ఏసీబీకి చిక్కిన విద్యుత్‌ శాఖ ఏఏఈ  | ACB Arrests Peddapalli TSNPDCL Assistant Engineer For Accepting Bribe | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన విద్యుత్‌ శాఖ ఏఏఈ 

Published Sun, Nov 7 2021 2:07 AM | Last Updated on Sun, Nov 7 2021 2:07 AM

ACB Arrests Peddapalli TSNPDCL Assistant Engineer For Accepting Bribe - Sakshi

ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్‌ శాఖ ఏఏఈ రాజ్‌కుమార్‌  

మంథని: పెద్దపల్లి జిల్లాలో ఓ అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. ఎన్‌పీడీసీఎల్‌ ఎక్లాస్‌పూర్‌ సెక్షన్‌ అదనపు అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఏఏఈ కాసర్ల రాజ్‌కుమార్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను బిగించడం కోసం ఓ రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా శనివారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. వరంగల్‌ ఏసీబీ డీఎస్పీ మధుసూదన్‌ కథ నం ప్రకారం.. మంథని మండలం ఆరెంద గ్రామానికి చెందిన ఎండీ షౌకత్‌ అలీ గోదావరిఖని ఫైర్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నారు.


బాధితుడు షౌకత్‌ అలీ  

ఆయన తన వ్యవసాయ భూమిలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ లైన్‌ కోసం 2020లో దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ట్రాన్స్‌ఫార్మర్‌ మంజూరు కావడంతో అధికారులు, ఏఏఈ రాజ్‌కుమార్‌ను కలవాలని లైన్‌మన్‌ ద్వారా సమాచారం అందించారు. షౌకత్‌ అలీ ఏఏఈని కలవగా ట్రాన్స్‌ఫార్మర్‌ను బిగించడానికి రూ.25 వేలు డిమాండ్‌ చేశారు. బాధితుడు ప్రాధేయపడడంతో రూ.20 వేలకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో షౌకత్‌ అలీ ఏసీబీని ఆశ్రయించంతో అధికారులు, సబ్‌స్టేషన్‌లో ఏఏఈ రూ.20 వేలు తీసుకుంటుం డగా పట్టుకున్నారు. ఏఏఈ రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

వివరాలు వెల్లడిస్తున్న ఏసీబీ డీఎస్పీ మధుసూదన్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement