రేణుకా జగ్తియాని
సంపన్న కుటుంబ నేపథ్యం లేని మిక్కీ జగ్తియాని ‘ల్యాండ్‌మార్క్’తో ఒక్కోమెట్టు ఎక్కుతూ ప్రపంచ కుబేరుల సరసన నిలిచాడు. భర్త అడుగు జాడల్లో నడిచి వ్యాపార నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న రేణుకా జగ్తియాని ‘ల్యాండ్ మార్క్’కు తనదైన మార్క్ జోడించి ఆ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించింది. తాజాగా.. ఫోర్బ్స్ న్యూ బిలియనీర్స్ 2024 జాబితాలో చోటు సాధించింది.
రేణుకా జగ్తియాని నేతృత్వంలోని దుబాయ్ చెందిన రిటైలింగ్ దిగ్గజం ‘ల్యాండ్‌మార్క్’ 21 దేశాలలో పాదరక్షల నుంచి గృహోపకరణ వస్తువుల వరకు వివిధ బ్రాండ్‌లతో విజయపథంలో దూసుకుపోతుంది. హాస్పిటాలిటీ బిజినెస్‌లో కూడా గెలుపు జెండా ఎగరేసింది. ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలతో ముందుకువెళ్లే రేణుక మిడిల్ ఈస్ట్, ఇండియా, ఆగ్నేయాసియాలోని కీలక మార్కెట్‌లలో రాబోయే కాలంలో వందలాది స్టోర్‌లను ప్రారంభించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది.
ఎలాంటి వ్యాపార అనుభవం లేని రేణుక 1993లో ల్యాండ్‌మార్క్ గ్రూప్‌లోకి అడుగు పెట్టింది. ‘ఇది సాధ్యమా!’ అనుకునే వాళ్లు సందేహాల దగ్గరే తచ్చాడుతారు. ‘కచిత్చంగా సాధ్యమే’ అనుకునే వాళ్లు ముందుకు దూసుకుపోతారు.
రేణుక రెండోకోవకు చెందిన మహిళ. వేగంగా వ్యాపార నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవడమే కాదు ఫాస్ట్–ఫ్యాషన్ బిజినెస్ ‘స్ప్లాష్’తో తనదైన ముద్ర వేసింది. ‘స్ప్లాష్’ పదకొండు దేశాలలో 200 స్టోర్స్ వరకు విస్తరించింది. మన దేశంలో 1999లో లైఫ్‌స్టైల్, హోమ్ సెంటర్ అండ్ మాక్స్‌లాంటి అయిదు ఫార్మట్స్‌లో ప్రస్థానం ప్రారంభించి 900 స్టోర్స్‌లో విస్తరించింది ల్యాండ్‌మార్క్.
2017లో రేణుక ల్యాండ్ మార్క్ గ్రూప్ చైర్‌పర్సన్, సీయీవోగా బాధ్యతలు స్వీకరించింది. రేణుక భర్త మిక్కీ జగ్తియాని సౌత్ ఆఫ్రికా ఇమిగ్రెంట్స్‌ను దృష్టిలో పెట్టుకొని బహ్రెయిన్‌లో బేబీ ్ర΄÷డక్ట్స్ స్టోర్‌ను మొదలుపెట్టాడు. అక్కడినుంచిప్రారంభమైన బుడి బుడి అడుగుల వ్యాపారం ‘ల్యాండ్‌మార్క్’ రూపంలోఎక్కడికో వెళ్లింది.
భర్త నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాన్ని చెక్కుచెదరకుండా నిలబెట్టడం అంత సులువు కాదు. కాని ఎక్కడా రేణుక వెనకడుగు వేయలేదు. అయితే ప్రపంచంలోని ఎన్నో కంపెనీలపై పడినట్లే కోవిడ్ సంక్షోభ ప్రభావం ‘ల్యాండ్‌మార్క్’ పై పడింది. రెండు నెలలకు పైగా స్టోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఆ తరువాత మెల్లమెల్లగా కొత్త గైడ్‌లైన్స్‌తో తెరుచుకోవడం మొదలైంది.
‘విపత్కరమైన పరిస్థితుల్లో ఆపరేషనల్‌ప్రాసెస్‌లో ర్యాపిడ్ చేంజెస్ చేశాము. ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాం. క్వారంటైన్‌లో ఉన్న ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందించాం, వారిలో ధైర్యం నింపాం. ఆఫీస్, స్టోర్ ఉద్యోగుల కోసం ప్రత్యేక వసతి ఏర్పాటు చేశాం. ఉద్యోగుల కోసమే కాదు కోవిడ్ బాధితుల కోసం మా ఫౌండేషన్ తరపున ఎన్నోరకాల సేవాకార్యక్రమాలు చేపట్టాం’ అంటూ ఆ రోజులను గుర్తు తెచ్చుకుంటుంది రేణుక.
చిన్న వ్యాపారంగా మొదలైన ‘ల్యాండ్‌మార్క్’ గల్ఫ్‌కు సంబంధించి ‘కింగ్ ఆఫ్ రిటైల్’గా పేరు తెచ్చుకుంది. విజయపథంలో దూసుకుపోతున్న ‘ల్యాండ్‌మార్కు’ ముందున్న కర్తవ్యం.. సమాజానికి తిరిగి ఇవ్వాలి. ఆదరించిన ప్రజలకు అండగా ఉండాలి. పర్యావరణ సంరక్షణ కార్యక్రమాలకుప్రాధాన్యత ఇస్తున్న ల్యాండ్ మార్క్ గ్రూప్ చెన్నై, ముంబై మురికివాడల్లో రకరకాల సేవాకార్యక్రమాలు చేపడుతోంది.
రేణుక జగ్తియాని భర్త మిక్కీ జగ్తియాని 71 సంవత్సరాల వయసులో చనిపోయారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక రిపోర్టర్ ఆయనను ‘మీ నెక్ట్స్ ΄్లాన్ ఏమిటి?’ అని అడిగాడు.
దీనికి మిక్కీ జగ్తియాని చెప్పిన జవాబు..
‘నా గురించి నేను పూర్తిగా తెలుసుకోవడానికి ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నాను. వ్యాపార సంబంధిత విషయాల గురించి కాకుండా నేనెవరిని? జీవితపరమార్థం ఏమిటి? లాంటి విషయాల గురించి ఆలోచిస్తుంటాను. వ్యాపార లాభాలే కాదు జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాలలో ఆనందం దొరుకుతుంది’
భర్త అడుగుజాడల్లో నడిచి, వ్యాపార నైపుణ్యాన్నే కాదు సేవాదృక్పథాన్ని సొంతం చేసుకున్న రేణుకా జగ్తియాని వ్యాపారంతో పాటు సేవాకార్యక్రమాలకు కూడాప్రాధాన్యత ఇస్తోంది. భర్త అడుగుజాడల్లో నడిచి, వ్యాపారనైపుణ్యాన్నే కాదు సేవాదృక్పథాన్ని సొంతం చేసుకున్న రేణుకా జగ్తియాని వ్యాపారంతోపాటు సేవా
కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తోంది.
ఇవి చదవండి: Vipul Varshney: ఎదుర్కోడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి
Comments
Please login to add a commentAdd a comment