![Filmmaker Karan Johar has expressed his pride in the success of Stree 2](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/karan.jpg.webp?itok=slPxNoBb)
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మహిళలు లీడ్ రోల్‌లో నటించిన చిత్రాలు సైతం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాయని అన్నారు. అందుకు శ్రద్ధాకపూర్ నటించిన స్త్రీ-2 ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చారు. 2024లో బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా స్త్రీ-2 నిలిచిందన్నారు. ఒక మహిళ నటి లీడ్ రోల్‌లో ఇంతటి భారీ విజయం దక్కడం గొప్ప విషయమన్నారు. దీని బట్టి జెండర్ పరంగా చూస్తే ఇది చిన్న విజయమే అవుతుందని తెలిపారు.
ఈ చిత్రం గురించి జోహార్ మాట్లాడుతూ.. "భారతదేశంలో మహిళలు విజయం సాధించడాన్ని ప్రత్యేకంగా చూస్తాను. ఎందుకంటే ఇది జెండర్‌కు దక్కిన చిన్న విజయం. ఈ దశాబ్దంలో బిగ్గెస్ట్ హిట్‌గా స్త్రీ-2ని చూసినప్పుడు నాకు కేవలం స్త్రీ మూవీగానే అనిపించింది. వాస్తవానికి ఈ సినిమాలో పురుషులు కూడా చాలా బాగా చేశారు. కానీ వారికి కూడా ఒక స్త్రీనే నాయకత్వం వహించింది. అలాగే ఆలియా భట్ లీడ్‌రోల్‌లో 2022లో వచ్చిన బ్లాక్‌బస్టర్ గంగూబాయి కతియావాడి కూడా ఇలాంటి విజయమే సాధించింది. ఇలాంటి చిత్రాలు సినీ ఇండస్ట్రీలో మైలురాళ్లుగా నిలుస్తాయి. మహిళ ప్రధాన పాత్రలో చేసినా సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తాయని ఈ విజయం చూస్తే అర్థమవుతోంది. ఒక మహిళ సినిమాకు నాయకత్వం వహించగలదనే పెద్ద సంకేతం ఇది. కేవలం ఆలియా పాత్రతోనే గంగుబాయి కతియావాడి సినిమాకు విజయం దక్కింది' అని అన్నారు..
సినీ పరిశ్రమలో నటీనటుల పారితోషికం గురించి కూడా కరణ్ జోహార్ మాట్లాడారు. మేల్ స్టార్స్ ఎక్కువ మంది ప్రేక్షకులను రాబడతారని.. అందుకే వారికి ఎక్కువ రెమ్యునరేషన్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. కానీ బాక్సాఫీస్ విషయానికొస్తే కొంతమంది ఫీమేల్ లీడ్ సినిమాలు సైతం మేల్ స్టార్స్ చిత్రాల కంటే అధిక ఒపెనింగ్స్ రాబడుతున్నాయని తెలిపారు. స్త్రీ 2, గంగూబాయి కతియావాడి వంటి చిత్రాల విజయం బాలీవుడ్‌లో ఈ మార్పును స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఫీమేల్ స్టార్స్ లీడ్ రోల్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment