Fact Check Eenadu Ramoji Rao False Propaganda On CM Jagan - Sakshi
Sakshi News home page

Fact Check: ఓర్చుకోలేక.. ‘ఈనాడు’ విషపు రాతలు.. సీమను సుభిక్షం చేస్తున్నదెవ్వరు?

Published Sat, Jan 28 2023 8:21 AM | Last Updated on Sat, Jan 28 2023 2:56 PM

Fact Check Eenadu Ramoji Rao False Propaganda On CM Jagan - Sakshi

తెలుగుగంగ లైనింగ్‌ పనులు (ఫైల్‌)

చంద్రబాబు నాయుడు ఏం చేసినా... అది బంగారు బాటే. జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో తనకెవ్వరూ సాటిలేరని పదేపదే నిరూపిస్తున్నా... ఆయన మాటలన్నీ నీటిమూటలే. వయసు మీదపడుతున్న కొద్దీ రామోజీరావులోని ఈ దృష్టిలోపం మరింత తీవ్రమవుతోంది. ఎందుకంటే 2016, సెపె్టంబరు 2న అనంతపురం జిల్లాలో అప్పటి సీఎం చంద్రబాబు కరవుపై యుద్ధానికి వెళ్లారు. అది కూడా ‘రెయిన్‌గన్‌’లతో!!. ఈ పిట్టలదొర విన్యాసానికి పరవశించిపోయారు రామోజీరావు. ‘ఈనాడు’లో కరువుపై యుద్ధమంటూ పతాక శీర్షికల్లో అచ్చేశారు. ఒక్క చుక్క వర్షం పడకపోయినా... దుర్భిక్ష రాయలసీమ సస్యశ్యా మలమైపోయినట్లు కథనాలు వండి వార్చేశారు. 

ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  అధికారంలోకి వచ్చాక గడిచిన మూడున్నరేళ్లుగా ఏటా హంద్రీ–నీవా సామర్థ్యం కంటే ఎక్కువగా కృష్ణా జలాలను తరలిస్తున్నారు. ప్రధాన కాలువ, ఉప కాలువల ద్వారా వేలాది చెరువులను నింపుతున్నారు. భూగర్భజలాలు పుష్కలంగా పెరిగాయి. బోరు బావులతో పాటు చెరువులు, హంద్రీ–నీవా ప్రధాన కాలువలు, ఉప కాలువల కింద లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. డిస్ట్రిబ్యూటరీలను ప్రాధాన్యతల వారీగా పూర్తి చేస్తూ ఆయకట్టుకు నీళ్లందించేలా అడుగులేస్తున్నారు. దీంతో రాయలసీమ పచ్చగా కళకళలాడుతోంది. ఇక చంద్రబాబుకు పుట్టగతులుండవనే భయం రామోజీలో అంతకంతకూ పెరుగుతోంది. ‘ఈనాడు’లో దు్రష్పచారపు రాతలూ పెరుగుతున్నాయి. ఆ కోవలోనిదే... శుక్రవారం నాటి ‘జగనన్న మాట.. నీటి మూట’ కథనం. మరి దీన్లో నిజానిజాలేంటి? ఒకసారి చూద్దాం... 

బహుశా! ఒకే ప్రాజెక్టుకు రెండు సార్లు శంకుస్థాపన చేసిందెవరైనా ఉంటే అది చంద్రబాబు నాయుడేనని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చాక... 1996 లోక్‌సభ ఎన్నికలకు ముందు 40 టీఎంసీల సామర్థ్యంతోనూ హంద్రీ–నీవాకు శంకుస్థాపన చేశారు చంద్రబాబు. 1999 ఎన్నికలకు ముందు దాని సామర్థ్యాన్ని 35 టీఎంసీలకు తగ్గించి మరోసారి కూడా శంకుస్థాపన చేశారు. రెండు సార్లు శంకుస్థాపన చేసినా... 1995 నుంచి 2004 మధ్య హంద్రీ–నీవా కోసం ఖర్చుపెట్టింది మాత్రం కేవలం రూ.13.57 కోట్లు. అది కూడా ఉద్యోగుల జీతభత్యాలు, కార్యాలయాల నిర్వహణ కోసమే తప్ప ప్రాజెక్టు కోసం కాదు. అది బాబు ఘనతయితే... ఈ నిర్వాకాన్ని ఆ తొమ్మిదేళ్లలో ఒక్కసారి కూడా ప్రశ్నించకపోవటం రామోజీరావు ఘనత. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక శ్రీశైలానికి వరద వచ్చే 120 రోజుల్లో 40 టీఎంసీలను తరలించి.. ఉమ్మడి కర్నూల్, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 40 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా 2004లో హంద్రీ–నీవాను చేపట్టారు. 2009 నాటికల్లా హంద్రీ–నీవా తొలి దశను పూర్తి చేయటంతో పాటు... రెండో దశ పనులనూ సింహభాగం పూర్తి చేశారు. కానీ వైఎస్సార్‌ ఆకస్మిక మరణం తరవాత... టీడీపీ మద్దతుతో కొనసాగిన కాంగ్రెస్‌ ప్రభుత్వం హంద్రీ–నీవా పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి అటకెక్కించేసింది. 

జీవో 22, జీవో 63లతో చంద్రబాబు దోపిడీ.. 
విభజన తర్వాత 2014 ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. జీవో 22 (ధరల సర్దుబాటు), జీవో 63 (పనుల పరిమాణం ఆధారంగా అదనపు బిల్లులు చెల్లించడం) తెచి్చ, వాటి ద్వారా హంద్రీ–నీవా అంచనా వ్యయాన్ని రూ.6,850 కోట్ల నుంచి రూ.11 వేల కోట్లకు పెంచేశారు. అంతేకాక 60–సీ కింద పాత కాంట్రాక్టర్లను తప్పించి, అస్మదీయ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. భారీ ఎత్తున ఖజానాను దోచేశారు. హంద్రీ–నీవా ద్వారా అరకొరగా నీళ్లను తరలించి.. అరకొరగా పంపిణీ చేసి సీమ ప్రజల మధ్య జలయుద్ధాలు సృష్టించారు. చివరకు హంద్రీ– నీవాలో అంతర్భాగమైన కుప్పం నియోజకవర్గానికి నీళ్లందించే కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులను కూడా రూ.477 కోట్ల అంచనాతో ప్రారంభించి.. ఆ తర్వాత వ్యయాన్ని రూ.622 కోట్లకు పెంచేశారు. చివరకు పనులు చేయకుండానే... అస్మదీయ కాంట్రాక్టర్‌తో కలిసి సులువైన మట్టి పనులు చేసి, కమీషన్లు వసూలు చేసుకుని చేతులు దులిపేసుకున్నారు చంద్రబాబు. హంద్రీ–నీవా జలాలు అందక... వర్షాలు కురవక రాయలసీమ.. అందులోనూ అనంతపురం జిల్లా కరవుతో తల్లడిల్లుతుంటే 2016, సెపె్టంబరు 2న కరవుపై యుద్ధం... అంటూ ట్యాంకర్లతో నీటిని తెప్పించారు చంద్రబాబు నాయుడు.  పిట్టలదొరలా రెయిన్‌ గన్‌లు చేతబట్టి.. నాలుగు బొట్లు విదిల్చి... కరవును జయించేసినట్లు ప్రకటించారు. రైతులకు ఏమాత్రం పనికిరాని ఈ రెయిన్‌ గన్‌ల నిర్వహణ పేరుతో రూ.105 కోట్లను కాజేశారు. అదీ రామోజీరావు తెగ మెచ్చుకున్న బాబుగారి బాగోతం!!. 

కృష్ణా జలాలను గరిష్ఠంగా తరలిస్తూ.. 
వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక హంద్రీ–నీవా సామర్థ్యమైన 40 టీఎంసీల కంటే ఏటా అధికంగా కృష్ణా జలాలను తరలిస్తున్నారు. ప్రధాన కాలువ, ఉప కాలువల ద్వారా వేల చెరువులను నింపుతూ.. వాటి కింద లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తున్నారు. చెరువుల్లో నీటి నిల్వ వల్ల భూగర్భ జలాలు గరిష్ఠ స్థాయికి చేరాయి. 2019, మే నాటికి రాయలసీమ జిల్లాల్లో సగటున భూగర్భ జలమట్టం 26 మీటర్లు ఉండగా.. ప్రస్తుతం కేవలం 4.8 అడుగుల్లోనే భూగర్భ జలాలు పుష్కలంగా దొరుకుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీనివల్లే బోరు బావుల కింద రైతులు లక్షలాది ఎకరాల్లో పంటలు సాగు చేసుకుంటున్నారు. ప్రధాన కాలువ, ఉప కాలువల కింద కూడా భారీగా సాగు చేస్తూ... ఉద్యానవన పంటల సాగులో రాయలసీమను అగ్రగామిగా మార్చారు. సత్యసాయి, అనంతపురం జిల్లాలు ఫ్రూట్‌ బౌల్‌ ఆఫ్‌ ఏపీగా అవతరించాయంటే దానివెనక ఈ ప్రభుత్వం చేసిన కృషిని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.   

‘ఈనాడు’కు ఈ చర్యలు కనపడవా..? 
దుర్భిక్ష రాయల సీమను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా సత్యసాయి జిల్లాలో పేరూరు (అప్పర్‌ పెన్నార్‌) ప్రాజెక్టును సీఎం వైఎస్‌ జగన్‌ 2020లోనే హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలతో నింపారు. అనంతపురం జిల్లాలో భైరవానితిప్ప ప్రాజెక్టును హంద్రీ–నీవా జలాలతో నింపే పనులను వేగవంతం చేశారు.  
ధర్మవరం నియోజకవర్గంలో 2.18 టీఎంసీల సామర్థ్యంతో జిల్లేడుబండ రిజర్వాయర్‌ నిర్మాణ పనులను సీఎం జగన్‌ చేపట్టారు. ఈ రిజర్వాయర్‌ కింద 23 వేల ఎకరాలకు నీళ్లందించనున్నారు.  
సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో హంద్రీ–నీవా ద్వారా 3 టీఎంసీలు తరలించి.. 195 చెరువులను నింపి, 10,834 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం, 2.43 లక్షల మంది దాహార్తి తీర్చే పనులు సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టారు. 
మడకశిర నియోజకవర్గానికి నీళ్లందించేందుకు హంద్రీ–నీవా రెండో దశలో మడకశిర బైపాస్‌ కెనాల్‌ పనులను చేపట్టారు.  
కర్నూల్‌ జిల్లాలో పశ్చిమ ప్రాంతంలోని 9 దుర్భిక్ష మండలాల్లో 10,130 ఎకరాలకు నీళ్లందించేందుకు హంద్రీ–నీవా నుంచి 1.238 టీఎంసీలను ఎత్తిపోసే పథకం పనులను రూ.180.67 కోట్లను ఖర్చు చేసి, దాదాపుగా పూర్తి చేశారు.  
హంద్రీ–నీవా.. గాలేరు–నగరి అనుసంధానం ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేసే పనులను సీఎం వైఎస్‌ జగన్‌ చేపడితే.. టీడీపీ నేతలతో ఎన్జీటీలో కేసులు వేయించి, సైంధవుడిలా అడ్డుపడే దుస్సాహసానికి చంద్రబాబు ఒడిగట్టారు. విచిత్రమేంటంటే ఈ దౌర్భాగ్యపు పనులను ‘ఈనాడు’ ఏనాడూ ప్రస్తావించదు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమని చెప్పదు. 
టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీనే గెలిపిస్తూ వచ్చిన హిందూపురం నియోజకవర్గ ప్రజల దాహార్తిని సైతం చంద్రబాబు తీర్చలేదు. ఆ నియోజకవర్గ ప్రజల దాహార్తిని మహా నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తీర్చితే. చంద్రబాబు చేతులెత్తేసిన హంద్రీ–నీవాలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులను జూన్‌కు పూర్తి చేసి ఆ నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలించి.. సస్యశ్యామలం చేసే దిశగా సీఎం వైఎస్‌ జగన్‌ అడుగులు వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement