ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నేడు రజనీకాంత్ పేరు కాసులు వర్షం కురిపిస్తుంది. సిల్వర్ స్క్రీన్‌పై ఆయన పేరు కనిపిస్తే చాలు అభిమానులు కేరింతలు వేస్తారు. కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. అయితే రజనీ కాంత్ మెచ్చిన హీరోయిన్ ఎవరు..? ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది..?
14 ఏళ్లకే ఎంట్రీ
1970, 80వ దశకంలో దక్షిణ భారతదేశంలో మరింత ప్రతిభావంతులైన నటీమణులు వచ్చారు. ఈ కాలంలో సినీ రంగ ప్రవేశం చేసిన నటీమణులు చాలామంది నేటికీ సుపరిచితులే. అయితే, ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన జయలక్ష్మి 14 ఏళ్ల వయసులో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 16 ఏళ్లకే స్టార్ డమ్ వచ్చింది. 22 ఏళ్లకే 66 సినిమాల్లో నటించి ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయింది.
'అంతులేని కథ' చిత్రంతో పాపులర్
1974లో కె.బాలచందర్ దర్శకత్వంలో 'అవల్ ఒరు తొదర్ కథై' విడుదలైంది. తెలుగులో 'అంతులేని కథ'గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో జయలక్ష్మి మెప్పించింది. ఆ పాత్ర ఊతపదం 'ఫటాఫట్'. దీంతో సౌత్ ఇండియానే ఈ పదం ఊపేసింది. అలా ప్రేక్షకుల్లో బాగా గుర్తింపు రావడంతో 'ఫటాఫట్ జయలక్ష్మి'గా స్థిరపడిపోయింది. ఇదే సినిమాలో రజనీకాంత్ కూడా నటించారు. అలా ఆయనతో ఆమె పలు సినిమాల్లో కనిపించింది. మరో చరిత్ర, కాళి, న్యాయం కావాలి, జ్యోతి,స్వర్గం నరకం,తిరుగులేని మనిషి,రామ్ రాబర్ట్ రహీమ్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో ఆమె మెరిసింది. అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'ఇద్దరు అమ్మాయిలు' సినిమాలో ఆమెకు తొలి ఛాన్స్ దక్కింది. ఆ సమయంలో జయలక్ష్మి వయస్సు కేవలం 14 సంవత్సరాలు.
మాజీ ముఖ్యమంత్రి బంధువుతో పెళ్లి
జయలక్ష్మి కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. అప్పటికే తమిళం, తెలుగు, మలయాళం, కన్నడతో సహా 60కి పైగా చిత్రాలలో నటించింది. చేతిలో చాలా ఆఫర్లు ఉన్నాయి. అలాంటి సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎంజీ రామచంద్రన్ తమ్ముడు చక్రపాణి కుమారుడు సుకుమార్‌ను ప్రేమించింది. అప్పటి వరకు జీవితంలో సక్సెస్ అయిన భర్త వల్ల కొద్ది రోజులకే వ్యక్తిగత జీవితంలో అపజయాన్ని చవిచూసింది. భర్త వల్ల చాలా భాదలు పడిందని చెప్పేవారు. 1980 నవంబర్ 21న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఈ వార్త సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆరోజుల్లో పెద్ద షాకిచ్చింది.
అసహజ శృంగారం కారణంగా మరణం
దక్షిణాది సినిమాలో అగ్ర హీరోలు చిరంజీవి,కమల్ హాసన్, నాగేశ్వరరావు, రజనీకాంత్, కృష్ణ , ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించిన జయలక్ష్మి 22 ఏళ్ల వయసులో గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు కనిపించింది. అయితే ఆమె నిద్రమాత్రలు మింగి సూసైడ్ చేసుకుందని, అసహజ శృంగారం కారణంగా మరణించిందని పలు కథానాలు చెబుతున్నాయి. కానీ ఇప్పటికీ ఆమె మరణం ఒక మిస్టరీ.. ఆమె చావుకు కారణం ఎవరు అనేది ఇప్పటికీ తేలలేదు. ఓ ఇంటర్వ్యూలో తన ఆల్ టైమ్ ఫేవరెట్ నటి జయలక్ష్మి అని రజనీకాంత్ చెప్పడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment