panchayat secretary posts
-
కేటుగాళ్లు వస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త
గ్రామ సచివాలయంలో ఏ పోస్టు కావాలి.. పంచాయతీ సెక్రటరీ.. ఏఎన్ఎం ఏదీ కావాలన్నా ఇప్పిస్తాం.. మాకు రాష్ట్ర స్థాయిలో అధికారులు తెలుసు.. అధికార పార్టీ నాయకులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటాం.. అంటూ కేటుగాళ్లు నిరుద్యోగులకు ఎర వేస్తున్నారు. ఉద్యోగం గ్యారంటీ పేరుతో రూ. లక్షలు దండుకుంటున్నారు. అయితే ఇలాంటి వారితో తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు అధికారులు. అక్రమాలు, అవకతవకలకు తావులేకుండా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కార్యక్రమం చేపడుతుందని.. ఇలాంటి మోసగాళ్ల బారిన పడి చేతులు కాల్చుకోవద్దని హితవు పలుకుతున్నారు. సాక్షి, అమరావతి : అమాయక అభ్యర్థులను నిలువునా ముంచుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని చెబుతూ లక్షలు వసూలు చేస్తున్నారు. జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులు తెలుసని, అధికార పార్టీ నాయకుల అండ ఉందని చెప్పుకుంటూ అందిన కాడికి దోచుకుంటున్నారు. జిల్లాలో 11,025 పోస్టులు జిల్లాలో 933 గ్రామ, 511 వార్డు సచివాలయాలలో 11,025 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటి కోసం 2,00,664 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు పూటల జరిగే పరీక్షలకు ఇప్పటికే 443 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 1, 3, 4, 6, 7, 8వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంత భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ సాగుతుండటంతో గ్రామ, మండల స్థాయి నుంచే దళారులు రంగ ప్రవేశం చేశారు. ఉద్యోగానికి రూ. 4 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు బేరసారాలు సాగిస్తున్నారు. నమ్మితే మోసపోవడం తథ్యం గత టీడీపీ ప్రభుత్వంలో వెలగపూడిలోని సచివాయలంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని టీడీపీ నాయకులు వసూళ్లకు తెరతీశారు. నకిలీ నియామక పత్రాలు అందజేసి రూ.లక్షల్లో దోచుకున్నారు. ఇందుకు సంబంధించి తుళ్లూరు పోలీస్ స్టేషన్లో పదుల సంఖ్యలో కేసులు నమోదైయయ్యాయి. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలకు పూర్తి విరుద్ధంగా.. పారదర్శకంగా పాలన అందిస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వేసే ప్రతి అడుగు పారదర్శకంగా, స్పష్టంగా ఉండనుంది. పరీక్షా కేంద్రాలపై ప్రత్యక్ష నిఘా జిల్లాలోని ప్రతీ పరీక్ష కేంద్రాలపై అధికారులు నిఘా ఉంచనున్నారు. అలాగే కేంద్రంలోని ప్రతీ గదిలో వీలైనంత మేరకు సీసీ కెమెరాల ఏర్పాటు, లేకపోతే వీడియో గ్రాఫర్ల సహాయంలో అభ్యర్థుల పరీక్ష రాస్తున్న తీరును చిత్రీకరించనున్నారు. ఎక్కడా తప్పు జరగకుండా, అభ్యర్థులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఓఎంఆర్ షీట్లు భద్రపరిచే స్ట్రాంగ్ రూం వద్ద పటిష్ట భదత్ర ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థుల మెరిట్ ఆధారంగానే ఎంపిక జరగనుంది. ఇంత భారీ మొత్తంలో ఖాళీలను భర్తీ చేస్తుండడం దేశ చరిత్రలోనే రికార్డుగా నిలిచిపోతుందని ఇప్పటికే ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహించి, అర్హులైన అభ్యర్థులకే ఉద్యోగాలను ఇవ్వనుంది. అలాంటి వారిపై సమాచారం ఇవ్వాలి నియోజకవర్గ స్థాయిలో కొంతమంది ఒక ముఠాగా ఏర్పడి తమకు అధికార పార్టీ నాయకులు తెలుసు అని నమ్మిస్తూ నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా తమ దందా నడిపిస్తున్నారు. ఇలాంటి వారిపై తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. డబ్బులు వసూలు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఇదివరకే పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గిరిజాశంకర్ హెచ్చరించారు. పకడ్బందీగా పరీక్షలు గ్రామ, వార్డు సచివాలయాల పోస్టులకు నిర్వహించే పరీక్షలు అత్యంత పకగ్బందీగా జరుగనున్నాయి. సర్వీస్ కమిషన్ పరీక్షలు ఎలా నిర్వహిస్తారో అలానే ఈ పరీక్షలు కూడా నిర్వహిస్తాం. ఓఎంఆర్ షీట్లు, మైనస్ మార్కులుంటాయి. అభ్యర్థులు శక్తివంచన లేకుండా కష్టపడండి. ఎలాంటి అవకతవకలకు చోటు లేదు. ఎవరైన ప్రలోభపెడితే మా దృష్టికి తీసుకురండి. – ఏఎండీ ఇంతియాజ్, కలెక్టర్ ప్రలోభాలకు పాల్పడితే కఠిన చర్యలు ఇటీవల కాలంలో గ్రామ, వార్డు సచివాలయాల పోస్టులకు నిర్వహించే పరీక్షలపై సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. డబ్బులు ఇస్తే ఉద్యోగం వస్తుందని మభ్య పెడుతున్నారు. ఇలాంటి వాటిపై ఇప్పటికే జిల్లాలో ఐదు కేసులు నమోదయ్యాయి. ఎవరైనా పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేసినా.. నిరుద్యోగులను ప్రలోభాలకు గురిచేసినా కఠినచర్యలు తీసుకుంటాం. – ఎం. రవీంద్రనాథ్ బాబు, ఎస్పీ -
వీళ్లెక్కడ ‘లోకల్’?
సాక్షి, గుంటూరు: ప్రకాశం జిల్లాకు చెందిన అల్లూర్‌రెడ్డి 2016 పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్లో ఒకే ఒక్క మార్కు తేడాతో ఉద్యోగానికి దూరమయ్యాడు. గతేడాది ఏపీపీఎస్సీ 1051 పంచాయతీ సెక్రటరీ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిలో ప్రకాశం జిల్లాలో ఎక్కువ పోస్టులుండటంతో ఈసారి ఉద్యోగం సాధిస్తానన్న నమ్మకంతో మరింత కష్టపడి చదివి స్క్రీనింగ్ టెస్ట్‌లో మంచి మార్కులు సాధించాడు. అయితే కోచింగ్ తీసుకుంటున్న గుంటూరు జిల్లాలోనే పరీక్షలు రాయడానికి సౌకర్యంగా ఉంటుందని ఆ జిల్లాను ఎగ్జామినేషన్ సెంటర్‌గా ఎంపిక చేసుకున్నాడు. అయితే ఏపీపీఎస్సీ అల్లూర్రెడ్డిని గుంటూరు జిల్లా నాన్‌లోకల్ అభ్యర్థిగా పరిగణించింది. దీంతో సొంత జిల్లాలో ఎక్కువ పోస్టులున్నా అక్కడా అవకాశాన్ని కోల్పోయి తీవ్రంగా నష్టపోయానని ఆందోళన వ్యక్తంచేస్తున్నాడు. ఇది అల్లూర్‌రెడ్డి ఒక్కడి సమస్యే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది గ్రూప్–3 అభ్యర్థులది. – ఓపెన్ కేటగిరిలో నాన్‌లోకల్‌గా.. ఏపీపీఎస్సీ 2018–19 పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలో చాలా వరకూ అభ్యర్థులు లోకల్ జిల్లాగా తమ సొంత జిల్లాను, ఎగ్జామినేషన్ సెంటర్ కింద కోచింగ్ తీసుకుంటున్న ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్ కింద ఎంపిక చేసుకున్న జిల్లానే పోస్ట్ ప్రిఫరెన్స్ జిల్లాగా ఏపీపీఎస్సీ పరిగణించడంతో చాలామంది ఆయా జిల్లాల్లో నాన్‌లోకల్ అభ్యర్థులుగా మారి.. నాన్‌లోకల్ కింద 20 శాతం పోస్టులకే అర్హులవుతున్నారు. సొంత జిల్లాల్లో ఎక్కువ పోస్టులున్నా వాటికి అర్హత కోల్పోయారు. ఎగ్జామినేషన్ సెంటర్ కోసం ఎంపిక చేసుకున్న జిల్లానే పోస్ట్ ప్రిఫరెన్స్ కింద పరిగణిస్తామని నోటిఫికేషన్లోనే పేర్కొన్నట్టు ఏపీపీఎస్సీ అధికారులు చెబుతున్నారు. అయితే మార్చి 18 నుంచి 24 మధ్య ఎగ్జామినేషన్స్ సెంటర్స్ మార్చుకునే అవకాశం కల్పించినా ప్రిపరేషన్ హడావుడిలో అభ్యర్థులు పట్టించుకోలేదు. తీరా స్క్రీనింగ్ పరీక్ష పూర్తయ్యాక పొరపాటును గ్రహించి లబోదిబోమంటున్నారు. ఈ తరహా పొరపాటు చేసిన వారిలో అధిక శాతం అభ్యర్థులు ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వారే. ప్రకాశం జిల్లాకు చెందిన అభ్యర్థులు గుంటూరులో, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థులు విశాఖపట్టణంలో ఎక్కువ శాతం కోచింగ్‌లు తీసుకుంటుంటారు. దీంతో ఆయా జిల్లాల అభ్యర్థులు తాము కోచింగ్ తీసుకుంటున్న ప్రాంతాలనే ఎగ్జామినేషన్ సెంటర్ల కింద ఎంపిక చేసుకున్నారు. – నోటిఫికేషన్లోనే చెప్పాం.. మా తప్పేం లేదు! కోచింగ్ తీసుకుంటున్న జిల్లాల్లో పరీక్ష సెంటర్లను ఎంపిక చేసుకుని నాన్‌లోకల్ అభ్యర్థులుగా పరిగణించబడుతున్నవారు ఇప్పటికే పలుమార్లు ఏపీపీఎస్సీ చైర్మన్‌ను కలిసి వినతిపత్రాలిచ్చారు. దరఖాస్తులో లోకల్ జిల్లా కాలమ్‌లో ఎంపిక చేసుకున్న జిల్లానే తమ పోస్ట్ ప్రిఫరెన్స్ జిల్లాగా పరిగణించాలని విన్నవించుకున్నారు. 2016–17 గ్రూప్–3 నోటిఫికేషన్ సైతం ఈ తరహా సమస్య తలెత్తగా అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మెయిన్స్‌ను తమ సొంత జిల్లాల్లో రాసుకునేలా వెసులుబాటు కల్పించి, అభ్యర్థుల సొంత జిల్లాలనే పోస్ట్ ప్రిఫరెన్స్ జిల్లాలుగా పరిగణించారు. అయితే ప్రస్తుత నోటిఫికేషన్లో అభ్యర్థులు పలుమార్లు ఏపీపీఎస్సీ చైర్మన్‌ను కలిసి సమస్య తెలియజేసినా.. ‘మేం నోటిఫికేషన్లో స్పష్టంగా చెప్పాం.. మా తప్పేం లేదు’.. అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
పాలన ఇక గాడిలో..
అశ్వాపురం: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల నియామకానికి లైన్‌క్లియర్ అయింది. నియామకాలకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కార్యదర్శుల పోస్టుల ఎంపికలో పారదర్శకత పాటించలేదంటూ కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో నియామకాలు నిలిచిపోయాయి. జిల్లాలో 479 పంచాయతీలు ఉండగా 387 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలకు ఎన్నికల సంఘం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో ఈ మొత్తం పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది. డిసెంబర్లోనే సర్టిఫికెట్ల పరిశీలన... రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసి, అక్టోబర్ 10న రాత పరీక్ష నిర్వహించింది. ఉత్తీర్ణత సాధించిన వారి మార్కుల ఆధారంగా జాబితా ప్రకటించారు. డిసెంబర్ 20న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేశారు. ఆ నెలలోనే పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా.. నియామక ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో నియామకాలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత మళ్లీ నియామకాలు చేపట్టాలని కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.. పంచాయతీ ఎన్నికల కోడ్ రావడంతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యమైంది. జనవరి 31న పంచాయతీ ఎన్నికల కోడ్ ముగియడంతో నియామకాలు చేపడతారని అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల కోడ్ రావడంతో ఇక ఇప్పట్లో నియామక ప్రక్రియ ఉండదని అభ్యర్థులు ఆందోళన చెందారు. అయితే ఎట్టకేలకు ఎన్నికల సంఘం నియామక ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో తమకు కొలువులు దక్కుతాయని అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యదర్శుల కొరతతో కుంటుపడిన పాలన... ఫిబ్రవరి 2న జిల్లాలోని 479 పంచాయతీలలో నూతన పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టినా.. పంచాయతీ కార్యదర్శుల కొరతతో పాలన కుంటు పడింది. జిల్లాలో 479 పంచాయతీలలో 92 మంది మాత్రమే పంచాయతీ కార్యదర్శులు ఉండటంతో ఒక్కొక్కరు నాలుగు, ఐదు పంచాయతీలకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో సమస్యలు ఎక్కడివక్కడే పేరుకుపోయాయి. కార్యదర్శులు లేకపోవడంతో నూతన పాలకవర్గాలు సైతం తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య చర్యలు, పంచాయతీ నిర్వహణ, ఇంటి పన్నుల వసూలు, వీధిలైట్లు, జనన, మరణ ధ్రువపత్రాల జారీ తదితర పనుల విషయంలో ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నాయి. ఇంకా ఆదేశాలు రాలేదు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి ఎన్నికల సంఘం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. కానీ మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. జిల్లాలో 387 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఈ నియామకాలకు సంబంధించి పంచాయతీరాజ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – ఆర్.ఆశాలత, డీపీఓ -
రోజుకో మాట..పూటకో నిర్ణయం
సాక్షి, గుంటూరు: 2014 ఎన్నికల ముందు ‘జాబు రావాలంటే బాబు రావాలి..’ అన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను నిలువునా ముంచారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలపై రోజుకో మాట.. పూటకో నిర్ణయం తీసుకుంటూ గత నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నారు. ఇదిగో అదిగో అంటూ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా కాలం వెళ్లదీసిన ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ కంటితుడుపు చర్యగా అరొకర పోస్టులు ప్రకటించిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఇటీవల విడుదల చేసిన పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీ నోటిఫికేషన్లో తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం 1,051 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మూడేళ్లుగా 7 లక్షల మంది ఎదురుచూపులు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శి పోస్టులన్నింటినీ ప్రభుత్వం భర్తీ చేస్తుందనే ఆశతో సుమారు 7 లక్షల మంది నిరుద్యోగులు గత మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కోసం ఒక్కో విద్యార్థి లక్షలు ఖర్చుపెట్టుకుని పట్టణాలకు వెళ్లి కోచింగ్ తీసుకుంటున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం కేవలం 1051 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. తాజా నోటిఫికేషన్లో వైఎస్సార్ జిల్లాలో ఒక్క పోస్టు కూడా లేకపోవడం దారుణమని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మే నెలలో ఇచ్చిన జీవోలో 104 ఖాళీలు చూపించి ఇప్పుడు ఒక్కటీ లేదనడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే తరహాలో కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి జిల్లాల్లో పోస్టులను భారీగా కుదించారు. కొన్ని రిజర్వేషన్ కేటగిరిల్లోనూ ఒక్క పోస్టు కూడా లేకపోవడం గమనార్హం. పూటకో మాట ఇలా... - 2017 అక్టోబర్ 9న దీపావళి సందర్భంగా 5,800 పంచాయతీ కార్యదర్శి పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. - 2018 ఫిబ్రవరి 11న 4వేల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదానికి ప్రతిపాదన - 2018 మార్చి 27న అవుట్సోర్సింగ్ విధానంలో పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి జీఓ నంబర్–38 జారీ - ఆ జీవోపై నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో మే 2న జీఓ నెంబర్ 39 ద్వారా 1,511 పంచాయతీ కార్యదర్శి పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నట్టు వెల్లడి. - అదే ఏడాది డిసెంబర్ 21న 1051 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. (ఇందులో 1000 మాత్రమే కొత్తవి కాగా, 51 బ్యాక్లాగ్ పోస్టులు) ఇలా 2017 నుంచి పూటకో మాట చెబుతూ 2017లో 5,800 వేల ఖాళీలు చూపించిన ప్రభుత్వం, ఇప్పుడు 1051కి తగ్గించడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. రెండేళ్లుగా కష్టపడి చదువుతున్నా.. పంచాయతీ కార్యదర్శి పోస్టుల నోటిఫికేషన్ కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా. తీరా చూస్తే మా జిల్లాకు ఒక్క పోస్టూ లేదు. ప్రతిపక్ష నేత ఈ జిల్లాకు చెందిన వాడనే ప్రభుత్వం రాజకీయ కోణంలో ఆలోచిస్తూ మా జీవితాలతో ఆడుకుంటోంది. ఇది దారుణం. – పి.జనార్దన్‌రెడ్డి, వైఎస్సార్ జిల్లా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2017లో 5,800 ఖాళీలు ఉన్నాయని చెప్పిన ప్రభుత్వమే ఇప్పుడు 1;000 పోస్టులే చూపడం దారుణం. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న టీడీపీకి వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులు బుద్ధి చెబుతారు. – బి.ఎస్.కె. అరుణ్‌కుమార్,నిరుద్యోగ ఐక్యవేదిక కో–కన్వీనర్, గుంటూరు 5,800 పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.. ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తారని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు రూ.లక్షలు ఖర్చుపెట్టి కోచింగ్‌లు తీసుకుని ఎదురు చూస్తున్నారు. మంత్రి గతంలో ప్రకటించినట్టుగా 5,800 పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం. – కె.వెంకట సుబ్రమణ్యం,నిరుద్యోగ ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ -
అభ్యర్థుల్లో ఆందోళన !
చుంచుపల్లి: గ్రామపంచాయతీ జూనియర్ కార్యదర్శుల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ హైకోర్టు ఆదేశాలతో సందిగ్ధంలో పడినట్లు కనిపిస్తోంది. అనేక ఏళ్లుగా ఖాళీగా ఉన్న కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అక్టోబర్ 10న రాత పరీక్ష నిర్వహించింది. ఇటీవలే ఫలితాలు కూడా వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 479 పంచాయతీల్లో ఖాళీగా ఉన్న 387 కార్యదర్శుల పోస్టులు ఈ కొత్త ఉద్యోగాలతో భర్తీ కానున్నాయి. అయితే ఇటీవల ప్రకటించిన ఫలితాలలో అవకతవకలు జరిగాయని, ఈ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా ఉందని కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో నియామక ఉత్తర్వులను నిలిపివేయాలని గత బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు నియామకాలు జరుపవద్దని కోర్టు ఆదేశించింది. దీంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కొలువులకు ఎంపికైన అభ్యర్థులు ఆందోళనలో పడ్డారు. జిల్లాలో ఎంపికైన 387 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయింది. అయితే కోర్టు ఉత్తర్వులతో వారిలో కొంత నిరాశ ఎదురైంది. నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు.. జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఎంపిక జాబితాలో ఒకే అభ్యర్థి నంబరును పలుసార్లు ప్రకటించటం, కనీస అర్హత సాధించని అభ్యర్థులు పేర్లు ఎంపిక జాబితాలో ఉండడంతో మిగిలిన వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల వారీగా ర్యాంకులను ప్రకటించకుండానే మెరిట్ జాబితాను వెల్లడించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగ నియామకాల విషయంలో 1:3 పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేయలేదన్న ఆరోపణలు సైతం వస్తున్నాయి. రిజర్వేషన్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 50 శాతానికి మించి పోస్టులు కేటాయించడాన్ని కూడా హైకోర్టు తప్పుబట్టినట్టు తెలుస్తోంది. ఫలితాల ప్రకటనలో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ అనంతరం ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయడంతో అర్హత సాధించిన అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. నిబంధన ప్రకారం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన అభ్యర్థులనే నియమించాల్సి ఉంటుంది. కానీ ఈ విషయమై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో గిరిజన అభ్యర్థులు సైతం ఆందోళనకు గురవుతున్నారు. ఎంపిక ప్రక్రియ మరింత జాప్యం.. మొదట నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 25న ఎంపికైన అభ్యర్థులకు కలెక్టర్ చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందించాల్సి ఉంది. కానీ కోర్టు ఆదేశాలతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో 15 రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే ఈ ఉద్యోగాల భర్తీ ఇంకా జాప్యం జరిగే అవకాశం ఉంది. కొత్త పంచాయతీల పాలకవర్గం వచ్చే లోపైనా ఈ నియామక ప్రక్రియ పూర్తవుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు ఆదేశాల ప్రకారంనడుచుకుంటాం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాల విషయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం నియామక ఉత్తర్వులను నిలిపివేసి ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమాన్ని పూర్తి చేశాం. మళ్లీ కోర్టు ఆదేశాల ప్రకారం నియామక ఉత్తర్హుల ప్రక్రియ కొనసాగిస్తాం. జిల్లాలో ఎలాంటి అవకతవకలు జరిగిన దాఖలాలు లేవు. ఎంపికైన అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – ఆర్ ఆశాలత:డీపీఓ -
ప్రభుత్వ ఉద్యోగాలకు గండి
సాక్షి, హైదరాబాద్: ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చంద్రబాబు సర్కారు ఎంతకీ అనుమతివ్వడం లేదు. పంచాయతీరాజ్ శాఖలో ఖాళీగా ఉన్న వేల పోస్టులను భర్తీ చేయడానికి ఆ శాఖ అధికారులు ఆరేడు నెలలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నివేదికలు అందజేస్తున్నప్పటికీ ఆయన నుంచి స్పందన కరువైంది. ఈ శాఖలో ఒక్క పంచాయతీ కార్యదర్శుల పోస్టులే దాదాపు 2,442వరకు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 12,918 గ్రామ పంచాయతీలు ఉన్నప్పటికీ.. రెండు, మూడు చిన్న పంచాయతీలకు ఒక్కటే కార్యదర్శి పోస్టు మంజూరు చేయడంతో 8,742 పంచాయతీ కార్యదర్శుల పోస్టులకే ప్రభుత్వ అనుమతి ఉంది. వీటిల్లోనూ ఇప్పుడు 2,442 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి అనుమతి తెలపాలంటూ అధికారులు ఆరు నెలలుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదికలు అందజేస్తూనే ఉన్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇవ్వడానికి సుముఖంగా లేని చంద్రబాబు.. ఖాళీగా ఉన్న పోస్టులను ఇతర శాఖలో అదనంగా ఉన్న ఉద్యోగులతో భర్తీ చేయాలంటూ సమీక్ష సమావేశాలలో అధికారులకు మౌఖిక సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఎంపీడీవో, ఈవోపీఆర్డీ పోస్టులకు మంగళం పంచాయతీరాజ్ శాఖలోనే 128 ఎంపీడీవో, 160 ఈవోపీఆర్డీ పోస్టులను ప్రభుత్వం ఇప్పటికే మాయం చేసింది. ఖాళీగా ఉన్న ఈ పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేయాల్సి ఉండగా.. ఆ పోస్టులన్నింటినీ శాఖలో కిందిస్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చి భర్తీ చే సింది. ఉమ్మడి రాష్ట్రంలో 2012 సంవత్సరంలో ఎంపీడీవో పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయి, పరీక్ష కూడా నిర్వహించిన తర్వాత కోర్టు తీర్పు కారణంగా ఆ పరీక్షను రద్దు చేశారు. ఆ పోస్టులను ప్రభుత్వం ప్రమోషన్ల పద్ధతిన భర్తీ చేసింది. ఉపాధ్యాయులతో కార్యదర్శుల పోస్టుల భర్తీ ప్రస్తుతం ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల పోస్టులను విద్యా శాఖలో అదనంగా ఉన్న ఉపాధ్యాయులతో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అతి తక్కువమంది పిల్లలు ఉన్న స్కూళ్లను వాటికి సమీపంలోని మరొక స్కూలులో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రస్తుతం పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు ఆ శాఖలో అదనంగా ఉన్నారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇలా అదనంగా ఉన్న ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై పంచాయతీరాజ్ శాఖకు బదిలీ చేసి, ఉపాధ్యాయ పోస్టులో ఉండే జీతంతోనే వారందరికీ పంచాయతీ కార్యదర్శులుగా బాధ్యతలు అప్పగించాలని ఆలోచిస్తోంది. ఇటీవల పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు అధికారుల సమీక్ష సమావేశంలో ఈ విషయంపై ఉన్నతాధికారుల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి తనకు ఒక నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. -
ఉద్యోగం ఇచ్చారు.. పోస్టింగ్ ఆపారు..
అతడొక అభాగ్యుడు. ఆకలితో నకనకలాడుతున్నాడు. నోటి వద్దకు అన్నం ముద్ద వచ్చింది. ప్రాణం లేచొచ్చింది. ఆవురావురుమంటూ తినేందుకు నోరు తెరిచాడు... అంతలోనే ఆ ముద్ద వెనక్కి జరిగింది. అది ముందుకు రాదు.. వెనక్కు వెళ్లదు..! ఇక, ఆ అభాగ్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఇలాంటి అభాగ్యులు మన జిల్లాలో 35మంది ఉన్నారు. వారి నోటి కాడి ముద్ద ఎలా దూరం దూరంగా జరిగిందో చదవండి. - ఖమ్మం జడ్పీసెంటర్ ఇదీ నేపథ్యం జిల్లావ్యాప్తంగా 83 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకిగాను ఏపీపీఎస్సీ ద్వారా గత ఏడాది డిసెంబర్ 31ననోటిఫికేషన్ వెలువడింది. ఫిబ్రవరి 23న పరీక్షలు జరిగారుు. మార్చి 24న ఫలితాలు వెలువడ్డాయి. అర్హులైన అభ్యర్థుల ధ్రువపత్రాలను జూన్ 9న జిల్లాపరిషత్ అధికారులు పరిశీలించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 83 పోస్టులను భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ నుంచి జిల్లా అధికారులకు ఉత్తర్వులు వచ్చారుు. జూలై 11న 83 మంది అభ్యర్థులకు అధికారులు నియూమక పత్రాలు (అపాయింట్మెంట్ లెటర్లు) ఇచ్చారు. వీరిలో 35మందిని ఏడు (పోలవరం ముంపు) మండలాలకు కేటారుుంచారు. వీరిని మినహారుుం చి, మిగతా 48మందికి పోస్టింగ్ ఇచ్చారు. విభజనతో బ్రేక్ రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రాకు వెళ్లడంతో ఈ 35మంది పోస్టింగ్ ప్రక్రియకు బ్రేక్ పడింది. వీరికి పోస్టింగ్ ఎలా ఇవ్వాలో స్పష్టత ఇవ్వాలంటూ అప్పటి కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి జవాబు రాలేదు. ఈ అభ్యర్థులు నాటి నుంచి.. అంటే, గత ఐదు నెలలుగా పోస్టింగ్ కోసం జిల్లాపరిషత్ అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. రాష్ట్రస్థాయి అధికారులను కలిసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం కనిపించలేదని వీరు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయూంలో ఈ పరీక్షలు జరిగారు. 35 పోస్టులు ఏపీకి వెళ్లారుు. మిగిలిన 48 పోస్టులను మాత్రమే భర్తీ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చారుు’’ అని, జిల్లాపరిషత్ అధికారులు చెబుతున్నారు. అపారుుంట్‌మెంట్ లెటర్లు అందుకున్న మిగిలిన 35మందికి పోస్టింగ్ కేటారుుంపు విషయమై తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదని వారు అంటున్నారు. జిల్లా పరిషత్‌లో నిరసన ఐదు నెలలుగా కాళ్లరిగేలా తిరుగుతున్నప్పటికీ తమను అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ ఈ 35మంది అభ్యర్థులు గురువారం జిల్లాపరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తమతోపాటు అపారుుంట్‌మెంట్ లెటర్లు తీసుకున్న 48మంది ఉద్యోగం చేస్తుండగా, తాము మాత్రం ఇలా చెప్పులరిగేలా తిరుగుతున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వీరి వద్దకు డీపీవో రవీందర్, జిల్లాపరిషత్ ఏఓ వచ్చి సర్దిచెప్పేందుకు యత్నించారు. ‘‘35 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశాం. ప్రభుత్వం నిర్ణయూనుసారం చర్యలు తీసుకుంటాం’’ అని, వారు చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం వైఖరి కారణంగానే తాము ఇబ్బందులు పడుతున్నామని అభ్యర్థులు అన్నారు. వారిని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. -
83 పోస్టులకు 37,984 మంది..పంచాయతీ కార్యదర్శి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదివారం రాత పరీక్షలు నిర్వహించనుంది. జిల్లాలోని 83 పోస్టులకుగాను 37,984 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షల కోసం జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం డివిజ న్లలో 96 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులు సకాలంలో హాజరుకావాలని, పరీక్ష ప్రారంభమైన పది నిమిషాల వరకు లోపలికి అనుమతిస్తామని, ఆ తర్వాత వచ్చిన అభ్యర్థులను లోనికి అనుమతించేది లేదని అధికారులు చెబుతున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జనరల్ స్టడీస్, అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు రూరల్ డెవలప్మెంట్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు శుక్రవారం చీఫ్ సూపరింటెండెంట్లకు, రూట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైజనింగ్ ఆఫీసర్లకు ఏపీపీఎస్సీ అధికారి వెంకటాద్రి ప్రత్యేక శిక్షణను ఇచ్చారు. ఇప్పటికే ప్రశ్నాపత్రాలు జిల్లా ఖజానా కార్యాలయంలో భారీ భద్రత మధ్య ఉంచారు. పరీక్షకేంద్రాల వద్ద జిరాక్స్, బుక్‌స్టాల్స్‌ను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలకు అభ్యర్థులు సకాలంలో హాజరయ్యేందుకు ప్రత్యేక బస్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద మంచినీరు, మెడికల్ కిట్లు అందుబాటు లో ఉంచాలని జేసీ సురేంద్రమోహన్ వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల కోసం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు 22 రూట్లను విభజించారు. వాటిలో ఖమ్మంలో 77 సెంటర్లకు 17 రూట్లు, కొత్తగూడెంలో 19 సెంటర్లకు 5 రూట్లను ఏర్పాటు చేశారు. పరీక్షలకు ఫ్లయింగ్ స్క్వాడ్‌గా రెవెన్యూ డివిజన్ అధికారులను నియమించారు. జిల్లావ్యాప్తం గా 27మంది లైజన్ అధికారులు, 96 మంది అసిస్టెంట్ లైజన్ అధికారులు, 96 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 1739 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఖమ్మంలో 1463 మంది, కొత్తగూడెంలో 276మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఈ పరీక్షల నిర్వహణకు జిల్లా పరిషత్ సీఈఓ జయప్రకాష్ నారాయణను కో-ఆర్డినేటర్‌గా నియమించారు. జిల్లాలో మొత్తం 16మంది అంధులు పరీక్షలకు హాజరవుతున్నారు. వారిలో ఆరుగురు కొత్తగూడెంలో, పదిమంది ఖమ్మంలో పరీక్షలు రాయనున్నారు. వీరికి లేఖకులను సహాయం గా తెచ్చుకునే అవకాశం కల్పించారు. అయితే పరీక్షకేంద్రాల్లో అదే పాఠశాలలు, కళాశాలలకు చెందిన సిబ్బందిని ఇన్విజిలేటర్లుగా నియమించారని, అక్కడ అవకతవకలు జరిగే అవకాశం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఆయా కళాశాలల్లో పరీక్షలకు ముందు ఇన్విజిలేటర్లకు డ్రా ద్వారా గదులు కేటాయిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. -
ఆన్‘లైన్’...పడిగాపులు
విజయనగరం కంటోన్మెంట్ న్యూస్‌లైన్:నిరుద్యోగుల ఆశలకు సాంకేతిక లోపా లు అడ్డుకట్టవేస్తున్నాయి. పంచాయతీ కార్యదర్శిపోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అసలే తక్కువ సమయం ఇచ్చారు. ఆ పై సోమవారమే ఆఖరి రోజు కావడంతో మీసేవా కేంద్రాల వద్ద వందల సంఖ్యలో క్యూ కట్టిన అభ్యర్థులు వైబ్‌సైట్ సర్వర్ డౌన్ కావడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏ రాత్రికైనా దరఖాస్తును ఆన్లైన్లో పెట్టవచ్చన్న ఆశతో రాత్రి వరకూ లైన్లోనే పడిగాపులు కాశారు. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ అయ్యే గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు మొదటి రోజు నుంచీ నానా తంటాలు పడుతున్నారు. దరఖాస్తుదారులు ఫీజు చెల్లించేందుకు సోమవారం ఆఖరు తేదీ కావడం...ఇదే రోజున ఉదయం నుంచి ఏపీపీఎస్సీ సర్వర్ పనిచేయకపోవడంతో చాలామంది నిరుద్యోగులు ఆందోళనకు గురయ్యా రు. అయితే 21వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు గడువు పెంచినప్పటికీ అభ్యర్థుల్లో ఆందోళన తొలగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 2,677 గ్రేడ్-4 పంచాయతీలకు కార్యదర్శులను నియమించేందుకు ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా గత ఏడాది డిసెంబర్ 30న నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో జిల్లాకు సంబంధించి 201 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు . జనవరి నాలుగు నుంచి 22 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్లో ప్రకటించారు. అయితే ఈ నెల 20వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా ఎవరైతే దరఖాస్తు ఫీజు చెల్లిస్తారో... వారికి ఈనెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో చివరిరోజు 20వ తేదీ (సోమవారం) పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత మీసేవా కేంద్రాలు వద్ద బారులు తీరారు. అయితే ఉదయం నుంచి ఏపీపీఎస్సీ సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడంతో వారికి పడిగాపులు తప్పలేదు. ఉదయానికే కేంద్రాల వద్దకు చేరుకున్న వారికి సాయంత్రం ఆరు గంటల వరకు ఆన్లైన్ నమోదు జరగలేదు. దీంతో మధ్యాహ్నం భోజనం చేయకుండా వేచి చూసిన అభ్యర్థులు ఒకింత అసహనానికి గురయ్యారు. వందల సంఖ్యలో మీ సేవా కేంద్రాలకు వచ్చిన వారిలో కేవలం పదుల సంఖ్యలో మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభించింది. అసలే తక్కువ రోజులు... ఆపై ఆన్లైన్ తంటాలు: నోటిఫికేషన్ జారీ నుంచి దరఖాస్తు చేసుకునేంత వరకు ఏపీపీఎస్సీ ఇచ్చిన గడువు తక్కువగా ఉండడం పట్ల నిరుద్యోగ యువత నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేవలం 17 రోజుల వ్యవధి ఉండగా అందులో పండగ మూడు రోజులు మినహాయిస్తే మిగిలింది 14 రోజులు మాత్రమే. అధిక సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునేందుకు ఆసక్తి కనబరిచినట్లు సమాచారం. ఇందులో మొదటి రోజు నాల్గవ తేదీ, చివరి రోజు 20వ తేదీల్లో సర్వర్ సక్రమంగా పని చేయకపోవడం నిరుద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. దరఖాస్తులు చేసుకునేందుకు గడువు పెంచాలన్న వారు డిమాండ్ చేశారు. -
పంచాయతీ కొలువులు
-
106 పంచాయతీ కార్యదర్శి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల(గ్రేడ్-4) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ వెలువడింది. జిల్లాలో 106 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి రిజర్వేషన్, రోస్టర్ వివరాలు కూడా అధికారులు ప్రకటించారు. జనవరి 4నుంచి 22వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు చెల్లింపునకు జనవరి 20 చివరి తేదీగా ప్రకటించారు. పరీక్షలు జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 23న నిర్వహిస్తారు. అభ్యర్థుల వయస్సు 01-07-2013 నాటికి 18సంవత్సరాలు పూర్తయి 36 సంవ్సరాల లోపు ఉండాలి. విద్యార్హత డిగ్రీ ఉత్తీర్ణతగా నిర్ణయించారు. కొలువుల కోలాహలం ఒకవైపు ఇప్పటికే డీఎస్సీ ద్వారా చేపట్టిన 135 కార్యదర్శుల పోస్టుల ప్రక్రియ కోర్తు ఉత్తర్వులతో నిలిచిపో గా.. ప్రభుత్వం తాజా ప్రకటనతో పంచాయతీలో మరోసారి ఉద్యోగాల భర్తీ కొలాహలం మొదలైంది. అయితే మొత్తం 241 పోస్టుల భర్తీ జరగుతున్నా జిల్లాలో ఖాళీలు పూర్తిస్థాయిలో భర్తీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే డీఎస్సీ ద్వారా భర్తీచేసే 135 పోస్టుల్లో.. ఇప్పటికే కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న వారికి 25మార్కుల వెయిటేజీ ఇస్తున్నారు. దీంతో వారే ఎక్కువగా ఈ పోస్టులకు ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇక మిగిలింది ప్రస్తుతం నోటిఫికేషన్ ఇవ్వనున్న 106 పోస్టులు మాత్రమే. 636 క్లస్టర్లకు 350 మంది కార్యదర్శులు జిల్లాలో మొత్తం 962 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం వీటిని పంచాయతీ క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. జిల్లాలో 1014 పంచాయతీలు ఉన్నప్పుడు 656 క్లస్టర్లు ఏర్పాటు చేయగా.. నగర పంచాయతీలు, మున్సిపాలీటిలు, కార్పొరేషన్లో విలీన పంచాయతీలను మినహారుుస్తే ప్రస్తుతం సుమారు 636 క్లస్టర్ల వరకు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 350 మంది కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 124 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తుండగా మిగతా వారు రెగ్యులర్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. -
గ్రేడ్-4 కార్యదర్శి పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ఖాళీగా ఉన్న 25 గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాత పరీక్ష ద్వారా వీటిని భర్తీ చేయడానికి ఏపీపీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. జనవరి 4 నుంచి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం నిర్ధేశించిన రూ.100 ఫీజును జనవరి 20లోగా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు ఫిబ్రవరి 23న ఏలూరులో రాత పరీక్ష నిర్వహిస్తారు. 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు మార్చి 23న కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ నియామక ఉత్తర్వులను ఇస్తుంది. అభ్యర్థుల వయసు 2013 జూలై 1 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్ల సడలింపు ఇచ్చారు. రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలు : జిల్లాలో గ్రేడ్-4 కార్యదర్శి పోస్టులు 25 ఖాళీగా ఉన్నాయి. వీటిలో జనరల్‌కు 13, మహిళలకు 12 పోస్టులను కేటాయించారు. ఓసీ విభాగంలో జనరల్‌కు 6, మహిళలకు 4, బీసీ-ఏలో జనరల్‌కు 1, మహిళకు 1, బీసీ-బీలో జనరల్‌కు 1, మహిళకు 1, బీసీ-సీలో జనరల్‌కు 1, బీసీ-డీలో మహిళకు 1, బీసీ-ఈలో మహిళకు 1, ఎస్సీ కేటగిరీలో జనరల్‌కు 2, మహిళలకు 2, ఎస్టీ కేటగిరీలో జనరల్‌కు 1, మహిళకు 1, ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీలో మహిళకు 1 వికలాంగుల కేటగిరీలో మహిళకు1 చొప్పున పోస్టులు కేటాయించారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకో..
అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు సోమవారం జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతపురం జిల్లాలో 202 పోస్టులు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. ఇందులో 132 జనరల్, 70 మహిళలకు కేటాయిస్తూ రోస్టర్ విడుదల చేసింది. జనవరి 4 నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 22వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు ఓసీ, బీసీలు రూ.100, ఎస్సీ, ఎస్టీలు రూ.80. ఇతర వివరాలను ఠీఠీఠీ.్చఞటఞఛి.జౌఠి.జీ వెబ్సైట్లో ఉంచారు. పరీక్ష 300 మార్కులకు ఉంటుంది. పేపర్-1 జనరల్ స్టడీస్ 150 మార్కులకు, పేపర్-2 గ్రామీణం 150 మార్కులకు ఉంటుంది. అర్హతలు.. డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 2013 జూలై 1 నాటికి 36 ఏళ్లకు మించరాదు. జనగణన విభాగంలో తాత్కాలికంగా పని చేస్తున్న వారికి 3 ఏళ్ల వెసులుబాటు ఉంటుంది. ఎక్స్ సర్వీస్మన్లకు మూడేళ్లు, ఎన్సీసీకి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు పదేళ్లు వెసులుబాటు కల్పించారు. -
నిరుద్యోగులకు శుభవార్త
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: జిల్లాలో ఖాళీగా ఉన్న 86 పంచాయతీ కార్యదర్శుల(గ్రేడ్-4) పోస్టుల భర్తీకి ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలో 86 పోస్టులు భర్తీ కానున్నాయి. గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన 18 నుంచి 36 ఏళ్ల లోపు వారు దర ఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దరఖాస్తులను జనవరి 4 నుంచి 22వ తేదీలోగా అన్లైన్లోనే చేయాలి. ఫీజు చెల్లింపునకు తుది గడువు జనవరి 20వ తేదీ. జనరల్ అభ్యర్థులకు రూ.100. మిగిలిన వారికి రూ.80 ఫీజుగా నిర్ణయించారు. -
కొలువుల జాతర
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : కొత్త సంవత్సరంలో కొలువుల జాతర సాగనుంది. ఇప్పటికే ప్రభుత్వం వీఆర్వో, వీఆర్ఏ పోస్టులకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. డీఎస్సీ కూడా నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. దీంతో నిరుద్యోగుల్లో ఉద్యోగ అవకాశాలపై ఆశలు పెరుగుతున్నాయి. సోమవారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీ స్ కమిషన్(ఏపీపీఎస్సీ) పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్-4) పోస్టుల నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,677 పోస్టులను భర్తీ చేయనున్నారు. జిల్లా వారీగా పో స్టులు, రిజర్వేషన్లు ఖరారు చేశారు. 2013 జూలై 1 నాటికి వయస్సు 18 ఏళ్లు పూర్తి చేసుకొని 36 ఏళ్లు మించకుండా ఉండాలి. పేపర్-1లో జనరల్ స్టడీస్ 150 మా ర్కులు, పేపర్-2 గ్రామీణాభివృద్ధి 150 మార్కులు ఉంటాయి. జిల్లాకు 241 పోస్టులు.. జిల్లాలో 580 క్లస్టర్ పంచాయతీలు ఉండగా ప్రస్తుతం 190 పంచాయతీలకు కార్యదర్శులు ఉన్నారు. తాజాగా ఏపీపీఎస్సీ నుంచి 241 పోస్టులు భర్తీ కానున్నప్పటికీ జిల్లాలో ఇంకా 149 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉండనున్నాయి. అయితే 120 పోస్టులు పదోన్నతుల ద్వారా గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3 పంచాయతీ కార్యదర్శులను నియమించే అవకాశాలు ఉంటాయి. కాగా కొత్తగా భర్తీ చేయనున్న 241 పోస్టుల్లో 80 శాతం స్థానికులతో, 20 శాతం స్థానికేతరులకు అవకాశం ఉంది. ఇందులో జనరల్ 155, మహిళలకు 86 పోస్టులు కేటాయించారు. వయో పరిమితి పరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్లు సడలింపునిచ్చారు. ఆన్లైన్ ద్వారా వెబ్సైట్ ఠీఠీఠీ.్చఞటఞటఛి.జౌఠి.జీ లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. కలెక్టర్, జిల్లా సెలక్షన్ కమిటీ ఈ ఎంపిక విధానాన్ని పర్యవేక్షిస్తారు. దరఖాస్తు విధానంలో, హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌లో అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురైన పక్షంలో హైదరాబాద్‌లోని 040-23120055 నెంబర్‌కు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సంప్రదివచవచ్చు. appschelpdesk@gmail.com లోనూ సంప్రదించవచ్చు. మార్చి చివరి వరకు పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. -
పంచాయతీ కొలువులు
సాక్షి, గుంటూరు: ఏపీపీఎస్సీ ద్వారా పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నూతన సంవత్సరం కానుకగా ఆశావహులకు తీపి కబురందించింది. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదలతో జిల్లాలో పలువురు నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారమే ఏపీపీఎస్సీ ఛైర్మన్ బిశ్వాల్ ప్రకటన జారీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రం మొత్తం 2,677 ఖాళీల భర్తీకి గతంలోనే ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో జిల్లాలో 26 పోస్టుల భర్తీకి అవకాశం పంచాయతీ కొలువులు దక్కింది. అయితే జిల్లాలో 50 పోస్టులు ఖాళీలున్నాయి. జిల్లాలో మొత్తం 1,011 పంచాయతీలు వున్నాయి. క్లస్టర్లుగా విభజించడంతో 575 క్లస్టర్లున్నాయి. పంచాయతీ కార్యదర్శులు 525 మంది వరకు ఉన్నారు. ఏపీపీఎస్సీ ప్రకటనతో ఇవన్నీ భర్తీ జరుగుతాయని అధికారులు భావించారు. అయితే 26 పోస్టుల భర్తీకే ఏపీపీఎస్సీ అనుమతివ్వడం గమనార్హం. ఆబ్జెక్టివ్ టైప్‌లో మొత్తం 300 మార్కుల (150 చొప్పున)కు రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపరు జనరల్ స్టడీస్, రెండో పేపరులో గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలపై ప్రశ్నలుంటాయి. జనవరి 4 నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 23న పరీక్ష ఉంటుంది. మార్చి 24న జిల్లా స్థాయిలో ర్యాంకింగ్ జాబితాలు తయారు చేస్తారు. డిగ్రీ అర్హతతో 18 ఏళ్ల నుంచి 36 లోపు జనరల్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 39 ఏళ్ల వరకు వయోపరిమితి ఉంది. వికలాంగులకు 46 ఏళ్ల వరకు వయోపరిమితి ఉంది. వివరాలకు www.apspsc.gov.in లో తెలుసుకోవచ్చు. -
29 పోస్టులు దరఖాస్తులు 5808
ఇందూరు, న్యూస్‌లైన్ : గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తా యి. ఈ నెల 6న జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. చాలాకాలం తర్వాత కార్యదర్శి పోస్టుల భర్తీ చేయనుండడంతో నిరుద్యోగులు వేల సంఖ్యలో పోటీ పడుతున్నారు. అధికారులు ప్ర తి రోజు 500 నుంచి 1500 వరకు దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 29 పోస్టులకు గాను 5,808 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు రెండు వందల మంది బరిలో ఉన్నారు. దరఖాస్తులకు గడు వు చివరి రోజైన శనివారం జిల్లా పం చాయతీ కార్యాలయం అభ్యర్థులతో కిక్కిరిసిపోయింది. అభ్యర్థులకు దరఖాస్తు ఫారాలు ఇవ్వడానికి మూడు కౌంటర్లు, పూరించిన దరఖాస్తులను స్వీకరించడానికి మూడు కౌంటర్లను ఏర్పాటు చేశారు. అతి తక్కువ పోస్టులకు ఇంత పెద్ద మొత్తంలో దరఖాస్తు లు రావడం ఇదే మొదటి సారని అధికారులు పేర్కొంటున్నారు. దరఖాస్తులను అధికారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ కేటగిరి కింద విభజిస్తారు. అనంతరం పరిశీలన చేసి దరఖాస్తులు సరి గ్గా చేసుకున్న అభ్యర్థుల వివరాలను నోటీసు బోర్డుపై పెడతారు. ఈ ప్రక్రి య పూర్తయ్యేవరకు 15రోజులు పట్టవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. పోస్టులు రావని తెలిసినా.. గ్రామ కార్యదర్శి పోస్టులు తమకు దక్కవని తెలిసినా.. అదృష్టాన్ని పరీ క్షించుకునేందుకే చాలా మంది అభ్యర్థులు దరఖాస్తులు చేకున్నారు. ప్రభుత్వం కల్పించిన వెయిటేజీ మార్కులతో మొత్తం 29 పోస్టుల్లో సుమారు 20 పోస్టులు కాంట్రాక్టు కార్యదర్శుల కే సొంతం కానున్నాయి. అంటే మిగి లే తొమ్మిది ఉద్యోగాలను ఐదు వేల మందికి పైగా ఆశిస్తున్నారు. -
రెండు పోస్టులు.. 20 వేలకు పైగా దరఖాస్తులు
కాకినాడ, న్యూస్‌లైన్ : ఉన్నవి రెండే ఉద్యోగాలు. కానీ, వాటి కోసం వచ్చిన దరఖాస్తులు మాత్రం 20వేలకు పైనే. ఇది అతిశయోక్తి కాదు, నిరుద్యోగ సమస్యకు నిలువుటద్దం పట్టే అచ్చమైన నిజం. జిల్లాలో ఖాళీగాఉన్న 68 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ఈనెల 6న నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిలో 62 పోస్టులకు ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న వారు అర్హులు. మిగిలిన ఆరింటిలో రెండు వికలాంగులకు, రెండు మహిళలకు కేటాయించారు. ఇక మిగిలిన రెండు పోస్టుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. వాటిని గ్రేడింగ్ చేసేందుకు పంచాయతీ కార్యాలయ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. కాగా ఈ 20 వేలమందిలో ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు మినహా మిగిలినవారు రూ.50 చొప్పున డీడీల రూపంలో దరఖాస్తు రుసుముగా చెల్లించింది రూ.5లక్షలకు పైనేనని అంచనా. -
గ్రేడ్-4 కొలువుల కోసం పోటాపోటీ
సాక్షి, సంగారెడ్డి: ‘‘అన్నా ! పాజిటివ్‌గా రాయ్.. జాబ్ రాలేదని రాస్తే నా పరువు పోతుంది (నవ్వుతూ). యాక్చువల్లి నాకు జాబ్ వచ్చింది. నేనే జాయిన్ కాలేదు’’ కంప్యూటర్ సైన్స్‌లో మూడేళ్ల కింద బీటెక్ పూర్తి చేసి, బుధవారం పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-4 పోస్టుకు దర ఖాస్తు చేసుకోడానికి వచ్చిన ఓ నిరుద్యోగిని చెప్పిన మొహ‘మాట’లు ఇవి. బీటెక్ పూర్తిచేసిన విద్యార్థి పంచాయతీ కార్యదర్శి పోస్టుకు దరఖాస్తు చేసుకుంటున్నాడా...అని ఆలోచిస్తున్నారా..పైన పేర్కొన్న యువకుడే కాదు...ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ, బీటెక్, ఎంఎస్సీ లాంటి ఉన్నత అర్హతలు కలిగిన అభ్యర్థులు పంచాయతీ కార్యదర్శి పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం ఎదుట క్యూ కడుతున్నారు. దీంతో గత వారం రోజులుగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం మొదటి అంతస్తు నిరుద్యోగులతో కిటకిటలాడుతోంది. ఇప్పుడే డిగ్రీ పూర్తిచేసిన తాజా ముఖాల నుంచి వయస్సు మళ్లిన ముదురు ఫేసుల వరకు ఆడా మగా నిరుద్యోగులంతా వేల సంఖ్యలో కదిలి వచ్చి దరఖాస్తు వేస్తున్నారు. ఏళ్లతరబడి ఉద్యోగాల కోసం నిరీక్షిస్తూ వయస్సు మీరిపోతుండడంతో చివరి ప్రయత్నం చేస్తున్న వాళ్లు గణనీయంగా ఉన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 210 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి గత నెల 30న ప్రకటన విడుదలైంది. ఏదైన డిగ్రీతో పాటు 18-36 ఏళ్ల వయో పరిమితిని అర్హతగా నిర్ణయించారు. ఈ నెల నుంచి 1న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ 10వ తేదీతో ముగియనుంది. గడువుకు మరో నాలుగు రోజుల సమయం మిగిలి ఉన్నా ఇప్పటికే వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దాదాపు 7,500 దరఖాస్తులు అమ్ముడుపోగా.. ఇప్పటి వరకు 5 వేల దరఖాస్తులు దాఖలయ్యాయి. కాంట్రాక్టు ఉద్యోగులు వర్సెస్ నిరుద్యోగులు ఈ పోస్టులను దక్కించుకునేందుకు నిరుద్యోగులు, కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులు పోటాపోటీగా తలపడుతున్నారు. రాతపరీక్ష ద్వారా భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తుంటే, కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. డిగ్రీలో సాధించిన మార్కులకు 75 శాతం వెయిటేజీ మార్కులు ఇస్తారు. డిగ్రీ పూర్తయి ఏడాది నుంచి ప్రతి సంవత్సరానికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు అదనంగా కేటాయిస్తారు. ఇది దరఖాస్తుదారులందరికీ వర్తిస్తుందని తొలుత నోటిఫికేషన్లో ప్రకటించారు. అయితే, డిగ్రీ తర్వాత ప్రతి సంవత్సరానికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులను కేవలం పనిచేస్తున్న కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులకే వెయిటేజీగా కేటాయిస్తామని పంచాయతీరాజ్ శాఖ స్పష్టత ఇచ్చింది. దీంతో పాటు కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శుల ఒక్కో ఏడాది సర్వీసుకు మూడు మార్కులు చొప్పున గరిష్టంగా 15 మార్కులను అదనపు వెయిటేజీగా ఇస్తారు. దీంతో వీరికి 25 మార్కులు అదనంగా రానున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 206 మంది కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తుండగా దాదాపు 200 మంది డిగ్రీ అర్హత కలిగి ఉండడంతో పోటీ పడుతున్నారు. అదనపు వెయిటేజీ నిబంధనల వల్ల ఎక్కువ ఉద్యోగాలు వీరికే దక్కే అవకాశాలున్నాయి. డిగ్రీలో 90 శాతం మార్కులు సాధించినా నిరుద్యోగులకు అవకాశం లేకుండా పోయింది. ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్లినా ఉద్యోగం రాలేదు ఇదే ఏడాది 62 శాతం మార్కులతో ఎంబీఏ పూర్తి చేశా. ఇప్పటి వరకు 10 ఇంటర్వ్యూలకు వెళ్లా. స్కిల్స్ మెరుగు పరుచుకోవాలని తిప్పి పంపించారు. ఇక అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని ఉద్యోగం కోసం సిద్ధం కావాలని నిర్ణయించుకున్నాను. ఎంబీఏకు టెన్త్ క్లాస్‌కు ఈ రోజుల్లో ఒకే వ్యాలు అయిపోయింది. ఎంబీఏ ద్వారా ఉద్యోగం వస్తదని ఆశలు లేవు. -జి. శ్రీకాంత్, రాంపూర్, నంగనూరు మా ఉద్యోగాలు మాకే ఇవ్వాలి 2003 నుంచి కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అప్పడు డీఎస్సీ ద్వారా ఎంపిక చేశారు. మా ఉద్యోగాలు మాకు ఇచ్చిన తర్వాతే ఇతరులకు అవకాశం కల్పించాలి. ఇన్నాళ్లు కొలువునే నమ్ముకుని బతుకుతున్న మమ్మల్ని తొలగిస్తే మా కుటుంబాల పరిస్థితి ఏం కావాలి ? -కటకం శ్రీనివాస్, కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శి బీటెక్ తర్వాత రూ.8 వేలు జీతమిస్తామన్నారు 2011లో బిటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్) పూర్తైది. ఇంటర్వ్యూకు వెళ్తే రూ.8 వేలు జీతం ఇస్తామన్నారు. అందువల్లే ఎంటెక్ చేస్తున్నా. అదృష్టం బాగుంటే ఉద్యోగం రావచ్చని దరఖాస్తు వేయడానికి వచ్చాను. మా నాన్న వ్యవసాయం చేస్తారు. -బి.అంజిరెడ్డి, ఎంటెక్ విద్యార్థి, దుబ్బాక