![Kodali Nani Slams Yellow Media And Chandrababu Naidu At Vijayawada - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/15/KODALI-NANI.jpg.webp?itok=Dv7Q_ia3)
సాక్షి, విజయవాడ: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం కొంతమందికి ఇబ్బందిగా ఉందని మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియాతో కుమ్మకై సొంత డబ్బా కొట్టుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు లాంటి దద్దమ్మ పాలనలో ఇష్టం వచ్చినట్లు రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. బోగస్ న్యూస్ ఛానల్ (ఎబీఎన్)లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేందుకు పెద్ధిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టారని అసత్య ప్రచారం మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు లాంటి వెన్నుపోటు కార్యక్రమాలు మా పార్టీలో జరగవు అని స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్ రెక్కల కష్టంతో ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు. (చదవండి: మీ నీచ రాజకీయాలు రాష్ట్రం మొత్తం తెలుసు బాబూ)
మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ‘బోగస్ న్యూస్ ఛానల్ ప్రచారంతో ఎంత ప్రయత్నించినా సీఎం జగన్‌ను ఏం చేయలేరు. వెన్నుపోటు పొడిచే సంస్కృతి మాకు లేదు. వెన్నుపోటుతో మామను చంపి అందలం ఎక్కిన చంద్రబాబుకు ఆందరూ తనలాగే ఉంటారని భావిస్తున్నాడు. సీఎం జగన్ ప్రజల కోసం పార్టీ పెట్టి కష్టపడి ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి. ఆయనను సీఎం నుంచి దించేస్తే ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో ఏం జరిగిందో ప్రజలకు తెలుసు.
చంద్రబాబుకు రామోజీ రావు, రాధాకృష్ణ డైరెక్షన్ ఇచ్చి నడిపిస్తారు. డబ్బా ఛానెళ్ళు ద్వారా అసత్య ప్రచారాలు చేసినా ఉపయోగం లేదు. ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏం కావాలో సీఎం జగన్‌కు తెలుసు. ఆయనకు ఏం కావాలో ప్రజలకు తెలుసు. రామోజీ రావు, రాధాకృష్ణ, బిఅర్ నాయుడు, చంద్రబాబు ఎంత మంది కుట్ర దారులు వచ్చినా సీఎం వైఎస్ జగన్‌ను ఏం చేయలేరు. చంద్రబాబు పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎల్లో మీడియా పెద్దలు కోట్ల రూపాయల ప్రజాసొమ్ము కొల్లగొట్టారు. సచ్చే ముందు అయినా ఆ దుష్ట చతుష్టయం చిల్లర పనులు మానుకోవాలి. విశ్వాసం చూపి ఆంధ్రప్రజల ఋణం తీర్చుకోవాలి’ అని కొడాలి నాని హితవు పలికారు. (చదవండి: చంద్రబాబుకు తగిన శాస్తి చేస్తాం: కొడాలి నాని)
Comments
Please login to add a commentAdd a comment