కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల(గ్రేడ్-4) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ వెలువడింది. జిల్లాలో 106 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి రిజర్వేషన్, రోస్టర్ వివరాలు కూడా అధికారులు ప్రకటించారు. జనవరి 4నుంచి 22వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు చెల్లింపునకు జనవరి 20 చివరి తేదీగా ప్రకటించారు. పరీక్షలు జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 23న నిర్వహిస్తారు. అభ్యర్థుల వయస్సు 01-07-2013 నాటికి 18సంవత్సరాలు పూర్తయి 36 సంవ్సరాల లోపు ఉండాలి. విద్యార్హత డిగ్రీ ఉత్తీర్ణతగా నిర్ణయించారు.
కొలువుల కోలాహలం
ఒకవైపు ఇప్పటికే డీఎస్సీ ద్వారా చేపట్టిన 135 కార్యదర్శుల పోస్టుల ప్రక్రియ కోర్తు ఉత్తర్వులతో నిలిచిపో గా.. ప్రభుత్వం తాజా ప్రకటనతో పంచాయతీలో మరోసారి ఉద్యోగాల భర్తీ కొలాహలం మొదలైంది. అయితే మొత్తం 241 పోస్టుల భర్తీ జరగుతున్నా జిల్లాలో ఖాళీలు పూర్తిస్థాయిలో భర్తీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే డీఎస్సీ ద్వారా భర్తీచేసే 135 పోస్టుల్లో.. ఇప్పటికే కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న వారికి 25మార్కుల వెయిటేజీ ఇస్తున్నారు. దీంతో వారే ఎక్కువగా ఈ పోస్టులకు ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇక మిగిలింది ప్రస్తుతం నోటిఫికేషన్ ఇవ్వనున్న 106 పోస్టులు మాత్రమే.
636 క్లస్టర్లకు 350 మంది కార్యదర్శులు
జిల్లాలో మొత్తం 962 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం వీటిని పంచాయతీ క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. జిల్లాలో 1014 పంచాయతీలు ఉన్నప్పుడు 656 క్లస్టర్లు ఏర్పాటు చేయగా.. నగర పంచాయతీలు, మున్సిపాలీటిలు, కార్పొరేషన్‌లో విలీన పంచాయతీలను మినహారుుస్తే ప్రస్తుతం సుమారు 636 క్లస్టర్ల వరకు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 350 మంది కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 124 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తుండగా మిగతా వారు రెగ్యులర్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు.
106 పంచాయతీ కార్యదర్శి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
Published Tue, Dec 31 2013 4:45 AM | Last Updated on Mon, Aug 20 2018 3:21 PM
Advertisement
Advertisement