తమిళసినిమా: సక్సెస్‌కు ఐఎస్‌ఐ ముద్ర అంత నమ్మకంగా మారిన నటి నయనతార. ప్రముఖ, యువ కథానాయకులంటూ భేదం లేకుండా ఎడాపెడా చిత్రాల్లో నటించేస్తున్న ఈ అగ్రతార మరో పక్క హీయిరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లోనూ నటిస్తూ తన స్థాయిని పెంచుకుంటున్నారు. ప్రస్తుతం తమి ళం, తెలుగు, మలయాళం అంటూ డజను చిత్రాలకు పైగా చేతిలో చి త్రాలున్న నయనతార హిట్‌కు రూ. కోటి చొప్పున ఇటీవల పారితో షికాన్ని పెంచుకుంటూపోతున్నారు.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇమైకా నోడిగళ్ చిత్రానికి నయనతార రూ. 3 కోట్లు పారితోషికం పుచ్చుకున్నారు. ఆ చిత్రం ఇంకా విడుదల కానేలేదు. ప్రస్తుతం ఆమె పారి తోషికం రూ.5 కోట్లకు చేరుకుందట. ఈ మధ్యలో తమిళ చిత్రం అరమ్, వేలైక్కారన్, తెలుగు చిత్రం జైసింహా చిత్రాలు విడుదలయ్యాయి. తాజాగా ఇంతకు ముందు అంగీకరించిన చిత్రాలను పూర్తి చేస్తూ, అజిత్‌కు జంటగా విశ్వాసం చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు.
అదే విధంగా కమలహాసన్‌కు జంటగా ఇండియన్–2 చిత్రంలో కథానాయకి అవకాశం నయనతారనే వరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్కెట్ ఉండడం వల్ల ఈ అమ్మడికి రూ. 5 కోట్లు పారితోషికాన్ని అందించడానికి నిర్మాతలు అభ్యంతరం చెప్పడం లేదు. ఇక్కడ చిక్కంతా ఎక్కడ వచ్చిందంటే ఆమె సహాయకులకు, ఇతర ఖర్చులకు తడిపి మోపెడవుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం గురించి సినియర్ నిర్మాత రాజన్ ఒక చానల్‌కిచ్చిన భేటీలో పేర్కొంటూ నయనతార పారితోషికం, ఆమె సహాయకులకయ్యే ఖర్చుపై మండిపడ్డారు.
ఇటీవల రూ.3 కోట్లు పారితోషికాన్ని పుచ్చుకుంటున్న నయనతార ఇప్పుడు రూ.5కోట్లకు పెంచేశారన్నారు. ఇదలా ఉంచితే ఆమె సహాయకులంటూ 5గురు వెంట ఉంటారన్నారు. వారి ఖర్చే రోజుకు రూ.60 వేలు అవుతోందని, ఇవి కాకుండా కేరవన్ మరో రూ.10 ఖర్చు అని అన్నారు. అదే విధంగా తింటానికి లేనట్టుగా నయనతార తరచూ తన పారితోషికాన్ని పెంచుకుంటూ పోతోందని ఆయన విమర్శల వర్షం కురిపించారు. దీనికి నయనతార వర్గం ఎలా రెస్పాండ్ అవుతారో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment