
చెన్నై: ఇటీవల షూటింగ్ నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ నిన్న(బుధవారం) తిరిగి చెన్నైకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఇంటికి చేరుకున్న ఆయన ఇవాళ కోవిడ్ టీకా తీసుకున్నారు. ఇంట్లో సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేయించుకుంటున్న రజనీ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం రజనీ, దర్శకుడు సిరుతై శివ దర్శకత్వంలో ‘అన్నాత్తై’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.
దాదాపు 35 రోజుల పాటు హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఇటీవల ఇక్కడి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. షూటింగ్ ముగియగానే రజనీ మిత్రుడు, విలక్షణ నటుడు మోహన్ బాబు ఇంటిలో కాసేపు సందడి చేసి, అనంతరం బుధవారం ప్రత్యేక విమానంలో చెన్నైకి వెళ్లిపోయాడు. ఆయన ఇంటిక చేరుకొగానే రజనీ సతీమణి హారతి ఇచ్చి ఆహ్వానించింది.
కాగా శివ తెరకెక్కిస్తున్న అన్నాత్తై మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, నయనతార, మీనా, ఖుష్బూ, కీర్తి సురేశ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment