సాక్షి, అమరావతి: చంద్రబాబు అరెస్ట్ విషయంలో టీడీపీ తీరు వింతంగా ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీడీపీకి అధికారం ఇస్తే ఆ పార్టీ అధినేతే అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు.
‘‘చంద్రబాబు తప్పు చేసినట్టు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. చంద్రబాబు పట్ల ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తున్నట్లు డ్రామాలు ఆడుతున్నారు. మార్గదర్శి షేర్ హోల్డర్‌ను బెదిరించి రామోజీ షేర్లు బదిలీ చేయించుకున్నారు. రామోజీ బెదిరింపుల పర్వం ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు, రామోజీ తప్పు చేసి ప్రజల మద్దతు కోరుతున్నారు’’ అంటూ సజ్జల ధ్వజమెత్తారు.
‘‘పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు. మార్గదర్శి షేర్ హోల్డర్ జీజేరెడ్డి కుటుంబాన్ని బెదిరించి షేర్లు బదిలీ చేయించుకుంది రామోజీ. చంద్రబాబు, రామోజీ ఎంత నీచమైన మనుషులో నిరూపితమైంది. రామోజీ ఎదుగుదలకు కారణమైన జీజేరెడ్డి కుటుంబాన్ని గౌరవంగా చూసుకోవాలి. జీజేరెడ్డి కుటుంబ సభ్యులను బెదిరించి బలవంతంగా షేర్లు లాక్కున్నారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం అయిన రెండు నెలలకే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు. కోర్టుల తీర్పులు ఎలా ఉన్నా వీళ్ల నిజస్వరూపం ప్రజలకు అర్థమవుతోందని సజ్జల అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment