Ramojirao
-
చందాదారుల వివరాలు ఎందుకివ్వరు?
సాక్షి, హైదరాబాద్: చందాదారులకు చెల్లింపులపై సుప్రీం కోర్టుకు అందజేసిన 69,531 పేజీల వివరాలను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌కు ఎల్రక్టానిక్ఫార్మాట్లో ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటని మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను తెలంగాణ హైకోర్టు నిలదీసింది. ఇప్పటికే ఉండవల్లి వద్ద పేపర్ ఫార్మాట్లో వివరాలున్నాయని, కొన్ని ఇబ్బందుల కారణంగా ఎలక్ట్రానిక్ ఫార్మాట్ (పెన్ డ్రైవ్)లో కోరుతున్నారని హైకోర్టు తెలిపింది. దీనికి సమాధానం చెప్పేందుకు మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తటపటాయించారు. కొంత గడువు ఇస్తే మార్గదర్శి ఫైనాన్సియర్స్ నుంచి సూచనలు పొంది చెబుతానని బదులిచ్చారు. దీంతో తదుపరి విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది. ఆరోజున అన్ని వివరాలతో విచారణకు హాజరు కావాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), మార్గదర్శితో పాటు ఇరు రాష్ట్రాల న్యాయవాదులను ఆదేశించింది. చందాదారుల వివరాలను పెన్ డ్రైవ్‌లో తీసుకురావాలని ఆదేశించింది. ఈమేరకు జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట నిబంధలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31న తీర్పునిచి్చంది. ఈ తీర్పుపై ఉండవల్లి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. అలాగే తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఈ ఏడాది ఏప్రిల్ 9న హైకోర్టు తీర్పును కొట్టివేసింది. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ.. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు మార్గదర్శి ఫైనాన్సియర్స్ పిటిషన్లపై మరోసారి విచారణ ప్రారంభించింది. లూథ్రా వాదనకు ధర్మాసనం అభ్యంతరం ఈ వ్యవహారంపై జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ విచారణకు ఉండవల్లి అరుణ్‌కుమార్ వర్చువల్‌గా హాజరయ్యారు. సుప్రీం కోర్టుకు మార్గదర్శి అందజేసిన 69,531 పేజీల చందాదారుల వివరాలను పెన్‌డ్రైవ్‌లో ఇచ్చేలా ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. పేపర్ ఫార్మాట్లో వివరాలు తన వద్ద ఉన్నప్పటికీ, పరిశీలనకు ఇబ్బందిగా ఉందని తెలిపారు. కొన్ని అంశాలను ఇప్పటికే పరిశీలించానని, ఆ వివరాలన్నీ డొల్లగానే ఇచ్చారని అన్నారు. ఎల్రక్టానిక్ ఫార్మాట్లో ఇస్తే అక్రమాలు తెలియజేస్తానన్నారు. తాను ఎవరి తరఫున వకాలత్ తీసుకోలేదని, సుప్రీం కోర్టు సూచన మేరకు హైకోర్టుకు సాయం మాత్రమే చేస్తున్నా అని చెప్పారు. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది లూథ్రా వాదనలు వినిపిస్తూ.. చందాదారుల వివరాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్పలేదన్నారు. దీనికి ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. పేపర్ ఫార్మాట్లో ఉన్న వివరాలనే పెన్‌డ్రైవ్‌లో కోరుతున్నారు కదా అని ప్రశ్నించింది. దీంతో గడువిస్తే సంస్థ నుంచి సూచనలు పొంది చెబుతానని లుథ్రా బదులిచ్చారు. కాగా, ఈ కేసులో పిటిషనర్–2 (రామోజీరావు) మృతి చెందారని తెలంగాణ పీపీ పల్లె నాగేశ్వర్రావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని కూడా ధర్మాసనం నమోదు చేసుకుంది. -
దాడి మీ కళ్లకు కనిపించలేదా?
సాక్షి, అమరావతి : ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం జగన్‌పైకి జనం మధ్య నుంచి రాయి విసరడం.. అది సీఎం కనుబొమ్మపై తగలడం.. కుట్లు పడటం.. కళ్లెదుటే కనిపిస్తున్నా, చంద్రబాబు, గురివింద రామోజీ మాత్రం తప్పును ఒప్పు చేయాలని పడరాని పాట్లు పడుతున్నారు. నిస్సిగ్గుగా దోషులను వెనకేసుకొస్తున్నారు. తప్పును తప్పు అని చెప్పే ధైర్యం లేక దుష్ప్రచారానికి మరోమారు తెర లేపారు. 2018లో పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగినప్పుడు, ఇటీవల ఎన్నికల ప్రచారంలో చోటుచేసుకున్న ఘటన విషయంలో చంద్రబాబు, రామోజీలు వక్రీకరణే లక్ష్యంగా బరితెగించారు.సీఎం జగన్‌పైకి రాయి విసిరిన కేసులో నిందితుడు వేముల సతీశ్ బెయిల్‌పై విడుదలైన తర్వాత చంద్రబాబు పలుకులు వల్లించి తాను టీడీపీ గూటి చిలుకనని చెప్పకనే చెప్పాడు. ఆ కట్టుకథను పచ్చ మీడియా ప్రముఖంగా ప్రచురించడం ద్వారా ఈ కుట్ర అంతా తమ పర్యవేక్షణలో సాగుతోందని రామోజీరావు స్పష్టం చేశారు. సీఎం జగన్‌ను హత్య చేసేందుకు పక్కా పన్నాగంతో పదునైనా రాయితో దాడికి పాల్పడ్డారని పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిరూపించారు.వైద్య నిపుణులు కూడా శాస్త్రీయంగా విశ్లేషించారు. కానీ పోలీసులు తనకు తుపాకీ గురిపెట్టి మరీ అభియోగాలను ఒప్పుకోవాలని బెదిరించారని సతీశ్ చెప్పడం పచ్చ నాటకంలో ఓ భాగం. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో, పోలీసులు ఈసీ పరిధిలో ఉన్నప్పుడు ఈ దాడి జరిగింది. అయినా పచ్చ మీడియా ఈ కేసును పక్కదారి పట్టించేందుకు ఇంతగా యత్నిస్తోందంటే.. ఈ హత్యాయత్నం వెనుక కుట్రదారుల పాత్రను మరుగున పరిచేందుకేనని స్పష్టమవుతోంది. పన్నాగం ప్రకారమే హత్యాయత్నంసీఎం జగన్‌ను హత్య చేయాలన్న కుట్రదారుల పన్నాగాన్ని వేముల సతీష్ అమలు చేశాడు. ఇందులో భాగంగా ఏప్రిల్ 13న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘మేమంతా సిద్ధం’ యాత్ర విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లోకి ప్రవేశించక ముందే సతీష్ అక్కడికి చేరుకున్నాడు. ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న బ్రిడ్జ్ వద్ద పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయిని ఎంపిక చేసుకుని తన ప్యాంట్ జేబులో వేసుకుని మరీ వివేకానంద స్కూల్ వద్దకు వచ్చాడు. మరి కొంతమందితో కలసి అక్కడ మాటు వేశాడు. ఆ రోజు రాత్రి 8.04 గంటలకు సీఎం జగన్ తన వాహనంపై నిలబడి యాత్ర నిర్వహిస్తూ అక్కడికి చేరుకున్నారు.ఆ వెంటనే సతీష్ ఆ రాయిని బలంగా సీఎం వైఎస్ జగన్‌పైకి గురిచూసి విసిరారు. సీఎం తలలో సున్నిత భాగంపై దాడి చేయడం ద్వారా ఆయన్ను హత్య చేయాలన్న కుట్రదారుల పన్నాగాన్ని అమలు చేసేందుకే సతీష్ ఆ దాడికి పాల్పడ్డాడు. అదృష్టవశాత్తు ఆ రాయి సీఎం జగన్ తలపై సున్నిత భాగంలో కాకుండా ఎడమ కన్ను పైభాగంలో తగలడంతో ప్రాణాపాయం తప్పింది. సాంకేతిక ఆధారాలతో నిర్ధారణముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తులో పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీ ఫుటేజీలు, సీఎం బస్సు చుట్టూ ఏర్పాటు చేసిన కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు, స్థానికులు తమ సెల్ ఫోన్లో తీసిన వీడియోలు, కాల్ డేటా తదితర ఆధారాలను విశ్లేషించారు. ఆ ఆధారాలన్నీ హత్యాయత్నం కుట్రలో ఏ1 వేముల సతీష్, ఏ 2ల పాత్రను నిర్ధారించాయి.అనంతరం పోలీసులు ఏప్రిల్ 17 సాయంత్రం 5 గంటలకు ప్రధాన నిందితుడు వేముల సతీష్‌ను విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని కేజీఎఫ్ అపార్ట్మెంట్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అతడి కదలికలపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్న అనంతరం మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేశారు. నిందితుడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సతీష్ ఇంట్లో సోదాలు జరిపి హత్యాయత్నానికి పాల్పడిన రోజు అతడు ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. కణతపై తగిలి ఉంటే ప్రాణాపాయమే..పదునైన కాంక్రీట్ రాయితో సీఎం జగన్ కణతపై దాడి చేయాలన్నదే నిందితుడు సతీశ్ లక్ష్యమన్నది స్పష్టమైంది. పదునైన రాయి కణతపై తగిలినా తల వెనుక భాగంలో తగిలినా ప్రాణాపాయం సంభవించేదని వైద్య నిపుణులు తేల్చి చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ – న్యూరో సైన్స్ (నిమ్హాన్స్– బెంగళూరు)లో న్యూరాలజీ విభాగాధిపతిగా డాక్టర్ కేవీఆర్ శాస్త్రితోపాటు పలువురు ప్రముఖ వైద్య నిపుణులు ఆ విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.కణత భాగంలో ఎముక సున్నితంగా ఉంటుంది. పదునైన రాయి బలంగా తగిలితే ఆ ఎముక విరిగి లోపలే ఉండిపోయేది. ఆ ఎముక లోపల మెదడు భాగానికి గుచ్చుకుంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లేది. ఎడమ కణత భాగంలోనే పెద్ద రక్తనాళం ఉంటుంది. అది తెగి భారీగా రక్తస్రావం అయ్యేది. తద్వారా కుడి చేయి చచ్చుబడటం, మాట పడిపోయే ప్రమాదానికి దారి తీసేది. మెదడులోనే రక్తస్రావమైనా, మెదడుకు రక్త సరఫరాలో ఇబ్బంది కలిగినా, ప్రాణాపాయం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సీఎం వైఎస్ జగన్ కుడివైపు ఉన్న ప్రజలను చూసి అభివాదం చేస్తూ ఉండటంతో ఎడమ వైపు నుంచి బలమైన రాయితో దాడి చేశారు. ఆ కాంక్రీట్ రాయి తల వెనుక కింద భాగంలో తగిలి ఉంటే మెదడుకు తీవ్ర గాయమయ్యేది. మెదడులో రక్తస్రావం అయి ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. అదృష్టవశాత్తు అది ఎడమ కనుబొమ్మపై భాగంలో తగలడంతో తీవ్ర గాయంతో సరిపోయింది. కుట్రదారుల పాత్ర కప్పిపుచ్చేందుకే..సీఎం జగన్‌పై హత్యయత్నం కేసులో తెరవెనుక కుట్రదారుల పాత్రపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో చంద్రబాబు, ఈనాడు రామోజీరావు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే గుర్తించిన ఏ 2తోపాటు తెర వెనుక ఉన్న ప్రధాన కుట్రదారుల పాత్రను నిగ్గు తేల్చాల్సి ఉందని పోలీసులు న్యాయస్థానానికి నివేదించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అందుకోసం మరి కొందరు సాక్షులను విచారించడంతోపాటు సాంకేతికపరమైన డేటాను మరింత విశ్లేషించాల్సి ఉందన్నారు. కీలక వ్యక్తుల సహకారం లేకుండా ఈ కుట్రను ఇంత పకడ్బందీగా అమలు చేయడం సాధ్యం కాదని పోలీసులు చెబుతున్నారు.దాంతో ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి రానున్నట్లు స్పష్టమవడంతో చంద్రబాబు హడలిపోతున్నారు. అందుకే పోలీసులపైనే తిరిగి అసత్య ఆరోపణలు చేసే కుట్రకు తెరతీశారు. తద్వారా పోలీసులు ఆత్మరక్షణలో పడి ఈ కేసులో కుట్రదారుల పాత్రపై దర్యాప్తు చేయకుండా మిన్నుకుండిపోయేలా చేయాలన్నది వారిద్దరి లక్ష్యం. అందుకే పోలీసులు తన తలకు తుపాకి గురిపెట్టి అభియోగాలను ఒప్పుకోవాలని బెదిరించారని, లేకపోతే తన తల్లిదండ్రులను కూడా చంపేస్తామని బెదిరించారని నిందితుడు వేముల సతీశ్‌తో చెప్పించారు.తాము చెప్పినట్టు చెబితే రూ.2 లక్షలు ఇస్తామని పోలీసులు చెప్పారన్నాడు. సతీష్.. తాము చెప్పినట్టు చెప్పడంతో రామోజీరావు తన పత్రికలో ఆ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించారు. అసలు ప్రధాన నిందితుడు తాను హత్యాయత్నం చేశానని ఎప్పుడైనా అంగీకరిస్తాడా..!? ఏదో అబద్ధం చెప్పి దర్యాప్తును పక్కదారి పట్టించాలనే యత్నిస్తాడు. మరి ఆ మాత్రం తెలియకుండా ఈనాడు రామోజీరావు సతీశ్ చెప్పిన కట్టుకథను అంత ప్రముఖంగా ప్రచురించడం విడ్డూరం. తద్వారా ఆ కట్టుకథ వెనుక తామే ఉన్నామని చెప్పకనే చెబుతోంది.న్యాయస్థానంలో ఆ రోజు ఎందుకు చెప్పలేదు?చంద్రబాబు పన్నాగం బెడిసికొట్టింది. న్యాయస్థానంలో ప్రవేశపెట్టినప్పుడు నిందితుడు సతీశ్ న్యాయమూర్తి వద్ద ఆ విషయాలు ఎందుకు చెప్పలేదని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. నిజంగా పోలీసులు ఆ విధంగా బెదిరించి ఉంటే న్యాయమూర్తి ఎదుటే చెప్పేందుకు నిందితుడికి అవకాశం ఉంది. కానీ ఆ రోజు చెప్పనే లేదు. బెయిల్‌పై విడుదలయ్యాక బయటకు వచ్చి టీడీపీ అనుకూల మీడియా ముందే ఆ ఆరోపణలు చేయడం గమనార్హం. అంటే పోలీసులు నిందితుడు సతీశ్‌ను ఆ విధంగా బెదిరించలేదన్నది సుస్పష్టం. అదంతా టీడీపీ పన్నాగమేనన్నది తేటతెల్లమవుతోంది.ఈసీ ఆధ్వర్యంలోనే పోలీసుల దర్యాప్తుటీడీపీ, ఈనాడు రామోజీరావు ఉద్దేశపూర్వకంగా విస్మరించిన మరో అంశం... సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసును పోలీసులు ఈసీ పర్యవేక్షణలో నిర్వహించారు. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే రాష్ట్రంలో పోలీసులతో పాటు మొత్తం అధికార వ్యవస్థ అంతా ఈసీ ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఎన్నికల నియమావళి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏమీ లేదు. ఈ కేసు దర్యాప్తును పోలీసులు ఎప్పటికప్పుడు ఈసీకి నివేదిస్తున్నారు. ఈసీ వ్యక్తం చేస్తున్న సందేహాలను పోలీసులు నివృత్తి చేస్తూ మరీ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడు సతీశ్ ద్వారా పోలీసులపై టీడీపీ ఆరోపణలు చేయించడం అంటే ఈసీనే నిలదీస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది. నిందితుడు సతీశ్ ఈసీనే నిందించాలిగానీ పోలీసులను కాదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.2018లోనూ ఇదే దుష్ప్రచార కుట్రపాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిపై 2018లో విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం కేసును కూడా టీడీపీ, పచ్చ మీడియా ఇదే రీతిలో వక్రీకరించేందుకు యత్నించడం గమనార్హం. టీడీపీ నేత హర్షవర్ధన్ చౌదరికి చెందిన ఫ్యూజన్ రెసారెంట్‌లో పనిచేసే జనుపల్లి శ్రీనివాస్ అరచేతిలో పట్టేంత పదునైన కత్తితో వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేంద్ర ప్రభుత్వ బలగాల ఆధీనంలో ఉండే విమానాశ్రయంలోకి శ్రీనివాస్‌ను ప్రవేశపెట్టడం వెనుక అప్పటి టీడీపీ ప్రభుత్వం పక్కా కుట్ర ఉందన్నది స్పష్టమైంది. అప్పట్లో కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజే ఉన్నారు.దాంతో ఈ హత్యాయత్నం వెనుక తమ కుట్ర ఎక్కడ బయటపడుతుందోనని భావించిన టీడీపీ వెంటనే ఆ ఉదంతాన్ని వక్రీకరించేందుకు యత్నించింది. పోలీసులు కనీసం కేసు నమోదు చేయకపోతే వైఎస్ జగన్‌కు సానుభూతి తీసుకురావడం కోసమే ఆయన అభిమాని అయిన జనుపల్లి శ్రీనివాస్ ఈ దాడికి పాల్పడ్డారని చెప్పడం గమనార్హం. చంద్రబాబు ఆదేశాలతో అప్పటి డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్ హడావుడిగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, అదే అసంబద్ధ వాదనను వినిపించడం విభ్రాంతికరం. కానీ టీడీపీ దుష్ప్రచారం బెడిసికొట్టింది. వైఎస్ జగన్‌ను హత్య చేసేందుకే ఆ దాడికి పాల్పడ్డారన్నది తేటతెల్లమైంది. అయినా సరే చంద్రబాబు, రామోజీ తీరు మార్చుకోలేదు. నాడు, నేడు కూడా వక్రీకరణలు, కుట్రలే వారి రాజకీయంగా స్పష్టమవుతోంది. -
షర్మిల రాజకీయం.. ఘోరంగా మిస్ ఫైర్!
అనుకున్నది ఒకటి.. అయింది ఒకటి.. అని ఒక పాట ఉంది. ప్రస్తుతం ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరిస్థితి అలాగే అయినట్లుగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి అయిన షర్మిలను ఏపీ రాజకీయాలలోకి తీసుకు వచ్చి ఆయనను ఇబ్బంది పెట్టాలని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఆదరించే వర్గాలలో కొంత చీలిక తీసుకురావాలని చంద్రబాబు ఆలోచించారు. తదనుగుణంగా ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్లే తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టుకుని రాజకీయ కార్యకలాపాలలో ఉన్న షర్మిలను అక్కడ నుంచి ఏపీకి తీసుకురావడంలో పరోక్షంగా ఒక పాత్ర పోషించారు. చంద్రబాబు శిష్యుడుగా పేరొందిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆమెను ఏపీ రాజకీయాలలోకే వెళ్లాలని పట్టుబట్టారు. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీ.కే శివకుమార్ వద్ద దీనిపై పంచాయతీ కూడా జరిగింది. ఆమె ఏపీ రాజకీయాలలోకి వెళ్లేలా ఒప్పందం కుదిరిన తర్వాతే ఆమె పార్టీ వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకున్నారు. తదుపరి షర్మిలను పీసీసీ అధ్యక్షురాలిని చేశారు. ఆమె కూడా చంద్రబాబు తరపునే పనిచేస్తూ అన్నను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తూ వస్తున్నారు. చంద్రబాబు కూడా తన ఉపన్యాసాలలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను విమర్శిస్తూ చెల్లెలుకు న్యాయం చేయడం లేదని అనేవారు. షర్మిల పట్ల, అలాగే విజయమ్మ పట్ల తనకు సానుభూతి ఉందన్నట్లు మాట్లాడేవారు. షర్మిల రాజకీయాలలోకి వస్తూనే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఇంటర్వ్యూ ఇవ్వడం ద్వారా తన వెనుక ఎవరు ఉంది ప్రపంచానికి పరోక్షంగా చెప్పేశారు. రాధాకృష్ణ అంటే చంద్రబాబు సొంత మనిషి కింద లెక్క. చంద్రబాబు తరపున ఆయా లావాదేవీలు నిర్వహిస్తుంటారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల కొనుగోలులో రాధాకృష్ణ క్రియాశీలక పాత్ర పోషించారని ఎక్కువ మంది నమ్ముతారు. అలాంటి వ్యక్తి చేసిన రాయబారం ఫలించి ఆమె కొంతకాలం తెలంగాణలో పార్టీ నడిపి, ఆ తర్వాత ఏపీ రాజకీయాలలోకి వచ్చారు. అంతవరకు తాను తెలంగాణ బిడ్డనని, ఈ మట్టిని వదలిపెట్టనని షర్మిల చేసిన శపధాలన్నీ గాలిలో కలిసిపోయాయి. షర్మిల క్రైస్తవ మతం ఆచరిస్తారు కనుక, ఆ ఓట్లను ఆమె కొంతవరకు చీల్చగలిగితే అది తమకు లాభిస్తుందని చంద్రబాబు, రాధాకృష్ణ అంచనా వేసుకున్నారు. ఆమె కూడా వారికి యధో శక్తి రాజకీయంగా ఉపయోగపడుతూ, తన అన్నను విమర్శిస్తున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో గతంలో మాట్లాడినదానికి భిన్నంగా ఆమె వ్యాఖ్యలు చేస్తున్న తీరు కూడా ఇంకో నిదర్శనంగా కనిపిస్తుంది. పీసీసీ అధ్యక్షురాలి హోదాలో ఆమె చంద్రబాబును సైతం కొంతమేర విమర్శించవలసి వస్తోంది. వాటిని ఎడిట్ చేసుకుని ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను విమర్శించిన మేర తమ మీడియాలో ప్రచారం చేశాయి. కాలం గడిచే కొద్ది చంద్రబాబుకు తత్వం బోధపడినట్లుగా ఉంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలు కొందరికి టిక్కెట్లు ఇవ్వడానికి నిరాకరించారు. వారిలో కొంతమంది పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఇది కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తమ వద్దకు రాకుండా కాంగ్రెస్‌లోకి ఎందుకు వెళ్లారా అని చంద్రబాబు మదనపడుతున్నారు. దీనివల్ల తమకు ఏమైనా నష్టం జరుగుతుందా అన్న ఆలోచనకు వచ్చారు. బహుశా షర్మిల వల్ల వైఎస్ జగన్మోహన్రెడ్డికు వచ్చే ఓట్లలో ఏమైనా గండి పడుతుందా అని సర్వేలు చేయించుకుని ఉండాలి. ఆ సర్వేలలో షర్మిల వల్ల వైఎస్ జగన్మోహన్రెడ్డికు ఎలాంటి నష్టం ఉండదని తేలి ఉండవచ్చు. పైగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి వైఎస్ జగన్మోహన్రెడ్డికు ఉపయుక్తంగా ఉంటుందన్న సమాచారం వచ్చి ఉండవచ్చు. దాంతో అంతవరకు షర్మిలను భుజాన వేసుకుని సానుభూతి వచనాలు పలికిన చంద్రబాబు మళ్లీ పెద్ద కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ పాత డైలాగులు చెప్పడం ఆరంభించారు. 2014లో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తదుపరి 2018లో తెలంగాణలో అదే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. 2019లో ప్రధాని నరేంద్ర మోదీని, వైఎస్ జగన్మోహన్రెడ్డిలను కలిపి విమర్శించేవారు. 2024 నాటికి అదే మోదీతో, బీజేపీతో ఆత్మగౌరవం వదలుకుని మరీ పొత్తు పెట్టుకున్నారు. డబుల్ స్టాండర్స్ కు పెట్టింది పేరు అయిన చంద్రబాబు నాయుడు ఇలా యూ టర్న్‌లు తీసుకోవడం కొత్తకాదు. ప్రస్తుతం కూడా అలాగే షర్మిల విషయంలో కూడా యు టర్న్ తీసుకుని మాట్లాడడం ఆరంభించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే షర్మిల వచ్చారని ఆయన చెబుతున్నారు. పెద్ద కాంగ్రెస్, వైకాపా పిల్ల కాంగ్రెస్ అని పాతపల్లవిని కొత్తగా ఎత్తుకున్నారు. ఈ రెండు కలిసి డ్రామాను రక్తి కట్టిస్తున్నాయని ఆయన అన్నారు. అక్కడితో ఆగకుండా రాజకీయాలకు దూరంగా ఇంటిలోనే ఉంటున్న విజయమ్మ పేరు ప్రస్తావించి.. మొన్నటివరకు కుమారుడికి ఆంధ్ర, కుమార్తెకు తెలంగాణ రాసిచ్చారని చెప్పిన విజయమ్మ ఇప్పుడేమో కుమార్తెను ఏపీలో యుద్దానికి పంపారని అన్నారు. పిల్లలకే న్యాయం చేయలేని తల్లి ఐదు కోట్ల మందికి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. షర్మిలకు అన్యాయం జరిగితే ఇంటిలోనే పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు. దీనిని బట్టి ఏమి తెలుస్తుంది! తన రాజకీయ అవసరాల కోసం తన ప్రత్యర్ది పార్టీ అధినేత ఇళ్లలో ఉన్న ఆడవారిపై కూడా అసందర్భ, అనుచిత వ్యాఖ్యలు చేయడానికి చంద్రబాబు వెనుకాడరనే కదా! తన భార్యను ఎవరో ఏదో అన్నారంటూ అసెంబ్లీలో రచ్చ చేసి, బయటకు వచ్చి ఏడుపు లంఖించుకున్న ఆయన, విజయమ్మపై విమర్శలు చేయవలసిన అవసరం ఏముంది. అంటే ఏదో రకంగా రెచ్చగొడితే ఆమె కూడా కామెంట్ చేస్తే, ఈ విషయంపై చర్చ కొనసాగించాలన్న దురుద్దేశంతోనా అనే సందేహం వస్తుంది. ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానిఫెస్టోల గురించి సవాల్ చేస్తూ ప్రజా సమస్యల గురించి అధికంగా ప్రస్తావిస్తూ, యాత్ర సాగిస్తుంటే, చంద్రబాబు మాత్రం ఇలా వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలను డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. దీని అంతటికి ఒక కారణం కనిపిస్తుంది. వలంటీర్లు తదితర అంశాలలో ఆత్మరక్షణలో పడ్డ చంద్రబాబు వాటిని జనం మర్చిపోవాలన్న లక్ష్యంతో పనికి రాని ఉపన్యాసాలు చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే? షర్మిల వల్ల తనకు రాజకీయంగా కలిసి వస్తుందని ఆయన ఆశించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికు మద్దతు ఇచ్చే వర్గాలలో ఎలాంటి విభజన రాకపోగా, ప్రభుత్వ వ్యతిరేక ఓటే ఎంతో కొంత చీలుతుందని ఆయనకు అర్దం అయినట్లుగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీచేస్తే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఓడించలేమన్న భయంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ట్రాప్‌లో వేసుకున్నారు. ఆ తర్వాత బీజేపీతో పొత్తులోకి వెళ్లారు.కానీ దీనివల్ల మైనార్టీ వర్గాలలో తనపై వ్యతిరేకత ఏర్పడిందని చంద్రబాబు అర్ధం చేసుకుని ముస్లింలకు తన పాలనలో రక్షణ ఉందని చెప్పడం ఆరంభించారు. షర్మిల వల్ల చీలే ఓట్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ఇలాంటి దిక్కుమాలిన వ్యూహాలపై ఆదారపడకుండా, తన ప్రభుత్వ పనితీరు, స్కీముల వల్ల ప్రజలకు జరిగిన మేలు మొదలైన విషయాలను చెబుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. బీజేపీ,జనసేనలతో నేరుగా పొత్తు పెట్టుకున్న చంద్రబాబు పరోక్షంగా కాంగ్రెస్, సీపీఐ వంటి పక్షాలతో అవగాహన పెట్టుకున్నారన్నది ఎక్కువ భావన. అయినా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఓడించలేకపోతున్నామన్న ఆందోళన చంద్రబాబులో ఏర్పడింది. అందులో భాగంగానే షర్మిలపై చేసిన వ్యాఖ్యలుగా కనిపిస్తాయి. కొన్నాళ్ల క్రితం కూటమి సభ జరిగినప్పుడు మోదీ ఇలాగే అన్నా, చెల్లెళ్లు ఒకటేనని అన్నప్పుడు చంద్రబాబు సీరియస్‌గా తీసుకోలేదు. కానీ టీడీపీ ఓట్లకే గండిపడుతోందని సర్వేలు తెలపడంతో ఆయనలో మరింత కంగారు ఏర్పడింది. నిజానికి షర్మిల ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌కు ఇప్పటికి 99 శాతం నియోజకవర్గాలలో ఒక్క శాతం ఓట్లు కూడా లేవు. 99 శాతం సీట్లలో డిపాజిట్లు కూడా దక్కించుకోవడం కూడా కష్టమేనని చెబుతున్నారు. అయినా ఆమెను అడ్డుపెట్టుకుని తను లబ్ది పొందాలని చంద్రబాబు చూస్తే, ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి భవిష్యత్తే అయోమయంలో పడిందన్న అభిప్రాయం ఏర్పడింది. తత్ఫలితంగా చంద్రబాబు కొత్త స్వరం ఆలపిస్తున్నారు. అనుకున్నది ఒకటి.. అయింది మరొకటి అనే చందంగానే చంద్రబాబు పరిస్థితి ఏర్పడింది! - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
‘అరరె.. బాబు బుర్రలో చిప్‌కి ఏమైంది?’
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో కానీ, ఇతరత్రా ఆయా ప్రాంతాలలో జరిగిన సభలలో కానీ చేసిన వివిధ ప్రసంగాలు తమాషాగా ఉంటున్నాయి. ఇంత సీనియర్ అయిన చంద్రబాబు ఏమిటి! ఇలా మాట్లాడుతున్నారు.. అన్న సందేహం అందరిలో కలుగుతోంది. కొన్ని ఉదాహరణలు చూడండి. మగవారు టీడీపీకి ఓటు వేయకపోతే వారికి ఆడవాళ్లు భోజనం పెట్టవద్దని చంద్రబాబు అన్నారు. టీడీపీ గ్రాఫ్ పెరగాలని ఆయన అనడం వరకు అభ్యంతరం లేదు. కానీ గ్రాఫ్ పెరగకపోతే దానికి ప్రజలు బాధ్యులట. అందుకే బగ్గింగ్ మెకానీజం ఏదో ఆయన వద్ద ఉందట. ఎవరి ఇంటిలో ఏమి అనుకుంటున్నది ఆయనకు తెలిసిపోతుందని బెదిరిస్తున్నారు. దేశంలో ఇలాంటి విచిత్రమైన ప్రకటన చేసిన వ్యక్తి చంద్రబాబు తప్ప మరొకరు ఉండరు. చంద్రబాబు ఇలా పలు ఆణిముత్యాలను తన ప్రసంగాలలో చెబుతున్నారు. వాటిలో మరీ పరువు తక్కువవి అయితే, టీడీపీకి నష్టం కలిగించేవి అయితే ఎల్లో మీడియా జాగ్రత్తగా ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నాయి. ఆయన నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు సరఫరా చేస్తారట. ఎవరైనా మద్యం సేవించవద్దని చెప్పాలా? లేక బాగా తాగండి.. తాను అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ తాగిస్తానని చెబుతారా? పద్నాలుగేళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి హామీలా ఇచ్చేది! ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలందరు తమ పిల్లలను బాగా చదివించాలని చెబుతుంటే, చంద్రబాబేమో పేదలకు మద్యం అందిస్తానంటున్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న మద్యం బ్రాండ్లన్ని చంద్రబాబు టైమ్ లో వచ్చినవే అయినా, వాటన్నిటిని వైఎస్ జగన్మోహన్రెడ్డికు అంటగడుతూ దుష్ప్రచారం చేస్తుంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సైకో అని చంద్రబాబు అంటారు. ఆయనేమో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ప్రశ్నిస్తారు. తానేసిన రోడ్డుపై నడుస్తారా? తాను ఇచ్చిన మరుగుదొడ్లను వాడతారా అని ప్రశ్నిస్తారు. తన ప్రచార పిచ్చికి గోదావరి పుష్కరాలలో ఇరవై తొమ్మిది మందిని బలి తీసుకున్నారన్న విమర్శ ఎప్పటికి ఆయనపై ఉంటుంది. ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా కందుకూరులో ఇరుకు రోడ్డుపై మీటింగ్ పెట్టి తొక్కిసలాటకు కారణం అయ్యారు. ఇక్కడ ఎనిమిది మంది మరణించారు. అలాగే గుంటూరు తొక్కిసలాటలో మరో ముగ్గురు చనిపోయారు. ఇలాంటి ఘటనలు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్న కార్యక్రమాలలో ఎప్పుడైనా జరిగాయా? వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు పరిపాలనను ఇంటి వద్దకు తీసుకు వెళితే సైకో అంట. ఈయనేమో ప్రజలను బలిగొంటే వారి ఖర్మ అట. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటివారు ఈయనకు అండగా ఉండి వారు నిత్యం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై అబద్ధాలు వండి ప్రజల మీద రుద్దుతున్నారు. వాటన్నిటిని ఈయన పట్టుకుని తిరుగుతుంటారు. అలాంటివారిని సైకో అంటారు కానీ, తన మానాన తాను స్కీములు అమలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలా సైకో అవుతారు? వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన ఐదేళ్లలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నది వాస్తవం. చంద్రబాబు టైమ్ లో మాదిరి ఉద్యమాలు, ఆందోళనలు దాదాపు లేవు. ప్రజలంతా ఈ స్కీముల ద్వారా లబ్ది పొందుతూ సంతృప్తిగా ఉంటే వీరికి కడుపు మంటగా ఉందని చెప్పాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఈయన కూటమి కట్టారట. జనం చెవిలో పూలు పెట్టుకుని వినాలట. నిజంగానే జనంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై అంత వ్యతిరేకత ఉందని నమ్మితే టీడీపీ ఎందుకు ఒంటరిగా పోటీచేయడం లేదు? వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల ఆదరణ పొందుతుండడం వల్ల ఆయనను ఓడించలేమన్న భయంతోనే కదా కూటమి కట్టింది. అయినా గెలుపు మీద సందేహాలు ఏర్పడడంతో చంద్రబాబు చెమటోడ్చుతున్నారు. చివరికి కుప్పంలో ఏమవుతుందో అన్న వణుకు ఆయనలో పుట్టింది. అందువల్లే ఒకటికి రెండుసార్లు కుప్పం నియోజకవర్గంలో పర్యటించి అక్కడ ప్రజలను మభ్య పెట్టడానికి యత్నిస్తున్నారు. కుప్పంకు విమానాశ్రయమని, కుప్పంలో అది చేస్తా, ఇది చేస్తా అంటూ హామీలు ఇస్తూ గెలిపించాలని తంటాలు పడుతున్నారు. మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీటిని ఎందుకు చేయలేదంటే సమాధానం ఉండదు. హైదరాబాద్‌కు తానే ఫౌండేషన్ వేశానని, రైతులు పొలంలో విద్యుత్ ఉత్పత్తి చేసి, మిగులు కరెంటును అమ్ముకోవచ్చని అందరూ ఆశ్చర్యపోయే ప్రకటనలు చేస్తున్నారు. ఏపీలో గంజాయి అధికంగా ఉందని అబద్ధాలు ప్రచారం చేసి రాష్ట్ర బ్రాండ్ ఇమేజీని చెడగొట్టాలన్న ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు నోరు జారి వైశ్యుల, కిరాణా షాపులవారి ఆగ్రహానికి గురయ్యారు. రావులపాలెం సభలో మాట్లాడుతూ కిరాణా షాపులలో గంజాయి అమ్మతున్నారని విమర్శించారు. దానిపై షాపుల యజమానులంతా బంద్ పాటించగా, వివిధ ప్రాంతాలలో వైశ్య సంఘాలు తీవ్రంగా నిరసించాయి. టిప్పర్ డ్రైవర్‌కు వైఎస్సార్సీపీ టిక్కెట్ ఇస్తారా అని డ్రైవర్ వృత్తి చేసుకునేవారిని అవమానించారు. ఫలితంగా డ్రైవర్లంతా టీడీపీపై మండిపడుతున్నారు. చంద్రబాబుకు ఏమైంది! ఇలా మాట్లాడుతున్నారు అని జనం విస్తుపోయే పరిస్థితి ఏర్పడింది. కుప్పంకు హంద్రీ-నీవా జలాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకు వచ్చినా ఎద్దేవగా మాట్లాడారు. ప్రస్తుతం కృష్ణా నదిలో నీళ్లు లేకపోతే, కుప్పంకు వచ్చే కాల్వల్లో నీళ్లేవి అని చంద్రబాబు ప్రశ్నించి ప్రజలను మోసం చేయాలని యత్నించారు. కుప్పం ప్రాంతంలోని చెరువులలో గతంలో ఎన్నడైనా వేసవిలో నీళ్లు ఉండేవా? ఇప్పుడు ఎందుకు ఉన్నాయి. అవి హంద్రీ-నీవా నీళ్లు కాదా? ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి చేస్తున్నారు. కుప్పంలో సైతం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్కీముల వల్ల కొన్నివేల కోట్ల మేర ప్రజలు లబ్ది పొందారు. సుమారు రెండువేల మందికి ఇళ్ల స్థలాలు వచ్చాయి. ఇళ్లు కట్టుకున్నారు. వీటన్నిటిని కప్పిపుచ్చుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో విద్వంసం అంటూ పడికట్టు డైలాగులు వదలుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మ ఒడి, చేయూత తదితర స్కీముల కింద సాయం చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిందని ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణలు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న స్కీములను మూడు రెట్లు అమలు చేస్తామని ఎలా చెబుతున్నారు? అంటే ప్రజలను మోసం చేయడమే కదా? సోషల్ మీడియాలో ఒక సామాన్యుడి వ్యాఖ్య చూశాను. 'వైఎస్ జగన్మోహన్రెడ్డి సుమారు మూడు లక్షల కోట్లు పేదలకు పంపిణీ చేసి వారిని ఆదుకున్నారు. చంద్రబాబు టైమ్ లో కూడా రెండున్నర లక్షల కోట్ల అప్పులు చేశారు కదా! ఆ డబ్బు అంతా అప్పుడు ఏమైపోయింది? వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలా ఇవ్వగలిగాడు?" అని ప్రశ్నించాడు. దీనికి చంద్రబాబు జవాబు ఇవ్వగలిగితే అప్పుడు ఆయన చెప్పే మాటలకు ఏమైనా విలువ వస్తుంది. తను సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండి చేయలేని పనులు మళ్లీ అధికారంలోకి వస్తే చేస్తానని చెబితే జనం విశ్వసిస్తారా? తాను పద్నాలుగేళ్లు గొప్పగా పాలన చేశానని, ప్రత్యేకించి 2014 -2019 మధ్య ఫలానా విధంగా పాలన చేశానని, దానినే మళ్లీ అందిస్తానని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారు. ఒక వైపు వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను మంచి చేశానని అనుకుంటేనే ఓటు వేయండని ధైర్యంగా అంటుంటే, చంద్రబాబు మాత్రం తన పాలన గురించి చెప్పలేని దైన్య స్థితిలో ఉన్నారన్నది వాస్తవం. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చంద్రబాబు కోసం బరితెగించొద్దు!
సాక్షి, అమరావతి: ‘‘వీళ్లా ఎస్పీలు?’’ అంటే అర్థమేంటి రామోజీరావ్? ఎస్పీలు మీరు ఊహించినట్లు ఉండాలా? మీకు కావాల్సినట్లు ఉండాలా? ఇదెక్కడి దుర్మార్గం!. అత్యున్నత సర్వీసుల్లో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు అవినీతి అంటగట్టడం, ఎవరెవరు ఎక్కడెక్కడ పని చేయాలో కూడా మీరే నిర్దేశించటం.. ఆఖరికి ఎన్నికల కమిషన్ ఎవరిని నియమించాలో కూడా మీరే సిఫారసు చేయటం ఇదెక్కడి దౌర్భాగ్యం? అసలిది పత్రికేనా? ‘‘వీళ్లా ఎస్పీలు?’’ అంటూ శుక్రవారం ‘ఈనాడు’ పతాక స్థాయిలో ప్రచురించిన హీనాతిహీనమైన కథనంపై అటు ఐఏఎస్ అధికారులు, ఇటు ఐపీఎస్ అధికారులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఈనాడు’ ‘ఆంధ్రజ్యోతి’ హద్దులు మీరుతున్నాయని, ఆ పార్టీల నేతలు నోటికొచ్చినట్లు వాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈసీకి ఇప్పటికే ఫిర్యాదు చేశామని తెలిపారు. అందరిపైనా చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ ‘పచ్చ’ మందకు ఐపీఎస్ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిగా నిలుస్తున్న రాజ్యాంగబద్ధ సంస్థ కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రతిష్టకు భంగం కలిగిస్తూ ఈనాడు పత్రిక దు్రష్పచారపూరిత కథనాన్ని ప్రచురించడం దారుణం అని ఇంకో వైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి మండిపడ్డారు. ఈసీ రాజ్యాంగ నిబంధనలను పాటిస్తూ కొత్తగా ఒక ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను నియమిస్తే ‘వీళ్లా.. కొత్త ఎస్పీలు’ అంటూ ప్రశ్నించే హక్కు రామోజీకి ఎక్కడిదని ప్రశ్నించారు. నిరాధార ఆరోపణలతో ఈనాడు పత్రిక ఈసీ ప్రతిష్టకు భంగం కలిగించడంతోపాటు యావత్ ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎస్ అధికారులంటే.. రామోజీ తన ఫిల్మ్ సిటీలో పని చేస్తున్న గార్డులుగా భావిస్తున్నట్లుందని పౌర సంఘాలు సైతం తీవ్రంగా తప్పు పట్టాయి. ఎలక్షన్ కమిషన్ నియామకాలను తప్పు పడుతున్నారంటే రామోజీ తనకు తాను రాజ్యాంగేతర శక్తిగా భావిస్తున్నట్లుందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఒక వర్గానికి కొమ్ము కాసేలా, రెండు ప్రభుత్వ వ్యవస్థల మధ్య అపోహలు కల్పించేలా ఈనాడు, దాని తోక పత్రిక, కొంత మంది టీడీపీ నేతలు నిత్యం పనిగట్టుకుని దు్రష్పచారం చేస్తున్నారని నిప్పులు చెరిగాయి. అది రాజకీయ దురుద్ధేశమే ఎన్నికల విధులు నిర్వహిస్తున్న రాష్ట్ర అధికార యంంత్రాంగం నిబద్ధత, మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఈనాడు పత్రిక దురుద్దేశపూరిత కథనాన్ని ప్రచురించడం ఏ మాత్రం భావ్యం కాదని సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. అధికారుల ప్రతిష్టకు భంగం కలిగిస్తూ వారిని అవమానపరిచే రీతిలో రాసిన కథనాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఒక్కో పోస్టుకు మూడేసి పేర్లతో పంపిన జాబితాను పరిశీలించి ఈసీ తన విచక్షణాధికారాల మేరకు నిర్ణయం తీసుకుంటుందన్నారు. తాము పంపించే జాబితాపై సందేహాలు ఉంటే దాన్ని తిరస్కరిస్తూ కొత్తగా మరికొందరు అధికారుల పేర్లతో మరో జాబితాను పంపించమని ఈసీ ఆదేశిస్తుందన్నారు. గుంటూరు ఐజీ పోస్టు కోసం తాము పంపిన జాబితాను ఈసీ వెనక్కి పంపడంతో మరో జాబితాను పంపించామని తెలిపారు. కీలకమైన ఎన్నికల తరుణంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అఖిల భారత సర్వీసు అధికారుల ప్రతిష్టకు భంగకరంగా ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని భావిస్తున్నామన్నారు. పాత్రికేయ ప్రమాణాలు, విలువలకు విరుద్ధంగా ఈనాడు పత్రిక వ్యవహరించిందని చెప్పారు. ఈనాడు కథనంపై తన అభిప్రాయాన్ని సైతం బ్యానర్‌గా ప్రచురించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. లేదంటే న్యాయపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని స్పష్టం చేశారు. సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటాం పోలీసు అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఈనాడు పత్రిక దు్రష్పచారం చేస్తోందని రాష్ట్ర ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా విమర్శించింది. ప్రజల భద్రత, ఎన్నికల సక్రమ నిర్వహణ కోసం రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగం మొత్తం సమష్టిగా కృషి చేస్తోందని స్పష్టం చేసింది. తమ విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు ఈనాడు పత్రిక దురుద్దేశాలు ఆపాదించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతోనే అవాస్తవ కథనాలను ప్రచురించారని మండి పడింది. దుష్ప్రచారం చేస్తున్న వారికి వ్యతిరేకంగా సంబంధిత ఐపీఎస్ అధికారులు వ్యక్తిగతంగా, సమష్టిగా సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటారని కూడా తెలిపింది. ఈ మేరకు ఐపీఎస్ అధికారుల సంఘం తరపున ఆ సంఘం కార్యనిర్వాహక సభ్యుడు క్రాంతిరాణా టాటా శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పలువురు ఐఏఎస్ అధికారులు సైతం ఈనాడు వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. తామంతా ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరించాలన్నట్లు రామోజీ వైఖరి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదని, రామోజీ తన హద్దులెరిగి ప్రవర్తించాలన్నారు. ఈసీ, ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు ఈనాడు దినపత్రికలో శుక్రవారం పతాక శీర్షికన ప్రచురితమైన కథనం ఒక వర్గానికి కొమ్ము కాసేలా, రెండు ప్రభుత్వ వ్యవస్థల మధ్య అపోహలు కల్పించేదిగా ఉందంటూ ఎన్నికల సంఘానికి రెండు పౌర సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఏపీ ఇంటిలెక్చువల్ అండ్ సిటిజన్స్ ఫోరం, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం సచివాలయంలోని ఎన్నికల కార్యాలయంలోని ఫిర్యాదుల విభాగానికి ఈ మేరకు ఒక లేఖను అందజేశారు. అనంతరం ఇంటిలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు పి.విజయబాబు మాట్లాడుతూ.. ఈనాడులో ‘వీళ్ళా కొత్త ఎస్పీలు.. సగానికి పైగా వైకాపా విధేయులే’ అన్న కథనం ఎటువంటి ఆధారాలు లేని అర్ధరహిత కథనంగా ఉందన్నారు. ఒక రాజకీయ పార్టీపై వ్యతిరేకతతో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి పై అసత్య ఆరోపణలు చేసే విధంగా వార్తను ప్రచురించారని, అందువల్ల ఆ పత్రిక యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈనాడు పత్రిక కథనాలు సత్య దూరంగా ఉంటున్నాయని, అందువల్ల దీనిపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేయబోతున్నామని ఆయన తెలిపారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు మాట్లాడుతూ.. కొత్త ఎస్పీల నియామకం నిబంధనల ప్రకారమే జరిగినప్పటికీ జవహర్ రెడ్డి పై అనవసర విమర్శలు చేశారన్నారు. జవహర్ రెడ్డి ఒక్కో పోస్టుకు ముగ్గురు అభ్యర్థుల పేర్లను మాత్రమే సూచించారని వారిలో ఒకరి పేరు నిర్ధారించే అధికారం ఎన్నికల సంఘానికే ఉందని కృష్ణంరాజు వివరించారు. ఎస్పీల నియామకాన్ని తప్పు పట్టడం అంటే ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉన్నంతకాలం వివిధ పత్రికల్లో వస్తున్న అసత్య, అర్ధసత్య వార్తలను ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు పరిశీలించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాది ఎం విఠల్ రావు, పలువురు ప్రముఖులు ఎన్నికల సంఘాన్ని కలిసిన వారిలో ఉన్నారు. రాజ్యాంగేతర శక్తి అనుకుంటున్నారు.. చింత చచ్చినా పులుపు చావలేదు అంటే ఇదేనేమో.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు ఛీకొట్టి నిర్ద్వందంగా తిరస్కరించి ఐదేళ్లు అవుతున్నా ఈనాడు రామోజీరావు మాత్రం తాను ఇంకా రాజ్యాంగేతర శక్తినేనని భావిస్తున్నారు. తాను చెప్పిందే శాసనం.. తన మాటే వేదం అన్నట్టుగా సాగాలని అనుకుంటున్నారు. అందుకోసం ఏకంగా రాజ్యంగబద్ధ సంస్థ ఎన్నికల కమిషన్ (ఈసీ)నే తూలనాడుతున్నారు. ఈసీ అంటే తన జేబు సంస్థ అన్నట్టుగా... తన ఆదేశాలే పాటించాలని, ఈనాడు ఉద్యోగుల్లా తన మనసెరిగి మసలుకోవాలని హకుం జారీ చేస్తున్నారు. తమ బాబుకు అనుకూలంగా జరిగితే ఆహా ఓహో అంటామని, అలా కాకుండా రాజ్యాంగ నిబంధనల మేరకు నిక్కచ్చిగా వ్యవహరిస్తామంటే మాత్రం ఎవరినైనా సరే బురదజల్లి బజారుకీడుస్తామని రామోజీరావు పాత్రికేయ వీరంగం వేస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొందరు ఎస్పీలను ఈసీ నియమిస్తే.. ‘వీళ్లా కొత్త ఎస్పీలు..?’అంటూ ఈనాడు పతాక శీర్షికన కథనాన్ని అచ్చేయడం రామోజీరావు పెత్తందారి పోకడలకు నిదర్శనం. ఎస్పీలు అంటే అఖిల భారత సర్వీసు అధికారులు కాదు.. తన ఇంటి నౌకర్లు.. ఫిలింసిటీ గార్డులు అన్నట్టుగా రామోజీరావు తన ఈనాడు పత్రిక నిండా విషాక్షరాలు కక్కడం పాత్రికేయ నైచత్వానికి పరాకాష్ట. ఈనాడు పాత్రికేయ దుర్మార్గంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వంటి రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల కమిషన్ ప్రతిష్టకు భంగకరంగా ఈనాడు పత్రిక దు్రష్పచారం చేసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి మండిపడ్డారు. అసలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పుడు అధికారుల పోస్టింగుల ప్రక్రియ ఎలా సాగుతుందన్న కనీస పరిజ్ఞానం ఈనాడు పత్రికకు ఉందా అని ఆయన నిలదీశారు. నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారుల మనో స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు ఈనాడు పత్రిక కుట్ర పన్నిందని రాష్ట్ర ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ధ్వజమెత్తింది. అటువంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్న వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు వెనుకడామని కూడా స్పష్టం చేసింది. ఈనాడు రామోజీరావు రాజ్యాంగబద్ధ సంస్థల ప్రతిష్టను దెబ్బతీస్తూ అప్రజస్వామికంగా వ్యవహరిస్తున్నారని పౌర సమాజం తీవ్రంగా దుయ్యబట్టింది. ఈనాడు పత్రిక రాజకీయ కుట్రలపై ఈసీకి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని ఏపీ ఇంటిలెక్చువల్ అండ్ సిటిజన్స్ ఫోరం, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ తెలిపాయి. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగబద్ధ సంస్థ ఈసీనీ, యావత్ అధికార యంత్రాంగంపై ఈనాడు రామోజీరావు దు్రష్పచారం చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. పరాజయానికి సాకులు త్వరలో నిర్వహించనున్న ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ మరోసారి దారుణంగా ఓడిపోనుందన్నది ఇప్పటికే స్పష్టమైంది. ‘జై జగన్’ అనే జన నినాదాలతో ‘సిద్ధం’ సభలు మార్మోగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ‘వన్స్ మోర్ జగన్’ అని ముక్తకంఠంతో నినదిస్తున్నారని జాతీయ చానళ్ల సర్వేలు పదే పదే వెల్లడిస్తున్నాయి. దాంతో బెంబేలెత్తిన చంద్రబాబు, రామోజీరావులు తమకు అలవాటైన రీతిలో కుట్ర రాజకీయాలకు తెరతీశారు. అందులో భాగంగా అధికార యంత్రాంగం మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు పన్నాగం పన్నారు. మరిది మనసెరిగి మసలుకుంటున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ ఈ కుట్రలో భాగస్వాములయ్యారు. దాంతో ఈ ఎల్లో గ్యాంగ్ దురుద్దేశపూరితంగా రాష్ట్రంలోని ఎస్పీలు, కలెక్టర్లు, ఇతర అఖిల భారత సర్వీసు అధికారులపై నిరాధార ఆరోపణలతో హడావుడి చేస్తోంది. సమర్థ పనితీరు, చిత్తశుద్ధితో నిమిత్తం లేకుండా శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు మొత్తం ఎస్పీలు, కలెక్టర్లు, డీఐజీలు, డీజీ స్థాయి అధికారుల వరకు ఓ జాబితా తయారు చేసి వారందరినీ బదిలీ చేయాలని ఈసీకి విజ్ఞప్తులపై విజ్ఞప్తులు చేశారు. ఓ వైపు చంద్రబాబు, లోకేశ్.. మరోవైపు పురందేశ్వరి, పవన్ కల్యాణ్.. దీనికి తోడు టీడీపీ అనుకూల ఎల్లో మీడియా రాష్ట్రంలోని ఉన్నతాధికారులపై అవాకులు చవాకులు పేలుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి, వ్యవస్థలను ప్రభావితం చేసేందుకు యత్నించారు. తద్వారా రానున్న ఎన్నికల్లో తమ ఓటమికి ఇప్పటి నుంచే సాకులు వెతుక్కునే పనలో పడింది పచ్చ ముఠా. బదిలీ చేస్తే ఈసీ ఆహా ఓహో అంటారా... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న చిలకలూరిపేట సభను అవకాశంగా చేసుకుని అసత్య ఆరోపణలతో ఎల్లో మీడియా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. వాహనాలు సమకూర్చినా, డబ్బులు ఇస్తామన్నా సరే సభకు ఆశించిన స్థాయిలో జనం హాజరు కాకపోవడంతో ఆ సభ అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. తమ వైఫల్యాన్ని అంగీకరించలేక చంద్రబాబు రాష్ట్రంలోని అధికారులపై సాకు నెట్టేసేందుకు యత్నించారు. అందుకే పలువురు అధికారుల జాబితాను రూపొందించి వారిని బదిలీ చేయాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు తానా అంటే పురందేశ్వరి, పవన్ కల్యాణ్ తందానా అన్నారు. పోనీ.. సక్రమంగా ఎన్నికల నిర్వహణకు ప్రతిపక్షాలు సహకరిస్తాయనే ఉద్దేశంతో ఈసీ.. ఒక ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను బదిలీ చేసింది. తమ దు్రష్పచార కుట్ర ఫలించడంతో రామోజీ ‘ఈడ్చి కొట్టిన ఈసీ’ అంటూ ఈనాడు పత్రికలో బ్యానర్ వార్త రాశారు. ఆ అధికారులను బదిలీ చేయడాన్ని అధికార వైఎస్సార్సీపీ ఏమీ తప్పుపట్ట లేదు. ఈసీ తన విచక్షణాధికారాలతో తీసుకున్న నిర్ణయాన్ని హుందాగా స్వీకరించి గౌరవించింది. కొత్త అధికారులను నియమిస్తే తూలనాడుతారా? బదిలీ చేసిన ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్ల స్థానంలో ఈసీ కొత్త అధికారులను నియమించింది. అందుకోసం రాజ్యాంగ నిబంధనలను పక్కాగా పాటించింది. కానీ ఈనాడు రామోజీరావుకు మాత్రం ఆ నిర్ణయం రుచించ లేదు. అధికారులను నియమించే ముందు ఈసీ హైదరాబాద్ శివార్లలో ఉన్న ఫిల్మ్ సిటీలో తాను అక్రమంగా నిర్మించిన తన బంగ్లాకు వచ్చి.. తాను మెట్లు దిగేవరకు వేచి చూసి.. ఎవరెవర్ని ఎస్పీలుగా, కలెక్టర్లుగా నియమించాలని తనను అడిగి.. తాను ఇచ్చిన జాబితాను మహా ప్రసాదంగా తీసుకుని వెళ్లి.. వారికి పోస్టింగులు ఇవ్వాలని రామోజీరావు భావించినట్టు ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అలానే చేసేవారన్నది ఆయన ఉద్దేశం. పాపం.. ఈసీకి ఆ విషయం తెలియదు కదా! రాజ్యాంగ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుని గుంటూరు ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను నియమించింది. అందుకోసం ముందుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని ప్రతిపాదనలు పంపమని ఆదేశించింది. ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూ సీఎస్ ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున మొత్తం మీద 27 మంది అధికారుల పేర్లను ప్రతిపాదిస్తూ ఈసీకి జాబితా సమర్పించారు. ఆ జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, అదనపు డీజీ (శాంతి, భద్రతలు) ఎస్.ఎస్. బాగ్చీలతో కూడిన కమిటీ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదించింది. ఆ జాబితాపై కేంద్ర ఎన్నికల కమిషన్ సమగ్రంగా సమీక్షించింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున ప్రతిపాదించిన అధికారుల సీనియారిటీ, పనితీరు, ట్రాక్ రికార్డ్‌ను కూలంకుషంగా పరిశీలించింది. సీఎస్ పంపిన జాబితాకే ఈసీ కట్టుబడాలని లేదు. స్వయం ప్రతిపత్తిగల ఈసీ తన విచక్షణాధికారాలతో నిర్ణయం తీసుకుంటుంది. సీఎస్ తన జాబితాలో పేర్కొన్న ప్యానళ్లలో అధికారుల సమర్థత, నిబద్ధతపై ఈసీకి సందేహాలు ఉంటే వారి పేర్లను తిరస్కరించవచ్చు. కొత్త ప్యానళ్లతో అధికారుల పేర్లను పంపించమని ఆదేశించవచ్చు. తాజాగా గుంటూరు ఐజీ పోస్టు కోసం సీఎస్ పంపిన మూడు పేర్లతో కూడిన ప్యానల్‌పై ఈసీ సంతృప్తి చెందలేదు. దాంతో మరో ముగ్గురు అధికారుల పేర్లతో కొత్త ప్యానల్‌ను సీఎస్ పంపారు. అనంతరం ఆ జాబితా నుంచి కొత్త ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను ఈసీ నియమించింది. ఈ ప్రక్రియ అంతా పక్కాగా నిబంధన మేరకు సాగింది. రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఈసీ సక్రమంగా వ్యవహరించడంతో రామోజీరావుకు పిచ్చి నాషాళానికి ఎక్కింది. ‘వీళ్లా ఎస్పీలు...’ అంటూ అధికారులను తూలనాడుతూ, అవమానపరుస్తూ, ఈసీ అధికారాలను ప్రశ్నిస్తూ విద్వేషపు విషం చిమ్మారు. కాదనడానికి మీరెవరు రామోజీ? దేశంలో అత్యంత ఉన్నతమైన అధికార వ్యవస్థ అఖిల భారత సర్వీసులు. ఏటా దేశంలో అత్యంత ప్రతిభావంతులైనవారే ఈ సర్వీసులకు ఎంపికవుతారు. అటువంటి అత్యున్నత వ్యవస్థను ఉద్దేశించి ‘వీళ్లా కొత్త ఎస్పీలు’ అని రామోజీరావు తూలనాడారంటే చంద్రబాబుకు మేలు చేయడం కోసం ఆయన ఎంతగా బరితెగించారో తెలుస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తన ఇంట్లో నౌకర్ల మాదిరిగా.. తన మోచేతి నీళ్లు తాగేవారి మాదిరిగా చిత్రీకరిస్తూ హేళన చేయడం రామోజీ పెత్తందారి పోకడలను నిదర్శనం. ఆ అధికారులేమీ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నియమించిన వారు కాదు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అఖిల భారత సర్వీసులకు ఎంపికైన వారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు నుంచి రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న వారే. టీడీపీ ప్రభుత్వంలో కూడా వివిధ హోదాల్లో నిబద్ధతతో విధులు నిర్వర్తించిన అధికారులేనని అఖిల భారత అధికారుల సంఘం గుర్తు చేస్తోంది. కానీ అప్పుడు తప్పుబట్టని చంద్రబాబు, రామోజీ.. ప్రస్తుతం మాత్రం వారు అధికారులు కాదు.. నౌకర్లు అన్నట్టుగా అవమాన పరచడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం. అసలు ఈసీ నియమించిన ఎస్పీలను కాదని అనడానికి మీరెవరు రామోజీ? ఆనాడు ఎన్టీ రామారావును కుట్రతో కూలదోసిన కుట్రలో చంద్రబాబు భాగస్వామి కాబట్టి.. ఆయనకు మీరు ఇంద్రుడు.. చంద్రుడిగా కనిపిస్తారేమో. అందుకే మీరు వేలాది ఎకరాలు కొల్లగొట్టడానికి ఆయన సహకరించి ఉండొచ్చు. టీడీపీ ప్రభుత్వంలో మీరు రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిపోయినా సహించి ఉండొచ్చు. కానీ రాజ్యాంగ బద్ధ సంస్థ ఈసీకి మీరు ఓ సాధారణ వ్యక్తే. మీ ఉడత ఊపులకు బెదిరి పోవాల్సిన అగత్యం ఈసీకి లేదు. ఇక అఖిల భారత సర్వీసులకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మీకు జీ హుజూర్ అని ఎందుకు అంటారు? మిమ్మల్ని చూసి బెంబేలెత్తిపోయి దాసోహం కావాల్సిన గతి పట్టలేదు. రామోజీ.. ఇక చంద్రబాబును మీరు నెత్తిన పెట్టుకుని ఊరేగితే ఊరేగండి. మీరిద్దరూ కలసి ఏ ఏట్లో దూకినా ఎవరికీ పట్టదు. కానీ నిరంకుశుడు, ప్రజాకంటకుడు, అవినీతి చక్రవర్తి అయిన చంద్రబాబును మోయాల్సిన అగ్యతం రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం లేదు. ఆ విషయాన్ని కుండబద్దలుగొడుతూ 2019లోనే ఇచ్చిన విస్పష్టమైన తీర్పును 2024 ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని ప్రజలు ఇప్పటికే డిసైడయ్యారు. ఆ నిజాన్ని భరించేందుకు మీరు, మీ చంద్రబాబు సిద్ధంగా ఉండాలని సిద్ధం సభలే స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ ఘోర పరాజయాన్ని జీర్ణించుకోగలిగితే సరి. లేకపోతే మీ చంద్రబాబు, మీరు కలసి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేరేందుకు అంబులెన్స్‌ను సిద్ధం చేసుకోండి. -
ఒకప్పుడు పొసగేదే కాదు.. ఇప్పుడు మరీ ఇంత ఆత్మీయతా?
ఏపీలో వైఎస్సార్సీపీను ఓడించలేమన్న భావనకు వచ్చిన విపక్ష కూటమి ఇప్పుడు బ్లాక్ మెయిల్ రాజకీయానికి బరి తెగిస్తోంది. బీజేపీని అడ్డు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ కేంద్రాన్ని, ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు తెలిసిపోతూనే ఉన్నాయి. పట్టుమని పది అసెంబ్లీ సీట్లకు పోటీచేయని బీజేపీ పక్షాన ఆ పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికల సంఘానికి పోలీసు అధికారులపై ఒక పెద్ద ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న 22 మంది పోలీసు అధికారులపై ఈ ఫిర్యాదు ఉంది. అది చదివితే ఒక విషయం బోధ పడుతుంది. ఇదంతా తెలుగుదేశం పార్టీ ఆడిస్తున్న నాటకం అని ఇట్టే అర్దం అయిపోతుంది. బీజేపీ తాను పోటీచేస్తున్న ప్రాంతాలలో పోలీసు అధికారులు ఎవరైనా తప్పు చేస్తున్నారని సమాచారం ఉంటే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్లవచ్చు. అలాకాకుండా ఇంతమంది పోలీసు అధికారులపై ఆరోపణలు చేస్తున్నారంటే ఇదంతా టీడీపీ కుట్రగానే కనిపిస్తుంది. ఇందులో విడ్డూరం ఏమిటంటే 'తమకు ఫలానా అధికారులు కావాలని అడగడం'. బహుశా దేశంలోనే ఇలా ఏ రాజకీయ పార్టీ కోరి ఉండరు. తాను నేరుగా ఫిర్యాదు చేస్తే పోలీసు వ్యవస్థ అంతా తమకు వ్యతిరేకం అవుతుందని, దాని వల్ల నష్టం ఏమైనా జరుగుతుందేమోనని అనుమానించిన చంద్రబాబు ఈ పనికి పురందేశ్వరిని పురమాయించినట్లు కనిపిస్తుంది. దీనివల్ల ఏదైనా అప్రతిష్ట వచ్చినా పురందేశ్వరికే కాబట్టి వ్యూహాత్మకంగా ఈ ప్లాన్ అమలు చేశారని అనుకోవాలి. ఎన్టీ రామారావు కుమార్తెగా ఉన్న పురందేశ్వరి ఆయనకు ప్రతిష్ట తీసుకురాకపోతే మానే.. ఆయన పరువు తీస్తున్న కూతురుగా ప్రసిద్దికెక్కుతున్నారు. 'ఒకప్పుడు చంద్రబాబుకు, పురందేశ్వరికి మధ్య ఏ మాత్రం పొసగేది కాదు. తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావును పలుమార్లు చంద్రబాబు అవమానించారని ఆమె మదనపడేవారు. ఒక సందర్భంలో ఆమె ఇంటిలో జరిగిన ఒక కార్యక్రమానికి వచ్చిన చంద్రబాబును పలకరించడానికి కూడా ఆమె ఇష్టపడలేదంటే ఆశ్చర్యం కాదు'. అలాంటిది ఇప్పుడు సడన్‌గా ఇలా రెండు కుటుంబాల మధ్య ఇంత ఆత్మీయత ఎలా వచ్చిందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. పురందేశ్వరి తమకు జరిగిన అవమానాలు మర్చిపోయి తెలుగుదేశం ఎజెండా కోసం, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారంటే, ఆమె ఎంపీ పదవి కోసం ఎంత తహతహలాడుతున్నారో అర్ధం అవుతుంది. 2014లో కూడా బీజేపీ, జనసేన,టీడీపీ కలిసి పోటీచేశాయి. కానీ అప్పటికి చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాల మధ్య రాజీ కుదరలేదు. చంద్రబాబు, వెంకయ్య నాయుడు కలిసి పురందేశ్వరిని తెలివిగా రాజంపేటలో పోటీచేయించారు. తద్వారా ఆమె అక్కడ ఓడిపోయేలా చేశారు. చాలాకాలం ఆ బాధ ఆమెలో ఉండేది. ఎప్పుడు రాజీపడ్డారో కానీ, చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్‌లో జైలులో ఉన్నప్పుడు లోకేష్‌ను పురందేశ్వరి వెంటబెట్టుకుని వెళ్లి హోం మంత్రి అమిత్‌షా తో కలిపారు. అలాగే ఎన్టీ రామారావు గోల్డ్ కాయిన్ విడుదల సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను పిలిచి, అక్కడ చంద్రబాబుతో మాట, మంతి కలిసేలా దగ్గుబాటి దంపతులు చేశారు. బీజేపీ అధిష్టానం పురందేశ్వరిని ఎందుకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు చేశారో తెలియదు కానీ, ఆమె అప్పటి నుంచి ఆ పార్టీని పూర్తిగా తెలుగుదేశంకు అనుకూలంగా మార్చివేశారు. చివరికి బీజేపీ ఇచ్చిన లోక్ సభ టిక్కెట్లు ఆరింటిలో ఐదు ఇతర పార్టీల నుంచి వచ్చినవారికే దక్కడం విశేషం. ఒరిజినల్ బీజేపీ నేతలంతా దిక్కుతోచని స్థితిలో తమ ఖర్మ అనుకుంటూ కాలం గడుపుతున్నారు. ఈ విషయాలు పక్కనబెడితే పురందేశ్వరి రాసిన ఫిర్యాదును పరిశీలిస్తే, అందులో టీడీపీ అరాచకాలను అడ్డుకున్నవారి పేర్లు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన స్కామ్‌లను బయటకు తెచ్చినవారి పేర్లే ఎక్కువగా కనిపించాయి. ప్రత్యేకించి ఒక సామాజికవర్గంపై వ్యతిరేకతతో కూడా ఈ ఫిర్యాదు చేశారా అన్న అనుమానం వస్తుంది. టీడీపీ మీడియాలో వచ్చిన కథనంలో ఏమి రాశారో చూడండి.. 'డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి నుంచి ఎస్పీ ఆనందరెడ్డి వరకు అని పేర్కొనడంలోనే కుత్సిత స్వభావం కనిపిస్తుంది.వీరంతా వైసిపితో సంబంధాలు ఉన్నవారట. విపక్షాలను వేధిస్తున్నారట. వీరిని తప్పిస్తేకానీ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని ఈమె అంటున్నారు'. నిజానికి ఈ 22 మంది ఎవరో పురందేశ్వరికి తెలియకపోవచ్చు. వీరి పేర్లు చెప్పాలని ఆమెను అడిగితే చెప్పలేకపోవచ్చు కూడా. ఎందుకంటే కేవలం టీడీపీ రాసిన ఒక పత్రంపై ఆమె సంతకాలు చేసి ఎన్నికల సంఘానికి పంపి ఉండవచ్చనిపిస్తుంది. బహుశా టీడీపీ హయాంలో ఆనాటి ఇంటిలెజెన్స్ ఛీప్ ఏబీ వెంకటేశ్వరరావు మాదిరే, అలాగే కొందరు ఎస్పీల మాదిరే ఇప్పుడు కూడా ఐపిఎస్ అధికారులు ఎవరైనా చేస్తారేమోనన్న అనుమానంతో టీడీపీ ఈ లేఖ రాయించి ఉంటుంది. వెంకటేశ్వరరావు టీడీపీ పార్టీ కార్యకలాపాలు కూడా పర్యవేక్షించేవారు. ఈ మాట అప్పట్లో టీడీపీ నేతలే చెప్పిన వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. బహుశా టీడీపీ కూటమికి అవకాశం ఇస్తే అలాంటివారిని నియమించుకోవాలని భావిస్తున్నారేమో తెలియదు. ఈనాడు రామోజీరావు మరో అడుగు ముందుకేసి కొన్ని జిల్లాలలో కొత్తగా వచ్చిన ఐపీఎస్ అధికారులకు కూడా పక్షపాత బుద్ధి ఆరోపిస్తూ పెద్ద స్టోరీ ఇచ్చేసింది. జర్నలిజం విలువలను దిగజార్చి టీడీపీకి నీచమైన రీతిలో మద్దతు ఇస్తున్న రామోజీనుంచి ఇంతకన్నా విలువలను ఆశించడం అత్యాశే అవుతుంది. పురందేశ్వరి రాసిన లేఖలో డీజీపీపై ఆరోపణలు చేస్తూ, సీక్రెట్ ఫండ్‌ను సొంతానికి వాడుకున్నారని, సంబంధిత ఫైళ్లను ద్వంసం చేశారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఏవీ చూపకుండా ఇలా రాయడం ఎంత బాధ్యతారాహిత్యం! వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న ఇంటెలిజెన్స్ ఛీఫ్ సీతారామాంజనేయులు ఎన్నికలను మేనేజ్ చేసేందుకు, తప్పుడు సర్వేలు చేయించేందుకు బాగా డబ్బులు తీసుకున్నారని పురందేశ్వరి ఆరోపణ. 'విపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారట. ప్రధాని సభకు జనం రాకుండా చేశారట'. వీటిలో ఒక్కదానికైనా అర్ధం ఉందా? పిచ్చి ఆరోపణలు చేసి జనాన్ని మోసం చేయడం తప్ప. చిత్తూరు ఎస్పీ జాషువా ఇటీవలే చిత్తూరు జిల్లాకు వెళ్లారు. ఆయనపై కూడా ఆరోపణ చేస్తూ కుప్పంలో చంద్రబాబును ఓడించే బాధ్యత పెట్టుకున్నారని పురందేశ్వరి అంటున్నారు.. 'కుప్పంలో వైఎస్సార్సీపీ నేతలు ఏవో అరాచకాలు చేశారట. వాటిని చూసిచూడనట్లు వ్యవహరించారట'. ఈ ఫిర్యాదు చూస్తే అసలు భయం కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారన్న అనుమానం వస్తుంది. 'పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి కూడా ప్రధాని సభకు జనం రాకుండా చెక్ పోస్టులు పెట్టి అడ్డుకున్నారట'. ఏమైనా బుద్ది జ్ఞానం ఉన్నవారు ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేస్తారా? ప్రధాని సభకు వెళ్లేవారిపై జాగ్రత్తగా నిఘా పెట్టకపోతే ఏమైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. చెక్ పోస్టులు పెడితే మోడీ సభకు జనం రాకుండా ఉంటారా? ఇలాంటి అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తే, వాటిని నమ్మి ఎన్నికల కమిషన్ ఆయనను పక్కనబెట్టిందా? అందుకే అయితే కచ్చితంగా ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది. ఎన్నికల సంఘం బీజేపీ ఒత్తిడికి లొంగుతోందన్న అభిప్రాయం కలుగుతుంది. సీఐడీ అదనపు డీజీ సంజయ్‌పై కూడా ఆరోపణ చేశారు. 'ఆయన మీడియా సంస్థలను బెదిరిస్తున్నారట'. మార్గదర్శి అక్రమాలను బయటపెడితే అది మీడియాను బెదిరించడమా! చంద్రబాబును స్కిల్ స్కామ్‌లో అరెస్టు చేస్తే అది ఆయన చేసిన తప్పా! డిల్లీలో ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారో, లేదో కానీ, అంతా కలిపి వంద కోట్ల స్కామ్‌లో ఈడి అరెస్టు చేసింది. ఆప్ మరో నేత మనీష్ సిసోడియా ఏడాదిగా జైలులో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్టు చేశారు. అదంతా పద్ధతిగా జరిగినట్లు చెప్పే బీజేపీ ఏపీలో చంద్రబాబుపై వచ్చిన వందల, వేల కోట్ల రూపాయల విలువైన స్కామ్‌లను సమర్ధించడం ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలా తమ అడ్డగోలు పనులకు సహకరించని అధికారులను, టీడీపీ ప్రభుత్వ స్కామ్‌లను బయటపెట్టిన అధికారులను బ్లాక్ మెయిల్ చేయడానికే పురందేశ్వరి ద్వారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటివారు ఇలాంటి ఫిర్యాదు చేసినట్లు అనిపిస్తుంది. వీటన్నిటిని పరిశీలించారో, లేక బీజేపీ ఒత్తిడి పనిచేసిందో కానీ వీరిలో కొందరిని ఎన్నికల సంఘం బదిలీ చేసి వారిని సంతృప్తి పరచే యత్నం చేసింది. అయినా అది చాలలేదని, ఇప్పుడు తెలుగుదేశం మీడియాలో ఆమె ఫిర్యాదు పేరుతో అందులోని అంశాలు అంటూ భారీ కథనం ఇచ్చారు. ఇదంతా కచ్చితంగా అధికారులను భయపెట్టి తమకు అనుకూలంగా లొంగదీసుకునే యత్నమే. ఇక్కడ ఒక మాట చెప్పాలి. '2019లో చంద్రబాబు నియమించుకున్న పోలీసు అధికారులే జిల్లాలలోను, రాష్ట్ర స్థాయిలోను వివిధ బాధ్యతలలో ఉన్నారు కదా! వీరిలో కొందరిని ఎన్నికల కమిషన్ బదిలీ చేస్తే టీడీపీ ప్రభుత్వం హైకోర్టుకు కూడా వెళ్లింది కదా! అప్పుడేమో అధికారులంతా సుద్దపూసలని, ఇప్పుడేమో అవినీతి పరులని బురద చల్లడానికి టీడీపీ మీడియా యత్నించింది'. ఎవరైనా అధికారి తప్పు చేస్తే చర్య తీసుకోవచ్చు. కానీ కేవలం ఒత్తిడులకు లొంగి ఐపీఎస్ అధికారులను పక్కనబెడుతూ ఎన్నికల సంఘం ఆదేశాలు ఇస్తే అది వ్యవస్థకే చేటు తెస్తుంది. బ్లాక్ మెయిల్ చేసే రాజకీయనాయకులకు, మీడియాకు అవకాశం ఇచ్చినట్లవుతుంది. ఈ ఎన్నికల రణక్షేత్రంలో టీడీపీ కూటమి ఇంకెన్ని కుట్రలకు పాల్పడుతుందో చూడాలి. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఆత్మలనూ వాడుకుంటున్న రామోజీ
ఎల్లోమీడియా అధినేత రామోజీరావు తన జీవితపు అంతిమ ఘడియల్లోనూ తన తన క్షుద్ర బుద్ధినిపోనిచ్చుకోవడం లేదు. రాష్ట్రంలో ఎక్కడ ఏ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నా దాన్ని ఏపీ ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అంటగట్టేందుకు ఎంతగానో తాపత్రయపడిపోతున్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరంలో సుబ్బారావు అనే చేనేత కార్మికుడు కుటుంబం విషాదాన్ని ప్రభుత్వం మెడకు చుట్టే ప్రయత్నం చేసిన ఈనాడు. వాస్తవానికి ఎక్కడో కొండల్లో ఉన్న ప్రభుత్వ భూమిని టీడీపీ హయాంలో రికార్డులను తారుమారు చేసే అధికారులను పట్టుకుని 2015 లో తన తండ్రిపేరు రికార్డ్ చేయించారు. తరువాత ప్రభుత్వం రికార్డులనుంచి ఆయన పేరును తొలగించింది. అంతేకాకుండా ఆ భూమి గతంలో ఎన్నడూ. ఎవరికీ ఎసైన్ చేయలేదు. రాళ్ళూ, రప్పలతో ఉన్న ఆ భూమి కనీసం సాగుకు కూడా పనికిరాదు.. గతంలో ఎన్నడూ ఎవరూ అధికారికంగా అనధికారికంగా కూడా అక్కడ సాగు చేయలేదు. ఆ భూమి తనకు ఇవ్వాలని ప్రభుత్వానికి సుబ్బారావు కూడా ఎన్నడూ అర్జీ కూడా పెట్టుకోలేదు.. ఏ అధికారిని కలవలేదు. జూదం.. క్రికెట్ బెట్టింగులు.. ఇతర వ్యసనాలతో ఇరవై లక్షల వరకు అప్పులు చేసి.. ఇటు కులవృత్తిని సైతం వదిలేసి ఇబ్బందులు పాలయ్యాడు.. దీంతో భార్యకుమార్తెను అయన హత్య చేసి తరువాత తానూ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక వివరాలను బట్టి తెలుస్తోంది. ఇలాంటి ఘటనలను సైతం ప్రభుత్వానికి అంటగట్టే కుట్రలకు ఎల్లో మీడియా తెగబడుతోంది. -
Fact Check: ఎందుకీ ‘తొందరపాటు’?
సాక్షి, అమరావతి: ఎగువ సీలేరు పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టు (పీఎస్పీ)కు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) 2022 సెపె్టంబరులో తయారైంది. అప్పటి ధరల ప్రకారం వ్యాప్కోస్ సంస్థ డీపీఆర్ తయారు చేసింది. అంటే ఈ ప్రాజెక్టు డీపీఆర్ 18 నెలల క్రితం ధరలతో తయారైంది. ఏ ప్రాజెక్టుకైనా ఏటా 6 శాతం ధరల పెరుగుదల ఉంటుంది. ఎగువ సీలేరు పీఎస్పీకి అన్ని నిబంధనలు, మార్గదర్శకాలను అనుసరించి, రివర్స్ టెండరింగ్ ద్వారా నిర్మాణ సంస్థ ఎంపిక జరిగింది. ఇందులో 9.87 శాతం ఎక్కువకు కోట్ చేసిన మేఘా సంస్థ ఎల్–1 (తక్కువ మొత్తానికి కోట్ చేసిన సంస్థ)గా ఎంపికైంది. దానికే ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. ధరల పెరుగుదల 6 శాతం పోగా మేఘా సంస్థ కోట్ చేసిన మొత్తం ఎక్కువేమీ కాదు. ఈ విషయం విష పత్రిక ఈనాడు అధినేత రామోజీకి తెలియనిదీ కాదు. పైగా, గత ఏడాది జూన్‌లో టెండర్లు పిలిచి, అన్ని నిబంధనలను పాటిస్తూ, రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరిలో టెండర్లను ఏపీ జెన్కో ఖరారు చేసింది. అంటే 8 నెలలపాటు టెండర్ల ప్రక్రియ సాగింది. ఇందులో తొందరపాటేమీ లేదన్నదీ రామోజీకి తెలుసు. అయినా వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఏదోలా విషం చిమ్మి, ప్రజలను మభ్య పెట్టేయాలన్న తొందరపాటులో విషయం లేని ఈ కథనాన్ని అచ్చేశారు. ఈనాడు ప్రచురించిన ఈ అసత్య కథనాన్ని ఏపీ జెన్కో, ఇంధన శాఖ ఖండించాయి. ఆ రెండు సంస్థలు అసలు టెండర్లలో పారదర్శకత, నిబంధనలు అమలు తీరును ‘సాక్షి’కి వెల్లడించాయి. ఆ వివరాలు.. ♦ 2022 సెప్టెంబరు ధరల ప్రామాణికంగా ఈ పీఎస్పీకి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘‘వ్యాప్కోస్’ డీపీఆర్ తయారు చేసింది. డీపీఆర్ తయారై 18 నెలలు గడిచిపోయింది. డీపీఆర్ ఆధారంగా ఈ ప్రాజెక్టుకు టెండరు పిలిచిన మొత్తం రూ. 6,717 కోట్లు కాగా మేఘా రూ.7,380 కోట్లకు (9.87 శాతం ఎక్కువకు) టెండరు పొందింది. ఏడాదిన్నర క్రితం ధరలతో పోల్చితే ఇప్పుడు మేఘా కోట్ చేసిన బిడ్‌లో ఏడాదికి 6 శాతం పెరుగుదలా ఉంది. అందువల్ల ప్రతిపాదిత టెండరు మొత్తంకంటే 9.87 శాతం ఎక్కువనడానికి లేదు. అన్ని అంశాలను విశ్లేషించిన తర్వాతే ప్రభుత్వ ఆమోదంతో ఏపీజెన్కో ఈ టెండరును ఆమోదించింది. ♦ ఉదయం, సాయంత్రం పీక్ లోడ్ అవసరాలు తీర్చడం ద్వారా గ్రిడ్‌ను స్థిరీకరించడం, అధిక ధరకు మార్కెట్లలో విద్యుత్ కొనుగోళ్లు తగ్గించడం, కర్బన ఉద్గారాల నియంత్రణ లక్ష్యాలుగా ప్రభుత్వ ఆదేశంతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎగువ సీలేరులో 1350 మెగావాట్ల సామర్థ్యంతో పీఎస్పీ నిరి్మంచాలని ఏపీజెన్కో నిర్ణయించింది. ♦ కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత విభాగాలకు ఈ ప్రాజెక్టు అనుమతికి సంబంధించిన అన్ని పత్రాలు అందజేసి, త్వరితగతిన వివరణలు ఇవ్వడం ద్వారా ఏపీజెన్కో చట్టబద్ధమైన అనుమతులు సాధించింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) అనుమతి పొందిన తర్వాత గత ఏడాది జూన్‌లో పీఎస్పీ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. పూర్తిగా నిబంధనలు, విధివిధానాలను అనుసరించి ఈ ఏడాది ఫిబ్రవరిలో టెండరు ఖరారు చేసింది. అన్ని నిబంధనలు పాటించినందునే టెండరు ఖరారుకు ఎనిమిది నెలలు పట్టింది. టెండర్ల ఖరారులో ఎలాంటి తొందరపాటు లేదనడానికి ఇదే నిదర్శనం. ♦ ఈ ఏడాది జనవరికల్లా పనులు ప్రారంభించి 2028 డిసెంబరుకల్లా ప్రాజెక్టు పూర్తి చేసి అందుబాటులోకి తేవడం ద్వారా ఐఎన్డీసీ, సీఓపీ మార్గదర్శకాల ప్రకారం కర్బన ఉద్గారాలను, భూతాపాన్ని తగ్గించాలని సీఈఏ షెడ్యూలు ఇచ్చింది. కర్బన ఉద్గారాల తగ్గింపు, భూతాపం (వేడి) నియంత్రణకు 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్య సాదనకు పీఎస్పీ, బ్యాటరీలే మార్గాలు. ఇంత పెద్ద పరిమాణంలో బ్యాటరీల ఏర్పాటు సాధ్యంకానందున పీఎస్పీల నిర్మాణమే ఉత్తమ మార్గం. అందువల్లే ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టింది. ఈ పీఎస్పీ నుంచి డిస్కంలు విద్యుత్ తీసుకునేందుకు ఏపీఈఆర్సీ, ఏపీపీసీసీ అనుమతులు కూడా లభించాయి. భూసేకరణ ప్రణాళిక కూడా రూపొందించిన తర్వాత సీఈఏ అనుమతించింది. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మొదటి దశ పర్యావరణ అనుమతి ఇచ్చింది. ♦ భూసేకరణ, జీఎస్టీ, ఐడీసీ, ధరల పెరుగుదల వల్ల పెరిగే వ్యయం, చట్టబద్ధమైన అనుమతులు అన్నీ కలిపి 2022 ధరల ప్రాతిపదికన ఈ పీఎస్పీ నిర్మాణానికి రూ. 11,881.50 కోట్లవుతుందన్న అంచనాతో 2022సెప్టెంబర్ లో వ్యాప్కోస్ డీపీఆర్ రూపొందించింది. దీని ప్రకారం జీఎస్టీ కాకుండా రూ. 6,717 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు ఆహా్వనించి రూ. 7,380 కోట్లకు (జీఎస్టీ కాకుండా).. అంటే 9.87 శాతం ఎక్కువకు కాంట్రాక్టు ఖరారు చేసింది. -
చంద్రబాబు పొత్తు వెనక ఇంత పెద్ద స్కెచ్చా.?
నలబై ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా ఆత్మగౌరవ నినాదం మారుమోగుతుండేది. అప్పట్లో కాంగ్రెస్ ఐ ప్రభుత్వం ఉండేది. ఆ పార్టీకి చెందిన నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం ప్రతిదానికి ఢిల్లీ పార్టీ నాయకత్వంపై ఆధారపడవలసి వచ్చేది. వారి అపాయింట్మెంట్ కోసం వేచి ఉండవలసి వచ్చేది. దాంతో ఈనాడు వంటి పత్రికలు ఈ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ నడి వీధులలో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడుతున్నారని ప్రచారం చేసేవి. కాంగ్రెస్ ఐ ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, అంజయ్య, భవనం వెంకట్రామ్రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డిలు కూడా ఈ విమర్శలను ఎదుర్కోవలసి వచ్చేది. తమ పార్టీ నేతలను తాము కలుస్తానని వేచి ఉంటే అది ఆంధ్రుల ఆత్మగౌరవ సమస్య ఎలా అవుతుందో అర్దం కాక కాంగ్రెస్ వారు తలలు పట్టుకునేవారు. అయినా ఆ విమర్శలను సరిగా తిప్పికొట్టలేకపోయేవారు. సరిగ్గా అదే టైమ్‌లో ప్రముఖ సినీ నటుడు ఎన్టీరామారావు ఆత్మగౌరవ నినాదంతోనే పార్టీని స్థాపించి దానిని ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లారు. ప్రజలంతా ఆయన గ్లామర్‌తో పాటు ఈ నినాదానికి బాగా ఆకర్షితులయ్యారు. కాంగ్రెస్ సీఎంలను మార్చడం వల్ల కూడా నష్టపోయింది. అది చరిత్ర... అప్పట్లో ఒకే పార్టీవారు ఢిల్లీలోను, ఉమ్మడి ఏపీలోను పాలనలో ఉన్నా... తెలుగు ప్రజలు ఆత్మగౌరవ సమస్యను ఎదుర్కున్నారు. మరి ఇప్పుడు అదే సూత్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రుల పరువును ఢిల్లీ వీధులలో తీసివేశారని చెప్పాలి. తెలుగుదేశం, జనసేన కార్యకర్తల పరువును మంట కలిపారని అంగీకరించాలి. ఈ ఇద్దరు నేతలు ఆత్మాభిమానం వదలుకుని, కేవలం పదవులపై యావతో ఎలాంటి అవమానాన్ని అయినా భరించడానికి సిద్దపడి రోజుల తరబడి పడిగాపులు పడ్డారంటే ఏమని అనాలి..! 1978-83 మధ్య కాలంలో ఆత్మగౌరవం సమస్యపైన ఈనాడు దినపత్రిక ఎన్ని కధనాలు ఇచ్చేదో తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. అదే పత్రిక ఇప్పుడు ఎలా రాస్తోంది చూస్తుంటే ఊసరవెల్లి కూడా సిగ్గుతో తలవంచుకోవలసిందే. రాష్ట్ర ప్రయోజనాలకోసం చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ డిల్లీలో కూర్చున్నారట. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ, జనసేనలు నానా పాట్లు పడితే, అదేదో బీజేపీనే వెయిటింగ్లో ఉన్నట్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 వంటి మీడియా సంస్థలు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేసే యత్నం చేశాయి. గత ఐదేళ్లలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడైనా ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోదీ, హోంమంత్రి అధికారిక అపాయింట్మెంట్ కాస్త లేటు అయితే చాలు.. ఇంకేముంది.. అంత అవమానం.. ఇంత అవమానం.. అని ప్రచారం చేసిన ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు ఇప్పుడు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు ఇంత పరువు తక్కువగా ఢిల్లీలో కళ్లు కాయలు కాచేలా మూడు రోజుల పాటు అమిత్‌షాతో భేటీ కోసం ఎదురు చూస్తే మాత్రం మొత్తం అన్ని మూసుకుని కూర్చున్నారు. ఐదేళ్ల క్రితం తానే ప్రధాని మోదీ కంటే సీనియర్ని అంటూ డంబాలు పలికి, మోదీని అనరాని మాటలు అన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఢిల్లీలో కిక్కురుమనకుండా కూర్చుని టీడీపీ కార్యకర్తల, అభిమానుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ యమునా నదిలో కలిపారు. పవన్‌కళ్యాణ్ పెద్దగా ఆత్మాభిమానం గురించి పట్టించుకోరు కాబట్టి ఆయన సంగతి అనవసరం. టీడీపీని, బీజేపీని కలపడానికి తాను అవమానాలకు గురి కావాల్సి వచ్చిందని, చివాట్లు తిన్నానని పవన్‌కళ్యాణ్ చెప్పడం ద్వారా బీజేపీకి టీడీపీ అంటే ఎంత చీత్కారమో చెప్పకనే చెప్పారు. ఆ మాట విన్నప్పుడైనా చంద్రబాబు నాయుడు కాస్త అయినా ఆత్మాభిమానం ప్రధర్శిస్తారనుకుని ఆశించిన టీడీపీ కార్యకర్తలకు తీవ్ర ఆశాభంగం కలిగించారని చెప్పాలి. దానిని పట్టించుకోకుండా అమిత్‌షా అపాయింట్మెంట్ దొరికితే చాలు అన్న చందంగా ఆయన ఢిల్లీలో పడిగాపులు పడ్డారు. బీజేపీ గురించి కూడా మాట్లాడుకోవాలి... 2019 ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోదీని టెర్రరిస్టు అని, ముస్లింలు, క్రిస్టియన్లను బతకనివ్వడని, అవినీతి పరుడని, భార్యనే ఏలుకోలేని వాడని... ఇలా అనేక దూషణలకు చంద్రబాబు పాల్పడ్డాడు. వాటన్నిటిని మర్చిపోయి ఇప్పుడు అదే చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ సిద్దపడిందంటే వారికి ఉన్న ఆత్మగౌరవం ఇదేనా అని అనుకోక తప్పదు. మోదీ చాలా ఆత్మాభిమానంతో ఉంటారని ఆశించడం తప్పు అన్న భావనకు అవకాశం ఇచ్చారు. సరే పొత్తు కుదిరిందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర ప్రకటించారు. మామూలుగా అయితే చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు ఎగిరి గంతేసినంత పనిచేసేవారు. మరి వారు ఇంకా పూర్తిగా అన్ని అంశాలు సెటిల్ కాకపోవడం వల్ల మీడియా ముందుకు రాలేదేమో తెలియదు. మూడు పార్టీలు కలిసి ప్రకటన చేస్తారని కనకమేడల తెలిపారు. ఇదంతా రాష్ట్ర ప్రయోజనాల కోసం నమ్మబలికే యత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రానికి ఏదో అన్యాయం చేస్తున్నారంట.. వీరు వచ్చి బాగు చేస్తారంట.. అప్పుడే మళ్లీ ప్రజలను మోసం చేయడానికి తయారైపోయారు. అసలు వీరు ఏ ప్రాతిపదికన పొత్తు పెట్టుకుంది తెలపడం లేదు. ప్రత్యేక హోదా, తదితర విభజన హామీలు అన్ని అప్రస్తుతమని ఆయన వ్యాఖ్యానించడం ద్వారా రాష్ట్రంపై వారికి ఉన్న శ్రద్ద ఏమిటో చెప్పకనే చెప్పారు. అధికారంపై యావతో సిద్దాంతాలు, విధానాలు.. వేటితో సంబంధం లేకుండా పొత్తు పెట్టుకోవడమే కాకుండా మళ్లీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. 2019లో ప్రత్యేక హోదాను కేంద్రం ఇవ్వనందుకే కదా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తానంటోందని కదా మీరు చెప్పింది.. కాంగ్రెస్ ఇప్పటికీ అదే మాట మీద ఉంది కదా! అయినా కాంగ్రెస్‌ను వదలి బీజేపీతో ఎందుకు అంటకాగుతున్నారు! ఇది ఫక్తు అధికార కాంక్ష కాకుండా మరేమవుతుంది? అసలు సమస్య వేరే ఉంది. చంద్రబాబు నాయుడుకు రాష్ట్రంలో ఒంటరిగా పోటీచేస్తే తుక్కు-తుక్కుగా ఓడిపోతామన్న భయం ఉంది. అందుకే ఆరుశాతం ఓట్లు ఉన్న జనసేన వెంటబడి పొత్తు పెట్టుకున్నారు. అక్కడితో ఆగకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని శరణు వేడుకున్నారు. ఒక్కశాతం ఓట్లు కూడా గత ఎన్నికలలో తెచ్చుకోలేకపోయిన బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు ఇవ్వడానికి సిద్దమయ్యారని వార్తలు వచ్చాయి. అంటే దాని అర్ధం బీజేపీని అడ్డం పెట్టుకుని తనపై ఎలాంటి కేసులు రాకుండా చూసుకోవడానికే అన్న సంగతి తెలుస్తూనే ఉంది కదా! ఆదాయపన్ను శాఖ ఇప్పటికే పంపిన నోటీసులు తన మెడపై వేలాడుతూనే ఉన్నాయి. సీబీటీడీ ప్రకటించిన రెండువేల కోట్ల రూపాయల అక్రమాల భయం వెంటాడుతూనే ఉంది. ఏపీలో బయటపడ్డ స్కిల్ స్కామ్‌తో సహా పలు కుంభకోణాలు తనకు చుట్టుకున్నాయి. తాజాగా ఐఎమ్జీ భరతభూమి కుంభకోణంలో సీబీఐ విచారణ పడుతుందేమోనన్న ఆందోళన ఉంది. వీటన్నిటినుంచి తప్పించుకోవడానికి బీజేపీతో కాళ్ల బేరానికి వెళ్లడమే శరణ్యమని చంద్రబాబు భావించి ఉండాలి. ఈ క్రమంలో బీజేపీ చిత్తశుద్దిని కూడా శంకించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో ఈ ఉదంతం అంతటిని పరిశీలిస్తే టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు ఆత్మగౌరవం లేని, పచ్చి అవకాశవాద పొత్తు అని ఇట్టే తేలిపోతోంది. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
AP: ఫెయిర్ రాజకీయం ఇలాగే ఉంటుంది మరి!
ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ను అభినందించాలి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన తీరు అభినందనీయం. ఎక్కడా ఆయన పక్షపాతానికో, పార్టీ అభిమానానికో అవకాశం ఇవ్వలేదు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కూడా మెచ్చుకోవాలి. ఫిరాయింపు వ్యవహారాలపై స్పీకర్ విధులలో జోక్యం చేసుకుని ఎలాంటి ఒత్తిడికి ఆయన అవకాశం ఇవ్వలేదు. ప్రతిపక్ష తెలుగుదేశంకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు, అధికార వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. సాధారణంగా ఇలాంటి కేసులలో సభ్యులకు ఎక్కువ అవకాశం ఇస్తుంటారు. అది కరెక్టా? కాదా? అన్నది పక్కనబెడితే చట్టం ప్రకారం అనుసరించవలసిన బాధ్యత స్పీకర్‌పై ఉంటుంది. అయినా ఏదో సాకు చూపుతూ ఫిరాయింపు సభ్యులు స్పీకర్‌కు వివరణలు ఇస్తూ పోతారు. స్పీకర్ కూడా వారు ఎలాగైనా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కనుక చూసి, చూడనట్లు వ్యవహరిస్తుంటారు. అయితే ముఖ్యమంత్రి ఒత్తిడి ఉంటే మాత్రం చకచకా అనర్హత వేటు వేస్తుంటారు. అలాగే లోక్ సభ,లేదా రాజ్యసభలలో అధికారపక్షానికి తలనొప్పి కలిగిస్తున్నారంటే మాత్రం వెంటనే అనర్హత వేటు వేస్తుంటారు. వెంకయ్యనాయుడు ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాజ్యసభలో శరథ్ యాదవ్ పదవిపై వేటు వేసిన తీరు విమర్శలకు గురి చేసింది. ఒక చోట వేరే పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా ఆయనపై వేటు వేశారు. అదే టీడీపీ సభ్యులు నలుగురు బీజేపీలో చేరితే మాత్రం దానిని విలీనంగా గుర్తించి, రాజ్యాంగ స్పూర్తిని వెంకయ్య నాయుడు నీరుకార్చారు. అయినా ఆయన ఏపీ, తెలంగాణలలో పర్యటిస్తూ ఫిరాయింపులకు వ్యతిరేకంగా, నైతిక విలువలపైన ప్రసంగాలు చేస్తుంటారు. ఇక లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సంగతి చూద్దాం. నరసాపురం లోక్ సభ సభ్యుడు రఘురామకృష్ణంరాజును అనర్హుడిని చేయండని వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసినా, పలుమార్లు గుర్తు చేసినా ఆయన ఎలాంటి చర్య తీసుకోకుండా కథ నడిపేశారు. కనీసం పార్లమెంటు గడువు ముగుస్తున్న చివరి రోజులలో సైతం ఆయనను అనర్హుడిని చేయలేదు. నైతిక విలువల గురించి సుద్దులు చెప్పే భారతీయ జనతా పార్టీ తీరు ఇలా ఉందని అనుకోవాలి. సుమారు నాలుగేళ్లుగా రఘురామకృష్ణంరాజు వైఎస్సార్సీపీ వ్యతిరేక కార్యకలాపాలలో ఉంటున్నారు. పార్టీకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నిజానికి ఆయన ఏ మాత్రం పద్దతిగల వ్యక్తి అయినా, తానే రాజీనామా చేసి ఉండాల్సింది. స్పీకర్ ఓం బిర్లా కూడా ఆయనపై చర్య తీసుకోలేదు. ఆ స్థాయిలో రఘురామకృష్ణంరాజు మేనేజ్ చేసుకోగలిగారు. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేయడమే అని చెప్పాలి. ఓం బిర్లా లోక్ సభ స్పీకర్ అయినా, ఆయన కంటే ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ బెటర్‌గా వ్యవహరించారని చెప్పవచ్చు. ఇందులో కూడా వివక్షకు తావు లేకుండా చేశారు. అధికార వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలతో పాటు, టీడీపీలో గెలిచి వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాల గిరిలపై కూడా అనర్హత వేటు వేశారు. చివరి సెషన్ తర్వాత వేసినా, దీనిని ఒక సింబాలిక్ గా తీసుకోవాలి. ఫిరాయింపులు చేస్తే ఎప్పటికైనా అనర్హత వేటు పడుతుందన్న సంకేతం వెళ్లాలి. ఇందులో ఆలస్యం చేయడం సరైనదేనా అని అడిగితే కాదని చెప్పకతప్పదు. కానీ అసలు చేయనిదానికంటే ఇది మెరుగు కదా అని సరిపెట్టుకోవాలి. టీడీపీలోకి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకుని రాజ్యసభ ఎన్నికలలో కుట్ర కథ నడపాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రయత్నించకపోలేదు. ఆయనకు అండగా ఉండే ఈనాడు రామోజీరావు కొద్దిరోజుల క్రితం ఏమి రాశారో గుర్తుకు తెచ్చుకోండి. రాజ్యసభ ఎన్నికలలో అధికారపార్టీ నిలబెట్టే అభ్యర్దులకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఓటు వేస్తారేమోనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వణికిపోతున్నారని రాశారు. అంతే తప్ప, ఫిరాయింపులను చంద్రబాబు లేదా మరెవరైనా ప్రోత్సహించడం తప్పని రాయలేదు. ఆ సమయంలో స్పీకర్ తమ్మినేని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంజాయిషీ నోటీసులు ఇవ్వగానే, దానిని వ్యతిరేకిస్తూ, రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే భయపడి ఈ నోటీసులు ఇచ్చారని టీడీపీ, ఈనాడు ప్రచారం చేశాయి. అంటే రాజ్యసభ ఎన్నికల కోసం గతంలో ఎమ్మెల్యేలను కొన్నట్లు మళ్లీ కొనుగోలు చేయాలని టీడీపీ ప్రయత్నం చేసిందన్నమాటే కదా! వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు దీనిపై కోర్టుకు కూడా వెళ్లినా ఫలితం దక్కలేదు. తదుపరి బలం లేకపోయినా, రాజ్యసభకు పోటీచేయాలనుకున్న టీడీపీ తోక ముడవడం ఈనాడుకు పెద్ద షాక్ అయింది. తాము అనుకున్నట్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి వణకలేదే అని తెగ బాధపడింది. ఈ నేపథ్యంలో పలుమార్లు వాయిదాల తర్వాత తమ్మినేని సీతారామ్ అనర్హత వేటు వేశారు. అధికార పార్టీకి మద్దతు ఇచ్చిన నలుగురు ఎమ్మెల్యేలపై వేటు పడడం వైఎస్సార్సీపీకి కాస్త ఇబ్బందే. అయినా విలువలకు కట్టుబడి వారిని అనర్హులను చేశారు. దీంతో టీడీపీ ఎలాంటి విమర్శలను చేయలేకపోయింది. గత టరమ్‌లో కోడెల శివప్రసాదరావు స్పీకర్‌గా ఉన్నప్పుడు తెలుగుదేశంకు అమ్ముడుపోయిన 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై చర్య తసుకోవాలని ఆ పార్టీ గట్టిగా కోరినా ఆయన వారిపై అనర్హత వేటు వేయలేకపోయారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు ఫిరాయింపు దారులకు మద్దతుగా నిలవడమేకాకుండా, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం కూడా అని చెప్పాలి. విలువల గురించి కథలు చెప్పే చంద్రబాబు ఇంత అనైతికంగా వ్యవహరించినా, శాసనసభలో సభ్యుల ప్రవర్తన గురించి సంపాదకీయాలు రాసి, నీతులు చెప్పే రామోజీరావు టీడీపీ హయాంలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఒక్క విమర్శ చేయలేదు. అది ఆయన చిత్తశుద్ది. పైగా ఆ రోజులలో చంద్రబాబు చేస్తున్న అభివృద్దిని చూసి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎగబడి వస్తున్నట్లుగా పిక్చర్ ఇచ్చేవారు. 1995లో టీడీపీ వ్యవస్థాపకుడు, ఆనాటి ముఖ్యమంత్రి ఎన్.టి రామారావును పదవినుంచి లాగిపడేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ ఫిరాయింపు చట్టాన్ని ఆసరాగా చేసుకుని, ఎన్.టి ఆర్ పక్షాన ఉన్న కొందరుఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడానికి యత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు టీడీపీకి మెజార్టీ వచ్చేసినందున, ఎన్.టి.ఆర్ గ్రూపులో ఉండేవారిపై అనర్హత వేటు పడుతుందన్న భయాన్ని కల్పించేవారు. తద్వారా అందరూ తనవైపు వచ్చేలా చేసుకున్నారని అంటారు. టెక్కలి ఉప ఎన్నికలో గెలిచిన అప్పయ్యదొర చాలారోజులు చంద్రబాబు గ్రూపునకు వ్యతిరేకంగా ఉండేవారు. ఆ టైమ్‌లో ఆయనకు ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఆనాటి స్పీకర్ యనమల నోటీసు ఇచ్చినట్లు గుర్తు. కొంతకాలం విచారణ కూడా చేశారు. తదుపరి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్పప్పుడు టీఆర్ఎస్కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. వారిని నేరుగా పార్టీలోకి వైఎస్ తీసుకోలేదు. అయినా వారు ఒక ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటు వేశారన్న కారణంగా అనర్హత వేటుకు గురయ్యారు. దానిపైన సుదీర్ఘకాలం వాదోపవాదాలు సాగాయి. చివరికి ఆనాటి స్పీకర్ సురేష్ రెడ్డి అనర్హత వేటు వేశారు. వేటు పడడానికి ఒకరోజు ముందు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాలలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటువేసిన వారిపై వెంటనే వేటు వేయడానికి అప్పటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ జంకారు. ఉప ఎన్నికలు జరగడానికి అవకాశం లేదనుకునే సమయం వరకు వేచి చూసి ఆ తర్వాత చర్య తీసుకున్నారు. దానికి కారణం అప్పట్లో సొంత పార్టీ పెట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డికు మద్దతుగా రాజీనామా చేసిన పద్దెనిమిది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో జరిగిన ఉప ఎన్నికలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేవలం రెండు మాత్రమే గెలుచుకోవడం. దాంతో అవిశ్వాసానికి మద్దతు ఇచ్చిన సుమారు ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్య తీసుకోకుండా కాలయాపన చేసి, కొత్త రాజకీయం చేశారు. కానీ వైఎస్ వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను ముఖ్యమంత్రి అయ్యాక అలాంటి అన్ ఫెయిర్ రాజకీయాలకు తావివ్వడం లేదు. ప్రతిపక్ష టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నా వారిని ఆకర్షించడానికి, కొనుగోలు చేయడానికి ఎక్కడా ప్రయత్నించలేదు. నలుగురు మాత్రం తమంతట తాము వైఎస్సార్సీపీకి మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వారిని కూడా అధికారికంగా పార్టీలో చేర్చుకోలేదు. వైఎస్సార్సీపీలో అసమ్మతి ఎమ్మెల్యేలుగా మారిన నలుగురిపై కూడా స్పీకర్ ప్రత్యేకంగా చర్య తీసుకోలేదు. మొత్తం ఎనిమిది మందిపై కలిపి ఓకేసారి స్పీకర్ తమ్మినేని సీతారామ్ అనర్హత వేటు వేశారు. కాగా మరో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సుమారు రెండేళ్ల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దానిని ఆయన ఉపసంహరించుకోలేదు. స్పీకర్ ఫార్మాట్లో చేసిన రాజీనామాను అమోదించాలని కోరుతున్నట్లు ఆయన ప్రకటనలు కూడా చేశారు. దాంతో కొద్దికాలం క్రితం స్పీకర్ తమ్మినేని ఆమోదించడంపై మాత్రం గగ్గోలు పెట్టారు. రాజ్యసభ ఎన్నికలలో వైఎస్సార్సీపీకి లబ్ధి కోసమే ఇలా ఆమోదించారని ఆరోపించారు. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా ఉత్తుత్తిగానే రాజీనామా చేశారని అనుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనా ఏపీ అసెంబ్లీ స్పీకర్ అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఒకేసారి చర్య తీసుకుని కొత్త ప్రమాణం నెలకొల్పారని చెప్పాలి. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయుల -
Fact Check: పచ్చ‘రోగం’ ముదిరింది
గురివింద రామోజీ అర్జంటుగా కళ్లద్దాలు మార్పించుకుంటే బావుంటుంది. చూపు మందగించడంతో రాష్ట్రంలో అభివృద్ధిని ఎటూ చూడలేకపోతున్న ఈ రాజగురువు ప్రజల రోగాలతో కూడా ఆడుకోవడం దుర్మార్గం. గత ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చి.. ఉద్దానం సమస్యకు పరిష్కారం చూపకపోతే పల్లెత్తు మాట అనని రామోజీ.. ఇప్పుడు కిడ్నీ పరిశోధన కేంద్రం, రీసెర్చ్ సెంటర్ అందరి కళ్లెదుటే అద్భుత పనితీరు కనబరుస్తున్నా కుళ్లుబోతు రాతలు రాస్తున్నారు. ఇదివరకెన్నడూ లేని విధంగా సీఎం వైఎస్ జగన్ ఏకంగా కిడ్నీ వ్యాధిపై యుద్ధమే ప్రకటించి, ఉద్దానంకు ఆరోగ్య భరోసా కల్పించడం పట్ల యావత్ ప్రపంచం ప్రశంసిస్తుంటే రామోజీ మాత్రం తప్పుడు కథనాలు వండివారుస్తున్నారు. దుర్మార్గానికి కూడా ఓ హద్దు ఉంటుంది. రామోజీ ఈ హద్దును కూడా దాటేసి చంద్రబాబు కోసం బరితెగించారు. ఈయన గారి పచ్చ రోగానికి త్వరలో ప్రజలే తగిన వైద్యం చేయడం ఖాయం. సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: చంద్రబాబు అధికారంలో ఉండగా ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశాడు. కొన్ని దశాబ్ధాలుగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపడంలో పూర్తిగా విఫలం అయ్యారు. బాబుకు తొత్తుగా ఉన్న రామోజీరావుకు అప్పట్లో చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు. ప్రజాశ్రేయస్సు పట్ల కమిట్మెంట్ ఉన్న సీఎం జగన్ కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే ఉద్దానం ప్రాంత సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపారు. బాబు చేయలేనిది సీఎం జగన్ చేసి చూపించడంతో రామోజీరావుకు కన్నుకుట్టింది. దశాబ్ధాల సమస్యలను అనతికాలంలోనే పరిష్కరించిన సీఎం జగన్‌కు, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ పెరిగి, టీడీపీ కనుమరుగు అవుతుందని భయం పట్టుకుంది. దీంతో తన ‘ఛీ’నాడులో ‘కిడ్నీ రోగం పిండేస్తోంది’ అంటూ మంగళవారం ఓ కట్టుకథను రామోజీ అల్లాడు. కిడ్నీ వ్యాధిగ్రస్తులను సీఎం జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. బాబే వాళ్లను ఉద్దరించాడంటూ సన్నాయి నొక్కుడు రాతలు రాసుకొచ్చారు. ఈ రాతలను చూసి ఉద్దానం ప్రాంత వాసులతో పాటు, రాష్ట్ర ప్రజలు పచ్చపత్రికను ఛీదరించుకుంటున్నారు. రాష్ట్రంలో కిడ్నీ బాధితులను నిర్లక్ష్యం చేసింది.. మీ బాబు కాదా రామోజీరావ్ అని ప్రశ్నిస్తున్నారు. కళ్లెదుటే ప్రాజెక్టులుంటే కబోది రాతలా.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపుతానని 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక అడుగులు ముందుకు వేశారు. పలాసలో రూ. 85 కోట్లతో వైఎస్సార్ కిడ్నీ పరిశోధనా కేంద్రం, మరొకటి రూ. 700 కోట్లతో వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు. ఈ వ్యాధిపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. సుజలధార ప్రాజెక్ట్ ద్వారా కిడ్నీ ప్రభావిత పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలో 7 మండలాల్లోని 807 గ్రామాలకు రక్షిత నీటి సరఫరా చేపడుతున్నారు. 6.78 లక్షల జనాభా 2051 నాటికి 7.85 లక్షలకు చేరుతుందన్న అంచనాతో అప్పటి అవసరాలకు కూడా సరిపోయేలా ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున నీటి సరఫరా చేసేలా ప్రాజెక్టు నిర్మించారు. కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్ల ఏర్పాటు చేశారు. విరివిగా కేంద్రాలు నెలకొల్పి.. ప్రస్తుతం టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆస్పత్రుల్లో డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. 63 మెషిన్లతో 68 పడకలపై డయాలసిస్ అందిస్తున్నారు. సోంపేట సీహెచ్‌సీ డయాలసిస్ సెంటర్లలో గతంలో 13 పడకలు ఉండేవి. ఇప్పుడవి 19కి పెరిగాయి. కవిటి సీహెచ్‌సీ డయాలసిస్ సెంటర్లలో గతంలో 10 పడకలు ఉండేవి. ఇప్పుడవి 15కి పెరిగాయి. హరిపురంలో కొత్తగా 10 పడకలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు. కొత్తగా గోవిందపురం, అక్కుపల్లి, కంచిలి, బెలగాంలో డయాలసిస్ సెంటర్లు మంజూరయ్యాయి. ఇవికాకుండా రెండు కంటైన్డ్ బేస్డ్ సర్వీసెస్ డయాలసిస్ యూనిట్లను ఏర్పాటు చేశారు. టీడీపీ హయాంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు 37రకాల మందులను అందుబాటులో ఉంచారు. రోగులకు వైద్య పరీక్షల కోసం సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్‌ను ఉద్దానం పరిధిలో ఉన్న 29ల్యాబ్‌లలో అందుబాటులో ఉంచారు. టీడీపీ హయాంలో జిల్లా నెఫ్రాలజీ విభాగమే లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక శ్రీకాకుళం జీజీహెచ్‌లో నెఫ్రాలజీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. పలాసలో కిడ్నీ ఆస్పత్రి నిర్మించాక స్పెషలిస్ట్‌లతో పాటు మొత్తంగా 17 మంది వైద్యులు, స్టాఫ్ నర్సులు 60 మంది, డీడీఏ స్టాఫ్ 50 మంది, సపోర్టింగ్ స్టాఫ్ 20 మంది సేవలు అందిస్తున్నారు. మొత్తం ఆస్పత్రిలో 195 పోస్టులు మంజూరుకాగా ప్రస్తుతం 127 పోస్టులను భర్తీ చేయడం జరిగింది. మిగతావి భర్తీ చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దాన ప్రాంతంలోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపు కొత్తూరు, పలాస తదితర 7 మండలాలు, ఇచ్ఛాపురం, పలాస మున్సిపాలిటీల్లో మొత్తం 807 హేబిటేషన్ల పరిధిలో కిడ్నీ రోగులున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కచ్చితంగా స్క్రీనింగ్ క్రమం తప్పకుండా వైద్యారోగ్య శాఖ సిబ్బందితోనే నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న మొత్తం 4,34,925 మంది జనాభాలో ఇప్పటివరకు 30,612 మందికి స్క్రీనింగ్ పూర్తి చేశారు. సీరమ్ క్రియాటిన్ సికెడి (క్రిటికల్ కిడ్నీ డిసీజ్) కేసులు సుమారుగా 3 వేల మందిని గుర్తించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో నిర్వహించిన వైద్యశిబిరాల్లో సుమారు 49,021 మంది ఓపి చూపించుకున్నారు. ఇందులో ఇప్పటివరకు 474 మందిని సికెడి అనుమానితులుగా గుర్తించారు. 2018లో టీడీపీ హయాంలో ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ రోగాలకు అసలైన కారణాల పరిశోధనకు అప్పటి ప్రభుత్వం జార్జి ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందంతో రూ.5 కోట్ల చెల్లింపునకు ఎంవోయు కుదుర్చుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాచింగ్ గ్రాంట్ నిధులు విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది. జాతీయ హెల్త్ మిషన్ ద్వారా రూ.2 కోట్లను విడుదల చేసింది. మిగిలిన నిధులు విడుదల చేయలేదు. ప్రభుత్వం మారిపోగా...కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఎన్హెచ్ఎం నుంచి నిధులను సదరు జార్జి సంస్థకు పరిశోధనకై నిధులు కేటాయించేది లేదని స్పష్టం చేసింది. దీంతో మిగిలిన నిధులు ఆ సంస్థకు సర్దుబాటు కాలేదు. కొండూరు బాధితులకు కొండంత అండ ఎన్టీఆర్ జిల్లా కొండూరు ప్రాంత కిడ్నీ బాధితులకు ఈ ప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తోంది. ఎ.కొండూరు, తిరువూరుల్లో కొత్తగా డయాలసిస్ సెంటర్లను నెలకొల్పింది. కొండూరు చుట్టుపక్కల తండాల్లో 30 ఏళ్లు పైబడిన వారందరికీ రక్త పరీక్షలను నిర్వహించి కిడ్నీ సమస్యలున్న వారిని గుర్తించింది. కిడ్నీ బాధితులకు రూ.వేల ఖరీదు చేసే మందులను ఉచితంగా సరఫరా చేస్తోంది. తిరువూరు, విజయవాడకు డయాలసిస్, ఇతర వైద్య సేవలు అవసరం ఉన్న కిడ్నీ బాధితులకు ఉచిత రవాణా కోసం ప్రత్యేకంగా ఓ అంబులెన్స్‌ను ఎ.కొండూరులో అందుబాటులో ఉంచింది. కిడ్నీ కేసులు నమోదు అవుతున్న గ్రామాలన్నింటికీ రక్షిత మంచినీటి ట్యాంకర్ల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం పరిసర ప్రాంతాల్లో కిడ్నీ బాధితులకు వైద్య సేవలను చేరువ చేయడంలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేసిన మార్కాపురం బోధనాస్పత్రిలో యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాలను ప్రభుత్వం మంజూరు చేసింది. పింఛన్ పెంచి.. బాసటగా నిలచి కిడ్నీ బాధితులకు గత ప్రభుత్వంలో రూ.2500 ఉన్న పింఛన్‌ను ఏకంగా రూ.10 వేలకు పెంచింది. . ప్రభుత్వం వ్యాధి తీవ్రత ఆధారంగా రెండు రకాలుగా పింఛన్లు అందజేస్తుస్తోంది. 5పైబడి సీరం క్రియేటినైన్ ఉన్న వారికి రూ.5వేలు, డయాలసిస్ రోగులకు రూ. 10వేల పింఛను ఇస్తున్నారు. ఈ లెక్కన ప్రస్తుతం 831మందికి రూ.10వేలు చొప్పున, 451 మందికి రూ.5వేలు ఇస్తున్నారు. ఈ రకంగా ఎంతమందికైనా మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలా కిడ్నీ బాధితులకు ప్రతి అడుగులో ప్రభుత్వం అండగా నిలుస్తుంటే రామోజీ వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. -
నాదెండ్ల బుకాయింపు.. రామోజీ దరువు!
సాక్షి, అమరావతి: బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నాడట! చంద్రబాబుతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ నోటికొచ్చిన అబద్ధాలు వల్లిస్తే రాజగురువు రామోజీ తాటికాయంత అక్షరాలతో ముద్రించి మురిసిపోయారు! సలహాదారుల పేరుతో 89 మందిని నియమించారని.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.680 కోట్లు వ్యయం చేసిందని.. ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డికే రూ.140 కోట్లు చెల్లించారంటూ నాదెండ్ల గాలి కబుర్లు చెప్పారు.అసలు ప్రభుత్వం నియమించిందే 46 మంది సలహాదారులైతే మిగతావారంతా ఎక్కడి నుంచి వచ్చినట్లు? నాదెండ్ల ఆరోపణల్లో నిజం లేదని ఇక్కడే తేలిపోతోంది. నెలకు రూ.లక్షన్నర లోపే జీతభత్యాల రూపంలో చెల్లిస్తుండగా ఏకంగా రూ.వందల కోట్లు ఇస్తున్నారంటూ నిస్సిగ్గుగా అబద్ధాలను ప్రచురించారు.రాష్ట్ర ప్రభుత్వం ఏ హోదాలో సలహాదారులను నియమిస్తోంది? వారికి వేతనాలు, భత్యాల రూపంలో ఎంత చెల్లిస్తున్నారు? అనే వివరాలు జీవోల రూపంలో పారదర్శకంగానే ఉన్నా గోప్యంగా దాచిపెడుతున్నట్లు ఎల్లో మీడియా దుష్ప్రచారానికి తెగబడుతోంది. 2023–24లో మంత్రులు, చైర్మన్లు, సలహాదారుల కోసం బడ్జెట్ కేటాయింపులే రూ.29.61 కోట్లు అయినప్పుడు ఒక్క సలహాదారులకే రూ.వందల కోట్లు చెల్లించడం ఎలా సాధ్యమవుతుందని అధికార యంత్రాంగం విస్మయం వ్యక్తం చేస్తోంది. ♦ రాష్ట్రప్రభుత్వం ఐదు కేటగిరీలుగా సలహాదారులను నియమిస్తోంది. కేటగిరీ ‘ఎస్’ కింద నియమితులైన వారికి క్యాబినెట్ ర్యాంక్ ప్రోటోకాల్ మాత్రమే ఉంటుంది. వారికి సిబ్బంది కానీ జీతభత్యాలు కానీ ఉండవు. క్యాబినెట్ ర్యాంక్ ఉన్న సలహాదారులకు క్యాబినెట్ మంత్రులతో సమానంగా వసతులు క ల్పిస్తారు. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ఎలాంటి గౌరవ వేతనాలు లేకుండా సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు. ♦చంద్రబాబు అధికారంలో ఉండగా రాజధాని డిజైన్ల పేరుతో ప్రచార ఆర్భాటం కోసం కన్సల్టెన్సీలు, సలహాదారులకు రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని గుమ్మరించారు. నార్మన్ ఫోస్టర్, సుర్బానా జురాంగ్ తదితర కన్సల్టెన్సీ సంస్థలు ఈ జాబితాలోనే ఉన్నాయి.పోలవరం సందర్శన పేరుతో చంద్రన్నకు జయము జయము అంటూ సొంత ప్రచారం కోసం బస్సుల్లో జనాన్ని తరలించేందుకు డబ్బులను నీళ్లలా ఖర్చు చేశారు. గోదావరి, కృష్ణా పుష్కరాల సమయంలో షూటింగ్‌లను తలపిస్తూ సినీ దర్శకుడితో డ్రోన్లతో చిత్రీకరణకు విచ్చలవిడిగా ఖర్చు చేయడంతోపాటు అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. ఇప్పుడు గుండెలు బాదుకుంటున్న రామోజీగానీ నాదెండ్లగానీ అప్పుడు నోరెత్తితే ఒట్టు!.ఫేక్ ప్రచారంఎల్లో మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్న టీడీపీకి ఈసారి కూడా ప్రజలు దిమ్మతిరిగే తీర్పు ఇవ్వడం ఖాయమని, శాశ్వత సమాధి తప్పదని వైఎస్సార్సీపీ శుక్రవారం ట్విట్టర్లో పేర్కొంది. సలహాదారులకు రూ.వందల కోట్లు చెల్లిస్తున్నారంటూ నిస్సిగ్గుగా అబద్ధాలను వల్లిస్తున్నారని మండిపడింది. -
రేవంత్ రెడ్డి ఫోకస్ మారితేనే మంచిది!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును బెదిరిస్తున్నట్లుగా ఉంది. పులి బయటకు వస్తే బోనులో బంధిస్తామని చెప్పడం ద్వారా తన ఉద్దేశాన్ని ఆయన వెల్లడించారు. లండన్‌లో తన అభిమానులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. బీఆర్ఎస్ను వచ్చే పార్లమెంటు ఎన్నికలలో వంద మీటర్ల లోతున పాతిపెడతామని కూడా ఆయన అన్నారు. లండన్ నుంచే ఆయన పార్లమెంటు ఎన్నికల ప్రచారం ఆరంభించినట్లు అనిపిస్తుంది. నిజానికి విదేశాలకు వెళ్లినప్పుడు తన ప్రభుత్వం ఏమి చేస్తుందో చెప్పడానికి సహజంగా యత్నిస్తారు. తన లక్ష్యాలను వివరిస్తారు. కాని రేవంత్ తన స్పీచ్‌లో కేసీఆర్‌ను, కేటీఆర్, హరీష్ రావులను టార్గెట్‌గా చేసుకుని మాట్లాడినట్లు అనిపిస్తుంది. రాజకీయాలలో ఎవరు ఎప్పుడు పులి అవుతారో, ఎప్పుడు పిల్లి అవుతారో చెప్పలేం. ఎవ్పుడైనా ,ఎవరైనా, ఏమైనా కావచ్చు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ రేవంత్ రెడ్డే. 2015లో ఆయన ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని జైలుపాలైనప్పుడు ఆయన భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపించింది. శాసనసభ నుంచి ఆయన బహిష్కరణకు కూడా గురయ్యారు. తదుపరి 2018లో కొడంగల్ నుంచి శాసనసభకు పోటీ చేసి ఓటమి చెందారు. అప్పుడు రేవంత్ రాజకీయంగా బాగా వెనకబడి పోయినట్లు అనిపించింది. కాని అదృష్టం కలిసి వచ్చి మల్కాజిగిరి నుంచి స్వల్ప ఆధిక్యతతో లోక్‌సభకు గెలవడం ఆయన రాజకీయ జీవితంతో ఒక పెద్ద మలుపు అయింది. తదుపరి రేవంత్ ఏకంగా పీసీసీ అధ్యక్షుడు అవడం, అనంతరం ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రి కావడం జరిగింది. రేవంత్ పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పై చాలా దురుసుగా మాట్లాడేవారు. కొన్నిసార్లు ఆయన భాషపై అభ్యంతరాలు వచ్చేవి. అయినా రేవంత్ తగ్గలేదు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి. ఆయనపై విమర్శలు బీఆర్ఎస్ వంతుగా మారింది. కేసీఆర్ ఇంతవరకు ఒక్క మాట కూడా అనలేదు. ఆయన కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ కాని, మాజీ మంత్రి హరీష్ రావు కాని కాంగ్రెస్ హామీలను పదే, పదే గుర్తు చేస్తున్నారు. ప్రజలలో ప్రభుత్వంపై అసమ్మతి, అసంతృప్తి పెరిగేలా ఉపన్యాసాలు ఇస్తున్నారు. అది రేవంత్‌కు గుర్రుగానే ఉంటుంది. ఆయన మంత్రివర్గ సహచరుల ఫీలింగ్ కూడా అలాగే ఉంటుంది. ఆ క్రమంలోనే రేవంత్ తనదైన శైలిలో కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. 'ఎన్నికలలో బీఆర్ఎస్ బొక్కబోర్లాపడ్డా బుద్ది రాలేదు. పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ ఆనవాళ్లు కనిపించకుండా వంద మీటర్ల లోతున బొందపెడతాం. పులి బయటకు వచ్చేస్తోందంటూ బీఆర్ఎస్ వాళ్లు మాట్లాడుతున్నారు. అందుకోసమే ఎదురుచూస్తున్నా.. నా దగ్గర బోను, వల ఉన్నాయి..' అని ఆయన వ్యాఖ్యానించడం ఆసక్తికరమైన అంశమే. అంటే దీని అర్ధం కాలు జారి పడ్డ కేసీఆర్ కోలుకుని మళ్లీ ప్రజాజీవనంలోకి వస్తే ఆయనను ఏదో కేసులో పెట్టి అరెస్టు చేస్తామని చెప్పడమేనా అన్న ప్రశ్న వస్తుంది. కాకపోతే, ఆ మాట ఆయన నేరుగా చెప్పలేదు. కేసీఆర్ ప్రభుత్వంలోని అవినీతిపై చర్చ జరగకూడదని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రజలకు తెలియచేయరాదన్నట్లుగా బీఆర్ఎస్ నాయకత్వం ప్రవర్తిస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. నిజమే! కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆత్మరక్షణలో ఉన్న బీఆర్ఎస్ ఆ విషయం తప్ప మిగిలిన అంశాలపైనే కేంద్రీకరిస్తుంది. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పదే, పదే ప్రస్తావించడం ద్వారా రేవంత్‌ను ఇరకాటంలోకి నెట్టడానికి కేటీఆర్, హరీష్‌రావు ఇతర నేతలు వ్యవహరిస్తారు. కేసీఆర్ ఇప్పుడిప్పుడే కోలుకుని వాకర్ సాయంతో నడుస్తున్నారు. ఆయన తక్షణమే ప్రజలలో తిరగాలని అనుకోకపోవచ్చు. మహా వస్తే పార్టీ ఆఫీస్‌కు వచ్చి కాసేపు కూర్చుని వెళ్లవచ్చు. ఎటూ మరో మూడు నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ తేల్చుకుందామని రేవంత్ అన్నట్లుగానే కేసీఆర్ కూడా అందుకు సిద్దం అవుతుండాలి. ఈలోగానే మాటల యుద్దంలో పైచేయి సాధించడానికి ఇరుపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. బీఆర్ఎస్ కు కాళేశ్వరం వీక్ పాయింట్ అయినట్లుగానే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆరు గ్యారంటీలు, ఇతర హామీలు వీక్ పాయింట్లు అవుతాయి. వాటిని అమలు చేయలేక ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దానిని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ పైన, బీఆర్ఎస్ నేతలపైన విమర్శలు చేస్తున్నారన్న భావన ఏర్పడుతుంది. ఇంతవరకు ఆర్టీసీ బస్‌లలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని అమలు చేశారు. దీనివల్ల మొదట కాస్త ఆకర్షణ ఏర్పడినా, రానురాను అది తగ్గుతోందన్న అభిప్రాయం కలుగుతోంది. బస్‌లలో సీట్లు చాలకపోవడం, అందరిని ఎక్కించుకోకపోవడం, అన్ని బస్ లలో ఈ సదుపాయం లేకపోవడం, ఈ స్కీమ్ వల్ల పెద్దగా ప్రయోజనం లేదని అనుకునే పరిస్థితి ఏర్పడుతోంది. దీనికన్నా వంట గ్యాస్ సిలిండర్‌ను 500 రూపాయలకే ఇచ్చే స్కీమ్ అమలు చేసి ఉంటే రేవంత్ ప్రభుత్వానికి ప్రజలలో ప్రత్యేకించి పేదవర్గాలలో గుడ్ విల్ పెరిగేది. కాని ఆ స్కీమ్ అమలు చేయాలంటే డబ్బు కూడా ఎప్పటికప్పుడు చెల్లించవలసి ఉంటుంది. గ్యాస్ సిలిండర్ల వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు. సుమారు కోటి మంది వరకు ఆ స్కీమ్ కింద సిలిండర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికి ఏడాది అయ్యే వ్యయం సుమారు 2500 కోట్లు అని అంచనా వేశారు. దీనితో పాటు వృద్దులకు పెన్షన్ నాలుగువేల రూపాయలు ఇవ్వవలసి ఉంది. రెండు లక్షల రూపాయల రుణమాఫీ, రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయవలసిన వాగ్దానాల జాబితా చాంతాడు అంత అవుతుంది. ఈ నేపధ్యంలోనే కేటీఆర్ ఒక పిలుపు ఇచ్చారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ అని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందువల్ల జనవరి బిల్లులను చెల్లించవద్దని, ఆ బిల్లులను సోనియాగాంధీ చిరునామాకు పంపించాలని ఆయన ప్రజలకు సూచించారు. వీటిని గుర్తు చేస్తే కాంగ్రెస్ నేతలకు కోపం వస్తుంది. ఎందుకంటే వీటన్నిటిని అమలు చేయడం సాధ్యం కాదని వారికి తెలుసు కాబట్టి. బీఆర్ఎస్ ను వంద మీటర్ల లోతున బొందపెట్టడం సరే కాని, ముందుగా వంద రోజుల లోపు హామీలను అమలు చేయాలని, రేవంత్ మాదిరి అహంకారంగా మాట్లాడేవారిని చాలామందిని చూశామని ఆయన అన్నారు. కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ప్రతిపక్షంపై వ్యాఖ్యలు చేసేవారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి రావవడంతో వాటి రుచిని ఆయన చవిచూస్తున్నారు. రేవంత్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాధ్ షిండేతో పోల్చుతూ ఎప్పటికైనా కాంగ్రెస్‌ను చీల్చుతారన్నట్లుగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్‌ది బీజేపీ రక్తమని కూడా ఆయన అన్నారు. రాజకీయంగా చూస్తే ఒకప్పుడు కేసీఆర్ కూడా టీడీపీవారే. అలాగే రేవంత్ కూడా తొలుత ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తి అయినా, ఆ తర్వాత టీడీపీలోకి వచ్చి తదుపరి కాంగ్రెస్‌లో చేరారు. కేసీఆర్ సొంతంగా పార్టీని పెట్టుకున్నారు. రేవంత్‌కు కాంగ్రెస్‌ను చీల్చవలసిన అవసరం ఎందుకు వస్తుందో తెలియదు. ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి దించివేస్తే అప్పుడు అలా అవుతారని చెప్పడం కేటీఆర్ ఉద్దేశం కావచ్చు. కాని ఇదేదో ఊహాజనిత విమర్శగా కనిపిస్తుంది. అయితే వచ్చే పార్లమెంటు ఎన్నికలు అటు రేవంత్ కు, ఇటు కేసీఆర్ కు ఇద్దరికి ప్రతిష్టాత్మకమే. మధ్యలో బీజేపీ తన వంతు గెలుపుకోసం ప్రయత్నిస్తుంది. మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోలేకపోతే అప్పుడు ఆ పార్టీలో అసమ్మతి పెరిగితే పెరగవచ్చు. ఎక్కువ స్థానాలు గెలిస్తే మాత్రం రేవంత్‌కు డోకా ఉండదనే చెప్పాలి. కేసీఆర్ కు కూడా పరీక్ష సమయమే. గౌరవప్రదమైన సంఖ్యలో లోక్ సభ సీట్లు గెలుచుకోలేకపోతే బీఆర్ఎస్ క్యాడర్ కు భవిష్యత్తుపై అనుమానాలు వస్తాయి. మరో నాలుగేళ్లపాటు పార్టీని నడపడానికి చాలా కష్టాలు పడవలసి ఉంటుంది. ఎందుకంటే గతంలో మాదిరి సెంటిమెంట్‌తో రాజకీయాలు చేయడం అంత తేలిక కాకపోవచ్చు. రేవంత్ డావోస్ పర్యటనలో వచ్చిన పెట్టుబడులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్దం జరిగింది. రేవంత్ గతంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదానిని విమర్శించేవారు. ఆ మాటకు వస్తే రాహుల్ గాంధీ సైతం ఆదానిపై విరుచుకుపడుతుంటారు. డావోస్ లో మాత్రం అదానిని రేవంత్ కలవడం సహజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కాంగ్రెస్ తన విధానం మార్చుకుందా? లేక అవకాశవాదంతో పోతోందా అనే సందేహం వస్తుంది. మూసి నదికి సంబంధించి శుద్ది చేయాలన్న ఆలోచనలు బాగానే ఉన్నాయి. లండన్‌లో దీనిపై చర్చలు జరిపే నెపంతో ఎమ్.ఐ.ఎమ్. నేత అక్బరుద్దీన్ ఓవైసీని పిలిపించుకోవడంలో రాజకీయం కూడా ఉంటుందన్నది బహిరంగ రహస్యమే. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. రేవంత్ రెడ్డిని తన బ్లాక్ మెయిల్ ద్వారా ఒక మీడియా యజమాని ఇప్పటికే లొంగదీసుకున్నారని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. అదే కొనసాగితే రేవంత్ కు కొత్త చిక్కులు రావచ్చు. ప్రస్తుతం రేవంత్‌కు ఆ మీడియా పెట్టే జాకీలపై ఆధారపడకుండా, తన స్వశక్తి ద్వారా ప్రజలలో ఆదరణ పొందగలిగితేనే నిలబడగలుగుతారు.లేకుంటే రాజకీయంగా చేదు అనుభవాలు ఎదురు అవుతాయి. ఉదాహరణకు మల్కాజిగిరి లోక్ సభ స్థానంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్కచోట కూడా కాంగ్రెస్ గెలవలేదు. గతసారి ఇక్కడ నుంచే రేవంత్ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఈసారి జరిగే ఎన్నికలలో అదే పరిస్థితి ఎదురైతే ఆయన నైతికంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. మరో సంగతి ఏమిటంటే రేవంత్ రెడ్డి ఇటీవల ప్రధాని మోదీని కలిసినప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికు వ్యతిరేకంగా మాట్లాడినట్లు, అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఫర్వాలేదు కాని, బీఆర్ఎస్ మాత్రం ఉండకూడదన్నట్లు మాట్లాడినట్లు తోక పత్రిక యజమాని ప్రచారం చేస్తున్నారు. నిజంగా మోదీ ఒక కాంగ్రెస్ నేతతో అలా అంటారా అన్నది డౌటే. కల్పిత కధలు రాయడంలో దిట్టగా పేరిందిన ఈయన మాటలు జనం ఎవరూ నమ్మరు. అలాగే టీడీపీకి మద్దతు ఇచ్చే మరో పత్రిక పట్ల కూడా రేవంత్ వ్యవహరించే శైలిని కూడా ప్రజలు గమనిస్తారు. ఉదాహరణకు రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఒక ప్రమాదంలో ఒక ప్రముఖ కంపెనీ సీఈఓ మరణించారు. ఈ కేసును రేవంత్ ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందన్నది కూడా చర్చనీయాంశంగా ఉంది. రేవంత్ తమ చెప్పుచేతలలో ఉన్నాడని ఆ పత్రిక యాజమాన్యం భావిస్తోందని చెబుతారు. ఇలా తెలుగుదేశం మీడియా గుప్పిట్లోనే రేవంత్ కనుక కొనసాగితే భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందులు వస్తాయి. వారితో తగాదా తెచ్చుకోవాలని చెప్పడం లేదు కాని వారి ఆటలకు అనుగుణంగా రేవంత్ డాన్స్ చేస్తే మాత్రం అప్రతిష్టపాలవుతాడని చెప్పకతప్పదు. మొత్తం మీద చూస్తే బీఆర్ఎస్ తనపై ఆరోపణలు జనంలోకి వెళ్లకుండా చూడడానికి విశ్వయత్నం చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోతే బాగుండు అన్నట్లుగా వ్యవహరిస్తుందని భావించవచ్చు. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
రోత రాతల రామోజీ.. మంచి జరిగితే నచ్చదా?: మంత్రి వేణు
సాక్షి, విజయవాడ: ఈ సమాజం ఎదగకూడదనేదే ఈనాడు పత్రిక ఆలోచన అంటూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. రామోజీకి మంచి జరిగితే నచ్చదని, చంద్రబాబుకు మద్దతుగా రాసేవన్నీ రోతరాతలేనని మత్రి దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమ్మ ఒడితో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జరిగిందని, ఈ సమాజానికి నీ రాతల వల్ల ఇచ్చే సందేశమేంటి రామోజీ.. అంటూ పశ్నించారు. చంద్రబాబు చెప్పే అబద్ధాలను రాయడమే నీ పనా.. 2024లో నీ రోత రాతలకు కాలం చెల్లుతుంది. లక్షలాది మంది వస్తే తట్టుకోలేక తప్పుడు వార్తలు రాస్తావా? బాధ్యత మరిచి వార్తలు రాస్తున్న ఈనాడుని బహిష్కరించే రోజులు దగ్గర్లో ఉన్నాయ్. ఈనాడు వార్తలు అంబేద్కర్‌ను అవమానించినట్లుగానే మేం భావిస్తున్నాం. ఈనాడు పత్రిక తక్షణమే డా.బి.ఆర్.అంబేద్కర్‌కు క్షమాపణ చెప్పాలి’’ అని మంత్రి వేణు మండిపడ్డారు. -
Fact Check: మీ అబద్ధాలకే లేదు హద్దు
విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండడమే కాదు.. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు, రైతుల అభ్యున్నతికి పాటుపడుతూ వ్యవసాయ, అనుబంధ రంగాల్లో స్పష్టమైన మార్పునకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాలు (ఆర్బీకేలు). దేశానికే ఇవి ఆదర్శంగా నిలుస్తూ రైతులకు అన్ని విధాలుగా భరోసా కల్పిస్తుంటే మెచ్చుకోవాల్సింది పోయి.. ఎలాగైనా రైతులకు వీటి సేవలను దూరం చేయాలన్న దుర్మార్గపు పన్నాగంతో నిత్యం వీటిపై బురద జల్లడమే పనిగా ఈనాడు రామోజీరావు పెట్టుకున్నారు. ఏ పల్లెకు వెళ్లినా సకల సౌకర్యాలతో ఆర్బీకేలు స్వాగతం పలుకుతుండడాన్ని.. రైతులు వీటి సేవలను కొనియాడుతుండడాన్ని చూసి రామోజీకి అస్సలు నిద్ర పట్టడంలేదు. ఇలాగైతే తన ఆత్మబంధువు చంద్రబాబుకు అధికారం దక్కడం అసాధ్యం అని భావించే నిత్యం ఏదో ఒక అంశంపై విషం చిమ్ముతున్నారు. అందులో భాగమే తాజాగా ‘ప్రచారానికి లేదు హద్దు.. వసతులు అడగొద్దు’.. అంటూ ఆర్బీకేలపై తన అక్కసును చాటుకుని తన అబద్ధాలకు ఎలాంటి హద్దులేదని అక్షరం అక్షరంలో చెప్పుకున్నారు. ఈ కథనంలో వాస్తవాలేమిటంటే.. –సాక్షి, అమరావతి ఆరోపణ : రైతులను గాలికొదిలేశారు.. వాస్తవం : గ్రామస్థాయిలో ఏర్పాటుచేసిన 10,778 ఆర్బీకేల ద్వారా 14,323 మంది సిబ్బందితో పాటు 1,573 బహుళార్ధ వ్యవసాయ విస్తరణ అధికారులు సేవలందిస్తున్నారు. వీటికి గ్రామ వలంటీర్‌తో పాటు బ్యాంకింగ్ కరస్పాండెంట్‌ను అనుసంధానం చేశారు. గతంలో ఏది కావాలన్నా మండల కేంద్రాలకు పరుగులు తీసేవారు. పగలనకా, రేయనకా నిద్రహారాలు మాని రోజుల తరబడి పడిగాపులు పడేవారు. కానీ, ప్రస్తుతం చూద్దామన్నా ఎక్కడా క్యూలైన్ అనేది కన్పించడంలేదు. వివక్షకు తావులేకుండా అడిగిన ప్రతీరైతుకు అవసరమైన మేరకు సర్టిఫైడ్ చేసిన సాగు ఉత్పాదకాల పంపిణీతో పాటు ఈ–క్రాప్ బుకింగ్, సంక్షేమ పథకాల అమలుతో పాటు ధాన్యంతో సహా ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. పరిశోధనా ఫలాలను నేరుగా రైతు క్షేత్రాలకు చేరవేస్తూ రైతుల్లో సామర్థ్యం పెంపుదలకు శిక్షణనిస్తున్నారు. ఆరోపణ : ఆర్బీకేల్లో సౌకర్యాలేవి? వాస్తవం : 526 గ్రామాల్లో ఆర్బీకేలకు సొంత భవనాలుండగా, మిగిలిన 10,252 గ్రామాల్లో ఆర్బీకేలకు రూ.2,260 కోట్ల అంచనాతో కొత్త భవనాల నిర్మాణం చేపట్టారు. తొలుత ఒక్కో భవన నిర్మాణానికి రూ.21.80 లక్షలు అంచనా వేయగా, అదనపు సదుపాయాల కోసం దీనిని రూ.23.94 లక్షలకు పెంచింది. ప్లాన్ ప్రకారం ప్రతీ ఆర్బీకే భవనం వద్ద మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉంది. టాయిలెట్స్ నిర్మాణ పనులు జాప్యం జరిగిన చోట, సిబ్బందికి ఇబ్బందిలేకుండా ఉండేందుకు సచివాలయం, హెల్త్ క్లినిక్, ఆర్బీకే భవనాల సముదాయంలో నిర్మించిన టాయిలెట్‌ను ఆర్బీకే సిబ్బంది వినియోగించేలా ఏర్పాటుచేశారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 4,239 ఆర్బీకే భవనాలను వ్యవసాయ శాఖకు అప్పగించారు. మరో 4,935 భవనాలు వివిధ దశల్లో ఉండగా, భూ వివాదాలు, స్థలాల కొరత, కోర్టు కేసులు వంటి వివిధ కారణాలతో 1,078 భవనాల నిర్మాణం ప్రారంభించలేదు. ఇప్పటివరకు భవనాల నిర్మాణం కోసం రూ.1,014.82 కోట్లు ఖర్చుచేయగా, మౌలిక వసతుల కల్పన కోసం మరో రూ.357 కోట్లు ఖర్చుచేశారు. సాగు ఉత్పాదకాల బుకింగ్‌తో పాటు ఎప్పటికప్పుడు వాతావరణ, మార్కెట్ సమాచారం తెలుసుకునేందుకు వీలుగా 9,484 ఆర్బీకేల్లో కియోస్క్‌లను.. వీటి పనితీరు పర్యవేక్షణకు ప్రత్యేక డాష్‌బోర్డును ఏర్పాటుచేశారు. ఆరోపణ : ఎరువుల లారీ వస్తే సిబ్బందికి ఇబ్బందే.. వాస్తవం : ఆర్బీకేలకు ఎరువుల సరఫరాను పగటిపూట మాత్రమే చేస్తున్నారు. ఏదైనా ప్రత్యేక పరిస్థితులలో లారీల రవాణా ఆలస్యమైతే మరుసటి రోజు ఉదయం అన్లోడ్ అయ్యేలా ఏర్పాట్లుచేసుకోవాలని లారీ డ్రైవర్లకు మార్క్‌ఫెడ్ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఇక ఆర్బీకేల ద్వారా ఎరువు అమ్మకాలను ప్రోత్సహించేందుకు 2020–21లో మాత్రమే నగదు ప్రోత్సహకాలు ప్రకటించారు. ఆ మేరకు మార్క్‌ఫెడ్ ద్వారా చెల్లింపులు చేసేందుకు మార్కెఫెడ్ చర్యలు తీసుకుంది. 2023–24లో జిల్లాకు 8 వేల నుండి 10 వేల వరకు భూసార పరీక్షల నిమిత్తం 26 జిల్లాలకు మట్టి నమూనాల సేకరణ కోసం రూ.54.50 లక్షలు విడుదల చేశారు. ఆరోపణ : నిర్వహణకు నిధులే లేవు? వాస్తవం : 3,830 ఆర్బీకేల అద్దె చెల్లింపు కోసం రూ.43 కోట్లు ఖర్చుచేయగా, 2023–24 ఆర్ధిక సంవత్సరం చివరి వరకు అద్దెల నిమిత్తం మరో రూ.32.98 కోట్లు విడుదల చేశారు. ఇప్పటికే రూ.22.98 కోట్లు నేరుగా భవన యజమానుల ఖాతాలకు జమచేశారు. మిగిలిన రూ.10 కోట్లు చెల్లించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. అలాగే, ఈ ఏడాది మార్చి వరకు పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బిల్లుల కోసం రూ.12 కోట్లు విడుదల చేయగా.. 2023–24 ఆర్థిక సంవత్సరం నుండి విద్యుత్ బిల్లుల చెల్లింపునకు అవసరమయ్యే బడ్జెట్‌ను నేరుగా విద్యుత్ శాఖకే కేటాయించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. స్టేషనరీ కోసం ఇప్పటికే రూ.3 కోట్లు విడుదల చేశారు. అలాగే, ఇందుకోసం ఖర్చుచేసిన ఆర్బీకే సిబ్బందికి నేరుగా రూ.53.48 లక్షలు విడుదల చేశారు. స్థానికంగా హైస్పీడ్ నెట్వర్క్ ఏది అందుబాటులో ఉంటే ఆ ఇంటర్నెట్ సదుపాయాన్ని ఆర్బీకేల్లో సమకూర్చారు. ఇందుకోసం ఇప్పటికే రూ.23 కోట్లు విడుదల చేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు, రైతుసేవలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు సొంత మొబైల్ డాటాని ఉపయోగించిన సిబ్బందిపై పైసా కూడా భారం పడకుండా ఏర్పాటుచేశారు. ఆరోపణ : రైతుభరోసా పత్రికల పేరిట అదనపు బాదుడు.. వాస్తవం : ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వ్యవసాయ రంగంలో వచ్చే మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికప్పుడు రైతులకు చేరవేసే సంకల్పంతో తీసుకొచ్చిన వైఎస్సార్ రైతుభరోసా మాస పత్రిక అనతి కాలంలోనే రైతుల ఆదరణ పొందింది. 14,300 ప్రతులను వ్యవసాయ శాఖ సొంత నిధులతో ముద్రించి ఆర్బీకేలకు సరఫరా చేస్తోంది. రూ.300 చొప్పున వార్షిక చందా చెల్లించగలిగే రైతులకు నేరుగా వారి ఇంటికి పంపిస్తున్నారు. వ్యవసాయ విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఆర్బీకే స్థాయిలో అవగాహన కల్పించి ఔత్సాహిక రైతులు చందాదారులుగా చేరే కార్యక్రమం చేపట్టారు. ఈ విషయంలో ఎవరిపైనా ఎలాంటి ఒత్తిడి లేదు. ఆర్బీకేల ద్వారా అందించిన సేవలిలా.. అదును దాటక ముందే.. కాదు కాదు.. సీజన్‌కు ముందుగానే సర్టిఫై చేసిన నాణ్యమైన సాగు ఉత్పాదకాలను బుక్ చేసుకున్న 24 గంటల్లోపే రైతుల ముంగిట్లో వాటిని అందిస్తున్నారు. ♦ ఇలా ఇప్పటివరకు ఆర్బీకేల ద్వారా 34.09 లక్షల క్వింటాళ్ల సర్టిఫైడ్ విత్తనాలను రూ.1,027.66 కోట్ల రాయితీతో 58 లక్షల మంది రైతులకు, నాన్ సబ్సిడీ కేటగిరీ కింద రూ.13 కోట్ల విలువైన 1,661 క్వింటాళ్ల పత్తి, మిరప, వరి, మొక్కజొన్న, సజ్జ, సోయాబీన్ తదితర సర్టిఫైడ్ విత్తనాలను 30వేల మంది రైతులకు సరఫరా చేశారు. ♦ఆర్బీకేల ద్వారా ఈ మూడున్నరేళ్లలో రూ.1,312 కోట్ల విలువైన 11.88 లక్షల టన్నుల ఎరువులను 31.54 లక్షల మంది రైతులకు పంపిణీ చేశారు. అలాగే, 1.51 లక్షల మంది రైతులకు రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగు మందులను పంపిణీ చేశారు. ♦ వీటితో పాటు.. ఆక్వా రైతులకు సర్టిఫై చేసిన ఫీడ్, సీడ్, పాడి రైతులకు సంపూర్ణ మిశ్రమ దాణా, పశుగ్రాసం విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. టమరోవైపు.. ఆర్బీకేల ద్వారా వైఎస్సార్ రైతుభరోసా కింద 53.53 లక్షల మంది రైతులకు రూ.33,209.81 కోట్ల పెట్టుబడి సాయం, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.05 పంటల బీమా పరిహారం, 22.85 లక్షల మంది రైతులకు రూ.1,976.44 కోట్ల పెట్టుబడి రాయితీ (పంట నష్టపరిహారం), 73.88 లక్షల మంది రైతులకు రూ.1,442.66 కోట్ల సున్నా వడ్డీ రుణాలు అందించగా.. ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటుచేసిన 10,936 వైఎస్సార్ యంత్రసేవా కేంద్రాల కోసం రూ.366.25 కోట్ల సబ్సిడీని అందించారు. .. ఇలా నిర్విరామంగా రైతుల సేవలో నిమగ్నమైన ఆర్బీకేలకు అనతి కాలంలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రశంసలతో పాటు అవార్డులు, రివార్డులు వరించాయి. అలాగే, సకల సౌకర్యాలతో అన్ని విధాలుగా రైతులకు భరోసా కల్పిస్తున్న వీటిపై ఈనాడు అదే పనిగా నిత్యం విషం కక్కడం వెనుక ఉన్న లక్ష్యాలు అందరికీ తెలిసిందే. -
బానిసగా మారిన గురువు
పాడిందే పాడరా.. పాచిపళ్ల దాసుడా అని ఒక నానుడి ఉంది. ప్రస్తుతం సరిగ్గా ఈనాడు మీడియాకు అది వర్తిస్తుంది. రాసిందే, రాసి, చూపిందే చూపి ఈనాడు మీడియా వారి పాఠకులను, ప్రేక్షకులను నానా విధాలుగా హింసిస్తోంది. ఈనాడు రామోజీరావు దశకంఠుడుగా అంటే రావణాసురుడిగా మారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను చెరబట్టాలని తీవ్రంగా యత్నిస్తున్నారు. ఏపీ అప్పులపై అనునిత్యం వార్తలు రాసి ప్రజలకు బోరు కొట్టిస్తున్నారు. పదే, పదే ఒక వార్తను ప్రచారం చేస్తే జనం నమ్మక చస్తారా అన్నది అభినవ గోబెల్స్ గా మారిన రామోజీరావు నమ్మకం. ✍️టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఒకప్పుడు ఆయన గురువుగా ఉండేవారు. ఇప్పుడు ఆయన బానిస పాత్రకు మారినట్లు అనిపిస్తుంది. అందుకే టీడీపీ కరపత్రం కన్నా హీనంగా ఈనాడు పత్రికను మార్చేశారు. ఈటివిని టీడీపీ యూట్యూబ్ ఛానల్ కన్నా అధ్వాన్నంగా మార్చారు. డిసెంబర్ 19వ తేదీన ఈనాడు దినపత్రికలో రాసిన బానర్ చూస్తే, ఛీ.. ఈనాడు ఇంతగా దిగజారిందేమిటా అనిపిస్తుంది. ఇప్పటికి ఈ నాలుగేళ్లలో ఒక వంద సార్లు ఈ వార్త రాసి ఉంటారు. అయినా వారికి తృప్తి కలగలేదు. ఎన్నికలలోగా ఇంకెన్ని సార్లు రాస్తారో! ముఖ్యమంత్రి జగన్ కారికేచర్ వేసి తొమ్మిది తలలు తగిలించి రుణకంఠుడు అని ఒక చెత్త కథనం వండారు. ✍️నిజానికి పది తలలు ఉన్న దశకంఠుడు రామోజీరావే. రావణాసురుడుగా మారింది ఆయనే. రోజూ ఒక పది పేజీలలో పచ్చి అబద్దాలు రాస్తూ జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నది రామోజీరావే. ఏ మాత్రం జర్నలిజం విలువలతో నిమిత్తం లేకుండా పత్రికలు కూడా వ్యభిచారం చేయవచ్చని ఈనాడు మీడియా నిరూపిస్తోంది. రాష్ట్ర విభజన నాటి ఉన్న అప్పులన్నీ జగన్ ప్రభుత్వం అప్పులన్నట్లుగా ప్రచారం చేస్తున్న ఈనాడు మీడియా, ఇంత అప్పులు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఇస్తున్న భవిష్యత్తుకు గ్యారంటీ హామీలు ఆచరణ సాధ్యం కావని, అది ప్రజలను మోసంచేయడమేనని చెప్పగలదా? ✍️చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఆ వాగ్దానాలను అమలు చేయరని మాజీ ఐఎఎస్ జయప్రకాష్ నారాయణ చెప్పినదానితో ఈనాడు మీడియా ఏకీభవిస్తుందా? ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా మితి మీరి అప్పులు చేయాలని ఎవరూ చెప్పరు. కాని ఈనాడు రాసిన వైనం చూస్తే జగన్ ప్రభుత్వమే అప్పులు తీసుకువచ్చినట్లు, వాటిని ఎక్కడా ఉపయోగించకుండా వృధా చేశారన్న భావన కలిగించేట్లు దిక్కుమాలిన వార్తను వండింది. రాష్ట్రం అప్పులు సుమారు నాలుగున్నర లక్షల కోట్లు అని కేంద్రం ఎన్నిసార్లు పార్లమెంటులో చెప్పినా, వీరు మాత్రం వినిపించుకోరు. పది లక్షల కోట్లపైనే అప్పులని దుష్ప్రచారం చేస్తారు. పోనీ దానిని అయినా పద్దతిగా రాస్తారా అంటే అదీ ఉండదు. చంద్రబాబు ప్రభుత్వ టైమ్‌లో అప్పులు ఎన్ని ఉన్నాయన్నది రాయకుండా, మొత్తం అప్పు అంతా జగన్ ప్రభుత్వమే చేసినట్లు పిక్చర్ ఇస్తుంటారు. ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా? ✍️చంద్రబాబు ప్రభుత్వం సుమారు రెండు లక్షలకు కోట్లకు పైగా అప్పు ఎందుకు తెచ్చిందో చెప్పమనండి. అప్పట్లో వివిధ కార్పొరేషన్ల ద్వారా ఎన్ని లక్షల కోట్ల అప్పు తీసుకున్నారో వివరించమనండి. ఆ డబ్బు దేనికి వాడారో ఎన్నడైనా రాశారా? ఊహూ.. వాటికి జోలికే వెళ్లరు. ఎంతసేపు జగన్ ప్రభుత్వంపైనే పడి ఏడుపు. పోనీ జగన్ ప్రభుత్వం ఏ, ఏ కార్యక్రమాలకు అప్పులు చేసిందో చెబుతారా?అంటే అదీ ఉండదు. చంద్రబాబు టైమ్‌లో సివిల్ సప్లైస్ కార్పొరేష్ ద్వారా అప్పులు తీసుకుని ఆ డబ్బును పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ అంటూ ఎన్నికల ముందు పంచిపెడితే అప్పుడు ఈనాడు, తదితర ఎల్లో మీడియా కు అందులో ఎంతో విజన్ కనిపించింది. జనం మాత్రం అది విజన్ కాదు.. వికృతం అని గమనించి టీడీపీ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాతపెట్టారు. ✍️టీడీపీ హయాంలో 1.60 లక్షల కోట్ల మేర అసెంబ్లీ అనుమతి లేకుండా అప్పులు తీసుకున్నారు. చంద్రబాబు టైమ్‌లో అప్పుల శాతం 15 శాతం అయితే, జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల శాతం 12.4 మాత్రమే. ఈ విషయాలన్నిటిని కప్పిపుచ్యుతూ ప్రభుత్వంపై బురద చల్లుతుంది. చంద్రబాబు పెట్టిన వేల కోట్ల బకాయిలను ఈ ప్రభుత్వం తీర్చవలసి వచ్చింది. చంద్రబాబు దిగిపోతూ వంద కోట్లే మిగిల్చారని అప్పట్లో ఈనాడు మీడియా రాయలేదా! అసలు జగన్ ముఖం చూసి అప్పులు ఎవరు ఇస్తారని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానిస్తే ఆనందంగా ప్రచురించింది కూడా ఈ మీడియానే. ఈ సంగతిని పక్కనబెడితే రామోజీరావుకు ఒక సవాల్ విసరదలిచాను. ✍️రాష్ట్ర విభజన నాటి నుంచి ఉన్న అప్పులన్నీ జగన్ ప్రభుత్వానికి అంటగట్టి బదనాం చేయాలని అనుకుంటున్నారు కదా! వీరు రాసిన లెక్క ప్రకారం జగన్ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తే, ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ వస్తే ఆయన ఇచ్చిన హామీలకు ఎన్ని లక్షల కోట్ల వ్యయం అవుతుంది? ఆ డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది. చంద్రబాబు కేవలం ప్రజలను మోసం చేయడానికే అంతటి భారీ వాగ్దానాలు ఇస్తున్నారని ఈనాడు రాయగలదా?. తెలుగుదేశం అధికారంలోకి రాలేదని తెలిసే, ఈనాడు మీడియా ఆ పార్టీని జాకీలు పెట్టి లేపడానికే ఇలాంటి చెత్త కథనాలు ఇస్తోంది. జగన్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలకు ఏడాదికి నలభైఐదు వేల కోట్లు వ్యయం చేస్తోంది. దీనికే ఇంత భారీగా అప్పులు అయ్యాయని రాశారు. మరి అలాంటప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్,లోకేష్ లు కలిసి ఇస్తున్న హామీలకు ఎన్ని లక్షల కోట్లు కావాలి? ✍️చంద్రబాబు ఇచ్చిన ఆరు హామీలకే ఏడాదికి లక్షన్నర కోట్లకు పైగానే నిధులు అవసరం అవుతాయి. వాటిని సమకూర్చుకోవడం అసాధ్యం కాబట్టి యథా ప్రకారం చంద్రబాబు మళ్లీ మోసం చేయడానికే ఈ హామీలన్ని ఇచ్చారని ఈనాడు రాస్తే అప్పుడు ఆ పత్రికను నమ్మవచ్చు. లేకుంటే టీడీపీకి అమ్ముడు పోయి ఇలాంటి దారుణమైన నీచ కథనాలను ఇస్తోందని ప్రజలు అనుకోరా! ఒకపక్క ఆయా స్కీములలో కోత పెడుతున్నారని రాసేది వీరే. వాటికి నిధులు తెచ్చి అమలు చేస్తుంటే, అప్పులు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేసేది వీరే. ✍️అదే చంద్రబాబు టైమ్‌లో బాండ్ల ద్వారా అప్పులు తీసుకున్నా, ఆహా.. చంద్రబాబు కాబట్టి అప్పులు వచ్చాయని భాజా వాయించారు. ఈనాడు మీడియాకు ఏపీ ప్రజలపై ఎలాంటి మమకారం లేదు. చిత్తశుద్ది అసలే లేదు. వారిది వ్యాపార, రాజకీయ ప్రయోజనమే. రామోజీ ఎప్పుడో ఏపీతో సంబంధం వదలుకున్నారన్నది వాస్తవం. చంద్రబాబు కోసం ఆయన ఏపీ ప్రజలను చెరబట్టాలని చూస్తున్నారు. పోనీ ఆయన అంత నిపుణుడైతే తన గ్రూపు సంస్థలు ఎందుకు నష్టాలు పాలవుతున్నాయి?. మార్గదర్శి వ్యవహారంలో అప్పులు తీర్చడానికి ఆయన తన టివీ చానళ్లను ఎందుకు అమ్ముకున్నారు?. న్యూస్ టైమ్, సోమా తదితర కంపెనీలను ఎందుకు మూసివేశారు? ✍️మార్గదర్శిలో ఎందుకు అక్రమాలకు పాల్పడుతున్నారన్న అభియోగాలను ఎదుర్కుంటున్నారు? అందులో నల్లధనం తిప్పుతున్నారన్న విమర్శలకు ఎందుకు గురి అవుతున్నారు?. మార్గదర్శి చిట్స్ సంస్థ లెక్కలను పారదర్శకంగా ఎందుకు చూపించడం లేదు? ఈయనేమో తన సంస్థల కోసం ఎంత అప్పు అయినా డిపాజిట్ల రూపంలో తీసుకోవచ్చు. ప్రభుత్వం మాత్రం నిర్ణీత నిబంధనల ప్రకారం అప్పులు చేస్తే మాత్రం చండాలపు స్టోరీలు రాస్తుంటారు. ఎన్నికలు మరో నాలుగు నెలల్లో జరగబోతున్నాయి. అంతవరకు ఈనాడు మీడియా అరాచకపు దాడిని జగన్ ఎదుర్కోవలసిందే. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
పేద విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తే తప్పేంటీ: నాగార్జున యాదవ్
సాక్షి, తాడేపల్లి: బడుగు బలహీన వర్గాల మీద రామోజీరావు విషం చిమ్ముతున్నారని వైఎస్సార్సీపీ నాయకుడు నాగార్జున యాదవ్ మండిపడ్డారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. బైజూస్‌పై తప్పుడు వార్తలు రాస్తున్నారని అన్నారు. పేద విద్యార్థులపై మీకు(రామోజీరావు) ఎందుకు అంత అక్కసుని దుయ్యబట్టారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని తెలిపారు. పేద విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తే తప్పేంటీ? అని నాగార్జున యాదవ్ సూటీగా ప్రశ్నించారు. చదవండి: చుక్కలు చూపిస్తానన్న పవన్‌కు డిపాజిట్ కూడా రాలేదు: సీఎం జగన్ -
చంద్రబాబు, రామోజీ అసలు బండారం బట్టబయలు: సజ్జల
సాక్షి, అమరావతి: చంద్రబాబు అరెస్ట్ విషయంలో టీడీపీ తీరు వింతంగా ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీడీపీకి అధికారం ఇస్తే ఆ పార్టీ అధినేతే అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబు తప్పు చేసినట్టు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. చంద్రబాబు పట్ల ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తున్నట్లు డ్రామాలు ఆడుతున్నారు. మార్గదర్శి షేర్ హోల్డర్‌ను బెదిరించి రామోజీ షేర్లు బదిలీ చేయించుకున్నారు. రామోజీ బెదిరింపుల పర్వం ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు, రామోజీ తప్పు చేసి ప్రజల మద్దతు కోరుతున్నారు’’ అంటూ సజ్జల ధ్వజమెత్తారు. ‘‘పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు. మార్గదర్శి షేర్ హోల్డర్ జీజేరెడ్డి కుటుంబాన్ని బెదిరించి షేర్లు బదిలీ చేయించుకుంది రామోజీ. చంద్రబాబు, రామోజీ ఎంత నీచమైన మనుషులో నిరూపితమైంది. రామోజీ ఎదుగుదలకు కారణమైన జీజేరెడ్డి కుటుంబాన్ని గౌరవంగా చూసుకోవాలి. జీజేరెడ్డి కుటుంబ సభ్యులను బెదిరించి బలవంతంగా షేర్లు లాక్కున్నారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం అయిన రెండు నెలలకే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు. కోర్టుల తీర్పులు ఎలా ఉన్నా వీళ్ల నిజస్వరూపం ప్రజలకు అర్థమవుతోందని సజ్జల అన్నారు. -
Fact Check: అవన్నీ మీ ‘బాబు’ బ్రాండ్లే
సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారం కోల్పోతేనే ఈనాడు రామోజీరావు గంగవెర్రులెత్తిపోతారు. అలాంటిది ఇక అవినీతి కేసుల్లో ఆధారాలతో సహా అడ్డంగా దొరికి తన ఆత్మబంధువు జైలుకెళ్తే ఇక రామోజీ మామూలుగా ఉంటారా.. కల్లు తాగిన కోతిలా తయారై తన కలంతో విషం కక్కుతారు. ఇప్పుడు ఆయన పూనకం వచ్చినట్లుగా అదే చేస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా అమలుచేస్తున్న దశలవారీ మద్య నియంత్రణ విధానంపై తెగ దుష్ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో రోజురోజుకు జనాదరణ పెంచుకుంటున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నాణ్యమైన మద్యం విక్రయించడంలేదని మరో అవాస్తవ కథనాన్ని ప్రచురించి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ఈనాడు ఎప్పటిలాగే మరోసారి బరితెగించింది. ఇటువంటి టీడీపీ, ఈనాడు దుష్ప్రచారాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగానే గతంలో ఎన్నోమార్లు సమర్థంగా తిప్పికొట్టింది. అయినప్పటికీ రామోజీ తన వంకర బుద్ధిని మార్చుకోకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విద్వేషాన్ని వెళ్లగక్కుతునే ఉన్నారు. అందుకే మరోసారి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ ఫ్యాక్ట్‌చెక్.. బాబు హయాంలోనే పచ్చ సిండికేట్ దోపిడీ.. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సిండికేట్ మొత్తం ఆ పార్టీ నేతల గుప్పెట్లోనే ఉండేది. బడి పక్కన, గుడి పక్కన అనే విచక్షణ కూడా లేకుండా ఎక్కడపడితే అక్కడ మద్యం దుకాణాలకు అనుమతులిచ్చేసి.. పర్మిట్ రూమ్‌ల పేరుతో అనధికారిక బార్లను తెరిచేసి.. మరో 43వేల బెల్డ్ దుకాణాలను ఏర్పాటుచేసి మరీ మద్యాన్ని ఏరులై పారించారు. ఈ మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే మద్యం బాటిల్‌పై రూ.10 నుంచి రూ.25 వరకు అధిక ధరకు విక్రయించినా అడిగే నాథుడే లేకుండాపోయారు. ఆనాడు మద్యం దందాపై కిమ్మనకుండా ఈనాడు సహకరించిందన్నది బహిరంగ రహస్యం. ఆ బ్రాండ్లన్నీ తెచ్చింది చంద్రబాబే.. నిజానికి.. రాష్ట్రంలో మద్యం బ్రాండ్లపై ఈనాడు ఇప్పుడు నీతులు చెబుతుండటం విడ్డూరంగా ఉంది. వివిధ మద్యం బ్రాండ్ల పేర్లను ఉదాహరిస్తూ వాటితో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని మొసలి కన్నీరు కారుస్తోంది. కానీ, అవన్నీ చంద్రబాబు బ్రాండ్లనే వాస్తవాన్ని రామోజీరావు ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతున్నారు. అప్పటివరకూ కనిపించని... వినిపించని మద్యం బ్రాండ్లన్నీ కూడా రాష్ట్రంలోకి తీసుకొచ్చింది చంద్రబాబే అన్నది నిఖార్సైన నిజం. సంధి ప్రేలాపనలు పేలుతున్న రామోజీ.. ఆ వివరాలు ఇవిగో.. ► ప్రెసిడెంట్ మెడల్, హైదరాబాద్ బ్లూడీలక్స్ బ్రాండ్ల విస్కీకి చంద్రబాబు సీఎంగా ఉండగానే 2017 నవంబరు 22న అనుమతిచ్చారు. ► గవర్నర్ రిజర్వ్, లెఫైర్ నెపోలియన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెన్త్ హెవెన్ బ్లూ బ్రాండ్ల పేరుతో విస్కీ, బ్రాందీ తదితర 15 బ్రాండ్లకు కూడా టీడీపీ ప్రభుత్వమే 2018 అక్టోబరు 26న ఒకేసారి అనుమతులిచ్చింది. ► హైవోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్ఎన్జీ 10000, బ్రిటీష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటీష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్లతో బీరు విక్రయాలు సైతం చంద్రబాబు నిర్వాకమే. ఆ బ్రాండ్లకు టీడీపీ ప్రభుత్వం 2017 జూన్ 7న అనుమతి జారీచేసింది. ► రాయల్ ప్యాలెస్, న్యూకింగ్, సైన్ అవుట్ పేర్లతో విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు కూడా రామోజీ పార్ట్నర్ చంద్రబాబే 2018 నవంబరు 9న అనుమతిచ్చారు. ► బిరా 91 పేరుతో మూడు రకాల బీర్ బ్రాండ్లకు అనుమతులు ఎప్పుడు ఇచ్చారో తెలుసా రామోజీ.. 2019 మే 14న మీ చంద్రబాబు ప్రభుత్వమే. అప్పటికి ఇంకా రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టలేదు. ► ఆ మర్నాడే టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్ విస్కీ, బ్రాందీ బ్రాండ్లకూ టీడీపీ సర్కారే అనుమతినిచ్చిందన్నది పచ్చి నిజం. డిస్టిలరీలకు అనుమతులిచ్చింది ఆయనే రామోజీ.. ఇక రాష్ట్రంలో మద్యం తయారుచేస్తున్న డిస్టిలరీలన్నింటికీ అనుమతులిచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉంటే వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు సీఎంగా ఉండగానే అనుమతినిచ్చారు. మిగిలిన 6 డిస్టిలరీలకు అంతకుముందు ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. అంటే టీడీపీ నేతలకు చెందిన కంపెనీలకే చంద్రబాబు అనుమతులిచ్చారు. ప్రస్తుతం చంద్రబాబు సన్నిహితుల కంపెనీలే మద్యాన్ని తయారుచేస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ప్రస్తుతం కూడా ఆ డిస్టిలరీలు తయారుచేస్తున్న మద్యాన్నే రాష్ట్రంలో విక్రయిస్తున్నారు. అయినా సరే టీడీపీ అధికారంలో ఉంటే మద్యం నాణ్యమైనదీ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉంటే మద్యంలో నాణ్యతలేదని దుష్ప్రచారం చేయడం ఈనాడుకే చెల్లింది. ప్రతీ డిస్టిలరీకి సమాన అవకాశాలు.. అలాగే, మద్యం తయారీ కూడా అప్పట్లో మాదిరిగా ఒకే డిస్టిలరీకి 50శాతం ఆర్డర్ ఇచ్చేయకుండా ప్రతీ డిస్టిలరీకీ సమానంగా అవకాశం వచ్చేలాగా.. 4–6 శాతం ఉండేలా తయారీ ఆర్డర్లు ఇస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మీకు ఎక్కడ తప్పు కనిపిస్తోంది?.. ఎక్కడ నాసిరకం ఉంది రామోజీ? మద్యం డాన్ చంద్రబాబే.. రాష్ట్రంలో మద్యం డాన్ చంద్రబాబే అన్న వాస్తవాన్ని రామోజీరావు ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నారు. రాష్ట్రంలో 20 డిస్టలరీలు ఉంటే.. అందులో 14 చంద్రబాబు హయాంలోనే అనుమతులిచ్చారు. మరి మద్యం డాన్ చంద్రబాబే కదా రామోజీ. పైగా.. రాష్ట్రంలోని ఈ డిస్టిలరీలన్నీ దాదాపుగా టీడీపీ కీలక నేతల కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయి. పీఎంకే డిస్టిలరీ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేశ్‌కుమార్‌ది. ఆయన టీడీపీ నేత పుట్టా మధుసూదన్ యాదవ్‌కు కుమారుడు కూడా. ► శ్రీకృష్ణ ఎంటర్‌ప్రైజస్ టీడీపీ మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవుల నాయుడు కుటుంబానిది. ► ఎస్పీవై ఆగ్రో ప్రొడక్ట్స్ టీడీపీ నేత, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబానిది. వైఎస్సార్సీపీ తరపున ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డిని నిబంధనలకు విరుద్ధంగా టీడీపీలో చేరినందుకు నజరానాగా ఆ డిస్టిలరీకి చంద్రబాబు అనుమతిచ్చారు. ► ఇక బాబు ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు ఆగ మేఘాల మీద 2019, ఫిబ్రవరి 25న అనుమతినిచ్చిన విశాఖ డిస్టిలరీస్‌లో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వాటాదారుగా ఉన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో దశలవారీ మద్య నియంత్రణ.. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశల వారీగా మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలుచేస్తోంది. ఇందుకోసం... ► టీడీపీ హయాంలో ప్రైవేట్ మద్యం దుకాణాలు ఉ.10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విక్రయాలు సాగించేవి. అనధికారికంగా 24 గంటలూ విక్రయిస్తూ ఉండేవి. కానీ, ఇప్పుడు సమయాన్ని కుదించి కచ్చితంగా అమలుచేస్తున్నారు. ఉ.10 నుంచి రాత్రి 9 గంటల వరకే విక్రయాలకు అనుమతించారు. ► బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లు రద్దుచేశారు. చంద్రబాబు హయాంలో ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుబంధంగా 43 వేల బెల్ట్ దుకాణాలు ఉండేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే వాటన్నింటినీ పూర్తిగా తొలగించింది. అలాగే, గతంలో మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లను అనుమతించారు. అవి అనధికారికంగా బార్లగా చలామణి అయ్యేవి. వాటినీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే రద్దుచేసింది. ► దుకాణాలనూ కుదించారు. టీడీపీ హయాంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా ఇప్పుడు 2,934కి తగ్గిపోయాయి. ఈ సంఖ్యను ఇంకా తగ్గించే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. ఇక బార్ల సంఖ్యను పెంచలేదు. 2019లో ఖరారుచేసిన 840 బార్లే ఉన్నాయి. కొత్త బార్లకు లైసెన్సులివ్వలేదు. ► షాక్ కొట్టేలా ధరలు పెంచారు. మద్యం విక్రయాలను నిరుత్సాహపర్చడమే తమ పార్టీ విధానమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో చాలాసార్లు చెప్పారు. విక్రయాలను ప్రోత్సహించి సొమ్ము చేసుకోవడం తమ లక్ష్యం కాదని స్పష్టంచేశారు. అందుకే అధికారంలోకి వచ్చాక మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచారు. అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్ఈటీ) పన్నునూ విధించారు. దీంతో మద్యం ధరలు పెరిగాయి. మద్యపాన వ్యసనాన్ని నిరుత్సాహ పరిచేందుకు విధించిన ఏఆర్ఈటీ పన్నుతో రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా వాస్తవానికి మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా పేదలు ఈ వ్యసనానికి క్రమంగా దూరమవుతున్నారు. ► మరోవైపు.. అమ్మకాలూ భారీగా తగ్గాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయనడానికి ఇదే ఉదాహరణ. రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. టీడీపీ హయాంతో పోలిస్తే రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం విక్రయాలు సగానికి పడిపోయాయి. అందుకు గణాంకాలే తార్కాణం. మద్యం నాణ్యతపై ఈనాడు దుష్ప్రచారం ఈనాడు కుట్రపూరితంగా సాగిస్తున్న మరో దుష్ప్రచారం ఏమిటంటే...రాష్ట్రంలో మద్యం నాణ్యత లేదని.. విషపు అవశేషాలు ఉన్నాయని చెన్నైలోని ఎస్జీఎస్ ల్యాబొరేటరీ పేరిట ఓ అబద్ధపు నివేదికను ప్రచారంలోకి తీసుకొచ్చింది. కానీ, ఈనాడు కుట్ర బెడిసికొట్టింది. తాము అసలు అలాంటి నివేదికే ఇవ్వలేదని ఆ సంస్థ స్పష్టంచేసింది. తాము పరీక్షించిన మద్యం నమూనాల్లో అవశేషాలు పరిమితికి లోబడే ఉన్నాయని, అవి ప్రమాదకరంకాని సహజసిద్ధమైన మొక్కల నుంచి తయారైనవేనని స్పష్టంచేసింది. తమ నివేదికను తప్పుగా అన్వయించారని చెప్పింది. అయినా సరే రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ రాష్ట్రంలో మద్యం నమూనాలను హైదరాబాద్‌లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ల్యాబ్‌లో పరీక్షించింది. ఆ నమూనాలన్నీ నిర్దేశిత ప్రమాణాల ప్రకారమే ఉన్నాయని నివేదిక ఇచ్చింది. మద్యం నాణ్యతపై ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చిచెప్పింది. రాష్ట్రంలో మద్యం తయారీకి డిస్టిలరీలు ఎప్పుడెప్పుడు అనుమతులు పొందాయంటే.. 1. కాంటినెంటల్ వైన్స్, ఆటోనగర్, విజయవాడ, 1971, ఆగస్టు 9 2. బీఆర్కే స్పిరిట్స్, కంకిపాడు, కృష్ణాజిల్లా, 1998, సెప్టెంబరు 15 3. పెర్ల్ డిస్టిలరీ లిమిటెడ్, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా, 1997, ఆగస్టు 14 4. సోరింగ్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్, చేబ్రోలు, తూ.గోదావరి జిల్లా, 2007, నవంబరు 7 5. సెంటిని బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, గండేపల్లి, కృష్ణాజిల్లా 2010, జూన్ 9 6. బీవీఎస్ డిస్టిలరీస్, కంకిపాడు, కృష్ణాజిల్లా, 2017, జనవరి 2 7. శ్రావణి ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్, గంపలగూడెం, కృష్ణాజిల్లా, 2017, సెప్టెంబరు 29 8. గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, వంగూరు, ప.గోదావరి జిల్లా, 1997, నవంబరు 17 9. జీఎస్బీ అండ్ కో, కశింకోట, విశాఖపట్నం జిల్లా, 2008 10. బీడీహెచ్ ఆగ్రో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, కొప్పరం, తూ.గోదావరి జిల్లా, 2017, ఆగస్టు 25 11. విశాఖ డిస్టిలరీస్, కశింకోట, విశాఖపట్నం జిల్లా, 2019, ఫిబ్రవరి 25 12. పీఎంకే డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, కశింకోట, విశాఖపట్నం జిల్లా, 2017, అక్టోబరు 23 13. ఈగిల్ డిస్టిలరీస్, తాడిగొట్ల, కడప, 1974, అక్టోబరు 14. ఎస్వీఆర్ డిస్టిలరీస్, తిరుపతి, 1982 15. శ్రీకృష్ణా ఎంటర్ప్రైజెస్, తిమ్మ సముద్రం, చిత్తూరు జిల్లా, 1998, జులై 16. ఎస్ఎన్జే సుగర్స్, ప్రొడక్ట్స్, వెంకటాచలం, నెల్లూరు జిల్లా, 2018, మే 17. మోహన్ బేవరేజస్ అండ్ డిస్టిలరీస్ లిమిటెడ్, పల్లూరు, చిత్తూరు జిల్లా, 1978 18. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, నంద్యాల, కర్నూలు జిల్లా, 2016, సెప్టెంబరు 19. ఖోడేస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, కుప్పం, చిత్తూరు జిల్లా, 1970 20. ప్రాగ్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, నల్లమిల్లి, తూ.గోదావరి జిల్లా, 1997, మార్చి 31. -
టీడీపీ కొంప ముంచిన రామోజీరావు
-
‘కోత’లపై చీకటి రాతలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 226.488 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుంటే దానిలో కేవలం 1.35 మిలియన్ యూనిట్లు లోటు ఏర్పడింది. ఇది సరఫరా చేసిన మొత్తంలో కేవలం 0.6 శాతం మాత్రమే. దీనికే ‘చీకటి రాజ్యం’ అంటూ తాటికాయంత అక్షరాలతో పచ్చబ్యాచ్‌కు చెందిన క్షుద్రపత్రిక ఓ కథనాన్ని అచ్చేసింది. రామోజీ మోస్తున్న చంద్రబాబు హయాంలో వారంలో రెండ్రోజులు పరిశ్రమలకు ‘పవర్‌హాలిడే’, గ్రామాల్లో పగలంతా విద్యుత్ కోతలు విధించిన సంగతి ఈనాడు మర్చిపోయినా ప్రజలు మర్చిపోరని రామోజీకి తెలియకపోవడం ఆశ్చర్యకరం. స్థానిక పరిస్థితుల కారణంగా తలెత్తిన విద్యుత్ అంతరాయాలన్నిటినీ విద్యుత్ కోతలుగా చూపించాలనే ప్రయత్నంలో అసలు నిజాలకు రామోజీ పాతరేశారు. కానీ, రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితులను విద్యుత్ సంస్థలు వాస్తవాలతో సహా ‘సాక్షి’కి వెల్లడించాయి. ఆ వివరాలు.. ఉత్పత్తి, వాతావరణ ప్రభావం.. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ గ్రిడ్ డిమాండ్ దాదాపు గతేడాది ఇదే రోజు జరిగిన 200.595 మిలియన్ యూనిట్లు కంటే 25.893 మిలియన్ యూనిట్లు (12.91 శాతం) పెరిగింది. కానీ, ఈ డిమాండ్‌కు సరిపడా సరఫరాకు వనరులు అందుబాటులో లేవు. ఈ సీజన్లో అధికంగా ఉండాల్సిన పవన విద్యుత్ కూడా వాతావరణంలో మార్పులవల్ల అంచనా వేసిన దానిలో కేవలం 30 శాతం కూడా రావడంలేదు. రోజులో వివిధ సమయాల్లో ఒక్కోసారి అంచనాలో కేవలం 10 శాతం కూడా ఉత్పత్తి కావటంలేదు. అలాగే, ఈ ఏడాది కృష్ణా నది బేసిన్లో జల విద్యుత్ ఉత్పత్తి ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. ఎగువ రాష్ట్రాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో మన రాష్ట్రంలో ఉన్న జలాశయాలకు ఇంకా నీటి చేరిక మొదలుకాలేదు. దానివల్ల జల విద్యుదుత్పత్తి కూడా జరగడంలేదు. ఏపీ జెన్కోలోని కొన్ని థర్మల్ విద్యుత్కేంద్రాలు వార్షిక మరమ్మతుల నిర్వహణ కోసం ఆపారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలోని కుడిగి థర్మల్ విద్యుత్ కేంద్రం కూడా ప్రస్తుతం అందుబాటులో లేదు. హిందుజా థర్మల్ కేంద్రంలో బొగ్గు కొరతవల్ల రెండు 520 మెగావాట్ల జనరేటర్లలో కేవలం ఒకటి మాత్రమే పనిచేస్తోంది. మార్కెట్లో దొరకడంలేదు.. ప్రస్తుత పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని ఏఏ సమయాల్లో విద్యుత్ కొరత ఏర్పడుతుందో ఆయా సమయాల్లో అత్యవసరంగా మార్కెట్ కొనుగోళ్లకు వెళ్లాల్సి వస్తోంది. స్వల్పకాలిక మార్కెట్లో కూడా తగినంత విద్యుత్ అందుబాటులో ఉండటంలేదు. ఎంత ధర వెచ్చించినా బహిరంగ మార్కెట్లో స్వల్పకాలిక కొనుగోళ్లు చేద్దామన్నా తగినంత విద్యుత్ అందుబాటులో లేదు. మనం పెట్టే బిడ్డింగ్ పరిమాణంలో కేవలం 10–20 శాతం మాత్రమే దొరుకుతుంది. అత్యంత అధిక ధర (సీలింగ్ ధర)కు బిడ్డింగ్ వేయడానికి సిద్ధపడినా కూడా తగినంత విద్యుత్ లభించడంలేదు. అయినప్పటికీ ఎలాగోలా ప్రయత్నించి బహిరంగ మార్కెట్ నుంచి యూనిట్ సగటు రేటు రూ.7.483 చొప్పున రూ.46.803 కోట్లతో 46.802 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను శనివారం కొనుగోలు చేశారు. నిరంతర చర్యలు.. ఇక విద్యుత్ గ్రిడ్‌ను సమతుల్యం చేసే క్రమంలో విద్యుత్ సరఫరాలో అక్కడక్కడ కొన్ని అవరోధాలు ఏర్పడ్డాయి. ఈ నియంత్రణ చర్యలు చేపట్టకపోతే దేశీయ గ్రిడ్ నుంచి ఓవర్ డ్రాయల్ విపరీతంగా పెరిగిపోయి మొత్తం గ్రిడ్ మనుగడకే ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉండడంతో దక్షిణ రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్, జాతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ మార్గదర్శకాలకు అనుగుణంగా శనివారం రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో అనివార్యంగా విద్యుత్ కోతలు విధించాల్సి వచ్చింది. దక్షిణ భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. కానీ, ఈనాడు, మరికొన్ని పత్రికల్లో రాస్తున్నట్లు మన రాష్ట్రంలో వేలాది గ్రామాల్లో విద్యుత్ కోతలు, చీకటి రాజ్యం పరిస్థితులు లేవు. సామాన్య గృహ విద్యుత్ వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది, అసౌకర్యం తలెత్తకూడదని ముందుగా పరిశ్రమలు వాడే విద్యుత్‌కు నియంత్రణ విధించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి అధికారులు సూచనలిచ్చారు. మరోవైపు.. నిత్యం విద్యుత్ కొనుగోలుకు డిస్కంలు చర్యలు తీసుకుంటున్నాయి. విద్యుత్ ఎక్స్చేంజీల్లోనే కాకుండా వారం ముందస్తు ద్వైపాక్షిక కొనుగోళ్ల ద్వారా కూడా విద్యుత్ కొనడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. -
ఉండవల్లి ప్రశ్నలకు సమాధానాలు లేవా రామోజీ?
రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ఒక ఆసక్తికర విషయం చెప్పారు. గతంలో మార్గదర్శి ఫైనాన్స్ కేసులో సుప్రీంకోర్టు జడ్జి ఒక వ్యాఖ్య చేశారట. ఈనాడు మీడియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ఇస్తోందని, అందుకే తమపై కక్ష వహిస్తున్నారని అంటున్నారు.. మీరేమో ప్రభుత్వంపై వ్యతిరేకతతో రాస్తారు. వారు మీ తప్పులు కనుగొని ఎత్తి చూపుతారు. ఇందులో తప్పేముందని అన్నారట. మార్గదర్శి ఫైనాన్స్ కేసులో ఉండవల్లి సుప్రీంకోర్టులో రామోజీరావుపై పోరాడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామోజీ మార్గదర్శి చిట్‌ఫండ్ కేసుల్లో ఇరుకునపడ్డారు. ఏపీ సీఐడీ వారు లేవనెత్తుతున్న అనేక ప్రశ్నలకు వారు సూటీగా సమాధానం చెబుతున్నట్లు అనిపించదు. తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని బుకాయించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వం తమపై దాడి చేస్తోందని వాపోతున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరిపైన అయినా కారణం ఉన్నా, లేకపోయినా, దాడి చేసే హక్కు ఒక్క ఈనాడు మీడియాకు, దాని అధినేత రామోజీరావుకే ఉందని అనుకోవాలి. ఉండవల్లి అంటున్నట్లు ఈ దేశంలో రామోజీ ఎన్ని చట్టాలను అతిక్రమించినా ఆయనను నిలదీసే పరిస్థితి లేదని, ఆయా రాజకీయ పార్టీలు, వ్యవస్థలను అలా మేనేజ్ చేయగలుగుతున్నారని చెప్పుకోవాలి. ఉదాహరణకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో రాష్ట్ర విభజన నేపథ్యంలో హైకోర్టు ఏపీకి తరలివెళ్లే చివరి రోజున గౌరవ హైకోర్టు వారితో ఎలా తన కేసును కొట్టివేయించుకోగలుగుతారని ఆయన ప్రశ్నిస్తుంటారు. కనీసం పిటిషనర్ అయిన తనకు కూడా తెలియకుండా చేయగలిగారని ఆయన వివరిస్తుంంటారు. ఆ తర్వాత ఎప్పటికో సమాచారం తెలిసి ఉండవల్లి సుప్రీంకోర్టుకు వెళ్లవలసి వచ్చింది. మార్గదర్ళి చిట్ కేసులలో కూడా రామోజీ కోర్టులలో ఎన్ని పిటిషన్లు వేస్తున్నారు. ఇందుకోసం ఎన్ని కోట్లు వెచ్చించగలుగుతున్నారు. నిజంగా తానేమీ తప్పు చేయకపోతే చిట్ రిజిస్ట్రార్ అధికారులు కాని సీఐడీ అధికారులు కాని అడిగిన రికార్డులను ఎందుకు చూపించలేదు. చదవండి: తెలంగాణలో ఒకలా, ఏపీలో మరోలా.. రామోజీ ఎందుకిలా? సుమారు 800 మంది కోటి రూపాయలకు పైగా డిపాజిట్ చేయడంలోని మతలబు ఏమిటి? ఇవన్ని నగదు డిపాజిట్లా? కాదా? చట్టబద్దమైన డిపాజిట్లే అయితే వారి పేర్లు బయటపెట్టవద్దని ఎందుకు కోరుతున్నారు? దీనికి ఆయన ఎందుకు జవాబు ఇవ్వలేకపోతున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ఒక్కదానిలోనే సోదాలు చేయలేదు కదా. అన్ని చిట్ ఫండ్ సంస్థలపై సోదాలు చేసి కొన్నిటిపై కేసులు పెట్టిన విషయం మరిచిపోకూడదు. రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు చెందిన చిట్ సంస్థలపై కేసు పెట్టడమే కాకుండా అరెస్టులు కూడా చేశారే. మార్గదర్శి సంస్థలో చిట్ గ్రూప్‌లు నిలిపివేస్తూ అధికారులు ఇచ్చిన ఆదేశాలపై సంస్థ వారు కోర్టుకు వెళితే చిట్ గ్రూపులను నిలిపివేయడానికి ముందు వారికి నోటీసు ఇవ్వాలని ఆదేశం మేరకే ప్రభుత్వం బహిరంగ నోటీసు జారీ చేసినట్లుంది. దానిని ప్రచార ప్రకటన రూపంలో ఇవ్వడం ఈనాడుకు అభ్యంతరం కావచ్చు. అదే వేరే కంపెనీలపై ఇలాంటి వాటిని ప్రభుత్వం ఇస్తే ఈనాడు తీసుకోకుండా ఉంటుందా? చట్ట ఉల్లంఘనలు వివరిస్తూ ప్రభుత్వ అధికారులు ఈ ప్రకటన విడుదల చేశారు. దానిని ప్రజాధనంతో దాడి చేస్తారా అని ఈనాడు ప్రశ్నించింది. మరి నిత్యం ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వం పై అసత్యాలు వండి వార్చుతూ దాడి చేస్తున్న ఈనాడును ఏమనాలి. పాఠకులకు విలువైన వార్తలు ఇవ్వవలసిన పత్రిక స్థలాన్ని తన వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా ఈనాడు మీడియా ఎలా వాడుతోంది. పేజీలకు పేజీలు రాసి ప్రజలపై దాడి చేస్తోంది ఈనాడు కాదా? అదంతా లెక్క వేస్తే ఎన్ని వందల కోట్ల వ్యయం అవుతుంది? ఇలా జర్నలిజాన్ని, వ్యాపారాన్ని కలగలిపి చేయడం విలువలతో కూడిన విషయమే అవుతుందా? ఉండవల్లి మరో ప్రశ్న వేశారు. టివి 9 రవిప్రకాష్‌పై కేసులు వచ్చినప్పుడు, ఆయనను జైలులో పెట్టినప్పుడు రామోజీపై కేసులు పెట్టకూడదని ఎలా అంటారని ఆయన అడిగారు. రవి ప్రకాష్ కేసులలో రాజకీయ పార్టీలు ఏవీ ఆయనకు మద్దతు ఇవ్వలేదని అన్నారు. రవిప్రకాష్‌కు ఒక న్యాయం, రామోజీకి ఒక న్యాయం ఉంటుందా? అని ఆయన అంటున్నారు. ఏపీ ప్రభుత్వం మార్గదర్శి చందాదారులకు నిర్దిష్ట సమాచారాన్ని ఇస్తూ ఆ ప్రకటన చేసింది. దానికి ఖండనగా ఈనాడు మీడియా పెద్ద ఎత్తున ఒక పేజీ నిండా వార్తల రూపంలో ప్రచురించింది. అందులో తాము చట్టాన్ని ఉల్లంఘించలేదన్న బుకాయింపు తప్ప స్పష్టత ఎంత మేర ఉందన్నది సందేహం. చిట్ దారుల డబ్బును ప్రత్యేక ఖాతాలలో ఉంచుతున్నారా? లేదా? అన్నదానికి జవాబు దొరికినట్లు లేదు. తమకు చట్టాలు వర్తించవని రామోజీ భావిస్తే ఏమి చేయాలి. తమపై దాడి అంటూ ఈనాడు రాసిన కథనంలో ప్రభుత్వంపై ఎలా అబద్దపు దాడి చేశారో చూడండి. గోదావరి వరదలతో రాష్ట్రం అల్లకల్లోలమైందట. గోదావరికి వరద వచ్చిన మాట నిజం. పలు గ్రామాలు నీటి ముంపునకు గురైన సంగతి వాస్తవం. కాని అంతవరకు రాయకుండా రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోయిందని, అయినా మార్గదర్శిపై దాడి చేశారని రాస్తోంది. అంటే రాష్ట్రంలో వారు అనుకున్నవి తప్ప ఇంకేమీ పనులు ప్రభుత్వాలు చేయరాదన్నమాట. నిజంగానే గోదావరి వరదలతో రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయితే ఆ వార్తను బానర్గా ఇవ్వకుండా డేటా చౌర్యం అంటూ మరో తప్పుడు వార్తను ఈనాడు ఎలా ఇచ్చింది. ఆ పక్కనే మార్గదర్శి రిజాయిండర్ వార్తను ఎందుకు ఇచ్చారు? ఆ తర్వాత ప్రభుత్వాన్ని దూషించడానికి కొన్ని కథనాలు ఇచ్చారు. వాటిలో వరద బాధితులకు సహయం అందడం లేదంటూ మరో కథనం అల్లారు. నిజానికి ప్రభుత్వం డెబ్బైవేల మందికి పైగా పునరావాస శిబిరాలకు తరలించింది. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వార్త ఇవ్వవచ్చు. కాని దానిని చిలవలు, పలవలు చేసి ప్రభుత్వంపై విషం చిమ్మిన విషయాన్ని ప్రజలు గమనించరా? పడవలలో కూడా వెళ్లి వలంటీర్లు ఇతర సిబ్బంది సేవలు అందిస్తున్న విషయాన్ని వీరు గుర్తించరా? ఇలా ఒకటి కాదు.. ఎక్కడెక్కడి చెత్త, చెదారాన్ని అంతటిని పోగు చేసుకు వచ్చి ఏపీ ప్రజలపైన రద్దుతున్న ఈనాడును ఏమనాలి. మరి తెలంగాణలో ఎందుకు నోరు మెదపడం లేదు. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ పేరెత్తడానికే గజగజలాడుతున్నారే. గత నాలుగేళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎంత బరితెగించి దాడి చేస్తూ వస్తున్నారు. కేవలం తెలుగుదేశం అధికారం కోల్పోయిందని, తమ ఎదుట కూర్చునే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోల్పోయారన్న దుగ్దతో పాటు తమ వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటాయన్న భయంతోనే కదా ఇలా చేస్తున్నారు. ఎక్కడ అక్రమాలు జరిగినా దానిపై చర్య తీసుకోవడమే కదా ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం ఇతరుల అక్రమాలపై చర్య తీసుకోకపోతే ఇంకేముంది .. ప్రభుత్వం కుమ్మక్కైపోయిందని రాసే ఈనాడు మీడియా తమ గ్రూప్ సంస్థలోని మార్గదర్శి అక్రమాలపై వార్తలు ఇస్తే మాత్రం దాడి అని ప్రచారం చేస్తున్నారు. ఇదంతా రామోజీ స్వయంకృతాపరాధం మాత్రమే కాదు. అహంకార పూరితంగా, తాను అన్నిటికి అతీతుడను అన్న భ్రమలో ఉండి చట్టాలను ఉల్లంఘించారు. ఒకప్పుడు రామోజీకి మద్దతుగా ప్రజలలో ఒకరకమైన భావం ఉండేది. కాని ఇప్పుడు అదే రామోజీ పై ప్రజలలో సానుభూతి లేకపోగా ఆయన ఏమి చేసినా చర్య తీసుకునే మగాడే లేడా అన్న ప్రశ్న ప్రజలలో తరచుగా వినిపిస్తోంది. వారందరికి జగన్ రూపంలో ఒక మగాడు కనిపిస్తున్నాడు. ఉండవల్లి కే కాదు.. చాలా మందికి ఇప్పుడు ఒక జవాబు దొరికింది కదా. వైఎస్సార్‌పై పగబట్టి వార్తలు రాసినా 2009లో ఆయనను రామోజీ ఓడించలేకపోయారు. ఇప్పుడు కూడా రామోజీ ఎంత విషం చిమ్మినా 2024లో కూడా అదే తరహాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రెడ్డి తిరిగి గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారు. పలు సర్వేలు కూడా ఇదే విషయం స్పష్టం చేస్తున్నాయి. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
తెస్తున్నా ఏడుపేనా?
రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి కీలకమైన రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించి రూ.వేల కోట్ల నిధులను విడుదల చేయటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధి, పట్టుదలే కారణమన్నది నిర్వివాదాంశం. ఆలస్యంగానైనా కేంద్రం నుంచి విడుదలవుతున్న నిధులే ఇందుకు నిదర్శనం! కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగి కూడా చంద్రబాబు సాధించలేని విభజన అంశాలను సీఎం జగన్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా చిక్కు ముడులను తొలగిస్తూ రాబడుతోంది. అవకాశం లభించిన ప్రతి సందర్భంలోనూ ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరిస్తూ సజీవంగా ఉంచుతోంది. సీఎం జగన్ కృషితో రాష్ట్రానికి నిధులు వస్తుంటే ఇప్పుడెందుకు ఇస్తున్నారనే తరహాలో రామోజీ కుళ్లు బుద్ధి చాటుకుంటున్నారు!! – సాక్షి, అమరావతి నాడు ఇచ్చిందే పది వేలు..!! రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014–15లో ఏర్పడిన రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా పూర్తి స్థాయిలో రాబట్టడంలో నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు దారుణంగా విఫలమయ్యారు. కాగ్ అకౌంట్స్ ప్రకారం రెవెన్యూ లోటు రూ.16,000 కోట్లు కాగా ఇక అది ముగిసిన అంశమని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొన్నా చంద్రబాబు నోరెత్తలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టాక పట్టు వదలకుండా ప్రధానితోపాటు నీతి ఆయోగ్‌తో దీనిపై పలు దఫాలు సంప్రదింపులు జరిపారు. ఈ మేరకు గణాంకాలతో కూడిన పత్రాలను అందచేయడంతో విభజన అంశాల సత్వర పరిష్కారానికి కేంద్రం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ క్రమంలో రెవెన్యూ లోటు భర్తీని పునఃపరిశీలించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.10,461 కోట్లను మంజూరు చేసింది. మరి ఈ విషయం రామోజీకి తెలుసా? తెలిసీ నటిస్తున్నారా? బకాయిలపై బాబు గజగజ.. ఓటుకు కోట్లు కేసు భయంతో అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి పరారై కరకట్టకు చేరుకున్న చంద్రబాబు తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, పలు సంస్ధల విభజన గురించి మాట్లాడితే ఒట్టు!! 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకు తెలంగాణకు సరఫరా చేసిన విద్యుత్ బకాయిల ఊసెత్తేందుకే గజగజలాడారు! సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టాక పలుదఫాలు ఒత్తిడి తెచ్చి బకాయిలు చెల్లించేలా కేంద్ర ప్రభుత్వంతో ఆదేశాలు జారీ చేయించారు. ఆంధ్రప్రదేశ్‌కు విద్యుత్ సరఫరా బకాయిల కింద రూ.7,230.14 కోట్లను చెల్లించాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించినందున ఇవాళ కాకపోతే రేపైనా చెల్లించక తప్పదు!! జీవనాడికి నిధుల కళ.. పోలవరంపై 2013–14 పాత ధరలను పక్కన పెట్టి తాజా ధరల మేరకు నిధులిచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పట్టుదలగా సీఎం జగన్ చేసిన ప్రయత్నాలతో పోలవరం తొలి దశ పూర్తికి రూ.12,911.15 కోట్లు మంజూరుకు అంగీకారం తెలిపింది. బిల్లుల చెల్లింపులో విభాగాల వారీగా విధించిన పరిమితులను తొలగించేందుకు కూడా సమ్మతించింది. నిధులు మంజూరును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదించారు. పోలవరాన్ని వేగంగా పూర్తి చేసేందుకు అడ్ హాక్‌గా నిధులు మంజూరు చేయాలని ప్రధాని మోదీని సీఎం జగన్ పలు సందర్భాల్లో కోరారు. ఈ నెల మొదటి వారంలోనే ఢిల్లీ పర్యటన సందర్భంగా పోలవరం నిర్మాణ వ్యయం రూ.55,656.87 కోట్లకు ఆమోదం తెలపాలని ప్రధాని మోదీని సీఎం జగన్ కోరారు. మరో 36 గ్రామాల్లో నిర్వాసితులకు సహాయ పునరావాసం ప్యాకేజీ అందిస్తే తొలిదశ పూర్తవుతుందని నివేదించారు. ఈ క్రమంలో పోలవరం తొలిదశ నిర్మాణానికి మొత్తంగా రూ.17,144 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.1,310.15 కోట్ల సొంత నిధులను వెంటనే రీయింబర్స్ చేయాలని అభ్యర్థించారు. పోర్టులు.. కడప స్టీల్ ప్లాంట్ దుగరాజపట్నం పోర్టు సాధనలో గత సర్కారు వైఫల్యాలు రామోజీ కంటికి కనపడలేదు. ఇప్పుడు దానికి బదులు రామాయపట్నం పోర్టు నిర్మాణానికి సీఎం జగన్ ప్రభుత్వం ఒకపక్క కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే మరో పక్క సొంతంగా నిర్మాణానికి చర్యలు చేపట్టింది. రామాయపట్నం తొలి దశ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. తొలి బెర్త్ నిర్మాణం జరుగుతుండటం రామోజీకి కనిపించలేదా? కడప స్టీల్ ప్లాంట్ గురించి విభజన చట్టంలోనే ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే కడప స్టీల్ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టింది. ముడి ఖనిజం కోసం మూడు గనులను ఏపీ ఎండీసీకి కేటాయించాలని ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ ప్రధానిని కోరారు. ఇది కేంద్రంపై ఒత్తిడి తేవడం కాదా? ఇక ఢిల్లీలో ఏపీ భవన్‌తో పాటు విభజన చట్టంలో పేర్కొన్న సంస్థల విభజన, ఆస్తుల పంపిణీపై కేంద్రంతో పాటు తెలంగాణపై కూడా సీఎం జగన్ ప్రభుత్వం ఒత్తిడి తెస్తూనే ఉంది. విశాఖ రైల్వే జోన్.. విశాఖ రైల్వే జోన్‌ను ఇప్పటికే ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. ఈ ప్రకటన వెలువడింది వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలోనే. గిరిజన విశ్వవిద్యాలయంపై ప్రకటన కూడా మన ఎంపీల ఒత్తిడితోనే సాధ్యమైంది. నాడు ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయాన్నే కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంగా ప్రకటించాలని చంద్రబాబు కోరడంతో కేంద్రం అందుకు నిరాకరించింది. సత్వరమే పెండింగ్ హామీలు పరిష్కరించండి ఈ నెల తొలి వారంలో ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో రాష్ట్ర విభజన పెండింగ్ హామీల గురించి సీఎం జగన్ మరోసారి ప్రస్తావించారు. ప్రత్యేక హోదా సహాం పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీలను వేగంగా నెరవేర్చాలని కోరారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకా శాలకు ప్రత్యేక హోదా ఎంతో దోహదపడుతుందని, రాష్ట్రం స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతుందని, దీనిపై సత్వరమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
పిల్లల చదువులపై రామోజీ క్షుద్ర ‘విద్య’!
సాక్షి, అమరావతి: పిల్లలు చక్కగా చదువుకోవడమే అంతిమ లక్ష్యం కావాలి! అందుకనే ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్.. ఇలా ఎక్కడ చదువుతున్నా సరే అర్హులందరికీ జగనన్న అమ్మ ఒడి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనాన్ని చేకూరుస్తోంది. మన విద్యార్థులు అంతర్జాతీయంగా రాణించేలా ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బాగు చేసేందుకు సీఎం వైఎస్ జగన్‌సర్కారు నాలుగేళ్లలో రూ.66,722.36 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది జగనన్న అమ్మఒడి కింద అందించిన రూ.6,392.94 కోట్లతో కలిపితే ఈ ఒక్క పథకానికే ఇప్పటివరకు రూ.26,067.28 కోట్లు వ్యయం చేసింది.ప్రభుత్వ స్కూళ్లు కళకళలాడుతుంటే కొందరు పెత్తందారులు మాత్రం పేదింటి పిల్లలకు ఈ చదువులేంటని కుళ్లుకుంటున్నారు. సర్కారు స్కూళ్లలో విద్యార్థులు తగ్గిపోయారంటూ క్షుద్ర కథనాన్ని వార్చేశారు. ► ఈనాడు లెక్కల ప్రకారం ప్రభుత్వ స్కూళ్లలో ఎన్రోల్మెంట్ 37.88 లక్షలు. ఇందులోనూ నిజం లేదు. ఇప్పటివరకు 38.22 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నారు. ఈ ఏడాది ప్రవేశాలు ఇంకా కొనసాగుతున్నాయి. అడ్మిషన్లకు మరో నెలన్నరకు పైగా సమయం ఇంకా మిగిలే ఉంది! మరి వేల మంది పిల్లలను రామోజీ కాకి లెక్కలతో ఏం చేసినట్లు? ► 2018–19లో ప్రాథమిక స్థాయిలో 92.91శాతంగా ఉన్న జీఈఆర్ 2022–23లో 100.80 శాతానికి చేరుకుంది. సెకండరీ విద్యలో 79.69 నుంచి 89.63 శాతానికి చేరింది. హయ్యర్ సెకండరీలో 46.88 నుంచి 69.87 శాతానికి పెరిగింది. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఉందా? ► జీఈఆర్‌ను పెంచేందుకు టెన్త్, ఇంటర్ ఫెయిలైన వారికి తిరిగి ప్రవేశాలు కలి్పంచడంతో పాటు మరోసారి అమ్మఒడిని ప్రభుత్వం అందిస్తోంది. ► పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు గతేడాది టాప్–10 ర్యాంకులు 25 లభించగా ఈ ఏడాది 64కు పెరిగాయి. 75 శాతానికి పైగా మార్కులతో డిస్టింక్షన్ సాధించిన విద్యార్థులు గతేడాది 63,275 మంది కాగా ఈ ఏడాది 67,114 మంది సత్తా చాటారు. గతేడాది 66.50 శాతం మంది ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణులు కాగా ఈ ఏడాది 70.16 శాతానికి పెరిగారు. ► ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఎస్సీ, ఎస్టీ గురుకులాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ చూపారు. 67 మంది ఐఐటీ, ఎన్ఐటీ, నిఫ్ట్, సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందారు. మరి ఈ విషయం రామోజీ చదివారా? విద్యా సంస్కరణల్లో మచ్చుకు కొన్ని.. ► ప్రభుత్వ స్కూళ్లల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.16,500కోట్లతో ‘మనబడి నాడు–నేడు’ ► డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ బైజూస్ కంటెంట్‌తో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, స్మార్ట్ టీవీలు ► ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంతోపాటు సీబీఎస్సీతో అనుసంధానం. ఇంగ్లిష్‌లో పావీణ్యం సాధించేలా 3వ తరగతి నుంచే ‘టోఫెల్’కు శిక్షణ. ► రూ.685.87 కోట్లతో 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు 5,18,740 ట్యాబ్‌ల పంపిణీ. ఏటా డిసెంబర్ 21న ఈ కార్యక్రమం నిర్వహణ. ► వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు కూడా బైజూస్ కంటెంట్, 45 వేల పాఠశాలల్లో ఇంటర్నెట్. మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ విధానం. గతంలో ఇదీ దుస్థితి... ► జగనన్న అమ్మ ఒడి లేదు. స్కూళ్లు తెరిచిన 6–7 నెలలకు కూడా యూనిఫాం సంగతి దేవుడెరుగు కనీసం టెక్ట్స్ బుక్స్ కూడా అందించలేని దుస్థితి. శిథిలావస్థలో స్కూళ్లు. ► రాగిజావ, చిక్కీ ఊసే లేదు. ఆయాల జీతాలు, సరుకుల బిల్లులు 8–9 నెలలు పెండింగ్‌లోనే. ► గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1,778 కోట్లు (వీటిని సీఎం జగన్ ప్రభుత్వం వచ్చాక చెల్లించి విద్యార్థులను ఆదుకుంది) ► విదేశీ విద్యా దీవెనలో అవకతవకలు, భారీగా బకాయిలు. -
పచ్చ విషం గక్కడమే పనిగా పెట్టుకున్నరామోజీరావు