తమిళ సినిమా: ఒక మార్కెట్‌ను సొంతం చేసుకోవడానికి హీరో, రౌడీ మధ్య జరిగే పోరాటం ఇతివృత్తంగా రూపొందుతున్న చిత్రం సెయల్. నవ జంట రాజన్‌తేజేశ్వర్, తరూషి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఇందులో నటి రేణుక, మునీష్‌కాంత్, సూపర్‌గుడ్ సుబ్రమణియం, వినోదిని, టీపోట్టి గణేశన్, ఆడుగళంజయబాలన్, దీనా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నటుడు ఛమక్ చంద్ర విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సీఆర్.క్రియేషన్స్ నిర్మలారాజన్ సమర్పణలో దివ్యక్షేత్ర ఫిలింస్ పతాకంపై సీఆర్.రాజన్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు గతంలో విజయ్ హీరోగా షాజహాన్ చిత్రాన్ని తెరకెక్కించిన రవి అబ్బులు దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన 15 ఏళ్ల తరువాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. వీ.ఇళయరాజా ఛాయాగ్రహణ, సిద్ధార్ద్ విపిన్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఉత్తర చెన్నైలోని తంగశాలై మార్కెట్‌ను సొంతం చేసుకోవడానికి వచ్చిన ఒక రౌడీని అదే మార్కెట్‌లో సరకులు కొనుక్కోవడానికి వచ్చిన హీరో చితకబాదే పరిస్థితి నెలకొంటుందన్నారు.
దీంతో ఆ మార్కెట్‌లో ప్రజలకు రౌడీ అంటే భయం పోతుందన్నారు. ఆ మార్కెట్‌ను సొంతం చేసుకోవాలంటే ఆ రౌడీ అదే చోట హీరోను తిరిగి కొట్టాలన్నారు. మరి ఆ రౌడీ కొట్టారా? లేక మరోసారి హీరో చేత చావు దెబ్బలు తిన్నాడా? అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో సెయల్ చిత్ర కథ సాగుతుందన్నారు. ఇందులో హీరోను ప్రేమించమని వెంటపడే పాత్రలో హీరోయిన్ నటిస్తోందని, అయితే ఆమె హీరోను కలిసి నప్పుడల్లా ఒక ఆసక్తికరమైన సంఘటన జరుగుతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment