Department of Electricity
-
విద్యుత్‌శాఖలో ఖాళీలు భర్తీ చేస్తాం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘విద్యుత్ శాఖలో పదేళ్లు గా ప్రమోషన్లు పెండింగ్‌లో ఉండగా, మా ప్రభుత్వమే ఇచ్చి0ది. ఎవరూ అడగక ముందే దీనిపై నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం ఈ శాఖలో ఖాళీల కారణంగా ఉన్న వారిపై పనిభారం పడు తోంది. నెల,రెండు నెలల్లో వీటి భర్తీకి నోటిఫికేషన్ ఇస్తాం’అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్ర మార్క వెల్లడించారు. ఖమ్మం కలెక్టరేట్లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల అధికారుల తో విద్యుత్, సంక్షేమ శాఖలపై మంగళవారం ఆయన సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో భట్టి మాట్లాడారు. మార్పులపై ప్రత్యేక శిక్షణ వరదల సమయంలో విద్యుత్ ఉద్యోగులు ఎంతో కష్టపడి పనిచేశారని భట్టి అభినందించారు. అయితే శాఖలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉద్యోగ వ్యవస్థ అందుబాటులోకి రావాల్సి ఉందని, 20 నుంచి 30 ఏళ్లుగా పనిచేస్తున్న వారికి హైదరాబాద్‌లోని స్టాఫ్ కాలేజీలో శిక్షణ ఇస్తామని తెలిపారు. విద్యుత్‌కు సంబంధించి ఏ సమస్య వచ్చినా వినియోగదారులు 1912కు కాల్ చేయొచ్చని, 108 లాగే ఇది కూడా ఉపయోగపడుతుందన్నారు. పేరు, అడ్రస్ చెబితే అక్కడ సమస్య పరిష్కారానికి అధికారులు కృషి చేస్తారని తెలిపారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నందున ఉద్యోగులు చిన్నలోపం కూడా ఎదురుకాకుండా చూడాలన్నారు. మరమ్మతులు చేసిన కొన్నాళ్లకే టాన్స్‌ఫార్మర్లు పేలిపోతున్నందున, వ్యవస్థలను తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. మూసీ అంశం కొత్తది కాదు రెవెన్యూ రికార్డుల అప్డేట్ అంటూ.. గత పాలకులు బినామీల పేర్లపైకి భూములను బదలాయించారని భట్టి ఆరోపించారు. తాము మాత్రమే ఆక్రమణకు గురైన చెరువులను సరిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఒక్కరే నిర్ణయాలు తీసుకునేవారని, అందుకే మూసీ అంశాన్ని కేబినెట్లో చర్చించారా అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారన్నారు. మూసీపై కేబినెట్లో చర్చించడానికి కొత్త అంశమేమీ కాదన్నారు. మూసీని శుభ్రం చేసి నగరం నడి»ొడ్డున స్వచ్ఛమైన నది ప్రవహించేలా సుందరీకరణ చేయబోతున్నామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూసీని సుందరీకరణ చేస్తామని చెప్పి చేయలేదని, తాము చేసి చూపిస్తామని, నిర్వాసితులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వమన్నారు. మూసీ ప్రక్షాళనకు డీపీఆర్‌లు సిద్ధం కాకముందే రూ.1.50 లక్షల కోట్లు వ్యయమవుతుందని చెప్పడం సరికాదని చెప్పారు. తాము గడీల్లో లేమని, ఎవరైనా ఎప్పుడైనా వచ్చి సలహాలు ఇవొచ్చని భట్టి తెలిపారు. మైనింగ్ వ్యవస్థపై అధ్యయనం చేశాం అమెరికాలో జరిగిన అంతర్జాతీయ మైనింగ్ ఎక్స్‌పోలో పాల్గొని ఆధునిక యంత్ర పరికరా లు, సాంకేతికతను వినియోగించి ఎక్కువ బొగ్గు వెలికితీయడం, బొగ్గు ఉత్పత్తిలో భద్రతా చర్యలను పరిశీలించామని భట్టి తెలిపారు. సింగరేణి పెద్ద మైనింగ్ వ్యవస్థ కావడంతో ఆ శాఖ మంత్రి గా అమెరికా, జపాన్ దేశాల్లో పర్యటించానన్నా రు. దసరా కన్నా ముందే అన్ని రకాల పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ల పెండింగ్ బిల్లులు రూ.114 కోట్లు, మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులు విడుదల చేశామని, పిల్లల కాస్మోటిక్ చార్జీలను ఏ నెలకానెల అందజేస్తామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు అన్నీ క్లియర్ చేస్తామన్నారు. 2029–2030 వరకు 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ కె.వరుణ్‌రెడ్డి, కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ శాఖనూ వీడని సర్దు‘పోటు’!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం వంద రోజల పాలనలో విద్యుత్ శాఖలో చెప్పుకోవడానికంటూ జరిగిన అభివృద్ధి ఒక్కటీ లేదు. కనీసం కొత్త సర్కిళ్లయినా ఇస్తే ప్రజలకు విద్యుత్ సేవలు చేరువవుతాయనే డిమాండ్ రావడంతో ఎట్టకేలకు వాటికి అనుమతినిచ్చింది. ఆ వెంటనే విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు పదమూడు కొత్త జిల్లాలకు సర్కిళ్లను ఏర్పాటు చేశారు. కానీ ఎలాంటి ఆర్థిక భారం ఉండకూడదని ప్రభుత్వం ఇచ్చిన అనుమతి ఆదేశాల్లోనే పేర్కొనడంతో ప్రస్తుతం ఉన్న సిబ్బందినే కొత్త కార్యాలయాల్లో సర్దుబాటు చేశారు. దానివల్ల కొన్ని చోట్ల కొన్ని పోస్టులను తీసేయాల్సి వచ్చింది. మరి కొన్ని చోట్ల పోస్టులను ఒకదానితో మరొకటి కలిపేయాల్సి వచ్చింది. దీంతో పనిభారం పెంచేలా ప్రభుత్వం చర్యలున్నాయని విద్యుత్ ఉద్యోగులు మండిపడుతున్నారు. అదీగాక ఇన్నాళ్లూ డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ (డీఈఈ)లు ఉన్న డివిజన్ కార్యాలయాలనే జిల్లా స్థాయికి మార్చడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. పర్యవేక్షక ఇంజనీర్ (ఎస్ఈ) కార్యాలయానికి తగ్గట్టు ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా.. ఉన్నవాటితోనే సర్ధుకోమనడంపై విద్యుత్ సంఘాలు మండిపడుతున్నాయి. గత ప్రభుత్వంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా పెంచినప్పుడు ప్రతి జిల్లాకు ఒకేలా పరిపాలనా సిబ్బందిని, కార్యాలయాలను కేటాయించారని, కానీ కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా విద్యుత్ సంస్థల్లో సిబ్బందిని వేధించేందుకే సర్కిళ్లకు షరతులు పెట్టిందని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.కేటాయింపుల్లో తేడాలుసిబ్బందిపైనే భారంరాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల్లో కొత్త సర్కిళ్లు (జిల్లా కార్యాలయాలు) ఏర్పాటు చేసిన విషయం విధితమే.13 పాత సర్కిళ్లకు అదనంగా మరో 13 కొత్త సర్కిళ్లను రూపొందించి, వాటికి అధికారులను, సిబ్బందిని కూడా కేటాయించారు. కార్పొరేట్ కార్యాలయాల్లో జనరల్ మేనేజర్లు(జీఎం)గా ఉన్నవారిని సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ)లుగా నియమించారు. అక్కడ మిగిలిన జీఎంల డిజిగ్నేషన్లు మార్చి, అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఒక్కొక్కరూ రెండు, మూడు విభాగాలను చూడాలి. ఉదాహరణకు ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో క్యాలిటీ కంట్రోల్ జీఎంకు కమర్షియల్ విభాగాన్ని అదనంగా ఇచ్చారు. అదేవిధంగా అన్ని సర్కిళ్లలో చీఫ్జనరల్ మేనేజర్లకు అదనపు బాధ్యతలు అప్పగించనున్నారు. అలాగే సర్కిళ్ల విభజన తరువాత ఒక్కో జిల్లాకూ ఒక్కో విధంగా విద్యుత్ సిబ్బంది పోస్టులను కేటాయించారు. ఏపీఎస్పీడీసీఎల్లో అనంతపురం సర్కిల్‌కు 58 మంది సిబ్బందిని కేటాయిస్తే, అదే డిస్కం పరిధిలోని సత్యసాయి జిల్లా, పుట్టపర్తి సర్కిల్‌కు 55 మందినే ఇచ్చారు. అలాగే ఏపీఈపీడీసీఎల్ లో విశాఖపట్నం సర్కిల్లో 61 మందితో సర్ధుబాటు చేస్తే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సర్కిల్‌కు కేవలం 52 మందితోనే సరిపెట్టారు. ఏపీసీపీడీసీఎల్‌లో ఒంగోలు సర్కిళ్లలో 49 మందిని ఇస్తే సీఆర్డీఏ సర్కిల్‌కు 41 మందినే కేటాయించారు. పోనీ ఈ కేటాయింపుల మేరకైనా సిబ్బందిని బదిలీ చేశారా అంటే అదీ లేదు. కొత్త సర్కిళ్ల పేరు చెప్పి సగం సర్వీసులు తగ్గించేశారు. ఉదాహరణకు కొన్ని సర్కిళ్లలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (ఎస్ఏఓ) పోస్టులను తీసేశారు. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్(జేఏఓ) పోస్టులను తగ్గించేశారు. అలాగే టెక్నికల్ పోస్టులను కుదించేశారు. ఒక్కో ఉద్యోగి రెండు మూడు విభాగాల పని చేసే విధంగా పనిభారం మోపడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అసలే పని భారంతో సతమతమవుతున్న ఉద్యోగులు ఈ కేటాయింపుపై ఆందోళనకు గురవుతున్నారు. -
విద్యుత్‌శాఖలో వింత ఆచారం
సాక్షి, అమరావతి: విద్యుత్‌శాఖలో డిప్యుటేషన్లపై పనిచేస్తున్నవారి విషయంలో ఆ శాఖ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం ఉద్యోగవర్గాల్లో సంచలనం సృష్టించింది. డిప్యుటేషన్‌పై వచ్చినవారు శాశ్వతంగా అక్కడే పనిచేసేలా జారీచేసిన ఈ ఉత్తర్వులు.. సంస్థ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి రగిలించాయి. ఒక ప్రభుత్వ విభాగంలో ఒక అధికారినిగానీ, సిబ్బందిగానీ వారి సొంత కారణాలతోనో, ఆ శాఖ అవసరానికో ఒకచోటు నుంచి మరోచోటుకి, ఒక శాఖ నుంచి మరో శాఖకు డిప్యుటేషన్‌పై పంపడం సాధారణంగా జరుగుతుంటుంది. దీనికి కాలాన్ని కూడా చాలా తక్కువగా నిర్ణయిస్తారు. అంటే మూడునెలల నుంచి ఏడాది పాటు తాత్కాలిక విధుల్లో కొనసాగేలా ఆ ఆదేశాలు ఇస్తుంటారు.అయితే ఒకసారి ఒక చోటుకిగానీ, ఒక శాఖకుగానీ వెళ్లిన వారిలో కొందరు అక్కడి నుంచి తిరిగిరావడానికి ఇష్టపడరు. మరికొందరు ఎప్పుడు వెనక్కి వచ్చేద్దామా అని చూస్తుంటారు. వారికిచ్చిన గడువు ప్రకారం డిప్యుటేషన్‌ను పొడిగించడం, రద్దుచేయడం వంటివి ఉన్నతాధికారులు చేస్తుంటారు. ఇదీ సాధారణంగా జరిగేది. రాష్ట్రంలో 11 జిల్లాలకు విద్యుత్ సరఫరా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో మాత్రం ఇందుకు విరుద్ధంగా సరికొత్త ఆచారం పుట్టుకొచ్చి0ది. ఇచ్చిపడేశారంతే.. ఏపీఈపీడీసీఎల్ ప్రధాన కార్యాలయం (కార్పొరేట్ ఆఫీస్) విశాఖపట్నంలో ఉంది. అక్కడ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్స్ హోదాల్లో 35 మంది ఉద్యోగులు డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. వీరిలో వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు తొమ్మిదేళ్లు పూర్తిచేసుకున్న వారు ఉన్నారు. 2015 నుంచి 2023 వరకు ఏటా కొంతమంది చొప్పున వీరంతా వచ్చారు. ఏటా వీరి విజ్ఞప్తిని, సంస్థ అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిప్యుటేషన్లు పొడిగిస్తున్నారు. కానీ సడన్‌గా ఏమైందో ఏమోగానీ.. ఇకపై వీరు ఎన్నాళ్లయినా కార్పొరేట్ ఆఫీసులోనే ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ 35 మందికి ఇకపై ఏటేటా డిప్యుటేషన్ పొడించాలా, రద్దుచేయాలా అనే చర్చే రాకుండా చేసేశారు. ఇకపై వీరంతా పర్మినెంట్‌గా కార్పొరేట్ కార్యాలయంలోనే విధులు నిర్వర్తించేలా సంస్థ ఫైనాన్స్, హెచ్ఆర్డీ విభాగం డైరెక్టర్ డి.చంద్రం తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. దీంతో జిల్లాల నుంచి ఎవరైనా ఉద్యోగి విశాఖకు డిప్యుటేషన్‌పై వెళ్లాలంటే ఇప్పుడున్నవారు ఉద్యోగ విరమణ చేస్తేగానీ కుదరదు. ఇలాంటి ముఖ్యమైన విధాన నిర్ణయాలు సీఎండీ స్థాయిలోనే తీసుకుంటారు. అలా కాకుండా డైరెక్టర్ స్థాయి అధికారి ఉత్తర్వులు ఇవ్వడం కూడా చర్చనీయాంశమైంది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వెనుక ఏవో బలమైన కారణాలున్నాయనే చర్చ విద్యుత్ ఉద్యోగుల మధ్య జరుగుతోంది. ఏటా ఎందుకని.. డిప్యుటేషన్లపై ఏటా ఫైలు నడపడం పెద్ద ప్రాసెస్‌గా ఉంటోంది. అలాంటిదేం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నాం. అయినప్పటికీ ఈ డిప్యుటేషన్లను ఎప్పుడైనా రద్దుచేసే అధికారం సంస్థకు ఉంది. – ఐ.పృధ్వీతేజ్, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్ -
రూ.1200 బిల్ లొల్లి.. కరెంట్ కట్ చేశాడని.. లైన్‌మన్‌పై పెట్రోల్ పోసి..
గజ్వేల్ రూరల్: బిల్లు చెల్లించలేదని ఇంటి విద్యుత్ కనెక్షన్ తొలగించిన జూనియర్ లైన్‌మన్‌పై వినియో గదారుడు పెట్రోల్ పోశాడు. గజ్వేల్ మున్సి పాలిటీ పరిధిలోని క్యాసారంలో శనివారం జరిగిన ఈ సంఘటనపై విద్యుత్ శాఖాధికారులు, వినియోగదా రుని కుటుంబ సభ్యులు, గజ్వేల్ పోలీసు లు తెలిపిన వివరాలివి. క్యాసారంలోని 2వ వార్డుకు చెందిన సుంకరి కరుణాకర్ ఇంటికి 2 నెలలకు రూ.1,200 బిల్లు వచ్చింది. ఇటీవల జూనియర్ లైన్‌మన్ నరేష్ తన విధుల్లో భాగంగా కరుణాకర్‌ను బిల్లు చెల్లించాల ని కోరాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. ఇదే విషయాన్ని జేఎల్ఎం నరేశ్ విద్యుత్‌శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి.. శనివారం విద్యు త్ స్తంభం ఎక్కి కరుణాకర్ ఇంటికి కనెక్షన్ తొలగించాడు. దీంతో అసహనానికి గురైన కరుణాకర్ తన ద్విచక్ర వాహనంలోని పెట్రోల్ తీసి నరేశ్‌పై పోసి అగ్గిపెట్టె తీయడంతో అతని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో నరేశ్ ఈ విషయాన్ని విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, తనపై హ త్యాయత్నం చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరప్రసాద్ తెలిపారు. కాగా తమకు జీతం రాలేదని, రెండుమూడు రోజుల్లో చెల్లిస్తామని చెప్పినప్పటికీ నరేష్ వినకుండా విద్యుత్ సరఫరాను తొలగించినట్లు కరుణాకర్ భార్య కావ్య పేర్కొన్నారు. -
అవసరమైనంత విద్యుత్ అందిస్తాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిమాండ్ తగ్గట్టుగా ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు ప్రజలకు కరెంటు అందిస్తున్నాయని, ఇకమీదట కూడా ఎంత అవసరమైనా విద్యుత్‌ను సరఫరా చేస్తామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై అధికారులతో శుక్రవారం ఆయన వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా, రికార్డు స్థాయిలో 12,653 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌తో 251 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగం జరుగుతున్నా.. విద్యుత్ కోతలు విధించడం లేదని తెలిపారు. భవిష్యత్తులో పెరగనున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడం కోసం విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. భారీగా పెరుగుతున్న డిమాండ్ ఇంధన డిమాండ్ ఏటా పెరుగుతూ వస్తున్నదని, గతేడాది గరిష్ట డిమాండ్‌తో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 27.51 శాతం పెరిగిందని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. ఉదాహరణకు, 2020 మార్చి నెలలో ఇంధన డిమాండ్ 5,853.39 మిలియన్ యూనిట్లు కాగా, ఈ ఏడాది మార్చిలో నెలవారీ ఇంధన డిమాండ్ దాదాపు 16 శాతం పెరుగుదలతో 6,781.54 మిలియన్ యూనిట్లకు చేరుకుందని చెప్పారు. అదేవిధంగా, 2020 మే నెలలో సగటు రోజు డిమాండ్ 180.69 మిలియన్ యూనిట్లుకాగా, ఈ ఏడాది మే 17 వరకు సగటు రోజు డిమాండ్ 16.33 శాతం పెరుగుదలతో 210.20 మిలియన్ యూనిట్లు ఉందని ఆయన వివరించారు. ఒక్క వైజాగ్ నగరంలోనే 2018–19లో 6,696 మిలియన్ యూనిట్లు ఉన్న విద్యుత్ డిమాండ్ 2021–22లో 8,164 మిలియన్ యూనిట్లకు, అంటే 22 శాతం పెరిగిందన్నారు. ఈ విధంగా ఇంధన వినియోగం పెరగడం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సంకేతమని మంత్రి అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగానికి 9 గంటలు పగటిపూట విద్యుత్ సరఫరా ఉచిత విద్యుత్ పథకాన్ని బలోపేతం చేయడంలో భాగంగా, ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో దాదాపు 1.20 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. విద్యుత్ శాఖ ఎల్లప్పుడూ సన్నద్ధం పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ఉత్పత్తి కోసం థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాను మెరుగుపరచడానికి ప్రయతి్నస్తున్నామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర బొగ్గు, రైల్వే మంత్రిత్వ శాఖలతో రాష్ట్ర విద్యుత్ శాఖ అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని వివరించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా డిస్కంలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయని, సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉన్నాయని ఆయన వివరించారు. థర్మల్ పవర్ ప్రొడక్షన్ ప్రాజెక్టులు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లు, పవర్ నెట్వర్క్ మొదలైన వాటి నుంచి విద్యుత్ ఉత్పత్తిని మరింత పెంచేందుకు ఏపీ విద్యుత్తు సంస్థలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. మే 18న నమోదైన 251మిలియన్ యూనిట్ల డిమాండ్‌లో దాదాపు 103.294 మిలియన్ యూనిట్ల డిమాండ్‌ను ఏపీజెన్కో ప్లాంట్లు తీర్చాయని సంస్థ ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు తెలిపారు. ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఐ.పృథీ్వతేజ్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ తీగల వల్ల ఒక్క ప్రాణం కూడా పోకూడదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ తీగల వల్ల ఇకపై ఒక్క ప్రాణం కూడా పోకూడదని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లాలో విద్యుత్ తీగలు తెగిపడిన ఘటనలో అమాయక కూలీలు మృత్యువాత పడటంపై ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి ఇటువంటి దుర్ఘటన పునరావృతం కాకూడదని అధికారులను హెచ్చరించారు. ఆయన గురువారం విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నుంచి విద్యుత్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలపై ఎందుకు దృష్టిపెట్టలేదని అధికారులను ప్రశ్నించారు. విద్యుత్ లైన్లు ప్రమాదకరంగా ఉన్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన తక్షణమే స్పందించాలని ఆదేశించారు. విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబరు 1912 గురించి ప్రచారం కల్పించాలని, అన్ని సచివాలయాల్లో ఈ నంబరు ప్రదర్శించాలని సూచించారు. ప్రజల ప్రాణాలకు అపాయం కలిగించే అంశాలను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని, వాటిని పరిష్కరించాలన్నారు. అధికారులు హెడ్‌క్వార్టర్స్‌లోనే కచ్చితంగా ఉండాలని చెప్పారు. విధుల్లో ఎవరైనా ఉదాసీనంగా వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేశామని, ఈ కమిటీలు అన్ని ప్రాంతాలను తనిఖీ చేస్తాయని తెలిపారు. లైన్మెన్లు, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ రంగానికి సంబంధించి కర్నూలు, అనంతరపురం జిల్లాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొంత నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. పాత విద్యుత్ లైన్లను సకాలంలో మార్చకపోవడం, ఆధునికీకరణ చేపట్టకపోవడంవల్ల లైన్లు తెగిపడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఈ రెండు జిల్లాల ఎస్ఈ, ఈఈ స్థాయి అధికారులు తమ పరిధిలోని అన్ని లైన్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. పెండింగ్ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లన్నీ ఈ నెలలో ఇవ్వాలి దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు నిబంధనల ప్రకారం ఈ నెలాఖరు నాటికి విద్యుత్ సర్వీసు ఇవ్వాలని నిర్దేశించారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ)æ ద్వారా రైతులకు డబ్బు జమచేసేందుకు ఖాతాలు ప్రారంభించడం, ఆధార్ అప్డేట్ పనుల్ని మరింత వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి విద్యుత్‌పై వస్తున్న ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్, విజిలెన్స్ జేఎండీ బి.మల్లారెడ్డి, పలు జిల్లాల స్‌ఈలు, ఈఈలు పాల్గొన్నారు. -
ప్రజలపై పైసా భారం లేకుండా స్మార్ట్ మీటర్లు
సాక్షి, అమరావతి: ప్రజలపై పైసా భారం పడకుండా, పూర్తి పారదర్శకంగా స్మార్ట్ మీటర్ల టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు రంగం సిద్ధం చేశాయి. రాష్ట్రంలోని గృహాలకు, వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని ఇంధన శాఖ సంకల్పించింది. బోర్లకు మీటర్లు అమర్చడం వల్ల డిస్కంల సమర్థత పెంచవచ్చని, విద్యుత్ చౌర్యాన్ని అరికట్టవచ్చని, రైతులకు బాధ్యత పెంచవచ్చనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేయనుంది. ఈ వివరాలతో టెండర్ డాక్యుమెంట్లను అక్టోబర్ 21న విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు న్యాయ సమీక్షకు పంపించాయి. వాటిపై ప్రజలు, వినియోగదారులు సూచనలు, సలహాలు, అభ్యంతరాలను వ్యక్తం చేసేందుకు ఇచ్చిన గడువు మంగళవారంతో ముగుస్తుంది. డాక్యుమెంట్ల పరిశీలన పూర్తికాగానే రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి డిస్కంలు దరఖాస్తు చేయనున్నాయి. ఏపీఈఆర్సీ తుది నిర్ణయం తరువాత మీటర్ల ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. అది అవాస్తవం మీటరుకు రూ. 6 వేలు, నిర్వహణకు రూ.29వేలు చొప్పున మొత్తం రూ.35 వేలను డిస్కంలు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అది పూర్తిగా అవాస్తవమని డిస్కంలు స్పష్టం చేశాయి. నిజానికి టెండర్లు కోట్ చేసిన రేటు ప్రకారం ఒక నెలకు ఒక్కో మీటరుకు రూ. 255 చొప్పున అన్ని నిర్వహణ బాధ్యతలు, దొంగతనం జరిగిన, మీటర్లు కాలిపోయిన టెండర్ బిడ్ చేసేవారే మీటర్లు మార్చే విధంగా డాక్యుమెంట్ పొందుపరిచారు. దీని ప్రకారం ఐదేళ్లకు రూ. 15,300 మాత్రమే ఖర్చుఅవుతోంది. వ్యవసాయ విద్యుత్ మీటర్లకు డీఓఎల్ స్టార్టర్లు వాడటం వల్ల 4 నుంచి 5 రెట్లు ఎక్కువ విద్యుత్ డ్రా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీటరు సామర్థ్యం దానికి తగ్గట్టుగా ఉండాలి. వ్యవసాయ క్షేత్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగ్గా ఉండదు. అందువల్ల దానికి తగ్గట్టు కమ్యూనికేషన్ వ్యవస్థను టెండర్స్ బిడ్ చేసే వారే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మీటర్లతో ప్రయోజనం స్మార్ట్ మీటర్లు వస్తే విద్యుత్ వృథా, చౌర్యాన్ని అరికట్టడం సాధ్యమవుతుంది. సరఫరాలో లోపాలుంటే డిస్కంలను ప్రశ్నించే హక్కు వినియోగదారులకు లభిస్తుంది. పంపిణీ వ్యవస్థలో లోపాలను సకాలంలో గుర్తించడం వల్ల విద్యుత్ అంతరాయాలను వెంటనే పరిష్కరించే వీలుంటుంది. స్మార్ట్ మీటర్లు ‘టూ వే కమ్యూనికేషన్’ను సపోర్ట్ చేస్తాయి. అంటే వినియోగదారుల మొబైల్‌కు అనుసంధానమై ఉంటాయి. విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి విద్యుత్ ధరలు, బిల్లు గడువు వంటి సందేశాలను ఎప్పటికప్పుడు వినియోగదారుల మొబైల్ ఫోన్లకు పంపుతాయి. – కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ -
Ganesh Chaturthi 2022: 'పండుగ వేళ..' కరెంటుతో జాగ్రత్త
సాక్షి, అమరావతి: ఊరూవాడా పూజలందుకునే వినాయకుడి పందిళ్ల వద్ద వేలాది రంగురంగుల విద్యుద్దీపాలు ఏర్పాటవుతున్నాయి. ఆయా పందిళ్ల వద్ద నిరంతరం స్వామి పాటలు వినిపించాలన్నా, పూజా మంత్రాలు భక్తులకు చేరాలన్నా.. లౌడ్ స్పీకర్లు, మైకులు తప్పనిసరి. అదేవిధంగా పెద్దపెద్ద మండపాల వద్ద ఏసీలు, ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలకు ప్రత్యేక విద్యుత్ ఏర్పాట్లు చేస్తున్నారు. వీటన్నిటికీ కరెంటు అవసరం. ఈ కరెంటు విషయంలో అందరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అందుకే వినాయక చవితికి విద్యుత్ శాఖ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. భద్రతకు చర్యలు చేపట్టింది. ఆ వివరాలను ఆంధ్రప్రదేశ్ తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీ కె.సంతోషరావు, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ జె.పద్మాజనార్ధనరెడ్డి ‘సాక్షి ప్రతినిధి’కి వెల్లడించారు. వారు చెప్పినదాని ప్రకారం.. ► వినాయక ఉత్సవాల్లో విద్యుత్ శాఖకు సంబంధించిన అన్నిరకాల సేవలను పర్యవేక్షించడానికి ప్రతి జిల్లాలోను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు బాధ్యతలు అప్పగించారు. వీరు డివిజనల్ ఇంజనీర్లతో సమన్వయం చేసుకుంటారు. ► క్షేత్రస్థాయిలో నిర్వాహకులు, భక్తులకు సహకరించడం, విద్యుత్ సర్వీస్, ప్రమాదాలపై వారికి అవగాహన కల్పించడం కోసం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ముగ్గురు సభ్యులతో ఏర్పాటైన బృందాలు ప్రతి మండపం వద్దకు తిరుగుతూ విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు చెబుతుంటాయి. ► ప్రతి మండలానికి ఒక సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ అందుబాటులో ఉంటారు. ఏదైనా పెద్ద సమస్య ఏర్పడితే ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతారు. ► మండపంలో విద్యుత్ కోసం ముందుగా విద్యుత్ శాఖ నుంచి లోడ్ ప్రకారం నిర్ణీత రుసుము చెల్లించి అనుమతి పొందాలి. దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన వారికి ఎలక్ట్రికల్ ఇంజనీర్లు విద్యుత్ ప్రమాదాలపై పలు సూచనలు చేస్తున్నారు. ► మండపంలో ఉండే విద్యుత్ పరికరాల లోడ్‌కు తగిన నాణ్యమైన కేబుల్స్ వాడాలి. జాయింట్లు ఉన్న, ఇన్సులేషన్‌లేని వైర్లను వాడటం అపాయకరం. వైరింగ్‌ను లైసెన్స్ కలిగిన ఎలక్ట్రీషియన్ చేత మాత్రమే చేయించుకోవాలి. ముఖ్యంగా లోడ్‌కు తగిన కెపాసిటీ కలిగిన ఎంసీబీ (మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్)లను తప్పనిసరిగా వాడాలి. ఒకవేళ ఎంసీబీలు ఓవర్ లోడ్ అయితే షార్ట్ సర్క్యూట్ అయి అగ్ని ప్రమాదాలు జరగవచ్చు. ► విద్యుత్ సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద గణేష్ మండపాలను ఏర్పాటు చేయరాదు. విద్యుత్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్ల దిమ్మెలను మండపాలకు సపోర్ట్ కోసం వాడరాదు. విద్యుత్ వైర్లు, పోల్స్, ఇతర ప్రమాదకర విద్యుత్ పరికరాలు మండపాల పరిసరాల్లో ఉంటే వాటిని పరిశీలించి వాటి నుంచి దూరంగా ఉండాలి. ► వినాయక మండపాలకు విద్యుత్ సరఫరా కనెక్షన్ కోసం విద్యుత్ స్తంభాలు ఎక్కకూడదు. విద్యుత్ శాఖ సిబ్బందిని సంప్రదిస్తే వారు మండపం వద్దకు వచ్చి పరిశీలించి కనెక్షన్ ఇస్తారు. ► ఒకవేళ ఎవరికైనా విద్యుత్ షాక్ తగిలినా, విద్యుత్ లైన్లు ఎక్కడైనా తెగిపడినా, ఇతర అత్యవసర పరిస్థితులు ఏర్పడినా వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1912కు గానీ, సమీప ఫ్యూజ్ ఆఫ్ కాల్‌కు గానీ కాల్చేసి విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలి. -
ఎస్ఎస్ఆర్ రేట్లు పెంచిన దక్షిణ డిస్కం
సాక్షి, హైదరాబాద్: నిర్వహణ,మరమ్మతు పనులకు సంబంధించిన ప్రామాణిక ధరల పట్టిక(ఎస్ఎస్ఆర్) రేట్లను పట్టణ ప్రాంతాల్లో 30%, గ్రామీణ ప్రాంతాల్లో 25% పెం చుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) ప్రకటించింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి కృషి తో ఎస్ఎస్ఆర్ రేట్లు పెరిగాయని తెలంగాణ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆయన కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు పెద్ద సం ఖ్యలో విద్యుత్ కాంట్రాక్టర్లు శనివారం మంత్రి నివాసానికి చేరుకుని ఆయన్ను సన్మానించారు. ఐదేళ్ల నుంచి రేట్ల పెంపుదల కోసం నిరీక్షిస్తున్నామని, సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు శివకుమార్, ఎస్కే మాజిద్ తెలిపారు. -
డిస్కంలపై ‘దివాలా’ పిడుగు!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ సంస్థ (డి స్కం)లు కొత్తగా ‘దివాలా’ముప్పు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ రంగ డిస్కంలకు కూడా దివాలా స్మృతి సంపూర్ణంగా వర్తిస్తుందని.. దివాలా వ్యా పార పరిష్కార ప్రక్రియ (కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్/సీఐఆర్‌పీ) కింద వాటిపై చర్యలు తీసుకోవచ్చని కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా కేంద్ర న్యాయశాఖకు లేఖ రాసింది. దీనితో అప్పులు, బకాయిలు చెల్లించడంలో విఫలమైన డిస్కంలను దివాలా తీసినట్టు ప్రకటించి, వాటి ఆస్తుల వేలం ద్వారా తమ బకాయిలు ఇప్పించాలంటూ.. బ్యాంకులు, విద్యుదుత్పత్తి సంస్థలు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని కోరేందుకు వీలు కలుగనుంది. నిజానికి ప్రభుత్వ రంగ డిస్కంలు విద్యుత్ చట్టం పరిధిలోకి వస్తాయని, వాటికి ‘దివాలా స్మృతి’వర్తించదని రాష్ట్రాలు వాదిస్తూ వచ్చాయి. బకాయిలు కట్టని డిస్కంలపై విద్యుత్ చట్టం కింద బ్యాంకులు, విద్యుదుత్పత్తి సంస్థలు చర్యలు తీసుకునేవి. జరిమానాలతో బకాయిలు వసూలు చేసేందుకు ప్రయత్నించేవి. కానీ ఇకపై డిస్కంలకు గడ్డుకాలమేనని నిపుణులు చెప్తున్నారు. రుణాలు, బకాయిల భారంతో.. దేశవ్యాప్తంగా ఉన్న డిస్కంలు రూ.వేల కోట్ల అప్పులు, బకాయిల్లో కూరుకుపోయి ఉన్నాయి. విద్యుత్ కొనుగోలు ధరల్లో పెరుగుదలకు తగ్గట్టు ఎప్పటికప్పుడు విద్యుత్ చార్జీల పెంపు లేకపోవడం, స్థానిక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ బిల్లులు వందలకోట్ల మేర పేరుకుపోవడం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సరిపడా విద్యుత్ సబ్సిడీలు అందకపోవడం వంటి కారణాలతో డిస్కంలు ఆర్థికంగా కుంగిపోయి ఉన్నాయి. విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి డిస్కంలు కొనే విద్యుత్‌కు 45 రోజుల్లోగా డబ్బులు చెల్లించాలి. కానీ నిధుల్లేక నెలలు, ఏళ్ల తరబడిగా కట్టలేకపోతున్నాయి. ►కేంద్ర విద్యుత్ శాఖ గణాంకాల ప్రకారమే.. దేశవ్యాప్తంగా ప్రభుత్వ/ప్రైవేటు రంగ విద్యుదుత్పత్తి కంపెనీలకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు రూ.98,518 కోట్ల వరకు ఉన్నాయి. ఇందులో తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు రూ.7,888 కోట్లు. వీటితోపాటు తెలంగాణ జెన్కో, సింగరేణి థర్మల్ ప్లాంట్లకు చెల్లించాల్సిన సొమ్ము కూడా కలిపితే.. తెలంగాణ డిస్కంల బకాయిలు రూ.20 వేల కోట్ల వరకు ఉంటాయని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇక తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు డిస్కంలు రూ.36 వేల కోట్ల మేర అప్పులు చేశాయి. ►డిస్కంల నుంచి సకాలంలో చెల్లింపులు రాక విద్యుదుత్పత్తి కంపెనీలు బొగ్గు కొనుగోళ్ల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ.. గతంలోనే తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. -
ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏఏఈ
మంథని: పెద్దపల్లి జిల్లాలో ఓ అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. ఎన్పీడీసీఎల్ ఎక్లాస్పూర్ సెక్షన్ అదనపు అసిస్టెంట్ ఇంజనీర్ ఏఏఈ కాసర్ల రాజ్‌కుమార్ ట్రాన్స్ఫార్మర్ను బిగించడం కోసం ఓ రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా శనివారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ కథ నం ప్రకారం.. మంథని మండలం ఆరెంద గ్రామానికి చెందిన ఎండీ షౌకత్ అలీ గోదావరిఖని ఫైర్స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్నారు. బాధితుడు షౌకత్ అలీ ఆయన తన వ్యవసాయ భూమిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లైన్ కోసం 2020లో దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ట్రాన్స్ఫార్మర్ మంజూరు కావడంతో అధికారులు, ఏఏఈ రాజ్‌కుమార్‌ను కలవాలని లైన్‌మన్ ద్వారా సమాచారం అందించారు. షౌకత్ అలీ ఏఏఈని కలవగా ట్రాన్స్ఫార్మర్ను బిగించడానికి రూ.25 వేలు డిమాండ్ చేశారు. బాధితుడు ప్రాధేయపడడంతో రూ.20 వేలకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో షౌకత్ అలీ ఏసీబీని ఆశ్రయించంతో అధికారులు, సబ్‌స్టేషన్‌లో ఏఏఈ రూ.20 వేలు తీసుకుంటుం డగా పట్టుకున్నారు. ఏఏఈ రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు వెల్లడిస్తున్న ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ -
AP: విద్యుత్ కోతలపై తప్పుడు ప్రచారం.. ఖండించిన ఇంధన శాఖ
సాక్షి, అమరావతి: విద్యుత్ కోతలపై తప్పుడు ప్రచారాన్ని ఇంధన శాఖ ఖండించింది. పట్టణాలు, గ్రామాల్లో గంటల తరబడి కోతలంటూ చేస్తోన్న దుష్ప్రచారాన్ని ఇంధన శాఖ అధికారులు తప్పుబట్టారు. విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు డిస్కమ్‌లు చర్యలు చేపట్టాయి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. (చదవండి: కర్రల సమరంలో హింస.. 100మందికిపైగా గాయాలు) బొగ్గు కొనుగోలు నిమిత్తం ఏపీ జెన్కోకు రూ.250 కోట్లు నిధులు, రాష్ట్రానికి అదనంగా రోజుకి దాదాపు 8 బొగ్గు రైళ్లు కేటాయించారు. దేశంలో బొగ్గు లభ్యత ఎక్కడున్నా కొనుగోలు చేయాలని ఏపీ జెన్కోను ప్రభుత్వం ఆదేశించింది. స్వల్పకాలిక మార్కెట్ నుంచి కొనుగోలు చేయాలని విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర విద్యుత్ సంస్థల నుంచి కేటాయించబడని వాటా నుంచి సమీకరణ యత్నాలను ప్రభుత్వం ప్రారంభించింది. వచ్చే ఏడాది జూన్ వరకు 400 మెగావాట్ల విద్యుత్ కోసం కేంద్రాన్ని అభ్యర్థించింది. సింగరేణి సంస్థతో సమన్వయం చేసుకుని బొగ్గు సరఫరా కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు. వీటీపీఎస్, కృష్ణపట్నంలోనూ థర్మల్ విద్యుత్ కేంద్రాలు ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. విద్యుత్ కోతలపై వదంతులు నమ్మొద్దు.. విద్యుత్ కోతలపై వదంతులు నమ్మొద్దని ఈపీడీసీఎల్ సీఎండీ సంతోష్‌రావు అన్నారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును ప్రభుత్వం సరఫరా చేసిందన్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని ఆయన స్పష్టం చేశారు. చదవండి: ఆహా ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోకు బాలయ్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా! -
విద్యుత్ సరఫరాకు అంతరాయం
సాక్షి, అమరావతి/అరసవల్లి: గులాబ్ తుపాను కారణంగా తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని ఐదు జిల్లాల పరిధిలో సంస్థకు వాటిల్లిన ప్రాథమిక నష్టం రూ.7.87 కోట్లుగా అధికారులు తేల్చారు. 213 ప్రత్యేక బృందాలతో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో తుపాన్ ప్రభావం అధికంగా ఉండటంతో అక్కడ భారీ నష్టం ఏర్పడింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూ.గోదావరి, ప.గోదావరి జిల్లాల్లో ఒక ఎక్స్ట్రా హైటెన్షన్ సబ్ స్టేషన్‌తో పాటు 33/11 కేవీ సబ్ స్టేషన్లు 380, ఫీడర్లు 276, స్తంభాలు 107, లైన్లు 10 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. 11 కేవీ ఫీడర్లు 1,623, స్తంభాలు 1,120, లైన్లు 51.19 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. ఎల్టీ లైన్లకు సంబంధించి 66.58 కిలోమీటర్ల మేర, ఎల్టీ కేటగిరిలోనే 1,719 స్తంభాలు, 678 ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమైనట్టు ఏపీఈపీడీసీఎల్ సిబ్బంది గుర్తించారు. తుపాను వల్ల 24 పట్టణాలు, 103 మండలాలు, 3,821 గ్రామాల్లో 11,26,959 వ్యవసాయేతర, 4,767 వ్యవసాయ సర్వీసులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శరవేగంగా పునరుద్ధరణ పనులు ముందస్తు ప్రణాళిక ప్రకారం పునరుద్ధరణ పనులు మొదలుపెట్టిన విద్యుత్ శాఖ ఈహెచ్‌టీ సబ్ స్టేషన్, 33/11 కేవీ సబ్స్టేషన్లు 364, ఫీడర్లు 255, స్తంభాలు 75, లైన్లు 5.5 కిలోమీటర్ల మేర బాగు చేశారు. 11 కేవీ ఫీడర్లు 1,255, స్తంభాలు 390, లైన్లు 23.35 కిలోమీటర్లు, ఎల్టీ లైన్లు 18.55 కిలోమీటర్లు, ఎల్టీ పోల్స్ 403, ట్రాన్స్ఫార్మర్లు 154 చొప్పున మరమ్మతులు పూర్తి చేశారు. 8,85,419 వ్యవసాయేతర, 1,463 వ్యవసాయ సర్వీసులకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. మంగళవారం ఉదయానికల్లా మిగిలిన అన్ని ప్రాంతాల్లో మరమ్మతులు పూర్తిచేసి విద్యుత్ సరఫరాను పూర్తిగా పునరుద్ధరిస్తామని ఈపీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు చెప్పారు. సోమవారం ఆయన శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, మిగిలిన జిల్లాల్లో కొన్నిగంటలపాటు అంతరాయం ఏర్పడిందన్నారు. -
విద్యుత్ శాఖలో ఉద్యోగాల వెలుగులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో ఎనర్జీ అసిస్టెంట్ (జూనియన్ లైన్మెన్ గ్రేడ్–2) పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. తన పరిధిలోని ఐదు సర్కిళ్లలో మొత్తం 398 పోస్టుల భర్తీకి "https://www.apeasternpower.com/' ఏపీఈపీడీసీఎల్ ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2019లో భర్తీ చేయగా.. మిగిలిన 398 పోస్టులను ఇప్పుడు భర్తీ చేస్తోంది. ఎలక్ట్రికల్, వైరింగ్ విభాగంలో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయెన్సెస్ విభాగంలో రెండేళ్ల ఒకేషనల్ ఇంటర్మీడియెట్ కోర్సు చేసిన పురుష అభ్యర్థులు అర్హులు. అలాగే అభ్యర్థులకు ఈ ఏడాది జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండి 35 ఏళ్ల లోపు వయసు ఉండాలి. గతంలో పదో తరగతి మార్కుల ఆధారంగా జరిగిన ఎంపిక విధానంలో ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా ఈసారి రాతపరీక్ష నిర్వహిస్తున్నారు. దీనిలో ఉత్తీర్ణులైనవారిని మాత్రమే శారీరక సామర్థ్య పరీక్ష (ఫిజికల్ టెస్ట్)కు పిలుస్తారు. ముఖ్యమైన తేదీలు ఇలా.. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 24 ► రాత పరీక్ష: అక్టోబర్ 10 (ఉదయం 11 గంటల నుంచి 12.45 గంటల వరకు) ► రాత పరీక్ష ఫలితాలు: అక్టోబర్ 22 ► ఫిజికల్ టెస్ట్ (విద్యుత్ స్తంభం ఎక్కడం, మీటర్ రీడింగ్ చూడటం, సైకిల్ తొక్కడం): నవంబర్ 1 – 6 ► ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా: నవంబర్ 15 ► నియామక పత్రాలు అందజేత: నవంబర్ 17 ► పత్రాలు అందుకున్నవారు ఏఈలకు రిపోర్ట్ చేయాల్సింది: నవంబర్ 29 ► ఓరియెంటేషన్ కార్యక్రమం: నవంబర్ 30 – డిసెంబర్ 1 వరకు ► గ్రామ, వార్డు సచివాలయాల్లో సెక్రటరీలకు రిపోర్ట్ చేసి విధుల్లో చేరిక: డిసెంబర్ 2 -
వదంతులు నమ్మవద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల ఉద్యోగుల వేతనాలు తగ్గించే ఆలోచన చేయడం లేదని, ఈ ప్రచారం వదంతులేనని విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ వదంతులతో ఉద్యోగులు అభద్రతకు లోనుకావద్దని కోరారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేయడం లేదన్నారు. ఖరీఫ్ నుంచి వందశాతం ఫీడర్ల ద్వారా పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్టు ప్రకటించారు. ఆయన సోమవారం విద్యుత్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల స్నేహపూర్వక వాతావరణాన్నే ఆకాంక్షిస్తోందని, వారికి నష్టం చేసే ఏ ఆలోచన చేయబోదని భరోసా ఇచ్చారు. 2018లో సవరించిన వేతనాలే 2022 వరకు కొనసాగుతాయని, ఈ విషయాన్ని వారికీ స్పష్టం చేశామని చెప్పారు. ప్రభుత్వం విద్యుత్ సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. రెండు నెలల్లో అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియను పూర్తిచేయాలనే సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు. రైతు కోసం ఎంతైనా ఖర్చు రైతు పక్షపాతి అయిన సీఎం వైఎస్ జగన్ ఉచిత విద్యుత్ కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఒక్క అనంతపురంలో మాత్రం రైతుల కోరిక మేరకు రాత్రిపూట విద్యుత్ అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం 55 శాతం ఫీడర్లే 9 గంటల పగటి విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. దీంతో అప్పటికప్పుడే రూ.1,700 కోట్లు మంజూరు చేసి సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లను బలోపేతం చేసినట్లు చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, రూ.80 వేల కోట్ల అప్పుల్లోకి నెట్టిందని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ మునుపెన్నడూ లేని విధంగా రెండేళ్లలోనే రూ.18 వేల కోట్ల చేయూతతో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు అడుగులేశారని చెప్పారు. ప్రైవేటీకరణ యోచన లేదు విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే దిశగా ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేయడంలేదని చెప్పారు. కేంద్రం ఒత్తిడికి తలొగ్గిన దాఖలాలు లేనేలేవన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా పంపుసెట్లకు మీటర్లు బిగించి, కచ్చితమైన విద్యుత్ వినియోగాన్ని లెక్కగట్టామని, ఒక్క రైతుపైనా పైసా భారం మోపలేదని చెప్పారు. రైతు ఖాతాల్లోకే వ్యవసాయ విద్యుత్ సబ్సిడీని వేశామని, దీనివల్ల నాణ్యమైన విద్యుత్ అందించే దిశగా డిస్కమ్‌ల్లో జవాబుదారీతనం పెరిగిందని పేర్కొన్నారు. వ్యవసాయ సబ్సిడీ ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. జగనన్న కాలనీల్లో నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. -
డిస్కమ్‌లను ప్రైవేటీకరించే ఆలోచన లేదు: మంత్రి బాలినేని
సాక్షి, అమరావతి: డిస్కమ్‌లను ప్రైవేటీకరించే ఆలోచన తమకు లేదని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇస్తున్నాం అని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ.. ‘‘కోవిడ్‌తో మరణించిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకుంటాం. ఇప్పటికే విద్యుత్ ఉద్యోగులకు 75శాతం వ్యాక్సిన్ వేశాం’’ అని తెలిపారు. ‘‘గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని 80వేల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచింది. విద్యుత్ రంగాన్ని కాపాడేందుకు సీఎం జగన్ 18వేల కోట్ల రూపాయలు ఇచ్చారు. డిస్కమ్‌లను ప్రైవేటీకరించే ఆలోచన మాకు లేదు. మోటర్లకు మీటర్లు పెట్టినా ప్రజలపై భారం పడకుండా చర్యలు’’ తీసుకుంటామని బాలినేని తెలిపారు. చదవండి: కృత్రిమ మేధ.. లేదిక ‘కోతల’ బాధ! -
విద్యుత్ సమస్యలపైనా సచివాలయాల్లో తక్షణ స్పందన
సాక్షి, అమరావతి: కరోనా వేళ జనం ఇల్లు కదల్లేని పరిస్థితి. ఈ దృష్ట్యా క్షణం కూడా కరెంట్ పోకుండా చూస్తున్నారు. ఈ ప్రయత్నంలో గ్రామ సచివాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందిస్తున్నాయి. విద్యుత్ తీగలు తెగినా, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా విద్యుత్ సిబ్బంది గంటల్లోనే పరిష్కరిస్తున్నారు. ఫలితంగా ఏడాది కాలంలో విద్యుత్ అంతరాయాలు 37.44 శాతం మేర తగ్గాయని ఇంధన శాఖ స్పష్టం చేసింది. గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న జూనియర్ లైన్‌మెన్లంతా మరింత అప్రమత్తంగా ఉన్నారని తెలిపింది. తక్షణమే ప్రత్యక్షం గ్రామ సచివాలయం పరిధిలో జూనియర్ లైన్మెన్లను విద్యుత్ శాఖ నియమించి, అవసరమైన శిక్షణ ఇస్తోంది. భవిష్యత్‌లో వాళ్లు లైన్మెన్, సీనియర్ లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, లైన్ సూపర్వైజర్, ఫోర్‌మెన్‌గా పదోన్నతులు పొందేలా వ్యవస్థను రూపొందించింది. ప్రతి జూనియర్ లైన్మెన్ 1,500 విద్యుత్ కనెక్షన్లకు బాధ్యుడు. 30 నుంచి 40 ట్రాన్స్పార్మర్లను ఇతను పర్యవేక్షిస్తుంటాడు. 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో లైన్‌పై చెట్లు పడ్డా, జంపర్లు తెగిపోయినా బాగు చేస్తాడు. కరోనా ఉన్నప్పటికీ భద్రత చర్యలు పాటిస్తూ వారు విధులు నిర్వర్తిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, చెడిపోయినా కొత్తవి బిగిస్తున్నారు. మీటర్లు ఆగిపోయినా కొత్తవి బిగించడం జూనియర్ లైన్మెన్ విధుల్లో భాగం. కాబట్టి వీరంతా ఫీల్డ్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి ఏ సమస్య గ్రామ సచివాలయానికి వచ్చినా సంబంధిత అధికారులు ఫోన్ ద్వారా జూనియర్ లైన్మెన్ను సంప్రదిస్తారు. ఫిర్యాదు వచ్చిన క్షణాల్లో కరెంట్ సమస్యలను పరిష్కరించాలి. దీనికి కచ్చితమైన జవాబుదారీతనం ఉంది. దారికొచ్చిన అంతరాయాలు గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత విద్యుత్ అంతరాయాల్లో గుణాత్మక మార్పు చోటుచేసుకుంది. ఎక్కువ గంటలు కరెంట్ పోయిందనే ఫిర్యాదులు క్రమంగా తగ్గుతున్నాయి. సచివాలయాలు ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే ఈ మార్పు ఉందంటే.. భవిష్యత్‌లో మరింత పురోగతి వస్తుంది. 2019లో 6,98,189 విద్యుత్ అంతరాయాలపై ఫిర్యాదులొస్తే.. 2020లో వీటి సంఖ్య 4,36,781గా నమోదైంది. అంటే.. దాదాపు 2.60 లక్షల ఫిర్యాదులు తగ్గాయి. గతంలో కరెంట్ పోతే ఎక్కడో దూరంగా ఉంటే లైన్మెన్ రావాలి. ఇప్పుడా సమస్య లేదు. ఊళ్లోనే జూనియర్ లైన్మెన్ అందుబాటులో ఉన్నాడు. అతనికి అన్నివిధాల శిక్షణ కూడా ఇవ్వడంతో విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గాయి. -
పెరుగుతున్న గృహ విద్యుత్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గృహ విద్యుత్ వినియోగం శరవేగంగా పెరుగుతోంది. ఏటా 20 శాతం వరకు అదనపు వాడకం ఉంటోంది. రాష్ట్ర ఇంధన ఆడిట్ విభాగం జరిపిన సర్వేలో ఈ అంశం వెల్లడైంది. 2015–16లో 11,356 మిలియన్ యూనిట్లున్న గృహ విద్యుత్ వినియోగం 2020–21 నాటికి 16,143 మిలియన్ యూనిట్లకు చేరింది. ఈ ఐదేళ్లలోనే 4,787 మిలియన్ యూనిట్లు పెరిగింది. 2018–19 తర్వాత ఏకంగా 3 వేల మిలియన్ యూనిట్ల వార్షిక పెరుగుదల నమోదైంది. మధ్యతరగతితోపాటు పేద వర్గాల్లోనూ విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, తదితరాలతో కుటుంబాల్లో ఆదాయం పెరగడంతో విద్యుత్ ఉపకరణాల కొనుగోలుపై దృష్టి పెడుతున్నారు. రెండేళ్లలో 16 శాతం పెరిగిన ఫ్రిజ్‌లు, ఏసీలు ► 2015లో రాష్ట్ర విద్యుత్ వినియోగం మొత్తం 41,191 మిలియన్ యూనిట్లు. 2021 నాటికి ఇది 57,065 మిలియన్ యూనిట్లకు చేరింది. ఆరేళ్ల కాలంలో 15,874 మిలియన్ యూనిట్లు పెరిగింది. ఇందులో దాదాపు మూడో వంతు (4,787 మిలియన్ యూనిట్లు) గృహ విద్యుత్ వినియోగమే ఉంది. ► పేద, మధ్యతరగతి వర్గాల విద్యుత్ లోడ్ కనిష్టంగా 2 కిలోవాట్ల వరకు పెరిగిందని అధికారులు చెబుతున్నారు. టన్ను ఏసీ వినియోగిస్తే ఒక కిలోవాట్ లోడ్ పెరుగుతుంది. ► ఏసీలు, ఫ్రిజ్‌ల వినియోగం గత రెండేళ్లలో 16 శాతం పెరిగినట్టు మార్కెట్ సర్వేలు చెబుతున్నాయి. ఆ తర్వాత స్థానంలో వాషింగ్ మెషిన్లు, ఇతర గృహోపకరణాలున్నాయి. ► వినియోగదారులు ఎక్కువగా స్టార్ రేటెడ్ విద్యుత్ ఉపకరణాలపైనే దృష్టి పెడుతున్నారు. ఇంధన పొదుపుపై అవగాహన పెరగడం, ఉత్పత్తిదారులు కూడా స్టార్ రేటెడ్ ఉపకరణాల ఉత్పత్తికే ప్రాధాన్యం ఇవ్వడం వీటి పెరుగుదలకు కారణాలు. చేరువలో సులభ వాయిదాలు.. ► పేద, మధ్యతరగతి వర్గాలను ఆకర్షించడంలో పలు సంస్థలు పోటీ పడుతున్నాయి. ముందుగా కొద్ది మొత్తాన్ని చెల్లించి, మిగతాది నెలనెలా సులభ వాయిదాలు కట్టుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. ► ఇలా ఈఎంఐల ద్వారా ఎక్కువగా విద్యుత్ ఉపకరణాలే కొనుగోలు చేస్తున్నట్టు ఇటీవల సర్వేల ద్వారా వెల్లడైంది. ఆరేళ్ల వ్యవధిలో రాష్ట్రంలో లక్షకుపైగా ఏసీల కొనుగోలు జరిగితే ఇందులో 85 శాతం సులభ వాయిదాలపై తీసుకున్నవే ఉన్నాయని విజయవాడలోని ఓ ఎలక్ట్రానిక్ సంస్థ నిర్వాహకుడు తెలిపారు. ► స్టార్ రేటెడ్ ఫ్యాన్లు, ఏసీలు, నీటి పంపుల ద్వారా విద్యుత్ పొదుపు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర విద్యుత్ పొదుపు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ దిశగా ప్రభుత్వ రంగ సంస్థలు కూడా సులభ వాయిదాలతో ఉపకరణాలు అందిస్తున్నాయి. దీంతో గృహ విద్యుత్ వినియోగం పెరుగుతోంది. నాణ్యమైన విద్యుత్ అందిస్తాం.. అన్ని వర్గాలు విద్యుత్ ఉపకరణాల వినియోగంపై దృష్టి పెట్టాయి. ఫలితంగా విద్యుత్ వాడకం పెరిగింది. ఆరేళ్లలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. విద్యుత్ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా విద్యుత్ వ్యవస్థలు బలోపేతంపై దృష్టి పెడుతున్నాయి. నాణ్యమైన విద్యుత్ అందించే దిశగా చర్యలు చేపట్టాం. – శ్రీకాంత్ నాగులాపల్లి,ఇంధన శాఖ కార్యదర్శి -
కృత్రిమ మేధ.. లేదిక ‘కోతల’ బాధ!
సాక్షి, అమరావతి: విద్యుత్ శాఖ అందుబాటులోకి తెచ్చిన కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)వ్యవస్థ వేసవి వేళ సత్ఫలితాలిస్తోంది. పెరుగుతున్న డిమాండ్‌ను ఇట్టే పసిగట్టడమే కాకుండా తక్షణమే అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వీలు కల్పిస్తోంది. ఇంటర్నెట్ ద్వారా అనుసంధానమైన ఈ వ్యవస్థ వల్ల వినియోగం అమాంతం పెరిగినా.. విద్యుత్ కోతలు లేకుండా చేయగలుగుతున్నామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. విద్యుత్ లోడ్, లోడ్‌ను బట్టి విద్యుత్ వినియోగం, ఏయే ప్రాంతాల్లో ఎంత వాడకం ఉంటుందనే అనేక అంశాలను ఎప్పటికప్పుడు గుర్తించేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను విద్యుత్ శాఖ రూపొందించింది. పదేళ్ల విద్యుత్ డేటాను నెట్‌కు అనుసంధానించింది. ఫలితంగా ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా విద్యుత్ డిమాండ్‌ను ముందే అంచనా వేయగలుగుతున్నారు. అప్పటికప్పుడు అవసరమైన విద్యుత్‌ను మార్కెట్ నుంచి కొనుగోలు చేయడం సాధ్యమవుతోంది. లెక్క పక్కా: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఈ నెల 27న 220.6 మిలియన్ యూనిట్లుగా రికార్డయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందించిన సమాచారం మేరకు మరో వారం రోజుల్లో ఇది రోజుకు 222 మిలియన్ యూనిట్లకు చేరొచ్చని భావిస్తున్నారు. ఉష్ణోగ్రతలు, వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని ఆధారంగా చేసుకుని ఈ తరహా అంచనాకు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. 2018లో గరిష్ట విద్యుత్ డిమాండ్ 185 మిలియన్ యూనిట్లు ఉండగా, 2020–21 నాటికి 218 మిలియన్ యూనిట్లకు చేరింది. గరిష్ట (పీక్) విద్యుత్ వినియోగం మార్చి 27, 2021 నాటికి 220.6 మిలియన్ యూనిట్లు. విద్యుత్ డిమాండ్ 11,193 మెగావాట్లకు చేరినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పక్కా లెక్క అందించింది. డిమాండ్ ఎంత పెరిగినా.. ‘కోత’లొద్దు తాజా పరిస్థితిపై విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్ష జరిపారు. విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా కోతలు లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఏపీ జెన్కో ద్వారా రోజుకు 100 మిలియన్ యూనిట్లు, కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి 40–45 మిలియన్ యూనిట్లు, పునరుత్పాదక విద్యుత్ (విండ్, సోలార్) నుంచి 30–35 మిలియన్ యూనిట్లు, ఇతర వనరుల నుంచి మరో 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుబాటులో ఉందని అధికారులు మంత్రికి తెలిపారు. ఈ పరిస్థితుల్లో 35–45 మిలియన్ యూనిట్లను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. మే నెలాఖరు వరకూ ఇదే పరిస్థితి ఉండొచ్చని వివరించారు. ఏప్రిల్ రెండో వారానికి రబీ సీజన్ ముగుస్తుందని, అయితే, గృహ విద్యుత్ వాడకం పెరుగుతుందని మంత్రికి నివేదించారు. ఈ వివరాలను విద్యుత్ శాఖ సోమవారం వెల్లడించింది. -
రాష్ట్రంలో పెరగనున్న జల విద్యుత్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జల విద్యుత్ ఉత్పత్తి భారీగా పెరగబోతోంది. 2030 నాటికి 7,700 మెగావాట్లకు చేరుతుందని విద్యుత్ శాఖ అంచనా వేసింది. ఈ దిశగా పెద్ద ఎత్తున చేపడుతున్న మినీ హైడల్, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు అధికారులు డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే ప్రాజెక్టుల రూపకల్పన దిశగా అడుగులేసే వీలుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,700 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. దీన్ని 7,700 మెగావాట్లకు తీసుకెళ్లడం ద్వారా చౌక విద్యుత్ లభిస్తుంది. మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం నుంచి యూనిట్ విద్యుత్ 90 పైసలకే లభిస్తోంది. పునరుత్పాదక ఇంధన వనరుల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకోవాలంటే.. 30 శాతం వరకూ స్థిర విద్యుత్ (24 గంటలూ ఉత్పత్తి చేయగల విద్యుత్) అందుబాటులో ఉండాలని కేంద్రం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రణాళికలు సిద్ధం చేసిన నెడ్‌క్యాప్ ఏపీలో ప్రస్తుతం 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి ప్లాంట్లు నెలకొల్పుతున్నారు. మరో 10 వేల మెగావాట్లకుపైగా సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో 6 వేల మెగావాట్ల జల విద్యుత్ అవసరం. నదుల దిగువ భాగాన ఉన్న నీటిని ఎగువకు పంపి, డిమాండ్ వేళ విద్యుదుత్పత్తి చేస్తారు. అలాగే కొండ ప్రాంతాల్లో జలపాతాల ద్వారా వెళ్లే నీరు వృథా కాకుండా ఆనకట్ట ద్వారా నిల్వ చేసి ఎగువకు పంప్ చేసి విద్యుదుత్పత్తి చేస్తారు. ఈ రెండు పద్ధతుల్లో పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ ప్రాజెక్టులకు సంప్రదాయేతర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్) ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తం 29 ప్రాంతాలను గుర్తించి డీపీఆర్‌లు రూపొందిస్తోంది. వీటి ద్వారా 31 వేల మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తేవచ్చని భావిస్తున్నారు. -
విద్యుత్ చార్జీలు పెంచం
సాక్షి, అమరావతి: ఎన్ని ఇబ్బందులున్నా విద్యుత్ చార్జీలు మాత్రం పెంచబోమని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే విద్యుత్ రంగాన్ని గాడిలో పెడతామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంధన పరిరక్షణ మిషన్(ఏపీఎస్ఈసీఎం) కొత్త లోగోను ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డితో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్న విషయాలను చంద్రశేఖరరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కరోనా సంక్షోభంతో విద్యుత్ సంస్థలు మరింత ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అయినా కూడా ప్రజలపై ఎలాంటి భారం పడకూడదని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే విద్యుత్ పంపిణీ సంస్థలు చార్జీల పెంపు ప్రతిపాదన లేకుండా వార్షిక ఆదాయ అవసర నివేదికలను ఏపీఈఆర్సీకి సమర్పించాయని వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిస్కంలను ఆదుకుందని మంత్రి చెప్పారు. 2019–20లో రూ.17,904 కోట్లు విడుదల చేసిందని గుర్తు చేశారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా కోసం రూ.8,353.58 కోట్లు, ఆక్వా రైతులకు విద్యుత్ సరఫరా కోసం రూ.717.39 కోట్లు సబ్సిడీ కేటాయించిందన్నారు. గృహ విద్యుత్ వినియోగదారులకు రూ.1,707 కోట్ల సబ్సిడీ ఇచ్చిందని తెలిపారు. చౌక విద్యుత్ లక్ష్య సాధన కోసం ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి నూతన విధానాలను అధ్యయనం చేయాలని విద్యుత్ సంస్థలకు మంత్రి సూచించారు. కాగా.. గ్రామ, మున్సిపల్ వార్డు సచివాలయాల్లో 7,000 మందికి పైగా జూనియర్ లైన్మెన్లను ప్రభుత్వం నియమించటం వల్ల క్షేత్రస్థాయిలో విద్యుత్ సంస్థల పనితీరు మెరుగుపడిందని మంత్రికి ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి వివరించారు. ఈ నెల 14 నుంచి 20 వరకు ఇంధన పరిరక్షణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
ఉచిత విద్యుత్ కోసం మెగా సౌర విద్యుత్ ప్లాంట్
సాక్షి, అమరావతి: రాబోయే 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పం మేరకే 10 వేల మెగావాట్ల భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు జ్యుడిషియల్ ప్రివ్యూ పూర్తి చేసుకుని, టెండర్ల దశకు చేరిందని తెలిపారు. మెగా సోలార్ ప్రాజెక్టు పురోగతిని గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ చైర్మన్ సాయిప్రసాద్, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి మంత్రికి వివరించారు. దీనిపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేసినట్టు ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయ విద్యుత్‌పై చేసే సబ్సిడీ 2015–16లో రూ.3,156 కోట్లు ఉంటే, 2020–21 నాటికి ఇది రూ.8,354 కోట్లకు చేరిందని ఇంధన శాఖ పేర్కొంది. ప్రస్తుతం డిస్కమ్‌లు విద్యుత్ కొనుగోలుకు యూనిట్‌కు రూ.4.68 చెల్లిస్తున్నాయని, అదే సమయంలో సౌర విద్యుత్ ధర రూ.2.43 నుంచి రూ.3.02 వరకు ఉందని తెలిపింది. రాష్ట్రంలో మెగా సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే రానున్న 30 ఏళ్ల కాలంలో రాష్ట్రం రూ.48,800 కోట్లకు పైగా ఆదా చేయవచ్చునని ఏపీజీఈసీఎల్ అధికారులు అంచనా వేసినట్టు పేర్కొన్నారు. సౌర విద్యుత్ ప్రాజెక్టు యూనిట్లను అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. సాంకేతిక ప్రమాణాల ఆధారంగా సౌర విద్యుత్ యూనిట్ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను అన్వేషిస్తున్నట్లు వెల్లడించారు. -
విద్యుత్ ఉద్యోగుల ఆందోళన విరమణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో కొంతకాలంగా చేస్తున్న ఆందోళనను విరమిస్తున్నట్టు విద్యుత్ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ (జేఏసీ) ప్రకటించింది. సంఘాల నేతలతో విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మంగళవారం చర్చలు జరిపారు. వారు లేవనెత్తిన ప్రతీ డిమాండ్‌పైనా సానుకూలంగా స్పందించారు. దీంతో సమ్మె విరమిస్తూ జేఏసీ నేతలు మంత్రి సమక్షంలో లిఖిత పూర్వకంగా తెలిపారు. జేఏసీ డిమాండ్లపై ప్రభుత్వ సానుకూల అంశాలను అధికారులు వెల్లడించారు. ► విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 30 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు విద్యుత్ సంస్థలే నేరుగా వేతనాలు చెల్లించేందుకు గల అవకాశాలను అధ్యయనం చేయనున్నారు. ఇందుకు ఈఆర్‌పీడీసీ సీఎండీ, ట్రాన్స్‌కో జేఎండీ నేతృత్వంలో వేయనున్న కమిటీ 60 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ► 1999–2004 మధ్య నియమించిన విద్యుత్ ఉద్యోగులకు పెన్షన్‌ను సమీక్షించి, ప్రభుత్వానికి 30 రోజుల్లో నివేదిక ఇవ్వనున్నారు. పెండింగ్ డీఏలను ఫ్రీజింగ్ ఆర్డర్స్ తొలగిన తర్వాత చెల్లిస్తారు. నగదు రహిత వైద్యసేవల విషయంలో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ముందుకెళ్తారు. ► రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఏపీ జెన్కో పీపీఏ నిబంధనలకు అనుగుణంగా విద్యుత్ తీసుకుంటుంది. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ ప్రతిపాదనేదీ లేదని చర్చల సందర్భంగా ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: బాలినేని ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు 2019–20లో రూ.17,904 కోట్లు, బిల్లుల చెల్లింపునకు రూ.20,384 కోట్లు ఇచ్చిందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. రూ.30 వేల కోట్లకుపైగా నష్టాల్లో ఉన్న సంస్థలను ప్రైవేటీకరించకుండా ఆపిన ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. విద్యుత్ రంగం పటిష్టానికి 7 వేల మంది లైన్మెన్లను, 172 మంది ఏఈలను నియమించామని తెలిపారు. ప్రైవేటీకరణ ఆలోచన లేదు కాబట్టే ఇవన్నీ చేశామని మంత్రి విద్యుత్ ఉద్యోగులకు స్పష్టం చేశారు. ఆందోళన సందర్భంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలన్న జేఏసీ డిమాండ్‌పైనా మంత్రి సానుకూలంగా స్పందించారు. ► చర్చల్లో ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, ట్రాన్స్‌కో జేఎండీలు శ్రీధర్ రెడ్డి, వెంకటేశ్వరరావు, సీపీడీసీఎల్ సీఎండీ పద్మా జనార్దన్ రెడ్డి, జేఏసీ నేతలు పి.చంద్రశేఖర్, ఎం.వాసుదేవరావు, సాయికృష్ణ, ఓసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ రంగ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జెన్కో విద్యుత్ ప్లాంట్లను అమ్మేస్తున్నారనేది కేవలం కొంతమంది పనిగట్టుకుని చేసే దుష్ప్రచారమేనన్నారు. రైతన్నకు మరో 30 ఏళ్లదాకా పగటిపూట 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యుత్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై బుధవారం ఆయా సంఘాల ప్రతినిధులతో మంత్రి చర్చలు జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్‌ను అమ్మేస్తున్నారనేది వదంతులు మాత్రమేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020ను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ఇదే విషయాన్ని తెలియజేస్తూ కేంద్రానికి లేఖ రాశామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై సీఎంతో చర్చిస్తా విద్యుత్ ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని మంత్రి చెప్పారు. 1999–2004 మధ్య కాలంలో చేరిన విద్యుత్ ఉద్యోగులకు పెన్షన్ పథకాన్ని వర్తింపజేయడంపై కూడా సీఎంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. కోవిడ్ సంక్షోభంలోని మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సగం జీతాలు త్వరలోనే చెల్లిస్తామన్నారు. ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగుల వేతనాలు నేరుగా సంస్థల ద్వారా ఇవ్వాలనే డిమాండ్‌నూ పరిశీలిస్తామన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారంటూ కొంతమంది రైతులను రెచ్చగొడుతున్నారని, అయితే రైతన్నపై పైసా భారం పడకుండా, మరింత జవాబుదారీతనంతో విద్యుత్ సరఫరా చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని బాలినేని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, జెన్కో ఎండీ శ్రీధర్, డిస్కమ్‌ల సీఎండీలు పద్మాజనార్థన్ రెడ్డి, హరినాథ్‌రావు, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాగా మంత్రి తమ సమస్యలు సానుకూలంగా విన్నారని ఉద్యోగ సంఘాల నేతలు చంద్రశేఖర్, వేదవ్యాస్ పేర్కొన్నారు. -
'కష్టమైనా' కొంటున్నాం
సాక్షి, అమరావతి: ప్రైవేట్ రంగానికి చెందిన పవన, సౌర విద్యుత్‌ను తీసుకోవడంలేదంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవంలేదని రాష్ట్ర విద్యుత్ శాఖ స్పష్టంచేసింది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ తగ్గుతున్నప్పటికీ పవన, సౌర విద్యుత్‌ను వచ్చినంతా తీసుకుంటున్నామని తెలిపింది. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలవల్ల కోత పెట్టలేని పరిస్థితి ఉందని వివరించింది. సాధ్యమైనంత వరకూ థర్మల్ విద్యుత్‌ను తగ్గించిన తర్వాతే వాటి వైపు వెళ్లాల్సి వస్తోందని పేర్కొంది. అదికూడా నిబంధనలకు అనుగుణంగా, గ్రిడ్ నిర్వహణను దృష్టిలో ఉంచుకునే కేవలం 4 శాతంలోపే కోత పెడుతున్నామని తెలిపింది. ఈ సందర్భంగా.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ విద్యుత్ లభ్యత, తీసుకున్నదీ గణాంకాలతో సహా ఇంధన శాఖ బుధవారం మీడియాకు వెల్లడించింది. ఆ వివరాలు.. మా విద్యుత్ తీసుకోవాల్సిందే.. ► సాధారణంగా సెప్టెంబర్‌లో రోజుకు 175 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుంది. కానీ, ఈ ఏడాది వర్షాలవల్ల ఒక్కసారిగా పడిపోయింది. 14న ఏకంగా 143 ఎంయూలకు.. 26న 146 ఎంయూలకు పడిపోయింది. నెలాఖరు వరకూ పెద్దగా మార్పులేదు. ► ఒక్కసారే రోజుకు 30 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ తగ్గితే.. ఉత్పత్తి తగ్గించడం తప్ప మరో మార్గంలేదని రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ తెలిపింది. ఈ నిర్ణయం తీసుకోకపోతే గ్రిడ్‌కు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ► కేంద్ర నిబంధనల ప్రకారం రాష్ట్రంలో కేవలం 16 శాతం మాత్రమే సంప్రదాయేతర ఇంధన వనరులను అనుమతించాల్సి ఉంది. కానీ, గత ప్రభుత్వం అంతకన్నా ఎక్కువ మొత్తంలో పీపీఏలు చేయడంవల్ల 26 శాతం ఈ విద్యుత్ వస్తోంది. డిమాండ్ లేకపోయినా తమ విద్యుత్ తీసుకోవాలని సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిదారులు ఒత్తిడి చేస్తున్నారు. ప్రజలపై భారం పడకూడదనే స్వల్పంగా ఉత్పత్తి తగ్గింపు నిబంధనల ప్రకారం కేవలం 3.78 శాతం మాత్రమే పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిని తగ్గించాం. దీనివల్ల ఆ సంస్థలకు ఎలాంటి నష్టం ఉండదు. ముందుగా జెన్కో థర్మల్ ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గించిన తర్వాతే.. ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉండబట్టే అలా చేశాం. ఇది పీపీఏలకు ఏమాత్రం వ్యతిరేకం కాదు. విద్యుత్ వినియోగదారుల ప్రయోజనాన్ని ప్రైవేటు సోలార్, విండ్ ఉత్పత్తిదారులు అర్థం చేసుకోవాలి. అవసరం లేకున్నా తీసుకుంటే, ప్రజలపై భారం పడుతుంది. – శ్రీకాంత్, ఇంధన శాఖ కార్యదర్శి