2.ఓ ట్రైలర్‌ వచ్చేసింది! | Rajanikanth Shankar 2PointO Trailer Launched | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 3 2018 12:53 PM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

Rajanikanth Shankar 2PointO Trailer Launched - Sakshi

భారతీయ సినీ రంగంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 2.ఓ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. రోబోకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను చెన్నైలో జరిగిన భారీ ఈవెంట్‌లో రిలీజ్‌ చేశారు. 3డీ వర్షన్‌ ట్రైలర్‌ను కూడా పలు థియేటర్లలో ప్రదర్శించనున్నారు. హాలీవుడ్‌ స్థాయి గ్రాఫిక్స్‌తో రూపొందిన ఈ ట్రైలర్‌ సినిమా మీద అంచనాలను మరింత పెంచేసింది. రజనీ యాక్షన్‌, అక్షయ్‌ లుక్‌, రోబో అమీ జాక్సన్‌ గ్లామర్‌ ఇలా అన్ని ట్రైలర్‌కు ఇంటర్‌నేషనల్‌ స్టాండర్డ్స్‌ తీసుకువచ్చాయి.

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ మరోసారి రోబో చిట్టిగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్ ప్రతినాయక పాత్రలో అలరించనున్నాడు. మరోసారి గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పూర్తిస్థాయి 3డీ చిత్రంగా ఈ సినిమాను రూపొందించాడు. చాలా కాలం కిందటే రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమా గ్రాఫిక్స్‌ ఆలస్యం కావటంతో వాయిదా పడింది. ఈ నెల 29న 2.ఓ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement