Rajanikant
-
రజనీకాంత్ సినిమాలో అనవసరంగా నటించా: హీరోయిన్
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించడానికి చాలా మంది నటులు ఆసక్తి చూపిస్తుంటారు. ఆయన సినిమాలో చిన్న పాత్ర అయినా సరే చేస్తామని చాలామంది హీరోయిన్లు ఎదురుచూస్తున్నారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం రజనీ సినిమాలో అనవసరంగా నటించానని బాధపడుతోంది. ఆమే మమతా మోహన్‌దాస్.యమగొంగ సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గరైంది ఈ మలయాళ భామ. ఆ సినిమా తర్వాత ఒకటి రెండు తెలుగు సినిమాల్లో నటిస్తూనే..మరోవైపు సింగర్‌గాను ఆకట్టుకుంది. క్యాన్సర్ బారిన పడడంతో కొన్నాళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉంది. చాలా కాలం తర్వాత ‘మహారాజా’తో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇటీవల విడుదలైన ఈ తమిళ్ చిత్రం..తెలుగులోనూ మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న మమతా.. తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది.రజనీకాంత్ హీరోగా నటించిన కుసేలన్(తెలుగులో కథానాయకుడు)లో మమతా ఓ సాంగ్‌లో నటించింది. ఈ పాట కోసం రెండు రోజుల పాటు షూటింగ్‌కి వెళ్లిందట. అయితే ఈ సినిమా ఎడిటింగ్‌లో ఆమె పార్ట్ మొత్తం డిలీట్ చేసి.. కేవలం ఒక సెకను మాత్రం తెరపై చూపించారట. రిలీజ్ తర్వాత ఆ పాటను చూసి తెగ ఫీలయిందట. అనవసరంగా రజనీకాంత్ సినిమాలో నటించానని బాధపడిందట. ప్రస్తుతం మమతా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నయన్ వల్లేనా?రజనీకాంత్ కుసేలన్(2008)లో నయనతార హీరోయిన్గా నటించింది. మమతా స్పెషల్ సాంగ్ చేస్తుందని ముందుగా నయన్‌కు తెలియదట. విషయం తెలిసిన తర్వాత ఆ పాట షూటింగ్‌కి తాను రాలేనని నయన్ చెప్పేసిందట. వేరే హీరోయిన్ నటిస్తుందని ముందే ఎందుకు చెప్పలేదని డైరెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం..మమతా పార్ట్‌ని కట్ని చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో కూడా మమతా ఇదే విషయాన్ని చెప్పింది. -
16ఏళ్లకు స్టార్ ఆపై 22ఏళ్లకే విషాదం.. రజనీకి ఇష్టమైన హీరోయిన్ ఎవరు?
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నేడు రజనీకాంత్ పేరు కాసులు వర్షం కురిపిస్తుంది. సిల్వర్ స్క్రీన్‌పై ఆయన పేరు కనిపిస్తే చాలు అభిమానులు కేరింతలు వేస్తారు. కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. అయితే రజనీ కాంత్ మెచ్చిన హీరోయిన్ ఎవరు..? ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది..?14 ఏళ్లకే ఎంట్రీ1970, 80వ దశకంలో దక్షిణ భారతదేశంలో మరింత ప్రతిభావంతులైన నటీమణులు వచ్చారు. ఈ కాలంలో సినీ రంగ ప్రవేశం చేసిన నటీమణులు చాలామంది నేటికీ సుపరిచితులే. అయితే, ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన జయలక్ష్మి 14 ఏళ్ల వయసులో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 16 ఏళ్లకే స్టార్ డమ్ వచ్చింది. 22 ఏళ్లకే 66 సినిమాల్లో నటించి ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయింది.'అంతులేని కథ' చిత్రంతో పాపులర్1974లో కె.బాలచందర్ దర్శకత్వంలో 'అవల్ ఒరు తొదర్ కథై' విడుదలైంది. తెలుగులో 'అంతులేని కథ'గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో జయలక్ష్మి మెప్పించింది. ఆ పాత్ర ఊతపదం 'ఫటాఫట్'. దీంతో సౌత్ ఇండియానే ఈ పదం ఊపేసింది. అలా ప్రేక్షకుల్లో బాగా గుర్తింపు రావడంతో 'ఫటాఫట్ జయలక్ష్మి'గా స్థిరపడిపోయింది. ఇదే సినిమాలో రజనీకాంత్ కూడా నటించారు. అలా ఆయనతో ఆమె పలు సినిమాల్లో కనిపించింది. మరో చరిత్ర, కాళి, న్యాయం కావాలి, జ్యోతి,స్వర్గం నరకం,తిరుగులేని మనిషి,రామ్ రాబర్ట్ రహీమ్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో ఆమె మెరిసింది. అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'ఇద్దరు అమ్మాయిలు' సినిమాలో ఆమెకు తొలి ఛాన్స్ దక్కింది. ఆ సమయంలో జయలక్ష్మి వయస్సు కేవలం 14 సంవత్సరాలు.మాజీ ముఖ్యమంత్రి బంధువుతో పెళ్లిజయలక్ష్మి కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. అప్పటికే తమిళం, తెలుగు, మలయాళం, కన్నడతో సహా 60కి పైగా చిత్రాలలో నటించింది. చేతిలో చాలా ఆఫర్లు ఉన్నాయి. అలాంటి సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎంజీ రామచంద్రన్ తమ్ముడు చక్రపాణి కుమారుడు సుకుమార్‌ను ప్రేమించింది. అప్పటి వరకు జీవితంలో సక్సెస్ అయిన భర్త వల్ల కొద్ది రోజులకే వ్యక్తిగత జీవితంలో అపజయాన్ని చవిచూసింది. భర్త వల్ల చాలా భాదలు పడిందని చెప్పేవారు. 1980 నవంబర్ 21న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఈ వార్త సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆరోజుల్లో పెద్ద షాకిచ్చింది.అసహజ శృంగారం కారణంగా మరణందక్షిణాది సినిమాలో అగ్ర హీరోలు చిరంజీవి,కమల్ హాసన్, నాగేశ్వరరావు, రజనీకాంత్, కృష్ణ , ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించిన జయలక్ష్మి 22 ఏళ్ల వయసులో గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు కనిపించింది. అయితే ఆమె నిద్రమాత్రలు మింగి సూసైడ్ చేసుకుందని, అసహజ శృంగారం కారణంగా మరణించిందని పలు కథానాలు చెబుతున్నాయి. కానీ ఇప్పటికీ ఆమె మరణం ఒక మిస్టరీ.. ఆమె చావుకు కారణం ఎవరు అనేది ఇప్పటికీ తేలలేదు. ఓ ఇంటర్వ్యూలో తన ఆల్ టైమ్ ఫేవరెట్ నటి జయలక్ష్మి అని రజనీకాంత్ చెప్పడం విశేషం. -
దటీజ్ తలైవర్! జపాన్ తాతగారి ఆట, పాట.. వైరల్ వీడియో
సూపర్ స్టార్ రజనీకాంత్ స్టయిల్‌కి పెట్టింది. ప్రతీ సినిమాలోనూ తన మార్క్ డైలాగ్గానీ, స్టయిల్ గానీ క్రియేట్ చేస్తాడు. ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తాడు. చిన్నపిల్లల్ని దగ్గరనుంచి, పండు ముదుసలి దాకా ఆయన స్టయిల్‌కు ఫిదా అవ్వాల్సిందే. జపాన్ కంపెనీ మిత్సుబిషి ఎగ్జిక్యూటివ్, 77 ఏళ్ల పెద్దాయన చేసిన డ్యాన్స్ చూస్తే మీరు కూడా అదే మాట అంటారు. విషయం ఏమిటంటే.. మిత్సుబిషి కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన కుబోకి శాన్ను ప్రత్యేక అతిథిగా పాండిచ్చేరి యూనివర్శిటీ ఆహ్వానించింది. ‘GLOBIZZ'24’ పేరుతో నిర్వహించిన ఈ ఈవెంట్లో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అలా మాట్లాడుతూనే రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘ముత్తు’లోని ‘ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలంచాడు యేనాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు’ అనే పాటకు తమిళ వెర్షన్‌ను పాడుతు డ్యాన్స్ చేస్తూ విద్యార్థును ఆశ్చర్యచకితుల్ని చేశాడు. విద్యార్థులు షాక్ అవ్వడమే కాదు, పాండిచ్చేరి యూనివర్శిటీలోని అడ్మినిస్ట్రేటర్లు , ప్రొఫెసర్లు అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. (మెడ పట్టేసిందా?ఈ చిట్కాలు పాలో అవ్వండి! ) ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. జపాన్‌లో తలైవర్ క్రేజ్ అలాంటిది మరి అని కొందరు "వావ్. ..జపాన్‌కు చెందిన ఒక వ్యక్తి తమిళ పాడటం ఎప్పుడూ వినలేదు" అంటే మరొకరు కామెంట్ చేశారు.(ప్రెగ్నెన్సీ ప్రకటించారో లేదో.. ‘ట్విన్స్’ అంటూ సందడి చేస్తున్న ఫ్యాన్స్) కాగా రజనీకాంత్ నటించిన 'ముత్తు', 1995లో బాక్సాఫీస్ వద్ద 400 మిలియన్ల జపనీస్ యెన్లు( దాపు 23.5 కోట్లు) సాధించి జపనీస్ చరిత్రలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. అయితే ఈ రికార్డును రాంచరణ్; జూఎన్టీర్, రాజమౌళి కామలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం 2022లో 24 ఏళ్ల ఈ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. (అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఈ ఏడాది ప్రత్యేకత ఏంటి?) At the age of 77, Mr. Kuboki San of Mitusubishi Corporation Ltd, Japan, at the GLOBIZZ'24 event conducted by Pondicherry University! He enthralled the MBA students with the Tamil Song from Rajnikanth starred movie "Muthu", which has been rocking in Japan since 1995! #Rajinikanth pic.twitter.com/ILG9WIkKie — Ananth Rupanagudi (@Ananth_IRAS) March 2, 2024 -
రజనీ కాంత్ చేతులమీదుగా ధోని 'అధర్వ' తొలికాపీ విడుదల
MS Dhoni Atharva First Copy Released By Rajinikanth: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఎంఎస్ ధోని: అన్‌టోల్డ్ స్టోరీ'. ఈ సినిమా ఎంతలా ప్రేక్షకాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంఎస్ ధోని పాత్రలో దివంగత హీరో సుశాంత్ సింగ్ అద్భుతమైన నటనను కనబర్చాడు. ప్రస్తుతం ధోని ప్రధాన పాత్రలో రూపొందిన గ్రాఫిక్ నవల 'అధర్వ: ది ఆరిజన్'. ఈ గ్రాఫిక్ నవల ఫస్ట్ లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ ధోని అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ అధర్వ గ్రాఫిక్ నవల తొలికాపీని తమిళ సూపర్‌స్టార్ రజనీ కాంత్ గురువారం చెన్నైలోని తన నివాసంలో లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ తొలికాపీని రజనీ కాంత్ విడుదల చేయడంపై ధోని సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే బుక్ పబ్లిషర్స్, రచయిత రమేశ్ తమిళమణి ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ పుస్తకం ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 1499తో అందుబాటులో ఉందని.. కావాల్సిన వారు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. రజనీ కాంత్ తమ కష్టాన్ని గుర్తించడంతో మరింత ఉత్సాహం పెరిగిందన్నారు. -
Rajinikanth: సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న సూపర్ స్టార్
చెన్నై: ఇటీవల షూటింగ్ నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ నిన్న(బుధవారం) తిరిగి చెన్నైకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఇంటికి చేరుకున్న ఆయన ఇవాళ కోవిడ్ టీకా తీసుకున్నారు. ఇంట్లో సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేయించుకుంటున్న రజనీ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం రజనీ, దర్శకుడు సిరుతై శివ దర్శకత్వంలో ‘అన్నాత్తై’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 35 రోజుల పాటు హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఇటీవల ఇక్కడి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. షూటింగ్ ముగియగానే రజనీ మిత్రుడు, విలక్షణ నటుడు మోహన్ బాబు ఇంటిలో కాసేపు సందడి చేసి, అనంతరం బుధవారం ప్రత్యేక విమానంలో చెన్నైకి వెళ్లిపోయాడు. ఆయన ఇంటిక చేరుకొగానే రజనీ సతీమణి హారతి ఇచ్చి ఆహ్వానించింది. కాగా శివ తెరకెక్కిస్తున్న అన్నాత్తై మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, నయనతార, మీనా, ఖుష్బూ, కీర్తి సురేశ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. -
రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి ఏడాది ఇచ్చే దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని 2020 సంవత్సరానికిగాను సూపర్ స్టార్ రజనీకాంత్‌ని వరించింది. రజనీకాంత్‌కు 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందించనున్నట్లు తాజాగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఈ పురస్కారంతో గౌరవిస్తారు. భారతీయ సినిమాకు పితామహుడుగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే జన్మ శతి సందర్భంగా 1963లో ఈ పురస్కారం ఏర్పాటు చేయబడింది. ఒక సంవత్సరానికి సంబంధించిన పురస్కారం మరుసటి ఏడాది చివర్లో ఇచ్చే జాతీయ సినిమా అవార్డులతో పాటు ఇస్తారు. తాజాగా ఈ అవార్డ్ ను రజని కాంత్ అందుకోవడం విశేషం. అయితే తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారీ ఫాలోయింగ్ ఉన్న రజనీకాంత్‌కు కేంద్రం అవార్డు ప్రకటించడం ఎలక్షన్ స్టంట్ అని విపక్షాలు నేతలు విమర్శిస్తున్నారు. రజని కాంత్ పార్టీ పెట్టి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నందుకు గిఫ్ట్‌గా ఈ అవార్డు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు: రజనీకాంత్ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్నందుకు గాను ఆయనకు పలువును సినీ రాజయకీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రజనీకి శుభాకాంక్షలు తెలిపారు. -
బ్లాక్‌బస్టర్ కాంబినేషన్: త్వరలో రజనీ ‘రాణా’!
రజనీకాంత్, దర్శకుడు కేఎస్ రవికుమార్ లది బ్లాక్‌బస్టర్ కాంబినేషన్. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో ‘నరసింహా, ముత్తు’ వంటి బ్లాక్బస్టర్లు ఉన్నాయి. మళ్లీ ఈ ఇద్దరూ ఓ సినిమా కోసం కలవబోతున్నారని కోలీవుడ్ టాక్. 2010లో ‘రాణా’ అనే భారీ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టారు కేఎస్ రవికుమార్. రజనీకాంత్ లీడ్ రోల్లో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ ముఖ్య పాత్రల్లో ఈ సినిమా ప్రారంభం అయింది. రజనీకాంత్ అనారోగ్యం వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. తాజాగా ఆ ప్రాజెక్ట్‌ను మళ్లీ సెట్స్ మీదకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ గురించి రజనీకాంత్‌తో చర్చలు జరిపినట్టు కేయస్ రవికుమార్ పేర్కొన్నారు. 2022లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని కోలీవుడ్ టాక్. ‘రాణా’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పలు సందర్భాల్లో కేయస్ రవికుమార్ పేర్కొన్నారు. మరి ఈ డ్రీమ్ నెరవేరుతుందా? చూడాలి. ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’ చిత్రం చేస్తున్నారు -
పవన్, రజనీ రాజకీయాల్లో రాణించలేరు
సాక్షి, తిరుపతి : మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వాదిని తానేనని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ఆయన చెప్పేవన్నీ అబద్దాలేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. ఆదివారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీ నిర్ణయాలు సంపన్నులకు సంక్షేమం, పేదలకు సంక్షోభంగా మారుతున్నాయన్నారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులు కొత్త బిచ్చగాళ్లలా వ్యవహరిస్తున్నారని, రాజధాని విషయంలో ద్వంద వైఖరి అవలంభిస్తున్నారని విమర్శించారు. (రజనీ రాజకీయ పార్టీ పొంగల్‌కు పక్కా!) దేశంలో సినీ రంగం నుంచి వచ్చిన వారిలో ఎన్టీఆర్, ఎంజీఆర్‌లు మాత్రమే సక్సెస్ అయ్యారని, ఇప్పుడు ఆ రంగం నుంచి వచ్చిన పవన్ కల్యాణ్, వస్తున్న రజనీకాంత్‌లు ఇద్దరూ రాణించలేరని అన్నారు. వారు కళా రంగానికే సేవ చేసుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు. బిగ్‌బాస్ షోలో నాగార్జున మహిళలను కించపరిచే విధంగా వ్యవహరించారని, ఈ అంశంపై హైకోర్టుకు వెళ్తామని పేర్కొన్నారు. -
బాలు సార్ త్వరగా కోలుకోవాలి: రజనీకాంత్
కరోనా బారినపడి గత పదిరోజులుగా చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లు చికిత్స అందిస్తున్న ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఓ వీడియో సందేశాన్ని ట్విట్ చేశారు. 'ప్రియమైన బాలు సర్, మీరు త్వరగా కోలుకోవాలి' అని ఆయన ఆకాంక్షించారు. ఈ వీడియోలో రజనీకాంత్.. ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఐదు దశాబ్దాలకు పైగా తన మధురమైన గానంతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించారు. కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే ప్రస్తుతం బాలుగారి ఆరోగ్యం నిలకడగానే ఉందని.. అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని తెలిసి ఎంతో సంతోషిస్తున్నాను. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. పూర్తి ఆరోగ్యంగా మారి సాధారణ స్థితికి రావడానికి మరి కొంత సమయం పడుతుంది. ఆయన ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను’ అంటూ వీడియో సందేశాన్ని ట్విట్ చేశారు రజనీకాంత్. (కోలుకుంటున్న ఎస్పీ బాలు) బాలు ఆరోగ్యంపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ స్పందించారు. ‘నాన్నగారు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. వదంతులను నమ్మొద్దు. ఒకట్రెండు రోజుల్లో నాన్నగారు కోలుకుంటారని వైద్యులు చెప్పారు’ అని చరణ్ పేర్కొన్నారు. బాలసుబ్రహ్మణ్యం ఈనెల 5న కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. గత పది రోజులుగా చెన్నై చూలైమేడులోని ఎంజీఎం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులంతా కోరుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా get well soon అంటూ ప్రార్థిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా బాలు ఆరోగ్య పరిస్థితిపై స్పందిస్తూ కన్నీటి పర్యంతం అయిన సంగతి తెలిసిందే. -
అంతటి చరిష్మా ఏ దర్శకుడికీ లేదు
‘‘నేడు ఆ మహనీయుడి 90వ పుట్టినరోజు. ఆయన లేకపోతే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు’’ అంటున్నారు రజనీకాంత్. ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్‌ను ఉద్దేశించి ఆయన ఈ విధంగా అన్నారు. జూలై 9 బాలచందర్ జయంతి. ఈ సందర్భంగా రజనీకాంత్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. రజనీకాంత్ మాట్లాడుతూ –‘‘ఆ రోజు నన్ను ఆయన చేరదీసి సినిమాల్లో పరిచయం చేయకపోయుంటే ఈ రోజు ఇంత మంచి స్థాయిలో ఉండేవాడిని కాదు. కన్నడ సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు చేస్తూ ఏదో కొన్ని సినిమాలు చేసి ఉండేవాడినేమో. ఆయన నాకు అవకాశం ఇవ్వడంతోపాటు నా పేరు మార్చి (రజనీ అసలు పేరు శివాజీరావ్ గైక్వాడ్), నా బలహీనతల్ని తొలగించి, నా బలాన్ని చాటి చెప్పారు. నన్ను పూర్తి స్థాయి నటునిగా తీర్చిదిద్దారు. తమిళ చిత్రపరిశ్రమలో స్టార్‌గా నిలబెట్టారు. నా తల్లిదండ్రులు, నా సోదరుడు, బాలచందర్‌గారు.. ఈ నలుగురూ నా జీవితానికి దేవుళ్లు. నాతో పాటు ఎంతోమంది నటీనటుల్ని తీర్చిదిద్దారాయన. నేను ఎంతోమంది దర్శకులతో పనిచేశాను. కానీ బాలచందర్‌గారు సెట్లోకి రాగానే లైట్‌బాయ్ నుండి ముఖ్య టెక్నీషియన్ల వరకూ అందరూ లేచి నిలబడి సెల్యూట్ చేసేవారు. అంతటి చరిష్మా ఉన్న దర్శకుడు కేబీగారు ఒక్కరే. వేరే ఎవరికీ ఆ చరిష్మా లేదంటే అది అతిశయోక్తి కాదు. ఆయన నా గురువు అని నేనీ మాటలు చెప్పటంలేదు. నిజంగా గొప్ప మహనీయుడు’’ అన్నారు. తమిళ చిత్రం ‘అపూర్వ రాగంగళ్’ (1975) ద్వారా రజనీకాంత్‌ను బాలచందర్ పరిచయం చేశారు. కమల్‌హాసన్, శ్రీవిద్య, సౌందరరాజన్, రజనీ, జయసుధ తదితరుల కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందింది. తొలి చిత్రంతోనే నటుడిగా రజనీకి మంచి పేరు వచ్చింది. తమిళ పరిశ్రమకు సూపర్ స్టార్‌ని ఇచ్చిన సినిమా ‘అపూర్వ రాగంగళ్’. ఇదే చిత్రాన్ని తెలుగులో ‘తూర్పు పడమర’గా దాసరి నారాయణరావు రీమేక్ చేశారు. తమిళంలో కీలక పాత్ర చేసిన శ్రీవిద్య తెలుగులోనూ నటించగా, ఇతర కీలక పాత్రల్లో తెలుగు తారలు నరసింహరాజు, కైకాల సత్యనారాయణ, మాధవి నటించారు. -
భవిష్యత్తులో పెదరాయుడు సీక్వెల్
‘‘ఓసారి ర జనీకాంత్ ఫోన్ చేస్తే ఇంటికెళ్లాను. ‘తమిళంలో ‘నాట్టామై’ సినిమా హిట్ అయింది. రీమేక్ హక్కులు మాకు కావాలని చెబుతాను.. నువ్వు సినిమా చూసి నిర్ణయం చెప్పు’ అన్నాడు. సినిమా చూశా.. చాలా బాగుంది, హక్కులు కావాలని రజనీకి చెప్పాను. ‘నిర్మాత ఆర్బీ చౌదరిగారితో మాట్లాడాను నువ్వు వెళ్లి మాట్లాడు’ అన్నాడు. నేను కలవగానే, ‘రజనీగారు చెప్పాక కాదనేది ఏముంది.. ఇస్తాను’ అన్నారు ఆర్బీ చౌదరిగారు’’ అని మోహన్‌బాబు అన్నారు. మోహన్‌బాబు, రజనీకాంత్, భానుప్రియ, సౌందర్య ప్రధాన పాత్రల్లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెదరాయుడు’. లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్‌బాబు నిర్మించిన ఈ సినిమా విడుదలై నేటికి 25ఏళ్లు(1995 జూన్ 15) అవుతోంది. ఈ సందర్భంగా మోహన్‌బాబు సాక్షితో పంచుకున్న విశేషాలు... ► ‘నాట్టామై’ రీమేక్ హక్కులు తీసుకున్నాక రజనీతో ‘రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహిస్తారు.. అన్ని పాత్రలు కుదిరాయి. పాపారాయుడు పాత్ర కుదరలేదురా’ అన్నాను. ‘నువ్వు ఆలోచించేది ఏంట్రా.. ఆ పాత్ర నేను చేస్తున్నాను’ అన్నాడు. ‘నువ్వేంట్రా! అది అతిథి పాత్ర.. పైగా నువ్వు నాకు తండ్రి వేషం వేయడమేంటి?’ అనగానే.. ‘అవును రా.. ఆ పాత్ర అద్భుతంగా ఉంటుంది, నేను చేయాలనుకునే నీకు చెప్పాను.. చేస్తాను’ అన్నాడు. ఈ విషయం రవిరాజాకి చెప్పగానే ఆశ్చర్యపోయాడు. ► ‘పెదరాయుడు’ చిత్రానికి అన్న ఎన్టీఆర్‌గారు క్లాప్ ఇచ్చారు. తొలి షాట్లో రజనీకాంత్‌కి నేను పూలమాల వేయాలి.. ఎందుకంటే తండ్రి కాబట్టి. నేను పూలమాల సగం వేయగానే వాడు దాన్ని అందుకుని నాకు వేసి కాళ్లకు దండం పెట్టాడు.. ‘నేను దండం పెట్టింది నీ మంచి మనసుకు.. ఈ సినిమా మంచి హిట్ అవుతుంది’ అన్నాడు రజనీ. ► ‘పెదరాయుడు’కి ముందు నాకు రెండు మూడు పరాజయాలు ఎదురయ్యాయి. అది రజనీకాంత్ ఎలా తెలుసుకున్నాడో. వాడు రాజమండ్రికి వచ్చినప్పుడు మిత్రుడు కదా అని నేను వెళ్లాను.. ఇద్దరం కలిసి కారులో హోటల్‌కి వెళ్లాం.. ‘ఇది తీసుకోరా’ అన్నాడు.. చూస్తే 45లక్షలు ఉంది. ‘ఎందుకురా?’ అని అడిగా. ‘నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావని నాకు తెలుసు, ‘పెదరాయుడు’ మంచి విజయం సాధిస్తుంది.. విడుదల తర్వాత నాకు ఇవ్వరా’ అన్నాడు.. నిజంగా వాడు గొప్ప మనిషి. ► ‘పెదరాయుడు’ సినిమాలో మంచి విషయం ఉంది. నటీనటులందరూ బాగా సహకరించారు. సినిమా విడుదలై అప్పుడే 25 ఏళ్లయిందా అనిపిస్తోంది. నేను, రజనీకాంత్, భానుప్రియ, బ్రహ్మానందం, బాబూమోహన్, డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి, సంగీత దర్శకుడు కోటి కలిసి ఘనంగా ఓ వేడుక చేద్దామనిపించింది. దురదృష్టం ఏంటంటే తొలి క్లాప్ కొట్టిన అన్నయ్య (ఎన్టీఆర్) లేరు. సౌందర్య, కెమెరామేన్ కేఎస్ ప్రకాశ్‌రావు లేరు. కరోనా నేపథ్యంలో గెట్ టు గెదర్ లాంటివి ఉండొద్దు కాబట్టి వేడుక చేయడం లేదు.. లేకుంటే చేసేవాణ్ణి. ► కొన్నేళ్ల తర్వాత ఏముందిలే.. ఇంకా ఏం చూస్తాం అని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ, నా విషయంలో అది జరగలేదు. నేను ఇంకా ఏదైనా మంచి పాత్ర చేస్తే చూడాలని ఆశిస్తున్నారు. ఇది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజుకీ కొన్ని పాత్రలకు అడుగుతుంటే నేనే వద్దనుకుంటున్నాను.. కొన్ని పాత్రలు నచ్చడం లేదు. నేను కానీ చేస్తే ఏడాదిలో 365 రోజులూ బిజీగానే ఉంటాను. నా జీవితంలో జరిగిందంతా భగవంతుని ఆశీస్సులు, ప్రకృతి వల్లే. ‘మనం విర్రవీగకూడదు.. అహంకారం తలకెక్కకూడదు.. మనిషి మనిషిగా బతకాలి’అనేవి మరచిపోకూడదు. ► ఓ అందమైన కుటుంబ కథ తయారు చేశాం. ‘పెదరాయుడు’ సినిమాలా మంచి నటీనటులుంటారు. ఆ సినిమా వివరాలు త్వరలో చెబుతా. సినిమాల్లో అయినా, రాజకీయమైనా భగవంతుని ఆశీస్సుల వల్లే రాణించగలం. రాజకీయాల్లో రాణించాలంటే బ్రహ్మాండంగా పనిచేయాలి. సినిమాల్లో నటించాలంటే బ్రహ్మాండంగా నటన తెలిసి ఉండాలి. అక్కడా ఇక్కడా విజయం అన్నది ఒక్కటే అయినా.. సినిమాలు మాత్రం కొంచెం అదృష్టంపై ఆధారపడి ఉంటాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమా మరో భాషలోనూ హిట్ కావాలనే రూల్ లేదు.. ఇదంతా కాకతాళీయమే.. భగవంతుని ఆశీస్సులే. ► ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనాని ఎవరు పంపించారు? ఇదేమైనా ప్రపంచయుద్ధమా? 82లక్షల జీవరాసుల తర్వాత మనుషులం పుట్టామని అంటారు. మనిషి జన్మ అనేది గొప్పది. ఈ జన్మని మనం మరచిపోయి అహంకారంతో విర్రవీగుతున్నాం. అందుకే కన్నూమిన్నూ కానరాకుండా ప్రవర్తిస్తున్నారురా మనుషుల్లారా అని దేవుడు కరోనా రూపంలో ఓ దెబ్బ కొట్టాడు. ఇది ఎప్పటికి ఏమవుతుందో తెలియదు. తలనొప్పి, కలరా, మలేరియా, టైఫాయిడ్.. వీటికి మందులు వచ్చాయి. కానీ, కరోనాకి ఇప్పటికి విరుగుడు మందు అయితే లేదు. ‘పెదరాయుడు’ని రీమేక్ చేయాలనుకుంటే మీరు, విష్ణు, మనోజ్.. చేసే అవకాశం ఉంటుందా? ఈ చిత్రాన్ని రీమేక్ చేయడం అసాధ్యం అనుకుంటున్నా. భవిష్యత్తులో విష్ణు, మనోజ్‌కి సీక్వెల్ చేసే అవకాశం ఉండొచ్చేమో. అయితే ఆ రోజుకీ, ఈ రోజుకీ ‘పెదరాయుడు’ అనేది చరిత్ర మరచిపోలేని సినిమా. ఆ సినిమా ఒక చరిత్ర. -
ప్లాన్ రెడీ
రజనీకాంత్ నెక్ట్స్ మూవీ షూటింగ్ కోసం ప్లాన్ రెడీ అవుతోంది. కమల్‌హాసన్ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాకు ‘మా నగరం (2017), ఖైదీ (2019)’ చిత్రాల ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఇది రజనీకాంత్ కెరీర్లో 169వ చిత్రం. ఆల్రెడీ కథా చర్చల్లో భాగంగా రజనీని లోకేష్ రెండుసార్లు కలిశారని సమాచారం. కథ పట్ల రజనీ సుముఖంగానే ఉన్నారట. అలాగే ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణులుగా ఎవర్ని ఎంపిక చేసుకోవాలనే విషయంపై కూడా కమల్–లోకేష్ చర్చించుకుంటున్నారట. ఈ సినిమాని నిర్మించనున్న కమల్ అతిథి పాత్రలోనూ కనిపించే అవకాశం ఉందని సమాచారం. వచ్చే ఏడాది షూటింగ్ మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘అన్నాత్తే’ చిత్రంలో నటిస్తున్నారు రజనీకాంత్. లాక్డౌన్ వల్ల ఈ సినిమా చిత్రీకరణ ఆగింది. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోన్న ‘అన్నాత్తే’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవల అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
రజనీ.. చిరంజీవి.. ఓ ‘ఫ్యామిలీ’!
కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ఇంటి పట్టునే ఉండిపోయిన ‘ఫ్యామిలీ’ల కోసం ‘ఫ్యామిలీ’ అనే షార్ట్‌ఫిల్మ్ నిర్మిస్తున్నారు. ఈ సమయంలో కుటుంబాలను ఉత్సాహపరచడానికి, వారికి అవసరమైన సూచనలు ఇవ్వడానికి ఈ షార్ట్‌ఫిల్మ్ ఉపయోగపడనుంది. అమితాబ్ ప్రోద్బలంతో సోనీ నెట్వర్క్ సహాయంతో ఈ షార్ట్‌ఫిల్మ్ తయారవుతోంది. ప్రసిద్ధ యాడ్ డైరెక్టర్ ప్రసూన్ పాండే వర్చువల్‌గా దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ షార్ట్‌ఫిల్మ్ కుటుంబాలకు ఐదు విషయాలను చెప్పనుంది. ‘ఇంట్లో ఉండండి’, ‘సురక్షితంగా ఉండండి’, ‘చేతులు కడుక్కోండి’, ‘ఇంటి నుంచి పని చేయండి’, ‘భౌతిక దూరం పాటించండి’... అని సృజనాత్మకంగా చెప్పనుంది. భారతీయులందరినీ ఉత్సాహపరచాలి కనుక ఈ షార్ట్‌ఫిల్మ్‌లో భారీ తారాగణం లిప్తపాటు కనిపిస్తారట. వారిలో రజనీకాంత్, చిరంజీవి, మమ్ముట్టి, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, ప్రియాంకా చోప్రా, ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ తదితరులు ఉంటారు. ఏప్రిల్ 6న రాత్రి 9 గంటలకు ఈ షార్ట్‌ఫిల్మ్ దేశమంతా ప్రముఖ చానెళ్లలో ప్రసారం కానుంది. ఈ షార్ట్‌ఫిల్మ్ గురించే కాక దేశంలో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పని చేస్తున్న చిన్న స్థాయి కార్మికులు లక్షమందికి సోనీ నెట్వర్క్, కల్యాణ్ జువెలర్స్‌తో కలిసి అమితాబ్ ఒక నెల వెచ్చాలను అందించనున్నారు. సూపర్మార్కెట్లతో ఏర్పాటు చేసుకున్న కూపన్లు కార్మికులకు అందేలా చేసి వెచ్చాలను అందించనున్నారు. -
వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ ప్రిమియర్ షో అదుర్స్
సూపర్ స్టార్ రజనీకాంత్ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్ కలిసి చేసిన వెబ్ సిరిస్ ‘ఇన్‌టూ ద వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్’ ప్రత్యేక ఎపిసోడ్ సోమవారం విడుదలైంది. రజనీ డిస్కవరీ ఛానెల్ రూపోదించిన ఈ ప్రత్యేక ఎపిసోడ్ విడుదలైనప్పటీ నుంచి సోషల్ మీడియాలో ట్రేండ్ అవుతోంది. ఇది చూసిన చూసిన ఆయన అభిమానులు రజనీకాంత్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బేర్ గ్రిల్స్‌తో సమానంగా ఆయన చేసిన స్టంట్స్ చూసి అభిమానులంతా ఇలా తలైవాను ఎప్పుడు చూడలేదంటూ.. ‘వయస్సు కేవలం సంఖ్య మాత్రమే’ ‘ఇది నిజంగా సూపర్ స్టార్ కోసమే’ ఇప్పడే ప్రిమియర్ చూశాను.. వావ్ ఎంత గొప్ప ఆత్మ విశ్వాసమో తలైవాది’ ‘అడవుల్లో ఆయన స్టైలిష్‌గా ఉన్నారు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేగాక ‘ రజనీ వయసు కేవలం సంఖ్య మాత్రమే అని బేర్ గ్రిల్స్ ఇదివరకే చాలసార్లు చెప్పారు. అయితే అది ఇప్పుడు రుజువైంది’ ఇద్దరు గొప్ప వ్యక్తులు కలిసి అద్భతమైన ప్రదర్శన ఇచ్చారు. అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. (రజనీకాంత్ సూపర్ హీరో: బేర్ గ్రిల్స్) ‘నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు’ ఈ డాక్యుమెంటరీ షూటింగ్ కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ జరిగింది. కాగా బేర్ గ్రిల్స్‌తో పాటు తలైవా బండిపూర్ నేషనల్ పార్కు ఆరణ్యాన్ని అన్వేషించారు. ఈ క్రమంలో బేర్‌తో కలిసి రజనీ 50 అడుగుల ఎత్తులో ఉన్న ఇనుప వంతేనను అధిరోహించడమే కాకుండా, అడ్వెంచర్ ట్రిప్‌లో భాగంగా నడుము లోతు నీళ్లలో అవలీలగా నడుచుకుంటూ వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. రజనీ డిస్కవరీ వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ ఎపిసోడ్‌ను జనవరిలో షూట్ చేసిన విషయం తెలిసిందే. ఈ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయనకు గాయాలైనట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ వార్తలపై స్పందించిన రజనీ చిన్న ముల్లు కారణంగా గీతలు పడ్డాయని స్పష్టం చేశారు. బేర్ గ్రిల్స్‌తో కలిసి అడ్వెంచర్ షోలో పాల్గొన్న రెండవ భారతీయుడు రజనీకాంత్ కావడం గమనార్హం. గత ఏడాది ఆగస్టులో ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కనిపించిన సంగతి తెలిసిందే. Just watched the premiere.,wooow whata beautiful Soul u r thalaivaaa😘😘😘...so stylish & charming even in the woods😍😍...thank u #beargrylls for returning our Thalaivar #Rajinikanth safely to us🙏🙏🙏...luv uuu thalaivaa😘😘 pic.twitter.com/SywKT4GvdI — Sri (@RRsri777) March 23, 2020 -
ఇంట్లోనే ఉందాం
కోవిడ్ 19 (కరోనా వైరస్)ను అధిగమించడానికి ప్రధాని మోదీ నేడు (ఆదివారం) జనతా కర్ఫ్యూ (ఉదయం ఏడుగంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇంటిలోపలే ఉండటం)కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పౌరులందరూ ఈ జనతా కర్ఫ్యూలో పాల్గొని కరోనా వైరస్‌ను అధిగమించాలని కొందరు స్టార్స్ కూడా సోషల్ మీడియాలో ఈ విధంగా ట్వీట్స్ చేశారు. ఇటలీ ప్రస్తుతం దారుణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అక్కడ మరణాల సంఖ్య మెండుగా ఉంది. అలాంటి పరిస్థితులు మన దేశంలో తలెత్తకూడదు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూలో పాల్గొందాం. స్వీయ గృహనిర్భందం, సామాజిక దూరం పాటిద్దాం. – రజనీకాంత్ ప్రధాని పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు కట్టుబడి ఉందాం. ఈ అసాధారణమైన పరిస్థితుల్లో అసాధారణ రీతిలో జాగ్రత్తులు తీసుకుందాం – కమల్ హాసన్ మోదీగారు పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూలో భాగస్వాములం అవుదాం. కరోనా విపత్కర పరిస్థితులను కట్టడి చేసేందుకు సామాజిక దూరాన్ని పాటిద్దాం – నాగార్జున ఈ ఆదివారం మార్చి 22 ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు జనతా కర్ఫ్యూను పాటిద్దాం – వెంకటేశ్ జనతా కర్ఫ్యూకు అందరం సపోర్ట్ చేద్దాం. కరోనా వైరస్‌పై సమిష్టిగా పోరాడదాం – మహేశ్‌బాబు కరోనా వైరస్‌పై పోరాడటానికి స్వీయ గృహనిర్భందం, సామాజిక దూరం.. ఈ రెండూ బలమైన ఆయుధాలు. కరోనాని జయించాలంటే అందరం మన వంతు కృషి చేయాలి. జనతా కర్ఫ్యూని విజయవంతం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. – ఎన్టీఆర్ జనతా కర్ఫ్యూలో భాగంగా పౌరులందరూ ఇళ్లలోనే ఉండాలని కోరుకుంటున్నాను. సమిష్టిగా పోరాడి కరోనాను అధిగమిద్దాం – రాజమౌళి మన ఇంట్లోకి ఎవరైనా వస్తే చెంబుతో నీళ్లిచ్చి, కాళ్లు కడుక్కున్నాకే ఇంట్లోకి రమ్మంటాం, అలాంటి సంప్రదాయం మనది. అలాంటిది ఈ మహమ్మారి కరోనా వస్తానంటే రానిస్తామా? అందుకే మన దేశం కోసం, మనందరి ఆరోగ్యం కోసం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీగారు చెప్పిన జనతా కర్ఫ్యూని పాటిద్దాం. ఈ రోజు ఉదయం 7గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మన ఇళ్లల్లో మనమే ఉంటూ బయటివారిని ఎవరినీ రానివ్వకుండా వీలైనంత పరిశుభ్రతను పాటించడం ఈ రోజు ముఖ్యోద్దేశ్యం. అలా ఇంట్లో ఉండి మన వంటలను మనమే చేసుకుని మనమే తింటూ ఇంట్లో ఉందాం. మనందరం ఒకటే అని నిరూపించటం కోసం సాయంకాలం 5 గంటలకు మన ఆనంద హర్హాతిరేకానికి గుర్తుగా మన దేశ పౌరులందరూ ఒక్కటే అనుకుని చేతులన్నీ శుభ్రం చేసుకొని ఒక్కసారి చప్పట్లు కొడదాం. అలా చేసి, మనందరం ఒకటే అని నిరూపిద్దాం. జైహింద్. – రాజేంద్రప్రసాద్ -
పెద్దన్నయ్య
రజనీకాంత్ సినిమాలంటే ఆ ఎనర్జీయే వేరు. ఆయన సినిమా ప్రకటించినప్పటి నుంచే హంగామా మొదలవుతుంది. ఇక టైటిల్ ప్రకటన తర్వాత ఆ హంగామా రెండింతలవుతుంది. ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారాయన. ఈ సినిమాకు ‘అన్నాత్తే’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సోమవారం ప్రకటించారు. ‘అన్నాత్తే’ అంటే పెద్దన్నయ్య అని అర్థం. ఇందులో ఖుష్భూ, మీనా, నయనతార, కీర్తీ సురేశ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో రజనీ కుమార్తె పాత్రలో కీర్తీ సురేశ్ నటిస్తున్నారు. నయనతార విలన్‌గా కనిపిస్తారని టాక్. ఈ సినిమాను ఈ ఏడాది దసరాకు విడుదల చేయాలనుకుంటున్నారు. -
లుక్ లీక్
శివ దర్శకత్వంలో ఓ కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్నారు రజనీకాంత్. ఇందులో ఖుష్భూ, మీనా, నయనతార, కీర్తీ సురేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో రజనీకాంత్ లుక్ ఒకటి బయటకు వచ్చింది. పంచె కట్టు, మెలి తిప్పిన మీసాలతో కనిపిస్తున్నారు రజనీ. లుక్ అదిరిందంటున్నారు ఫ్యాన్స్. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని సమాచారం. ఈ ఏడాది దసరాకు ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. -
‘దర్బార్’ డిస్ట్రిబ్యూటర్ల నిరాహార దీక్ష!
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘దర్బార్’ సినిమాతో దాదాపు రూ.70 కోట్లు నష్టపోయామని పంపిణీదారులు తెలిపారు. దీంతో ఈ చిత్ర పంపిణీదారులు హీరో రజనీకాంత్‌ను కలవడానికి చెన్నైలోని ఆయన ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు ఆయనను కలవకుండా వారిని అడ్డుకోవడంతో నిరాహార దీక్ష చేయాలని పంపిణీదారులు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత శనివారం తాము రజనీకాంత్‌ను కలిసేందుకు చెన్నైలోని ఆయన ఇంటికి వెళ్లామని చెప్పారు. ఇంటి సమీపంలోకి వెళ్లగానే పోలీసులు లోపలికి వెళ్లకుండా తమను అడ్డుకున్నారని, రజనీకాంత్ కూడా తమను కలవడాని ఇష్టపడలేదని చెప్పారు. దీంతో తాము నిరాశకు గురయ్యామన్నారు. ఈ క్రమంలో నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నట్లు పంపిణీదారులు తెలిపారు. కాగా గతంలో రజనీ నటించిన లింగా చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కూడా రజనీ ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. దర్బార్ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు నష్టమా? కాగా రూ. 200 కోట్లతో నిర్మించిన దర్బార్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 250 కోట్లు వసూలు చేసినప్పటికీ భారీ డిజాస్టర్‌గా నిలిచి పంపిణి దారులకు నష్టాన్నిచ్చింది. అయితే ఈ సినిమాకు రజనీ రూ. 108 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. దర్శకుడు ఎఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించారు. ఇక గజిని, కత్తి వంటి సూపర్ హిట్లను అందించిన మురుగుదాస్.. రజనీతో తీసిన మొదటి సినిమా ఇది. -
నయన్ ఇన్
‘చంద్రముఖి’ (2005), ‘దర్బార్’ (2020) చిత్రాల్లో రజనీకాంత్, నయనతార జంటగా నటించారు. రజనీ శివాజీ (2007), ‘కుశేలన్ ’ (2008) (తెలుగులో ‘కథానాయకుడు’) చిత్రాలలో ఆయనతో కాలు కదిపారు నయనతార. ఇప్పుడు రజనీ, నయనతార మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఖుష్బూ, మీనా, కీర్తీ సురేష్, ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోకి నయనతారను తీసుకున్నారు. అయితే నయనతార రజనీకాంత్‌కు జోడిగా నటించనున్నారా? లేక ఏదైనా కీలక పాత్ర చేయబోతున్నారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసింది. తర్వాతి షెడ్యూల్ చెన్నైలో ఈ నెల ప్రారంభం కానుందట. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. -
సరికొత్త కాంబినేషన్?
అగ్ర కథానాయకులు రజనీకాంత్, కమల్‌హాసన్ కలిసి ఓ సినిమా చేయబో తున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. కానీ వీరిద్దరూ హీరోలుగా నటించడం లేదు. రజనీకాంత్ హీరోగా కమల్‌హాసన్ నిర్మాతగా రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై ఓ సినిమా తెరకెక్కనుందని కోలీవుడ్ తాజా టాక్. ఈ వార్త నిజమైతే ఓ కొత్త కాంబినేషన్ కుదిరినట్లే. ‘మా నగరం, ఖైదీ’ వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారట. ఇదిలా ఉంటే.. కెరీర్ ఆరంభంలో రజనీ–కమల్ కలిసి పలు సినిమాల్లో నటించారు. మరి ఇప్పుడు ఎందుకు చేయడంలేదు? అనే ప్రశ్న ఈ హీరోల ముందుంచితే– ‘‘ఇప్పుడు మా కాంబినేషన్ అంటే బడ్జెట్ భారీగా ఉండాలి. దానికంటే ముఖ్యం కథ. అప్పట్లో మా ఇద్దరి ఇమేజ్ వేరు. ఇప్పుడు ఇమేజ్ వేరు. ఇద్దరి ఇమేజ్‌కి తగ్గ కథ కుదరాలి. అందుకని కలిసి నటించడానికి కుదరకపోవచ్చేమో’’ అని చెబుతుంటారు. మరి.. హీరో–నిర్మాతగా ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా? అంటే వేచి చూడాల్సిందే. -
‘ఆయన బ్రిటిష్ ఏజెంట్’
సాక్షి, న్యూఢిల్లీ : సంఘ సంస్కర్త ఈవీ రామస్వామి పెరియార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ మద్దతుగా నిలిచారు. పెరియార్ బ్రిటిష్ ఏజెంట్‌గా వారి విభజించి పాలించే విధానాన్ని ముందుకు తీసుకువెళ్లారని కట్జూ ఆరోపించారు. తమిళ మ్యాగజైన్ తుగ్లక్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెరియార్‌పై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. గతంలో సీతారాముల విగ్రహాలకు చెప్పుల దండ వేసి చేపట్టిన ర్యాలీలో పెరియార్ పాల్గొన్నారని ఈ వార్తను ఏ ఒక్కరూ కవర్ చేయలేదని రజనీ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. పెరియార్‌పై రజనీ వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ వివాదంపై జస్టిస్ కట్జూ తన ఫేస్బుక్ పేజ్‌లో స్పందించారు. బ్రిటిష్ పాలకులకు ఊడిగం చేసిన ఇతరులెందరి మాదిరిగానే పెరియార్ కూడా బ్రిటిష్ ఏజెంటేనని..ఆయన ఉద్దేశాలు ఏమైనా బ్రిటిషర్ల విధానమైన విభజించి పాలించనే సిద్ధాంతానికి అనుగుణంగా పెరియార్ వ్యవహరించారని అన్నారు. దీనిపై పలు వెబ్సైట్లు, తన బ్లాగ్‌లో రాసిన వ్యాసాలను పరీశీలించవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. కాగా రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడంపై 2017లో మార్కండేయ కట్జూ విమర్శలు గుప్పించడం విశేషం. పేదరికం, నిరుద్యోగం వంటి ప్రధాన సమస్యలకు రజనీ వద్ద పరిష్కారం ఉందా అంటూ తన బ్లాగ్‌లో ఆయన తమిళ సూపర్‌స్టార్ రజనీని ప్రశ్నించారు. చదవండి : పెరియార్‌పై వ్యాఖ్యలు : క్షమాపణకు సూపర్‌స్టార్ నో.. -
రజినీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం
చెన్నై: తమిళులకు ఆరాధ్యుడైన సంస్కరణవాది ఈవీ రామస్వామి పెరియార్‌కు సంబంధించి సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. రజినీకి మద్దతిచ్చే, వ్యతిరేకించే వర్గాలుగా తమిళ రాజకీయాలు విడిపోయాయి. ద్రవిడ సైద్ధాంతిక పార్టీలు, సంస్థలు రజినీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ మాత్రం రజినీకి మద్దతుగా నిలిచింది. రజినీకాంత్ కోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని బుధవారం పెరియార్ స్థాపించిన ద్రవిడార్ కజగం సంస్థ అధ్యక్షుడు వీరమణి వ్యాఖ్యానించారు. మతవాద శక్తుల చేతిలో పావుగా మారొద్దని కాంగ్రెస్ ఈ సినీ సూపర్‌స్టార్‌కు హితవు చెప్పింది. రజినీ ఇంటి దగ్గరలో ద్రవిడార్ విదుతలై కచ్చి సభ్యులు ధర్నా నిర్వహించారు. పెరియార్ సిద్ధాంతాలను ఎవరూ తప్పుబట్టలేరని అధికార అన్నాడీఎంకే నేత పన్నీర్‌సెల్వం వ్యాఖ్యానించారు. పెరియార్ విషయంలో ఆలోచించి మాట్లాడాలని డీఎంకే పేర్కొంది. -
సంక్రాంతి సంబరాలు
తెలుగు, తమిళ, కన్నడ సినీ తారల సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తమ ఆనందపు జ్ఞాపకాల క్షణాలను ఫొటోల్లో భద్రపరచి అభిమానుల కోసం వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవే ఇక్కడున్న ఫొటోలు. కుమార్తె సౌందర్య, అల్లుడు విశగన్లతో రజనీకాంత్, లత చిరంజీవితో అల్లు శిరీష్, అల్లు అర్జున్, కల్యాణ్‌దేవ్, వైష్ణవ్‌తేజ్, రామ్‌చరణ్, వరుణ్‌తేజ్, సాయిధరమ్‌తేజ్ తదితరులు పిల్లలు అరియానా, వివియానా, అవ్రామ్ భక్త, ఆరాలతో మంచు విష్ణు, వెరోనికా దంపతులు భార్య రాధికా పండిట్‌తో ‘కేజీయఫ్’ ఫేమ్ యశ్ తండ్రి సురేశ్‌కుమార్‌తో కీర్తీసురేశ్ -
ఫస్ట్‌వీక్‌లో దర్బార్ వసూళ్ల సునామీ..
హైదరాబాద్ : సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన రజనీకాంత్ దర్బార్ తొలి వారంలో రికార్డు కలెక్షన్లను కొల్లగొట్టింది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తమిళనాడులో ఫస్ట్‌వీక్‌లో ఏకంగా రూ 60 కోట్ల వరకూ రాబట్టింది. తమిళనాడులో 650కి పైగా స్ర్కీన్స్‌లో రిలీజైన దర్బార్ తొలిరోజే రూ 18 కోట్లు వసూలు చేసింది. సంక్రాంతి సెలవల కారణంగా తమిళనాడులో దర్బార్ భారీ వసూళ్లతో సత్తా చాటింది. చెన్నైలో తొలి వారంలో రూ 10 కోట్ల మార్క్‌ను దాటింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పాజిటివ్ టాక్‌తో ఈ మూవీ రూ 15 కోట్లుపైగా కలెక్ట్ చేసింది. సరిలేరు, అల వైకుంఠపురంలో వంటి భారీ సినిమాల నుంచి పోటీ ఎదురైనా ఈ స్ధాయి వసూళ్లను దర్బార్ రాబట్టడం విశేషమే. కేరళలో రూ 7 కోట్లు, కర్ణాటకలో రూ 14 కోట్లు, రెస్టాఫ్ఇండియాలో రూ 4 కోట్లుపైగా వసూళ్లను నమోదు చేసింది. దేశవ్యాప్తంగా రూ 100 కోట్లు కలెక్ట్ చేసిన దర్బార్ అమెరికాలో రూ 10 కోట్లు, గల్ఫ్‌లో రూ 11 కోట్లు రాబట్టింది. విదేశీ వసూళ్ల వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడైతే దర్బార్ వసూళ్లు ఓ రేంజ్లో ఉంటాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చదవండి : దర్బార్ చిత్రంలో నయనతార పాత్ర దారుణం -
దర్బార్: ట్విటర్లో ఏమంటున్నారంటే?
సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఏర్పడ్డాయి. అంతేకాకుండా చాలా కాలం తర్వాత తలైవా పోలీస్ గెటప్‌లో కనిపిస్తుండటంతో థియేటర్లో రచ్చరచ్చే అని ఫ్యాన్స్ ఆనందపడ్డారు. ఇక సంక్రాంతి కానుకగా నేడు(గురువారం) ‘దర్బార్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ‘దర్బార్’ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు ట్విటర్లో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. రజనీ వన్ మ్యాన్ షోతో అదరగొట్టారని.. ఈ సినిమాతో అలనాటి తలైవాను మళ్లీ చూశామని తమిళ తంబిలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అనిరుధ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో రచ్చరచ్చ చేశాడంట. అదేవిధంగా ఇంటర్వెల్ సీన్ అదిరిపోయిందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే రేసు గుర్రం పరిగెట్టినట్టు పరిగెత్తిందని అందరూ చెబుతున్న కామన్ పాయింట్. సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకు ఒక్క సెకన్ కూడా బోర్ కొట్టకుండా ఉందట. ఇక సెకండాఫ్‌లో డైరెక్టర్ తన క్రియేటివిటీని ప్రదర్శించాడని అంటున్నారు. దీంతో బొమ్మ బ్లాక్‌బస్టర్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ‘జెట్ స్పీడ్ స్క్రీన్ ప్లే, ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు. కామెడీ, రొమాంటిక్, యాక్షన్స్ సీన్స్‌లో తలైవా అదరగొట్టాడు. విలన్ ఇంటర్వెల్‌కు ముందు రావడంతో అసల ఆట ఆరంభవుతుంది’అంటూ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘ఈ సినిమా రూ.400-500 కోట్లు వసూలు చేయకపోతే సినీ అభిమానులకు టేస్ట్ లేదని అర్థం’, ‘తలైవా వన్ మ్యాన్ షో. రజనీ ఎనర్జీ, స్టైల్, చరిష్మా అందరినీ ఇన్స్పైర్ చేసేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. రజనీని చాలా కొత్తగా చూపించారు. ఘనవిజయాన్ని అందుకున్న ‘దర్బార్’ టీంకు శుభాకాంక్షలు’, ‘బొమ్మ బ్లాక్‌బస్టర్ హిట్’, అంటూ పలువురు నెటజన్లు ట్విటర్లో కామెంట్ చేస్తున్నారు. Hats off to Thalaivar and ARM. #Darbar Every minute enjoyable. No doubt , #Darbar going to be industrial hit and massive blockbuster. Only one super star and thalaivar. No one can stand in front of thalaivar. #DarbarThiruvizha#DarbarFDFS #DarbarThiruvizha — looking for good leader (@suchi2019) January 9, 2020 #Darbar 1st half - It's a complete Vishwaroopam of #SuperstarRajinikanth's charisma, energy & screen presence🙏👑 #Thalaivar pinni pedal edukaraaru. Ageless!#TharamMaaraSingle la avar panra dance, settai (enjoying Mahanadhi Kamal sir's kiss scene) etc vera ragam👌😎 Delightful — Kaushik LM (@LMKMovieManiac) January 9, 2020