అక్రమ కేసులకు భయపడం: సజ్జల | Sajjala Ramakrishna Reddy Fires On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులకు భయపడం: సజ్జల

Published Thu, Oct 17 2024 5:08 PM | Last Updated on Thu, Oct 17 2024 5:25 PM

Sajjala Ramakrishna Reddy Fires On Chandrababu Govt

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని.. ఇష్టానుసారం సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారంటూ ఆ పార్టీ సీనియర్‌ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. టీడీపీ కార్యాయలంపై దాడి చేశారంటూ పెట్టిన అక్రమ కేసులో మంగళగిరి పీఎస్‌లో విచారణకు గురువారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మీడియాతో మాట్లాడుతూ, అధికారం ఉందని అక్రమ కేసులు పెడుతున్నారు పాలనను గాలికొదిలేసి.. దాడులకు పాల్పడుతున్నారంటూ ధ్వజమెత్తారు.

వైఎస్సార్‌సీపీ శ్రేణులను భయపెట్టాలని చూస్తున్నారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగిన రోజు నేను అక్కడ లేను. దాడి జరిగిన రోజు నేను బద్వేలులో ఉన్నా. స్వేచ్ఛగా తిరగకుండా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమ కేసులతో ఎయిర్‌పోర్టులో కూడా ఆపుతున్నారు. ప్రజలు పాలించమని అధికారాన్ని ఇస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ కేసులు వైఎస్సార్‌సీపీ నేతల్లో ధైర్యాన్ని మరింత పెంచుతాయి.’’ అని సజ్జల స్పష్టం చేశారు.

120 నిందితుడిగా నా పేరు చేర్చారు. సంఘటన జరిగినప్పుడు నేను ఇక్కడ లేనే లేను. కానీ వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో నేను ఉన్నట్టు నేను చెప్పినట్లు వాంగ్మూలంలో ఉంది. అది ఎలా సాధ్యం?. నేను ఏదో చేయాలని చెప్పానంటా.. అప్పిరెడ్డితో చెప్పానంటా.. ఇదంతా కథలా లేదా?. స్టోరీలు రాస్తున్నారు.. ప్రొసిజర్స్ ఉంటాయి వాటిని ఫాలో అవ్వాలి. నేను కార్యాలయంలో ఉన్నట్లు పోలీసులు రాసుకున్నారు. స్వేచ్చగా తిరిగేందుకు లేకుండా కేసులు పెడుతున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతల్లో పట్టుదల పెరుగుతుంది.

ఇదీ చదవండి: ఇచ్చిన హామీలేంటి?.. బాబు చేస్తున్నదేంటి?: వైఎస్‌ జగన్‌

.. విష సంస్కృతి మొదలు పెట్టారు. విచారణ లేకుండానే ఎఫ్‌ఐఆర్‌లో ఎవరో వాంగ్మూలం ఇచ్చారని పేర్లు నమోదు చేస్తున్నారు. ప్రతిపక్షం లేకుండా చేయాలన్న భావిస్తే అది సాధ్యం కాదు. ఆ రోజు పట్టాభి ప్లాన్‌తోనే తప్పుడు మాటలు మాట్లాడారు. ఈ కేసును పొడిగించాలనే సీఐడీకి అప్పగించారు‌. ఎల్‌వోసి ఇవ్వడంపై కోర్టుకు వెళ్తాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement