
కమల్‌హాసన్–శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘భారతీయుడు’ (1996) ఓ సంచలనం. 24 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ ఆరంభించారు కమల్–శంకర్. గతేడాది మూడు షెడ్యూల్స్ కూడా ముగించారు. కానీ షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం, ఆ తర్వాత కరోనా లాక్‌డౌన్ వల్ల చిత్రీకరణకు బ్రేక్ పడింది. అయితే బడ్జెట్ సమస్యల వల్ల సినిమా మళ్లీ ట్రాక్ ఎక్కదనే వార్త మొదలైంది. కానీ అది నిజం కాదు. త్వరలో నాలుగో షెడ్యూల్ మొదలుపెట్టడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
జనవరిలో సంక్రాంతి పండగ తర్వాత లేదా ఫిబ్రవరిలో చిత్రీకరణ ఆరంభించడానికి పకడ్బందీగా షెడ్యూల్ ప్లాన్ చేశారు. చెన్నైలో షెడ్యూల్ పూర్తి చేశాక, దేశంలో పలు లొకేషన్స్‌లో షూటింగ్ చేయాలనుకుంటున్నారు. అలాగే విదేశాల్లోనూ షెడ్యూల్స్ ఉంటాయని సమాచారం. ఈ కరోనా టైమ్‌లో దేశ, విదేశాల్లో ఎక్కువమందితో షూటింగ్ అంటే సవాల్ అనే చెప్పాలి. ఈ సవాల్‌ని అధిగమించేలా దర్శకుడు శంకర్ అండ్ టీమ్ వర్కవుట్ చేస్తోంది. సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్ తదితరులు నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment