
అప్పులతో చనిపోతే ప్రభుత్వానికి చుడతారా ?
కడపలో నేత కుటుంబం ఆత్మహత్య
వ్యసనాలతో రూ. 20 లక్షలు అప్పులు
తనదికాని కొండ భూమి పొందేందుకు తీవ్ర యత్నాలు
అది దక్కకపోవడం, ఇటు అప్పులతో తీవ్ర నిరాశ
అంతిమంగా భార్య, కుమార్తెను చంపేసి తాను ఆత్మహత్య
దీనికి ప్రభుత్వాన్ని లింక్ చేస్తూ రామోజీ రాతలు
ఎల్లోమీడియా అధినేత రామోజీరావు తన జీవితపు అంతిమ ఘడియల్లోనూ తన తన క్షుద్ర బుద్ధినిపోనిచ్చుకోవడం లేదు. రాష్ట్రంలో ఎక్కడ ఏ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నా దాన్ని ఏపీ ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అంటగట్టేందుకు ఎంతగానో తాపత్రయపడిపోతున్నారు.
కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరంలో సుబ్బారావు అనే చేనేత కార్మికుడు కుటుంబం విషాదాన్ని ప్రభుత్వం మెడకు చుట్టే ప్రయత్నం చేసిన ఈనాడు. వాస్తవానికి ఎక్కడో కొండల్లో ఉన్న ప్రభుత్వ భూమిని టీడీపీ హయాంలో రికార్డులను తారుమారు చేసే అధికారులను పట్టుకుని 2015 లో తన తండ్రిపేరు రికార్డ్ చేయించారు. తరువాత ప్రభుత్వం రికార్డులనుంచి ఆయన పేరును తొలగించింది.
అంతేకాకుండా ఆ భూమి గతంలో ఎన్నడూ. ఎవరికీ ఎసైన్ చేయలేదు. రాళ్ళూ, రప్పలతో ఉన్న ఆ భూమి కనీసం సాగుకు కూడా పనికిరాదు.. గతంలో ఎన్నడూ ఎవరూ అధికారికంగా అనధికారికంగా కూడా అక్కడ సాగు చేయలేదు.
ఆ భూమి తనకు ఇవ్వాలని ప్రభుత్వానికి సుబ్బారావు కూడా ఎన్నడూ అర్జీ కూడా పెట్టుకోలేదు.. ఏ అధికారిని కలవలేదు. జూదం.. క్రికెట్ బెట్టింగులు.. ఇతర వ్యసనాలతో ఇరవై లక్షల వరకు అప్పులు చేసి.. ఇటు కులవృత్తిని సైతం వదిలేసి ఇబ్బందులు పాలయ్యాడు.. దీంతో భార్యకుమార్తెను అయన హత్య చేసి తరువాత తానూ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక వివరాలను బట్టి తెలుస్తోంది. ఇలాంటి ఘటనలను సైతం ప్రభుత్వానికి అంటగట్టే కుట్రలకు ఎల్లో మీడియా తెగబడుతోంది.