2. ఓలోని దృశ్యం
వినాయక చవితి సందర్భంగా టీజర్‌ను్ రిలీజ్ చేసిన ‘2. ఓ’ చిత్రం బృందం దీపావళికి అభిమానులకు మరో కానుక ఇవ్వనున్నట్లు తెలిసింది. ‘2. ఓ’ ట్రైలర్‌ని దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. చెన్నైలో జరిగే ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి చిత్ర బృందమంతా హాజరుకానున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ‘2. ఓ’ రిలీజ్ డేట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. వినాయక చవితి సందర్భంగా ‘2. ఓ’ టీజర్‌ని తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సెప్టెంబరు 13న విడుదల చేశారు.
విడుదలైన 24 గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌తో టీజర్ దూసుకుపోయిన సంగతి తెలిసిందే. తెలుగులో 5,069,230, తమిళ్‌లో 9,341,840, హిందీ 10,231,367 వ్యూస్ సాధించింది. దీంతో ‘చిట్టి’ మరోసారి మాయ చేయబోతున్నాడంటూ... టీజర్‌తోనే అదరగొట్టి అంచనాలు పెంచేస్తున్నాడంటూ తలైవా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో సుమారు 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ భారీ చిత్రంలో రజనీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ యాక్షన్ ఖిలాడి అక్షయ్‌కుమార్ రజనీకి ధీటైన ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment