జస్ట్‌ మిస్‌ | Kamal Haasan refused to play Rajini's villain in '2.0' | Sakshi
Sakshi News home page

జస్ట్‌ మిస్‌

Nov 2 2018 5:34 AM | Updated on Sep 12 2019 10:40 AM

Kamal Haasan refused to play Rajini's villain in '2.0' - Sakshi

కమల్‌హాసన్‌

రజనీకాంత్, కమల్‌హాసన్‌... తమిళ సినిమాకు రెండు పిల్లర్స్‌ లాంటి యాక్టర్స్‌. ఎప్పుడో కెరీర్‌ తొలినాళ్లలో ఈ ఇద్దరు హీరోలు ‘అంతులేని కథ’, 16 వయదినిలే’ వంటి పలు బ్లాక్‌బాస్టర్‌ చిత్రాల్లో కలసి యాక్ట్‌ చేశారు. ఆ తర్వాత మళ్లీ స్క్రీన్‌ షేర్‌ చేసుకోలేదు ఈ సూపర్‌ స్టార్స్‌. రీసెంట్‌గా ఈ స్టార్స్‌ ఇద్దరూ కలసి నటించే చాన్స్‌ జస్ట్‌ మిస్‌ అయింది అంటున్నారు శంకర్‌. రజనీకాంత్‌ హీరోగా శంకర్‌ తెరకెక్కించిన చిత్రం ‘2.ఓ’. ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటించారు.

కానీ తొలుత  ఈ పాత్రకు హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్, ఆ తర్వాత బాలీవుడ్‌లో ఆమిర్‌ ఖాన్‌ పేర్లను పరిశీలించారనే టాక్‌ వినిపించింది. అయితే విలన్‌ పాత్రకు కమల్‌హాసన్‌ పేరును కూడా అనుకున్నారట దర్శకుడు శంకర్‌. ఆ పాత్ర కోసం కమల్‌ను సంప్రదించారని కూడా చెప్పుకొచ్చారు శంకర్‌. ఈ విషయాన్ని తెలియజేస్తూ–  ‘‘2.ఓ’ కంటే ‘భారతీయుడు’ సీక్వెల్‌ మీద కమల్‌సార్‌ ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపించారు. దాంతో కమల్‌సార్‌ని నటింపజేయాలనుకునే ఆలోచన విరమించుకున్నాను’’ అని అన్నారు శంకర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement