Notification released
-
టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల
కేయూ క్యాంపస్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరం (2024–2025)లో ప్రవేశాలకుగాను ప్రవేశ పరీక్ష (టీ ఎస్‌ఐసెట్) నోటిఫికేషన్‌ను కాకతీయ యూనివర్సిటీ వీసీ, టీఎస్ ఐసెట్ చైర్మన్ తాటికొండ రమేశ్, కన్వినర్ ఆచార్య నర్సింహాచారి మంగళవారం విడుదల చేశారు. ఈ మేరకు హనుమకొండలోని యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలోని టీఎస్ ఐసెట్ కార్యాలయంలో తొలుత సెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 7వ తేదీనుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని వారు తెలిపారు. ఎస్సీ ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.550, ఇతరులు రూ.750 రుసుం చెల్లించి దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రూ.250 అపరాధ రుసుంతో మే 17వ తేదీ వరకు, రూ.500 అపరాధ రుసుంతో మే 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని వెల్లడించారు. దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే మే 17 నుంచి 20వ తేదీ వరకు మార్పులు చేసుకోవచ్చునని, మే 20వ తేదీనుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. టీఎస్ ఐసెట్‌ను జూన్ 4, 5వ తేదీల్లో నిర్వహిస్తారని చెప్పారు. ఈ ప్రవేశ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్టుగానే నిర్వహిస్తారని పేర్కొన్నారు. జూన్ 4న రెండు సెషన్లలో, 5న ఒక సెషన్లో ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. కాగా, జూన్ 15న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. జూన్ 16 నుంచి 19 మధ్య ప్రాథమిక కీలో వచ్చిన అభ్యంత రాలు స్వీకరిస్తారు. ఫలితాలను జూన్ 28న విడుదల చేస్తారు. కార్యక్రమంలో కేయూ రిజి్రస్టార్ పి.మల్లారెడ్డి, కామర్స్అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రొఫెసర్ పి.వరలక్ష్మి, డీన్ పి.అమరవేణి, బీఓఎస్ చైర్మన్ కట్ల రాజేందర్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.సదానందం, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ సీహెచ్ రాధిక పాల్గొన్నారు. -
తెలంగాణ గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం గ్రూప్-1 నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు ఓ ప్రకటనలో టీఎస్పీఎస్సీ పేర్కొంది. 563 పోస్టులకు టీఎస్పీఎస్సీ తిరిగి కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ పేర్కొంది. మళ్లీ అభ్యర్థులుందరూ.. కొత్త నోటిఫికేషన్‌కు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. మే లేదా జూన్‌లో ప్రిలిమినరీ పరీక్ష.. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మెయిన్స్ పరీక్ష జరగునున్నట్లు తెలుస్తోంది. ఇక.. అభ్యర్థుల వయోపరిమితిని తెలంగాణ ప్రభుత్వం 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది. చదవండి: తెలంగాణ పాత గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు -
యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ విడుదల
ఢిల్లీ: దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థుకుల గుడ్ న్యూస్. అఖిల భారత సర్వీసుల్లో 1,056 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్(CSE)-2024 పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC)బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు యూపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షకు నేటి నుంచి మార్చి 5వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష మే 26న, మెయిన్స్ అక్టోబర్ 19న నిర్వహించన్నుట్లు యూపీఎస్సీ పేర్కొంది. ఇది కూడా చదవండి: యూపీఎస్సీ సివిల్స్‌లో రాణించేందుకు నిపుణుల మెలకువలు అర్హత: భారతదేశంలోని సెంట్రల్ లేదా స్టేట్ లెజిస్లేచర్ చట్టం లేదా పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన ఇతర విద్యా సంస్థలు లేదా సెక్షన్-3 ప్రకారం విశ్వవిద్యాలయంగా పరిగణించబడుతున్నట్లు ప్రకటించబడిన ఏదైనా విశ్వవిద్యాలయాల డిగ్రీ యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ చట్టం, 1956, లేదా సమానమైన అర్హతను కలిగి ఉండాలి. వయోపరిమితి (01/08/24 నాటికి): 21 - 32 సంవత్సరాలు ఎన్ని సార్లు రాయొచ్చంటే: సాధారణ అభ్యర్థులు: 06 OBC అభ్యర్థులు: 09 SC/ST అభ్యర్థులు: పరిమితి లేదు పరీక్ష ప్రణాళిక: సివిల్ సర్వీసెస్ 2024 పరీక్ష రెండు వరుస దశలను కలిగి ఉంటుంది. మెయిన్ పరీక్షకు అభ్యర్థుల ఎంపిక కోసం సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్); మరియు వివిధ సర్వీసులు మరియు పోస్టుల్లో అభ్యర్థుల ఎంపిక కోసం సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష (వ్రాత మరియు ఇంటర్వ్యూ). -
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
-
ప్రశ్నోత్తరాలు లేకుండానే పార్లమెంటు ప్రత్యేక భేటీ
న్యూఢిల్లీ: ఈ నెల ద్వితీయార్థంలో జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు మరెన్నో రకాలుగా కూడా ప్రత్యేకంగా నిలవనున్నాయి. సెపె్టంబర్ 18–22 మధ్య ఐదు రోజుల పాటు వాటిని నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద జోషీ గురువారం ప్రకటించడం తెలిసిందే. ఉభయ సభల్లో సాధారణంగా ఉదయాన్నే చేపట్టే ప్రశ్నోత్తరాలు ఈ సమావేశాల్లో ఉండబోవు. అలాగే ప్రైవేట్ సభ్యుల బిల్లులు ప్రవేశ పెట్టేందుకు కూడా అవకాశం ఇవ్వబోరు. రాజ్యసభ, లోక్‌సభ సచివాలయాలు శనివారం ఈ మేరకు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. ‘17వ లోక్‌సభ 13వ సమావేశాలు సెపె్టంబర్ 18 సోమవారం మొదలవుతాయి. ఉభయ సభలు సభ్యులకు ఈ మేరకు సమాచారం ఇవ్వడం జరిగింది‘ అని లోక్‌సభ సచివాలయం; ‘రాజ్యసభ 261వ సమావేశాలు మొదలవుతాయి‘ అని రాజ్యసభ సచివాలయం వేర్వేరు బులెటిన్లలో పేర్కొన్నాయి. ఈ ప్రత్యేక సమావేశాల అజెండాను కేంద్రం ఇప్పటిదాకా గోప్యంగా ఉంచడం తెలిసిందే. ప్రత్యేక భేటీ కొత్త భవనంలో...? పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రస్తుత లోక్‌సభకు చివరివి అయ్యే అవకాశముందని భావిస్తున్నారు. భేటీ అనంతరం ఉభయ సభలు సభ్యులకు ప్రత్యేక గ్రూప్ ఫోటో సెషన్‌కు ఏర్పాట్లు జరుగుతుండటం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. అయితే ఈ సమావేశాలు కొత్త భవనంలో జరిగే అవకాశముందని కూడా అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇవి కొత్త భవనంలో జరిగే తొలి సమావేశాలు గనుక ఫోటో సెషన్ ఏర్పాటు చేస్తుండవచ్చని కూడా కొందరు అంటున్నారు. అత్యాధునిక రీతిలో సర్వ హంగులతో రికార్డు సమయంలో నిర్మితమైన పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గత మే 28న ప్రారంభించడం తెలిసిందే. ప్రత్యేక సమావేశాలు ఇలా... ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మొత్తం ఐదు సెషన్లు ఉంటాయి. సమావేశాలకు సంబంధించిన ప్రోవిజనల్ కేలండర్‌ను ఎంపీలకు విడిగా తెలియజేస్తారు. -
TSPSC: గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్. గ్రూప్-4 నోటిఫికేషన్‌ను గురువారం అధికారికంగా రిలీజ్ చేసింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. మొత్తం 9,168 పోస్టులకుగానూ నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. అగ్రికల్చర్, కో ఆపరేటివ్ శాఖలో 44 పోస్టులు, పశు సంవర్ధక శాఖ, డైరీ డెవలప్ మెంట్లో 2, బీసీ వెల్ఫేర్‌లో 307, పౌర సరఫరాల శాఖలో 72, ఆర్ధిక శాఖలో 255 మున్సిపల్, అర్బన్ డెవల్మెంట్ లో 2, 701 పోస్టులు, ఉన్నత విద్యా శాఖలో 742 పోస్టులు, రెవెన్యూ శాఖలో 2,077 ఎస్సీ వెల్ఫేర్ లో 474 పోస్టులకుగానూ నోటిఫికేషన్ విడుదల చేసింది. లేబర్ డిపార్ట్మెoట్ లో 128 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ లో 221 పోస్టులు, హోమ్ శాఖలో 133 పోస్టులు, పాఠశాల విద్యా శాఖలో 97 పోస్టులు ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నెల 23 నుంచి జనవరి 12వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొంది టీఎస్పీఎస్సీ. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. -
మోడల్ స్కూళ్లలో 282 టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 282 టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తారు. వీటిలో 71 ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), 211 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులున్నాయి. అభ్యర్థుల అర్హతలు, ఇతర ప్రాధమ్యాలను పరిగణనలోకి తీసుకొని ఇంటర్వ్యూల ద్వారా ఎంపికచేస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జోన్, కమ్యూనిటీ రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జోన్ల వారీగా సెలెక్షన్ కమిటీల ఆధ్వర్యంలో నియామకాలు జరుగుతాయి. టీజీటీ పోస్టులు జోన్ 1లో 17, జోన్ 3లో 23, జోన్ 4లో 31 ఉండగా పీజీటీ పోస్టులు జోన్ 1లో 33, జోన్ 2లో 4, జోన్ 3లో 50, జోన్ 4లో 124 ఉన్నాయి. అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను ‘హెచ్‌టీటీపీఎస్://సీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్’ వెబ్సైట్ ద్వారా సమర్పించాలి. ఇటీవలి పాస్‌పోర్టు సైజు ఫొటో, స్పెసిమన్ సిగ్నేచర్ స్కాన్డ్ కాపీలను స్పష్టంగా కనిపించేలా అప్లోడ్ చేయాలి. అభ్యర్థులకు 18 నుంచి 44 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లు. పీజీటీ పోస్టులకు రెండేళ్ల మాస్టర్ డిగ్రీలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టు మెథడాలజీలో బీఈడీ కోర్సు పూర్తి చేసి ఉండాలి. పీజీటీ కామర్స్ పోస్టులకు ఎం.కామ్ అప్లయిడ్ బిజినెస్ ఎకనమిక్స్ చేసిన వారు అర్హులు కారు. టీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు లేదా యూజీసీ గుర్తింపు ఉన్న కాలేజీల్లో డిగ్రీ కోర్సు పూర్తి చేసి 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులలో బీఈడీ తదితర ప్రొఫెషనల్ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అర్హతలు, వెయిటేజీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్లో పొందుపరిచింది. ఎంపికల అనంతరం నిబంధనల ప్రకారం అభ్యర్థులు నిర్ణీత కాంట్రాక్టు ఒప్పందాలను పూర్తిచేశాక నియామకాలు పొందుతారు. ఎప్పుడైనా డీఎస్సీ ద్వారా రెగ్యులర్ టీచర్లు నియామకమైతే వీరి కాంట్రాక్టు ఆటోమేటిగ్గా రద్దు అవుతుంది. -
ఆర్మీలో అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల
న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ నియామకాలకు నోటిషికేషన్ విడుదల చేసింది. అంతేగాక ఎయిర్‌ఫోర్స్, నేవీలో కూడా అగ్నివీర్ నియామకాల కోసం తేదీలను ప్రకటించింది. మంగళవారం ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్.. ఈనెల 24న ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇండియన్ ఆర్మీలో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ రోజు నుంచే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు అగ్నిపథ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. ఇదిలా ఉండగా ఓ వైపు అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనల జ్వాలలు రగులుతుంటే.. మరోవైపు కేంద్రం మాత్రం ఈ పథకం కింద నియామకాలపై తగ్గేదేలే అంటూ ముందుకు వెళ్తోంది. చదవండి: భారత్ బంద్ ఎఫెక్ట్: వందల సంఖ్యలో రైళ్లు రద్దు 📢 #Agniveer aspirants, get ready! Notification dates for recruitments under #AgnipathScheme 👇 🇮🇳 Indian Army @adgpi - June 20, 2022. 🇮🇳 Indian Navy @indiannavy - June 21, 2022. 🇮🇳 Indian Air Force @IAF_MCC - June 24, 2022.#AgnipathRecruitmentScheme #Agnipath #Agniveers pic.twitter.com/ZFPxcOZTcX — Ministry of Information and Broadcasting (@MIB_India) June 20, 2022 పథకం స్వరూపం... ►ఇది ఆఫీసర్ దిగువ ర్యాంకు సిబ్బంది (పీబీఓఆర్) నియామక ప్రక్రియ. ►త్రివిధ దళాలకు సంయుక్తంగా ఆన్లైన్ సెంట్రలైజ్డ్ విధానంలో ర్యాలీలు, క్యాంపస్ ఇంటర్వ్యూ తదితర మార్గాల్లో నాలుగేళ్ల కాలానికి నియామకాలు చేపడతారు. ►ఈ ఏడు 46,000 నియామకాలుంటాయి. 90 రోజుల్లో ప్రక్రియ మొదలవుతుంది. ►వయో పరిమితి 17.7–21 ఏళ్లు. ఆర్నెల్ల శిక్షణ, మూడున్నరేళ్ల సర్వీసు ఉంటాయి. ►త్రివిధ దళాల్లో ప్రస్తుతమున్న అర్హత ప్రమాణాలే వర్తిస్తాయి. ►సైన్యంలో ఇప్పటిదాకా జరుగుతున్న ప్రాంతాలు, కులాలవారీ నియామకాలకు భిన్నంగా ‘ఆలిండియా–ఆల్ క్లాస్’ విధానంలో రిక్రూట్మెంట్ ఉంటుంది. దీంతో రాజ్‌పుత్, మరాఠా, సిక్కు, జాట్ వంటి రెజిమెంట్ల స్వరూప స్వభావాలు క్రమంగా మారతాయి. ►విధుల్లో చేరేవారిని అగ్నివీర్‌గా పిలుస్తారు. వీరికి ప్రస్తుత ర్యాంకు లు కాకుండా ప్రత్యేక ర్యాంకులిస్తారు. ►వేతనం తొలి ఏడాది నెలకు రూ.30,000. రూ.21 వేలు చేతికిస్తారు. రూ.9,000 కార్పస్ నిధికి వెళ్తుంది. కేంద్రమూ అంతే మొత్తం జమ చేస్తుంది. నాలుగో ఏడాదికి రూ.40,000 వేతనం అందుతుంది. ►నాలుగేళ్ల సర్వీసు పూర్తయ్యాక రూ.11.71 లక్షల సేవా నిధి ప్యాకేజీ అందుతుంది. దీనిపై ఆదాయ పన్నుండదు. ►సర్వీసు కాలావధికి రూ.48 లక్షల ఉచిత జీవిత బీమా కవరేజీ ఉంటుంది. ►గ్రాట్యుటీ, పెన్షన్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు. ► ప్రతిభ, ఖాళీల ఆధారంగా 25 శాతం మందిని శాశ్వత సర్వీసుకు పరిగణనలోకి తీసుకుంటారు. ►మిగతా వారికి రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు రంగ నియామకాల్లో ప్రాధాన్యం. -
గుడ్‌న్యూస్! టీఎస్ఎన్పీడీసీఎల్లో 82 ఏఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్/హన్మకొండ: ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎన్పీడీసీఎల్) 82 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 11 వరకు దరఖాస్తులను స్వీకరించ నుంది. ఆగస్టు 6 నుంచి హాల్‌టికెట్లను ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఆగస్టు 14న ఉదయం 10.30 నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అం డ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండి 18–44 ఏళ్ల వయసు గల అభ్య ర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో ఐదేళ్లు, శారీ రక వికలాంగులకు మరో 10 ఏళ్ల గరిష్ట వయో పరిమితి సడలింపు వర్తించనుంది. కొత్త జోన ల్ విధానం కింద టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధి లోని 18 జిల్లాల అభ్యర్థులకు 95 శాతం పోస్టు లు రిజర్వ్ చేశారు. మిగిలిన 5 శాతం పోస్టుల ను ఓపెన్ కేటగిరీ కింద భర్తీ చేస్తారు. సంస్థ వెబ్సైట్ జ్టి్టp://్టటnpఛీఛి .ఛిజజ.జౌఠి.జీn ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. -
Postal Department: పదో తరగతి అర్హతతో 38926 ఉద్యోగాలు
భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన పోస్టల్ విభాగం దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ►మొత్తం పోస్టుల సంఖ్య: 38926 ►తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: తెలంగాణ–1226,ఆంధ్రప్రదేశ్–1716.»పోస్టుల వివరాలు: బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ఏబీపీఎం),డాక్ సేవక్. ►అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్థానిక భాషతోపాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. ►వయసు: 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. జీతభత్యాలు ►టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ (టీఆర్సీఏ) ప్రకారం జీతభత్యాలు చెల్లించాలి. ►బీపీఎం పోస్టులకు నాలుగు గంటల టీఆర్సీఏ సబ్ ప్లాన్ కింద నెలకు రూ.12000 చెల్లిస్తారు. ఏబీపీఎం/డాక్సేవక్ పోస్టులకు నాలుగు గంటల టీఆర్సీఏ సబ్ ప్లాన్ కింద నెలకు రూ.10000 చెల్లిస్తారు. ఎంపిక విధానం ►పదో తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ప్రకారం తుది ఎంపిక జరుగుతుంది. ►దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. ►దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.05.2022 ►దరఖాస్తులకు చివరి తేది: 05.06.2022 ►వెబ్సైట్: https://indiapostgdsonline.gov.in -
7 నుంచి ఎడ్‌సెట్ దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎడ్‌సెట్–2022కు ఈ నెల 7 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. అప్లికేషన్లను జూన్ 15లోగా, రూ. 500 పెనాల్టీతో జూలై 1 వరకూ పంపొచ్చని స్పష్టం చేశారు. ఇందుకు షెడ్యూల్‌ను సోమవారం తన కార్యాలయంలో ఆయన విడుదల చేశారు. ఎడ్‌సెట్ పరీక్ష జూలై 26, 27 తేదీల్లో 19 ప్రాంతీయ కేంద్రాల్లో జరుగుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 17, ఏపీలో విజయవాడ, కర్నూల్ ప్రాంతీయ కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ఉస్మానియా వర్సిటీ నేతృత్వంలో జరిగే ఎడ్‌సెట్‌కు ఫీజు రూ. 650 (ఎస్సీ, ఎస్టీలు, పీహెచ్‌లకు రూ. 450)గా నిర్ణయిం చినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన బీఈడీ కాలేజీలు 220 ఉన్నాయని, వీటిల్లో 19,600 సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. గతేడాది 33,683 మంది బీఈడీలో అర్హత సాధించారని తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ (హోం సైన్స్), బీఎస్సీ, బీసీఏ, బీబీఎం, బీఏ (ఓరియంటల్ లాంగ్వేజెస్), బీటెక్, బీబీఏ లేదా మాస్టర్ డిగ్రీని 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. ఆఖరి సంవత్సరం డిగ్రీ విద్యార్థులు కూడా బీఎడ్ సెట్ రాసేందుకు అర్హులే. ముఖ్యమైన తేదీలు దరఖాస్తుల స్వీకరణ -ఏప్రిల్ 7 నుంచి జూన్ 15 వరకు రూ. 500 పెనాల్టీతో -జూలై 1 వరకు ఫీజు వివరాలు -రూ. 650 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌లకు రూ. 450) పరీక్ష తేదీలు -జూలై 26, జూలై 27 -
న్యాయశాస్త్రంలో పీజీ డిప్లొమా నోటిఫికేషన్
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా వర్సిటీ న్యాయశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కొనసాగుతున్న 6 పీజీ డిప్లొమా సాయంకాలం (6 నుంచి 8 గం. వరకు) కోర్సుల్లో ప్రవేశాలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏడాది కాల వ్యవధితో 2సెమిస్టర్ పరీక్షలు గల ఈ పీజీ డిప్లొమా ప్రవేశాలకు 2022, జనవరి 2న ప్రవేశ పరీక్ష జరగనుంది. దీనికోసం ఈనెల 11 నుంచి నవంబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వర్సిటీ క్యాంపస్‌లో కాలేజీతోపాటు బషీర్‌బాగ్ పీజీ న్యాయ కళాశాలలో సైబర్ లా, టాక్సేషన్ అండ్ ఇన్సూరెన్స్, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపీఆర్), మోడ్రన్ కార్పొరేట్ లా, అప్లైడ్ హ్యూమన్ రైట్స్ పీజీ డిప్లొమాలో ప్రవేశాలకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని అధికారులు పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా 2021–22 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కన్వీనర్ అపర్ణ తెలిపారు. పూర్తి వివరాలకు 81066 78887కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. -
బద్వేల్, హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల
-
బద్వేలు ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా సబ్‌కలెక్టర్ కేతన్ గార్గ్‌ను ఈసీ నియమించింది. నోటిఫికేషన్ విడుదల కావడంతో జిల్లా వాప్యంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అక్టోబర్ నెల 8 తేదీ నామినేషన్ల ప్రక్రియకు చివరి తేదీగా నిర్ణయించారు. 11న నామినేషన్ల పరిశీలన ఉండగా 13న ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కోవిడ్ నిబంధనల అమలు నేపథ్యంలో బహిరంగ సభకు 1,000 మందికి మించి అనుమతించబోమని ఎన్నికల అధికారులు తెలిపారు. బద్వేలు పరిధిలో 272 పోలింగ్ స్టేషన్లు... 2,12,739 మంది ఓటర్లు బద్వేలు నియోజకవర్గ పరిధిలోని బద్వేలు, గోపవరం, అట్లూరు, బి.కోడూరు, పోరుమామిళ్ల, కాశినాయన, కలసపాడు మండలాల పరిధిలో 272 పోలింగ్ స్టేషన్లు ఉండగా వాటి పరిధిలో జనవరి, 2011వ తేదీ నాటికి 2,12,739 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,06,650 మందికాగా 1,06,069 మంది మహిళలు ఓటర్లుగా ఉన్నారు. తాజాగా కొత్త ఓటర్ల జాబితా వెలువడనుంది. ఆమేరకు ఉప ఎన్నిక జరగనుంది. చదవండి: (Badvel Bypoll: ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే...) -
హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ వివరాలను హుజూరాబాద్ ఆర్డీఓ రవీందర్ రెడ్డి వెల్లడించారు. నేటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తామని వివరించారు. కోవిడ్ నేపథ్యంలో నామినేషన్ కేంద్రంలో కోవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. నామినేషన్ కేంద్రం వద్ద 144 సెక్షన్ రెండు అంచెల భద్రత ఏర్పాటు చేశారు. చదవండి: వ్యాక్సిన్ వేసుకుంటే డబ్బు ఇస్తాం.. వృద్ధురాలిపై అమానుషం నేటి ఉదయం 11 నుంచి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8. అక్టోబర్ 11న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13. కాగా, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే తొలిరోజు ఎవరూ నామినేషన్లు వేసేటట్టు కనిపించడం లేదు. మంచి రోజు చూసుకుని అభ్యర్థులు నామినేషన్ దాఖలుకు వచ్చేటట్టు ఉన్నారు. ఈ నెల 30వ తేదీన పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. చదవండి: పేరుకు ఊరి సర్పంచ్.. చేసేది గంజాయి సరఫరా -
AP: ఏపీ పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పీజీ కోర్సులలో ప్రవేశ పరీక్షలకి ఉన్నత విద్యా మండలి పీజీ సెట్ నిర్వహిస్తోంది. కడప యోగి వేమన యూనివర్సిటీ పీజీ సెట్‌ను నిర్వహణా బాధ్యతలు చేపట్టింది. అందులో భాగంగా ఏపీ పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి(బుధవారం) నుంచి ఆన్లైన్లో ధరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. చదవండి: AP: నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఓసీ విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.850, బీసీలకి రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌లకు రూ.650గా ఫీజు నిర్ణయించింది. ఆన్లైన్లో ధరఖాస్తుల స్వీకరణకి సెప్టెంబర్ 30వ తేదీ తుది గడువుగా పేర్కొంది. రూ. 200 అదనపు రుసుముతో అక్టోబర్ నాలుగు వరకు గడువు ఉన్నట్లు తెలిపింది. రూ.500 అదనపు రుసుముతో అక్టోబర్ 8 వరకు తుది గడువు ఉన్నట్లు పేర్కొంది. అక్టోబర్ 22వ తేదీన పీజీ సెట్ పరీక్ష జరగనుంది. -
విశాఖ ‘శాయ్’లో ప్రవేశాలు
విజయవాడ స్పోర్ట్స్: విశాఖపట్నంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) కేంద్రంలో బాక్సింగ్, వాలీబాల్ క్రీడల్లో శిక్షణ తీసుకునేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) వైస్ చైర్మన్, ఎండీ ప్రభాకరరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దీనిలో భాగంగా 10 నుంచి 16 ఏళ్ల వయసు కలిగిన బాలబాలికలకు వాలీబాల్, బాక్సింగ్‌ల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. వాలీబాల్ శిక్షణకు హాజరయ్యేవారు ఈ నెల 21, 22 తేదీల్లో, బాక్సింగ్ శిక్షణకు హాజరు కావాలనుకునేవారు ఈ నెల 23, 24 తేదీల్లో విశాఖపట్నం పోర్టు స్టేడియంలో జరిగే ఎంపిక పోటీలకు రావాలని సూచించారు. జనన ధ్రువీకరణ పత్రం, విద్యార్హత, ఆరు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్‌కార్డ్, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇంతకుముందు పాల్గొన్న క్రీడల సర్టిఫికెట్లు తీసుకురావాలని కోరారు. మరిన్ని వివరాలకు 8247443921 (బాక్సింగ్), 9440587614 (వాలీబాల్) నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. ఈ శిక్షణ కేంద్రంలో అర్హత కలిగిన కోచ్‌లు, ట్రైనీలతో శిక్షణ ఇస్తామన్నారు. అలాగే పౌష్టికాహారం, అత్యాధునిక సదుపాయాలు కలిగిన కిట్లు, విద్య, వైద్య, బీమా సౌకర్యాలను ప్రభుత్వం సమకూర్చుతుందన్నారు. -
15 నుంచి తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు ఈ నెల 15న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ పదిహేడో సమావేశాల నోటిఫికేషన్‌ను శాసనసభ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు మంగళవారం విడుదల చేశారు. 15న ఉదయం 11 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇరు సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇటీవల మరణించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 16న సంతాపం ప్రకటిస్తారు. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభలు వేర్వేరుగా సమావేశమవుతాయి. 18న ఉదయం 11.30కు తెలంగాణ 2021–22 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశముంది. అయితే బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీ, సమయంతోపాటు ఉభయ సభలను ఎన్నిరోజుల పాటు నిర్వహించాలనే దానిపై ఈ నెల 16న జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది. భౌతిక దూరం, కోవిడ్ నిబంధనలతో.. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో.. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల తరహాలోనే ఇప్పుడు కూడా భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేయనున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. సమావేశాల నిర్వహణ తీరుతెన్నులకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగే భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన సమావేశంలో సభ్యుల మధ్య దూరం ఉండేలా అదనపు సీట్లు ఏర్పాటు చేశారు. అందరికీ కరోనా పరీక్షలు తప్పనిసరి చేశారు. గ్యాలరీ పాసులను రద్దు చేయడంతోపాటు మీడియాకు పరిమిత సంఖ్యలో పాసులు ఇచ్చారు. ఈసారి కూడా అవే తరహా నిబంధనలను పాటించే అవకాశం ఉంది. -
14,061 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్లో 14,061 ఉద్యోగాల భర్తీకి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు శనివారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 31వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులకు తుది గడువు అని అధికారులు చెప్పారు. గత ఏడాది ఆగస్టు–సెప్టెంబరులో దాదాపు 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఆ నోటిఫికేషన్లలో పోస్టుల వారీగా పేర్కొన్న విద్యార్హతలే ఇప్పుడు కూడా వర్తిస్తాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే సర్వీసులో ఉన్న అభ్యర్థులకు కొన్ని ఉద్యోగాల విషయంలో 10 శాతం మార్కుల వెయిటేజీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల్లో పోస్టుల భర్తీకి రాత పరీక్షను మార్చి తర్వాత నిర్వహించే అవకాశం ఉందన్నారు. నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టుల సంఖ్య పెరిగే వీలుందన్నారు. దరఖాస్తులు చేసుకోవాల్సిన వెబ్సైట్లు: gramasachivalayam.ap.gov.in,vsws.ap.gov.in,wardsachivalayam.ap.gov.in వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టులు రాష్ట్రంలో పట్టణాలు, నగరపాలక సంస్థల పరిధిలో వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. వార్డు సచివాలయాల్లో మొత్తం 2,146 ఉద్యోగాల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. శనివారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 31. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్ నిబంధనల మేరకు పోస్టులను భర్తీ చేస్తారు. పూర్తి సమాచారం గ్రామ, వార్డు సచివాలయాల వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ విజయ్‌కుమార్ చెప్పారు. దరఖాస్తుకు వెబ్సైట్లు: wardsachivalayam.ap.gov.in, gramasachivalayam.ap.gov.in -
వైద్య ఫీజులకు ముకుతాడు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల్లో ఫీజులను ఇకపై ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ నిర్ణయించనుంది. ఈమేరకు కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, సూపర్ స్పెషాలిటీ కోర్సులు నిర్వహించే వైద్య కళాశాలలతోపాటు యూజీ, పీజీ డెంటల్ కాలేజీలు, ఆయుష్ కోర్సులు నిర్వహించే కాలేజీలు, యూజీ, పీజీ, డిప్లొమో నర్సింగ్ కాలేజీలు, పారా మెడికల్ కాలేజీల ఫీజులను కమిషన్ నిర్ణయిస్తుందని తెలిపారు. కమిషన్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ భార్గవరామ్, కార్యదర్శి ఎన్.రాజశేఖరరెడ్డితో కలసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు విద్యా సంవత్సరాలకు ఫీజులు ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ప్రొఫెషనల్ వైద్య విద్యాసంస్థలన్నీ ఈనెల 27వతేదీ నుంచి ఫిబ్రవరి 29వ తేదీ లోగా ఫీజుల ప్రతిపాదనలను కమిషన్‌కు సమర్పించాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య పేర్కొన్నారు. 2020–21, 2021–22, 2022–23 విద్యా సంవత్సరాలకు ఫీజులను కమిషన్ నిర్ణయిస్తుందని వివరించారు. విద్యాసంస్థలు 2017–18, 2018–19 విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఆడిట్ ఫైనాన్సియల్ నివేదికలు, ఇతర సమాచారాన్ని నిర్ణీత ప్రొఫార్మాలో కమిషన్‌కు https:// aphermc.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సమర్పించాలి. ఫీజులను ప్రతిపాదించకపోయినా, స్పందించకపోయినా ఫీజుల వసూలుకు అనుమతించబోమని కమిషన్ చైర్మన్ స్పష్టం చేశారు. డిగ్రీ, పీజీ కాలేజీల ఫీజులను కూడా ఇకపై కమిషనే నిర్ణయిస్తుందని, వాటికి వచ్చే వారంలో నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. ఇంజనీరింగ్, బీఈడీ, ఫార్మా కాలేజీల్లో ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయని, అనంతరం ఫీజులపై నిర్ణయం ఉంటుందని తెలిపారు. ఫీజులు తగ్గుతాయా? పెరుగుతాయా? అనేది ఆయా కాలేజీల్లో వసతులు, సిబ్బంది, విద్యార్థుల సంఖ్య, హాజరు, ఉత్తీర్ణత వాస్తవిక స్థితిని బట్టి ఉంటుందని చెప్పారు. బయోమెట్రిక్, జియో ట్యాగింగ్.. ప్రతి కాలేజీలో విద్యార్ధులు, సిబ్బంది హాజరుకు బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరి చేయడంతోపాటు జియో ట్యాగింగ్ ద్వారా ప్రభుత్వ సర్వర్‌కు అనుసంధానం చేయిస్తామని కమిషన్ చైర్మన్ తెలిపారు. యూజీసీ కూడా ఫీజులను ఆయా ప్రాంతాలు, ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులు, కాలేజీల్లో వసతులు, బోధనా ప్రమాణాలు అనుసరించి వేర్వేరుగా ఉండాలని నిర్ణయించినందున కామన్ ఫీజు అన్నది ఉండదన్నారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ తదితర కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లకు నిర్ణీత ఫీజు కంటే నాలుగైదు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నందున ఆ మేరకు కన్వీనర్ కోటా సీట్లలో ఫీజులను తగ్గించుకోవాలని యాజమాన్యాలకు సూచిస్తున్నామన్నారు. తప్పుడు నివేదికలిస్తే ప్రొఫెసర్లపైనా చర్యలు కాలేజీల్లో తనిఖీలు చేసి కమిటీలు ఇస్తున్న రిపోర్టులు తప్పుల తడకగా ఉంటున్నట్లు ఫిర్యాదులున్నాయని, ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రొఫెసర్లతో పాటు ఆయా వర్సిటీలపై చట్టపరమైన చర్యలు తప్పవని కమిషన్ చైర్మన్ హెచ్చరించారు. యూనివర్సిటీలు అఫ్లియేషన్ కోసం ఇచ్చే నివేదికలను కమిషన్‌కు కూడా అందించాలన్నారు. గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు కొన్ని కాలేజీలు ‘జగనన్న విద్యాదీవెన’ కింద ఇచ్చే రూ.20 వేలు తమకే ఇవ్వాలని విద్యార్ధులపై ఒత్తిడి తెస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి కళాశాలలపై చర్యలు తప్పవని కమిషన్ చైర్మన్ స్పష్టం చేశారు. ఇలాంటి అంశాలపై grievanceaphermc@gmail. com మెయిల్ ద్వారా కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు. 08645 274445 నంబర్‌కు ఫోన్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. లేఖ ద్వారా పంపే ఫిర్యాదులను ‘కమిషన్ కార్యదర్శి, ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్, రెగ్యులేటరీ, మానిటరింగ్ కమిషన్, థర్డ్ ఫ్లోర్, శ్రీమహేంద్ర ఎన్క్లేవ్, తాడేపల్లి, గుంటూరు జిల్లా’ చిరునామాకు పంపాలన్నారు. రీయింబర్స్మెంట్ కోసం అక్రమాలు ‘కొన్ని చోట్ల మినహా పలు కాలేజీల్లో వసతులు లేవు. విద్యార్థులు రికార్డుల్లో మాత్రమే ఉన్నారు. కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల కోసమే కొన్నిటిని కొనసాగిస్తున్నట్లు కనిపించింది’ అని జస్టిస్ ఈశ్వరయ్య పేర్కొన్నారు. రీయింబర్స్మెంట్ కోసం ఇంటర్ పాసైన విద్యార్ధుల సర్టిఫికెట్లను దళారీల ద్వారా తెప్పించి రికార్డుల్లో చూపుతున్నారన్నారు. మైనార్టీ కాలేజీల్లో ఇకపై నాన్ మైనార్టీ విద్యార్థులను ఎంసెట్ ద్వారా చేర్చుకుంటేనే రీయింబర్స్మెంట్ ఇవ్వాలని సిఫార్సు చేస్తున్నామని వివరించారు. -
మే 3 నుంచి ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్ డిగ్రీ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్–2019 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 6 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. శనివారం జేఎన్టీయూహెచ్లో జరిగిన ఎంసెట్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మే 3నుంచి ఆన్లైన్లో ఎంసెట్ నిర్వహిస్తున్నామని, ఇందుకోసం టీఎస్టీఎస్, టీసీఎస్ సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 18 పరీక్ష జోన్లుగా విభజించి 54 పరీక్షా కేంద్రాల్లో ఎంసెట్ నిర్వహిస్తున్నామని, తెలంగాణలో 15 జోన్లు, ఆంధ్రప్రదేశ్‌లో 3 జోన్లు ఉన్నాయన్నారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి హాజరు కావాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆన్లైన్లో మాక్ టెస్ట్‌కు అవకాశం కల్పించామని, ఇందుకు సెట్ వెబ్సైట్ చూడాలన్నారు. ఆన్లైన్ దరఖాస్తులు, విద్యార్థుల సంఖ్య ఆధారంగా పరీక్షా కేంద్రాలను ఖరారు చేస్తామని పాపిరెడ్డి చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు ఇబ్బంది కలగకుండా పరీక్షలు నిర్వహిస్తామని, ప్రస్తుతం ప్రకటించిన పరీక్షల తేదీల్లో ఎన్నికల తేదీలు ఉంటే వాటిని మార్చే అవకాశం ఉంటుందన్నారు. గతేడాది 2.40 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఈసారి మరో 10 వేల వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఇదీ ఎంసెట్ షెడ్యూల్... ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 06–03–2019 దరఖాస్తుల స్వీకరణ గడువు: 05–04–2019 దరఖాస్తులో తప్పుల సవరణ: 06–04–2019 నుంచి 09–04–2019 రూ. 500 అపరాధ రుసుముతో గడువు: 11–04–2019 రూ. 1000 అపరాధ రుసుముతో గడువు: 17–04–2019 ఆన్లైన్లో హాల్‌టికెట్లు జనరేట్ అయ్యే తేదీ: 18–04–2019 హాల్‌టికెట్ల డౌన్లోడ్ ప్రారంభం తేదీ: 20–04–2019 హాల్‌టికెట్ల డౌడ్‌లోడ్‌కు చివరి తేదీ: 01–05–2019 రూ. 5,000 అపరాధ రుసుముతో దరఖాస్తు సమర్పణ గడువు: 24–04–2019 రూ. 10,000 అపరాధ రుసుముతో దరఖాస్తు సమర్పణ గడువు: 28–04–2019 పరీక్ష తేదీలు: ఇంజనీరింగ్ స్ట్రీమ్- మే 3, 4, 6 అగ్రికల్చర్, ఫార్మసీ- మే 8, 9 పరీక్ష సమయం: మార్నింగ్ సెషన్: ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆఫ్టర్నూన్ సెషన్: మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రిజిస్ట్రేషన్ ఫీజు: కేటగిరీ ఫీజు వివరాలు ఇంజనీరింగ్ ఎస్సీ, ఎస్టీలకు రూ. 400, ఇతరులకు రూ. 800 అగ్రికల్చర్, ఫార్మసీ ఎస్సీ, ఎస్టీలకు రూ. 400, ఇతరులకు రూ. 800 రెండు కేటగిరీలకు ఎస్సీ, ఎస్టీలకు రూ. 800, ఇతరులకు రూ. 1,600 -
టీఎస్ జెన్కో నోటిఫికేషన్ జారీ
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) 33 ఖాళీలు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (జేఏఓ) 42 ఖాళీల భర్తీకి టీఎస్జెన్కో శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) పోస్టులకు ఎంబీఏ(హెచ్ఆర్)/ఎంఎస్‌డబ్ల్యూ/పర్సనల్ మేనేజ్మెంట్/హ్యూమన్ రైట్స్/లా కోర్సులో 2 సంవత్సరాల డిప్లొమా డిగ్రీ అర్హత కలిగి ఉండి, 8సంవత్సరాల అనుభవం ఉండాలి. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు గుర్తింపు పొందిన ఏదేని యూనివర్సిటీ నుంచి ఎంకాం ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత/బీకాం ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత/ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నుంచి ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి. ఈ రెండు కేటగిరీలకు ఏప్రిల్ 13 నుంచి ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. ఫీజు చెల్లింపునకు మే 9 చివరితేది. దరఖాస్తుల స్వీకరణకు చివరితేది మే 10. హాల్‌టికెట్‌ను మే 20వతేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 27న పరీక్ష నిర్వహించనున్నారు. వివరాలకు వెబ్సైట్ www.tsgenco.co.in లో సంప్రదించవచ్చు. -
ఏపీలో మరో రెండు ట్రిపుల్ ఐటీలు
► ఒంగోలు, శ్రీకాకుళంలో ఏర్పాటు ► వారం రోజుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ ► రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అమరావతి : ఈ విద్యాసంవత్సరం నుంచే కొత్తగా మరో రెండు ట్రిపుల్ ఐటీలను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఒంగోలు, శ్రీకాకుళంలలో ఏర్పాటు చేస్తున్న ఈ ట్రిపుల్ ఐటీలకు సంబంధించి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయనుందని, ఆ వెంటనే ఈ రెండు కేంద్రాలకు సంబంధించి అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను మంత్రి శుక్రవారం విజయవాడలో విడుదల చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ట్రిపుల్ ఐటీలకు మంచి స్పందన ఉందని, ఇందులో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థుల్లో 60 శాతం మందికి క్యాంపస్ నియామకాలు లభిస్తున్నాయన్నారు. దీంతో మరో రెండు కొత్త కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ఈ విద్యాసంవత్సరానికి ఒంగోలు కాలేజీకి ఎంపికైన వారికి ఇడుపులపాయలో, శ్రీకాకుళం కళాశాలకు ఎంపికైన వారికి నూజివీడులో తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 1 నుంచి తరగతులు నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ల కోసం 15,974 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 13,546 అర్హమైనవిగా ఉన్నట్లు తెలిపారు. ఇందులో రిజర్వేషన్ల ప్రకారం కటాఫ్ మార్కులను నిర్ణయించి నూజివీడు కాలేజీకి 1,230 మందిని, ఇడుపులపాయకు 721 మందిని ఫేజ్1లో ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కాలేజీలకు జూలై 20 నుంచి కౌన్సెలింగ్ మొదలవుతుంది. ఫేజ్2 జాబితాను జూలై 23న విడుదల చేసి వారికి కౌన్సెలింగ్ 29తో పూర్తి చేస్తామన్నారు. జూలై 30లోగా విద్యార్థులు కాలేజీల్లో చేరాల్సి ఉంటుందని, ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని మంత్రి వివరించారు. ఇంజినీరింగ్ ఫీజులు ఖరారు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, ఫార్మసీ ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారుచేసింది. ఈ నెల 27 నుంచి ఇంజినీరింగ్ క్లాసులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, ఫీజుల నిర్ణయంపై ఆలస్యం కావడంతో జూలై 1కి వాయిదా వేసినట్లు మంత్రి తెలిపారు. కొత్తగా నిర్ణయించిన కాలేజీ ఫీజుల వివరాలు శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఫీజుల ఆధారంగా వెబ్ ఆప్షన్లో కాలేజీలను మార్చుకోవడానికి జూన్ 26 సాయంత్రం ఆరుగంటల వరకు సమయాన్ని ఇచ్చారు. జూన్ 27 ఉదయం 8 గంటల నుంచి సీట్ల కేటాయింపు మొదలై జూన్ 28 మధ్యాహ్నం ఒంటిగంటతో పూర్తవుతుందన్నారు. అదేరోజు సాయంత్రానికి ఎంపికైన విద్యార్థుల జాబితాను విడుదల చేస్తామని, జూన్ 29న నుంచి విద్యార్థులు కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. జూలై 1 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని మంత్రి వివరించారు. -
రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్‌ను మంగళవారం ఉదయం అధికారులు విడుదల చేశారు. తెలంగాణలో 2, ఏపీలో 4 రాజ్యసభ సీట్లకు ఎన్నిక జరగనుంది. నేటి నుంచి మే31 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూన్ 11న ఎన్నిక జరుగును. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరుపుతారు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలకు చెందిన 57 సీట్లకు ఎన్నిక జరుగును. పదవీ విరమణ చేస్తున్న వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్(బీజేపీ), జైరాం రమేశ్, జేడీ శీలం(కాంగ్రెస్), సుజనా చౌదరి(టీడీపీ), తెలంగాణ నుంచి గుండు సుధారాణి(ప్రస్తుతం టీఆర్ఎస్), వి.హనుమంతరావు( కాంగ్రెస్) ఉన్నారు. వీరితో పాటు కర్ణాటక నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడి పదవీకాలం జూన్ 30తో పూర్తవుతుంది. -
563 ఏఈ పోస్టులకు నోటిఫికేషన్
అక్టోబరు 25న రాత పరీక్ష హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 563 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామీణ నీటి సరఫరా విభాగం, రోడ్లు భవనాల శాఖ, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. టీఎస్పీఎస్సీ తొలి నోటిఫికేషన్లో 770 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల (ఏఈఈ) భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసిన కమిషన్ గురువారం ఏఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. బుధవారం టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అధ్యక్షతన జరిగిన కమిషన్ సమావేశంలో ఈ నోటిఫికేషన్ జారీకి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులను ఈనెల 29వ తేదీ నుంచి వచ్చే నెల 28వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఆన్లైన్లో టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు ముందుగా వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఆ తరువాత దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 25వ తేదీన రాత పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. -
ఐసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఐసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను జారీచేసినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఐసెట్‌లో అర్హత సాధించిన 58,037 మంది విద్యార్థులకు ఈ నెల 27 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడతామని పేర్కొన్నారు. వెరిఫికేషన్ చేయించుకున్న విద్యార్థులు 28 నుంచి 31వరకు వెబ్ ఆప్షన్లను tsicet.nic.in వెబ్సైటల్లో ఇచ్చుకోవచ్చన్నారు. విద్యార్థులకు వచ్చే నెల 2న సాయంత్రం 6 గంటలకు సీట్లు కేటాయిస్తామని వివరించారు. ఇదీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ షెడ్యూలు.. ⇒ 27న 1 నుంచి 15 వేల ర్యాంకు వరకు ⇒ 28న 15,001 నుంచి 30 వేల ర్యాంకు వరకు ⇒ 29న 30,001 నుంచి 45 వేల ర్యాంకు వరకు ⇒ 30న 45,001 నుంచి చివరి ర్యాంకు వరకు. -
ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
కాకినాడ సిటీ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ వెల్లడించారు. ఈ ఎన్నికకు సంబంధించి ఈ నెల 16 వరకు నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. ఎన్నికల షెడ్యూల్ అంశంపై కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జిల్లాస్థాయి ప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ సెలవు రోజులు మినహా అన్ని పని దినాల్లో 16 వరకు కలెక్టరేట్లో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారిగా తాను లేని పక్షంలో సహాయ రిటర్నింగ్ అధికారిగా డీఆర్ఓ నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. 17న నామినేషన్ల పరిశీలన, 19 లోపు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. జూలై 3న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూలై 7న ఉదయం 8 గంటలకు కలెక్టరేట్ బెన్నెట్ క్లబ్లో నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి రాష్ట్రంలో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరై ఉండి 35 ఏళ్లకు పైబడిన వయసు ఉండాలని స్పష్టం చేశారు. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఫారం-26లో నోటరైజ్డ్ అఫిడవిట్‌ను ఇవ్వాలన్నారు. జనరల్ అభ్యర్థులైతే రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే కుల ధ్రువీకరణ పత్రంతో పాటు రూ.5 వేల ధరావత్తు చెల్లించాలన్నారు. నియమావళి పాటించాలి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పక పాటించాలని రాజకీయ పార్టీలకు రిటర్నింగ్ అధికారి, జేసీ సత్యనారాయణ సూచించారు. ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే లౌడ్ స్పీకర్లకు, వాహనాలకు పోలీస్ అధికారుల అనుమతి ఉండాలన్నారు. రాజకీయ పార్టీలు, పోటీచేసే అభ్యర్థులు, ప్రచురించే పోస్టర్లు, కరపత్రాల ముద్రణకు సంబంధించి నియమాలను తప్పక పాటించాలన్నారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి శెట్టిబత్తుల రాజబాబు, సీపీఎం కాకినాడ నగర కార్యదర్శి పలివెల వీరబాబు, టీడీపీ జిల్లా నాయకులు మందాల గంగసూర్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు విలియం హేరీ, బీఎస్పీ నాయకులు చొల్లంగి వేణుగోపాల్, డీఆర్వో బి.యాదగిరి, రాజమండ్రి అర్బన్ అడిషనల్ ఎస్పీ శరత్‌బాబు, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ కె.సుబ్బారావు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
విజయనగరం కంటోన్మెంట్: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ను జేసీ, రిటర్నింగ్ అధికారి రామారావు మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా తన చాంబర్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ను పక్కాగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన విధివిధానాల గూర్చి డివిజన్, మండల స్థాయిల్లో ప్రతి ఒక్కరికీ తెలిసేలా అవగాహన కల్పిస్తామని, ఎన్నికల అధికారులకు అప్పగించిన బాధ్యతలపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. నామినేషన్లు ప్రారంభం నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకూ ప్రతీ అంశం ఎన్నికల సంఘం సూచనల ప్రకారం జరుగుతుందన్నారు. సమస్యలు ఉత్పన్నమైతే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. 16వ తేదీ వరకూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. జూన్ 17న నామినేషన్ల పరిశీలన, 19న మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని చెప్పారు. జూలై 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఏడవ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. పదో తేదీ నాటికి ఎన్నికల విధులు పూర్తవుతాయని ఆయన చెప్పారు. మొత్తం జిల్లాలో 719 ఓటర్లు ఉన్నారన్నారు. ఎన్నికల కోడ్ అమలు బాధ్యతను జెడ్పీ సీఈఓ జిల్లా వ్యాప్తంగా చేపడతారన్నారు. మండలాల్లో ఎంపీడీఓలు, డివిజన్లలో ఆర్డీఓలు, మున్సిపాలిటీల్లో కమిషనర్లు ఎన్నికల కోడ్ అమలు బాధ్యత వహిస్తారన్నారు. సహాయ రిటర్నింగ్ అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి వ్యవహరిస్తారన్నారు. -
హమ్మయ్య..! ఇప్పటికైనా కరుణించారు
ఎచ్చెర్ల క్యాంపస్: ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ కౌన్సెలింగ్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంసెట్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ సైతం కన్వీనర్ జారీ చేశారు. మేలో ఎంసెట్ ఫలితాలు ప్రకటించగా ,ఆగస్టు 1 నుంచి ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభంకావాలి.అయితే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ఫీజు రీయింబర్స్మెంట్ వివాదం, 1956ను స్థానికతకు తెలంగాణ ప్రామాణికంగా తీసుకోవటం వలన తీవ్ర జాప్యం అవుతూ వచ్చింది. ఈ నేపధ్యంలో వివాదాలు కొనసాగుతున్నా అకడమిక్ ఏడాదిలో జాప్యం, ఎంసెట్ రాసిన విద్యార్థులు ఇతర రాష్ట్రాకు వలస వెళ్లిపోవటం, విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో ఉన్నత విద్యామండలి దిగొచ్చింది. ఈ ఏడాది కూడా కౌన్సెలింగ్ వెబ్ పద్దతిలోనే నిర్వహించనున్నారు. జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ పురుషుల కళాశాలలో సహాయ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. గత ఏడాది ముందుగా పాలిటెక్నిక్ కళాశాలలో సహాయ కేంద్రం ఏర్పాటు చేయగా, సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో లెక్చరర్లు విధులు బహిష్కరించడంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో నిర్వహించారు. మళ్లీ ఇక్కడ విద్యార్థి జేఏసీ నాయకులు, విద్యార్థులు ఉద్యమంలో భాగంగా అడ్డుకోవటంతో పాలిటెక్నిక్ కళాశాలలోని సహాయ కేంద్రంలో వర్సిటీ సిబ్బంది వచ్చి కౌన్సెలింగ్ నిర్వహించారు. గత ఏడాది చివరకు 3950 మంది విద్యార్థులు ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరయ్యారు. గత ఏడాది ఆందోళనలు నేపధ్యంలో విజయనగరం, విశాఖపట్నం తదితర జిల్లాల నుంచి సైతం విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఈ ఏడాది ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీం 4850 మంది రాశారు. మూడు వేలకు తక్కువ లేకుండా విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో 13 జిల్లాలో 34 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు.అయితే జిల్లాలో రెండు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు గతంలో అధికారులు తెలిపారు.అయితే ఈ ఏడాది కూడా ఒకే సహాయ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. గతంలో విద్యార్థులు సహాయ కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయ్యాక ఇంటర్నెట్ సెంటర్లలలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేవారు. పవేట్ కళాశాలల వత్తిడి, పాస్వర్డ్ హ్యాకింగ్, స్క్రాచ్కార్డ్పై సీక్రేట్ పాస్వర్డ్ ప్రవేట్ యాజమాన్యాలకు తెలిసి పోవటం, మరో పక్క ప్రవేట్ యూజమాన్యాలే నెట్ సెంటర్లు పెట్టి విద్యార్థులకు ఆప్షన్లు ఇవ్వటం వంటి సంఘటనలు జరిగేవి. ఈ నేపథ్యంలో సహాయ కేంద్రాల్లోనే ధ్రువీకరణ పత్రాల పరిశీలనలు తరువాత కళాశాలలు, బ్రాంచ్‌ల ఆప్షన్లు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నేపధ్యంలో ఈ ఏడాది ఎటువంటి విధానాన్ని అమలు చేస్తారో వేచి చూడాల్సిందే. జిల్లాలో 10 ప్రవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా, ప్రస్తుతం ఎనిమిది కళాశాలలు కౌన్సెలింగ్ రేసులో ఉన్నాయి .రెండు కళాశాలలు గత ఏడాది కౌన్సెలింగ్ దూరంగా ఉన్నాయి. జిల్లా కళాశాలల్లో 3132 సీట్లు ఉండగా 2012లో 1605, 2013లో 1590 మంది విద్యార్థులు చేరారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరైన వారిలో 50 శాతం లోపు వారు జిల్లా కళాశాలల్లో చేరుతుండగా మిగతా వారు ప్రభుత్వ, ఇతర పెద్ద కళాశాలల్లో చేరుతున్నారు. కౌన్సెలింగ్ షెడ్యూల్ ర్యాంకుల వారీగా తేదీలు ఇలా... 7వ తేదీ 1 నుంచి 5 వేలు, 8వ తేదీ 5001 నుంచి 10,000, 9వ తేదీ 10001 నుంచి 15 వేలు, 10వ తేదీ 15001 నంచి 20 వేలు, 11వ తేదీ 20001 నుంచి 38 వేలు, 12వ తేదీ 38001 నుంచి 56 వేలు, 13 వ తేదీ 56001 నుంచి 75 వేలు, 14వ తేదీ 75001 నుంచి 90 వేలు, 16వ తేదీ 90001 నుంచి 105000, 17వ తేదీ 105001 నుంచి 1.20 లక్షలు, 18వ తేదీ 120001 నుంచి 1.35 లక్షలు, 19 వ తేదీ 135001 నుంచి 1.50 లక్షలు, 20 వ తేదీ 150001 నుంచి 1.65 లక్షలు, 21వ తేదీ 165001 నుంచి 1.80 లక్షలు, 22 వ తేదీ1001 నుంచి 1.95 లక్షలు, 23వ తేదీ 195001 నుంచి చివరి వరకు అవసరమైన ధ్రువపత్రాలు ఇవే... ఎన్సీసీ, స్పోర్ట్స్ తదితరత కేటట గిరిల వారు హైదరాబాద్‌లో సాంకేతిక విద్యా భవన్‌కు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. ఒరిజనల్, మూడు సెట్ల జిరాక్సులతో హాజరుకావాలి ర్యాంక్ కార్డు, హాల్‌టిక్కెట్, ఇంటర్మీడియెట్ మార్కుల మెమో, పదో తరగతి మార్కుల మెమో, 6 నుంచి ఇంటర్మీడియెట్ వరకు స్టడీ, ఆరు నెలల లోపు ఆదాయ,కుల ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలి. ఓసీ, బీసీలకు రూ.600, ఎస్సీ, ఎస్టీలకు రూ.300 కౌన్సెలింగ్ ఫీజుగా నిర్ణయించారు. అలాట్మెంట్ల వివరాలు, ట్యూషన్ ఫీజుల వివరాలు తరువాత తెలియజేస్తారు. -
మోగిన ఎన్నికల నగారా
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఆ మరుక్షణమే నామినేషన్ల స్వీకరణ ఘట్టానికి తెరలేచింది. జిల్లాలోని ఒక లోక్‌సభ, పది అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు శనివారం నోటిఫికేషన్లు జారీ చేశారు. అయితే తొలిరోజు శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి తప్ప మిగతా నియోజకవర్గాలకు బోణీ పడలేదు. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ సహా అందరు ఆర్వోలు తమ కార్యాలయాల్లో ఉదయం నుంచి తమ కార్యాలయాల్లోనే గడిపినా ఒక్కరు కూడా రాలేదు. అయితే శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి పిరమిడ్ పార్టీ తరఫున ఒక నామినేషన్ దాఖై లెంది. ఆ పార్టీ అభ్యర్థిగా డి.వీరభద్రరావు అనే వ్యక్తి రిటర్నింగ్ అధికారి అయిన ఆర్డీవో గణేష్‌కుమార్‌కు నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సౌరభ్‌గౌర్ మాట్లాడుతూ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నెల 19 వరకు.. అదీ పనిదినాల్లో మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. అవసరమైన నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. పార్లమెంటు, అసెంబ్లీలకు పోటీ చేసే అభ్యర్థులకు అవసరమైన సమాచారం అందజేసేందుకు, దరఖాస్తు పత్రాలు పూర్తి చేయడంలో వారికి సహాయపడేందుకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. తహశీల్దార్ ఎం.కాళీప్రసాద్‌తో పాటు మరో ముగ్గురు సిబ్బంది, డేటా ఎంట్రీ అపరేటర్లు ఇక్కడ అందుబాటులో ఉంటారన్నారు. 13, 14, 18 తేదీలు సెలవు ఈ నెల 19 వరకు నామినేషన్ల దాఖలుకు గడువున్నప్పటికీ మధ్యలో మూడు రోజులు నామినేషన్లు స్వీకరించర ని కలెక్టర్ చెప్పారు. 13వ తేదీ ఆదివారం, 14వ తేదీ అంబేద్క ర్ జయంతి, 18న గుడ్ ఫ్రేడే సందర్బంగా ప్రభుత్వ సెలవులని వివరించారు. 21న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, ఉపసంహరణకు 23 వరకు గడువు ఉంటుందన్నారు. -
నోటిఫికేషన్ విడుదల
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కలెక్టర్ కాంతిలాల్ దండే శనివారం ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఉదయం పదకొండు గంటలకు నోటిఫికేషన్‌ను ఫారం-1లో విడుదల చేశారు. ఇందులో అభ్యర్థులకు ఆరు సూచనలు చేశారు. ఎంపీ నియోజకవర్గం నుంచి ఒక సభ్యునికి ఎన్నిక జరుగుతుందని పొందుపరిచారు. నామినేషన్ పత్రాలను తనకు గానీ ఏఆర్వో ఏజేసీ నాగేశ్వరరావుకు గానీ సమర్పించాలన్నారు. నామినేషన్ పత్రాలను ఈ నెల 21న పరిశీలిస్తామని నోటిఫికేషన్లో పొందుపర్చారు. మే7న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలవరకూ పోలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. విజయనగరం ఎంపీ స్థానానికి సంబంధించి నామినేషన్ల పరిశీలన రోజున అన్ని పార్టీల అభ్యర్థులతో నామినేషన్లు, ఎన్నికల వ్యయానికి సంబంధించిన అంశాలు తెలియజేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. పుస్తకాల అందజేత ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పూసపాటి అశోక్ గజపతిరాజుకు భారత ఎన్నికల సంఘం ముద్రించిన నియమ నిబంధనల పుస్తకాలను కలెక్టర్ కాంతిలాల్ దండే అందించారు. అశోక్ తో పాటు ఆయన భార్య సునీలా గజపతిరాజు కూడా ఈ పుస్తకాలను అందుకున్నారు. అనంతరం రశీదుల మీద సంతకాలు చేశారు. -
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
గుంటూరుసిటీ, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఎన్నికల నోటిఫికేషన్‌ను శనివారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.సురేశ్‌కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా సెంటర్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రెండు పార్లమెంట్, 17 అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేశామని చెప్పారు. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో తొలిరోజు గుంటూరు పార్లమెంట్‌కు ఒక నామినేషన్, నరసరావుపేట పార్లమెంట్‌కు ఒక నామినేషన్ దాఖలు అయినట్టు కలెక్టరు చెప్పారు. జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 10 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. తాడికొండకు-1, మంగళగిరి-2,తెనాలి-1,బాపట్ల-1,మాచర్ల-1,గుంటూరు తూర్పు-1, గుంటూరు పశ్చిమ-3 నామినేషన్లు దాఖలైనట్టు ఆయన వివరించారు. ఈ నెల 19వ తేదీ వరకు సెలవు దినాలలో మినహా మిగిలిన రోజుల్లో నామినేషన్లు స్వీకరిస్తారని చెప్పారు. విజయవంతంగా ముగిసిన స్థానిక ఎన్నికలు జిల్లాలో పురపాలక , ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎటువంటి రీపోలింగ్‌కు అవకాశం లేకుండా విజయవంతంగా నిర్వహించినట్టు కలెక్టర్ సురేశ్‌కుమార్ చెప్పారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, రెవెన్యూ, పోలీసు, ఇతర అధికారులు, సిబ్బంది సహకరించడం వలనే ఎన్నికలు సజావుగా నిర్వహించగలిగామన్నారు. 2006 ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో 75.35 శాతం మాత్రమే పోలింగ్ జరిగిందని, ఈసారి 85.5 శాతం పోలింగ్ జరిగిందని తెలిపారు. నిజాంపట్నం, రెంటచింతల మండలాలలో మాత్రం తక్కువ శాతం పోలింగ్ జరిగిందన్నారు. అత్యధికంగా దుగ్గిరాలలో 91.59 శాతం, తుళ్లూరులో 91.18 శాతం నమోదయ్యాయని, అత్యల్పంగా నిజాంపట్నంలో 74.84 శాతం, గురజాలలో 80.34 శాతం నమోదయ్యాయన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి గత ఎన్నికలలో 75 శాతం పోలింగ్ నమోదైందని, ఈసారి ఎన్నికలలో 90 శాతం ఓటింగ్ పెంచేందుకు స్వీప్ కార్యక్రమాలు నిర్వహించి ఓటర్లను చైతన్యపరుస్తున్నట్టు వివరించారు. ఈ నెల 14న అన్ని నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లను చైతన్యపరచడానికి విలేజ్ అవేర్నెస్ కార్యక్రమం చేపడుతున్నట్టు కలెక్టర్ వివరించారు. ఇందుకు కమిటీలు ఏర్పాటుచేశామని, ఈ కమిటీల్లో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, విశ్రాంత ఉద్యోగులు,ఏఎన్ఎం, ఆశ, సాక్షర భారత్ కార్యకర్తలను సభ్యులుగా నియమించి ఓటు ప్రాధాన్యం గురించి తెలియజేసేలా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఈనెల 15న జిల్లాలోని అన్ని గ్రామాల్లో సిగ్నేచర్ కాంపైన్ బోర్డుతో పర్యటిస్తారన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన వినుకొండ, మాచర్ల,గురజాల, పెదకూరపాడు నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, మిగిలిన 13 నియోజక వర్గాలలో ఉదయం 7గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని కలెక్టరు స్పష్టం చేశారు. -
అసలు పోరు మొదలైంది
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రక్రియకు తెరలేవడంతో జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. నామినేషన్ల హడావుడి మొదలవడంతో పార్టీల్లో ఎన్నికల ఫీవర్ కనిపిస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులెవరు, గెలిచే అవకాశం ఎవరికి ఉంటుందనే విషయాలపై గ్రామాలు, పట్టణాల్లో ఎడతెగని చర్చలు నడుస్తున్నాయి. మునిసిపల్, స్థానిక ఎన్నికల పోలింగ్ సరళి తమకు కలిసొచ్చేలా లేదని తెలియడంతో తెలుగుదేశం పార్టీ కొంత వెనక్కి తగ్గింది. ఓటింగ్ సరళి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా జరుగుతుందనే విష యం స్పష్టమవడంతో టీడీపీ నేతలు అయోమయంలో పడ్డారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక ప్రకారం ముందుకెళుతోంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన శనివారమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నామినేషన్లు వేశారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త తోట గోపి నామినేషన్లు దాఖలు చేశారు. మిగిలిన నియోజకవర్గాల నేతలు కూడా నామినేషన్ల దాఖలుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీంతో ఆ పార్టీలో కోలాహలం నెలకొంది. టీడీపీ నేతల్లో గందరగోళంటీడీపీలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇంకా నాన్చుడు ధోరణి అవలంభిస్తుండడంతో నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. శుక్రవారం అర్ధరాత్రి రెండో జాబితాలో ఐదుగురు అభ్యర్థిత్వాలను మాత్రమే ఖరారు చేశారు. నిడదవోలుకు బూరుగుపల్లి శేషారావు, తణుకుకు ఆరిమిల్లి రాధాకృష్ణ, పోలవరానికి మొడియం శ్రీనివాస్, ఏలూరుకు బడేటి బుజ్జి, దెందులూరుకు చింతమనేని ప్రభాకర్‌ను ఎంపిక చేశారు. మిగి లిన 10 నియోజకవర్గాల్లో తాడేపల్లిగూడెం బీజేపీకి వదిలేయగా, తొమ్మిది నియోజకవర్గాలకు అభ్యర్థులు ఎవరనేది ఇంకా తేలలేదు. వలస నేతల టెన్షన్ ఇతర పార్టీల్లోంచి టీడీపీలోకి వెళ్లిన వలస నేతలు నేటికీ సంకటస్థితిని ఎదుర్కొంటున్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు ఆచంట ఖరారైనట్లు ప్రచారం జరిగినా నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గుబ్బల తమ్మ య్య ఎదురుతిరగడంతో వివాదం నెల కొంది. దీంతో పితాని పరిస్థితి అయోమయంలో పడింది. కాంగ్రెస్ నుంచి వెళ్లిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబును స్థానిక నేతలు వ్యతిరేకిస్తుండడంతో అక్కడా ఏంచేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. ఆ సీటు ఆశించిన మెంటే పార్థసారథి వర్గం అధినేత ఎదుట బలనిరూపణ చేసేం దుకు రాజధానికి వెళ్లింది. ఉండి స్థానం మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సిట్టింగ్ ఎమ్మెల్యే కలవపూడి శివ మధ్య దోబూచులాడుతోంది. కొవ్వూరు, గోపాలపురం, చింతలపూడి, నరసాపురం, ఉంగుటూరు నియోజకవర్గాలను ఎవరికిస్తా రనే దానిపైనా స్పష్టత రాలేదు. దీంతో టీడీపీ నేతలెవరికీ సీటు ధీమా కనిపిం చడం లేదు. తమ పేర్లు జాబితాలో ఉంటాయో లేదోననే ఉత్కంఠ వారిలో కనిపిస్తోంది. ఈ కారణంగానే నేతలు నామినేషన్ల గురించి ఆలోచించే పరి స్థితి లేకుండాపోయింది. -
నగారా మోగింది
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగిం ది. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సిద్ధార్థజైన్ శనివారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ప్రారంభమైంది. తొలి రోజు నరసాపురం ఎంపీ స్థానానికి రెండు, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఏడు నామినేషన్లు దాఖలయ్యూయి. ఏలూరు పార్లమెంటరీ, 9 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నరసాపురం సిట్టిం గ్ ఎంపీ కనుమూరి బాపిరాజు కాం గ్రెస్ అభ్యర్థిగా, అదే స్థానానికి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియూ తరఫున ఆదిత్య కృష్ణంరాజు నామినేషన్ వేశారు.తాడేపల్లిగూడెం అసెంబ్లీ సెగ్మెం ట్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తోట గోపీ, ఉండి సెగ్మెంట్‌కు వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు పాతపాటి సర్రాజు నామినేషన్లు వేశారు. తణుకు సెగ్మెంట్‌కు బీఎస్పీ తరఫున పొట్ల సురేష్, పాలకొల్లులో స్వతంత్ర అభ్యర్థిగా షేక్ రసూల్, ఆచంటలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా నెక్కంటి అనిత, పోలవరంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ నుంచి ధర్ముల సురేష్, స్వతంత్ర అభ్యర్థిగా సరయం రామ్మోహన్ నామినేషన్ వేశారు. ఏలూరు, చింతలపూడి, నిడదవోలు, భీమవరం, గోపాలపురం, దెందులూరు, ఉంగుటూరు, కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ సెగ్మెంట్లలో నామినేషన్లు బోణీ కాలేదు. మిగిలింది నాలుగు రోజులే... ఈనెల 19వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరిస్తుండగా, నాలుగు పని దినాలు మాత్రమే మిగిలి ఉన్నారుు. 13వ తేదీ ఆదివారం, 14న అంబేద్కర్ జయంతి, 18న గుడ్ ఫ్రైడే సెలవు దినాలు కావడంతో ఈనెల 15, 16, 17, 19 తేదీల్లో మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తారు. హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటు లోక్‌సభ, అసెంబ్లీ సెగ్మెంట్లకు పోటీచేసే అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు, నామినేషన్లు పత్రం దాఖలు చేసే సమయంలో అనుసరించాల్సిన పద్ధతులు, సమర్పించాల్సిన వివిధ సరిఫికెట్లు వంటి వివరాలను తెలియజేసేందుకు వీలుగా రిట ర్నింగ్ అధికారుల కార్యాలయూల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లో హెల్ప్‌డెస్క్‌ను కలెక్టర్ సిద్ధార్థజైన్ ప్రారంభించారు. 19న మధ్యాహ్నం 3 గం టలకు నామినేషన్ల స్వీకరణ ముగుస్తుందని, 21న పరిశీలన, 23న మధ్నాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉందని కలెక్టర్ చెప్పారు. -
30న మునిసిపల్ ఎన్నికలు
ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్న మునిసిపల్ ఎన్నికలకు నగారా మోగింది. ఎట్టకేలకు మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 30వ తేదీన ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మొత్తం 146 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. వీటి ఫలితాలు ఏప్రిల్ 2వ తేదీన వెల్లడిస్తారు. ప్రచార ఖర్చు మునిసిపాలిటీలకు లక్ష, కార్పొరేషన్లకు లక్షన్నర పరిమితిగా విధించారు. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 10వ తేదీన ప్రారంభమై 14వ తేదీ వరకు ఉంటుంది. మార్చి 15న నామినేషన్ల పరిశీలన, 18న ఉపసంహరణకు చివరి రోజు. పార్టీ గుర్తులపైనే జరిగే ఈ ఎన్నికలలో మొత్తం 11వేల ఈవీఎంలు ఉపయోగిస్తారు. ఏదో కారణంతో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయని, ఈ విషయంలో హైకోర్టు సీరియస్ అయ్యిందని ఆయన చెప్పారు. ఎన్నికల ఆలస్యానికి ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన స్ఫష్టం చేశారు. హైకోర్టు తమకు డెడ్ లైన్ విధించిందని, అందుకే త్వరగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. -
మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు సీరియస్:రమాకాంత్ రెడ్డి
-
30న మునిసిపల్ ఎన్నికలు
-
జిల్లాలో 136 వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల భర్తీకి చర్యలు
ఎప్పుడెప్పుడా అని నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొలువుల జాతర మొదలైంది. వీఆర్వో, వీఆర్ఏ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాలో 136 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. 53 వీఆర్వో, 83 వీఆర్ఏ పోస్టులు భర్తీ చేయనుంది. రాత పరీక్షల ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడుతోంది. వీఆర్వో వేతనం రూ.7,520, వీఆర్ఏ గౌరవ వేతనం రూ.3వేలతోపాటు అలవెన్స్‌లు ఇస్తారు. విద్యావంతులు తహశీల్దార్ కేడర్ వరకు పదోన్నతి పొందవచ్చు. చాలా రోజులుగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ లేకపోవడంతో నిరుద్యోగులు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియెట్ విద్యార్హతతో నిర్వహిస్తున్న ఈ పోస్టులకు డిగ్రీ, పీజీ, బీఈడీ, బీటెక్ తదితర ఉన్నత విద్యావంతులూ దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. రాత పరీక్షకు మరికొద్ది రోజులే సమయం ఉంది. పక్కా ప్రణాళిక ప్రకారం శ్రమిస్తే ఉద్యోగం మీ సొంతమవుతుంది. - న్యూస్‌లైన్, మంచిర్యాల అర్బన్/ఆదిలాబాద్ టౌన్ గ్రామానికి అధికారి.. వీఆర్వో గ్రామానికి తొలి అధికారి వీఆర్వో(గ్రామ రెవెన్యూ అధికారి)నే. గ్రామాల్లోని ప్రజల సమస్యలపై మొదటగా స్పందించాల్సింది వారే. తుపాన్, కరువు, అగ్ని ప్రమాదాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడం, ఉన్నతాధికారులను సంప్రదించి నష్ట నివారణ చర్యలు చేపట్టడం, నష్టాన్ని నిబంధనల ప్రకారం లెక్కగట్టి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. గ్రామ పరిధిలో ప్రభుత్వ భూముల పరిరక్షణ, వివరాలు వారి వద్దనే ఉంటాయి. నీటి తీరువా, భూమి శిస్తు వసూలు, గ్రామ స్థాయిలో పంటల రకాలు, వాటి సరాసరి దిగుబడిపై అధికారిక సమాచారం కలిగి ఉండాలి. వీఆర్ఏ.. వీరు వీఆర్వోలకు సహాయకులుగా వ్యవహరిస్తారు. వీఆర్వోల పనితీరు, ఖాళీల ఆధారంగా కేవలం పదేళ్లలోనే డెప్యూటీ తహశీల్దార్ స్థాయికి ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. వీఆర్ఏగా చేరిన వారు సర్వీసు పూర్తయ్యేలాగా డెప్యూటీ తహశీల్దార్ వరకు పదోన్నతి పొందుతారు. ఇవీ అర్హతలు వీఆర్వో పోస్టులకు : కనీస విద్యార్హత రెండేళ్ల ఇంటర్మీడియెట్ గానీ, మూడేళ్ల డిప్లొమా కోర్సు గానీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 36 ఏళ్లలోపు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్లు, మాజీ సైనికులకు మూడేళ్ల వరకు సడలింపు ఉంది. నిర్దేశించిన విద్యార్హత పూర్తయ్యే నాటికి వరుసగా నాలుగేళ్లపాటు జిల్లాలో చదివినవారు మాత్రమే ఇక్కడి పోస్టులకు అర్హులు. వీఆర్ఏ పోస్టులకు.. కనీస విద్యార్హత పదోతరగతి ఉత్తీర్ణత. వయోపరిమితి 18 నుంచి 37 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 42 ఏళ్లు, మాజీ సైనికులకు 40 ఏళ్లు, వికలాంగులకు 47 సంవత్సరాలు వరకు ఉండవచ్చు. పరీక్ష రుసుం రూ.300, ఎస్సీ, ఎస్టీలకు రూ.150, వికలాంగులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సంబంధిత రెవెన్యూ గ్రామ పరిధిలో నివాసులై ఉండాలి షెడ్యూల్ వివరాలు... నోటిఫికేషన్ జారీ : డిసెంబర్ 28 దరఖాస్తుకు గడువు : వీఆర్వో పోస్టులకు జనవరి 12, వీఆర్ఏ పోస్టులకు 13వ తేదీ హాల్‌టికెట్ల జారీ : జనవరి 19 నుంచి ఆన్లైన్ ద్వారా పొందవచ్చు. పరీక్ష తేదీ : ఫిబ్రవరి 2, 2014(వీఆర్వోలకు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, వీఆర్ఏలకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ) ప్రాథమిక కీ విడుదల : ఫిబ్రవరి 4 తుది కీ విడుదల : ఫిబ్రవరి 10 ఫలితాల ప్రకటన : ఫిబ్రవరి 20 నియామక ఉత్తర్వులు జారీ : ఫిబ్రవరి 26 పరీక్ష ఫీజు.. ఓసీ, బీసీలకు రూ.300, ఎస్సీ, ఎస్టీలకు రూ.150. వికలాంగులకు పూర్తిగా మినహాయింపు. వీఆర్ఏ, వీఆర్వో పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 12 వరకు ఏపీ ఆన్లైన్, మీ సేవ, ఈ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 2న ఉదయం వీఆర్వో, మధ్యాహ్నం వీఆర్ఏ పరీక్షలు నిర్వహిస్తారు. ఇలా భర్తీ చేస్తారు.. వీఆర్వో, వీఆర్ఏ పోస్టులను జిల్లాల వారీగా కాకుండా యూనిట్లుగా విభజించారు. వీఆర్వో పోస్టులను జిల్లా యూనిట్‌గా, వీఆర్ఏ పోస్టులను రెవెన్యూ గ్రామం యూనిట్‌గా భర్తీ చేస్తారు. వీఆర్వో పోస్టులకు జిల్లా వ్యాప్తంగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి జిల్లాలో ఎక్కడైనా విధులు కేటాయిస్తారు. వీఆర్ఏ పోస్టులకు ఖాళీలున్న నిర్దేశిత రెవెన్యూ గ్రామాలకు చెందిన అభ్యర్థులనే అర్హులుగా పరిగణిస్తారు. వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. గతంలో మండలంలోని ఏ గ్రామస్తులైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉండేది. తాజాగా ఆ నిబంధనను సవరించారు. రెవెన్యూ గ్రామం యూనిట్‌గానే భర్తీ చేయనున్నారు. పరీక్షలు ఇలా.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. మార్కుల ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. వంద మార్కుల ప్రశ్నపత్రంలో ప్రశ్నలన్నీ అబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. రెండు పరీక్షలకు నెగెటివ్ మార్కులు లేవు. రెండింటికీ సిలబస్ ఒక్కటే అయినా ప్రశ్నల విషయంలో వ్యత్యాసం ఉంటుంది. జనరల్ స్టడీస్‌లో 60, అర్థమెటిక్ 30, లాజికల్ స్కిల్స్ 10 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. జనరల్ స్టడీస్‌లో సగం ప్రశ్నలు గ్రామీణ ప్రాంతాలు, అక్కడి ప్రజల జీవన విధానం, ప్రభుత్వ పథకాలు, దేశ చరిత్ర, ఆంగ్లేయుల పాలన, తిరుగుబాటు, ఆర్థిక, సామాజిక రంగాల్లో మార్పులు, నాగరికత, ప్రాచీన యుగం, మధ్య యుగం ఇలా అనేక ప్రశ్నలు ఉంటాయి. వీఆర్వో ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యేవారు బాగా చదవాలి. అన్ని సబ్జెక్టుల్లో మార్కులు సాధించాలి. కఠోర సాధన చేయాలి. చదివినది గుర్తు పెట్టుకోవాలి. నమూనా ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేయాలి సమయం చాలా తక్కువగా ఉన్నందున నమూనా ప్రశ్నపత్రాల సాధనకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి పక్షం రోజులకు ఒకసారి నమూనా ప్రశ్నపత్రాలు తయారు చేసుకుని జవాబులు రాస్తూ మార్కులు, నైపుణ్యం స్థాయిని పరిశీలించుకోవాలి. తక్కువగా వస్తే మరింతగా సాధన చేయాలి. స్టడీ మెటీరియల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం కోచింగ్ తీసుకున్నా సమయం సరిపోదు. ఏపీ ఎకానమీ, జాగ్రఫి, 73, 74 రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. సిలబస్ మొత్తం పూర్తి చేయడం కష్టంగా ఉంటుంది. వ్యక్తిగత ప్రణాళికను సిద్ధం చేసుకుని చదవాలి. ఎక్కువగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు పుస్తకాలు చదవాలి. దినపత్రికలు రోజు చదవడం అలవాటు చేసుకుంటే పరీక్షలకు సులువుగా ప్రిపేర్ కావచ్చు. -
మళ్లీ పంచాయతీ
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్ : జిల్లాలో గ్రామ పంచాయితీ ఎన్నికల సందడి మళ్లీ మొదలైంది. గత ఏడాది జూలైలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అభ్యంతరాలు, వివాదాలు తదితర కారణాలతో పలు పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు. ఆ పంచాయతీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేసింది. ఎన్నికల ప్రధానాధికారి పి.రమాకాంత్‌రెడ్డి విడుదల చేసిన ఉత్తర్వులు జిల్లాకు చేరాయి. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న మండలాల్లో నోటిఫికేషన్ విడుదల నుంచి ఫలితాల వెల్లడి తేది వరకు ‘ఎన్నికల కోడ్’ అమల్లో ఉంటుంది. జిల్లాలో మొత్తం 19 మండలాల్లో ఎన్నికల కోడ్ బుధవారం సాయంత్రం నుంచే అమల్లోకి వచ్చింది. ఎన్నికలు జరిగే పంచాయతీలు... సర్పంచ్ల స్థానాలు ఇవే... శాసనం (కంచిలి), పట్టుపురం (కోటబొమ్మాళి), బుడితి (సారవకోట), కొల్లివలస (ఆమదాలవలస), బుడుమూరు (లావేరు), చల్లయ్యవలస (పోలాకి), పొన్నుటూరు (కొత్తూరు), సంతబొమ్మాళి గ్రామ పంచాయతీ సర్పంచ్ల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. బుడుమూరు, సంతబొమ్మాళిల సర్పంచ్‌లు అకాల మృతితో ఎన్నిక జరుగుతోంది. వార్డు స్థానాలు శాసనం (కంచిలి)- మొత్తం 10 వార్డులు, పట్టుపురం (కోటబొమ్మాళి)- 8 వార్డులు, బుడితి (సారవకోట)- 12 వార్డులకు సర్పంచ్ స్థానాలతో సహా పూర్తి పాలకమండలికి ఎన్నికలు జరుగనున్నాయి. కొత్తూరు మండలంలోని పొన్నుటూరులో 7వవార్డు, కలిగాంలో 3వ వార్డులకు, బూర్జ మండలంలోని లంకాంలో 6వ వార్డు, లావేరు మండలంలోని పెద్దరావుపల్లిలో 2వ వార్డు, సారవకోట మండలానికి చెందిన కరడశింగిలో 1వ,4వ,7వ వార్డులకు, ఆర్కె.పురంలో 7వ, తొగిరిలో 1వ,3వ,4వవార్డులు, చీడిపూడిలో 4వ వార్డుకు ఎన్నిక జరగనుంది. సంతకవిటి మండలంలోని జిఎన్.పురంలో 1, 6వ వార్డులకు, మెళియాపుట్టి మండలంలోని గంగరాజపురంలో 4వ, 5వ వార్డులకు, పద్ద పంచాయితీలోని 3వ వార్డుకు, కంచిలి మండలం కె.బి.నవగాంలో 5, 6, 7, 9, 10వ వార్డులకు ఎన్నిక జరుగుతుంది. సోంపేట మండలంలోని టి.శాసనాంలో 4వ వార్డుకు, నందిగాం మండలంలోని మహాలింగపురంలో 7వవార్డు, ఇచ్ఛాపురం మండలంలోని పైతారిలో 7వ వార్డుకు, కోటబొమ్మాళి మండలంలోని దంతలో 4వవార్డు, కస్తూరిపాడులో 7వవార్డు, టెక్కలి మండలంలోని ముఖలింగాపురంలో 6వవార్డుకు ఎన్నికలు జరుగుతాయి. కవిటి మండలంలోని కొజ్జీరియాలో 4, జగతిలో 3, 12వ వార్డులకు, డి.జి.పుట్టుగలో 1, 10వ వార్డులకు, వజ్రపుకొత్తూరు మండలంలోని పల్లిసారధిలో 10, పలాస మండలంలోని మామిడిమెట్టలో 7, నరసన్నపేట మండలంలోని జమ్ము పంచాయతీలోని 10వ వార్డుల స్థానానికి ఎన్నిక జరగనుంది. బిజీబిజీగా పంచాయతీ అధికారులు నూతన సంవత్సరం తొలి రోజే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో జిల్లాలో పంచాయతీ అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. గతంలోలా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈనెల 3 నుంచే నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో నేడు సంబంధిత పంచాయతీల్లో ఎన్నికల నోటిఫికేషన్ వివరాలను ప్రదర్శనలో పెట్టనున్నారు. ఈమేరకు బుధవారం సాయంత్రమే పంచాయితీ అధికారులకు సమాచారం పంపించారు. వివాదాలు తలెత్తే పంచాయతీల్లో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు సమాలోచనలు ప్రారంభించారు. ఎన్నికల షెడ్యూల్ జిల్లాలో మొత్తం 8 పంచాయతీ సర్పంచ్ల స్థానాలకు, 66 వార్డు స్థానాలకు ఈనెల 18న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈనెల 3 నుంచి 6 వతేది సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 7న ఉదయం11 గంటల నుంచి నామినేషన్ల స్క్రూట్నీ 8న సాయంత్రం 5 గంటల వరకు ఆర్డీవో కార్యాలయంలో పలు అప్పీళ్లు స్వీకరణ, 9న ఆర్డీవో సమక్షంలో అప్పీళ్ల డిస్పోజల్ ఈనెల 10న (మధ్యాహ్నం 3గంటల లోగా) నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ, తర్వాత తుది జాబితా విడుదల 18న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ 18న మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితాల వెల్లడి... పంచాయతీ ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల కోడ్‌ను అతిక్రమించకుండా ఉండాలనేది ప్రధానం. -
మళ్లీ పంచాయతీ
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో వాయిదాపడ్డ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 18న ఏడు సర్పంచ్, 150 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గతేడాది జూలై 23 నుంచి మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. భారీ వర్షాలతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో మళ్లీ నోటిఫికేషన్ జారీ చేశారు. స్థానాలు ఇవే.. దండేపల్లి మండలం గూడెం, బేల మండలం కొబ్బాయి, తాంసి మండలం వడ్డాడి, కాగజ్‌నగర్ మండలం నజ్రూల్‌నగర్, చింతగూడ, తలమడుగు మండలం రుయ్యాడి, తాంసి మండలం బండల్‌నాగాపూర్ సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గూడెంలో ఎస్టీ రిజర్వేషన్ కాగా అక్కడ ఎస్టీ ప్రజలు, ఓటర్లు లేకపోవడంతో ఎన్నికలు జరగలేదు. తెలంగాణ నినాదంతో కొన్ని గ్రామాల్లో అప్పట్లో ఎన్నికలను బహిష్కరించారు. ఇంకొన్నింటికి నామినేషన్లు రాలేదు. భారీ వర్షాల కారణంగా కూడా కొన్నిచోట్ల ఎన్నికలు జరగలేదు. గూడెం, కొబ్బాయిలో సర్పంచ్‌తోపాటు అన్ని వార్డుసభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు మొత్తంగా 150 వార్డు స్థానాల్లో కూడా జరగనున్నాయి. నామినేషన్లు ఇలా.. ఈనెల 3 నుంచి 6వ తేది వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు దాఖలు చేయవచ్చు. 7న స్క్రూట్నీ, 8న ఆర్డీవోకు అప్పీల్, 9న అభ్యంతరాల పరిష్కరణ, 10న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, అదేరోజు సాయంత్రం బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా వెల్లడిస్తారు. 18న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి సాయంత్రం వరకు ఫలితాన్ని ప్రకటిస్తారు. -
పంచాయతీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో పంచాయతీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌ను కలెక్టర్ సిద్ధార్థ జైన్ విడుదల చేశారు. గతేడాది జూలై నెలలో 23, 27, 31వ తేదీల్లో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెల్సిందే. అప్పట్లో 884 పంచాయతీల ఎన్నికలకు జిల్లా యంత్రాంగ నోటిఫికేషన్ ఇచ్చింది. కాగా మొగల్తూరు మండలం మోడీ (అన్‌రిజర్వుడ్), పోలవరం మండలం పైడిపాక(ఎస్టీ), టి.నర్సాపురం మండలం మర్రిగూడెం(ఎస్సీ మహిళ) గ్రామాల్లో పాలకవర్గ ఎన్నికలకు ఎవ్వరు నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో 881 గ్రామాల్లోనే ఎన్నికలు జరిగాయి. ఇదే సందర్భంలో 17 గ్రామాల్లో 20 వార్డు పదవులకు ఎవ్వరు నామినేషన్ దాఖలు చేయలేదు. అదే విధంగా పెదవేగి మండలం పెదకడిమి సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు కాలేదు. ఉంగుటూరు మండలం తల్లాపురం సర్పంచ్‌గా ఎన్నికైన మద్దూరి చినరామ సోమయాజి శాస్త్రి 15 రోజుల తర్వాత ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో ఈ పదవి ఖాళీ అయ్యింది. ఎన్నికలు జరిగిన 6 నెలల్లోగా ఖాళీ అయిన పదవులను ఉప ఎన్నికల ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వీటి భర్తీకి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో జిల్లాలో ఉప ఎన్నికలకు బుధవారం కలెక్టర్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు డీపీవో పోలింగ్, సిబ్బంది ఏర్పాట్లును పూర్తి చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఇలా... ఈ నెల 3 నుంచి 6వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు ఆయా గ్రామాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లును స్వీకరిస్తారు. 10వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, 16వ తేదీ సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారానికి గడువు ఇచ్చారు. 18న ఉదయం 7 నుంచి 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను విడుదల చేస్తామని డీపీవో అల్లూరి నాగరాజు వర్మ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. -
106 పంచాయతీ కార్యదర్శి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల(గ్రేడ్-4) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ వెలువడింది. జిల్లాలో 106 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి రిజర్వేషన్, రోస్టర్ వివరాలు కూడా అధికారులు ప్రకటించారు. జనవరి 4నుంచి 22వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు చెల్లింపునకు జనవరి 20 చివరి తేదీగా ప్రకటించారు. పరీక్షలు జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 23న నిర్వహిస్తారు. అభ్యర్థుల వయస్సు 01-07-2013 నాటికి 18సంవత్సరాలు పూర్తయి 36 సంవ్సరాల లోపు ఉండాలి. విద్యార్హత డిగ్రీ ఉత్తీర్ణతగా నిర్ణయించారు. కొలువుల కోలాహలం ఒకవైపు ఇప్పటికే డీఎస్సీ ద్వారా చేపట్టిన 135 కార్యదర్శుల పోస్టుల ప్రక్రియ కోర్తు ఉత్తర్వులతో నిలిచిపో గా.. ప్రభుత్వం తాజా ప్రకటనతో పంచాయతీలో మరోసారి ఉద్యోగాల భర్తీ కొలాహలం మొదలైంది. అయితే మొత్తం 241 పోస్టుల భర్తీ జరగుతున్నా జిల్లాలో ఖాళీలు పూర్తిస్థాయిలో భర్తీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే డీఎస్సీ ద్వారా భర్తీచేసే 135 పోస్టుల్లో.. ఇప్పటికే కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న వారికి 25మార్కుల వెయిటేజీ ఇస్తున్నారు. దీంతో వారే ఎక్కువగా ఈ పోస్టులకు ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇక మిగిలింది ప్రస్తుతం నోటిఫికేషన్ ఇవ్వనున్న 106 పోస్టులు మాత్రమే. 636 క్లస్టర్లకు 350 మంది కార్యదర్శులు జిల్లాలో మొత్తం 962 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం వీటిని పంచాయతీ క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. జిల్లాలో 1014 పంచాయతీలు ఉన్నప్పుడు 656 క్లస్టర్లు ఏర్పాటు చేయగా.. నగర పంచాయతీలు, మున్సిపాలీటిలు, కార్పొరేషన్లో విలీన పంచాయతీలను మినహారుుస్తే ప్రస్తుతం సుమారు 636 క్లస్టర్ల వరకు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 350 మంది కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 124 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తుండగా మిగతా వారు రెగ్యులర్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. -
గ్రేడ్-4 కార్యదర్శి పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ఖాళీగా ఉన్న 25 గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాత పరీక్ష ద్వారా వీటిని భర్తీ చేయడానికి ఏపీపీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. జనవరి 4 నుంచి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం నిర్ధేశించిన రూ.100 ఫీజును జనవరి 20లోగా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు ఫిబ్రవరి 23న ఏలూరులో రాత పరీక్ష నిర్వహిస్తారు. 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు మార్చి 23న కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ నియామక ఉత్తర్వులను ఇస్తుంది. అభ్యర్థుల వయసు 2013 జూలై 1 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్ల సడలింపు ఇచ్చారు. రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలు : జిల్లాలో గ్రేడ్-4 కార్యదర్శి పోస్టులు 25 ఖాళీగా ఉన్నాయి. వీటిలో జనరల్‌కు 13, మహిళలకు 12 పోస్టులను కేటాయించారు. ఓసీ విభాగంలో జనరల్‌కు 6, మహిళలకు 4, బీసీ-ఏలో జనరల్‌కు 1, మహిళకు 1, బీసీ-బీలో జనరల్‌కు 1, మహిళకు 1, బీసీ-సీలో జనరల్‌కు 1, బీసీ-డీలో మహిళకు 1, బీసీ-ఈలో మహిళకు 1, ఎస్సీ కేటగిరీలో జనరల్‌కు 2, మహిళలకు 2, ఎస్టీ కేటగిరీలో జనరల్‌కు 1, మహిళకు 1, ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీలో మహిళకు 1 వికలాంగుల కేటగిరీలో మహిళకు1 చొప్పున పోస్టులు కేటాయించారు. -
పంచాయతీ పోస్టులు 133
సాక్షి, నల్లగొండ :పల్లెల్లో పంచాయతీ కార్యదర్శుల కొరత త్వరలో తీరనుంది. పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయడంతో నిరుద్యోగుల్లో ఆశ చిగురిస్తోం ది. జిల్లాలో మొత్తం 133 పోస్టులను భర్తీ చేయనున్నారు. వచ్చే నెల 4వ తేదీ నుంచి దరఖాస్తులు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 20వ తేదీ ఆఖరి గడువు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేయాల్సి ఉం టుంది. రాత పరీక్ష ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహిస్తారు. 18 ఏళ్ల వయస్సు నుంచి ఈ ఏడాది జూలై నాటికి 36 ఏళ్లు దాటని అభ్యర్థులు అర్హులని నోటిఫికేషన్లో సర్కారు పేర్కొంది. ఏదేని డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఓపెన్‌లో 59, బీసీలో 36, ఎస్సీ 20, ఎస్టీ 9, వికలాంగులు 5, మాజీ సైనికుల విభాగాల్లో 4 పోస్టులు ఉన్నాయి. అదనంగా.... జిల్లాలో 1169 గ్రామ పంచాయతీలను 573 క్లస్టర్లుగా విభజించారు. ప్రతి క్లస్టర్‌కు ఒక కార్యదర్శి అవసరం. అయితే జిల్లాలో దాదాపు 410 మంది కార్యదర్శులు మాత్రమే పనిచేస్తున్నారు. ఇప్పటికే కాం ట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న 38 కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయడానికి మూడు నెలల క్రితం నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అందుకు వీరికి 25 మార్కుల వెయిటేజీ కల్పించింది. కాంట్రాక్టు కార్యదర్శులతోపాటు ఇతర అభ్యర్థులు కూడా పెద్ద సం ఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం దరఖాస్తుదారుల అభ్యంతరాల స్వీకరణ సోమవారంతో ముగిసింది. ఇవిగాక తాజా నోటిఫికేషన్ ద్వారా 133 పోస్టులు భర్తీ కానున్నాయి. దరఖాస్తులు, ఖాళీల వివరాలు, పరీక్ష సమయం తదితర వివరాల కోసం ఠీఠీఠీ. ్చఞటఞటఛి.జౌఠి.జీలో చూడవచ్చు. రిజర్వేషన్ ఇలా... కేటగిరి జనరల్ మహిళ ఓసీ 38 21 బీసీ -ఏ 7 3 బీసీ - బీ 7 5 బీసీ - సీ 2 - బీసీ -డీ 5 3 బీసీ - ఈ 3 1 ఎస్సీ 13 7 ఎస్టీ 6 3 వికలాంగ 3 2 మాజీ సైనికులు 2 2 మొత్తం 86 47 -
ఎన్నాళ్లకెన్నాళ్లకో..
అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు సోమవారం జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతపురం జిల్లాలో 202 పోస్టులు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. ఇందులో 132 జనరల్, 70 మహిళలకు కేటాయిస్తూ రోస్టర్ విడుదల చేసింది. జనవరి 4 నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 22వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు ఓసీ, బీసీలు రూ.100, ఎస్సీ, ఎస్టీలు రూ.80. ఇతర వివరాలను ఠీఠీఠీ.్చఞటఞఛి.జౌఠి.జీ వెబ్సైట్లో ఉంచారు. పరీక్ష 300 మార్కులకు ఉంటుంది. పేపర్-1 జనరల్ స్టడీస్ 150 మార్కులకు, పేపర్-2 గ్రామీణం 150 మార్కులకు ఉంటుంది. అర్హతలు.. డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 2013 జూలై 1 నాటికి 36 ఏళ్లకు మించరాదు. జనగణన విభాగంలో తాత్కాలికంగా పని చేస్తున్న వారికి 3 ఏళ్ల వెసులుబాటు ఉంటుంది. ఎక్స్ సర్వీస్మన్లకు మూడేళ్లు, ఎన్సీసీకి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు పదేళ్లు వెసులుబాటు కల్పించారు. -
నిరుద్యోగులకు శుభవార్త
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: జిల్లాలో ఖాళీగా ఉన్న 86 పంచాయతీ కార్యదర్శుల(గ్రేడ్-4) పోస్టుల భర్తీకి ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలో 86 పోస్టులు భర్తీ కానున్నాయి. గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన 18 నుంచి 36 ఏళ్ల లోపు వారు దర ఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దరఖాస్తులను జనవరి 4 నుంచి 22వ తేదీలోగా అన్లైన్లోనే చేయాలి. ఫీజు చెల్లింపునకు తుది గడువు జనవరి 20వ తేదీ. జనరల్ అభ్యర్థులకు రూ.100. మిగిలిన వారికి రూ.80 ఫీజుగా నిర్ణయించారు. -
కొలువుల జాతర
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : కొత్త సంవత్సరంలో కొలువుల జాతర సాగనుంది. ఇప్పటికే ప్రభుత్వం వీఆర్వో, వీఆర్ఏ పోస్టులకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. డీఎస్సీ కూడా నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. దీంతో నిరుద్యోగుల్లో ఉద్యోగ అవకాశాలపై ఆశలు పెరుగుతున్నాయి. సోమవారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీ స్ కమిషన్(ఏపీపీఎస్సీ) పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్-4) పోస్టుల నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,677 పోస్టులను భర్తీ చేయనున్నారు. జిల్లా వారీగా పో స్టులు, రిజర్వేషన్లు ఖరారు చేశారు. 2013 జూలై 1 నాటికి వయస్సు 18 ఏళ్లు పూర్తి చేసుకొని 36 ఏళ్లు మించకుండా ఉండాలి. పేపర్-1లో జనరల్ స్టడీస్ 150 మా ర్కులు, పేపర్-2 గ్రామీణాభివృద్ధి 150 మార్కులు ఉంటాయి. జిల్లాకు 241 పోస్టులు.. జిల్లాలో 580 క్లస్టర్ పంచాయతీలు ఉండగా ప్రస్తుతం 190 పంచాయతీలకు కార్యదర్శులు ఉన్నారు. తాజాగా ఏపీపీఎస్సీ నుంచి 241 పోస్టులు భర్తీ కానున్నప్పటికీ జిల్లాలో ఇంకా 149 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉండనున్నాయి. అయితే 120 పోస్టులు పదోన్నతుల ద్వారా గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3 పంచాయతీ కార్యదర్శులను నియమించే అవకాశాలు ఉంటాయి. కాగా కొత్తగా భర్తీ చేయనున్న 241 పోస్టుల్లో 80 శాతం స్థానికులతో, 20 శాతం స్థానికేతరులకు అవకాశం ఉంది. ఇందులో జనరల్ 155, మహిళలకు 86 పోస్టులు కేటాయించారు. వయో పరిమితి పరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్లు సడలింపునిచ్చారు. ఆన్లైన్ ద్వారా వెబ్సైట్ ఠీఠీఠీ.్చఞటఞటఛి.జౌఠి.జీ లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. కలెక్టర్, జిల్లా సెలక్షన్ కమిటీ ఈ ఎంపిక విధానాన్ని పర్యవేక్షిస్తారు. దరఖాస్తు విధానంలో, హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌లో అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురైన పక్షంలో హైదరాబాద్‌లోని 040-23120055 నెంబర్‌కు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సంప్రదివచవచ్చు. appschelpdesk@gmail.com లోనూ సంప్రదించవచ్చు. మార్చి చివరి వరకు పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. -
రెవెన్యూ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలోని రెవెన్యూశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. జిల్లాలోని 53 గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), 83 గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్ఏ) పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ మేరకు శుక్రవారం డీఆర్వో రాజు, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ 18 ఏళ్లకుపైబడి 35 ఏళ్లలోపు ఉన్న వారు అర్హులని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికైన వీఆర్వోలకు రూ.7,520 నుంచి రూ.22,430 వరకు వేతనం ఉంటుంది. వీఆర్వోలకు దరఖాస్తులు చేసుకునే వారు ఇంటర్ విద్యార్హత ఉందన్నారు. పరీక్ష ఫీజు రూ.300. ఎస్సీ, ఎస్టీలకు రూ.150 మాత్రమే చెల్లించాలని పేర్కొన్నారు. వీఆర్వోలకు 2014 జనవరి 12 వరకు దరఖాస్తులకు చివరి తేదని తెలిపారు. వీఆర్వోలకు ఫిబ్రవరి 2న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందన్నారు. అబ్జెక్టివ్ రూపంలో పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో పరీక్ష ప్రశ్నపత్రాలు ఉంటాయని పేర్కొన్నారు. శుక్రవారం నుంచి ఆన్లైన్లో, మీసేవ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. వీఆర్ఏలకు జనవరి 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వీఆర్ఏలకు ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. వీఆర్ఏలకు దరఖాస్తులు చేసుకునేవాళ్లు ఖచ్చితంగా ఆ గ్రామస్థులై ఉండాలని, లేనియేడల తిరస్కరించడం జరుగుతుందని తెలిపారు. -
వీఆర్ఓ, వీఆర్ఏల నోటిఫికేషన్ విడుదల
కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో 98 గ్రామ రెవెన్యూ అధికారి, 172 గ్రామ రెవెన్యూ సహాయకుల ఉద్యోగాల భర్తీ కోసం ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామ రెవెన్యూ అధికారిగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జిల్లా వాసులై ఉండడంతో పాటు కనీసం ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు, ఈ ఏడాది జులై 1 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్న వారు మాత్రమే అర్హులన్నారు. ఎస్సీ, అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, మాజీ సైనిక ఉద్యోగులకు 39 ఏళ్ల వయస్సు సడలింపు ఉందన్నారు. ఓపెన్ స్కూల్ విధానంలో ఇంటర్మీడియెట్ విద్యార్హత కలిగిన వారు కూడా అర్హులన్నారు. వీఆర్వో పరీక్ష 2014 ఫిబ్రవరి 2న ఉదయం నిర్వహిస్తామని ఆమె తెలిపారు. గ్రామ రెవెన్యూ సహాయకుడి పోస్టుకు ఏ గ్రామానికి చెందిన వారు అక్కడే అర్హులన్నారు. కనీస విద్యార్హత పదో తరగతి పాసై ఉండాలన్నారు. 18 నుంచి 36 ఏళ్ల వయస్సు కలిగిన వారు అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల సడలింపు, మాజీ సైనిక ఉద్యోగులకు 39 ఏళ్ల వరకు అర్హులన్నారు. ఈ పరీక్ష ఫిబ్రవరి 2న మధ్యాహ్నం ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ద్వారా మీ-సేవ, ఇంటర్నెట్ సెంటర్ ద్వారా జనవరి 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు రూ. 300, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 150 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. వికలాంగులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అభ్యర్థులు పరీక్ష ఫీజును జనవరి 12లోగా చెల్లించాలన్నారు. రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బోత్ ఆప్షన్ చేయించుకుంటే ఒకే సెంటర్లో రెండు పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. దరఖాస్తులను ఠీఠీఠీ.ఛిఛ్చి.ఛిజజ.జౌఠి.జీ లో నమోదు చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు తెలుగు, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమంలో పరీక్ష రాయవచ్చన్నారు. మరిన్ని వివరాల కోసం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన 08455-272525కు సంప్రదించవచ్చన్నారు.