిక గ్రామపెద్దల దృష్టికి తీసుకురావడంతో సర్పంచ్‌లు ఎరిపల్లి శ్రీను, కొర్లయ్య తదితరులు బుధవారం పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని నిలదీసిన సంగతి తెలి సిందే. ఈ వ్యవహారం పత్రికల్లో రావడంతో డీవైఈవో స్పందించి విచారణకు వచ్చారు. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. వివాహితుడైన ఉపాధ్యాయుడు కన్నబిడ్డలా చూడాల్సిన విద్యార్థినితో నీచంగా ప్రవర్తించడం సమంజసం కాదని, చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లితోపాటు ప్రజాప్రతినిధులు, మత్స్యకార సంఘ నాయకులు డిమాండ్ చేశారు. అందరి వాంగ్మూలాన్ని డీవైఈవో రేణుక నమోదు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులతో ఇలా ప్రవర్తించడం క్షమించరాని నేరమన్నారు. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించరాదన్నారు. విచారణ నివేదికను ఆమె ఉన్నతాధికారులకు అందజే యడంతో ఉపాధ్యాయుడు ఈశ్వర్‌పై డీఈవో చర్యలు తీసుకున్నారు. విచారణలో మత్య్సకార సంఘ నాయకులు శ్రీను, ముసలయ్య, కొర్లయ్య, బాలిక తల్లి బండమ్మ, హెచ్ఎం నూకరాజు పాల్గొన్నారు. రూ.5.35కోట్లతో అదనపు తరగతి గదులు నక్కపల్లి : జిల్లాలోని పాఠశాలల్లో వసతి సమస్య తీర్చేందుకు ఆర్‌ఎంఎస్‌ఏ మూడో విడత కింద రూ.5.35 కోట్లతో 151 తరగతి గదులను నిర్మిస్తున్న ట్లు ఉపవిద్యాశాఖాధికారిణి సీవీ రేణుక తెలిపారు. గురువారం ఆమె నక్కపల్లిలో విలేకర్లతో మాట్లాడుతూ వీటి నిర్మాణం వివిధ దశల్లో ఉందన్నారు. సర్వశిక్ష అభియాన్ పథకం ద్వారా 311 అదనపు తరగతి గదులు మంజూరయ్యాయని, వీటిలో 109 పూర్తయ్యాయన్నారు. ఈ ఏడాది కొత్తగా గణపర్తి, డి.ఎర్రవరం, పంచదార్లలో పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వచ్చాయని, ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని తెలిపారు. -
రాజయ్యకు నిరాశ
మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారుల సజీవ దహనం కేసులో రాజయ్య, ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్‌కుమార్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించింది. బెయిల్ పిటిషన్ పై గురువారం రెండవ అదనపు జిల్లా కోర్టు లో న్యాయమూర్తి రేణుక విచారణ చేపట్టారు. గత నెల 4న సారిక, ఆమె ముగ్గురు కుమారుల మతి ఘటనపై సుబేదారీ పోలీసుస్టేషన్లో నమోదైన కేసులో ప్రధాన నిందితుడు అనిల్‌కుమార్, రాజయ్య దంపతులు, సనా ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నసంగతి తెలిసిందే. బెయిల్ కోసం రాజయ్య, ఆయన భార్య గతంలోనే వేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది. ప్రధాన నిందితుడు అనిల్‌కుమార్ మొదటిసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, రాజయ్య దంపతులు రెండోసారి బెయిల్ కోసం జిల్లా కోర్టును ఆశ్రయించారు. కాగా, ఈ రెండు పిటిషన్లను విచారించిన కోర్టు తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. -
భర్తను నరికి.. శవాన్ని మూటగట్టి..
శివ్వంపేట: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే నెపంతో భర్తను నరికి చంపిందో భార్య. శవాన్ని మూటకట్టి ఆటోలో తరలించేందుకు యత్నిస్తూ పట్టుబడింది. మెద క్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం గ్రామానికి చెందిన ఎర్రోల్ల చెంద్రయ్య (50) రైతు. ఆయన భార్య రేణుక.. వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన రేణుక.. సోమవారం గొడ్డలితో చంద్రయ్య తలపై మోది హతమార్చింది. శవాన్ని సంచిలో మూటకట్టి ప్రియుడి సాయంతో ఆటోలో తరలించేందుకు పథకం వేసింది. బియ్యం తీసుకెళ్లాలంటూ ఆటోను అద్దెకు మాట్లాడింది. ఆటోలో బియ్యం సంచులతోపాటు మృతదేహం ఉన్న సంచిని వేస్తుండగా అందులో నుంచి రక్తం కారసాగింది. గమనించి ఆటోడ్రైవర్.. గ్రామస్తులకు తెలిపాడు. అక్కడికి చేరుకున్న గ్రామస్తులు అనుమానంతో మూటవిప్పి చూడగా చంద్రయ్య మృతదేహం బయటపడింది. ఈ సమాచారం అందుకున్న శివ్వంపేట ఎస్సై రాజేష్‌నాయక్ రేణుకను పోలీస్టేషన్‌కు తరలించారు. ఆమె ప్రియుడు పరారయ్యాడు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై చెప్పారు. -
పాము వెంటాడింది.. విధి వెక్కిరించింది
రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు దుర్మరణం నాగర్‌కర్నూల్ సమీపంలో దుర్ఘటన పాము వెంటాడింది.. విధి వెక్కిరించింది. పాము కరిచిందని ఓ తల్లి తన కన్నపేగును బతికించుకునేందుకు వైద్యం కోసం వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్తోంది. మరో పది నిమిషాలయితే తన కంటిరెప్పను కాపాడుకునేదేమో..! ఆ క్షణం ఆగితే కొడుకు దక్కేవాడేమో..! ఇంతలో యముడేదో తరిమినట్లు.. ఉరిమేదో ఉరిమినట్లు కారు రూపంలో మృత్యువు తల్లీబిడ్డను కబళించింది. ఒడిలో బిడ్డ.. ఆ కుమారుడిని అదిమిపట్టుకున్న తల్లి విగతజీవులుగా మిగిలారు. ఈ సంఘటన అందరి హృదయాలను కలిచివేసింది. నాగర్‌కర్నూల్ రూరల్: రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతిచెందిన సంఘటన బుధవారం నాగర్‌కర్నూల్ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు, బాధితుల కథనం మేరకు.. పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామానికి చెందిన పగిడాల రేణుక(35)కు ఒక్కగానొక్క కొడుకు రాంచరణ్(6)ను మంగళవారం రాత్రి నిద్రిస్తున్న స మయంలో పాము కరిచింది. ఉదయం చూసిన తల్లి తన కొడుకును అదేగ్రామంలో ఓ నాటువైద్యుడి వద్దకు తీసుకెళ్లి చూపించింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తుఫాన్ వాహనంలో తీసుకెళ్తోంది. నాగర్‌కర్నూల్ సమీపంలో రెడ్డి హోటల్ వద్ద నాగర్‌కర్నూల్ నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ఇండికా కారును వీరి వాహనం ఢీకొట్టింది. తుఫాన్ వాహనం ముందు ఎడమ వైపుటైరు ఊడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో రేణుక, ఆమె కొడుకు చరణ్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. రేణుక తల్లి బాలమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. తుఫాన్ వాహనం క్లీనర్, డ్రైవర్ పరారయ్యారు. ఈ సంఘటనపై నాగర్‌కర్నూల్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐ గురుస్వామి సంఘటన స్థలానికి వెళ్లి శవాలను పోస్టుమార్టం కోసం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
లిఫ్టు అడుగున మహిళ మృతదేహం
తిరువొత్తియూరు: చెన్నై కొత్వాల్ చావడిలోని ఓ అపార్టుమెంటు లిప్టు అడుగుభాగంలో మహిళ మృతదేహాన్ని సోమవారం పోలీసులు కనుగొన్నారు. చెన్నై కొత్వాల్ చావడి సాధిక్ వీధికి చెందిన సాధిక్ వీధికి చెందిన వ్యక్తి డేవిడ్ సింగ్ (45). ఇతను షావుకారుపేటలో బొమ్మల హోల్‌సేల్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతని భార్య రేణుక (40). శనివారం ఆలయానికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్ళిన రేణుక తిరిగి ఇంటికి రాలేదు. ఈమె బంధువులు ఈమె కోసం అన్ని చోట్ల గాలించినప్పటికీ రేణుక ఆచూకి తెలియలేదు. దీనిపై కొత్వాల్ చావడి పోలీసులకు డేవిడ్సింగ్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో రేణుక నివాసం వుంటున్న అపార్టుమెంటులో వున్న లిప్టు అడుగు నుంచి దుర్వాసన వెలువడింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేయగా రెండు రోజులుగా లిప్టు పని చేయడం లేదని తెలిసింది. దీంతో కార్మికులను పిలిపించి లిప్టు తొలగించి చూడగా లిప్టు కింద శరీరం నలిగిన స్థితిలో రేణుక శవంగా పడి ఉంది. ఇది చూసిన అక్కడి వారు దిగ్భ్రాంతి చెందారు. రేణుక లిఫ్టుకు అడుగు భాగంలోకి ఎందుకు వెళ్లింది, ఎలా మృతి చెందిందని పోలీసులు విచారణ చేస్తున్నారు. -
పేద విద్యార్థి చదువుకు సీఎం భరోసా
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఓ నిరుపేద విద్యార్థిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఔదార్యం చూపించారు. నగరంలోని మాదన్నపేటకు చెందిన రేణుక కూరగాయాల వ్యాపారి. ఆమె కుమారుడు రాకేశ్‌కుమార్ బీఫార్మసీలో 59.3 శాతం మార్కులు సాధించాడు. విదేశాల్లో చదివేందుకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. నిబంధనల ప్రకారం 60 శాతం మార్కులుంటేనే స్కాలర్షిప్ వస్తుంది. నిరుపేద విద్యార్థి రాకేశ్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సీఎం ప్రత్యేక అనుమతితో స్కాలర్షిప్ మంజూరు చేశారు. -
నమో శక్తి స్వరూపిణి
నేడు మహిళా దినోత్సవం అమ్మగా.. ఆలిగా.. ఉద్యోగినిగా.. సమర్థ అధికారిగా ‘ఆమె’ సేవలు అమేయం. ముదిత్ నేర్వరే ముద్దారగన్ నేర్పన్.. అంటూ అన్ని రంగాల్లో రాణించడం అతివలకు నల్లేరుపై నడక . ఒంటి చేత్తో ఏక సమయంలో విభిన్న పనులు చేసే నైపుణ్యం వారి సొంతం. అవసరమైతే ఆటో డ్రైవర్ కాగలదు .. మహిళల హక్కులపై పోరాటమూ చేయగలదు. బహుముఖ ప్రజ్ఞతో భాసిల్లే ఆదిశక్తీ నీకు వందనం.. నువ్వుంటేనే ఈ లోకం నందనం. యత్ర నార్యంతు పూజతే! తత్ర దేవతా రమంతే!! ‘ఆమె’ అభివృద్ధిలో కీలకం ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేవు పథకాల అవులు బాధ్యతలను ఓ మహిళా అధికారి సవుర్థంగా నిర్వహిస్తున్నారు. కుప్పం ప్రాంత అభివృద్ధి అథారిటీ (కడా) ప్రత్యేకాధికారి చక్కా ప్రియూంక అధికారులను పరుగెట్టిస్తూ సకాలంలో పనులను పూర్తి చేరుుస్తూ వుహిళా శక్తిని చాటుతున్నారు. వరంగల్ ఎన్ఐటీలో బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చేసిన ప్రియూంక రెండేళ్లపాటు సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేశారు. అమెరికాలోని న్యూయూర్క్లోని గోల్డ్‌మెన్ సాక్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో ప్రోగ్రాం అనలసిస్టుగా పనిచేశారు. పాలనాపరమైన ఉద్యోగంపై ఆసక్తి, నేరుగా ప్రజా సవుస్యల పరిష్కారంపై వుక్కువతో గ్రూప్-1 పరీక్షలు రాశారు. 2012 బ్యాచ్‌లో ఉత్తర్ణీత సాధించి అవులాపురంలో ఆర్డీగా చేరారు. వుదనపల్లి ఆర్డీవో కర్ణన్‌ను వివాహం చేసుకున్నారు. ప్రియూంక పనితీరు, నిర్ణయూల్లో వేగం, కింది స్థారుు అధికారులతో పని చేరుుంచే నేర్పు పాలకులకు నచ్చటంతో కుప్పంలో పని చేసే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. - శాంతి పురం డ్రైవింగ్‌లో దిట్ట.. వాహనాల డ్రైవింగ్ లో సాధారణంగా పురుషులే పనిచేస్తుంటారు. ఇందు కు భిన్నంగా ఓ మహిళ డ్రైవింగ్ లో శిక్షణ ఇస్తోంది. ఆమే సాయి డ్రైవింగ్ స్కూల్ యజమాని రేణుక (చిట్టి). భర్త సుబ్రమణ్యంరెడ్డి సహకారంతో డ్రైవింగ్ స్కూల్ నిర్వహిస్తోంది. పదేళ్లుగా వందలాది మందికి డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తుంది. డ్రైవింగ్‌తోపాటు సేవా కార్యక్రమాల్లో రాణిస్తోంది. కళ్లకు గంతలు కట్టుకుని రెండు కిలోమీటర్లు డ్రైవింగ్ చేసి పలువురి మన్ననలు పొందింది. - మదనపల్లె డ్రైవింగే నా ఊపిరి.. పదేళ్లుగా పైగా వందలాది మంది మహిళలు, విద్యార్థులు, యువతులకు డ్రైవింగ్ శిక్షణ ఇచ్చాను. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రధాన రహదారులు, ఖాళీ స్థలాల్లో శిక్షణ ఇస్తున్నాను. నా వద్ద డ్రైవింగ్ నేర్చుకున్న వారు విదేశాల్లో ఉపాధి పొందుతున్నారు. డ్రైవింగ్‌నే ఊపిరిగా భావిస్తున్నాను. ఇదే నాకు ఉపాధి. - రేణుక (చిట్టి) మహిళా హక్కులే ఊపిరిగా.. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను చైతన్యపరిచి మహిళా హక్కులపై అవగాహనతో సంఘటిత పరిచారు. వారి హక్కుల సాధన కోసం 25 ఏళ్లుగా అలుపెరగని పోరాటం. మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రతిభను చాటి ప్రశంసలతో గుర్తింపు పొందారు. ఇందుకు పలు సంస్థలు అవార్డులు అందజేశారు. ఆమె మదనపల్లె ఫోర్డు సంస్థ డెరైక్టర్ జల్లా లలితమ్మ. చదువుకునే రోజుల నుంచి మహిళా హక్కుల సాధనకు పలు ఆలోచనలు సాగించేవి. ఈ క్రమంలో 1992లో తంబళ్లపల్లెలో పీపుల్స్ ఆర్గనైజేషన్ రూరల్ డెవలప్మెంట్ (ఫోర్డు) స్వచ్ఛంద సంస్థను స్థాపిం చారు. ప్రదానంగా మహిళలు, పిల్లల హక్కులు, వారిలో చైతన్యవంతులు చేయడం, వారి సమస్యలు వారే పరిష్కరించుకునే విధంగా నాయకత్వం పెంపొందించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం దాదాపు 25 మండలాల్లో సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. లలితమ్మ కృషికి 2014 డిసెంబర్లో డాక్టర్ అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు దక్కింది. 2007లో నేపాల్‌లో నిర్వహిం్చన నాయత్వం చర్చావేదికలో పాల్గొన్నారు. ఏపీ బాలల హక్కుల ప్రజాధ్వని రాష్ట్ర అధ్యక్షురాలిగా, ఏపీ మహిళా వేదిక రాయలసీమ కార్యదర్శిగా పని చేస్తున్నారు. - మదనపల్లె సిటీ -
భర్త బారినుంచి కాపాడాలని ఫిర్యాదు
హొసూరు: పెళ్లి చేసుకొని మోసగించి, తన పేరు మీద ఉన్న ఆస్తిని తాకట్టు పెట్టి రూ.లక్ష, నగలు కాజేసి, మరో అమ్మాయిని పెళ్లి చేసుకొన్న తన భర్త నుంచి కాపాడి డబ్బు, నగలు ఇప్పించి న్యాయం చేయాలని ఓ మహిళ హొసూరు మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన శనివారం చోటు చేసుకొంది. ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. హొసూరు యూనియన్ ప్యారండపల్లి సమీపంలోని గాంధీనగర్‌లో నివసిస్తున్న క్రిష్ణప్ప కొడుకు మంజునాథ్ 2012లో రేణుకను పెళ్లి చేసుకొన్నాడు. ఈ పెళ్లికి ముందే మరో ఇద్దరు అమ్మాయిలతో పెళ్లిళ్లు చేసుకున్నాడు. విషయం తెలియక రేణుక మళ్లీ పెళ్లి చేసుకుంది. ఆమెకు ఆడపిల్ల పుట్టి ఐదు నిమిషాలకే మరణించింది. వ్యాపారం కోసం ఆర్థికంగా సాయం చేయమని డిమాండ్ చేయడంతో తల్లిదండ్రులు ఇచ్చిన ఎకరం నేల తాకట్టు పెట్టి లక్షరూపాయలు వడ్డీకి తీసిచ్చింది. బంగారు నగలు కూడా ఇచ్చానని, గత కొద్ది రోజుల నుంచి వదలి వెళ్లిపోయాడని, మొబైల్‌కు ఫోన్ చేస్తే మరోఅమ్మాయి మాట్లాడుతోందని రేణుక వివరించింది. తన భర్తతో నీకేం పని అని ఆ మహిళ బెదరిస్తోందని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
ప్రవక్త మార్గం..అనుసరణీయం
కర్నూలు ఓల్డ్‌సిటీ: ఇస్లాం పవిత్రతను మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి చాటిచెప్పారని, శాంతి, సామరస్యాలతో జీవనం సాగించాలని ఉద్బోధించారని, ఆయన మార్గం అనుసరణీయమైనది కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక అన్నారు. మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజును పురస్కరించుకుని మిలాద్ ఉన్ నబీ పండగను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. మిలాద్ కమిటీ అధ్యక్షుడు బి.ఇంతియాజ్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో భారీ ఊరేగింపు (మిలాద్ జులూస్) నిర్వహించారు. నగరంలోని పలు వీధుల నుంచి బయలుదేరిన మిలాద్ జులూస్‌లు కూడా స్థానిక రాజ్‌విహార్ సెంటర్లో కలుసుకున్నాయి. రాజ్‌విహార్ సెంటర్లోని జుల్ఫీషా, చందేషా దర్గాలో మిలాద్ పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. లతీఫ్ లావుబాలీ దర్గా పీఠాధిపతి సయ్యద్‌షా అబ్దుల్లా హుసేని బాద్షా ఖాద్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ బుట్టా రేణుకతో పాటు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ సీఈసీ మెంబర్ హఫీజ్ ఖాన్, మైనారిటీ నాయకులు బి.జహీర్‌అహ్మద్‌ఖాన్, కాంగ్రెస్ పార్టీ మైనారిటీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు అహ్మద్‌అలీఖాన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ.. రంజాన్ నెలలో భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు ఉండటం, పేదలకు దానం చేసి పుణ్యం కట్టుకోవడం వంటి సత్కర్యాలు అభినందనీయమన్నారు. రంజాన్ నెల నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందని, ఇందులో మాటలతో కాకుండా చేతలతో చూపించే తత్వం ఉందన్నారు. ఇక్కడి హిందూ ముస్లింల మధ్య మంచి వాతావరణం ఉందని, ఈ ప్రాంతపు ఎంపీ కావడం తన అదృష్టమని బుట్టారేణుక పేర్కొన్నారు. అనంతరం కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. యుద్ధంలో సైతం నీతిని పాటించిన వ్యక్తి మహమ్మద్ ప్రవక్త అని, ఆయన దువా సౌభాగ్యం కలగడాన్ని ఆదమ్ అలై సలాం కూడా గర్వించారని తెలిపారు. ప్రతి ముస్లిం ఆయన చూపిన మార్గంలో నడుచుకోవాలన్నారు. అసలైన ముస్లింలు హాని తలపెట్టరని, ఉగ్రవాదం వేరు, ఇస్లాం వేరని, ఉగ్రవాదాన్ని ముస్లింలకే అంటగట్టడం చాలా తప్పు అని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ ఏమతం కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదని, ఇస్లాం మతస్తులు ఉగ్రవాదులు కారని, అలాంటి అభిప్రాయం తప్పని తెలిపారు. ప్రవక్త శాంతినే కాంక్షించారని, ఆయన చూపిన మార్గంలో ముస్లింలు నడుచుకోవాలని సూచించారు. ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకోవాలని, ఇలాంటి సంప్రదాయం కర్నూలులో ఉండటం అదృష్టమని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో లావుబాలీ దర్గా సజ్జాదే నషీన్ ఆరిఫ్ పాషా ఖాద్రి, అహ్లె సున్నత్ జమాత్ జిల్లా అధ్యక్షుడు షఫిబాష ఖాద్రి, రోజా దర్గా పీఠాధిపతులు అన్వర్‌బాష ఖాద్రి, సయ్యద్ మాసుంపీర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటిపంట’ స్ఫూర్తితో... మేడపైనే పండ్లు, కూరగాయలు!
ఆదిలాబాద్ పట్టణానికి చెందిన గృహిణి రేణుక తమ మేడపైన పచ్చని ఫుడ్ ఫారెస్ట్‌ను సృష్టించారు. వ్యవసాయ శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న ఆమె ‘ఇంటిపంట’ స్ఫూర్తితో ఆర్గానిక్ కిచెన్ గార్డెన్ ప్రారంభించారు. తమ కుటుంబం కోసం ఆరోగ్యదాయకమైన పండ్లు, కూరగాయలను పండిస్తున్నారు. అప్పుడప్పుడూ ఇరుగు పొరుగు వారికీ రుచిచూపిస్తున్నారు. ఈ టై తోటను మెచ్చిన ‘చిన్న పిచ్చుక’ అందులోనే ఓ బుజ్జి గూడు కట్టుకుని.. సంతానం వృద్ధి చేసుకుంది! ఆదిలాబాద్‌లోని ద్వారకానగర్‌లో వ్యాపారి అరుణ్‌కుమార్ ఖత్రి (9849267774), రేణుక ఖత్రి కుటుంబం మూడంతస్తుల సొంత భవనంలో నివాసం ఉంటోంది. బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకొని గృహిణిగా జీవనం కొనసాగిస్తున్న రేణుకకు పూల మొక్కలంటే ఇష్టం. అయితే, నాలుగేళ్ల క్రితం ‘సాక్షి’లో ఇంటిపంట కాలమ్ చదివిన తర్వాత ఆమె దృష్టి సేంద్రియ ఇంటిపంటల వైపు మళ్లింది. హైదరాబాద్ కల్యాణ్‌నగర్‌కు చెందిన వేగేశ్న రామరాజు గారి టై గార్డెన్‌పై కథనం చదివి.. స్వయంగా వెళ్లి చూసి స్ఫూర్తి పొందానని ఆమె తెలిపారు. అప్పటి నుంచి తమ మేడ మీద సేంద్రియ పద్ధతుల్లో పండ్లు, కూరగాయలు సాగు చేయడం ప్రారంభించారు. ‘ఇంటిపంట’ కాలమ్ అందిస్తున్న మెలకువలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయన్నారు. కాంక్రీటు మేడల మధ్య వీరి టై పచ్చగా అలరారుతోంది. 100 చదరపు గజాల టైపై 25 ప్లాస్టిక్ డ్రమ్ములు, 40 మట్టి కుండీలు ఏర్పాటు చేసి రేణుక నిక్షేపంగా ఇంటిపంటలు పండిస్తున్నారు. నల్లమట్టి, ఎర్రమట్టి, ఆవు పేడ ఎరువు, వరిపొట్టు, వేపపిండి, వర్మీకంపోస్టుతో కూడిన మట్టి మిశ్రమాన్ని వాడుతున్నారు. సీతాఫలం, జామ, నిమ్మ, బత్తాయి, దానిమ్మ, అల్లనేరేడు, ఉసిరి, సపోట, మామిడి, రేగు తదితర 15 రకాల పండ్ల చెట్లతోపాటు వివిధ కూరగాయ మొక్కలు, ఔషధ, సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన మొక్కలను సేంద్రియ పద్ధతుల్లో పెంచుతున్నారు. రెండేళ్లుగా సొంత పండ్లు, సొంత కూరగాయలపైనే ఎక్కువగా వాడుతున్నామని రేణుక వివరించారు. వంటింటి వ్యర్థాలతో తయారైన కంపోస్టుతోపాటు జీవామృతాన్ని సొంతంగా తయారు చేసి కిచెన్ గార్డెన్‌కు 15 రోజులకోసారి వాడుతున్నారు. నాటు విత్తనాలతోనే టమోటా, గోరుచిక్కుడు, మిరప, చిక్కుడు, బీర, కాకర, వంగ, బెండ, చేమగడ్డ, మునగ, గోంగూర, కొత్తిమీర, మెంతికూర, ఇతర ఆకుకూరలు సాగు చేస్తున్నారు. తమ ఇంటిపంటను అప్పుడప్పుడూ ఇరుగు పొరుగుకీ పంచుతున్నారు. భర్త సహాయ సహకారాల్లేకుండా ఇంటిపంటల సాగు సాధ్యమయ్యేది కాదని, ఆయన తోడ్పాటుతోనే హైదారాబాద్, కడియం నర్సరీల నుంచి కోరుకున్న మొక్కలు తెప్పించుకుంటున్నానన్నారు రేణుక. సంధ్యా సమయాల్లో టై తోట పక్షుల కిలకిలారావాలతో సందడిగా ఉంటుంది. పల్లెటూరు వాతావరణాన్ని తలపిస్తూ మానసికోల్లాసాన్ని కలిగిస్తోందన్నారు రేణుక. గత ఏడాది నాగమల్లి చెట్టుపై చిన్న పిచ్చుకలు గూడు పెట్టడం.. మూడు పిల్లల్ని చేయడం.. తమ ‘ఇంటిపంట’లో మరువలేని మధుర జ్ఞాపకంగా మిగిలిందని ఆమె తృప్తిగా చెప్పారు. - కొండా శ్రీనివాస్, ఆదిలాబాద్ -
పక్కనే ఉంటూ ప్రాణాలు తీశారు
సిద్దిపేట పట్టణంలో ఇటీవల ఓ మహిళ దారుణంగా హత్యకు గురైంది. దుండగులు ఆ మహిళను నిజామాబాద్ జిల్లా కామారెడ్డి సమీపంలోని అడవిలో పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ సంఘటనకు సంబంధించి సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఓ జంటపై అనుమానం కలిగి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తాము చేసిన నేరాలన్నీ ఒక్కొక్కటికీ చెప్పారు. ఈ కే సుకు సంబంధించిన వివరాలను సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శనివారం సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. సిద్దిపేట మండలం నారాయణరావుపేటకు చెందిన మహ్మద్ అబ్దుల్ సలీం (43)కు 20 ఏళ్ల క్రితం కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట గ్రామానికి చెందిన మహిళతో వివాహమైంది. వీరికి నలుగురు కుమారులు కాగా, అందరూ కలిసి పట్టణంలోని సుభాష్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే సలీంకు ఎనిమిదేళ్ల క్రితం మండలంలోని ఇర్కోడ్ గ్రామానికి చెందిన మల్లవ్వతో పరిచయం ఏర్పడడంతో అది కాస్త ప్రేమగా మారి మల్లవ్వను రెండో భార్యగా వివాహం చేసుకున్నాడు. డ్రైవర్‌గా పని చేస్తున్న సలీంకు ఇద్దరు భార్యలతో పాటు పిల్లలను పోషించడం కష్టమైంది. ఈ విషయాన్ని రెండో భార్య మల్లవ్వతో చర్చించాడు. ఎలాగైనా సులభంగా డబ్బులు సంపాదించాలని అనుకున్నారు. సలీం ఒక రోజు న్యూస్ పేపర్లో చదువుతుండగా, గుర్తు తెలియని మహిళను కొందరు వ్యక్తులు హత్య చేసి కాల్చి బూడిద చేసిన వార్త కనిపించింది. ఈ కథనానికి ప్రభావితుడైన సలీం, ఇదే మార్గంలో డబ్బు సంపాదించాలని భావించాడు. ఈమేరకు బంగారం ధరించి ఉన్న మహిళలను టార్గెట్‌గా ఎంచుకుని వారి ఒంటిపై ఉన్న ఆభరణాలను కాజేయాలని రెండోభార్య మల్లవ్వతో కలిసి పథకం పన్నాడు. 2008 జూలైలో తొలిహత్య పట్టణంలోని సుభాష్‌నగర్‌లో ఉంటున్న సలీం, మల్లవ్వలు పొరుగింట్లో ఉంటున్న ఎర్రగుంట్ల రేణుక, తమ కుటుంబంలో ఉన్న గొడవలను మల్లవ్వకు చెప్పింది. అయితే ఎలాగైనా సరే రేణుక మెడలో ఉన్న బంగారం గొలుసును కాజేయాలని సలీం దంపతులు భావించారు. తమకు తెలిసిన వ్యక్తులను పురామాయించి నీ భర్తను చంపిస్తామని రేణుకను నమ్మించారు. ఈ క్రమంలోనే రేణుక ఇంట్లో ఎవరూ లేని సమయంలో సలీం, మల్లవ్వలు ఆమెను ఓ బైక్‌పై ఎక్కించుకుని కరీంనగర్ జిల్లా పరిధిలో మల్లారం గుట్టల వద్ద తీసుకెళ్లారు. మల్లవ్వ, రేణుకలు మాట్లాడుతున్న సమయంలో సలీం తనతో పాటు తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో రేణుక తలపై బలంగా కొట్టి చంపేసి, ఆమె మెడలో ఉన్న బంగారం తీసుకున్నాడు. అనంతరం రేణుకపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. రేణుక వద్ద తీసుకున్న బంగారం అమ్మగా వచ్చిన డబ్బులతో సలీం ఆటో కొనుగోలు చేశాడు. రెండో హత్య 2010 జూలైలో ఇలా.. అదే కాలనీకి చెందిన దేవమ్మ.. మల్లవ్వతో మాట్లాడేందుకు ఇంటికి రాగా, సలీం వెనుక నుంచి వచ్చి ఇనుప రాడ్‌తో దేవమ్మ తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం ఆమె మెడలోని పుస్తెల తాడు, చెవి కమ్మలు స్వాధీనం చేసుకుని అదే రోజు రాత్రి సలీం తన ఆటోలో సిద్దిపేట మండలం ఇర్కోడ్ శివారులోకి తీసుకెళ్లి డీజిల్ పోసి దేవమ్మ మృతదేహాన్ని తగలబెట్టారు. మూడో హత్య 2010 నవంబర్‌లో ఇలా.. సలీం భార్య మల్లవ్వకు బాగా తెలిసిన గుడిశెట్టి శోభ తరచూ ఇంటికి వస్తుండేది. ఈ క్రమంలో ఓ రోజు శోభ ఇంటికి రాగా, సలీం ఇంట్లో ఉన్న రోకలిబండతో శోభ తలపై కొట్టి హత్య చేసి, రెండు తులాల గొలుసు తీసుకుని మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో కట్టేశాడు. అర్ధరాత్రి సమయంలో కరీంనగర్ జిల్లా వేములవాడ దారిలో రోడ్డు పక్కన ఉన్న ఈత వనంలో పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. నాలుగో హత్య 2011 మార్చిలో.. పట్టణంలో నసర్పురాలో ఉంటున్న రాజవ్వ మార్కెట్లో పని చేసేది. అక్కడ లభించిన కందులు, ఉలువలను ఇంటింటికీ తిరుగుతూ అమ్ముకునేది. ఈ క్రమంలో రాజవ్వ వద్ద సలీం మల్లవ్వ దంపతులు ఉలవలు కొనేవారు. అయితే ఓసారి ఉలువల పైసలు కొన్ని బాకీ పడ్డారు. రాజవ్వ ఉలువల పైసల కోసం ఓ రోజు వీరి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో సలీం ఆమెను టవల్‌తో గొంతు నులిమి చంపేశారు. ఆమె ఒంటిపై ఉన్న నగలు, డబ్బులు తీసుకున్నాడు. అనంతరం తన కుమారుడు నడుపుతున్న కారును తెచ్చి అర్ధరాత్రి కారులో మృతదేహాన్ని తీసుకుని నిజామాబాద్ జిల్లా కామారెడ్డి సమీపంలోని దగ్గరలో ఉన్న అడవిలో పెట్రోల్ పోసి నిప్పంటించారు. ప్రాణాలు దక్కించుకున్న ఇంద్రమ్మ.. మార్చి నెలలోనే ఓ రోజు ఉదయం 5 గంటలకు ఇంద్రమ్మ మెదక్ రోడ్డుకు తన ఇంటి ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా సలీం రాడ్‌తో తలపై కొట్టాడు. మెడలో ఏం లేకపోవడంతో ఆమె చేతిలో ఉన్న సంచి వెతకగా బంగారు గొలుసు లభించింది. దీంతో గొలుసును తీసుకున్న సలీం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంద్రమ్మకు తలకు బలమైన గాయంకావడంతో స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించడంతో చికిత్స చేయగా ప్రాణాలు దక్కాయి. ఐదో హత్య 2014 నవంబర్ 3న.. ఇర్కోడ్ గ్రామానికి చెందిన నాగభూషణం రెండో భార్య గౌరిశెట్టి పుష్ప సరస్వతి నగర్లో నివాసముంటోంది. ఈ క్రమంలో సలీం భార్య మల్లవ్వతో పుష్పకు స్నేహం ఏర్పడింది. పుష్ప తన తన ఇంట్లోని గొడవల గురించి మల్లవ్వ, సలీంలకు చెప్పేది. నీ భర్త నీ మాట వినేలా చేస్తామని పుష్పను సలీం, మల్లవ్వలు నమ్మించారు. ఓ రోజు ఇంటికి పిలిచి నీ బాధలు పోవాలంటే దీపానికి మొక్కాలని సూచించారు. దీపానికి మొక్కుతున్న పుష్పను సలీం రాాడ్తో కొట్టి హత్య చేశారు. ఎప్పటిలాగే అర్ధరాత్రి మృతదేహాన్ని కారులో నిజమాబాద్ జిల్లా కామారెడ్డి సమీపంలోని అడవిలో పెట్రోల్ పోసి తగలబెట్టారు. పుష్ప మిస్సింగ్‌పై నాగభూషణం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు పుష్పకు సన్నిహితులుగా ఉన్నవారిపై నిఘా పెట్టారు. ఆ రోజు పుష్ప సలీం ఇంటికి వెళ్లినట్లు స్థానికుల ద్వారా తెలుసున్న పోలీసులు తమదైన శైలిలో వారిని విచారించగా ఈ వరుస హత్యల బాగోతం బయటపడిందని డీఎస్పీ వెల్లడించారు. బంగారం.. వాహనాలు స్వాధీనం.. సలీం మల్లవ్వ దంపతులు వరుసుగా ఐదు హత్యలు, ఓ దోపిడీ చేశారు. వీరి వద్ద నుంచి 13.50 తులాల బంగారం, 12 తులాల వెండి నగలతో పాటు హత్యలకు ఉపయోగించిన రాడ్, రోకలి బండ, ఓ బైక్, ఓ కారు, ఓ ఆటోను సీజ్ చేశారు. నిందితులను కోర్టుకు తరలించారు. సిబ్బందికి అభినందన.. రివార్డులు.. వరుస హత్యల మిస్టరీని ఛేదించిన వన్‌టౌన్ సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్ఐ సత్యనారాయణలతో పాటు ఐడీ పార్టీ సిబ్బంది బాల్‌రెడ్డి, వేణుగోపాల్, శ్రీనివాస్, మల్లేశంలను సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ అభినందించారు. ఐడీ పార్టీ సిబ్బంది రివార్డులు అందజేశారు. -
కిరాతకం...
భార్యను చంపిన భర్త బెల్టుతో ఉరేసి.. ఆత్మహత్యగా చిత్రీకరణ చైతన్యపురి: బెల్టుతో మెడకు ఉరేసి భార్యను హతమార్చి.. ఆపై మూర్ఛతో చనిపోయిందని నమ్మించేందుకు యత్నించాడో కిరాతక భర్త. మృతురాలి మెడపై ఉన్న గాట్లును గమనించి బంధువులు అనుమానం వ్యక్తం చేయడంతో అసలు విషయం బయటపడింది. సరూర్‌నగర్ పోలీసులు, మృతురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం... నల్లగొండజిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడకు చెందిన యాదయ్య, బాసమ్మ దంపతుల కుమార్తె రేణుక(26)కు విజయవాడకు చెందిన ప్రసాద్‌తో 8 ఏళ్ల క్రి తం పెళ్లైంది. ప్రస్తుతం వీరు సరూర్‌నగర్ హుడా కాంప్లెక్స్‌లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ప్రసాద్ ఓ బ్యాంక్‌లో ఔట్సోర్సింగ్ ఉద్యోగి. రేణుక తమ్ముడు వెంకటేశ్ (15) వీరి ఇంట్లోనే ఉంటున్నాడు. ప్రసాద్ మంగళవారం మధ్యాహ్నం బావమరిదిని పనిపై కూకట్పల్లి పంపించాడు. కొద్దిసేపటి తర్వాత భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆవేశానికి గురైన ప్రసాద్ భార్య మెడకు బెల్టుతో ఉరిబిగించి బయటకు వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన బావమరిది తన అక్కను లేపినా కదలక పోవటంతో బావకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఇద్దరూ ఆమెను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. బావమరిదితోనే మామకు ఫోన్ చేయించి, పిట్స్ రావడంతో రేణుక చనిపోయిందని చెప్పించాడు. సాయంత్రం 6 గంటలకు మృతదేహాన్ని కారులో శివన్నగూడకుతీసుకెళ్లాడు. మృతదేహాన్ని పరిశీలించిన తల్లిదండ్రులకు రేణుక మెడపై గాయాలు కనిపించాయి. అల్లుడిని నిలదీయగా సరైన సమాధానం చెప్పలేదు. దీంతో మృతదేహాన్ని రాత్రి 11 గంటకు తిరిగి హుడా కాంప్లెక్స్‌కు తీసుకొచ్చి సరూర్‌నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రసాద్‌కు మరో యువతితో ఉన్న వివాహేతర సంబంధం కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని మృతురాలి బంధువులు పోలీసులకు తెలిపారు. అల్లుడు ప్రసాద్ అతని సోదరి జ్యోతి కలిసి గతంలో రెండు పర్యాయాలు రేణుకను హత్య చేయటానికి యత్నించారని, ఇప్పుడు ఇంట్లో ఎవరూలేని సమయంలో గొంతు నులిమి చంపేశారని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బుధవారం రేణుక మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. ప్రసాద్‌ను విచారించగా తానే హత్య చేసినట్టు అంగీకరించినట్టు తెలిసింది. కాగా, హత్యా నేరం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రజలను మభ్యపెట్టొద్దు
ఎమ్మిగనూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టత లేని విధానాలతో ప్రజలను మభ్యపెట్టాలనుకుంటే చూస్తూ ఊరుకోబోమని కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు బుధవారం ఎమ్మిగనూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని హామీలతో రాజకీయాల్లో తాత్కాలిక ప్రయోజనం పొందినా.. అంతిమంగా ప్రజల విశ్వాసం కోల్పోక తప్పదన్నారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన అనుభవంతో రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతల రుణాలను మాఫీ చేస్తానని ప్రకటించి గద్దెనెక్కిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చడం తగదన్నారు. కమిటీల పేరిట కాలయాపన చేస్తూ.. రోజుకో ప్రకటనతో గందరగోళం సృష్టిస్తున్న టీడీపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్ర విభజనతో ఇప్పటికే రాయలసీమ, ఆంధ్ర ప్రాంతానికి తీరని నష్టం జరిగిందని.. ఈ పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి అందరినీ నిరాశ నిస్పృహలకు గురి చేస్తున్నారన్నారు. ఆయన మాటలు నమ్మి మోసపోయిన రైతులు, మహిళలకు రుణాల వడ్డీ తలకు మించిన భారమవుతోందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వారి బాధలను అర్థం చేసుకుని హామీలపై స్పష్టతనివ్వాలన్నారు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమంతో ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. అర్హులైన నిరుపేదలను సంక్షేమ పథకాలకు దూరం చేస్తూ టీడీపీ వర్గీయులకు కట్టబెట్టడం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. తానిచ్చిన హామీలపై చంద్రబాబు పునరాలోచించుకుని అమలు దిశగా అడుగులు వేయాలని.. లేదంటే భవిష్యత్‌లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మరిన్ని ఉద్యమాలు చేపట్టి ప్రజలకు అండగా నిలుస్తామన్నారు. -
కట్టుకున్నోడే కడతేర్చాడు
గజ్వేల్ : డబ్బు కోసం కట్టుకున్న భార్యను ఓ భర్త కడతేర్చాడు. భార్య ముఖంపై దిండు ఉంచి ఊపిరాడకుండా చేసి .. చీరతో ఉరేసి అంత్యంత కిరాతంగా హతమార్చాడు. ఈ సంఘటన గజ్వేల్ పట్టణంలో గురువారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది.. వివరాలిలా ఉన్నాయి. రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన ఎం శ్రీనివాస్ (34)కు నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన రేణుక (28)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి సందర్భంగా రూ. 2 లక్షల నగదు, బంగారు ఆభరణాలు కట్నం కింద ఇచ్చారు. వీరికి దీక్షిత (3), ధీరజ్ (10 నెలలు) లు ఉన్నారు. గజ్వేల్ మండలం కొడకండ్లలోని 400 కేవీ సబ్‌స్టేషన్‌లో వైర్మన్గా కాంట్రాక్ట్ ఉద్యోగం రావటం వల్ల భార్యాపిల్లలతో కలిసి గజ్వేల్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య కలతలు మొదలయ్యాయి. పుట్టింటి నుంచి డబ్బులు తెచ్చి ఇవ్వాలని శ్రీనివాస్ రేణుకను తరుచూ వేధిస్తుండేవాడు. అంతేకాకుండా మద్యం పీకల దాక సేవించి శారీరకంగా హింసించేవాడు. ఈ విషయంలో ఎన్నోసార్లు గొడవలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో కుమార్తె రేణుకను అల్లుడు వేధించినప్పుడల్లా రూ. 10 వేల వరకు అప్పగించేవారు. వీటితో కొంతకాలం బాగానే ఉంటూ తిరిగి డబ్బుల కోసం గొడవపెట్టేవాడు. కొన్ని రోజుల క్రితం రూ. 50 వేలు కావాలని డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని రేణుక తల్లిదండ్రులకు వివరించింది. దీంతో రూ. 10 వేల ఇచ్చి వెళ్లారు. అయినా తనకు ఈ డబ్బులు సరిపోవని హింసించడం మొదలుపెట్టాడు. ఈ విషయంలో బుధవారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో రేణుకను దిండుతో నోటిని కుక్కి ఊపిరాడకుండా చేయడమే కాకుండా చీరతో ఊరేసి హతమార్చాడు. ఆ తర్వాత ఇంటికి గడియపెట్టి పిల్లలను తీసుకుని బయటకు వచ్చాడు. రాత్రి పది గంటల వరకు రోడ్డుపైనే తిరిగాడు. ఆ తర్వాత అక్కన్నపేటలోని తన తల్లిదండ్రులతో పాటు ఇతర కుటుంబీకులకు శ్రీనివాస్ ఫోన్ ద్వారా సమాచారమిచ్చాడు. దీంతో వారు ఇక్కడికి చేరుకుని పిల్లలను తమ వద్దకు తీసుకున్నారు. ఆ తర్వాత 12 గంటల ప్రాంతంలో శ్రీనివాస్ నేరుగా పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లి జరిగిన విషయం చెప్పి లొంగిపోయాడు. దీంతో అదే రాత్రి సీఐ అమృతరెడ్డి, ఎస్ఐ జార్జిలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సమాచారాన్ని మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబీకులకు అందించారు. తెల్లవారుజామున వారు ఇక్కడికి చేరుకుని బోరున విలపించారు. ఈ సందర్భంగా రేణుక తండ్రి లింగయ్య విలేకరులతో మాట్లాడుతూ ఎంతో కాలంగా నా బిడ్డను డబ్బుల కోసం ఇబ్బంది పెడుతున్నా.. మారుతాడోమేనని అనుకున్నాం.. ఎన్నోసార్లు అడిగి కాడికి డబ్బులిచ్చాం.. గిప్పుడు ప్రాణాలే తీసిండు.. అంటూ రోదించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అమృతరెడ్డి తెలిపారు. ఇదిలావుంటే అభం శుభం తెలియని చిన్నారులు దీక్షిత, ధీరజ్‌లు పిన్న వయసులో కన్నతల్లిని కోల్పోవడం పలువురిని కలచి వేసింది. చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ప్రాణం తీసిన మొబైల్ వ్యసనం
* శ్రుతిమించిన సంభాషణలతో నిత్యం దంపతుల మధ్య గొడవ * భార్యను హత్య చేసిన భర్త * అలవాటు మార్చుకోలేక ప్రాణాలు పోగొట్టుకున్న వివాహిత * నిందితుడి అరెస్ట్ బెంగళూరు : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే క్రమంలో కొంత విచక్షణ ఉండాలి. అది మనకు ఎంత వరకు ఉపయోగకరమో అంతవరకే దానిని వినియోగించుకోవాలి. శ్రుతి మించితే ఎంతటి అనర్థానికైనా దారితీస్తాయన డానికి ఇదో ఉదాహరణ. తరచూ గంటల తరబడి భార్య మొబైల్లో మాట్లాడటం సహించని భర్త ఆమెను హత్య చేసిన సంఘటన ఇక్కడి ఇక్కడి రాజగోపాలనగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. యాదగిరికి చెందిన రేణుకా (20) ఆదివారం రాత్రి హత్యకు గురైంది. ఈమె భర్త సైమన్ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని సోమవారం పోలీసులు చెప్పారు. వివరాలు... ఇరుగుపొరుగు ఇళ్లల్లో ఉండే సైమన్, రేణుకా ప్రేమ వివాహం చేసుకున్నారు. అన ంతరం బెంగళూరు చేరుకుని రాజగోపాలనగరలోని సంజీవిని నగరలో నివాసం ఉంటున్నారు. సైమన్ ఇక్కడి ఓ ఫ్యాక్టరీలో పనికి కుదిరాడు. ఇదిలా ఉంటే మొబైల్లో మాట్లాడటమే వ్యసనంగా మారడంతో తరచూ రేణుకను సైమన్ హెచ్చరించేవాడు. భార్యకు ఎప్పుడు ఫోన్ చేసిన కూడా ఎవరితోనో మాట్లాడుతూ ఉండేది. గంటల తరబడి సంభాషిస్తుండటంతో తరచూ భర్త అసహనానికి గురయ్యేవాడు. ఈ విషయంపై భర్తకు సరైన సమాధానం ఇచ్చేది కాదు. ఇదే విషయంలో గత నెల నుంచి దంపతుల మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. ఆదివారం రాత్రి దంపతులు గొడవపడ్డారు. ఆ సమయంలో సహనం కోల్పోయిన సైమన్ కత్తి తీసుకుని భార్య గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు. సోమవారం ఉదయం విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో పరిలించిమతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. బంధువు ఇంటిలో తలదాచుకున్న సైమన్ను పోలీసులు అరెస్టు చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి దర్యాప్తు చేస్తున్నామని సోమవారం పోలీసులు తెలిపారు. -
బిటెక్ లవ్‌స్టోరీ మూవీ స్టిల్స్
-
మందలించాడని..‘మండి’పోతివా బిడ్డా!
ఉపాధ్యాయుడు తప్పుపట్టాడని టెన్ విద్యార్థిని ఆత్మాహుతి ‘ఏ తప్పూ చేయలేదు.. క్షమించండి’ అని సూసైడ్ లెటర్ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన బంధువులు, స్థానికులు మృతదేహంతో రాస్తారోకో, నిర్భయ చట్టం కేసుకు డిమాండ్ కొత్తపేట :ఓ ఉపాధ్యాయుడు పెడుతున్న మానసిక హింసను తప్పించుకోవడానికి మరణమే శరణ్యమనుకుందా బాలిక. నోట్స్ రాయాల్సిన కలంతో సూసైడ్ నోట్ రాసింది. ఒకేఒక్క అగ్గిపుల్లతో నూరేళ్ల నిండుజీవితానికి నిప్పు పెట్టుకుంది. ‘ఏ తప్పూ చేయలేదు’ అంటూనే ఈ లోకం నుంచి తప్పుకుంది. కన్నవారికి ఎన్నటికీ చల్లారని వేదనాగ్నిని మిగిల్చింది. కొత్తపేట మండలం పలివెలలో పదో తరగతి విద్యార్థిని బండి రేణుక బుధవారం మధ్యాహ్నం ఒంటిపై కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మాహుతికి పాల్పడింది. తన ఆత్మహత్యకు నాగభూషణం అనే ఉపాధ్యాయుని వేధింపులే కారణమని రేణుక సూసైడ్‌నోట్‌లో పేర్కొంది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం, తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం పలివెల పైపూరివారి వీధికి చెంది బండి ధనరాజు, లక్ష్మి దంపతులకు కుమార్తె రేణుక, కుమారుడు జగదీష్ మణికంఠ ఉన్నారు. ధనరాజు ఉపాధి నిమిత్తం కువైట్‌లో ఉంటున్నాడు. బిళ్లకుర్రు శివారు కొత్తపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో రేణుక పదో తరగతి, మణికంఠ ఏడో తరగతి చదువుతున్నారు. ఒంట్లో బాగోలేదని రేణుక బుధవారం ఇంటి వద్దే ఉండగా, మణికంఠ స్కూలుకు వెళ్లాడు. తల్లి మందుల కోసం కొత్తపేట వెళ్లింది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో రేణుక ఇంట్లో ఉన్న సుమారు 5 లీటర్ల కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు చూసిన పక్కింటి మామిడిశెట్టి సూరిబాబు పరుగుపరుగున వచ్చి చూసేసరికి రేణుక మంటల్లో కాలి, మృతి చెందింది. ఇంతలో వచ్చిన తల్లి లక్ష్మి, బంధువులు జరిగిన ఘోరాన్ని చూసి గొల్లుమన్నారు. ఇంట్లో లభించిన 4 పేజీల సూసైడ్ లెటర్లో ‘అమ్మ, నాన్న, పెద్దంకులు, అమ్మమ్మ, తాతయ్య మీరందరూ నన్ను క్షమించండి’ అని మొదలు పెట్టి ‘నేను ఏ తప్పూ చేయలేదు. నన్ను అందరూ క్షమించాలి. నాగభూషణం సార్ నేను తప్పు చేయలేదని ఎంత చెప్తున్నా వినిపించుకోలేదు. ఇంకా లేనిపోనివి అన్నీ అంటున్నారు’ అని రాసింది. దీంతో కోపోద్రిక్తులైన బంధువులు, స్థానికులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడు వై.నాగభూషణానికి దేహశుద్ధి చేశారు. పోలీసులు వచ్చి నాగభూషణాన్ని అదుపులోకి తీసుకుని కొత్తపేట పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. రేణుక మృతదేహాన్ని ఎస్సై ఎ.బాలాజీ పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీస్ స్టేషన్ సమీపంలో రాస్తారోకో రేణుక ఆత్మహత్యకు కారకుడైన ఉపాధ్యాయుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు, పలువురు పలివెల గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆస్పత్రి వద్ద ఉన్న రేణుక మృతదేహాన్ని తీసుకువచ్చేసి, పోలీస్ స్టేషన్ సమీపంలో ఆర్అండ్బీ రోడ్డుపై ఉంచి సాయంత్రం 4 గంటల నుంచి రాస్తారోకో చేశారు. డీఎస్పీ వచ్చి తాము కోరినట్టు హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. వారికి మద్దతుగా పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు రోడ్డుపై బైఠాయించారు. ఇన్చార్జి సీఐ శ్రీనివాస్ వచ్చి ఉపాధ్యాయునిపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తే సెక్షన్ మార్చి, కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో రాత్రి 8 గంటల సమయంలో ఆందోళన విరమించారు. మృతదేహాన్ని తిరిగి ఆస్పత్రికి తరలించారు. తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు 306 సెక్షన్‌తో కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. చలించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి బాలిక ఆత్మహత్య గురించి తెలిసిన స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రభుత్వాస్పత్రికి వచ్చి, మృతదేహాన్ని చూసి, చలించిపోయారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఆకుల రామకృష్ణ, ఎంపీపీ రెడ్డి అనంతకుమారి, జెడ్పీటీసీ సభ్యుడు దర్ణాల రామకృష్ణ, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి డేవిడ్‌రాజు, టీడీపీ నాయకుడు కోరం జయకుమార్, ఎంపీడీఓ పి.వీణాదేవి, ఎంఈఓ వై.సత్తిరాజు తదితరులు మృతదేహాన్ని చూసి, బాలిక కుటుంబానికి సానుభూతి తెలిపారు. -
బీటెక్ ప్రేమకథ
టెన్త్ క్లాస్, ఇంటర్ ప్రేమకథల సీజన్ అయిపోయినట్టుంది. ఇప్పుడు బీటెక్ ప్రేమకథతో ఓ సినిమా రూపొందుతోంది. యల్లారెడ్డి దర్శకత్వంలో ఇందుజ క్రియేషన్స్ పతాకంపై గుడ్‌లైఫ్ మూవీ క్రియేషన్స్ సమర్పణలో వనజ, రేణుక నిర్మిస్తున్న చిత్రం ‘బీటెక్ లవ్‌స్టోరీ’. రమేశ్‌బాబు, శ్రీకాంత్, అంజలి, గెహనా వశిష్ట్ ఇందులో హీరో హీరోయిన్లు. కృష్ణుడు, శ్రావణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ఇది. టైటిల్‌తో పాటు కథాంశం కూడా యూత్‌కి కనెక్ట్ అవుతుంది. చిన్నిచరణ్ సంగీతం ఈ సినిమాకు మెయిన్ హైలైట్. త్వరలోనే పాటలను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. హాస్యానికి పెద్ద పీట వేశామని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జీఎల్ బాబు, సహ నిర్మాత: బద్రీనాథ్, పర్యవేక్షణ: శ్యామ్. -
కన్నతండ్రి..కర్కశం
చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిందా చిన్నారి. తండ్రి మంచంలో ఉండటంతో కన్నతల్లిలా సపర్యలు చేసింది. కదలలేని స్థితిలో ఉన్న తండ్రిని కంటికి రెప్పలా కాచుకుంటున్నా..కనికరం లేని అతను నిత్యం కుమార్తెకు నరకం చూపాడు. కొడుతూ చిత్రహింసలు పెట్టాడు. తొమ్మిదేళ్ల బాలిక రోదన చూడలేక..చుట్టుపక్కల వారు చైల్డ్‌లైన్‌కు సమాచారం ఇవ్వడంతో వారు ఆ బాలికకు తండ్రి నుంచి విముక్తి కల్పించారు. ఒంగోలు టౌన్: కదలలేని స్థితిలో ఉన్న తనను కంటికి రెప్పలా చూసుకుంటున్న కుమార్తెను చిత్రహింసలు పెట్టాడో తండ్రి. ఒంగోలులోని పొనుగుపాటినగర్‌లో ఉంటున్న కాకర్ల కృష్ణ (40) భార్య లక్ష్మి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించింది. బేల్దారి పని చేసుకుంటూ కుమార్తె రేణుకను పోషించేవాడు. రెండేళ్ల క్రితం బిల్డింగ్‌పై నుంచి పడటంతో వెన్నెముకకు బలమైన దెబ్బ తగిలి కృష్ణ కాళ్లు పూర్తిగా చచ్చుబడిపోయాయి. అప్పటి నుంచి రేణుక.. తండ్రికి అన్నీ తానై సపర్యలు చేస్తోంది. తండ్రి మంచంపైనే మలమూత్ర విసర్జన చేసినా చీదరించుకోకుండా శుభ్రం చే సేది. మంచంపైనే తండ్రికి స్నానం చేయించి దుస్తులు కూడా వేసేది. తల్లి తన బిడ్డని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో అలా సేవలు చేసేది. అలాంటి కూతురిని ఏ తండ్రి అయినా అపురూపంగా చూసుకుంటాడు. ఆ చిన్న మనస్సుకు ఎలాంటి కష్టం రాకుండా చూస్తాడు. కానీ కృష్ణ మాత్రం మంచంపై నుండి లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ కుమార్తెను ప్రతిరోజూ రాచి రంపాన పెట్టేవాడు. కదల్లేని స్థితిలో ఉన్నప్పటికీ కుమార్తెను కొట్టేందుకు మంచం పక్కనే ఒక కర్రను కూడా సిద్ధంగా ఉంచుకునేవాడు. అయిన దానికి, కానిదానికి ఆగ్రహిస్తూ కర్రతో కొట్టడమే గాకుండా ఆ బాలిక శరీరంపై గోళ్లతో రక్కడం, తొడపాశం పెట్టడం నిత్యకృత్యమైంది. ప్రతిరోజూ తండ్రి చిత్రహింసలు భరించలేని ఆ బాలిక పెట్టే కేకలకు చుట్టుపక్కల వాళ్లు చలించిపోయేవారు. ఆ తండ్రి వద్దకు వెళ్లి పలుమార్లు చెప్పినప్పటికీ అతని తీరులో ఎలాంటి మార్పు కనిపించలేదు. దాంతో చుట్టుపక్కల వాళ్లు ఆ బాలిక స్థితిని చూసి తట్టుకోలేక చైల్డ్‌లైన్(1098)కు సమాచారం అందించారు. చైల్డ్‌లైన్ ప్రతినిధి బీవీ సాగర్ ఆ బాలికను బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ బీవీ శివప్రసాద్ ఎదుట హాజరు పరిచారు. ఆ బాలికను బాలసదన్‌లో చేర్పించి కష్టాలకు తాత్కాలిక చెక్ పెట్టారు. -
మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచిన రేణుక
కొత్తగూడ : మెదడు సంబంధ వ్యాధితో 12 రోజులుగా మృత్యువుతో పోరాడిన పీజీ విద్యార్థి గొంది రేణుక(22) తుదిశ్వాస విడిచింది. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూసింది. మండలంలోని ముస్మి గ్రామానికి చెందిన రేణుక చిన్నతనం నుంచి చదువుల్లో ముందుండేది. ఇటీవల జ్వరం రావడం తో మెదడులో గడ్డ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆమెకు వైద్యం అందించే సమయానికే కోమాలోకి వెళ్లిన విషయం తెలిసిందే. రేణుక పరిస్థితిపై ‘సాక్షి’లో కూడా ఈ నెల 24న ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం రాజయ్య స్పందించి ఆస్పత్రి వర్గాలతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని, అందుకయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఆమెను మృత్యువు కబలించింది. రేణుక మృతితో ఆమె సహవిద్యార్థులు కన్నీరుమున్నీరయ్యూరు. మృతదేహం వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. అశ్రునయనాల మధ్య ముస్మిలో ఆమె అంత్యక్రియలు పూర్తిచేశారు. -
నాలుగు చెక్‌పోస్టులు ఏర్పాటు
జంగారెడ్డిగూడెం : రాష్ట్ర విభజన నేపథ్యంలో తన పరిధిలో నాలుగు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి.రేణుక తెలిపారు. సోమవారం రాత్రి ఆమె స్థానిక ఎక్సైజ్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఈ ఏడాది ఎన్నికల నుంచి ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలను సీఐ జె.రమేష్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవిభజన నేపథ్యంలో చింతలపూడి శివారు గురుభట్లగూడెం, జీలుగుమిల్లి మండలం శివారు తాటియాకులగూడెం, అదేమండలంలోని రాచన్నగూడెం, సీతంపేట గ్రామాల్లో ఎక్సైజ్ చెక్‌పోస్టుల ఏర్పాటుకు అనుమతి లభించిందన్నారు. అయితే అక్కడ ఎంతమంది సిబ్బంది నియమించాలనేది ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు బెల్టుషాపుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే 90 శాతం బెల్టుషాపులను అదుపుచేశామని చెప్పారు. బెల్టుషాపుల నివారణ నేపథ్యంలో నాటుసారా అమ్మకాలు పెరిగే అవకాశం ఉన్నందున వాటిపై కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా నల్లబెల్లం అమ్మకాలపై కొరడా ఝులిపిస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేక నిఘా బృందాలను నియమించామన్నారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో బూర్గుంపాడు, కుకునూరు, వేలేరుపాడు మండలాలు పశ్చిమగోదావరి జిల్లాలో కలిసినప్పటికీ అవి ఏ పరిధిలోకి వస్తాయో స్పష్టమైన ఆదేశాలు అందలేదన్నారు. ప్రస్తుతం ఏలూరు నుంచి ఆ మూడు మండలాలకు మానిటరింగ్ చేస్తున్నామన్నారు. ఎస్సై సుబ్రహ్మణ్యం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ పరిధిలో పట్టుకున్న సుమారు 2వేల లీటర్ల నాటు సారాను ఆమె సమక్షంలో అధికారులు ధ్వంసం చేశారు. -
వైఎస్ షర్మిలకు అండగా ఉంటాం
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిలకు అండగా ఉంటామని ఆ పార్టీ మహిళా నాయకులు, ఎంపీలు చెప్పారు. సోషల్ మీడియాలో షర్మిలను కించపరుస్తూ దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం వైఎస్ఆర్ సీపీ ఎంపీలు బుట్టా రేణుక, కొత్తపల్లి గీత మాట్లాడారు. మహిళలను ప్రోత్సహించాలే కానీ వారి గౌరవ మర్యాదలకు భంగం కలిగించేలా అసభ్యంగా చిత్రీకరించడం దారుణమని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మహిళల రాణించకుండా చేయడానికి కొన్ని వెబ్ సైట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ప్రజా సమస్యల కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసిన షర్మిలపై అసత్య ప్రచారం చేయడం తగదని అరకు ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. ఇలాంటి సంఘటనల్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని, మహిళలకు అండగా ఉండాలని చెప్పారు. అస్యత ప్రచారం చేస్తున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, సోమయాజులు సీపీని కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందచేశారు. -
'షర్మిలకు అండగా నిలబడి పోరాడతాం'
-
‘ఆయనే’ కాలయముడు..!
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్:స్వయానా..మేనామామే భర్త కావడంతో ఎంతో సంతోషించిన ఆమె పాలిట ఆయనే.. కాలయముడయ్యాడు. సూటిపోటి మాటలతో నిత్యం వేధించసాగాడు. అయినా..మామయ్యే కదా అని.. ఎంత ఓర్చుకున్నా.. రోజురోజుకూ..పిశాచిలా మారాడు..ఆ వేధింపుల పర్వానికి అంతం లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె..తనువు చాలించాలనుకుంది. ఇంటి పెరడులోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. హృదయవిదారకమైన ఈ సంఘటన శ్రీకాకుళం పట్టణంలోని గుజరాతీ పేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సరుబుజ్జిలి మండలం సింధువాడ గ్రామానికి చెందిన రేణుక(21)ను..స్వయానా మేనమామ అయిన..గుజరాతీపేటకు చెందిన పప్పల శ్రీనివాసరావుకు ఇచ్చి..21 నెలల క్రితం వివాహం చేశారు. అయితే..ముందు నుంచి ఆయనకు ఈ వివాహ ం ఇష్టం లేదని సమాచారం. అయినా..పెద్దలు కుదిర్చిన సంబంధం కావడంతో..కాదనలేక చేసుకున్నాడు. కానీ పెళ్లి నాటి ప్రమాణాలను మరిచి..కాలయుముడిలా మారా డు. నిత్యం రేణుకను వేధించసాగాడు. సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురి చేసేవాడు. తన అన్నయ్య, వదినలైన అప్పలరాజు, ఝాన్సీల మాటలు విని..మరింత రెచ్చిపోయేవాడు. అయితే..మేనమామే కావడంతో రేణుక ఎంతో సహనంతో భరిస్తూ వచ్చింది. కానీ..రోజురోజుకూ పరిస్థితి చేయిదాటిపోతుండడంతో.. తనువు చాలించాలని నిర్ణయించుకుంది. సోమవారం తెల్లవారు జామున ఇంటి వెనుక ఉన్న జామి చెట్టుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి కెల్ల భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం రెండో పట్టణ సీఐ రాధాకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. రేణుక భర్త శ్రీనివాసరావు, అతని అన్న వదినలు అప్పలరాజు, ఝాన్సీలపై కేసు నమోదు చేశామన్నారు.