TSNPDCL
-
దేశంలోనే అట్టడుగున మన డిస్కంలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి రేటింగ్, ర్యాంకింగ్స్‌లో తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు మరోసారి దేశంలోనే అట్టడుగు స్థానంలో నిలిచాయి. దేశంలోని 51 డిస్కంలలో టీఎస్ఎన్పి డీసీఎల్ 47వ ర్యాంకు, టీఎస్ఎస్పీడీసీఎల్ 43వ ర్యాంకుతో సరిపెట్టుకున్నాయి. ఈ మేరకు డిస్కంల 11వ వార్షిక రేటింగ్స్, ర్యాంకింగ్స్ నివేదికను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మెరుగైన రేటింగ్, ర్యాంకింగ్ కలిగి ఉంటేనే డిస్కంలకు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు లభించనున్నాయి. ఈ మేరకు కేంద్రం లంకె పెట్టడంతో ఈ రేటింగ్స్ కీలకంగా మారాయి. రాష్ట్ర డిస్కంలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. డీ–గ్రేడ్‌కి అడుగు దూరంలో ... డిస్కంల ఆర్థిక సుస్థిరతకు 75, పనితీరు సమర్థతకు 13, బయటి నుంచి ప్రభుత్వం/ఈఆర్సీల మద్దతుకు 12 కలిపి మొత్తం 100 స్కోరుకిగాను ఆయా డిస్కంలు సాధించిన స్కోరు ఆధారంగా వాటికి.. ఏ+, ఏ, బీ, బీ–, సీ, సీ–, డీ అనే గ్రేడులను కేటాయించింది. కీలక అంశాల్లో డిస్కంల వైఫల్యాలకు నెగెటివ్ స్కోర్‌ను సైతం కేటాయించింది. ఎస్పీడీసీఎల్ 10.8 స్కోరు సాధించి ‘సీ–’ గ్రేడ్‌ను, ఎన్‌పి డీసీఎల్ 6.6 స్కోరును సాధించి ‘సీ–’ గ్రేడ్‌ను పొందింది. చిట్టచివరి స్థానమైన ‘డీ గ్రేడ్’లో మేఘాలయ డిస్కం మాత్రమే నిలిచింది. దేశం మొత్తం బకాయిల్లో 15% మనవే... జెన్కో, ట్రాన్స్‌కోలకు దేశంలోని అన్ని డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు 2021–22 నాటికి రూ.2.81 లక్షల కోట్లకు ఎగబాకినట్టు కేంద్రం పేర్కొంది. అందులో ఎస్పీడీసీఎల్ వాటా ఏకంగా 10.3 శాతం కాగా, ఎన్పీడీసీఎల్ వాటా 4.3 శాతం కావడం గమనార్హం. జెన్కోల నుంచి డిస్కంలు కొనుగోలు చేసే విద్యుత్‌కు సంబంధించిన బిల్లులను 45 రోజుల్లోగా చెల్లించాల్సి ఉండగా ఎస్పీడీసీఎల్ 375 రోజులు, ఎన్పీడీసీఎల్ 356 రోజుల కిందటి నాటి బిల్లులను బకాయిపడ్డాయి. అంటే మన డిస్కంలు విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిల చెల్లింపులకు కనీసం ఏడాది సమయాన్ని తీసుకుంటున్నాయి. -
త్రీఫేజ్ విద్యుత్ సరఫరా ఎలా జరుగుతోంది?
రఘునాథపల్లి: వ్యవసాయ మోటార్లకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు టీఎస్ ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు జనగామ జిల్లా రఘునాథపల్లి సబ్ డివిజన్ సెక్షన్ ఆఫీస్, ఈఆర్వో కార్యాలయం, 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. త్రీఫేజ్ కరెంట్ సరఫరా అస్తవ్యస్తంగా ఉండటంతో పొలాలకు నీరు పెట్టేందుకు రైతులు రాత్రివేళ పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’ప్రధాన సంచికలో మంగళవారం ‘చేను తడవాలంటే జాగారమే’శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. వ్యవసాయానికి త్రీఫేజ్ సరఫరా ఎలా జరుగుతుంది, ఏమైనా ఇబ్బందులున్నాయా.. 33/11 పవర్ ట్రాన్స్ఫార్మర్ల తీరు తెన్నులు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన, వర్క్ కేటాయింపు రిజిస్టర్లను తనిఖీ చేశారు. వినియోగదారులకు, రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. అధికారులు, ఉద్యోగులు హెడ్‌క్వార్టర్‌లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆయన వెంట సూపరింటెండెంట్ æఇంజనీర్ వేణుమాధవ్, డీఈ ఆపరేషన్ ఎంఎల్ఎన్ రెడ్డి, డీఈ ఐటీ అనిల్‌కుమార్, ఏడీఈ మనోహర్‌రెడ్డి, ఎస్‌ఏవో జయరాజ్, ఏఏవో హన్మంత్‌నాయక్, ఏఈ రాహుల్ తదితరులున్నారు. -
వాయిదాల్లో ఏసీడీ సేకరణ
హనుమకొండ: అదనపు వినియోగాధారిత డిపాజిట్(ఏసీడీ)ను వాయిదాల్లో చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఉత్తర విద్యుత్ పంపిణీ మండలి(ఎన్పీడీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాల్‌రావు తెలిపారు. మంగళవారం హనుమకొండలోని టీఎస్ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైన విద్యుత్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏసీడీ విధింపుపై ఎలాంటి సందేహాలకు తావు లేదన్నారు. విద్యుత్ సర్వీస్ తీసుకున్నప్పటి కంటే అదనంగా లోడ్ పెరిగినప్పుడు ఆ మేరకు ఏసీడీ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏసీడీపై ప్రతి ఏడాది మే నెలలో వడ్డీ చెల్లిస్తూ బిల్లులు సర్దుబాటు చేస్తామని, విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ నిబంధనల మేరకే ఏసీడీ విధిస్తున్నామన్నారు. ఇది విద్యుత్ పంపిణీ సంస్థలు, పాలకమండలి సొంత నిర్ణయం కాదని స్పష్టం చేశారు. వినియోగదారులు వరుసగా రెండు నెలలు బిల్లు చెల్లించనప్పుడు మూడో నెల నోటీసు ఇచ్చి డిపాజిట్ నుంచి సంస్థకు రావాల్సిన బకాయిలు తీసుకుని సర్వీస్ రద్దు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో వినియోగదారులు వినియోగిస్తున్న యూనిట్లకు ఎంత బిల్లు వస్తుందో ఏడాదికి సగటున లెక్కించి రెండు నెలల బిల్లు మొత్తాన్ని ఏసీడీగా సేకరిస్తున్నామని, ఈ ఏసీడీని ఇంటి యజమాని చెల్లించాలన్నారు. అద్దెదారులు, ఇంటి యజమాని పరస్పర అవగాహనకు వచ్చి ఏడీసీని అద్దెదారులు చెల్లించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని, తలసరి వినియోగంలోనూ ముందున్నామన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సమావేశంలో డైరెక్టర్లు బి.వెంకటేశ్వర్రావు, పి.గణపతి, పి.సంధ్యారాణి, వి.తిరుపతిరెడ్డి, సీజీఎం మధుసూదన్ పాల్గొన్నారు. -
టీఎస్ ఎన్పీడీసీఎల్కు స్కోచ్ అవార్డులు
హనుమకొండ: తెలంగాణ స్టేట్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీఎస్ ఎన్పీడీసీఎల్)కు రెండు ‘స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’అవార్డులు దక్కాయి. శుక్రవారం ఢిల్లీ నుంచి ఆన్లైన్ ద్వారా 88వ స్కోచ్ సదస్సు జరిగింది. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్కోచ్ వైస్ చైర్మన్ గురుశరణ్ డంజల్ స్కాచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డులను ప్రకటించారు. ఐఆర్డీఏ జీపీఆర్ఎస్ ఎనేబుల్డ్ ఇంటిగ్రేటెడ్ స్పాట్ బిల్లింగ్, డిస్ట్రిబ్యూటెడ్ సోలార్ ఎనర్జీ ఇన్ టీఎస్ ఎన్పీడీసీఎల్ అవార్డులు వచ్చాయి. ఆ సంస్థ సీఎండీ ఎ.గోపాల్‌రావు ఆన్లైన్లో అవార్డులు స్వీకరించారు. -
విద్యుత్ కనెక్షన్‌పై ఏసీడీ.. ఇంటి యజమానే చెల్లించాలి
హన్మకొండ: ఇంటి యజమానులు విద్యుత్ కనెక్షన్ తీసుకున్న సమయంలో తక్కువ లోడ్‌తో కనెక్షన్ తీసుకుంటారని, ఆనంతరం అవసరాలు పెరగడంతో లోడ్ పెరుగుతుందని, పెరిగిన లోడ్‌పై రెండు నెలల డిపాజిట్‌ను ఏసీడీ (అదనపు వినియోగ డిపాజిట్) రూపంలో విధిస్తున్నట్లు టీఎస్ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాల్ రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ డిపాజిట్‌కు విద్యుత్ సంస్థ ఏడాదికి ఒకసారి వడ్డీ చెల్లిస్తుందన్నారు. డిపాజిట్ రూపంలో ఉంటున్నందున, దీనిని కిరాయిదారుడు కాకుండా ఇంటి యాజమాని చెల్లించడం సబబుగా ఉంటుందన్నారు. ఇంటి యజమానికి విద్యుత్ అవసరం తీరి కనెక్షన్ తొలగించుకునే సమయంలో సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నట్లు తెలిపారు. చాలామంది వినియోగదారులు ఏసీడీని కిరాయిదారుడు చెల్లించాలా? లేదా ఇంటి యజమాని చెల్లించాలా? అని సందేహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈమేరకు స్పష్టంచేశారు. వినియోగదారులకు ఇంకా సందేహాలుంటే విద్యుత్ రెవెన్యూ కార్యాలయం, బిల్లులు చెల్లించే కౌంటర్ వద్ద నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. -
ఎన్పీడీసీఎల్లో నోటిఫికేషన్ జారీచేయలేదు
హనుమకొండ: టీఎస్ ఎన్పీడీసీఎల్లో ఎలాంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయలేదని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎ.గోపాల్‌రావు స్పష్టం చేశారు. ఆన్లైన్ వెబ్సైట్లో 157 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు వస్తున్న ప్రకటన, ప్రచురణతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని ఆన్లైన్ వెబ్సైట్లు, కొన్ని పత్రికల్లో 157 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు ప్రకటనలు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇలాంటి కథనాలను నమ్మవద్దని, నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్‌కు చెందిన వెబ్సైట్లో చూసుకుని వాస్తవాలు నిర్ధారించుకోవాలని గోపాల్‌రావు సూచించారు. సంస్థ ఉద్యోగాల భర్తీ చేపడితే అధికారికంగా పత్రికలు, చానళ్లలో నోటిఫికేషన్ ఇస్తుందన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారాన్ని నమ్మవద్దని కోరారు. చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థలు 157 యూనిట్లను ఆడిట్ చేయాలని ఎన్పీడీసీఎల్ వెబ్సైట్లో పొందుపరిస్తే.. దీన్ని కొన్ని వెబ్సైట్లు, పత్రికలు 157 పోస్టులుగా వక్రీకరించి ప్రచారం చేస్తున్నాయని, నిరుద్యోగులు దీన్ని గమనించాలని సూచించారు. -
మనీ కొట్టు జాబ్ పట్టు.. ఎన్పీడీసీఎల్లో చక్రం తిప్పుతున్న కీలక నేత!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : హనుమకొండ కిషన్‌పురలో ఉండే సృజన్ (పేరు మార్చాం)కు జూనియర్ లైన్‌మన్ ఉద్యోగం ఇప్పిస్తామని ఓ ఎన్పీడీసీఎల్ ఉద్యోగి రూ.10లక్షల డీల్ మాట్లాడుకున్నాడు. ఆ నిరుద్యోగి.. రూ.1.50 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. రెండు నెలలైనా ఉద్యోగం లేకపోవడంతో గట్టిగా నిలదీశాడు. తనకు ఉద్యోగం అవసరం లేదని గొడవకు దిగడంతో ఆ ఉద్యోగి ఖర్చుల కింద రూ.22వేలు తీసుకుని మిగతా డబ్బులు వాపస్ ఇచ్చాడు. - సిద్దిపేటకు చెందిన అరుణ్ (పేరు మార్చాం) అనే నిరుద్యోగి వద్ద హనుమకొండకు చెందిన ఓ ఎన్పీడీసీఎల్ ఉద్యోగ సంఘం నాయకుడు అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగం కోసం రూ.8 లక్షలు ఖర్చవుతుందని రూ.1.50లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. వరుసకు మామ అయ్యే ఓ వ్యక్తిని మధ్యన పెట్టి అరుణ్ డబ్బులు ఇచ్చాడు. 45రోజుల తర్వాత ఉద్యోగం ఉట్టిదేనని తెలుసుకున్న నిరుద్యోగి సిద్దిపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)లో జాబ్ ప్లేస్మెంట్ పేరుతో పలువురు నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కొందరు దళారులను ఏర్పాటు చేసుకుని పాల్పడిన వసూళ్ల దందా బట్టబయలవుతోంది. నిరుద్యోగుల ఆశను ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న కొందరిపై ఇంటెలిజెన్స్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆరా తీస్తుండడం ఎన్పీడీసీఎల్లో కలకలం రేపుతోంది. తెరవెనుక ఓ ఉద్యోగ సంఘం నేత.. మొదట ఈ తరహా బాగోతం ఎస్పీడీసీఎల్లో బయటపడడంతో రెండు నెలల క్రితం మలక్‌పేట ఏడీలు సైదులు, ఫిరోజ్, నిత్యలు, లైన్మన్లు శ్రీనివాస్‌లను హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. హనుమకొండ, జనగామ హుజూరాబాద్ ప్రాంతాలనుంచి ఫిర్యాదు చేసిన వారిని పిలిచి మాట్లాడి ఉద్యోగులపై కేసులు నమోదు చేశారు. ఇటీవల వరంగల్, హనుమకొండలలో నివాసం ఉండే ఇతర ప్రాంతాలవారితోపాటు పలువురు బాధితులు.. పోలీసులు, ఎన్పీడీసీఎల్ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఓ కేసు కూడా నమోదు చేశారు. నిరుద్యోగులకు ఎర వేసి డబ్బులు గుంజే ప్రయత్నంలో భాగంగా ఎన్పీడీసీఎల్ హనుమకొండలో పనిచేసే ఓ సీనియర్ అసిస్టెంట్, ఓ ఉద్యోగసంఘం నేత జరిపిన సెల్‌ఫోన్ సంభాషణల ఆడియో రికార్డులను కూడా బాధితులు అధికారులకు అందజేశారు. దీంతో ఓ వైపు ఎన్పీడీసీఎల్.. మరోవైపు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఇదే సమయంలో గత నెలాఖరులో హనుమకొండ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఇంతియాజ్‌ను సస్పెండ్ చేసిన అధికారులు, ఉద్యోగ సంఘం నేతపైనా విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో వసూళ్లకు పాల్పడిన కొందరు అధికారులు, ఉద్యోగసంఘం నేత సదరు బాధితులకు అడ్వాన్స్ తిరిగి చెల్లించేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నారు. కాగా ఎన్పీడీసీఎల్లో ఉద్యోగాల పేరిట వసూళ్లకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నట్లు ట్రాన్స్‌కో విజిలెన్స్ విభాగానికి చెందిన ఓ అధికారి చెప్పారు. ఉద్యోగాల పేరిట భారీగా వసూళ్లు.. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్‌లలో భారీగా ఖాళీలను భర్తీ చేసేందుకు 2021 జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది. సుమారు 1,271 జూనియర్ లైన్‌మన్ (జేఎల్ఎం), అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), జూనియర్ అసిస్టెంట్ (జేఏ), బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి విధి విధానాలను ప్రకటించింది. ఆ తర్వాత 2022 జూన్ 18న కూడా ఎన్పీడీసీఎల్లో 82 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీ మరో నోటిఫికేషన్ ఇచ్చింది. మొదటి నోటిఫికేషన్‌నుంచే కొందరు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు నిరుద్యోగుల ఆశను అవకాశంగా తీసుకుని జాబ్ ప్లేస్మెంట్ పేరిట వసూళ్లకు శ్రీకారం చుట్టారు. జేఎల్ఎం, ఏఈ, జేఏ పోస్టులకు రూ.8లక్షల నుంచి రూ.13లక్షల వరకు ఖర్చవుతుందని లెక్కలు వేశారు. ‘ఈ ఖర్చు భరించేందుకు సిద్ధమైతే జాబ్ గ్యారంటీ’అంటూ నమ్మబలికిన దళారులు.. రూ.లక్ష నుంచి రూ.2.50 లక్షల వరకు అడ్వాన్స్ తీసుకున్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన పలు ప్రాంతాలనుంచి సుమారు 200మందికిపైగా నిరుద్యోగులనుంచి వసూలు చేసినట్లు తెలిసింది. నెలలు గడిచినా ఉద్యోగాలు రాకపోవడం.. అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇవ్వని కారణంగా నిరుద్యోగులు.. మధ్యవర్తులను, పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సుబేదారి, సిద్దిపేట, హైదరాబాద్‌లలో ఇటీవల ఐదు కేసులు నమోదు అయ్యాయి. విచారణ చేపట్టిన పోలీసులు ఉద్యోగాల పేరిట వసూళ్లకు శ్రీకారం చుట్టిన ఉద్యోగులు, ఉద్యోగ సంఘం నాయకుడిపై విద్యుత్‌శాఖ విజిలెన్స్ ఉన్నతాధికారికి రెండు రోజుల కింద ఫిర్యాదు చేశారు. -
బిల్లులు కట్టని సంస్థలకు ఎన్పీడీసీఎల్ షాక్
సాక్షి, హైదరాబాద్: భారీ మొత్తంలో విద్యుత్ బిల్లులు బకాయిపడిన పలు పరిశ్రమలు, వ్యాపార సంస్థలపై ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) కొరడా ఝుళిపించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) చట్టాన్ని ప్రయోగించింది. రెవెన్యూ శాఖ సాయంతో వాటి ఆస్తులను అటాచ్ చేసుకొని వేలం వేసేందుకు చర్యలు ప్రారంభించింది. విద్యుత్ బిల్లుల బకాయిలను చెల్లించనందున వరంగల్, హనుమకొండ, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు పరిశ్రమలు, సంస్థల ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ స్థానిక మండల తహసీల్దార్లు తాజాగా ఆర్ఆర్ యాక్ట్ కింద గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేశారు. సంబంధిత పరిశ్రమలు/సంస్థలకు చెందిన భవనాలు, ఖాళీ స్థలాలు, యంత్రాలు, ఇతర ఆస్తుల జాబితాను ఈ నోటిఫికేషన్లలో పొందుపరిచారు. ఈ జాబితాను టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థ తన వెబ్సైట్లో ఉంచింది. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి 15 రోజుల్లోగా మొత్తం బకాయిలను ఆయా సంస్థలు వడ్డీ, ఇతర చార్జీలతో సహా చెల్లించకుంటే ఆస్తులను వేలం వేసి విక్రయించడం ద్వారా బకాయిలను టీఎస్ఎన్పీడీసీఎల్ వసూలు చేసుకోనుంది. మంచిర్యాలలోని మంచిర్యాల సిమెంట్ ఫ్యాక్టరీ రూ. 10.35 కోట్ల బిల్లులను బకాయిపడగా ఆ పరిశ్రమకు చెందిన 165 ఎకరాలకుపైగా స్థలాలను అటాచ్ చేసినట్లు నోటీసుల్లో తహసీల్దార్లు పేర్కొన్నారు. -
కరెంటు బిల్లులపై ‘ట్రూఅప్’ చార్జీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారుల నుంచి ‘ట్రూఅప్’ చార్జీలను వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (టీఎస్ఎన్పీడీసీఎల్/ టీఎస్ఎస్పీడీసీఎల్) రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి విజ్ఞప్తి చేశాయి. 2006–07 నుంచి 2020–21 మధ్య చేసిన విద్యుత్ సరఫరా, వసూలైన బిల్లుల్లో తేడాలకు సంబంధించి రూ.4,092 కోట్ల లోటు ఉందని.. ఈ మేరకు ట్రూఅప్ చార్జీల వసూలుకు ఓకే చెప్పాలని కోరుతూ ప్రతిపాదనలు సమర్పించాయి. వచ్చే నెల 8 దాకా అభ్యంతరాలకు గడువు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసే ఎస్పీడీసీఎల్ రూ.3,259 కోట్ల మేర ట్రూఅప్ చార్జీల వసూలుకు అనుమతి కోరగా.. ఉత్తర తెలంగాణ జిల్లాలకు విద్యుత్ సరఫరా చేసే ఎన్పీడీసీఎల్ మరో రూ.833.23 కోట్ల ట్రూఅప్ చార్జీల వసూలు కోసం ప్రతిపాదన సమర్పించింది. సెప్టెంబర్ 8వ తేదీలోగా ఈ ప్రతిపాదనలపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలను తెలపాలని రెండు డిస్కంలు గురువారం బహిరంగ ప్రకటన విడుదల చేశాయి. ఆయా అభ్యంతరాలకు రాతపూర్వకంగా వివరణ ఇస్తాయి. తర్వాత ఈఆర్సీ బహిరంగ విచారణ జరిపి మరోసారి అభిప్రాయ సేకరణ చేస్తుంది. అనంతరం ప్రతిపాదిత ట్రూఅప్ చార్జీల్లో ఎంతమేర వసూలు చేయాలి? ఎలా వసూలు చేయాలన్న అంశాలను నిర్ణయిస్తూ ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఆ మేరకు డిస్కంలు చార్జీలను వసూలు చేసుకుంటాయి. డిస్ట్రిబ్యూషన్ ట్రూఅప్ చార్జీలు అంటే? విద్యుత్ కొనుగోళ్ల వ్యయం కాకుండా.. వినియోగదారులకు విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అయ్యే అన్ని రకాల వ్యయాలను కలిపి డిస్ట్రిబ్యూషన్ వ్యయం అంటారు. ఇందులో డిస్ట్రిబ్యూషన్ లైన్లు, సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ, సిబ్బంది జీతాలు (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చార్జీలు), ఆదాయంపై పన్నులు, తరుగుదల, మూలధనంపై రాబడి, ఇతర ఖర్చులు వంటివి ఉంటాయి. ముందస్తుగా డిస్ట్రిబ్యూషన్ వ్యయ అంచనాలను ఈఆర్సీ ఆమోదిస్తుంది. దానికి తగినట్టుగా బిల్లుల వసూలుకు అనుమతి ఇస్తుంది. ఒకవేళ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అంచనాల కంటే డిస్ట్రిబ్యూషన్ వ్యయం పెరిగితే.. ఆ మేరకు ట్రూఅప్ చార్జీల రూపంలో వసూలు చేసుకోవచ్చు. ఒకవేళ వ్యయం తగ్గితే వినియోగదారులకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఉదయ్ అమలు కాకపోవడంతో.. డిస్కంల ఆర్థిక పునర్ వ్యవస్థీకరణ కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ఉదయ్ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం చేరింది. ఈ పథకం కింద డిస్కంలకు సంబంధించిన రూ.8,200 కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గతంలో ఒప్పందం జరిగింది. ఉదయ్ అమలుతో 2017–18, 2018–19లలో డిస్కంలకు రూ.2,233 కోట్లు ఆదా అవుతాయని ఈఆర్సీ అంచనా వేసింది. కానీ ఉదయ్ పథకం ఫలితాలు అందకపోవడంతో.. ఈ భారం ట్రూఅప్ చార్జీల రూపంలో వినియోగదారులపైనే పడనుంది. రిటైల్ సప్లై ట్రూఅప్ చార్జీలు కూడా.. ఈఆర్సీ ముందుగా ఆమోదించిన విద్యుత్ కొనుగోళ్ల వ్యయం, వాస్తవంగా జరిగిన వ్యయం మధ్య వ్యత్యాసాన్ని.. రిటైల్ సప్లై ట్రూఅప్ చార్జీల పేరుతో డిస్కంలు వసూలు చేసుకోవచ్చు. గత 8 ఏళ్ల రిటైల్ సప్లై ఆదాయ లోటు రూ.38 వేల కోట్ల వరకు ఉంటుందని డిస్కంలు పేర్కొంటున్నాయి. ఈ రిటైల్ సప్లై ట్రూఅప్ చార్జీల వసూలు కోసం డిస్కంలు ఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంది. ఇది అమల్లోకి వస్తే మరింత భారమనే అంచనాలు ఉన్నాయి. -
గుడ్‌న్యూస్! టీఎస్ఎన్పీడీసీఎల్లో 82 ఏఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్/హన్మకొండ: ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎన్పీడీసీఎల్) 82 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 11 వరకు దరఖాస్తులను స్వీకరించ నుంది. ఆగస్టు 6 నుంచి హాల్‌టికెట్లను ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఆగస్టు 14న ఉదయం 10.30 నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అం డ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండి 18–44 ఏళ్ల వయసు గల అభ్య ర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో ఐదేళ్లు, శారీ రక వికలాంగులకు మరో 10 ఏళ్ల గరిష్ట వయో పరిమితి సడలింపు వర్తించనుంది. కొత్త జోన ల్ విధానం కింద టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధి లోని 18 జిల్లాల అభ్యర్థులకు 95 శాతం పోస్టు లు రిజర్వ్ చేశారు. మిగిలిన 5 శాతం పోస్టుల ను ఓపెన్ కేటగిరీ కింద భర్తీ చేస్తారు. సంస్థ వెబ్సైట్ జ్టి్టp://్టటnpఛీఛి .ఛిజజ.జౌఠి.జీn ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. -
తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం.. వ్యవసాయానికి 7 గంటలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాను ఏడు గంటలకు కుదించింది. గ్రామీణ ప్రాంతాల్లో రోజులో 7గంటలు మాత్రమే త్రీఫేజ్ విద్యు త్ సరఫరా జరుగుతోంది. ముఖ్యంగా రోజూ రాత్రి 12 నుంచి ఉదయం 8 గంటల వరకు కేవలం సింగిల్ ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని తాజాగా ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) క్షేత్రస్థాయి అధికారులకు రాతపూర్వకంగా ఆదేశాలు ఇచ్చింది. జిల్లాల వారీగా 7 గంటల త్రీఫేజ్ విద్యుత్ సరఫరా షెడ్యూల్‌ను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. సాధారణంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య త్రీఫేజ్ విద్యుత్ సరఫరాకు కోత పెడుతుంటారు. కానీ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రాత్రివేళల్లో త్రీఫేజ్ విద్యుత్‌కు కోతలు విధిస్తుండటం గమనార్హం. 1,500 మెగావాట్ల వరకు కొరత రాష్ట్రంలో నెలరోజులుగా 1,000 నుంచి 1,500 మెగావాట్ల వరకు విద్యుత్ కొరత ఉంటోంది. గత నెలలో గరిష్ట విద్యుత్ డిమాండ్ ఎన్నడూ లేనట్టుగా 14,200 మెగావాట్లకు చేరి రికార్డు సృష్టించింది. యాసంగి పంటలు కోతకు రావడంతో రోజువారీ డిమాండ్ 12,500 మెగావాట్లకు తగ్గింది. ఇంకా కొరత నెలకొనడంతో.. మూడురోజులుగా వ్యవసాయ విద్యుత్ సరఫరాను 7 గంటలకు కుదించినట్టు అధికారులు వెల్లడించారు. అయితే కోతలు తాత్కాలికమేనని, వారం, పదిరోజుల్లో విద్యుత్ డిమాండ్ తగ్గి పరిస్థితి చక్కబడుతుందని తెలిపారు. కొందామన్నా దొరక్క.. ఎండలు తీవ్రం కావడంతో గత నెల చివరివారం నుంచి దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోయింది. దీనికితోడు ఉక్రెయిన్–రష్యా యుద్ధం వల్ల అమ్మోనియం నైట్రేట్ (పేలుడు పదార్థం) కొరత ఏర్పడి బొగ్గు ఉత్పత్తి తగ్గింది. బొగ్గు కొరతతో ఓవైపు అకస్మాత్తుగా ధరలు పెరగడం, మరోవైపు విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడంతో మరింత ప్రభావం పడింది. విద్యుత్ కొరతను తీర్చుకోవడానికి రాష్ట్రాలు పవర్ ఎక్సే్ఛంజీని ఆశ్రయించడంతో.. ధరలు యూనిట్‌కు రూ.20 వరకు పెరిగాయి. ఈ క్రమంలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) రంగంలో దిగి యూనిట్ రేటు రూ.12కు మించకుండా నియంత్రణ విధించింది. పవర్ ఎక్సే్ఛంజీ నుంచి గతనెలలో రాష్ట్రం రూ.1,800 కోట్ల విద్యుత్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం రోజుకు రూ.30కోట్ల నుం చి రూ.40కోట్ల మేర విద్యుత్ కొంటోంది. అదికూడా 1,000 మెగావాట్ల విద్యుత్ కొనేందుకు బిడ్ వేస్తే.. 100 నుంచి 150 మెగావాట్ల విద్యుత్ మాత్రమే లభిస్తోందని అధికారు లు చెప్తున్నారు. అందువల్ల కోతలు విధించడం తప్పడం లేదని స్పష్టం చేస్తున్నారు. ఆలస్యంగా వేసిన పంటలకు కటకట యాసంగిలో బోర్లు, బావుల కింద ఆలస్యంగా వేసిన పంటలు ఇంకా చేతికి అందలేదు. వ్యవసాయ విద్యుత్ సరఫరాను అకస్మాత్తుగా 7 గంటలకు తగ్గించిన నేపథ్యంలో సదరు రైతులు ఆందోళనలో పడ్డారు. ఆ పంటలకు నెలాఖరు వరకు విద్యుత్ అవసరమని అంటున్నారు. మరోవైపు యాసంగి పంటలన్నీ దాదాపు కోతకు వచ్చాయని, ప్రస్తుతమున్న పంటల్లో చాలావరకు కూరగాయలు, ఇతర మెట్ట పంటలు మాత్రమేనని అధికారులు అంటున్నారు. అందుకే వ్యవసాయ విద్యుత్‌ను 7గంటలకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంటున్నారు. ఈ కోతల అంశంపై ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డిని వివరణ కోరేందుకు ప్రయత్నించినా.. వారు స్పందించలేదు. -
ఇట్లు.. ఆకాశరామన్న!.. రెండేళ్లలో 120 తప్పుడు ఫిర్యాదులు
సాక్షి, హన్మకొండ: ఎన్పీడీసీఎల్లో ఊరు, పేరు లేకుండా ఫిర్యాదు అందుతుం ది. ఆపై ఉన్నతాధికారులు స్పందిస్తారు. విచారణ చేపడతారు. దీంతో ఉద్యోగులు బెం బేలెత్తిపోతున్నారు. అలాంటి ఫిర్యాదులను పరిశీలనకు, విచారణకు స్వీకరించాల్సిన అవసరం లేదని సెంట్రల్ విజిలెన్స్, స్టేట్ విజిలెన్స్ ఆదేశాలున్నా యి. అయినా కొందరు అధికారులు అత్యుత్సాహంతో విచారిస్తున్నారు. అవసరం లేకున్నా విచారణకు పిలుస్తున్నారు. ఖమ్మం జిల్లాలో టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలో రెండేళ్లలో 120 తప్పుడు ఫిర్యాదులు అందాయి. చదవండి: (అడగండి అది మన హక్కు..పెట్రోల్ బంకుల్లో ఈ ఆరు సేవలు ఉచితం) ఉద్యోగినులకు సంబంధాలు అంటగడుతూ.. టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 జిల్లాల్లో తప్పుడు లేఖలు ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. చివరికి మహిళా ఉద్యోగులకు వివాహేతర సంబంధాలు అంటగట్టే స్థాయికి దిగజారారు. ప్రస్తుతం ఆకాశరామన్న ఉత్తరాలు టీఎస్ ఎన్పీడీసీఎల్ ఉద్యోగులు, అధికారుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ప్రధానంగా టీఎస్ ఎన్పీడీసీఎల్లోని యాంటీ పవర్ థెఫ్ట్ స్టేషన్ (ఏపీటీఎస్) అండ్ విజిలెన్స్ విభాగం అధికారులు తప్పుడు ఫిర్యాదులను అత్యుత్సాహంగా విచారిస్తుండటంతో ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. కాసుల కోసమేనా? ఖమ్మం జిల్లా (సర్కిల్)లో డిప్యుటేషన్‌పై పోలీస్ శాఖ నుంచి వచ్చి ఇటీవల బదిలీ అయిన ఓ ఉన్నతాధికారి తప్పుడు ఫిర్యాదులను ఆసరాగా తీసుకొని బాధితులపై విచారణ చేపట్టినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. వారిని బెదిరించి అక్రమార్జనకు పాల్పడ్డారని విద్యుత్ ఉద్యోగుల నుంచి ఆరోపణలున్నాయి. ఖమ్మం జిల్లాలో విద్యుత్ ఉద్యోగులు గ్రూపులుగా విడిపోయి ఆకాశరామన్న ఉత్తరాల పేరుతో ఫిర్యాదు చేసుకోవడం పరిపాటైందని ఉద్యోగులు వాపోతున్నారు. ఫిర్యాదులపై పట్టించుకోవద్దని ఆదేశాలున్నా.. ఇలాంటి ఫిర్యాదులను పట్టించుకోవద్దని సెంట్రల్ విజిలెన్స్ ఆదేశించింది. కోర్టు తీర్పులనూ ఉదహరించింది. అయినప్పటికీ కొందరు అధికారులు అత్యుత్సాహం చూపుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు వాపోతున్నారు. -
ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏఏఈ
మంథని: పెద్దపల్లి జిల్లాలో ఓ అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. ఎన్పీడీసీఎల్ ఎక్లాస్పూర్ సెక్షన్ అదనపు అసిస్టెంట్ ఇంజనీర్ ఏఏఈ కాసర్ల రాజ్‌కుమార్ ట్రాన్స్ఫార్మర్ను బిగించడం కోసం ఓ రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా శనివారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ కథ నం ప్రకారం.. మంథని మండలం ఆరెంద గ్రామానికి చెందిన ఎండీ షౌకత్ అలీ గోదావరిఖని ఫైర్స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్నారు. బాధితుడు షౌకత్ అలీ ఆయన తన వ్యవసాయ భూమిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లైన్ కోసం 2020లో దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ట్రాన్స్ఫార్మర్ మంజూరు కావడంతో అధికారులు, ఏఏఈ రాజ్‌కుమార్‌ను కలవాలని లైన్‌మన్ ద్వారా సమాచారం అందించారు. షౌకత్ అలీ ఏఏఈని కలవగా ట్రాన్స్ఫార్మర్ను బిగించడానికి రూ.25 వేలు డిమాండ్ చేశారు. బాధితుడు ప్రాధేయపడడంతో రూ.20 వేలకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో షౌకత్ అలీ ఏసీబీని ఆశ్రయించంతో అధికారులు, సబ్‌స్టేషన్‌లో ఏఏఈ రూ.20 వేలు తీసుకుంటుం డగా పట్టుకున్నారు. ఏఏఈ రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు వెల్లడిస్తున్న ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ -
వామ్మో! గుండె గుబేలు.. కరెంటు బిల్లు రూ.లక్షా 21వేలు
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన మెరుగు సంధ్య పేరిట ఉన్న విద్యుత్ మీటర్‌కు రూ.1,21,728 కరెంటు బిల్లు వచ్చింది. దీంతో వినియోగదారులు అవాక్కయ్యారు. సెప్టెంబర్‌లో రూ.48,441 విద్యుత్ బిల్లు రావడంతో బిల్లు సవరించాలని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అక్టోబర్‌లో మీటర్ రీడింగ్ తీయగా రూ.73,287 రావడంతో ఆందోళనకు గురయ్యారు. చదవండి: జూబ్లీహిల్స్ దాడిలో గాయపడ్డ రియల్టర్ రవీందర్ రెడ్డి మృతి రెండు నెలలకు సంబంధించి రూ.1,21,728 వచ్చిందని బాధితురాలు వాపోయింది. అంతకుముందు నెలకు రూ.500 నుంచి రూ.600 వస్తుండగా రెండు నెలల నుంచి వేలల్లో బిల్లు రావడంతో వారి గుండె గుభేల్ మంటోంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. -
టీఆర్‌వీకేఎస్‌లో ముసలం.. అసమ్మతికి ఆజ్యం
సాక్షి, హనుమకొండ: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టీఆర్వీకేఎస్)లో ముసలం మొదలైంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నేపథ్యంలో పురుడు పోసుకున్న ఈ సంఘం.. టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఉద్యమ స్ఫూర్తితో కొనసాగుతూ వస్తున్న ఇందులో ఒక్కసారిగా అసమ్మతి రాజేసుకుంది. టీఎస్ ఎన్పీడీసీఎల్లో ఇటీవల జరిగిన సాధారణ బదిలీలు అసమ్మతికి ఆజ్యం పోశాయి. బదిలీల్లో పోటీ యూనియన్‌లో సభ్యులైన ఉద్యోగులకు రాష్ట్ర మంత్రులు సహకారం అందించి కోరుకున్న చోటుకు బదిలీ చేయించారని, అదే అనుబంధంగా ఉన్న టీఆర్వీకేఎస్ సభ్యులను పట్టించుకోలేదని గుర్రుగా ఉన్నారు. ఇదే అంశాన్ని నాయకత్వం వద్ద వ్యక్తీరించినట్లు ఆ సంఘానికి చెందిన ఉద్యోగులు కొందరు తెలిపారు. అధికార పార్టీకి అనుబంధంగా ఉండి కూడా మంత్రులనుంచి సహకారం అందనప్పుడు అనుబంధంగా కొనసాగాల్సిన అవసరం ఏమొచ్చిందని నాయకత్వాన్ని ప్రశ్నించినట్లు సమాచారం. పనిచేయని బుజ్జగింపులు రాజుకున్న ఈ అసమ్మతి మరింత విస్తరించకుండా అధికార పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు రంగంలోకి దిగి బుజ్జగింపులకు దిగారు. అధికార పార్టీకి అనుబంధంగా కొనసాగుతున్నా.. తమకు సహకారం అందనప్పుడు అఫిలేటెడ్ అవసరం లేదని, ఏ పార్టీకి చెందకుండా స్వతంత్రగా సంఘాన్ని నడుపుకుంటామని నాయకత్వానికి చెప్పినట్లు అసమ్మతి నాయకులు వివరించారు. టీఆర్ఎస్ పార్టీ అనుబంధాన్ని తీసివేస్తేనే సంఘంలో కొనసాగుతామని, లేకపోతే ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటామని అల్టిమేటం ఇచ్చినట్లు సమాచారం. కల్వకుంట్ల కవిత గౌరవాధ్యక్షురాలిగా ఉన్న టీఆర్వీకేఎస్ అధికార పార్టీకి అనుబంధంగా కొనసాగితేనే అన్ని విధాలుగా ప్రయోజనకారీగా ఉంటుందని సంఘం అధినాయకత్వం అసమ్మతి నాయకులకు సంతృప్తి పరిచే ప్రయత్నం చేసింది. అయినా బెట్టువీడని నాయకులు తమ అనుచరగణాన్ని వెంటబెట్టుకుని టీఆర్‌వీకేఎస్‌ను వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఇతర సంఘాల నాయకులతో చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం. -
Telangana : నష్టాల బాటలో డిస్కంలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల నష్టాలు ఏటేటా పెరిగిపోతున్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)లు 2019–20లో మరో రూ.6,061 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇందులో టీఎస్ఎస్పీడీసీఎల్ నష్టాల వాటా రూ.4,940.24 కోట్లు కాగా, టీఎస్ఎన్పీడీసీఎల్ నష్టాల వాటా రూ.1,116.29 కోట్లు. దీంతో 2019– 20 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వీటి నికర నష్టాలు ఏకంగా రూ.42,292 కోట్లకు ఎగబాకాయి. ఇందులో టీఎస్ఎస్పీడీసీఎల్ నికర నష్టాలు రూ.29,303 కోట్లు కాగా, టీఎస్ఎన్పీడీసీఎల్ నికర నష్టాలు రూ.12,983 కోట్లు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తమ వార్షిక నివేదికల్లో ఈ వివరాలను రెండు డిస్కంలు వెల్లడించాయి. 2017–18 ముగిసే నాటికి రూ.28,209.26 కోట్లకు పెరిగిన డిస్కంల నికర నష్టాలు, 2018–19 ముగిసే నాటికి రూ.36,231.47 కోట్లకు చేరాయి. 2020 మార్చి 31 ముగిసే నాటికి రూ.రూ.42,292 కోట్లకు ఎగబాకినట్లు డిస్కంలు స్పష్టం చేస్తున్నాయి. విద్యుత్ సరఫరా వ్యయంతో పోలిస్తే బిల్లు ల వసూళ్లు, ప్రభుత్వ విద్యుత్ సబ్సిడీల ద్వారా వస్తున్న ఆదాయం తక్కువగా ఉంటుండటంతో డిస్కంలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా విద్యుత్ చార్జీలను పెంచకపోవడం కూడా డిస్కంల నష్టాలకు కారణంగా చెబుతున్నారు. ఖర్చులు ఎక్కువ.. ఆదాయం తక్కువ.. ► టీఎస్ఎస్పీడీసీఎల్ 2019–20లో 45,247 మిలియన్ యూనిట్ల (ఎంయూ)ల విద్యుత్ కొనుగోళ్లకు రూ.24,907 కోట్లు, జీతాల చెల్లింపులకు రూ.2,314 కోట్లు, ఆపరేషన్ ఇతర ఖర్చులు రూ.261 కోట్లు, రుణాలపై వడ్డీలు రూ.1,489 కోట్లు, ఆస్తుల తరుగుదల రూ.986 కోట్లు, అసాధారణ ఖర్చులు రూ.148 కోట్లు కలిపి మొత్తం రూ.30,108 కోట్లు ఖర్చు చేసింది. విద్యుత్ అమ్మకాల ద్వారా రూ.24,600 కోట్లు, ఇతరాత్ర ఆదాయం రూ.46 కోట్లు కలిపి మొత్తం రూ.24,647 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. దీంతో సంస్థకు 2019–20లో రూ.4,940 కోట్ల నష్టాలు వచ్చాయి. ► టీఎస్ఎన్పీడీసీఎల్ 2019–20లో 20,504 ఎంయూల విద్యుత్ కొనుగోళ్లకు రూ.11,326 కోట్లు, ఉద్యోగులకు జీతాల చెల్లింపులకు రూ.1,429 కోట్లు, రుణాలకు వడ్డీల చెల్లింపులకు రూ.626 కోట్లు, ఆస్తుల తరుగుదల రూ.444 కోట్లు, ఇతర ఖర్చులు రూ.305 కోట్లు కలిపి మొత్తం రూ.14,132 కోట్ల వ్యయం చేయగా, 18,650 ఎంయూల విద్యుత్ అమ్మకాల ద్వారా మొత్తం రూ.24,647.65 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. దీంతో సంస్థ 2019–20లో స్థూలంగా రూ.1,116 కోట్లను నష్టపోయింది. -
తెలంగాణ డిస్కంల పనితీరు అధ్వానం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల పనితీరు, ఆర్థిక నిర్వహణ అధ్వానంగా ఉన్నట్లు వెల్లడైంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 41 డిస్కంల పనితీరును కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ పరిశీలించి రేటింగ్స్ నిర్ధారించింది. తాజాగా ప్రకటించిన 9వ వార్షిక సమగ్ర రేటింగ్స్‌లో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)కు ‘బీ -గ్రేడ్’, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)కు ‘సీ -గ్రేడ్’దక్కాయి. ఉత్తర తెలంగాణ డిస్కం బీహార్ లాంటి రాష్ట్రాల డిస్కంల సరసన నిలవడం గమనార్హం. అత్యుత్తమ పనితీరుతో గుజరాత్‌లోని నాలుగు డిస్కంలతోపాటు హర్యానాలోని ఒక డిస్కం ‘ఏ+’ గ్రేడ్‌ను సాధించి జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలవగా హర్యానా, పంజాబ్, మహారాష్ట్రలకు చెందిన ఒక్కో డిస్కం ‘ఏ’ గ్రేడ్‌ను దక్కించుకున్నాయి. టీఎస్ఎస్పీడీసీఎల్లో లోపాలు నిర్దేశితం కన్నా అధిక వ్యయంతో విద్యుత్ కొనుగోళ్లు చేయడం గడువులోగా 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాల టారిఫ్ ప్రతిపాదనల (ఏఆర్ఆర్)ను ఈఆర్సీకి సమర్పించకపోవడం సంస్థకు వరుసగా మూడేళ్లు నష్టాలు రావడం విద్యుత్ బిల్లుల వసూళ్లతోపాటు కొనుగోళ్లకు జరిపే చెల్లింపుల్లో తీవ్ర జాప్యం పెరుగుతున్న ఇంధన వ్యయానికి తగ్గట్టు ఆటోమెటిక్‌గా టారిఫ్‌ను పెంచే వ్యవస్థ లేకపోవడం సాంకేతిక, వాణిజ్య(ఏటీ అండ్ సీ) విద్యుత్ నష్టాలను తగ్గించుకోకపోవడం టీఎస్ఎన్పీడీసీఎల్లోని కీలక లోపాలు 2018-19లో 26.66 శాతం ఉన్న విద్యుత్ నష్టాలు 2019-20లో 34.49 శాతానికి పెరిగిపోవడం 2019-20లో యూనిట్‌కు రూ.5.26 చొప్పున అధిక ధరతో విద్యుత్ కొనుగోళ్లు చేయడం 2020-21, 2021-22ల టారిఫ్ ప్రతిపాదనలను నిర్దేశిత గడువులోగా ఈఆర్సీకి సమర్పించకపోవడం 2019-20లో అధిక ధరతో విద్యుత్ కొనుగోళ్లు జరపడం, ప్రభుత్వం నుంచి సకాలంలో సబ్సిడీలు రాకపోవడంతో సంస్థ చేసిన వ్యయం తిరిగి రాబట్టుకోలేకపోవడం పెరుగుతున్న ఇంధన వ్యయానికి తగ్గట్టు ఆటోమెటిక్‌గా టారిఫ్‌ను పెంచే వ్యవస్థ లేకపోవడం విద్యుత్ బిల్లుల వసూళ్లు, విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం -
మీ కరెంట్ రీడింగ్ మీరే చెప్పండి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు వినూత్నంగా సెల్ఫ్ బిల్లింగ్ సిస్టంను అమలు చేయబోతున్నాయి. కోవిడ్ విజృంభన దృష్ట్యా సిబ్బంది ఇంటింటికి తిరిగి స్పాట్ బిల్లింగ్ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. వినియోగదారులే స్వయంగా మీటర్ రీడింగ్ తీసి పంపించేందుకు మొబైల్ యాప్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఎన్పీడీసీఎల్ ఈ సేవలను తన టీఎస్ఎన్పీడీసీఎల్ ఐటీ వింగ్, భారత్ సెల్ఫ్ మీటర్ రీడింగ్ యాప్‌ల ద్వారా బుధవారం నుంచి అందుబాటులోకి తెచ్చింది. https://play.google.com/store/apps/details?id=in.tsnpdcl.tsnpdcl లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా ‘టీఎస్ఎన్పీడీసీఎల్ ఐటీ వింగ్’ అనే యాప్‌ను.. https://play.google.com/store/ apps/details? id= in.coral.met లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా ‘భారత్ సెల్ఫ్ మీటర్ రీడింగ్’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. గతేడాది మార్చిలో లాక్డౌన్ విధించడంతో ఏప్రిల్, మే నెల ల్లో మీటర్ రీడింగ్ తీయడం సాధ్యం కాలేదు. జూన్ లో మూడు నెలల రీడింగ్ తీసి బిల్లులు ఇచ్చాయి. దీంతో స్లాబులు మారి భారీగా బిల్లులు రావడంతో వినియోగదారులు ఆందోళన పడ్డారు. దీనికి పరిష్కారంగా సెల్ఫ్ బిల్లింగ్ అమలు చేయనున్నాయి. స్పాట్ బిల్లర్లు రాకుంటేనే.. ప్రస్తుత మే నెలలో స్పాట్ బిల్లింగ్ సిబ్బంది ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ తీయకపోతే, రెండు రోజులు వేచి చూసి ఆ తర్వాత సెల్ఫ్ బిల్లింగ్ సదుపాయాన్ని వాడుకోవాలని టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ ఎ.గోపాల్‌రావు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మే నెలలో మాత్రమే ఈ సదుపాయం కల్పిస్తున్నామని వెల్లడించారు. త్వరలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సైతం ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టబోతోంది. ఇలా వినియోగించాలి టీఎస్ఎన్పీడీసీఎల్ ఐటీ వింగ్ లేదా భారత్ మీటర్ రీడింగ్ యాప్ ఓపెన్ చేసి అందులో సెల్ఫ్ మీటర్ రీడింగ్ ఆప్షన్‌ను క్లిక్ చేసి సబి్మట్ సెల్ఫ్ మీటర్ రీడింగ్‌ను ఎంపిక చేసుకోవాలి. తర్వాత వినియోగదారులు యూనిక్ సరీ్వస్ నంబర్, మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. అనంతరం స్కాన్ కేడబ్ల్యూహెచ్ రీడింగ్‌ను ఎంపిక చేసి మీటర్‌లోని కేడబ్ల్యూహెచ్ రీడింగ్‌ను స్కాన్ చేసి సబి్మట్ బటన్ క్లిక్ చేయాలి. అధికారులు ఆ ఫోటో ఆధారంగా విద్యుత్ బిల్లును ఎస్ఎంఎస్ రూపంలో పంపిస్తారు. -
విద్యుత్‌లో తెలంగాణ నయా రికార్డు!
