False propaganda
-
బెడిసికొట్టిన టీడీపీ ఫేక్ ట్రిక్
దీని అర్థమేంటి చంద్రబాబూ..ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టు కేసులో మనీలాండరింగ్‌కు పాల్పడిన నిందితులకు చెందిన రూ.23.54 కోట్ల స్థిర, చర ఆస్తులను అటాచ్ చేశాం. డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్విల్కర్, భారత్‌లో సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్, ముకుల్‌చంద్ అగర్వాల్, సురేశ్ గోయల్ బోగస్ ఇన్వాయిస్లతో నిధులను షెల్ కంపెనీల ద్వారా అక్రమంగా మళ్లించినట్లు మా దర్యాప్తులో వెల్లడైంది. వారి బ్యాంకు ఖాతాలు, షేర్లు, స్థిరాస్తు లను జప్తు చేశాం. గతంలోనే డిజైన్‌టెక్‌కు చెందిన రూ.31.20 కోట్లను జప్తు చేశాం. వికాస్, సుమన్, ముకుల్, సురేశ్‌లను అరెస్టు చేశాం. తదుపరి విచారణ కొనసాగుతోంది. – ఈడీసాక్షి, అమరావతి: అడ్డంగా దొరికిన ప్రతిసారి తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మభ్యపెట్టడం చంద్రబాబు మార్కు రాజకీయ ఎత్తుగడ అని మరోసారి రుజువైంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) ప్రాజెక్టు పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టారని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిగ్గు తేల్చడంతో మరోసారి ఫేక్ ప్రచారం చీప్ ట్రిక్‌ను టీడీపీ తెరపైకి తెచ్చింది. ఈడీ జారీ చేసిన అధికారిక ప్రకటననే ట్యాంపర్ చేస్తూ మరీ చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతోపాటు కొన్ని ఇంగ్లీష్ పత్రికల్లో కూడా తప్పుడు సమాచారం ప్రచురితమయ్యేలా చేశారు. తద్వారా అబద్ధపు ప్రచారానికి రెక్కలు తొడిగుతూ తిమ్మినిబమ్మి చేసేందుకు యత్నించారు. అయితే ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టులో ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్టు ఈడీ స్పష్టం చేయడంతోపాటు, చంద్రబాబుతోపాటు తాము ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఈడీ తేల్చి చెప్పడంతో టీడీపీ ఎత్తుగడ బెడిసికొట్టింది. బోగస్ ఇన్వాయిస్లతో ప్రజాధనం కొల్లగొట్టారు 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ పేరిట భారీ అవినీతికి పాల్పడినట్టు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ ఓ ప్రకటనలో స్పష్టంగా వెల్లడించింది. అంతేకాదు అసలు ఆ ప్రాజెక్ట్‌నే చేపట్టలేదని, పరికరాలు సరఫరా చేయకుండానే చేసినట్టు బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి నిధులు విడుదల చేసినట్టు గుర్తించామని తెలిపింది. ఆ నిధులను సీమెన్స్ కంపెనీకి అప్పటి ఎండీ సుమన్ బోస్, డిజైన్‌టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్విల్కర్.. తమ సన్నిహితులు ముకుల్‌చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్) ద్వారా అక్రమంగా దారి మళ్లించినట్టు వెల్లడించింది. ఆ నిధులను షెల్ కంపెనీల ద్వారా సింగపూర్‌కు తరలించి.. అక్కడి నుంచి తిరిగి దేశంలోని ఏ ఖాతాలకు తిరిగి వచ్చాయన్న విషయాన్ని గుర్తించామని తెలిపింది. ఇప్పటికే రూ.70 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్టు నిర్ధారించింది. చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్ కంపెనీల ప్రతినిధులు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసి పలువురిని విచారించింది. ఈ కేసులో నిందితులు సుమన్ బోస్, వికాస్ ఖన్విల్కర్, ముకుల్‌చంద్ర అగర్వాల్, సురేశ్ గోయల్‌లను అరెస్టు చేయడంతోపాటు విశాఖపట్నంలోని పీఎంఎల్ఏ న్యాయస్థానంలో చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ గతంలోనే అటాచ్ చేసింది. తాజాగా రెండో విడతగా మరో రూ.23.54 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను మంగళవారం అటాచ్ చేసింది. దాంతో ఈ కేసులో ఈడీ ఇప్పటివరకు రూ.54.74 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్టైంది.టీడీపీ ఫేక్ ట్రిక్ ఇదీ..⇒ స్కిల్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచేసరికి చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే ఆయన అవినీతిని సిట్ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. దాంతోనే చంద్రబాబును గతేడాది సెపె్టంబర్ 9న అరెస్ట్ చేసింది. సిట్ నివేదికతో సంతృప్తి చెందిన న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉండాల్సి వచ్చింది. ⇒ ప్రస్తుతం ఈడీ కూడా దర్యాప్తు వేగవంతం చేసి స్కిల్ స్కామ్‌లో నిధులు కొల్లగొట్టిన తీరును నిరూపిస్తోంది. తాను నిధులు కొల్లగొట్టడంలో పాత్రధారులుగా చేసుకున్న షెల్ కంపెనీల ప్రతినిధులు వికాస్ ఖన్విల్కర్, సుమన్‌బోస్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేశ్ గోయల్‌లను ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఇక రెండో విడతలో వికాస్ ఖన్విల్కర్, సుమన్ బోస్ ఆస్తులను అటాచ్ చేసింది. అదీ టీడీపీ భాగస్వామిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వం ఉన్నప్పటికీ.. ఆ కుట్రలో తన భాగస్వాముల ఆస్తులను అటాచ్ చేయడం చంద్రబాబును బేంబేలెత్తిస్తోంది. ⇒ ఇక ఈడీ తదుపరి చర్యలు తనపైనే అని ఆందోళన చెందుతున్నారు. అందుకే ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు టీడీపీ తనకు అలవాటైన రీతిలో తప్పుడు ప్రచారం తెరపైకి తెచ్చింది. ఈ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు ఓ ఫేక్ ప్రకటనను సోషల్ మీడియాలో మంగళవారం రాత్రి నుంచి వైరల్ చేసింది. ఏకంగా ఈడీ అధికారికంగా ఇచ్చిన ప్రకటనలకు ముందు వెనుకా రెండు వాక్యాలు జోడించడం ద్వారా ట్యాంపర్ చేసి ఈ ప్రచారం చేయడం గమనార్హం. ⇒ ఈడీ పేరుతో రూపొందించిన ఆ ఫేక్ ప్రకటనను టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారంలోకి తెచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. ఏకంగా కొన్ని ఇంగ్లిష్ పత్రికల్లోనూ ఆ తప్పుడు సమాచారం ప్రచురితమయ్యేట్టు చేయడం చంద్రబాబు మార్కు మీడియా మేనేజ్మెంట్కు నిదర్శనం.ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదన్న ఈడీ చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు టీడీపీ చేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. తాము చంద్రబాబుతోపాటు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఈడీ హైదరాబాద్ విభాగం అధికారులు మీడియాకు తేల్చి చెప్పారు. షెల్ కంపెనీల ఆస్తులను అటాచ్ చేశామన్నారు. ఈ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోందని, ఇంకా పూర్తి కాలేదని కూడా ఈడీ తన అధికారిక ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది. దీంతో ఫేక్ ట్రిక్‌తో తాము చేసిన తప్పుడు ప్రచార ఎత్తుగడ బెడిసి కొట్టడంతో బుధవారం ఉదయం నుంచి టీడీపీ మౌన ముద్ర దాల్చింది. ఇక అసలు విషయం ఏమిటంటే.. గతంలో సీఐడీ సిట్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను ప్రాతిపదికగా చేసుకునే ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ ఎఫ్ఐఆర్లో చంద్రబాబును ఏ–1గా సీఐడీ పేర్కొంది. షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించారని ఇప్పటికే నిగ్గు తేల్చింది. స్కిల్ స్కామ్ కేసులో సిట్ న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను ఈ ఏడాది మార్చిలోనే ఈడీకి పంపించింది. అంటే చంద్రబాబు.. ఏ–1గా ఉన్న ఎఫ్ఐఆర్, చార్జిషీట్ ఆధారంగానే ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తోందని స్పష్టమవుతోంది. మరో వైపు ఈ కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారులు అందరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని కూడా ఈడీ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. అటువంటిది ఈడీ చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చిందని, టీడీపీ తప్పుడు ప్రచారం చేయడం విడ్డూరం. స్కిల్ కేసులో ఇప్పటికే పాత్రధారులైన షెల్ కంపెనీల ప్రతినిధుల బండారాన్ని బయటపెట్టిన ఈడీ.. ఇక అసలు సూత్రధారి చంద్రబాబు పాత్రను నిగ్గు తేల్చేందుకు ఉద్యుక్తమవుతున్నట్టేనని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. -
సహాయక చర్యలపై తప్పుడు ప్రచారం: కమలా హారిస్
వాషింగ్టన్: మిల్టన్, హెలెన్ హరికేన్ల సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై ట్రంప్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కమలా హారిస్ మండిపడ్డారు. నార్త్ కరోలినాలో వారం రోజుల పర్యటనలో భాగంగా రెండోరోజైన ఆదివారం ఆమె.. పలు చర్చిలకు వెళ్లి నల్లజాతీయులను కలిశారు. కోయినోనియా క్రిస్టియన్ సెంటర్లో ఆమె మాట్లాడుతూ.. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలకు సహాయం చేస్తున్న వారు నిజమైన హీరోలని కొనియాడారు. కానీ ఒక కీలక వ్యక్తి సహాయం చేయకపోగా, సొంత ప్రయోజనాలకోసం తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేస్తున్నారని ట్రంప్‌ను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షోభ సమయంలో రాజకీయ నాయకులు చేయాల్సింది అది కాదని హితవు పలికారు. హెలెన్ తుఫాను అనంతరం ఫ్లోరిడాలో పర్యటించిన ట్రంప్.. రిపబ్లికన్ల సహాయాన్ని ప్రభుత్వం కావాలనే నిలిపేస్తోందని ఆరోపించారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉన్న వలసదారుల కోసం ఖర్చు చేయడంతో ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీకి ఇవ్వడానికి నిధులు లేకుండా పోయాయయని విమర్శించారు. ట్రంప్ వ్యాఖ్యలపై హారిస్ పైవిధంగా స్పందించారు. కమలా హారిస్ ప్రసంగానికి ముందు బైడెన్ గల్ఫ్ తీరంలోని టంపా, సెయింట్ పీట్ బీచ్ మధ్య హెలికాప్టర్లో హరికేన్ నష్టాన్ని సర్వే చేశారు. మిల్టన్ ఊహించినంత నష్టం చేయలేదని, చాలామంది సర్వం కోల్పోయారని, వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విపత్తు సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్న ఫస్ట్ రెస్పాండర్లను బైడెన్ ప్రశంసించారు. ఇలాంటి సమయాల్లో డెమొక్రాట్లు, రిపబ్లికన్లుగా కాకుండా అమెరికన్లుగా పరస్పరం సహాయం చేసుకోవడం అభినందించదగ్గ విషయమన్నారు. సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులకోసం నిధులను మంజూరు చేశారు. పోలింగ్‌కు ఇంకా మూడు వారాల సమయమే ఉన్న నేపథ్యంలో వరుస తుఫానులు ఎన్నికలకు మరో కోణాన్ని జోడించాయి. -
నాకు యూట్యూబ్ ఛానల్ లేదు.. వారికి ఆర్కే రోజా వార్నింగ్
సాక్షి, విజయవాడ: తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి యూ ట్యూబ్ ఛానల్ లేదని.. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మాత్రమే వాడుతున్నానని ఆమె స్పష్టం చేశారు. ‘‘నా పేరుతో ఎవరో ఫేక్ యూట్యూబ్ ఛానళ్లు నడుపుతున్నారు. వాటి ద్వారా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. వారిపైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. తక్షణమే వాటిని తొలగించకపోతే చర్యలు తీసుకుంటా’’ అని ఆర్కే రోజా హెచ్చరించారు.అందరికీ నమస్కారం!!నా మిత్రులు మరియు అభిమానులు పార్టీ కార్యకర్తలు దయచేసి గమనించగలరు.నేను సామాజిక మాద్యమాల్లో మీ అందరికీ అందుబాటులో ఉండటానికి #facebook #Instagram , #twitter మరియు #threads మాత్రమే వాడుతున్నాను,నాకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదు దయచేసి గమనించగలరు. నా పై…— Roja Selvamani (@RojaSelvamaniRK) September 24, 2024 ఇదీ చదవండి: ‘లడ్డూ’ వెనుక బాబు మతలబు ఇదేనా?.. ఏదో తేడా కొడుతోంది -
వల్లభనేని వంశీ అరెస్ట్‌పై టీడీపీ తప్పుడు ప్రచారం
సాక్షి, కృష్ణాజిల్లా: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటన కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు.. గత రాత్రి సర్నాల రమేష్, ఈ రోజు ఉదయం యూసఫ్‌ను అరెస్ట్ చేశారు. అయితే, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేసింది. వంశీ అరెస్ట్‌పై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. -
‘సాక్షి’పై ఇన్ని అబద్ధాలా?.. కూటమి కుట్ర బట్టబయలు
సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు అదే పనిగా అబద్ధాలు చెబుతూ... వైఎస్ జగన్ ప్రభుత్వం ‘సాక్షి’ పత్రికకు అడ్డగోలుగా దోచిపెట్టేసిందని ఆరోపణలు చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల కూటమి ఇపుడు అసెంబ్లీలో నిజాలు చెప్పక తప్పటం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఏ పత్రికకూ అడ్డగోలుగా ప్రకటనలివ్వటం వంటివి జరగలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పటంతో... మరి ‘సాక్షి’ విషయంలో చేసిన ఆరోపణలన్నీ తప్పేనా? ఇలాంటి అబద్ధాలు ఇంకెన్ని చెప్పారో...!! అని ముక్కున వేలేసుకోవటం జనం వంతవుతోంది... ఇవిగో నిజానిజాలు...ఐదేళ్లలో‘సాక్షి’కిచ్చిన ప్రకటనల వివరాలివీ... వాస్తవానికి సమాచార శాఖ నిబంధనలు, ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) గణాం కాలను పరిగణనలోకి తీసుకునే వైఎస్సార్సీ ప్రభుత్వం వివిధ పత్రికలకు ప్రకటనలు ఇచ్చింది. శాసన సభలో టీడీపీ ఎమ్మెల్యేలు దూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్ తదితరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి పార్థసారథి ఇదే విషయాన్ని చెప్పారు. 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల సమయంలో సమాచార శాఖ ద్వారా సాక్షి పత్రికకు రూ.293 కోట్లు, వివిధ శాఖల ద్వారా రూ.78 కోట్లు. మొత్తం రూ.371 కోట్ల మేర ప్రకటనలు ఇచ్చినట్టు తెలిపారు.నిజానికి ఇక్కడే వాస్తవ సమాచారాన్ని కాస్త వక్రీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. సాక్షికి రూ.371 కోట్ల విలువైన ప్రకటనలిచ్చినా ‘ఈనాడు’ పత్రికకు తక్కువగా ఇచ్చారని. వాస్తవానికి ‘సాక్షి’ పత్రికలో ఐదేళ్లూ ప్రభుత్వ ప్రకటనలు ప్రచురితమయ్యాయి. కానీ ‘ఈనాడు’లో మూడున్నరేళ్లు మాత్రమే ప్రచురితమయ్యాయి. ఈ వాస్తవాన్ని మాత్రం కాస్తంత గోప్యంగా ఉంచారు మంత్రి పార్థసారథి. ఈ మూడున్నరేళ్ల వ్యవధిలోనే... ఈనాడుకు సమాచారశాఖ ద్వారా రూ.190 కోట్లు, వివిధ శాఖల ద్వారా రూ.53 కోట్లు.. మొత్తం రూ.243 కోట్లు విలువైన ప్రకటనలు ఇచ్చింది. మూడున్నరేళ్ల తరువాత ఈనాడు యాజమాన్యం తమకు ప్రభుత్వ ప్రకటనలు తాము ప్రచురించబోమని అధికారికంగా సమాచార శాఖకు లేఖ రాసింది. దాంతో చివరి ఏడాదిన్నర ఈనాడు పత్రికకు ప్రకటనలు ఇవ్వలేదు. అదీ.. ఈనాడు పత్రిక యాజమాన్యం స్వచ్ఛందంగా వద్దని లేఖ రాయడంతోనే, ఆ ఏడాదిన్నర కూడా ఈనాడు పత్రిక యాజమాన్యం ప్రకటనలు తీసుకొని ఉంటీ ప్రభుత్వం మరో రూ.125 కోట్ల వరకు విలువైన ప్రకటనలు ఇచ్చేది. దాంతో సాక్షి పత్రికతో సమానంగా ఈనాడు పత్రికకు కూడాప ప్రకటనల బడ్జెట్ కేటాయించినట్లు అయ్యేది.‘సాక్షి’కి బకాయిలు ‘ఈనాడు’కన్నా ఎక్కువే...బాబు ప్రభుత్వం మరో అబద్ధాన్ని కూడా తెరమీదికి తేబోయింది. అదేంటంటే ‘ఈనాడు’ పత్రికకు ప్రకటనల బిల్లులు పూర్తిగా చెల్లించకుండా ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని, అందుకే ‘ఈనాడు’ మూడున్నరేళ్ల తరవాత ప్రకటనలు తీసుకోలేదని. నిజానికి ‘ఈనాడు’కు ప్రభుత్వ ప్రగతిని తన పత్రికలో ప్రకటనల రూపంలో కూడా ప్రచురించటం ఇష్టం లేదు. అందుకే ప్రకటనలు వెయ్యలేమని లిఖితపూర్వకంగా చెప్పేసింది. వాస్తవానికి ‘ఈనాడు’కే కాదు. ‘సాక్షి’ పత్రికకు కూడా ప్రకటనల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.ఈనాడు పత్రికకు చెల్లించాల్సిన ప్రకటన బకాయిలు రూ.51 కోట్లు ఉండగా, వైఎస్సార్సిపీ ప్రభుత్వం అయినప్పటికీ సాక్షి పత్రికకు రూ.104.85 కోట్ల యాడ్స్ బకాయిలు పెండింగులో ఉన్నాయి. వాస్తవాలు ఇలా ఉంటే వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవటానికి అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రయత్నించబోయి బొక్కబోర్లా పడింది. నిజానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషలలో ప్రచురితమయ్యే 22 పెద్ద పత్రికలతో పాటు ఎన్నో చిన్న పత్రికలు, మేగజైన్లకు కూడా ప్రకటనలు ఇచ్చింది. మార్గదర్శకాలను ఏమాత్రం ఉల్లంఘించకుండా, వివక్షకు తావు లేకుండా ప్రకటనలు ఇచ్చింది. -
అసెంబ్లీ సాక్షిగా బాబు తప్పుడు లెక్కలు
-
KSR Live Show: బాబుది రోత పత్రం... జగన్ ది ఫ్యాక్ట్ పత్రం
-
‘ఎల్లో’ విష ప్రచారం.. పులివెందులలో ఎలాంటి రాళ్ల దాడి జరగలేదు: డీఎస్పీ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనపై ఎల్లో మీడియా విష ప్రచారానికి ఒడిగట్టింది. ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని పోలీస్ అధికారులు ఖండించారు. పులివెందులలో వైఎస్ జగన్ ప్రజా దర్బార్ నిర్వహిస్తుండగా, కార్యకర్తల తోపులాటలో కిటికీ అద్దాలు పగిలాయని.. ఎటువంటి రాళ్లదాడి జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు.పార్టీ కార్యాలయం వద్ద ఎటువంటి నినాదాలు చేయలేదని.. కేవలం వైఎస్ జగన్‌ను చూడడానికి ప్రజలు తరలిరావడంతో తోపులాట జరిగిందని పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ రెడ్డి తెలిపారు. -
సిగ్గు విడిచి.. చిలవలు పలవలు
సింగరాయకొండ/ఒంగోలు టౌన్: ఎక్కడ చిన్న గొడవ జరిగినా అది వైఎస్సార్సీపీకి అంటగట్టడం ఎల్లో బ్యాచ్‌కు అలవాటుగా మారింది. జరిగిన ఘటనపై టీడీపీ నేతలు వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. వెనువెంటనే వారి అనుకూల ఛానల్స్‌లో అసత్య కథనాలు మొదలైపోతాయి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో జరిగిన కారు దహనం ఘటన దానికి నిదర్శనంగా నిలిచింది. మూలగుంటపాడు పంచాయతీ విద్యానగర్‌లో టీడీపీ నేత చిగురుపాటి శేషగిరిరావు నివాసముంటున్నాడు.శుక్రవారం అర్ధరాత్రి అతని ఇంటి ఆవరణలోని కారుపై కొందరు పెట్రోలు పోసి తగలబెట్టారు. అయితే ఇది పాత కక్షల నేపథ్యంలో జరిగిందని, రాజకీయాలకు సంబంధంలేదని బాధితుడితోపాటు పోలీసులు చెబుతున్నా పచ్చ నేతలు దానికి రాజకీయ రంగు పులిమి శిలవలు పలవలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఒంగోలులో ఏఎస్పీ (క్రైం) శ్రీధర్‌రావు మీడియాకు వివరించారు. వ్యక్తిగత విద్వేషాలతోనే శేషగిరిరావును భయభ్రాంతులకు గురిచేసేందుకు కారు దహనానికి పాల్పడ్డారని, ఇందులో రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. అసలు జరిగింది ఇదీ.. సింగరాయకొండ లారీ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శేషగిరిరావుకు అదే గ్రామానికి చెందిన లాడ్జి యజమాని కనసాని ఈశ్వర్‌రెడ్డికి మధ్య భూ వివాదం ఉంది. ఈశ్వర్‌రెడ్డికి, అశోక్ అనే వ్యక్తికి మధ్య ఒక భూ వివాదానికి సంబంధించి మధ్యవర్తిగా వ్యవహరించిన శేషగిరిరావు అందుకు సంబంధించిన సెటిల్మెంట్ పత్రాలను తన వద్దనే ఉంచుకొన్నాడు. అయితే ఆ పత్రాలను తనకు ఇవ్వవలసిందిగా ఈశ్వర్‌రెడ్డి కొద్ది రోజులుగా అడుగుతున్నా ప్రయోజనం లేకుండా పోయింది. అంతేకాకుండా ఈశ్వర్ రెడ్డి మీద శేషగిరిరావు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు.దీంతో కక్ష పెంచుకున్న ఈశ్వర్ రెడ్డి తన వద్ద పనిచేసే పాలేటి అభిõÙక్ అతడి మిత్రుడైన ఒక మైనర్ సహాయంతో శేషగిరిరావు ఇంటివద్ద ఉన్న కారుపై పెట్రోలు పోసి తగలబెట్టించాడు. శేషగిరిరావు ఫిర్యాదు చేసిన వెంటనే ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ స్పందించారు. ఈ కేసును ఛేదించేందుకు అడిషనల్ ఎస్పీ (క్రైం) శ్రీధర్ రావు, ఒంగోలు డీఎస్పీ కిశోర్ కుమార్ల ఆధ్వర్యంలో 6 టీంలను రంగంలోకి దించారు. అన్నీ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు శనివారం మధ్యాహ్నం సింగరాయకొండ బైపాస్ వద్ద ఈశ్వర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. వైఎస్సార్ సీపీపై నింద వేసేందుకు ఒత్తిడి ఇందులో వ్యక్తిగత కక్షలు తప్ప రాజకీయ నేపథ్యం లేదు. అయితే ఈ ఘటనకు వైఎస్సార్సీపీయే కారణం అని ఫిర్యాదు చేయాలంటూ శేషగిరిరావుపై టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. వాస్తవానికి ఈశ్వరరెడ్డి వైఎస్సార్సీపీ నాయకుడు కాదు. ఆయనకు టీడీపీ నాయకులతో సంబంధాలున్నాయి. వాస్తవాలను కప్పిపుచ్చుతూ టీడీపీ, వైఎస్సార్సీపీల మధ్య వివాదంగా చిత్రీకరించాలని చూడడంపై స్థానికులు విస్మయం చెందారు. -
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
సాక్షి, విజయవాడ: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వ్యవస్థల మీద నమ్మకం పోయేవిధంగా వ్యవరిస్తున్నారన్నారు. ‘‘ప్రభుత్వాధినేత భూములు మింగేస్తారని చెప్పడం దేనికి సంకేతం’’ అంటూ టీడీపీపై ధ్వజమెత్తారు.అధికారంలోకి రావాలి అనుకున్నప్పుడు చేయాల్సిన విమర్శలు ఇవేనా?. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా?. అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ చట్టం తెచ్చారు. ఇంకా గజిట్ అవ్వలేదు చట్టం అమలు అవ్వలేదు. విధి విధానాలు ఖరారు అవ్వలేదు. ఎన్నికల కోసం ఈ రకంగా ప్రచారం చేస్తారా?’’ అంటూ సజ్జల మండిపడ్డారు.భూ అక్రమాలకు చెక్ పెట్టడం కోసమే చట్టం ఉద్దేశం. చట్టం తేవడం ఒక విప్లవాత్మక మార్పు. ల్యాండ్ గ్రాబింగ్ చేసింది టీడీపీ. టీడీపీ ప్రభుత్వంలో వెబ్ ల్యాండ్ పేరుతో చంద్రబాబు భూముల అక్రమాలకు పాల్పడ్డారు. వెబ్ ల్యాండ్ పోర్టల్‌లో మార్పులు చేసి ఎంతో మంది భూములను ఇబ్బందులోకి నెట్టారు. సీఆర్డీఏ పరిధిలోని భూములను డీమ్డ్ మ్యుటేషన్ పేరుతో అక్రమాలకు చంద్రబాబు పాల్పడ్డారు. సాదా బైనామా పేరుతో భూములు కొల్లగొట్టారు. అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారు. అరాచకానికి అడ్డుకట్ట వేసేందుకు జగన్ అడుగులు వేస్తున్నారు’’ అని సజ్జల పేర్కొన్నారు.తన అనుయాయులకు భూములు చంద్రబాబు కట్టబెట్టారు. లీజులకు తీసుకోవడం వాటిని కొల్లగొట్టడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది. కబ్జాలకు అలవాటు పడిన వాళ్లకి సంస్కరణలు నచ్చవు. సమగ్ర భూ సర్వే పూర్తి అయ్యాక భూముల రక్షణ విషయంలో పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. కబ్జాలు,అక్రమాలు, అన్యాయాలకు అడ్డుకట్ట పడుతుందని చంద్రబాబు భయపడుతున్నారు’’ అని సజ్జల చెప్పారు.‘‘భూముల వివరాలను ఏ కంపెనీకి ఇస్తున్నాం. అర్థరహితమైన ఆరోపణలు చేస్తారా. 190 దేశాల్లో భూముల వివాదాలపై సర్వే చేస్తే 154 స్థానంలో ఉన్నాం. కన్నాలు వేసే వాళ్లకి ఇటువంటి చర్యలు నచ్చవు. భూ సంస్కరణలు అమలు చేస్తుంటే చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆరు వేల గ్రామాల్లో భూముల రీ సర్వే పూర్తి అయ్యింది. రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తే దానికి అడ్డుపడుతున్నారు.’’ అని సజ్జల నిప్పులు చెరిగారు.‘‘చంద్రబాబు హయాంలో స్టాంప్స్ కుంభకోణాలకు పాల్పడ్డారు. పాస్ పుస్తకాలను డిజిటలైజ్ చేశాం. పుస్తకాలపై సీఎం జగన్ ఫోటో వస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి?. రాష్ట్ర ప్రజలకు లేని సమస్య చంద్రబాబుకు మాత్రమే వచ్చిందా?. ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేస్తానని చంద్రబాబు అంటే మాత్రం కచ్చితంగా శిక్షించాల్సిందే. సమగ్ర భూ సర్వే పూర్తి అయ్యాక మాత్రమే ఈ చట్టం అమలవుతుంది. ఇదే విషయాన్ని కోర్టుకు తెలిపాం. చట్టం అమలు అవ్వాలంటే మరో రెండు నుంచి మూడేళ్లు పడుతుంది’’ సజ్జల వివరించారు.‘‘కోవిడ్ వైరస్ కంటే చంద్రబాబు ముఠా ప్రమాదకరం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీపై ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నాం. ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలను బట్టి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి’’ అని సజ్జల పేర్కొన్నారు. -
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
సాక్షి, విజయవాడ: టీడీపీపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. కొద్దిరోజులుగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా టీడీపీ నిరాధార ఆరోపణలు చేస్తోంది. దీనిపై ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం.. విచారణకు సీఐడీని ఆదేశించింది. తక్షణమే నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.మా ఫిర్యాదుపై ఈసీ స్పందించింది: ఎమ్మెల్యే మల్లాది విష్ణుమార్కాపురం, ఒంగోలు సభల్లో సీఎం జగన్‌పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబుకు జగన్‌పై అసూయ తారా స్థాయికి చేరిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై బాబు అండ్ కో విషం చిమ్ముతోంది. ఐటీడీపీ సైట్లో విష ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ విలువలు, విశ్వసనీయత కోల్పోయారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఐవీఆర్ఎల్ సర్వేలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మా ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. చర్యలకు సీఐడీకి సిఫారసు చేసింది. చంద్రబాబు, పవన్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి’’ అని విష్ణు కోరారు.ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బాబు, పవన్ దుష్ప్రచారం: మనోహర్ రెడ్డిల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేస్తున్న విషప్రచారంపై ఈసీకి ఫిర్యాదు చేశామని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేస్తున్నారు. భూ వివాదాల పరిష్కారం కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై మోదీ సభలో మాట్లాడే ధైర్యం బాబు, పవన్‌లకు ఉందా?. అబద్దాల ప్రచారానికి టీడీపీకి ఓ యూనివర్సిటీ నే ఉంది’’ అని మనోహర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.కాగా, అమల్లో లేని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి తెలుగుదేశం పార్టీ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారం చేస్తోంది. ఓటర్లను తప్పుదారి పట్టిస్తోంది. ఇది ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు విరుద్ధం. టీడీపీపై తగిన చర్యలు తీసుకోండి’ అని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్ మీనాకు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు ఎ.నారాయణమూర్తి, న్యాయవాది కె.శ్రీనివాసరెడ్డిలు ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదుతో పాటు తగిన ఆధారాలను అందజేశారు. -
ఆత్మలనూ వాడుకుంటున్న రామోజీ
ఎల్లోమీడియా అధినేత రామోజీరావు తన జీవితపు అంతిమ ఘడియల్లోనూ తన తన క్షుద్ర బుద్ధినిపోనిచ్చుకోవడం లేదు. రాష్ట్రంలో ఎక్కడ ఏ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నా దాన్ని ఏపీ ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అంటగట్టేందుకు ఎంతగానో తాపత్రయపడిపోతున్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరంలో సుబ్బారావు అనే చేనేత కార్మికుడు కుటుంబం విషాదాన్ని ప్రభుత్వం మెడకు చుట్టే ప్రయత్నం చేసిన ఈనాడు. వాస్తవానికి ఎక్కడో కొండల్లో ఉన్న ప్రభుత్వ భూమిని టీడీపీ హయాంలో రికార్డులను తారుమారు చేసే అధికారులను పట్టుకుని 2015 లో తన తండ్రిపేరు రికార్డ్ చేయించారు. తరువాత ప్రభుత్వం రికార్డులనుంచి ఆయన పేరును తొలగించింది. అంతేకాకుండా ఆ భూమి గతంలో ఎన్నడూ. ఎవరికీ ఎసైన్ చేయలేదు. రాళ్ళూ, రప్పలతో ఉన్న ఆ భూమి కనీసం సాగుకు కూడా పనికిరాదు.. గతంలో ఎన్నడూ ఎవరూ అధికారికంగా అనధికారికంగా కూడా అక్కడ సాగు చేయలేదు. ఆ భూమి తనకు ఇవ్వాలని ప్రభుత్వానికి సుబ్బారావు కూడా ఎన్నడూ అర్జీ కూడా పెట్టుకోలేదు.. ఏ అధికారిని కలవలేదు. జూదం.. క్రికెట్ బెట్టింగులు.. ఇతర వ్యసనాలతో ఇరవై లక్షల వరకు అప్పులు చేసి.. ఇటు కులవృత్తిని సైతం వదిలేసి ఇబ్బందులు పాలయ్యాడు.. దీంతో భార్యకుమార్తెను అయన హత్య చేసి తరువాత తానూ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక వివరాలను బట్టి తెలుస్తోంది. ఇలాంటి ఘటనలను సైతం ప్రభుత్వానికి అంటగట్టే కుట్రలకు ఎల్లో మీడియా తెగబడుతోంది. -
ఏది సత్యం? ఏదసత్యం?
‘ఏకం సత్ విప్రాః బహుధా వదంతి’ అనేది ఉపనిషత్ వాక్యం. ఉన్నది ఒకటే సత్యం. దానినే పండితులు అనేక రకాలుగా చెబుతారని దీని అర్థం. వెలుతురు ఉన్న లోకంలో చీకటి ఉన్నట్లే,వసంతం ఉన్న ప్రకృతిలో శిశిరం ఉన్నట్లే సత్యం ఉన్న ప్రపంచంలో అసత్యం కూడా ఉనికిలో ఉంటుంది. అది సహజం. ‘సత్యమేవ జయతే’– ఇది కూడా ఉపనిషత్ వాక్యమే! మన దేశం గణతంత్ర రాజ్యంగా అవతరించిన రోజున ఈ వాక్యాన్ని జాతీయ ఆదర్శంగా స్వీకరించాం. ‘సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్/ నబ్రూయాత్ సత్యమప్రియం/ ప్రియంచ నానృతం బ్రూయాత్/ ఏష ధర్మ స్సనాతనః’– ఇది సుభాషిత శ్లోకం. ఎప్పుడూ సత్యాన్నే పలకాలి. సత్యాన్ని ప్రియంగా పలకాలి. సత్యమే అయినప్పటికీ అప్రియంగా పలుకరాదు. ప్రియమైనదే అయినంత మాత్రాన అసత్యాన్ని పలుకరాదు. ఇదే సనాతన ధర్మం అని ఈ శ్లోకానికి అర్థం. అనాదిగా ప్రచారంలో ఉన్న ఉపనిషత్ వాక్యాలను, సుభాషిత శ్లోకాలను గమనిస్తే, అవన్నీ సత్యం పట్ల నిబద్ధతకు అద్దం పడతాయి. సత్యం కోసం సర్వస్వాన్నీ వదులుకున్న సత్యహరిశ్చంద్రుడి కథ మన జాతిపిత మహాత్మా గాంధీ సహా ఎందరికో ఆదర్శప్రాయం. మరి సత్యసంధతపై ఇంత కట్టుదిట్టమైన పునాదులు ఉన్న మన దేశం నలుచెరగులా నిరంతరం సత్య వాక్కులే వినిపిస్తూ ఉండాలి కదా! సత్యమే వర్ధిల్లుతూ ఉండాలి కదా! అలా అనుకుంటే అది అమాయకత్వమే! దీపం కింద నీడలా సత్యాన్ని అంటిపెట్టుకుని అసత్యమూ ఉంటుంది. సత్యానిదే అంతిమ విజయం కావచ్చు గాక, కాని అప్పుడప్పుడు అసత్యం బలం పుంజుకుని లోకంలో అనర్థాలకు కారణమవుతుంది. అసత్యం తెచ్చిపెట్టే అనర్థాలకు ఉదాహరణలు మన రామాయణ, మహాభారతాల్లో దొరుకు తాయి. రామబాణం తాకినప్పుడు మాయలేడి రూపంలోని మారీచుడు ‘హా సీతా! హా లక్ష్మణా!’ అంటూ రాముడి గొంతుతో ఆర్తనాదాలు చేసి, సీతాపహరణానికి కారకుడయ్యాడు. కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మరాజు ‘అశ్వత్థామ హతః’ అని బిగ్గరగా పలికి, భేరీనాదాలు మోగే సమయంలో ‘కుంజరః’ అని గొణిగి ద్రోణాచార్యుడి మరణానికి కారకుడయ్యాడు. అబద్ధం చేసే అలజడి మార్మోగే సమయంలో మనకు మెదడు పనిచేయదు. వెనువెంటనే నిజాన్ని తెలుసుకోగల వ్యవధి ఉండదు. నిజాన్ని తెలుసుకునే వ్యవధిలోగానే అబద్ధం నానా అనర్థాలను కలిగిస్తుంది. అసత్య ప్రచారం అట్టహాసంగా సాగుతున్నప్పుడు సత్యమేదో, అసత్యమేదో తేల్చుకోవడం దుస్సాధ్యంగా మారుతుంది. పత్రికలు మొదలయ్యాక ఆధునిక ప్రపంచంలో అసత్య ప్రచారం బలం పుంజుకోవడం మొదలైంది. అబద్ధాలకు పత్రికలు ఊతమివ్వగల అవకాశాలను తొలి తరాల్లోనే కొందరు రాజకీయవేత్తలు గుర్తించారు. పత్రికల ద్వారా అబద్ధాలను ప్రచారం చేయడాన్ని హిట్లర్ అనుయాయి గోబెల్స్ ఒక కళలా సాధన చేశాడు. ‘ప్రజాభిప్రాయాన్ని మలచే కార్యక్రమాన్ని పర్యవేక్షించే పూర్తి అధికారం రాజ్యానికి ఉంది’ అనేది గోబెల్స్ జ్ఞానగుళిక. రెండో ప్రపంచ యుద్ధకాలంలో నాజీ నిరంకుశ రాజ్యానికి గొంతునిచ్చిన గోబెల్స్‌ను ఆరాధించేవారు ప్రపంచంలో నేటికీ ఉన్నారు. నిజానికి ఇప్పుడు గోబెల్స్‌కు బాబుల్లాంటి వాళ్లు పుట్టుకొచ్చారు. ఇలాంటి పరిస్థితులను చూడటం వల్లనే కాబోలు ‘ఏది పుణ్యం, ఏది పాపం/ ఏది సత్యం, ఏదసత్యం? / ఏది నరకం, ఏది నాకం?/ ఓ మహాత్మా, ఓ మహర్షీ!’ అని వాపోయాడు మహాకవి. ఇది హైటెక్కు టమారాల యుగం. ఇది సమాచార విప్లవశకం. స్మార్ట్ఫోన్ల ఆవిష్కరణతో ప్రపంచం పిడికిట్లో ఇమిడిపోయిన కాలం. క్షీరనీర న్యాయంగా అబద్ధాల నుంచి నిజాలను వేరు చేయగల హంసలు బొత్తిగా కరవైపోతున్న రోజులివి. నిజం వేషాన్ని ధరించిన అబద్ధాన్ని గుర్తించడం అగ్నిపరీక్షగా మారిన రోజులివి. సమాచార ప్రచారానికి ఒకప్పుడు వార్తాపత్రికలు, రేడియో మాత్రమే ఆధారంగా ఉండేవి. ఇప్పుడు ఇరవై నాలుగు గంటలూ ప్రసారాలతో ఊదరగొడుతున్న టీవీ చానళ్లు, నిరంతర కథనాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వార్తా వెబ్సైట్లు, వీటికి తోడుగా సామాజిక మాధ్యమ సాధనాలు అనుక్షణం జనాల మీదకు పుంఖాను పుంఖాలుగా సమాచారాన్ని వదిలిపెడుతున్నాయి. వరద ఉద్ధృతి ఉప్పొంగినప్పుడు జలప్రవాహంతో పాటు చెత్తా చెదారం కొట్టుకొస్తుంటాయి. నిర్విరామంగా సాగే నిరంతర సమాచార ప్రవాహంలో సత్యంతో పాటు అర్ధసత్యాలు, అసత్యాలు కూడా అలాగే కొట్టుకొస్తుంటాయి. గుట్టలు గుట్టలుగా పోగుపడుతున్న అసత్యాలు, అర్ధసత్యాల అడుగున సత్యం కనుమరుగుగా ఉంటుంది. సత్యాన్ని మరుగుపరచేలా సాగుతున్న అసత్యాల, అర్ధసత్యాల సమాచార ప్రవాహం సమాచార కాలుష్యాన్ని పెంచుతోంది. సమాచార కాలుష్యం ప్రపంచానికే పెనుముప్పుగా పరిణమిస్తోంది. అబద్ధాల రణగొణల మధ్య నిజాల గొంతు వినిపించకుండా పోతున్న పరిస్థితి ఏర్పడుతోంది. తప్పుడు సమాచారం ప్రపంచ దేశాలకు ప్రమాదకరంగా మారుతోందని ఇటీవల ప్రపంచ ఆర్థిక వేదిక తన ‘గ్లోబల్ రిస్క్ రిపోర్ట్–2024’లో వెల్లడించింది. అసత్యాలు, అర్ధసత్యాలతో హోరెత్తిస్తున్న తప్పుడు సమాచారం ప్రపంచ దేశాల్లో ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించడమే కాకుండా, రాజకీయ అస్థిరతకు, అశాంతికి, హింసకు, ఉగ్రవాదానికి దారితీస్తుందని ప్రపంచ ఆర్థిక వేదిక సమర్పించిన ఈ నివేదిక హెచ్చరించింది. ‘సత్యమేవ జయతే’ అని జాతీయ ఆదర్శంగా చెప్పుకుంటున్న మన భారతదేశమే తప్పుడు సమాచారం వ్యాప్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలవడం వర్తమాన విషాదం. -
Yellow Media: ఈ పత్రికలు చదవడానికా? సైకిల్ తుడవడానికా?
కోరల నిండా విషం నింపుకున్న పాములకన్నా.. వాళ్ళిద్దరూ ఇంకా ప్రమాదకరం.. వాళ్ళు చిమ్మే ఎల్లో పాయిజన్ పాము విషం కంటే అత్యంత ప్రమాదకరం. తప్పుడు కథనాలు, అసత్య ప్రచారాలతో ఎల్లో మీడియా జగన్‌పై, జగన్ సర్కార్‌పై విషం చిమ్ముతోంది.. మొదట్లో ఒకటి రెండు డోస్ మాత్రమే పాయిజన్ కనిపించేది. ఇప్పుడు లీటర్ల కొద్దీ విషం కక్కుతున్నారు. ప్రతిరోజూ తప్పుడు వార్తలు, అసత్య కథనాలతో తమ పత్రికల్ని నింపేస్తున్నారు. వాటిని పత్రికలు అనడం కటంటే.. విష పుత్రికలు అనడమే కరెక్ట్.. క్రమంగా విషపు రాతల డోస్ పెంచుతూ వచ్చారు. ఎంతలా అంటే మన ఊహలకు అందనంతలా ఇప్పుడు డోస్ పెంచారు. ఒక్కో పత్రిక రోజుకు 50కి పైగా విషపు వార్తలు రాస్తోంది. అంటే ఆ రెండు ఎల్లో పత్రికలు రోజుకు వందకు పైగా విషపు రాతలు రాసి జనాలపైకి వదులుతున్నాయి. సీఎం జగన్ ప్రభుత్వంపై పూర్తిగా బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. ఇంతకీ ఎందుకు ఇంతలా విషం చిమ్ముతున్నారు? పనికట్టుకుని మరీ ఎందుకిలా రోత పుట్టించే రాతలు రాస్తున్నారు ? ఈ పత్రికలు చదవడానికా ? సైకిల్ తుడవడానికా ? జర్నలిజం అనే సీసా ఒక ఇజంతో ఒక నిజంతో నిండి ఉంటుంది. అందులో ఉన్న ఆ ఇజాన్ని నిజాన్ని పక్కన పడేసి పూర్తిగా అందులో విషాన్ని నింపి... రాజకీయాల్లో దాన్ని శత్రువులపై అస్త్రంగా వాడుకోవచ్చని మూడు దశాబ్దాల క్రితమే గుర్తించిన దొంగ విజన్ వున్నోడు నారా రూప చంద్రబాబు నాయుడు. మీడియా ఏం చెప్పినా జనం నమ్ముతారు.. మీడియా ఏం చెప్పినా జనం వింటారని అప్పట్లోనే గుర్తించి మెల్లగా కొన్ని పత్రికలను తన విష పుత్రికలుగా మార్చుకుని స్లో పాయిజన్ మాదిరిగా తప్పుడు వార్తలు జనంలోకి తీసుకెళ్లిన ఘనత పచ్చ బాబుకే దక్కుతుంది. జర్నలిజం విలువలు పూర్తిగా దిగజార్చిన ఖ్యాతి కూడా ఆయనదే..! అతను విసిరే బిస్కెట్ల కోసం ఆశపడే శునక జాతి.. జర్నలిజాన్ని అమ్ముడుపోయే వస్తువుగా మార్చేసింది. జాతి జనుల కంటే..తమ జాతి గాడి ప్రయోజనాల కోసం మీడియా విలువల్ని కిలో మీటర్ లోతులో గొయ్యి తీసి పాతి పెట్టిన క్రెడిట్ మాత్రం మన ఎల్లో తాతగారికి, అందరి కుర్చీ కింద కూర్చుని, బాత్ రూముల్లో దాక్కుని రహస్య వార్తలు సేకరించే కృష్ణయ్యగారికే దక్కుతుంది. అసలు ఎందుకీ విషపు రాతలు? వీళ్లు చేస్తున్నది జర్నలిజమా ? చంద్రబాబుకు ఊడిగమా ? ఇవి పత్రికలా.. పత్రికలకు పట్టిన పీడా ? ఈ పత్రికలు చదవడానికా ? సైకిల్ తుడవడానికా ? అడ్డగోలు రాతలు రాసి అడ్డంగా బుక్కై పోయామా.. అయినా డోంట్ కేర్. పట్టపగలు నట్ట నడివీధిలో నగ్నంగా పట్టుబడ్డామా.. అయినా డోంట్ కేర్. పచ్చి అబద్ధాలు చెప్పి పక్కా ఆధారాలతో పచ్చిగా దొరికిపోయామా...అయినా డోంట్ కేర్. అందరి ముందు ముసుగు తొలగిపోయి నిజస్వరూపం బయట పడిపోయిందా...అయినా డోంట్ కేర్. ప్రతిరోజూ వందకు పైగా తప్పుడు వార్తలు రాసేద్దాం.. ప్రజల మధ్యకు వదిలేద్దాం..! జగన్ చేస్తున్న సంక్షేమాన్ని, అబివృద్దిని పచ్చ పత్రికలతో కప్పేద్దాం ...ఇలానే ఉంది ఈ విష పత్రికల తీరు. ఒక్క మాటలో చెప్పాలంటే బాబుగారి కూలి పత్రికలు.. ప్రభుత్వంపై బురద జల్లేందుకు పోటీ పడతాయి.. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడంలో ముందుంటాయి.. మంత్రులు, వైఎస్ఆర్ సీపీ నేతలపై విమర్శలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తాయి.. ప్రభుత్వం చేసే మంచి పనులపై తప్పుడు రాతలు రాయడంలో మేమే ఫస్ట్ అంటాయి. పేదలపై విషం చిమ్మేందుకు ప్రయత్నిస్తాయి. మంచి చేసే వ్యవస్థలను నోటికొచ్చిన ఆరోపణలు చేయడంలో పోటీ పడతాయి. వీటి పనేంటో తెలుసా.. ప్రజలకు నిజాలు చెప్పడం కాదు. అందంగా అబద్ధాలను వండి వార్చడం. ప్రభుత్వంపై లేని వ్యతిరేకతను సృష్టించడం. తప్పుడు వార్తలు ప్రచారం చేయడం. బాబుగారి కూలి పత్రికలు అదే పనిగా అబద్ధాలను అచ్చేసి వదిలేస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.. అవేంటో ఒక్కసారి చూద్దాం... 1. ప్రభుత్వంపై ఎందుకిలా విషం చిమ్ముతున్నారు? 2. ప్రతిరోజూ వందకు పైగా తప్పుడు కథనాలు ఎందుకు వండి వారుస్తున్నారు ? 3. ఈ పత్రికలు చదవడానికా ? సైకిల్ తుడవడానికా ? 4. వీళ్లు చేస్తున్నది జర్నలిజమా ? చంద్రబాబుకు ఊడిగమా ? పదే పదే బాబుగారి విషపు పత్రికలు అబద్ధాలను అచ్చేస్తున్న వేళ వినిపిస్తున్న ప్రశ్నలివే! ఎల్లో తాతగారి పత్రిక, కుర్చీ కింద కృష్ణయ్య గారి పత్రిక ఒక్కసారి ఓపెన్ చేసి తీక్షణంగా చూడండి. మొదటి పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు ఓసారి ప్రభుత్వ వ్యతిరేక వార్తలు లెక్క పెట్టి చూడండి. ఒక్కో పత్రికలు సుమారుగా 50కి పైగా వార్తలు మీకు కనిపిస్తాయి. అంటే ఈ రెండు పత్రికల్లో రోజుకు సుమారుగా వందకు పైగా తప్పుడు కథనాలు వండి వారుస్తున్నారన్న మాట. ఈ లెక్కన ఏడాదికి 365 రోజులు అంటే.. 36 వేల 500 తప్పుడు వార్తలు. అవును ఎవరు నమ్మినా నమ్మకపోయినా.. ఇది నిజంగా నిజం. ఇంకా డౌట్ ఉంటే ఓ వారం రోజులు ఆ దిక్కుమాలిన పేపర్లు దగ్గర పెట్టుకుని.. విషపు వార్తలు ఎన్ని వున్నాయో లెక్క పెట్టి చూడండి... నేను చెప్పిన లెక్క తక్కువ కాదు ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. వీటి పనంతా ప్రభుత్వంపై బురద జల్లడం ప్రభుత్వాన్ని బద్నాం చేయడం. దీనికోసం బాబుగారి నుంచి సెపరేట్ పేమెంట్లు ఉంటాయ్. ఇటు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు, ఇంచార్జీల మార్పులు చేర్పులు చేస్తుంటే దానిపైనా విషం కక్కుతున్నారు. ముందు రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్లు మాకొద్దు బాబోయ్ మాకొద్దు అంటున్నారని ఓ వార్త రాస్తారు. మరుసటి రోజు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కో టికెట్ కోట్లు పలుకుతోందని రాస్తారు. ఆ వార్తకు ఈ వార్తకు అసలు సంబంధమే లేదు. ఏదేమైనా జనాల మెదళ్లలోకి విషాన్ని నింపడమే వీళ్ల టార్గెట్. మరి టీడీపీకి రాజీనామా చేస్తానని ఎంపీ కేశినేని నాని ప్రకటిస్తే మాత్రం ఆ వార్త జోలికి పోరు. వాటిని మెయిన్ పేజీల్లో అచ్చేయరు. అలా చేస్తే బాబుకు డ్యామేజీ కాబట్టి. ఈసారి ఎన్నికల్లో గెలిచే దారి బాబుకు కనిపించడం లేదు. కొడుకుతో పాదయాత్ర చేయించాడు కుదర్లేదు. జైల్లో ఉండగా భార్యతో చెక్కులు పంపిణీ చేశాడు పావుకిలో సింపతీ రాలేదు. పీకేను తెచ్చేకున్నాడు ఉపయోగం లేదు. మరో పీకేతో చర్చలు జరిపాడు.. అయినా నమ్మకం కుదర్లేదు. ఎయిర్ పోర్టులో డీకేను కలిశాడు.. అయినా ఐసీయూలో ఉన్న పార్టీని బతికించే దారి కనిపించ లేదు. కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాడు.. అయినా జగన్ అదరలేదు బెదరలేదు. ఇక చేతిలో ఉన్న అన్నీ అస్త్రాలు వాడేసిన బాబు.. మిగిలిన ఒకే ఒక్క విషపు అస్త్రాన్ని మరింత బలంగా వాడుతున్నాడు. అదే ఎల్లో మీడియా. ఆంధ్రాలో జనరంజక పాలన నడుస్తుంటే.. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతుంటే.. అభివృద్ధి పరుగులు పెడుతుంటూ.. చూసి ఓర్వలేక అబద్ధాలను అచ్చేసి ఆనందిస్తున్నారు చంద్రబాబు, ఆయన కూలి మీడియా. నిజం చెప్పకపోవడం అబద్ధం.. అదే అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం..! ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మీరు చేస్తోంది పచ్చి మోసం. దానికి తగిన మూల్యం త్వరలోనే చెల్లించుకోక తప్పదు. సార్ ఒక్క విషయం చెప్పనా.. 700 సంవత్సరాల క్రితం బద్దెన ఓ పద్యం రాసారు శార్.. తలనుండు విషము ఫణికిని....వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్...తలతోక యనక యుండును.. ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ! పాముకి తలలో, తేలుకు తోకలో విషం వుంటుంది...కానీ శరీరమంత విషం నిండిన వారు ఈ భూలోకంలో ముగ్గురే ముగ్గురు వున్నారు.. కుప్పం, ఎల్లో తాత, బాత్ రూం క్రిష్ణయ్య.. చెప్పాను కదా 700 సంవత్సరాల క్రితమే ఈ ముగ్గురు గురించి... బద్దెన ఊహించారు. అందుకే ఈ పద్యం రాశారు. చదవండి: రామోజీకి గోనె ప్రకాశరావు బహిరంగ లేఖ -
ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డిపై ఎల్లో మీడియా ఏడుపునకు కారణాలెన్నో..!
ఏయూ ప్రగతిని అడ్డుకునే కుట్రలో భాగంగా విద్యా వ్యాపార రంగంలో పాతుకుపోయిన ఎల్లోగ్యాంగ్.. మీడియా ముసుగులో తెర వెనుక చేరి.. వీసీ ప్రసాద్‌రెడ్డిపై విషం చిమ్ముతోంది. ప్రైవేటు వర్సిటీల అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిష్టాత్మక యూనివర్సిటీని తెలుగుదేశం పార్టీ పట్టించుకోకపోవడంతో మసకబారిన ఆంధ్ర విశ్వవిద్యాలయం.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతో కొత్త ఊపిరులందుకుంది. ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా మరలా ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి నియామకంపై ఎల్లో ఏడుపులు మాములుగా లేవు. ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి 2019లో మొదటిసారి వీసీగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి చాలా ధైర్యంగా తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల మూలంగా సామాజిక, రాజకీయ, ఆర్ధిక ఇబ్బందులను ఎల్లో గ్యాంగ్ ఎదుర్కొంది. ఎల్లో మీడియా ఏడుపునకు కారణాలు చాలానే ఉన్నాయి. నారా లోకేష్ తోడల్లుడుకి చెందిన గీతం సంస్థకు పోటీగా ఏయూలో సౌకర్యాలను మెరుగుపరిచి, క్యాంపస్ రూపురేఖలు మార్చి, తరగతి బోధన విధానాలను మెరుగుపరిచి, హాస్టళ్లను ఆధునీకరించి, 150కి పైగా ఇంక్యుబేషన్ సెంటర్లు, స్టార్టప్‌లను మొదలుపెట్టి ఏయూని దేశంలోనే ఒక ప్రఖ్యాత సంస్థగా మార్చారు. దీనికి రుజువు ఈమధ్యనే ఏయూని సందర్శించిన NAAC (National Assessment Accreditation Council) టీమ్ ఏయూకి 4 మార్కులకుగాను 3.74 మార్కులను వేసి ఏయూకి ప్రతిష్టాత్మక NAAC A++ ర్యాంక్ ప్రకటించింది. నగరం నడిబొడ్డున ఏయూని ఆనుకుని ఏయూ చుట్టూ ఉన్న భూములను దశాబ్దాలుగా ఆక్రమించి వ్యాపార సముదాయాలు నిర్మించి వ్యవహారాలు నడిపిన కుహనా ఖద్దరు చొక్కాల చెర నుంచి వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను విడిపించి ఆక్రమణదారుల పీచమనిచారు. దీంతో ఎల్లోగ్యాంగ్ గుక్కపట్టి ఏడ్చారు. యూనివర్శిటీ గ్రౌండ్, చుట్టూ ఉండే పరిసరాలను పూర్తిగా ప్రక్షాళించి తుప్పలు పొదలు లేకుండా పరిశుభ్రం చేసి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు సాగించేందుకు ఏ చిన్న అవకాశం లేకుండా కట్టడి చేయడంతో ఎల్లో గ్యాంగ్ ఆపసోపాలు పడ్డారు. ఇంతకుముందు ప్రభుత్వాన్నో, ఏయూ ఉన్నత అధికారులనో ఇబ్బందులు పెట్టాలంటే ఏయూ క్లాసుల్లోకి వెళ్లి బలవంతంగా విద్యార్థులను బయటకు తీసుకొచ్చి ధర్నాలు చేయించి పబ్బం గడుపుకునే కుహనా యువ రాజకీయ విద్యార్థి లీడర్స్ తోకలను కత్తిరించి వారిని క్యాంపస్ నుంచి బయటకు పంపారు. ఎల్లోగ్యాంగ్ హాహాకారాలు చేశారు. రాజకీయ మీటింగ్‌లకు కుల సంఘాల మీటింగ్‌లకు బలవంతంగా ఏయూ ఉద్యోగులు విద్యార్థుల నుంచి చందాలు వసూలు చేసే కుల విద్యార్థి సంఘాల కుహనా వ్యక్తులను క్యాంపస్ లోకి అడుగుపెట్టకుండా కట్టడి చేయడంతో ఎల్లోగ్యాంగ్ పెడబొబ్బలు పెట్టారు. హాస్టళ్లలో మత్తు పదార్థాలను చొప్పిస్తూ అసాంఘిక కార్యకలాపాలు సాగించే బేవర్స్‌లను మెడ పట్టుకుని బయటకు గెంటి ఏయూ ప్రశాంతతని కాపాడటంతో ఎల్లోగ్యాంగ్ విలవిల్లాడిపోయారు. ఒకప్పుడు దెయ్యాల కొంపగా ఎల్లో గ్యాంగ్‌తో అభివర్ణించిబడిన ఏయూ నేడు ప్రభుత్వ విధి విధానాలు, ప్రసాద్‌రెడ్డి అకుంఠిత దీక్ష మూలంగా అత్యంత సుందరంగా రూపుదిద్దుకోవడంతో రాబోయే పరిణామాలను ముందుగానే బేరీజు వేసుకుని లెక్కలు వేసుకుంటూ, తర్జనభర్జనలు పడుతూ పచ్చ గ్యాంగ్ ఉడికిపోతుంది. ఏం చెయ్యాలో పాలుపోక, ఏయూ ప్రగతిని అడ్డుకునే కుట్రలో భాగంగా విద్యా వ్యాపార రంగంలో పాతుకుపోయిన ఎల్లోగ్యాంగ్.. మీడియా ముసుగులో తెర వెనుక చేరి.. ప్రసాద్ రెడ్డిపై విషం చిమ్ముతోంది. ఇదీ చదవండి: భయపెట్టి.. ప్రభుత్వ భూములూ హాంఫట్! -
కరీంనగర్ లోక్‌సభ సెగ్మెంట్: నెగిటివ్ ప్రచారం కొత్త పుంతలు!
ఎన్నికల టైమ్‌లో ప్రత్యర్థుల లోపాలు వెతికి నెగిటివ్ ప్రచారం చేయడం మామూలే. కాని కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఈ నెగిటివ్ ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోందని టాక్. మూడు పార్టీల ప్రధాన నేతలు ఎదుటివారి మైనస్‌లను పట్టుకుని ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగత ప్రచారాలను ఆపడానికి ఏకంగా పోలీసుల ఫిర్యాదుల వరకు వెళుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముంగిట ప్రత్యర్థి నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో రచ్చ రచ్చగా మారుతోంది. ఈ నాయకులు చేస్తున్న ఆరోపణలేంటి? ఆ నేతలు ఎవరు? గులాబీ పార్టీ తరపున కరీంనగర్ లోక్‌సభ స్థానానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మరోసారి పోటీ చేస్తారని వినిపిస్తోంది. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఆయనైతే ప్రచారంలో నిమగ్నమైపోయారు. ఇదిలా ఉంటే..వినోద్‌కుమార్‌కు సమీప బంధువు ఒకరికి జెన్కోలో ఉద్యోగం ఇప్పించారంటూ సోషల్ మీడియాలో జరిగిన రచ్చ... ఆ మాజీ ఎంపీ మనస్సును తీవ్రంగా గాయపర్చింది. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ.. వినోద్ ఓ ప్రెస్ మీట్ నిర్వహించి వివరణ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో క్యాష్ చేసుకునేందుకే తనను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరైతే జెన్కోలో ఉద్యోగం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారో ఆ వ్యక్తి ఇంటి పేరు.. తన ఇంటి పేరూ ఒకటైనంత మాత్రాన తన బంధువని ఎలా అంటారంటూ ఫైరయ్యారు వినోద్. బండి సంజయ్ తన అనుచరులతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఎదుర్కోలేక బీజేపీ, కాంగ్రెస్‌లు ఏకమై తన మీద దుష్ప్రచారం చేస్తున్నాయన్నది బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ వాదన. అయితే ఈ రచ్చ అంతటితో ఆగలేదు. వినోద్ విమర్శలపై బీజేపీ నేతలు కూడా కౌంటర్ అటాక్ ప్రారంభించారు. ఈ ఇద్దరు నేతల మాటల యుద్ధం పార్లమెంట్ ఎన్నికల ముంగిట కరీంనగర్ లో పొలిటికల్ హీట్‌ను బాగా పెంచాయి. బంధుప్రీతి లేకుంటే కరీంనగర్ మేయర్ గా సునీల్ రావు ఎలా అయ్యాడని.. కరీంనగర్ కార్పొరేషన్లో అవినీతి ఎలా రాజ్యమేలుతుందో చెప్పాలంటూ బీజేపీ నేతలు పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. వినోద్ ప్రమేయం లేకుంటే ఆయనెందుకంత ఉలికి పడుతున్నారో చెప్పాలని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి గెలవాలన్న తలంపుతో అందరికంటే ముందస్తుగానే బండి సంజయ్ తన వ్యూహాల్ని తాను రచించుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇప్పటివరకూ వినోద్ పేరే వినిపిస్తుండటం.. ఆయనే పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం కలియ తిరుగుతుండటంతో.. ఇప్పటివరకు వీరిద్దరి మధ్యే గట్టి పోటీ కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సోదరుడైన శ్రీనుబాబుతో పాటు.. ఈటల రాజేందర్ పేరు కూడా ప్రచారంలోకొస్తున్నాయి. బరిలోకి దిగే అభ్యర్థిని బట్టి కరీంనగర్లో జరగబోయేది ముఖాముఖీ పోటీనా.. లేక, ముక్కోణపు పోటీనా అన్నది తేలుతుంది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, బీఆర్ఎస్ తరపున మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌లు మరోసారి తలపడతారని తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఎవరో తేలితే ఇక కరీంనగర్ హీట్ మామూలుగా ఉండదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. చదవండి: బీజేపీ, కాంగ్రెస్ మళ్లీ కలిసి పని చేయబోతున్నాయి: కేటీఆర్ -
మా వ్యూహం మాకుంది
‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అలాగే మా ‘వ్యూహం’ సినిమా విడుదలను కూడా ఆపలేరు. ఈలోగా మా సినిమాపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేయకుండా నేనే ముందుకొచ్చి మాట్లాడుతున్నా. ఒకవేళ మా చిత్రం రిలీజ్‌కి అడ్డంకులు సృష్టిస్తే ఏం చేయాలో మా వ్యూహం మాకుంది’’ అని డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ అన్నారు. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘వ్యూహం’. దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా తొలి భాగం ఈ నెల 10న విడుదల కావాల్సి ఉంది. అయితే రిలీజ్‌ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ–‘‘వ్యూహం’ చూసిన సెన్సార్ సభ్యులు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. ఎందుకు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నారో కారణాలు చెప్పలేదు. దీంతో ప్రస్తుతానికి సినిమా విడుదల వాయిదా వేస్తున్నాం. రివైజింగ్ కమిటీల్లోనూ తేల్చకుంటే ‘ఉడ్తా పంజాబ్, పద్మావత్’ వంటి హిందీ సినిమాలకు కోర్టు ద్వారా రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్నట్లే మేమూ తెచ్చుకుంటాం. చట్టపరంగా ఉన్న పద్ధతుల ద్వారా ‘వ్యూహం’ను రిలీజ్ చేసుకుంటాం. ఈ సినిమా విడుదల ఆపాలని నారా లోకేశ్ సెన్సార్‌కు లేఖ రాసినట్లు తెలిసింది. అయితే అదెంత నిజమో చెప్పడానికి నా దగ్గర ఆధారాలు లేవు. మీడియా, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలు చెప్పినట్లే ‘వ్యూహం’ ద్వారా నా అభిప్రాయాలు చెప్పాను. అది ఎవరైనా వింటారా? లేదా అన్నది అర్థం లేని ప్రశ్న. సినిమా ఇవ్వడం వరకే నా బాధ్యత’’ అన్నారు. ‘‘మా సినిమాను రివైజింగ్ కమిటికీ పంపినా నష్టం జరగదు. మేము అనుకున్నట్లే అన్నీ సకాలంలో జరుగుతాయని ఆశిస్తున్నాం. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తాం’’అన్నారు దాసరి కిరణ్ కుమార్. -
ముందు టెట్.. ఆ తర్వాత డీఎస్సీ: మంత్రి బొత్స
సాక్షి, అమరావతి: విద్యా శాఖపై విపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం ఆయన ఏపీ సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీఎం జగన్ తొలి ప్రాధాన్యత అయిన విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. ‘‘బైజూస్ కంటెంట్ ఫ్రీగానే ఇచ్చారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇచ్చాం. అందులోనూ బైజూస్ కంటెంట్ పెట్టి ఇచ్చాం. దానికి కూడా బైజూస్‌కి ఒక రూపాయి చెల్లించలేదు. అతని వ్యాపారాలతో మాకు సంబంధం లేదు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. పిల్లలకు మంచి ఇంగ్లీష్ నేర్పడం కోసం టోఫెల్‌ను తీసుకొచ్చాం. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు టోఫెల్‌కి ఇచ్చేస్తున్నామని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’’ నిప్పులు చెరిగారు. టోఫెల్లో శిక్షణ కోసం పెట్టే టెస్ట్‌కి ఒక్కో విద్యార్థికి రూ.7.50 పైసలు మాత్రమే ఫీజు. 20 లక్షల 75 వేల మందికి ప్రభుత్వం ఆ ఫీజు కట్టింది. ఆ టెస్ట్‌లో పాస్ అయిన వారికి మాత్రమే టెస్ట్‌కి రూ.600 ఫీజు తీసుకుంటారు. మొత్తం కలిపి రూ.6 కోట్లు మాత్రమే టోఫెల్ టెస్ట్‌ల కోసం పెడితే రూ.వందల కోట్లు పెడుతున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పేద పిల్లలకు మంచి విద్య అందించడానికి ఖర్చు చేయడం తప్పా?’’ అంటూ మంత్రి బొత్స ప్రశ్నించారు. చదవండి: బాబు లాయర్ల అతి.. బెంచ్ దిగి వెళ్లిపోయిన జడ్జి ముందు టెట్.. ఆ తర్వాత డీఎస్సీ.. ‘‘డీఎస్సీపై కొద్ది రోజుల్లోనే స్పష్టత వస్తుంది. డీఎస్సీపై సీఎం దగ్గర చర్చ జరుగుతోంది. ముందు టెట్.. ఆ తర్వాత డీఎస్సీ నిర్వహిస్తాం. యూనివర్శిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,200కి పైగా పోస్టులు భర్తీ చేస్తాం. నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. 18 ఏళ్ల నుండి యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీ జరగలేదు. పాఠశాలల్లో ఖాళీలన్నింటిని గుర్తించాం’’ అని మంత్రి వెల్లడించారు. -
మద్యంపై పురంధేశ్వరి అడ్డగోలు ఆరోపణలు.. వాస్తవాలు ఇవిగో
మద్యంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. డిస్టిలరీలన్నీ చంద్రబాబు అనుమతిచ్చినవేనని తెలిసినా ఆ విషయాన్ని పురంధేశ్వరి దాటవేశారు. మద్యం నిధులు మళ్లించింది చంద్రబాబేనని తేలుతున్నా నోరెత్తని ఆమె.. పైపెచ్చు కాకిలెక్కలు చెబుతూ.. ఈ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మద్యం వినియోగం తగ్గిందని కేంద్ర శాఖ తేల్చిచెప్పిన కానీ, ఇవేవీ పట్టించుకోకుండా ‘ఈనాడు’ రూట్లోనే ఏపీ బీజేపీ చీఫ్ వెళ్తున్నారు. ఏపీలో మద్యం వ్యాపారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించండి’ అంటూ ఈ నెల 9న ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన వార్త పూర్తిగా అవాస్తవంగా తేలింది. 8వ తేదీన పురంధేశ్వరి చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారం. ఆమె చేసిన ఆరోపణలు, వాస్తవాలు... ఇవిగో. ఆరోపణ: ఏపీలో చీప్ లిక్కర్ అమ్మకాలు వేలాది ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. మద్యం పేరిట భారీ అవినీతికి తెరలేపి వేల కోట్ల రూపాయలు స్వాహా చేస్తున్నారు. వాస్తవం: ఈ ఆరోపణ పూర్తిగా నిరాధారం. సమాజంపై మద్యం వినియోగం ప్రభావాన్ని తగ్గించడానికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్రంలో దశలవారీగా మద్య నియంత్రణ విధానాన్ని ప్రభుత్వం సమర్థంగా అమలుచేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్యను ఈ ప్రభుత్వం తగ్గించింది. గత ప్రభుత్వంలో 4,380 మద్యం దుకాణాలుండగా ఈ ప్రభుత్వం వాటిని 2,934కి తగ్గించింది. మద్యం, బీరు గరిష్ట స్వాధీన పరిమితి కూడా ఈ ప్రభుత్వమే తగ్గించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉన్న బెల్ట్ షాపులను ఈ ప్రభుత్వమే తొలగించింది. మద్యం విక్రయాలను నిరుత్సాహపరిచేందుకు అదనపు ఎక్సైజ్ టాక్స్ (ఏఆర్ఈటీ) విధించారు. దీంతో మద్యం ధరలు పెరిగాయి. మద్యం దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మద్య విమోచన ప్రచార కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. గత ప్రభుత్వంలో ఐఎమ్ఎల్ (మద్యం), బీరు విక్రయాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఈ ప్రభుత్వం వచ్చాకే గణనీయంగా తగ్గాయి. గత ప్రభుత్వంలో 2017–18లో అంటే 360.85 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగితే, 2018–19లో ఆ సంఖ్య 384.36 లక్షల కేసులకు పెరిగింది. అలాగే 2017–18లో బీర్ల అమ్మకాలు 227.26 లక్షల కేసులుంటే.. 2018–19లో ఆ సంఖ్య 277.16 లక్షల కేసులకు పెరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక మద్యం, బీర్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. ఈ మాట చెప్పింది ఎవరో కాదు.. కేంద్ర ప్రభుత్వమే. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) నివేదిక ప్రకారం 2015–16లో రాష్ట్రంలో పురుషుల్లో 34.9 శాతం, మహిళల్లో 0.4 శాతం మద్యం సేవించేవారు. 2019–21 నాటికి రాష్ట్రంలో మద్యం సేవించే పురుషులు 31.2 శాతానికి, మహిళలు 0.2 శాతానికి తగ్గారు. దీనికి సంబంధించిన టేబుల్ కూడా చూడవచ్చు. ఆరోపణ: వైయస్సార్సీపీలోని కీలక నేతలే మద్యం తయారీ పరిశ్రమలను తమ చెప్పుచేతల్లోకి తీసుకున్నారు. వైయస్సార్సీపీ నాయకులకు తన కంపెనీని అప్పగించడానికి ఒక వైఎస్సార్సీపీ ఎంపీ నిరాకరిస్తే.. ఏపీఎస్‌బీసీఎల్ ఆ కంపెనీ నుంచి మద్యం కొనుగోలును ఆపేసింది. వాస్తవం: ఈ ఆరోపణ పూర్తిగా నిరాధారం, అవాస్తవం. ఈ ప్రభుత్వం వచ్చాక అంటే 2019 మే తరవాత... ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా అనుమతివ్వలేదు. ఈ ప్రభుత్వం రాకముందు ఏ డిస్టిలరీలు ఉన్నాయో అవే.. మద్యం తయారీ, సరఫరా చేస్తున్నాయి. ఆరోపణ: మద్యంలో నాణ్యత లేదు. విషపు అవశేషాలు ఉన్నాయి. ముడి పదార్థమైన రెక్టిఫైడ్ స్పిరిట్ నుంచి హానికారక అవశేషాలను తొలగించడం లేదు. మద్యం తయారీ ధర లీటరుకు రూ.15 కాగా.. విక్రయ ధర లీటరుకు రూ.600–రూ.800 మధ్య ఉంది, వాస్తవం: రాష్ట్రంలో మద్యం తయారీలో డిస్టిలేషన్ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందనడం పూర్తిగా అవాస్తవం. ఏపీ డిస్టిలరీ (బీర్, వైన్ కాకుండా మద్యం తయారీ), 2006 నియమాలకు అనుగుణంగానే రాష్ట్రంలో మద్యం తయారవుతోంది. మద్యంలో ఎలాంటి హానికారక అవశేషాలు ఉండకూడదని రూల్ 34 చెబుతోంది. మద్యం తయారయ్యే ప్రతి ఫ్యాక్టరీలోనూ మద్యం నాణ్యతను పరీక్షించేందుకు ఒక రసాయన ల్యాబొరేటరీ కూడా ఉంది. మద్యం తయారీ ప్రక్రియను, నాణ్యతను పర్యవేక్షించడానికి ప్రతి డిస్టిలరీ పరిధిలోనూ ఒక డిస్టిలరీ ఆఫీసర్ ఉన్నారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ విభాగం వారు రాష్ట్రంలో 5 ప్రాంతీయ ఎక్సైజ్ ల్యాబొరేటరీలు ఏర్పాటుచేశారు. ఇవి విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, చిత్తూరుల్లో ఉన్నాయి. ఇవి మద్యం నాణ్యతను పరిశీలించి మద్యం నమూనాల్లో అవశేషాలు ఏ మేరకు ఉన్నాయో సర్టిఫికెట్లను కూడా ఇస్తాయి. ఇవి కోర్టుల్లో కూడా చెల్లుబాటు అవుతాయి. ఆధునిక పరీక్షా పద్ధతులు సాధ్యమయ్యేలా అత్యాధునిక పరికరాలతో ఈ ల్యాబొరేటరీలను ఆధునికీకరించింది ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ విభాగం. ఎఫ్ఎస్ఎస్ఏఐ, బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా అత్యంత వేగంగా, కచ్చితంగా పరీక్షలు చేసేలా ఈ ల్యాబొరేటరీలు తయారయ్యాయి. ఈ అత్యాధునిక పరికరాల కోసం రూ.12.5 కోట్లు ఖర్చు చేశారు. ఎసిటల్ డీహైడ్, ఇథైల్ ఎసిటేట్, మెథనాల్ వంటి వాటిని నిశితంగా పరిశీలించే వీలు ఇప్పుడు డిస్టిలరీల్లోని ల్యాబొరేటరీల్లోనూ, ప్రాంతీయ ల్యాబొరేటరీల్లోనూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక నాలుగేళ్లలో విశ్లేషించిన శాంపిళ్ల వివరాలను టేబుల్లో చూడొచ్చు. ఇక మద్యం ఎమ్మార్పీ విలువ విషయానికొస్తే... అందులో15 శాతం తయారీ ఖర్చు కాగా, మిగిలిన 85 శాతం ఏపీఎస్‌బీసీఎల్, ప్రభుత్వ ఆదాయం. ఆరోపణ: రాష్ట్రంలో 80 శాతం మద్యం అమ్మకాలు నగదు లావాదేవీల ద్వారానే నిర్వహిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. వాస్తవం: వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నగదు అమ్మకాలే కాదు.. డిజిటల్ చెల్లింపుల విధానాన్నీ బెవరేజెస్ కార్పొరేషన్ అమలు చేస్తోంది. రోజువారీ వేతనాలు తీసుకునే కూలీలు నగదు ద్వారానే మద్యం కొంటున్నారు కనుక ఆ విధానాన్నీ కొనసాగిస్తోంది. మద్యం విక్రయాల మొత్తాన్ని ఏ రోజుకా రోజు సమీపంలోని ఎస్బీఐ శాఖలో జమ చేసి చలానాలు అందజేస్తోంది. మద్యం నిల్వలు, విక్రయాలు, బ్యాంకుల్లో జమ చేసిన మొత్తం అన్నింటిపై బెవరేజెస్ కార్పొరేషన్ పకడ్బందీగా రికార్డులు నిర్వహిస్తోంది. ఆరోపణ: రాష్ట్రంలో రోజూ 80 లక్షల మంది ఒకొక్కరూ సగటున రూ.200 విలువైన మద్యాన్ని సేవిస్తున్నారు. ఆ విధంగా మద్యం అమ్మకాల మొత్తం రూ.57,600 కోట్లు అయితే అందులో రూ.25 వేల కోట్లు అక్రమంగా మళ్లించేస్తున్నారు. వాస్తవం: రాష్ట్రంలో రోజూ 80 లక్షల మంది ఒకొక్కరూ సగటున రూ.200 విలువైన మద్యాన్ని సేవిస్తున్నారు అనేది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే కేంద్ర జాతీయ కుటుంబ ఆరోగ్య నివేదిక(ఎన్ఎఫ్హెచ్ఎస్) నివేదిక ప్రకారం 2019–21లో రాష్ట్రంలో 18.7 శాతం మంది అంటే దాదాపు 40 లక్షల మంది మాత్రమే మద్యం సేవిస్తున్నారు. అలాంటప్పుడు రూ.25వేల కోట్లు అక్రమంగా మళ్లిస్తున్నారు అనేది కూడా అసంబద్ధం, అవాస్తవం. ఆరోపణ: లంచాలిచ్చే కంపెనీల నుంచే ఏపీఎస్‌బీసీఎల్ మద్యం కొనుగోలు చేస్తోంది. వాస్తవం: రాష్ట్రంలో 2015లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను అనుసరించే ప్రస్తుతం బెవరేజస్ కార్పొరేషన్ మద్యం కొంటోంది. ఈ ప్రభుత్వం వచ్చిన తరవాత అంటే 2019 తరువాత ఆ విధానంలో ఎలాంటి మార్పూ జరగలేదు. కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రాష్ట్రంలో మద్యం కొనుగోళ్లు పూర్తి పారదర్శకంగా, నిబంధనల మేరకే ఉన్నాయని 19–09–2022న నివేదిక ఇచ్చింది. ఆరోపణ: రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై స్పెషల్ డ్యూటీ (పన్ను) వసూలు చేస్తున్నారు. కానీ ఆ మొత్తం ఎక్కడికి వెళ్తోందో తెలియడం లేదు. వాస్తవం: వాస్తవానికి అది స్పెషల్ డ్యూటీ (పన్ను) కాదు. అది స్పెషల్ మార్జిన్. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమ పథకాలు కోసం ప్రభుత్వం 2021 నవంబరు 9న ప్రత్యేక జీవో జారీ చేసి ఆ స్పెషల్ మార్జిన్ వసూలు చేస్తోంది. ఆ నిధుల్ని సంక్షేమ పథకాల కోసం వెచ్చిస్తోంది. అందువల్ల ఆ స్పెషల్ మార్జిన్ రాష్ట్ర ఖజానాకు వెళ్లదు. ఆరోపణ: రాష్ట్రంలో గడచిన రెండేళ్లలో కాలేయ సంబంధ వ్యాధులతో మరణించిన వారు 25 శాతం పెరిగారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి అవినీతికి పాల్పడుతున్నారు. వాస్తవం: మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయాన్ని ప్రతి మద్యం సీసాపైనా స్పష్టంగా కనిపించేలా చేస్తోంది ప్రభుత్వం. అతిగా మద్యం సేవించడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని, ముఖ్యంగా కాలేయం వంటివి దెబ్బతింటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అంతేతప్ప, ప్రభుత్వం విక్రయించే మద్యంలో నాణ్యత లేకపోవడం వల్లనో, విషపూరిత అవశేషాలు ఉండటం వల్లనో కాదు. విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో గత పదేళ్లలో నెలకు సగటున 20 మంది మాత్రమే కాలేయ సంబంధిత వ్యాధులతో ఆసుపత్రిలో చేరారు. వారిలో కూడా 95 శాతం మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ నివేదిక కూడా ఇచ్చారు. దీన్నిబట్టి ఈ ఆరోపణ పూర్తిగా అవాస్తవమని అర్థమవుతోంది. అందువల్ల పురంధేశ్వరి రాసిన లేఖలో అన్నీ అవాస్తవాలే. మద్యం విక్రయాలను నిరుత్సాహపరచడమే ఈ ప్రభుత్వ విధానం. పూర్తిగా నాణ్యమైన మద్యాన్ని తయారుచేసి, ఎలాంటి అవినీతికీ ఆస్కారం లేకుండా అమ్మకాలు జరిపేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. చదవండి: Fact Check: కళ్లు తెరిచి చూడు రామోజీ.. -
ఏసీబీ జడ్జిపై అసత్య ప్రచారం.. టీడీపీ నేత అరెస్ట్
సాక్షి, కృష్ణా జిల్లా: స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించిన న్యాయమూర్తిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన టీడీపీ నాయకుడు బుర్ర వెంకట్‌ను కంకిపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసును మచిలీపట్నం సైబర్ బ్రాంచ్‌కు పోలీసులు అప్పగించారు. కాగా, చంద్రబాబుకు రిమాండ్ తర్వాత జడ్జిని కించపరుస్తూ కొందరు టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారు. నిన్న(బుధవారం) నంద్యాల జిల్లాకు చెందిన ఐటీడీపీ కార్యకర్త ఖాజా హుస్సేన్‌పై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పరాకాష్టకు టీడీపీ శవ రాజకీయం
సాక్షి నెట్వర్క్ : చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రాణాలు విడుస్తున్నట్లుగా ప్రజలను నమ్మించడానికి టీడీపీ విఫలయత్నం చేస్తోంది. అభూత కల్పనలు, అసత్య ప్రచారాలతో సహజ మరణాలను సైతం చంద్రబాబు అరెస్టు, జైలుకు ముడిపెట్టి శవ రాజకీయం కొనసాగిస్తోంది. ఈ విషయానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి, సానుభూతి పొందేందుకు పచ్చ బ్యాచ్ తెగతాపత్రయ పడుతోంది. నిజానికి.. ‘పచ్చ’ మీడియా పేర్కొన్న వారంతా అనారోగ్య కారణాలతో మరణిస్తున్నా ‘బాబు అరెస్టును తట్టుకోలేక..’ అంటూ నానా హడావుడి చేస్తోంది. టీడీపీ, ఎల్లో మీడియా భజనతో గ్రామాల్లో ప్రజలు నివ్వెరపోతున్నారు. మొత్తానికి ‘సాక్షి’ పరిశీలనలో తేలిన వాస్తవాలివి. -
సిగ్గులేని రామోజీ, చివరికి ఇందులో కూడా విష ప్రచారమా!
-
Fact Check: వీఆర్ఏలకు వెన్నుపోటు పొడిచింది బాబే
సాక్షి, అమరావతి: నిజాలకు పాతరేసి అబద్ధాలను అచ్చేయడంలో అందెవేసిన చెయ్యి అయిన రామోజీ తాజాగా వీఆర్ఏల డీఏపై పడ్డారు. టీడీపీ పాలనలో చేసిన నిర్వాకాలను మరిచిపోయినట్లుగా నటిస్తున్నారు. వీఆర్ఏల డీఏను తొలగించి వారిని నిండా ముంచింది చంద్రబాబు అనే విషయం అందరికీ తెలిసిన విషయమైనా రామోజీ అదేమీ తెలీనట్లు ఉంటూ సొల్లు పురాణం అందుకున్నారు. నిజానికి.. చంద్రబాబు అధికారంలో ఉండగానే 2018లో వీఆర్ఏలకు డీఏ వర్తించదని జీఓ ఇచ్చారు. ఆ అన్యాయాన్ని సరిదిద్దేందుకు ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది. త్వరలోనే దీనిపై ఒక సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం కూడా ఉంది. కానీ, ఈ నిజాలకు ముసుగేసి వీఆర్ఏలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు చెప్పినట్టల్లా ఆడుతున్న ఈనాడు.. బరితెగించి మరీ అడ్డగోలు కథనం రాయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇదీ నిజం.. వీఆర్ఏలకు నెలకు రూ.300 చొప్పున ఇచ్చే కరువు భత్యాన్ని (డీఏ)ను కేవలం 5 నెలలకు మాత్రమే పరిమితం చేస్తూ 2019 జనవరి 29న టీడీపీ ప్రభుత్వం జీఓ–14 జారీచేసింది. 2018 జూన్ 1 నుంచి వీఆర్ఏలకు డీఏ వర్తించదని ప్రకటించింది. ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని పలు సందర్భాల్లో కోరాయి. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీఓను మార్చి కరువు భత్యాన్ని పునరుద్ధరించాలని కోరుతుండగా ఉద్యోగ సంఘాల సమస్యలను పరిశీలించి, పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరచూ నిర్వహించే సమావేశాల్లోనూ దీనిపై చర్చ జరిగింది. ఈ విషయాలను మరచిపోయి ఉద్యోగుల్లో భయాందోళనలు కలిగించే ఉద్దేశంతో అబద్ధాలను అచ్చోసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 19,359 మంది వీఆర్ఏలు సేవలు అందిస్తున్నారు. సాధారణ ప్రక్రియలో భాగంగా వారిలో ఎంతమంది ఏవిధంగా డీఏ డ్రా చేశారని తెలుసుకునేందుకే ఖజానా, అకౌంట్స్ శాఖ మెమో ఇచ్చింది. రాష్ట్రంలో ఒక్క వీఆర్ఏ నుంచి కూడా అదనంగా డ్రా చేసిన డీఏను రికవరీ చేయలేదు. ఈ విషయం తెలిసి కూడా ఈనాడు నిస్సిగ్గుగా వీఆర్ఏల నుంచి డీఏలను రికవరీ చేస్తున్నట్లు అబద్ధాలు రాసిపారేసింది. కానీ, డీఏలు రికవరీ లేకుండా చేయడంతోపాటు ప్రతినెలా డీఏను కొనసాగించేలా రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. వీటిపై అతి త్వరలో నిర్ణయం వెలువడే అవకాశముంది. వీఆర్ఏలకు మేలు జరిగింది ఈ ప్రభుత్వంలోనే.. ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీఆర్ఏలకు మేలు చేసే అనేక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సుమారు 3,795 మంది వీఆర్ఏలకు వీఆర్ఓలుగా పదోన్నతి కల్పించింది. ఈ సంవత్సరమే 66 మంది వీఆర్ఏలకు గ్రేడ్–2 వీఆర్ఓలుగా పదోన్నతులిచ్చింది. ఇవన్నీ మర్చిపోయి.. అవాస్తవాలు ప్రచారం చేయడం ద్వారా ఉద్యోగులు, ప్రజల్లో అపోహలు సృష్టించేందుకే ఈనాడు కంకణం కట్టుకుని వార్తలు ప్రచురిస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
ఏది నిజం?: ‘ఈనాడు’ వంకర రాతలు.. రామోజీ ఇవన్నీ సాధ్యమయ్యాయిగా?
నిజాలకు పాతరేసి.. అబద్ధాలు అందంగా అచ్చు వేయటంలో ‘ఈనాడు’ దిట్ట. ఏలినవారు కావాల్సిన వారైతే... ఏమీ చేయకపోయినా సాహో.. అంటూ పొగడ్తలు కురిపిస్తుంది. అదే అధికారం తమవారి చేతుల్లో లేకపోతే మాత్రం... ‘ప్రతిపక్ష’ పాత్ర పోషిస్తుంది. ఈ విషయాన్ని ఒకనాడు కోర్టుకే నేరుగా చెప్పారు ఘనత వహించిన రామోజీరావు. ఇదంతా ఎందుకంటే... ఉన్నత విద్యా వ్యవస్థలో తీసుకు రావాల్సిన మార్పులను వివరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తన విజన్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల వీసీలతో సమావేశమై భవిష్యత్తులో చేపట్టాల్సిన మార్పులను చర్చించారు. అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న టెక్నాలజీలను మన పిల్లలు ఒడిసి పట్టుకోవటానికి యూనివర్సిటీలు ఏం చేయాలో ఆయన చెప్పారు. ఆ వార్త యథాతథంగా వేస్తే... ముఖ్యమంత్రి విజన్ అందరికీ తెలుస్తుందని, చదువుకున్న వారిలోను, విద్యార్థుల్లోను సానుకూలత వస్తుందని భయపడిన రామోజీరావు... ‘సీఎంగారూ! ఇదెలా సాధ్యం?’ అంటూ తన పైత్యం మొత్తాన్ని జోడించి ఒక కథనాన్ని వండేశారు. యూనివర్సిటీల్లో నియామకాలు చేపట్టలేదని, నిధులు మళ్లించేస్తున్నారని, వైస్‌చాన్స్‌లర్లుగా, పాలకమండలి సభ్యులుగా అధికార పారీ్టకి కావాల్సిన వారిని నియమించారని... ఇలా చేతికొచ్చినంత రాసిపారేశారు. మరి ఇందులో నిజమెంత? ఏది నిజం? నిజమే! ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పోస్టులు భర్తీ కావటం లేదు. కాకపోతే అది గడిచిన నాలుగేళ్లుగా కాదు. చాలా సంవత్సరాలుగా!!. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన నాటి నుంచీ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్లుగా, పాలక మండలి సభ్యులుగా తన బంధువులనే నియమించుకున్నారు. వారు అడ్డగోలుగా అన్ని నిబంధనలనూ తుంగలో తొక్కేసి తమకు కావాల్సిన వారిని, ముడుపులిచ్చిన వారిని నియమించుకోబోయారు. ఆ పోస్టులను ఆశిస్తున్న పలువురు నిరుద్యోగులు, వారి తీరు నచ్చన ఆయా వర్సిటీల్లోని సిబ్బంది ఈ వ్యవహారంపై కోర్టులకెళ్లారు. దీంతో రిక్రూట్మెంట్లు నిలిచిపోయాయి. ఆ పోస్టులన్నీ అలానే ఖాళీగా ఉండిపోయాయి. మరి అలా వర్సిటీల్లో తమ బంధువుల్ని నియమించుకున్నందుకు చంద్రబాబును ఎన్నడూ ప్రశి్నంచలేదెందుకు రామోజీరావు గారూ? వారు అడ్డగోలుగా పోస్టుల భర్తీ చేయబట్టే కదా... కోర్టుల్లో కేసులు పడి రిక్రూట్మెంట్లు నిలిచి పోయాయి. దాన్ని కూడా ఎన్నడూ ప్రశ్నించలేదెందుకు? ఇవన్నీ పక్కనబెడితే... కనీసం ఆ కోర్టు కేసుల్ని త్వరగా పరిష్కరించి పోస్టులు భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనే వార్తలు సైతం ‘ఈనాడు’ రాస్తే ఒట్టు!. ఇప్పుడేమో ఆ కేసులన్నిటినీ ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ పోస్టుల భర్తీ చేపడుతున్న ప్రభుత్వాన్ని మాత్రం ప్రశి్నంచటం మొదలెట్టారు రామోజీ!!. నాలుగేళ్లూ ఊరుకుని ఇప్పుడెందుకంటూ సన్నాయి నొక్కులు మొదలు పెట్టారు. అసలు ఐదేళ్లూ ఏమీ చేయని చంద్రబాబును... కోర్టు కేసులకు కారకుడైన చంద్రబాబును మాత్రం వెనకేసుకొస్తూనే ఉన్నారు. పైపెచ్చు ఈ ప్రభుత్వం యూనివర్సిటీల పాలక మండళ్లలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో 50% మహిళలకే అవకాశమిస్తోంది. దాన్ని కూడా పక్కనబెట్టి అంతా అధికార పారీ్టవారే అంటూ దుర్మార్గపు రాతలకు దిగింది ‘ఈనాడు’. అదీ రామోజీరావు తీరు!!. ఇదీ నిజం. నిధులు మళ్లించిందెవరు రామోజీ? వర్సిటీల నిధులను దారిమళ్లించినట్లు ‘ఈనాడు’ అవాస్తవాలను వండి వార్చేసింది. మరి ఇందులో నిజమెంత? టీడీపీ ప్రభుత్వ హయాంలోనే యూనివర్సిటీలకు ఉరి వెయ్యటానికి చంద్రబాబు నిధుల దుబారా పథకాన్ని అమలు చేశారు. అంటే... ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారాల కోసం యూనివర్సిటీల్లో సమావేశాలు నిర్వహించారు. సమావేశం వర్సిటీలో కనక దానికయ్యే ఖర్చు మొత్తాన్ని వర్సిటీల నుంచే చేయించారు. ఇందుకోసం ఆయా యూనివర్సిటీలు ఒక్కొక్కటి రూ.10 కోట్ల చొప్పున ఖర్చు చేశాయి. కానీ అప్పట్లో ‘ఈనాడు’ పెన్నెత్తితే ఒట్టు. ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి పనులకోసం స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయించింది. వర్సిటీలు సహా ఇతర సంస్థలు తమ వద్ద అదనంగా ఉన్న నిధులను బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తే వచ్చే వడ్డీకన్నా ఎక్కువ వడ్డీ చెల్లిస్తూ కార్పొరేషన్లో డిపాజిట్ చేసేలా చర్యలు తీసుకున్నారు. వర్సిటీల నిధులకు అధిక వడ్డీ చెల్లిస్తూ తిరిగి వారికి అవసరమైనప్పుడు ఇస్తున్నారు. బాబు దుబారాపై కళ్లు మూసుకుని... డిపాజిట్లను నిధులు మళ్లించటమని అంటున్నారంటే రామోజీని ఏమనుకోవాలి? ఎంతైనా రామోజీ.. రామోజీనే!! సాక్షాత్తూ యూజీసీ చైర్మన్ చెప్పారు జూలై 1న సాక్షాత్తూ యూజీసీ ౖచైర్మన్ కాకినాడలో జరిగిన సమావేశంలో... ఉన్నత విద్యకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పలు అంశాల్లో ముందున్నదని వ్యాఖ్యానించారు. కానీ ‘ఈనాడు’ మాత్రం ఉన్నత విద్యపై బురద చల్లుతూ విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో భయాందోళనలను కలిగించడానికి ప్రయత్నిస్తోందన్నది నిజం. గడిచిన నాలుగేళ్లలో దేశంలోనే తొలిసారిగా ఏపీలోని పలు యూనివర్సిటీల్లో సంస్కరణలు తెచ్చారు. హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు, రీజనల్ క్లస్టర్ గ్రూపులు, 10 నెలల తప్పనిసరి ఇంటర్న్‌షిప్, కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టులు, నైపుణ్య కోర్సులు వంటి అనేక సంస్కరణలను అమల్లోకి తెచ్చారు. ఇదే క్రమంలో ప్రపంచ స్థాయిలోని మేటి వర్సిటీల్లో ఉన్న నాలుగేళ్ల కోర్సును నూతన జాతీయ విద్యా విధానంతో అనుసంధానం చేసి విద్యార్థులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలన్నీ ‘ఈనాడు’కు అసాధ్యమైనవిగా కనిపించటం విచిత్రమే మరి. ఎందుకంటే చేస్తానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు కాదు కాబట్టి ‘ఈనాడు’కు సహజంగానే అవన్నీ అసాధ్యమైనవిగా కనిపిస్తాయి. ఒక కొత్త విద్యా విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశ పెట్టే ముందు దానిపై లోతుగా అధ్యయనం చేయటం, ప్రణాళికాబద్ధంగా అమలుకోసం సన్నద్ధమవటం వంటివి చేస్తున్నపుడు ఏదో ఒకరకంగా బురద జల్లాలనే లక్ష్యంతో ‘ఈనాడు’ వరుస కథనాలు రాస్తూనే ఉంది. నిజం చెప్పాలంటే నిన్న జరిగిన వైస్‌చాన్సలర్ల సమావేశం.. ఈ ప్రభుత్వం వచ్చాక జరిగిన మొదటి సమావేశం కాదు. 2021 అక్టోబర్ 25న తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్ ఉపకులపతులతో సమావేశమై ఉన్నత విద్యపై దిశానిర్దేశం చేశారు. ఈ నాలుగేళ్లలో దాదాపుగా 10 సార్లు ఉన్నత విద్యపై అధికారులతో సమీక్షలు చేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఉన్నత విద్యపై ఇన్ని సమీక్షలు, సమావేశాలు నిర్వహించలేదు. వీటన్నిటినీ విస్మరించిన ‘ఈనాడు’... నాలుగేళ్ల తరవాత తొలిసారిగా వీసీలతో సమావేశం నిర్వహిస్తున్నారన్న తరహాలో కథనాన్ని వండిందంటేనే.. రామోజీ దుర్బుద్ధిని అర్థం చేసుకోవచ్చు. ఆరంభం నుంచే పటిష్ట పునాదులు ఒక్క ఉన్నత విద్యలోనే కాకుండా పునాది స్థాయి నుంచే విద్యార్ధులను తీర్చిదిద్దేలా రాష్ట్రంలో పలు సంస్కరణలను సీఎం జగన్ తొలిరోజు నుంచీ అమలు చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు అందుకోవడమే కాకుండా పలు రాష్ట్రాలకు ఆదర్శంగానూ నిలిచాయి. పాఠశాల విద్యలో నాడు–నేడు, అమ్మ ఒడి, జగనన్న విద్యాకానుక, గోరుముద్ద వంటి పథకాలు యూపీ, అస్సాం, బీహార్, తెలంగాణ వంటి రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. గతంలో ప్రయివేటుకే పరిమితమైన ఆంగ్ల మాధ్యమాన్ని వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో పెట్టించారు. దీనిపైనా చంద్రబాబు, రామోజీ విషం చిమ్మి అడ్డుపడే ప్రయత్నం చేశారు. నూతన విద్యావిధానం కన్నా ముందే రాష్ట్రంలో ఫౌండేషన్ విద్యావిధానాన్ని తీసుకువచ్చి శిశుస్థాయి నుంచే పిల్లల్లో అక్షరజ్ఞానానికి సీఎం శ్రీకారం చుట్టారు. నాడునేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, సీబీఎస్ఈ విధానం వంటి విధానాలను తెచ్చి పాఠశాల విద్యను బలోపేతం చేశారు. 6వ తరగతి నుంచి అన్ని తరగతుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను నెలకొల్పి డిజిటల్ బోధన చేయిస్తున్నారు. ప్రతి ఏటా 8వ తరగతికి వచ్చే విద్యార్ధులకు, టీచర్లకు ట్యాబులను కూడా అందిస్తూ... దిగ్గజ ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ పాఠాలను కూడా అందులో అందజేస్తున్నారు. ఉన్నత విద్య భారం పూర్తిగా ప్రభుత్వానిదే... ఉన్నత విద్యలో చేరే ప్రతి విద్యార్థికీ పూర్తి ఫీజురీయింబర్స్మెంటుతో పాటు వారి వసతి ఖర్చులనూ ప్రభుత్వమే భరించేలా ముఖ్యమంత్రి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను అమలు చేస్తున్నారు. దీనికోసం గత నాలుగేళ్లలో రూ.15వేల కోట్ల వరకు ప్రభుత్వం వెచి్చంచింది. గత ప్రభుత్వంలో 35వేలు మాత్రమే ఫీజు ఇవ్వడంతో మిగతా మొత్తాన్ని విద్యార్ధులే కట్టుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం పూర్తిభారం ప్రభుత్వానిదే కావటంతో ఇంటర్ తరవాత డ్రాపవుట్లు గత ప్రభుత్వంలో 21 శాతం ఉండగా ఇపుడు 6 శాతానికి తగ్గారు. ఉన్నత విద్యలోనూ నేటి అవసరాలకు తగ్గట్టుగా కరిక్యులమ్ అభివృద్ధి చేయించారు. బెంగళూరు ఐఐఎస్సీ ప్రొఫెసర్ బాలకృష్ణన్ నేతృత్వంలో కమిటీని వేసి సంస్కరణలకు శ్రీకారం చుట్టించారు. డిగ్రీలో ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసి నాలుగేళ్ల హానర్ కోర్సులను ఏర్పాటు చేయించారు. 27 వేల పరిశ్రమలు, సంస్థల అనుసంధానంతో ఇంటర్న్‌షిప్. విద్యార్ధులకు ఇంటర్న్íÙప్కోసం కాలేజీలను జిల్లాల వారీగా 27వేల పరిశ్రమలతో అనుసంధానం చేయించారు. చదువులు పూర్తి చేసేనాటికే విద్యార్ధులకు అవసరమైన ఉద్యోగ, ఉపాధి నైపుణ్యాలు సమకూరేలా చేశారు. విద్యార్ధులలో నైపుణ్యాలకోసం 553 ఎంటర్ప్రెన్యూర్íÙప్, ఇంక్యుబేషన్, స్టార్టప్ కేంద్రాల ఏర్పాటుచేయించారు. మైక్రోసాఫ్ట్ ద్వారా రూ.32 కోట్లతో 1.62 లక్షల మందికి సర్టిఫికేషన్ కోర్సులు అందించారు. మరో 1.95 లక్షల మందికి వివిధ కంపెనీలతో వర్చువల్ ఇంటర్న్íÙప్ అందించారు. నాస్కామ్ ఫ్యూచర్‌స్కిల్స్, ఎడ్యుస్కిల్స్, బీఎస్ఎన్ఎల్, సేల్స్‌ఫోర్సు, పాల్ ఆల్టో, బ్లూప్రిజమ్, ఫుల్‌స్టేక్, ఏడబ్ల్యూఎస్, ఎంప్లాయిమెంటు ఎక్స్‌ప్రెస్ వంటి జాతీయ అంతర్జాతీయ సంస్థలతో వర్చువల్ శిక్షణ ద్వారా నైపుణ్యాలను మెరుగుపర్చారు. సాఫ్ట్వేర్, ఐటీ రంగాల్లోనే కాకుండా బ్యాంకింగ్, ఫైనాన్సియల్, క్స్‌టైల్స్, అపెరల్, లైఫ్‌సైన్సెస్, అగ్రికల్చర్, హెల్త్‌కేర్ తదితరాల్లో ఇంటర్న్íÙప్ వల్ల విద్యార్ధులకు అవగాహన పెరుగుతోంది. బాబు హయాంలో 37వేలు మాత్రమే ప్లేస్మెంట్లు ఉండగా గత ఏడాదికి ఈ సంఖ్య 85వేలకు చేరింది. ఈ ఏడాదిలో 1.20 లక్షల మందికి ప్లేస్మెంట్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అంతా ‘పచ్చ’గానే ఉండాలనుకునే రామోజీరావు కళ్లకు ఇవేవీ ఎన్నటికీ కనిపించకపోవటంలో ఆశ్చర్యమేమీ లేదు. బాబు హయాంలో ఒక్కపోస్టూ భర్తీ చేయలేదే.. మన పిల్లలని ప్రపంచస్థాయి లీడర్లుగా ఎదగకుండా ఆపింది ఎవరు? అనేది ‘ఈనాడు’ ప్రశ్న. దీనికి సమాధానం చంద్రబాబే. ఎందుకంటే విశ్వవిద్యాలయాలలోని ఖాళీలు భర్తీ కాకపోవడానికి కారణం ఆయనే. చంద్రబాబు అధికారంలో ఉన్న తొలి తొమ్మిదేళ్ళూ... అంటే 1995 నుంచి 2004 వరకు, ఆలాగే, ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయాక 2014 నుండీ 2019 వరకూ విశ్వవిద్యాలయాల్లో ఒక్క ఆచార్యుడినీ నియమించలేదు. దీన్ని రామోజీరావు ఎప్పుడూ ప్రశ్నించలేదు కూడా!. విశ్వవిద్యాలయాల్లో 71 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, ఆయా కోర్సుల్లో పిల్లలకు పాఠాలు చెప్పేవారు లేకుంటే కృత్రిమ మేధ వంటి కొత్త కోర్సుల వల్ల ఉపయోగం ఏమిటనేది ‘ఈనాడు’ ప్రశ్న. వాస్తవానికి మారుతున్న సమకాలీన సామాజిక అవసరాల దృష్ట్యా కొత్త కోర్సులు వస్తుంటాయి. వాటికి అవసరమైన నిపుణులను వర్సిటీల్లో నియమించుకోవాలి. అంతేకానీ, ప్రస్తుతం నిపుణులు లేరు కాబట్టి కొత్త కోర్సులను తేవొద్దని చెప్పటం ఏ రకమైన పాత్రికేయం? వర్సిటీల్లో ర్యాంకులు పడిపోతున్నాయనీ, ఈ సమయంలో కొత్త కోర్సులు అవసరమా? అనేది ‘ఈనాడు’ కథనంలో ప్రధానమైన అంశం. ర్యాంకులు పడిపోవడానికి శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఆచార్యులు లేకపోవడమే కారణం. దీనికి ప్రధాన బాధ్యుడు చంద్రబాబే. నియామకాలు చేపట్టకపోవటం, కోర్టు కేసులపై దృష్టిపెట్టకపోవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ర్యాంకులను పునరుద్ధరించుకోవడానికి ముఖ్యమంత్రి, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి విశ్వవిద్యాలయాల అభివృద్ధి నమూనాలను తీసుకోవాలని దార్శనికతతో వివరించారు. రాబోయే కొద్ది రోజుల్లో బోధనా సిబ్బంది నియామకాలు చేపట్టాలని సూచించారు. తద్వారా విశ్వవిద్యాలయాలను శక్తివంతమైన సాంకేతిక, ఆధునిక విద్యా కేంద్రాలుగా మారాలన్నారు. కార్యాచరణ మొదలుపెట్టి విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తయారు చేయాలని పేర్కొన్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రి ప్రతిపాదించిన అంశాలు, ఏ నిరుద్యోగినీ బాధించవు. అవకాశాలు పెంచుకోవడానికి, మరికొంత మందిని ఉపాధికి చేరువ చేయడానికి కృత్రిమ మేధ ఉపయోగ పడుతుంది. బహుశా, ఇలాంటి విధానం ‘ఈనాడు’కు నచ్చి ఉండకపోవచ్చు. లేకపోతే ఇలా చెప్పింది చంద్రబాబు కాదు కాబట్టి నచ్చి ఉండకపోవచ్చు. విశ్వవిద్యాలయాల్లో పోస్టులు త్వరలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు సిద్ధమవుతుండటాన్ని గమనించి... ఎలాగైనా నియామకాలు జరగకూడదనే కుట్ర ఈ కథనంలో స్పష్టంగా కనబడుతోంది. -
‘ఫెర్రో ఎల్లాయ్స్’ సమస్యలు ఏనాటివో..! ఆ ఇబ్బందులు దశాబ్దాలుగా ఉన్నవే రామోజీ..
సాక్షి, అమరావతి: రాసిందే పదే పదే రాస్తే పాఠకులు నమ్మేస్తారన్నది రామోజీరావు భ్రమ. ప్రతీ అంశాన్నీ అటుతిప్పి ఇటు తిప్పి చివరికి ముఖ్యమంత్రి జగన్, ఆయన ప్రభుత్వంపై తన అక్కసును వెళ్లగక్కేలా ఉంటున్నాయి ఆయన రాతలు. గత టీడీపీ ప్రభుత్వంలోనే కుదేలైన ఫెర్రో ఎల్లాయ్స్ పరిశ్రమల సమస్యలను ప్రస్తుత ప్రభుత్వంపై రుద్దేందుకు తెగ ఆయాసపడుతూ ఎప్పటిలాగే మరో తప్పుడు కథనాన్ని అచ్చోశారు. అసలు రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల పరిస్థితులే లేవన్నట్లు ఆ కథనానికి కలరింగ్ ఇచ్చారు. ‘కరెంటు షాక్‌తో అల్లాడుతున్న ఫెర్రో ఎల్లాయ్స్ పరిశ్రమల మూత’ శీర్షికతో మంగళవారం ఈనాడు అసత్యాలతో ఓ వంటకాన్ని వండి వార్చింది. దీని వెనకనున్న అసలు వాస్తవాలను ఇంధన, పరిశ్రమల శాఖలు వెల్లడించాయి. అవి.. ఆరోపణ: జగన్ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు, బెదిరింపులు, దాషీ్టకానికి భయపడి ఇప్పటికే చాలా పరిశ్రమలు వెళ్లిపోయాయి.. వాస్తవం: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలవల్ల రాష్ట్రంలో అనేక కొత్త పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇందులో భాగంగా.. వైఎస్సార్ జిల్లాలో సెంచరీ ప్లైవుడ్స్ పరిశ్రమ ఏర్పాటవుతోంది. జపాన్‌కు చెందిన ‘యెకోమా’ సంస్థ ఏటీజీ టైర్ల తయారీ పరిశ్రమను గత ఏడాది ఉత్పత్తి ప్రారంభించింది. మరో రూ.1,000 కోట్లతో రెండోదశ కర్మాగారం నిర్మాణానికి సీఎం జగన్ ఇప్పటికే శంకుస్థాపన చేయడంతో శరవేగంగా ఆ పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ వేధిస్తేనే వచ్చాయా? ఆరోపణ: రాష్ట్రంలో ఫెర్రో ఎల్లాయ్స్ పరిశ్రమలు.. అనేక చిన్న, మధ్య తరహా పరిశ్రమలూ మూతపడుతున్నాయి.. వాస్తవం: అనేక కారణాలవల్ల ఫెర్రో ఎల్లాయ్స్ పరిశ్రమలు గత కొన్ని దశాబ్దాలుగా ఆరి్థక ఇబ్బందుల్లో ఉన్నాయి. అందువల్లే అవి మూతపడుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏమీ జరగడంలేదు. గత ప్రభుత్వ హయాంలోనూ ఇవి అనేకం మూతపడ్డాయి. గత ఇరవై ఏళ్లుగా ఈ విభాగంలో అమలులో ఉన్న టారిఫ్‌కు ఎలాంటి డిమాండు ఛార్జీలు, స్థిర ఛార్జీలు, సమయానుసార ఛార్జీలు (టీఓడీ), తప్పనిసరి వినియోగం ఛార్జీలు విధించలేదు. కానీ, ఖర్చులు 54శాతం పెరిగాయి. ఇతర వినియోగదారులకు అవలంబిస్తున్నట్లుగానే ఈ పరిశ్రమలకూ డిస్కంలు చార్జీలను అమలుచేస్తున్నాయి. వీటి ప్రకారం చూసినా.. రాష్ట్రంలో వీటికి యూనిట్ ఛార్జి దాదాపు రూ.0.50 తక్కువే. ఆరోపణ: ‘అమరరాజా’పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటంతో ఆ సంస్థ విస్తరణ ప్రాజెక్టుల్ని తెలంగాణ, తమిళనాడులో చేపట్టింది. వాస్తవం: కాలుష్య కారకాలైన వాయు, ద్రవ పదార్థాలను నేరుగా వదలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పర్యావరణ ప్రమాణాలను పాటించాలని ‘అమరరాజా’కు నోటీసులివ్వడం, కోర్టు ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకోవడం కక్ష సాధింపు ఎలా అవుతుంది? ప్రజారోగ్యాన్ని గుల్లచేస్తున్నా ఊరుకోవాలా డ్రామోజీ? ఆరోపణ: కృష్ణాజిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో టీడీపీ నిర్ణయించిన భూముల ధరల్ని వైఎస్సార్సీపీ అధి కారంలోకి వచ్చాక ఐదురెట్లు పెంచింది. వాస్తవం : ఏపీఐఐసీ వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని భూముల ధరలను సవరించడం సర్వసాధారణం. ఆరోపణ: విక్రయ ఒప్పందానికి రాలేదన్న కారణాలతో 74 మందికి స్థల కేటాయింపులను రద్దుచేసింది.. వాస్తవం: ఇందులో తప్పేముంది? భూముల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కేటాయిస్తే నిరీ్ణత కాలంలో డబ్బు చెల్లించి రిజి్రస్టేషన్ చేయించుకోవాల్సిన బాధ్యత పారిశ్రామిక సంస్థలది కాదా? ఆరోపణ: రిలయన్స్ ఇండస్ట్రీస్ చిత్తూరు జిల్లాలో రూ.13 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనను ఉపసంహరించుకుంది.. వాస్తవం: ఇది పూర్తిగా అవాస్తవం. రకరకాల వివాదాల్లో ఉన్న భూమిని గత టీడీపీ ప్రభుత్వం రిలయన్స్‌కు కేటాయించింది. అందుకే విరమించుకుంది. కానీ, రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెడతామని ముఖేష్ అంబానీ విశాఖ సదస్సులో ప్రకటించిన విషయం గుర్తులేదా!?