2Point0
-
చైనాలో ‘2.ఓ’
-
చైనాకు వెళ్లనున్న ‘2.ఓ’
ఇండియన్ మూవీస్‌కు చైనా మార్కెట్ బాగానే కలసివస్తోంది. ఇక్కడి చిత్రాలు అక్కడ బ్లాక్ బస్టర్‌హిట్‌లుగా నిలుస్తున్నాయి. బాలీవుడ్ చిత్రమైన అంధాదున్ చైనాలో రికార్డులు సృష్టించింది. ఇక రీసెంట్గా హృతిక్ రోషన్ హీరోగా నటించిన కాబిల్ చిత్రాన్ని చైనాలో విడుదల చేశారు. ఇండియన్ డైరెక్టర్ శంకర్, సూపర్‌స్టార్ రజనీకాంత్ కాంబినేషన్లో వచ్చిన 2.ఓ చైనాకు వెళ్లనుంది. దీనికి సంబంధించిన వార్తలు కూడా చైనా మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. జూలై 12న ఈ చిత్రాన్ని చైనాలో విడుదల చేయనున్నారు. అంతేకాకుండా జూలై 25న రష్యాలో కూడా 2.ఓను రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ పర్వాలేదనిపించిన 2.ఓ అక్కడ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. -
ఏడాదికి ముందే రెడీ!
తారల పెళ్లి అంటే ఆ హంగామా, ఆ సందడే వేరప్పా. కొందరు రెండు రోజులు, మరికొందరు వారం రోజులు అంటూ వివాహ వేడుకలను జరుపుకుంటుంటారు. అయితే ఈ హడావుడి నెల ముందు నుంచి మొదలవ్వవచ్చు. లేదా రెండు నెలల ముందు నుంచి ప్రారంభం కావచ్చు. అయితే నటి ఎమీజాక్సన్ రూటే వేరు కదా! ఏకంగా ఏడాదికి ముందు నుంచే పెళ్లి ప్రయత్నాలను చేసుకుంటోంది. మదరాసు పట్టణం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన ఈ ఇంగ్లిష్ బ్యూటీ ఆ తరువాత ఐ, తెరి, 2.ఓ వరకూ బాగానే అవకాశాలను రాబట్టుకుంది. అదేవిధంగా బాలీవుడ్, టాలీవుడ్, శాండిల్‌వుడ్ చుట్టేసింది. రజనీకాంత్‌తో నటించిన 2.ఓ చిత్రం తనకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుందని ఆశలు పెట్టుకుంది. అయితే అలా జరగలేదు. అందుకు కారణాలేమైనా, ప్రస్తుతం చేతిలో సినిమాలు లేవు. ఒక హాలీవుడ్ వెబ్ సిరీస్‌లో మాత్రం నటిస్తోంది. ఆ మధ్య బాలీవుడ్ యువ నటుడితో ప్రేమ వ్యవహారం బెడిసికొట్టిందనే ప్రచారం జోరుగా సాగిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత యూకేకు చెందిన బిగ్‌షాట్ జార్జ్ పనయిటోవా అనే వ్యకిని ప్రేమించి, ఆయనతో షికార్లు కొడుతూ వస్తోంది. ఈ విషయం ఇటీవలే బయటకొచ్చింది. ఇటీవల ఆ ప్రేమజంట ఆఫ్రికాకు విహారయాత్ర చేశారు. అప్పుడు పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారట. పనిలో పనిగా మంచి తరుణం మించిపోనీకూ అన్న చందాన ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఆ తరువాత వివాహ నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. ఈ సంచలన జంట 2020లో పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే అందుకు ఎమీ ప్రియుడు ఇప్పటి నుంచే ఆ ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ఈ ముద్దుగుమ్మ ప్రియుడ్ని ఒక కోరిక కోరిందట. మన పెళ్లి ఇంతకు ముందు ఎవరూ చేసుకోని విధంగా చాలా స్పెషల్‌గా ఉండాలని, అందుకు ఒక అందమైన సముద్రతీరం వేదిక కావాలని కోరిందట. అంతే ఎమీ ప్రియుడు అలాంటి ప్రాంతం కోసం గాలించి చివరికి గ్రీస్ దేశంలోని ఒక దీవిని సెలక్ట్ చేశాడట. ఆ దీవిలోని ఒక రిసార్ట్ వివాహ వేదికను ఏడాదికి ముందే ఏర్పాటు చేసుకోనున్నారట ఈ జంట. నటి ఎమీ కాబోయే భర్త అత్యంత కోటీశ్వరుడట. ఎమీయా మజాకా! View this post on Instagram Merry 💋mass ❤️ First Christmas in our new home with family and friends like family ✨🙏🏼 Thankyou @penny_toumbas @88ga @hga003 #DREAMTEAM 👩🏻🍳 A post shared by Amy Jackson (@iamamyjackson) on Dec 25, 2018 at 2:16pm PST -
గోల్డెన్ రీల్ అవార్డుకు ‘2.ఓ’
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కిన భారతీయ చిత్రం 2.ఓకు మరో అరుదైన గౌరవం దక్కింది. గోల్డెన్ రీల్ అవార్డుకు ఈ చిత్రం నామినేట్ అయ్యింది. అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన అవార్డుల్లో ప్రధానమైన వాటిలో గోల్డెన్ రీల్ ఒకటి. ఉత్తమ సౌండ్ ఎఫెక్ట్, ఎడిటింగ్ కళాకారులకు ఈ అవార్డులను ప్రతి ఏడాది అందిస్తుంటారు. ఈ ఏడాది 66వ గోల్డెన్ రీల్ అవార్డుల ప్రదానోత్సవ వేడుక ఫిబ్రవరి 17న అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో బ్రహ్మాండంగా జరగనుంది. మోషన్ పిక్చర్ సౌండ్, ఎడిటర్స్ సంస్థ నిర్వహించనున్న ఈ అవార్డులకు శంకర్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడుగా నటించిన 3డీ ఫార్మెట్లో 4డీ ఎస్ఎల్ఆర్ సౌండ్‌సిస్టంలో రూపొందిన 2.ఓ చిత్రం నామినేట్ అవడం విశేషం. గత ఏడాది నవంబర్‌లో తెరపైకి వచ్చిన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణను పొందింది. ఇప్పుడీ చిత్రం విదేశీ చిత్రాల కేటగిరీలో ఉత్తమ సౌండ్ ఎఫెక్ట్ విభాగంలో గోల్డెన్ రీల్ అవార్డుకు నామినేట్ అయ్యింది. ఈ అవార్డు కోసం జనవరి 21 నుంచి ఫిబ్రవరి 11 వరకూ ఓటింగ్ పక్రియ జరుగుతుంది. అధిక శాతం ఓటింగ్ పొందిన చిత్రానికి ఫిబ్రవరి 17న జరిగే కార్యక్రమంలో గోల్డెన్ రీల్ అవార్డును అందిస్తారు. 2.ఓ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పూకుట్టాన్ సౌండ్ డిజైనర్‌గా పని చేశారు. -
సంచలనాలు, వివాదాలు.. కోలీవుడ్ 2018
సందేశాలు, సాంకేతిక అంశాలు పక్కన పెడితే.. క్షణం తీరికలేని దినచర్యలతో ఉక్కిరిబిక్కిరయ్యే సగటు మనిషి కాస్త స్వాంతన కోసం వచ్చేది సినిమాకే. వారికి రెండు గంటల పాటు ఆహ్లాదాన్ని అందించడమే సినిమా ప్రధాన లక్ష్యం. అందులో ఎంత వరకు చిత్ర పరిశ్రమ సక్సెస్ అయ్యిందన్నది ప్రశ్నార్థకమే. ఈ ఏడాది కోలీవుడ్ మనుగడ కూడా అలాగే గడిచిపోయింది. కోలీవుడ్ చిత్రపరిశ్రమ 2018లో జీఎస్టీ పన్ను విధానం, చిత్ర పరిశ్రమ సమ్మె వంటి సంఘటనలను ఎదుర్కొంది. దాదాపు 170 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది విజయాల శాతం కొంచెం (10 శాతం) ఎక్కువే అన్నది సంతోషించాల్సిన విషయం. పెద్దా, చిన్న చిత్రాల్లో విజయాలపై అంచనాలు పెట్టుకున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. ఇక కొన్ని చిత్రాలయితే పెట్టిన పెట్టుబడులను కూడా తిరిగి రాబట్టలేకపోయాయి. దెయ్యం ఇతివృత్తాలతో హర్రర్, థ్రిల్లర్ కథా చిత్రాలు వెల్లువెత్తాయి. తక్కువ ఖర్చు, అధిక లాభార్జన కారణం. చిత్ర జయాపజయాల విశ్లేషణ గురించి ప్రముఖ పంపిణీదారుడు తిరుపూర్ సుబ్రమణియం మాట్లాతూ ఈ ఏడాది భారీ బడ్జెట్, చిన్న బడ్జెట్ చిత్రాలన్ని కలిసి 170 విడుదలైనా విజయాల సంఖ్య తక్కువేనన్నారు. కొన్ని చిత్రాలైతే నిర్మాణ వ్యయాన్ని సైతం రాబట్టలేక నష్టాలనే మిగిల్చాయన్నారు. చెన్నైలో ‘2.ఓ’దే అగ్రస్థానం ఈ ఏడాది అధిక చిత్రాలు విడుదలైనా, చాలా తక్కువ చిత్రాలే లాభాలను తెచ్చిపెట్టాయని చెప్పారు. తమిళనాడు వ్యాప్తంగా చూసుకుంటే విజయ్ నటించిన సర్కార్ చిత్రమే అత్యధిక వసూళ్లను రాబట్టింది. అయితే చెన్నై వరకూ అగ్రస్థానం రజనీకాంత్ నటించిన 2.ఓ చిత్రానిదే. ఇక ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లలో 2.ఓ చిత్రమే సత్తా చాటుకుంది. ఇక నటుడు కార్తీ నటించిన కడైకుట్టి సింగం వసూళ్ల సాధనలో మూడోస్థానంలో నిలిచింది. విశాల్ నటించిన ఇరుంబుతిరై, విజయ్‌సేతుపతి నటించిన 96, నయనతార నటించిన కోలమావు కోకిల, ఇమైకా నోడిగళ్ వంటి చిత్రాలు మంచి లాభాలను తెచ్చి పెట్టాయి. చిన్న చిత్రాల్లో అనూహ్య విజయాన్ని సాధించిన చిత్రం రాక్షసన్. ఇకపోతే సక్సెస్ అనిపించుకున్న చిత్రాల్లో గులేబకావళి, ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్, నాచియార్, కాట్రిన్ మొళి, స్కెచ్, కలగలప్పు 2, ఒరు కుప్పకథై, కాలా, టిక్ టిక్ టిక్, ప్యార్ ప్రేమ కాదల్, యూటర్న్, వడచెన్నై, మారి–2 వంటి చిత్రాలు ఉన్నాయి. సూపర్‌స్టార్ నటించిన కాలా, కమల్‌హాసన్ నటించిన విశ్వరూపం– 2 వంటివి అంచనాలు అందుకోలేకపోయాయి. సంచలనాలు, వివాదాలు పలు సంచలనాలకు, వివాదాలకు ఈ ఏడాది నిలయం అయ్యిందనే చెప్పాలి. ఏడాది ఆరంభంలోనే జనవరి 15న గీత రచయిత వైరముత్తు ఆండాళ్ గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. వైరముత్తుపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇక సంచలన నటి అమలాపాల్ ఖరీదైన కారును కొనుగోలు చేసి పాండిచ్చేరిలో రిజిస్టర్ చేసి వివాదాల్లో చిక్కుకుంది. జనవరి 28న ఈ వ్యవహారంలో కొచ్చిలో ఆమె అరెస్ట్ అయి తరువాత విడుదలైంది. అదే నెల 31న ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి వార్తల్లోకి ఎక్కింది. గాయని చిన్మయి గీత రయియిత వైరముత్తు, నటుడు రాధారవిలపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు వివాదంగా మారాయి. ఇక నటి శ్రీరెడ్డి దర్శకుడు ఏఆర్ మురుగదాస్, నటుడు రాఘవ లారెన్స్ వంటివారిపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు సంచలనం సృష్టించాయి. కమల్‌హాసన్ ఫిబ్రవరి 21న మక్కళ్ నీది మయ్యం పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించారు. డిజిటల్ సంస్థలు అధిక ధరలను వసూలు చేయడాన్ని ఖండిస్తూ నిర్మాతల మండలి 47 రోజుల పాటు సమ్మె చేయడంతో చిత్ర షూటింగ్‌లు రద్దు కొత్త చిత్రాల విడుదలను నిలిపేశారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ ఏప్రిల్ 13న శ్రీదేవి జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. జూలై 15న పైయనూర్‌లో ఫెఫ్సీ ఆధ్వర్యంలో స్టూడియోనే ప్రారంభించారు. ఆగస్ట్ 29న విశాల్ ప్రజా సంక్షేమ సంఘం పేరుతో సంఘాన్ని ప్రారంభించారు. అక్టోబర్ 20న నటుడు అర్జున్ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ నటి శ్రుతీహరిహరన్ ఆరోపణలు చేసింది. రాజకీయ దుమారం నవంబర్ 8న నటుడు విజయ్ నటించిన సర్కార్ చిత్రంలో ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను విమర్శించారంటూ అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గజ తుపాను బాధితులను ఆదుకోవడానికి సినీలోకం తరలి వచ్చింది. ఇక సర్కార్ చిత్ర వ్యవహారంలో దర్శకుడు ఏఆర్ మురుగదాస్ క్షమాపణ చెప్పాలంటూ ప్రభుత్వ తరఫు న్యాయవాది చెన్నై హైకోర్టులో వాదనలు వినిపించారు. అందుకు ససేమిరా అన్న ఏఆర్ మురుగదాస్ కేసును ఎదుర్కొంటానని మరు పిటిషన్లో పేర్కొన్నారు. అధిక చిత్రాల హీరో ఈ ఏడాది అధిక చిత్రాల్లో నటించిన కథానాయకుడిగా విజయ్‌సేతుపతి నిలిచారు. జీవీ.ప్రకాశ్, ప్రభుదేవా, కార్తీక్ గౌతమ్,విక్రమ్‌ప్రభు,విక్రాంత్ ఉన్నారు. రజనీ కాంత్, విక్రమ్, విశాల్, ధనుష్, జయంరవి, విష్ణువిశాల్, అధర్వ, అరవిందస్వామి రెండు చిత్రాలే చేశారు. కమల్, సూర్య, విజయ్, శివకార్తి్తకేయన్, కార్తీ, శింబు, జీవా ఒక్క చిత్రంతోనే సరి పెట్టుకున్నారు. హీరోయిన్లలో కీర్తీదే అధిక్యం హీరోయిన్లలో ఈ ఏడాది అధిక చిత్రాల్లో నటించిన రికార్డు యువనటి కీర్తీసురేశ్‌దే. ఈ బ్యూటీ ఏకంగా 5 చిత్రాల్లో నటించింది. వీటిలో మహానటి(నడిగైయార్ తిలగం) చిత్రం కీర్తీ సినీ కెరీర్లో గొప్ప మైలురాయిగా నిలిచింది. ఇక నటి ఐశ్వర్యరాజేశ్, వరలక్ష్మీశరత్‌కుమార్ కూడా తలా ఐదు చిత్రాల్లో నటించారు. నటి సమంత, సాయిషా, జ్యోతిక 3 చిత్రాలు చేశారు. అగ్రనటి నయనతార, త్రిష, హన్సిక, అమలాపాల్, సాయిపల్లవి రెండేసి చిత్రాల్లో నటించారు. తమన్నా, అంజలి ఒక్కో చిత్రానికే పరిమితం అయ్యారు. కాగా నటి త్రిషకు ‘96’చిత్రం అనూహ్య విజయాన్ని అందించింది. అదే విధంగా సూపర్‌స్టార్‌తో నటించాలనే తన చిరకాల కోరిక ఏడాది ‘పేట’చిత్రంతో నెరవేరింది. 2018 త్రిషకు మరచిపోలేని అనుభవాన్ని మిగిల్చింది. దివికేగిన తారలు ఇక విషాద కరమైన సంఘటన ఆగస్ట్ 7న డీఎంకే అధినేత, సినీ రచయిత కరుణానిధి తుదిశ్వాస విడిచారు. నిర్మాత పట్టియల్ శేఖర్, నటుడు దేసింగురాజా, కొల్లం అజిత్, హాస్య నటుడు నీలు, సిలోన్ మనోహర్, నటి శ్రీదేవి, కృష్ణకుమారి, ఎడిటర్ పీఎస్.నాగరాజ్, ఎడిటర్ అనిల్‌మల్నాడ్, ఎడిటర్ శేఖర్, చాయాగ్రహకుడు సురేశ్‌కుమార్, సీవీ.రాంజేంద్రన్, గాయని ఎంఎస్. రాజ్యలక్ష్మి, రచయిత బాలకుమార్, సీనియర్ దర్శక నిర్మాత ముక్తాశ్రీనివాసన్, దర్శకుడు ఆర్.త్యాగరాజన్, గాయని రాణి, దర్శకుడు శివకుమార్, నటుడు వెల్లైసుబ్బయ్య, నటుడు రాకెట్ రామనాథన్, నిర్మాత ఎంజీ.శేఖర్, నటుడు కోవై.సెంథిల్, నటుడు కెప్టెన్‌రాజు వంటి సినీ ప్రముఖులను చిత్ర పరిశ్రమ కోల్పోయింది. -
‘2.ఓ’ చూశాక...
రజనీకాంత్ పెద్ద హీరో అనందరికీ తెలుసు. ఆయన నటనకు వంక పెట్టలేం. కానీ, 2.0లో ఆయనెంత గొప్పగా నటించినా.. నచ్చడు! నవ్వించడానికి ప్రయత్నించినా.. నవ్వురాదు! రజనీకి మాత్రమే సాధ్యమయ్యే స్టైల్లో డైలాగ్స్ చెప్పినా అరవాలనిపించదు. త్రిడీలో రోబోగా ఆయనెన్నీ విన్యాసాలు చేసినా ఆకట్టుకోవు. ఎందుకంటే మనసంతా పక్షిరాజు (అక్షయ్‌కుమార్) పైనే ఉంటుంది. పక్షిరాజు మనుషుల్ని చంపుతున్నా కోపం రాదు. ఒకనొక సమయంతో పక్షిరాజు రోబోనూ చంపేస్తే బాగుండనిపిస్తుంది. సుక్ష్మంగా చెప్పాలంటే మన ఎమోషన్ పక్షిరాజుతో కలసి నడుస్తుంది. అందుకే రజనీ ఎంత గొప్పగా నటించినా నచ్చడు! నిజ జీవితంలో సెల్ఫోన్లు వాడొద్దంటే మనిషి వింటాడా? పక్షుల్ని చంపొద్దంటే ఆగుతాడా? అసలు పక్షిరాజు లాంటి వాడు భూమిపై వాలితే వదులుతాడా? వదలడు కాబట్టే ఈ క్రూర జంతువును నాశనం చేయడానికి, మనల్ని సరైన దారిలో పెట్టడానికి పక్షిరాజు లాంటి వాడు వస్తే బాగుండని ప్రతి ఆలోచనకూ అనిపిస్తుంది. అయితే అది సాధ్యమా?..కనుకే నిజ జీవితంలో మనం చేయలేనివి, చేయాలనుకున్నవి తెరపై చూసి మురిసిపోతాం. ఎదో సాధించామని గర్వపడతాం! నువ్వు బతకాలనుకున్న తీరు, నువ్వు ధ్వంసం చేయాలనుకున్న అన్యాయం, నువ్వు మరిచిపోవాలనుకున్న బాధలు సినిమాలో కనబడిప్పుడు లేదా పుస్తకంలో చదివినప్పుడు గుండెలో గడ్డ కట్టుకున్న భావోద్వేగాలు ఒక్కసారిగా పేలిపోతాయి. లోపలున్న అసంతృప్తులు పారిపోతాయి. మూడు గంటల్లో ఏదో ఒక్క పాత్ర.. అది కొన్ని క్షణాలు సాగినా సరే.. నీ ఉద్వేగానికి మరిచిపోలేని ఉద్దీపన కలిగిస్తే నా ఉద్దేశంలో అది సక్సెస్ అయినట్లే! అది సినిమా అయినా, కథ అయినా, కవితయినా! అది నిన్ను కొన్నాళ్లపాటు వెంటాడుతుంది. పక్షిరాజు అలాంటి ఎమోషనే! ఈ ఒక్క ఎమోషన్ చాలు సినిమా చూడటానికి! ఇంకా ‘ఆకలైతే చెయ్యిని నరుక్కుని తింటామా’ వంటి టెక్నాలజీకి చురకలంటించే అద్భుతమైన డైలాగ్స్ ఎన్నో ఉన్నాయి!! –తండ గణేశ్ -
భారతీయుడు 2 షూటింగ్ అప్డేట్
ఇటీవల 2.ఓ తో సంచలనం సృష్టించిన దర్శకుడు శంకర్ తన తదుపరి చిత్ర పనులు ప్రారంభించాడు. కమల్ హాసన్ హీరోగా ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన భారతీయుడు 2 సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. కొత్త ఏడాది జనవరిలో భారతీయుడు 2 షూటింగ్‌ను చెన్నైలో ప్రారంభించనున్నారు. తరువాత పొల్లాచ్చిలో మరో షెడ్యూల్‌ను పూర్తి చేసి మేజర్ షెడ్యూల్ కోసం ఉక్రెయిన్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తయితే 2020 జనవరిలో భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా తరువాత కమల్ పూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెప్పునున్నారన్న ప్రచారం జరుగుతుండటంతో భారతీయుడు 2 భారీ హైప్ క్రియేట్ అయ్యింది. -
మరోసారి అమెరికాకు రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబసభ్యులతో కలిసి విశ్రాంతి కోసం అమెరికాకు పయనమయ్యారు. రజనీకాంత్ జీవన శైలి గురించి అందరికీ తెలిసిందే. ఆయన తాను నటించిన చిత్రం పూర్తి కాగానే విశ్రాంతి కోసం తప్పనిసరిగా విదేశాలకు వెళుతుంటారు. ఈ సారి ఆయన కుటుంబ సమేతంగా అమెరికాకు వెళ్లారు. రజనీకాంత్ నటించిన 2.ఓ చిత్రం గత నెల 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. ఆ చిత్ర షూటింగ్ పూర్తి అయిన సమయంలోనూ ఆయన విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లారు. తాజాగా పేట చిత్రాన్ని పూర్తి చేశారు. ఈ చిత్రం జనవరిలో సంక్రాంతికి తెరపైకి రానుంది. దీంతో రజనీకాంత్ విశ్రాంతి కోసం కుటుంబసభ్యులతో సహా శనివారం సాయంత్రం చెన్నై నుంచి బయలుదేరి అమెరికాకు పయనం అయ్యారు. అక్కడ 10 రోజులు ప్రశాంతంగా గడిపి జనవరి తొలి వారంలో చెన్నైకి తిరిగిరానున్నారు. రజనీ రాజకీయాల్లోకి రానున్నట్లు గత ఏడాది డిసెంబర్లో బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఏడాది గడుస్తున్నా ఇంకా పార్టీ పేరును కూడా వెల్లడించని పరిస్థితి. దీంతో ఈ నెలలో రజనీకాంత్ పార్టీని ప్రకటిస్తారని ఆశించిన ఆయన అభిమానులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. కొత్త సంవత్సం ప్రథమార్థంలోనైనా ప్రకటిస్తారనే ఆశాభావంతో ఉన్నారు. అయితే రజనీకాంత్ ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించడానికి పచ్చజెండా ఊపారనే ప్రచారం జరుగుతుండడంతో ఆయన అమెరికా నుంచి రాగానే ఆ చిత్ర షూటింగ్‌కు సిద్ధం అవుతారనే టాక్ వినిపిస్తోంది. -
‘ఆ విషయంలో హిందీ దర్శకులు ఫెయిల్’
సూపర్‌స్టార్ రజనీకాంత్, అక్షయ్‌కుమార్‌ల కలయికలో శంకర్ రూపొందించిన విజువల వండర్ 2.ఓ వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ రెండు వారాల్లో రూ. 700 కోట్లు వసూలు చేసింది. 2. ఓనే కాకుండా గతంలో తెలుగులో వచ్చిన ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ భారత సిని చరిత్రలో రికార్డు సృష్టించాయి. వసూళ్ల పరంగా సునామీలా దూసుకు పోయాయి. మరో పక్క బాలీవుడ్లో భారీ అంచానలతో తెరకెక్కిన ఆమిర్ ఖాన్ చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’ మాత్రం ఘోర పరాజయాన్ని చవి చూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శేఖర్ కపూర్ ‘భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించడంలో దక్షిణాది దర్శకులు ఎందుకు విజయవంతమవుతున్నారు.. ముంబై దర్శకులు ఎక్కడ ఫెయిలవుతున్నారు..? దక్షిణాది దర్శకులకు సినిమాలంటే చాలా పాషన్. అందుకే వారు బాహుబలి, బాహుబలి 2, 2 పాయింట్ ఓ వంటి భారీ చిత్రాలు తీయగలిగారు అంటూ ట్వీట్ చేశారు. బాహుబలి, 2. ఓ వంటి చిత్రాలు భారతీయ సినిమాల స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లాయని పొగిడారు. ఇదే సమయంలో హిందీ దర్శకులు ఇలాంటి ప్రయత్నాల్లో వెనకబడ్డారని చెప్పుకొచ్చారు. దక్షిణాదిలో సినిమాల మీద విపరీతమైన అభిమానం ఉన్నవారే ఇండస్ట్రీకి వస్తారంటూ వ్యాఖ్యానించారు. Why are Directors from Southern India succeeding in large scale films where Directors in Mumbai are failing? Directors from the South certainly show far more passion in their film making. Like in #Bahubali #Bahubali2 #2Point0 — Shekhar Kapur (@shekharkapur) December 12, 2018 గతంలో కరణ్ జోహర్ కూడా ఇలాంటి కామెంట్లే చేశారు. ‘బాహుబలి 2 : ది కంక్లూజన్’ విడుదలైనప్పుడు కరణ్ జోహర్ ఇలాంటి అద్భుతాలు దక్షిణాది దర్శకులు మాత్రమే చేయగలరు హిందీ పరిశ్రమలో ఇలాంటి సినిమాలు చేయడం చాలా కష్టం. కానీ పారీతోషికం విషయంలో మాత్రం హిందీ వాళ్లు దక్షిణాది వాళ్ల కంటే ఎక్కువ తీసుకుంటారని పేర్కొన్నారు. చైనాలో కూడా 2 పాయింట్ ఓ దూసుకుపోతుంది. బాహుబలి బిగినింగ్, ఆమిర్ ఖాన్ ‘పీకే’ రికార్డలను కూడా బ్రేక్ చేసింది. -
రూ 700 కోట్ల క్లబ్లో 2.ఓ
చెన్నై : సూపర్‌స్టార్ రజనీకాంత్, అక్షయ్‌కుమార్‌ల కలయికలో శంకర్ రూపొందించిన విజువల వండర్ 2.ఓకు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించినా వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ రెండు వారాల్లో రూ 700 కోట్లు వసూలు చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 2.ఓ రూ 700 కోట్ల క్లబ్లో చేరిన తొలి కోలీవుడ్ సినిమాగా నిలిచింది. 2.ఓ ప్రపంచవ్యాప్తంగా రూ 710.98 కోట్లు వసూలు చేసిందని, రెండు వారాల్లో తమిళనాడులో రూ 166.98 కోట్లు రాబట్టిందని ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ 2.ఓ మెరుగైన వసూళ్లను రాబడుతోంది. రెండు వారాల తర్వాత కూడా అమెరికాలో 2.ఓ వందకు పైగా థియేటర్లలో రన్ అవుతోంది. ఉత్తర అమెరికాలో ఈ తరహాలో ఎక్కువ రోజులు మరే ఇతర భారతీయ సినిమా ప్రదర్శింపబడలేదని చెబుతున్నారు. ఈ ప్రపంచం కేవలం మానవాళి కోసమే కాకుండా సమస్త జీవరాశుల కోసం సృష్టించబడిందనే సందేశంతో తెరకెక్కిన ఈ మూవీలో రజనీకాంత్ డాక్టర్ వశీకరణ్, చిట్టి, 2.ఓ, మైక్రోబోట్స్ 3.ఓ వంటి పలు పాత్రల్లో మెప్పించారు. -
థియేటర్లో రజనీ.. అభిమానుల సందడి!
సూపర్‌స్టార్ రజనీకాంత్.. తన సినిమాను వీక్షించడానికి చెన్నైలోని ఓ థియేటర్‌కి వెళ్లారు. అయితే అక్కడ ఇప్పటికీ దీని సందడి కనపడుతోంది. రిలీజై పదిరోజులు గడుచినా.. ‘2.ఓ’ జోరు ఏ మాత్రం తగ్గడంలేదు. ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో నడుస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మూవీని త్రీడీ వర్షెన్‌లో చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.500కోట్లు కలెక్ట్‌చేసి ఆల్‌టైమ్ రికార్డులను క్రియేట్ చేసింది. రజనీ.. నిన్న(డిసెంబర్ 8) సత్యం థియేటర్లో తన సతీమణి లతా రజనీకాంత్, మనువళ్లతో కలిసి ‘2.ఓ’ను వీక్షించారు. అయితే అక్కడికి వచ్చిన మిగతా ఆడియెన్స్ రజనీకి ఏమాత్రం అసౌకర్యం కలిగించకుండా వారు ఉన్న చోటు నుంచే సెల్ఫీలు తీసుకుంటూ సంబరపడిపోయారు. రజనీ సాధారణ ప్రేక్షకుడిలా మారి తన సినిమానే వీక్షిస్తున్న ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. -
2.ఓ : చైనాలో 56,000 స్క్రీన్స్‌పై..!
సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన భారీ విజువల్ వండర్ 2.ఓ. ఇటీవల విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సూనామీ సృష్టిస్తోంది. తొలి నాలుగు రోజుల్లోనే 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన 2.ఓ ఇప్పుడు మరో రికార్డ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను చైనాలో ఏకంగా 56000 స్క్రీన్స్‌లో రిలీజ్ చేయనున్నారట. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. చైనీస్ భాషలోకి డబ్బింగ్ చేసిన వర్షన్‌తో పాటు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో రూపొందించిన వర్సన్‌ను కూడా చైనాలో రిలీజ్ చేయనున్నారట. దాదాపు 10000 థియేటర్లలో 56000 స్క్రీన్స్‌పై రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అంతేకాదు వీటిలో 47000 స్క్రీన్స్3డీవే కావటం విశేషం. The Next Major Milestone for Team #2Point0 ➡️ MEGA Release In CHINA.. #2Point0InChina #2Point0MegaBlockbuster 🔥 @rajinikanth @akshaykumar @shankarshanmugh @arrahman @iamAmyJackson pic.twitter.com/RyWsNh5sUZ — Lyca Productions (@LycaProductions) 4 December 2018 -
2.ఓ స్థాయిలో అంజలి చిత్రం
సినిమా: నటి అంజలి చిత్రం కూడా 2.ఓ స్థాయిలో ఉంటుందా? దీనికి ఆ చిత్ర దర్శకుడు అవునంటున్నారు. ఏమిటీ నమ్మశక్యం కావడం లేదా? రజనీకాంత్ నటించిన సుమారు రూ.600 కోట్ల బడ్జెట్ చిత్రం ఎక్కడ, నటి అంజలి నటిస్తున్న చిత్రం ఎక్కడ. ఊహించుకోవడానికే మనసంగీకరించడం లేదు అని అంటారా? అయితే నటి అంజలి నటిస్తున్న తాజా చిత్రం గురించి తెలుసుకుందాం. ఈ అమ్మడు తెలుగులో గీతాంజలి, తమిళంలో బెలూన్ లాంటి హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రాల్లో నటించి సక్సెస్‌ను అందుకుంది. తాజాగా లీసా అనే చిత్రంలో నటిస్తోంది. ఇదీ హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రమే నటుంన్నారు దర్శకుడు రాజు విశ్వనాథన్. లిసా చిత్రం గురించి ఈయన తెలుపుతూ సాధారణంగా రూ.100నుంచి 200 కోట్ల బడ్జెట్‌తోనే 3డీ ఫార్మాట్ చిత్రాలు చేయడం అసాధ్యం అని భయపెడుతుంటారని, చిన్న బడ్జెట్లోనూ బ్రహ్మాండమైన విజువల్స్ చేయవచ్చునని, అదే లిసా చిత్రంలో చేశామని అన్నారు. లిసా చిత్ర కథను మొదట థ్రిల్లర్ కథగానే తయారు చేసుకున్నానని, అయితే ఛాయాగ్రహకుడు పీజీ.ముత్తయ్య ఆ సమయంలో తన బ్యానర్లో ఒక దెయ్యం ఇతి వృత్తంతో కూడిన చిత్రం చేస్తారా? అని అడిగారన్నారు. దీంతో తాను తయారు చేసుకున్న థ్రిల్లర్ కథను హర్రర్‌గా మార్చానన్నారు. నిజం చెప్పాలంటే ట్రెండ్‌గా మారిన దెయ్యం కథా చిత్రాలకు కాస్త క్రేజ్ తగ్గిందని, తామూ అదే భాణీలో చిత్రం రూపొందిస్తే ప్రేక్షకులకు బోర్ అనిపిస్తుందని భావించి కొంచెం భిన్నంగా 3డీ స్టీరియోస్కోప్లో లీసా చిత్రాన్ని చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. సాధారణంగా 4కే ఫార్మాట్లో చిత్రాన్ని షూట్ చేసి దాన్ని 2కేకు మారుస్తారన్నారు. అయితే తాము 8కే ఫార్మెట్లో షూట్ చేసి 2కేకు మార్చామన్నారు. దీంతో చిత్రం సూపర్ క్యాలిటీగా, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని చెప్పారు. లీసా చిత్రాన్ని 3డీలోనే కాకుండా 2డీలో చూసిన మంచి అనుభూతి కలుగుతుందని చెప్పారు. 2.ఓ చిత్రానికి పని చేసిన సీజీ టీమ్‌నే ఈ చిత్రానికి వర్క్ చేశారని తెలిపారు. ఈ కథను సిద్ధం చేసుకున్నప్పుడే అంజలి నటిస్తే బాగుంటుందని భావించామన్నారు. కథ చెప్పగానే అంజలి నటించేందుకు ఒప్పుకోవడంతో మొదలైన లీసా చిత్రం ఇప్పుడు చాలా బాగా వచ్చిందని దర్శకుడు రాజు విశ్వనాథన్ చెప్పారు. -
సూపర్ స్టార్ మరో సినిమాకు ఓకె చెప్పాడా..?
2.ఓ సినిమాతో సంచనాలు నమోదు చేస్తున్న సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుసగా సినిమాలతో రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో పేట్ట షూటింగ్ పూర్తి చేసిన రజనీ, మరో సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీ 166వ చిత్రం తెరకెక్కనుంది. విజయ్ హీరోగా సర్కార్ సినిమాతో కమర్షియల్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న మురుగదాస్ తొలిసారిగా రజనీ హీరోగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న రజనీ, సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు చేసే మురుగదాస్ తోడైతే రజనీ పొలిటికల్ ఎంట్రీకి కూడా ప్లస్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్. -
దటీజ్ రజినీ.. నాలుగు రోజుల్లోనే రూ.400కోట్లు!
సూపర్‌స్టార్ రజనీకాంత్ మానియా అంటే ఏంటో గతకొంతకాలంగా చూపెట్టలేదని అభిమానులు నిరాశపడ్డారు. కబాలి, కాలా సినిమాలతో తలైవా అభిమానులు నిరాశపడినా.. ‘2.ఓ’తో వారికి రెట్టింపు ఆనందాన్నిచ్చారు రజనీ. లేటుగా హిట్ కొట్టినా.. లేటెస్ట్గా హిట్ కొడతామని తలైవా ఫ్యాన్స్ కాలరేగరేసుకుని చెప్పుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం నాలుగు రోజుల్లో నాలుగు వందల కోట్లకు పరుగులు తీసినట్లు మేకర్స్ ప్రకటించారు. గత గురువారం విడుదలై లాంగ్ వీకెండ్‌ను కుమ్మేసిన రజనీ.. వసూళ్లతో అందరినీ ఆశ్యర్యపరిచాడు. డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. రోజురోజుకి వసూళ్లను పెంచుకుంటూ పోతోంది. ప్రముఖ తమిళ సినీ విశ్లేషకుడు రమేష్ బాలా ఈ చిత్రవసూళ్లపై ట్వీట్ చేశాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 52.5(దాదాపు 360కోట్లు) మిలియన్ డాలర్లను వసూళ్లు చేసి.. ఫెంటాస్టిక్ బీస్ట్స్ (40.2)ను వెనక్కునెట్టేసిందని ట్వీట్ చేశాడు. యూఎస్‌లో రంగస్థలం ఫుల్‌రన్‌లో వసూళ్లు చేసిన 3.5మిలియన్ డాలర్లను కేవలం నాలుగు రోజుల్లోనే క్రాస్ చేసేసి నాలుగు మిలియన్ డాలర్లకు పరుగులుపెడుతోందని తెలిపాడు. తెలుగులోనే ‘2.ఓ’ ఇప్పటికివరకు దాదాపు 50కోట్లు, హిందీలో 100కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. Nov 29th - Dec 2nd International (Outside North America) Top 5 BO: 1. #2Point0 - $52.5 Million 2. #FantasticBeasts - $40.2 Million 3. #RalphBreaksTheInternet - $33.7 Million 4. #TheGrinch - $27.1 Million 5. #Venom - $13 Million — Ramesh Bala (@rameshlaus) December 3, 2018 #2Point0 crosses the 50 Cr Gross mark at the AP/TG Box office.. Final weekend nos by this afternoon.. AP/TG — Ramesh Bala (@rameshlaus) December 3, 2018 #2Point0 with $3,588,450 is now 2018's Highest Grossing South Movie in #USA It overtakes #Rangasthalam 's Life-time gross of $3,513,450.. * #2Point0 - 3 Lang Versions.. #Rangasthalam - Only Telugu.. — Ramesh Bala (@rameshlaus) December 3, 2018 -
సిగరెట్ స్టైల్.. సీక్రెట్ రివీల్ చేసిన రజనీ!
స్టైల్‌కు పెట్టింది పేరు రజనీకాంత్. తలైవాకు అంత మంది ఫాలోవర్స్ ఏర్పడటానికి ప్రధానం కారణం తన మ్యానరిజం, స్టైలే. అందులోనూ స్టైల్‌గా సిగరెట్‌ను వెలగించడం ఫ్యాన్స్ మరిచిపోలేరు. రజనీకి అదొక సిగ్నేచర్ మూమెంట్ అయిపోయింది. అయితే రీసెంట్గా ‘2.ఓ’లో రోబో కూడా అదే సిగ్నేచర్ మూమెంట్ చేయడంతో థియేటర్స్‌లో విజిల్స్ మోతమోగాయి. అదీ ఆ మూమెంట్‌కు ఉన్న క్రేజ్. అయితే సిగ్నేచర్ ఈ మూమెంట్ వెనకున్న రహస్యాన్ని రజనీ ఇటీవలె వెల్లడించారు. ఆ సిగరెట్‌ను మూమెంట్‌ను బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా దగ్గర నుంచి నేర్చుకున్నాని.. అప్పటినుంచి తాను కూడా అలా ప్రయత్నించానని, దానికి తన మ్యానరిజాన్ని కూడా కలిపానని తలైవా చెప్పుకొచ్చారు. అయితే సిగరెట్ స్టైల్‌గా నోట్లోకి విసరడం మాత్రమే సరిపోదని, దానికి తగ్గ టైమ్, సందర్భం, టైమింగ్ లాంటివి అవసరమని తెలిపారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘2.ఓ’ పాజిటివ్ టాక్‌తో రికార్డుల దిశగా దూసుకెళ్తోంది. -
మరి రజనీ ఫ్యాన్స్ అంటే మామూలు విషయమా!
తమ అభిమాన హీరో కోసం ఏమైనా చేయడానికి రెడీ అవుతారు ఫ్యాన్స్. తమ హీరో సినిమా హిట్ అయితే వారికి వచ్చే కిక్కే వేరు. అందులోనూ సౌత్‌లో అభిమానుల హడావిడి ఎక్కువ ఉంటుంది. తమ అభిమాన హీరోను దైవసమానులుగా భావిస్తారు. ఇక తమిళ నాట అయితే ఏకంగా విగ్రహాలు పెట్టి ఆరాధిస్తారు. రజనీ, విజయ్, అజిత్ లాంటి స్టార్లకు అక్కడ తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం రజనీ ‘2.ఓ’ ట్రెండ్ నడుస్తోంది. గురువారం విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌తో దూసుకుపోతుండటంతో తలైవా అభిమానుల ఆనందాలకు ఆకాశమే హద్దైంది. పాలాభిషేకాలు, ఒంటిపై రజనీ బొమ్మలు, భారీ కటౌట్లు ఇవన్నీ మామూలే ఐనా.. ఒక అభిమాని చేసిన చర్య మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ‘2.ఓ’లో మాదిరి సెల్ఫోన్లను తన ఆటోకు అతికించేసి.. ఆటో పైన చుట్టూ తుపాకులతో రజనీ బొమ్మను అరెంజ్ చేశాడు. ఇప్పుడు ఈ ఆటో వైరల్‌గా మారింది. మరి తలైవా ఫ్యాన్స్ అంటే అలాగే ఉంటారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. -
భార్యను పొగడ్తలతో ముంచెత్తిన సూపర్ స్టార్
నలభై ఏళ్ల నుంచి సిని పరిశ్రమలో నం.1 స్థానంలో కొనసాగుతున్నారు తలైవా రజనీకాంత్. ఇప్పటికి కూడా యువ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు ఈ సూపర్ స్టార్. గురువారం విడుదలైన రజనీ 2.ఓ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. ఈ సినిమా విడుదల నేపథ్యంలో ఇండియా టూడేతో ముచ్చటించారు రజనీకాంత్. ఈ సందర్భంగా తన భార్య లతా రజనీకాంత్‌ను పొగడ్తలతో ముంచెత్తారు రజనీకాంత్. ‘తను నా పిల్లలను, కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటుంది. తను నాకు స్నేహితురాలు, ఫిలాసఫర్ అన్ని’ అంటూ భార్యను పొగడ్తలతో ముంచెత్తారు రజనీకాంత్. ఈ సందర్భంగా తన పిల్లలు దర్శకురాలు ఐశ్వర్య ధనుష్, డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ సౌందర్య రజనీకాంత్‌ల గురించి కూడా మాట్లాడారు. ‘నా పిల్లల విషయంలో నేను ఎప్పుడు సంతోషంగానే ఉన్నాను. ఎందుకంటే నా పిల్లలిద్దరూ వారికి నచ్చిన రంగంలోనే స్థిరపడ్డారు. వారు చేసే పని పట్ల వారు సంతోషంగా ఉన్నారం’టూ చెప్పుకొచ్చారు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. -
మీటూపై స్పందించిన రజనీ
చెన్నై : సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం 2.ఓ సక్సెస్ ఊపులో ఉన్నారు. శంకర్ దర్శకత్వలో సైంటిఫిక్ ఫిక్షన్‌గా తెరకెక్కిన ఈ విజువల్ వండర్‌కు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించినా వసూళ్లలో సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. 2.ఓ విడుదల నేపథ్యంలో ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీటూ సహా పలు అంశాలపై రజనీకాంత్ తన మనోగతం వెల్లడించారు. మీటూ ఉద్యమం మహిళలకు ఒక మెరుగైన అవకాశంగా ముందుకొచ్చిందని, అయితే వారు దీన్ని దుర్వినియోగం చేయడం లేదా అవకాశంగా తీసుకోరాదని అభిప్రాయపడ్డారు. మీటూపై సహనటులను అప్రమత్తం చేస్తారా అని ప్రశ్నించగా, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను నియంత్రించేందుకు అవసరమైన చర్యలను నడిగర్ సంఘం చేపడుతుందని చెప్పారు. ఈ అంశాలను పరిష్కరించేందుకు నడిగర్ సంఘం ఓ వేదికను ఏర్పాటు చేసిందని చెప్పుకొచ్చారు. పనిప్రదేశంలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల అనుభవాలను మీటూ పేరిట వెల్లడిస్తూ సినీ, వ్యాపార, మీడియా సహా పలు రంగాలకు చెందిన మహిళలు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. -
‘2.ఓ’పై మహేష్ ప్రశంసలు
ప్రస్తుతం సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో 2.ఓ ఫీవర్ కనిపిస్తోంది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. అదే సమయంలో సినీ ప్రముఖులు ఈ విజువల్ వండర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తరణ్ ఆదర్శ్, రమేష్ బాలా, శ్రీధర్ పిల్లై లాంటి ఫిలిం క్రిటిక్స్ సినిమాను ఆకాశానికి ఎత్తేశారు. టాలీవుడ్ స్టార్స్ కూడా 2.ఓ సినిమాపై ట్వీట్ చేస్తూ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే నాని, అల్లరి నరేష్ లాంటి స్టార్స్ ఆసక్తికర ట్వీట్స్‌తో ఆకట్టుకోగా తాజాగా మహేష్ బాబు 2.ఓ పై టీంను పొగడ్తలతో ముంచెత్తారు. ‘2.ఓ ఓ సినిమాటిక్ జెమ్. ఈ సినిమా మీకు గతంలో ఎప్పుడూ పరిచయం లేని ఓ గొప్ప అనుభూతి కలిగిస్తుంది. శంకర్ సార్ మీరు సినిమా స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. రజనీకాంత్ సర్, అక్షయ్ కుమార్, 2.ఓ టీం మొత్తానికి నా శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు మహేష్. #2point0 is a cinematic gem!!! Gives you a never before seen experience... @shankarshanmugh sir ups his game to an all new level of sheer brilliance👌🏻 thoroughly enjoyed it 👍🏻👍🏻 Congratulations to @rajinikanth sir, @akshaykumar and the entire team of 2.0👏🏻👏🏻👏🏻 — Mahesh Babu (@urstrulyMahesh) 30 November 2018 -
‘భారతీయుడు 2’ లాంచ్ డేట్..!
2.ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు శంకర్ తన తదుపరి చిత్ర పనులు ప్రారంభించాడు. ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా భారతీయుడు సినిమాకు సీక్వల్‌ను లాంచనంగా ప్రారంభించారు. ఇన్నాళ్లు 2.ఓ పనుల్లో శంకర్ బిజీగా ఉండటంతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. 2.ఓ రిలీజ్ కావటంతో శంకర్ తదుపరి చిత్రం మీద దృష్టి పెట్టాడు. వీలైనంత త్వరగా భారతీయుడు 2ను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. అందుకే డిసెంబర్ 14 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారట. రాయలసీమతో పాటు చెన్నై, తైవాన్లతో షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో కమల్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించనుందన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు 2.ఓలో ప్రతినాయకుడిగా అలరించిన అక్షయ్ కుమార్ మరోసారి శంకర్ సినిమాలో భాగం కానున్నాడట. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమాలో నటించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. -
షాకింగ్ : ఆన్లైన్లో లీకైన 2.ఓ
చెన్నై : సూపర్‌స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్‌లు ప్రధాన పాత్రల్లో ఎస్ శంకర్ దర్శకత్వంలో విజువల్ వండర్‌గా తెరకెక్కిన 2.ఓ అన్ని రికార్డులను తిరగరాస్తూ అత్యధిక థియేటర్లలో విడుదలై సందడి చేస్తోంది. ఈ మూవీ తొలిరోజు భారీ కలెక్షన్లను కొల్లగొట్టగా, మూవీ మేకర్లను షాకింగ్‌కు గురిచేస్తూ సినిమా పూర్తి హెచ్డీ ప్రింట్‌ను పైరసీ వెబ్సైట్ తమిళ్‌రాకర్స్ లీక్ చేసింది. థియేటర్లలో సినిమా విడుదలైన కొద్దిగంటలకే హెచ్డీ ప్రింట్ పూర్తిగా లీక్ కావడం నిర్మాతలు, రజనీ అభిమానులను కలవరపరిచింది. సినిమా విడుదలకు ముందే నిర్మాతలు ఈ తరహా పైరసీ వెబ్సైట్ల జాబితాతో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో పాటు ఆన్లైన్ పైరసీని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిర్మాతలు ఇన్ని ఏర్పాట్లు చేసినా సినిమా లీక్ కావడం దుమారం రేపుతోంది. పలు పైరసీ వెబ్సైట్లను ప్రభుత్వం బ్లాక్ చేసినా తమిళ్రాకర్స్ను బ్లాక్ చేయలేదు. ఇదే వెబ్సైట్ గతంలో ధనుష్ నటించిన వడచెన్నై, విజయ్ హీరోగా తెరకెక్కిన సర్కార్ మూవీలను లీక్ చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన 2.ఓకు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. సెల్ఫోన్ల నుంచి విడుదలయ్యే రేడియేషన్ దుష్ర్పభవాల చుట్టూ ఈ సినిమా కథాంశం సాగుతుంది. -
తలైవా అంటే.. అంతే మరి!
-
బుకింగ్స్‌లో ‘2.ఓ’ ఆల్‌టైమ్ రికార్డ్
ఇప్పుడు ‘2.ఓ’ ట్రెండ్ నడుస్తోంది. అవును.. ఎక్కడ చూసినా రజనీ-శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన 2.ఓ గురించే వినిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక మిగిలింది బాక్సాఫీస్ రికార్డులను వేటాడమే. అయితే ఇప్పటికే కొన్ని రికార్డులను 2.ఓ సెట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6800 థియేటర్లలో పదివేల స్ర్కీన్లపై ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌పై సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన మీమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆన్లైన్ బుకింగ్స్ ద్వారా ఈ మూవీ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే పేటీఎమ్ ద్వారా 1.25 మిలియన్స్ టికెట్స్ అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఇక బుక్‌మైషో ద్వారా దాదాపు పది లక్షల టికెట్లు తెగాయని సమాచారం. ఇలా ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఇన్ని లక్షల టికెట్లు తెగడం ‘2.ఓ’తోనే సాధ్యమైందని తలైవా అభిమానులు సంబరపడుతున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించిన ఈ చిత్రాన్ని లైకా సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. Breaking all Booking Records, 1.25 Million+ Tickets of #2Point0 Sold in @PaytmTickets! Grab your #2Point0 tickets now! PayTm Tamil - https://t.co/kC3nGgPULC PayTm Telugu - https://t.co/zGoiohA9SA PayTm Hindi - https://t.co/Tiwbmgusxf — 2.0 (@2Point0movie) November 28, 2018 -
‘2.ఓ’ మూవీ రివ్యూ
టైటిల్ : 2.ఓ జానర్ : సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ తారాగణం : రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ తదితరులు సంగీతం : ఏఆర్ రెహమాన్ దర్శకత్వం : శంకర్ నిర్మాత : సుభాస్కరణ్ ఒకవైపు ఇండియా గర్వించదగ్గ దర్శకుడు శంకర్. మరోవైపు ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్. ఇంకోవైపు వరుసగా సందేశాత్మక చిత్రాల్లో నటిస్తూ.. సక్సెస్‌లో ఉన్న నార్త్ స్టార్ అక్షయ్‌కుమార్. ఇవే కాక త్రీడీ, 4డీ సౌండ్ సిస్టమ్, భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఇలాంటి ఎన్నో స్పెషాలిటీస్‌తో వస్తోన్న చిత్రం ‘2.ఓ’. మామూలుగా రజనీ సినిమా వస్తోందంటేనే అభిమానుల సంబరాలకు హద్దులుండవు. ఇక శంకర్ కాంబినేషన్లో తలైవా వస్తున్నాడంటే బాక్సాఫీస్ కూడా హడలెత్తిపోతుంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన శివాజీ, రోబో కలెక్షన్ల వర్షం కురిపించాయి. అయితే రోబోకు సీక్వెల్‌గా ఇండియన్ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కించిన ‘2.ఓ’ అంచనాలను అందుకుందా? బాహుబలి రికార్డులను చిట్టి బద్దలుకొట్టనున్నాడా? శంకర్ మరోసారి తన విజన్‌తో మ్యాజిక్ చేశాడా?.. ఇవన్ని తెలియాలంటే ఓ సారి కథలోకి వెళ్దాం.. కథ హఠాత్తుగా నగరంలోని సెల్ఫోన్లు మాయమవుతుంటాయి. మనుషులు మాట్లాడుతుంటే వారి చేతుల్లోంచి కూడా ఫోన్లు ఎగిరిపోతుంటాయి. అయితే ఈ సమస్య ఎందుకు ఎదురైంది? ఎలా పరిష్కరించాలో ఎవరికీ అంతుపట్టదు. ఈ పరిణామాలకు కారణాలేంటో శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతారు. అలా మాయమైపోయిన సెల్‌ఫోన్స్ అన్ని కలిసి ఓ సెల్ ఫోన్ వ్యాపారిని, ఓ మొబైల్ నెట్వర్క్ ఓనర్ని దారుణంగా హత్య చేస్తాయి. ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొవటానికి ప్రభుత్వం ఓ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. మిలటరీ సాయంతో సెల్‌ఫోన్ దాడిని ఎదుర్కోవాలని ప్రయత్నిస్తారు. కానీ ఆ ప్రయత్నం కూడా ఫలించదు. (సాక్షి రివ్యూస్) డా.వసీకరణ్ (రజనీకాంత్) రంగంలోకి దిగి దీన్ని చిట్టి మాత్రమే పరిష్కరించగలడని భావించి.. మళ్లీ దానికి ప్రాణం పోస్తాడు. తిరిగి ప్రాణం పోసుకున్న చిట్టి సాయంతో ఈ విధ్వంసానికి కారణం చనిపోయిన పక్షిరాజా అని తెలుసుకోని ఆ నెగెటివ్ ఎనర్జీని బంధించే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో వసీకరణ్ విజయం సాధించాడా..? అసలు పక్షిరాజా సెల్‌ఫోన్స్‌ను ఎందుకు మాయం చేస్తున్నాడు.? ఎందుకు హత్యలు చేస్తున్నాడు..? ‘2.ఓ’ రావల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అన్నది తెరపై చూడాల్సిందే. నటీనటులు సూపర్‌స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ల చుట్టూనే కథ నడుస్తుంది. ఇందులో సైంటిస్ట్ వసీకరణ్, చిట్టి, 2.ఓ రోబో పాత్రల్లో రజనీ నటన ఆకట్టుకుంటుంది. మూడు పాత్రల్లో భిన్నంగా రజనీ చేసిన అద్భుతం అభిమానులకు కన్నులపండువగా ఉంటుంది. ముఖ్యంగా 2.ఓగా రజనీ మేనరిజమ్స్‌కు థియేటర్లో విజిల్స్ పడతాయి. ఈ వయసులో రజనీ చూపించిన డెడికేషన్ తెర మీద కనిపిస్తుంది. యాక్షన్స్ సీన్స్‌లోనూ రజనీ సూపర్బ్ అనిపించారు. (సాక్షి రివ్యూస్) ఇక అక్షయ్‌కుమార్ నటన ఈ సినిమాకు ప్రత్యేకంగా నిలుస్తుంది. పక్షిరాజాలా అక్షయ్ నటన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఓ సాధారణ ప్రోఫెసర్ సమాజాన్ని పక్షి జాతిని కాపాడేందుకు పడే వేదనను ఆయన అద్భుతంగా పలికించారు. భారీ ప్రోస్తటిక్ మేకప్‌లోనూ అద్భుతమైన నటనతో ఆకట్టకున్నారు. అంత భారీ సూట్, మేకప్ తో నటించిన అక్షయ్ కష్టం సినిమాకు చాలా పస్ల్ అయ్యింది. అక్షయ్ నటనలోని మరోకోణాన్ని శంకర్ అద్భుతంగా ఆవిష్కరించాడు. రోబో వెన్నెలగా అమీ జాక్సన్ తన పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. యాక్షన్ సీన్స్‌లోనూ అలరించింది. ఇతర పాత్రల్లో సుధాన్షు పాండే, ఆదిల్ హుస్సేన్, కళాభవన్ షాజోన్లు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. విశ్లేషణ శంకర్ తన సినిమాను సామాజిక సమస్యలు, సందేశాత్మక అంశాలను జోడించి తెరకెక్కిస్తాడన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటివరకూ శంకర్ తీసిన సినిమాలను చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. అయితే ఈ సినిమాకు కూడా సామాజిక కోణంలోంచే కథను ఎంచుకుని దానికి అధునాతన సాంకేతికతను జోడించిన తీరు బాగుంది. సెల్ఫోన్లకు మనుషులు ఏవిధంగా బానిసవుతున్నారో? దానివల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయో అన్న అంశాలను భారీగా తెరకెక్కించారు. (సాక్షి రివ్యూస్) విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సినీ ప్రేమికులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. సినిమాలో ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన పదాలు వాడటంతో అవి సామాన్య ప్రేక్షకులకు అర్థం కావటం కాస్త కష్టమే. తొలి భాగం అంతా సెల్‌ఫోన్స్ మాయం కావటం, అందుకు కారణాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం, వసీకరణ్ చేసే ప్రయత్నాలతో సరిపెట్టేసిన దర్శకుడు అసలు కథ, మలుపులను ద్వితీయార్థంలోనే చూపించాడు. పక్షిరాజా ఫ్లాష్‌బ్యాక్ ఎమోషనల్‌గా సాగుతూ అందరిని ఆకట్టుకుంటుంది. ఇక సుదీర్ఘ క్లైమాక్స్ ఎపిసోడ్ ప్రేక్షకులు కన్నార్పకుండా చూసే భారీ విజువల్ గ్రాఫిక్స్‌తో అలరిస్తుంది. అయితే క్లైమాక్స్ ఎపిసోడ్లో రజనీ మేనరిజమ్స్, అక్షయ్ లుక్ కనిపించినా పూర్తిగా గ్రాఫిక్స్‌లో రూపొందించిన పాత్రలు మాత్రమే తెర మీద కనిపిస్తాయి. సినిమాకు మరో మేజర్ ఎసెట్ మ్యూజిక్. ఇలాంటి కమర్షియల్ సినిమాలో పాటలు లేకుండా రూపొదించటం సాహసం అనే చెప్పాలి. అయితే ఆ లోటును నేపథ్యం సంగీతంతో తీర్చారు. ఆస్కార్ అవార్డు గ్రహీతలు ఏఆర్ రెహమాన్, రసూల్ పూకుట్టి చేసిన మాయ అందరినీ అబ్బురపరుస్తుంది. రసూల్, రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆడియన్ను కథలో లీనమయ్యేలా చేస్తుంది. స్వర మాంత్రికుడు తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేయగా.. ఇండియన్ సినిమాలో 4డీ సౌండ్ టెక్నాలజీని వాడి మరో మాయా ప్రపంచంలోకి రసూల్ తీసుకెళ్లారు. నీరవ్ షా అందించిన సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరో ఆకర్షణ. సినిమాలో ఏది గ్రాఫిక్స్ ఏది నిజమన్న విషయాన్ని చాలా సన్నివేశాల్లో గుర్తించటం కూడా కష్టమే అంత అద్భుతంగా ఉంది సినిమాటోగ్రఫి. నిర్మాణ విలువలు లైకా ప్రొడక్షన్స్ స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. ఆంటోని ఎడిటింగ్ పనితనం కూడా ఈ సినిమాకు కలిసివచ్చింది. ప్లస్ పాయింట్స్ : గ్రాఫిక్స్ రజనీ, అక్షయ్‌ల నటన మ్యూజిక్ మైనస్ పాయింట్స్ : సగటు ప్రేక్షకుడికి అర్ధం కాని సాంకేతిక అంశాలు