2.ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు శంకర్ తన తదుపరి చిత్ర పనులు ప్రారంభించాడు. ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా భారతీయుడు సినిమాకు సీక్వల్‌ను లాంచనంగా ప్రారంభించారు. ఇన్నాళ్లు 2.ఓ పనుల్లో శంకర్ బిజీగా ఉండటంతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు.
2.ఓ రిలీజ్ కావటంతో శంకర్ తదుపరి చిత్రం మీద దృష్టి పెట్టాడు. వీలైనంత త్వరగా భారతీయుడు 2ను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. అందుకే డిసెంబర్ 14 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారట. రాయలసీమతో పాటు చెన్నై, తైవాన్‌లతో షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాలో కమల్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించనుందన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు 2.ఓలో ప్రతినాయకుడిగా అలరించిన అక్షయ్ కుమార్ మరోసారి శంకర్ సినిమాలో భాగం కానున్నాడట. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమాలో నటించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment