సాక్షి, హన్మకొండ: ఎన్‌పీడీసీఎల్‌లో ఊరు, పేరు లేకుండా ఫిర్యాదు అందుతుం ది. ఆపై ఉన్నతాధికారులు స్పందిస్తారు. విచారణ చేపడతారు. దీంతో ఉద్యోగులు బెం బేలెత్తిపోతున్నారు. అలాంటి ఫిర్యాదులను పరిశీలనకు, విచారణకు స్వీకరించాల్సిన అవసరం లేదని సెంట్రల్ విజిలెన్స్, స్టేట్ విజిలెన్స్ ఆదేశాలున్నా యి. అయినా కొందరు అధికారులు అత్యుత్సాహంతో విచారిస్తున్నారు. అవసరం లేకున్నా విచారణకు పిలుస్తున్నారు. ఖమ్మం జిల్లాలో టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ పరిధిలో రెండేళ్లలో 120 తప్పుడు ఫిర్యాదులు అందాయి.
చదవండి: (అడగండి అది మన హక్కు..పెట్రోల్ బంకుల్లో ఈ ఆరు సేవలు ఉచితం)
ఉద్యోగినులకు సంబంధాలు అంటగడుతూ..
టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ పరిధిలోని 16 జిల్లాల్లో తప్పుడు లేఖలు ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. చివరికి మహిళా ఉద్యోగులకు వివాహేతర సంబంధాలు అంటగట్టే స్థాయికి దిగజారారు. ప్రస్తుతం ఆకాశరామన్న ఉత్తరాలు టీఎస్ ఎన్‌పీడీసీఎల్ ఉద్యోగులు, అధికారుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ప్రధానంగా టీఎస్ ఎన్‌పీడీసీఎల్‌లోని యాంటీ పవర్ థెఫ్ట్ స్టేషన్ (ఏపీటీఎస్) అండ్ విజిలెన్స్ విభాగం అధికారులు తప్పుడు ఫిర్యాదులను అత్యుత్సాహంగా విచారిస్తుండటంతో ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు.
కాసుల కోసమేనా?
ఖమ్మం జిల్లా (సర్కిల్)లో డిప్యుటేషన్‌పై పోలీస్ శాఖ నుంచి వచ్చి ఇటీవల బదిలీ అయిన ఓ ఉన్నతాధికారి తప్పుడు ఫిర్యాదులను ఆసరాగా తీసుకొని బాధితులపై విచారణ చేపట్టినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. వారిని బెదిరించి అక్రమార్జనకు పాల్పడ్డారని విద్యుత్ ఉద్యోగుల నుంచి ఆరోపణలున్నాయి. ఖమ్మం జిల్లాలో విద్యుత్ ఉద్యోగులు గ్రూపులుగా విడిపోయి ఆకాశరామన్న ఉత్తరాల పేరుతో ఫిర్యాదు చేసుకోవడం పరిపాటైందని ఉద్యోగులు వాపోతున్నారు.
ఫిర్యాదులపై పట్టించుకోవద్దని ఆదేశాలున్నా..
ఇలాంటి ఫిర్యాదులను పట్టించుకోవద్దని సెంట్రల్ విజిలెన్స్ ఆదేశించింది. కోర్టు తీర్పులనూ ఉదహరించింది. అయినప్పటికీ కొందరు అధికారులు అత్యుత్సాహం చూపుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment