
విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించిన పీరియాడికల్ డ్రామా ఛావా. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. ఫిబ్రవరి 14 2025న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
ఛావా రిలీజైన ఐదో వారంలో మరో సరికొత్త రికార్డ్‌ను సృష్టించింది. హిందీ బాక్సాఫీస్ వద్ద ఐదో వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ లిస్ట్‌లో ఛావా రూ.22 కోట్లు రాబట్టగా.. గతేడాది విడుదలైన స్త్రీ-2 రూ.16 కోట్లు, అల్లు అర్జున్ పుష్ప-2 రూ.14 కోట్లతో రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. ఐదో వారాంతంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ఛావా నిలిచింది. పుష్ప 2 తర్వాత రష్మిక కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ఘనతను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు.
కాగా.. ఈ చిత్రం ఇప్పటికే రణబీర్ కపూర్ చిత్రం యానిమల్‌ను దాటేసింది. ఈ సినిమా రిలీజైన 31 రోజుల్లో ఇండియా వ్యాప్తంగా నెట్ కలెక్షన్ 562.65 కోట్లు రాగా.. అందులో హిందీ వెర్షన్ రూ.548.7 కోట్లు, తెలుగు వెర్షన్ మరో రూ.13.95 కోట్లు రాబట్టింది. ఇండియాలో గ్రాస్ కలెక్షన్ 661.3 కోట్లు కాగా.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఛావా 750.5 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. కాగా.. ఈ సినిమా తెలుగు వర్షన్ మార్చి 7న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అశుతోష్ రానా, దివ్య దత్తా కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా.. మాడాక్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో దినేష్ విజన్ నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment