
ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్‌లో విషాదం నెలకొంది. తన చావుకు ఢీ షో డ్యాన్సర్ అభి కారణమంటూ కావ్య కల్యాణి(24)(Kavya Kalyani) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. తనని పెళ్ళి చేసుకొని తనతో కాపురం చేస్తూ ఇప్పుడు మరో యువతిని పెళ్ళి చేసుకుంటున్నట్లు కావ్యకళ్యాణి సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చింది.
'నా పేరు కావ్య. నేను చచ్చిపోబోతున్నాను. నా చావుకి కారణం అభి. ఐదు సంవత్సరాల నుంచి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి,తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇప్పుడేమో మరో అమ్మాయిని తీసుకొచి.. ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడు. నన్ను వెళ్లిపొమ్మన్నాడు. ఇప్పుడు నేను ఉరేసుకుంటున్నాను. సారీ అమ్మ.. సారీ డాడీ' అంటూ యువతి సెల్ఫీ వీడియో ద్వారా తెలిపింది.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment