RAJAN
-
ప్రపంచానికి ప్రమాదం: రఘురామ్ రాజన్
ప్రపంచంలో ప్రభుత్వ రుణాలు పెరుగుతున్నాయని, అవి చాలా ప్రమాదకరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ముఖ్యంగా దానివల్ల అమెరికాకు చాలా నష్టం కలుగుతుందన్నారు. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు అమెరికా ఆర్థిక విధానాలపై ఆధారపడి ఉన్నాయని గుర్తు చేశారు.రోమ్‌లోని బ్యాంకోర్ ప్రైజ్ అవార్డు సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘ప్రభుత్వ రుణాలు పెంచుకునే దేశాలకు భవిష్యత్తులో సంక్షోభాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం, అంటువ్యాధులు పెరుగుతున్నాయి. దానివల్ల అప్పులు పేరుకుపోయే ప్రమాదం ఉంది. ఇటీవలి ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం ప్రపంచ దేశాల ప్రభుత్వ రుణాలు అధికమవుతున్నాయి. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు ఇదో హెచ్చరిక. వచ్చే ఏడాది వైట్‌హైజ్ బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండేందుకు రుణాలు తగ్గించుకోవాలి’ అన్నారు.ఇదీ చదవండి: గోల్డ్ లోన్ చెల్లింపు విధానంలో మార్పులుప్రపంచ ప్రభుత్వ రుణం ఈ ఏడాది చివరి నాటికి 100 ట్రిలియన్ డాలర్లు లేదా ప్రపంచ జీడీపీలో 93% చేరుకుంటుందని కొన్ని సర్వేలు అంచనా వేస్తున్నాయి. యూఎస్ అప్పు దాదాపు 31 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ద్రవ్యోల్బణం మందగించడం, వడ్డీ రేట్లు తగ్గడం వంటి అంశాలు ప్రభుత్వాలు రుణాలు క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం ఇస్తాయని రాజన్ అన్నారు. దేశాల అప్పులు పెరగడంవల్ల ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఇతర దేశాల నుంచి రుణం పొందే అవకాశం ఉండదని చెప్పారు. -
అలా చేస్తే ప్రజల్లో విశ్వసనీయత పోతుంది
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం నుంచి ఆహారోత్పత్తుల ధరలను మినహాయించడానికి తాను వ్యతిరేకమని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల సవరణలో ఆహార ధరలను మినహాయించాలన్న సూచనలపై రాజన్ స్పందించారు. అలా చేస్తే సెంట్రల్ బ్యాంక్ పట్ల ప్రజల్లో ఉన్న గొప్ప నమ్మకం తుడిచిపెట్టుకుపోతుందన్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో పెట్టాలంటూ ఆర్బీఐకి కేంద్రం లక్ష్యం విధించడాన్ని గుర్తు చేశారు. వినియోగదారులు వినియోగించే ఉత్పత్తుల బాస్కెట్ వరకే ద్రవ్యోల్బణ నియంత్రణ లక్ష్యం ఉండాలని అభిప్రాయపడ్డారు.ఎందుకంటే అది వినియోగదారుల అవగాహనను ప్రభావితం చేస్తుందన్నారు. రాజన్ ఓ వార్తా సంస్థకు ఇచి్చన ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయమై మాట్లాడారు. వడ్డీ రేట్ల నిర్ణయంలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని మినహాయించాలని 2023–24 ఆర్థిక సర్వేలో పేర్కొనడం గమనార్హం. ‘‘ద్రవ్యోల్బణంలో ఎంతో ముఖ్యమైన కొన్నింటిని మినహాయించి, ద్రవ్యోల్బణం నియంత్రణంలో ఉందని చెప్పొచ్చు. కానీ, ఆహార ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అలాంటప్పుడు దీన్ని ద్రవ్యోల్బణం బాస్కెట్లో చేర్చకపోతే ఆర్బీఐ పట్ల ప్రజల్లో గొప్ప విశ్వాసం నిలిచి ఉండదు’’అని రాజన్ వివరించారు. ఇలా చేయాలి.. ‘‘ఆహార ధరలు దీర్ఘకాలం పాటు అధిక స్థాయిల్లోనే కొనసాగుతున్నాయంటే, డిమాండ్‌కు సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేయడంలో ఉన్న సమస్యలను తెలియజేస్తోంది. అలాంటి సందర్భంలో ఇతర విభాగాల్లోని ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలి. సెంట్రల్ బ్యాంక్ చేయాల్సింది ఇదే’’అని రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. మొత్తం ధరలను ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణంలో ఆహారం వెయిటేజీ ప్రస్తుతం 46 శాతంగా ఉంది. దీన్ని 2011–12లో నిర్ణయించారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కట్టడి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం విధించిన లక్ష్యం. ప్రతికూల పరిస్థితుల్లో ఇది మరో 2 శాతం ఎగువ, దిగువకు మించకుండా చూడాలి. విశ్వసనీయంగా ఉండాలి.. సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్‌పై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ చేసిన ప్రయోజన వైరు« ద్య ఆరోపణలను ప్ర స్తావించగా.. ఎవరైనా, ఎప్పుడైన ఆరోపణలు చేయొచ్చంటూ, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని రాజన్ పేర్కొన్నారు. ఒక్కో ఆరోపణపై మరింత వివరంగా స్పందన ఉండాలని అభిప్రాయపడ్డారు. ‘‘అంతిమంగా మన నియంత్రణ సంస్థలు సాధ్యమైనంత వరకు విశ్వసనీయంగా మసలుకుంటే అది దేశానికి, మార్కెట్లకు మంచి చేస్తుంది. నియంత్రణ సంస్థలకూ మంచి చేస్తుంది’’అని రాజన్ పేర్కొన్నారు. -
కాలుష్యరహిత చౌక విద్యుత్!
సాక్షి, హైదరాబాద్: కాలుష్య రహిత కరెంటు.. అది కూడా కారు చౌకగా దొరికితే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదూ..ఇలాంటి టెక్నాలజీ ఇప్పటివరకు ఏదీ లేదు. కానీ ఇకపై ఇది సాధ్యమేనంటోంది హైలెనర్! ప్రపంచంలోనే తొలిసారి తాము కోల్డ్ ఫ్యూజన్ టెక్నాలజీ సాయంతో అందించే వేడి కంటే ఎక్కువ వేడిని పొందగలిగామని.. దీనివల్ల భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు ఉంటాయని హైలైనర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిద్ధార్థ దొరై రాజన్ చెప్పారు.దీని పూర్వాపరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనందరికీ వెలుగునిచ్చే సూర్యుడు కోట్ల సంవత్సరాలుగా భగభగ మండుతూనే ఉన్నాడు. విపరీతమైన వేడి, పీడనాల మధ్య హీలియం అణువులు ఒకదాంట్లో ఒకటి లయమై పోతుండటం వల్ల ఈ వెలుగు సాధ్యమవుతోంది. ఈ ప్రక్రియను కేంద్రక సంలీన ప్రక్రియ లేదా న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారని చిన్నప్పుడు చదువుకున్నాం.ఇదే ప్రక్రియను భూమ్మీద నకలు చేయడం ద్వారా చౌక, కాలుష్య రహిత విద్యుత్తు ఉత్పత్తికి బోలెడన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే ఇవి ఎంతవరకు విజయవంతమవుతాయన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో హైలెనర్ ప్రతిపాదిస్తున్న ‘లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్’ టెక్నాలజీ ఆసక్తి రేకెత్తిస్తోంది. గది ఉష్ణోగ్రతలోనే.. న్యూక్లియర్ ఫ్యూజన్‌కు విపరీతమైన వేడి, పీడనాలు అవసరమని ముందే చెప్పుకున్నాం కదా..అయితే ‘లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్’లో వీటి అవసరం ఉండదు. గది ఉష్ణోగ్రతలోనే అణుస్థాయిలో రియాక్షన్స్ జరిగేలా చూడవచ్చు. ఫలితంగా కోల్డ్ ఫ్యూజన్ టెక్నాలజీ సాయంతో అందించే వేడి కంటే ఎక్కువ వేడి అందుబాటులోకి వస్తుంది. హైలెనర్ బుధవారం హైదరాబాద్‌లోని టీ–హబ్‌లో ఈ టెక్నాలజీని ప్రదర్శించింది. వంద వాట్ల విద్యుత్తును ఉపయోగించగా... 150 వాట్లకు సమానమైన శక్తి లభించింది. మిల్లీగ్రాముల హైడ్రోజన్ ఉపయోగంతోనే అదనపు వేడి పుట్టిందని రాజన్ చెప్పారు. టి–హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాసరావు ఈ ‘లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్’పరికరాన్ని ఆవిష్కరించారు. 1989 నాటి ఆలోచనే.. హైలెనర్ చెబుతున్న టెక్నాలజీ నిజానికి కొత్తదేమీ కాదు. 1989లో మారి్టన్ ఫైష్‌మాన్, స్టాన్లీ పాన్స్ అనే ఇద్దరు ఎలక్ట్రో కెమిస్ట్‌లు తొలిసారి ఈ రకమైన టెక్నాలజీ సాధ్యతను గుర్తించారు. భారజలంతో పల్లాడియం ఎలక్ట్రోడ్‌ను వాడుతూ ఎలక్ట్రోలసిస్ జరుపుతున్నప్పుడు కొంత వేడి అదనంగా వస్తున్నట్లు వీరు గుర్తించారు. అణుస్థాయిలో జరిగే ప్రక్రియలతో మాత్రమే ఇలా అదనపు వేడి పుట్టే అవకాశముందని వీరు సూత్రీకరించారు. అయితే దీన్ని నిరూపించేందుకు ఇప్పటివరకు చాలా విఫల ప్రయత్నాలు జరిగాయని, తాము విజయం సాధించామని హైలెనర్ అంటోంది. దేశ రక్షణకు అత్యంత కీలకమైన క్షిపణులను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించిన పద్మశ్రీ ప్రహ్లాద రామారావు ఈ కంపెనీ చీఫ్ ఇన్నొవేటింగ్ ఆఫీసర్‌గా ఉండటం, ఈ టెక్నాలజీకి భారత పేటెంట్ ఇప్పటికే దక్కడం హైలెనర్‌పై ఆశలు పెంచుతున్నాయి.విద్యుత్ ఆదా..ఉత్పత్తివిద్యుత్తు, వేడి అవసరమైన ఎన్నో రంగాల్లో ఈ టెక్నాలజీ ద్వారా లాభం కలగనుంది. అంతరిక్షంలో తక్కువ విద్యుత్తును వాడుకుంటూ ఎక్కువ వేడిని పుట్టించవచ్చు. చల్లటి ప్రాంతాల్లో గదిని వెచ్చగా ఉంచేందుకు ఉపకరిస్తుంది. ఇందుకోసం ఇప్పుడు కాలుష్య కారక డీజిల్ ఇంధనాలను వాడుతున్న విషయం తెలిసిందే. ఇండక్షన్ స్టౌలను మరింత సమర్థంగా పనిచేయించవచ్చు. తద్వారా విద్యుత్తు ఆదా చేయవచ్చు. విద్యుత్తు ఉత్పత్తికీ దీనిని వాడుకోవచ్చు. -
ఇలాగైతే విజయ్ గెలవడు.. అలా చేయాల్సిందే!: నటుడు
దళపతి విజయ్ 'తమిళగ వెట్రి కళగం' పేరుతో పార్టీని ప్రారంభించడంతో తమిళనాట పాలిటిక్స్ మరింత ఆసక్తికరంగా మారాయి. అయితే విజయ్ సొంతంగా మాట్లాడకుండా తన తరఫున బుస్సీ ఆనంద్ మీడియా ద్వారా ప్రకటనలు చేస్తే గెలవరని నటుడు, నిర్మాత కె.రాజన్ అన్నారు. ఆయన ప్రజల్లోకి రావాలని ఆకాంక్షించారు. ఎంజీఆర్ ప్రజలకు చేసిన సేవల్లో 30 శాతం చేస్తే విజయ్ రాజకీయాల్లో రాణిస్తారన్నారు. ఆయన ప్రజలకు మంచి చేస్తారని భావిస్తున్నానన్నారు. నినైవెల్లా నీయడా చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై కె.రాజన్ పై వ్యాఖ్యలు చేశారు. ఇళయరాజా సంగీతం.. లేఖా క్రియేటర్స్ పతాకంపై రాయల్ ప్రభు నిర్మించిన చిత్రం నినైవెల్లా నీయడా. సెటిలైంది, రణతంత్ర, ఆరువా సౌండ్ వంటి హిట్ సినిమాల ఫేమ్ ఆదిరాజన్ ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు రాసి దర్శకత్వం వహించారు. ప్రాజన్, మనీషాయాదవ్ జంటగా నటించగా రాజా భట్టార్జి చాయాగ్రహణం, ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఇది ఇళయరాజా సంగీతం అందించిన 1,417వ చిత్రం కావడం విశేషం. చిత్ర ఆడియో లాంచ్ మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఆయన్ను కలవడమే కష్టమన్నారు.. ఈ కార్యక్రమంలో నటుడు, నిర్మాత కె.రాజన్, దర్శకుడు పేరరసు, ఆర్వీ ఉదయకుమార్, నిర్మాత కేఆర్ సినీ ప్రముఖులు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. చిత్ర దర్శకుడు ఆదిరాజన్ మాట్లాడుతూ.. ఇది మధురైలో తన మిత్రుడి జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన ప్రేమ కథా చిత్రం అని చెప్పారు. ఇందులో 70 శాతం వాస్తవం కాగా 30 శాతం కల్పితమని పేర్కొన్నారు. ఇళయరాజాను చేరడమే కష్టమని కొందరు చెప్పారని, అలాంటిది ఈ చిత్రానికి ఆయన సంగీతాన్ని అందించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇళయరాజాతో పనిచేయడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. చదవండి: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి -
ఆత్మవిశ్వాసంలో అతివలే మేటి
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ సర్వీసెస్‌లోకి వచ్చే మహిళా అధికారుల సంఖ్య ఏటా పెరుగుతుండటం శుభపరిణామం అని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ) డైరెక్టర్ ఏఎస్ రాజన్ అన్నారు. ఆత్మవిశ్వాసంలో పురుషుల కంటే అతివలే మేటి అని చెప్పారు. ప్రతి బ్యాచ్‌లోనూ 20 మందికిపైగా మహిళా ఐపీఎస్‌లు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. శిక్షణలోనూ పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా ఔట్‌డోర్‌లో సైతం తాము మేటి అని నిరూపిస్తున్నారన్నారు. ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకున్న 2021 బ్యాచ్‌లోనూ దీక్ష అనే మహిళా ఐపీఎస్ బెస్ట్ ఔట్‌డోర్ ప్రొబేషనరీగా ఐపీఎస్ అసోసియేషన్ గౌరవ కరవాలాన్ని పొందారని, ఎన్పీఏ చరిత్రలో రెండోసారి ఈ ఘనత దక్కించుకున్న అధికారిణిగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. ఎన్పీఏలో శిక్షణ పొందిన 2021 బ్యాచ్ ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ శనివారం జరగనుంది. ఈ సందర్భంగా.. దేశవ్యాప్తంగా శాంతిభద్రతల నిర్వహణలో అత్యంత కీలకమైన ఐపీఎస్ అధికారులను తీర్చిదిద్దే ఎన్పీఏలో ఇచ్చే శిక్షణ, మారుతున్న పరిస్థితులకు తగిన విధంగా శిక్షణలో తెచ్చిన మార్పులు తదితర అంశాలపై రాజన్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. అకాడమీలోకి వచ్చాక అందరూ సమానమే.. ఐపీఎస్కుకు ఎంపికయ్యే వారిలో కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్‌ల పిల్లల వరకు.. స్థానిక విద్యా సంస్థలు మొదలు కాన్వెంట్లలో చదివిన వారు..అప్పుడే చదువులు పూర్తి చేసుకున్న వారి నుంచి విదేశాల్లో లక్షల జీతాల కొలువులు వదిలి వచ్చే వారి వరకు విభిన్న నేపథ్యాల వారు ఉంటారు. అది ఎన్‌పీఏలోకి రాకముందు వరకే. ఒకసారి అకాడమీలో అడుగుపెట్టిన తర్వాత వారంతా సమానమే. మొదటి రెండు వారాలు ఇదే అంశంపై దృష్టి పెడతాం. ట్రైనీలను బృందాలుగా ఏర్పాటు చేసి వారిలో నాయకత్వ లక్షణాలు పెంచేలా చూస్తాం. ఐపీఎస్ అధికారిగా తనతోపాటు వందల మందిని కలుపుకొని నిత్యం పనిచేయాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా వారిని తీర్చిదిద్దుతాం. నైతిక విలువలు పెంచేలా శిక్షణ కొత్తగా విధుల్లోకి వచ్చే ఐపీఎస్ అధికారుల వైఖరి సరిగా ఉండడం లేదన్న విమర్శల నేపథ్యంలో 8 రాష్ట్రాల్లో 6 విధాలుగా అభిప్రాయాలు సేకరించాం. ఐపీఎస్‌ల వైఖరి, శిక్షణలో ఎలాంటి మార్పులు చేయాలన్న అంశాలపై డీఎస్పీ, సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ ర్యాంకు వరకు ఒక గ్రూప్, డీఐజీ నుంచి డీజీపీ ర్యాంకు వరకు ఒక గ్రూప్, రెవెన్యూలో వివిధ స్థాయిల అధికారులు ఒక గ్రూప్, ఎన్జీఓలు.. మీడియా ఒక గ్రూప్, సమాజంలో ప్రభావిత స్థానాల్లో ఉన్న వారు ఒక గ్రూప్, ప్రజలు ఒక గ్రూప్.. ఇలా వారి అభిప్రాయాలు తీసుకుని వాటిని క్రోడీకరించి బలాలు, బలహీనతలు గుర్తించాం. బాధితులతో ఎలా వ్యవహరించాలన్న అంశంతో పాటు ఐపీఎస్ శిక్షణ నైతిక విలువలు పెంచేలా కరికులంలో చాలా మార్పులు చేశాం. శిక్షణలోనూ స్త్రీ, పురుష తేడా లేదు అకాడమీలో శిక్షణలో ప్రవేశించిన తర్వాత మహిళలు, పురుషులు అనే తేడా కూడా ఏ అంశంలోనూ ఉండదు. శిక్షణలోనూ మినహాయింపులు ఉండవు. వారంతా కూడా సుశిక్షితులైన పోలీస్ అధికారులుగా తయారు కావాల్సిందే. వాస్తవం చెప్పాలంటే ఆత్మవిశ్వాసంలో పురుషుల కంటే మహిళలే మేటి. ప్రతి బ్యాచ్‌లో మేం ఔట్‌డోర్ శిక్షణలో మహిళలకు ప్రత్యేకంగా ట్రోఫీ కేటాయిస్తాం. ఆ ట్రోఫీయే ఈసారి దీక్షకు దక్కింది. 2019లోనూ రంజితశర్మ బెస్ట్ ఔట్‌డోర్ ప్రొబేషనరీగా నిలిచారు. ఔట్‌డోర్ శిక్షణలో వాళ్లు పురుషులను వెనక్కి నెట్టి బెస్ట్‌గా నిలిచారు. చూస్తుంటే ఇకపై బెస్ట్ లేడీ ప్రొబేషనరీ ఔట్‌డోర్ ట్రైనింగ్ మాదిరిగా బెస్ట్ జెంటిల్మెన్ ప్రొబేషనరీ ఔట్‌డోర్ ట్రైనింగ్ అని పెట్టాల్సి వచ్చేట్టుంది.. (నవ్వుతూ..). ‘సైబర్’ సవాళ్లను ఎదుర్కొనేలా ప్రత్యేక శిక్షణ సైబర్ నేరాలనేవి భవిష్యత్తులో మనం ఎదుర్కొనబోయే అతిపెద్ద ముప్పు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు యువ ఐపీఎస్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. ఇందుకోసం ఎన్పీఏలో ప్రత్యేకంగా నేషనల్ డిజిటల్ క్రైం రిసోర్స్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (ఎన్డీసీఆర్టీసీ)ని ఏర్పాటు చేశాం. సరికొత్త సైబర్ సవాళ్లను ఎదుర్కొనేలా ఇక్కడ శిక్షణ ఇస్తాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 10 వేల మంది వివిధ ర్యాంకుల పోలీస్ అధికారులకు ఎన్డీసీఆర్టీసీలో సైబర్ క్రైం దర్యాప్తు, నియంత్రణలో శిక్షణ ఇచ్చాం. ప్రొబేషనరీ ఐపీఎస్‌లతోపాటు సీనియర్ ఐపీఎస్‌లకు కూడా వివిధ దశల్లో ఇక్కడ శిక్షణలు ఇస్తుంటాం. మన పోలీసులతో పాటు నేపాల్, భూటాన్, మాల్దీవులు, మారిషస్ దేశాల పోలీస్ అధికారులకు సైతం శిక్షణ ఇస్తాం. -
వారీసు మూవీకి థియేటర్లు దొరకడం లేదని బాధపడుతున్నారు, కానీ..: నిర్మాత
బాస్కెట్ ఫిలింస్ అండ్ క్రియేషన్స్ పతాకంపై భాస్కీ దర్శకత్వం వహించిన చిత్రం హై 5. నూతన తారలతో రూపొందిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో కార్యక్రమాన్ని చెన్నై ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. దర్శకుడు ఆర్వీ ఉదయకుమార్, పేరరసు, నటుడు, నిర్మాత కే.రాజన్, జాగ్వర్ తంగం ముఖ్య అతిథులుగా పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కె.రాజన్ మాట్లాడుతూ.. ఒకప్పుడు కుటుంబ అనుబంధాలకు నిలయంగా తమిళనాడు ఉండేదని, అలాంటిది ఇప్పుడు ఒకే ఇంటిలో మనిషికో గది ఉంటూ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదన్నారు. ఆ ఆవేదనను ఆవిష్కరించే చిత్రంగా హై 5 చిత్రాన్ని రూపొందించారని, అందుకు చిత్ర యూనిట్‌కు అభినందనలు అన్నారు. ఇకపోతే వారీసు చిత్రానికి తెలుగులో థియేటర్లు దొరకడం లేదని ఇక్కడ కొందరు బాధపడుతున్నారని, ఇక్కడ చిత్ర పరిశ్రమకు పట్టుకొమ్మలయిన చిన్న చిత్రాల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. హై 5 లాంటి చిన్న సినిమాలు ఆడాలన్నారు. దర్శకుడు ఆర్వీ ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘హై5’ చిత్ర ట్రైలర్ చూస్తున్నప్పుడు హాలీవుడ్ చిత్రాన్ని చూసినట్లు అనిపించిందన్నారు. చిత్రాన్ని కెనడాలో చిత్రీకరించినట్లు చెప్పారని, మంచి సందేశంతో రూపొందించిన ఈ చిత్ర యూనిట్‌కు అభినందనలు అన్నారు. చిత్ర దర్శక నిర్మాత భాస్కీ మాట్లాడుతూ తల్లిదండ్రులు చివరి దశలో చిన్న పిల్లల మనస్థత్వంతో ప్రవర్తిస్తారని, అయితే ఇంటిలోని వారు దీనిని అర్థం చేసుకోవడం లేదని, తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలని చెప్పే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. -
ఆ విషయంలో టాలీవుడ్ గ్రేట్: తమిళ నిర్మాత రాజన్
ఆర్ఎఫ్ఐ ఫిలింస్ పతాకంపై రెహాన్ అహ్మద్ నిర్మించిన చిత్రం ‘విచిత్రం’. వీఆర్ఆర్ దర్శకత్వం వహించిన ఈ త్రంలో నటుడు శ్రీనివాస్, ఈరిన్ జంటగా నటించారు. పలువురు పాత కొత్త నటీనటులు ముఖ్యపాత్ర పోషింన ఈ త్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం స్థానిక వడపళనిలోని కమల థియేటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నటుడు, నిర్మాత కె.రాజన్ మాట్లాడుతూ చిన్న బడ్జెట్ చిత్రాలు విజయం సాధిస్తే పరిశ్రమ అభివృద్ధి చెందుతుందన్నారు. చదవండి: విజయ్-లోకేశ్ కనకరాజుల మూవీ.. బయటికొచ్చిన కథ! దానివల్ల కార్మికులు బాగుంటారన్నారు. ఈ చిత్ర యూనిట్ విజయవంతం అయితేనే మళ్లీ వాళ్లు సినిమా చేస్తారన్నారు. విచిత్రం మూవీ నిర్మాత చాలా ఉన్నత వ్యక్తి అని, మంచి యాక్షన్ ఓరియంటెడ్ కథా చిత్రాన్ని నిర్మించారని, విత్రం మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపోతే తమిళనాడులో హీరోలకు 60 శాతం పారితోషికం చెల్లించే పరిస్థితి నెలకొంది అన్నారు. అలాంటి చిత్రాలు చేస్తే ఎలా ఆడతాయని ప్రశ్నించారు. నిర్మాతలు బతికి బట్ట కట్టకపోతే చిత్ర పరిశ్రమ బతక లేదన్నారు. ఈ విషయంలో తెలుగు చిత్ర నిర్మాతలు దమ్మున్న వారని, హీరోలు పారితోషికం, నిర్మాణ వ్యయం వంటివి తగ్గించే విషయమై చర్చించేందుకు షూటింగ్‌లను రద్దు చేశారని ప్రసంశించారు. -
ఎమ్మెల్యేగా విశేష సేవలు.. సెంటు భూమి, ఇల్లు కూడా లేని నేత
స్వార్థం పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఆయన భావాలు చీకటిలో చిరుదివ్వెలు. మనం ఏమి చేశామని కాకుండా.. మనకు ఏమి లాభం అని ఆలోచించే మనుషుల్లో, స్వాతంత్య్ర పోరాటంలో తనవంతు పాత్ర పోషించి చిల్లిగవ్వ ఆశించని మహానుభావుడు. దేశం కోసం పక్కనపెడితే.. ఊరికి కాస్త మంచి చేసినా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ అడుగడుగునా కనిపిస్తున్న పరిస్థితుల్లో.. ఆయన మిగుల్చుకుంది నాలుగు జతల బట్టలు మాత్రమే. భూమి ఇస్తామన్నా.. ఇల్లు తీసుకోమన్నా.. తృణప్రాయంగా తిరస్కరించిన ఆ దేశభక్తుడు ప్రజల గుండెల్లో తనపేరు చిరస్థాయిగా ఉంటే చాలని కోరుకోవడం చూస్తే ఎలాంటి వారైనా ‘సెల్యూట్’ చేయాల్సిందే. అచ్చ తెలుగు భారతీయత ఉట్టిపడే పంచె, లాల్చీ ధరించిన.. వయస్సు శత వసంతాలు దాటిన ఆయనతో స్వాతంత్య్రోద్యమ మాట కలిపితే.. ఆ పోరాట పటిమ తూటాలా పేలుతుంది.. ఆ వయస్సులోనూ, ప్రతి మాటలోనూ ‘రాజ’సం ఉట్టిపడుతుంది.. ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తోంది.. భరతమాత ముద్దుబిడ్డగా ఆయన మనస్సు త్రివర్ణ శోభితమవుతోంది. పలమనేరు: ‘‘ప్రభుత్వం నుంచి ఏనాడు ఏమి ఆశించలేదు. ఇప్పుడు నాకు నాలుగు జతల బట్టలు తప్ప ఇంకేమీ లేవు అని స్వాతంత్య్ర సమరయోధులు, పలమనేరు మాజీ ఎమ్మెల్యే ఠాణేదార్ చిన్న(టీసీ) రాజన్ వెల్లడించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ ప్రాంతంలోని స్వాతంత్య్ర సమరయోధులు, మృతి చెందిన వారి సతీమణులను సన్మానించే కార్యక్రమాన్ని రెవెన్యూ అధికారులు బుధవారం నిర్వహించారు. పలమనేరుకు చెందిన టీసీ రాజన్, దివంగత రామ్మూర్తి సతీమణి జయలక్షుమమ్మకు మేళతాళాలమధ్య ఘనస్వాగతం పలికి వారి అనుభవాలను ఆలకించి ఘనంగా సన్మానించారు. నాటి పరిస్థితులు ఆయన మాటల్లోనే.. నా వయస్సు ఇప్పుడు 104 ఏళ్లు మరో రెండు నెలల్లో 105లో పడతాను. చెవులు సరిగా వినపడవు, కంటిచూపు తగ్గింది. జిల్లాలో బతికున్న ఫ్రీడం ఫైటర్లలో బహుశా నేనే మిగిలానేమో. దేశానికి స్వాతంత్య్రం కోసం నాడు ఎందరో వీరులు పడిన కష్టాలను నేటి సమాజానికి తెలిసేలా ప్రభుత్వం చేస్తున్న మంచి పని ఇది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉండేది. ఆపై కొన్ని పార్టీలొచ్చాయి. 1956లో రాజాజీ స్వతంత్ర పార్టీని స్థాపిస్తే అందులో రంగాను జాతీయ అధ్యక్షునిగా నియమించారు. నన్ను చిత్తూరు జిల్లా కార్యదర్శిని చేశారు. 1957లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెనాలిలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీచేసి రంగా ఓడిపోయారు. అనంతరం చిత్తూరు ఎంపీగా ఉన్న అనంతశయనం అయ్యంగార్ను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బిహార్ గవర్నర్‌గా నియమించింది. దీంతో ఇక్కడి ఎంపీ స్థానానికి 1962లో ఎన్నిక వస్తే రంగాను స్వతంత్ర పార్టీ ఇక్కడ పోటీలో పెట్టింది. అప్పట్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి విశ్వనాథ రెడ్డిపై 19వేల మెజారిటీతో గెలిచారు. ఈ విజయానికి నేను చేసిన కృషికి మెచ్చి, 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ పలమనేరు అభ్యర్థిగా నన్ను నిలబెట్టింది. ఈ ఎన్నికలో నేను 9వేల మెజారిటీతో గెలిచాను. గ్రామాల్లో తిరిగాను గెలిచిన తరువాత నెలకు 15 రోజులు గ్రామాల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొన్నా. ఆ సమస్యలను అసెంబ్లీలో చర్చించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. రైతులు పండించిన బియ్యాన్ని రవాణా చేయకుండా బెల్ట్ ఏరియాగా ప్రకటించారు. దీంతో ఈ ప్రాంతంలో ఆరేడు చెక్ పోస్టులుండేవి. ఈ సమస్యను అసెంబ్లీలో చర్చించి దాన్ని రద్దు చేయించా. పాలార్ బేసిన్ స్కీమ్ మేరకు నదులపై చెక్‌డ్యామ్‌లు నిషేధం పెట్టారు. దీనిపై పోరాటం సాగించా. ఆ పోరాటం వల్లే రాష్ట్రంలో నదులపై చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో కరెంట్ ఉండేది కాదు. దీనిపై అసెంబ్లీలో చర్చించి అన్ని గ్రామాల్లోనూ వెలుగులు నింపా. ఊరూరా పండగే జెండా పండగ వచ్చిందంటే ఊరు ముందు పచ్చతోరణాలను కట్టి జెండా ఎగురవేసే వాళ్లు. ఆ జెండా ఎగురవేయడం కోసం ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. జెండా ఎగురవేసి తరువాత నిర్వహించే సమావేశంలో గ్రామ పెద్దలు, స్వాతంత్య్రం కోసం పాటు పడిన వారు ప్రసంగిస్తుంటే వినేందుకు ఎగబడేవారు. అందరూ తెల్లటి దుస్తులను ధరించి కార్యక్రమానికి వచ్చేవారు. ఊరూరా జెండా పండుగ రోజు స్థానిక ప్రముఖులు, విద్యావేత్తలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేవారు. శాకాహారిని నేను పక్కా శాకాహారిని. ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు భోజనంలో తీసుకుంటా. నేను ఇంత ఆరోగ్యంగా ఉండానంటే మా వంశంలోని జీన్స్ కారణమే. మా అక్క 108 ఏళ్లు బతికింది. మా అన్నలు 98 ఏళ్లు బతికారు. ప్రత్యేకంగా నేను ఆహారమేమీ తీసుకోనూ. అయితే మితంగా తింటాను. ప్రస్తుతం బెంగళూరులోని పటేల్ లేఅవుట్, వర్తూర్‌లో కుమారుడి వద్ద ఉంటున్నాను. ఈ దేశమే నాది అయినప్పుడు ఇక ఇల్లెందుకు, పొలమెందుకు.. నేను దేశం కోసమే పుట్టాను. దేశం కోసమే పోరాడాను. అందుకే ప్రభుత్వాలు ఇచ్చే నజరానాలపై మోజు పడలేదు. స్వాతంత్య్ర పోరాటంలో నన్ను అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో పెట్టినా వెనుకడుగు వేయలేదు. 55 ఏళ్ల క్రితమే ఎమ్మెల్యేగా సేవలందించా. అప్పట్లో స్వాతంత్య్ర సంబరాన్ని ఊరూరా ప్రజలే స్వచ్ఛందంగా జెండా ఎగురవేసి దేశభాక్తిని చాటుకునేవారు. ఈ దేశం నా కోసం ఏం చేసిందని కాకుండా, నా దేశానికి నేనేం చేయగలనని మాత్రం ఆలోచించాను. ఈ జీవితంలో దేశం కోసం చేయాల్సిందంతా చేశాను. – టీసీ రాజన్, స్వాతంత్య్ర సమరయోధుడు జైల్లోనే పరిచయాలు టెలిగ్రాఫ్లైన్ల (ప్రభుత్వ ఆస్తుల)ను ధ్వంసం చేసిన అభియోగం కింద అప్పటి ఎస్పీ సుబ్బరాయన్ నన్ను మూడు నెలలు రాజమండ్రి జైల్లో పెట్టారు. అదే జైల్లో ఉన్న టీకే నారాయణరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, రాచకొండ నరసింహులు, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డితో పరిచయం ఏర్పడింది. మరింత దేశభక్తి పెరిగింది. అప్పట్లో నరసింహారెడ్డి, సీతారామయ్య, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, పెండేకంటి వెంకటసుబ్బయ్యతో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నా. ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి వద్దనుకున్నా. తామ్రపత్రమూ వద్దనే చెప్పాను. మాజీ ఎమ్మెల్యేలకు పింఛను వద్దని వ్యతిరేకించాను. ప్రభుత్వం ఇచ్చే 15 ఎకరాల భూమి కూడా తీసుకోలేదు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఇంటి స్థలమూ వద్దని చెప్పాను. ఉట్టి అన్నానికి ఉప్పుకూడా ఇచ్చేవారు కాదట గాంధీ ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునిస్తే నా భర్త రామమూర్తి వెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న బ్రిటీష్ అధికారులు టెలిఫోన్ కమ్మీలను కత్తిరించిన కేసులో ఆయన్ను జైలులో పెట్టారు. ఆ సమయంలో ఒట్టి అన్నం మెతుకులు పెట్టారంట. అది తినేందుకు చప్పగా ఉంటుందట. కాస్త ఉప్పు ఇవ్వమని అడిగితే చాలా హింసించేవారని నా భర్త చెప్పేవారు. అలాంటి ఆంగ్లేయుల బానిస సంకెళ్లను తెంచి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహనీయులను స్మరించుకోవడం మన ధర్మం. - నాటి స్వాతంత్య్ర సమరయోధులు రామమూర్తి సతీమణి జయలక్షుమమ్మ -
వరుస ఫెయిల్యూర్స్.. అయినా తగ్గలా.. ‘స్లైస్ పే’ రూపంలో గట్టి సక్సెస్ కొట్టి మరీ..
ఫెయిల్యూర్స్ అనేవి ఒకదాని తరువాత ఒకటి వరుస కడితే, ఎవరైనా ఏంచేస్తారు? ‘ఇక చాలు నాయనా’ అని వెనక్కితగ్గుతారు. సక్సెస్‌ను గట్టిగా కోరుకునేవారు మాత్రం ‘తగ్గేదేలా’ అనుకుంటారు. రాజన్ బజాజ్ ఈ కోవకు చెందిన యువకుడు. మూడు ఫెయిల్యూర్స్ తరువాత...‘స్లైస్ పే’ రూపంలో గట్టి సక్సెస్ కొట్టిన ఘనుడు... ‘బజాజ్’ అనే మాట వినిపించగానే పెద్ద పెద్ద కంపెనీలు గుర్తుకు వస్తాయి. అయితే ఈ ‘బజాజ్’కు రాజస్థాన్ అల్వార్‌లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన రాజన్ బజాజ్‌కు బీరకాయ పీచు బంధుత్వం కూడా లేదు. ఐఐటీ–ఖరగ్‌పూర్‌లో చదువుపూర్తయిన తరువాత రాజన్ ‘ఫ్లిప్‌కార్ట్’లో ఉద్యోగం చేశాడు. పదినెలల తరువాత... ‘ఇలా అయితే ఎలా?’ అనుకున్నాడు. దీనికి కారణం ఏదైనా ఒక స్టార్టప్ స్టార్ట్ చేసి స్టార్ అనిపించుకోవాలనేది తన కల. ‘ఫ్లిప్‌కార్ట్’లో తనకు చాలా బాగుంది. ఇలా సంతృప్తి పడి అక్కడే ఉంటే, తన కల కూడా కదలకుండా అక్కడే ఉంటుందని తనకు తెలుసు. ఉద్యోగం వదిలేసిన తరువాత... బెంగళూరులో ‘మెష్’ పేరుతో గేమింగ్ కన్సోల్స్, కెమెరా, డీవిడీలు అద్దెకు ఇచ్చే బిజినెస్‌ను స్టార్ట్ చేశాడు. తన బైక్‌పై తిరుగుతూ ఆర్డర్స్ డెలివరీ చేసేవాడు. ‘అద్దెకు తీసుకునే అవకాశం ఉన్నప్పుడు సెకండ్ హ్యాండ్, థర్డ్‌హ్యాండ్ నాసిరకం వస్తువులు మీకేలా?’ అనేది తన నినాదం అయింది. రెండు నెలల తరువాత డెలివరీ బాయ్‌ని నియమించుకున్నాడు. రెంటల్‌కు మార్కెట్ పెద్దగా లేకపోవడం, డ్యామేజీ...మొదలైన కారణాలతో ‘మెష్’కు టాటా చెప్పాడు. ఆ తరువాత ‘కార్ అండ్ బైక్’ రెంటల్ బిజినెస్‌లోకి వచ్చాడు. రోజుకు 20 నుంచి 30 వరకు ఆర్డర్లు వచ్చేవి. యాక్సిడెంట్స్ వల్ల వచ్చే నష్టాలు, కార్ల నిర్వాహణ కష్టం కావడంతో ఈ వ్యాపారానికి కూడా ‘బైబై’ చెప్పాడు. ఆ తరువాత ‘ఫర్నిచర్ రెంటల్’ బిజినెస్‌లోకి దిగాడు. ఇది కూడా నిరాశపరిచింది. ఆగిపోయాడు... ఆలోచించాడు... ‘చేసింది చాలు ఇక రాజస్థాన్‌కు వెళ్లిపోదాం’ అనుకోలేదు. పోయిన చోటే వెదుక్కోవాలి అంటారు కదా! ఆగిపోయాడు. ఆలోచించాడు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘బై–నౌ–పే–లాటర్’ (బీఎన్‌పీఎల్) వెంచర్ గుర్తుకు వచ్చింది. ఆ తరహాలోనే యువతరాన్ని లక్ష్యంగా పెట్టుకొని ‘స్లైస్ పే’ను స్టార్ట్ చేశాడు. ఇఏంఐ పేమెంట్స్ సర్వీస్‌గా చిన్న స్థాయిలో మొదలైన ‘స్లైస్’ ఇండియాలో చెప్పుకోదగ్గ ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీగా ఎదిగి, అమెరికన్ మల్టీనేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ‘విసా’తో భాగస్వామ్యం కుదుర్చుకునే స్థాయికి ఎదిగింది. రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) లైసెన్స్ తీసుకుంది. ‘స్లైస్’ స్టార్టప్ మెగా సక్సెస్ వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ‘గతంతో పోల్చితే యంగ్ జెనరేషన్‌కు క్రెడిట్ యాక్సెస్‌ను సులభతరం చేసింది స్లైస్’ అంటారు విశ్లేషకులు. మరి రాజన్‌ను అడిగి చూడండి. ఇలా అందంగా చెబుతాడు... ‘ఫెయిల్యూర్స్ గెలుపు పాఠాలు చెబుతాయి. అవి ఎవరికి వారు తెలుసుకోవాల్సిందే’ ! చదవండి: Suman Kalyanpur: ఓడిన కోకిల... ఆమె గొంతు కూడా అచ్చు లతా గొంతులాగే.. -
Electric Bike: ఆ పిల్లాడు చెప్పిన అబద్ధం.. అద్భుతాన్ని ఆవిష్కరించింది
అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ళ.. కాదేది ప్రయోగానికి అనర్హం అనే చందాన, ఓ కుర్రాడు పాత బైక్ స్క్రాప్‌తో ఏకంగా ఎలక్ట్రిక్ బైక్ తయారీ చేసి ఔరా అనిపించాడు. లాక్డౌన్ సమయాన్ని వృథా చేయకూడదనే అతని ఆలోచన.. ఇలా అద్భుతాన్ని ఆవిష్కరించింది. అయితే ఈ ఆవిష్కరణ కోసం ఆ కుర్రాడు.. తన తండ్రికి చెప్పిన ఒక్క అబద్ధం ఏమిటి? ఆ అబద్ధం అతని జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? ఇందుకోసం రాజన్ ఎలా కష్టపడ్డాడో ఇప్పుడు చూద్దాం.. ఢిల్లీ సుభాష్ నగర్‌కు చెందిన రాజన్.. ఒక్కడే పాత రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాడు. అయితే ఈ బైక్ తయారీ వెనుక పెద్ద స్టోరీయే ఉందని కుర్రాడి తండ్రి దశరథ్ శర్మ చెబుతున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఆటపాటలతో కాకుండా.. రాజన్ ఏదో ఒక ప్రయోగం చేయాలని అనుకున్నాడు. ప్రయోగంలో భాగంగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ మీద అతని దృష్టి పడింది. ముందు ఎలక్ట్రిక్ సైకిల్ తయారీకి పూనుకోగా.. అదికాస్త విఫలం అయ్యింది. ఆ ప్రయోగంలో రాజన్ గాయపడ్డాడు కూడా. దీంతో రాజన్‌ను తండ్రి అడ్డుకున్నారు. అయితే ఆ కుర్రాడికి ప్రయోగాలంటే చాలా ఇష్టం. అందుకే ఓ ప్లాన్ వేశాడు. స్కూల్ ప్రాజెక్టు వంకతో.. స్కూల్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎలక్ట్రిక్ బైక్ తయారు చేయాలని టీచర్లు చెప్పినట్లు తండ్రికి అబద్ధం చెప్పాడు రాజన్. అది నిజమని భావించి.. స్నేహితులు, ఆఫీస్ కొలీగ్స్ సాయంతో ఆ ‘అబద్ధపు’ ప్రాజెక్టు డబ్బులు సమకూర్చాడు దశరథ్. అటుపై మాయాపురి జంక్ మార్కెట్ నుంచి ఓ పాత రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తెచ్చి ఇచ్చాడు. ఇక రాజన్ ఆ పాత బండిని ఎలక్ట్రికల్ బైక్‌గా మార్చే పనిలో పడ్డాడు. మూడు నెలల పాటు శ్రమించి ఎలక్ట్రిక్ బైక్‌కు ఒక రూపం తీసుకొచ్చాడు. ఈ ప్రయత్నంలో తండ్రి దశరథ్ రోజూ కొడుకును ప్రొత్సహించడం విశేషం. చివరికి తండ్రికి రాజన్ అసలు విషయం చెప్పడం.. కొడుకు సాధించిన ఘనత చూసి ఆ తండ్రి ఉప్పొంగిపోవడం ఒకదాని వెంట ఒకటి జరిగాయి. ‘‘రాజన్ వయసు పదిహేనేళ్లు. టీచర్లు ఇలాంటి ప్రాజెక్టు ఇవ్వడం ఏంటి? వీడేం ఎలక్ట్రిక్ బైక్ తయారు చేస్తాడని నవ్వుకున్నా. కానీ, తీరా బైక్‌ను చూశాక నా కళ్లారా నేనే నమ్మలేకపోయా’ అంటున్నాడు దశరథ్. విశేషం ఏంటంటే.. గూగుల్, యూట్యూబ్‌లో చూసి ఈ ఈ-బైక్‌ను తయారు చేశాడు రాజన్. గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలిగే ఈ ఈ-బైక్‌ను పరిశీలన పంపనున్నట్లు జిల్లా అధికారి సంత్ రామ్ చెప్తున్నారు. ఈ బైక్ తయారీ సఫలం కావడంతో రాజన్ ఇప్పుడు ఎలక్ట్రిక్ కారును తయారీపై ఫోకస్ పెట్టాడు. చదవండి: Tesla: వారెవ్వా టెస్లా.. ‘లేజర్’తో అద్దాలు శుభ్రం! -
అదే జరిగితే పీహెచ్‌సీల్లో డాక్టర్లు కనిపించరు!
నీట్ ఎగ్జామ్‌ను గనుక కొనసాగిస్తే.. రాబోయే రోజుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు కనిపించరని ఆందోళన వ్యక్తం చేశారు మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, విద్యావేత్త ఏకే రాజన్. నీట్ పరీక్ష-ప్రజాభిప్రాయసేకరణ కోసం రాజన్ నేతృత్వంలో తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తన తుది నివేదికను సమర్పించింది కూడా. చెన్నై: ‘నీట్ వల్ల పేదలకు ఇబ్బందులే ఎదురవుతాయి. ఉన్నత వర్గాలకు చెందినవాళ్లే ఎక్కువ సీట్లను దక్కించుకునే ఆస్కారం ఉంటుంది. అప్పుడు స్థానికులకు వైద్య విద్య దక్కదు. బాగా డబ్బున్నవాళ్లు మారుమూల పల్లెల్లో వైద్య సేవలను అందించేందుకు ముందుకొస్తారా? విదేశాలకు వెళ్లడానికి, వాళ్ల గురించి వాళ్లు ఆలోచించుకోవడానికే ఇష్టపడతారు. అప్పుడు పీహెచ్‌సీలు ఖాళీగా ఉంటాయి. వైద్యం అందక పేదల ప్రాణాల మీదకు వస్తుంది’అని మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే రాజన్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి తమిళనాడు తప్ప మిగతా రాష్ట్రాలేవీ నీట్‌ను వ్యతిరేకించట్లేదని, కానీ, త్వరలో మిగతా రాష్ట్రాలు కూడా తమిళనాడు బాటలోనే డిమాండ్ వినిపిస్తాయని, ‘హిందీ తప్పనిసరి’ ఆదేశాల విషయంలో జరిగిందే నీట్ విషయంలోనూ జరగొచ్చని రంజన్ అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే 86 వేల మంది నుంచి వచ్చిన విజ్ఞప్తులు, అభిప్రాయాలను పరిశీలనలోకి తీసుకుని.. మరికొందరితో మాట్లాడి, విద్యావేత్తలతో చర్చించాకే ఈ రిపోర్ట్ తయారు చేసినట్లు రాజన్ వెల్లడించారు. ఇదిలా ఉంటే మెడికల్ అడ్మిషన్లకు సంబంధించిన తప్పనిసరి ఎగ్జామ్ నీట్ వల్ల వెనుకబడిన వర్గాలు, గ్రామీణ ప్రాంత పిల్లలకు వైద్య విద్యలో అవకాశాలు దక్కవని, సిలబస్ సమస్యతో పాటు కోచింగ్ లాంటి వాటితో ఆర్థిక భారం పడుతుందని, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలను సైతం ప్రస్తావిస్తూ రాజన్ కమిటీ తన ప్రాథమిక రిపోర్ట్‌ను తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించింది. అందరికీ సమాన హక్కులు దక్కనప్పుడు.. అడ్డుగా ఉన్న నిబంధనలను(నీట్) మార్చాల్సిన అవసరం ఉంటుందని రాజన్ అంటున్నారు కూడా. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయిన నీట్ వల్ల విద్యార్థులకు సామాజిక న్యాయం దక్కదనే అంశంపై పార్టీలకతీతంగా తమిళనాడు నుంచి పరీక్ష రద్దు డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ డిమాండ్‌కు పలువురు సెలబ్రిటీలు సైతం మద్దతు తెలుపుతుండడం విశేషం. అయితే ఇవేం పట్టించుకోని కేంద్రం నీట్ యూజీ 2021 పరీక్షను సెప్టెంబర్ 12న నిర్వహించబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ‘స్కూళ్లు, కాలేజీలు మూసి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షను నిర్వహిస్తే కరోనా వ్యాప్తికి కారణంగా మారే అవకాశం ఉంది. అందువల్ల మీ నిర్ణయంపై మరోసారి ఆలోచించండి’ అని తమిళనాడు సీఎం స్టాలిన్ ఇటీవలె ప్రధాని మోదీని కోరారు. ఇంకోవైపు విద్యార్థులు కూడా అక్టోబర్ వరకు ఎగ్జామ్ వాయిదా వేయాలంటూ ట్విటర్లో ట్రెండ్ కొనసాగిస్తున్నారు. -
చినుకులా రాలి... నదులుగా సాగి
ప్రభాతాన వినాలంటే అతని పాట ఉంది. ‘పూజలు చేయ పూలు తెచ్చాను’ పరవశాన పాడుకోవాలంటే అతని పాట ఉంది. ‘మల్లెలు పూసె వెన్నెల కాసే’ ఒకరి సమక్షంలో మరొకరు పాడుకోవాలంటేనో? ‘ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది’ నిరాశలో ఒక తోడు కావాలా? ‘మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం’ కుర్రకారు శిగమూగాలంటే? ‘ఆకాశం నీ హద్దురా అవకాశం వదలొద్దురా’ తెలుగుపాటకు పల్లవి అనుపల్లవిగా భాసించిన రాజన్– నాగేంద్ర సోదరుల్లో నాగేంద్ర ఇరవై ఏళ్ల క్రితమే వెళ్లిపోయారు. ఇప్పుడు రాజన్ వంతు. మెలొడీ.. లాలిత్యం... రాజన్ నాగేంద్రల సంగీతం.. చల్లదనాన్ని పంచిన మంచు శిఖరం కూలి కాలంలో కరిగిపోయింది నేడు. సంగీత దర్శకుడు రాజన్‌కు నివాళి ఇది. రాజన్ ఇకలేరు ప్రముఖ సంగీత దర్శకులు రాజన్ (87) మృతి చెందారు. ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో బెంగళూరులోని స్వగృహంలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. 1933లో మైసూర్‌లోని శివరాంపేట్‌లో రాజప్పకు జన్మించారు రాజన్. రాజప్ప హార్మోనియమ్, ఫ్లూట్ ప్లూయర్. పలు చిత్రాలకు పని చేశారాయన. తన సంగీత జ్ఞానాన్ని చిన్నప్పటినుంచే పిల్లలకు పంచారు రాజప్ప. 1952లో కన్నడ చిత్రం ‘సౌభాగ్య లక్ష్మీ’తో సోదరుడు నాగేంద్రతో కలసి సంగీతదర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించారు రాజన్. దాదాపు 40 సంవత్సరాల పాటు సుమారు 375 సినిమాలకు ఈ ద్వయం సంగీతం అందించారు. కన్నడ, తెలుగు, తమిళం, తుళు, సింహళ భాషల్లో సంగీతాన్ని అందించారు. రాజన్–నాగేంద్ర ద్వయంగా ఈ ఇద్దరూ పాపులర్. తెలుగులో తొలి నంది అవార్డు అందుకున్న సంగీత దర్శకులు ఈ సోదరులే. ‘పంతులమ్మ’ చిత్రానికి ఈ పురస్కారం లభించింది. తెలుగులో ‘అగ్గిపిడుగు, పూజ, పంతులమ్మ, మూడుముళ్లు, సొమ్మొకడిది సోకొకడిది, ప్రేమఖైదీ, రెండు రెళ్ల ఆరు, నాగమల్లి, పులి బెబ్బులి, కిలాడీ దొంగలు’ వంటి సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించారు. 2000 సంవత్సరంలో నాగేంద్ర మృతి చెందారు. రాజన్ బెంగళూరులో ‘సప్త స్వరాంజలి’ అనే సంగీత పాఠశాలను స్థాపించారు. లాక్‌డౌన్‌లోనూ ఆన్లైన్లో సంగీత పాఠాలు తీసుకున్నారాయన. రాజన్ కుమారుడు అనంత్ కుమార్ కూడా సంగీతదర్శకుడే. సోమవారం బెంగళూరులోని హెబ్బాళలోని స్మశాన వాటికలో రాజన్ అంత్యక్రియలు జరిగాయి. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తపరిచారు. తెలుగువారు ఘనకార్యాలు చేస్తుంటారు. కాకపోతే తెలుగువారికి పెద్దగా పట్టదు. కన్నడ సీమలో తెలుగువారు రాజన్–నాగేంద్ర చాలా పెద్ద సంగీత దర్శకులు అయ్యారు. వారి దగ్గర పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం అనే తెలుగువారు చాలా హిట్ సాంగ్స్ పాడారు. కన్నడ ప్రజల కంఠానికి తెలుగు వారు రాసిన గంధం ఇది. కన్నడిగులు అది గుర్తించి గౌరవిస్తారు. తెలుగువారు చాలా తక్కువ ప్రస్తావిస్తారు. రాజన్–నాగేంద్రల తండ్రి తరం తెలుగు ప్రాంతం నుంచే మైసూర్ ప్రాంతానికి వలస వెళ్లింది. వారు నేటికీ తెలుగే ఇంట్లో మాట్లాడుకుంటారు. వారి ఇంటి భాష తెలుగు. బతుకు భాష కన్నడం. రాజన్–నాగేంద్రల తండ్రి రాజప్ప అలనాడు మైసూర్ ప్రాంతంలో మూకీ సినిమాలు రిలీజైతే హాల్లో కూచుని సన్నివేశాలకు తగినట్టుగా వాద్యసంగీతం సృష్టించి షోకు ఇంత చొప్పున తీసుకునేవాడు. ఆ రోజుల్లో మూకీ సినిమాల వ్యాఖ్యాతలకు, ఇలా వాద్యహోరు సృష్టించేవారికి నాలుగు డబ్బులు దొరికేవి. అయితే ఆ డబ్బుల కంటే తన ఇద్దరు పిల్లలకు నాలుగు స్వరాలు అందివ్వడమే మంచిదని రాజప్ప అనుకునేవాడు. ఆయన ఇద్దరు కొడుకులు రాజన్–నాగేంద్ర తండ్రి కోరినట్టే సంగీతం నేర్చుకున్నారు. రాజన్‌కు వయొలిన్లో గొప్ప ప్రవేశం వచ్చింది. నాగేంద్ర పాటలు పాడేవాడు. అన్నదమ్ములకు సంగీతం మీదే ధ్యాస ఉండటంతో అతి కష్టం మీద హైస్కూలు వరకూ చదివి పద్నాలుగు పదిహేనేళ్లు రావడంతోటే బెంగళూరులో సంగీత బృందాల్లో పని చేయడం మొదలెట్టారు. వారి ప్రతిభను గమనించి కన్నడిగుడని అందరూ పొరబడే మరో సంగీత ఉద్దండుడు, కన్నడ తొలి టాకీకి సంగీతాన్ని అందించిన టి.ఆర్.పద్మనాభశాస్త్రి వారిని మద్రాసు తీసుకెళ్లి ఒక సినిమా సంగీతంలో భాగం చేశారు. అక్కడ ఒకటి రెండేళ్లు ఉన్నాక తిరిగి బెంగళూరు చేరుకున్నారు అన్నదమ్ములు. విఠలాచార్య విన్న పాట అతి పొదుపుగా ఖర్చు చేసి సినిమా పూర్తి చేసే విఠలాచార్య ఈ కొత్త పిల్లలను సినిమా సంగీత దర్శకులను చేసి సినిమా ఖర్చును తగ్గించుకోదలచి కన్నడలో ‘సౌభాగ్యలక్ష్మి’ (1952) అనే సినిమాలో అవకాశం ఇచ్చాడు. అది రాజన్ నాగేంద్రల మొదటి సినిమా. వారి పని తీరు నచ్చాక ముఖ్యంగా డబ్బు గురించి అన్నదమ్ములకు పట్టింపు లేదని గ్రహించాక ఆయన మరో కన్నడ సినిమా ‘చంచల కుమారి’కి అవకాశం ఇచ్చాడు. అంతటితో ఆగక తెలుగుకు ‘వద్దంటే పెళ్లి’ (1957)తో పరిచయం చేశాడు. 1964లో విఠలాచార్య తీసిన ‘నవగ్రహ పూజా మహిమ’ లో ‘ఎవ్వరో ఎందుకీ రీతి సాధింతురు’ పాట పెద్ద హిట్ అయ్యింది. అయితే ఆ పాట ఓ.పి.నయ్యర్ చేసిన పాటకు కాపీ. తొలి రోజుల్లో నిలదొక్కుకోవడానికి రాజన్ నాగేంద్ర హిందీ బాణీల ప్రభావంతో చేసేవారు. కాని ‘అగ్గి– పిడుగు’లో వారు చేసిన ‘ఏమో ఏమో ఇది’ నేటికీ నిలిచి ఉంది. అసలైన రాజన్ నాగేంద్ర కన్నడ సీమలో ‘గంధదగుడి’ (1963) సినిమాతో రెక్కలు సాచారు. ఎన్.టి.ఆర్ ‘అడవిరాముడు’ సినిమాకు మూలంగా నిలిచిన ఈ హీరో రాజ్‌కుమార్ సినిమా రాజన్ నాగేంద్ర పాటలు తోడై సిల్వర్ జూబ్లీగా నిలిచింది. ఇందులో పి.బి.శ్రీనివాస్ పాడిన ‘నావాడువనుడియె కన్నడ నుడి’ పాటతో రాజన్–నాగేంద్ర కన్నడిగుల హృదయాలలో శాశ్వతస్థానం సంపాదించుకున్నారు. నింగి నేల ఒకటాయెనే రాజన్–నాగేంద్రల రెండవ రాకడ ‘పూజ’ (1975)తో జరిగింది. ఏ.వి.ఎం వారు తీసిన ఈ సినిమా అంతగా ఆడకపోయినా పాటలు నేటికీ పాడుతున్నాయి. ఇందులో రాజన్–నాగేంద్ర తమ పూర్తిస్థాయి సామర్థ్యాన్ని తెలుగుసీమకు చూపారు. ‘ఎన్నెన్నో జన్మల బంధం’ పాట ఒక బెస్ట్ డ్యూయెట్గా ఎంచబడుతుంది. ‘పూజలు చేయ పూలు తెచ్చాను’, ‘మల్లెతీగ వాడిపోగా’, ‘నింగి నేల ఒకటాయెనె’, ‘అంతట నీరూపం’, ‘నీ దయ రాదా’... పాటలు వీరికి పునఃస్వాగతం పలికాయి. ఆ వెంటనే సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘పంతులమ్మ’ పాటలూ సినిమాను మ్యూజికల్ హిట్‌ను చేశాయి. ‘సిరిమల్లె నీవే’, ‘మానసవీణ మధుగీతం’, ‘మనసెరిగిన వాడు మా దేవుడు’ పాటలు గానానికి, శబ్దానికి వీరిచ్చే విలువను తెలియ చేశాయి. సింగీతం, రాజన్ నాగేంద్రల కాంబినేషన్లో ‘సొమ్మొకడిది సోకొకడది’ కూడా హిట్టే. ఇందులోని ‘ఆ పొన్న నీడన’, ‘తొలి వలపూ తొందరలు’ కొబ్బరాకుల మీది పచ్చదనంతో ఉంటాయి. మధువనిలో రాధికవో సుందరమైన కుటుంబ కథలకు, లలితమైన ప్రేమ కథలకు రాజన్ నాగేంద్రల సంగీతం బాగుంటుందనే అభిప్రాయం స్థిరపడింది. ‘ఇంటింటి రామాయణం’ (వీణ వేణువైన సరిగమ విన్నావా, మల్లెలు పూసె వెన్నెల కాసే), ‘అల్లరి బావా’ (మధువనిలో రాధికవో), ‘నాగమలి’్ల (నాగమల్లివో తీగమల్లివో, రాగం తీసే కోయిల), ‘అద్దాల మేడ’ (పరిమళించు పున్నమిలో) ఇవన్నీ రాజన్ నాగేంద్రల మెలడీలతో నిండాయి. ఆ తర్వాత జంధ్యాల వచ్చి వారితో జత కట్టారు. ‘నాలుగు స్తంభాలాట’ పాటలు ముఖ్యంగా ‘చినుకులా రాలి’ ఇంటింట శ్రోతలు కోరే పాట అయ్యింది. జంధ్యాలతో రాజన్ నాగేంద్రలు ‘మూడు ముళ్లు’, ‘రెండురెళ్లు ఆరు’, ‘చూపులు కలసిన శుభవేళ’, ‘రాగలీల’ సినిమాలు తీశారు. ‘లేత చలి గాలులు’, ‘కాస్తందుకో దరఖాస్తందుకో’, ‘చలికాలం ఇంకా ఎన్నాళ్లో’ ఈ సినిమాల పాటలు. అలనాటి ‘చూపులు కలిసిన శుభవేళ’ పాటను ‘మేల్ డ్యూయెట్’ అంతే అర్థవంతంగా రాజన్ నాగేంద్రలు మలిచారు. ‘ప్రేమ ఖైదీ’, ‘అప్పుల అప్పారావు’ వారి చివరి హిట్ సినిమాలు. మనిషే మణిదీపం సంగీత ద్వయం అంటే ఒకరిది బాణి, ఒకరిది ఆర్కెస్ట్రయిజేషన్. రాజన్ నాగేంద్రలో పెద్దవారైన రాజన్ సినిమా బాణీలు కూర్చేవారు. నాగేంద్ర పాట నేర్పించేవారు. రాజన్ పర్ఫెక్షనిస్ట్. ఒక్కోసారి ఐదారుసార్లు రికార్డు చేసేవారు. ట్రాకులు పాడించకుండా గాయకుల చేతే ప్రాక్టీసు చేయించి పాడించేవారు. కన్నడంలో రాజ్‌కూమార్ స్టార్ హీరో చేత కూడా తమకు కావాల్సినట్టుగా పాడించుకున్న సంగీత దర్శకులు రాజన్ నాగేంద్ర. ఆ సంగీతద్వయానికి ఎందరో అభిమానులు ఉన్నారు. వారందరూ ఇవాళ వారి పాటలను తలుచుకుంటారు. కొలుచుకుంటారు. మణిషే మణిదీపం మనసే నవనీతం... – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
నటుడు రాజన్ సెహగల్ కన్నుమూత
ఈ ఏడాది బాలీవుడ్ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సరోజ్ ఖాన్, వాజిద్ ఖాన్, జగదీప్ వంటి స్టార్స్‌ను కోల్పోయింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడం ఓ పెద్ద విషాదం. తాజాగా బాలీవుడ్ సినీ, టీవీ నటుడు రాజన్ సెహగల్ (36) అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చండీగఢ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బుల్లితెరపై క్రైౖమ్ పెట్రోల్, సావధాన్ ఇండియా, తుమ్ దేనా సాత్ మేరా వంటి కార్యక్రమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన రాజన్ ఆ తర్వాత బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. ఐశ్వర్యా రాయ్, రణదీప్ హుడా నటించిన ‘సరబ్జిత్’ చిత్రంలో చేసిన రవీంద్ర పాత్ర రాజన్‌కి మంచి గుర్తింపు తెచ్చింది. ‘ఫోర్స్, కర్మ’ వంటి చిత్రాలతో పాటు పంజాబీ చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకుల్ని మెప్పించారాయన. రాజన్ సెహగల్ మృతి పట్ల సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. -
నేను పెద్ద స్టార్ అవుతానన్నారు
‘‘టి. కృష్ణగారి ‘దేశంలో దొంగలుపడ్డారు’ సినిమాలో వేషం కోసం వెళ్లా. ‘నీ ఫేస్ కామెడీగా ఉంటుంది.. పైగా చిన్నపిల్లాడివి.. నువ్వు చచ్చిపోయే పాత్ర చేస్తే జనాలు నవ్వుతారు.. వద్దు.. అన్నారు. ‘ఏ రోజుకైనా ఈ అబ్బాయి పెద్ద స్టార్ అవుతాడు’ అని ఆయన తన స్నేహితులతో ఆ రోజే చెప్పారట’’ అని నటుడు అలీ అన్నారు. ఖయ్యూమ్, తనిష్క్, రాజన్, షానీ, పృథ్విరాజ్, సమీర్, లోహిత్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. గౌతమ్ రాజ్‌కుమార్ దర్శకత్వంలో రమా గౌతమ్ నిర్మించిన ఈ సినిమాకి అలీ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అలీ మాట్లాడుతూ– ‘‘టి.కృష్ణగారి స్నేహితుడు నాగేశ్వరరావుగారు ముత్యాల సుబ్బయ్యగారి దర్శకత్వంలో తీసిన ‘అమ్మాయి కాపురం’ సినిమాకు నాకు ఉత్తమ కథానాయకుడిగా అవార్డు వచ్చింది. ‘దేశంలో దొంగలుపడ్డారు’ కోసం కొన్నాళ్లు భోజనం కూడా సరిగా లేకుండా పని చేశానని నా తమ్ముడు ఖయ్యూమ్ చెప్పాడు. వాడి కోసమే ఈ సినిమా చూశా. గౌతమ్ రాజ్‌కుమార్ కొత్త దర్శకుడైనా తనని చూస్తే 30 ఏళ్లకు ముందు రామ్‌గోపాల్ వర్మను చూసినట్టు అనిపించింది’’ అన్నారు. ‘‘ఇదొక క్రైమ్ థ్రిల్లర్. హ్యూమన్ ట్రాఫికింగ్ అంశాన్ని హైలైట్ చేస్తూ, సమాజంలో జరుగుతున్న పరిస్థితులను ప్రతిబింబిస్తూ తెరకెక్కించాం. విడుదలకు ముందే మా సినిమా బ్లాక్ బెర్రీ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌కి వెళ్లడం సంతోషంగా ఉంది’’ అన్నారు గౌతమ్ రాజ్‌కుమార్. ఖయ్యూమ్, సహ నిర్మాత సంతోష్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సాయికుమార్ పాలకుర్తి, సహ నిర్మాతలు: సంతోష్ డొంకాడ, సెలెట్ కనెక్ట్స్. -
నయన్ ఖర్చుపై రచ్చ
తమిళసినిమా: సక్సెస్‌కు ఐఎస్ఐ ముద్ర అంత నమ్మకంగా మారిన నటి నయనతార. ప్రముఖ, యువ కథానాయకులంటూ భేదం లేకుండా ఎడాపెడా చిత్రాల్లో నటించేస్తున్న ఈ అగ్రతార మరో పక్క హీయిరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లోనూ నటిస్తూ తన స్థాయిని పెంచుకుంటున్నారు. ప్రస్తుతం తమి ళం, తెలుగు, మలయాళం అంటూ డజను చిత్రాలకు పైగా చేతిలో చి త్రాలున్న నయనతార హిట్‌కు రూ. కోటి చొప్పున ఇటీవల పారితో షికాన్ని పెంచుకుంటూపోతున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇమైకా నోడిగళ్ చిత్రానికి నయనతార రూ. 3 కోట్లు పారితోషికం పుచ్చుకున్నారు. ఆ చిత్రం ఇంకా విడుదల కానేలేదు. ప్రస్తుతం ఆమె పారి తోషికం రూ.5 కోట్లకు చేరుకుందట. ఈ మధ్యలో తమిళ చిత్రం అరమ్, వేలైక్కారన్, తెలుగు చిత్రం జైసింహా చిత్రాలు విడుదలయ్యాయి. తాజాగా ఇంతకు ముందు అంగీకరించిన చిత్రాలను పూర్తి చేస్తూ, అజిత్‌కు జంటగా విశ్వాసం చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. అదే విధంగా కమలహాసన్‌కు జంటగా ఇండియన్–2 చిత్రంలో కథానాయకి అవకాశం నయనతారనే వరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్కెట్ ఉండడం వల్ల ఈ అమ్మడికి రూ. 5 కోట్లు పారితోషికాన్ని అందించడానికి నిర్మాతలు అభ్యంతరం చెప్పడం లేదు. ఇక్కడ చిక్కంతా ఎక్కడ వచ్చిందంటే ఆమె సహాయకులకు, ఇతర ఖర్చులకు తడిపి మోపెడవుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం గురించి సినియర్ నిర్మాత రాజన్ ఒక చానల్‌కిచ్చిన భేటీలో పేర్కొంటూ నయనతార పారితోషికం, ఆమె సహాయకులకయ్యే ఖర్చుపై మండిపడ్డారు. ఇటీవల రూ.3 కోట్లు పారితోషికాన్ని పుచ్చుకుంటున్న నయనతార ఇప్పుడు రూ.5కోట్లకు పెంచేశారన్నారు. ఇదలా ఉంచితే ఆమె సహాయకులంటూ 5గురు వెంట ఉంటారన్నారు. వారి ఖర్చే రోజుకు రూ.60 వేలు అవుతోందని, ఇవి కాకుండా కేరవన్ మరో రూ.10 ఖర్చు అని అన్నారు. అదే విధంగా తింటానికి లేనట్టుగా నయనతార తరచూ తన పారితోషికాన్ని పెంచుకుంటూ పోతోందని ఆయన విమర్శల వర్షం కురిపించారు. దీనికి నయనతార వర్గం ఎలా రెస్పాండ్ అవుతారో వేచి చూడాలి. -
సొంతం నీకా..? నాకా..?
తమిళ సినిమా: ఒక మార్కెట్‌ను సొంతం చేసుకోవడానికి హీరో, రౌడీ మధ్య జరిగే పోరాటం ఇతివృత్తంగా రూపొందుతున్న చిత్రం సెయల్. నవ జంట రాజన్తేజేశ్వర్, తరూషి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఇందులో నటి రేణుక, మునీష్కాంత్, సూపర్‌గుడ్ సుబ్రమణియం, వినోదిని, టీపోట్టి గణేశన్, ఆడుగళంజయబాలన్, దీనా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నటుడు ఛమక్ చంద్ర విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సీఆర్.క్రియేషన్స్ నిర్మలారాజన్ సమర్పణలో దివ్యక్షేత్ర ఫిలింస్ పతాకంపై సీఆర్.రాజన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు గతంలో విజయ్ హీరోగా షాజహాన్ చిత్రాన్ని తెరకెక్కించిన రవి అబ్బులు దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన 15 ఏళ్ల తరువాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. వీ.ఇళయరాజా ఛాయాగ్రహణ, సిద్ధార్ద్ విపిన్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఉత్తర చెన్నైలోని తంగశాలై మార్కెట్‌ను సొంతం చేసుకోవడానికి వచ్చిన ఒక రౌడీని అదే మార్కెట్లో సరకులు కొనుక్కోవడానికి వచ్చిన హీరో చితకబాదే పరిస్థితి నెలకొంటుందన్నారు. దీంతో ఆ మార్కెట్లో ప్రజలకు రౌడీ అంటే భయం పోతుందన్నారు. ఆ మార్కెట్‌ను సొంతం చేసుకోవాలంటే ఆ రౌడీ అదే చోట హీరోను తిరిగి కొట్టాలన్నారు. మరి ఆ రౌడీ కొట్టారా? లేక మరోసారి హీరో చేత చావు దెబ్బలు తిన్నాడా? అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో సెయల్ చిత్ర కథ సాగుతుందన్నారు. ఇందులో హీరోను ప్రేమించమని వెంటపడే పాత్రలో హీరోయిన్ నటిస్తోందని, అయితే ఆమె హీరోను కలిసి నప్పుడల్లా ఒక ఆసక్తికరమైన సంఘటన జరుగుతుందని చెప్పారు. -
డ్రైవర్ రుసరుస... జ్యోతిక విలవిల!
‘చంద్రముఖి’ సినిమాలో నటి జ్యోతికకు పట్టిన దయ్యాన్ని వదిలించడానికి ముగ్గులో కూర్చోబెడతాడు మాంత్రికుడు. ఆమె ఏవో పిచ్చిపనులు చేస్తూ, పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ‘‘పూర్తిగా చంద్రముఖిలా మారిన నీ భార్య గంగను చూడు’’... అంటూ డైలాగ్ కూడా చెబుతాడు ఆ సినిమాలో సూపర్‌స్టార్ రజనీకాంత్. చాలాకాలం తర్వాత మళ్లీ జ్యోతికకు అలాంటి సిట్యుయేషనే వచ్చింది. కాకపోతే కాస్త డిఫరెంటుగా! అప్పుడా మాంత్రికుడు ముగ్గులో కూర్చోబెడితే... ఇప్పుడో డ్రైవర్‌గారు ఆమెను కోర్టు ‘బోను’లో నిలబెట్టబోతున్నాడు. ఆ డ్రైవర్ గారి పేరు రాజన్. ‘‘పూర్తిగా పోలీస్‌లా మారినట్టుగా మాట్లాడుతున్న జ్యోతికను చూడు’’ అంటూ డైలాగ్ చెప్పడం ఒక్కటే రాజన్ చేయడం లేదంతే. మిగతాదంతా ‘సేమ్ టు సేమ్’! అప్పుడా మంత్రగాడు బెత్తంతో వడ్డిస్తే ఇప్పుడీ డ్రైవర్‌సాబ్ చట్టం చేత చీవాట్లు పెట్టించే పనిలో ఉన్నాడు. మరి జ్యోతిక ఏం చేసిందనీ? ఏమీ లేదు... ‘నాచ్చియార్’ అనే సినిమాలో నటిస్తోంది జ్యోతిక. గతంలో ‘సేతు’, ‘శివపుత్రుడు’ సినిమాలకు దర్శకత్వం వహించిన బాలా డైరెక్షన్లో ప్రస్తుతం ఈ సినిమా తయారౌతోంది. మరి పోలీస్ అన్నాక పవర్ఫుల్ పంచ్ డైలాగులు ఉండనే ఉంటాయి కదా. ఆ డైలాగుల్లో కొన్ని మహిళలను కించపరిచేలా ఉన్నాయట. ఇటీవలే బయటకు వచ్చిన ఆ సినిమా తాలూకు టీజర్ చూశాక ఒళ్లు మండిపోయిందా డ్రైవర్‌కి. ‘ఠాట్... పవిత్రమైన పోలీస్ యూనిఫారంలో ఉండి, ఓ మహిళే అలా మహిళలను కించపరిచే మాటలు అనొచ్చా’... అంటూ కోప్పడి చిందులు తొక్కుతూ చిర్రుబుర్రులాడుతున్నాడు రాజన్. నిజం పోలీసులు వల్లించాల్సిన సెక్షన్లను తానే వల్లిస్తూ ‘ఐపీసీ సెక్షన్ 249బి తో పాటు ఐటీ చట్టం సెక్షన్ 67’ ప్రకారం ఇదొక నేరం యువరానర్’ అంటూ జ్యోతిక మీద పిటిషన్‌తో విరుచుకుపడ్డాడు. అంతే.. కేసులోని పూర్వాపరాలు విచారించి నివేదిక సమర్పించమంటూ కోర్టువారు మేట్టుపాళయం పోలీసులకు ఆదేశించినట్టు సమాచారం. దాంతో ప్రస్తుతం... ‘‘పోలీసులా నటిస్తున్న సాక్షాత్తూ నేనే ఎవరి మీదైనా సినిమా కేసు పెట్టాలిగానీ... నా పైనే నిజమైన కేసా? అతగాడెవరు నా మీద విసవిసలాడటానికి’’ అంటూ రుసరుసలాడుతోంది జ్యోతిక. -
కొనసాగాలనే అనుకున్నా...
♦ కానీ ప్రభుత్వంతో అవగాహన కుదరలేదు.. ♦ ఆర్బీఐ గవర్నర్ రాజన్ వెల్లడి న్యూఢిల్లీ: రెండు రోజుల్లో (సెప్టెంబర్ 4) రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా మూడేళ్ల బాధ్యతల నుంచి తప్పుకుంటున్న రఘురామ్ రాజన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను వెల్లడించారు. ఆర్బీఐ గవర్నర్‌గా మరికొంత కాలం కొనసాగాలనే అనుకున్నట్లు పేర్కొన్నారు. అరుుతే పదవీ బాధ్యతల పొడిగింపు విషయమై ప్రభుత్వంతో ‘‘తగిన విధమైన అవగాహనకు’’ రాలేకపోరుునట్లు పేర్కొన్నారు. నిజానికి పదవిలో కొనసాగే విషయమై చర్చలు జరిగాయని, ఒక దశ దాటి అవి ముందుకు సాగలేదని తెలిపారు. అరుుతే ఈ ‘‘అవగాహన’’ ఏమిటన్న విషయంపై ఆయన స్పష్టతను ఇవ్వలేదు. పూర్తి చేయాల్సిఉన్న పనులు ఇంకా మిగిలి ఉండడమే బాధ్యతల్లో కొనసాగాలనుకోవడానికి కారణమని అన్నారు. అరుునా తన బాధ్యతలను సంతృప్తిగానే విరమిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఆర్బీఐ గవర్నర్‌గా నియమితులైన ఉర్జిత్ పటేల్ గురువారంనాడు ముంబైలో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమయ్యారు. -
వడ్డీ రేట్లలో కోత ఉంటుందా..?
♦ ఆర్బీఐ విధానంపై మిశ్రమ అంచనాలు ♦ రాజన్‌కు ఇదే చివరి సమీక్ష న్యూఢిల్లీ : ఆర్బీఐ మంగళవారం నాటి పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో మార్కెట్, పారిశ్రామిక, బ్యాంకింగ్ వర్గాలు మరోసారి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లో కొనసాగుతున్నందున కీలక వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయకపోవచ్చని కొంతమంది బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. వర్షపాతం ప్రభావాన్ని పూర్తిగా పరిశీలించి గానీ ఆర్బీఐ నిర్ణయం తీసుకోదని వారు భావిస్తున్నారు. అయితే కొన్ని సానుకూల కారణాల వల్ల వడ్డీ రేట్ల తగ్గుదలకు అవకాశం వుందని మరికొందరు బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. గవర్నర్‌గా రఘురామ్ రాజన్‌కు ఇదే చివరి సమీక్ష కానుంది. సెప్టెంబర్ 4న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అలాగే పాలసీ నిర్ణయాన్ని ఆర్బీఐ గవర్నర్ స్వతంత్రంగా తీసుకోబోయే చివరి సమీక్షా సమావేశం కూడా ఇదే. తదుపరి సమీక్ష అక్టోబర్ 4 నాటికి వడ్డీ రేట్ల నిర్ణయానికి కేంద్రం తీసుకొచ్చిన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ తన పని ప్రారంభిస్తుందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేయడంపై ఆర్బీఐ దృష్టి సారిస్తుందని ఆశిస్తున్నట్టు కేంద్రం గత వారమే ప్రకటించిన విషయం తెలిసిందే. రాజన్ దేవుడు... నేను దెయ్యమా..? బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మరోసారి రాజన్‌ను టార్గెట్ చేశారు. మీడియాను కూడా విడిచిపెట్టలేదు. రాజన్‌ను దేవుడిగా, తనను దెయ్యంగా మీడియా చిత్రీకరించిందని విమర్శించారు. ‘రాజన్ వెళితే స్టాక్ మార్కెట్లు కుప్పకూలతాయని మీడియా చెప్పింది. కానీ మార్కెట్లు ఏమీ కుప్పకూలడం లేదు. పైగా పెరుగుతున్నాయి. వడ్డీ రేట్లను పెంచుతూ ఆర్థిక వ్యవస్థకు రాజన్ హాని చేస్తున్నారు. చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలు బ్యాంకుల నుంచి రుణాలు పొందలేకున్నాయి. నేను దెయ్యం అయితే, ఈ వ్యక్తి దేవుడు. మనల్ని రక్షించడానికి బయటి నుంచి వచ్చాడు’ అని స్వామి విరాట్ హిందుస్తాన్ సమావేశంలో అన్నారు. అధిక స్థాయిలో ద్రవ్యోల్బణం.. వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. కూరగాయల ధరలు అధిక స్థాయిలో ఉన్నాయి. ఖరీఫ్ పంటలు మార్కెట్లోకి వచ్చి ధరలు తగ్గడానికి మరికొన్ని నెలలు పడుతుంది. - అరుంధతీ భట్టాచార్య, చైర్పర్సన్, ఎస్బీఐ 50 పాయింట్ల మేర కోతకు అవకాశం.. స్థూల ఆర్థిక పరిస్థితులను చూస్తే ఆర్బీఐ 50 బేసిస్ పాయింట్ల కోత విధించవచ్చు. బ్రిటన్ సహా చాలా దేశాల్లో రేట్లు తగ్గుముఖం పట్టాయి. సాధారణం కంటే అధిక వర్షపాతం, ప్రభుత్వ సెక్యూరిటీల రేట్లు తక్కువగా ఉండడం, అధిక విదేశీ మారక నిల్వలు, బాండ్ ఈల్డ్ తక్కువగా ఉండడం, కరెంటు ఖాతా, ద్రవ్యలోట్లు పరిమితుల్లోనే ఉండడం వల్ల 50 పాయింట్ల కోతకు అవకాశం ఉంది. - రాణా కపూర్, ఎండీ, యస్‌బ్యాంక్ 25 పాయింట్ల మేర కోత.. ఈ సమీక్షలో ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గిస్తుందని భావిస్తున్నాం. వర్షపాతం బాగుంటే ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ఖరీఫ్‌లో పప్పు ధాన్యాల సాగు గతేడాదితో పోలిస్తే 39% ఎక్కువగా ఉంది. - బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ -
రాజన్... గ్రేట్ : ప్రపంచ బ్యాంక్ చీఫ్
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యాంకుల గవర్నర్లలో రాజన్ గొప్ప వ్యక్తి అని ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ జిమ్ యాంగ్ కిమ్ చెప్పారు. ఎటువంటి ఒత్తిడులూ లేకుండా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ స్వతంత్రంగా పనిచేస్తారని, ఇదే విధానం మున్ముందు కూడా కొనసాగుతుందని భారత్ నాయకత్వం తనకు తెలిపిందని చెప్పారాయన. గురువారమిక్కడ ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజన్ విజ్ఞానాన్ని తాను ఎంతగానో గౌరవిస్తానన్నారు. జీడీపీ నంబర్లు ఓకే..! భారత్ స్థూల దేశీయోత్పత్తి నంబర్లను మీరు విశ్వసిస్తారా అన్న ప్రశ్నకు కిమ్ సమాధానం చెబుతూ, ‘‘ఇది (జీడీపీ అంకెల గణాంకాల విధానం) ఖచ్చితమైన శాస్త్రం కాదు. ఇక్కడ ఫిజిక్స్ ఏమీ ఉండదు. వివిధ విభాగాల నుంచి సమాచారాన్ని సేకరించి సమన్వయంతో తగిన నిర్ధారణకు రావడం జరుగుతుంది. కాలం, పరిస్థితులకు అనుగుణంగానే ఇవి ఉంటాయి. ఈ అంకెలు తగిన విధంగా ఉన్నాయనే భావిస్తున్నాం’’ అని అన్నారు. అయినా ఇలాంటి సందేహాలు కొత్తేమీ కాదనీ, చైనా వృద్ధి గణాంకాల విషయంలోనూ ఇలాంటి ప్రశ్నలు, సందేహాలు చోటుచేసుకున్న సందర్భాలున్నాయన్నారు. అయితే చర్చలను ఎప్పుడూ ప్రపంచబ్యాంక్ స్వాగతిస్తుందని కూడా చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం భారత్ జీడీపీ వృద్ధి రేటు 7.6%కాగా, ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 7.9 శాతం నమోదయింది. -
మానిటరీ పాలసీ కమిటీ పని మొదలు కానుందా?
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) ఏర్పాటు నేపథ్యంలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బీఐ గురువారం సమావేశమైంది. ఆర్థిక మంత్రి నివాసంలో జైట్లీ ని కలిసిన రాజన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. వడ్డీ రేట్ల విధానంలో కొత్త విధానాన్నిత్వరగా అమలు చేయడానికి ప్రభుత్వం, ఆర్బీఐ చర్చిస్తున్నాయన్నారు. ఆగస్టు 9 న నిర్వహించే వడ్డీ రేట్ల సమీక్షలో ఆరుగురు సభ్యులతో కూడిన ద్రవ్య విధాన కమిటి (మానిటరీ పాలసీ కమిటీ) మెకానిజం అమలుపై ఈ భేటీ జరిగిందని తెలిపారు. అయితే ఆగస్టు 9న సమీక్ష నుంచే కమిటీ పని మొదలు కానుందా అని ప్రశ్నించినపుడు దానికోసమే ప్రయత్నిస్తున్నామని.. ఎంత తొందరగా ఇది సాధ్యమవుతుందో చూడాలని చెప్పారు. ఇటీవల వడ్డీ రేట్ల విధానాలపై ఆర్బీఐ గవర్నర్ అధికారాలకు కత్తెర వేసిన కేంద్రం,మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు, దానికి చట్టబద్ధత కల్పించింది. ప్రస్తుత విధానం ప్రకారం ద్రవ్య పరపతి విధానానికి సంబంధించి ఆర్బీఐ నియమించిన కమిటీ సిఫార్సుల ఆధారంగా వడ్డీరేట్లపై నిర్ణయం జరుగనుంది అయితే, ఈ కమిటీ నిర్ణయాన్ని ఆమోదించడం లేదా తోసిపుచ్చే (వీటో) అధికారం మాత్రం ఆర్బీఐ గవర్నర్‌కే ఉంటుంది. అంటే తుది నిర్ణయం ఆర్బీఐ గవర్నర్‌కే ఉన్నట్లు లెక్క. ఎంపీసీ ఏర్పాటుతో గవర్నర్‌కు ఉన్న ఈ అధికారానికి బ్రేక్ పడుతుంది. అయితే, ఆరుగురు సభ్యుల నిర్ణయం టై (రెండు వాదనలవైపు చెరో ముగ్గురు ఉంటే ) అయితే, ఆర్బీఐ గవర్నర్ నిర్ణయాత్మక ఓటును వినియోగించుకోవడానికి ఈ కొత్త విధానం వీలు కల్పిస్తోంది. కాగా దేశంలో వడ్డీ రేట్లు ఏ మేరకు ఉండాలన్నది ఇకపై రిజర్వు బ్యాంకు పరిధిలో ఉండదు. ఇప్పటిదాకా ఆర్బీఐ గవర్నరు తీసుకుంటున్న ఈ నిర్ణయా న్ని ఇక ప్రభుత్వమే తీసుకోనుంది. కీలకమైన పాలసీ వడ్డీరేట్ల నిర్ణయంపై ఆర్బీఐ గవర్నర్‌కు ఉన్న విశేష అధికారాలకు కేంద్రం ముగింపు పలికిన సంగతి తెలిసిందే. -
నన్ను ఇన్వాల్వ్ చేయకండి..
ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీకాలం అనంతరం మళ్ళీ అధ్యాపక వృత్తిలోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. సెప్టెంబర్ 4 తో ఆయన పదవీకాలం ముగియనుండగా, ఆయన తిరిగి అధ్యాపక వృత్తిలోకి వెడతారని సహచరులతో చెప్పినట్లుగా వచ్చిన వార్తలపై స్పందించారు. బెంగళూరులో జరిగిన ఓ సమావేశంలో అదేవిషయంపై వ్యాఖ్యానించారు. తనను అనవసర విషయాల్లోకి లాగొద్దని, తాను ప్రపంచంలో ఎక్కడైనా ఉంటానని రఘురాం రాజన్ తెలిపారు. బుధవారం సాయంత్రం బెంగళూరులో జరిగిన అసోచామ్ సమావేశంలో పాల్గొన్న ఆర్బీఐ గవర్నర్ రంగ రాజన్ ఆయన భవిష్యత్ జీవితంపై ఎవ్వరూ ఊహా కథనాలు అల్లొద్దని స్పష్టం చేశారు. మరో రెండు నెలలు పదవిలో ఉంటానని, తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా తాను నివసించే అవకాశం ఉందని అన్నారు. ముఖ్యంగా భారత్ లో ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. సమావేశం సందర్భంగా మాట్లాడిన ఆయన.. క్రెడిట్ రేటు మందగించడానికి అధిక వడ్డీరేట్లు కారణం కాదన్నారు. బ్యాలెన్స్ షీట్లను పటిష్ఠపరచడం, రుణాలను పెంచడం వంటివి చాలా సున్నితమైన ఆంశాలుగా ఆయన వివరించారు. ఈ విషయంలో ప్రభుత్వం, ఆర్బీఐ ప్రభుత్వ బ్యాంకులకు సాయపడుతున్నట్లు తెలిపారు. -
చిన్న పరిశ్రమల పని ముగిసిపోయింది!
న్యూఢిల్లీః సుబ్రమణ్యస్వామి ఆరోపణల పర్వం కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఆర్బీఐ గవర్నర్ రఘురామ రాజన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. రాజన్ విధానాలతో చిన్న పరిశ్రమలకు పాతర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా మల్టీ నేషనల్ కంపెనీలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు చిన్న పరిశ్రమలపై చిన్న చూపు చూపిస్తున్నారని, వ్యవసాయ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని స్వామి విరుచుకుకు పడ్డారు. రాజన్ తప్పుడు విధానాల ఆధారంగానే తాను విమర్శలు చేయాల్సి వస్తోందని, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పొట్ట కొట్టి, బహుళజాతి సంస్థలకు మేలు చేసేందుకు ఆయన ఈ విధానాలను అనుసరిస్తున్నారంటూ స్వామి ఆరోపించారు. ఆర్ బీ ఐ గవర్నర్ రాజన్ వ్యవసాయ వ్యతిరేక బ్యాంకింగ్ విధానాలను అనుసరించారని వాటిని తాను చార్జిషీటులో పొందిపరచినట్లు స్వామి తెలిపారు. ఢిల్లీలో జరిగిన భారతీయ కిసాన్ అభియాన్ లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంలో మాట్లాడిన స్వామి... అధిక వడ్డీరేట్లు చిన్న, మధ్య తరహా పరిశ్రమలను తీవ్ర నష్టాల్లో ముంచేస్తున్నాయని, దీంతో దేశవాళీ ఉత్పత్తులు తగ్గిపోవడమే కాక, నిరుద్యోగం పెరిగిపోయిందని అన్నారు. రఘురామ రాజన్ ను ఆర్బీఐ గవర్నర్ పదవినుంచీ వెంటనే తొలగించాలని కోరుతూ స్వామి ప్రధానమంత్రికి ప్రత్యేకంగా లేఖ రాశారు. -
చైనాతో ముప్పు ఉంది.. జర జాగ్రత్త!
ముంబై : చైనా చూపిస్తున్న నెమ్మదస్తు ఆర్థికవ్యవస్థ గణాంకాలపై ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆరోపణలు చేశారు. గ్లోబల్ ఎకనామీకి ఇది ముప్పువాటిల్లే అవకాశముందని హెచ్చరించారు. భారత్ లాంటి ఇతర ఆర్థిక వ్యవస్థలు ఈ ముప్పు నుంచి తట్టుకోవడానికి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చైనా పక్కన ఉన్న దేశాలకు మధ్యవర్తిత్వ బ్యాంకింగ్ సిస్టమ్(గ్లోబల్ ఫైనాన్సియల్ సిస్టమ్ లో రుణాన్ని కల్పించడం) నుంచి తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు.. దక్షిణ ప్రాంతీయ సహకార ఆసియా అసోసియేషన్ గ్రూపింగ్(సార్క్) సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల సదస్సులో రాజన్ ప్రసంగించారు. భారత ఆర్థిక క్యాపిటల్ ను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తూ.. ఆయన చైనా ఆర్థికవ్యవస్థ చూపించే గణాంకాల ప్రభావం ఇతర ఆర్థికవ్యవస్థలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ప్రస్తుతం బ్యాంకింగ్ సిస్టమ్ లో మొండిబకాయిల బెడద పెరగడం, మధ్యవర్తిత్వ బ్యాంకింగ్ సిస్టమ్ లో తీవ్రమైన బలహీనతలు సార్క్ ఆర్థికవ్యవస్థల్లో మందగమనం నెలకొనేలా చేస్తాయన్నారు. చైనా ఆర్థికాభివృద్ధి కేవలం పాలసీల మీదే ఆధారపడి లేదని, ప్రపంచ వృద్ధిపైనా కూడా ఆధారపడి ఉందని పేర్కొన్నారు. -
నిర్ణయంపై ‘ఏ ప్రభావం’ పడదు: జైట్లీ
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రాజన్ పదవీకాలం సెప్టెంబర్ 4 తరువాత రెండవసారీ పొడిగించాలా... వద్దా అన్న అంశానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయంపై ‘ఏ అంశం ప్రభావం’ పడబోదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం స్పష్టం చేశారు. తక్షణం రాజన్‌ను తొలగించాలన్న బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి డిమాండ్‌ను విలేకరులు ప్రస్తావించినప్పుడు ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ‘‘ప్రభుత్వం, ఆర్బీఐ బాధ్యతాయుతమైన సంస్థలు. మరే ఇతర అంశం ప్రభావం లేకుండా రెండు సంస్థలూ తగిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది’’ అని ఆయన ఈ ఒక చానల్‌తో వ్యాఖ్యానించారు. స్వామి ఆరోపణలపై వ్యాఖ్యానించాలని కోరినప్పుడు ఆయన మాట్లాడుతూ, ‘‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్థికమంత్రిత్వశాఖల మధ్య సంబంధాలు, విధానపరమైన చర్చలు పూర్తి సజావుగా, పరిపక్వ స్థాయిలో ఉన్నాయి. వాటిపై (ప్రతికూల వ్యాఖ్యలు) వ్యాఖ్యానించడం సరికాదు’’ అని మాత్రం అన్నారు. స్వామి అసలు లక్ష ్యం జైట్లీనే: రమేశ్ కాగా సుబ్రమణ్యస్వామి నిజమైన లక్ష్యం ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీనే అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ వ్యాఖ్యానించారు. ఆయనను ఏమీ అనలేక... బహిరంగంగా తన అభిప్రాయాలు వెల్లడించని ఆర్బీఐ గవర్నర్‌పై స్వామి ‘డమ్మీ’ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాజన్ ఆర్థిక శక్తిసామర్థ్యాలు ప్రపంచం అంతటికీ తెలుసనని వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా ఆర్బీఐని పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఆర్థిక వ్యవహారాల బీజేపీ ప్రతినిధి గోపాల్‌కృష్ణ అగర్వాల్ మాట్లాడుతూ, సీనియర్ నాయకునిగా స్వామి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని అన్నారు. అయితే తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదేనని అన్నారు.