land mark
-
ల్యాండ్ మార్క్ చెట్లు
మణికొండ: ఒక్కో గ్రామంలో ఒక్కో భవనం, విగ్రహాలు, చౌరస్తాలు, బావులు లాండ్ మార్క్‌గా నిలవటం సహజం. కానీ రెండు చెట్లు ఈ ప్రాంతంలో దశాబ్దాల కాలం పాటు ల్యాండ్ మార్క్‌గా నిలుస్తున్నాయి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందే క్రమం నుంచి ఇప్పటికీ అవి అలాగే కొనసాగుతున్నాయి. వాటి చుట్టు పక్కల మరో ల్యాండ్ మార్క్ ఏర్పాటు చేసినా ప్రజలు వాటిని గుర్తించలేక పాత వాటితోనే పిలుస్తున్నారంటే ప్రజల్లో ఎంతలా నాటుకుపోయాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆ చెట్లేంటి? వాటి కథేంటి? తెలుసుకుందాం.. దైనా కొత్త ప్రాంతానికి వెళ్లాలన్నా.. ఎవరికైనా అడ్రస్ చెప్పాలన్నా.. ముందుగా ఆ ప్రాంతం పేరుతోపాటు అక్కడ ప్రాచుర్యం పొందిన ల్యాండ్ మార్క్ చెప్పడం పరిపాటి.. అయితే అభివృద్ధి చెందే క్రమంలో కొన్ని పేర్లు మారుతుంటాయి.. మరికొన్ని ఏళ్ల తరబడి అవే గుర్తింపుగా మారుతుంటాయి.. అలాంటి గుర్తింపు పొందిన రెండు వృక్షాల కథే ఇది..పూర్తి వివరాల్లోకి వెళితే గతంలో మణికొండకు కొత్తగా వచ్చే వారు మీ ఇంటికి ఎలా రావాలి అంటే ముందుగా మర్రిచెట్టు వద్దకు వచ్చి ఎడమవైపు, కుడి వైపు, నేరుగా ఇటువైపు రావాలని చిరునామా చెప్పే వారు. దాని కేంద్రంగానే మణికొండకు కొత్తగా వచ్చే వారు గమ్యస్థానాలను చేరేవారు. ఇదే మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ, నెక్నాంపూర్ వాసులు అలకాపూర్ టౌన్షిప్ ప్రవేశంలో ఉండే చింత చెట్టును కేంద్రంగా చేసుకుని చిరునామా చెప్పేవారు. అక్కడి నుంచి ఎడమ, కుడి, నేరుగా అనే రోడ్లతో వారి గమ్యస్థానాలకు చేరుకునే వారు. ఆ తరువాతి క్రమంలో గూగుల్ మ్యాప్‌లు, లొకేషన్ పాయింట్లు వచ్చి వాటి ఆదారంగా కొత్త వారు గమ్య స్థానాలను చేరుకుంటున్నా వీటి గుర్తింపు ఏమాత్రం చెక్కు చెదరలేదు. వాటిలో ముందుగా మణికొండ మర్రిచెట్టు, పుప్పాలగూడ, నెక్నాంపూర్ చింతచెట్టు అడ్రస్‌కి కేరాఫ్‌గా మారాయి.మార్పులు చేసినా... మణికొండ మర్రిచెట్టు కూడలికి కాల క్రమంలో పేరు మార్చాలనే ఉద్దేశంతో ఓ సంస్థ దాని కింద భరతమాత విగ్రహాన్ని నెలకొలి్పంది. అప్పటి నుంచి దాన్ని భరతమాత కూడలిగా పిలవాలని ప్రకటించారు. అది ఏమాత్రం ప్రజల్లోకి ఎక్కకుండా అదే మర్రిచెట్టు కూడలిగానే ప్రసద్ధి చెందుతోంది. ఇదే తరహాలో పుప్పాలగూడ, నెక్నాంపూర్ వాసులకు ల్యాండ్ మార్క్‌గా ఉన్న చింత చెట్టు పక్కనే మున్సిపాలిటీ నుంచి శోభాయమానంగా సీతాకోకచిలుకలు ఎగురుతున్నట్టుగా కూడలిని అభివృద్ధి చేశారు. దాన్ని బటర్‌ఫ్లై కూడలిగా నామకరణం చేసినా దాన్ని ఎవరూ పట్టించుకోవటం లేదు. అదే చింతచెట్టు సర్కిల్గానే దాని పేరు కొనసాగుతోంది. అదే రోడ్డులో అలకాపూర్ టౌన్íÙప్లోకి నేరుగా వెళితే మూలమలుపు వద్ద ఏర్పాటు చేసిన యోగ సర్కిల్(సూర్యనమస్కారాల బొమ్మలు) మాత్రం ఇప్పుడిపుడే ప్రాచూర్యం పొందుతున్నాయి. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మర్రిచెట్టు, చింతచెట్ల చరిత్ర అవి జీవించినంత కాలం కొనసాగుతుందని స్థానికులు భావిస్తున్నారు. మణికొండలోని అదే మర్రిచెట్టుపై కొత్తగా రావి చెట్టు, దాని కింద వేపచెట్టు పెరుగుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. -
Renuka Jagtiani: 'ఫోర్బ్స్ న్యూ బిలియనీర్స్ 2024 జాబితాలో' తన ల్యాండ్ మార్క్..
సంపన్న కుటుంబ నేపథ్యం లేని మిక్కీ జగ్తియాని ‘ల్యాండ్‌మార్క్’తో ఒక్కోమెట్టు ఎక్కుతూ ప్రపంచ కుబేరుల సరసన నిలిచాడు. భర్త అడుగు జాడల్లో నడిచి వ్యాపార నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న రేణుకా జగ్తియాని ‘ల్యాండ్ మార్క్’కు తనదైన మార్క్ జోడించి ఆ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించింది. తాజాగా.. ఫోర్బ్స్ న్యూ బిలియనీర్స్ 2024 జాబితాలో చోటు సాధించింది. రేణుకా జగ్తియాని నేతృత్వంలోని దుబాయ్ చెందిన రిటైలింగ్ దిగ్గజం ‘ల్యాండ్‌మార్క్’ 21 దేశాలలో పాదరక్షల నుంచి గృహోపకరణ వస్తువుల వరకు వివిధ బ్రాండ్లతో విజయపథంలో దూసుకుపోతుంది. హాస్పిటాలిటీ బిజినెస్‌లో కూడా గెలుపు జెండా ఎగరేసింది. ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలతో ముందుకువెళ్లే రేణుక మిడిల్ ఈస్ట్, ఇండియా, ఆగ్నేయాసియాలోని కీలక మార్కెట్లలో రాబోయే కాలంలో వందలాది స్టోర్లను ప్రారంభించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఎలాంటి వ్యాపార అనుభవం లేని రేణుక 1993లో ల్యాండ్‌మార్క్ గ్రూప్‌లోకి అడుగు పెట్టింది. ‘ఇది సాధ్యమా!’ అనుకునే వాళ్లు సందేహాల దగ్గరే తచ్చాడుతారు. ‘కచిత్చంగా సాధ్యమే’ అనుకునే వాళ్లు ముందుకు దూసుకుపోతారు. రేణుక రెండోకోవకు చెందిన మహిళ. వేగంగా వ్యాపార నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవడమే కాదు ఫాస్ట్–ఫ్యాషన్ బిజినెస్ ‘స్ప్లాష్’తో తనదైన ముద్ర వేసింది. ‘స్ప్లాష్’ పదకొండు దేశాలలో 200 స్టోర్స్ వరకు విస్తరించింది. మన దేశంలో 1999లో లైఫ్‌స్టైల్, హోమ్ సెంటర్ అండ్ మాక్స్‌లాంటి అయిదు ఫార్మట్స్‌లో ప్రస్థానం ప్రారంభించి 900 స్టోర్స్‌లో విస్తరించింది ల్యాండ్‌మార్క్. 2017లో రేణుక ల్యాండ్ మార్క్ గ్రూప్ చైర్పర్సన్, సీయీవోగా బాధ్యతలు స్వీకరించింది. రేణుక భర్త మిక్కీ జగ్తియాని సౌత్ ఆఫ్రికా ఇమిగ్రెంట్స్‌ను దృష్టిలో పెట్టుకొని బహ్రెయిన్‌లో బేబీ ్ర΄÷డక్ట్స్ స్టోర్‌ను మొదలుపెట్టాడు. అక్కడినుంచిప్రారంభమైన బుడి బుడి అడుగుల వ్యాపారం ‘ల్యాండ్‌మార్క్’ రూపంలోఎక్కడికో వెళ్లింది. భర్త నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాన్ని చెక్కుచెదరకుండా నిలబెట్టడం అంత సులువు కాదు. కాని ఎక్కడా రేణుక వెనకడుగు వేయలేదు. అయితే ప్రపంచంలోని ఎన్నో కంపెనీలపై పడినట్లే కోవిడ్ సంక్షోభ ప్రభావం ‘ల్యాండ్‌మార్క్’ పై పడింది. రెండు నెలలకు పైగా స్టోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఆ తరువాత మెల్లమెల్లగా కొత్త గైడ్‌లైన్స్‌తో తెరుచుకోవడం మొదలైంది. ‘విపత్కరమైన పరిస్థితుల్లో ఆపరేషనల్ప్రాసెస్లో ర్యాపిడ్ చేంజెస్ చేశాము. ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాం. క్వారంటైన్లో ఉన్న ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందించాం, వారిలో ధైర్యం నింపాం. ఆఫీస్, స్టోర్ ఉద్యోగుల కోసం ప్రత్యేక వసతి ఏర్పాటు చేశాం. ఉద్యోగుల కోసమే కాదు కోవిడ్ బాధితుల కోసం మా ఫౌండేషన్ తరపున ఎన్నోరకాల సేవాకార్యక్రమాలు చేపట్టాం’ అంటూ ఆ రోజులను గుర్తు తెచ్చుకుంటుంది రేణుక. చిన్న వ్యాపారంగా మొదలైన ‘ల్యాండ్‌మార్క్’ గల్ఫ్‌కు సంబంధించి ‘కింగ్ ఆఫ్ రిటైల్’గా పేరు తెచ్చుకుంది. విజయపథంలో దూసుకుపోతున్న ‘ల్యాండ్‌మార్కు’ ముందున్న కర్తవ్యం.. సమాజానికి తిరిగి ఇవ్వాలి. ఆదరించిన ప్రజలకు అండగా ఉండాలి. పర్యావరణ సంరక్షణ కార్యక్రమాలకుప్రాధాన్యత ఇస్తున్న ల్యాండ్ మార్క్ గ్రూప్ చెన్నై, ముంబై మురికివాడల్లో రకరకాల సేవాకార్యక్రమాలు చేపడుతోంది. రేణుక జగ్తియాని భర్త మిక్కీ జగ్తియాని 71 సంవత్సరాల వయసులో చనిపోయారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక రిపోర్టర్ ఆయనను ‘మీ నెక్ట్స్ ΄్లాన్ ఏమిటి?’ అని అడిగాడు. దీనికి మిక్కీ జగ్తియాని చెప్పిన జవాబు.. ‘నా గురించి నేను పూర్తిగా తెలుసుకోవడానికి ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నాను. వ్యాపార సంబంధిత విషయాల గురించి కాకుండా నేనెవరిని? జీవితపరమార్థం ఏమిటి? లాంటి విషయాల గురించి ఆలోచిస్తుంటాను. వ్యాపార లాభాలే కాదు జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాలలో ఆనందం దొరుకుతుంది’ భర్త అడుగుజాడల్లో నడిచి, వ్యాపార నైపుణ్యాన్నే కాదు సేవాదృక్పథాన్ని సొంతం చేసుకున్న రేణుకా జగ్తియాని వ్యాపారంతో పాటు సేవాకార్యక్రమాలకు కూడాప్రాధాన్యత ఇస్తోంది. భర్త అడుగుజాడల్లో నడిచి, వ్యాపారనైపుణ్యాన్నే కాదు సేవాదృక్పథాన్ని సొంతం చేసుకున్న రేణుకా జగ్తియాని వ్యాపారంతోపాటు సేవా కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తోంది. ఇవి చదవండి: Vipul Varshney: ఎదుర్కోడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి -
గూగుల్ మ్యాప్స్.. ఇక అడ్రస్ కోసం ఇబ్బంది పడక్కర్లేదు
కొత్త ప్రదేశాల్లో.. కొత్త ప్రాంతాలకు వెళ్లడానికి చాలామందికి గూగుల్ మ్యాప్స్ ఒక మార్గదర్శి. అయితే కచ్చితమైన అడ్రస్సుల విషయంలోనే ఒక్కోసారి గందరగోళం ఏర్పడవచ్చు. ఇప్పుడు ఈ సమస్యను కూడా తీర్చడానికి ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది గూగుల్ మ్యాప్స్. చాలామంది తమ హోం అడ్రస్సులను అవసరం ఉన్నప్పుడు కరెంట్ లేదంటే అడ్రస్‌ను టైప్ చేయడం ద్వారా వివరాల్ని షేర్ చేస్తుంటారు. ఇకపై ఆ అవసరం లేకుండా ఫ్లస్ కోడ్‌ని షేర్ చేస్తే సరిపోతుంది. ఫ్లస్ కోడ్‌లో హోం అడ్రస్ బదులు.. నెంబర్లు, లెటర్ల ఆధారంగా ఉదాహరణకు.. ‘CCMM+64G’ ఇలా నెంబర్లు, లెటర్ల ఆధారంగా కోడ్ రూపంలో కనిపిస్తుంది. మాటి మాటికి అడ్రస్‌ను టైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఇది షేర్(ఆల్రెడీ హోం అడ్రస్‌గా సేవ్ చేసి ఉంటారు కాబట్టి) చేస్తే సరిపోతుంది. గూగుల్ ఫ్లస్ కోడ్‌ను చాలా కాలం కిందటే(2018) తీసుకొచ్చింది. చాలాకాలం పాటు ఇది ఎన్జీవోలకు, ప్రభుత్వ కార్యాలయాలకు కేరాఫ్‌గా నిలిచి.. ప్రజలకు ఉపయోగపడ్డాయి. ఇక ఇప్పుడు ఈ ఫీచర్‌ను యూజర్లందరికీ అందించనుంది. ఇది అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా గ్రిడ్ తరహాలో ప్రాంతాలను విభజించుకుంటూ పోతుంది. విశేషం ఏంటంటే.. రోడ్డు మార్గం, సరైన ల్యాండ్ మార్క్‌లు లేనిచోట్ల కూడా అదీ ఆఫ్‌లైన్‌లోనే(ఒక్కసారి సేవ్ చేస్తే సరిపోతుంది) ఫ్లస్ కోడ్ సరైన అడ్రస్‌ను లొకేట్ చేస్తుంది. కరెక్ట్‌గా అడ్రస్ పెడితేనే రావట్లేదు.. ఇంక ఫ్లస్ కోడ్ వర్కవుట్అవుతుందా? అంటారా? కచ్చితంగా అవుతుంది. ఎందుకంటే.. గూగుల్ మ్యాప్ తీసుకుచ్చిన ఫ్లస్ కోడ్ అనేది యూనివర్సల్. భూమ్మీద ప్రతీ లొకేషన్, అడ్రస్‌కు ఒక్కో ఫ్లస్ కోడ్ ఉంటుంది. పైగా ఎగ్జాట్‌గా హోం లొకేషన్‌గా సేవ్ అవుతుంది కాబట్టి. ఇది జనరేట్ చేయాలంటే.. యూజ్ యువర్ కరెంట్ లొకేషన్ ద్వారా చేయొచ్చు. సేవ్డ్ ట్యాబ్‌ను కూడా హోం అడ్రస్ కాపీ చేయడానికి, షేర్ చేయడానికి ఉపయోగించొచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ కేవలం ఆండ్రాయిడ్ వెర్షన్లలో మాత్రమే ఉంది. కింద వీడియోలో మరింత స్పష్టత రావొచ్చు. -
అంధకార ‘ప్రకాశం’
నాలుగున్నర దశాబ్దాలైనా వెలుగుల్లేవు పోర్టును పొరుగు జిల్లా తన్నుకెళ్లింది కాగితాలపైనే పారిశ్రామికాభివృద్ధి గాలిలోనే విమానాశ్రయం నేడు నలభై ఐదవ జిల్లా ఆవిర్భావ దినోత్సవం ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: పేరులోనే ప్రకాశం. అభివృద్ధిలో మాత్రం అంధకారమే. జిల్లా ఆవిర్భవించి నాలుగున్నర దశాబ్దాలవుతున్నా ఇంత వరకు ల్యాండ్ మార్క్ అభివృద్ధి లేకపోవడం దురదృష్టకరం. పోర్టు రూపంలో జిల్లాకు వచ్చిన అవకాశాన్ని ప్రజాప్రతినిధులు నిలబెట్టుకోలేకపోయారు. పారిశ్రామికాభివృద్ధి కాగితాలపైనే నాట్యమాడుతోంది. విమానాశ్రయం ఏర్పాటు గాలి మాటలకే పరిమితమైంది. వెనుకబడిన జిల్లాల్లోని ప్రాంతాలతో ఏర్పాటు చేసిన ప్రకాశం జిల్లా ఆవిర్భవించి ఆదివారం నాటికి నలభై ఐదేళ్లవుతున్నా అభివృద్ధిలో వెనుకబడే ఉంది. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో 1970 నాటి పరిస్థితులు కనిపించడం పాలకుల వైఫల్యాన్ని ప్రతిఫలిస్తోంది. జిల్లా జనాభా 33 లక్షలు దాటినా అందుకు అనుగుణంగా వసతులు కల్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఘోరంగా విఫలమయ్యారు. గుక్కెడు నీరు అందని గ్రామాలు వందల సంఖ్యలో ఉన్నాయి. పనుల కోసం ఇప్పటికీ వేలాది మంది ఇతర జిల్లాలకు క్యూ కడుతున్నారు. గ్రానైట్ సిరులున్నా... జిల్లాలో ప్రధానంగా గ్రానైట్, పలకల పరిశ్రమలున్నాయి. గ్రానైట్ రంగంలో ఉపాధి పొందుతున్నవారు జిల్లాకంటే పొరుగు రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. గ్రానైట్ రంగంలో వివిధ విభాగాలకు సంబంధించి ప్రత్యేక శిక్షణలు ఇస్తే జిల్లాలో ఉండే నిరుద్యోగులు వినియోగించుకొని ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశాలుంటాయి. కోస్టల్ కారిడార్ కింద వేలాది ఎకరాలు సేకరించారు. ఏళ్లు గడుస్తున్నప్పటికీ అక్కడ ఎలాంటి పారిశ్రామికాభివృద్ధి జరగలేదు. పోర్టు తన్నుకెళ్లినా పట్టదు.. ‘రామాయపట్నంలో పోర్టు ఏర్పాటు చేస్తున్నారు. భూ సేకరణ పూర్తయింది. ఇక అభివృద్ధే అభివృద్ధి. ఉపాధే ఉపాధి’ అంటూ జిల్లా మంత్రి మానుగుంట మహీధరరెడ్డి గొప్పగా ప్రకటనలు గుప్పించారు. అయితే మంత్రి, ఇతర ప్రజాప్రతినిధుల చేతగానితనాన్ని పొరుగు జిల్లావాళ్లు చక్కగా వినియోగించుకున్నారు. రామాయపట్నం పోర్టు పొరుగు జిల్లాకు తన్నుకు వెళ్లినప్పటికీ మంత్రి మహీధరరెడ్డికి, శాసనసభ్యులకు మాత్రం పట్టలేదు. పోర్టు పోయిందన్న బాధ కూడా వారిలో కనిపించకపోవడం గమనార్హం. కొత్తపట్నంలో విమానాశ్రయం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్పుకొస్తున్నా ఫలితం లేదు. ఒంగోలులో వందల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన రిమ్స్ హాస్పిటల్ ఇతర మెడికల్ కాలేజీలను చూసి తలదించుకునే స్థాయికి దిగజారింది. మెడికల్ కాలేజీ, హాస్పిటల్ ఏర్పాటు చేసినప్పటికీ ఆ దిశగా సౌకర్యాలు కల్పించడంలో పాలకులు, అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. వెలి‘గోడు’ పట్టదు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులున్నప్పటికీ వాటిలో ఎలాంటి పురోగతి లేదు. వెలిగొండ ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఏటా ప్రకటించే బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు మెతుకులు విదిలించినట్లుగా నిధులు కేటాయిస్తూ మరింత దిగజారుస్తున్నారు. సంబరాలకే పరిమితం ఏటా జిల్లా అవతరణ దినోత్సవాన్ని సంబరాలతో సరిపెట్టుకుంటున్నారు. జిల్లా మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కుబడిగా ఈ వేడుకల్లో పాల్గొనడం, ప్రకాశం జిల్లా అభివృద్ధికి కంకణబద్ధులు అవుతామని ప్రకటించడం తప్పితే ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇదే తీరు కనబరిస్తే మరో పదేళ్లు అయినా జిల్లాలో అభివృద్ధిని వెతుక్కోవాల్సిందే.