పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ఏపీపీఎస్‌సీ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు సోమవారం జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ చేసింది.
అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ఏపీపీఎస్‌సీ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు సోమవారం జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతపురం జిల్లాలో 202 పోస్టులు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇందులో 132 జనరల్, 70 మహిళలకు కేటాయిస్తూ రోస్టర్ విడుదల చేసింది. జనవరి 4 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 22వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు ఓసీ, బీసీలు రూ.100, ఎస్సీ, ఎస్టీలు రూ.80. ఇతర వివరాలను ఠీఠీఠీ.్చఞటఞఛి.జౌఠి.జీ వెబ్‌సైట్‌లో ఉంచారు.
పరీక్ష 300 మార్కులకు ఉంటుంది. పేపర్-1 జనరల్ స్టడీస్ 150 మార్కులకు, పేపర్-2 గ్రామీణం 150 మార్కులకు ఉంటుంది.
అర్హతలు.. డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 2013 జూలై 1 నాటికి 36 ఏళ్లకు మించరాదు. జనగణన విభాగంలో తాత్కాలికంగా పని చేస్తున్న వారికి 3 ఏళ్ల వెసులుబాటు ఉంటుంది. ఎక్స్ సర్వీస్‌మన్లకు మూడేళ్లు, ఎన్‌సీసీకి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు పదేళ్లు వెసులుబాటు కల్పించారు.