సాక్షి, హైదరాబాద్/హన్మకొండ: ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎన్పీడీసీఎల్) 82 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 11 వరకు దరఖాస్తులను స్వీకరించ నుంది. ఆగస్టు 6 నుంచి హాల్‌టికెట్లను ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఆగస్టు 14న ఉదయం 10.30 నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు రాతపరీక్ష నిర్వహించనున్నారు.
ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అం డ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండి 18–44 ఏళ్ల వయసు గల అభ్య ర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో ఐదేళ్లు, శారీ రక వికలాంగులకు మరో 10 ఏళ్ల గరిష్ట వయో పరిమితి సడలింపు వర్తించనుంది. కొత్త జోన ల్ విధానం కింద టీఎస్‌ఎన్పీడీసీఎల్ పరిధి లోని 18 జిల్లాల అభ్యర్థులకు 95 శాతం పోస్టు లు రిజర్వ్ చేశారు. మిగిలిన 5 శాతం పోస్టుల ను ఓపెన్ కేటగిరీ కింద భర్తీ చేస్తారు. సంస్థ వెబ్‌సైట్ జ్టి్టp://్టటnpఛీఛి .ఛిజజ.జౌఠి.జీn ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment