కడుపునొప్పి తాళలేక ఓ వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్.ఐ. ప్రేమ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం యేజర్ల జయలక్ష్మి (25) శంషీగూడలో నివాసముంటోంది. గత సంవత్సర కాలంగా కడుపునొప్పితో ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలోనే ఆదివారం కడుపునొప్పి విపరీతంగా రావటంతో బాధను భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పు రేకులకు ఉన్న రాడ్‌కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త మల్యాద్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు.
కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య...
Published Sun, Jul 31 2016 8:29 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM