కే. విశ్వనాథ్‌ సతీమణి మృతి పట్ల సీఎం జగన్ సంతాపం | CM Jagan condolences the death of Vishwanath's wife Jayalakshmi | Sakshi
Sakshi News home page

CM Jagan:కే. విశ్వనాథ్‌ సతీమణి మృతి పట్ల సీఎం జగన్ సంతాపం

Published Sun, Feb 26 2023 10:22 PM | Last Updated on Sun, Feb 26 2023 10:22 PM

CM Jagan condolences the death of Vishwanath's wife Jayalakshmi - Sakshi

దివంగత దర్శకుడు, కళాతపస్వి కే. విశ్వనాథ్‌ సతీమణి జయలక్ష్మి (86) మృతి పట్ల ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. కళాతపస్వి కన్నుమూసిన 24 రోజులకే ఆమె మృతి చెందడం గమనార్హం. గుండెపోటుతో ఆమె కన్నుమూశారు.

కాగా.. ఫిబ్రవరి 2వ తేదీన వృద్ధాప్యరిత్యా సమస్యలతో దర్శకదిగ్గజం కాశీనాధుని విశ్వనాథ్‌(92) కన్నుమూశారు. అయితే.. ఆయన మృతి చెందినప్పటి నుంచి జయలక్ష్మి తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం గుండెపోటు రావడంతో మరణించారు. 

విశ్వనాథ్‌కు 20 ఏళ్ల వయసున్నప్పుడు జయలక్ష్మితో వివాహం జరిగింది.  ఈ దంపతులకు ముగ్గురు సంతానం. ఎవరూ సినీ పరిశ్రమలోకి ప్రవేశించలేదు. అలాగే.. తన భార్య తనతో ఎప్పుడూ సినిమాల గురించి చర్చించేది కాదని, సినిమాలను కూడా విశ్లేషించేది కాదని తరచూ ఇంటర్వ్యూలలో ఆయన చెప్పారు కూడా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement