సాక్షి, శ్రీకాకుళం: విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై హత్యాహత్నం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. దీనిపై ఎన్‌ఐఏ క్షుణ్నంగా విచారణ జరపాలన్నారు. ఈ ఘటనపై ఎల్లో మీడియా అసత్య రాతలు రాస్తోందని బొత్స మండిపడ్డారు. ఒక వ్యక్తే హత్యాహత్నం జరిపించుకున్నాడని రాయడం దారుణమన్నారు. ఎన్‌ఐఏ రిపోర్టు ఏంటి? మీరు రాసిన రాతలేంటి అని ఫైర్ అయ్యారు. ఎల్లో మీడియా తప్పుడు రాతలు, కూతలను తీవ్రంగా ఖండించారు.
'2003లో అలిపిరిలో చంద్రబాబుపై హత్యాయత్నం నిజమేనా? సానుభూతి కోసమే చంద్రబాబు దాడి చేయించుకున్నారా? చంద్రబాబుకు ఉన్నఅలవాట్లు ఎవరికీ ఉండవు. ఈనాడు వార్తలు నీచమైనవి. విశాఖ ఎయిర్‌పోర్టు ఘటన నిందితుడు, ఆయన పనిచేస్తున్న సంస్థ తెలుగు దేశం మద్దతు దారుడు అవునా? కాదా? రాజకీయ స్వలాభం కోసం, డ్రామాల కోసం చంద్రబాబు మాట్లాడుతారు. నేను కూడా రాజకీయం కోసమే అని మీడియా ముసుగు తీసి రామోజీ రావు చెప్పాలి. 2014లో కూడా రామోజీ రావు ఇలాంటి పనులే చేశారు. దేవుడు అనేవాడు వున్నాడు కాబట్టే మేం గెలిచారు. ఎన్‌ఐఏ నివేదికలో జగనే దాడి చేయించుకున్నారని చెప్పిందా? ఏ ఆధారాలతో రాస్తారు?' అని బొత్స ధ్వజమెత్తారు.
అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంపై మాట్లాడుతూ.. 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది మా నినాదం. మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకం. ప్రైవేటికరణ ఆపాలని ఢిల్లీలో మేము పోరాటం చేస్తున్నాం. బీఆర్ఎస్, జనసేన చేస్తున్నవి తప్పుడు ప్రచారాలు. రాష్ట్రం పట్ల, అభివృద్ధి పట్ల టీడీపీకి చిత్తశుద్ధి లేదు. అందుకే మేమే ఒంటరిగా పోరాటం చేస్తున్నాం. భావనపాడు పోర్ట్‌ను టీడీపీ ఎందుకు నిర్మించలేకపోయింది. మేం చేస్తున్న భావనపాడు పోర్ట్ నిర్మాణాన్ని టీడీపీ అడ్డుకుంటే పుట్టగతులు ఉండవ్.' అని బొత్స హెచ్చరించారు.
చదవండి: చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్..
Comments
Please login to add a commentAdd a comment