bharatheeyudu
-
భూతల్లి పై ఒట్టేయ్...
‘శౌర..’ అంటూ చైతన్య గీతం పాడారు సేనాపతి. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో విడుదలైన సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఇండియన్’ (‘భారతీయుడు’). ఈ సినిమాకు సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2, ఇండియన్ 3’ (‘భారతీయుడు 2, 3’)’ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు శంకర్. ఈ చిత్రంలో సేనాపతి పాత్రలో కనిపిస్తారు కమల్‌హాసన్. రెడ్ జెయింట్ మూవీస్, లైకా ్ర΄÷డక్షన్స్పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక జూన్ 1న చెన్నైలో జరగనుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని తొలి పాటను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. ‘భూతల్లి పై ఒట్టేయ్... తెలుగోడి వాడి చూపెట్టేయ్...’ అంటూ సాగే తెలుగు పాట ‘శౌర..’కు సుద్దాల అశోక్‌తేజ సాహిత్యం అందించగా, రితేష్ జి. రావ్, శ్రుతికా సముద్రాల పాడారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. జూలై 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘ఇండియన్ 2’ చిత్రం విడుదల కానుంది. -
అవినీతిపై వ్యతిరేక పోరాటం.. ఆరోజే మొదలు!
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. వీరిద్దరి కాంబినేషన్లో 1996లో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన ‘ఇండియన్’ చిత్రాన్ని ‘భారతీయుడు’గా విడుదల చేసింది. ఆ మూవీకి సీక్వెల్‌గా ఇప్పుడు ‘భారతీయుడు 2’ రూపొందుతోంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతిగా కమల్ హాసన్ పవర్ఫుల్ పెర్ఫామెన్స్ ఇవ్వటానికి రెడీ అయ్యారు. తాజాగా ఈ సినిమాను జూన్ నెలలో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌ను గమనిస్తే.. తెల్లటి ధోతి, కుర్తాలో కమల్ హాసన్ కనిపిస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం అంటే ఎంత స్వచ్చంగా ఉండాలో అంతటి స్వచ్చత పోస్టర్లో ప్రస్పుటంగా కనిపిస్తోంది. జీరో టాలరెన్స్ (తప్పును అస్సలు భరించలేను) అన్న లైన్ చాలా ప్రభావవంతంగా ఉంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్.జె.సూర్య, బాబీ సింహ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎ.శ్రీకర ప్రసాద్ ఎడిటర్ కాగా ప్రొడక్షన్ డిజైనర్‌గా టి.ముత్తురాజ్ గా వర్క్ చేస్తున్నారు. బి.జయమోహన్, కబిలన్ వైరముత్తు, లక్ష్మీ శరవణకుమార్‌లతో కలిసి డైరెక్టర్ శంకర్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. Gear up for the comeback of Senapathy!🤞INDIAN-2 🇮🇳 is all set to storm in cinemas this JUNE. Mark your calendar for the epic saga! 🫡🔥#Indian2 🇮🇳🌟 #Ulaganayagan @ikamalhaasan🎬 @shankarshanmugh🎶 @anirudhofficial📽️ @dop_ravivarman✂️🎞️ @sreekar_prasad🛠️ @muthurajthangvl… pic.twitter.com/kwiKyAcNta— Lyca Productions (@LycaProductions) April 6, 2024 -
ఆ సినిమాలో ఛాన్స్ కోసం డైరెక్టర్‌కు బికినీ ఫోటోలు పంపిన హీరోయిన్
అన్నమయ్య,పెద్దరికం, భారతీయుడు సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది సీనియర్ హీరోయిన్ కస్తూరి.. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో మంచి సినిమాలు చేసిన కస్తూరికి భారీ ఫ్యాన్స్ బేస్ ఉంది. ఇండస్ట్రీలో తనకు నచ్చిన విషయంతో పాటు ఏదైనా నచ్చలేదంటే ఓపెన్‌గానే తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే గట్స్ ఆమెకు ఉన్నాయి. అలా ఒక్కోసారి ఆమె కామెంట్లు భారీగానే వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఆమె 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్లో తులసి పాత్రతో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా ఇంటర్వ్యూలో కస్తూరి తన కెరీర్ ప్రారంభం రోజుల్ని గుర్తు చేసుకుంటూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శంకర్ లాంటి దర్శకుడితో కలసి పనిచేయడం ఎంత అదృష్టమో నాకు ఆ తర్వాత రోజుల్లో తెలిసింది. 'అప్పుడు నాది చిన్న వయసు. కాబట్టి ఏదో సరదాగా చేసేశాను. కమల్ హాసన్ హిట్ సినిమా భారతీయుడులో మొదట హీరోయిన్ ఛాన్స్ నాకే వచ్చింది. ఆ సినిమా విషయంలో సంప్రదింపులు జరుగుతున్న సమయంలో ఎలాగైనా అవకాశం దక్కించుకోవాలని డైరెక్టర్‌కి బికినీ ఫోటోలు కూడా పంపించాను. కానీ.. అదే సమయంలో రంగీలా చిత్రం రిలీజ్ కానుంది. ఆ సమయంలో ఎక్కడ చూసిన ఊర్మిళ గురించే మాట్లాడుకుంటున్నారు. దీంతో భారతీయుడు సినిమా మేకర్స్ అటెన్షన్ ఆమె వైపు వెళ్ళింది. చివరికి ఊర్మిళను హీరోయిన్గా ఫైనల్ చేశారు. నాకు మాత్రం కమల్ హాసన్ చెల్లి పాత్ర ఇచ్చి సరిపెట్టేశారు. అలా భారతీయుడికి కుమార్తెగా నటించాను. కొద్దిరోజుల తర్వాత ఏంటి సర్ ఇలా చేశారు..? అని అడిగితే.. సినిమాలో ఇదొక కీలకమైన పాత్ర అని చెప్పడంతో నేను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను.' అని కస్తూరి తెలిపింది. -
విజయవాడకు భారతీయుడు
హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2’ (తెలుగులో ‘భారతీయుడు 2’). 1996లో కమల్, శంకర్ కాంబినేషన్లోనే రూపొంది, బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ రూపొందుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ విజయవాడలో ్రపారంభం కానున్నట్లుగా తెలిసింది. ఆల్రెడీ దర్శకుడు శంకర్ కొన్ని లొకేషన్స్‌ను ఫైనలైజ్ చేశారని తెలిసింది. దాదాపు పదిరోజుల పాటు జరిగే ఈ సినిమా షూటింగ్లో కమల్‌హాసన్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా, కీలక సన్నివేశాల చిత్రీకరణను ΄్లాన్ చేశారు. అలాగే విజయవాడ షెడ్యూల్ తర్వాత వైజాగ్‌లో కూడా కొంత షూటింగ్ జరుగుతుందని సమాచారం. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా, సిద్ధార్థ్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ‘ఇండియన్ 2’కు కొనసాగింపుగా ΄్లాన్ చేసిన ‘ఇండియన్ 3’ షూటింగ్‌ను కూడా ఆల్రెడీ శంకర్ ఆరంభించారని, ఇందుకు కమల్ అదనంగా 40 రోజుల కాల్షీట్స్ను కేటాయించవలసి వచ్చిందని భోగట్టా. ‘ఇండియన్ 2’ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో, ‘ఇండియన్ 3’ని దీపావళికి విడుదల చేస్తారనే టాక్ వినిపిస్తోంది. -
పలు గెటప్స్‌లలో కనిపించనున్న టాప్ హీరోలు
అభిమాన హీరోలు వెండితెరపై ఒక గెటప్‌లో కనిపిస్తేనే ఫ్యాన్స్ ఖుషీ అవుతారు. అలాంటిది ఆ స్టార్ హీరో పలు రకాల గెటప్స్‌లో కనిపిస్తే ఆ ఖుషీ డబుల్ అవుతుంది. అలా డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించే కథలు కొందరు స్టార్స్‌కి సెట్ అయ్యాయి. ఒక్కో హీరో మినిమమ్ నాలుగు, ఇంకా ఎక్కువ గెటప్స్‌లో కనిపించనున్నారు. గెట్.. సెట్.. గెటప్స్ అంటూ ఆ స్టార్స్ చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. విభిన్న భారతీయుడు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించడం కమల్‌హాసన్‌కు కొత్తేం కాదు. ‘దశావతారం’లో కమల్ పది పాత్రల్లో పది గెటప్స్ చేసి ఆడియన్స్‌ను ఆశ్చర్యపరిచారు. అన్ని పాత్రల్లో కాదు కానీ ‘ఇండియన్ 2’లో కమల్‌హాసన్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. 1996లో హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ వీరి కాంబినేషన్లోనే రూపొందుతోంది. 1920 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఇందులో కమల్‌హాసన్ నాలుగుకి మించి గెటప్స్‌లో కనిపిస్తారని కోలీవుడ్ టాక్. వీటిలో లేడీ గెటప్ ఒకటనే టాక్ తెరపైకి వచ్చింది. మహిళగా, 90 ఏళ్ల వృద్ధుడిగా, యువకుడిగా.. ఇలా విభిన్నంగా కనిపించడానికి కమల్‌కి ప్రోస్థటిక్ మేకప్ వేసుకోవడానికి, తీయడానికి మూడు గంటలకు పైగా పడుతోందని యూనిట్ అంటోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. పెయింటరా? సైంటిస్టా? పెయింటరా? రైతా? సైంటిస్టా? అసలు ‘ఈగిల్’ సినిమాలో రవితేజ క్యారెక్టర్ ఏంటి? అనే సందేహం తీరాలంటే ఈ సంక్రాంతి వరకూ వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడే. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘ఈగిల్’. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ ఓ లీడ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో రవితేజ ఐదారు గెటప్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వీటిలో ప్రొఫెషనల్ స్నైపర్ గెటప్ ఒకటి అని భోగట్టా. ఇంకా రవితేజ లుక్ విడుదల కాలేదు. పదికి మించి.. ప్రయోగాత్మక పాత్రలకు సూర్య ముందుంటారు. ‘సుందరాంగుడు’, ‘సెవెన్త్ సెన్స్’, ‘24’, ‘బ్రదర్స్’... ఇలా సూర్య కెరీర్లో వైవిధ్యమైన చిత్రాల జాబితా ఎక్కువే. ఈ కోవలోనే సూర్య నటించిన మరో చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సూర్య పదమూడు గెటప్స్‌లో కనిపిస్తారనే టాక్ ఎప్పట్నుంచో వినిపిస్తోంది. 17వ శతాబ్దంలో మొదలై 2023కి కనెక్ట్ అయ్యేలా ‘కంగువా’ కథను రెడీ చేశారట శివ. రెండు భాగాలుగా విడుదల కానున్న ‘కంగువా’ తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. స్టూడెంట్.. రాజకీయ నాయకుడు కాలేజ్ స్టూడెంట్, ఐఏఎస్ ఆఫీసర్, రాజకీయ పార్టీ కార్యకర్త... ఇలా ‘గేమ్ చేంజర్’ సినిమాలో రామ్‌చరణ్ ఏడు గెటప్స్‌లో కనిపిస్తారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులకు, ఐఏఎస్ ఆఫీసర్లకు మధ్య నెలకొని ఉండే అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందట. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. 2 దశాబ్దాలు.. 4 గెటప్స్ ‘తొలిప్రేమ’ (2018)లో వరుణ్ తేజ్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయి. కాలేజీ కుర్రాడిలా, ఉద్యోగం చేసే వ్యక్తిగా కనిపిస్తారు. ఇదే తరహాలో వరుణ్ తేజ్ మరో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే ‘మట్కా’. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నాలుగు గెటప్స్‌లో కనిపిస్తారని చిత్ర యూనిట్ వెల్లడించింది. వైజాగ్ నేపథ్యంలో 1958 నుంచి 1982 టైమ్ పీరియడ్‌లో ‘మట్కా’ కథనం ఉంటుంది. ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబరు మొదటి వారంలో ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేస్తారు. పలు అవతారాల్లో స్మగ్లింగ్ స్మగ్లింగ్ చేస్తున్నారట కార్తీ. అది కూడా గోల్డ్ స్మగ్లింగ్. ఇందులో భాగంగా అధికారులను బోల్తా కొట్టించేందుకు తన గెటప్ మార్చుతుంటారట. ఇదంతా ‘జపాన్’ సినిమా కోసం. రాజు మురుగన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, ఇందులో కార్తీ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రం ఈ దీపావళికి విడుదల కానుంది. -
‘ఇండియన్ 2’.. తైవాన్ టు సౌతాఫ్రికా
తైవాన్‌కు బై బై చెప్పాడు భారతీయుడు. 1996లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్‌గా హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లోనే ‘ఇండియన్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా, బెనెడిక్ట్ గారెట్, గుల్షన్ గ్రోవర్ కీ రోల్స్ చేస్తున్నారు. ఇటీవల తైవాన్‌లో మొదలైన ‘ఇండియన్ 2’ షెడ్యూల్ ముగిసింది. ఈ షూటింగ్ షెడ్యూల్లో కమల్‌హాసన్ పాల్గొనగా, కొన్ని కీలక సన్నివేశాలతో పాటు విదేశీ ఫైటర్స్‌తో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. తైవాన్ షెడ్యూల్ తర్వాత యూనిట్ సౌతాఫ్రికా వెళ్తుందని, అక్కడి లొకేషన్స్‌లో మరో యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేసిందనికి వినికిడి. ఈ చిత్రాన్ని సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ కలిసి నిర్మిస్తున్నారు. -
ఇండియన్ 2 మూవీ టార్గెట్ ఫిక్స్
భారతీయుడికి టార్గెట్ ఫిక్స్ చేశారు దర్శకుడు శంకర్. 1996లో హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన హిట్ మూవీ ‘ఇండియన్’కి(తెలుగులో భారతీయుడు) సీక్వెల్‌గా తీస్తున్న ‘ఇండియన్ 2’ షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ తైవాన్‌లో జరుగుతోంది. కమల్ హాసన్‌పై కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తున్నారు శంకర్. ఇందులో ఓ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉందని కోలీవుడ్ టాక్. అయితే ‘ఇండియన్ 2’ టాకీ పార్ట్ షూటింగ్‌ను జూన్‌కల్లా పూర్తి చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శంకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘టాకీ పార్టు పూర్తి కాగానే ఓ పాట చిత్రీకరిస్తాం.. దీంతో మేజర్ షూటింగ్ పూర్తవుతుంది. జూన్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ను స్టార్ట్ చేస్తాం’’ అన్నారు శంకర్. కాజల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో రకుల్ ప్రీత్‌సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ట్రైన్లో యాక్షన్ సీన్స్.. ఆ కిక్కే వేరప్పా!
తెరపై విలన్ని హీరో రఫ్ఫాడిస్తుంటే ప్రేక్షకులకు దక్కే కిక్కే వేరు. అందుకే యాక్షన్ సీన్స్‌ని ప్రత్యేకంగా డిజైన్ చేస్తుంటారు. ఇప్పుడు కొన్ని సినిమాల కోసం ట్రైన్లో ఫైట్ సీన్స్ డిజైన్ చేస్తున్నారు. ట్రైన్లో రిస్కీ యాక్షన్ సీన్స్ చూపించనున్న ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. ట్రైన్లో భారతీయుడు దర్శకుడిగా శంకర్ పరిచయమైన తొలి సినిమా ‘జెంటిల్‌మేన్’. ఈ సూపర్‌డూపర్ హిట్ ఫిల్మ్‌లో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించారు. ఈ సినిమా ప్రారంభంలోనే ఓ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. ఆసక్తికర విషయం ఏంటంటే... శంకర్ దర్శకత్వం వహించిన ఆ తర్వాతి చిత్రాల్లో రజనీకాంత్ ‘రోబో’, విక్రమ్ ‘ఐ’ (తెలుగులో ‘మనోహరుడు’) వంటి వాటిలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ట్రైన్ యాక్షన్ సీక్వెన్సెస్పై స్పెషల్ ఫోకస్ పెట్టారు శంకర్. 1996లో హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దాదాపు పాతికేళ్ల తర్వాత కమల్, శంకర్ కాంబోలోనే ‘ఇండియన్’కు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ సౌత్ ఆఫ్రికాలో జరగనుంది. అక్కడ దాదాపు రెండు వారాలపాటు షూటింగ్‌ని ΄్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లోనే ఓ భారీ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారట శంకర్. ఫారిన్ ఫైటర్స్, ఫారిన్ యాక్షన్ మాస్టర్స్ ఈ ఫైట్‌ను డిజైన్ చేయనున్నట్లు సమాచారం. ‘ఇండియన్ 2’లో ఉన్న మేజర్ హైలైట్స్‌లో ఇదొకటనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. పది కోట్ల ఫైట్ ఒకవైపు కమల్‌హాసన్‌తో ‘ఇండియన్ 2’ సినిమా చేస్తూనే మరోవైపు రామ్‌చరణ్‌తో ‘సీఈవో’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా చేస్తున్నారు శంకర్. ఈ సినిమా షూటింగ్‌ని యాక్షన్ సీన్‌తోనే ఆరంభించారు. భారీ స్థాయిలో ఓ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు దర్శకుడు శంకర్. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో వందమందికి పైగా ఫైటర్స్ పాల్గొన్నారని, ఈ ఫైట్ ఖర్చు రూ. పది కోట్లు పైనే అనే టాక్ వినిపిస్తోంది. మరి.. ఈ ఫైట్ ఏ విధంగా ఉంటుందనేది తెలియాలంటే వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ నెల 27న రామ్‌చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్, రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం కోసం రామ్‌చరణ్ పాల్గొనగా ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. పాటకు ప్రభుదేవా కొరియోగ్రాఫర్. నాగేశ్వరరావు దోపిడీ స్టువర్టుపురం దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ లుక్‌లో రవితేజ రైలు పట్టాలపై ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కథ రీత్యా ట్రైన్లో నాగేశ్వరరావు దోపీడీ చేసే సీన్ అట అది. ట్రైన్లో చిన్నపాటి యాక్షన్ టచ్ కూడా ఉంటుందట. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. డెవిల్ పోరాటం స్వాతంత్య్రానికి పూర్వం అంటే 1945లో బ్రిటిష్‌వాళ్ళు పరిపాలించిన మద్రాస్ ప్రెసిడెన్సీ నేపథ్యంలో జరిగే కథతో రూపొందుతున్న చిత్రం ‘డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్పోస్టర్లో కల్యాణ్ రామ్ ఓ ట్రైన్‌పై ఉన్నట్లు కనిపిస్తుంది. యాక్షన్ సీన్లో భాగంగా ఈ ట్రైన్ వస్తుందని తెలుస్తోంది. నవీన్ మేడారం దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. బొగ్గు దొంగ తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల సమీపంలో గల ఓ కల్పిత గ్రామంలో జరిగే కథగా రూపొందిన చిత్రం ‘దసరా’. ఇందులో మద్యానికి బానిస అయి, బొగ్గు దొంగతనం చేసే ధరణి పాత్రలో కనిపిస్తారట నాని. ఇటీవల విడుదలైన ‘దసరా’ ట్రైలర్లో బొగ్గు ఉన్న గూడ్స్ ట్రైన్‌పై నాని ఉన్న సీన్ కనిపిస్తుంది. ఇది ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ అని టాక్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. లోకల్ ట్రైన్లో ఏజెంట్ లోకల్ ట్రైన్లో ఫైట్స్ చేశారట అక్కినేని అఖిల్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన స్పై యాక్షన్ ఫిల్మ్ ‘ఏజెంట్’. గత ఏడాది వేసవిలో ‘ఏజెంట్’ షూటింగ్ హైదరాబాద్ మెట్రో రైల్లో జరిగింది. ట్రైన్లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా సురేందర్ రెడ్డి చిత్రీకరించారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇక ‘ఏజెంట్’ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఎనిమిది కోట్ల యాక్షన్ సూరి, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ ప్రధాన పాత్రల్లో వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విడుదలై’. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంలోని తొలి భాగం ‘విడుదలై పార్ట్ 1’ ఈ నెల 31న విడుదల కానుంది. ఈ చిత్రం కోసం దర్శకుడు వెట్రిమారన్ ఓ భారీ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌ను తీశారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఖర్చు దాదాపు రూ. 8 కోట్లు అని సమాచారం. కాగా ‘విడుదలై’ రెండో భాగం విడుదలపై కూడా త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ఈ చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాల్లో ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. -
తిరుపతిలో భారతీయుడు
హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘ఇండియన్’ (‘భారతీయుడు’) బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 25 సంవత్సరాల తర్వాత ‘ఇండియన్’కు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ని రూపొందిస్తున్నారు. కమల్–శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ చిత్రం కీలక షెడ్యూల్ ఇటీవల చెన్నైలో జరిగింది. తదుపరి షెడ్యూల్ చిత్రీకరణ తిరుపతిలో ప్రారంభం కానుందని తెలిసింది. ఈ షెడ్యూల్లో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్‌సింగ్, ప్రియా భవానీశంకర్, బాబీ సింహా కీలక పాత్రలు చేస్తున్నారు. ‘ఇండియన్ 2’ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ఆ లుక్ కోసం ఆహారం మానేసిన కమల్! కేవల పండ్ల రసాలతోనే..
‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా తర్వాత హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ తాజాగా ‘ఇండియన్ 2’ చేస్తున్న సంగతి తెలిసిందే. కమల్‌హాసన్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. ‘ఇండియన్’ సినిమాలో మాదిరిగానే ‘ఇండియన్ 2’లోనూ కమల్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ‘ఇండియన్’లో సేనాపతి, అతని తనయుడు చంద్రబోస్ సేనాపతి పాత్రల్లో నటించారు కమల్‌హాసన్. అయితే ‘ఇండియన్ 2’ కథను మాత్రం సేనాపతి, అతని తండ్రి పాత్రల నేపథ్యంలో (1920 సమయంలో...) సాగుతూనే, మరోవైపు ఇప్పటి కాలం కూడా టచ్ అయ్యేలా స్క్రీన్‌ప్లే రెడీ చేశారట శంకర్. అలాగే ఈ చిత్రంలో కమల్‌హాసన్ ఓ పాత్రలో తొంభైసంవత్సరాల వ్యక్తిగా కనిపించనున్నారు. ఈ లుక్‌కి సంబంధించిన షూటింగ్లో పాల్గొంటున్నప్పుడు కమల్ ఆహారం తీసుకోవడంలేదట. ప్రొస్థటిక్ మేకప్ వాడడంతో నోరు పూర్తిగా తెరవలేని పరిస్థితుల్లో షూటింగ్ అప్పుడు కేవలం పండ్ల రసాలతో సరిపెట్టుకుంటున్నారట. -
ఆ చిత్రాలను మళ్లీ ఆరంభించాలని ప్లాన్
కొబ్బరికాయ కొట్టారు.. వీలైనంత త్వరగా షూటింగ్ ముగించాలనుకున్నారు. అయితే అనుకోని కారణాల వల్ల షూటింగ్‌కి బ్రేక్ పడింది. ఇలా బ్రేక్ పడిన చిత్రాలు చాలా ఉన్నాయి. వాటిలో కమల్‌హాసన్ ‘భారతీయుడు 2’, ‘శభాష్ నాయుడు’, విక్రమ్ ‘ధృవ నక్షత్రం’ ఉన్నాయి. ఈ మూడు చిత్రాలు పలు అంచనాల నడుమ ఆరంభమయ్యాయి. అయితే చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఇప్పుడు ‘రీ స్టార్ట్’ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. ‘విక్రమ్’ సినిమా సక్సెస్ జోష్‌లో ఉన్నారు కమల్‌హాసన్. దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ. 400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంత బంపర్ హిట్ సాధించారు కాబట్టే కమల్ తన తదుపరి చిత్రాల షూటింగ్స్ని, ఆగిపోయిన చిత్రాలను మళ్లీ ఆరంభించాలనీ ప్లాన్ చేసుకుంటున్నారు. నిజానికి అన్నీ సవ్యంగా జరిగి ఉంటే ‘విక్రమ్’ కంటే ముందు కమల్ ‘ఇండియన్ 2’ (‘భారతీయుడు 2) రిలీజ్ అయ్యుండేది. కానీ దర్శకుడు శంకర్‌కు, ఈ చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు మధ్య విభేదాలు, ‘ఇండియన్ 2’ సెట్స్‌లో ప్రమాదం జరిగి క్రూ మెంబర్స్ చనిపోవడం వంటి కారణాల చేత ఈ సినిమా షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. అయితే కమల్ చొరవతో ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ మళ్లీ సెట్స్‌పైకి వెళ్లనుందని కోలీవుడ్ టాక్. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు చివరివారం లేదా సెప్టెంబరులో ఆరంభం కానుందని తెలిసింది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా తొలుత కాజల్ అగర్వాల్ ఉన్నారు. కాజల్ తల్లి అయిన విషయం తెలిసిందే. మరి.. ఆమె ఈ చిత్రంలో ఉంటారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక మరో కీలక పాత్రధారి వివేక్ చనిపోయారు. ఆయన పాత్రకు నటుణ్ణి ఎంపిక చేసే పనిలో ఉందట ‘ఇండియన్ 2’ టీమ్. 1986లో కమల్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇండియన్’కి సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక కమల్ చిత్రాల్లో ఆగిన మరో సినిమా ‘శభాష్ నాయుడు’. 2016లో ఈ సినిమా ఆరంభమైన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో శ్రుతీహాసన్, బ్రహ్మానందం కీలక పాత్రధారులు. ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు కమల్ గాయపడ్డారు. దీంతో ఈ సినిమా ఆగింది. ‘భారతీయుడు 2’ని మళ్లీ స్టార్ట్ చేయాలనుకుంటున్నట్లే ‘శభాష్ నాయుడు’ని పట్టాలెక్కించాలనుకుంటున్నారట కమల్. ఈ సినిమా షూటింగ్ కూడా ఈ ఏడాదే ఆరంభం కానున్నట్లు తెలిసింది. మరోవైపు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ‘ధృవ నక్షత్రం’ అనే సినిమా నాలుగేళ్ల క్రితం మొదలైంది. అయితే ఈ సినిమా షూటింగ్ వివిధ కారణాల వల్ల నిలిచిపోయింది. ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ కూడా ఓ నిర్మాత. షూటింగ్‌కి బ్రేక్ పడటానికి ఆర్థిక ఇబ్బందులు ఓ కారణం అనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ సినిమాను రీ స్టార్ట్ చేసే పనిలో ఉన్నారట. ఇక ‘ఇండియన్ 2, శభాష్ నాయుడు, ధృవ నక్షత్రం’ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం. -
కొత్తదనం కోసం తాపత్రయపడే నటతపస్వి.. కమల్ హాసన్
ఎన్ని ప్రయోగాలు చేసినా తీరని కళాదాహం. ఉప్పొంగే అద్భుత హావభావాల నటప్రవాహం. అంత తేలిగ్గా అంతుపట్టని మర్మయోగి. ఎంత అభివర్ణించినా పట్టుబడని ప్రజ్ఞాశాలి. అనుకున్నది సాధించి ఎవ్వరూ ఛేదించలేని శిఖరంలా ఎదిగాడు. అతి సామాన్యుడిలా ఒదిగాడు. అతనే భారతీయ సినిమా గర్వించదగ్గ నటుడు..కమల్ హాసన్. నవంబర్ 7 కమల్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణాన్ని చూద్దాం. ఆరేళ్లకే నటప్రస్థానాన్ని ప్రారంభించాడు. వైవిధ్యమైన నటనతో సినీ అభిమానులు మనసు దోచుకున్నాడు. ఆయన్ని పొగడని విమర్శకుడు లేడు. ఆయన పొందని ప్రశంస లేదు. కమల్ హాసన్ వెండితెరపై అస్సలు కనిపించడు. అంతలా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. అందుకే ఆయన్ని చూస్తే కొత్తదనాన్ని చూసినట్టు ఉంటుంది. 1954, నవంబర్ 7న తమిళనాడుకు చెందిన, రామనాథపురం జిల్లా, పరమకుడిలో జన్మించారు కమల్ హాసన్. తన ఆరేళ్ల వయసులో ‘కలత్తూర్ కన్నమ్మ’ అనే సినిమాతో.. బాలనటుడిగా తెరంగేట్రం చేశాడు. మొదటి సినిమాతోనే జాతీయ స్థాయిలో ఉత్తమ బాలనటుడి అవార్డ్ సాధించారు. బాలనటుడిగా శివాజీగణేశన్, ఎంజీ రామచంద్రన్ వంటి తమిళ అగ్రనటులతో కలసి పనిచేశారు. యవ్వనంలో డాన్స్ డైరెక్టర్ కమ్ ఫైటర్ గా పనిచేశారు. 1974లో మలయాళంలో వచ్చిన ‘కన్యాకుమారీ’ కమల్ ను సక్సెస్ ఫుల్ హీరోను చేసింది. 1977లో వచ్చిన ‘పదనారు వయదినిలె’ కమల్ హాసన్ కెరీర్‌ను మలుపుతిప్పింది. 1978లో ‘మరో చరిత్ర’తో కమల్ చరిత్రే మారిపోయింది. ఇందులో కమల్, సరితలు చేసిన నటనకు.. తెలుగు ప్రేక్షకులు నీరాజనం పలికారు. కలర్ సినిమాల టైంలో వచ్చిన బ్లాక్ అండ్ వైట్ మూవీ ఇది. 1983లో కమల్, శ్రీదేవి జంటగా బాలుమహేంద్ర దర్శకత్వంలో ‘మూన్రాంపిరై ’బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని దాన్ని ‘వసంత కోకిల’గా తెలుగులోకి డబ్ చేసి విడుదల చేశారు. ఈ చిత్రం హిందీలో ‘సద్మా’గా రీమేక్ అయింది. ఈ సినిమాలోని నటనకు జాతీయ స్థాయిలో ఉత్తమనటుడిగా ఎంపికయ్యాడు. మణిరత్నం దర్శకత్వంలో చేసిన ‘నాయకుడు’ మూవీలో నటనకుగాను రెండోసారి, శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాతో మూడోసారి ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్నాడు. ఆర్ట్ సినిమాలోని నాచురాలిటీ.. కమర్షియల్ సినిమాలోని సేలబులిటీ..రెండిటినీ మిక్స్ చేసి సరిహద్దు రేఖల్ని చెరిపేశాడు. సినిమా అంటే ఓ కళారూపం అన్న సత్యాన్ని తెలియజెప్పాడు. ప్రాంతాలు, భాషలు అనే అడ్డుగోడల్ని కూల్చేశాడు. సినిమా చుట్టూ అల్లిన లిల్లీపుట్ ఫార్మెట్ ను బద్ధలుకొట్టి..నిజమైన నాయకుడిగా నిలబడ్డాడు.. ఆ లోకనాయకుడు. నాయకుడుగా నటించినా.. బ్రహ్మచారిగా కనిపించినా.. తెనాలిగా మెప్పించినా.. ఇంద్రుడు చంద్రుడు అనిపించుకున్నా.. అది కమల్‌కే చెల్లింది. హీరోయిజానికి మించి నటుడిగా తన ఇమేజ్ తారాస్థాయికి వెళ్లింది. నిరంతరం కొత్తదనం కోసం తాపత్రయపడే నటతపస్వి.. కమల్ హాసన్. అన్నీ అద్భుతాలే సాధిస్తే ఏమవుతుంది? అవార్డులు..రివార్డులూ వద్దన్నా చెంతకు చేరతాయి. అభినందనలు...ప్రశంసలూ వెతుక్కుంటూ వచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కమల్ హాసన్ తన అద్భుత నటనకుగాను 19 ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు 4 నేషనల్ అవార్డులను అందుకున్నారు. 1990లో పద్మశ్రీ, 2014లో పద్మభూషన్ వంటి ఎన్నో గొప్ప అవార్డులను సొంతం చేసుకున్నారు. కమల్ నట వారసులుగా ఆయన కూతుళ్లు శృతి హాసన్, అక్షరా హాసన్‌లు హీరోయిన్లుగా రాణిస్తున్నారు. త్వరలో ’విక్రమ్’తో పాటు ‘భారతీయుడు 2’ చిత్రాలతో త్వరలోప్రేక్షకులను పలకరించనున్నారు. -
ఈ సినిమాలు ఆగిపోలేవు..
ఉందా? లేదా? లేదట.... కాదు.. కాదు.. ఉందట! ఈ మధ్య కొన్ని చిత్రాల గురించి జరిగిన చర్చ ఇది. ‘ఆగిపోయింది’ అంటూ ఆ చిత్రాలపై వచ్చిన వార్తలకు స్పందించి... ‘ఉందండోయ్’ అని చిత్రబృందం స్పష్టం చేసింది. ఆ చిత్రాలేంటో చూద్దాం. బంగార్రాజు వస్తాడు ఐదేళ్ల క్రితం సంక్రాంతి పండగకి నాగార్జున చేసిన సందడి అంతా ఇంతా కాదు. బంగార్రాజుగా పంచె కట్టుకుని, ‘సోగ్గాడే చిన్ని నాయనా.. ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు..’ అంటూæ అమ్మాయిలతో నాగ్ వేసిన స్టెప్పులు అదుర్స్. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ (2016)లో బంగార్రాజు, రాము పాత్రల్లో నటించారాయన. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ప్రీక్వెల్‌ని ఎప్పుడో ప్రకటించారు. ప్రీక్వెల్ అంటే.. ముందు జరిగిన కథ అన్నమాట.. ‘సోగ్గాడే..’లో బంగార్రాజు చనిపోతాడు... అసలు బంగార్రాజు కథేంటి అనేది ప్రీక్వెల్. అయితే ‘సోగ్గాడే..’ వచ్చి ఐదేళ్లు కావడంతో ప్రీక్వెల్ ఇంకా మొదలుపెట్టలేదు కాబట్టి, ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. కానీ, ఆగలేదు. ఈ విషయాన్ని ‘వైల్డ్ డాగ్’ ప్రమోషన్స్ అప్పుడు నాగార్జున స్వయంగా చెప్పారు. సో... ‘బంగార్రాజు ఈజ్ బ్యాక్’. ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటించే అవకాశం ఉంది. ఆన్‌లోనే ఉంది హీరో అల్లు అర్జున్–దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఎప్పుడో రూపొందాల్సింది కానీ, ఇప్పటివరకూ జరగలేదు. ఇక ఈ కాంబినేషన్ లేనట్లే అని ఈ మధ్య చాలామంది ఫిక్సయ్యారు. దానికి కారణం ‘పుష్ప’ పూర్తి చేశాక కొరటాల శివ సినిమాలోనే అల్లు అర్జున్ చేయాలి. కానీ ఎన్టీఆర్ హీరోగా కొరటాల దర్శకత్వం వహించే సినిమా తెరపైకి వచ్చింది. దాంతో బన్నీ–కొరటాల సినిమా లేనట్లే అని ఎవరికివారు ఫిక్సయ్యారు. కానీ, ‘ప్రాజెక్ట్ ఆన్‌లోనే ఉంది’ అని నిర్మాణ సంస్థ యువసుధ పేర్కొంది. వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత ఈ సినిమా ఆరంభం అవుతుంది. మరోవైపు అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే చిత్రాన్ని ఎప్పుడో ప్రకటించారు. ఈ సినిమా పట్టాలెక్కే చాన్స్ లేదనే వార్తలు వచ్చాయి కానీ, ‘ఐకాన్’ ఉంటుందని ఇటీవల ‘దిల్’ రాజు పేర్కొన్నారు. మారలేదు ‘ప్లాన్ మారలేదు.. ముందు అనుకున్న ప్రకారమే ముందుకు వెళతాం’ అంటూ ఇటీవల ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ సంస్థ ప్రకటించింది. విజయ్ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించనున్న సినిమా గురించే ఈ ప్రకటన. ఈ సినిమా లేదంటూ వచ్చిన వార్తలకే ‘ఉంది’ అని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘లైగర్’లో నటిస్తున్నారు. సుకుమార్ ‘పుష్ప’ తెరకెక్కిస్తున్నారు. ఈ ఇద్దరూ తమ చిత్రాలు పూర్తి చేశాక.. వీరి కాంబినేషన్ సినిమా ఆరంభమవుతుంది. భారతీయుడు ఆగడు! కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్’ (భారతీయుడు) ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రం వచ్చిన పాతికేళ్లకు ‘ఇండియన్ 2’కి శ్రీకారం చుట్టారు కమల్–శంకర్. కొన్నాళ్లు షూటింగ్ కూడా జరిగింది. షూటింగ్లో జరిగిన ప్రమాదం వల్ల చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఆ తర్వాత తమిళనాడు ఎన్నికల కోసం కమల్ బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి, ఇక పట్టాలెక్కడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో రామ్‌చరణ్ హీరోగా శంకర్ ఒక సినిమా ప్రకటించడం, అలాగే రణ్వీర్ సింగ్‌తో ‘అన్నియన్’ (అపరిచితుడు) రీమేక్ ప్రకటించడంతో ‘భారతీయుడు 2’ ఏమైంది? అనే టాక్ మొదలైంది. ‘ఇండియన్ 2’ నిర్మాణ సంస్థ లైకా కూడా కూడా శంకర్ ఈ సినిమాని మధ్యలో వదిలేయడం సరికాదని కోర్డుకెక్కింది. ‘‘నేనేం వదల్లేదు.. ‘భారతీయుడు ఆగడు’. దీనికి విదేశీ సాంకేతిక నిపుణులు కావాలి. అలాగే కమల్ డేట్స్ ఇస్తే.. నేను షూట్‌కి రెడీ’ అని శంకర్ విన్నవించుకున్నారు. చిన్న బ్రేక్.. అంతే! కరణ్‌జోహార్ దర్శకత్వంలో జాన్వీ కపూర్ నటిస్తున్న కొత్త సినిమా కూడా ఆగిపోలేదట. గత ఏడాది ఫిబ్రవరిలో తన దర్శకత్వంలో ‘తక్త్’ అనే సినిమాని ప్రకటించారు కరణ్ జోహార్. దానిలో జాన్వీకపూర్‌ది ఓ కీలకపాత్ర. కానీ ఆ చిత్రం ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు. రణ్వీర్ సింగ్, అనిల్ కపూర్, కరీనా కపూర్, ఆలియా భట్, భూమీ పెడ్నేకర్ తదితర భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ‘తక్త్’ ఆగిందనే వార్తలకు స్పందిస్తూ – ‘‘ఆగలేదు... చిన్న బ్రేక్ పడింది.. అంతే’’ అని కరణ్ జోహార్ అన్నారు. ‘ఖిలాడి’గా రవితేజను, ‘టక్ జగదీష్’గా నానీని, ‘వరుడు కావలెను’లో నాగశౌర్యను ఇదివరకే చూశాం. పలు సందర్భాల్లో ఈ చిత్రం పోస్టర్లు విడుదలయ్యాయి, శ్రీరామ నవమికి కూడా ఈ చిత్రాల ఫొటోలు విడుదలయ్యాయి. రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఖిలాడి’. మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇక, హీరో నాని, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘టక్ జగదీష్’. ఇందులో రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లు, నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. ఈ చిత్రా నికి లక్ష్మీ సౌజన్య దర్శకురాలు. -
పండగ తర్వాత ప్రారంభం
కమల్‌హాసన్–శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘భారతీయుడు’ (1996) ఓ సంచలనం. 24 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ ఆరంభించారు కమల్–శంకర్. గతేడాది మూడు షెడ్యూల్స్ కూడా ముగించారు. కానీ షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం, ఆ తర్వాత కరోనా లాక్డౌన్ వల్ల చిత్రీకరణకు బ్రేక్ పడింది. అయితే బడ్జెట్ సమస్యల వల్ల సినిమా మళ్లీ ట్రాక్ ఎక్కదనే వార్త మొదలైంది. కానీ అది నిజం కాదు. త్వరలో నాలుగో షెడ్యూల్ మొదలుపెట్టడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. జనవరిలో సంక్రాంతి పండగ తర్వాత లేదా ఫిబ్రవరిలో చిత్రీకరణ ఆరంభించడానికి పకడ్బందీగా షెడ్యూల్ ప్లాన్ చేశారు. చెన్నైలో షెడ్యూల్ పూర్తి చేశాక, దేశంలో పలు లొకేషన్స్‌లో షూటింగ్ చేయాలనుకుంటున్నారు. అలాగే విదేశాల్లోనూ షెడ్యూల్స్ ఉంటాయని సమాచారం. ఈ కరోనా టైమ్‌లో దేశ, విదేశాల్లో ఎక్కువమందితో షూటింగ్ అంటే సవాల్ అనే చెప్పాలి. ఈ సవాల్‌ని అధిగమించేలా దర్శకుడు శంకర్ అండ్ టీమ్ వర్కవుట్ చేస్తోంది. సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్ తదితరులు నటిస్తున్నారు. -
భారతీయుడు-2: కమల్ కొత్త స్టిల్!!
చెన్నై: లోకనాయకుడు కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ దర్శకుడు శంకర్ గురువారం భారతీయుడు-2 మూవీ స్టిల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ట్విటర్లో శుభాకాంక్షలు తెలిపారు. దీంతో సుమారు 23 ఏళ్ల తర్వాత ఇండియన్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న భారతీయుడు-2లో కమల్ లుక్ ఎలా ఉంటుందో అని ఆత్రుతగా ఎదురు చూస్తున్న అభిమానులను.. సర్ప్రైజ్ చేశాడు. విలక్షణ నటుడు కమల్ - ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారతీయుడు-2 సినిమాలో ఆయన మరోసారి సేనాపతిగా ప్రేక్షకులకు కనువిందు చేయనున్న సంగతి తెలిసిందే. కాగా కమల్ తన పుట్టిన రోజు వేడుకల కోసం భారతీయుడు-2 సినిమా షూటింగ్‌కు 3 రోజుల పాటు బ్రేక్ చెప్పి.. తన స్వగ్రామం పరమక్కుడిలో 60 ఏళ్ల సినీ ప్రస్థానానికి జ్ఞాపకంగా తండ్రి శ్రీనివాసన్ విగ్రహన్ని ఆవిష్కరించారు. Happy birthday sir @ikamalhaasan pic.twitter.com/Gpx6LRc2DO — Shankar Shanmugham (@shankarshanmugh) November 7, 2019 ఇక కమల్ హాసన్ ఇండియన్(1996) సినిమాలో అవినీతిపరులైన ప్రభుత్వ అధికారులను హడలెత్తించే సేనాపతి పాత్రలో.. విశ్వరూపం చూపి విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో రీమేక్ అయ్యింది. కాగా భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమల్ సరసన కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. -
అప్పుడు 70 ఇప్పుడు 90
శంకర్–కమల్‌హాసన్ కాంబినేషన్లో 1996లో వచ్చిన సినిమా ‘ఇండియన్’ (తెలుగులో భారతీయుడు). ఆ సినిమాలో కమల్ యువకుడిగా, వృద్ధుడిగా కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. అందులో 70 ఏళ్ల వృద్ధుడిలా నటించారు కమల్. అప్పుడు 41 ఏళ్ల వయసులో ఉన్న కమల్ హాలీవుడ్ స్థాయి మేకప్, తన నటనతో ప్రేక్షకులను తాను నిజంగానే 70 ఏళ్ళ వృద్ధుడు అన్నట్లు నమ్మించారు. 23 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కమల్ వయసు 64. రెండో భాగంలో ఆయన 90 ఏళ్ల వృద్ధుడిగా కనిపిస్తారట. యాక్షన్ సీన్స్‌ను కూడా అందుకు తగ్గట్టుగానే రూపొందిస్తున్నారట ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్, రకుల్, సిద్ధార్థ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
న్యూ ఇయర్ గిఫ్ట్
సమాజంలో లంచాన్ని నిర్మూలించాలని స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతిగా ‘భారతీయుడు’ సినిమాలో కమల్‌హాసన్ పోరాటం చేశారు. ఇప్పుడు మరోసారి సేనాపతిగా తిరిగి రానున్న సంగతి తెలిసిందే. ఈ సేనాపతి తమిళ కొత్త సంవత్సరం రోజున థియేటర్స్‌లోకి రానున్నారని టాక్. కమల్‌హాసన్ – దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన చిత్రం ‘భారతీయుడు’. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. కాజల్, రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కమల్‌హాసన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమాకు చిన్న బ్రేక్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. ఈ చిత్రాన్ని 2021 ఏప్రిల్ 14న తమిళ సంవత్సరాది సందర్భంగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరు«ద్ సంగీత దర్శకుడు. -
ఆ సినిమా నుంచి కాజల్ తప్పుకుందా?
తమిళసినిమా: నటి కాజల్ అగర్వాల్‌కు ఇప్పుడు టైమ్ అస్సలు బాగోలేదని చెప్పవచ్చు. ఈ అమ్మడు మంచి విజయాన్ని చూసి చాలా కాలమే అయ్యింది. కోలీవుడ్‌లో అజిత్ సరసన నటించిన వివేకం చిత్రం తరువాత కాజల్‌కు విజయమే ముఖం చాటేసిందంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్‌లోనూ నేనేరాజా నేనేమంత్రి తరువాత సక్సెస్‌లు లేవు. ఇటీవల ఈ బ్యూటీ నటించిన ఎంఎల్ఏ, కవచం, సీత వంటి తెలుగు చిత్రాలు వరుసగా నిరాశ పరిచాయి. తమిళంలో అంతకంటే నిరాశను కలిగించిన అవకాశం ఇండియన్–2. నిజానికి ఈ చిత్రంలో నటించే అవకాశం రావడంతో కాజల్‌అగర్వాల్ సంతోషంతో ఉబ్బితబ్బిబై పోయింది. కారణం కథానాయకుడు కమలహాసన్ కావడం, దర్శకుడు శంకర్ కావడం. ఇక ఇండియన్ (తెలుగులో భారతీయుడు) వంటి చిత్రానికి సీక్వెల్ కావడంతో ఇండియన్–2 తన సినీ కేరీర్లో మైలు రాయిగా నిలిచి పోతుందని భావించింది. ఈ చిత్రం కోసం కాజల్‌అగర్వాల్ ఫొటో సెషన్లో కూడా పాల్గొంది. చిత్రానికి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే కమలహాసన్ రాజకీయ రూపంలో ఇండియన్–2 చిత్ర నిర్మాణానికి తొలి గండి పడింది. ఆయన లోక్‌సభ ఎన్నికల పనిలో బిజీ కావడంతో ఈ చిత్ర నిర్మాణం వాయిదా పడిందనే ప్రచారం జరిగింది. ఇప్పటికీ ఈ చిత్ర షూటింగ్‌కు సంబంధించిన వివరాలేవీ లేవు. లోక్‌సభ ఎన్నికల హడావుడి తగ్గిన తరువాత కమలహాసన్ బిగ్‌బాస్–3 పనిలో నిమగ్నమయ్యారు. ఈ రియాలిటీ షో త్వరలో ప్రసారం కానుంది. దీని కోసం కమలహాసన్ వారానికి రెండు రోజులు కేటాయించారు. అలా మరో మూడు నెలల వరకూ ఆయన ఇండియన్–2 చిత్రం గురించి ఆలోచించేలా కనిపించడం లేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూసిన కాజల్‌అగర్వాల్ వేసారిపోయిందట. ఇక సహనం నశించవడంతో ఇండియన్–2 చిత్రాన్ని వదులు కోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తాజా సమాచారం. అలా ఒక క్రేజీ చిత్రాన్ని కాజల్ కోల్పోవాల్సిన పరిస్థితి రావడంతో చాలా నిరాశ, నిస్పృహలకు లోనైనట్లు ప్రచారం జరుగుతోంది. మరో విషయం ఏమిటంటే ఈ అమ్మడు చాలా ఆశలు పెట్టుకున్న హింది చిత్రం క్వీన్‌కు రీమేక్ అయిన ప్యారీస్ ప్యారీస్ విడుదలలో జాప్యం కాజల్‌ను నిరాశకు గురిచేస్తోంది. ప్రస్తుతం జయంరవితో రోమాన్స్ చేస్తున్న తమిళ చిత్రం కోమాలి పైనే ఈ బ్యూటీ ఆశలన్నీ. దీనితో పాటు తెలుగులో ఒక చిత్రం మాత్రమే కాజల్‌అగర్వాల్ చేతిలో ఉంది. కొత్తగా అవకాశాలేమీ లేవు. మరో పక్క ఈ ముద్దుగుమ్మకు ఇంటిలో పెళ్లి ఒత్తిడి పెరుగుతోందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
కొరియన్ భామతో కమల్!
యూనివర్సల్ హీరో కమల్ హాసన్, ఇండియన్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఇండియన్-2 చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘2.ఓ’ తరువాత శంకర్ రూపొందిస్తున్న మూవీ కావడం, గతంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలునెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో కమల్ హాసన్‌కు జోడిగా అందాల చందమామ కాజల్ నటించనుంది. అంతేకాకుండా ఈ మూవీలో మరో భామ కూడా ఉండే అవకాశముందనీ, ఈ పాత్ర కోసం కొరియన్ స్టార్ బేయ్ సుజీని తీసుకున్నట్లు సమాచారం. ఈ పాత్రతో చాలానే యాక్షన్ సీన్స్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు. -
‘భారతీయుడు 2’ లాంచ్ డేట్..!
2.ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు శంకర్ తన తదుపరి చిత్ర పనులు ప్రారంభించాడు. ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా భారతీయుడు సినిమాకు సీక్వల్‌ను లాంచనంగా ప్రారంభించారు. ఇన్నాళ్లు 2.ఓ పనుల్లో శంకర్ బిజీగా ఉండటంతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. 2.ఓ రిలీజ్ కావటంతో శంకర్ తదుపరి చిత్రం మీద దృష్టి పెట్టాడు. వీలైనంత త్వరగా భారతీయుడు 2ను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. అందుకే డిసెంబర్ 14 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారట. రాయలసీమతో పాటు చెన్నై, తైవాన్లతో షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో కమల్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించనుందన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు 2.ఓలో ప్రతినాయకుడిగా అలరించిన అక్షయ్ కుమార్ మరోసారి శంకర్ సినిమాలో భాగం కానున్నాడట. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమాలో నటించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. -
‘ఇండియన్-2’ మొదలైంది..!
ఇండియన్ డైరెక్టర్ శంకర్, యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ కలిస్తే క్రియేట్ అయ్యే సెన్సేషన్‌కు తరుణం ఆసన్నమైంది. గతంలో ఇండియన్(భారతీయుడు)తో సంచలనం సృష్టించిన వీరి కాంబినేషన్.. మళ్లీ ఇన్నాళ్లకు సీక్వెల్ రూపంలో ప్రకంపనలు సృష్టించేందకు రెడీ అయింది. ఇప్పటికే శంకర్ ‘2.ఓ’కు సంబంధించిన పనులను పూర్తి చేశారు. ఈ చిత్రం విడుదలైన తరువాత ‘ఇండియన్2’ చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ‘ఇండియన్2’కు సంబంధించిన పూజాకార్యక్రమాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కమల్‌కు జోడిగా కాజల్ అగర్వాల్ నటించనున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. ఈ సినిమాలోని నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులకు సంబంధించిన విషయాలను త్వరలోనే చిత్రయూనిట్ ప్రకటించనున్నట్లు సమాచారం. Set work for #Indian2 started.. pic.twitter.com/clKLenzzDb — Ramesh Bala (@rameshlaus) November 12, 2018 -
‘భారతీయుడు 2’లో చాన్స్ కొట్టేసింది..!
లోక నాయకుడు కమల్ హాసన్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా భారతీయుడు. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. మరోసారి కమల్, శంకర్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో భారతీయుడు 2పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో కమల్‌కు జోడిగా కాజల్ అగర్వాల్ నటించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. తెలుగులో చిరంజీవి లాంటి సీనియర్ల సరసన నటించిన కాజల్, కమల్ సరసన నటించే అవకాశం రావటంతో వెంటనే ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. -
ఒక్కరా? ఇద్దరా?
కమల్ హాసన్– శంకర్ కాంబినేషన్లో ‘ఇండియన్’ (తెలుగులో భారతీయుడు) సీక్వెల్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్, లొకేషన్స్ వెతికే పనుల్లో శంకర్ ఫుల్ బిజీగా ఉన్నారు. కోలీవుడ్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ సీక్వెల్లో కమల్‌హాసన్ డ్యూయల్ రోల్లో కనిపిస్తారట. ఏయం రత్నం నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రం వచ్చే ఏడాదిలో స్టార్ట్ కానుంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఇందులో ఓ కీలక పాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్‌లో తండ్రీ, కొడుకుల్లా రెండు పాత్రల్లో కనిపించిన కమల్, సినిమా చివరలో లంచగొండి అయిన కొడుకుని చంపేస్తాడు. మరి సీక్వెల్లో డ్యూయల్ రోల్ ఎలా తీసుకువస్తారన్నది చర్చనీయాంశం. ఏది చేసినా లాజిక్‌లకి లోబడి ఉండే శంకర్ దానికి మించిన స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారని ఊహించవచ్చు. -
పెరియ మనుషన్ ఏమయ్యాడు?
‘‘భేష్.. సినిమా బాగుంది. రైట్ స్క్రిప్ట్ తీసుకొస్తే నీ డైరెక్షన్లో సినిమా చేస్తా’’... శంకర్‌కి సూపర్ స్టార్ రజనీకాంత్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ‘జెంటిల్‌మేన్’ చూసి శంకర్‌కి రజనీ ఈ ఆఫర్ ఇచ్చారు. శంకర్‌కి దర్శకుడిగా ఇది ఫస్ట్ మూవీ. రజనీ ఇచ్చిన ఆఫర్‌తో ఉత్సాహంగా కథ రాయడం మొదలుపెట్టారు. అది రాస్తూనే ‘ప్రేమికుడు’ సినిమా తీయడం మొదలుపెట్టారు. ఈ సినిమా పూర్తయ్యేసరికి రజనీ కోసం తయారు చేసిన కథ కూడా పూర్తయింది. ‘పెరియ మనుషన్’ అని టైటిల్ కూడా పెట్టేశారు. అంటే పెద్ద మనిషి అని అర్థం. ఇక రజనీ కథ వినడమే ఆలస్యం. ‘పెరియ మనుషన్’ పట్టాలెక్కేస్తాడు. అయితే అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని జరగవు కొన్ని అనే సామెతలా రజనీతో తీయాలనుకున్న ఈ ప్రాజెక్ట్ మొదలు కాలేదు. ఎందుకంటే, రజనీ అప్పటికి వేరే సినిమాలకు డేట్స్ ఇచ్చేశారు. ఇది జరిగింది 1993లో. ఆ తర్వాత 14 ఏళ్లకు ‘శివాజీ’ (2007)తో రజనీ–శంకర్ కాంబినేషన్ కుదిరింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ‘రోబో’తో ఇద్దరూ మరో ఘనవిజయం ఇచ్చారు. ఈ చిత్రం సీక్వెల్ ‘2.0’తో ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ కుదిరింది. ‘2.0’ నవంబర్ 29న విడుదల కానుంది. అంతా బాగానే ఉంది. ఇంతకీ ఆ ‘పెరియ మనుషన్’ స్క్రిప్ట్ ఏమైంది? అంటే.. ఆ కథనే శంకర్ అటూ ఇటూ మార్చి కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు’ తీశారని టాక్. -
కమల్ హాసన్ చివరి సినిమా అదేనా?
లోక నాయకుడు, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా ‘విశ్వరూపం 2’ రాబోతోంది. ప్రస్తుతం సినిమాలతో, రాజకీయాలతో బిజీగా ఉన్న కమల్ హాసన్ త్వరలోనే సినిమాలకు స్వస్తి పలకనున్నారు. తమిళనాడులో ‘మక్కళ్ నీది మయ్యం’ పార్టీని బలోపేతం చేసేందుకు కమల్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ పార్టీని ప్రజల్లోకి మరింత చేరువ చేసేందుకు ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘భారతీయుడు’ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోందన్న ప్రచారం అప్పట్లో ఊపందుకుంది. ఇక కమల్ కూడా ‘భారతీయుడు 2’ సినిమానే తన చివరి సినిమానే అని చెప్పినట్లు సమాచారం. విశ్వరూపం 2 సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ విషయాన్ని ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక భారతీయుడు 2 సినిమా ఎంతటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందో చూడాలి. ఇప్పటికే సగం షూటింగ్‌ను కంప్లీట్ చేసుకున్న ‘శభాష్ నాయుడు’ సినిమా సంగతి ఇంకా తెలియాల్సి ఉంది. కమల్ నటించి దర్శకత్వం వహించిన ‘విశ్వరూపం 2’ ఆగస్టు 10న విడుదల కానుంది. -
భారతీయుడికి గెస్ట్
కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘ఇండియన్’ (‘భారతీయుడు’). ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నారు శంకర్. రాజకీయాల్లోకీ ఎంట్రీ ఇవ్వడంతో ఇదే తన లాస్ట్ సినిమా అవ్వనుందని ఆ మధ్య కమల్ ప్రకటించారు. ఫస్ట్ పార్ట్‌కు మించి ఈ సీక్వెల్ ఉండాలని స్క్రిప్ట్ పనిలో ఫుల్ బిజీగా ఉన్నారట శంకర్. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్‌ను ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారట. మరి అజయ్ విలన్‌గా కనిపిస్తారా? గెస్ట్ పాత్రలో కనిపిస్తారో వేచి చూడాలి. ఆల్రెడీ శంకర్ ‘2.0’లో హిందీ నటుడు అక్షయ్ కుమార్ విలన్‌గా యాక్ట్ చేశారు. ఇప్పుడు ‘ఇండియన్ 2’లో అజయ్ దేవగన్. ఇలా బాలీవుడ్ నటులను కూడా తీసుకుంటే సినిమాకి హిందీ మార్కెట్ కూడా బాగుంటుందని శంకర్ ఉద్దేశం అయ్యుండొచ్చు. -
స్టార్ డైరెక్టర్ @25
పెరంబూరు: అభిమాన ధనాన్ని మించింది లేదంటారు. అలాంటి శిష్యాభిమానంలో దర్శకుడు శంకర్ తడిచి ముద్దయ్యారు. ఇండియాలోని స్టార్ దర్శకుల్లో ఒకరిగా ఖ్యాతి గాంచిన దర్శకుడు శంకర్. జంటిల్మెన్ చిత్రంతో జనూన్ దర్శకుడిగా తమిళసినిమాకు పరిచయం అయ్యారు. ఈయన చిత్రాలన్నీ అద్భుతాలను ఆవిష్కరించినవే. శంకర్ తొలి చిత్రం జెంటిల్మెన్ 1997లో విడుదలైంది. దర్శకుడిగా ఆయన 25 వసంతాలను పూర్తి చేసుకున్నారన్నమాట. ఒక దర్శకుడిగా వరుస విజయాలను సాధిస్తూ రాణించడం ఆసాధారణమే. ఎన్ని చిత్రాలు చేశామన్నది కాకుండా ఎన్ని మంచి ప్రజాదరణ పొందిన చిత్రాలు అందించామన్నదే ముఖ్యంగా భావించేవారు శంకర్. ఆయన ఈ 25 ఏళ్లలో 12 చిత్రాలే చేశారు. ఆయన తాజా చిత్రం 2.ఓ ఎన్నో అద్భుతాలతో త్వరలో తెరపైకి రానుంది. తదుపరి కమలహాసన్ హీరోగా ఇండియన్– 2ను తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే దర్శకుడిగా ఆదివారం 25 వసంతాలను పూర్తి చేసుకున్న శంకర్‌ను ఆయన శిష్యులు అట్లీ, మాదేశ్, బాలాజీ శక్తివేల్, హోసిమిన్, వసంతబాలన్, అరివళగన్ అభిమానంతో సత్కరించారు. ఒక జ్ఞాపికను అందించి ఆయనతో ఫొటో కూడా దిగారు. ఈ మధుర క్షణాలను ఆస్వాదిస్తూ శంకర్ శిష్యుల అభిమానంలో తడిసి ముద్దయ్యాను. మీరు లేనిదే ఈ నా పయనం ఉండదు అని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
‘భారతీయుడు 2’కి లైన్ క్లియర్
లోక నాయకుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ల కాంబినేషన్లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా భారతీయుడు. తమిళ్లో రూపొందిచన ఈసినిమా తెలుగు, హిందీ భాషల్లోనూ ఘనవిజయం సాధించింది. చాలా కాలంగా ఈ సినిమాకు సీక్వల్‌ను రూపొందించేందుకు దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్‌ను ప్రయత్నిస్తున్నారు. అయితే ఇద్దరు బిజీగా ఉండటంతో ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. శంకర్ 2.ఓ సినిమా షూటింగ్లో ఉండగానే భారతీయుడు సీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్టుగా ప్రకటించారు. అంతేకాదు శంకర్, కమల్‌లు ఒకే వేధిక నుంచి అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. ఈ లోగా కమల్ రాజకీయాల్లో బిజీ కావటం, శంకర్ తెరకెక్కిస్తున్న 2.ఓ వాయిదా పడటంతో భారతీయుడు 2 పట్టాలెక్కలేదు. తాజాగా కమల్ తన సినీ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు. తప్పకుండా సినిమాల్లో కొనసాగుతానని చెప్పటం, శంకర్ కూడా 2.ఓ రిలీజ్ డేట్ ప్రకటించటంతో త్వరలోనే భారతీయుడు 2 పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ముందుగా ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించేందుకు సిద్దమయ్యారు. అయితే ప్రాజెక్ట్ డిలే కావటం, బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోవటంతో దిల్ రాజు తప్పుకున్నారు. దీంతో 2.ఓ సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో భారతీయుడు 2ను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
కమల్‌తో నయన్ ఢీ
కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్–2 చిత్రంలో ఆయనకు జంటగా నయనతారను నటింపజేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. అందుకు నయనతార కొన్ని షరతులు విధించారు. అందులో ముద్దుసీన్లు తీయాలనుకుంటే ముందుగానే తెలియజేయాలని, స్విమ్ సూట్లో నటించేది లేదంటూ తేల్చేశారు. ఇలావుండగా కోలమావు కోకిల అనే చిత్రంలో మత్తుమందులు తరలించే మహిళగా నటిస్తున్నారు నయనతార. ఈ సినిమా కోసం నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ ఓ పాట కూడా రాశారు. ఈ సినిమా ఆగస్టు 10న విడుదల కానుంది. ఇలావుండగా కమలహాసన్ నటించిన విశ్వరూపం–2 చిత్రం ఇదివరకే ఫైనాన్స్ సమస్యతో రెండేళ్లు రిలీజ్ కాకుండా ఉంది. ఈ చిత్రం బాధ్యతలు స్వీకరించిన కమలహాసన్ చిత్రాన్ని పూర్తిగా ముగించి సెన్సార్ సర్టిఫికెట్ పొందారు. ఈ చిత్రం ఆగస్టు 10వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఇండియన్–2లో జంటగా నటించనున్న కమలహాసన్, నయనతార నటించిన చిత్రాలు ఒకే రోజున తలపడేందుకు రెడీ కావటంతో కోలీవుడ్ లో ఆసక్తి నెలకొంది. -
కమల్ చిత్రంలో అజయ్‌దేవ్‌గన్?
తమిళసినిమా: రజనీకాంత్, కమలహాసన్ వంటి ప్రముఖ నటుల చిత్రాల్లో బాలీవుడ్ స్టార్స్‌ను నటింపజేయడానికి దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. కాంబినేషన్ కొత్తగా ఉంటుంది, వ్యాపారం అంతర్జాతీయ స్థాయిలో పలుకుతుందన్న ఆలోచనలే ఇందుకు కారణంగా భావించవచ్చు. బాలీవుడ్ స్టార్స్ కూడా దక్షిణాది చిత్రాల్లో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. రజనీకాంత్ కాలా చిత్రంలో తనకు విలన్‌గా నానాపటేకర్‌ను ఎంచుకున్నారు. ఇక ఎందిరన్ చిత్రంలో అక్షయ్‌కుమార్ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కమలహాసన్ కూడా తన తాజా చిత్రం ఇండియన్–2లో మరో బాలీవుడ్ హీరో అజయ్దేవ్గన్ను నటింపజేసే ప్రయత్నంలో ఉన్నట్లు తాజా సమాచారం. అయితే కమల్ తన హేరామ్ చిత్రంలోనే షారూఖ్‌ఖాన్‌ను నటింపజేశారన్నది గమనార్హం. ఆయన త్వరలో శంకర్ దర్శకత్వంలో ఇండియన్–2లో నటించడానకి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 2.ఓ చిత్ర గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా ఉన్న శంకర్ సెప్టెంబర్‌లో ఇండియన్–2 చిత్రానికి షిఫ్ట్ అవుతున్నట్లు సమాచారం. ఆయన చిత్రాలు బ్రహ్మాండానికి మారుపేరు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ తారాగణం, ప్రఖ్యాత సాంకేతిక వర్గం ఆయన చిత్రాల్లో పనిచేస్తుంటారు. అలా ఇండియన్–2ను భారీ ఎత్తున తెరకెక్కించడానికి శంకర్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే కమలహాసన్ సరసన అగ్రనటి నయనతార నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా అజయ్దేవ్గన్ను ప్రధాన పాత్రల్లో నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్. దీనికి యువ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీత బాణీలు కడుతున్న విషయం తెలిసిందే. ఇంకా ఎన్ని విశేషాలు ఈ చిత్రంలో చోటు చేసుకోనున్నాయో. -
నయన్ ఖర్చుపై రచ్చ
తమిళసినిమా: సక్సెస్‌కు ఐఎస్ఐ ముద్ర అంత నమ్మకంగా మారిన నటి నయనతార. ప్రముఖ, యువ కథానాయకులంటూ భేదం లేకుండా ఎడాపెడా చిత్రాల్లో నటించేస్తున్న ఈ అగ్రతార మరో పక్క హీయిరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లోనూ నటిస్తూ తన స్థాయిని పెంచుకుంటున్నారు. ప్రస్తుతం తమి ళం, తెలుగు, మలయాళం అంటూ డజను చిత్రాలకు పైగా చేతిలో చి త్రాలున్న నయనతార హిట్‌కు రూ. కోటి చొప్పున ఇటీవల పారితో షికాన్ని పెంచుకుంటూపోతున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇమైకా నోడిగళ్ చిత్రానికి నయనతార రూ. 3 కోట్లు పారితోషికం పుచ్చుకున్నారు. ఆ చిత్రం ఇంకా విడుదల కానేలేదు. ప్రస్తుతం ఆమె పారి తోషికం రూ.5 కోట్లకు చేరుకుందట. ఈ మధ్యలో తమిళ చిత్రం అరమ్, వేలైక్కారన్, తెలుగు చిత్రం జైసింహా చిత్రాలు విడుదలయ్యాయి. తాజాగా ఇంతకు ముందు అంగీకరించిన చిత్రాలను పూర్తి చేస్తూ, అజిత్‌కు జంటగా విశ్వాసం చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. అదే విధంగా కమలహాసన్‌కు జంటగా ఇండియన్–2 చిత్రంలో కథానాయకి అవకాశం నయనతారనే వరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్కెట్ ఉండడం వల్ల ఈ అమ్మడికి రూ. 5 కోట్లు పారితోషికాన్ని అందించడానికి నిర్మాతలు అభ్యంతరం చెప్పడం లేదు. ఇక్కడ చిక్కంతా ఎక్కడ వచ్చిందంటే ఆమె సహాయకులకు, ఇతర ఖర్చులకు తడిపి మోపెడవుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం గురించి సినియర్ నిర్మాత రాజన్ ఒక చానల్‌కిచ్చిన భేటీలో పేర్కొంటూ నయనతార పారితోషికం, ఆమె సహాయకులకయ్యే ఖర్చుపై మండిపడ్డారు. ఇటీవల రూ.3 కోట్లు పారితోషికాన్ని పుచ్చుకుంటున్న నయనతార ఇప్పుడు రూ.5కోట్లకు పెంచేశారన్నారు. ఇదలా ఉంచితే ఆమె సహాయకులంటూ 5గురు వెంట ఉంటారన్నారు. వారి ఖర్చే రోజుకు రూ.60 వేలు అవుతోందని, ఇవి కాకుండా కేరవన్ మరో రూ.10 ఖర్చు అని అన్నారు. అదే విధంగా తింటానికి లేనట్టుగా నయనతార తరచూ తన పారితోషికాన్ని పెంచుకుంటూ పోతోందని ఆయన విమర్శల వర్షం కురిపించారు. దీనికి నయనతార వర్గం ఎలా రెస్పాండ్ అవుతారో వేచి చూడాలి. -
సీక్వెల్ మచ్చీ సీక్వెల్
మచ్చీ... ‘రోబో’ అప్డేట్ అయ్యి వస్తున్నాడు.... భారతీయుడు విశ్వరూపం చూపిస్తాడట. ఈసారి పందెంకోడి మళ్లీ బరిలోకి దిగాడు... సామి దూకుడు పెంచాడు... మారి మమ్మమ్మాస్...సీక్వెల్ మచ్చీ సీక్వెల్... ఈ ఏడాది తమిళంలో సీక్వెల్స్ జోరు సాగుతోంది... ‘2.0’, ‘విశ్వరూపం 2’ఆల్రెడీ రిలీజ్‌కు రెడీ అయ్యాయి.... ఆన్ సెట్స్‌లో పదికి పైగా సీక్వెల్స్ ఉన్నాయి. సీక్వెల్స్ మావా సీక్వెల్స్. మరోసారి ఇండియన్ విశ్వరూపం కొడుకు మీద ఉన్న ప్రేమకన్నా, దేశభక్తే మిన్న అని చెప్పాడు భారతీయుడు. శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్, ఉర్మిళ, మనీషా కోయిరాల ముఖ్య తారలుగా తమిళ్, హిందీ భాషల్లో రూపొందిన చిత్రం ‘భారతీయుడు’ (1996). ఆల్మోస్ట్ ఎనిమిది కోట్లతో నిర్మించిన ఈ సినిమా 30 కోట్లను అప్పట్లోనే కొల్లగొట్టింది. ఈ సినిమాకు బెస్ట్ యాక్టర్ విభాగంలో కమల్‌హాసన్ స్టేట్ అండ్ నేషనల్ అవార్డులు అందుకున్నారు. అంతేనా బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ విభాగంలో ఈ సినిమాను ఆస్కార్ నామినేషన్‌కు పంపించారు. భారతీయుడు అంత క్రేజ్ ఉండబట్టే... ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో పడ్డారు దర్శకుడు శంకర్ అండ్ కమల్‌హాసన్. సీక్వెల్ ఎనౌన్స్ చేసిన వెంటనే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ముందు ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించాలనుకున్నారు. ఆ తర్వాత తప్పుకున్నారు. దాంతో ఫస్ట్ పార్ట్‌ని నిర్మించిన ఏయం రత్నం సీక్వెల్ తీయడానికి ముందుకొచ్చారు. ప్రముఖ రచయిత జయమోహన్‌తో కలసి ప్రముఖ రచయిత వైరముత్తు తనయుడు, యువరచయితల్లో మంచి పేరు తెచ్చుకున్న కబిలన్ వైరముత్తు రెండో భాగానికి కథ రెడీ చేసే పనిలో ఉన్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ చిత్రం కోసం భారీ సెట్ వేయిస్తున్నారట. ఆగస్ట్‌లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.విశేషం ఏంటంటే.. రానున్న రోజుల్లో కమల్ రెండు సీక్వెల్స్‌లో కనిపించనున్నారు. ఆల్రెడీ ‘విశ్వరూపం 2’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఆల్మోస్ట్ ఐదేళ్ల క్రితం రిపబ్లిక్‌డే టైమ్‌లో ‘విశ్వరూపం’ విడుదలైంది. కమల్‌హాసన్, రాహుల్ బోస్, పూజా కుమార్, ఆండ్రియా, జై దీప్ ముఖ్య తారలుగా నటించారు. కమల్‌హాసన్ స్వీయ దర్శకత్వంలో ఆల్మోస్ట్ 90కోట్లతో రూపొందిన ఈ సినిమా 200 కోట్ల క్లబ్లో చేరింది. సో.. ‘విశ్వరూపం 2’ పై అంచనాలు నెలకొన్నాయి. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. త్వరలోనే ట్రైలర్‌ను రిలీజ్ చేసి, చిత్రాన్ని ఈ ఏడాదిలో విడుదల చేయాలనుకుంటున్నారు. విశ్వరూపం ఫస్ట్‌లుక్ రంజాన్‌కు సామి స్క్వేర్ ! పద్నాలుగేళ్లు పట్టింది.. 2003లో వచ్చిన ‘సామి’ సినిమాకు సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లేందుకు. విక్రమ్, త్రిష, వివేక్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘సామి’. దోచుకున్న వారిని దోచుకునే పోలీస్ పాత్రలో విక్రమ్ నటించారు. అప్పట్లో ఐదు కోట్లతో రూపొందిన ఈ సినిమా 30కోట్లను కలెక్ట్ చేసింది. ఈ సినిమాను తెలుగులో ‘లక్ష్మీనరసింహా’ పేరుతో బాలకృష్ణ రీమేక్ చేశారు. తెలుగులో కూడా మంచి స్పందన లభించింది. సామి స్వే్కర్ ఆన్‌లోకేషన్ ‘సామి’ సెన్సేషనల్ హిట్ సాధించడంతో ‘సామి స్వే్కర్పై అంచనాలు పెరిగాయి. స్క్రిప్ట్ పరంగా ఇద్దరు హీరోయిన్లకు చాన్స్ ఉన్న ఈ సినిమాలో కీర్తీ సురేశ్ లీడ్ రోల్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ స్టార్టింగ్‌లోనే క్రియేటివ్ డిఫరెన్స్‌తో హీరోయిన్ త్రిష తప్పుకున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ 80శాతం షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ సీక్వెల్లో కూడా విక్రమ్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. రంజాన్‌కు రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. సామిలో విక్రమ్ మళ్లీ రేస్ మొదలైంది డిఫరెంట్ యాంగిల్ రౌడీయిజాన్ని ‘మారి’లో చూపించారు దర్శక–నటుడు–నిర్మాత ధనుష్. ఆయన హీరోగా బాలాజీ మోహన్ దర్శకత్వంలో కాజల్ కథానాయికగా రూపొందిన చిత్రం ‘మారి’. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. పావురాల రేసింగ్ కాన్సెప్ట్ ఈ సినిమాలో హైలెట్. ఈ ఏడాది ఈ సినిమాకు సీక్వెల్‌ను ఎనౌన్స్ చేశారు ధనుష్. మారిలో ధనుష్ బాలాజీ మోహన్ దర్శకత్వంలోనే తెరకెక్కనున్న ఈ సినిమాలో సాయి పల్లవి, వరలక్ష్మీ శరత్‌కుమార్ నటిస్తున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. పదేళ్ల క్రితం ధనుష్ నటించిన ‘యారుడా నీ మోహిని’కి సంగీతం అందించిన యువన్ శంకర్ రాజా ఇన్నేళ్ల తర్వాత ధనుష్ ‘మారి 2’కి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 40 శాతం కంప్లీట్ అయ్యింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మారి2 వర్కింగ్ స్టిల్ ఇదిగో వస్తా.. అదిగో వస్తా! రజనీకాంత్ ‘2.0’ రిలీజ్ డేట్ చాలాసార్లు మారింది. కానీ అంచనాలు మాత్రం మరింత పెరిగాయి. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా దాదాపు 450 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఆల్మోస్ట్ ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ‘ఎందిరన్’ (తెలుగులో ‘రోబో’) సినిమాకు ఇది సీక్వెల్. ఆల్మోస్ట్ 130 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘రోబో’ భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ‘2.0’ అయితే... రిలీజ్‌కు ముందే ఆల్మోస్ట్ 150 కోట్ల బిజినెస్ చేసింది. రోబో అంతేకాదు ఈ సినిమాను త్రీడీ వెర్షన్‌తో పాటు, ఆల్మోస్ట్ 14 భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. కొందరైతే ఇప్పటివరకు ఇండియాలో అత్యధిక వసూళ్లు చేసిన మొదటి సినిమా ‘బాహుబలి’ రికార్డులను ‘2.0’ బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు. జనవరిలో రావాల్సిన ఈ సినిమా ఏప్రిల్‌కి వాయిదా పడింది. అదీ జరగలేదు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ చేస్తారని కొందరు, లేదు లేదు దీపావళికి రిలీజ్ చేస్తారని మరికొందరు అంచనాలు వేస్తున్నారు. మరి.. ఇదిగో వస్తా.. అదిగో వస్తా అంటున్న ‘2.0’ ఎప్పుడు వస్తుందో కాలమే చెప్పాలి. 2.0 కాంచన కమింగ్ సూన్ ‘ముని’ సినిమాను తెరకెక్కించేటప్పుడు రాఘవ లారెన్స్ ఊహించారో లేదో.. ఈ సినిమాకు మూడు సీక్వెల్స్ వస్తాయని. స్వీయ దర్శకత్వంలో రాఘవ లారెన్స్ నటిస్తూ వేదిక, రాజ్ కిరణ్ ముఖ్య తారలుగా 2007లో రూపొందిన సినిమా ‘ముని’. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దాదాపు 15 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. అంతేకాదు. ఆ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా 2011లో వచ్చిన ‘కాంచన’, నాలుగేళ్ల తర్వాత 2015లో వచ్చిన ‘కాంచన 2’ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. కాంచన3 వర్కింగ్ స్టిల్ ఇప్పుడు ‘కాంచన 3 రూపొందుతోంది. ఈ సినిమాని కూడా స్వీయ దర్శకత్వంలో రాఘవ లారెన్స్ నటిస్తూ, నిర్మిస్తున్నారు. ఇందులో ఓవియా, వేదిక నటిస్తున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఎనిమిదేళ్ల క్రితం ‘ముని’ ఫస్ట్ పార్ట్‌లో నటించిన వేదిక మళ్లీ ‘కాంచన 3’లో నటిస్తున్నారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ నుంచి ఓవియా తప్పుకున్నారన్న వార్తలు వచ్చాయి. కానీ ఓవియా ‘కాంచన 3’ షూట్లో జాయిన్ అవ్వడంతో ఆ వార్తలు అవాస్తవం అని తేలిపోయాయి. ‘కాంచన 3’ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘ముని’లో రాజ్‌కిరణ్, లారెన్స్ బరిలోకి అదే పందెంకోడి విశాల్‌ని మంచి మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ‘పందెం కోడి’. లింగుస్వామి దర్శకత్వంలో విశాల్, మీరా జాస్మిన్ జంటగా తమిళ్లో రూపొందిన చిత్రం ‘సండైకోళి’ (2005) తెలుగులో ‘పందెంకోడి’గా రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘పందెం కోడి 2’ నిర్మిస్తున్నారు. స్టార్టింగ్‌లో కాస్త స్లోగా ఈ చిత్రం షూటింగ్ సా..గిం..ది. ఇప్పుడు ‘పందెం కోడి’ మంచి ఊపుమీద ఉంది. ఈ సీక్వెల్లో విశాల్ సరసన కీర్తీ సురేశ్, వరలక్ష్మీ శరత్‌కుమార్ నటిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేసుకుందని సమాచారం. ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కీర్తీ సురేశ్, విశాల్ నవ్వుల పందిరి ‘పెళ్లాం ఊరెళితె’ ఏం జరిగిందో థియేటర్లో చూశాం. ఇది తమిళ ‘చార్లీ చాప్లీన్’కి రీమేక్. శక్తి సుందర్ రాజన్ దర్శకత్వంలో ఆల్మోస్ట్ 16 ఏళ్ల క్రితం ప్రభుదేవా, ప్రభు, లివింగ్స్టన్, అభిరామి, గాయత్రి ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘చార్లీ చాప్లీన్’. థియేటర్స్‌లో నవ్వులతోపాటు, బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. ప్రస్తుతం ‘చార్లీ చాప్లీన్ 2’ తెరకెక్కుతోంది. శక్తి సుందర్ రాజన్ దర్వకత్వంలోనే ప్రభుదేవా, ప్రభు, ఆదా శర్మ, నిక్కి గల్రానీ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ 70 శాతం కంప్లీట్ అయ్యిందని సమాచారం. పెళ్లి బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ఉంటుందట. పెళ్లి మండపంలో మా నవ్వుల పందరి ఏంటో సిల్వర్ స్క్రీన్‌పై చూడండి అంటున్నారు చిత్రబృందం. ఆదా శర్మ సుడిగాడి సందడి సినిమా రిలీజ్‌కి ముందే లీకయ్యే పరిస్థితి ఇప్పుడు. అయితే కొన్ని కొన్ని సీన్లు లీకవుతుంటాయి. అయితే రిలీజైన మర్నాడు మొత్తం సినిమా ఆన్లైన్లో దర్శనమిస్తోంది. దీన్ని ఉద్దేశించే ‘తమిళ్ పడమ్ 2.0’ చిత్రబృందం ‘మా సినిమా మే 25న విడుదలవుతుంది. 26న ఆన్లైన్లో ఉంటుంది. చూసుకోండి’ అని సెటైరికల్‌గా అన్నారు. అన్నట్లు ఇది కూడా సెటైరికల్ మూవీనే. సీయస్ అముదాన్ దర్శకత్వంలో డిఫరెంట్ పేరడీలతో శివ, దిశా పాండే జంటగా రూపొందిన చిత్రం ‘తమిళ్ పడమ్’. ఈ సీక్వెల్ సేమ్ హీరో, సేమ్ డైరెక్టర్‌తో తెరకెక్కుతోంది. ‘తమిళ్ పడమ్’ సినిమా తెలుగులో ‘సుడిగాడు’ టైటిల్‌తో రిలీజైన సంగతి తెలిసిందే. మరికొన్ని... ఈ సినిమాలే కాకుండా త్రిష, అరవిందస్వామి జంటగా ‘చదురంగ వేటై్ట 2’ తెరకెక్కుతోంది. ఇది ‘చదురంగ వేటై్ట’ కి సీక్వెల్. అలాగే సముద్రఖని దర్వకత్వంలో 2009లో రూపొందిన ‘నాడోడిగల్’ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌లో నటించిన శశికుమార్‌నే రెండో పార్ట్‌లో నటిస్తున్నారు. అంతేకాదు ఎస్.ఆర్. ప్రభాకరన్ దర్శకత్వంలో శశికుమార్ హీరోగానే ‘సుందరప్పాండియన్ 2’ తెరకెక్కనుందని కోలీవుడ్ సమచారం. రామ్‌బాలా దర్శకత్వంలో సంతానం హీరోగా రూపొందిన హారర్ చిత్రం ‘దిల్లుకు దుడ్డు’. ఇప్పుడు సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. మరికొందరి స్టార్ హీరోలతో పాటు, చిన్న హీరోలు కూడా సీక్వెల్ స్వింగ్‌లో రావడానికి చర్చలు జరుగుతున్నాయట. ఆల్రెడీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘కలకలప్పు’కి సీక్వెల్‌గా సుందర్. సి రూపొందించిన ‘కలకలప్పు 2’ విడుదలైంది. ఇప్పటికి పదికి పైగా సీక్వెల్స్ ఆన్ సెట్స్‌లో ఉన్నాయి. చూడబోతుంటే ఇది ‘సీక్వెల్ నామ సంవత్సరం’ అనాలేమో. -
హైదరాబాద్‌లో ఇండియన్–2 షూటింగ్
తమిళసినిమా: తమిళసినిమాను భారతదేశ ఎల్లలు దాటించిన దర్శకులలో శంకర్ ఒకరు. ఈయన చిత్రాలే కాదు ఆలోచనలు, ఆచరణలు అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడంలో ముందుంటారు. ముదల్వన్ చిత్రం నుంచే శంకర్ టెక్నాలజీని ఉపయోగించడంలో సిద్ధహస్తుడనిపించుకున్నారు. అలా బాయ్స్, ఇండియన్, శివాజీ, ఎందిరన్ చిత్రాల్లో శంకర్ సాంకేతిక పరిజ్ఞానం అబ్బురపరచింది. తాజాగా 2.ఓ చిత్రాన్ని హాలీవుడ్ చిత్ర పరిశ్రమనే తిరిగి చూసేలా తీర్చిదిద్దడానికి అహర్నిశలు తపిస్తున్నారు. 2.ఓ చిత్రీకరణను పూర్తి చేసుకుని గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటోంది. దీంతో శంకర్ తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. కమలహాసన్ కథానాయకుడిగా ఇండియన్–2 చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర కథను శంకర్ థాయ్‌లాండ్‌లో తయారుచేశారట. కథ చర్చలు అంతా అక్కడే జరిగాయని సమాచారం. ఇక చిత్ర షూటింగ్‌ను హైదరాబాద్‌లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అక్కడ రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్లను ఏర్పాటుచేస్తున్నట్టు తెలిసింది. కమలహాసన్ రాజకీయరంగ ప్రవేశం చేసిన తరుణంలో ఇండియన్–2 చిత్రం ఆయన రాజకీయ జీవితానికి ఉపయోగపడే విధంగా ఉంటుందని సమాచారం. ఇండియన్ చిత్రం తరహాలోనే ఇది కూడా అవినీతిపై పోరాటంగానే ఉంటుందట. రాజకీయ నాయకులు ప్రజల డబ్బును ఎలా దోచుకుంటున్నారో చేప్పే చిత్రంగా ఇండియన్–2 ఉంటుందని సినీవర్గాల టాక్. -
కమల్‌తో జోడి కుదిరినట్టేనా?
తమిళసినిమా: విశ్వనటుడు కమలహాసన్ ఒక పక్క రాజకీయపార్టీ ప్రారంభ కార్యక్రమాలతో బిజీగా ఉన్నా, మరో పక్క సినిమాలతోనూ బిజీ అవుతున్నారు. ఈనెల 21న పార్టీ పేరు, గుర్తును ప్రకటించడానికి కార్యోణ్ముఖుడవుతున్నారు. అదే సమయంలో తాను స్వీయ దర్శకత్వంలో నటించిన విశ్వరూపం–2 చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ తరువాత సగం వరకూ చిత్రీకరణను పూర్తి చేసిన శభాష్‌నాయుడు చిత్రంపై దృష్టిసారించనున్నారట. అంతే కాదు శంకర్ దర్శకత్వంలో ఇండియన్–2 (భారతీయుడు చిత్రానికి సీక్వెల్)లో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇండియన్ చిత్రంలో అవినీతిపై అవిశ్రాంత పోరాటం చేసిన స్వాతంత్య్ర సమరయోధుడిగా నటించిన కమలహాసన్ సీక్వెల్లోనూ అవనీతిపై పోరాడే పాత్రలోనే నటించనున్నారట. అయితే ఇందులో ఆయన గెటప్ ఎలా ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. రజనీకాంత్ హీరోగా 2.ఓ చిత్రా నిర్మాణంతర కాక్యక్రమాలతో బిజీగా ఉన్న శంకర్ ఇటీవల తైవాన్ నగరంలో ఇండియన్–2 పోస్టర్‌తో భారీ బెలూన్ను ఎగురవేసి ఆ చిత్రంపై మరింత అటెన్షన్‌ను తీసుకొచ్చారు. 2.ఓ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్నే ఇండియన్–2 చిత్రాన్ని నిర్మించనుందట. ఇది ఇంతకు ముందు కమల్ నటించిన చిత్రాలన్నిటి కంటే అత్యధిక భారీ బడ్జెట్లో తెరకెక్కనున్నట్లు సమాచారం. నాయకిగా నయన్? ఇందులో విశ్వనటుడు కమలహాసన్‌కు జంటగా అగ్రనటి నయనతార నటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఆమెను నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నాయని టాక్. అంతే కాదు ఇందులో నయనతార విప్లవ నారిగా నటించనున్నట్లు ప్రచారం జరగుతోంది. ఇదే గనుక నిజం అయితే కమల్‌తో నయన్ నటించే తొలి చిత్రం ఇదే అవుతుంది. ఇండియన్–2 చిత్రంలో వైగైపులి వడివేలు హాస్యభూమికను పోషించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెడువడే అవకాశం ఉంది. -
భారతీయుడు 2 : మ్యూజిక్ అతను కాదు
గ్రేట్ డైరెక్టర్ శంకర్, లోక నాయకుడు కమల్ హాసన్ ల కాంబినేషన్లో తెరకెక్కి ఘనవిజయం సాధించిన సినిమా భారతీయుడు. సంచలన విజయం సాధించిన ఈ సినిమాకు సీక్వల్ తెరకెక్కనున్నట్టుగా ఇటీవల అధికారికంగా ప్రకటించారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రకటించిన దగ్గర నుంచి రకరకాల వార్తలు సౌత్ ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. ముందుగా నిర్మాతగా దిల్ రాజు తప్పుకున్నాడని, తరువాత కమల్ తప్పుకున్నాడనీ వార్తలు వినిపించాయి. ఇటీవల ఈ భారీ చిత్రానికి సంగీత దర్శకునిగా కోలీవుడ్ యువ సంచలనం అనిరుద్‌ను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికి భారతీయుడు సంగీత దర్శకునిగా ఎవరినీ ఫైనల్ చేయలేదని, ముఖ్యంగా అనిరుద్ ను ఈ విషయంపై సంప్రదించలేదని తెలిపింది. 2.ఓ పనుల్లో బిజీగా ఉన్న శంకర్ ఆ సినిమా పూర్తయిన తరువాత భారతీయుడు 2 పనులు ప్రారంభించనున్నారు. -
20 దేశాలు... 200 కోట్లు!
భారతీయుడు భారీ లెవల్లో ప్లాన్ చేస్తున్నాడిప్పుడు! ఏమాత్రం తగ్గడం లేదు. ఖర్చులో... ఖర్చుకి రెండింతలు రాబట్టే విషయంలోనూ... ఆల్రెడీ స్కెచ్ రెడీ చేసేశాడు. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో కల్ట్ క్లాసిక్ ‘భారతీయుడు’కి సీక్వెల్‌గా ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు ‘ఇండియన్–2’ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిన్మాను 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సోషల్ ఇష్యూస్‌పై పొలిటికల్ ఎంట్రీకి ముందు కమల్ నటించే సిన్మా కావడం... సోషల్ ఇష్యూస్‌తో సిన్మాలు తీయడంతో స్పెషలిస్ట్ అయిన శంకర్, ‘2.0’ తర్వాత తీయబోయే సిన్మా కావడంతో ఆల్రెడీ ‘ఇండియన్–2’పై అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పట్నుంచి సినిమా గురించి డిస్కషన్ జరుగుతోంది. అందుకు తగ్గట్టే సినిమాను భారీ లెవల్లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందించనున్న ‘ఇండియన్–2’ను పలు భాషల్లో అనువదించి, దాదాపు 20 దేశాల్లో విడుదల చేయాలనుకుంటున్నారట!! -
భారతీయుడు మళ్లీ వస్తాడా..!
కమల్ హాసన్ కెరీర్ లో బిగెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సినిమా భారతీయుడు. అవినీతి, లంచగొండితనం మీద తెరకెక్కించిన ఈ సినిమాకు సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకుడు. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో అప్పటినుంచి భారతీయుడు సినిమాకు సీక్వల్ ను రూపొందించాలన్న ఆలోచనతో ఉన్నారు చిత్రయూనిట్. అయితే సరైన కథా కథనాలు దొరక్క ఈ సీక్వల్ ఆలస్యం అవుతూ వచ్చింది. శంకర్ తో పాటు, కమల్ కూడా తన సినిమాలతో బిజీగా ఉండటంతో దాదాపుగా ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారు. అయితే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 2.ఓ సినిమా రిలీజ్ కు దగ్గరపడుతుండటంతో మరోసారి భారతీయుడు సీక్వల్ తెర మీదకు వచ్చింది. ఇప్పటికే శంకర్ ఓ లైన్ సిద్ధం చేశాడని, కమల్ ఓకె చెపితే ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే శంకర్, కమల్ ఈ సీక్వల్ పై ఇంత వరకు అఫీషియల్ గా స్పందించలేదు. కానీ అభిమానులు మాత్రం మరోసారి ఈ సూపర్ హిట్ కాంబినేషన్ ను తెర మీద చూసేందుకు ఎదురుచూస్తున్నారు. గతంలో స్టార్ నిర్మాత ఏయం రత్నం భారతీయుడు సీక్వల్ కోసం ప్రయత్నాలు చేశారు. మరి రోబో సీక్వల్ తరువాత అయినా ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ వస్తుందేమో చూడాలి. -
శంకర్, కమల్ ల సీక్వెల్
కమల్ హాసన్ కెరీర్ లో బిగెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సినిమా భారతీయుడు. అవినీతి, లంచగొండితనం మీద తెరకెక్కించిన ఈ సినిమాకు సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకుడు. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో అప్పటినుంచి భారతీయుడు సినిమాకు సీక్వల్ ను రూపొందించాలన్న ఆలోచనతో ఉన్నారు చిత్రయూనిట్. అయితే సరైన కథా కథనాలు దొరక్క ఈ సీక్వల్ ఆలస్యం అవుతూ వచ్చింది. శంకర్ తో పాటు, కమల్ కూడా తన సినిమాలతో బిజీగా ఉండటంతో దాదాపుగా ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారు. ఈ సినిమా నిర్మించాడానికి ప్రయత్నాలు చేస్తున్న నిర్మాత ఏఎం రత్నం కూడా కొంతకాలంగా నిర్మాణ రంగానికి దూరంగా ఉంటూ వస్తున్నాడు. అందుకే భారతీయుడు సీక్వల్ కు సంబంధించిన వార్త చాలారోజులుగా ఇండస్ట్రీలో వినిపించలేదు. తాజాగా అజిత్ హీరోగా వేదలం సినిమాను నిర్మించిన రత్నం మరోసారి భారతీయుడు సీక్వల్ ను తెర మీదకు తీసుకువచ్చాడు. వేదలం సినిమాను దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం రజనీ హీరోగా తెరకెక్కుతున్న రోబో 2 పనుల్లో బిజీగా ఉన్న శంకర్ ఆ సినిమా పూర్తయిన తరువాత భారతీయుడు సీక్వల్ మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది.