సాక్షి, అమరావతి: విద్యుత్ కోతలపై తప్పుడు ప్రచారాన్ని ఇంధన శాఖ ఖండించింది. పట్టణాలు, గ్రామాల్లో గంటల తరబడి కోతలంటూ చేస్తోన్న దుష్ప్రచారాన్ని ఇంధన శాఖ అధికారులు తప్పుబట్టారు. విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు డిస్కమ్‌లు చర్యలు చేపట్టాయి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. (చదవండి: కర్రల సమరంలో హింస.. 100మందికిపైగా గాయాలు)
బొగ్గు కొనుగోలు నిమిత్తం ఏపీ జెన్‌కోకు రూ.250 కోట్లు నిధులు, రాష్ట్రానికి అదనంగా రోజుకి దాదాపు 8 బొగ్గు రైళ్లు కేటాయించారు. దేశంలో బొగ్గు లభ్యత ఎక్కడున్నా కొనుగోలు చేయాలని ఏపీ జెన్‌కోను ప్రభుత్వం ఆదేశించింది. స్వల్పకాలిక మార్కెట్ నుంచి కొనుగోలు చేయాలని విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర విద్యుత్ సంస్థల నుంచి కేటాయించబడని వాటా నుంచి సమీకరణ యత్నాలను ప్రభుత్వం ప్రారంభించింది. వచ్చే ఏడాది జూన్ వరకు 400 మెగావాట్ల విద్యుత్ కోసం కేంద్రాన్ని అభ్యర్థించింది. సింగరేణి సంస్థతో సమన్వయం చేసుకుని బొగ్గు సరఫరా కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు. వీటీపీఎస్, కృష్ణపట్నంలోనూ థర్మల్ విద్యుత్ కేంద్రాలు ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
విద్యుత్ కోతలపై వదంతులు నమ్మొద్దు..
విద్యుత్ కోతలపై వదంతులు నమ్మొద్దని ఈపీడీసీఎల్ సీఎండీ సంతోష్‌రావు అన్నారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును ప్రభుత్వం సరఫరా చేసిందన్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని ఆయన స్పష్టం చేశారు.
చదవండి: ఆహా ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోకు బాలయ్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!
Comments
Please login to add a commentAdd a comment