సాక్షి ప్రతినిధి, వరంగల్: విద్యుత్ సరఫరాలో తెలంగాణ మరోసారి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఉమ్మడి ఏపీలో సైతం ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో ఈ సీజన్లో అత్యధిక వినియోగం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో 2014 మార్చి చివరి వారం (23న) అత్యధికంగా 13,162 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరగ్గా ఈ నెల మొదటి వారంలో ఒక్క తెలంగాణలోనే 13,141 మెగావాట్ల వినియోగం జరగడం రికార్డుగా విద్యుత్ సరఫరా సంస్థలు ప్రకటించాయి. వాతావరణం చల్లబడి, వరి కోతలు చేపడుతున్న సమయంలో శుక్రవారం కూడా భారీగా విద్యుత్ వినియోగం అయినట్లు నమోదైంది. ఈ సీజన్లో ఇంత పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడినా ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్), దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) విద్యుత్ సరఫరా చేసి సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఏటా పెరుగుతున్న విద్యుత్ వినియోగం టీఎస్ ఎన్పీడీసీఎల్, టీఎస్ఎస్పీడీఎల్ పరిధిలో ఏటేటా విద్యుత్ వినియోగం పెరుగుతోంది. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన విద్యుత్ వినియోగం వివరాలను విద్యుత్ పంపిణీ సంస్థలు ఇటీవల ప్రకటించాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ‘తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే–2021’ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2016-17లో తెలంగాణలో 9,187 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదవగా 2017-18లో అది 10,284 మెగావాట్లకు చేరింది. అలాగే 2018-19లో 10,818 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదుకాగా 2019–20లో డిమాండ్ 11,703 మెగావాట్లకు చేరింది. దేశ సగటు వృద్ధి శాతం 3.44గా నమోదవగా తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు 8.18 శాతంగా నమోదైంది. పంపుసెట్లకు నిరంతర ఉచిత విద్యుత్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలలో కీలకమైనది వ్యవసాయానికి ఉచిత, నాణ్యమైన విద్యుత్ సరఫరా. 2018 జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంపు సెట్లకు 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతోంది. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 19 లక్షలకుపైగా పంపు సెట్లు ఉంటే ఇప్పుడు 24 లక్షలకుపైగా కనెక్షన్లు ఉన్నాయి. అనధికారికంగా మరో 4.20 లక్షల వరకు ఉంటాయని అధికారుల అంచనా. అలాగే రాష్ట్రం ఏర్పడే నాటికి 1.10 కోట్ల వరకు వివిధ రకాల విద్యుత్ కనెక్షన్లు ఉండగా ఈ ఏడాది మార్చి 31 నాటికి వాటి సంఖ్య 1.55 కోట్లు దాటింది. ఈ లెక్కన విద్యుత్ కనెక్షన్లలో 38.62 శాతం వృద్ధి నమోదైనట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. ఇదే స్థాయిలో సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు కూడా పెరిగాయి. కాగా వీటితో పాటు 2014 వరకు 680 మెగావాట్ల విద్యుత్ ఎత్తిపోతల పథకాలకు వినియోగించగా, కాళేశ్వరం లాంటి భారీ పథకాలు తోడవడంతో ప్రస్తుతం 2,100 మెగావాట్లకు చేరినట్లు అధికరుల గణాంకాలు చెబుతున్నాయి. వచ్చే రెండేళ్లలో మరిన్ని ఎత్తిపోతల పథకాలు పూర్తి కానుండగా, వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. మహబూబ్‌నగర్, మెదక్, కరీంనగర్లో భారీగా యాసంగి పంటలు కోతకు వచ్చినా విద్యుత్ వినియోగం ఆగడం లేదు. గురు, శుక్రవారాల్లోనూ గతేడాది ఇదే సమయంతో పోలిస్తే విద్యుత్ గణనీయంగా వినియోగమైంది. ఎన్పీడీసీఎల్ పరిధిలో గత ఏడాది 2,584 మెగావాట్లు కాగా, ఇప్పుడు 3,081 మెగావాట్లుగా, ఎస్పీడీసీఎల్ పరిధిలో గతేడాది ఇదే సమయంలో 4,575 మెగావాట్లు కాగా, శుక్రవారం 6,665 మెగావాట్లు విద్యుత్ వినియోగం నమోదైంది. ఈ రెండు విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలోని పూర్వ కరీంనగర్ జిల్లాలో 1,029 మెగావాట్లు వినియోగం కాగా, ఎస్పీడీసీఎల్ పరిధిలోని మెదక్‌లో 1,443, మహబూబ్‌నగర్‌లో 1,126 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. -
విద్యుత్ బకాయిలు రూ.430 కోట్లు
కొత్తపల్లి(కరీంనగర్): టీఎస్ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ బకాయిలు గుట్టలా పేరుకుపోతున్నాయి. మొండి బకాయిలకు చెక్ పెట్టేందుకు విద్యుత్ సంస్థలు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్లు అందుబాటులోకి రాకపోవడంతో బకాయిలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫలితంగా బకాయిల భారంగా మిగిలిపోతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ మీటర్లు బిగించినా వాటిని ఇన్స్టాల్ చేయకపోవడంతో మొండి బకాయిలు నెలనెలా పెరుగుతున్నాయి. విద్యుత్‌సంస్థ ఉదాసీనత, ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం మూలంగా కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్‌లో పడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తగా ఇప్పటి వరకు 2,308 సింగిల్ ఫేజ్, 543 త్రీఫేజ్ ప్రీ పెయిడ్ మీటర్లను ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ శాఖ బిగించింది. బిగించిన మీటర్లు ఇన్స్టాలేషన్ చేయకపోవడంతో విద్యుత్ బకాయిలు పేరుకుపోతూనే ఉన్నాయి. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో రూ.430,47,9700 కోట్లు విద్యుత్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆలోచన అద్భుతం.. ఆచరణ శూన్యం.. ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బకాయిలకు చెక్ పెట్టేందుకు విద్యుత్ సంస్థలు చేపట్టిన ప్రీ పెయిడ్ మీటర్ల ఆలోచన బాగున్నప్పటికీ వాటి నిర్వహణ బాధ్యతలు చేపట్టకపోవడంతో ఆశించిన ఫలితం దక్కడం లేదు. కరీంనగర్ సర్కిల్ పరిధిలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటి వరకు 727 సింగిల్ ఫేజ్, 295 త్రీ ఫేజ్ ప్రీపెయిడ్ మీటర్లు బిగించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అడ్డగోలుగా విద్యుత్ దుబారా అవుతున్నట్లు గుర్తించిన విద్యుత్ అధికారులు ప్రీ పెయిడ్ మీటర్ల ద్వారా అదుపు చేయాలని నిర్ణయించారు. లైట్లు, ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు అవసరానికి మించి వాడటంతో విద్యుత్ దుబారా కావడంతోపాటు బిల్లులు చెల్లించకపోవడం విద్యుత్ శాఖకు తలనొప్పిగా మారింది. విద్యుత్ బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేస్తే ఉన్నతాధికారుల సిఫారసులతో విద్యుత్ పునరుద్ధరించుకోవడం పరిపాటిగా మారింది. మొండి బకాయిలు వసూలు చేసేందుకు విద్యుత్ శాఖ అనేకమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పటికీ ఒత్తిడిలకు తలొగ్గి సరఫరా చేయాల్సి వస్తోంది. ప్రభుత్వ శాఖలే కాదా.. అంటూ బకాయిలపై నిర్లక్ష్యం వహించడంతో కోట్ల రూపాయల బకాయిలు పేరుకుతున్నట్లు తెలుస్తోంది. ఈ బకాయిలు వసూలు చేయడం విద్యుత్ శాఖకు తలకుమించిన భారంగా మారుతోంది. అయినా అడపాదడపా చర్యలు చేపడుతోంది. కానీ అనుకున్న ఫలితాలను సాధించలేకపోతోంది. కనీసం ప్రీ పెయిడ్ మీటర్లనైనా ఇన్స్టాలేషన్ చేస్తే విద్యుత్ బకాయిల వసూలుతోపాటు వినియోగం కూడా తగ్గే అవకాశం ఉంటుందని విద్యుత్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. రూ.430.47 కోట్లు టీఎస్ ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ పరిధిలో రూ.430,47,97 కోట్ల విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. ఏడాదికేడాది ఈ బకాయిలు పెరుగుతున్నాయే తప్ప చెల్లింపులు మాత్రం చేయకపోవడం విద్యుత్ శాఖకు భారంగా మారుతోంది. విద్యుత్ సర్వీసులు నిలిపివేస్తే క్షణాల్లోనే పునరుద్ధరణ కోసం పైరవీలు.. దీంతో ఏం చేయలేని విద్యుత్ శాఖ తిరిగి సరఫరా పునరుద్ధరిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లోని బకాయిలను నిలువరించాలంటే ప్రీ పెయిడ్ మీటర్లు పూర్తిస్థాయిలో పని చేయాల్సి అవసరం ఉంది. ఆ దిశగా విద్యుత్ అధికారులు అడుగులేస్తే తప్ప విద్యుత్ బకాయిల వసూళ్లు కష్టసాధ్యమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక డ్రైవ్ ప్రభుత్వ కార్యాలయాల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలపై ఎన్నికల ఫలితాల అనంతరం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం. బకాయిలు చెల్లించని శాఖల విద్యుత్ సరఫరా నిలిపివేస్తాం. ప్రతినెలా నోటీసులిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ప్రీపెయిడ్ మీటర్లను ఇన్స్టాలేషన్ చేసి అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రభుత్వ శాఖలు బిల్లులు చెల్లించి సహకరించాలి. – కె.మాధవరావు, ఎస్ఈ, కరీంనగర్ సర్కిల్ -
జేఏఓ ప్రశ్నపత్రాన్ని నిపుణుల బృందానికి నివేదించండి
సాక్షి, హైదరాబాద్: జూనియర్ అకౌంట్స్ అధికారుల (జేఏఓ) పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రంపై అభ్యర్థులు అభ్యంతరాలు లేవనెత్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని నిపుణుల బృందానికి నివేదించాలని తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) ను హైకోర్టు ఆదేశించింది. నిపుణుల బృందం చేసే సిఫారసులకనుగుణంగా పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగించడంతో పాటుగా ‘కీ’పై వస్తున్న అభ్యంతరాలను కూడా ఈ బృందం పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. ప్రశ్నలను ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి చేసిన అనువాదాన్ని కూడా పరిశీలించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. అభ్యర్థుల అభ్యంతరాలివి.. రాష్ట్రంలో 107 జూనియర్ అకౌంట్స్ అధికారుల పోస్టు భర్తీకి 2018 మే లో ఎన్పీడీసీఎల్ నోటిఫికేషన్ జారీ చేసింది. 35 ప్రశ్నలు అకౌంటెన్సీ, అడ్వాన్డŠస్ అకౌంటెన్సీ, 25 ప్రశ్నలు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, 20 ప్రశ్నలు ఆడిటింగ్, మిగిలిన 20 ప్రశ్నలు ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్‌కు సంబంధించి ఉంటా యన్నారు. జూలైలో రాతపరీక్ష నిర్వహించారు. అయితే...51 ప్రశ్నలు అకౌంటెన్సీ, అడ్వాన్స్డ్ అకౌంటెన్సీ నుంచి, 19 ప్రశ్నలు, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ నుంచి, ఆడిటింగ్ నుంచి పది ప్రశ్నలు మాత్రమే ఇచ్చారని ఇది సరికాదంటూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పరీక్షను రద్దు చేసి తిరిగి పరీక్ష నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పలువురు అభ్యర్థులు వేర్వేరుగా పిటిషన్లు దాఖ లు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు బి.రచనారెడ్డి, భుజంగరావులు వాదనలు వినిపిస్తూ, నోటిఫికేషన్లో చెప్పిన విధానానికి, పరీక్ష నిర్వహించిన విధానానికి ఏ మాత్రం పొంతన లేదన్నారు. ఫలానా విభాగంలో ఇన్ని ప్రశ్నలు వస్తాయని పేర్కొనడం వల్ల అభ్యర్థులు అందుకనుగుణంగా ప్రాధాన్యతలను నిర్ణయించుకుని పరీక్షకు సన్నద్ధులయ్యారన్నారు. పరీక్షను రద్దు చేసి, తిరిగి పరీక్ష నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. వారికి ఆ హక్కులేదు.. ఈ వాదనలను ఎన్పీడీసీఎల్ తరఫు సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ తోసిపుచ్చారు. ఫైనల్ కీ విడుదల చేసిన తరువాత కూడా అభ్యర్థులు ఈ అభ్యంతరాలను లేవనెత్తలేదని, ఇప్పుడు ప్రశ్నలు ఫలానా విధంగా లేవంటూ అభ్యంతరం వ్యక్తం చేసే హక్కు వారికి లేదని తెలిపారు. పరీక్ష పత్రం తయారు చేసిన జేఎన్టీయూ తరఫున ఏ.అభిషేక్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, అకౌంటెన్సీ, అడ్వాన్స్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఆడిటింగ్ ఇవన్నీ కూడా పరస్పర సంబంధం ఉన్న సబ్జెక్టులేనన్నారు. అందువల్ల పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ సమయంలో ప్రశ్నాపత్రాన్ని నిపుణుల బృందానికి నివేదించే విషయం చర్చకు రాగా, ఎన్పీడీసీఎల్ న్యాయవాది అందుకు అభ్యంతరం లేదని చెప్పారు. దీంతో న్యాయమూర్తి మొత్తం ప్రశ్నపత్రాన్ని నిపుణుల బృందానికి నివేదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్ణీత కాల వ్యవధిలోపు ఈ నిపుణుల బృందం అన్నీ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, తగిన సిఫారసు చేయాలని స్పష్టం చేశారు. -
తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్ల పంజా!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలపై ఆన్లైన్ హ్యాకర్లు రెచ్చిపోయారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థల వెబ్సైట్లను హ్యాక్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్), హన్మకొండ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్), తిరుపతి కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఎస్పీడీసీఎల్), వైజాగ్ కేంద్రంగా పనిచేస్తున్న తూర్పు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్)ల అధికారిక వెబ్సైట్లపై అంతర్జాతీయ హ్యాకర్లు పంజా విసిరారు. ర్యాన్సమ్వేర్ వైరస్ ద్వారా సర్వర్లలో ఉన్న డేటాను హ్యాకర్లు తస్కరించారు. అనంతరం సర్వర్లలో ఉన్న డేటాను పూర్తిగా డిలీట్ చేశారు. తస్కరించిన డేటాను వెనక్కి ఇచ్చేందుకు రూ.35 కోట్లకు పైగా డబ్బులు ఇవ్వాలని హ్యాకర్లు మెయిల్ పంపించినట్లు అధికారులు తెలిపారు. అయితే, 4 డిస్కంలకు సంబంధించిన సర్వర్లకు బ్యాకప్ ఉండడంతో డేటా భద్రత సమస్య తప్పింది. తిరుపతిలో డిస్కంల సర్వర్లు.. నాలుగు డిస్కంల ద్వారానే 2 రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఈ సంస్థల వెబ్సైట్లను తిరుపతి కేంద్రంగా టాటా కన్సల్టెన్సీ లిమిటెడ్(టీసీఎస్) నిర్వహిస్తోంది. ఉమ్మడి ఏపీ నుంచే డిస్కంల వెబ్సైట్ల సర్వర్లను తిరుపతి నుంచి నిర్వహిస్తున్నారు. గుర్తుతెలియని మెయిల్స్‌ను తెరవగానే వీటి సర్వర్లలో వైరస్ చొరబడి వెబ్సైట్లను హ్యాక్ చేసింది. సర్వర్ల నుంచి మొత్తం డేటాను డిలీట్ చేయడంతోపాటు వాటిని తెరుచుకోకుండా చేశారు. మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెబ్సైట్లు హ్యాకింగ్‌కు గురికావడంతో 2 రోజులుగా ఆన్లైన్, పేటీఎం ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపు స్తంభించిపోడంతో వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు. టీసీఎస్ నిర్వహిస్తున్న వెబ్సైట్లే లక్ష్యం.. హ్యాకర్లు టీసీఎస్ కంపెనీ నిర్వహిస్తున్న పలు సంస్థల వెబ్సైట్లపై దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలోని 4 డిస్కంలతో పాటు ఇండియన్ ఎయిర్‌లైన్స్ అధికారిక వెబ్‌సైట్‌ను సైతం హ్యాకింగ్‌కు పాల్పడినట్లు అధికారవర్గాలు తెలిపాయి. దీనితో పాటు ఆంధ్రాబ్యాంక్ వెబ్‌సైట్‌ను సైతం టార్గెట్ చేసినట్లు తెలిసింది. ఈ అంశంపై ఇప్పటివరకు ఆంధ్రాబ్యాంక్, ఇండియన్ ఎయిర్‌లైన్స్ సంస్థల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. హ్యాకింగ్ నిజమే.. తమ సంస్థ వెబ్సైట్ హ్యాక్ అయినట్లు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి ధ్రువీకరించారు. సంస్థ వెబ్సైట్ నిర్వహణ బాధ్యతలను టీసీఎస్‌కు అప్పగించామని, టీసీఎస్‌తో కలసి సంస్థ ఐటీ నిపుణులు వెబ్‌సైట్‌ను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ర్యాన్సమ్వేర్ వైరస్ కారణంగా వెబ్సైట్ హ్యాక్ అయ్యిందన్నారు. ఆంధ్రాబ్యాంక్, ఇండియన్ ఎయిర్‌లైన్స్ వెబ్సైట్లను హ్యాక్ చేసిన దుండగులే తమ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినట్లు భావిస్తున్నామన్నారు. తిరుపతిలో డిస్కంల వెబ్సైట్లకు సంబంధించిన డేటా బ్యాకప్ ఉందన్నారు. బ్యాకప్ బాధ్యత టీసీఎస్‌దే.. తమ సంస్థ వెబ్సైట్ నిర్వహణ బాధ్యతలు టీసీఎస్ చూస్తోందని, పునరుద్ధరణ బాధ్యత ఆ సంస్థదేనని టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ ఎ.గోపాల్‌రావు అన్నారు. ఇప్పటికే వెబ్‌సైట్‌లోని కొన్ని ఆప్షన్లను పునరుద్ధరించామని తెలిపారు. డిస్కంల వెబ్సైట్లు హ్యాకింగ్‌కు గురికావడంపై హైదరాబాద్ నగర సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 65 కింద గుర్తుతెలియని హ్యాకర్లపై కేసు నమోదు చేశామని సీసీఎస్ అదనపు డీసీపీ రఘువీర్ తెలిపారు. -
విద్యుత్ శాఖలో బదిలీల లొల్లి..
కొత్తపల్లి(కరీంనగర్) : ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) కరీంనగర్ సర్కిల్ పరిధిలో చేపట్టిన సాధారణ బదిలీల ప్రక్రియ శనివారం రాత్రి ఓ కొలిక్కి వచ్చింది. సబ్ ఇంజినీర్లు సహా ఆఫీసు, ఫీల్డ్ విభాగానికి సంబంధించిన ఉద్యోగుల బదిలీలు చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా.. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి బదిలీల ప్రక్రియపై లొల్లి నెలకొంది. ఈనెల 15వ తేదీ సాయంత్రం వరకే బదిలీలు పూర్తి చేసి లిస్టు ప్రదర్శించాల్సిన అధికారులు ట్రేడ్ యూనియన్ల ఒత్తిళ్లకు తలొగ్గి బదిలీల ప్రక్రియను ఆలస్యం చేశారు. దీంతో ఉద్యోగులు, సిబ్బంది పోస్టింగ్‌ల కోసం ఎస్ఈ కార్యాలయం ఆవరణలో పడిగాపులు కాస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంజినీర్ల బదిలీల్లో నిబంధనలు పాటించడం లేదంటూ, ఒకే యూని యన్‌కు అనుకూలంగా ఎస్ఈ వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ శనివారం తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఎస్‌పీఈఏ) కరీంనగర్ బ్రాంచి ఆధ్వర్యంలో ఎస్ ఈ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఎస్ఈకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించారు. ఈ సందర్భంగా టీఎస్‌పీఈఏ కరీంనగర్ బ్రాంచి సెక్రటరీ కె.అంజయ్య మాట్లాడుతూ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టారీతిన ఇంజినీర్ల బదిలీలు చేపడుతున్నారని, ఓ యూనియన్‌కు వత్తాసు పలుకుతూ ఎస్ఈ చేపడుతున్న బదిలీలు సరికావని ఆరోపించారు. మహిళలని చూడకుండా గతంలో అటవీ ప్రాంతాకు సమీపంలో పోస్టింగ్‌లు ఇచ్చారని, ప్రస్తుతం కూడా అదే పద్ధతి అవలంబించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. విద్యుత్ శాఖను భ్రష్టు పట్టిస్తున్న ఎస్ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. నిబంధనల ప్రకారం బదిలీలు చేపట్టే వరకు ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఈ ధర్నాలో కోశాధికారి జి.రఘు, వివిధ జిల్లాల అధ్యక్షులు ఎన్.అంజయ్య, ఎ.శ్రీనివాస్‌రెడ్డి, వి.ప్రదీప్, కె.గంగారాం, కార్యదర్శులు పి.అశోక్, ఎ.నరేష్, డీఈలు గంగాధర్, బాలయ్య, ఏడీలు వి.ప్రభాకర్, సాగర్, ఏఈలు పాల్గొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కార్యాలయ గేట్ ఎదుట చేపడుతున్న ఇంజినీర్ల నిరసనపై స్పందించిన ఎస్ఈ కె.మాధవరావు వారిని చర్చలకు ఆహ్వానించారు. ఎస్సీ, ఎస్టీ సంఘం నాయకులు సైతం ఆందోళన చేపట్టారు. పలు విభాగాల్లో పోస్టింగ్‌లు.. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) కరీంనగర్ సర్కిల్ పరిధిలోని సాధారణ బదిలీల ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. రెండు రోజులుగా నిరీక్షిస్తున్న ఉద్యోగులకు శనివారం రాత్రి ఊరట లభించింది. ఇంకనూ ఇంజినీర్ల బదిలీల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. శుక్రవారంతో బదిలీల ప్రక్రియ ముగియాల్సి ఉండగా.. పైరవీలు, ఒత్తిళ్ల మేరకు పలు విభాగాల పోస్టింగ్‌లు శనివారం ప్రకటించారు. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ (జేఏఓ) 12, జూనియర్ అసిస్టెంట్ 48, సీనియర్ అసిస్టెంట్ 20, ఆఫీసు సబార్డినేట్స్ 18, స్వీపర్లు 3, ఫోర్‌మెన్ (గ్రేడ్ 1) 7, సబ్ ఇంజినీర్ 18లను బదిలీ చేస్తూ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ కె.మాధవరావు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. సర్కిల్ పరిధిలోని కరీంనగర్ డివిజన్ పరిధిలోని లైన్ ఇన్స్పెక్టర్ 5, లైన్మెన్ 67, అసిస్టెంట్ లైన్మెన్ 3, జూనియర్ లైన్మెన్ 2 బదిలీ లిస్టును శనివారం రాత్రి డీఈ రాజారెడ్డి ప్రకటించారు. ఇందులో కొంతమందికి ఆప్షన్ ప్రకారం, మరికొంత మందికి ఆప్షన్‌కు విరుద్ధంగా పోస్టింగ్‌లు కేటాయించడంతో అసంతృప్తి వ్యక్తమైంది. రెండు రోజులుగా పోస్టింగ్‌ల కోసం సిబ్బంది ఎదురుచూస్తుండటంతో ఎస్ఈ కార్యాలయం సందడిగా కనిపించింది. పారదర్శకంగా బదిలీలు కరీంనగర్ సర్కిల్ పరిధిలోని సాధారణ బదిలీలన్నీ పారదర్శకంగా చేపట్టాం. అన్ని యూనియన్ల నాయకులతో చర్చించాకే బదిలీలు చేపడుతున్నాం. ఇంజినీర్ల బదిలీలపై ఓ తుది నిర్ణయం వెలువడకముందే నిందారోపణలు వేయడం సరికాదు. అందరికీ ఆమోదయోగ్యంగానే బదిలీలు జరుగుతాయి. – కె.మాధవరావు, ఎస్ఈ, కరీంనగర్ సర్కిల్ -
వాడుకున్నంత!
సాక్షి, మెదక్: ఇక నుంచి విద్యుత్ వినియోగదారులు ప్రతినెలా సెల్‌ఫోన్ రీచార్జి తరహాలోనే విద్యుత్ మీటర్‌ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. కార్డులో బ్యాలెన్స్ ఉన్నంత వరకే విద్యుత్ సరఫరా అవుతుంది. బ్యాలెన్స్ అయిపోతే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. జిల్లాలో త్వరలో ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్లను బిగించేందుకు ట్రాన్స్‌కో అధికారులు సిద్ధమవుతున్నారు. దీంతో విద్యుత్ బకాయిలకు చెల్లుచీటి పడనుంది. అలాగే వినియోగదారులు వినియోగించే తీరులో మార్పుతో పాటు దుబారా తగ్గనుంది. మొదటి విడతగా ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో ఈ మీటర్లను బిగించనున్నారు. ఇందుకు సంబంధించి ట్రాన్స్‌కో అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఉన్న విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలని, చెల్లించిన వెంటనే ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్లు బిగించనున్నారని ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు జారీ చేశారు. మార్చి నాటికి ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్ల బిగింపు ప్రక్రియ పూర్తి చేయాలని సంబంధిత అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే సంగారెడ్డిలోని ట్రాన్స్‌కో స్టోర్స్‌కు ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు చేరుకున్నాయి. దుబారా తగ్గుదలకు.. ఫిబ్రవరి మొదటి వారంలో జిల్లాకు మొదట విడతగా 400 నుంచి 500 వరకు ప్రీపెయిడ్ మీటర్లు వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఇది వరకే ఈ మీటర్ల బిగింపు ప్రక్రియ విజయవంతమైనట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాల్లో సైతం ఈ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) నిర్ణయించింది. నిరంతర విద్యుత్ అందుబాటులోకి రావడంతో జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలతోపాటు గృహ విద్యుత్ వినియోగదారులు ఎడాపెడా విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్ దుబారా పెరుగుతుంది. దీనికితోడు వినియోగించిన విద్యుత్‌కు సంబంధించిన డబ్బులను ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు చెల్లించడం లేదు. నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవటంతో ట్రాన్స్కోపై విద్యుత్ బకాయిలు భారం పెరుగుతోంది. విద్యుత్ దుబారా, బకాయిలకు చెక్ పెట్టేందుకు వీలుగా ట్రాన్స్‌కో ప్రీపెయిడ్ మీటర్లు బిగించేందుకు సిద్ధం అవుతుంది. రీచార్జి చేసుకుంటేనే.. ప్రస్తుతం అన్ని సర్వీసుల్లో మెకానికల్ విద్యుత్ మీటర్లు ఉన్నాయి. మెకానికల్ విద్యుత్ మీటర్ల రీడింగ్ ఆధారంగా బిల్లులు వసూలు చేస్తోంది. ప్రతినెలా ప్రభుత్వ కార్యాలయాలు, గృహ విద్యుత్ వినియోగదారులకు బిల్లులు ఇచ్చినా వారు చెల్లించడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రీపెయిడ్ మీటర్ల బిగించాలని నిర్ణయం తీసుకుంది. విద్యుత్ వినియోగదారులు ప్రతినెలా సెల్‌ఫోన్ రీచార్జి తరహాలోనే ఇకపై విద్యుత్ మీటర్‌ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. కార్డులో బ్యాలెన్స్ ఉన్నంత వరకే విద్యుత్ సరఫరా అవుతుంది. బ్యాలెన్స్ అయిపోతే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. రూ.500 నుంచి రూ.5వేల విలువతో ప్రీపెయిడ్ విద్యుత్ కార్డులు అందుబాటులో ఉంటాయి. జిల్లాలో మొదట మీ సేవ కేంద్రాల్లో ప్రీపెయిడ్ విద్యుత్ రీచార్జి కార్డులను అందుబాటులో ఉంచనున్నారు. రూ.కోట్లలో పేరుకు పోయిన బకాయిలు జిల్లాలో విద్యుత్ బకాయిలు కోట్ల రూపాయలలో పేరుకుపోయి ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలులతో పాటు గృహ వినియోగదారులు, పరిశ్రమల నుంచి పెద్ద మొత్తంలో మొండి బకాయిలున్నాయి. గృహా విద్యుత్ బకాయిలు రూ.19 కోట్లు, పరిశ్రమలు రూ.2 కోట్లు, ప్రభుత్వ కార్యాలయాలు రూ.1.13 కోట్లు, పంచాయతీ బకాయిలు రూ.122 కోట్లు చెల్లించాల్సి ఉంది. దశల వారీగా.. జిల్లాలో దశలవారిగా ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను బిగించనున్నారు. మొదటి విడతగా ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో ప్రీపెయిడ్ మీటర్లు బిగించనున్నారు. ఇందుకోసం ఇప్పటి వరకు 931 కార్యాలయాలకు ట్రాన్స్‌కో అధికారులు నోటీసులు ఇచ్చారు. మెదక్ డివిజన్ పరిధిలో 627 ప్రభుత్వ కార్యాలయాలు, తూప్రాన్ డివిజన్ పరిధిలో 304 ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు అందజేశారు. ప్రీపెయిడ్ విద్యుత్‌మీటర్ల అమర్చేందుకు వీలుగా బకాయిలు రూ.1.13 కోట్లు ట్రాన్స్‌కో వసూలు చేయనుంది. డబ్బులు వసూలు అయిన వెంటనే ఈ మీటర్లను అమర్చనున్నారు. త్వరలోనే బిగిస్తాం జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో మొదటగా ఈ ప్రీపెయిడ్ మీటర్లు అమర్చుతాం. సంగారెడ్డిలోని ట్రాన్స్‌కో స్టోర్స్‌కు ఈ మీటర్లు ఇప్పడికే వచ్చాయి. త్వరలోనే జిల్లాకు మీటర్లు తీసుకువచ్చి బిగింపు ప్రక్రియ ప్రారంభిస్తాం. ప్రీ పెయిడ్ మీటర్లతో విద్యుత్ దుబారా తగ్గడంతోపాటు బకాయిల భారం తొలుగుతుంది. –శ్రీనాథ్, ట్రాన్స్‌కో ఎస్ఈ -
‘విద్యుత్’లో మరో 1,800 పోస్టులు
సాక్షి, హైదరాబాద్ వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)లో 1,800 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన జారీ కానుంది. సంస్థ పాలక మండలి సమావేశం అనంతరం మరో వారం పదిరోజుల్లో ఈ నియామక ప్రకటన జారీ చేయనున్నామని అధికారవర్గాలు తెలిపాయి. తెలంగాణ ట్రాన్స్‌కోలో 330 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), 174 సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 1,100 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టులు కలిపి మొత్తం 1,604 పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రకటన జారీ కాగా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో 150 ఏఈ, 500 జూనియర్ అసిస్టెంట్, 100 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (జేఏఓ) పోస్టులతో పాటు 2,000 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టుల భర్తీకి మరో వారంలో ప్రకటన రానున్న విçషయం తెలిసిందే. అయితే టీఎస్ఎన్పీడీసీఎల్లో జేఎల్ఎం పోస్టులు తప్ప మిగతా ఏఈ, సబ్ ఇంజనీర్, ఇతర కేటగిరీల పోస్టులను ప్రస్తుతానికి భర్తీ చేయడం లేదని అధికారవర్గాలు తెలిపాయి.