Jayalakshmi
-
16ఏళ్లకు స్టార్ ఆపై 22ఏళ్లకే విషాదం.. రజనీకి ఇష్టమైన హీరోయిన్ ఎవరు?
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నేడు రజనీకాంత్ పేరు కాసులు వర్షం కురిపిస్తుంది. సిల్వర్ స్క్రీన్‌పై ఆయన పేరు కనిపిస్తే చాలు అభిమానులు కేరింతలు వేస్తారు. కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. అయితే రజనీ కాంత్ మెచ్చిన హీరోయిన్ ఎవరు..? ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది..?14 ఏళ్లకే ఎంట్రీ1970, 80వ దశకంలో దక్షిణ భారతదేశంలో మరింత ప్రతిభావంతులైన నటీమణులు వచ్చారు. ఈ కాలంలో సినీ రంగ ప్రవేశం చేసిన నటీమణులు చాలామంది నేటికీ సుపరిచితులే. అయితే, ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన జయలక్ష్మి 14 ఏళ్ల వయసులో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 16 ఏళ్లకే స్టార్ డమ్ వచ్చింది. 22 ఏళ్లకే 66 సినిమాల్లో నటించి ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయింది.'అంతులేని కథ' చిత్రంతో పాపులర్1974లో కె.బాలచందర్ దర్శకత్వంలో 'అవల్ ఒరు తొదర్ కథై' విడుదలైంది. తెలుగులో 'అంతులేని కథ'గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో జయలక్ష్మి మెప్పించింది. ఆ పాత్ర ఊతపదం 'ఫటాఫట్'. దీంతో సౌత్ ఇండియానే ఈ పదం ఊపేసింది. అలా ప్రేక్షకుల్లో బాగా గుర్తింపు రావడంతో 'ఫటాఫట్ జయలక్ష్మి'గా స్థిరపడిపోయింది. ఇదే సినిమాలో రజనీకాంత్ కూడా నటించారు. అలా ఆయనతో ఆమె పలు సినిమాల్లో కనిపించింది. మరో చరిత్ర, కాళి, న్యాయం కావాలి, జ్యోతి,స్వర్గం నరకం,తిరుగులేని మనిషి,రామ్ రాబర్ట్ రహీమ్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో ఆమె మెరిసింది. అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'ఇద్దరు అమ్మాయిలు' సినిమాలో ఆమెకు తొలి ఛాన్స్ దక్కింది. ఆ సమయంలో జయలక్ష్మి వయస్సు కేవలం 14 సంవత్సరాలు.మాజీ ముఖ్యమంత్రి బంధువుతో పెళ్లిజయలక్ష్మి కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. అప్పటికే తమిళం, తెలుగు, మలయాళం, కన్నడతో సహా 60కి పైగా చిత్రాలలో నటించింది. చేతిలో చాలా ఆఫర్లు ఉన్నాయి. అలాంటి సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎంజీ రామచంద్రన్ తమ్ముడు చక్రపాణి కుమారుడు సుకుమార్‌ను ప్రేమించింది. అప్పటి వరకు జీవితంలో సక్సెస్ అయిన భర్త వల్ల కొద్ది రోజులకే వ్యక్తిగత జీవితంలో అపజయాన్ని చవిచూసింది. భర్త వల్ల చాలా భాదలు పడిందని చెప్పేవారు. 1980 నవంబర్ 21న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఈ వార్త సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆరోజుల్లో పెద్ద షాకిచ్చింది.అసహజ శృంగారం కారణంగా మరణందక్షిణాది సినిమాలో అగ్ర హీరోలు చిరంజీవి,కమల్ హాసన్, నాగేశ్వరరావు, రజనీకాంత్, కృష్ణ , ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించిన జయలక్ష్మి 22 ఏళ్ల వయసులో గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు కనిపించింది. అయితే ఆమె నిద్రమాత్రలు మింగి సూసైడ్ చేసుకుందని, అసహజ శృంగారం కారణంగా మరణించిందని పలు కథానాలు చెబుతున్నాయి. కానీ ఇప్పటికీ ఆమె మరణం ఒక మిస్టరీ.. ఆమె చావుకు కారణం ఎవరు అనేది ఇప్పటికీ తేలలేదు. ఓ ఇంటర్వ్యూలో తన ఆల్ టైమ్ ఫేవరెట్ నటి జయలక్ష్మి అని రజనీకాంత్ చెప్పడం విశేషం. -
ముత్తు నందిని ప్యాలెస్ ఇష్టాల ఇల్లు
రాజ్ చందర్ పద్మనాభన్, నాగ జయలక్ష్మి దంపతులు తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారిలో నివసించేవారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునే క్రమంలో వీరు అనుసరించిన విధానం ఇప్పుడు దేశమంతటినీ ఆకర్షిస్తోంది. పర్యావరణ ప్రేమికులనైతే మరీ ఎక్కువగా ఆకట్టుకుంటోంది. రెండేళ్ల కిందట గృహప్రవేశం చేసుకున్న కొత్త ఇల్లది. అయితే ఆ ఇంట్లో అడుగుపెడితే కాలం గిర్రున సినిమా రీల్‌లాగ వందేళ్ల వెనక్కి తిరిగిపోయిందా అనిపిస్తుంది. ఇంటిని చూడడానికి వచ్చిన వాళ్లను అతిథి మర్యాదలతో ముంచెత్తుతారు ఈ దంపతులు. సేంద్రియ పద్ధతిలో పండించిన దినుసులు, కాయగూరలతో సంప్రదాయ తమిళ, చెట్టినాడు వంటలను వడ్డిస్తారు. ఎర్రమట్టి, సున్నపు రాయితో నిర్మించిన ఇంట్లో భూగర్భ జలాలను పరిరక్షించే ఏర్పాటు ఉంది. బంకమట్టి నిర్మాణం కావడంతో ఎండాకాలం చల్లగా ఉంటుంది. నేచర్ ఫ్రెండ్లీ ట్రావెల్‌ను ఇష్టపడే వాళ్లు ఇక్కడ బస చేస్తుంటారు. బస చేయకపోయినా చూసి పోవడానికి వచ్చేవాళ్లు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ కాలంలో ఇంటిని ఇలా ఎందుకు కట్టుకున్నారనే ప్రశ్న దాదాపుగా ప్రతి ఒక్కరి నుంచి ఎదురవుతుంటుంది. జయలక్ష్మి ప్రతి ఒక్కరికీ పూసగుచ్చినట్లు వివరిస్తుంటుంది. బాల్యంలోకి వెళ్లారాయన! ‘‘రాజ్‌చందర్ వృత్తిరీత్యా జియో డాటా అనలిస్ట్. ఆయనకు ఇష్టమైన రోజులంటే చిన్నప్పుడు వాళ్ల అమ్మమ్మ గారింట్లో గడిపిన బాల్యమే. పైగా రాజ్ అభిరుచి, విధి నిర్వహణ కూడా పర్యావరణవేత్తలతో కలిసి పని చేయడమే. ఈ రెండు ఇష్టాలను కలుపుతూ చక్కటి ఇల్లు కట్టుకోవాలని ఎప్పుడూ చెప్పేవారు. నాక్కూడా మా సంప్రదాయ నిర్మాణంలో ఉండే సౌందర్యం చాలా ఇష్టం. ఇద్దరి అభిరుచులూ కలవడంతో ఇంటిని ఇలా కట్టుకున్నాం. మా ఇద్దరి ఇష్టాల మేరకు ఎలా కట్టుకోవాలో ఒక ఐడియా వచ్చేసింది. ఎక్కడ కట్టాలనే విషయంలో ఒక అభిప్రాయానికి రావడం కొంచెం కష్టమే అయింది. లొకేషన్ సెర్చింగ్ మొదలు పెట్టాం. సంజీవని శకలం కన్యాకుమారికి సమీపంలో పోథయాడి గ్రామాన్ని చూసినప్పుడు కొండలు, పచ్చటి చెట్లతో ప్రదేశం బాగుందనిపించింది. ఆశ్చర్యంగా మరో విషయం తెలిసింది. అదేంటంటే... రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు వైద్యం కోసం హనుమంతుడు ఏకంగా సంజీవని మొక్క ఉన్న పర్వతం అంతటినీ ఎత్తుకొచ్చాడని విన్నాం. వైద్యం చేసిన తర్వాత ఆ పర్వతాన్ని తిరిగి తీసుకెళ్లే క్రమంలో పర్వతంలోని ఒక శకలం విరిగి కింద పడి పోయిందని, ఆ శకలమే ఈ కొండ అని చె΄్పారు స్థానికులు. వాళ్ల విశ్వాసాన్ని పక్కన పెడితే ఆ కొండమీద చుట్టు పక్కల ఉన్న మొక్కలన్నీ ఔషధ మొక్కలే. ప్రకృతితో మమేకమై నివసించడానికి మాకు ఇంతకంటే సౌకర్యవంతమైన ప్రదేశం మరోటి ఉండదేమో అనిపించింది. అంతే... 2021లో నిర్మాణం మొదలు పెట్టాం. ఒక ఏడాదిలో తమిళ, వేనాడు, చెట్టినాడు సంస్కృతుల సమ్మేళనమైన మా ఇంటి నిర్మాణం పూర్తయింది. సంప్రదాయ కళాకృతుల సేకరణ నా హాబీ. ఇంటిని తమిళ సంప్రదాయ సంస్కృతికి ప్రతీకగా మలిచాను. ఇంటి ముఖద్వారం నుంచి నేల, గోడ, మెట్లు, పై కప్పు, అలంకరణ వస్తువులు ప్రతి ఒక్కటీ తమ వైభవాన్ని తామే చెప్పుకుంటాయి. పర్యావరణ హితమైన సున్నపు పోడి ఇటుకలు, ఎర్ర మట్టి, ఆవుపేడ, ధాన్యం పోట్టు, కోడిగుడ్లు, బెల్లంతోపాటు అత్తంగుడి నది తీరాన దొరికే ఇసుకతో తయారు చేసే అత్తంగుడి టైల్స్‌ను వాడాం. పై కప్పుకి కాంక్రీట్ వాడకాన్ని తగ్గించి ఫిల్లర్ స్లాబ్ టెక్నిక్ ఉపయోగించాం. వర్షపు నీటిని నిల్వ చేయడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్, కరెంటుకోసం సోలార్ ప్యానెల్స్ పెట్టాం. ఈ మట్టి సౌధంలో 5బెడ్ రూమ్‌లు, మూడు బాల్కనీలు, మూడు లివింగ్ స్పేస్‌లు ఉన్నాయి. ఇప్పటివరకు రెండు వందల మందికి పైగా పర్యాటకులు ఈ హోమ్ స్టేలో బస చేశారు. ఆహారం కూడా తమిళనాటప్రాంంతాల వారీగా విలసిల్లిన విభిన్నమైన రుచులుంటాయి. ఇంటి ఆవరణలో అన్ని రకాల కూరగాయలనూ పండిస్తాం. వంటగదిలో వచ్చే వ్యర్థాలనే ఎరువుగా వేస్తాం’’ అని తమ పర్యావరణ హిత భవనం ముత్తు నందిని ప్యాలెస్ గురించి వివరించింది జయలక్ష్మి. -
అంగన్వాడీలపై సానుకూలం
సాక్షి, అమరావతి: అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల సమస్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన దృష్టికి వచ్చిన వాటిని సంబంధిత శాఖ ద్వారా పరిశీలించి పలు అంశాల పట్ల సానుకూల నిర్ణయం తీసుకుంది. సంబంధిత యూనియన్లతో విస్తృతంగా చర్చించిన అనంతరం మేలు చేసేలా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలను తీసుకున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి జి.జయలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చర్చల ద్వారా పలు అంశాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. అంగన్వాడీల సమ్మె కారణంగా అత్యంత అణగారిన వర్గాలకు చెందిన బాలింతలు, పసిపిల్లలు, చిన్నారులు, గర్భిణులకు అందిస్తున్న పౌష్టికాహారం నిలిచిపోయే ప్రమాదం ఉన్నందున వెంటనే ఆందోళన విరమించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. లేని పక్షంలో విధులకు గైర్హాజరైనట్లుగా భావించి సంబంధించిన జీవోల ప్రకారం కలెక్టర్లు చర్యలు తీసుకుంటారని పేర్కొంది. ఆమోదం తెలిపిన అంశాలివీ.. ♦ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల గరిష్ట వయో పరిమితిని 62 ఏళ్లకు పెంచాలని నిర్ణయం. ♦ అంగన్వాడీ కార్యకర్తలకు తమ సర్వీసు చివరి నాటికి బెనిఫిట్ ఇప్పుడున్న రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచేందుకు నిర్ణయం. ♦ హెల్పర్లకు సర్వీసు చివరి నాటికి బెనిఫిట్ రూ.20 వేల నుంచి రూ.40 వేలకు పెంచుతూ నిర్ణయం. ♦ సహాయకులకు అంగన్వాడీ కార్యకర్తలుగా అవకాశం కల్పించేందుకు గరిష్ట వయో పరిమితి 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచేందుకు అంగీకారం. ♦ టీఏ, డీఏలు రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి విడుదల చేయడానికి ఆమోదం. ♦ రాష్ట్రంలో అవకాశం ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చేందుకు నిర్ణయం. మేలు చేసిన సీఎం జగన్ ♦ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు మేలు చేస్తూ పలు చర్యలు తీసుకుంది. అందులో కొన్ని ఇవీ.. గత అసెంబ్లీ ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు వరకూ టీడీపీ హయాంలో అంగన్వాడీల జీతం నెలకు రూ.7 వేలు మాత్రమే. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అంగన్వాడీల జీతాలను పెంచుతూ జీఓ 18 జారీ చేసింది. అంగన్వాడీల జీతాలను రూ.11,500కి పెంచుతూ 2019 జూన్ 26న జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేసింది. గత నాలుగేళ్లుగా పెంచిన వేతనం అమలవుతోంది. ♦ అంగన్వాడీ కార్యకర్తలతోపాటు మినీ అంగన్వాడీ వర్కర్లకు కూడా గత ఎన్నికలకు 6 నెలల ముందు వరకూ రూ.4,500 మాత్రమే ఉన్న జీతాన్ని సీఎం జగన్ రూ.7 వేలకు పెంచారు. ♦ సహాయకులకు గత ఎన్నికలకు ముందు వరకు రూ.4,500 మాత్రమే ఉన్న జీతాన్ని సీఎం జగన్ రూ.7 వేలకు పెంచారు. వీటిని జీవో 18 ద్వారా ప్రభుత్వం వెంటనే అమల్లోకి తెచ్చింది. ♦ టీడీపీ హయాంలో 2019 వరకూ అంగన్వాడీ కార్యకర్తలకు సగటున రూ.6,950, అంగన్వాడీ సహాయకులు, మినీ అంగన్వాడీ కార్యకర్తలకు సగటున రూ.3,900 మాత్రమే చెల్లించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరి జీతాలు పెంచి అందించింది. ♦ మంచి పనితీరు కనబర్చిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు రూ.500 చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. ఏడాదికి సుమారు రూ.27.8 కోట్లు ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం చెల్లిస్తోంది. ♦ 2013 నుంచి అంగన్వాడీలకు పదోన్నతులు (ప్రమోషన్లు) ఇవ్వలేదు. గత సర్కారు దీన్ని పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే ప్రమోషన్లు ఇచ్చింది. 560 గ్రేడ్–2 సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేసింది. ♦ సూపర్వైజర్ పోస్టుల పరీక్షలు రాసే వారి వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ వారికి అనుకూల నిర్ణయం తీసుకుంది. తొమ్మిదేళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి వయో పరిమితి పెంపు ఎంతో ఉపయోగపడింది. ♦ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులను అర్హులుగా గుర్తించి రూ.1,313 కోట్లు అందించింది. జగనన్న విద్యాదీవెన, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ రైతు భరోసా, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ తదితర పథకాలను వారికీ వర్తింపజేసింది. రూ.85.47 కోట్లతో 56,984 స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసి వారికి అందించింది. డేటా ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తూ అదనంగా డేటా కూడా ఇస్తోంది. 2023 జూలై 1 నుంచి ఇది అమలవుతోంది. డేటా కోసం ఏడాదికి రూ.12 కోట్లు చెల్లిస్తోంది. ♦ ఈ ఏడాది నుంచి వర్కర్లు, హెల్పర్లకు జీవిత బీమాను వర్తింపచేస్తూ ప్రమాద బీమాగా రూ.2 లక్షల వరకూ చెల్లిస్తోంది. ♦ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు రూ.16 కోట్ల విలువైన యూనిఫాం శారీలు అందించింది. నాడు–నేడు ద్వారా అంగన్వాడీల్లో సౌకర్యాలను మెరుగుపరుస్తోంది. ♦ గర్భిణులు, బాలింతలు, పిల్లలకు హోం రేషన్ పద్ధతిని అమలు చేస్తోంది. 2023 నుంచి డ్రై రేషన్ అందిస్తోంది. -
కొత్తవాళ్లతో సినిమా పెద్ద బాధ్యత
‘‘మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌లో ఇప్పటివరకు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలింస్ చేశాం. తొలిసారి ఫీచర్ ఫిల్మ్ప్రారంభించాం. ఇంతమంది కొత్తవాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను’’ అన్నారు నిహారిక కొణిదెల. యదు వంశీ దర్శకత్వంలో నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పీ, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్‌పై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్న చిత్రం శుక్రవారంప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నటుడు నాగబాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో వరుణ్ తేజ్ క్లాప్ కొట్టారు. డైరెక్టర్ వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ని యూనిట్‌కి అందించారు. యదు వంశీ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ద్వారా 11 మందిని హీరోలుగా, నలుగురిని హీరోయిన్లుగా పరిచయం చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంతో నేను, నా సతీమణి జయలక్ష్మి నిర్మాతలుగా పరిచయమవుతున్నాం’’ అన్నారు శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ అధినేత ఫణి. ఈ చిత్రానికి కెమెరా: రాజు ఎడురోలు, సంగీతం: అనుదీప్ దేవ్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: మన్యం రమేశ్. -
చెత్తబండి నడుపుతుంది.. అమెరికా వెళ్లొచ్చింది.. జయలక్ష్మి ఒక స్పూర్థి
మూసారాంబాగ్ సమీపంలోని సలీం నగర్లో తెల్లవారుజామున ‘చెత్తబండొచ్చిందమ్మా’ అని అరుస్తూ కనిపిస్తుంది జయలక్ష్మి. డిగ్రీ చదువుతూ తల్లి నడిపే చెత్తబండిలో సాయం చేస్తుంది జయలక్ష్మి. ‘ఎదగాలనుకుంటే చెత్త నుంచి కూడా ఎదగొచ్చు’ అంటుందా అమ్మాయి. తాను నివాసం ఉండే మురికివాడ పిల్లల కోసం ట్యూషన్లు చెబుతూ, వాలంటీర్‌గా పని చేస్తూ,ప్రతిష్ఠాత్మక ‘గాంధీ – కింగ్ స్కాలర్లీ ఎక్స్చేంజ్ ఇనిషియేటివ్’లో భాగంగా జూన్‌లో అమెరికా వెళ్లి వచ్చింది జయలక్ష్మి. చిన్న చితకా సవాళ్లకే డీలా పడుతున్న యూత్‌కు జయలక్ష్మి ఇచ్చే స్ఫూర్తి చాలానే ఉంది. యునైటెడ్ స్టేట్స్– ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (యు.ఎస్.ఐ.ఇ.ఎఫ్) వారి ‘గాంధీ– కింగ్ ఎక్స్చేంజ్ ఇనిషియేటివ్’ స్కాలర్షిప్ పొంది, అమెరికా వెళ్లి రెండు వారాల పాటు మార్టిన్ లూధర్ కింగ్ మార్గంలో అహింసా పద్ధతితో ప్రజా ఉద్యమాలు ఎలా నిర్వహించాలో అధ్యయం చేసి రావడానికి దరఖాస్తులు కోరినప్పుడు మన దేశవ్యాప్తంగా 4 వేల అప్లికేషన్లు వచ్చాయి. వారిలో కేవలం 10 మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. ఆ పది మందిలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు ఉన్నారు. వారిలో ఒకరు అరిపిన జయలక్ష్మి. హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ సమీపంలో అతి పెద్ద మురికివాడ– సింగరేణి కాలనీలో ఉంటూ, చెత్త బండి లాగుతూ చదువుకుంటున్న ఈ అమ్మాయి ఇలా అమెరికా వరకూ చేరుకోవడం సామాన్యం కాదు. పోరాడే తత్వం, సాధించాలనే పట్టుదల ఉండటం వల్లే ఇది సాధ్యమైంది. జయలక్ష్మిలోని అసాధారణమైన చొరవ, తపన ఆమెను ఇలా ముందుకు నడుపుతున్నాయి. Dear Aripina Jayalakshmi @j_aripina Congratulations to you for This Changemaker Award you Received in Delhi!💐 Telangana Bidda we are proud of you!!🌹@KTRTRS @trspartyonline #JaiTelangana pic.twitter.com/lTZhxJ6E8n — (A*R) (@iNTeLHyd) July 11, 2022 ముగ్గుపిండి అమ్మే దళిత కుటుంబం అరిపిన జయలక్ష్మిది రాయలసీమ ప్రాంతానికి చెందిన దళిత కుటుంబం. తండ్రి రామ్మోహన్, తల్లి హుసేనమ్మ చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని హైదరాబాద్ వలస వచ్చారు. వీరి ఇళ్లల్లో ముగ్గుపిండి అమ్ముకుని తరాలుగా జీవనం సాగిస్తున్నారు. అయితే జయలక్ష్మి తల్లిదండ్రులు చెత్తబండి నడపడాన్ని ఉపాధి చేసుకున్నారు. ‘అమ్మ ఒక బండి, నాన్న ఒక బండి నడుపుతారు. కాలనీ వాళ్లు నెలకు ఇంతని ఇచ్చే డబ్బులే మాకు జీవనాధారం. గవర్నమెంట్ నుంచి ఏమీ జీతం రాదు. చెత్త తీయడం చాలా కష్టమైన పని. నాన్న తానొక్కడే చెత్త తీయగలిగినా అమ్మకు కష్టమని నేను ఏడో క్లాస్ నుంచి ఇవాళ్టి వరకూ ఆమెకు తోడు వెళుతూనే ఉన్నాను. చెత్త సేకరించడం, తడిచెత్త పొడిచెత్త వేరు చేయడం, డంపింగ్ యార్డ్‌లో పడేయడం అన్నీ చేస్తాను. ఇది చాలా దారుణమైన పని అని కొందరు అంటారు. కాని నా మటుకు నాకు ఇది అన్నం పెట్టే వృత్తి. నేను దానిని గౌరవిస్తాను. మా ఇంట్లో నేను కాకుండా అన్నయ్య, చెల్లెలు ఉన్నారు. అందరూ మంచిగా చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడాలని మా అమ్మ తపన. అంతవరకు ఈ పని చేయకతప్పదు’ అంటుంది జయలక్ష్మి. Since this young lady from a Hyderabad slum community told me in a class of peers aged 13 who aspired for worthy professions as nurses, teachers & police how she WOULD one day be an IAS officer (turning many heads) I have followed her achievements in awe. Every wish @j_aripina! https://t.co/V1X47W2i1t — Dr Andrew Fleming 🇬🇧 🏴 (@Andrew007Uk) August 23, 2023 ఎన్.జి.ఓ దృష్టిలో పడి జయలక్ష్మి చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండేది. కాలనీలోని సమస్యలపై మాట్లాడేది. స్కూల్లో ఒకసారి ఇలాగే మాట్లాడితే ‘మాంట్‌ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్’ అనే ఎన్.జి.ఓ దృష్టిలో పడింది. పేదవర్గాల కోసం పని చేసే ఆ సంస్థ జయలక్ష్మిని తన కార్యకలాపాల్లో భాగం చేస్తూ ప్రోత్సహించింది. ‘స్లమ్స్‌లో ఉండే పిల్లల వికాసం కోసం నేను పని చేశాను. హైదరాబాద్‌లో 56 స్లమ్స్ ఉంటే వాటిలో 21 చోట్ల అంగన్వాడీ కేంద్రాలు లేవు. మేమందరం మహిళా సంక్షేమ శాఖ దగ్గరకు వెళ్లి మాట్లాడి వాటిని సాధించాం’ అంటుంది జయలక్ష్మి. ఇంగ్లిష్ మీడియంలో చదవాలనుకుని తన వాడ నుంచి నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకున్న జయలక్ష్మి తన వాడలోని పిల్లలకు సాయంత్రాలు ట్యూషన్ చెప్తూ వారి చదువుకు మేలు చేస్తోంది. ‘కోవిడ్ సమయంలో మా కాలనీలో నేను కార్యకర్తగా పని చేశాను. కోవిడ్ రాకుండా చాలా వరకు సక్సెస్ అయ్యాను’ అంది. ఐ.ఏ.ఎస్ కావాలని ‘యువతకు నాయకత్వ లక్షణాలు ఉండాలి. హక్కుల కోసం పోరాడాలి. అమెరికాలో శాంతియుత పోరాటాల విజయగాథలను అధ్యయనం చేయగలగడం నా అదృష్టం. ఒక యువ ప్రతినిధిగా పోరాడుతూనే ప్రజల సేవ కోసం ఐ.ఏ.ఎస్ సాధించాలనుకుంటున్నాను. అందుకు కావలసిన సహాయం పొందగలననే అనుకుంటున్నాను. నాకు ఎంతమంచి పేరున్నా చెత్త అమ్మాయి అనే పిలుస్తారు కొందరు. వారి చేత ఉత్తమ అమ్మాయి అనిపించుకునేందుకు, లక్ష్యం లేని వారి బుర్రలే చెత్త అని నిరూపించేందుకు మరింత కష్టపడతాను’ అంది జయలక్ష్మి. – సాక్షి ఫీచర్స్ డెస్క్ In 5 years in Hyderabad this young lady is one of the most inspiring people I met. She turned every head in the room in 2018 when at an event she announced her intention to be an IAS Officer. I pray she succeeds - she is a true #changemaker full of only kindness & good intent. https://t.co/5khoCxNjjj — Dr Andrew Fleming 🇬🇧 🏴 (@Andrew007Uk) December 11, 2022 -
రాకేష్ మరిన్ని సినిమాలు చేయాలి
‘జబర్దస్త్’ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ప్రారంభోత్సవం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. తొలి సన్నివేశానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి కెమెరా స్విచ్చాన్ చేయగా, తెలంగాణ ఎంపీ (రాజ్యసభ) సంతోష్ కుమార్ క్లాప్ ఇచ్చారు. నటుడు తనికెళ్ల భరణి గౌరవ దర్శకత్వం వహించగా, నటుడు సాయికుమార్ మేకర్స్‌కి స్క్రిప్ట్ అందజేశారు. గ్రీన్ ట్రీ ప్రోడక్షన్స్ పతాకంపై జయలక్ష్మీ సాయి కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ అంజి దర్శకత్వం వహిస్తుండగా, అనన్యా నాగళ్ల హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాప్రా రంభోత్సవంలో రోజా మాట్లాడుతూ– ‘‘రాకేష్‌కి ఎప్పట్నుంచో లీడ్ రోల్ చేయాలని ఉంది. ఈ సినిమాతో అది నెరవేరడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా విజయం సాధించి, భవిష్యత్‌లో రాకేష్ మరిన్ని సినిమాలు చేసి, ప్రజలకు వినో దాన్ని పంచాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.‘‘నటుడిగా, నిర్మాతగా రాకేష్ మరెన్నో సినిమాలు చేసి, మంచి పేరు తెచ్చుకోవాలి’’ అన్నారు ఎంపీ సంతోష్ కుమార్. ‘‘చిన్న సినిమాలు పెద్దగా అవుతున్నాయి. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించి, రాకేష్ మరో పది సినిమాలు చేసే స్థాయికి రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు తనికెళ్ల భరణి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు సంగీతం: చరణ్ అర్జున్. -
కే. విశ్వనాథ్ సతీమణి మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
దివంగత దర్శకుడు, కళాతపస్వి కే. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి (86) మృతి పట్ల ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. కళాతపస్వి కన్నుమూసిన 24 రోజులకే ఆమె మృతి చెందడం గమనార్హం. గుండెపోటుతో ఆమె కన్నుమూశారు. కాగా.. ఫిబ్రవరి 2వ తేదీన వృద్ధాప్యరిత్యా సమస్యలతో దర్శకదిగ్గజం కాశీనాధుని విశ్వనాథ్(92) కన్నుమూశారు. అయితే.. ఆయన మృతి చెందినప్పటి నుంచి జయలక్ష్మి తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం గుండెపోటు రావడంతో మరణించారు. విశ్వనాథ్‌కు 20 ఏళ్ల వయసున్నప్పుడు జయలక్ష్మితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. ఎవరూ సినీ పరిశ్రమలోకి ప్రవేశించలేదు. అలాగే.. తన భార్య తనతో ఎప్పుడూ సినిమాల గురించి చర్చించేది కాదని, సినిమాలను కూడా విశ్లేషించేది కాదని తరచూ ఇంటర్వ్యూలలో ఆయన చెప్పారు కూడా. -
కళాతపస్వి కన్నుమూసిన వార్డులోనే ఆయన భార్య కూడా..
టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణవార్త మరువకముందే ఆయన సతీమణి జయలక్ష్మి(86) అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. విశ్వనాథ్ మరణంతో పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన ఆమె అప్పటి నుంచి అస్వస్థతకు లోనయ్యారు. గత కొద్దిరోజులుగా అపోలో ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం 6.15 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. తండ్రి విశ్వనాథ్ కన్నుమూసిన వార్డులోనే తమ తల్లి జయలక్ష్మి కూడా మరణించడం దురదృష్టకరమని కుటుంబసభ్యులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం పంజాగుట్ట స్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా ఈ నెల 2న కె.విశ్వనాథ్ శివైక్యమయ్యారు. విశ్వనాథ్-జయలక్ష్మిలకు పద్మావతి దేవి, కాశీనాథుని నాగేంద్రనాథ్, కాశీనాథుని రవీంద్రనాథ్ ముగ్గురు సంతానం. చదవండి: విశ్వనాథ్ సతీమణి కన్నుమూత -
కే. విశ్వనాథ్ సతీమణి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. దివంగత డైరెక్టర్ ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్ సతీమణి కాశీనాథుని జయలక్ష్మి(88) ఇకలేరు. ఆదివారం సాయంత్రం 5:45 గంటలపైన ఆమె తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంచానికే పరిమితమయ్యారు. భర్త విశ్వనాథ్ మరణం తర్వాత మరింత అనారోగ్యానికి గురయ్యారు జయలక్ష్మి. ఈ క్రమంలోనే ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అక్కడే ఆమె తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని కైకలూరు జయలక్ష్మి స్వస్థలం. 1935లో వినాయక చవితి రోజున జన్మించారామె. ఆమె అన్నయ్య చదువు కోసం వారి కుటుంబం బందరుకి మారింది. అక్కడి లేడీ యాంథల్ మిషనరీ స్కూల్లో చదివారు జయలక్ష్మి. ఆమె పదో తరగతి చదువుతున్నప్పుడే పద్నాలుగేళ్లకే కె.విశ్వనాథ్‌తో 1948 అక్టోబర్ 2న వివాహం జరిగింది. ఆ తర్వాత మద్రాసులో కాపురం పెట్టారు విశ్వనాథ్–జయలక్ష్మి దంపతులు. వారికి ముగ్గురు సంతానం. పద్మావతి దేవి, కాశీనాథుని నాగేంద్ర నాథ్, కాశీనాథుని రవీంద్రనాథ్. ఈ నెల 2న కె.విశ్వనాథ్ కన్నుమూశారు. ఆయనతో 75 ఏళ్ల వైవాహిక జీవితం గడిపారు జయలక్ష్మి. కె.విశ్వనాథ్ మరణించినప్పటి నుంచి ఆయన మీద ఉన్న ప్రేమతో ఆమె తీవ్ర మనో వేదనకు గురై, ఆరోగ్యం మరింత క్షీణించటంతో తుదిశ్వాస విడిచారు. ఆమె పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి ఫిలింనగర్‌లోని ఇంటికి తరలించారు. విశ్వనాథ్ చనిపోయిన 24 రోజులకే జయలక్ష్మి కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. జయలక్ష్మి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కె.విశ్వనాథ్ తుదిశ్వాస విడిచిన వార్డులోనే జయలక్ష్మి కూడా కన్నుమూయటం దురదృష్టకరమని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం పంజాగుట్ట స్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. వైఎస్ జగన్ సంతాపం జయలక్ష్మి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. -
ఏం జరిగిందో.. ఏ కష్టం వచ్చిందో..?
సాక్షి, ఇచ్ఛాపురం (శ్రీకాకుళం): ఏం కష్టం వచ్చిందోగాని వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన మున్సిపాలిటీ పరిధి రత్తకన్న గ్రామం సంతోషం వీధిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకోగా.. ఈది జయలక్ష్మి (21) ప్రాణాలు తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. జయలక్ష్మికి గత ఏడాది మే నెలలో ఒడిశా రాష్ట్రంలోని కోటిలింగి గ్రామానికి చెందిన మంచాల పితాంబర్‌తో వివాహమైంది. ఈమె తల్లిదండ్రులు చంద్రమ్మ, మోహనరావులు కొన్నేళ్ల క్రితం వివిధ ప్రమాదాల్లో మృతి చెందడంతో సోదరి, సోదరులు ఈది నాగమ్మ, రామయ్యలవద్ద పెరిగింది. ఈమె ఆదివారం సాయంత్రం అత్తవారింటి నుంచి కన్నవారిల్లైన సోదరింటికి వచ్చింది. అయితే ఏం జరిగిందోగాని.. సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో వంటగదిలో సీలింగ్ హుక్‌కి ఉరివేసుకొని మృతి చెందింది. చదవండి: (యువతిపై అత్యాచారం, హత్య.. కట్టెల కోసమని అడవిలోకి వెళ్లగా..) ఇంటికి వచ్చిన సోదరి హుక్‌కి వేలాడుతున్న జయలక్ష్మిని చూసి కేకలు వేయడంతో సమీపంలో ఉన్నవారు అక్కడకు చేరుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని సోదరి నాగమ్మ ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్ఐ వి.సత్యనారాయణ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
నేను జయలలిత కుమార్తెనే.. అమ్మ కంటే ఆస్తి పెద్దది కాదు: జయలక్ష్మి
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జీవించి ఉన్నప్పుడే కాదు గతించిన తరువాత కూడా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. జయ కుమార్తెను అని చెప్పుకుని గతంలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు హడావిడి చేసి.. ఆ తరువాత మిన్నకుండి పోయారు. ఈ క్రమంలో తాజాగా మరో మహిళ తెరపైకి వచ్చారు. తగిన ఆధారాలతో జయ కుమార్తెను అని త్వరలో నిరూపించుకుంటానని చెన్నైలో శనివారం స్పష్టం చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: జీవితాంతం కుమారిగానే మెలిగిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఒక కుమార్తె ఉందని దశాబ్దాల తరబడి ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని జయ ఏనాడు ఖండించలేదు. అలాగని సమర్ధించనూ లేదు. జయ మరణం తరువాత తమను వారసులుగా గుర్తించాలంటూ ఆమె అన్న కుమార్తె దీప, కుమారుడు దీపక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అదే సమయంలో బెంగళూరు, మైసూరు నుంచి వేర్వేరుగా ఇద్దరు యువతులు, ఓ యువకుడు వచ్చారు. కొన్నాళ్లు పోరాడారు. అయితే వారి వాదన పెద్దగా నిలవక పోవడంతో తెరమరుగై పోయారు. నేనే జయ కుమార్తెను..: ఇదిలా ఉండగా, తాజాగా మరో మహిళ తెరపైకి వచ్చింది. చిన్నపాటి మందీ మార్బలంతో శనివారం సాయంత్రం చెన్నై మెరీనాబీచ్‌లోని జయ సమాధి వద్దకు చేరుకుని ఆమె నివాళులర్పించారు. సమాధికి ప్రదక్షిణ చేసి కన్నీరు పెట్టుకున్నారు. ఆమె హావభావాలు, కట్టూబొట్టూ, బాడీ లాంగ్వేజ్ అంతా జయను పోలినట్లుగా ఉండడంతో పరిసరాల్లోని వారు ఆశ్చర్యంగా అనుసరించారు. అనంతరం ఆమె మీడియా ప్రతినిధుల వద్ద జయ కుమార్తెగా పరిచయం చేసుకున్నారు.. ‘‘మాది మైసూరు. చెన్నై పల్లవరంలో స్థిరపడ్డాను. చాలా ఏళ్ల క్రితమే నేను జయ కుమార్తెను అని తెలుసు. అయితే ఇష్టం లేక, కొన్ని సమస్యల వల్లనే ఇన్నేళ్లూ బాహ్య ప్రపంచంలోకి రాలేదు. అమ్మ కంటే ఆస్తి పెద్దది కాదు, అందుకే అప్పట్లో రాలేదు. అమ్మను కోల్పోయిన షాక్ నుంచి బయటకు వచ్చేందుకు ఇంత సమయం పట్టింది. చదవండి: (Heavy Rains: మరో ఐదు రోజులు కుండ పోతే!) చెన్నై పోయస్ గార్డెన్ ఇంటిలో మొదటిసారి అమ్మతో మాట్లాడాను. ఆ తరువాత అపోలో ఆసుపతిలో కలిశాను. అమ్మ పీఏ అపోలో ఆసుపత్రి వెనుకమార్గం గుండా లోనికి తీసుకెళ్లారు. అమ్మతో నేరుగా మాట్లాడాను. చెక్కిలిపై ఆమె ముద్దు పెట్టుకుంది. ఉద్వేగానికి లోనై ఇద్దరం కన్నీరు పెట్టుకోవడంతో బేబీని తీసుకెళ్లండని అక్కడి సిబ్బందికి చెప్పింది. దీప, దీపక్ నాతో మాట్లాడేందుకు యత్నించారు, అయితే ఇష్టం లేక దూరంగా మెలిగాను. ఇప్పటికే కొందరు జయ కుమార్తెలు అని వచ్చారు, అయితే అందరికీ ఆమె అమ్మ కాలేదు కదా.. వారు ఫేక్ అని రుజువైంది కదా. జయ కుమార్తెను అని వైద్యపరంగా కూడా నిరూపణకు అన్ని ఆధారాలు ఉన్నందునే ఈరోజు ధైర్యంగా మాట్లాడుతున్నాను. మంచి రోజు చూసి మీడియా వద్ద బహిరంగ పరుస్తాను. మైసూరులో నన్ను పెంచిన వారు ఇటీవలే మరణించారు. నాకు ఇప్పటికీ చిన్నమ్మ శశికళ మాత్రమే అండగా ఉంది. చిన్నమ్మతో కూడా ఇంకా మాట్లాడలేదు. మూడు నాలుగు రోజుల్లో శశికళను కలుస్తాను. అపాయింట్మెంట్ కూడా ఆమె ఇచ్చారు. రాజకీయాల గురించి ఇప్పుడు ప్రశ్నలు వేయవద్దు, త్వరలో రాజకీయం గురించి అన్ని విషయాలు చెబుతాను. నా పేరు ప్రేమ, అమ్మ నన్ను జయలక్ష్మి అని ముద్దుగా పిలుచుకునేది’’ అని ఆమె వివరించింది. -
‘నమ్మభూమి’ని నమ్ముకొంది
చెన్నైకు చెందిన జయలక్ష్మి, పెళ్లి తర్వాత భర్తతో కలిసి పద్నాలుగేళ్లపాటు కెనడాలో ఉంది. కొన్ని కారణాలతో 1992లో ఇండియా తిరిగి వచ్చింది. తన కూతురుకు ఫుడ్ అలెర్జీలు ఎదురవుతుండడంతో, రసాయనాలు వాడకుండా పండించిన కూరగాయలు ఎక్కడ దొరుకుతాయని స్థానిక మార్కెట్లన్నింట్లోనూ వెదికింది. కానీ సేంద్రియ కూరగాయలు ఎక్కడా దొరకలేదు. దీంతో తనే సేంద్రియ పద్ధతిలో కూరగాయల్ని పండించాలనుకుంది. ఆమె కోరిక తెలిసిన జయలక్ష్మి కజిన్ తనకున్న పది ఎకరాల పొలంలో ఐదెకరాలను సేంద్రియ వ్యవసాయం చేసుకోమని ఇచ్చింది. ఐదెకరాల భూమిలో వరి, ఆకుకూరలు, ములక్కాడలు పండించడం ప్రారంభించింది. అయితే దిగుబడి పెద్దగా వచ్చేది కాదు. మరోపక్క జయలక్ష్మి భర్తకు హార్ట్ ఎటాక్ రావడం, కోమాలోకి వెళ్లడంతో పలుమార్లు సర్జరీలు చేశాక కానీ ఆయన కోలుకోలేదు. భర్త వైద్యానికి ఖర్చు, పంట దిగుబడి సరిగా లేక నష్టాలు చవి చూడడం, దానికి తోడు జయలక్ష్మి దగ్గర అప్పు తీసుకున్న వారు తిరిగి ఇవ్వక పోవడంతో ఆర్థికంగా బాగా చితికిపోయింది. దీంతో సేంద్రియ వ్యవసాయం వదిలేసి కుటుంబంతో తిరిగి కెనడాకు వెళ్లిపోదామనుకుంది. కానీ ఆరోగ్య కారణాల దృష్ట్యా ఇండియాలోనే ఉండిపోయింది. ∙ పెట్టుబడిలేని వ్యవసాయం.. రకరకాల సమస్యలతో కృంగిపోయిన జయలక్ష్మికి 2002లో రామకృష్ణ ఆశ్రమ మిషన్ స్కూల్లో పనిచేస్తోన్న డాక్టర్ షణ్ముగ సుందరం.. పెట్టుబడి లేని సేంద్రియ వ్యవసాయం ఎలా చేయవచ్చో చెప్పే వర్క్‌షాపును పరిచయం చేసి జీవితం మీద ఆశను చిగురింపచేశారు. షణ్ముగానికి ఉన్న 30 ఎకరాల్లో మూడెకరాల పొలాన్ని ఇచ్చి వ్యవసాయం చేసుకోమనడంతో... జయలక్ష్మి ఆ పొలంలో ఈసారి వరి మాత్రమే పండించడం మొదలుపెట్టింది. దిగుబడి బాగుండడంతో క్రమంగా మరో పది ఎకరాలకు వ్యవసాయాన్ని విస్తరించి... మూలికా మొక్కలు, మెంతికూర, పాలకూర వంటి ఆకు కూరలు, ములక్కాడ, మామిడి, జామ, సపోటా వంటి పండ్ల చెట్లను కూడా పెంచింది. ఇక్కడ వరకు అంతా సాఫీగా సాగినప్పటికీ పండిన పంటను లాభసాటిగా ఎలా విక్రయించాలో తనకి తెలియలేదు. ఈ సమయంలో.. నగరంలో 300 అపార్టుమెంట్లలో సేంద్రియ కూరగాయలు, ఆర్గానిక్ వేస్ట్‌ను కంపోస్టుగా ఎలా తయారు చేయవచ్చో వర్క్‌షాపులు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తోన్న ఆరుల్ ప్రియను ఆమెకు షణ్ముగం పరిచయం చేశారు. ఆరుల్ జయలక్ష్మిని కలిసి ఆమె కష్టాల గురించి తెలుసుకుని సలహాలు ఇచ్చేది. ఈ క్రమంలోనే వీరిద్ద్దరు కలిసి ‘నమ్మ భూమి’ పేరుతో ఎకో ఫ్రెండ్లి ఉత్పత్తులను విక్రయించేవారు. నమ్మ అంటే తమిళంలో మన అని అర్థం. 2010 నుంచి జయలక్ష్మి పొలంలో పండించిన రసాయనాలు లేని కూరగాయలను ఇంటింటికి తిరిగి అమ్మేది. అలా అమ్ముతూ ఏడేళ్లలో పట్టణంలోని కస్టమర్లకు తన కూరగాయలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. అలా గత కొన్నేళ్లుగా సేంద్రియ కూరగాయలను దేశంలోని ఇతర ప్రాంతాలు, ఉత్తరాఖండ్, కశ్మీర్ ప్రాంతాలకు పంపిస్తున్నారు. వ్యవసాయంలో కొత్తకొత్త పద్ధతులను అనుసరిస్తూ లాభాలు పొందుతున్నారు. ఒక పక్క కస్టమర్లకు అవగాహన కల్పిస్తూ సేంద్రియ వ్యవసాయం చేయమని ఇతర రైతులను ప్రోత్సహిస్తున్నారు. -
పెలికాన్ @ తెలినీల్లాపురం
సాక్షి, హైదరాబాద్: కొన్ని పక్షులు ప్రపంచమంతా ప్రయాణం చేస్తాయి. కొందరు పక్షి ప్రేమికులు పక్షుల కోసం ప్రపంచం అంతా ప్రయాణాలు చేస్తారు. టూర్లందు బర్డ్ వాచింగ్ టూర్లు వేరయా.. అన్నట్టుగా వీరి అనుభవాలు ఉంటాయి. నగరానికి చెందిన జయలక్ష్మి.. తాను చేసిన ఓ టూర్ గురించి చెప్పిన విశేషాలు వింటే.. పక్షుల కిలకిలరావాలు మదిలో ప్రతిధ్వనిస్తాయి. తాను వెళ్లిన వలస పక్షుల కేంద్రం గురించి జయలక్ష్మి పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే.. సైబీరియా నుంచి వచ్చే చుట్టాలు.. ఏటా మన దగ్గరకు వచ్చి పిల్లలకు రెక్కలు వచ్చాక తీసుకు వెళ్లిపోతాయి. పుట్టింటికి ఆడపిల్ల వచ్చినట్లు, పుట్టింటి వాళ్లను సంతోషపెట్టినట్లు ఊరంతటినీ అలరిస్తాయి పెలికాన్(గూడబాతు), పెయింటెడ్ స్టార్క్(ఎర్ర జడ పిట్ట). ఈ వలస పక్షులు సైబీరియా నుంచి తెలుగు రాష్ట్రానికి వస్తాయి. ఆ రావడం ఊరికే రావు. ఏరియల్ సర్వే చేస్తాయి. నీటి చెరువులు, దట్టమైన చెట్లు ఉన్న ప్రదేశాన్ని ఎంచుకుని మరీ విడిదికి సిద్ధమవుతాయి. అలా పదిహేనేళ్ల నుంచి శ్రీకాకుళంలోని తేలినీలాపురాన్ని కొత్త విడిదిగా మార్చుకున్నాయి వలస పక్షులు. తేలి నీలాపురం శ్రీకాకుళం జిల్లా, టెక్కలి మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరాన ఉంది. వైజాగ్– కోల్‌కతా రైల్వే లైన్లో నైపడ స్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరం. పెద్దగా ప్రచారానికి నోచుకుని ఈ అందమైన ప్రదేశం.. పక్షి ప్రేమికుల పాలిట స్వర్గధామం అనే చెప్పాలి. టెక్కలి పట్టణంలో బస చేసి తెల్లవారు జామునే బయలుదేరి తేలినీలాపురం బర్డ్ సాంక్చురీకి బయలు దేరితే గూడు వదిలి ఆహారానికి బయలుదేరే పక్షులు కనువిందు చేస్తాయి. ఆకాశంలో రెక్కలు విచ్చుకున్న పక్షుల తోరణాలను చూడాల్సిందే తప్ప వర్ణించలేం. ఆరు నెలల ఆవాసం.. చేపలే ఆహారం.. ఈ పక్షుల రాక ఏటా సెప్టెంబర్ నెలలో మొదలవుతుంది. అక్టోబర్ ఆఖరుకి పూర్తిగా వచ్చేస్తాయి. చెట్ల కొమ్మల మీద దట్టమైన గూళ్లు కట్టుకుని ఆరు నెలల ఆవాసానికి సిద్ధమైపోతాయి. గుడ్లు పెట్టి, పొదిగి, మార్చి నాటికి తిరుగు ప్రయాణమవుతాయి. ఏప్రిల్ ఆఖరుకి అన్ని పక్షులూ వెళ్లిపోతాయి. ‘ఈ పక్షులు ఇక్కడికే ఎందుకు వస్తున్నాయి’ అని ఓ స్థానికుడిని అడిగినప్పుడు అతడు చెప్పిన విషయాలు చాలా ఆశ్చర్యం కలిగించాయి. వాతావరణంతోపాటు ఆహారం సమృద్ధిగా ఉన్న చోటుకే తొలి ప్రాధాన్యం. మంచి చేపలు దొరికే ప్రదేశాన్ని ఎంపిక చేసుకుంటాయి. ఇవి ఇతర పక్షుల్లా గింజలను తినవు. పెద్ద పక్షులు ఒక్కోటి రోజుకు నాలుగు నుంచి ఆరు కిలోల చేపలను తింటాయి. తేలినీలాపురానికి చుట్టు పక్కల రెండున్న కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎనిమిది చెరువులు ఉన్నాయి. ఇక ఇక్కడ చింతచెట్లు ఎక్కువ. దాంతో పెద్ద గూళ్లు కట్టుకోవడానికి అనువుగా ఉంటాయి. అందుకే ఈ పక్షులు ఈ గ్రామానికి వస్తున్నాయని చెప్పాడు. ఎంపిక ఆడపక్షిదే ఏ పక్షితో జతకట్టాలనే నిర్ణయం ఆడపక్షిదే. ఒకసారి జత కట్టి గూడులో నివసించడం మొదలైన తర్వాత గుడ్లు పెట్టి, పొదిగి, పిల్లలను పోషించే వరకు ఆ పక్షుల సహచర్యం కొనసాగుతుంది. ఒక సీజన్‌కి అవి నాలుగు గుడ్ల వరకు పెడతాయి. అయితే వాటిలో పొదిగి పిల్లలయ్యేది సగం గుడ్లే. ఈ గుడ్లు పొదగడానికి పాతిక నుంచి ముప్పై రోజులు పడుతుంది. పెలికాన్లు గుడ్లను పొదగడంలో మగ–ఆడ పక్షులు రెండూ భాగం పంచుకుంటాయి. ఒక పక్షి గుడ్ల మీద ఉంటే మరో పక్షి ఆహారం తెస్తుంది. ఇవి ఆహారం కోసం ఉదయం ఏడు గంటలకే బయలుదేరి పది గంటలకు తిరిగి గూటికి చేరతాయి. మరో విడత మూడు గంటలకు వెళ్లి ఐదు గంటలకు గూళ్లను చేరతాయి. సూర్యుడి కిరణాలు నిట్టనిలువుగా పడుతున్నప్పుడు చూపు చెదురుతుంది. నీటిలో కదలాడే చేపల ఆనవాళ్లు దొరకడం కష్టం. అందుకే ఇలా టైమింగ్స్ సెట్ చేసుకున్నాయవి. వాచ్ టవర్ తేలినీలాపురం చిన్న గ్రామం. వలస పక్షుల సీజన్లో ఇళ్లకంటే పక్షుల గూళ్లే ఎక్కువగా కనిపిస్తాయి. నాలుగు వందలకు పైగా గూళ్లు ఉంటాయి. ఏడాదికి 500లకు పైగా పిల్ల పక్షులు ఇక్కడ పుట్టి సైబీరియాకు ప్రయాణమవుతాయని అంచనా. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కట్టిన 40 అడుగుల వాచ్ టవర్ ఉంది. ఈ టవర్ మీద నుంచి చూస్తే మన చుట్టూ పక్షులే. వాటి కువకువలు రకరకాలుగా ఉంటాయి. అవి చేసే శబ్దాల్లో తేడాలుంటాయి. పక్షుల కలయిక సందర్భంలో ఒక రకంగా, గుడ్లను పొదిగేటప్పుడు ఒక రకమైన శబ్దం, పిల్లలకు ఆహారం పెట్టేటప్పుడు మరో రకమైన శబ్దం చేస్తాయి. అవి వెళ్లిపోతుంటే తమ పిల్లలు వదిలిపోతున్నట్లు బాధగా ఉంటుందని చెప్పారు గ్రామస్తులు. ముక్కు పొడవు పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ పక్షులకు ముక్కు పొడవుగా ఉంటుంది. నీటి మీద ఎగురుతూ నీటి లోపలున్న చేపల జాడ పడతాయి. ఒక్కసారిగా నీటిలోకి దూరి ఈదుతూ వెళ్లి ముక్కుతో చేపలను పట్టుకొస్తాయి. చేపలతోపాటుగా వచ్చిన నీటిని వదిలేసి చేపలను మాత్రం గొంతుకు ఉన్న సంచిలో వేసుకుంటాయి. ఆ చేపలు గూటిలో ఉన్న పిల్లల కోసం. అలా పిల్ల పక్షులను 45 రోజులు పోషిస్తాయి. పెలికాన్ కానీ పెయింటెడ్ స్టార్క్ కానీ పేరుకు పక్షులే కానీ ఎంత బలంగా ఉంటాయంటే.. గుడ్ల మీద దాడి చేసిన ఒక మోస్తరు జంతువులను కూడా ముక్కుతో పొడిచి, కాళ్లతో తన్ని తరిమేస్తాయి. ఈ పక్షులు తొమ్మిది కిలోల బరువుంటాయి. రెక్కలు చాచాయంటే... ఆ చాచిన రెక్కల పొడవు రెండు నుంచి మూడున్నర మీటర్లు ఉంటుంది. పెద్ద పక్షులకు నీటిపాము దొరికిందంటే చాలు.. మనం కళ్లు మూసి తెరిచేలోపు ఒక్క గుటకలో మింగేస్తాయి. వీటి జీవితకాలం పదిహేను నుంచి పాతికేళ్లు. త్రేతాయుగపు శివలింగం తేలినీలాపురం టూర్లో భాగంగా ‘రావి వలస’ను కూడా కలుపుకోవచ్చు. ఇక్కడ ఉన్న శివలింగం ఇరవై రెండు అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడ స్వామి స్వయంభువుగా వెలిశాడని చెబుతారు. ఆ శివుడికి గుడి కట్టాలని టెక్కలి రాజు ముందుకొచ్చాడని, అప్పుడు శివుడు తనను గుడిలో బంధించవద్దని, తనను తాకిన గాలి గ్రామమంతటా వ్యాపించాలని చెప్పాడంటారు. ఇప్పుడు కూడా అక్కడ గుడి లేదు. కానీ శివలింగంపై భాగాన్ని చూడడానికి వీలుగు మెట్ల నిర్మాణం ఉంది. పై నుంచి పూజాదిక్రతువులు నిర్వహించుకోవచ్చు. రాముడు ఇక్కడ పర్యటించాడని, ఇక్కడి ఔషధ వృక్షాల గురించి అధ్యయనం చేయడానికి రాముడి ఆస్థాన వైద్యుడు ఇక్కడే ఉండిపోయాడని కూడా చెబుతారు. -
పల్నాడు ఫ్యాక్షన్ కోరలు పీకుతాం
సాక్షి, గుంటూరు : పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షన్ కోరలు పీకడానికి ప్రణాళిక రచించారు. పేకాట క్లబ్ షో ముగించేందుకు ముందస్తు కసరత్తు ప్రారంభించారు. పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టే బెల్ట్ షాపులకు ఉచ్చు బిగిస్తానని హెచ్చరిస్తున్నారు. శాంతి, భద్రతల పరిరక్షణ, మహిళలు, చిన్నారుల రక్షణే లక్ష్యమని, దీని కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఇటీవల గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆర్ జయలక్ష్మి చెబుతున్నారు. పోలీసుశాఖలో అవినీతిని సహించబోమని సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె హెచ్చరించారు. బెల్ట్ షాప్‌లు, పేకాట, క్రికెట్ బెట్టింగ్, గుట్కా, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడితే ఏ స్థాయి ఉద్యోగులనైనా వదిలే ప్రస్తకి లేదని తేల్చి చెప్పారు. పల్నాడులో సమస్యాత్మక గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయమని స్పష్టం చేశారు. వివరాలు ఆమె మాటల్లో.. జిల్లాలో అన్ని వర్గాల ప్రజలకు పోలీస్ శాఖపై నమ్మకాన్ని పెంపొందించడమే నా లక్ష్యం. పోలీస్ అంటే ప్రజల పక్షమని అంతా భావించేలా చర్యలు తీసుకుంటున్నాం. పోలీసులు ఏ ఒక్కరి ప్రయోజనాల కోసం పని చేయరని, అందరి కోసం ఉంటారనే విషయాన్ని ప్రజలు గుర్తించాలి. ఆరు నెలల్లో అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం. రూరల్ జిల్లాలో ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షనిజంపై సీరియస్‌గా దృష్టి సారించాం. గ్రామాల్లో గొడవలకు పాల్పడే వారిని గుర్తించి కఠినంగా వ్యవహరించడంతోపాటు ప్రజలంతా కలిసి మెలసి ఉండేలా అవగాహన కల్పిస్తాం. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. గతంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల పల్నాడులోని అనేక గ్రామాల్లో ప్రజల మధ్య రాజకీయ చిచ్చు రాజుకుంది. పోలీస్ అధికారులు కొందరు గతంలో వ్యవహరించిన తీరు ఇందుకు కారణం. అయితే ఇక నుంచి అది కుదరదు. పోలీసులు అవినీతి పాల్పడితే సహించం పోలీస్ అధికారులు అవినీతికి పాల్పడితే సహించేది లేదు. ఎవరి ఒత్తిళ్లు లేకుండా విధులు నిర్వహించొచ్చు. ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించాలి.హోంగార్డుæ నుంచి ఏఎస్పీ వరకూ ప్రతి ఒక్కరు పారదర్శకత కోసం కృషి చేయాలి. అందరూ ఫ్రెండ్లీ పోలీసింగ్ దిశగా అడుగులు వేయాలి. నిజాయితీగా పనిచేసే వారికి మద్దతుగా నిలుస్తాం. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు బెల్ట్ షాప్‌లు, పేకాట, క్రికెట్ బెట్టింగ్, గుట్కా, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదు. అందుకు సహకరించే పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. వీటిపై సమాచారం అందించాలనుకునే వారు నేరుగా నా నంబర్‌కు ఫోన్ చేసి చెప్పవచ్చు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. బెల్ట్ షాప్‌లకు మద్యం సరఫరా చేసే దుకాణాలను సీజ్ చేయడంతోపాటు నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. -
చెన్నైలో వ్యభిచార ముఠా గుట్టురట్టు
సాక్షి ప్రతినిధి, చెన్నై: సామాజిక మాధ్యమాల సాయంతో చెన్నైలో నడుస్తున్న భారీ సెక్స్ రాకెట్ బట్టబయలైంది. ఫేస్బుక్, వాట్సాప్‌ల ద్వారా యువకులకు వలవేస్తూ వ్యభిచార సామ్రాజ్యాన్ని నడుపుతున్న ఇద్దరు యువకులను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై అన్నానగర్‌లో నివసించే తమిళ సినీ, టీవీ సీరియల్ నటి జయలక్ష్మి ఇటీవల నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ‘రిలేషన్షిప్ డేటింగ్ సర్వీస్’ పేరుతో కొన్నిరోజులుగా 2 నంబర్ల నుంచి తన వాట్సప్‌కు అసభ్యకర సందేశాలు వస్తున్నాయని చెప్పారు. ‘మీరు డేటింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారా. మీతో రావడానికి వీఐపీలు సిద్ధం. రూ.30 వేలు మొదలుకుని రూ.3లక్షల వరకు చెల్లించేందుకు వారు సిద్ధంగా ఉన్నారు’ వంటి సందేశాలు వస్తున్నాయని దీనిపై చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు వ్యభిచార నిరోధక విభాగం పోలీసులు విచారణ చేపట్టి చెన్నై విరుగంబాక్కంలో ఉండే మురుగ పెరుమాన్, కవియరసన్ అనే యువకులే ఈ సందేశాలు పంపుతున్నట్లు తెలుసుకున్నారు. వీరిని అరెస్ట్ చేశారు. ఆ నటి రేటు రూ.40 లక్షలు అరెస్టయిన ఈ ఇద్దరి సెల్ఫోన్లను పరిశీలించి అందులోని ఫొటోలను చూసి పోలీసులు ఖంగుతిన్నారు. ప్రముఖ తమిళ నటీమణుల ఫొటోలు, వారి రేట్లు ఉన్నాయి. తమిళ సినిమారంగంలో పేరొందిన ఒక ప్రముఖ యువ నటి పేరు, ఆమెతో సమయం గడిపేందుకు రూ. 40 లక్షలు చెల్లించాలని ఓ విటుడికి మెసేజ్ పెట్టారు. సుమారు 70 మంది యువతుల అసభ్య ఫొటోలను పలువురికి పంపి రేటు ఫిక్స్చేశారు. ఈ వాట్సప్ చాటింగ్‌ను పోలీసులు సేకరించారు. ఫొటోలు, రేట్లు ఉన్న ఫొటో ఆల్బమ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరి సేవలు పొందుతున్న రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు ఎవరు? వీరికి అండగా పెద్దలెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
హలో అమ్మాయి కావాలా.?
‘హలో.. అమ్మాయి కావాలా. రూ.30 వేల నుంచి రూ.3 లక్షల వరకు రేటు.. ఫలానా నటికైతే రూ.40 లక్షలు’. చెన్నైలో శుక్రవారం పోలీసులకు చిక్కిన సెక్స్ రాకెటర్ల దందా ఇది. ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా సాగుతున్న బాగోతంపై ఒక తమిళనటి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో బట్టబయలైంది. సాక్షి, చెన్నై: చెన్నై అన్నానగర్‌లో నివసించే నటి జయలక్ష్మి నేపాలి చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. సుమారు 30కి పైగా తమిళ సినిమాల్లో నటించారు. టీవీ సీరియళ్లలో కూడా పలు పాత్రలు పోషించారు. కాగా ఆమె సెల్‌ఫోన్‌కు కొన్నిరోజులుగా ‘రిలేషన్షిప్ డేటింగ్ సర్వీస్’పేరుతో రెండు ఫోన్ నంబర్ల నుంచి సందేశాలు వస్తున్నాయి. ‘మీరు డేటింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారా.. మీతో రావడానికి ఎందరో వీఐపీలు వేచిచూస్తున్నారు. రూ.30 వేలు మొదలుకుని.. రూ.3 లక్షల వరకు చెల్లించేందుకు వారు సిద్ధంగా ఉన్నారు.. వంటి సందేశాలతో వ్యభిచారానికి ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటున్నాయి. ఈ మెసేజ్‌లతో బిత్తరపోయిన నటి చెన్నై పోలీస్ కమిషనర్‌ను ఇటీవల నేరుగా వెళ్లి ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఆదేశాలతో వ్యభిచార నిరోధక విభాగం పోలీసులు విచారణ చేపట్టారు. చెన్నై విరుగంబాక్కంలో నివసించే మురుగ పెరుమాన్, కవియరసన్ నటి జయలక్ష్మికి వాట్సాప్ సందేశాలు పంపినట్లు తెలుసుకున్నారు. విటుల మాదిరిగా నటిస్తూ వారికోసం వలవిసిరారు. అన్నానగర్‌కు రావాల్సిందిగా కబురు పంపి ఇద్దరినీ అరెస్ట్ చేశారు. వీరిని శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు పంపారు. ఇలా ముగ్గులోకి దించుతారు.. ‘రిలేషన్షిప్ డేటింగ్ సర్వీస్’అనే పేరుతో స్నేహితుల్లా పరిచయం పెంచుకుంటారు. ప్రముఖ నటీమణులు, సహాయ నటీమణులు, అందమైన అమ్మాయిల ఫోటోలను పంపుతూ ముగ్గులోకి దించుతున్నారు. అరెస్ట్ అయిన ఇద్దరు యువకుల సెల్ఫోన్లను పోలీసులు పరిశీలించి అందులోని ఫోటోలను చూసి ఖంగుతిన్నారు. ప్రముఖ నటీమణుల ఫోటోలు, ఎవరి రేటు ఎంత అని స్పష్టంగా ఉంది. ముఖ్యంగా తమిళ సినిమారంగంలో పేరొందిన ఒక ప్రముఖ యువ నటి పేరును విటులకు పంపుతున్నారు. ఈ నటితో జల్సాకు రూ.40 లక్షలు చెల్లించాలని సందేశం కూడా పంపారు. ఈ సందేశానికి బదులు సందేశాన్ని పంపిన విటుడు ‘రేటు మరీ ఎక్కువ, రూ.1 లక్ష కావాలంటే ఇస్తాను’అని పేర్కొన్నాడు. ఇలా సుమారు 70 మంది యువతులకు ఒక రేట్‌ను ఫిక్స్ చేసి ఫోటోలను పంపారు. ఎందరో రాజకీయ ప్రముఖులు మీతో గడిపేందుకు తహతహలాడుతున్నారు. మీరు మనసు పెడితే లక్షల్లో సంపాదించవచ్చు అనే ఆశలు కల్పిస్తూ పలువురికి సందేశాలు పంపారు. ఈ వాట్సాప్ చాటింగ్‌ను పోలీసులు సేకరించారు. ఈ యువకుల పరిధిలో పనిచేస్తున్న నటీమణులు ఎవరు, వీరి సేవలు అందుకున్న రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు ఎవరని పోలీసులు విచారణ చేస్తున్నారు. నటి జయలక్ష్మికి అసభ్య సందేశాలు పంపిన ఇద్దరు యువకులు పోలీసులకు ఒక ప్రముఖ నటి పేరు చెప్పి, ఆమెతో హాయిగా గడపవచ్చన్నట్లు సమాచారం. నటీమణులంటే చులకన కాకూడదు: జయలక్ష్మి నటి జయలక్ష్మి దీనిపై అవేశంగా మీడియాతో మాట్లాడారు. ‘రెండువారాల క్రితం నా సెల్‌ఫోన్ వాట్సాప్‌నకు రెండు నంబర్ల ద్వారా వెంట వెంటనే రెండు మెసేజ్‌లు వచ్చాయి. ‘మీరు సరేనంటే డేటింగ్ కోసం బైటకు వెళదాం.. మా వద్ద చాలా వీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలున్నారని ఉంది. దీని ద్వారా రూ.30 వేల నుంచి రూ.3 లక్షల వరకు సంపాదించవచ్చని వచ్చింది. డీల్‌కు అంగీకరిస్తే కింద ఉన్న నంబరుకు ఫోన్ చేయండి అని ఉందని అన్నారు. ఈ విషయాన్ని నా స్నేహితులకు తెలియజేయడంతో వారు విటుల్లా వారితో సంభాషించగా వెండితెర, బుల్లితెర నటీమణుల ఫోటోలు, వారి రేట్లు పంపారు. ఆ ఫోటోలు, వివరాలు చూసి దిగ్భ్రాంతికి లోనయ్యా. తరువాత స్నేహితుల సలహామేరకు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశా. పోలీసులు సైతం వెంటనే రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు. ఇలాంటి పరిస్థితులను మహిళలు ధైర్యంగా ఎదుర్కొవాలి. సినీ నటి అయినంత మాత్రాన ఇలానే ఉంటారని భావించడం సరికాదు. ఇతర మహిళల్లానే మేమూ.. మాకూ కుటుంబం ఉంటుంది’ అని ఆమె అన్నారు. -
ఇల్లు.. పొలం.. అంతులేని శ్రమ!
వ్యవసాయం ఈ మాత్రమైనా నడుస్తున్నదంటే మహిళా రైతుల శ్రమ వల్లనే అయినప్పటికీ వారి శ్రమకు గుర్తింపు లేదని వేరే చెప్పాల్సిన పని లేదు. జయలక్ష్మి జీవితం చూస్తే చాలు, మనకు అర్థమవుతుంది. ఆమె ఊరు అతుకొట్టాయ్. తమిళనాడులోని ధర్మపురి పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఆ ఊరుంది. తెల్లవారుజామున 4.30 గంటలకు నిద్ర లేస్తుంది జయలక్ష్మి. ఇంటి పనులు, పిల్లలను బడికి పంపించి, వంట పనులు పూర్తి చేసుకొని.. పొలం పనులు ప్రారంభిస్తుంది. సూర్యుడు నెత్తి మీదకు వచ్చి ఎండ చుర్రుమనిపించే 11.30 గంటల సమయానికి ఇంటికి చేరి.. బట్టలు ఉతకటం, అంట్లు తోమటం మొదలు పెడుతుంది. పశువులకు నీళ్లు పెట్టి, గడ్డి వేస్తుంది. 3 గంటల తర్వాత మళ్లీ పొలం పనిలో నడుము వంచుతుంది. 6 గంటల కల్లా ఇల్లు చేరుకొని వంట పని, ఇతర ఇంటి పనుల్లో మునిగిపోతుంది. నడుము వాల్చేటప్పటికి రాత్రి 11 గంటలవుతుంది. ఇంత చేసినా మొగుడు ఎప్పుడేమంటాడోనన్న భయం నీడలాగా వెంటాడుతూనే ఉంటుంది. ‘పొద్దున వండిన అన్నం రాత్రి పూట పెడితే మా ఆయన పళ్లెం ఇసిరికొడతాడు.. నేనే కాదు, మా ఊళ్లో ఆడవాళ్లు ఎవరైనా అంతే. ఇంటి పనితోపాటు పొలం పనిలో చాలా వరకు మేమే చేస్తాం. మగవాళ్లు దుక్కి చెయ్యటం, రాత్రి పూట అడవి పందులను పారదోలే పనులు తప్ప.. మిగతావన్నీ మేమే చేస్తాం..’ అంటుంది జయలక్ష్మి. మహిళా రైతులు ఇంత శ్రమ పడుతున్నా.. వారికి భూమి మీద హక్కుల్లేవు. తమిళనాడులో 12.8 శాతం మహిళా రైతులకు మాత్రమే ఎకరమో అరెకరమో భూమి ఉంది. శ్రమ మాత్రం 90 శాతం వారిదే. పితృస్వామిక వ్యవస్థ ఇళ్లలో, పొలాల్లో.. అంతటా ఇంకా రాజ్యం ఏలుతూనే ఉంది! -
స్వర్గం నరకం
స్త్రీ చేతి సంసారపు సున్నితపు త్రాసు నాటి సినిమా నరకంలో సలసలకాగే నూనెలో మనిషిని వేగిస్తారట. అది సంసారంలో భార్య పలికే పరుషమైన మాటతో సమానం కావచ్చు. స్వర్గంలో తేనె ప్రవాహాలు దప్పిక తీరుస్తాయట. అది సంసారంలో భార్య ఆదరంగా అందించే మంచినీరే కావచ్చు. స్వర్గం ఏదో ఆకాశంలో... నరకం పాతాళంలో ఉండవు. అవి పక్క పక్కనే ఉంటాయి– బొమ్మా బొరుసులా. భార్య దేనిని ఎంచుకుంటే అది దక్కుతుంది. సంసారం సున్నితపు త్రాసులాంటిది. మగవాడు ఉత్త దండెంలాంటి వాడు.స్త్రీ తన చేతితో ఆ దండేన్ని స్వర్గం వైపు వంచితే జీవితం స్వర్గం అవుతుంది. నరకం వైపు వంచితే బతుకు నరకం అవుతుంది. మంచి మాటలే తూకం రాళ్లు... పట్టువిడుపులే తక్కెడ గొలుసులు... దయా క్షమలే చెరోవైపు పళ్లేలుగా వ్యవహరిస్తే ఏ కాపురపు ముల్లైనా స్వర్గం వైపు వొంగుతుంది. లేదంటే అది నరకాన్ని దభేలున తాకుతుంది. జయలక్ష్మి (పాత్ర పేరు కూడా అదే), అన్నపూర్ణ (పాత్ర పేరు అన్నపూర్ణే) కాలేజీలో స్నేహితులు. జయలక్ష్మి టపాకాయ లాంటిది. మంచికీ చెడ్డకీ టపాటపామని పేలుతుంటుంది. అన్నపూర్ణ మౌనంగా వెలిగి అగరుబత్తీ లాంటిది. నిశ్శబ్దంగా పరిమళం ఇవ్వడమే తప్ప, తనను తాను కాల్చుకోవడం తప్ప ఎదుటివారి మీద నిందలు వేసే మనిషి కాదు. జయలక్ష్మికి మగవాళ్లంటే సదభిప్రాయం లేదు. వాళ్లు తాగుతారని, తిరుగుతారని, పెళ్లి చేసుకుని భార్యలను అవస్థల పాలు చేస్తారని అనుకుంటూ ఉంటుంది. అన్నపూర్ణ మాత్రం అలాంటి బుద్ధులు కేవలం మగవారికే ఉండవని ఆడవారి అండ లేకుండా తప్పు చేసే మగవాడు ఉండడని అభిప్రాయపడుతూ ఉంటుంది. ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకరి పెళ్లికి మరొకరు హాజరవుదామనుకుంటారు. కాని అనుకోకుండా ఇద్దరి పెళ్లిళ్లూ ఒకే ముహుర్తానికి నిశ్చితమవుతాయి. ఇద్దరూ స్వర్గంలాంటి కాపురాలను ఊహిస్తారు. కాని జయలక్ష్మి కాపురం స్వర్గం. అన్నపూర్ణ కాపురం నరకం. జయలక్ష్మి భర్త ఈశ్వరరావు (పాత్ర పేరు అదే) లెక్చరర్. మంచివాడు. భార్య అంటే పంచ ప్రాణాలు. ‘ఏమండీ సాయంత్రం ఐదు గంటలకే ఇంటికి వచ్చేస్తారుగా’ అని భార్య అడిగితే ‘ఐదు వరకు ఎందుకు... నాలుగున్నరకే వచ్చేస్తాను’ అని భార్య చుట్టే తిరిగే రకం. జయలక్ష్మికి కూడా భర్త అంటే ఎంతో అనురాగం. భర్తను విడిచి ఒక్కరోజు ఊరు వెళ్లాల్సి వస్తే స్పృహ తప్పి పడిపోతుంటుంది. భర్త కాలేజీ క్యాంప్‌కు వారం రోజులు వెళతానంటే ఏడుపు మొదలెడుతుంటుంది. భర్త వారం రోజులు క్యాంప్‌కు వెళతాడు. అతణ్ణి రిసీవ్ చేసుకోవడానికి జయలక్ష్మి స్టేషన్‌కు వెళుతుంది. స్టేషన్లో కంపార్ట్మెంట్లో నుంచి భర్త దిగుతాడు. అతడితో పాటు మరో లేడీ లెక్చరర్ కూడా దిగుతుంది. ‘ఈమె మా కాలేజ్ లెక్చరర్.’ అని పరిచయం చేస్తాడు. అంతే. జయలక్ష్మి గుండెల్లో అనుమానపు టపాకాయలు టపాటపామని పేలుతాయి. ఈశ్వరరావు కొంచెం మతిమరుపు మనిషి. మాటల్లో పడితే ఇంటి దగ్గర భార్యను మర్చిపోతుంటాడు. ఒకరోజు జయలక్ష్మి ఇంటికి త్వరగా రమ్మంటుంది. కాని సాయంత్రం స్నేహితులతో మాటల్లో పడి ఎగ్జిబిషన్‌కు వెళతాడు. అక్కడ తోటి కాలేజీ లెక్చరర్ కనిపిస్తే ఆమెతో మాటల్లో పడతాడు. అంతే కాదు పొరపాటున తన అద్దాలకు బదులు ఆమె అద్దాలను ఇంటికి తెస్తాడు. అతడి రాకలో ఆలస్యానికి ఇల్లు పీకి పందిరేసున్న జయలక్ష్మిని చూసి కంగారుగా ఏవో అబద్ధాలు చెప్తాడు. కాని అతడు తెచ్చిన అద్దాలు అతడు పని చేసే కాలేజీ లెక్చరర్వని బయటపడగానే జయలక్ష్మిలో అనుమానం రూఢీ అవుతుంది. అతడికి ఆమెతో సంబంధం ఉందని నమ్ముతుంది. ఆ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఈశ్వరరావు జీవితాన్ని నరకప్రాయం చేస్తుంది. ‘మీరు ఎవరితో తిరిగితే నాకేం. ఎందరితో తిరిగితే నాకేం. మీరు దాంతోనే తిరగండి’ అని పుట్టింటికి వెళ్లిపోతుంది. ఈశ్వరరావుకు నిజంగానే ఇదంతా నరకం. మరోవైపు అన్నపూర్ణ సంసారం ఘోరంగా ఉంటుంది. ఆమెను మోసం చేసి పెళ్లి చేసి ఉంటారు. భర్త మోహన్‌బాబు (పాత్ర పేరు మోహన్‌బాబు) ఉత్త తిరుగుబోతు. పెళ్లయిన రోజు రాత్రి కార్యం వేళకు అందరూ పెళ్లికొడుకును వెతుకుతుంటే అతడు భార్యతో కాకుండా మరొకరితో గడుపుతూ పట్టుబడతాడు. పెళ్లింట్లోనే పెద్ద గొడవైపోతుంది. అన్నపూర్ణ తండ్రి ఈ పెళ్లిని పెటాకులు చేద్దామని చూస్తాడు. కాని అన్నపూర్ణ ఒప్పుకోదు. తన రాత ఇలాగే ఉందని గ్రహించి మోహన్‌బాబుతోనే వెళ్లడానికి ఇష్టపడుతుంది. అత్తారింటికి చేరాక కూడా ఆమెకు సుఖం ఉండదు. భర్త ఆడవాళ్లను నేరుగా ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాడు. లేదంటే స్నేహితులతో పేకాటకు వెళ్లిపోతుంటాడు. అన్నపూర్ణ సహనంగా అతడి ప్రవర్తనను భరిస్తూ ఉంటుంది. మధ్యలో స్నేహితురాలిని చూడటానికి వచ్చిన జయలక్ష్మి అతడి ప్రవర్తన చూసి అన్నపూర్ణను చెడామడా తిడుతుంది. ‘నాతో వచ్చెయ్. అలాంటి వెధవకు వెంటనే విడాకులు ఇచ్చి పారెయ్’ అంటుంది. అయినా అన్నపూర్ణ వినదు. అతడి ప్రవర్తన చూసి చూసి తల్లి ఎదిరించి ఆ పెనుగులాటలో మెట్ల మీద పడి దొర్లి చనిపోతుంది. అప్పుడు కూడా అన్నపూర్ణ భర్తతో మెత్తగా అతడి బాధ్యతను గుర్తు చేస్తుంది తప్ప తీవ్ర నిందకు దిగదు. ఇదంతా చూసి మోహన్‌బాబు కరిగిపోతాడు. ఇంత దుర్మార్గంగా ఉన్నా ఈ స్త్రీ ఇంత సహనంగా ఉండటం చూసి మారిపోతాడు. భార్యను మనస్ఫూర్తిగా అంగీకరిస్తాడు. ఇప్పుడు ఆ సంసారం స్వర్గం. స్వర్గంలా ఉండాల్సిన కాపురాన్ని జయలక్ష్మి సర్వనాశనం చేసుకుంది. లేడీ లెక్చరర్ ఇంటికి వెళ్లి భర్త ఏదో మాట్లాడుతుండగా జనాన్ని వేసుకొని వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని గొడవ గొడవ చేస్తుంది. అంతే కాదు భర్తకు కావల్సింది తన అడ్డు తొలగడమే అని భావించి ఆత్మహత్యాయత్నానికి కూడా పూనుకుంటుంది. విడాకుల కాగితం రాసి భర్త మొహాన కొడుతుంది. వీటన్నింటి పరాకాష్టగా ఆ లేడీ లెక్చరర్ ఈమె చేసే రాద్ధాంతాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటుంది. ‘మంచి మనిషి ఈశ్వరరావు కాపురం అవస్థల పాలు కాకుండా ఉండేందుకే ఈ పని చేస్తున్నానని’ ఆమె రాసి చచ్చిపోతుంది. ఆమె చావు చూసి సున్నిత మనస్కుడైన ఈశ్వరరావు పిచ్చివాడైపోతాడు. అసలు వాస్తవాలను ఎట్టకేలకు గ్రహించిన జయలక్ష్మి భర్తను వెతుక్కుంటూ బయలుదేరి అతణ్ణి చేరుకోవడంతో కథ ముగుస్తుంది. భర్తలకు సంపాదించడం తెలుసు. బాధ్యతలను మోయడం తెలుసు. అవసరాలు తీర్చడం తెలుసు. కాని సంసారపు ఆటుపోట్లను సజావుగా అర్థం చేసుకోవడం తెలీదు. సంసారానికి స్త్రీయే కేంద్రకం తప్ప పురుషుడు కాదు. ఆమె సంయమనం సమయస్ఫూర్తి సహనం లౌక్యం లేకపోతే ఆ సంసారం అభాసుపాలవుతుంది. పాలూనీళ్లులా కలిసి ఉండాల్సిన భార్యభర్తలు నిప్పు ఉప్పుల్లా మారరాదని చెప్పిన సినిమా స్వర్గం నరకం.కలతలతో కలహాలతో చిన్న గొడవలను పెద్ద సమస్యలుగా సృష్టించుకుంటున్న భార్యాభర్తల ఇవాళ్టి రోజుల్లో కూడా ఈ సినిమా ఒక లెసన్. ఒక పర్సనాల్టీ కరెక్షన్ క్లాస్. ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. యూ ట్యూబ్‌లో ఉంది. వాచ్ ఇట్. కొత్తవాళ్లతో దాసరి తీసిన సూపర్‌హిట్ స్వర్గం నరకం 1975లో విడుదలైంది. ఇది దర్శకుడు దాసరి నారాయణరావుకు పదో సినిమా. గతంలో ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్తవాళ్లతో ‘తేనె మనసులు’ తీసి కృష్ణ వంటి స్టార్‌కు జన్మనిచ్చారు. ఆ స్ఫూర్తితో దాసరి కూడా కొత్తవాళ్లతో సినిమా తీయాలని ‘స్వర్గం– నరకం’కు నడుం బిగించారు. హైదరాబాద్‌లో నాటకాల్లో కనిపించిన విశ్వేశ్వరావును ‘ఈశ్వరరావు’గా పేరు మార్చి ఒక హీరోగా తీసుకున్నారు. మరో పాత్రకు బోసుబాబు అనే నటుడు పోటీ పడ్డాడు. కాని దాసరి ఆ వేషాన్ని భక్త వత్సలం అనే నటుడికి ఇచ్చారు. ఆ భక్తవత్సలానికి పేరు మార్చి ‘మోహన్‌బాబు’గా ‘స్వర్గం–నరకం’లో పురుడుపోశారు. బెజవాడలో నాటకాల్లో ఫేమస్ అయిన అన్నపూర్ణ ఒక హీరోయిన్ కాగా తర్వాతి రోజుల్లో ‘ఫటాఫట్’ జయలక్ష్మిగా పేరు పొందిన జయలక్ష్మి మరో హీరోయిన్. ఈ సినిమాలో దర్శకుడు కోడి రామకృష్ణ ఒక పాత్రలో కనిపిస్తాడు. అలాగే ఆ తర్వాతి కాలంలో ఫేమస్ అయిన ఆర్.నారాయణమూర్తి, జీవా తదితరులు అతి చిన్న పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ఆచారి అనే పాత్ర ముఖ్యమైంది. అది కథకు అనుసంధానకర్తగా ఉంటుంది. పరాన్నభుక్కుగా జీవిస్తూ అందరి తలలో నాలుకలా ఉండే ఆ పాత్రను దాసరే స్వయంగా పోషించారు. ‘ఫినిష్’ అనేది ఆయన ఊతపదం. అప్పట్నించి ఆ మాట చాలా ఫేమస్ అయ్యింది. ఇప్పటికీ ‘ఫినిష్’ ఫేమస్సే. దాసరి సింబాలిక్ షాట్స్ ఈ సినిమాలో దాసరి సింబాలిక్ షాట్స్‌ను వాడారు. దానికి కారణం ఉంది. సినిమా పూర్తయ్యాక అన్నపూర్ణ క్లోజప్స్ పంపిణీదారులకు నచ్చలేదు. ఏం చేయాలా అని ఆలోచించిన దాసరి క్లోజప్స్ వచ్చినప్పుడల్లా కాలుతున్న అగరుబత్తుల్ని సింబాలిక్‌గా చూపించారు. అవసరం కోసం చూపినా ప్రేక్షకులు అది దర్శకుడి మంచి సృజనగా భావించారు. అలాగే జయలక్ష్మి మనసులో భావోద్వేగాలు కలిగినప్పుడల్లా టపాకాయలు పేలుతున్న చప్పుడు వినిపిస్తుంది. ఇదీ జనానికి నచ్చింది. సినిమా క్లయిమాక్స్‌లో భార్యాభర్తల అనుబంధాన్ని పాలూ నీళ్లతో పోలుస్తూ సింబాలిక్ షాట్స్ చూపడం ఆ రోజుల్లో కొత్తదనంగా భావించారు. ‘‘ఆడది మగవాణ్ణి గుప్పిట్లో కాదమ్మా పెట్టుకోవాల్సింది.. గుండెల్లో పెట్టుకోవాలి. మాటల్తో కాదమ్మా కట్టేయాల్సింది మనసుతో కట్టేయాలి. హక్కుల కోసం కాదమ్మా పోరాడాల్సింది బాధ్యతలతో పోరాడాలి. బరువు బాధ్యతలతో బయట తిరిగే మనిషి లక్షా తొంభై సమస్యలతో ఇంట్లో అడుగు పెడతాడు. ఇంట్లో అడుగు పెట్టీ పెట్టగానే ఏమండీ... ఇంట్లో ఉప్పు లేదు పప్పు లేదు కుర్రాడికి జబ్బు చేసింది నాకు తలనొప్పి వచ్చింది మీరు ఎక్కణ్ణుంచి వచ్చారు ఎలా వచ్చారు ఎందుకింత ఆలస్యంగా వచ్చారు దేంతో తిరిగి వచ్చారు అని అడిగితే ఆ మగాడు ఏం సమాధానం చెప్తాడమ్మా.. ఆ ఇల్లు నరకం కాకుండా ఏమవుతుందమ్మా’’ – జయలక్ష్మి పాత్రతో ఆచారి పాత్ర – కె -
ర్యాగింగ్‌కు పాల్పడితే శిక్ష తప్పదు
– యాజమాన్యాలు స్పందించకున్నా శిక్షార్హులే – విద్యార్థులు ఆత్మన్యూతనకు లోనుకాకూడదు – అవగాహన సదస్సులో అర్బన్ ఎస్పీ ఆర్.జయలక్ష్మి తిరుపతి ఎడ్యుకేషన్ : ర్యాగింగ్‌కు పాల్పడితే ఎంతటి వారైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని తిరుపతి అర్బన్ ఎస్పీ ఆర్.జయలక్ష్మి హెచ్చరించారు. రేణిగుంట రోడ్డులోని చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం విద్యార్థులకు ర్యాగింగ్, దాని పర్యవసనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు చదువుపైనే దష్టి సారించాలన్నారు. సరదా కోసం తోటి విద్యార్థిని మానసికంగా, శారీరకంగా బాధపెడితే ఉన్నతమైన జీవితాన్ని కోల్పోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇటీవల విజయవాడలో 7వ తరగతి విద్యార్థి ర్యాగింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న ఘటనను గుర్తు చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడితే వెంటనే తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యాసంస్థల యాజమాన్యం దష్టికి తీసుకెళ్లాలని సూచించారు. యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు ఆత్మన్యూనతకు గురికాకూడదని, ఎటువంటి సమస్యనైనా దీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కష్ణతేజ విద్యాసంస్థల అధినేత్రి డాక్టర్ చదలవాడ సుచరిత మాట్లాడుతూ దేశంలో మహిళా సాధికారతను పెంపొందించడానికి విద్యార్థినులు ధైర్యంగా ముందుకు సాగాలని తెలిపారు. ర్యాగింగ్‌కు పాల్పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. ఈ సదస్సులో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.మల్లికార్జునయ్య, ఆర్ అండ్ డి సెల్ డైరెక్టర్ డాక్టర్ ఎ.మోహన్, టెక్నికల్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ పి.జయచంద్రారెడ్డి, ప్రొఫెసర్ రామమూర్తి, ప్రొఫెసర్ నాగమునెయ్య పాల్గొన్నారు. -
కుమారుడితో పాటు తల్లి ఆత్మహత్య
ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులు మృతి చెందారు.. మేనత్త పెంచి పెద్ద చేసింది.. పెళ్లయినా తర్వాతైనా తన జీవితం బాగుంటుందని కలలు కనింది.. అయితే ఆమె కలలు కల్లలయ్యాయి.. భర్త నుంచి చీత్కారాలు, వేధింపులు ఎదురయ్యాయి.. పేదరికం వెక్కిరించింది.. ఇన్ని కష్టాల మధ్య జీవనం సాగించలేనని నిర్ణయించుకుంది.. తాను మాత్రమే చనిపోతే కుమారుడిని ఎవరూ చూసుకోరేమోనని భావించింది.. తనతోపాటే కుమారుడిని పైలోకానికి తీసుకెళ్లింది. ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరు మండలంలోని రేగుళ్లపల్లెకు చెందిన కోనేటి జయలక్ష్మి(24) ఏడాదిన్నర వయసు ఉన్న తన కుమారుడు గౌతమ్‌పై గురువారం కిరోసిన్ పోసి నిప్పంటించి, తానూ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రేగుళ్లపల్లెకు చెందిన నరసింహులుకు ఐదేళ్ల క్రితం ప్రొద్దుటూరుకు చెందిన జయలక్ష్మితో వివాహం అయింది. అతను గతంలో చేనేత పని చేసే వాడు. ఆ పని గిట్టుబాటు కాకపోవడంతో చిల్లర కొట్టు పెట్టుకున్నాడు. దుకాణం కూడా సరిగా జరగకపోవడంతో ఫైనాన్స్‌లో ఆటో తీసుకున్నాడు. కంతులు కట్టని కారణంగా రెండు నెలల క్రితం ఫైనాన్స్ కంపెనీ వాళ్లు ఆటోను తీసుకెళ్లడంతో బేల్దారి పనికి వెళ్తున్నాడు. ఇంట్లో నుంచి పొగ రావడంతో.. గురువారం ఉదయాన్నే భర్త నరసింహులు మైదుకూరు సమీపంలోని గ్రామానికి బేల్దారి పనికి వెళ్లాడు. అత్త కూడా కూలి పనికి వెళ్లింది. ఇక ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమారుడితోపాటు తనపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించింది. ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున పొగ రావడంతో దారిన వెళ్లే స్థానికులు పరుగెత్తుకుంటూ వచ్చారు. తలుపులు తీయడానికి ప్రయత్నించగా లోపల గడియ పెట్టడంతో రాలేదు. దీంతో ఇనుప పైపుతో తలుపులను పగులగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే తల్లీకొడుకులు మంటల్లో కాలి బూడిదయ్యారు. నిత్యం సూటి పోటి మాటలతో.. జయలక్ష్మికి పెళ్లైన నాలుగేళ్ల వరకు సంతానం కలుగలేదు. దీంతో భర్త నరసింహులు ‘నీలో ఏదో లోపం ఉంది.. లేకుంటే పిల్లలు ఎందుకు పుట్టరు’ అంటూ ఆమెను సూటి పోటి మాటలతో వేధించే వాడు. పెళ్లైన మూడేళ్ల తర్వాత రెండో పెళ్లి చేసుకుంటానని కూడా అతను భార్యతో అన్నాడు. ఈ విషయాన్ని ఆమె తన మేనత్త, అన్నకు ఫోన్ చేసి చెప్పేది. ఈ క్రమంలో ఏడాది క్రితం ఆమెకు ప్రైవేట్ ఆస్పత్రిలో కవల పిల్లలు జన్మించగా.. రెండు మూడు గంటల్లోనే ఒక శిశువు మృతి చెందాడు. శిశువు ఆరోగ్యకరంగా లేకపోవడంతో వైద్యం కోసం సుమారు రూ.1 లక్ష దాకా ఖర్చు అయింది. అప్పటికే అప్పుల్లో ఉన్న నరసింహులుకు మరో రూ.1 లక్ష ఖర్చు కావడంతో అదనపు భారంగా భావించాడు. కంతులు కట్టకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ వాళ్లు ఆటోను తీసుకెళ్లారు. గ్రామంలో ఇలా జరగడంతో అతను తీవ్ర అవమానంగా భావించాడు. అప్పటి నుంచి రోజూ భార్యను వేధించే వాడు. నీ వల్లే అప్పుల్లో కూరుకుపోయాయని, పుట్టింటి నుంచి డబ్బు తీసుకొని రమ్మని ఆమెను చిత్రహింసలకు గురి చేసే వాడు. ఈ నెల 2న గౌతం మొదటి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. వీధిలో వారందరికీ చాక్లెట్లను పంచారు. పెంచి పెద్ద చేసిన మేనత్త జయలక్ష్మి చిన్న తనంలోనే తల్లిదండ్రులు మృతి చెందారు. దీంతో ప్రొద్దుటూరుకు చెందిన ఆమె మేనత్త పద్మావతి పెంచి పెద్ద చేసింది. జయలక్ష్మి డిగ్రీ వరకు చదువుకుంది. పెళ్లి సమయంలో ఆమె జయక్ష్మికి 6 తులాల బంగారు, రూ.50 వేలు నగదు ఇచ్చింది. పెళ్లైనప్పటి నుంచి తరచూ తన వద్దకు వచ్చి డబ్బు తీసుకొని పోయేదని పద్మావతి తెలిపింది. తనను భర్త వేధిస్తున్నాడని ఆమె ఫోన్ చేసి చెప్పేదని, డబ్బు తీసుకొని రావాలంటూ కొట్టేవాడని వాపోయింది. కన్న కూతురిలా పెంచానని ఆమె రోదించ సాగింది. సంఘటన స్థలాన్ని రూరల్ పోలీసులు సందర్శించారు. సోదరుడు వెంకటసుబ్బరాయుడు ఫిర్యాదు మేరకు నరసింహులుపై వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివశంకర్ తెలిపారు. -
కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం రేగులపల్లెలో గురువారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కోనేటి జయలక్ష్మి(25) అనే మహిళ కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. మొదట కొడుకు పై కిరోసిన్ పోసి నిప్పంటించి.. తర్వాత తను కూడా ఆత్మహత్మకు పాల్పడింది. తీవ్రగాయాలతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఆర్ధిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమై ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బస్సును తాకిన కరెంట్ తీగ... ఒకరి మృతి
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా హీరమండలం గులుమూరు సమీపంలో బస్సుకు కరెంటు తీగలు తగిలి ఒకరు చనిపోయారు. ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు 20 మంది ప్రయాణికులతో వెళుతోంది. గులుమూరు వద్ద రహదారిపై చెట్టు అడ్డంగా పడి ఉండటంతో డ్రైవర్ బస్సును మరో దారిలో మళ్లించాడు. అయితే బస్సు వెళ్తుండగా పైన ఉన్న కరెంటు తీగలు తగిలి షాక్ వచ్చింది. దీంతో బస్సులోని జయలక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే చనిపోగా డ్రైవర్‌తోపాటు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. -
కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య...
కడుపునొప్పి తాళలేక ఓ వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్.ఐ. ప్రేమ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం యేజర్ల జయలక్ష్మి (25) శంషీగూడలో నివాసముంటోంది. గత సంవత్సర కాలంగా కడుపునొప్పితో ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలోనే ఆదివారం కడుపునొప్పి విపరీతంగా రావటంతో బాధను భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పు రేకులకు ఉన్న రాడ్‌కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త మల్యాద్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. -
విశ్వజయం
విశ్వాన్ని జయించడానికి జయలక్ష్మి లాంటి సహచరి కావాలి. జయాన్ని విశ్వమంతా గుర్తించాలంటే విశ్వనాథ్ లాంటి మార్గదర్శి కావాలి. విశ్వజయానికి ప్రేమ కావాలి. స్వచ్ఛమైన ప్రేమ కావాలి. దిసీజ్ ది స్టోరీ ఆఫ్ టు సోల్‌మేట్స్. ఈ దంపతుల ప్రేమలో ఆత్మ ఉంది. అయినా... ఆత్మీయమైన ప్రేమకు ఒక రోజెలా సరిపోతుంది? అందుకే ‘ప్రేమికుల రోజు’, ‘వరల్డ్ మ్యారేజ్ డే’ లాంటివి లాంఛనాలు మాత్రమే. * ఆదిదంపతుల లాంటి మీకు నమస్కారమండీ! విశ్వనాథ్ గారూ! ఏమిటీ గడ్డం పెంచారు? కొత్త సినిమా గెటప్పా? కె. విశ్వనాథ్: అదేమీ లేదండీ! (సరదాగా...) ఈ గడ్డం చూసైనా, కొత్త తరహా వేషాలు వస్తాయేమోనని! జయలక్ష్మి: (నవ్వేస్తూ) ఆ..అదొకటి కూడానా! (నవ్వులు) విశ్వనాథ్: ఈ 19న నా బర్తడేకైనా తీసేయమని గొడవ! * ఇంతకీ, మీ పెళ్ళి తేదీ గుర్తుందా? జయలక్ష్మి: (అందుకుంటూ...) నా పుట్టినరోజు వినాయక చవితి. ఇక, మా పెళ్ళి రోజు అక్టోబర్ రెండో తేదీ. * పెళ్ళైన తొలినాళ్ళు, కొత్తకాపురం సంగతులు గుర్తున్నాయా? జయలక్ష్మి: అప్పుడు నాకు 14 ఏళ్ళు. ఆయనకు 19 ఏళ్ళు. నేను పదో తరగతి చదువుతుండగానే పెళ్ళయింది. ఆ తరువాత కాపురానికొచ్చేశాను. మద్రాసుకు వచ్చిన కొత్తల్లో వడపళని దగ్గర చిన్న ఇంట్లో ఉన్న రోజులు గుర్తే! విశ్వనాథ్: (నవ్వుతూ) అప్పట్లో సౌండ్‌రికార్డిస్ట్‌గా నా జీతం 75 రూపాయలు. చాప వేసుకొని పడుకొంటే, చేతికి చెప్పుల స్టాండ్ తగిలేంత చిన్న అద్దె గది. దానికి రూ. 20 అద్దె. ఆ గదికి ముందు కొబ్బరాకులతో చిన్న వరండా లాంటిది వేస్తే బాగుంటుందనుకొనేవాణ్ణి. చివరకు మా ఓనర్ వేయించాడు. కాకపోతే, మరో 5 రూపాయలు అద్దె పెంచాడు (నవ్వులు...). అక్కడ దానికి ఆనుకొని తోటమాలి ఉండేవాడు. అతనికి ఓ కూతురు. పిచ్చిది. జయలక్ష్మి: ఆ అమ్మాయి పేరు ఇంద్రాణి! నాకు గుర్తే! విశ్వనాథ్: మా నాన్న గారు వాళ్ళు మా ఆవిడను కాపురానికి తీసుకొని బెజవాడ నుంచి మద్రాసుకు ‘మెయిల్’లో ఉదయాన్నే వచ్చారు. చెక్క భోషాణంలో సరుకులు, సామాన్లు అవీ తీసుకొచ్చారు. కానీ నాన్న గారితో ఇంటి సంగతులు చెప్పి ఇబ్బంది పడతారని ‘వెంటనే వెళ్ళిపొమ్మన్నా’. ఉదయం కాపురానికొచ్చిన మా ఆవిడ వాళ్ళు ఆ సాయంత్రమే వెళ్ళిపోయారు (నవ్వు). జయలక్ష్మి: తర్వాత మళ్ళీ వచ్చాం లెండి! విశ్వనాథ్: ఇల్లంటే బెజవాడలో పెరిగిన రోజులు గుర్తుకొస్తాయి. కృష్ణలంకలో తాడికొండవారి తోటలో మా ఇల్లు. అప్పట్లో అగ్నిప్రమాదాలు, కృష్ణానదికి వరదలెక్కువ. ఏది జరిగినా ఇంట్లో నుంచి సామాన్లన్నీ తీసుకొని, కట్ట మీదకొచ్చి, కాలక్షేపం చేసేవాళ్ళం. మా తర్వాతే నా ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళయ్యాయి. వాళ్ళకి పురుళ్ళు పుణ్యాలొస్తే తనే! పెద్దవాళ్ళను చూసుకొనేదీ తనే! ఏడాదిలో 8 నెలలు బెజవాడలో, 4 నెలలు మద్రాసులో! * మరి, మిస్సయిన ఫీలింగ్ ఉండేదా? జయలక్ష్మి: ఎప్పుడూలేదు. అత్తమామల సేవలో తృప్తుంది.చల్లగావున్నామంటే వారి ఆశీర్వాదం. విశ్వనాథ్: అప్పట్లో నైట్ షూటింగ్స్ ఎక్కువ. రికార్డిస్ట్‌గా రాత్రంతా పనిచేసి, ఉదయాన్నే స్టూడియో క్యాంటీన్లో టిఫిన్ చేసొచ్చి, రూమ్‌లో పడుకొనేవాణ్ణి. సాయంత్రమే లేవడం! మధ్యాహ్నం భోజనం ఉండేది కాదు. లేవగానే స్నానం చేసి, స్టూడియోకి. వేరే ధ్యాసే లేదు. జయలక్ష్మి: సేవ చేసేది పరాయివాళ్లకని అనుకోలేదు. మా అత్తగారికి ఆయన కన్నా నా మీదే నమ్మకముండేది. విశ్వనాథ్: పెళ్లయిన ఎనిమిదేళ్లకు మాకు పిల్లలు పుట్టారు. నేను అన్నపూర్ణా సంస్థలో చాకిరీ చేస్తున్న రోజులవి. మా మొదటి సంతానం... అమ్మాయి పుట్టింది. విజయవాడలో అమెరికన్ ఆసుపత్రిలో డెలివరీ. మా మేనమామ అర్జెంట్‌గా రమ్మని ఫోన్ చేస్తే, వెళ్ళా. ఆరోగ్యం బాలేని పసిగుడ్డుని ఒళ్ళో పెట్టుకొని, ‘చంద్ర శేఖరాష్టకం’ చదువుకుంటూ మా ఆవిడ కనిపించింది. అప్పుడు ‘వెలుగు నీడలు’ రీరికార్డింగ్ జరుగుతోంది. రీరికార్డింగ్ నోట్స్ నా దగ్గరే ఉంది. నేను దర్శకుణ్ణి కాకున్నాసరే వెంటనే మద్రాసెళ్ళిపోయా. దాన్ని మూర్ఖత్వమనుకోవాలి! ఆమె మాత్రం ఏమీ అనుకోలేదు. * ఫలానా చేయలేకపోయానన్న గిల్టీ ఫీలింగ్ ఏమైనా ఉందా? విశ్వనాథ్: స్కూల్ ఫైనలయ్యాక చదువుతానంటూ అప్పట్లో మా ఆవిడ ఉత్తరం రాసింది. పరిస్థితుల వల్ల కంటిన్యూ చేయించలేదు. అదే ఇప్పటికీ నాకు పెద్ద గిల్టీ. జయలక్ష్మి: నాకు బాధేమీ లేదు. టెన్త్ వరకే చదివినా, ఇప్పటికీ గుర్తే. మనవరాళ్ళు చదువుతుంటే నేను సరిదిద్దుతా. ‘ఇవన్నీ తెలుసా బామ్మా!’ అని ఆశ్చర్యపోతుంటారు. * మీ చిన్నప్పటి కబుర్లు, స్కూలు విషయాలు చెప్పండమ్మా? జయలక్ష్మి: మాది కైకలూరు. మా పుట్టింటి వారు ‘బందా’ వారు. ప్రముఖ రంగస్థల కళాకారులు బందా కనకలింగేశ్వరరావు మాకు దాయాదులే! నాన్న గారు, బాబాయి అప్పట్లో ఇక్కడ హైదరాబాద్‌లో నిజామ్ వారి రైల్వేస్‌లో పనిచేసేవారు. రజాకార్ల ఉద్యమ సమయంలో కైకలూరు వచ్చేశారు. తర్వాత అన్నయ్య చదువుకి బందరు మారాం. అక్కడ లేడీ యాంథల్ మిషనరీ స్కూల్లో చదివా. * మీ పెళ్ళెలా కుదిరింది? అయినవాళ్ళ సంబంధమా? జయలక్ష్మి: (నవ్వుతూ) లేదు. బయట సంబంధమే! అదో కథ. అన్నయ్య పెళ్లి చేసుకున్న వారి వైపు నుంచి ఒక సంబంధం వచ్చింది. అంతా సిద్ధమనుకున్నాక, తీరా అది తప్పిపోయింది. అప్పుడీయనతో పెళ్ళి జరిగింది. విశ్వనాథ్: నాదీ ఓ పిట్టకథ ఉంది. ప్రసిద్ధ ఓరియంటల్ పబ్లిషింగ్ కంపెనీకి విజయవాడ మేనేజర్‌గా మా మేనమామ పనిచేసేవారు. మంచి మనిషి. వాళ్ళ యజమానికి ముగ్గురు కూతుళ్ళు. ఆ రోజుల్లోనే కోట్ల ఆస్తి. రెండో అమ్మాయిని చూడడానికి తెనాలి తీసుకెళ్ళాడు మా మేనమామ. తీరా చేసుకోనంటే, మామయ్య చెడతిట్టాడు. నా చిత్రాల్లో ‘సాక్షి’ రంగారావు పాత్రల స్వభావం ఆయనదే! * సంసారం నడుపుకోవడం, మంచీచెడు ఎలా నేర్చుకున్నారు! విశ్వనాథ్: ఏదైనా పొరపాటు చేద్దామన్నా ‘నాన్న గారేమంటారో, అమ్మేమంటుందో’ అనే భయం ఉండేది. డిసిప్లిన్డ్ మిడిల్‌క్లాస్ ఫ్యామిలీవ్యాల్యూస్తో పెరిగాం. ‘తల్లి తండ్రుల్ని ప్రేమించవలె’నని ప్రత్యేకించి నీతులు చెప్పక్కర్లేదు. జయలక్ష్మి: మన ప్రవర్తన బాగుంటే పిల్లలూ ఆ దోవలోనే. అత్తమామల్తో వచ్చేపోయే చుట్టాలతో సర్దుబాటెలా ఉండేది? జయలక్ష్మి: బంధువుల్ని చూస్తే పిల్లలకు ఆనందం! బంధువులెవరైనా వచ్చివెళ్ళిపోతుంటే, దిగులు వాళ్ళకు! ‘వెళ్లద్దు మావయ్యా’ అని ఆప్యాయత చూపేవారు. కానీ, అంతమందికి వండడం, వడ్డించడం... జయలక్ష్మి: కష్టం అనుకుంటే కష్టం, ఆనందం అనుకుంటే ఆనందం. కలసి పని చేసుకునేవాళ్లం. * వంటలో ఆయనెప్పుడైనా సాయం చేసేవారా? జయలక్ష్మి: వంట చేయడం నామోషీ కాదు. మా మామ గారు వంటలో సాయం చేసేవారు. ఈయనా కూరలు తరగడంలో సాయపడతారు. అదేగా దాంపత్యమంటే! * తరాలతో ప్రేమ, పెళ్లి మీద అభిప్రాయాలు మారుతున్నాయి! జయలక్ష్మి: ఎప్పుడూ ప్రేమలు, పెళ్లిల్లూ ఇటువంటి విషయాలన్నీ ఉన్నాయండి ఈ ప్రపంచంలో. భార్యలను కొట్టే మొగుళ్లున్నారు, ప్రేమగా చూసుకునే వారున్నారు. తల్లితండ్రులు కొట్టుకుంటుంటే పిల్లలూ అలాగే తయారవుతారు. * విశ్వనాథ్ గారికి ఒక్కోసారి కాస్తంత కోపం ఎక్కువేమో! జయలక్ష్మి: అబ్బే లేదండీ! అది చీకాకు. పని అనుకున్నట్లు జరగకపోతే వస్తుంది. వచ్చినా ఒక్క క్షణమే! * భార్యాభర్తలకు సరిపడకపోయినా కాపురం చేయాలా? విశ్వనాథ్: అవసరం లేదు. రోజూ తిట్టుకొని, కొట్టుకొనే కన్నా ఆ బంధం నుంచి బయటకొచ్చేయచ్చు. ‘మాంగల్యానికి మరో ముడి’ సినిమాలో అదే చెప్పా. జయలక్ష్మి: సరైన కారణాలుంటే సరే. ప్రతి చిన్నదానికీ విడాకులొద్దు. పిడుగుకీ బియ్యానికీ ఒకే మంత్రం కుదర్దు. విశ్వనాథ్: మహిళలు బాధ్యతలన్నీ నిర్వర్తించడం నాట్ ఎ జోక్. అందుకే సినిమాల్లో స్త్రీలని ఉన్నతంగా చూపిస్తా. మ్యారీడ్ కపుల్‌పై లవ్‌స్టోరీ తీయాలని ఇప్పుడనిపిస్తోంది. జయలక్ష్మి: అవును... ఇంత జీవితం చూసిన తర్వాత ఇదివరకటి కన్నా ఇప్పుడే బాగా తీయగలరు కూడా! (నవ్వులు) * మీరు ఎప్పుడైనా షూటింగ్‌లకు వెళ్లేవారా? జయలక్ష్మి: ఏముందనక్కడ ఇల్లు వదిలేసి వెళ్లడానికి! పిల్లలకీ అదే అలవాటైంది. ఆయన సినిమాలేస్తే చూసేవాళ్ళం. * ఆయనలో మీకు నచ్చని అంశం ఏదైనా ఉందా? జయలక్ష్మి: నచ్చని అంశం ఏమీ లేదు కానీ, ఆయనకు డబ్బు విషయంలో శ్రద్ధ తక్కువ. అదే చెబుతుంటాను. విశ్వనాథ్: అది నిజం. యావ లేదు, శ్రద్ధా తక్కువే. లేకపోతే కోట్లు కూడబెట్టేవాళ్ళం! అయినా తృప్తిగా ఉన్నాం. నలుగురొస్తే అన్నం పెట్టగలుగుతున్నాం. ఇంకేం కావాలి! * మరి మీరు మీ శ్రీమతికి ఇచ్చిన గిఫ్ట్స్ ఏంటి? విశ్వనాథ్: ఐ హ్యావ్ గివెన్ హర్ త్రీ గుడ్ చిల్డ్రన్. జయలక్ష్మి: (నవ్వుతూ) ఇంకేం కావాలి.. పిల్లలు బంగారం! విశ్వనాథ్: మా కోడళ్ళు అంతకన్నా బంగారాలు! * అది సరే! మీరెప్పుడైనా మీ శ్రీమతికి చీరలు కొని తెచ్చేవారా? జయలక్ష్మి: (అందుకుంటూ) తెచ్చినా, నాకు నచ్చేది కాదు! విశ్వనాథ్: (నవ్వుతూ) నాకు ఆలివ్ గ్రీన్ రంగు ఇష్టం. వాళ్ళేమో దాన్ని పాచి రంగనేవారు. ఒకసారి మద్రాస్‌లో చీర కొని, బెజవాడ తీసుకెళ్ళా. చీర చూడగానే ‘ఎంత’ అంది మా ఆవిడ. ‘నాలుగువేలు’ అని చెప్పగానే ‘అంత ధర కనబడట్లేదే చీరలో’ అనేసింది. నా గాలి పోయింది! * అప్పట్లో అత్తా కోడళ్లు అంటే అమ్మా కూతుళ్లలా ఉండేవారా? జయలక్ష్మి: అప్పుడైనా ఇప్పుడైనా అలాగే ఉండాల్సింది! విశ్వనాథ్: నా సినిమాల్లో కూడా అలాగే చూపించేవాడిని. * మీ మధ్య ఎప్పుడైనా, ఏదైనా విషయంలో గొడవలు? విశ్వనాథ్: ఇప్పటివరకూ ఎలాంటి గొడవలూ లేవు, రావు! జయలక్ష్మి: మీరెన్ని రాసినా రావు (నవ్వులు...)! * విశ్వనాథ్ గారూ! ఇలాంటి జీవిత భాగస్వామి దొరకడం...? విశ్వనాథ్: నిజంగా నా అదృష్టం. జయలక్ష్మి: సేమ్ టు సేమ్. ఇది నా అదృష్టం. పూర్వజన్మ సుకృతం. ఆయన బింబం... నేను అద్దంలో కనిపించే ప్రతిబింబం. ఏ తేడా లేదు. సాక్షి: అభిమాన దేవుళ్ళ నుంచి మీకు శతమానం భవతి. - రెంటాల జయదేవ విశ్వనాథ్: పెద్ద నగ కొంటే, డైమండ్ రింగ్ కొనిస్తేనే ప్రేమ అనుకోకండి. మా నాన్న గారు అప్పట్లో వాహినీ పిక్చర్స్‌లో ఫిల్మ్ రిప్రెజెంటేటివ్. ఆయన జీతం నెలకు 24 రూపాయలు. రోజుకు రూపాయి పావలా బేటా. ఎన్ని టూర్లకు వెళ్ళినా, ఆ కొద్ది మొత్తంలోనే జాగ్రత్తగా మిగిల్చి, తిరిగి వచ్చేటప్పుడు మా అమ్మకు కచ్చితంగా చీర తెచ్చేవారు. మాకు చాక్లెట్లు తెచ్చేవారు. మలబార్‌కు వెళ్ళినప్పుడు ఆవకాయ ముక్కలు కోసే కత్తి పట్టుకొస్తే, పెద్ద విషయం. నాకు మూడుచక్రాల సైకిల్ కొన్నారు. అదే మాకు రోల్స్‌రాయిస్ కారు! ప్రేమ, వాత్సల్యానికి ప్రతిరూపాలైన వాటికి విలువెవరు కట్టగలరు! విశ్వనాథ్: భార్యాభర్తల మధ్య తప్పనిసరిగా ఉండాల్సింది పరస్పరం నమ్మకం. ప్రేమ, గౌరవం మన హృదయాంతరాళంలో నుంచి రావాలి. అంతేకాని, ప్రత్యేకించి ఫాదర్స్ డే, మదర్స్ డే, ప్రేమికుల దినం, వైవాహిక దినం - అని ఏడాదికి ఒక రోజే మొక్కుబడిగా చేసుకోవడంలో అర్థం లేదు. జయలక్ష్మి: ప్రేమ ఉన్నప్పుడు ఏదీ తప్పుగా అనిపించనే అనిపించదు. ఏమైనా, డబ్బు వల్ల సమస్యలొస్తాయి. అతిగా కోరికలు లేకుండా, ఉన్నదాంట్లో తృప్తి పడితే అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు. ‘కోరికలు దుఃఖహేతువులు’ అని బుద్ధుడు ఏనాడో చెప్పాడు కదా! (నవ్వులు...) -
టీడీపీ తీరు దారుణం
జెడ్పీటీసీ యేళ్ళ జయలక్ష్మి దుగ్గిరాల : జన్మభూమి కమిటీల ఎంపికలో ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులపై తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు జెడ్పీటీసీ సభ్యులు యేళ్ళ జయలక్ష్మి మండిపడ్డారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అధికార పార్టీ నాయకుల తీరును తప్పుపట్టిన వైఎస్సార్ సీపీ నాయకులపై దాడి చేసే పరిస్థితికి వచ్చారని ఆరోపించారు. సంబంధం లేని టీడీపీ నాయకులు సమావేశానికి రావడాన్ని ఆమె తప్పుపట్టారు. వైఎస్సార్ సీపీ నాయకులను రౌడీమూకలుగా సంబోధించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు కూడా పార్టీ కార్యక్రమాలుగా జరపాలని చూడడం, సంబంధం లేని వ్యక్తులు సమావేశానికి వచ్చి అంతరాలు సృష్టించింది ఎవరని ప్రశ్నించారు. ఏకపక్ష నిర్ణయాలను తీసుకొని సమావేశంలో రౌడీయిజాన్ని తలపించేలా చేస్తోంది టీడీపీ నాయకులు మాత్రమేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు కొరిటాల సురేష్, ఎంపీపీ చల్లపల్లి భారతీదేవి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు వడ్డేశ్వరపు రజనీకాంత్, పాటిబండ్డ కృష్ణప్రసాద్, యేమినేని ధనుంజయరావు, నల్లగొర్ల నాగేశ్వరరావు, శృంగారపాటి రత్నం, బనరావూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
బ్యూటీషియన్ హత్య
వివాహేతర సంబంధం కొనసాగించేందుకు విముఖత హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రియుడి యత్నం గుంటూరు రూరల్: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ హత్యకు గురైన సంఘటన శనివారం రాత్రి అడవితక్కెళ్ళపాడు గ్రామంలోని రాజీవ్‌గృహకల్పలో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి ఆమెను హత్య చేసి అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించడం గమనార్హం! ఈ ఘటనకు సంబంధించి నల్లపాడు పోలీసుస్టేషన్ సీఐ పూర్ణచంద్రరావు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. తెనాలికి చెందిన జయలక్ష్మి(32)కి నగరంలోని నేతాజీనగర్‌కు చెందిన పసుపులేటి శ్రీనివాసరావుతో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. శ్రీనివాసరావు లారీడ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో జయలక్ష్మి నేతాజీనగర్‌లోనే అత్తమామల వద్దే ఉండేది. ఆమె మూడేళ్ల క్రితం బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొంది వివాహాలు, ఇతర శుభకార్యాలకు ఇళ్ల వద్దకు వెళుతూ గార్డెన్స్ తదితర ప్రాంతాల్లోని బ్యూటీపార్లర్లలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తోంది. ఈ క్రమంలో నేతాజినగర్‌కు చెందిన కారుడ్రైవర్ రవీంద్ర అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అప్పటికే అతనికి వివాహమై ఒక బాబు కూడా ఉన్నాడు. వారి పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో రవీంద్ర, జయలక్ష్మిలు అడవితక్కెళ్ళపాడులోని రాజీవ్‌గృహకల్పలో ఏడాది క్రితం ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వీలున్నప్పుడల్లా అక్కడ గడిపివస్తున్నారు. ఈ విషయం జయలక్ష్మి బంధువులకు తెలిసి ఆమెను హెచ్చరించడంతో ఆమె వెనక్కుతగ్గింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రవీంద్ర జయలక్ష్మికి ఫోన్ చేసి రాజీవ్‌గృహకల్పకు రమ్మని కోరాడు. లారీ డ్రైవర్ అయిన ఆమె భర్త శ్రీనివాసరావు డ్యూటీ నిమిత్తం వేరే రాష్ట్రం వెళ్లడంతో ఆమె రాజీవ్‌గృహకల్పకు వెళ్లింది. శుక్రవారం అక్కడే రవీంద్రతో గడిపి శనివారం జయలక్ష్మి ఇంటికి వచ్చింది. మళ్లీ రాజీవ్‌గృహకల్పకు ఆమె వెళ్లి రాత్రికి ఇద్దరూ పూటుగా మద్యం తాగారు. ఆ సమయంలో వివాహేతర సంబంధం కొనసాగించే విషయమై వారి మధ్య అర్ధరాత్రి వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన రవీంద్ర జయలక్ష్మి చున్నీతో ఆమె మెడకు బిగపట్టి హతమార్చాడు. అనంతరం ఇంటిలోని స్టాండ్ ఫ్యాన్‌కు ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించేందుకు నిందితుడు యత్నించాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. జయలక్ష్మి ఆత్మహత్య చేసుకునేందుకు అక్కడ పరిస్థితులు వీలుగా లేకపోవడంతో చుట్టుపక్కల వారిని విచారించగా విషయం బయట పడింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో పోలీసులు విచారించగా హత్యచేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నల్లపాడు పోలీసులు తెలిపారు. -
చిన్నారుల వేదన వర్ణనాతీతం
- చిన్నారులను పరామర్శించిన ఎమ్మెల్యే డీకే అరుణ - సవతితల్లిపై కఠినచర్యలు తీసుకోవాలి గద్వాల: సవతి తల్లి చిత్రహింసలకు గురై చికిత్స పొందుతున్న జయలక్ష్మి (5), వీరేష్ (10)లను ఎమ్మెల్యే డీకే అరుణ పరామర్శించారు. గురువారం మధ్యాహ్నం స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి జయలక్ష్మి చెంప, నడుంపై కాలిన గాయాలను చూసి ఎమ్మెల్యే డీకే అరుణ చలించిపోయారు. వీరేష్ చేతిపై ఉన్న కాలిన గాయాన్ని పరిశీలించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ శోభారాణిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆమె వైద్యులకు సూచించారు. చికిత్స పొందుతున్న వీరేష్, జయలక్ష్మితో కొంతసేపు మాట్లాడారు. ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత చిన్నారులను వసతిగృహాల్లో చేర్పించి, విద్యాబుద్దులు నేర్పేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. చిన్నారులపై పాశవికంగా వ్యవహరించిన సవతి తల్లిపై వెంటనే కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్నారులకు ప్రాథమిక హక్కులకు భంగం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జయలక్ష్మి, వీరేష్‌లకు సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదించి, ముందుకు నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆమెతోపాటు చైర్పర్సన్ బండల పద్మావతి, వైస్ చైర్మన్ శంకర్, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, బండల వెంకట్రాములు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. చర్చాంశనీయం.. గట్టు ప్రత్యూష ఉదంతం.. - కోలుకుంటున్న చిన్నారులు.. - సవతి తల్లి, తండ్రిపై కేసు నమోదు.. గట్టు: సవతి తల్లి పెట్టిన చిత్రహింసల వ్యవహారం పత్రికల ద్వారా బయటి ప్రపంచానికి తెలియడంతో గట్టులో చర్చాంశనీయంగా మారింది. కాగా గట్టు పోలీసులు, వైద్యసిబ్బంది, అంగన్వాడీ వర్కర్ల సహకారంతో జయలక్ష్మి, వీరేష్ గద్వాల ఏరియా ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. సవతి తల్లి, తండ్రి ఏమీ పట్టనట్లుగా గురువారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లిపోయారు. కేసు నమోదు.. సవితి తల్లి చిత్రహింసల నేపథ్యంలో తండ్రి చిన్న మల్లేష్, సవతి తల్లి సుజాతపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాంబాబు తెలిపారు. జయలక్ష్మి కోలుకున్న తర్వాత హైదరాబాదులోని శిశువిహార్‌కు అన్నా చెల్లెళ్లను తరలించనున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆ మేడ.. పంటల వైవిధ్యానికి నెలవు!
ఇంటి పంట పచ్చని ఇంటి పంటలతో టై కళకళ బ్యాగ్స్, సిమెంటు సంచుల్లో ఆకుకూరలు, కూరగాయల సాగు ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరించి గుంటూరులోని ఏటీ అగ్రహారం వాస్తవ్యురాలైన ఎల్లాప్రగడ జయలక్ష్మి తమ మేడ పైన 3 నెలలుగా రసాయన రహిత కూరగాయలు, ఆకుకూరలు పెంచుతున్నారు. వృత్తి రీత్యా క్లినికల్ సైకాలజిస్ట్ అయిన ఆమె ఆరోగ్యదాయకమైన కూరగాయలు పండించడాన్ని ప్రవృత్తిగా మార్చుకొని పదుగురికి స్ఫూర్తినిస్తున్నారు. తన తండ్రి, విశ్రాంత వ్యవసాయ విస్తరణాధికారి అయిన ఎస్ఎస్ఎన్ మూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఇచ్చిన సలహాల ప్రకారం తృప్తిగా ఇంటిపంటలు పండిస్తున్నారు జయలక్ష్మి (77999 92038). ఆమె ఇంటి మేడపై పంటల జీవవైవిధ్యం కనువిందు చేస్తున్నది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. 64 గ్రోబ్యాగ్స్.. 60 సిమెంటు సంచులు ‘కుండీలకు బదులు తక్కువ ఖరీదైన గ్రోబ్యాగ్స్‌ను, ఖాళీ సిమెంటు సంచులను వాడుతున్నాం. రెండు సైజుల్లో గల 64 గ్రోబ్యాగ్స్, 60 సంచులలో బేబీకార్న్, టమాటా, వంగ, బెండ, క్యాబేజీ, కాకర, బీర, సొర లాంటి కాయగూరలు.. తోటకూర, పాలకూర, మెంతికూరలతోపాటు గులాబీ, బంతి వంటి పూల మొక్కలనూ పెంచుతున్నాం. దోమపోటు, పేనుబంక వంటి రసంపీల్చే పురుగుల బారి నుంచి కూరగాయ మొక్కలను కాపాడటానికి జొన్న, సజ్జ మొక్కలను పది సంచుల్లో పెంచుతున్నాం. దీని వల్ల పురుగుమందులు పిచికారీ చేయాల్సిన అవసరం రావడం లేదు. వీటిపై పురుగులేమైనా కనిపిస్తే తీసేసి నాశనం చేస్తున్నాం. మట్టి మిశ్రమం తయారీ ఇలా.. కొబ్బరి పొట్టు, వర్మీ కంపోస్టు, ఎర్రమట్టి, పశువుల ఎరువును సమపాళ్లలో కలిపిన మట్టి మిశ్రమాన్ని బ్యాగ్స్‌లో నింపాము. విత్తనాలు, మొక్కలు నాటే ముందు ‘బీజామృతం’తో తప్పకుండా శుద్ధి చేస్తున్నాం. ఒక్కో బ్యాగ్‌లో నాటేముందు, తరువాత నెలకోసారి 50 గ్రాముల చొప్పున ఘనజీవామృతాన్ని వేస్తున్నాం. ఏడాది తర్వాత మట్టి మిశ్రమాన్ని బ్యాగ్‌లలో నుంచి తీసి.. పశువుల ఎరువు, ఘనజీవామృతం, వర్మీకంపోస్టు కొద్ది మొత్తంలో కలిపి మళ్లీ బ్యాగ్‌లలో నింపుకోవాలి. పది రోజులకోసారి జీవామృతం.. సొంతంగా తయారు చేసుకున్న జీవామృతాన్ని 1:10 నిష్పత్తిలో నీటిలో కలిపి.. మొక్కలపై పది రోజులకోసారి పిచికారీ చేస్తున్నాం. పదిహేను రోజులకోసారి మొక్కల మొదళ్ల వద్ద పోస్తాం. టై గోడలకు వెదురు బొంగులు కట్టి వైర్ అల్లి తీగజాతి మొక్కలను పాకిస్తున్నాం. ఎండల ప్రభావం మొదలవటంతో రెండు పూటలా నీరు పోస్తున్నాం. ఉదయం, సాయంత్రం అరగంట మొక్కల పనికి వెచ్చిస్తాను. నా పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండానే మా కుటుంబానికి అవసరమైన ఆకుకూరలను పండించుకుంటున్నా. వంగ, టమాటా పిందెలు వస్తున్నాయి. విషం లేని ఆహారం సొంతంగా పండించగలగడం సంతోషాన్ని కలిగిస్తోంది. మా నాన్న మూర్తి (9491582181) తోడ్పాటుతో మా చుట్టుపక్కల ఉండే వారికి ఇంటిపంటల సాగుపై శిక్షణ ఇప్పించా. శిక్షణ పొందిన ఆరుగురు ఇంటిపంటల సాగుకు ఉపక్రమిస్తున్నారు..’ ప్రెజెంటేషన్: దండేల కృష్ణ, ఇంటిపంట డెస్క్ -
సదరం క్యాంపునకు భారీ స్పందన
నర్సాపూర్ రూరల్: నర్సాపూర్‌లోని ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం నిర్వహించిన సదరం క్యాంపునకు భారీ స్పందన లభించింది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి వికలాంగులు శిబి రానికి తరలిరాగా, అధికారులు నాలుగు కౌం టర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. నలుగురు వైద్యు లు వికలాంగులకు పరీక్షలు నిర్వహించారు. శిబిరంలో మొత్తం 1,613 దరఖాస్తులు వచ్చినట్లు డీఆర్డీఏ ఏపీఓ జయలక్ష్మి తెలిపారు. వికలత్వ పరీక్షలు పూర్తయ్యాయని, త్వరలోనే ధ్రువీకరణ పత్రాలను ఆయా మండలాలకు పంపుతామని ఆమె వెల్లడిం చారు. అర్హులందరికీ పింఛన్లు అర్హులైన ప్రతి వికలాంగునికి రూ.1,500 పింఛన్ వచ్చేలా కృషి చేస్తానని జిల్లా పరిషత్ చైర్పర్సన్ రాజమణి హామీ ఇచ్చారు. శుక్రవారం ఆమె సదరం క్యాంపును సందర్శించారు.ఈ సందర్భంగా దరఖాస్తులు స్వీకరణ కౌంటర్లు, వైద్య పరీక్షలు చేసే కౌంటర్లను పరి శీలించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మురళీధర్ యాదవ్, ఎంపీడీఓ ల క్ష్మీబాయి, స్థానిక ఆస్పత్రి సూపరింటెండెం ట్ సురేష్‌బాబు, నగేష్ , నవాజ్ పాల్గొన్నారు. -
భర్తను చంపించిన భార్య
శ్రీరామనగర్ : శ్రీరామనగర్‌కు సమీపంలోని బరుగూరు క్రాస్ దగ్గర ఈ నెల 10వ తేదీన గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు చిత్రీకరించిన ఘటన హత్య కేసుగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఆదివారం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చిలుకూరి శ్రీనివాసు(35)ట్రాక్టర్ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. ఇతను ఈడుపుగంటి ప్రసాద్ అనే వ్యక్తి వద్ద డ్రైవర్‌గా పనిలో చేరాడు. పని ఉన్నప్పుడల్లా శ్రీనివాసును పిలిచేందుకు అతని ఇంటి దగ్గరకు ప్రసాద్ వెళ్లేవాడు. ఈ క్రమంలో చిలుకూరి శ్రీనివాస్ భార్య జయలక్షి్ష్మతో అతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలిస్తే ప్రమాదమని జయలక్ష్మి భావించింది. ప్రియునితో కలిసి భర్త చిలుకూరి శ్రీనివాస్‌ను అంతమొందించాలని పథకం వేసింది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌ను పొలానికి నీళ్లు పెట్టాలని ప్రసాద్ ఒకరోజు రాత్రిపూట పిలుచుకెళ్లాడు. శ్రీనివాసుకు తాగుడు అల వాటు ఉండడంతో మాయమాటలు చెప్పి పీకలదాకా తాగించాడు. తర్వాత పథకం ప్రకారం గొంతుకు పగ్గంతో బిగించి తన స్నేహితుల సహకారంతో హత్య చేశాడు. మృతదేహాన్ని గంగావతి నుంచి సింధనూరు వైపు వెళ్లే రోడ్డుపై ఉంచి ప్రసాద్ తన ట్రాక్టర్‌ను మీద నడిపాడు. తర్వాత ఒక పాత సైకిల్‌ను అక్కడ ఉంచి గుర్తు తెలియని వాహనం ఢీకొన్నట్లుగా నమ్మించారు. ఈ క్రమంలో శ్రీనివాస్ ప్రమాదంలో మృతిచెందలేదని, హత్య చేశారనే విషయం పోలీసులకు తెలిసింది. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు ప్రసాద్‌ను, హతుడు శ్రీనివాసులు భార్య జయలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో శ్రీనివాసులును స్నేహితులు కృష్ణమూర్తి, బుడాసాబ్, సత్యనారాయణతో కలిసి హత్య చేసినట్లు ప్రసాద్ అంగీకరించాడు. దీంతో ప్రసాద్, కృష్ణమూర్తిని, జయలక్ష్మిని అరెస్టు చేశారు. సత్యనారాయణ, బుడాసాబ్ ఇద్దరు పరారీలో ఉన్నట్లు సీఐ ధర్మట్టి తెలిపారు. జరిగిన సంఘటన స్థలానికి పోలీసులతో పాటు సీఐ ధర్మట్టి, ఎస్ఐ ఉదయ్వ్రి, కనకగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డిశ్రీనివాస్, తమ్మినీడి వెంకటేశ్వరరావు, డీఆర్ ప్రసాద్, చిలుకూరి సత్యనారాయణ(బుజ్జి) తదితరులు చేరుకుని పరిశీలించారు. డ్రైవర్ శ్రీనివాస్ మృతితో అతని ఇద్దరు సంతానం అనాథలయ్యారు. -
దొంగల ముఠాకు చెక్
సికింద్రాబాద్: ప్రయాణికుల దృష్టి మళ్లించి నగదు, నగలు ఎత్తుకెళ్తున్న ఓ ఘరానా ముఠా ఆట కట్టించారు గోపాలపురం పోలీసులు. నిందితుల నుంచి 105 తులాల బంగారు నగలు, 370 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర మండలం డీసీపీ ఆర్.జయలక్ష్మి, గోపాలపురం ఏసీపీ కె.శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం... సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, జూబ్లీబస్‌స్టేషన్ ప్రాంతాల్లో మహిళా ప్రయాణికుల నగల చోరీతో పాటు జేబు దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండటంతో నిందితులను పట్టుకొనేందుకు ఉత్తర మండలం ఎస్ఐలు ఎంఎస్వీ కిషోర్, భాస్కర్‌రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పక్కా పథకం ప్రకారం రెక్కీ నిర్వహించిన ఈ బృందం.. రైల్వేస్టేషన్ ప్రాంతంలో సంచరిస్తున్న నిందితులు నలుగురినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఓల్డ్ అల్వాల్ సూర్యనగర్‌లో నివాసముండే ఆవుల గణేష్ అలియాస్ ఆకుల రాజు (40) పాత నేరస్తుడు. ఎనిమిదేళ్లుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో దృష్టి మళ్లించి చోరీలు, జేబుదొంగతనాలు చేస్తున్నాడు. గతంలో పలుమార్లు జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదయ్యాడు. అనంతపురం జిల్లాకు చెందిన మరో నిందితురాలు దుర్గ (35) ఇదే తరహా నేరాలు చేస్తోంది. ఇటీవల బోయిన్పల్లి పోలీసులు దుర్గను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, జైలు నుంచి బెయిల్ విడుదలైన ఆవుల గణేష్ తన తరహాలోనే దోపిడీలకు పాల్పడే దుర్గతో పాటు అనంతపురం పట్టణానికి చెందిన గొల్ల సురేష్ (25), బలిజ ప్రశాంత్‌కుమార్ (28)తో కలిసి ముఠాను ఏర్పాటు చేశాడు. రద్దీగా ఉండే బస్సుల్లో ప్రయాణిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. మహిళల వద్ద దుర్గ అపహరించిన నగలను గణేష్ బృందం బయటికి తరలిస్తుంది. గణేష్ బృందం మహంకాళి, గోపాలపురం, మార్కెట్, బోయిన్పల్లి, మారేడుపల్లి, కార్ఖానా, బొల్లారం పోలీస్స్టేషన్ల పరిధిలోని బస్టాప్‌ల్లో చోరీలకు పాల్పడింది. నలుగురినీ అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి కిలో 50 గ్రాముల (105 తులాలు) బంగారు ఆభరణాలు, 370 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. -
వరకట్న దాహానికి వివాహిత బలి
మృతదేహాన్ని నీలగిరి తోపులో పారేసిన వైనం పరారీలో నిందితులు దొడ్డబళ్లాపురం : దొడ్డబళ్లాపురం తాలూకా తంబేనహళ్లిలో వరకట్న భూతానికి వివాహిత బలైంది. తంబేనహళ్లిలోని కెంపణ్ణ, రుద్రమ్మ దంపతుల ఏకైక కుమార్తె జయలక్ష్మికి (19) సోమవారం రాత్రి అత్తింటిలో నూరేళ్లు నిండిపోయాయి. వివరాలు... బూచనహళ్లికి చెందిన కెంపయ్య, లక్ష్మమ్మ దంపతుల కుమారుడు చలపతికిచ్చి మూడేళ్ల క్రితం జయలక్ష్మి పెళ్లి జరిపించారు. వివాహ సమయంలో రూ. 2 లక్షల నగదుతో పాటు తాహతుకు మించి కట్నకానుకుల సమర్పించారు. అయితే వివాహం జరిగిన నాటి నుంచి చలపతి, అతని తల్లి లక్ష్మమ్మ, అక్క రంగమ్మ అదనపు కట్నం తీసుకురావాలని నిత్యం వేధించేవారని సమాచారం. ఈ క్రమంలో జయలక్ష్మి అన్న లక్ష్మినారాయణ మూడుసార్లు రూ. లక్ష చొప్పున ఇచ్చాడు. ఇదిలా ఉంటే జయలక్ష్మిని పుట్టింటికి పంపించడానికి అనేక అంక్షలు విధించేవారని, కనీసం పండుగలకు కూడా తమ బిడ్డను పంపించే వారు కాదని జయలక్ష్మి తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చలపతి హొసూరులోని ఒక ఫ్యాక్టరీలో పని చేస్తుండగా, బెంగళూరు హెగ్గనహళ్లిలో ఉన్న తన అక్క ఇంటిపై పోర్షన్లో భార్యతో కాపురం ఉండేవాడు. ఇదిలా ఉంటే భర్త చలపతి, అత్త లక్ష్మమ్మలు వారం క్రితం స్థలం కొనుగోలు కోసం మరో రూ. లక్ష తీసుకురావాలని జయలక్ష్మిని కొట్టి పుట్టింటికి పంపించా రు. అయితే అప్పటికే ఉన్న కాస్త పొలం విక్రయించి పెళ్లి జరిపించడంతో తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేకపోయా రు. దీంతో ఆగ్రహించిన భర్త, అత్త కలిసి జయలక్ష్మిని హత్య చేసి రాత్రి మృతదేహాన్ని తంబేన హళ్లికి అంబులెన్స్‌లో తీసుకు వచ్చి గ్రామ శివారులో ఉన్న నీలగిరితోటలో దించి కాల్చివేయడానికి ప్రయత్నించారు. అయితే గ్రామస్తులు గమనించడంతో శవాన్ని అక్కడే వదిలి పరారయ్యారు. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు నిందితులను అరెస్టు చేసేవరకూ తోటలో నుంచి మృతదేహాన్ని కదిలించేది లేదని పట్టుబట్టారు. దొడ్డబెళవంగల పోలీసులు ఘటనా స్థలంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రానికి దొడ్డబెళవ ంగల ఎస్ఐ బాలాజీ నిందితులను అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని అక్కడి నుంచి గ్రామానికి తీసికెళ్లారు. మృతురాలి భర్త, అత్త, మామ, ఆడపడచు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సరస్వతీపుత్రిక ఆర్థిక పోరాటం
లక్ష్మీకటాక్షం లేని జయలక్ష్మి ఆమెది చదువు కోసం ఆరాటం. కానీ లక్ష్మీ కటాక్షమే లేదు. సర్కారు బడిలో చదువుకున్నా టెన్త్‌లో అత్యున్నత ప్రతిభచూపి ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన జయలక్ష్మికి ఇప్పుడు పై చదువు పరీక్షగా మారింది. కుటుంబం గడవడమే కష్టమైన పరిస్థితుల్లో ఉన్నత చదువు ఎలాగో ఆమెకు దిక్కుతోచడం లేదు. ఆదుకునే హస్తం ఉంటే చదువు కోవాలన్నది ఆమె కోరిక. కొత్తకోట(రావికమతం) : ఆమె పేరులోనే విజయం ఉన్నా లక్ష్మీ కటాక్షం మాత్రం లేదు. చదువులో సత్తాచాటినా ఆర్థిక పరిస్థితులు ఆమె ముందరి కాళ్లకు బంధం అవుతున్నాయి. ఇది కొత్తకోట గ్రామానికి చెందిన ఉండా జయలక్ష్మి దీనగాథ. కటిక పేదరికం...పైగా తండ్రికి పక్షవాతం. కుటుంబం గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఇక ఆమె చదువుసాగడం ఎలా. పదోతరగతితో 9.8 పాయింట్లు సాధించిన జయలక్ష్మి నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధిం చింది. ఆర్థిక పరిస్థితి అనుకూలించక పోవడంతో ‘పైచదువులు మనకెందుకులే తల్లీ’ అంటూ కుటుంబ సభ్యులు చెబుతుం టే ఆమె కన్నీటిపర్యంతమవుతోంది. ఉండాకొండబాబు, సత్యవతి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. తండ్రి మంచంపట్టగా తల్లి సంపాదనే వారికి ఆధారం. ఊర్లోనే ప్రభుత్వ పాఠశాల ఉండడంతో పదో తరగతి వరకు గడిచిపోయింది. ఓ వైపు అరకొర ఆదాయం, మరోవైపు తండ్రికి వైద్యంతో ప్రస్తుతం కుటుం బం గడవడమే కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఆమె పై చదువు ప్రశ్నార్థకంగా మారింది. ఓ వైపు పాఠశాల ప్ర ధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు ఉన్నత చదువులు చదివించాలని సూ చిస్తున్నారు. జయలక్ష్మికి మంచి భవిష్యత్తు ఉందని చెబుతున్నా ఎలా సర్ధుకుపోవాలో అర్థంకాక ఆ పేద తల్లి తల్లడిల్లిపోతోంది. దాతలెవరైనా సాయం చేస్తే తప్ప జయలక్ష్మి చదువు కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు. ఏదైనా ఆపన్న హస్తం చేయూతనిస్తుందేమోనని ఆ కుటుంబం ఎదురు చూస్తోంది. -
‘సెంచరీ’ దొంగ మళ్లీ చిక్కాడు...!
పేరు: హజీబాబా వృత్తి: ఆటో డ్రైవర్ ప్రవృత్తి: జేబుదొంగతనాలు చేసిన చోరీలు: వందకు పైగానే చిలకలగూడ: దొంగతనాల్లో సెంచరీ చేసి కొన్నేళ్లుగా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న ఘరానా జేబుదొంగను ఎట్టకేలకు మహంకాళి పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నార్త్‌జోన్ డీసీపీ జయలక్ష్మీ గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం.. చిలకలగూడ హమాలీబస్తీకి చెందిన షేక్ హజీబాబా అలియాస్ హజీ (45) ఆటోడ్రైవర్. జల్సాలకు అలవాటు పడ్డ హజీ జేబు దొంగతనాలు ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. బస్సుల్లో తిరుగుతూ వందకు పైగా చోరీలకు పాల్పడ్డాడు. మరికొంతమంది జేబుదొంగలను కలుపుకుని హజీగ్యాంగ్ను ఏర్పాటు చేశాడు. చిలకలగూడ పీఎస్‌లో క్రిమినల్ డోషియర్( సీడీసీ)గా నమోదయ్యాడు. మహంకాళి, మారేడుపల్లి, చిలకలగూడ తదితర ఠాణాల్లో హజీపై కేసులున్నాయి. సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట క్రాస్‌రోడ్ వద్ద బుధవారం అనుమానాస్పదంగా సంచరిస్తున్న హజీబాబాను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. తన చోరీల చిట్టా విప్పాడు. ఇతడి వద్ద నుంచి రూ.52 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హజీని గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
‘మాయామహల్’లో ఏం జరిగింది?
అదొక మాయామహల్. ఆ మహల్లోకి అడుగుపెట్టినవారు ఎలాంటి అనుభూతులకు గురవుతారు? ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు? అనే కథాంశంతో మోక్షగుండం జయలక్ష్మి సమర్పణలో మోక్షగుండం అంకయ్య నిర్మించిన చిత్రం ‘మాయామహల్’. టీయస్ రాజు, గ్రీష్మ జంటగా నటించిన ఈ చిత్రానికి సింగం సుధాకరరెడ్డి దర్శకుడు. ఈ నెల 25న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇది హారర్ థ్రిల్లర్ మూవీ. ప్రేమ, వినోదం సెంటిమెంట్.. ఇలా అన్ని అంశాలూ ఉంటాయి. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే సినిమా. నిర్మాతగా మా ఈ తొలి ప్రయత్నం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. -
మౌలిక సదుపాయాలు కల్పించండి
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : వసతిగృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయూలని సాంఘిక సం క్షేమ శాఖాధికారులను ఆ శాఖ కమిషర్ జయలక్ష్మి ఆదేశించారు. బుధవారం ఆమె డీఆర్డీఏ సమావేశ మందిరంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల సాంఘిక సంక్షేమ శాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వసతిగృహాల్లోనిమరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచడానికి ప్రత్యేక ప్రణాశికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. వసతిగృహాల్లో కనీస సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు. రూ. 400 కోట్లతో వసతిగృహాలకు సొంత భవనాల నిర్మాణం జరుగుతుందన్నారు. రెండేళ్లల్లో అన్ని వసతిగృహాలకు సొంత భవనాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆన్లైన్లో ఉపకార వేతనాలు మంజూరు చేసేందుకు ప్రతి కళాశాల బయోమెట్రిక్ పాస్ మిషన్ కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఆధార్ నంబ ర్లు లేని విద్యార్థుల వద్ద ఈఐడీ తీసుకుని బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేయాలన్నారు. బ్యాంకు ఖాతాల్లో ఆధార్ సీడింగ్‌లో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించాలన్నారు. ఇ టీవల బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి లబ్ధిదారుల డేటాను మేపింగ్ చేయడానికి తగు సూచనలు జారీ చేశామని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ కాంతిలాల్‌దండే మాట్లాడుతూ జిల్లాలో ఆధార్ సీడింగ్‌లో వ్యత్యాసాలు ఉ న్నాయని, కళాశాలల్లో ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులు ఎన్రోల్ చేయించుకోవడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వసతిగృహాల నిర్మాణానికి సంబంధించి భూ పరిపాలనా శాఖ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామని, భవనాలు నిర్మించడానికి అనువైన స్థలాలు గుర్తింపు, సేకరణకు తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేశామని వివరించారు. జిల్లాలో 7 వసతిగృహాలు అద్దె భవనాల్లో ఉండగా, అందులో ఐదు వసతిగృమాలకు సొంత భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణాలకు చెందిన సాంఘి క సంక్షేమ ఉప సంచాలకులు, కె. అచ్యుతానంద గుప్త, శ్రీనివాసన్, ఆదిత్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసిన కలెక్టర్
ఏలూరు, న్యూస్‌లైన్ : తనకు ఓటు హక్కు కల్పించాలని కోరుతూ కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఆదివారం మినీ బైపాస్ రోడ్డులోని మత్స్యశాఖ కార్యాలయం పోలింగ్ బూత్‌లో బీఎల్వోకు వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్‌ను కుర్చీలో కూర్చొమని బూత్‌లెవెల్ ఆఫీసర్ జయలక్ష్మి కోరినా ఆయన నిలబడే ఆమె ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఓటుహక్కు కావాలంటే స్థానికంగా నివాసం ఉంటున్నట్టు ఏదైనా ధృవపత్రం సమర్పించాలని బీఎల్వో జయలక్ష్మి కోరారు. ఆధార్ కార్డు ఉందా అని ప్రశ్నించగా తాను ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు అక్కడ ఆధార్ కార్డు ఉందని, నివాస వివరాలన్ని అక్కడే ఉన్నాయని కలెక్టర్ సమాధానమిచ్చారు. రేషన్ కార్డు ఉందా అని బీఎల్వో ప్రశ్నించగా రేషన్ కార్డు తీసుకోవడానికి తనకు తీరిక ఎక్కడ ఉంటుందని ఆయన అన్నారు. ఖమ్మం అడ్రస్ ఉంటే ఇక్కడ పనికిరాదని, పోనీ ఏదైనా బ్యాంకు ఖాతా ఉందా అని జయలక్ష్మి కలెక్టరును ప్రశ్నించారు. బ్యాంకు ఖాతా ఇక్కడే ఉందని దాని నకలు వెంటనే సమర్పిస్తానని ఈ లోగా ఓటుహక్కు దరఖాస్తు ఫారాన్ని పరిశీలించాలని సిద్దార్ధజైన్ కోరారు. ఆమె దరఖాస్తును పరిశీలిస్తూ రెండు ఫొటోలకు బదులు ఒక ఫొటో ఇచ్చారు, మరో ఫొటో ఇవ్వాలని కోరారు. సరిగా చూసుకో అమ్మా. నీకు రెండు ఫొటోలు ఇచ్చా.. అంటూ కలెక్టర్ చిరునవ్వు చిందించారు. అనంతరం కలెక్టర్ దరఖాస్తు ఫారంపై సంతకం చేసి అందజేసిన లోగానే బ్యాంకు పాస్‌బుక్ నకలు కూడా సమర్పించారు. ఈ వ్యవహరం జరుగుతున్నంతసేపూ కలెక్టర్ సామాన్య పౌరుని మాదిరిగానే వ్యవహరించారు. ఓటరు నమోదు ప్రక్రియలో అనుసరించాల్సిన పద్ధతులపై బీఎల్వో వ్యవహరించిన తీరుపట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరు హోదాలో కేంద్రాన్ని తనిఖీ చేశారు. నాలుగు వారాలుగా 109 దరఖాస్తులు అందాయని వాటిలో 98 విచారణ చేసి 91 మందికి ఓటుహక్కు కల్పించాలని సిఫార్స్ చేసినట్టు బీఎల్వో జయలక్ష్మి కలెక్టర్‌కు వివరించారు. మరో ఏడుగురు హైదరాబాదు, తిరుపతి తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటూ ఇక్కడ ఓటు కోసం దరఖాస్తు చేశారని వాటిని తిరస్కరించినట్టు తెలిపారు.