శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్:స్వయానా..మేనామామే భర్త కావడంతో ఎంతో సంతోషించిన ఆమె పాలిట ఆయనే.. కాలయముడయ్యాడు. సూటిపోటి మాటలతో నిత్యం వేధించసాగాడు. అయినా..మామయ్యే కదా అని.. ఎంత ఓర్చుకున్నా.. రోజురోజుకూ..పిశాచిలా మారాడు..ఆ వేధింపుల పర్వానికి అంతం లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె..తనువు చాలించాలనుకుంది. ఇంటి పెరడులోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. హృదయవిదారకమైన ఈ సంఘటన శ్రీకాకుళం పట్టణంలోని గుజరాతీ పేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సరుబుజ్జిలి మండలం సింధువాడ గ్రామానికి చెందిన రేణుక(21)ను..స్వయానా మేనమామ అయిన..గుజరాతీపేటకు చెందిన పప్పల శ్రీనివాసరావుకు ఇచ్చి..21 నెలల క్రితం వివాహం చేశారు.
అయితే..ముందు నుంచి ఆయనకు ఈ వివాహ ం ఇష్టం లేదని సమాచారం. అయినా..పెద్దలు కుదిర్చిన సంబంధం కావడంతో..కాదనలేక చేసుకున్నాడు. కానీ పెళ్లి నాటి ప్రమాణాలను మరిచి..కాలయుముడిలా మారా డు. నిత్యం రేణుకను వేధించసాగాడు. సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురి చేసేవాడు. తన అన్నయ్య, వదినలైన అప్పలరాజు, ఝాన్సీల మాటలు విని..మరింత రెచ్చిపోయేవాడు. అయితే..మేనమామే కావడంతో రేణుక ఎంతో సహనంతో భరిస్తూ వచ్చింది. కానీ..రోజురోజుకూ పరిస్థితి చేయిదాటిపోతుండడంతో.. తనువు చాలించాలని నిర్ణయించుకుంది. సోమవారం తెల్లవారు జామున ఇంటి వెనుక ఉన్న జామి చెట్టుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి కెల్ల భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం రెండో పట్టణ సీఐ రాధాకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. రేణుక భర్త శ్రీనివాసరావు, అతని అన్న వదినలు అప్పలరాజు, ఝాన్సీలపై కేసు నమోదు చేశామన్నారు.
‘ఆయనే’ కాలయముడు..!
Published Tue, Jan 14 2014 1:40 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM
Advertisement
Advertisement