తెలుగు సినిమా తన పరిధిని విస్తరించుకుంటూ పోతోంది. బాహుబలి సినిమా తరువాత టాలీవుడ్ రేంజ్ మారిపోయింది. మన దర్శక నిర్మాతలు బాలీవుడ్‌లోనూ తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. కొన్ని సినిమాల డిజిటల్, డబ్బింగ్ రైట్స్ బాలీవుడ్‌లో రికార్డ్‌లు క్రియేట్ చేస్తున్నాయి.
ముఖ్యంగా సౌత్ కమర్షియల్ ఎంటర్ టైనర్లకు బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ విషయంపై స్పందించిన బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సౌత్ దర్శకుల విజన్ గొప్పగా ఉంటుంది. వాళ్ల టేకింగ్, సాంకేతికను వినియోగించుకునే విదానం అద్భుతం. సౌత్ సినిమాల కారణంగానే భారతీయ సినిమా ప్రరిశ్రమకు మంచి గుర్తింపు వస్తోంది.
బాలీవుడ్ దర్శకులు ప్రయోగాలు, సాహసాలు చేసేందుకు ముందుకు రావటం లేదు. మనం మన ఆలోచనా సరళిని మార్చుకోవటం లేదు. వాళ్లు భారీ చిత్రాలతో మనల్ని మనం తక్కువగా భావించేలా చేస్తున్నారు. సంజయ్ లీలా బన్సాలీ లాంటి వారు భారీ చిత్రాలు చేస్తున్నా.. బాలీవుడ్ అలాంటి చిత్రాలు మరిన్ని రావాలి’ అన్నారు. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానున్న 2.ఓ ప్రమోషన్ కార్యక్రమాల్లో కరణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2.ఓ సినిమాను బాలీవుడ్‌లో కరణ్ నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రిలీజ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment