ఇందూరు, న్యూస్‌లైన్ : గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తా యి. ఈ నెల 6న జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. చాలాకాలం తర్వాత కార్యదర్శి పోస్టుల భర్తీ చేయనుండడంతో నిరుద్యోగులు వేల సంఖ్యలో పోటీ పడుతున్నారు. అధికారులు ప్ర తి రోజు 500 నుంచి 1500 వరకు దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 29 పోస్టులకు గాను 5,808 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు రెండు వందల మంది బరిలో ఉన్నారు. దరఖాస్తులకు గడు వు చివరి రోజైన శనివారం జిల్లా పం చాయతీ కార్యాలయం అభ్యర్థులతో కిక్కిరిసిపోయింది.
అభ్యర్థులకు దరఖాస్తు ఫారాలు ఇవ్వడానికి మూడు కౌంటర్లు, పూరించిన దరఖాస్తులను స్వీకరించడానికి మూడు కౌంటర్లను ఏర్పాటు చేశారు. అతి తక్కువ పోస్టులకు ఇంత పెద్ద మొత్తంలో దరఖాస్తు లు రావడం ఇదే మొదటి సారని అధికారులు పేర్కొంటున్నారు. దరఖాస్తులను అధికారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ కేటగిరి కింద విభజిస్తారు. అనంతరం పరిశీలన చేసి దరఖాస్తులు సరి గ్గా చేసుకున్న అభ్యర్థుల వివరాలను నోటీసు బోర్డుపై పెడతారు. ఈ ప్రక్రి య పూర్తయ్యేవరకు 15రోజులు పట్టవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
పోస్టులు రావని తెలిసినా..
గ్రామ కార్యదర్శి పోస్టులు తమకు దక్కవని తెలిసినా.. అదృష్టాన్ని పరీ క్షించుకునేందుకే చాలా మంది అభ్యర్థులు దరఖాస్తులు చేకున్నారు. ప్రభుత్వం కల్పించిన వెయిటేజీ మార్కులతో మొత్తం 29 పోస్టుల్లో సుమారు 20 పోస్టులు కాంట్రాక్టు కార్యదర్శుల కే సొంతం కానున్నాయి. అంటే మిగి లే తొమ్మిది ఉద్యోగాలను ఐదు వేల మందికి పైగా ఆశిస్తున్నారు.