AP CM YS Jagan
-
ఏపీ ముఖ్యమంత్రిగా మళ్లీ జగనే: హీరో విశాల్ కామెంట్స్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ప్రముఖ హీరో విశాల్ ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఆయనే అధికారంలోకి వస్తారని అన్నారు. గతంలోనూ సీఎం జగన్‌పై ఇలాంటి దాడులు జరిగాయని తెలిపారు. ఇలాంటి దాడులను జగన్ ఎన్నోసార్లు ఎదుర్కొన్నారని విశాల్ వెల్లడించారు. తాను ఏ పార్టీకి కూడా మద్దతుగా లేనని.. కానీ సీఎం జగన్ అంటేనే తనకు విపరీతమైన అభిమానమని విశాల్ తెలిపారు. ప్రస్తుతం విశాల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ప్రస్తుతం ఆయన రత్నం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ చిత్రం ఏప్రిల్ 26న థియేటర్లలోకి రాబోతోంది. ప్రస్తుతం ఆయన మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. హైదారాబాద్‌లో పర్యటించిన విశాల్ మీడియా ప్రతినిధులు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా ఏపీలో మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అవుతారని విశాల్ అన్నారు. (Read this article in English) -
ఆ దేవుడి ఆశీస్సులతో సీఎం త్వరగా కోలుకోవాలి: మోహన్ బాబు
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ట్వీట్ చేశారు. షిర్డీ సాయి బాబా, వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరింత నూతన శక్తితో తిరిగిరావాలని కోరారు. రాబోయే రోజుల్లో మీ పనులను మళ్లీ విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటున్నా అంటూ పోస్ట్ చేశారు. మోహన్ బాబు తన ట్వీట్లో రాస్తూ..' ఎన్నికల ప్రచారంలో గాయపడిన సీఎం వైఎస్ జగన్ త్వరగా కోలుకోవాలి. షిర్డీ సాయి బాబా, వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు ఉంటాయి. మీరు త్వరగా కోలుకోవాలని తిరిగి రావాలి. మరింత నూతన ఉత్సాహంతో మీ విధులను పునఃప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని పోస్ట్ చేశారు. కాగా.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా కొందరు దుండగులు రాళ్లు రువ్వడంతో గాయపడిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు సైతం సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి మరింత ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు విష్ణు ట్వీట్ చేశారు. Sending my best wishes to @ysjagan anna for a speedy recovery after last night's unfortunate incident. Hoping for his quick healing and return to good health. 🙏 — Vishnu Manchu (@iVishnuManchu) April 14, 2024 Wishing Sri @ysjagan a swift recovery from the injury sustained during campaigning. With the. Blessings of Shirdi Sai Baba and Lord Venkateshwara, May you heal quickly and resume your duties with renewed strength. — Mohan Babu M (@themohanbabu) April 14, 2024 -
పెన్షన్ లబ్ధిదారులతో సీఎం జగన్ మీటింగ్ @వెంకటాచలంపల్లి
-
సీఎం జగన్ డైనమిక్ ఎంట్రీ @ కావలి
-
ఎవరెన్ని కుట్రలు చేసినా... మా ఓటు జగనన్నకే
-
సీఎం జగన్ రాక కోసం నెల్లూరు ప్రజలు
-
ఏలూరుపాడు నుంచి వెంకుపాలెం వరకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర
-
కోవూరు జంక్షన్లో జననేత, ముఖ్యమంత్రి జగన్ కు ఘనస్వాగతం
-
సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజువల్స్ హైలైట్
-
సీఎం జగన్ పెద్ద మనసు
-
సీఎం జగన్ పై నెల్లూరు మహిళలు శ్రీ గొప్ప మాటలు
-
సీఎం జగన్ రోడ్ షో.. @రాజుపాలెం
-
యాత్రలో అలా వెళ్తూ వెళ్తూ..!
-
దారిపొడవునా జననేత సీఎం జగన్ కు జన నీరాజనం
-
బాబుకు మహిళల మాస్ వార్నింగ్
-
బస్సు యాత్ర జనసంద్రం
-
దామలచెరువులో సీఎం రోడ్ షో విజువల్స్
-
చిత్తూరులో కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సుయాత్ర
-
సినిమా రేంజ్ లో గజమాలలతో సీఎం జగన్ కు ఘన స్వాగతం
-
జైత్ర యాత్రలో జనగర్జన
-
AP : జస్టిస్ రాకేష్ వివాదాస్పద తీర్పు రద్దు
ఏపీ హైకోర్టులో జడ్జిగా ఉన్నప్పుడు జస్టిస్ రాకేష్‌కుమార్ ఇచ్చిన వివాదస్పద తీర్పును రద్దు చేసింది సుప్రీంకోర్టు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ డిసెంబర్ 31, 2020న జస్టిస్ రాకేష్‌కుమార్ ఒక తీర్పు ఇచ్చారు. తన వ్యక్తిగత వ్యాఖ్యలను తీర్పులో చేర్చిన జస్టిస్ రాకేష్.. దాన్నే తీర్పుగా పేర్కొనడంపై అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. జస్టిస్ రాకేష్‌కుమార్ ఇచ్చిన తీర్పును అప్పట్లో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయగా, ఆ పిటిషన్‌ను జస్టిస్ బేలా త్రివేదీ, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింగ్వీ, నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో సుదీర్ఘ వాదనల అనంతరం సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వాళ ప్రకటించింది. కేసు పూర్వపరాలేంటీ? ప్రభుత్వ స్థలానికి సంబంధించిన వేలం వ్యవహారానికి సంబంధించి 2020లో ఓ పిటిషన్ ఏపీ హైకోర్టు ముందు దాఖలయింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అలాగే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్న జస్టిస్ రాకేష్ కుమార్.. తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ డిసెంబర్ 31, 2020న ఓ తీర్పు ఇచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని, యంత్రాంగం లేదంటూ తన తీర్పులో వ్యాఖ్యలు చేశారు జస్టిస్ రాకేశ్‌కుమార్. శాసనవ్యవస్థమీదా, పోలీసు యంత్రాంగంమీద, మూడు రాజధానుల అంశంమీదా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిన జస్టిస్ రాకేశ్‌కుమార్ వాటన్నింటిని తీర్పులో పొందుపరిచారు. సుప్రీంకోర్టుపైనే ఎదురుదాడి దీంతో పాటు ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ వ్యవహారంపైనా సుప్రీంకోర్టు కొలీజియంను తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు జడ్జిలను బదిలీ చేయడాన్ని హైకోర్టుపై దాడిగా అభివర్ణించారు. నాడు హైకోర్టు జడ్జిగా జస్టిస్ రాకేష్ చేసిన తీర్పులో ఏకంగా సుప్రీంకోర్టు కొలిజీయంనే తప్పుబట్టారు. సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పింది? కేసుల విచారణ జాప్యంపై, అలాగే అమరావతి భూముల కేసులో జస్టిస్ రాకేశ్‌కుమార్ ఇచ్చిన తీర్పు అంశాలనూ సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇతర రాజ్యాంగ వ్యవస్థల విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందంటూ హైకోర్టు ఆరోపించడం జరికాదని సూచించింది సుప్రీంకోర్టు. జస్టిస్ రాకేష్ తీరును తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. ఒక హైకోర్టు జడ్జిగా తనకున్న విచక్షణాధికారాన్ని ఇష్టానుసారంగా వినియోగించలేరని, వ్యవస్థలను ఇబ్బంది పెట్టకూడదని తెలిపింది. ఒక హైకోర్టు జడ్జిగా సుప్రీంకోర్టు కొలీజియంను తప్పుపట్టే ముందు.. తాను కూడా రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న విషయాన్ని రాకేష్‌కుమార్ గుర్తించకపోవడం శోచనీయమని పేర్కొంది. జస్టిస్ రాకేష్ కుమార్ పై ఆరోపణలేంటీ? వివాదాల్లో ఇరుక్కోవడం జస్టిస్ రాకేష్‌కుమార్‌కు ఇది కొత్తేమీ కాదు. నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ NCLATలో సభ్యుడిగా ఉన్న రాకేష్‌కుమార్ తీరును ఇటీవల సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టడంతో ఆయన ఆ పోస్టుకు రాజీనామా చేసి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఫినోలెక్స్ కేబుల్స్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేందుకు ప్రయత్నించడంతో ఆయన వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది సర్వోన్నత న్యాయస్థానం. జస్టిస్ రాకేశ్‌కుమార్ కోర్టు ధిక్కరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో పాట్నా హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు కోర్టంతా అవినీతిమయమయిందని నిరాధార ఆరోపణలు చేసి విమర్శల పాలయ్యారు. ఇదీ చదవండి: ఎల్లో మీడియా దుష్ప్రచారంపై సీఐడీ సీరియస్ -
జై భీం పాటకు డ్యాన్స్ తో హోరెత్తిన సభ
-
సంక్రాంతి కానుకగా జగనన్న సాంగ్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్!
సంక్రాంతి కానుకగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కొత్త సాంగ్ రిలీజైంది. ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే విపరీతమైన ఆదరణ లభిస్తోంది. పల్లెలతో పాటు ఎక్కడ చూసినా ఈ సాంగే వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పథకాలు, సంక్షేమం, నేరవేర్చిన హామీలను చూపిస్తూ ఈ సాంగ్‌ను రూపొందించారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా రూపొందించిన ఈ సాంగ్ యూట్యూబ్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మీరు కూడా జగనన్న కొత్త సాంగ్‌ను చూసేయండి. -
ఘనంగా నంది బహుమతుల కార్యక్రమం.. ఎన్టీఆర్, వైఎస్ఆర్ అవార్డ్స్ వారికే!
ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నగరంలో నాటకోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సామాజిక సమస్యలపై ఎక్కుపెట్టిన చైతన్యాస్త్రాలుగా ఉన్న నాటికలు, నాటకాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి ప్రదర్శనలోనూ నటీనటుల నటన ప్రేక్షకుల మనసులను హత్తుకుంటున్నాయి. నంది నాటక బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టివి, నాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డితో పాటు 2011 నందమూరి తారక రామారావు రంగస్థలం పురస్కార గ్రహీత KST సాయి ఈ కార్యక్రమానికి హజరయ్యారు. ఈ నంది నాటక బహుమతుల కార్యక్రమంలో పోసాని మురళీకృష్ణ ఇలా మాట్లాడారు. ' ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాకు సమస్ధ చైర్మన్‌గా పదవి ఇచ్చారు. కానీ నేను మూడు నెలలు పాటు ఆయనకు కనిపించకుండా తిరుగుతూనే ఉన్నాను. ముఖ్యమంత్రి జగన్ గారు తరువాత నన్ను పిలిపించుకుని, కలను కాపాడాల్సిన బాధ్యత నీకు అప్పగించాను దాన్ని నువ్వు నిర్వర్తించాలని చెప్పారు. దీంతో నేను నిరంతరం నా కార్యచరణ కొనసాగుతుంది. ఈ క్రమంలో నంది నాటకోత్సవానికి నిష్ణాతులైన న్యాయ నిర్ణీతలను ఎంపిక చేశాం. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా 87 మంది న్యాయ నిర్ణీతల్ని ఎంపిక చేశాం. నంది నాటకాల ఎంపిక విషయంలో కులం, మతం, ప్రాంతం వంటి సిఫార్సులకు తావులేదు. ఎక్కడైనా పొరపాటు ఉంటే నా చొక్కా పట్టుకుని నిలదీయండి. అని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు. మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్ ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు పలు వ్యాఖ్యలు చేశారు.' గుంటూరులో ఏడు రోజుల నుంచి నంది నాటకోత్సవాలు జరుగుతున్నాయి. నాటకం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. నాటకం సజీవమైనది. సినిమాల్లో కన్నా నాటకాల్లో నటించడం చాలా కష్టం. సినిమాల్లో టేకులు తీసుకోవచ్చు కానీ నాటకాల్లో అలాంటి పరిస్థితి ఉండదు. సినిమాల్లో టీవీల్లో నటించిన వారు బాగా డబ్బు సంపాదించిన వాళ్లు చాలామంది ఉన్నారు. కానీ నాటక రంగంలో డబ్బులు పోగొట్టుకున్న నటీనటులే ఎక్కువగా ఉన్నారు. నాటక రంగ కళాకారులకు డబ్బులు ముఖ్యం కాదు ప్రేక్షకులకు కొట్టే చప్పట్లే వారికి గౌరవం. నాటక రంగానికి ప్రాముఖ్యత చాలా ఉంది దానిని మనం కాపాడుకోవాలి. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు' తెలిపారు. ప్రముఖ సంగీత నవధానం సృష్టికర్త మేగడ రామలింగ స్వామికి 2022 నందమూరి తారక రామారావు రంగస్థలం పురస్కారం దక్కింది. ఆయనకు లక్షన్నర నగదు బహుమతితో పాటు అవార్డు దక్కింది. ది యంగ్మెన్స్ హేపీ క్లబ్ అధ్యక్షులు దంటు భాస్కరరావుకు 2022 డాక్టర్ వైఎస్ఆర్ రంగస్థలం పురస్కారం దక్కింది. ఆయనకు అవార్డుతో పాటు రూ. 5 లక్షల నగదు బహుమతి దక్కడం విశేషం ది యంగ్మెన్స్ హేపీ క్లబ్ గురించి తెలుసా? చితామణి, భక్తరామదాసు, కృష్ణ లీల, లోబి, డాటర్, నాటకాలు ఆంధ్ర, ఆంధ్రేతర ప్రాంతాలలో ప్రదర్శనలిచ్చి ఎనలేని కీర్తిని పొందింది. ఎస్వీ రంగారావు, రేలంగి వెంకట్రావు, అంజనీదేవి, సూర్యకాంతం వంటి నటులు ది యంగ్మ్న్స్ క్లబ్ నుంచి వచ్చినవారే. క్లబ్ వృద్ధ కళాకారులకు ఆర్థిక సహాకారం కూడా అందజేస్తుంది. రాజమహేంద్రవరం కేంద్రంగా తెలుగు రాష్ట్రమంతటా నాటకోద్యమం జరుగుతున్న తరుణంలో ఆ సంస్కృతికోత్సవంలో భాగంగా కాకినాడ నగరంలో 1913లో పల్లె హనుమంతరావు, యరగల సత్తిరాజు యువజన ఆనంద సంఘం ఏర్పాటు చేశారు. ఈ సంఘాన్ని 1916లో యంగ్మ్న్స్ హాపీ క్లబ్‌గా దంటూ సూర్యారావు, గండికోట జోగినాధం, మాదిరెడ్డి రామానుజల నాయుడు, ఖాశిం సాహెబ్ మార్పు చేశారు. కళాకారులు, కళాభిమానుల శ్రమదానంతో ది యంగ్మెన్స్ హాపీ క్లబ్ ప్రదర్శనశాల నిర్మాణం జరిగింది. -
ఆడుదాం ఆంధ్రా… ఇది అందరి ఆట!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు మంగళవారం (డిసెంబర్ 26) ప్రారంభం కానున్నాయి. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ క్రీడాంశాల్లో నిర్వహించే ఈ పోటీలను మంగళవారం గుంటూరు జిల్లాలోని నల్లపాడు వద్ద ఉన్న లయోలా పబ్లిక్ స్కూల్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. టోర్నమెంట్ తేదీలివే.. డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10 వరకు 47 రోజులపాటు గ్రామ, వార్డు సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి. రిజిస్ట్రేషన్లు క్రీడాకారులు : 34.19 లక్షలు ప్రేక్షకులు : 88.66 లక్షలు మొత్తం : 122.85 లక్షలు కార్యక్రమ లక్ష్యాలు క్రీడల ద్వారా గ్రామ స్థాయి నుంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం. ప్రతిభను గుర్తించి, మట్టిలో మాణిక్యాలను వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పోటీపడేలా తీర్చిదిద్దడం. క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం. ప్రైజ్ మనీ నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలలో బహుమతులు ప్రదానం చేస్తారు. మొత్తం రూ. 12 కోట్లకు పైగా నగదు బహుమతులు, ఇతర ఉత్తేజకరమైన బహుమతులు అందిస్తారు. -
షార్జాలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు షార్జాలోని కింగ్ ఫైసల్ పార్కులో సంఘ సేవకులు రిజవాన్గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనేక మంది అభిమానుల సమక్షంలో ముఖ్యమంత్రి జగన్ గారి పుట్టిన రోజుని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో యూఏఈ వైస్సార్సీపీ కన్వీనర్ సయ్యద్ అక్రమ్, ఇర్షాద్, అబ్దుల్లా, చక్రి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రామాలని వివరిస్తూ మరోసారి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలా శక్తి వంచన లేకుండా కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి ప్రభుత్వం చేస్తున్న మంచిని విస్తృతంగా తీసుకువెళ్లాలి అని ఈ సందర్భంగా వారు పార్టీ శ్రేణుల్ని కోరారు. ఈ సందర్భంగా ఏపీఎన్ఆర్టీసీ ప్రెసిడెంట్ శ్రీ మేడపాటి వెంకట్ గారు, బీహెచ్ ఇలియాస్ గారు ప్రవాసాంధ్రలు అభివృద్ధి కొరకు ప్రభుత్వంతో సమన్వయము చేసుకుంటూ అన్ని విధాలుగా ప్రవాసాంధ్రుల అభ్యున్నతి కొరకు చేస్తున్న కృషిని వారు కొనియాడారు. (చదవండి: లండన్‌లో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు!) -
సీఎం జగన్‌కు మహేశ్ బాబు స్పెషల్ విషెస్!
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సూపర్ స్టార్ మహేశ్ బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్ ద్వారా విషెస్ చెప్పారు. ఈ ఏడాది మీరు మరిన్ని విజయాలు సాధించాలని.. నిండు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్లో రాసుకొచ్చారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున సీఎం జగన్‌కు విషెస్ తెలిపారు. కాగా..సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. Happy birthday to the honourable CM, @ysjagan. Wishing you a year filled with happiness, success, and good health! — Mahesh Babu (@urstrulyMahesh) December 21, 2023 -
బిజినెస్విమెన్ @ ఏపీ.. పారిశ్రామికంలో ముందడుగు
మహిళాభ్యుదయం.. పారిశ్రామిక రంగంలో వారి ప్రగతే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకుసాగుతోంది. మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన సీఎం వైఎస్ జగన్.. వారు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు వివిధ పథకాల ద్వారా తోడ్పాటు అందిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలకు అనేక విధాలుగా సహకారం అందిస్తున్నారు. దీంతో బిజినెస్ రంగంలో ప్రవేశిస్తున్న మహిళల సంఖ్యలో నాలుగేళ్లలో గణనీయంగా పెరిగింది. ఎంఎస్ఎంఈలలో.. ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో దూసుకెళ్తోన్న ఏపీ.. వ్యాపార రంగంలో కూడా ఎన్నో ఘనతలు సాధించడం విశేషం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(MSME) రంగంలో మహిళా పారిశ్రామిక వేత్తల సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లో గణనీయంగానే ఉంది. కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖకు సంబంధించిన ‘ఉద్యమ్’ (Udyam) రిజిస్ట్రేషన్ పోర్టల్ ప్రకారం.. 2020 జులై 1 నుంచి 2023 డిసెంబర్ 4 నాటికి దేశంలో నమోదైన మొత్తం ఎంఎస్ఎంఈల సంఖ్య 3,16,05,581 (Udyam Assist ప్లాట్ఫామ్లో నమోదు చేసుకున్న అనధికారిక సూక్ష్మ సంస్థలతో సహా). వీటిలో మహిళల యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈల సంఖ్య 1,17, 36,406 (ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్ఫామ్లో నమోదైన అనధికారిక మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌తో సహా). ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్లలో మొత్తం 11,37,229 ఎంఎస్ఎంఈలు నమోదయ్యాయి. ఇందులో మహిళా ఎంఎస్ఎంఈలు 5,53,003 ఉన్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మహిళా పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని అర్థం చేసుకోవచ్చు. సంవత్సరాల వారీగా చూస్తే.. సంవత్సరం నమోదైన ఎంఎస్ఎంఈలు 2020-21 6,51,74 2021-22 1,47,374 2022-23 2,45,795 2023-24 6,78,886 మొత్తం 11,37,229 మహిళా యాజమాన్యంలోనివి 5,53,003 రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతోనే.. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు మహిళలను సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తూ వచ్చింది. ఫలితంగా పరిశ్రమల స్థాపనకు ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(MSME) స్థాపనకు లక్షలాది మంది మహిళలు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇండస్ట్రియల్ పాలసీ 2021-23లో మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ కమ్యూనిటీలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి అమలు చేసింది. పవర్ బిల్లులపై సబ్సిడీ, లీజ్ రెంటల్స్ పై రాయితీ, నోటిఫై చేసిన జాతీయ, అంతర్జాతీయ ఎగ్జిబిషన్లలో స్టాల్స్ సెట్ చేయడానికి రీయింబర్స్మెంట్లు, ఫిక్స్డ్ క్యాపిటల్ పై పెట్టుబడి సబ్సిడీ వంటివి మహిళా వ్యవస్థాపకులకు ఇస్తున్న ప్రోత్సాహకాలలో ఉన్నాయి. -
నాలాంటి పేదోడికి జగనన్నే దిక్కు
విత్తు నాటిన వెంటనే చెట్టయిపోదు. ఫలించడానికి దానికి సమయమివ్వాలి. ఈలోగా సంరక్షించాలి. ఇదిగో.. రాష్ట్రంలో ఇపుడా ఫలాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు వెళ్లే ముందు మాయమాటలు చెప్పి... గెలిచాక మరిచిపోయే కుటిల రాజకీయాలకు స్వస్తి చెప్పారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. 2019లో ఎన్నికలకు ముందు ప్రకటించిన మేనిఫెస్టోను... గెలిచిన క్షణం నుంచే మనసా వాచా ఆచరణలోకి తీసుకురావటం మొదలుపెట్టారు. కోవిడ్ చుట్టుముట్టి యావద్దేశాన్నీ అతలాకుతలం చేసినా... రాష్ట్రం సైతం ఆరి్థకంగా తల్లకిందులైనా... ఆడిన మాట తప్పలేదు. ఆరంభించిన ఏ పథకాన్నీ ఆపలేదు. ఫలితం... ‘అమ్మ ఒడి’తో స్కూళ్లలో చదువుకునే పిల్లల సంఖ్య పెరిగింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పింఛన్లను అన్నట్టే రూ. 3,000 వరకూ పెంచుకుంటూ వెళుతుండటంతో వారికి ఆసరా దొరికింది. డ్వాక్రా రుణాల మాఫీతో మహిళలు తలెత్తుకు నిలబడ్డారు. నగదు జమచేసి రైతుకు భరోసా కల్పించటమే కాదు. ఈ–క్రాప్‌తో ఉచితంగా నూరుశాతం బీమా చేయించి పంటనష్టమనే భయం లేకుండా చేశారు. రైతు భరోసా కేంద్రాలతో వ్యవసాయాన్ని లాభసాటి చేశారు. చరిత్రలో తొలిసారి ఉచితంగా ప్రతి పేద మహిళకూ ఇంటి స్థలాన్నివ్వటమే కాక.. ఇళ్ల నిర్మాణానికీ శ్రీకారం చుట్టారు. ‘నాడు–నేడు’తో స్కూళ్లు, ఆసుపత్రుల రూపు రేఖలనే మార్చేశారు. విద్యాకానుక, గోరుముద్ద, వసతి దీవెన పేరిట విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. ఇక ఆరోగ్య రంగంలో తెచ్చిన సంస్కరణలు అమూల్యం. ఆసుపత్రుల రూపురేఖల్ని మార్చటమే కాదు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి దాదాపు ప్రతి చికిత్సా వచ్చేలా ప్రొసీజర్ల సంఖ్యను గణనీయంగా పెంచారు. ఇంటింటికీ ఫ్యామిలీ డాక్టర్‌ను పంపించి, ఉచితంగా మందులిస్తూ పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇలా చెబుతూ వెళితే ఐదేళ్లలో ఇన్ని చేయటం సాధ్యమా? అనే ఆశ్చర్యం కలగకమానదు. కాకపోతే సంకల్పం కన్నా శక్తిమంతమైనదేదీ లేదని నిరూపించారు వైఎస్ జగన్. అందుకే.. ఆ ‘నవరత్నాల’ వెలుగుల్ని ఆయా లబ్ధిదారుల మాటల్లోనే చూపించే ప్రయత్నం ఆరంభించింది సాక్షి.. నా ప్రాణం నిలబెట్టారు.. మాది టెక్కలి సమీపంలోని రాందాస్‌పేట. శ్రీకాకుళం జిల్లా. నేను టెక్కలి రోడ్డులో కొబ్బరికాయలు అమ్ముకుంటూ బతుకుతున్నాను. గతేడాది ఆరో నెలలో ఎక్కువగా గుండె వద్ద నొప్పి వస్తుంటే... అందరూ గ్యాస్టిక్ నొప్పి అని చెప్పారు. శ్రీకాకుళంలోని పెద్ద డాక్టర్‌కు చూపిస్తే వెంటనే ఆపరేషన్ చెయ్యాలని చెప్పారు. అప్పుడే నా గుండె ఆగినంత పనైంది. మా ఆవిడ అమ్ములమ్మతో కలిసి తిరిగి మా ఊరొచ్చేశాము. దిగాలుగా ఉండిపోయాం. నాకు ముగ్గురు ఆడపిల్లలు. ఇద్దరికి పెళ్లి చేసేశాను. ఇంకా ఒక పిల్ల ఉంది. మేము రోజంతా రోడ్డు మీద కొబ్బరికాయలు, పళ్లు అమ్మితేనే ఇళ్లు గడుస్తుంది. ఏం చెయ్యాలిరా దేవుడా అని బెంగపడ్డాను. వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో ఈ డబ్బులు లేకుండానే ఆపరేషన్ చేస్తారని ఎవరో మా ఆవిడకి చెప్పారు. వెంటనే టెక్కలి ఆస్పత్రికి వెళ్లి నా జబ్బు కోసం చెప్పాను. ఇలా చెప్పానో లేదో నాలుగైదు రోజు ల్లోనే ఆపరేçషన్ చేయిస్తామని కబురు చెప్పారు. శ్రీకాకుళం కిమ్స్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు. పది రోజులు అక్కడే ఉన్నాం. వెంటనే పనికి వెళ్లలేనని ఆసరా పథకం అంటూ పది వేలు నగదు నా ఖాతాకు వేశారు. ఆరోగ్యశ్రీ లాంటి పథకం లేకపోతే..నాలాంటి పేదోడికి దిక్కేది చెప్పండి. నాకోసం రూ.4.30 లక్షలు వరకు ఈ ప్రభుత్వం భరించింది. ఈ ఆరోగ్యశ్రీ యే నా ప్రాణం నిలబెట్టింది. ఇప్పుడైతే నా ఆరోగ్యం బాగానే ఉంది. ఉన్న ఆడపిల్లకు పెళ్లి చేసేశాను. ఆనందంగా ఉన్నాను. – బోర రామ్మూర్తి, రాందాస్‌పేట (బి.శివప్రసాద్, విలేకరి, అరసవెల్లి) మా రెక్కల కష్టానికి మద్దతు మాది ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఒమ్మెవరం. పదేళ్ల క్రితం వివాహమైంది. మా కుటుంబంలో నేను చిన్న కోడలిని. మాకు సెంటు భూమి కూడా లేదు. భార్యభర్తలమిద్దరం రెక్కల కష్టం మీదే ఆధారపడి జీవిస్తున్నాం. ఒక్క రోజు కూలికి వెళ్లకపోతే ఆ రోజు పస్తు ఉండాల్సిందే. కూలి పనులకు వెళ్తూనే మా ఇద్దరు బిడ్డలు జాస్మిన్ (8వ తరగతి), అమర్ (7వ తరగతి)లను చదివించుకోవాలి. వారికి మంచి దుస్తులు, పుస్తకాలు కొనాలంటే మాలాంటి వారికి తలకు మించిన భారమే. ఈ దుస్థితిలో మా బిడ్డల్ని ఎలా చదివించాలి అని మథనపడేవాళ్లం. వారు పెద్దవుతున్న క్రమంలో ఇంకా భయం పట్టుకొంది. పెద్ద పెద్ద చదువులు చదివించాలంటే మా వల్ల కాదు. మాలాగా మా పిల్లలు ఉండకూడదు. వారిని ఉన్నత చదువులు చదివించాలనేదే నా ముందున్న పెద్ద సవాలు. కానీ మాకు ఆ స్తోమత లేదు. అలాంటి సమయంలో నాలుగేళ్లుగా ఎలాంటి ఆటంకం లేకుండా అమ్మ ఒడి పథకం మాకు కొండంత ఆసరాగా నిలిచింది. నాలుగేళ్లుగా నా బ్యాంక్ అకౌంట్లో నేరుగా డబ్బులు పడుతున్నాయి. వాటితో మా బిడ్డలకు కావల్సిన ఇతరత్రా వస్తువులు కొనుక్కుంటున్నాము. ఒకప్పుడు స్కూళ్లు తెరుస్తున్నారంటే ఎంతో భయపడిపోయేవాళ్లం. వారికి ఏ విధంగా డబ్బులు సమకూర్చాలి? ఎక్కడ అప్పు చేయాలి..? అని మేమిద్దరం నెల రోజులపాటు ఆలోచించేవాళ్లం. ఎంతమందిని అడిగినా అప్పు పుట్టేది కాదు. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్ ఏమిటా అని భయపడేవాళ్లం. కానీ అమ్మ ఒడి రూపంలో ఆ దేవుడే కరుణించాడు. ఈరోజు ఏపీలో మా లాంటి నిరుపేదల పిల్లలకు మంచి చదువు దొరుకుతోంది. తొందరలో మాకు సొంతింటి కల నెరవేరనుంది. – అత్తంటి యేసుమ్మ, ఒమ్మెవరం (ఎ.మధుబాబు, విలేకరి, నాగులుప్పలపాడు) ఇదిగో మా సొంతిల్లు అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలోని సిబ్యాలకు చెందిన మేము 30 ఏళ్ల క్రితం ముగ్గుÆý‡ు కొడుకులతో కలిసి బతుకుదెరువు కోసం మదనపల్లెకు వలస వచ్చాం. నీరుగట్టువారిపల్లె చౌడేశ్వరినగర్, మాయాబజార్ ఇంకా చానా చోట్ల అద్దె ఇళ్లల్లో ఉన్నాం. బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాళ్లం. ముగ్గురు బిడ్డలకు పెళ్లిళ్లయ్యాక జీవనోపాధికి మగ్గాలు నేసుకునేందుకు వేర్వేరుగా వెళ్లిపోయారు. మాకు వయసై పోవడంతో చంద్రబాబు ఉన్నప్పుడు సొంతింటి కోసం తిరిగాము. చేతిలో అర్జీ పెట్టుకొని తిరగని ఆïఫీసంటూ లేదు. చేతులెత్తి మొక్కని ఆఫీసర్ లేడు.. చెప్పులరిగిపోయాయేగానీ పెద్దసార్ల మనసు కరగలేదు. తహసీల్దార్, మున్సిపాలిటీ ఆఫీస్ వద్ద చాలా సార్లు అర్జీలు ఇచ్చాము. తలదాచుకునేందుకు ఓ చిన్న గూడు కట్టుకుందామన్నది మా ఆశ. అది ఈ జన్మలో తీరదనుకుని ఆశ వదిలేసుకున్నాం. ఓ రోజు మా ఇంటికి వలంటీర్ రోజా ‘పెద్దయ్య, పెద్దమ్మా.. మీకు ఇల్లు మంజూరు చేస్తే కట్టుకుంటారా’అంటూ మా దగ్గరికొచ్చింది. ఇది కూడా వట్టి మాటలే అనుకున్నాం. కొన్ని రోజులుపోయాక శ్రీవారినగర్ సమీపంలో ఇల్లు మంజూరైందని చల్లని కబురు చెప్పింది. పట్టా కూడా చేతికి రావడంతో నమ్మలేకపోయాం. ప్రభుత్వం ఇచ్చిన సొమ్ముతో, మా కష్టంతో ఇల్లు ఇలా కట్టుకున్నాం. – సుబ్బరామయ్య, రాములమ్మ దంపతులు (ఎస్.వంశీధర్, విలేకరి, మదనపల్లి) -
గెలిచేది వైఎస్సార్సీపీ జెండా.. నిలిచేది జగన్ అజెండా
సాక్షి విజయనగరం: జిల్లా బొబ్బిలి గడ్డపై వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర గర్జించింది. అశేష జనవాహిని స్వాగత నినాదాల మద్య వైఎస్సార్ సీపీ సామాజిక సాదికార బస్సు యాత్ర బొబ్బిలిలో అడుగుపెట్టింది. ఈ సందర్బంగా స్థానికులు అపూర్వ స్వాగతం పలికారు. బొబ్బిలి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులతో వైఎస్ఆర్ సీపీ నేతలు, ప్రజా ప్రతినిదులుముచ్చటించారు. అనంతరం బొబ్బిలి జంక్షన్ వద్ద జరిగిన బహిరంగ సభకు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు శంబంగి చిన అప్పలనాయుడు, పుష్పశ్రీ వాణి, బొత్స అప్పలనర్సయ్య తదితరులు హాజరయ్యారు. రుణాల మాపీపై బాబు పంగనామాలు పెట్టాడు, జగన్ టీడీపీ వదిలిన అప్పులు తీర్చారు - డిప్యూటీ సీఎం బూడి ఈ సందర్బంగా జరిగిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని గత పాలకులు ఎంతలా విస్మరించారో, యువనేత జగన్ సీఎం అయ్యాక ఎలా ప్రజల కలలను సాకారం చేసారో ప్రజలు గమనిoచాలన్నారు. బొబ్బిలి కేంద్రంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేస్తే, జగన్ అధికారంలోకి రాగానే ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చారని వివరించారు. ఎస్టీ మహిళ అయిన పుష్ప శ్రీవాణి, ఎస్టీ నేత అయిన పీడిక రాజన్నదొర, బీసీ వర్గానికి చెందిన తాను ఉప ముఖ్యమంత్రులుగా ముఖ్యమంత్రి జగన్ పక్కన కూర్చొని పాలన సాగించడమే సామాజిక సాధికారతకు నిదర్శనమన్నారు. 25 మంది కేబినెట్ మంత్రులు ఉండగా, వారిలో 17 మంది బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ వర్గాలకే కేటాయించారని గుర్తు చేసారు. గడిచిన ఎన్నికలలో ఎవరు ఏ పార్టీకి ఓటు వేసారనే లెక్క లేకుండా అర్హులైన వారందరికీ లబ్ధి చేకూర్చిన ముఖ్యమంత్రి దేశంలో జగన్ ఒక్కరేనన్నారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ విషయంలో చంద్రబాబు పంగనామాలు పెట్టి మోసం చేస్తే, జగన్ సీఎం కాగానే బాబు ఎగ్గొట్టిన అప్పులన్నీ తీరుస్తున్నారన్నారు. వచ్చే జనవరి నుంచి అవ్వా తాతలకు పింఛన్ రూ. 3 వేలు చేయబోతున్నారని, ఎప్పుడూ రెండు వేళ్లు చూపే టీడీపీ నేతలకు పండగ నుంచి మూడు వేలు తీసుకుని వారికి మూడు వేళ్లు చూపాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ స్థాయి సంపన్నుల పిల్లలు ఎలా చదువుకుంటారో, పేదల పిల్లలు కూడా అలానే అభ్యసించాలని ప్రభుత్వ స్కూల్స్ ను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మార్చారని వివరించారు. పేద విద్యార్థుల ఉజ్వల భవిత కోసం జగన్ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే అనేక అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసారని, బొబ్బిలి రాజుల పిల్లలే ఆంగ్లంలో చదువుకోవాలా, ఎస్సీ, బీసీ, ఎస్టీ పిల్లలు చదువుకోకూడదా అని జగన్ నాడు - నాడు ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు. 2024 ఎన్నికల్లో బొబ్బిలిలో శంబంగి చిన అప్పల నాయుడును, రాష్ట్రంలో జగన్ ను మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ముత్యాల నాయుడు ఉద్గాటించారు. జగన్ ఆశీస్సులతో 11,500 ఎకరాలకు సాగునీరిచ్చాం. బొబ్బిలి రాజులు సొంత ఆస్తులు పెంచుకున్నారు - ఎమ్మెల్యే శంబంగి బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు మాట్లాడుతూ, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ, ఇప్పుడు వైఎస్ జగన్ సారథ్యంలో బొబ్బిలి నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో రైతాంగానికి నాలుగున్నరేళ్లలో 11,500 ఎకరాలకు కొత్తగా సాగు నీరు అందించామని, మరో 4,500 ఎకరాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతి లేని పాలనను దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అందిస్తున్నారని వివరించారు. మాట తప్పని, మడమ తిప్పని ఖ్యాతి జాతీయ స్థాయిలో జగన్ కు మాత్రమే ఉందని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 606 హామీలిచ్చి కనీసం ఆరు హామీలు కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. అర్హతలే ప్రతిపాదికగా తీసుకుని సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరుస్తున్నారని, కుల, మతాలకు, రాజకీయాలకు తావు లేకుండా అమలు చేస్తున్నారని వెల్లడించారు. బొబ్బిలి రాజులను నమ్ముకుంటే సొంత డబ్బుతోనైనా ఆదుకుంటారని ప్రచారం చేసుకుంటే, ప్రజల నమ్మి గెలిపిస్తే సొంత ఆస్తులే పెంచుకుని ఓటర్లను వంచించారని విమర్శించారు. గెలిచేది వైఎస్సార్ సీపీ జెండా... నిలిచేది జగన్ అజెండా - కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీ వాణి మాట్లాడుతూ, బొబ్బిలి అడ్డా.. జగన్ అన్న అడ్డాగా నిలిపి బొబ్బిలి కోటపై వైఎస్సార్ సీపీ జెండా ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఎప్పుడూ గెలిచేది వైెఎస్సార్ సీపీ జెండానే అని, ఎన్నడూ నిలిచేది జగన్ అజెండానే అని అభివర్ణించారు. జగన్ ను విమర్శించే టీడీపీ నాయకులకు తాను సవాల్ చేస్తున్నానని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అత్యథికంగా మేలు చేసినట్లు చెప్పే ధైర్యం తమకు ఉందని, అలా చెప్పే దమ్ము తెలుగు తమ్ముళ్లకు ఉందా అని సవాల్ విసిరారు. జగన్ ప్రభుత్వంలో మేలు జరిగిందో, చంద్రబాబు ప్రభుత్వంలో మేలు జరిగిందో తేల్చుకుందాం రావాలని సవాల్ విసిరారు. ఇది దళితుల, ఎస్టీల, బీసీల ప్రభుత్వమని, పేదల కోసం పాటుపడుతోందని వివరించారు. ఓట్ల కోసం ఇంటికి వచ్చే టీడీపీ నేతలను గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేసారో, ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పాలని నిలదీయాలని పిలుపునిచ్చారు. చెరకు రైతులను టీడీపీ మోసం చేస్తే, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ. 35 కోట్లు యాజమాన్యం నుంచి వసూలు చేసి చెల్లించింది - జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, బొబ్బిలిలో సామాజిక సాధికార యాత్రకు వచ్చిన ప్రజానీకాన్ని చస్తుంటే జన సునామీని తలపిస్తోందన్నారు. ఈ ప్రాంతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా మోసం చేసి ఇప్పుడు మళ్లీ ఓట్లు కోసం వస్తున్నారని, వారిని చెప్పే మాయ మాటలను నమ్మవద్దని హితవు పలికారు. చెరకు రైతులను షుగర్ ఫ్యాక్టరీ నిలువునా ముంచేసి మోసం చేస్తే వైెఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రూ. 35 కోట్లు యాజమాన్యం నుంచి ముక్కుపిండి వసూలు చేసి రైతులకు అందించామన్నారు. విజయనగరం జిల్లాతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల రూపు రేఖలు మారుస్తున్న ఘనత జగన్ దేనని కొనియాడారు. వెనుకబడిన వర్గాలన్నీ జగన్ సారథ్యంలో అథికారం అనుభవిస్తున్నామని, టీడీపీ అధికారంలోకి వస్తే మళ్లీ పనుల కోసం బొబ్బిలి రాజుల గేటు వద్ద కాపలా కాయాలని వివరించారు. తోటపల్లి, మడ్డువలస వంటి ప్రాజెక్టులను తీసుకువచ్చి రైతులను ఆదుకున్నామని, చెరకు రైతుల సమస్యలను పరిష్కరించి వారికి కూడా అండగా ఉంటామన్నారు. విద్య,వైద్యం, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు జగన్ కే సాధ్యం - ఎంపీ బెల్లాన విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి పేదలకు చేరువ చేస్తున్నారన్నారు. సంక్షేమం ఓ వైపు, అభివృద్ధి మరోవైపున చేస్తూ జగన్ జనరంజక పాలన చేస్తున్నారన్నారు. సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చి పాలనను ప్రజల చెంతకు తీసుకువచ్చి గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన ఏకైక నేత ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. -
సామాజిక న్యాయానికి ఛాంపియన్ జగనన్న
సాక్షి, కాకినాడ: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సాధించిన సామాజిక సాధికారత ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రజ్వరిల్లింది. సామాజిక సాధికార బస్సు యాత్రలో వేలాది మంది జనం కదలివచ్చారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో వచ్చి జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. జగనన్న అందించిన చేయూతతో తాము సాధించిన సాధికారతను బహిరంగ సభలో బడుగు వర్గాలకు చెందిన నేతలు తెలియచేస్తుంటే ప్రజలు హర్షధ్వానాలు పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పినిపె విశ్వరూప్, మేరుగ నాగార్జున, ఎంపీలు వంగా గీత, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, కురసాల కన్నబాబు, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, పెండెం దొరబాబు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కర్రి పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. మంత్రి పినిపె విశ్వరూప్ మాట్లాడుతూ..... – 14 సంవత్సరాల చంద్రబాబు పాలనకు, నాలుగున్నరేళ్ల జగనన్న పాలనకు తేడా గమనించాలి. – ప్రతి అవ్వాతాత రూ.2,750 పింఛను తీసుకుంటున్నారు. వికలాంగులు రూ.3,500 అందుకుంటున్నారు. దానికి ప్రధాన కారణం గతంలో వైయస్సార్, నేడు జగనన్న. – చంద్రబాబు సీఎంగా పని చేసినప్పుడు 70 రూపాయలున్న పింఛన్ కనీసం 10 రూపాయలైనా పెంచాడా? – చంద్రబాబు 30 లక్షల మందికి వెయ్యి రూపాయల పింఛన్ ఇస్తే, ఈరోజు రూ.2,750 చొప్పున 64 లక్షల మందికి ఇస్తున్న జగనన్న. – ఫీజు రీయింబర్స్మెంట్ అంటే గుర్తుకొచ్చేది వైయస్సార్. – ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు తూట్లు పొడిచిన చంద్రబాబు. 30 శాతం స్లాబ్ విధించి 70 శాతం తల్లిదండ్రులు కట్టుకోవాలని విద్యార్థులను గాలికొదిలేశాడు. – మళ్లీ జగనన్న రాగానే వైయస్సార్ హయాంలో మాదిరిగా పూర్తి ఫీజు ఇస్తున్నారు. – జగనన్న అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లకే సచివాలయ వ్యవస్థ ద్వారా 1.40 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చారు. దేశానికే దిక్సూచిగా నిలిచిన జగనన్న. – రాజశేఖరరెడ్డి సంక్షేమంలో రెండడుగులు వేస్తే, జగనన్న నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నారు. – రాజ్యసభకు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలను 14 సంవత్సరాల్లో ఒక్కరినీ పంపని బాబు. – నలుగురు బీసీలను రాజ్యసభకు పంపిన జగన్మోహన్రెడ్డి. సామాజిక న్యాయానికి ఛాంపియన్ జగనన్న. – ఐదుగురు ఎస్సీలకు మంత్రి పదవులిచ్చిన జగనన్న. బాబు కేవలం ముగ్గురికే ఇచ్చి ఏడాదికోసారి మార్చేశారు. నలుగురు ఎస్సీ మంత్రుల్నీ కొనసాగిస్తున్న సీఎం జగన్. – ఎస్టీలు లేని మంత్రివర్గం చంద్రబాబుది, ఎస్టీని ఉపముఖ్యమంత్రి చేసిన జగన్. – మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వని చంద్రబాబు. మైనార్టీ వర్గానికి డిప్యూటీ సీఎం ఇచ్చిన జగనన్న. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.... – అంబేద్కర్ దగ్గర నుంచి జ్యోతిరావు పూలే, సాహూ మహరాజ్, పెరియార్ రామస్వామి నాయకర్, జగ్జీవన్‌రామ్ లాంటి వారు సామాజిక సాధికారత కోసం విప్లవాలు చేశారు. – ఏపీలోగానీ, భారతదేశంలోగానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలు వారి స్థితిగతుల కోసం ఆలోచించిన నాయకులు కరువయ్యారు. – ఏపీలో జగనన్న సీఎం అయిన తర్వాత ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు భరోసా, ధైర్యం వచ్చాయి. సమాజంలో అసమానతలు తొలిగాయి. – రాజ్యాధికారం వచ్చేలా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు, డబ్బులు అందించి గుండెమీద చెయ్యి వేసుకొని పేదవారు బతకడానికి అవకాశాలు వచ్చాయి. – మన పిల్లలు ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ చదువుతున్నారు. – 31 లక్షల పట్టాలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అందుతున్నాయి. – రూ.2.40 లక్షల కోట్లు డైరెక్ట్‌గా పేదవారికి అందిస్తే అగ్రతాంబూలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కింది. – ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్నాడు చంద్రబాబు. బీసీ కులాల తోకలు కత్తిరిస్తాన్నాడు. బీసీలు జడ్జిలుగా పనికిరారన్నాడు. – మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వని బాబు. ఎస్టీ కమిషన్ ఇవ్వలేదు. దళితులపై దాడులు, అఘాయిత్యాలు చేయించాడు. – 2014లో మూడు పార్టీలు వచ్చాయి. 648 వాగ్దానాలిచ్చాయి. ఒక్కటీ నెరవేర్చలేదు. – చంద్రబాబు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేయలేదు. – పేదల కోసం, భావితరలాల భవిష్యత్ కోసం ఆలోచించే ముఖ్యమంత్రి జగనన్న. – 11.5 శాతం ఉండే పేదరికం 6 శాతానికి తగ్గిందంటే జగనన్న పేదల కోసం ఎంతగా పని చేస్తున్నారో అర్థమవుతోంది. – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగనన్న సీఎం కావడం అవసరం. 2024 ఎన్నికల్లో మనం తప్పు చేస్తే మన గొయ్యి మనమే తవ్వుకుంటాం. ఎంపీ నందిగం సురేష్, మాట్లాడుతూ.... – జగనన్న తన పాదయాత్రలో మన కష్టాలు దగ్గర నుంచి చూశాడు. – నాలుగున్నరేళ్లలో జగనన్న ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. – జగనన్నకు పేదవాడి గుండె తెలుసు. వ్యవసాయ కూలీల చమటవాసన తెలుసు. – మన జీవితాల్లో చీకటి నింపిన వ్యక్తి చంద్రబాబు. రెండెకరాల నుంచి ఆరు లక్షల కోట్లు దోచుకున్నాడు. ఆ సంపద మనదే. – నాడు–నేడు కింద స్కూళ్లు గొప్పగా ఉన్నాయంటే, అవ్వాతాతలు పింఛన్ తీసుకుంటున్నారంటే, వ్యవసాయ రైతులు బాగున్నారంటే జగనన్న కారణం. – వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మన ఇంటికి వచ్చి సమస్యలున్నాయా అని అడుగుతున్నారు. దేశం మొత్తం మీద ఎక్కడా ఇలాంటి వ్యవస్థ లేదు. – మన జీవితాలకు వెలుగునిచ్చే వ్యక్తి జగనన్న. 20–25 ఏళ్లు సీఎంగా ఉంచుకోగలిగితే మన పిల్లలు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లుగా అవుతారు. – చంద్రబాబు పేరు చెబితే ఏ పథకమూ గుర్తుకురాదు. వెన్నుపోటు ఒక్కటే గుర్తుకొస్తుంది. – 2014లో మద్దతు పలికి 2019లో బాబును తిట్టిన పవన్ 2024లో మళ్లీ బాబు మంచోడంటున్నాడు. – పేదవాళ్లు గొప్పవాళ్లు అవ్వాలని అసైన్డ్ భూములకు పట్టాలిచ్చిన జగనన్న. – అమరావతిలో అసైన్డ్ భూములు దోచుకుతిన్న చంద్రబాబు. – ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు నేనున్నానంటూ జగనన్న భరోసా ఇస్తున్నారు. – సామాన్యుడు పార్లమెంటులో కూర్చున్నాడంటే కారణం జగనన్న. ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి మాట్లాడుతూ.... – 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు కేబినెట్లో ఉన్నారు. – నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన జగనన్న. – డైరెక్టర్ పదవులు వెతికి వెతికి బీసీలకు, ఎస్సీలకు ఇచ్చారు. అలాంటి ఆలోచన చేసే ప్రభుత్వం ఎక్కడైనా ఉందా. – నాలుగేళ్లలో రూ.7 లక్షల కోట్లు రాష్ట్రానికి బడ్జెట్ ఉంటే రూ.4.15 లక్షల కోట్లు ఈ వర్గాలకే ఇచ్చారు. – లాంతరు పెట్టి వెతికినా గతంలో బడుగు వర్గాల్లో ఇంజనీరు, డాక్టరు కనిపించేవారు కాదు. ఈరోజు ప్రతి ఇంట్లో ఇంజనీరు,డాక్టర్ ఉన్నారంటే కారణం వైయస్సార్. – ఫీజు రీయింబర్స్మెంట్ తెచ్చి చదువుకొనే అవకాశం కల్పించారు. – ఇంటి స్థలాలు ఇస్తుంటే ప్రతిపక్షాలు ఎద్దేవా చేశారు. రాజధానిలో సోషల్ డెమోగ్రఫీ చెడిపోతుందన్నారు. – 30 లక్షల పట్టాలిచ్చి ఇళ్లు కట్టించేందుకు లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్న జగనన్న. – మహిళలంటే పొలాల్లో కోతలకే, వంటింటికే పరిమితమయ్యేవారు. ఇప్పుడు ప్రతి పథకాన్నీ మహిళ పేరు మీద పట్టా, విద్యాదీవెన, వసతి దీవెన సొమ్ము తల్లి పేరుమీద ఖాతాలో వేస్తున్నారు. – గతంలో పార్టీ, కులం చూసేవారు. మనకు ఓటు వేస్తారా అని చూసేవారు. మన కులాలను బానిసలుగా భావించేవారు. – ఈరోజు ఎవరి దగ్గరకూ వెళ్లాల్సిన పని లేదు. అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ... – జనం గుండెచప్పుడు జగనన్న. కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి పేద కుటుంబం గుండెల్లో జగనన్న ఉన్నారు. – వెనుకబడిన కులాలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చిన జగనన్న. – దేశం మొత్తం ఆయనవైపు తిరిగి చూస్తోంది. రోల్‌మోడల్‌గా సామాజిక న్యాయాన్ని, సంస్కరణలను అమలు చేస్తున్నారు. – 2014–19 మధ్య ఏ విధమైన సామాజిక న్యాయం చంద్రబాబు చేశారు? ఈరోజు ఏ విధమైన సామాజిక న్యాయం జరుగుతోందో చర్చకు సిద్ధం. – రూ.2.40 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లలో వేసి సామాజిక న్యాయానికి, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా జగనన్న ఉన్నారు. – ఏ ఎన్నికల్లో, ఏ పార్టీ మేనిఫెస్టోలో చూసినా జగనన్న పథకాలు కనిపిస్తాయి. – వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, పెన్షన్ల విధానం ఇస్తామని రాష్ట్రాలు చెబుతున్నాయి. – బాబుకే గ్యారెంటీ లేదు. ఆయన ఇంకేం గ్యారెంటీ ఇస్తాడు. బాబు గ్యారెంటీల్లోనూ జగనన్న స్పూర్తి ఉంది. -
మీరిచ్చిందే.. మీ బిడ్డ ధైర్యం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘మీ బిడ్డ ఎవరికీ భయపడడు. ఎవరితోనూ పొత్తులు పెట్టుకోడు. మీ బిడ్డ పొత్తు ప్రజలతోనే. ఎన్నికలు సమీపిస్తుండటంతో గజదొంగల ముఠా, దత్తపుత్రుడు అంతా ఏకమై ప్రజలను మోసం చేసేందుకు అడుగులు వేస్తున్నారు’’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. మాజీ సీఎం చంద్రబాబు ఏనాడూ ప్రజలకు మంచి చేసి అధికారంలోకి రాలేదని, వంచనతోనే పదవి దక్కించుకున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు మోసాలను తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ఆ అన్యాయాలను గుర్తు తెచ్చుకోండి.. గత ముఖ్యమంత్రి (చంద్రబాబు నాయుడు) మాదిరిగా తన వర్గం, తన వాళ్లు, గజదొంగల ముఠా, దత్తపుత్రుడి కోసం ప్రజలందరి ప్రయోజనాలను తాకట్టు పెడితే సామాజిక అన్యాయం జరుగుతుంది. గజదొంగల ముఠా, జన్మభూమి కమిటీల కోసం దోచుకోవాలని భావించే వ్యక్తి సీఎం స్థానంలో కూర్చుంటే ఏం న్యాయం చేస్తాడో మనమంతా చూశాం. రైతులు, అక్క చెల్లెమ్మలు, నిరుద్యోగులకు ఎంత అన్యాయం చేశాడో చూశాం. 2014 నుంచి 2019 వరకు ఆ ఐదేళ్లలో ప్రత్యక్ష సాక్షులుగా అవన్నీ గుర్తు తెచ్చుకోవాలని కోరుతున్నా. ప్రాంతాలకు, సమాజంలో మనుషులకు అన్యాయం చేసిన ఆ పెద్ద మనిషి చంద్రబాబు గురించి మరో రెండు మాటలు కూడా చెబుతా. చంద్రబాబు ఎన్నడూ ప్రజలకు మంచి చేసి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోలేదు. ఆయన తీసుకొచ్చిన మంచి స్కీముల వల్లనో లేక చేసిన మంచి పనుల వల్లనో ఏనాడూ సీఎం కాలేదు. ఆ పెద్ద మనిషి సీఎం ఎలా అయ్యాడో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. కూతుర్ని ఇచ్చిన మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి మొట్టమొదటిసారి సీఎం అయ్యాడు. రెండోసారి కార్గిల్ యుద్ధం పుణ్యమా అని సీఎం అయ్యాడు. రైతన్నలకు రూ.87,612 కోట్లు రుణమాఫీ చేస్తానని, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రుణమాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని, జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పి 2014లో మూడోసారి సీఎం అయ్యాడు. ఆ తర్వాత రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలను కూడా వదలకుండా ఎంత మోసం చేశాడో చూసిన ప్రజలు 2019 ఎన్నికల్లో చంద్రబాబు గూబ గుయ్‌మనిపించేలా 151 స్థానాలతో మీ బిడ్డను గెలిపించారు. అలాంటి వ్యక్తిని ఎవరైనా నమ్మగలరా? మిగతా సామాజిక వర్గాలంటే చంద్రబాబుకు ఎంత చులకనో ఆయన పాలనను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నోటి నుంచి వచ్చిన మాటలను జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నా. ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా..? అని ఆయన అన్న మాటలను గుర్తు తెచ్చుకోండి. నాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆ వ్యక్తి బీసీల తోకలు కత్తిరిస్తా.. ఖబడ్దార్! అంటూ బెదిరించిన వైనాన్ని గుర్తు తెచ్చుకోండి. ఇదే పెద్దమనిషికి అక్క చెల్లెమ్మల మీద ఉన్న చులకన భావనను కూడా గుర్తు తెచ్చుకోండి. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా..? అంటూ చులకనగా వ్యాఖ్యానించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అసలు సమాజం మీద ప్రేమ గానీ రైతుల పట్ల గౌరవం గానీ అక్కచెల్లెమ్మల సాధికారత, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలపై కమిట్మెంట్ గానీ లేని ఇలాంటి నాయకుడు ఎవరికి మేలు చేయగలుగుతాడు? ఎప్పుడైనా మేలు చేశాడా? ఇలాంటి వారిని అసలు నమ్మగలరా? విజ్ఞతతో ఆలోచించండి.. రాబోయే రోజుల్లో ఆయన అబద్ధాలు, మోసాలు ఎక్కువ అవుతాయి. ఆయనకు తోడు గజదొంగల ముఠా! ఆ ముఠాకు తోడు దత్త పుత్రుడు ఏకమవుతారు. వీరందరూ కలసి ప్రజలను మోసం చేసేందుకు అడుగులు వేస్తారు. ప్రతి ఇంటికీ బంగారం, బెంజ్ కారు కూడా ఇస్తామంటారు. వాటిని విని మోసపోకండి. ఆ అబద్ధాలను నమ్మకండి. గతంలో ఇదే పెద్ద మనుషులిద్దరూ కలిసి వచ్చి 2014లో ఏం చెప్పారు? వాటిని అమలు చేశారా లేదా? అని ఆలోచించి విజ్ఞతతో అడుగులు ముందుకు వేయాలి. తోడేళ్లంతా ఏకమైనా.. ఒంటరిగానే సింహం వీళ్ల మాదిరిగా నాకు అబద్ధాలు చెప్పడం చేతకాదు. వాళ్ల మాదిరిగా మీ బిడ్డకు కుట్రలు, కుతంత్రాలు చేయడం తెలియదు. మీ బిడ్డ మోసం చేయడు, అబద్ధాలు ఆడడు. ఇది కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నా. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయి. మీ బిడ్డకు వారి మాదిరిగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడి సపోర్టు లేదు. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగిందా లేదా అని మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మీరే సైనికులుగా నిలబడండి. మీ బిడ్డ ఎవరితోనూ పొత్తు పెట్టుకోడు.. మీ బిడ్డ పొత్తు కేవలం మీతోనే ఉంటుంది. తోడేళ్లు మొత్తం ఏకమై వచ్చినా కూడా సింహం ఒంటరిగానే నడుచుకుంటూ వస్తుంది. మీ బిడ్డకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఈ ధైర్యం మీ దగ్గర నుంచే వచ్చింది. నేను దేవుడిని నమ్ముతా. మీ ఆశీస్సుల మీద ఆధారపడతా. ఇవే మీ బిడ్డకు ధైర్యాన్ని ఇస్తాయి. సీఎం సభలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, తానేటి వనిత, పినిపే విశ్వరూప్, మేరుగ నాగార్జున, ఎంపీలు మిథున్‌రెడ్డి, కోటగిరి శ్రీధర్, కృష్ణా, ఏలూరు జిల్లాల ఎమ్మెల్యేలు మేకా వెంకట ప్రతాప అప్పారావు, తలారి వెంకట్రావు, పుప్పాల వాసుబాబు, తెల్లం బాలరాజు, దూలం నాగేశ్వరరావు, పేర్ని నాని, సామినేని ఉదయభాను, జెడ్పీ చైర్పర్సన్లు ఘంటా పద్మశ్రీ, ఉప్పాల హారిక తదితరులు పాల్గొన్నారు. నూజివీడులో పల్ప్ యూనిట్, ప్రాసెసింగ్ ప్లాంట్ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు కోరినట్లుగా 16 వార్డు సచివాలయాల పరిధిలో పనులకు ఒక్కో సచివాలయానికి రూ.కోటి చొప్పున రూ.16 కోట్లు కేటాయిస్తున్నాం. రూ.275 కోట్లతో మ్యాంగో పల్ప్ యూనిట్, ప్రాసెసింగ్ ప్లాంట్‌కు త్వరలో పునాది రాయి వేయబోతున్నాం. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తాం. -
34 లక్షల ఎకరాలపై పేదలకు హక్కులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములపై పేదలకు సర్వ హక్కులు కల్పింస్తోంది మీ బిడ్డ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. పేదలు, రైతుల గుండె చప్పుడు విన్నది కాబట్టే మనందరి ప్రభుత్వం దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా వారికి భూములపై పూర్తి హక్కులు కల్పిస్తూ మనస్ఫూర్తిగా మంచి చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35,44,866 ఎకరాలకు సంబంధించి 20,24,709 మంది పేదలకు హక్కులు కల్పించి ఆ భూములను మీ బిడ్డ ప్రభుత్వం వారి చేతుల్లో పెడుతోందన్నారు. మనందరి ప్రభుత్వంలో సామాజిక న్యాయమన్నది ఒక నినాదంగా కాకుండా ఒక విధానంగా అమలు చేస్తున్నామని చెప్పారు. పేద వర్గాలను అక్కున చేర్చుకుని సామాజిక, ఆర్థిక న్యాయం చేయగలిగామన్నారు. ప్రతి పేదవాడు కాలర్ ఎగరవేసి అదిగో మా అన్న ప్రభుత్వం.. మా ప్రభుత్వం.. మా కోసం ఆలోచన చేసేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పుకునే విధంగా పాలన సాగిందని చెప్పేందుకు గర్విస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 46,463.82 ఎకరాల భూమిని 42,307 మందికి కొత్తగా డీకేటీ పట్టాలు పంపిణీ చేసే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. దశాబ్దాలుగా అనుభవదారులుగా ఉన్న పేద రైతులకు అసైన్డ్ భూములపై హక్కులు కల్పించడంతోపాటు చుక్కల భూముల సమస్యకు సైతం పరిష్కారాన్ని చూపామన్నారు. దళితుల శ్మశాన వాటికల కోసం 1,563 గ్రామాల్లో 951 ఎకరాలను కేటాయిస్తున్నట్లు తెలిపారు. 2003 నాటి అసైన్డ్ భూములపై హక్కులు, కొత్తగా డీకేటీ పట్టాలను అందిస్తూ పేదలకు వెన్నుదన్నుగా నిలుస్తుంటే పెత్తందారులకు నచ్చడం లేదని మండిపడ్డారు. పేద వర్గాల పట్ల బాధ్యతగా, చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంటే ప్రతిపక్షం కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో నిరుపేదలకు భూ పంపిణీ, అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు, లంక భూములకు పట్టాలు, చుక్కల భూములు, షరతు గల పట్టా భూములు, సర్వీస్ ఈనాం భూములు 22 (ఏ) నుంచి తొలగింపు, భూమి కొనుగోలు పథకం ద్వారా అందించిన భూములపై హక్కుల కల్పన, గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. భూములకు సంబంధించి కేవలం 53 నెలల వ్యవధిలో తీసుకున్న తొమ్మిది రకాల విప్లవాత్మక నిర్ణయాలతో పేదలు, రైతన్నలకు చేకూర్చిన మేలును వివరిస్తూ ఆయా అంశాలను సీఎం జగన్ ప్రస్తావించారు. నిర్ణయం1 దేశంలో వందేళ్ల తరువాత మన ప్రభుత్వ హయాంలో భూముల రీసర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పటికే రెండు దశల్లో నాలుగు వేల గ్రామాల్లో భూముల రీ సర్వే విజయవంతంగా పూర్తి చేశాం. మొత్తంగా 42.60 లక్షల ఎకరాల్లో రీసర్వే పూర్తై యజమానులకు భూ హక్కు పత్రాలను కూడా అందజేశాం. దాదాపు 45 వేల సరిహద్దు వివాదాలను పరిష్కరించి రికార్డులను అప్డేట్ చేశాం. 15 వేల మంది సర్వేయర్లు రైతులకు మంచి చేసే విషయంలో నిమగ్నమయ్యారు. రీసర్వే పూర్తి అయిన చోటగ్రామ సచివాలయాల్లోనే రిజి్రస్టేషన్లు జరుగుతున్నది మీ బిడ్డ ప్రభుత్వ హయాంలోనే. మూడో విడత కూడా మొదలు పెడుతున్నాం. నిర్ణయం2 15.41 లక్షల మంది పేద రైతులకు మంచి అసైన్మెంట్ చేసి 20 ఏళ్లు గడిచిన భూములపై లబ్ధిదారులకు సర్వహక్కులు కలి్పంచే కార్యక్రమం మీ బిడ్డ ప్రభుత్వ హయాంలోనే జరుగుతోంది. దీనివల్ల 27.42 లక్షల ఎకరాలపై సంపూర్ణ హక్కులను కల్పించగా 15.41 లక్షల మంది పేద రైతులకు మంచి జరుగుతోంది. పేద సామాజిక వర్గాలకు మంచి జరిగే గొప్ప కార్యక్రమం ఇది. పెత్తందారీ పోకడలపై పేదల ప్రభుత్వం, మీ బిడ్డ సాధించిన గొప్ప విజయంగా ఇది చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోతుంది. భూములను గుంజుకునే పరిస్థితుల నుంచి అసైన్డ్ భూములపై పూర్తి హక్కులను ఆ పేదవాడికి కలి్పంచే గొప్ప మార్పులకు ముందడుగు పడింది. చంద్రబాబు హయాంలో అసైన్డ్ భూములను తన అత్తగారి సొత్తు అన్నట్లుగా ఆక్రమించుకున్నారు. నిర్ణయం3 అప్పుడెప్పుడో బ్రిటిష్ పాలనలో రీసర్వే అండ్ సెటిల్మెంట్ రిజిస్ట్రార్ నమోదు చేసే సమయంలో వివరాలు అందుబాటులో లేని భూములను చుక్కల భూములుగా చూపించారని చంద్రబాబు ప్రభుత్వం 2016లో వీటిని నిషేధిత జాబితాలో 22 (ఏ)లో చేర్చడంతో రైతన్నలు అల్లాడిపోయారు. రైతులు, భూములున్నాయి కానీ హక్కు పత్రాలు మాత్రం లేవు. దీనికి కారణం చంద్రబాబు ఆ భూములను నిషేధిత భూముల్లో చేర్చడమే. దీన్ని సరిదిద్దుతూ 2.6 లక్షల ఎకరాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి 1.2 లక్షల మంది రైతులకు మంచి చేశాం. ఇది కూడా మీ బిడ్డ పాలనలోనే జరిగింది. నిర్ణయం4 పేదవాడికి భూ హక్కులు కల్పించేందుకు మీ బిడ్డ ప్రభుత్వం ఎంత గొప్పగా అడుగులు వేసిందో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. షరతులు గల పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. 1934లో రీసర్వే రిజిస్టర్ రిమార్క్స్ కాలంలో షరతులు గల పట్టాగా నమోదు చేయడంతో ఆ భూమిపై రైతులకు హక్కులు లేని పరిస్థితి నెలకొనగా ఇప్పుడు ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాం. 33,394 ఎకరాలు సాగు చేసుకుంటున్న 22,045 మంది రైతులకు మంచి చేస్తూ సర్వహక్కులు పేదవాడి చేతుల్లో పెట్టింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమేనని చెప్పేందుకు గర్వపడుతున్నా. నిర్ణయం5 ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన భూములు రుణంలో ఉండటంతో హక్కులు కోల్పోయిన ఎస్సీ రైతుల రుణాలను మాఫీ చేస్తూ వారికి సర్వహక్కులు కలి్పంచింది కూడా మన అందరి ప్రభుత్వమే. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలైన 22,346 మంది దళితులకు పంపిణీ చేసిన 22,387 ఎకరాలకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తాకట్టు పెట్టిన ఆ భూములన్నింటినీ 21( ఏ) జాబితా నుంచి తొలగించి రుణాలు మాఫీ చేసి రైతులకు పూర్తి హక్కులు కలి్పంచాం. నిర్ణయం6 ప్రతి పేదవాడికి సాధికారత కలి్పస్తూ చెయ్యి పట్టుకుని తోడుగా నిలిచి నా గిరిజన రైతులకు మంచి జరగాలని అడుగులు వేశాం. ఈ దిశగా పట్టాల పంపిణీ మరో ప్రధానమైన నిర్ణయం. తరతరాలుగా కొండల్లో, అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న మన గిరిజన సోదరులకు, గిరిజన అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని తపిస్తూ సాగు హక్కులు కలి్పంచాం. 1,56,655 గిరిజన కుటుంబాలకు మంచి చేస్తూ 3,26,982 ఎకరాలను పంపిణీ చేసింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. నిర్ణయం7 తరతరాలుగా లంక భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు లేకపోవడం వల్ల లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. వారంతా ఏ సహాయం అందని దుస్థితిలో ఉన్నారు. లంక భూములు సాగు చేసుకుంటున్న అలాంటి రైతన్నలను గుర్తించి వారికి డీకేటీ పట్టాలు, లీజు పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం. లంక భూముల్లో సాగు చేసుకుంటున్న వారిని ఎంజాయిమెంట్ సర్వే ద్వారా నిర్ధారించి ఏ, బీ కేటగిరీలకు డీకేటీ పట్టాలు, సీ కేటగిరికి చెందిన వాటికి లీజు పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. 17,768 మంది పేద రైతులకు మంచి జరిగేలా అడుగులు ముందుకు వేసే కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ నుంచి శ్రీకారం చుట్టాం. నిర్ణయం8 గతంలో అన్ని గ్రామాల్లో సర్వీస్ ఈనాం భూములను నిషేధిత జాబితా కింద 22 (ఏ) కింద చేర్చారు. ఒక్క దేవాలయాలు, ఇతర సంస్థలకు సంబంధించిన ఈనాం భూములు మినహా మిగిలిన అన్ని సరీ్వస్ ఈనామ్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశాం. ఆ భూములకు సంబంధించి 1,61,584 మంది రైతులకు మరీ ముఖ్యంగా కుమ్మరి, కమ్మరి, రజకులు, నాయీ బ్రాహ్మణులు తదితర వృత్తుల వారికి మంచి జరిగేలా, వారి సమస్య పరిష్కారమయ్యేలా నిషేధిత జాబితా నుంచి తొలగించి పూర్తి హక్కులు కలి్పస్తున్నాం. నిర్ణయం9 రాష్ట్రవ్యాప్తంగా మరో 42,307 మంది నిరుపేదలకు 46,463 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమానికి ఇక్కడే శ్రీకారం చుడుతున్నాం. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా నిరుపేద వర్గాలకు మంచి జరిగేలా అడుగులు ఇక్కడ నుంచి పడుతున్నాయి. ఇవన్నీ కేవలం 53 నెలల్లోనే భూములకు సంబంధించి చేసిన మంచి పనులు. ప్రతి పేదవాడిని చెయ్యి పట్టుకుని నడిపించే కార్యక్రమం ఎలా చేశామో చెప్పడానికే ఈ తొమ్మిది అంశాలను ప్రస్తావించా. అంతిమ సంస్కారాల్లోనూ అంటరానితనమా? ప్రతి పేదవాడి గురించి ఆలోచన చేస్తూ ఇవాళ ఇంకో గొప్ప అడుగు పడింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా రాష్ట్రంలో ఇప్పటికి కూడా చాలా గ్రామాలలో ఎస్సీ వర్గాల వారి అంతిమ సంస్కారాల కోసం అనువైన భూమి లేని పరిస్థితి. తరతరాలుగా అవమానాలు ఎదుర్కొన్న వీరికి చివరికి అంతిమ సంస్కారాల విషయంలోనూ అంటరానితనం పాటించే దుస్థితి ఉంటే మనుషులుగా మనం ఏం ఎదిగినట్లు? అనే ఆలోచన ప్రతి ఒక్కరి మదిలోనూ రావాలి. రాష్ట్రవ్యాప్తంగా 1,854 గ్రామ సచివాలయాల పరిధిలో శ్మశాన వాటికల కోసం 1,250 ఎకరాలు అవసరమని నివేదికలిచ్చారు. వీటిలో 1,563 సచివాలయాల పరిధిలో ఇప్పటికే 951 ఎకరాలను సేకరించి గ్రామ పంచాయతీలకు అప్పగించాం. ఇంత చిన్న విషయాన్ని కూడా నేను పరిశీలించి పర్యవేక్షిస్తున్నా. -
మైనారిటీల గురించి సీఎం జగన్..!
-
సీఎం జగన్ మంచితనం అంటే ఇదే
-
కోవిడ్ సమయంలో రోల్ మోడల్ గా ఏపీ నిలిచింది.
-
ఈ సారి వైఎస్సార్సీపీ మెజారిటీ అంతకుమించి: విజయసాయి రెడ్డి
అమరావతి: తెలుగు ప్రాంతం సాంకేతికంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా 2014 జూన్ 2న విడిపోయాక రెండు చోట్ల శాసనసభ ఎన్నికలు ఆరు నెలల తేడాతో నిర్వహించడం ఐదేళ్ల క్రితం మొదలైంది. తెలంగాణ అసెంబ్లీకి రెండో ఎన్నికలు దాని పదవీ కాలం ముగియడానికి ఆరు నెలలు ముందు 2018 డిసెంబర్ 7న జరిగాయి. పాలకపక్షమైన తెలంగాణ రాష్ట్ర సమితి బలం మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో 63 నుంచి 88 స్థానాలకు పెరిగింది. ఓట్ల శాతాన్ని కూడా ఈ ఎన్నికల్లో 46.9 శాతానికి పెంచుకోగలిగింది. ఆరు నెలల తర్వాత 17వ లోక్ సభ ఎలక్షన్లతోపాటు జరిగిన ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రజలు వినూత్న, చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. 2019 ఏప్రిల్–మే మాసాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో ఏపీలో నాటి పాలకపక్షాన్ని తొలగించి, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మునుపెన్నడూ కనీవినీ ఎరగని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. మొత్తం 175 సీట్లకు గాను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని పార్టీకి 151 సీట్లలో విజయాన్ని అందించారు. పాలక టీడీపీకి కేవలం 23 సీట్లే ఇచ్చి అసెంబ్లీలో, రాష్ట్రంలో మూలన కూర్చోబెట్టారు. ఐదేళ్ల అడ్డగోలు పరిపాలనకు తెలుగుదేశం చెల్లించిన మూల్యం ఇది. నూతన రాజధాని అమరావతి పేరుతో, ఇంకా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వంటి పేర్లుతో చేసిన కుంభకోణాలపై ఆంధ్రా ప్రజలు ఇలా స్పందించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని పన్నెండేళ్ల ఉద్యమాల ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి తన నాలుగున్నరేళ్ల పాలన తర్వాత జరిపించిన 2018 డిసెంబర్ ఎన్నికల్లో తన బలాన్ని 25 సీట్లు పెంచుకుని మరో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంది. 2022 అక్టోబర్ లో భారత రాష్ట్రసమితిగా (బీఆరెస్) మారిన టీఆరెస్ ఇప్పుడు మూడోసారి తనకు పరిపాలించే అవకాశం ఇవ్వాలని జనం ముందకు పోతోంది. తొమ్మిదిన్నరేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, మరో జాతీయపక్షం బీజేపీ తెలంగాణ ఎన్నికల్లో పాలక ప్రాంతీయపక్షంతో పోటీపడుతున్నాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని పార్టీకి మూడోసారి పరిపాలించే అవకాశం ఇవ్వాలా? అనేది తెలంగాణ ఓటర్ల ముందున్న ప్రశ్న. ఈసారి అంతకుమించి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రగతితోపాటు ప్రజా సంక్షేమంపై అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచీ దృష్టి పెట్టింది. వృద్ధాప్య పెన్షన్లను దశలవారీగా పెంచుతూ పోయే ఫైలుపైనే కొత్త సీఎం జగన్ 2019 మే 30న లక్షలాది మంది ప్రజానీకం ముందు సంతకం చేశారు. ‘నవరత్నాలు’ పేరుతో ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన అన్ని హామీలను నెరవేర్చే పనిని కృతనిశ్చయంతో మొదలుబెట్టింది రాష్ట్ర సర్కారు. పేద, దిగువ మధ్య తరగతి ప్రజల అభ్యున్నతికి రూపొందించిన అనేక నగదు బదిలీ పథకాలను గత నాలుగున్నర సంవత్సరాలుగా పకడ్బందీగా అమలు చేస్తోంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. మతం, కులం, పార్టీ భేదం లేకుండా ఆంధ్రా ప్రజలంతా రాష్ట్ర సర్కారు పనితీరుపై పూర్తి సంతృప్తితో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం తన అనుకూల మీడియా సాయంతో పాలకపక్షంపై దుష్ప్రచారం చేసే కార్యక్రమాన్ని 2019 వేసవి నుంచీ నిరాటంకంగా కొనసాగిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ చివర్లో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అవినీతి కుంభకోణంలో తెలుగుదేశం అగ్రనేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అయినప్పటి నుంచీ ఓ పక్క కోర్టుల్లో న్యాయవిచారణ ప్రక్రియ కొనసాగుతోంది. మరో పక్క టీడీపీ నేతలు, చంద్రబాబు కుటుంబసభ్యులు అబద్ధాలు, అర్థసత్యాలతో చంద్రబాబు అరెస్టు ‘అన్యాయమంటూ’ గావుకేకలు పెడుతూ రోడ్లెక్కుతున్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఎంత అవినీతి జరిగిందో స్వయంగా చూసిన తెలుగు ప్రజానీకం మాత్రం అవినీతి ఆరోపణలపై జరిగిన మాజీ సీఎం అరెస్టుపై హేతుబద్ధంగానే స్పందిస్తున్నారు. సొంత రాష్ట్రం ఏపీలో జనం నుంచి తమ నాయకుడి అరెస్టుపై ‘సానుభూతి వర్షం’ కురవకపోవడంతో టీడీపీ కొత్త వ్యూహానికి తెర తీసింది. హైదరాబాద్ నగరంలోని ఐటీ ఉద్యోగులు, ఆంధ్రా మూలాలున్న కొన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుని భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు చేయడానికి ఈ పార్టీ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆరు నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా–జనాదరణ కరవైన టీడీపీ ఇప్పుడు నిరాశా నిస్పృహలతో చేస్తున్న విన్యాసాలను ఆంధ్రాప్రజలు గమనిస్తున్నారు. 2024 ఏప్రిల్–మేలో జరిగే సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గట్టిగా బుద్ధిచెబుతారు. వైఎస్సార్సీపీ మెజారిటీని 160 సీట్లు దాటించి ఇంకా ఎందాకా తీసుకెళతారనేదే ప్రస్తుతం రాజకీయ, ఎన్నికల విశ్లేషకుల చర్చనీయాంశం. -విజయసాయి రెడ్డి, రాజ్యసభ ఎంపీ ఇదీ చదవండి: వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ఉత్తమ పథకం -
Infy New Campus: సీఎం జగన్ తోడ్పాటు హర్షణీయం: ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ నీలంజన్ రాయ్
ఆంధ్రప్రదేశ్‌లో సంస్థల ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తున్న సీఎం జగన్ చేస్తున్న కృషి హర్షణీయం అని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీలంజన్ రాయ్ అన్నారు. సీఎం జగన్ వైజాగ్‌లోని రుషికొండలో సంస్థ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నీలంజన్ రాయ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని విశాఖపట్నం ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు అందిస్తున్న మద్దతుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, డిజిటల్ వంటి సాంకేతికతలపై దృష్టి సారిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు. సంస్థ భవనాన్ని 83,750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశామన్నారు. సుమారు 1,000 మంది ఉద్యోగులకు హైబ్రిడ్ వర్క్ కోసం అన్ని వసతులు కల్పించేలా దీన్ని రూపొందించామన్నారు. -
నాపై హత్యాయత్నం కుట్ర కోణంలో క్షుణ్ణంగా దర్యాప్తు జరపలేదు
సాక్షి, అమరావతి: తనపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం వెనుక ఉన్న కుట్ర కోణంపై లోతుగా దర్యాప్తు చేసేలా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ను ఆదేశించాలన్న పిటిషన్‌ను విజయవాడ ఎన్ఐఏ కోర్టు కొట్టి వేయటాన్ని సవాల్ చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రీ అభ్యంతరాలపై విచారణ జరిపే నిమిత్తం ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు వచి్చంది. న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి దీనిపై విచారణ జరిపారు. సీఎం జగన్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. రిజిస్ట్రీ అభ్యంతరాలకు సంబంధించి నిరంజన్‌రెడ్డి వినిపించిన వాదనలతో న్యాయమూర్తి సంతృప్తి చెందారు. ఈ క్రమంలో ఎన్ఐఏ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్‌కు నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేశారు. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2018 అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో జనిపల్లి శ్రీనివాసరావు అలియాస్ చంటి అనే వ్యక్తి ఆయనపై హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. నిందితుడు పదునైన కత్తితో వైఎస్ జగన్ మెడపై దాడికి ప్రయతి్నంచాడు. ఈ ఘటనలో వైఎస్ జగన్ ఎడమ చేయికి లోతైన గాయమైంది. ఈ ఘటనపై హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు జరిపిన ఎన్ఐఏ చార్జిïÙట్ దాఖలు చేసింది. వైఎస్ జగన్‌ను చంపడమే నిందితుడు శ్రీనివాసరావు ఉద్దేశమని, అందుకే మెడపై కత్తితో దాడికి ప్రయతి్నంచాడని ఎన్ఐఏ చార్జిషీట్లో పేర్కొంది. దీని వెనుక ఉన్న కుట్ర వ్యవహారాన్ని తదుపరి దర్యాప్తులో తేలుస్తామని ప్రత్యేక కోర్టుకు నివేదించింది. అయితే అటు తరువాత కుట్ర కోణంపై ఎన్ఐఏ దృష్టి సారించలేదు. ఈ నేపథ్యంలో తనపై హత్యాయత్నం ఘటన వెనుక ఉన్న కుట్రపై లోతైన దర్యాప్తు జరిపేలా ఎన్ఐఏను ఆదేశించాలని అభ్యరి్థస్తూ సీఎం వైఎస్ జగన్ ఈ ఏడాది ఏప్రిల్‌లో విజయవాడ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్ఐఏ దర్యాప్తులో లోపాలను కోర్టు దృష్టికి తెచ్చారు. కాగా ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు దీన్ని కొట్టివేస్తూ ఈ ఏడాది జూలై 25న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీఎం జగన్ తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యకాలీన పిటిషన్ (ఇంటర్లాక్యుటరీ)పై ఎన్ఐఏ కోర్టు ఇచి్చన ఉత్తర్వులపై క్వాష్ పిటిషన్ దాఖలు చేయవచ్చా? అంటూ రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది. దీనిపై విచారణ జరిపే నిమిత్తం పిటిషన్ శుక్రవారం హైకోర్టులో విచారణకు వచి్చంది. సీఎం జగన్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ వ్యాజ్యకాలీన పిటిషన్‌పై క్వాష్ పిటిషన్ దాఖలు చేయవచ్చని, పలు సుప్రీం కోర్టు తీర్పులను కోర్టుకు నివేదించారు. ఈ కేసులో ఉత్తర్వులు జారీ చేసే పరిధి విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు లేదన్నారు. కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ ప్రకారం ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశి్చమ గోదావరి జిల్లాలు విశాఖ ఎన్ఐఏ కోర్టు పరిధిలోకి వస్తాయన్నారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ కేసును విచారించే పరిధి విశాఖ ఎన్ఐఏ కోర్టుకు మాత్రమే ఉందన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ కోర్టు ఉత్తర్వులు చెల్లవన్నారు. వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చారు. -
గిరిజనాభివృద్ధికి పెద్దపీట
వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించడంలో విద్య పాత్ర కీలకం. భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేసిన 28 ఏకలవ్య పాఠశాలల్లో 24 స్కూళ్లు వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లోనే ఉన్నాయి. వీటి ద్వారా రాష్ట్రంలోని గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్య అందుతోంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం 1,953 ప్రభుత్వ ప్రాథమిక, 81 గురుకుల, 378 ఆశ్రమ పాఠశాలలతో పాటు 179 ప్రీ, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లను నిర్వహిస్తోంది. మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు–నేడు కార్యక్రమం ద్వారా ఈ స్కూళ్లన్నింటిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ.. డిజిటలైజేషన్ పరంగా తరగతి గదులన్నింటినీ అప్‌గ్రేడ్ చేస్తున్నాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన ప్రజల హక్కులు పరిరక్షిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. గిరిజన రైతుల అభివృద్ధి కోసం 3.22 లక్షల ఎకరాలకు పట్టాలు జారీ చేశామన్నారు. వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించాలంటే విద్య ప్రధాన ఆయుధంగా తీసుకొని ఆయా ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. కేంద్ర హోం శాఖ ధృడమైన మార్గదర్శకత్వం, మద్దతుతో రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద సమస్యను విజయవంతంగా రూపు మాపుతామని, రాష్ట్ర ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తామని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. శుక్రవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో పాల్గొన్న వైఎస్ జగన్.. రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదంపై పోరాటం, నిర్మూలన, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధిపై మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్ గత నాలుగు దశాబ్దాలుగా వామపక్ష తీవ్రవాద సమస్యపై పోరాడుతోంది. జాతీయ విధానం, కార్యాచరణ ప్రణాళిక ప్రకారం.. తీసుకున్న చర్యలు, అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక ప్రజల హక్కుల పరిరక్షణ వంటి బహుముఖ విధానం సానుకూల ఫలితాలను అందించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మద్దతుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది. మా ప్రభుత్వం అనుసరించిన వ్యూహాల వల్ల రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద హింసాత్మక సంఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి’ అని తెలిపారు. ఈ సదస్సులో సీఎం జగన్ ఇంకా ఏం చెప్పారంటే.. తీవ్రవాదబలం బాగా తగ్గుముఖం తొలుత ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు జిల్లాల్లో విస్తరించిన మావోయిస్టు కార్యకలాపాలు ఇప్పుడు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న చురుకైన చర్యల కారణంగా మావోయిస్టు తీవ్రవాదబలం 2019 నుంచి 2023 నాటికి 150 నుంచి 50 కి తగ్గింది. పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లతో పటిష్టమైన సమన్వయం ఉంది. నాలుగు రాష్ట్రాల అధికారులతో కూడిన జాయింట్ టాస్క్‌ఫోర్స్‌లు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడానికి మాకున్న సమాచారాలను ఈ ఉమ్మడి టాస్క్‌ఫోర్స్ ద్వారా పరస్పరం పంచుకుంటూ సమష్టిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. స్థిరమైన అభివృద్ధి, సామాజిక, ఆర్థిక పురోగతి మాత్రమే తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి కీలక పరిష్కారాలు అని దృఢంగా విశ్వసిస్తున్నాం. పేదరికం, అవిద్య, అందుబాటులో లేని వైద్యం, సమాజాన్ని పీడిస్తున్న పరిమితమైన ఉపాధి అవకాశాలే తీవ్రవాదానికి అత్యంత అనుకూల అంశాలు. సమర్థవంతమైన విధానాలు అమలు చేయడం ద్వారా మాత్రమే దీన్ని రూపు మాపగలం. ప్రత్యామ్నాయ పంటల సాగు ఆపరేషన్ పరివర్తనలో భాగంగా 2020–21 నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు 9,371 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశారు. 224 కేసులు నమోదు చేసి, 141 మంది నిందితులను అరెస్టు చేశారు. సుమారు 3.24 లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని తగులబెట్టారు. నిరంతరాయంగా చేస్తున్న ఈ ఆపరేషన్ వల్ల 2022లో గంజాయి సాగు 1500 ఎకరాలకు తగ్గింది. ప్రస్తుత సంవత్సరం అంటే 2023లో అది కేవలం 45 ఎకరాలకు మాత్రమే పరిమితమైందని చెప్పడానికి సంతోషిస్తున్నా. గంజాయి సాగు చేసే గిరిజనుల ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడానికి పోలీసులు, జిల్లా యంత్రాంగం, పోలీసులు గంజాయి సాగు చేపడుతున్న గిరిజనులతో సంప్రదించి.. వారికి ప్రత్యామ్నాయ పంటలైన కాఫీ, నిమ్మ, జీడి మామిడి, నారింజ, కొబ్బరి, చింతపండు, సిల్వర్ ఓక్తో పాటు రాజ్మా, కందిపప్పు, వేరుశనగ తదతర పంటల సాగును ప్రోత్సహిస్తూ వారికి జీవనోపాధి కల్పిస్తోంది. తద్వారా వారిని గంజాయి సాగు నుంచి మరల్చే ప్రయత్నం చేస్తోంది. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు.. రహదారులు అటవీ ప్రాంతంలో అర్హులైన 1.54 లక్షల మంది గిరిజన రైతులకు 3.22 లక్షల ఎకరాల మేరకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు జారీ చేశాం. వారి భూములను సాగు చేసుకునేందుకు మద్దతుగా, పెట్టుబడి ఖర్చు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతు భరోసాగా రూ.13,500 ఆర్థిక సహాయం అందజేస్తోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రహదా రులతో అనుసంధానం అన్నది అత్యంత కీలక మైన అంశం. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజమ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ స్కీం కింద 1,087 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణాన్ని పూర్తి చేశాం. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా, పారదర్శకంగా త్వరితగతిన అందజేయడం కోసం 897 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశాం. ఒక్కో సచివాలయంలో 10 మంది ఉద్యోగులతో పాటు ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ కూడా ఉన్నారు. కమ్యూనికేషన్ నెట్వర్క్ ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. ఇందులో భాగంగా మొబైల్ కనెక్టివిటీ పెంచడం కోసం 944 కమ్యూనికేషన్ టవర్లను ఏర్పాటు చేశాం. పిల్లలను బడికి పంపే తల్లులకు ప్రోత్సాహకం పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహిస్తూ, అమ్మఒడి కార్యక్రమం ద్వారా వారికి ఏటా రూ.15,000 ఆర్థిక సహాయం అందిస్తున్నాం. మరోవైపు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలు బలోపేతం చేయడానికి, మా ప్రభుత్వం కొత్తగా 879 విలేజ్ హెల్త్ క్లినిక్స్‌ను ఏర్పాటు చేసింది. దీంతో పాటు అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవలను అందించేందుకు గిరిజన ప్రాంతాల్లో 108 అంబులెన్స్‌లు 75 పని చేస్తున్నాయి. 89 మొబైల్ మెడికల్ యూనిట్ల (104) ద్వారా గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ సేవలు కూడా ప్రవేశపెట్టాం. సికిల్‌సెల్ అనీమియా, తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న గిరిజనులకు ఆ రోగ్య పింఛన్ కింద నెలకు రూ.10 వేలు అందజేస్తున్నాం. వృద్ధాప్య ఫించను కింద గిరిజన ప్రాంతాల్లో 50 ఏళ్ల నుంచే నెలకు రూ.2,750 ఇస్తున్నాం. మేము ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ.. గిరిజన ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలను ఇంకా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం ఈ మావో ప్రభావిత జిల్లాల్లో కనీసం 15 కొత్త బ్యాంకు శాఖలు మంజూరు కావాల్సి ఉంది. గతంలో సదరన్ జోనల్ కౌన్సిల్లో సిఫార్సు మేరకు వైజాగ్‌లో గ్రే హౌండ్స్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమిని కేటాయించి, దీనికి సంబంధించిన ప్రతిపాదనను కేంద్రానికి సమర్పించిందనే విషయాన్ని తెలియజేస్తున్నా. దీనిని వీలైనంత త్వరగా మంజూరు చేయగలరు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధి, శాంతిని సాధించడం, వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలు విస్తరించకుండా నిరోధించడం కోసం కేంద్ర, రాష్ట్రాల నడుమ నిరంతరం పరస్పర సహాయ సహకారాలు అవసరం. ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అయినప్పటికీ, వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలకు.. అక్కడ పోలీసు బలగాల ఆధునికీకరణ, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆర్థిక, వ్యూహాత్మక మద్దతును కేంద్రం అందించడం అన్నది చాలా కీలకం. -
కృష్ణా జలాలపై ఏపీ హక్కులను పరిరక్షించండి
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులకు విఘాతం కలిగించకుండా పరిరక్షించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల (ఐఎస్ఆర్డబ్ల్యూడీ–ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ షేరింగ్ డిస్ప్యూట్స్) చట్టం–1956లో సెక్షన్–1 ప్రకారం కొనసాగుతున్న కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2కు మరిన్ని విధి విధానాల జారీకి బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం 2014 జూలై 14న చేసిన ఫిర్యాదు ప్రకారం ఈ విధి విధానాలను కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకే పరిమితం చేశారని గుర్తు చేశారు. ఆ విధి విధానాల నుంచి కృష్ణా నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లోని మిగతా రెండు రాష్ట్రాలను (మహారాష్ట్ర, కర్ణాటక) పూర్తిగా మినహాయించి.. రెండు రాష్ట్రాలకే (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) పరిమితం చేయాలని ఏకపక్షంగా సూచించడం అశాస్త్రీయం అని చెప్పారు. దీంతోపాటు జాతీయ సంపద అయిన జల వనరులను న్యాయ బద్ధంగా వినియోగించుకోవడానికి కూడా విరుద్ధమని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కృష్ణా జలాలపై ఆధార పడిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయ పరమైన చిక్కులను పరిశీలించి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని తదుపరి చర్యలు తీసుకోకుండా కేంద్ర జల్ శక్తి శాఖను ఆదేశించాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రధానికి లేఖ రాశారు. అందులో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. కేడబ్ల్యూడీటీ–1 అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానం – ఐఎస్ఆర్డబ్ల్యూడీ చట్టం–1956లో సెక్షన్–4 ప్రకారం కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్–1 (కేడబ్ల్యూడీటీ – కృష్ణా వాటర్ డిస్పూట్ ట్రిబ్యునల్)ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేడబ్ల్యూడీటీ–1 ఇచ్చిన తుది నివేదిక ఆధారంగా 1976 మే 31న గెజిట్‌ను ప్రచురించింది. కృష్ణా నదిలో 2,130 టీఎంసీల జలాలు అందుబాటులో ఉన్నాయని కేడబ్ల్యూడీటీ–1 లెక్క కట్టింది. – 75 శాతం లభ్యత ఆధారంగా ఆ మేరకు నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసింది. దీని ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టీఎంసీలు కేటాయించింది. 2,130 టీఎంసీల కన్నా అధికంగా ఉన్న జలాలు అంటే మిగులు జలాలను వినియోగించుకునే స్వేచ్ఛను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చింది. ఐఎస్ఆర్డబ్ల్యూడీ చట్టం–1956లో సెక్షన్–6(1) ప్రకారం కేడబ్ల్యూడీటీ–1 అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానం. అదనపు ప్రవాహాన్ని వినియోగించుకునే స్వేచ్ఛ – అనంతరం కృష్ణా జలాల పంపిణీకి ఐఎస్ఆర్డబ్ల్యూడీ చట్టం –1956లోని సెక్షన్–4 (1) ప్రకారం 2004 ఏప్రిల్ 2న కేడబ్ల్యూడీటీ–2 (బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్)ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ 2010 డిసెంబర్ 30న సెక్షన్–5(2) ప్రకారం నివేదిక సమర్పించింది. ఆ తర్వాత 2013 నవంబర్ 29న సెక్షన్ 5(3) ప్రకారం కేడబ్ల్యూడీటీ–1 ద్వారా అప్పటికే 75 శాతం లభ్యత ఆధారంగా చేసిన 2,130 టీఎంసీల కేటాయింపులను నిర్ధారిస్తూ కేడబ్ల్యూడీటీ–2 తదుపరి నివేదిక సమర్పించింది. – బేసిన్‌లోని రాష్ట్రాలకు సగటు ప్రవాహాలతో సహా 65 శాతం లభ్యత ఆధారంగా అదనపు నీటిని కూడా కేటాయించింది. దీని కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 194 టీఎంసీలు కేటాయించింది. దాంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చేసిన మొత్తం కేటాయింపులు 1005 టీఎంసీలు (811 టీఎంసీలు+194 టీఎంసీలు). దీంతోపాటు 2,578 టీఎంసీల కంటే ఎక్కువగా ఉండే అదనపు ప్రవాహాలను ఉపయోగించుకోవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు స్వేచ్ఛ ఇచ్చింది. సుప్రీంకోర్టులో ఐదు ఎస్సెల్పీలు – కేడబ్ల్యూడీటీ–2 నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఐదు ఎస్సెల్పీ (స్పెషల్ లీవ్ పిటిషన్)లను కృష్ణా బేసిన్‌లోని రాష్ట్ర ప్రభుత్వాలు దాఖలు చేశాయి. సెక్షన్ 5(2) ప్రకారం కేడబ్ల్యూడీటీ–2 ఇచ్చిన నివేదికను పక్కన పెట్టాలంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. సుప్రీంకోర్టు 2011 సెప్టెంబరు 16న జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా కేడబ్ల్యూడీటీ–2 సెక్షన్–5(2) కింద ఇచ్చిన నివేదికపై స్టే ఇచ్చింది. అన్ని ఎస్సెల్సీలు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఇదే అంశాన్ని 2021 ఆగస్టు 17న.. ఆ తర్వాత 2022 జూన్ 25న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. ట్రిబ్యునల్ ద్వారా జరిగిన కేటాయింపులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా న్యాయ బద్ధమైన నిర్ణయం తీసుకోవాలని కోరాం. -
అక్టోబర్ 15 నుంచి విశాఖ రాజధాని రాకపై సంబరాలు
-
సీఎం సార్... ఆశీర్వదించండి
ఆంధ్రప్రదేశ్ గురుకులం విద్యార్థులు అరుదైన అవకాశం చేజిక్కించుకున్నారు. అగ్రరాజ్యం అమెరికా వెళ్లి అక్కడ 10 నెలలు ఉండి పాఠాలు చదువుకోబోతున్నారు. ఈ గొప్ప అవకాశం వారి జీవితాలను మార్చనుంది. ఇందుకు కారణమైన ఏ.పి. సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం అంటున్నారు. ‘ఏ.పి గురుకులాలను సి.ఎం గారు ఆధునికంగా తీర్చిదిద్దడం వల్లే మాకు ఈ అవకాశం దక్కింది’ అంటున్నారు. ‘కెనడీ లుగర్–యూత్ ఎక్స్ఛేంజ్ అండ్ స్టడీ ప్రోగ్రామ్’ కింద అమెరికా వెళ్లిన విద్యార్థుల మనోగతాలు... మా దేశానికి అధ్యయానికి రండి అంటూ అగ్రదేశం అమెరికా నుంచి వచ్చిన ఆహ్వానం ఏ.పి. గురుకుల పాఠశాలల్లో సీనియర్ ఇంటర్ చదువుతున్న ఐదుగురు విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా చేసింది. నెలకు కనీసం రూ.10 వేలు కూడా సంపాదన లేని కుటుంబాల నుంచి వచ్చిన ఈ విద్యార్థులు అమెరికాను చూడటమే కాదు అక్కడ పది నెలలు ఉండి చదువుకునే అవకాశం పొందడం వారి జీవితాలను మార్చనుంది. ఇలా పేదపిల్లలకు పెద్ద అవకాశం దక్కడం వెనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన చదువుల మహాయజ్ఞం కీలకపాత్ర పోషించిందన్నది జగమెరిగిన సత్యం. ‘నాడు–నేడు’తో రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలు అధునాతంగా మారిపోవడంతోపాటు అన్ని వసతులూ సమకూరాయి. ఇంగ్లిష్ విద్య, నాణ్యమైన విద్యాబోధన, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ఆన్లైన్ క్లాసులు, ట్యాబ్‌లు వంటి ఎన్నో సౌకర్యాలతో పేదపిల్లల పెద్ద చదువుకు కొత్త బాటలు పరుస్తున్నారు. తొమ్మిది దశల వడపోత ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో అంతర్జాతీయ అవగాహనలో భాగంగా యూనైటెడ్ స్టేట్స్ (యూఎస్) గత కొన్నేళ్లుగా ‘కెన్నడీ లుగర్–యూత్ ఎక్సే ్చంజ్ అండ్ స్టడీ (కేఎల్ – వైఈఎస్) ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రతి యేటా ఎంపికైన విద్యార్థులు పది నెలలపాటు అమెరికాలో ఉంటారు. దీనికి ఎంపిక కావాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోని విద్యాసంస్థలకు చెందిన విద్యార్థుల నుంచి గట్టి పోటీ ఉంటుంది. మొదట బయోడేటా నుంచి చివరి ఇంటర్వ్యూల వరకు తొమ్మిది దశల్లో కఠినతరమైన వడపోత కొనసాగు తుంది. దాదాపు తొమ్మిది నెలలపాటు కొనసాగే అన్ని అర్హత పరీక్షల ప్రక్రియను విజయవంతంగా దాటుకుని రాష్ట్రానికి చెందిన ఎస్సీ గురుకుల విద్యార్థులు డి.నవీన, ఎస్. జ్ఞానేశ్వరరావు, రోడా ఇవాంజిలి, బి.హాసిని, సీహెచ్. ఆకాంక్షలు అవకాశాన్ని దక్కించుకున్నారు. వారంతా ఇటీవలే అమెరికాకు పయనమై వెళ్లారు. వారిని అక్కడ ఎంపిక చేసిన పాఠశాలలోచేర్పిస్తారు. ఆ విద్యార్థులు పరీక్షలు, క్రీడలతోపాటు మొత్తం పాఠశాల ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. ఆ విద్యార్థులకు అమెరికాలో ఎంపిక చేసిన కుటుంబాలు అతిథ్యం ఇస్తాయి. విద్యార్థులు ఒక్కొక్కరికీ దాదాపు 200 డాలర్లు (సుమారు రూ. 16,500) నెలవారీ ఆర్థిక తోడ్పాటు (స్టైపెండ్)ను అందిస్తారు. సీఎంకు కృతజ్ఞతలు 2023–24 విద్యా సంవత్సరానికి ‘కెన్నడీ లుగర్–యూత్ ఎక్సే ్చంజ్ అండ్ స్టడీ’ కోసం ఆఫ్రికా, పశ్చిమాసియా, దక్షిణాసియాలోని 38 దేశాల విద్యార్థులను ఎంపిక చేశారు. వారిలో మన దేశానికి చెందిన 30 మంది ఎంపిక కాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐదుగురు విద్యార్థులు ఉండటం గర్వకారణం. వీరికి కావలసిన నిత్యావసరాలు, దుస్తులు, బ్యాగులు, మొబైల్ఫోన్ల కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ ఆర్థికసాయం అందిస్తోంది. కేఎల్–వైఈఎస్ ప్రోగ్రామ్‌లో అమెరికా చదువులకు వెళ్తున్న ఐదుగురు విద్యార్థులు డి. నవీన, ఎస్.జ్ఞానేశ్వరరావు, రోడా ఇవాంజిలి, బి.హాసిని, సీహెచ్ ఆకాంక్ష సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆగస్టు 31న కలిశారు. వారితోపాటు గతేడాది అమెరికా వెళ్లి కోర్సు పూర్తిచేసుకుని వచ్చిన విద్యార్థులు కె.అక్ష, సి.తేజ కూడా సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల కుటుంబ నేప«థ్యం తదితర వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. యూఎస్ఏ లో చదువులు పూరై్త వచ్చిన తర్వాత కూడా వారి చదువులు కొనసాగించేలా నిరంతరాయంగా వారిని పర్యవేక్షించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఒక్కో విద్యార్థికి ప్రోత్సాహకంగా రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారికి ట్యాబ్‌లను అందజేశారు. థాంక్యూ సీఎం సార్ అమెరికా చదువులకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. విద్యా వ్యవస్థలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన విప్లవాత్మక చర్యల వల్లే నాకు ఈ అవకాశం దక్కింది. విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం పెదగంట్యాడ మా ఊరు. మా నాన్న ప్రవీణ్ రాజ్ నెలకు రూ.7 వేలు సంపాదించే ప్రైవేటు ఉద్యోగి. తల్లి సుకాంతి గృహిణి. ఇల్లు గడవడమే కష్టమైన పరిస్థితిలో గురుకులం ద్వారా ప్రభుత్వం నాకు మంచి విద్యావకాశాలు కల్పించింది. – రోడా ఇవాంజిలి, మధురవాడ గురుకులం, విశాఖ జిల్లా. విద్యాలయాల్లో మెరుగైన సదుపాయాలు మా వంటి పేద వర్గాల పిల్లలు చదివే విద్యాలయాలను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో బాగా తీర్చిదిద్దారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం పుచ్చకాయలపల్లి మా గ్రామం. మా నాన్న దార కేశయ్య పదవ తరగతి చదివి వ్యవసాయ పనులతో నెలకు రూ.10 వేలు సంపాదిస్తాడు. ఐదవ తరగతి చదివిన అమ్మ ఆదిలక్ష్మమ్మ గృహిణి. పేదరికం కారణంగా ప్రకాశం జిల్లా మార్కాపురం గురుకులంలో 5 వ తరగతిలో చేరిన నేను ప్రస్తుతం సీనియర్ ఇంటర్ చదువుతున్నా. – డి.నవీన, మార్కాపురం గురుకులం ఆనందంగా ఉంది ప్రభుత్వ గురుకులంలో చదివే నేను అమెరికా చదువులకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. విజయవాడ గుణదల ప్రాంతం మాది. మా నాన్న చొక్కా సురేష్ అటెండర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మా అమ్మ వనజ గృహిణి. – సీహెచ్ ఆకాంక్ష, ఈడ్పుగల్లు ఐఐటీ– ఎన్ఐటీ అకాడమి, కృష్ణా జిల్లా పేద పిల్లల చదువులకు సీఎం శ్రద్ధ చూపిస్తున్నారు పేద పిల్లల ఉన్నత చదువుల కోసం సీఎం వైఎస్ జగన్ శ్రద్ధ చూపిస్తున్నారు. పేదవర్గానికి చెందిన నేను అమెరికా చదువులకు ఎంపిక అయ్యానంటే మా చదువులకు సీఎం సార్ అందించిన ప్రోత్సాహమే కారణం. చాలా సరదాగా మాతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న సీఎం గారు మాకు రూ.లక్ష సాయం, ట్యాబ్‌లు అందించారు. సత్యసాయి జిల్లా, ధర్మవరం మండలం, మల్లెనిపల్లి మా గ్రామం. మా నాన్న నరసింహులు ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. తల్లి నాగమణి గృహిణి. –హాసిని బలిగా, ఈడ్పుగల్లు ఐఐటీ– నీట్ అకాడమి, ఎస్సీ గురుకుల కలలో కూడా ఊహించలేదు నేను అమెరికా చదువుకు ఎంపిక అవుతానని కలలో కూడా ఊహించలేదు. ప్రభుత్వం, ఉపాధ్యాయులు అందించిన సహకారం వల్లే ఈ అవకాశం దక్కింది. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం జి.కొత్తూరు మా ఊరు. మా నాన్న ఎస్.కృష్ణ మృతి చెందడంతో అమ్మ రాము రోజువారీ కూలీగా నెలకు ఆరు వేలు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. 2017లో గురుకులంలో 6వ తరగతిలో చేరి ప్రస్తుతం సీనియర్ ఇంటర్ చదువుతున్నాను. – ఎస్. జ్ఞానేశ్వరరావు, శ్రీకృష్ణాపురం గురుకులం, విశాఖ జిల్లా. – యిర్రింకి ఉమమాహేశ్వరరావు, సాక్షి ప్రతినిధి, అమరావతి -
చిరంజీవి ఏ ఉద్దేశంతో కామెంట్స్ చేశారో తెలీదు: ఆర్జీవీ
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రామదూత క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం వ్యూహం. ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనలే కథాంశంగా ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో సీఎం జగన్‌గా అజ్మల్, భారతీగా మానస నటిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలోని ప్రకాశం బ్యారేజీపై మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన ఆర్జీవీ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. (ఇది చదవండి: వ్యూహం టీజర్..ఒక్క డైలాగ్‌తో అంచనాలు పెంచేసిందిగా! ) రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ..' నేను నమ్మిన నిజాన్ని సినిమాలో చూపిస్తున్నా. సినిమాల్లో నా అభిప్రాయాన్ని చెబుతున్నా. పొగడ్తలు అంటే నాకు చిరాకు. విమర్శలు అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేస్తా. నేను తెరకెక్కిస్తున్న వ్యూహం సినిమా ఎన్నికలను ప్రభావితం చేస్తుంది. వ్యూహం సినిమాలో అన్ని అంశాలు ఉంటాయి. ఈ చిత్రంలో ఎవరినీ టార్గెట్ చేయలేదు. సీఎం జగన్‌పై నాకున్న అభిప్రాయాలను మాత్రమే చూపిస్తా. అని అన్నారు. (ఇది చదవండి: ‘వ్యూహం’ సినిమా కొనసాగింపుగా ‘శపథం’) అనంతరం చిరంజీవి కామెంట్స్‌పై మాట్లాడుతూ..' సినిమా గురించి ఇప్పుడే అన్ని చెబితే ఆసక్తి ఉండదు. సినిమాల్లో సందేశాలు ఇచ్చే అలవాటు నాకు లేదు. చిరంజీవి ఏ ఉద్దేశంతో కామెంట్స్ చేశారో నాకు తెలియదు. నేను నిజానికి బట్టలిప్పి చూపిస్తా. భోళా శంకర్ సినిమా డాకుమెంట్స్ ఏవో టైంకు ఇవ్వలేదని తెలిసింది. కానీ ఆ వివరాలు పూర్తిగా నాకు తెలియదు. రెమ్యూనరేషన్ అనేది ఇచ్చేవాడి ఇష్టం. తీసుకునే వాళ్లకు ఎలాంటి సంబంధం లేదు. ఇది మార్కెట్‌ను బట్టి ఇస్తారు. నన్ను ఎవరూ ప్రలోభ పెట్టలేదు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. అంతే కాకుండా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీస్తున్నాం. ' అని అన్నారు. -
ఏపీ విద్యా విధానాలు భేష్
సాక్షి, అమరావతి : అందరికీ విద్య, వైద్యం, పేదరిక నిర్మూలన కోసం నవరత్నాలు, నాడు – నేడు, సంక్షేమ పథకాల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా రంగం అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని ఐక్యరాజ్యసమితి ఎకనావిుక్, సోషల్ కౌన్సిల్ అంతర్జాతీయ అధ్యక్షురాలు లచ్చెజర స్టోవ్ ప్రశంసించారు. ఐక్యరాజ్య సమితి లక్ష్యం కూడా ఇదేనని స్పష్టం చేశారు. ఐరాస ప్రధాన కార్యాలయమైన న్యూయార్క్‌లో ఆర్థిక, సామాజిక మండలి నేతృత్వంలో సుస్థిరాభివృద్ధి పై జూలై 17న జనరల్ అసెంబ్లీ హాలులో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు – నేడు, విద్యారంగంలో పధకాలకు సంబంధించి ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశారు. జగనన్న విద్యాకానుక కిట్లు, విద్యా దీవెన, అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యార్ధులకు ఇచ్చే ఇతర ప్రోత్సాహకాల పోస్టర్లను ప్రదర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ బోర్డులు, అటల్ టింకరింగ్ ల్యాబ్స్, స్మార్ట్ బోర్డ్స్, బైజూస్ ట్యాబ్స్ నమూనాలను ప్రదర్శించారు. ఐరాస స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ వున్నవ షకిన్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన విద్యారంగ సంస్కరణలు, వివిధ పథకాల ద్వారా విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేలా సీఎం జగన్ ప్రోత్సహిస్తున్న తీరు, డిజిటల్ బోధన, డిజిటల్ క్లాస్ రూమ్స్ గురించి వివరించారు. నాడు – నేడు స్టాల్‌ని సందర్శించిన ఎకనావిుక్ సోషల్ కౌన్సిల్ ప్రపంచ అధ్యక్షురాలు లచ్చెజర స్టోవ్ ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం జగన్ బాలికల విద్యను ప్రోత్సహిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడాన్ని అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు టోఫెల్ ట్రైనింగ్, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్, బైలింగ్యువల్ డిక్షనరీలు, గోరుముద్ద, ఆణిముత్యాల పథకాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. పేద విద్యార్ధులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని షకిన్ కుమార్ ఆమెకు వివరించారు. డిజిటల్ ఇండియా దిశగా అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రశంసించారు. ఏపీ స్టాల్‌పై పలు దేశాల ఆసక్తి టాంజానియా ఆర్థిక శాఖా మంత్రి నటూ వాంబా ఏపీ స్టాల్‌ను సందర్శించి విద్యాభివృద్ధికి సీఎం జగన్ చేస్తున్న కృషిని అభినందించారు. అమెరికా పర్మినెంట్ అబ్జర్వర్ మిషన్ టూ యునైటెడ్ నేషన్స్ ప్రొఫెసర్ ఒట్టో ఫీజిన్ బ్లాట్, అమెరికన్ డిపొ్లమాటిక్ అకాడమి రిప్రజెంటేటివ్ టు యునైటెడ్ నేషన్స్ ప్రెసిడెంట్ బిల్ గ్రాహమ్ తదితరులు ఏపీ విద్యా విధానాలను తెలుసుకుని అభినందించారు. ఈ కార్యక్రమంలో సునీత చిట్టూమూరి తదితరులు పాల్గొన్నారు. -
ఈ పాయింట్‌తో యాత్ర 2 ఉంటుంది: మహీ వి. రాఘవ్
'యాత్ర’కి, ‘యాత్ర 2’కి కథ పరంగా సంబంధం ఉండదు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి జీవితంలోని ఎత్తుపల్లాలనే ‘యాత్ర 2’లో చూపిస్తాం' అన్నారు డైరెక్టర్ మహీ వి. రాఘవ్. ఆయన దర్శకత్వంలో శివ మేక నిర్మించనున్న చిత్రం ‘యాత్ర 2’. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి (జూలై 8) సందర్భంగా ‘యాత్ర 2’ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భగా మహీ వి. రాఘవ్ మాట్లాడుతూ–'యాత్ర 2’లో 2009 నుంచి 2019 వరకు జగన్‌గారి జీవితాన్ని, ఆయన ఎదుగుదలను పొలిటికల్ డ్రామాగా చూపిస్తాను. తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టే కొడుకు అనే పాయింట్‌తో ఈ సినిమా ఉంటుంది. పొలిటికల్ సినిమాలు చేయడమే రిస్క్. ఇలాంటి సినిమాలు ఎప్పుడు, ఏ టైమ్‌లో రిలీజ్ చేస్తామనేది ముఖ్యం. అందుకే ఎన్నికల టైమ్‌లో 2024 ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఏపీ ఓటర్లను తక్కువ అంచనా వేయొద్దు. ‘యాత్ర 2’తో ఓటర్లు ప్రభావితం అవుతారనుకోవద్దు. మా సినిమా చూసి ఎమోషనల్ అవుతారు. కానీ, వాళ్లకు నచ్చినవాళ్లకు ఓటు వేస్తారు. ‘యాత్ర 2’ని వైసీపీ వాళ్ల కోసమే తీస్తున్నామని అనుకున్నా పర్లేదు' అన్నారు. 'నిజ జీవితంలో ఉండే పాత్రలన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ‘యాత్ర’ను అందరూ సపోర్ట్ చేశారు.. ‘యాత్ర 2’ మూవీని కూడా ఆదరించాలి' అన్నారు శివ మేక. -
సీఎం అయ్యాక జగన్ ఫస్ట్ స్పీచ్... దద్దరిల్లిన ఏపీ నవశకానికి నాలుగేళ్లు
-
అప్పట్లో అంబాసిడర్ పై వైఎస్సార్ మాస్ ఎంట్రీ
-
అప్పట్లో వైఎస్సార్ ఇంగ్లీష్ స్పీచ్ వింటే ఫిదా అవ్వాల్సిందే
-
నాన్నని తలుచుకొని ఎమోషనల్ అయిన సీఎం జగన్
-
వైఎస్సార్,జగన్ గురించి చెప్తూ..కన్నీళ్ళు పెట్టుకున్న పబ్లిక్
-
వ్యూహం..
రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రామధూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్న చిత్రానికి ‘వ్యూహం’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో అజ్మల్ నటిస్తున్నారు. ‘‘అహంకారానికి, ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం నేపథ్యంలో ‘వ్యూహం’ రూపొందుతోంది. ఇది బయోపిక్ కాదు.. బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయోపిక్‌లో అబద్ధాలు ఉండొచ్చు కానీ, రియల్ పిక్‌లో నూటికి నూరు పాళ్లు నిజాలే ఉంటాయి’’ అని మేకర్స్ పేర్కొన్నారు. -
సీఎంకు నిరుద్యోగ జేఏసీ కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రూప్–1, గ్రూప్–2లో 1,000 పోస్టుల భర్తీకి అనుమతించిన సీఎం వైఎస్ జగన్‌కు ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు హేమంత్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయాల్లోనూ బదిలీలకు అవకాశం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. గతంలో సచివాలయాల్లో చేపట్టినట్టే భారీ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. ఇటీవల పరీక్షలు రాసిన ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రశ్నాపత్రంలోని దోషాలను అధిగమించేలా గ్రేస్ మార్కులు ఇవ్వాలని అభ్యర్థించారు. (చదవండి: ఎప్పటి నీటి లెక్కలు అప్పటికే...) -
ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరం: సీఎం జగన్
సీనియర్ నటుడు శరత్ బాబు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చలనచిత్ర రంగంలో గొప్ప నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరమన్నారు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా అన్ని రకాల పాత్రలను పోషించి ప్రత్యేక గుర్తింపు పొందారని గుర్తు చేసుకున్నారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సీఎం ట్వీట్ చేశారు. (ఇది చదవండి: శరత్‌బాబు-రమాప్రభ లవ్‌స్టోరీ వెనుక ఇంత కథ నడిచిందా?) దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించిన శరత్ బాబు అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 1973లో రామరాజ్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శరత్ బాబు.. చివరిసారిగా మళ్లీ పెళ్లి అనే చిత్రంలో కనిపించారు. శరత్ బాబు మృతి పట్ల ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంచ్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి, టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. (ఇది చదవండి: ఆయన మృతి ఇండస్ట్రీకి తీరని లోటు: పోసాని కృష్ణమురళి) తెలుగు చలనచిత్ర రంగంలో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా అన్ని రకాల పాత్రలను పోషించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గొప్ప నటుడు శరత్‌బాబుగారు. నేడు ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం బాధాకరం. శరత్‌బాబు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/NaTgovOKOW — YS Jagan Mohan Reddy (@ysjagan) May 22, 2023 -
హజ్ యాత్రకు అదనపు సాయం: సీఎం జగన్‌కు ఎన్ఆర్ఐల కృతజ్ఞతలు
పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు అదనపు భారం పడకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా హర్షం వ్యక్తం చేశారు. మైనారిటీల హజ్ యాత్రకు అదనపు సాయం అందిస్తూ ఏపీ సీఎం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం దుబాయ్‌లో ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో థాంక్యూ సీఎం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అంజాద్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి విజయవాడ ఎంబార్గేషన్ ద్వారా ఒక్కొక్కరికి రూ. 80 వేల అదనపు ధరను సెంట్రల్ హజ్ కమిటీ, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఇతర అధికారులను తనతో పాటు ఎంపీ మిధున్ రెడ్డి కలిశామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లిన వెంటనే స్పందించిన సీఎం జగన్ ముస్లిమ్ సోదరులపై అదనపు భారం పడకుండా 80 వేల రూపాయల సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా ఉత్తర్వులు జారీ చేశారన్నారు. రూ. 14.15 కోట్లు విడుదల చేసి ముస్లిం సోదరుల పక్షపాతిగా మరోసారి సీఎం రుజువు చేశారన్నారు. ఈ సమావేశంలో డా. భూ అబ్దుల్లా, కడప యువజన విభాగ అధ్యక్షులు షేక్ ఉమైర్ తదితరులు పాల్గొన్నారు. -
కావలిలో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ (ఫొటోలు)
-
అల్లూరి సీతారామరాజు వర్ధంతి.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు సీఎం జగన్. స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అలుపెరుగని పోరాటం చేసిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఆయన త్యాగాన్ని ఎల్లప్పుడూ స్మరించుకునేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆయన పేరు మీద జిల్లాను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అలుపెరుగని పోరాటం చేసిన వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు. ఆయన త్యాగాన్ని ఎల్లప్పుడూ స్మరించుకునేలా మన ప్రభుత్వంలో ఆయన పేరు మీద జిల్లాను ఏర్పాటు చేశాము. నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి. — YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2023 చదవండి: ‘మార్గదర్శి’ అక్రమాలు, నిజానిజాలు.. రామోజీ గురించి ఏం చెప్పారంటే? -
అన్నదాతకు భరోసా.. తక్షణమే ఆదుకోవాలంటూ సీఎం వైఎస్ జగన్ ఆదేశం
కష్టపడి పండించిన పంటలు చేతికొచ్చే వేళ కురుస్తున్న అకాల వర్షాలతో అన్నదాతలు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరిస్తూ అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ ప్రత్యేక అధికారులు, స్థానిక అధికారులు రంగంలోకి దిగారు. ప్రచారానికి దూరంగా, పనికి ప్రాధాన్యత ఇస్తూ చేపట్టాల్సిన చర్యలన్నీ వెనువెంటనే తీసుకుంటూ ధాన్యం కొనుగోలుకు ఉపక్రమించి, రైతులకు భరోసా కల్పిస్తున్నారు. ఇదివరకెన్నడూ లేని విధంగా కనీస మద్దతు ధర కల్పించడమే కాకుండా ప్రభుత్వమే గన్నీ సంచులు, లేబర్, రవాణా చార్జీల కోసం నిధులు విడుదల చేయడం ద్వారా మరో అడుగు ముందుకు వేసి ఆదుకుంటోంది. ఈ వాస్తవాలను స్థానికంగా రైతులు నిర్ధారిస్తున్నప్పటికీ.. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మాత్రం ఎప్పటిలాగే అబద్ధాలతో కూడిన ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రచారం కోసం పాకులాడుతున్నారు. ఆయన హయాంలో గన్నీ సంచుల కోసం, రవాణా కోసం, లేబర్ కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించిన పాపాన పోలేదు. ఈ విషయాన్ని దాచిపెట్టి.. ‘నేనొచ్చే వరకు గోతాలకూ దిక్కులేద’ని రైతులను రెచ్చగొట్టి.. రాజకీయ లబ్ధి పొందాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుత సహాయ కార్యక్రమాల్లో గత చంద్రబాబు ప్రభుత్వంలా ప్రచారార్భాటం లేకపోవడాన్ని ఆసరాగా తీసుకుని తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టడం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. తక్షణ స్పందన రాష్ట్రంలో రబీలో 54 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సకాలంలో విత్తనాలు, సమృద్ధిగా ఎరువులు అందుబాటులో ఉంచడంతో రైతులు సాగు వేళ ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. గత రబీ కంటే మిన్నగా 86.64 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేశారు. ముఖ్యంగా ధాన్యం 54.23 లక్షల టన్నులు, మొక్కజొన్న 18.44 లక్షల టన్నులు, జొన్నలు 2.02 లక్షల టన్నులు వస్తాయని లెక్కలేశారు. కోతలు మొదలయ్యే సమయంలో.. దాదాపు రాష్ట్రమంతా 40 శాతం మాసూళ్లు కూడా పూర్తవని దశలో అనూహ్యంగా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు రైతులను ఆందోళనకు గురిచేశాయి. రైతుల ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం క్షణం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగింది. ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లోని టోల్ ఫ్రీ నంబర్ 155251తో పాటు ధాన్యం కొనుగోలు సందర్భంగా తలెత్తే సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ 1967ను ఏర్పాటు చేశారు. ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తూనే ఎవరు ఫోన్ చేసినా, క్షణాల్లో స్పందించేలా ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ దిశా నిర్ధేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంఓ, వ్యవసాయ ఉన్నతాధికారులతో రోజువారీ సమీక్షించడమే కాకుండా, ఎప్పటికప్పుడు అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. సీఎం ఆదేశాలతో ప్రత్యేకాధికారులతో పాటు మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా రంగంలోకి దిగారు. శాస్త్రవేత్తలు, సంబంధిత అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలు గ్రామ స్థాయిలో పర్యటిస్తూ పంట నష్టం తీవ్రతను తగ్గించేందుకు రైతులకు సూచనలు, సలహాలు ఇస్తున్నాయి. వాట్సప్ గ్రూపుల ద్వారా చిన్న చిన్న వీడియో సందేశాలను పంపిస్తూ పంటను ఏ విధంగా కాపాడుకోవాలో అర్థమయ్యే రీతిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాకొక ఐఏఎస్ అధికారి సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లాకో సీనియర్ ఐఎఎస్ అధికారిని నియమించగా, వారంతా గత మూడు రోజులుగా ఆయా జిల్లాల్లో మకాం వేశారు. ముంపు ప్రభావం ఉన్న గ్రామాల్లో పర్యటిçస్తూ రైతుల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టారు. మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పల్లెల్లో పర్యటిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారు. కల్లాల్లోని ధాన్యం రవాణాలో సమస్య రాకుండా జిల్లాకు రూ.కోటి చొప్పున కార్పస్ ఫండ్‌ను విడుదల చేశారు. ప్రభావిత జిల్లాల్లో ధాన్యం కొనుగోలుకు గన్నీ సంచుల కొరత లేకుండా చర్యలు చేపట్టారు. పొరుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున గన్నీ బ్యాగ్స్‌ను ముంపు ప్రభావిత జిల్లాలకు తరలించారు. ఇప్పటికే 40–50 శాతం మేర వరి కోతలు పూర్తి కాగా, మిగిలింది పంటపై ఉంది. జొన్న, మొక్కజొన్నలు కూడా 50–60 శాతం వరకు కోతలు పూర్తయ్యాయి. మిగిలిన పంటను మిషన్లపై కోసేలా అవగాహన కల్పిస్తున్నారు. 3 రోజుల్లో 80 వేల టన్నుల కొనుగోలు రబీలో 30 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా 2,636 ఆర్బీకేల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 66 వేల మంది రైతుల నుంచి రూ.1315 కోట్ల విలువైన 6.18 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తున్నారు. వాటిని బాయిల్డ్ రకాలుగా గుర్తించి మద్దతు ధర కల్పిస్తున్నారు. ఇప్పటికే కోతలు పూర్తయి పంటలో 70 శాతం సేకరించగా మిగిలింది రెండ్రోజుల్లో కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గత మూడు రోజుల్లో సుమారు 80 వేల టన్నులు సేకరించారు. మొలక 7–10 శాతం ఉన్నా సరే.. మార్చిలో కురిసిన వర్షాలు, ఏప్రిల్‌లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల అధిక తేమ శాతం, గింజ విరుగుడు సమస్య ఎక్కువగా ఉంది. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాల బారిన పడి బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో పెద్ద ఎత్తున ధాన్యం రాశులు తడిచిపోయాయి. రైతులు వాటిని ఆరబెట్టు కోలేని పరిస్థితుల నేపథ్యంలో నేరుగా ఆఫ్‌లైన్‌లో (వాస్తవానికి పూర్తిగా ఆన్లైన్లో) కొనుగోలు చేస్తున్నారు. వాటిని బాయిల్డ్ రకంగా పరిగణించి బాయిల్డ్ మిల్లులకు తరలిస్తున్నారు. సాధారణంగా 5 శాతం మొలక ధాన్యానికి మినహాయింపు ఉంటుంది. వర్షాల వల్ల ప్రస్తుతం మొలక శాతం 7–10 వరకు ఉంటోంది. అయినా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అవసరమైన చోట్ల ఉపాధి కూలీలతో పంట పొలాల్లో నిలిచిపోయిన ముంపు నీరు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. మరో వైపు తేమ, నూక శాతం తగ్గించేందుకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. నూర్పిడులు పూర్తిగా మిషన్లపై చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మండలానికో మినీ మొబైల్ మిల్లు నూక శాతం పేరుతో మిల్లర్లు రైతులను దోపిడీ చేయకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. మండలానికి ఒకటి చొప్పున డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, గోదావరి జిల్లాల్లో మొబైల్ మినీ మిల్లులు ఏర్పాటు చేశారు. మండల వ్యవసాయశాఖాధికారి, టెక్నికల్ అసిస్టెంట్లు వీటిని పర్యవేక్షిస్తున్నారు. ఈ మినీ మిల్లుల ద్వారా మిల్లరు, రైతుల ఎదుటే ధాన్యాన్ని మరాడించి ఎంత శాతం నూక వస్తుందో పరిశీలిస్తున్నారు. డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్ అధికారులను కస్టోడియన్ ఆఫీసర్లుగా మిల్లుల వద్ద నియమించి రైతులకు సమస్య రాకుండా చూస్తున్నారు. ఆర్బీకేలో ధాన్యం అప్పగించి రసీదు పొందే వరకే రైతు బాధ్యత. ఆ తర్వాత మిల్లర్లు పిలిచినా వెళ్లనవసరం లేదని రైతులకు స్పష్టం చేస్తున్నారు. ఏ మిల్లర్ అయినా íపిలిస్తే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. రైతులను ఇబ్బందిపెట్టిన కారణంగా ఇప్పటికే 39 రైస్ మిల్లులపై చర్యలు తీసుకున్నారు. రంగంలోకి మార్క్‌ఫెడ్ వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న మొక్క జొన్న రైతులను ఆదుకుందుకు మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపారు. 66 వేల టన్నులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. మొక్క జొన్న ఎక్కువగా సాగయ్యే ప్రాంతాల్లోని 3,330 ఆర్బీకేల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పటికే 5,036 మంది రైతులు సీఎం యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరి నుంచి కనీస మద్దుత ధర రూ.1,962 చొప్పున ఫైన్ వెరైటీ మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 60 శాతం పంట కోతలు పూర్తయ్యాయి. బాపట్ల, ఏలూరు, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, తూర్పుగోదావరి జిల్లాల్లో 17–18.5 శాతం తేమ ఉన్నట్టుగా గుర్తించారు. తేమ శాతాన్ని 14 శాతానికి తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లు ఇలా.. జిల్లా రైతుల సంఖ్య సేకరించిన ధాన్యం (టన్నుల్లో) పశ్చిమగోదావరి 28,650 2,62,711 ఏలూరు 11,423 1,34,543 తూర్పుగోదావరి 12,998 1,19,748 కోనసీమ 5,975 46,669 కాకినాడ 2,481 18,357 కృష్ణా 2,598 15,298 బాపట్ల 1968 12,014 నెల్లూరు 281 4257 ప్రకాశం 411 2577 ఎన్టీఆర్ 113 1456 ––––– వేగంగా స్పందించి కొన్నారు నేను 4 ఎకరాల్లో వరి సాగు చేశాను. ఎకరానికి 45 బస్తాల దిగుబడి వచ్చింది. అకాల వర్షాలు భయపెట్టాయి. ధాన్యం తడిసిపోయి 48 గంటలు దాటకుండానే ప్రభుత్వం ఆర్బీకే ద్వారా కొనుగోలు చేసింది. 75 కిలోల బస్తాకు రూ.1,530 చొప్పున ఇచ్చారు. 6 రోజుల్లోనే బ్యాంకు ఖాతాలో నగదు జమ చేశారు. ప్రభుత్వం ఇంత వేగంగా స్పందించడం ఎన్నడూ చూడలేదు. – కుసుమ శివప్రసాద్, ఈదరాడ, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రభుత్వం వల్లే ధాన్యం అమ్మగలిగా రెండెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశా. మిషన్‌తో కోయించా. వర్షానికి తడిసిపోయిందని తక్కువ రేటుకు అడిగారు. ఏం చేయాలో పాలుపోలేదు. శుక్రవారం కలెక్టర్, అధికారులు మా గ్రామానికి వచ్చినప్పుడు చూపించా. కలెక్టర్ ఆదేశాలతో ఆర్బీకే సిబ్బంది సంచులిచ్చి, దగ్గరుండి కాటా వేయించి, ట్రాక్టర్‌తో రైసు మిల్లుకు తీసుకెళ్లారు. మద్దతు ధరకు కొంటామని చెప్పడంతో గట్టెక్కగలిగాను. లేకపోతే అయినకాడకు అమ్ముకోవాల్సి వచ్చేది. ప్రభుత్వం చాలా వేగంగా స్పందించినందుకు చాలా సంతోషంగా ఉంది. – పేపకాయల వెంకటరమణ, కౌలురైతు, కరప, కాకినాడ జిల్లా తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్నాం జిల్లా అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నాం. రైతుల వద్ద ఉన్న తడిసిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలుపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. తుపాన్‌ను దృష్టిలో పెట్టుకొని రైతుల వద్ద కోత కోసిన ధాన్యాన్ని సేకరించేందుకు ఆదేశాలిచ్చాం. అలాగే చేలల్లో నీరు నిల్వ ఉన్న చోట్ల బయటకు పంపేందుకు చర్యలు చేపట్టాం. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ, స్పెషలాఫీసర్, పశ్చిమగోదావరి జిల్లా వేగంగా ధాన్యం తరలింపు అకాల వర్షాలతో రైతుల ధాన్యం తడిచింది. ఎక్కడా ఆరబెట్టుకోలేని పరిస్థితి. రైతులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోంది. అందుకు చాలా వరకు నిబంధనల్లో సడలింపులు ఇచ్చాం. తడిచిన, మొలకొచ్చిన ధాన్యాన్ని సైతం తీసుకుంటున్నాం. వాటిని బాయిల్డ్ రకాల జాబితాలో కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలిస్తున్నాం. కోసిన పంట కోసినట్టు ఆఫ్‌లైన్‌లో నమోదు చేసి సేకరిస్తున్నాం. ప్రత్యేక అధికారుల దగ్గర నుంచి జిల్లా కలెక్టర్లు, జేసీలు, పౌర సరఫరాల సంస్థ డీఎంలు, తహసీల్దార్లు, ఏవోలు, ఆర్బీకే సిబ్బంది ఇలా నిరంతరం రైతులకు అందుబాటులో ఉన్నారు. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ రబీ సీజన్లో టీడీపీ హయాంలో కొనుగోళ్లు ఇలా.. సంవత్సరం టన్నులు 2014–15 18,91,106 2015–16 20,70,540 2016–17 16,95,341 2017–18 18,12,994 2018–19 16,47,193 (మార్చి 31 వరకు) మొత్తం 91,17,174 –––– వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 2018–19 11,05,578 (ఏప్రిల్ 1నుంచి) 2019–20 34,73,827 2020–21 37,23,522 2021–22 26,22,386 2022–23 6,17,761 (మే 6వ తేదీ వరకు) 1,15,43,074 ధాన్యం కొనుగోలు కోసం ప్రత్యేక అధికారులు జిల్లా ఐఏఎస్ అధికారి అల్లూరి సీతారామరాజు ప్రవీణ్‌కుమార్, ఎండీ ఎపీఐఐసీ అనకాపల్లి జే.నివాస్, కమిషనర్, వైద్య ఆరోగ్య శాఖ బాపట్ల కాటమనేని భాస్కర్, కమిషనర్, స్కూల్ ఎడ్యుకేషన్ (ఇన్ఫ్రా) తూర్పు గోదావరి వివేక్‌యాదవ్, కమిషనర్ సీఆర్డీఎ ఏలూరు శశిభూషణ్‌కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ, జలవనరుల శాఖ గుంటూరు ఎండీ ఇంతియాజ్, చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్, సెర్ప్ కాకినాడ పీఎస్ ప్రద్యుమ్న, ప్రిన్సిపల్ సెక్రటరీ, రోడ్లు, భవనాల శాఖ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వీరపాండ్యన్, ఎండీ ఏపీఎస్సీఎస్సీఎల్ కృష్ణా లక్ష్మీశా, ఎండీ, ఎపీఎస్‌హెచ్‌సీఎల్ ఎన్టీఆర్ గిరిజా శంకర్, కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ ఎస్పీఎస్ నెల్లూరు చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ పల్నాడు సూర్యకుమారి, కమిషనర్, పంచాయతీరాజ్ పార్వతీపురం మన్యం ముద్దాడ రవిచంద్ర, ప్రిన్సిపల్ సెక్రటరీ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రకాశం ఎం.టీ.కృష్ణబాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ, వైద్య ఆరోగ్య శాఖ శ్రీకాకుళం సిద్ధార్థ జైన్, కమిషనర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విజయనగరం సురేష్ కుమార్, కమిషనర్, పాఠశాల విద్య పశ్చిమగోదావరి కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ అనంతపురం ఎస్ఎస్ శ్రీధర్, కమిషనర్, ఉద్యాన శాఖ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గొల్లవిల్లి గ్రామానికి చెందిన సలాది లక్ష్మణబాబు.. రబీలో రెండున్నర ఎకరాల్లో ఎంటీయూ–3626 (జయ) రకం ధాన్యం సాగు చేశాడు. ఎకరాకు రూ.25 వేలు ఖర్చు చేశాడు. తెగుళ్ల బెడద లేకపోవడంతో దిగుబడి బాగా వచ్చింది. కోతలు కోసి కుప్పనూర్చాడు. అయితే తెల్లారేసరికి కుండపోత వర్షాలు. వారం పాటు ధాన్యాన్ని ఎలా రక్షించుకోవాలా అని ఆందోళన చెందాడు. కళ్లెదుటే ధాన్యంలో కొంత మేర మొలకలొచ్చేశాయి. కనీసం పెట్టుబడి అయినా దక్కుతుందో లేదోనని భయపడ్డాడు. అంతలో ప్రభుత్వం ఆగమేఘాల మీద స్పందించడం.. సీఎం వైఎస్ జగన్ ఆదేశించడంతో కలెక్టర్ సహా అధికారులంతా ఆ గ్రామానికి వచ్చారు. మొలకెత్తిన ధాన్యాన్ని చూశారు. వెంటనే బస్తాలకు ఎక్కించి మిల్లుకు తరలించారు. ‘ఆందోళన చెందకండి.. కనీస మద్దతు ధరకు మీ ధాన్యం కొనుగోలు చేస్తాం’ అని అభయమిచ్చారు. దీంతో లక్ష్మణబాబు ఆందోళన మాయమైంది. కాకినాడ జిల్లా పత్తిగొందికి చెందిన సేలం శ్రీనివాసరావు 10 ఎకరాల్లో వరివేశాడు. మాసూళ్లు ప్రారంభించే సరికి కురిసిన భారీ వర్షాలతో 4 ఎకరాల్లో పంట పూర్తిగా ముంపునకు గురైంది. ఆర్బీకే సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి తీవ్ర నష్టం జరగకుండా చూశారు. ముంపునకు గురైన వరిచేలలో నీటిని ఉపాధి కూలీల సాయంతో అధికారులు బయటకు పోయేలా చర్యలు చేపట్టారు. వరి పనలు మొలకెత్తకుండా శాస్త్రవేత్తల సిఫార్సు మేరకు ఉప్పునీటి ద్రావణం చల్లాడు. తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు భరోసా ఇవ్వడంతో ఇతనికి ఊరట కలిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడిన ప్రతి చోటా ప్రభుత్వం రైతుల వెన్నంటి ఉంటూ అండగా నిలుస్తోంది. -
‘జగనన్నే మా భవిష్యత్తు’ క్యాంపెయిన్‌కు అపూర్వ స్పందన
-
సీఎం జగన్‌తో యూఏఈ రాయబారి సమావేశం.. ఏపీలో పెట్టుబడులపై చర్చ
సాక్షి, తాడేపల్లి: క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు భారత్‌లో యూఏఈ రాయబారి అబ్ధుల్ నాసర్ అల్షాలి. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని అబ్దుల్ నాసర్‌కు సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను యూఏఈ రాయబారికి సీఎం వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఫుడ్ పార్క్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, టూరిజం, హాస్పిటాలిటీ, గ్రీన్ హైడ్రోజన్, పోర్ట్‌లు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లు, మౌలిక సదుపాయాల కల్పన వంటి వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి యూఏఈ రాయబారి తెలిపారు. ఏపీని పెట్టుబడులకు లీడ్ స్టేట్‌గా పరిగణిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే పెట్టుబడుల సదస్సులో చర్చించిన అంశాలపై మున్ముందు ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ భేటీలో సీఎం స్పెషల్ సీఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య, యూఏఈ రాయబార కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. చదవండి: గర్వంగా ఉంది: సాత్విక్- చిరాగ్‌లకు సీఎం జగన్ అభినందనలు -
అచంచలమైన నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: జగనన్నే మా భవిష్యత్తు మెగా సర్వేలో 1.45 కోట్ల కుటుంబాలకు వైఎస్సార్సీపీ చేరువైంది. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని భారీ మెగా పీపుల్స్ సర్వేగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ నిలిచింది. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా విజయవంతం చేసిన రాష్ట్ర ప్రజలకు, వైఎస్సార్సీపీ క్యాడర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘సుపరిపాలన, ప్రభుత్వ విధానాలపై అచంచలమైన నమ్మకాన్ని ఉంచి ఫోన్లు చేసి మద్దతు తెలిపిన 1.16 కోట్ల కుటుంబాలకు, పార్టీ క్యాడర్‌కు ధన్యవాదాలు’’ అంటూ సీఎం ట్వీట్ చేశారు. ‘‘ప్రజలకు మరింత సేవ చేసేందుకు దేవుని దయ, మీ చల్లని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను’’ అని ట్విటర్లో పేర్కొన్నారు. మన పాలన పట్ల మన ప్రభుత్వ విధానాల పట్ల అచంచలమైన నమ్మకాన్ని ఉంచి ఫోన్లు చేసి నాకు మద్దతు తెలిపిన 1.16కోట్ల కుటుంబాలకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన @YSRCParty క్యాడర్ కు ధన్యవాదాలు. మీకు మరింత సేవ చేసేందుకు, దేవుని దయ మీ చల్లని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనసారా… pic.twitter.com/92DSw9eFFX — YS Jagan Mohan Reddy (@ysjagan) April 29, 2023 కాగా, వైఎస్సార్ సీపీ ప్రతిష్టాత్మక జగనన్నే మా భవిష్యత్తు మెగా పీపుల్స్ సర్వే శనివారం నాటితో రాష్ట్ర వ్యాప్తంగా ముగిసింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్రంలోని 1.45 కోట్ల కుటుంబాలను కలిసి సీఎం జగనన్న పాలనపై వారి అభిప్రాయాలను సేకరించింది. సీఎం జగన్ పాలనకు 1.1 కోట్ల కుటుంబాలు మిస్డ్ కాల్ ద్వారా మద్దతు ప్రకటించారు. చదవండి: ఇంటింటా ‘నమ్మకం’.. జగనన్నే మా భవిష్యత్తు..1.1 కోట్ల మిస్డ్ కాల్స్ -
ఎన్ఐఏ రిపోర్టు ఏంటి? ఎల్లో మీడియా రాసిన రాతలేంటి?
సాక్షి, శ్రీకాకుళం: విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై హత్యాహత్నం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. దీనిపై ఎన్ఐఏ క్షుణ్నంగా విచారణ జరపాలన్నారు. ఈ ఘటనపై ఎల్లో మీడియా అసత్య రాతలు రాస్తోందని బొత్స మండిపడ్డారు. ఒక వ్యక్తే హత్యాహత్నం జరిపించుకున్నాడని రాయడం దారుణమన్నారు. ఎన్ఐఏ రిపోర్టు ఏంటి? మీరు రాసిన రాతలేంటి అని ఫైర్ అయ్యారు. ఎల్లో మీడియా తప్పుడు రాతలు, కూతలను తీవ్రంగా ఖండించారు. '2003లో అలిపిరిలో చంద్రబాబుపై హత్యాయత్నం నిజమేనా? సానుభూతి కోసమే చంద్రబాబు దాడి చేయించుకున్నారా? చంద్రబాబుకు ఉన్నఅలవాట్లు ఎవరికీ ఉండవు. ఈనాడు వార్తలు నీచమైనవి. విశాఖ ఎయిర్‌పోర్టు ఘటన నిందితుడు, ఆయన పనిచేస్తున్న సంస్థ తెలుగు దేశం మద్దతు దారుడు అవునా? కాదా? రాజకీయ స్వలాభం కోసం, డ్రామాల కోసం చంద్రబాబు మాట్లాడుతారు. నేను కూడా రాజకీయం కోసమే అని మీడియా ముసుగు తీసి రామోజీ రావు చెప్పాలి. 2014లో కూడా రామోజీ రావు ఇలాంటి పనులే చేశారు. దేవుడు అనేవాడు వున్నాడు కాబట్టే మేం గెలిచారు. ఎన్ఐఏ నివేదికలో జగనే దాడి చేయించుకున్నారని చెప్పిందా? ఏ ఆధారాలతో రాస్తారు?' అని బొత్స ధ్వజమెత్తారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంపై మాట్లాడుతూ.. 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది మా నినాదం. మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకం. ప్రైవేటికరణ ఆపాలని ఢిల్లీలో మేము పోరాటం చేస్తున్నాం. బీఆర్ఎస్, జనసేన చేస్తున్నవి తప్పుడు ప్రచారాలు. రాష్ట్రం పట్ల, అభివృద్ధి పట్ల టీడీపీకి చిత్తశుద్ధి లేదు. అందుకే మేమే ఒంటరిగా పోరాటం చేస్తున్నాం. భావనపాడు పోర్ట్‌ను టీడీపీ ఎందుకు నిర్మించలేకపోయింది. మేం చేస్తున్న భావనపాడు పోర్ట్ నిర్మాణాన్ని టీడీపీ అడ్డుకుంటే పుట్టగతులు ఉండవ్.' అని బొత్స హెచ్చరించారు. చదవండి: చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్.. -
స్కూళ్లకు వచ్చే విద్యార్ధులపై నిరంతరం ట్రాకింగ్ ఉండాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ ఎంవీ శేషగిరిబాబు, పాఠశాల విద్యాశాఖ (మౌలికవసతులు) కమిషనర్ కాటమనేని భాస్కర్ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. స్కూళ్లుకు వచ్చే విద్యార్ధులపై నిరంతరం ట్రాకింగ్ ఉండాలి సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో క్షేత్రస్ధాయిలో విద్యాశాఖ ఇప్పటికే సినర్జీతో ఉంది దీన్ని మరింత సమర్ధవంతంగా వాడుకోవాలి పిల్లలు పాఠశాలకు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్తుంది అయినా పిల్లలు బడికి రాని పక్షంలో తల్లిదండ్రులను ఆరా తీస్తున్నారు పిల్లలను బడికి పంపేలా అమ్మ ఒడిని అందిస్తున్నాం ఇంటర్మీడియట్ వరకూ అమ్మ ఒడి వర్తిస్తుంది ఆ తర్వాత కూడా విద్యాదీవెన, వసతి దీవెన ఉన్నాయి ఇలా ప్రతి దశలోనూ చదువులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది ఇలా ప్రతి విద్యార్థిని కూడా ట్రాక్ చేస్తున్నాం –అందుకే డ్రాప్‌అవుట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నాం దీనిపై ఎప్పటికప్పుడు సమర్థవంతమైన పర్యవేక్షణ జరగాలి వచ్చే విద్యాసంవత్సరంలో విద్యాకానుకపై సీఎం సమీక్ష విద్యార్థులకు పంపిణీచేయాల్సిన పుస్తకాల ముద్రణ ముందుగానే పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు మే 15 నాటికి అన్నిరకాలుగా సిద్ధమవుతున్నామన్న అధికారులు సబ్జెక్టు టీచర్ల పైనా సీఎం సమీక్ష పిల్లలకు ప్రతి సబ్జెక్టులోనూ పట్టుకోసం ఈ విధానాన్ని తీసుకు వచ్చామన్న సీఎం దీనివల్ల చక్కటి పునాది ఏర్పడుతుందని, పిల్లల్లో నైపుణ్యాలు మెరుగుపడుతాయన్న సీఎం గతంలో సబ్జెక్టు టీచర్లకు మంచి శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశాల నేపథ్యంలో సబ్జెక్టు టీచర్లకు బోధనా పద్ధతులపై ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ కోర్సులు ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో బోధనా పద్ధతుల్లో నైపుణ్యాలను పెంచేలా కోర్సు వచ్చే రెండేళ్లపాటు ఈ సర్టిఫికెట్ కోర్సు కొనసాగుతుందన్న అధికారులు 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఈ వేసవిలో శిక్షణా తరగతులు పిల్లల సంఖ్యకు తగినట్టుగా సమీక్ష చేసుకుని వారి అవసరాలకు అనుగుణంగా టీచర్లను నియమించాలని సీఎం ఆదేశం ఇక ప్రతిఏటా కూడా దీనిపై సమీక్ష చేసుకోవాలన్న సీఎం. ఆ మేరకు మార్పులు, చేర్పులు చేసుకోవాలన్న సీఎం పిల్లలకు ఎక్కడా కూడా టీచర్లు సరిపోలేదన్న మాట రాకూడదన్న సీఎం ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ) ఏర్పాటుపై సీఎం సమీక్ష ►సీఎం ఆదేశాల మేరకు జూన్ నాటికి తరగతి గదుల్లో ఐఎఫ్‌పీలు ఏర్పాటు చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్టు అధికారుల వెల్లడి ►స్కూలు పిల్లలకు టోఫెల్ సర్టిఫికేట్ పరీక్షలపై సీఎం సమీక్ష ►3 నుంచి 5గ్రేడ్ల ప్రైమరీ విద్యార్థులకు టోఫెల్ పరీక్షలు ►ఉత్తీర్ణులైన వారికి టోఫెల్ ప్రైమరీ సర్టిఫికెట్ ►6 నుంచి 10 గ్రేడ్ల వారికి జూనియర్ టోఫెల్ పరీక్షలు ►వీరికి జూనియర్ స్టాండర్డ్ టోఫెల్ పరీక్షలు ►మొత్తం మూడు దశల్లో వీరికి టోఫెల్ పరీక్ష ►ప్రైమరీ స్థాయిలో లిజనింగ్, రీడింగ్ నైపుణ్యాల పరీక్ష ►జూనియర్ స్టాండర్డ్ స్ధాయిలో లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్ నైపుణ్యాల పరీక్ష ►ఈ పరీక్షలకోసం విద్యార్థులను, టీచర్లను సన్నద్ధం చేసేలా ఇ– కంటెంట్ రూపొందించాలని సీఎం ఆదేశం. ►విద్యార్థులకు ట్యాబుల పంపిణీ, వారు వినియోగస్తున్న తీరుపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు ►ట్యాబులు ఎక్కడ రిపేరు వచ్చినా వెంటనే దానికి మరమ్మతు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం ►దీనికి సంబంధించి ఇప్పటికే ఎస్ఓపీ తయారుచేశామన్న అధికారులు. ►ట్యాబులకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా.. వెంటనే ఫిర్యాదు చేయడానికి వీలుగా ఒక ఫిర్యాదు నంబరును స్కూల్లో ఉంచాలన్న సీఎం. ►ఏ సమస్య వచ్చినా, రెండు మూడు రోజుల్లో పరిష్కరించి తిరిగి విద్యార్థులకు అప్పగిస్తున్నామన్న అధికారులు. ►సీఎం ఆదేశాల మేరకు పదోతరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామన్న అధికారులు ►గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్న అధికారులు. ►ఎక్కడా ప్రశ్నపత్రాల లీకేజీలకు ఆస్కారం లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామన్న అధికారులు. ►నో మొబైల్ జోన్స్‌గా పరీక్ష కేంద్రాలను మార్చామని, ఎవ్వరికీ కూడా మొబైల్ అనుమతిలేదని తేల్చిచెప్పిన అధికారులు. ►ప్రశ్న ప్రత్రాల్లో క్యూ ఆర్ కోడ్ ప్రతీ ప్రశ్నకూ ఇచ్చామన్న అధికారులు. ►దీనివల్ల ఎక్కడ నుంచి, ఏ సెంటర్ నుంచి, ఏ విద్యార్థికి సంబంధించిన ప్రశ్నపత్రం లీక్ అయ్యిందో సులభంగా తెలుసుకునే అవకాశం ఉందని తెలిపిన అధికారులు. ►ఈ చర్యలు కారణంగా ఎలాంటి సమస్యలు లేకుండా పరీక్షలు జరుగుతున్నాయన్న అధికారులు. ►ఇంటర్మీడియట్ పరీక్షల్లో కూడా ఇలాంటి చర్యలే తీసుకున్నామన్న అధికారులు. ►ప్రతి పరీక్షా గదిలో కూడా సీసీ కెమెరాలు పెట్టామన్న అధికారులు. ►మధ్యాహ్న భోజనం నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగాలని సీఎం ఆదేశం. ►ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్ఈ అఫిలియేషన్ పూర్తిస్థాయిలో చేయాలన్న సీఎం. ►ఇప్పటికే వేయి ప్రభుత్వ స్కూళ్లు అఫిలియేట్ అయ్యాయని, మిగిలిన స్కూళ్లు కూడా చేసేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. ►ప్రభుత్వ పాఠశాలల్లో రెండో దశ నాడు – నేడు కింద పనులపైనా సమీక్షించిన సీఎం. ►ప్రాధాన్యతా క్రమంలో పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్న అధికారులు. చదవండి: తిరుపతి-హైదరాబాద్ ‘వందేభారత్’ హౌస్‌ఫుల్.. రైలులో ప్రయాణించిన సీఎస్ -
రైతు భరోసా కేంద్రాలు అద్భుతం: రాజస్థాన్ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ ఎండీ
తిరుపతి రూరల్: క్షేత్రస్థాయిలోనే రైతు సమస్యలకు ఉత్తమ పరిష్కార కేంద్రంగా ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) అద్భుతమని రాజస్థాన్ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) జస్వంత్‌సింగ్ కొనియాడారు. ఆయన ఆదివారం రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అగ్రికల్చర్ అధికారులు, శాస్త్రవేత్తలతో కలిసి తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రంలోని ఆర్బీకేని సందర్శించారు. వ్యవసాయ శాఖాధికారులు, రైతులతో మాట్లాడారు. ఆర్బీకేలో రైతుల సంక్షేమం, అధిక దిగుబడి కోసం చేపడుతున్న చర్యలు, అందిస్తున్న నాణ్యమైన క్రిమిసంహారిక మందులు, రైతులకు సీజన్ల వారీగా అందిస్తున్న సేవలను తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి ప్రసాద్‌రావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆర్బీకేలో కియోస్క్ పనితీరు, వివిధ అవసరాలకు రైతులు కియోస్‌్కను ఉపయోగించుకుంటున్న విధానాన్ని వారు ఆసక్తిగా పరిశీలించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్బీకేలను ఏర్పాటు చేసిన తర్వాత వ్యవసాయ, పశుసంవర్ధకశాఖల అధికారులు రోజూ అందుబాటులో ఉంటున్నారని, విలువైన సలహాలు, సూచనలు ఇవ్వడం వల్ల తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించామని రైతులు తెలిపారు. అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎండీ జస్వంత్‌సింగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఆర్బీకే వంటి పథకాలపై దేశవ్యాప్తంగా చర్చజరుగుతోందని చెప్పారు. అందులో భాగంగానే వ్యవసాయాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో వాటిని పరిశీలించేందుకు వచి్చనట్లు తెలిపారు. నిజంగానే ఆర్బీకేలు రైతులకు అద్భుతంగా సేవలు అందిస్తున్నాయని కితాబిచ్చారు. ఈ విషయమై తమ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖాధికారి సంగన మమత, అగ్రికల్చర్ అసిస్టెంట్ అయేషా, రైతులు పాల్గొన్నారు. చదవండి: అన్ని ఆర్బీకేల్లో యంత్ర సేవా కేంద్రాలు! -
ఇంటింటా జన నీరాజనం.. ‘జగనన్నే మా భవిష్యత్తు’ ఘనంగా ప్రారంభం
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: ఏ ఇంటికి వెళ్లినా ఆత్మీయ పలకరింపులు.. ప్రభుత్వ పనితీరుపై ఎవరిని కదిపినా హర్షాతిరేకాలు.. మళ్లీ జగనన్నే సీఎం కావాలన్నది తమ ఆకాంక్షగా ప్రజా మద్దతు పుస్తకంలో నమోదు చేయాలని అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల ఆశీర్వచనాలు.. వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఇంటి తలుపు, మొబైల్ ఫోన్‌కు వైఎస్ జగన్ ఫొటోతో కూడిన స్టిక్కర్లను అతికించుకోవడానికి పోటీ పడ్డ అక్కచెల్లెమ్మలు.. 82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి, మద్దతు తెలిపిన వెంటనే సీఎం వైఎస్ జగన్ సందేశంతో ఐవీఆర్ఎస్ కాల్ రావడంతో కేరింతలు.. వెరసి మా నమ్మకం నువ్వే జగన్.. అంటూ నినాదాలు.. ఇదీ వైఎస్సార్సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి తొలి రోజున వచ్చిన స్పందన. గత 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రజలకు చేస్తున్న మేలును వివరించి.. ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా సాగిస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 14 వేలకుపైగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు నిర్వహించాయి. ప్రతి ఇంటా ఎదురేగి ఆహ్వానం సీఎం వైఎస్ జగన్ ప్రతినిధులుగా ఇంటికి వచ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, సచివాలయాల కన్వీనర్లు, గృహ సారథులు, పార్టీ శ్రేణులు, వలంటీర్లకు కుటుంబ సభ్యులు ఎదురేగి ఆహ్వానించారు. టీడీపీ సర్కార్‌కూ ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలను వివరిస్తూ కరపత్రాన్ని చదివి వినిపించినప్పుడు.. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తమతోపాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారనే మాట ప్రతి ఇంటా విన్పించింది. గత 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలతో తమకు అండదండగా సీఎం వైఎస్ జగన్ నిలుస్తున్నారని అవ్వాతాతలు, అక్కాచెల్లెమ్మలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజా సర్వేలో భాగంగా ప్రజా మద్దతు పుస్తకంలో స్లిప్పులలోని ఐదు ప్రశ్నలను గృహ సారథులు వినిపించినప్పుడు.. వైఎస్ జగన్ ప్రభుత్వంతోనే తమకు న్యాయం జరిగిందని, మళ్లీ సీఎంగా వైఎస్ జగనే కావాలంటూ సమాధానాలు చెప్పి.. వాటిని నమోదు చేయించి, రసీదు తీసుకున్నారు. రసీదు తీసుకున్నాక గృహ సారథులు అడగక ముందే.. వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చారు. ప్రభుత్వానికి మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం వైఎస్ జగన్ సందేశంతో ఐవీఆర్ఎస్ కాల్ రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. గృహ సారథుల వద్ద నుంచి వైఎస్ జగన్ ఫొటో ఉన్న స్టిక్కర్లను తీసుకుని.. ఇంటి తలుపునకు, మొబైల్ ఫోన్‌కు అతికించి.. ‘జగనన్నే మా భవిష్యత్’ అంటూ నినదించారు. 20వ తేదీ వరకు కొనసాగనున్న కార్యక్రమం ‘జగన్నే మా భవిష్యత్తు’ పేరుతో భారీ ఎత్తున వైఎస్సార్సీపీ చేపట్టిన కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతుంది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాలల్లో 1.65 కోట్ల కుటుంబాల్లోని ఐదు కోట్ల మంది ప్రజలను సీఎం వైఎస్ జగన్ ప్రతినిధులుగా గృహ సారథులు, కన్వీనర్లు, వలంటీర్లు కలవనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ప్రారంభం గత టీడీపీ సర్కార్‌కు, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ మరోసారి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతూ ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమైందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎంపీ సంజీవ్ కుమార్ తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ’జగనన్నే మా భవిష్యత్తు’ మెగా పీపుల్ సర్వే కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ ‘1.65 కోట్ల ఇళ్లకి వెళ్లి ఈ సర్వే చేపడతాం. 7 లక్షలు మంది పార్టీ సైనికులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు ఈ సర్వే కోసం అందుబాటులో ఉంటారు. జగనన్న ప్రభుత్వానికి, గత టీడీపీ ప్రభుత్వానికి గల తేడాలను పోల్చి చెబుతారు’ అని తెలిపారు. ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. ‘కుల, మత, పార్టీలకు అతీతంగా ఈ మెగా పీపుల్ సర్వే జరుగుతుంది. దేశంలో ఇలాంటి కార్యక్రమం జరగడం ఇదే మొదటిసారి. ఇంత వరకు ఇంత ధైర్యంగా ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టలేదు. తాను ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజాభిప్రాయం కోరటం మొదటిసారి ఏపీలోనే జరుగుతోంది’ అని అన్నారు. ఎంపీ ఎస్.సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో సీఎం జగన్ పేదల తరుపున యుద్ధం చేస్తున్నారు. సీఎం జగన్‌కు అందరూ అండగా ఉండి సామాజిక కుట్రలు తిప్పికొట్టాలి. ప్రజల నుంచి వచ్చిన ప్రధాన నినాదం ‘మా నమ్మకం నువ్వే జగన్’. అందుకే ఈ నినాదాన్ని ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో ఒక ప్రధాన అంశంగా పెట్టాం. గత 46 నెలల్లో ప్రజల జీవితాల్లో, వారి జీవనశైలిలో వచ్చిన మార్పును కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం’ అని వివరించారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘ఇప్పటికే గడప గడపకూ తిరిగి జరిగిన అభివృద్ధి వివరించి చెబుతున్నాం. ఇప్పుడు జగనన్నే మా భవిష్యత్తు పేరుతో మెగా పీపుల్స్ సర్వే కోసం ధైర్యంగా ప్రజల ముందుకు వెళుతున్నాం. ప్రతి తలుపు తడుతూ, ప్రతి గడప తొక్కుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరిస్తాం’ అని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో ఉత్సాహంగా.. ► రాయలసీమ జిల్లాలైన ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఆలూరులో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, కళ్యాణదుర్గం మండలం శీబావి గ్రామంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి ఉషశ్రీ చరణ్, వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలో డిప్యూటీ సీఎం అంజద్‌బాషా పాల్గొన్నారు. ► గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, పుంగనూరులోని భగత్‌సింగ్ నగర్ కాలనీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నగరి నియోజకవర్గం వడమాలపేట మండలం పూడి గ్రామంలో మంత్రి ఆర్కే రోజా ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అంటించారు. ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాలన్నింటిలో కార్యక్రమం కొనసాగింది. అంతటా అదే ఉత్తేజం.. ► శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఒంగోలులోని గద్దలగుంటలో వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, యర్రగొండపాలెంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్‌లు ప్రజల స్పందన తెలుసుకున్నారు. ► పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంటలో మంత్రి అంబటి, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, చిలకలూరిపేట మండలం వేమూరులో మంత్రి విడదల రజని పాల్గొన్నారు. మాచర్లలో ర్యాలీ నిర్వహించారు. ► గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమం ఘనంగా మొదలైంది. ఆయా కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ► బాపట్ల జిల్లా రేపల్లెలో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు ప్రజలతో మమేకం అయ్యారు. వేమూరులో మంత్రి మేరుగ నాగార్జున కార్యక్రమంలో పాల్గొన్నారు. ► ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల వ్యాప్తంగా శుక్రవారం అన్ని నియోజకవర్గాల్లో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ఉత్సాహంగా మొదలైంది. ‘మా నమ్మకం నువ్వే జగన్’ స్టిక్కర్లను ఇళ్ల గోడలు, తలుపులపై అంటించి ప్రజా మద్దతు కోరారు. పెడనలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, విజయవాడలో మాజీ మంత్రి వెలంపల్లి, మేయర్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ► ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, తణుకులో రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, నరసాపురంలో ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోని ఇందిరమ్మ కాలనీలో హోం మంత్రి తానేటి వనిత, రాజమహేంద్రవరంలో ఎంపీలు మార్గాని భరత్‌రామ్, పిల్లి సుభాష్ చంద్రబోస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, రామచంద్రాపురంలో రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ► విజయనగరంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరులో డిప్యూటీ æసీఎం రాజన్నదొర, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం, పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో నేతలు ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లారు. ► అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మోడల్ కాలనీలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, తుమ్మపాల పంచాయతీ పరిధిలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంటింటికీ వెళ్లి ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారు. విశాఖ నగరంలో పార్టీ ఎమ్మెల్యేలు, శ్రేణులు ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాయి. ప్రజల స్పందన తెలుసుకునేందుకే : మంత్రి అంబటి రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా అందించిన సంక్షేమ పథకాలపై ప్రజల స్పందనను నేరుగా తెలుసుకునేందుకే జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం, ఏ పార్టీ చేయని విధంగా.. ప్రజా స్పందన కోసం వారి వద్దకే వెళ్తున్నామని చెప్పారు. ‘నేను కూడా నకరికల్లు మండలం కుంకలగుంట, రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామాలలో పర్యటించాను. ప్రజల స్పందన సంతోషకరంగా ఉంది. రాష్ట్రంలో ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు ఒక్క వైఎస్సార్సీపీకి మాత్రమే ఉంది. ప్రజల అనుమతితోనే తలుపుకు, సెల్ ఫోన్‌కు స్టిక్కర్ అంటిస్తున్నాం’ అని చెప్పారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం : మంత్రి రజిని జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు వెళ్లి ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై ఐదు అంశాలకు సంబంధించి ప్రజల అభిప్రాయాన్ని నమోదు చేసుకుంటారని తెలిపారు. గత ప్రభుత్వ అరాచకాలను, అప్పట్లో ప్రజలు పడిన ఇబ్బందులను, ప్రజలు ఎలా మోసపోయారో కూడా వివరిస్తారని చెప్పారు. నవరత్నాలు పేరుతో హామీలు ఇచ్చి, వాటిని అతి తక్కువ సమయంలో అమలు చేసి ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లేలా చేసిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఒక్క జగనన్నే కనిపిస్తారని చెప్పారు. చిలకలూరిపేట నియోజకవర్గం వేదికగా ‘ఫ్యామిలీ డాక్టర్’ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: అక్కడ సెల్ఫీ తీసుకునే దమ్ము ఉందా: చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్ -
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పులపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులపై ప్రతిపక్షాల పత్రికా ప్రకటనలు, కొన్ని పత్రికల్లో వస్తున్న కథనాలు పచ్చి అబద్ధాలని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023 మార్చి 31 నాటికి తమ ప్రభుత్వం చేసిన అప్పు రూ. 1,64,725 కోట్లే అని వెల్లడించారు. టీడీపీ హయాంలో కేంద్రం కన్నా రాష్ట్రం రెండింతల అప్పులు చేసినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ 59,729 కోట్లు వేస్ అండ్ మీన్స్ నిజం కాదా? అని ప్రశ్నించారు. “ఖజానా ఖాళీ!, రూ.100కోట్ల నిధి మాత్రమే మిగిలింది. ఎక్కడెక్కడ అప్పులొస్తాయో అన్నీ తెచ్చేశాం. ఒక్క రూపాయి కూడా ఇక అప్పు పుట్టదు. వైసీపీ ప్రభుత్వం మొదటి 6 నెలల్లోనే అప్పుదొరకక ఆదాయం లేక ఇంటికి వెళుతుంది” అంటూ గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన యనమలగారు వేర్వేరు సందర్భాలలో చేసిన వ్యాఖ్యలివి! ఇప్పుడేమో రాష్త్రం అప్పు రూ. 12.5 లక్షల కోట్లు దాటనుందని జోస్యం చెబుతున్నారు. అలాగే చంద్రబాబు గారు కూడా రాష్ట్రం అప్పు రూ. 10.31 లక్షల కోట్లు చేరిందని ఆయనే నిర్ధారించి సభల్లో ఇష్టమొచ్చినట్లు ప్రకటిస్తున్నారు. కొద్ది నెలల క్రితం వరకూ ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకగా, నైజీరియాగా, జింబాబ్వేగా మారబోతోందని ప్రతిపక్ష నేతలు ఇలాగే గగ్గోలు పెట్టారు. టీడీపీ నాయకులలో రాష్ట్ర ఆర్ధిక స్థితిపై సరైన అవగాహన లేక నోటికి వచ్చినట్లు పచ్చి అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారు. ఈ దుష్ప్రచారాలతో రాష్ట్ర ప్రజలలో ఒక రకమైన గందగోళాన్ని సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని విఫల యత్నంచేస్తున్నారు. వాస్తవానికి , మే నెల, 2019 లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు రూ.2,71,797 కోట్లు. మార్చి 31 , 2023 నాటికీ రాష్ట్రం అప్పు రూ. 4,36,522 కోట్లు. ఈ లెక్కల ప్రకారం, ఈ నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు అక్షరాలా రూ.1,64,725 కోట్లు మాత్రమే. అప్పు పెరుగుదలని పోల్చి చూస్తే, గత ప్రభుత్వ హయాం లో 2014 -19 లో కేంద్ర ప్రభుత్వ అప్పు Compound Annual Growth Rate (CAGR) 9.89% పెరిగినప్పుడు, మన రాష్ట్ర అప్పు CAGR 19.02 % పెరిగింది. అంటే, టీడీపీ హయాంలో కేంద్రం కన్నా రాష్ట్రం రెండింతల అప్పులు చేసిందన్నడానికి అధికారిక గణాంకాలే నిదర్శనం. అదే వైసీపీ ప్రభుత్వ హయాంలో (జూన్ 2019 నుంచి మార్చి 2023) కేంద్ర ప్రభుత్వ అప్పు CAGR 14.37% పెరిగినప్పటికీ రాష్ట్ర అప్పు మాత్రం CAGR 13.55 శాతమే పెరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్పు నెమ్మదిగా పెరిగింది (SLOWER PACE) తప్ప మీరు చెప్పినట్టు కాదు. మీరు చేసినంత అప్పు అసలే లేదు. పైగా మా ప్రభుత్వం ఆ మాత్రం చేసింది కూడా కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కుంటూ సంక్షేమ పథకాలు ఏవీ ఆపకుండా ఉండడానికే..ప్రజలను కాపాడుకోవడానికే. తలసరి అప్పు రూ. 5.5 లక్షలని, అప్పులపై సంవత్సరానికి లక్ష కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుందని సొంత లెక్కలు చెబుతూ యనమల గారు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇవి ముమ్మాటికి ప్రజలను తప్పు దోవ పట్టించే తప్పుడు లెక్కలు, పచ్చి అసత్యాలన్నది వాస్తవం. సెన్సస్-2011 ఆంధ్రప్రదేశ్ జనాభా 4.96 కోట్లు. ఈ జనాభా ప్రకారం తలసరి అప్పు రూ.88,008 మాత్రమే. అప్పులపై వడ్డీ చూస్తే 2022 - 23కి రూ. 25,754 కోట్లు మాత్రమే. ఒక మాజీ ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి కూడా కనీస బాధ్యత లేకుండా రూ.లక్ష కోట్లు వడ్డీ కడుతుందని చెప్పడమంటే ముమ్మాటికి ఇది రాజకీయ ప్రయోజనాలు మినహా నిజాలు లేవని ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు ఏమైనా పర్వాలేదు, యువత భవిష్యత్తు నాశనమైనా మాకేం పోదు, పేదవారు కష్టాల ఊబిలో కూరుకుపోయినా మాకు సంబంధం లేదు, మాకు కేవలం వైసీపీ ప్రభుత్వాన్ని అసత్యాలతో, అనుకూల మీడియాతో భయాందోళనలోకి ప్రజలను నెట్టి ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని టీడీపీ పన్నిన దుష్ట పన్నాగం కాక మరేమిటి? వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్‌ని, ఓవర్ డ్రాఫ్ట్ (O.D) ని అప్పులలో కలిపి యనమల గారు కుతంత్రాలను జొప్పించి అర్థరహితంగా మాట్లాడుతున్నారు. ఇది ముమ్మాటికీ ఒక పథకం ప్రకారం వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లాలని చేస్తున్న కుయుక్తే. భారతీయ రిజర్వు బ్యాంకు రాష్ట్రాలకు రోజు వారీ నగదు నిర్వహణకు గాను, వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ వసతిని కల్పించింది. దీనిని వాడుకోవడమనేది ఏ ప్రభుత్వానికైనా సర్వసాధారణమైన విషయం. వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ అనేవి తాత్కాలిక అప్పు మాత్రమే. ‘వేస్ అండ్ మీన్స్’ మరియు ‘ఓవర్ డ్రాఫ్ట్’ కింద మన రాష్ట్ర అప్పు సున్నా. టీడీపీ ప్రభుత్వం కూడా 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ 59,729 కోట్లు వేస్ అండ్ మీన్స్ గా పొందడం వాస్తవం కాదా? అందులో రూ. 139 కోట్లు తిరిగి చెల్లించకుండా వెళ్లి పోయిన మాట వాస్తవం కాదా? అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా 2020–21 సంవత్సరానికి గాను రూ 69,454 కోట్లు వేస్ అండ్ మీన్స్ను ఉపయోగించుకుంది. ఇదేదో ఇపుడే వైసీపీ ప్రభుత్వమే తొలిసారి చేస్తున్నట్లుగా వాస్తవాలను మరుగున పరచి అబద్ధాలను ఎందుకు ప్రచారం చేస్తున్నారో వారికే తెలియాలి. ఉదాహరణకు కోవిడ్ పరిస్థితుల్లో పేద వాడిని కష్టాల నుండి కాపాడుకోవడం కోసం నియమిత గడువులోపల ఒక సంక్షేమ పథకానికి నిధులు విడుదల చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు ఉండకపోవచ్చు. అప్పుడు ఆర్బీఐ వద్దకు వేస్ అండ్ మీన్స్కు వెళ్లడం పరిపాటి. రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి అధికంగా వచ్చినప్పుడు అది మిగులు బ్యాలెన్స్‌గా కూడా మారొచ్చు. ఇది తెలిసి కూడా అదేదో పెద్ద విషయమైనట్లు టీడీపీ నేతలు చిత్రీకరించే ప్రయత్నం చూడడానికి విడ్డూరంగా ఉంది. స్థిరమైన అభివృద్ధి లక్షాలలో (SDG) 13వ స్థానంలో ఉందని, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) లో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో ఉందనే ప్రతిపక్షాల ప్రచారం కూడా నిజం కాదు. ఎక్కడ నుండి ఈ తప్పుడు సమాచారాన్ని కనిపెడతారో, కావాలనే ఈ కాకి లెక్కలు ఎలా సృష్టిస్తారో కూడా చెప్పాలని కోరుతున్నాను. నీతిఆయోగ్, భారత ప్రభుత్వం 2020-21 సంవత్సరంలో ప్రకటించిన ఎస్డీజీ ఇండెక్స్ ప్రకారం, ఈ ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ 72 స్కోరుతో 4వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడేళ్లలో తన స్కోర్‌ను నిరంతరం మెరుగుపరుచుకుంటూ సత్తా చాటుతోంది. 2018-19లో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్కోర్ 64 నుండి 2020-21నాటికి ఆ స్కోరు 72కి మెరుగుపడడం ఏపీ ప్రభుత్వ విధానాలకు ప్రతిబింబమన్న అసలు నిజం ప్రజలకు తెలియాలి. పైగా ప్రతిసారి ఈ స్కోరులో భారతదేశ సగటు స్కోరు కంటే ఆంధ్రప్రదేశ్ మెరుగ్గా ఉందని నీతిఆయోగ్ గణాంకాలే తేల్చాయి. చంద్రబాబు నాయుడు గారు 2022-23 లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం తెలంగాణతో పోల్చితే చాల వెనుకపడి ఉందంటున్నారు. మరి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019లో తెలంగాణ తలసారి ఆదాయం రూ. 2,09,848/- ఉంటే మరీ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం కేవలం రూ. 1,54,031/- ఎందుకు ఉంది. అప్పుడు ఇప్పుడు తక్కువ తలసరి ఆదాయానికి కారణం చంద్రబాబు నాయుడు పాతకకృత్యాలే. ఓటుకు నోటు కేసు , ఇబ్బడిముబ్బడిగా అప్పులు,వడ్డీలతో ఆర్ధిక విధ్వంసం. ఇవే ఏపీ వెనకబాటుతనానికి కారణం. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొరికి పోయి హైదరాబాద్ ని రాత్రి రాత్రికి తరలి వచ్చి విజయవాడలో చేరడం, టీడీపీ వాళ్ళు అవినీతి ఊబిలో కూరుకుపోయి చేసిన ఆర్థిక అనర్థాలేనని తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ బాగా తెలుసు. ప్రస్తుత ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,19,518/- (2022-23 AE). భారతదేశం యొక్క తలసరి ఆదాయం రూ. 1,72,000/- (2022-23 AE). అంటే 2022-23లో రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే 27.6% ఎక్కువ. తలసరి ఆదాయం అంశంలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో మెరుగ్గా ఉంది. వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి లెక్క ఉంది. ప్రతి పైసా ప్రజలకు అవినీతి లేకుండా వారి ఖాతాలకు జమ అయింది. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నవరత్నాలలో భాగముగా 26 సంక్షేమ పథకాలకు ఎస్సి, ఎస్టి, బీసి, పేద ,మధ్యతరగతి ప్రజలకు నేరుగా సుమారు రూ 2,05,109 కోట్లు డీబీటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. దేశంలోనే కనీవినీ ఎరుగని విధంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తుంటే ప్రతిపక్షాలు కడుపు మంటతో అర్థం లేని వివర్శలు చేయడం శోచనీయం. గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీ సిఫారసు మేరకు, రాజకీయ నాయకుడికి దగ్గరగా ఉన్న అనుకూల వర్గాల వారినే లబ్ధిదారులుగా ఎంచుకున్నారు. వారి లక్ష్యం స్వార్థపూరితం.. కావడం వల్ల అర్హత ఉన్నా కూడా ఫలాలు అందని పేద ప్రజలెందరో నాటి ప్రభుత్వ హయాంలో. కానీ ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా, కేవలం అర్హత ఉన్న ప్రతి లబ్ది దారునికి కుల,మత, ప్రాంత,వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది. ఎవరి సిఫారసులు అక్కర లేదు.. కేవలం అర్హతే ప్రామాణికం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, నిర్వహణ, అప్పులు, వడ్డీ, తలసరి ఆదాయం, ఎస్.డీ.జీ , డీ.బీ.టీ ఇలా అన్నింటిలో వాస్తవాలు వేరు. యనమలగారు , చంద్ర బాబు నాయుడు గారి దుష్ప్రచారంలో చెప్పే లెక్కలు వేరు. పత్రికా ప్రకటనల్లో రాసే ప్రతి అక్షరం ఓ అబద్ధం. అప్పులు, వడ్డీలు, తలసరి ఆదాయం, SDG, DBT లెక్కలపై సరైన అవగాహన లేకుండా ప్రభుత్వ ప్రతిష్టను అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా లెక్కలన్నీ పూర్తిగా కల్పితం. ప్రతిపక్ష నాయకులు, కొన్ని పత్రికలు స్వార్థంతో చేసిన కపట నాటకాలనడానికి.. పైన పేర్కొన్న వాస్తవ గణాంకాలే ఉదాహరణ. అని మంత్రి బుగ్గన అన్నారు. చదవండి: వైఎస్సార్సీపీకి ఎవరూ నన్ను దూరం చేయలేరు: ఎమ్మెల్యే ఆర్కే -
సీఎం జగన్‌పై ప్రపంచబ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంసలు..
సాక్షి, తాడేపల్లి: ప్రపంచబ్యాంకు భారత్ విభాగం డైరెక్టర్ ఆగస్టే టానో కౌమే నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సీఎం జగన్‌తో సోమవారం భేటీ అయింది. వరల్డ్ బ్యాంకు సహకారంతో అమలవుతున్న మూడు కార్యక్రమాలను సమీక్షించింది. ఏపీ ప్రజారోగ్య బలోపేతం, ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ (సాల్ట్), ఏపీ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ (ఏపీఐఐఏటీపీ) ప్రాజెక్టుల అమలును పరిశీలించింది. అనంతరం ఆగస్టే టానో మాట్లాడుతూ.. సీఎం జగన్ సర్కార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్‌ను మిగిలిన రాష్ట్రాలు ఒక ఉదాహరణగా తీసుకుని ముందుకు సాగవచ్చు అని కొనియాడారు. 'రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. వివిధ రంగాల్లో మీరు చేరుకున్న లక్ష్యాలను ప్రత్యక్షంగా మేం చూశాం. ఒక ప్రభుత్వం తన ప్రజలకు ఏ విధంగా సేవలు అందించగలదు అనే దానికి మీరు ఉదాహరణగా నిలిచారు. దీనికి మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నా. మంచి వైద్యం, ఆరోగ్యం, మంచి విద్యను ఎలా అందించవచ్చు అన్నదానికి మీరు చక్కటి మార్గాన్ని చూపారు. నిర్దేశిత సమయంలోగా సేవలను పౌరులకు అందించడంలో మీరు గొప్ప ఉదాహరణగా నిలిచారు. దేశంలో దాదాపు 22 రాష్ట్రాలకు మేం రుణాలు ఇస్తున్నాం. వివిధ రంగాల్లో వృద్ధికోసం ఈ రుణాలు ఇస్తున్నాం. వచ్చే పాతికేళ్లలో మీ విజన్ కు, మీ మిషన్ కు ఈ సహకారం కొనసాగుతుంది.' అని పేర్కొన్నారు. మరింత భాగస్వామ్యం ఆశిస్తున్నాం.. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని సీఎం జగన్ ప్రపంచబ్యాంకు బృందాన్ని కోరారు. ఈ కార్యక్రమాల్లో మరింతగా ప్రపంచబ్యాంకు భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నట్లు చెప్పారు. 'రాష్ట్రంలో మొత్తం స్కూళ్ల రూపు రేఖలన్నీ మారుస్తున్నాం. 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. 6వ తరగతి నుంచి ఐఎఫ్‌పీ ప్యానెల్స్ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే జూన్ కల్లా వీటిని ఏర్పాటు చేస్తున్నాం. దీంతో బోధనా పద్ధతులను పూర్తిగా మార్చివేస్తున్నాం. డిజిటలైజేషన్ దిశగా వేస్తున్న పెద్ద అడుగు ఇది. రాష్ట్రంలో ఆరు పోర్టులు ఉన్నాయి, మరో నాలుగు వస్తున్నాయి. ఈ పోర్టు ఆధారిత పారిశ్రామిక వ్యవస్థలకు అవసరమైన నైపుణ్యం ఉన్న మానవవనరులు రాష్ట్రంలోనే తయారవుతాయి. ఈ కార్యక్రమాల్లో ప్రపంచబ్యాంకు భాగస్వామ్యం కావాలని కోరుతున్నా. వైద్యారోగ్యశాఖలో కొత్తగా సుమారు 40 వేలమందికిపైగా సిబ్బందిని రిక్రూట్ చేశాం. 17 కొత్త మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలవుతోంది. ఆరోగ్యశ్రీని అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్నాం.' అని సీఎం జగన్ వివరించారు. చదవండి: గవర్నర్‌తో సీఎం జగన్ మర్యాదపూర్వక భేటీ.. -
గవర్నర్‌తో సీఎం జగన్ మర్యాదపూర్వక భేటీ..
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సాయంత్రం 5గంటలకు విజయవాడలోని రాజ్‌భవన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాజ్‌భవన్ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన గవర్నర్‌తో గంటకుపైగా సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి గవర్నర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివరించినట్టు సమాచారం. (చదవండి: ఏప్రిల్ 1 నుండి నడకమార్గాల్లో ప్రయోగాత్మకంగా దివ్యదర్శనం టోకెన్లు) -
అకాల వర్షాలపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
తాడేపల్లి: అకాల వర్షాలపై అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వానల వల్ల జరిగిన పంట నష్టంపై ఎన్యుమరేషన్ ప్రారంభించాలని సూచించారు. వారం రోజుల్లో దీనికి సంబంధించి నివేదికలు ఇవ్వాలని చెప్పారు. నివేదికల ఆధారంగా రైతులకు సహాయపడేందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. కాగా, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో పిడుగులు, వడగళ్లు హడలెత్తిస్తున్నాయి. దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి జార్ఖండ్ వరకు.. రాయలసీమ, తెలంగాణ, ఒడిశాల మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్ వరకు కొనసాగుతున్న ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు. అలాగే, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో సోమవారం అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుపడే అవకాశముందని తెలిపారు. చదవండి: భారీ వర్షాలు.. పిడుగులు -
జగనన్న విద్యాదీవెన: తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేసిన సీఎం జగన్
Updates: ►జగనన్న విద్యా దీవెన కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేశారు. గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు 2017 నుండి పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద ప్రభుత్వం రూ.13,311 కోట్లు సాయం అందించింది. కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ ఈ పథకాలను వర్తింప చేస్తూ పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలుస్తోంది. సీఎం జగన్ ప్రసంగం: ♦సినిమాల్లో హీరోలే నచ్చుతారు.. విలన్లు నచ్చరు.. ♦ఎన్నికుట్రలు చేసినా గెలిచేది మంచి మాత్రమే ♦చివరికి మంచి చేసిన వాడే గెలుస్తాడు ♦ఎందుకు ఈ తోడేళ్లు ఏకమవుతున్నాయి ♦పొత్తుల కోసం వీళ్లంతా ఎందుకు వెంపర్లాడుతున్నారు ♦అర్హతలేని వారు మన ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారు ♦విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం ♦కుటుంబం, రాజకీయ, మనవతా విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం ♦మన ప్రభుత్వంలో డీబీటీ.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ♦గత ప్రభుత్వంలో డీపీటీ.. దోచుకో, పంచుకో, తినుకో.. ♦కొత్తగా 14 డిగ్రీ కాలేజీలు తీసుకొచ్చాం ♦17 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి ♦45 నెలల్లో డీబీటీ ద్వారా నేరుగా 1.9లక్షల కోట్లు అందించాం ♦ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజులు చెల్లిస్తున్నాం ♦ఫీజులు మాత్రమే కాదు వసతి ఖర్చులు కూడా ఇస్తున్నాం ♦ఏప్రిల్ 11న రెండో విడత వసతి దీవెన నిధులు ♦ఈ పథకాలతో చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరిగింది ♦జీఈఆర్ రేషియో 32 నుంచి 72 శాతానికి తీసుకెళ్లే దిశగా అడుగులు ♦ప్రభుత్వ బడులు, కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడేలా చేస్తున్నాం ♦మీ పిల్లల చదువులకు నాది బాధ్యత ♦ఉన్నత విద్యకు మరింత ఊతమిచ్చే చర్యలు తీసుకున్నాం ♦8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తున్నాం ♦రెండేళ్లలో ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతాం ♦ప్రభుత్వ పాఠశాలలతో కార్పొరేట్ స్కూళ్లు పోటీపడే పరిస్థితి తెస్తాం ♦పేదలు బాగుండాలనే నవరత్నాలు ప్రవేశపెట్టాం: సీఎం జగన్ ♦పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే ♦ఒక మనిషి పేదరికం నుంచి బయటపడాలంటే చదువుతోనే సాధ్యం ♦ఒక కుటుంబం తలరాతను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది. ♦ఒక మనిషి జీవన ప్రమాణం, జీవన ప్రయాణం నిర్దేశించేది చదువే ♦కలెక్టర్ ఢిల్లీరావు సాధారణ కుటుంబం నంచి వచ్చిన వ్యక్తి ♦చదువుకు పేదరికం అడ్డుకాకూడదు ♦దేశంలో విద్యాదీవన, వసతి దీవెన పథకాలు ఎక్కడా లేవు ♦కాలేజీ ఫీజులు ఎంతైనా సరే పూర్తి బాధ్యత మీ జగనన్నదే ♦గత ప్రభుత్వంలో కాలేజీ ఫీజులు బకాయిలు పెట్టేవారు ♦ఫీజులు కట్టలేక చదువులు మానివేసే పరిస్థితి రాకూడదు ♦లంచాలు, వివక్ష లేకుండా తల్లుల ఖాతాల్లో విద్యాదీవెన నిధులు జమ చేస్తున్నాం ♦గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ అరకొరగా ఇచ్చేవాళ్లు ♦ఫీజులు కట్టలేక విద్యార్థులు అవస్థలు పడేవారు ♦తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలున్నాయి ♦అందుకే విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాం ♦జగనన్న విద్యాదీవెన ద్వారా ఇప్పటివరకు రూ.9,947 కోట్లు ఇచ్చాం ♦27 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చాం ♦చంద్రబాబు హయాంలోని బకాయిలను సైతం చెల్లించాం ♦విద్యాదీవెనతో పాటు వసతి దీవెన కూడా ఇస్తున్నాం ♦తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయడం ద్వారా ప్రశ్నించే హక్కు ఉంటుంది ♦కాలేజీలో సమస్యలుంటే 1092కి ఫిర్యాదు చేస్తే మేమే మాట్లాడతాం ►సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు.. కాసేపట్లో నాలుగో విడత జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేయనున్నారు. సీఎం జగన్‌కు ఘన స్వాగతం ►కొద్దిసేపట్లో మార్కెట్ యార్డ్‌లోని సభా ప్రాంగణానికి సీఎం జగన్ చేరుకోనున్నారు. ►తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, మంత్రి బొత్స సత్యనారాయణ, హోంమంత్రి తానేటి వనిత, రీజనల్ కోఆర్డినేటర్లు, ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్,ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, మేకా ప్రతాప్ అప్పారావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తదితరులు సీఎంకు స్వాగతం పలికారు. ►జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో భాగంగా తిరువూరు వాహినీ కాలేజ్ గ్రౌండ్స్‌లోని హెలీప్యాడ్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేరుకున్నారు. ► జగనన్న విద్యా దీవెన కింద గత ఏడాది (2022) అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేయనున్నారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే ప్రభుత్వం చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ►గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు 2017 నుండి పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద ప్రభుత్వం రూ.13,311 కోట్లు సాయం అందించింది. కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ ఈ పథకాలను వర్తింప చేస్తూ పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలుస్తోంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. జగనన్న వసతి దీవెన కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది. తల్లుల ఖాతాల్లో వేయడం ద్వారా వారికి ప్రశ్నించే హక్కును, తమ పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయో తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది. ఉన్నత విద్యకు ప్రోత్సాహం ► జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్‌తో ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు పాఠ్యాంశాల్లో మార్పులు చేసి నాలుగేళ్ళ ఆనర్స్ డిగ్రీ కోర్సులు, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేలా కోర్సులు అందుబాటులోకి తెచ్చింది. ► కరిక్యులమ్‌లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్‌షిప్ పెట్టడం ద్వారా విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతోంది. 40 అంశాలలో నైపుణ్యం పెంపొందించేలా 1.62 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే 1.07 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ టెక్నాలజీలో, 73 వేల మందికి ఇతర అత్యాధునిక సాంకేతిక అంశాల్లో శిక్షణ పూర్తి చేసి, సర్టిఫికెట్స్ పంపిణీ చేసింది. దేశంలో ఒకే క్యాలెండర్ ఇయర్లో 1.75 లక్షల కంటే ఎక్కువ సర్టిఫికేషన్స్ సాధించిన ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ► ఇంటర్ పాసై పై చదువులకు వెళ్లని విద్యార్థుల సంఖ్య 2018–19 లో 81,813 కాగా, వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, సంస్కరణల వల్ల ఈ సంఖ్య గణనీయంగా తగ్గి 2022–23 నాటికి 22,387కు చేరింది. ► 2018–19లో 32.4 గా ఉన్న స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) 2020–21 సంవత్సరానికి 37.2కు పెరిగింది. రాబోయే రోజుల్లో జీఈఆర్ శాతం 70కి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకుంది. 2018–19లో సగటున ప్రతి 100 మంది బాలురకు 81 మంది బాలికలు కళాశాలల్లో చేరితే 2020–21 నాటికి ఈ సగటు 94కు పెరిగింది. ► 2018–19 లో 37,000 గా ఉన్న క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ గణనీయంగా పెరిగి 2021–22కి 85,000 కు చేరడం విశేషం. విద్యా రంగంపై జగన్ ప్రభుత్వం గత 45 నెలల్లో మొత్తం రూ.57,642.36 కోట్లు వెచ్చించింది. ► 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌లు, నాడు –నేడు ద్వారా ఇప్పటికే అభివృద్ది చేసిన పాఠశాలల్లో 6 వ తరగతి పైన ప్రతి క్లాస్ రూమ్‌లో ఉండేలా 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, 10,038 ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లలో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేస్తోంది. -
పోలీసులకు బకాయిలు విడుదల చేసిన ఏపీ సర్కార్
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వం.. పోలీసులకు బకాయిలను విడుదల చేసింది. పోలీస్ సిబ్బంది టీఏ నిధులను ఆర్థిక శాఖ విడుదల చేసింది. పోలీస్ ఉద్యోగుల జీపీఎఫ్ లోన్లను క్లియర్ చేసింది. పెడింగ్ నిధుల విడుదల పట్ల పోలీస్ అధికారుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. చదవండి: ఎకనమిక్ కారిడార్‌కు లైన్‌క్లియర్ -
పొట్టి శ్రీరాములు జయంతి.. నివాళులు అర్పించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా సచివాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్. జవహర్ రెడ్డి పాల్గొన్నారు. -
Womens Day: వనిత జీవితం మనందరికీ ఆదర్శం.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన వనిత గారి జీవితం మనందరికీ ఆదర్శం అంటూ ట్వీట్ చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన వనిత తన బిడ్డల కోసం ఒంటరి పోరాటం చేస్తూ సమాజానికి ప్రేరణగా నిలిచారంటూ కొనియాడారు. వనితతోపాటు మహిళాలోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని, తన బిడ్డల కోసం ఒంటరి పోరాటం చేస్తూ సమాజానికి ప్రేరణగా నిలిచిన చిత్తూరు జిల్లాకు చెందిన వనిత గారి జీవితం మనకు ఆదర్శం. వనిత గారికి, మరియు రాష్ట్ర ప్రజలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.#InternationalWomensDay pic.twitter.com/rtRHf3O1pF — YS Jagan Mohan Reddy (@ysjagan) March 8, 2023 ఈ వీడియోలో వనిత ఏం చెప్పారంటే.. వివాహమయ్యాక ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడంతో భర్తతో తనకు గొడవలు అయ్యి పుట్టింటికి వెళ్లిపోయినట్లు టీ వనిత తెలిపారు. ఆ తర్వాత కొద్ది రోజులకే తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం తనపైనే పడిందన్నారు. కష్టాల్లో ఉన్న తనకు వలంటీర్ ఉద్యోగం ఇప్పించారని పేర్కొన్నారు. ఆసరా డబ్బులు, సున్నా వడ్డీ డబ్బులు, అమ్మఒడి డబ్బులు అన్నీ అందుతున్నాయని వివరించారు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న తన జీవితంలో సీఎం జగన్ వెలుగులు నింపారని చెప్పారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. చదవండి: మహిళల అభ్యున్నతే ఏ సమాజం ప్రగతికైనా కొలమానం: సీఎం జగన్ -
అచ్చెన్నాయుడు ఇప్పుడే నిద్రలేచారా?: మంత్రి అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు పెట్టుబడిదారుల నుంచి వచ్చిన స్పందనే తమ ప్రభుత్వ పారిశ్రామిక విధానమని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. కేవలం సంవత్సరం, రెండు సంవత్సరాల్లోనే సాకారమయ్యేలా ఎంఓయూలు కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. రికార్డు స్థాయిలో తొలి రోజు రూ.11.87 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు. ఈ రెండు రోజుల సదస్సు ద్చారా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తున్నామని గర్వంగా చెబుతున్నామన్నారు. వీటి ద్వారా 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలుంటాయన్నారు. కేవలం సీఎం జగన్ బ్రాండ్ వల్లే ఏపీకి ఈ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని స్పష్టంచేశారు. 14 రంగాలలో ఫోకస్ చేద్దామనుకున్నప్పటికీ 20 రంగాలలో పెట్టుబడులు వచ్చాయి. దేశ, విదేశాల ప్రముఖులకు తమ ప్రభుత్వం ఇచ్చిన నమ్మకం వల్లే పెట్టుబడుల ప్రవాహం వచ్చింది. ఏపీకి సహజ వనరులు ఎన్నో ఉన్నాయి. రాష్ట్ర అభివృద్దికి సీఎం వైఎస్ జగన్ నిరంతరం కృషి చేస్తున్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి రెండో రోజు సదస్సు ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ‘‘ఏపీకి వచ్చిన పెట్టుబడులపై ఫాలో అప్ ఉండాలని సీఎం జగన్ సూచించారు. ప్రభుత్వానికి మరింత బాధ్యత పెరిగింది. కోవిడ్ వల్ల రెండేళ్ల పాటు ఈ తరహా సమావేశాలు నిర్వహించలేకపోయాం. టీడీపీ హయాంలో చేసుకున్న ఎంఓయూలలో పది శాతం మాత్రమే ప్రారంభమైతే సీఎం జగన్ హయాంలో ఇప్పటి వరకు 80 నుంచి 90 శాతం ప్రారంభమయ్యాయి. ఈ సమ్మిట్ లో చేసుకున్న ఎంఓయూలు నూరు శాతం ప్రారంభమవుతాయి.’’ అని అమర్నాథ్ పేర్కొన్నారు. అలాగే సమ్మిట్‌పై టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలపై అమర్నాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అచ్చెన్నాయుడు ఇపుడే నిద్రలేచారా?. అంబానీ, అదానీ, దాల్మియా, బజాంకాలని ఆయన ఎపుడైనా చూశాడా?. ఈ సమ్మిట్‌కు వచ్చిన అనూహ్య స్పందనపై ప్రశంసించకపోయినా పర్వాలేదు, కానీ తప్పుడు విమర్శలేంటి?' అంటూ నిప్పులు చెరిగారు. చదవండి: 'కేంద్రం నుంచి ఏపీకి సంపూర్ణ సహకారం.. రోడ్ కనెక్టివిటీ పెంచేందుకు రూ.20వేల కోట్లు..' -
సీఎం జగన్ ప్రశ్నలకు చంద్రబాబు, పవన్ సమాధానాలు చెప్పగలరా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీడ్ పెంచారు. ఆయన ధాటిగా మాట్లాడటమే కాదు.. ప్రతిపక్షాన్ని సెంటిమెంటు ఆయుధంతో దెబ్బ కొడుతున్నారు. ప్రతిపక్షం బలహీనతను ఆయన నొక్కి మరీ ప్రశ్నిస్తున్నారు. మరో వైపు ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేనలు 175 సీట్లలో పోటీచేయగలరా? అని జగన్ సవాల్ విసురుతున్నారు. జగన్ ప్రసంగంలోని వివిధ అంశాలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఎంతవరకు సమాధానం చెప్పగలుగుతారన్నది సందేహమే. తెనాలిలో జరిగిన రైతు భరోసా -పి.ఎమ్.కిసాన్ సాయం పంపిణీ సందర్భంగా ఆయన ఉపన్యసిస్తూ పలు ప్రశ్నలు సంధించారు. రాజకీయంగా టీడీపీ, జనసేనల బలహీనతలపై దెబ్బ కొడుతూ వారు శాసనసభ ఎన్నికలలో మొత్తం అన్ని సీట్లకు పోటీచేయలేని నిస్సహాయ స్థితిని ప్రజల ముందుంచారు. టీడీపీ, జనసేనల బలహీనత తెలిసేలా.. 2019 శాసనసభ ఎన్నికలలో టీడీపీ ఒంటరిగా పోటీచేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. జనసేన పరిస్థితి మరీ దయనీయం. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణే రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయారు. వామపక్షాలు, బీఎస్పితో ఆయన పొత్తు పెట్టుకుని కూడా ఈ పరాభవానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో జనసేనతో కలిస్తే ఏమైనా రాజకీయ లబ్ధి కలుగుతుందా అన్న ఆశతో టీడీపీ శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబు ఇందుకోసం తన మంత్రాంగం కొనసాగిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తాను గెలిస్తే చాలన్నట్లుగా టీడీపీతో ఎలా జట్టుకట్టాలా అని తంటాలు పడుతున్నారు. ఒకవేళటీడీపీతో కలిస్తే జనసేనకు కేవలం 25 నుంచి సీట్ల లోపే ఇవ్వవచ్చన్న అంచనా ఉంది. ఇది ఒక విధంగా పవన్ కళ్యాణ్‌కు అవమానమే. అయినా దానిని భరించడానికి ఆయన సిద్ధపడుతున్నారని అంతా భావిస్తున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ పాదయాత్ర చేస్తున్నందున పవన్ తన వారాహి యాత్రను కూడా వాయిదా వేసుకున్నారని కూడా రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనిని పవన్ కళ్యాణ్ ఖండించలేదు. అంటే జనసేన ఎటూ 175 సీట్లలో పోటీచేసే అవకాశమే లేదు. అసలు ఆ పార్టీకి అన్ని నియోజకవర్గాలలో క్యాడరే లేదు. సాయం కోసం టీడీపీ ఎదురుచూపు.. ఇక టీడీపీకి అన్ని నియోజకవర్గాలలో క్యాడర్ ఉన్నా, బలం క్షీణించిపోవడంతో బిక్కుబిక్కుమంటూ చూస్తోంది. ఎవరైనా వచ్చి సాయం చేయకపోతారా అని ఎదురుచూస్తోంది. స్థానిక ఎన్నికలలో కేవలం 25 శాతం ఓట్లే రావడం వారికి తీవ్ర ఆశాభంగం కలిగించింది. అందువల్ల జనసేనతో కలిస్తే ఏమైనా పోటీ ఇవ్వగలుగుతామా? అన్నది వారి ఆలోచన. అందుకే జనసేనకు కొన్ని సీట్లు ఇస్తే 175 సీట్లలో పోటీచేసే పరిస్థితి టీడీపీకి ఉండదు. ఆ విధంగా టీడీపీ, జనసేనల బలహీనతను జనానికి తెలిసేలా చేయగలిగారు. సీఎం జగన్‌కు అడ్వాంటేజ్.. మరో వైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్ని సీట్లకు పోటీకి సై అంటూ సవాల్. తద్వారా ప్రజలలో తమకు ఆదరణ ఉందన్న నమ్మకాన్ని ,అన్ని చోట్ల పార్టీ బలంగా ఉందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేయగలుగుతోంది. ఆ కాన్ఫిడెన్స్ ప్రతిపక్షంలో కొరవడడం జగన్‌కు అడ్వాంటేజ్ అని చెప్పాలి. దీనికి సమాధానంగా టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీతో కలిసి వచ్చే పార్టీలు ఉన్నాయా? అని పిచ్చి ప్రశ్న వేశారు. 2014లో బిజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఆ పార్టీ నాయకత్వం కోరినా జగన్ ఒప్పుకోలేదు. తాను ఒంటరిగా పోటీచేసి గెలవగలమన్న దమ్ము ఆయనకు ఉండడమే దీనికి కారణం 2014లో అధికారం రాకపోయినా, ఏ ఇతర పార్టీ పొత్తుకోసమో ఆయన తెలుగుదేశం మాదిరి అర్రులు చాచలేదన్న సంగతి సోమిరెడ్డి గ్రహించాలి. జగన్ సెంటిమెంట్ ఇక ఇతర అంశాలలో జగన్ సెంటిమెంట్ పండించారంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు టైమ్ లో 300కి పైగా కరువు మండలాలు ఉన్న స్థితిని ఆయన గుర్తు చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ, అంతకుముందు తన తండ్రి హయాంలో కానీ పుష్కలంగా వర్షాలు పడ్డాయని సభలో పాల్గొన్న రైతులకు జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు ఆ రోజులలో రెయిన్ గన్ అంటూ షో చేసి, వాటితోనే కరువును పొగొట్టినంత బిల్డప్ ఇచ్చేవారు. అది వందల కోట్ల మేర దండగమారి ఖర్చుగానే మిగిలిపోయింది. దాంతో రైతులలో బలంగా ఒక అభిప్రాయం నాటుకుపోయింది. చంద్రబాబు పాలనలో కరువు తప్పదన్న భావన సర్వత్రా ఏర్పడింది. అదే జగన్ పాలన ఆరంభమైన సంవత్సరం నుంచి నాలుగేళ్లలో పుష్కలంగా వర్షాలు పడడం, నదులు పొంగిపొర్లడం, చెరువులు ,రిజర్వాయిర్లు నిండడంతో పంటలు బాగా పండుతున్నాయి. భూగర్భ జలాల మట్టం బాగా పెరిగింది. సాధారణంగానే వైఎస్సార్సీపీ నేతలు.. కరువు, చంద్రబాబు కవల పిల్లలని విమర్శిస్తుంటారు. దానికి కొనసాగింపుగా ముఖ్యమంత్రి జగన్ రైతుల సభలో చంద్రబాబు ప్రభుత్వ టైమ్‌లో కరువు పరిస్థితులను తన స్పీచ్ లో గట్టిగా వినిపించారు. రైతులకు తన ప్రభుత్వం అమలు చేసిన వివిధ స్కీములను ఆయన వివరించారు. తదుపరి రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ పేదలు, రైతులకు , పెత్తందార్లకు మధ్య యుద్దం జరగబోతోందని ఆయన చెప్పారు. తాము హామీ ఇచ్చినట్లు భరోసా డబ్బు పంపిణీ చేశామని, అదే చంద్రబాబు నాయుడు రైతులకు రుణమాఫీ చేస్తామని చివరికి వారిని మోసం చేశారని ఆయన పేర్కొన్నారు. అలాగే పేదల పిల్లలకు ఆంగ్ల మీడియంలో చదువు చెప్పిస్తున్న తనకు, ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం వద్దంటున్న పెత్తందార్లకు మధ్య యుద్దం జరగబోతోందని ఆయన చెబుతున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా.. ఇవన్నీ సెంటిమెంట్ తో కూడిన అంశాలే అవుతాయి. జగన్ ప్రభుత్వం స్కూళ్లను నాడు-నేడు కింద బాగు చేయడమే కాకుండా ఆంగ్ల మీడియం కూడా ప్రవేశపెట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తెలుగుదేశం, జనసేన వంటి పార్టీలు ఆంగ్ల మీడియంకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి. అదే టైమ్‌లో ఆ పార్టీలు జనంలో పలచన అయ్యాయి. ఫలితంగా తాము ఆంగ్ల మీడియంకు వ్యతిరేకం కాదని ఆ పార్టీల నేతలు చెప్పవలసి వస్తోంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ విషయంలో జగన్ ధైర్యంగా ముందడుగు వేశారు. ఇది ఆయనకు సానుకూల పరిణామంగా ఉంది. అన్నింటినీ మించి వందల హామీలు ఇచ్చి వాటిని అమలు చేయని చంద్రబాబుకు, ఇచ్చిన హామీలలో 98.5 శాతం అమలు చేసిన తనకు మధ్య పోటీ జరగబోతోందని, హామీలు నెరవేర్చినవారిని తిరిగి ఎన్నుకోకపోతే, భవిష్యత్తులో ఎవరూ ఎన్నికల మానిఫెస్టో అమలుపై దృష్టి పెట్టరని జగన్ హెచ్చరించారు. మాట తప్పే వ్యక్తిగా చంద్రబాబును ఫోకస్ చేయడంలో జగన్ సఫలం అవుతున్నారు. అదే ధైర్యంతో జగన్ వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. తెనాలి సభకు పెద్ద ఎత్తున హాజరైన రైతులు, ఇతర వర్గాల ప్రజలు, వారు ఆయా సమయాలలో జగన్ స్పీచ్ కు వ్యక్తం చేసిన స్పందన గమనిస్తే జగన్‌కు జనంలో తిరుగులేదన్న అభిప్రాయం మరోసారి కలుగుతుంది. -హితైషి -
కే. విశ్వనాథ్ సతీమణి మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
దివంగత దర్శకుడు, కళాతపస్వి కే. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి (86) మృతి పట్ల ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. కళాతపస్వి కన్నుమూసిన 24 రోజులకే ఆమె మృతి చెందడం గమనార్హం. గుండెపోటుతో ఆమె కన్నుమూశారు. కాగా.. ఫిబ్రవరి 2వ తేదీన వృద్ధాప్యరిత్యా సమస్యలతో దర్శకదిగ్గజం కాశీనాధుని విశ్వనాథ్(92) కన్నుమూశారు. అయితే.. ఆయన మృతి చెందినప్పటి నుంచి జయలక్ష్మి తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం గుండెపోటు రావడంతో మరణించారు. విశ్వనాథ్‌కు 20 ఏళ్ల వయసున్నప్పుడు జయలక్ష్మితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. ఎవరూ సినీ పరిశ్రమలోకి ప్రవేశించలేదు. అలాగే.. తన భార్య తనతో ఎప్పుడూ సినిమాల గురించి చర్చించేది కాదని, సినిమాలను కూడా విశ్లేషించేది కాదని తరచూ ఇంటర్వ్యూలలో ఆయన చెప్పారు కూడా. -
ఏపీ నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఘనస్వాగతం పలికిన సీఎం జగన్ (ఫొటోలు)
-
'కొల్లేరు సమస్యపై సీఎం జగన్‌ను కలుస్తా.. ఆ తర్వాత రాజకీయ నిర్ణయం'
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొల్లేరు ప్రాంత సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వినతిపత్రం సమరి్పస్తానని తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ ఇన్చార్జి జయమంగళ వెంకటరమణ చెప్పారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. కొల్లేరు మూడో కాంటూరు వరకు కుదింపు, ఆక్వా జోన్ పరిధిలో మరిన్ని చెరువులు చేర్చటం, ఈబీసీలకు పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలు అందించడం తదితర అంశాలతో ముఖ్యమంత్రిని కలిసి విన్నవిస్తానని, ఆయన స్పందననుబట్టి రాజకీయ నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. కైకలూరు నియోజకవర్గంలో టీడీపీలో ఐదుగురిని బరిలో నిలిపి వారితో పనిచేయిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని చెప్పారు. వైఎస్సార్ హయాంలో అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందే 250 నియోజకవర్గాలకు అభ్యర్థులను నిర్ణయించారని, అది సరైన విధానమని తెలిపారు. నియోజకవర్గంలో ఐదుగురు నాయకులు ఉండటం వల్ల చివర్లో ఒకరికి టికెట్ వస్తే మిగిలినవారు వెన్నుపోటుదారులుగా మారుతున్నారని విమర్శించారు. 1999 నుంచి తెలుగుదేశం పార్టీలో సేవ చేస్తున్నానని, ఈ క్రమంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నానని వివరించారు. ఓ పౌరుడిగా ముఖ్యమంత్రిని కలిసే హక్కు ఉంటుందని, తాను గతంలో నలుగురు సీఎంలను కలిసి కొల్లేరు సమస్యలను విన్నవిస్తే అందరూ సానుకూలంగా స్పందించారని చెప్పారు. తనపై ఇటీవల హత్యాయత్నం జరిగితే రక్షణ కావాలని ప్రభుత్వానికి లేఖ రాశానని, అందుకే గన్‌మెన్‌ను కేటాయించారని ఆయన తెలిపారు. చదవండి: సైన్యం సన్నద్ధం -
జగనన్న తడాఖా బాబుకు చూపిస్తాం: కొడాలి నాని
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సత్తా, తడాఖాను 2024 ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి చూస్తారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరావు(నాని) వ్యాఖ్యానించారు. 175 నియోజకవర్గాల్లో గెలుపే ధ్యేయంగా గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించి అన్ని చోట్లా విజయం సాధిస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ చేతిలో చంద్రబాబు చావుదెబ్బ తినడం ఖాయమని, అంతటితో ఆయన రాజకీయ చరిత్ర ముగుస్తుందన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. ► చంద్రబాబు, లోకేశ్ తెచ్చిన జగనాసుర రక్తచరిత్రను ఎవరు చదువుతారు? ఆ పుస్తకాలు చలి మంటలు కాచుకునేందుకే పనికొస్తాయి. ‘ఎన్టీఆర్‌ను తడిగుడ్డతో ఎలా గొంతు కోశారు?’ అనే పుస్తకాన్ని వారు విడుదలచేస్తే జనం చదువుతారు. ► మామను పొట్టనబెట్టుకుంటే చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి, పార్టీ అధ్యక్ష పదవి వచ్చింది. సీఎం జగన్‌కి వైఎస్ వివేకానందరెడ్డి చిన్నాన్న. ఆయన్ను ఎందుకు చంపుకుంటారు? వైఎస్ వివేకా చనిపోతే సీఎం జగన్‌కు ఏమైనా ఆస్తులొచ్చాయా? వివేకా ఆస్తులు ఆయన కుమార్తె, అల్లుడి పేరుమీదకు ఎలా వచ్చాయ్? వైఎస్ వివేకా అప్పట్లో వైఎస్ జగన్‌తో కలిసి నడిచి వచి్చన వ్యక్తి కాదు. వైఎస్ విజయమ్మపై కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడించే ప్రయత్నం చేశారు. ► వైఎస్ జగన్ కుటుంబం నాశనమవ్వాలని కోరుకునే వ్యక్తులు వైఎస్ వివేకా ఫ్యామిలీలో ఉన్నారు. వైఎస్ భాస్కర్‌రెడ్డి కుటుంబమే సీఎం జగన్ వెంట నడిచింది. వైఎస్ వివేకా బతికి ఉన్నా కడప ఎంపీ సీటును అవినాష్ రెడ్డికే సీఎం జగన్ ఇచ్చేవారు. ► మార్చి 18 నుంచి 26 వరకు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. చంద్రబాబు గ్రాఫిక్స్‌తో ఎలా మభ్యపెట్టారో కూడా చెబుతాం. లోకేశ్‌కు వచి్చంది ఖర్జూరనాయుడు గొంతు అయి ఉంటుంది. ఆయన బస్టాండులో జేబులు కొడుతూ తిరిగేవాడు. వర్ల రామయ్య, పట్టాభి లాంటి వాళ్లు బాబు జీతగాళ్లు. ► మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలిచి తీరాలని సీఎం ఆదేశించారు. తప్పకుండా విజయం సాధిస్తాం. చదవండి: సైన్యం సన్నద్ధం -
Asha Malviya: మహిళల భద్రత దిశగా ఆశా యాత్ర
మనదేశంలో మహిళల భద్రత, మహిళాసాధికారత సాధన కోసం ఆశా మాలవీయ దేశపర్యటనకు సిద్ధమయ్యారు. విజయవంతంగా సాగుతున్న ఆమె యాత్ర తెలుగు రాష్ట్రంలో ప్రవేశించింది. మహిళల భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శవంతంగా ఉందని చెప్పారామె. ఆశా మాలవీయది మధ్యప్రదేశ్ రాష్ట్రం, రాజ్‌ఘర్ జిల్లా సతారామ్ గ్రామం. ఆమె క్రీడాకారిణి, పర్వతారోహణలో అభిరుచి మెండు. మహిళాభ్యుదయం లక్ష్యంగా సాగుతున్న ఆమె సైకిల్ పర్యటనలో స్త్రీ సాధికారత, భద్రత గురించి సమాజాన్ని చైతన్యవంతం చేస్తోంది. ఆమె పర్యటన ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆమె సోమవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆమె తన లక్ష్యాన్ని వివరించారు. అపోహను తొలగిస్తాను! ‘‘నేను స్పోర్ట్స్‌లో నేషనల్ ప్లేయర్‌ని. పర్వతారోహణలో రికార్డు హోల్డర్ని. ప్రస్తుతం 25వేల కిలోమీటర్ల సంపూర్ణ భారత యాత్ర చేస్తున్నాను. నవంబర్ ఒకటిన భోపాల్‌లో ప్రారంభమైన నా సైకిల్ యాత్రలో ఎనిమిది వేల కిలోమీటర్లు పూర్తయ్యాయి, విజయవాడ చేరుకున్నాను. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో యాత్ర నిర్వహించాలనేది లక్ష్యం. ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో యాత్ర పూర్తయింది. భారతదేశం మహిళలకు అంత సురక్షితమైన దేశం కాదని విదేశాల్లో తప్పుడు అభిప్రాయం ఉంది. మహిళలకు భారతదేశంలో పూర్తి భద్రత ఉందని నేను ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటున్నాను. ‘దిశ’ బాగుంది సీఎం జగన్ గారిని కలవడం ఎంతో ఉద్వేగంగా, గర్వంగా ఉంది. దేశం అభివృద్ధితో పాటు మహిళల భద్రతలాంటి విషయాలపై ముఖ్యమంత్రి గారి అభిప్రాయాలు ఎంతో గొప్పగా ఉన్నాయి. మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. ఏపీలో మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన దిశ యాప్ డౌన్‌న్‌లోడ్ చేసుకున్నాను. ఈ యాప్ చాలా బాగా పనిచేస్తోంది. ఏపీలో మహిళలే కాదు, ప్రజలంతా సురక్షితంగా ఉన్నారు. ముఖ్యమంత్రిగారు నన్ను ప్రశంసలతో ముంచెత్తడంతోపాటు నా ఆశయం కోసం 10లక్షల రూపాయల ప్రోత్సాహకం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. తిరుపతి వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటి నుంచి నాకు ప్రత్యేక రక్షణ అందించారు. స్కూల్స్, కాలేజీల్లో అమ్మాయిల కోసం ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఎంతో మంచివి. దేశానికే ఆదర్శంగా నిలిచిన జగన్‌న్‌మోహన్‌న్‌రెడ్డి లాంటి మఖ్యమంత్రిని కలవడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఆశా మాలవీయ. మహిళల భద్రత, సాధికారతతోపాటు ప్రపంచదేశాల ముందు మనదేశం గౌరవాన్ని ఇనుమడింపచేయాలనే ఆమె ఆశయం ఉన్నతమైనది. ఈ యాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆమెను ఆశీర్వదిద్దాం. – సాక్షి, ఏపీ బ్యూరో